Karthik
-
రూ.100 కోట్లతో నాగార్జున 100వ సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. ఈ నలుగురిని టాలీవుడ్‌కి నాలుగు స్తంభాలు అంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యధిక సినిమాలలో హీరోలుగా నటించింది వీరే. చిరంజీవి ఇప్పటికే 156 చిత్రాలకు పైగా నటించగా.. బాలకృష్ణ కూడా సెంచరీ పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు నాగార్జున(Nagarjuna) తన 100వ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే హీరోగా 99 చిత్రాల్లో నటించిన నాగ్.. తన సెంచరీ మూవీ కోసం ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు.నాగ్ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం 'నా సామి రంగ'. ఇది గతేడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజైంది. ఆ తర్వాత సోలో సినిమా ఇంత వరకూ ప్రకటించలేదు. ఇప్పుడు తన బెంచ్ మార్క్ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ వేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కింగ్ నాగ్ నటించబోయే 100వ సినిమాని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోందిప్రస్తుతం నాగార్జున ‘కుబేర’, ‘కూలీ’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తయిన తర్వాత 100వ సినిమా ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. తాజా వార్తల ప్రకారం, ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కార్తీక్ గతంలో తమిళంలో ‘నితం ఓరువానం" చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ సినిమా తెలుగులో 'ఆకాశం' పేరుతో డబ్ అయ్యింది. ఇక్కడ ఆశించిన స్థాయిలో ఆ చిత్రం ఆడలేదు కానీ దర్శకుడు కథను తెరపై చూపించిన విధానం నాగ్‌కి బాగా నచ్చిందట. వెంటనే అతన్ని పిలిపించి..వందో చిత్రం బాధ్యతలు అప్పజెప్పాడట.తన 100వ విజువల్ వండర్‌గా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని నాగ్ కోరుకుంటున్నట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిన్న మొన్నటి వరకు నాగార్జున వందో చిత్రానికి పూరి జగన్నాధ్, బెజవాడ ప్రసన్న కుమార్, తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ పేర్లు గట్టిగా వినిపించాయి.. అయితే, తాజా సమాచారం ప్రకారం కార్తీక్‌తోనే ఈ ప్రాజెక్ట్ ఖరారైనట్లు కనిపిస్తోంది. షూటింగ్ ఈ ఏడాది చివరలో లేదా 2026 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. నాగ్ అభిమానులకు ఆకట్టుకునేలా ఓ సూపర్ స్టోరీని రెడీ చేశాడట కార్తీక్. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్ లో నాగ్ సెంచరీ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
సందేహాలున్నప్పుడు.. శిక్షలు విధించలేం
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సాక్షులు, మెడికల్ ఆధారాల్లో వ్యత్యాసం ఉండి.. ప్రత్యక్ష సాక్షి చెబుతున్నది సందేహాస్పదంగా ఉన్నప్పుడు శిక్షలు విధించడం సాధ్యం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఫిర్యాదు చేసిన తర్వాత అది కోర్టుకు చేరడానికి పదహారున్నర గంటల సమయం పట్టిందని.. ఇంత సమయం ఎందుకు పట్టిందో దర్యాప్తు అధికారి వెల్లడించలేదని వ్యాఖ్యానించింది. ఆలస్యం పరిస్థితులను ప్రశ్నార్థకంగా మారుస్తుందని సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని పేర్కొంది. ప్రత్యక్ష సాక్షి (పీడబ్ల్యూ 6) వాంగ్మూలం ప్రకారం.. కార్తీక్ చేతిపై షంషీర్ ఖాన్ దాడి చేశాడని.. తలపై దాడి చేసినట్లు పేర్కొనలేదని చెప్పింది. కానీ, పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. పుర్రెపై బలమైన గాయం కారణంగా కార్తీక్ మరణించినట్లు ఉందని చెప్పింది. జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్రధానంగా అతని వాంగ్మూలంపై ఆధారపడ్డారని అభిప్రాయపడింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని 2018లో ఆదిలాబా ద్ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నామని తెలిపింది. నిందితుడు షంషీర్‌పై ఇతర కేసులు లేకుంటే వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కె.సురేందర్, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం తీర్పు వెలువరించింది.ఫిర్యాదులో పీడబ్ల్యూ 6 ప్రస్తావన లేదు..పోలీసుల కథనం మేరకు.. ‘ఓ అమ్మాయికి సంబంధించిన విషయంలో షంషీర్, కార్తీక్‌కు మధ్య వివాదం తలెత్తింది. దీంతో కాగజ్‌నగర్‌లోని లారీ చౌరస్తాలో కార్తీక్‌ను షంషీర్ కత్తితో దాడి చేసి చంపాడు. 2014, ఫిబ్రవరి 20న కార్తీక్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత షంషీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.’ ఈ కేసు విచారణ చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా కోర్టు.. షంషీర్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ 2018లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ షంషీర్ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో షంషీర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి, పోలీసుల తరఫున ఏపీపీ అరుణ్‌కుమార్ వాదనలు వినిపించారు. ‘కోర్టుకు పంపిన ఫిర్యాదులో పీడబ్ల్యూ 6 పేరు ప్రస్తావించలేదు. విచారణ సమయంలోనూ అతని పేరు లేదు. పీడబ్ల్యూ 6 చెప్పిన దానికి మెడికల్ ఆధారాలు విరుద్ధంగా ఉన్నాయి. మరణించిన వ్యక్తి తల, మెడపై దాడి జరిగిందని సాక్షి చెప్పలేదు. మెడికల్ ఆధారాల్లో తల, మెడ, ఎడమ చెవిపై గాయాలున్నాయి. ఎడమ మణికట్టు వద్ద కూడా గాయాలున్నాయి. పీడబ్ల్యూ 6 సాక్షాలు సందేహాస్పదంగా ఉన్నా యి. అందువల్ల 2018లో ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నాం’ అని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.న్యాయం గెలిచిందిఎనిమిదేళ్లుగా జైలు జీవితం గడిపి ఈ రోజే విడుదలయ్యాను. శిక్షా కాలంలో సెంట్రల్ జైలు, వరంగల్‌లో ఓపెన్ జైలు పెట్రోల్ బంకులో పని చేశాను. ఇన్నేళ్లకు మళ్లీ న్యాయం గెలిచిందని నమ్ము తున్నాను. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. – షంషీర్ ఖాన్ -
ఆర్మీ జవాన్ కార్తీక్ మృతికి వైయస్ జగన్ సంతాపం
-
జవాన్ కార్తీక్ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: ఆర్మీ జవాన్ కార్తీక్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) సంతాపం తెలిపారు. కార్తీక్ చూపిన ధైర్యసాహసాలు, త్యాగానికి సెల్యూట్ అని ప్రశంసించారు. ఈ కష్ట సమయంలో కార్తీక్(Jawan Karthik) కుటుంబానికి అండగా నిలుద్దామని చెప్పారు.ఉత్తర జమ్మూలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో కార్తీక్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్తీక్ మృతిపై వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. కార్తీక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు వైఎస్ జగన్. అలాగే, కార్తీక్ చూపిన ధైర్యసాహసాలు, త్యాగానికి సెల్యూట్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ కష్ట సమయంలో కార్తీక్ కుటుంబానికి అందరం అండగా నిలుద్దాం అని వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్‌లోని సొపోర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో చిత్తూరు జిల్లా, ఎగువరాగిమాను పెంట గ్రామానికి చెందిన కార్తిక్ వీర మరణం పొందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కార్తిక్ కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని… pic.twitter.com/9P1axvHTi9— YS Jagan Mohan Reddy (@ysjagan) January 21, 2025 -
కశ్మీర్లో ఎన్కౌంటర్ నేల కొరిగిన ఆంధ్రా జవాను
శ్రీనగర్/బంగారుపాళ్యం: జమ్మూకశ్మీర్‌లోని సొపోర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జలూర గుజ్జర్పటి ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని జవాన్లు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా పంగల కార్తీక్(32) అనే జవాను బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. వైద్యం కోసం తరలిస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచారని అధికారులు సోమవారం తెలిపారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు ముష్కరుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నాయన్నారు. కార్తీక్ వీరమరణంపై శ్రీనగర్ కేంద్రంగా పనిచేసే ఆర్మీ విభాగం చినార్ కార్ప్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన కార్తీక్ యొక్క అత్యున్నత త్యాగానికి చినార్ కార్ప్స్ సెల్యూట్ చేస్తోంది చినార్ వారియర్స్ కార్తీక్ అపారమైన పరాక్రమానికి, త్యాగానికి వందనం చేస్తోంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతోంది. వారికి సంఘీభావంగా నిలుస్తుంది’అని ‘ఎక్స్’లో తెలిపింది. కాగా, కార్తీక్‌ది ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎగువరాగిమాను పెంట గ్రామం. వరద మందడి, సెల్వి దంపతుల రెండో కుమారుడైన కార్తీక్ పదేళ్ల క్రితం ఆర్మీలో చేరారు. ఈయన చనిపోయిన విషయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం రాత్రికల్లా మృతదేహం గ్రామానికి రావచ్చని చెబుతున్నారు. -
క్రికెట్ బెట్టింగ్ 140 కోట్లు!.. కూటమి ఎమ్మెల్యేల సహకారం?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: క్రికెట్ బెట్టింగ్ ముఠా వ్యవహారంలో కూటమి నేతలదే కీలకపాత్ర అని తెలుస్తోంది. ప్రధాన నిందితులు లగుడు రవితో పాటు ప్రముఖ పాత్ర పోషిస్తున్న బొబ్బిలి రవి పరారీలో ఉన్నారు. వీరిద్దరూ జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో విచారణ చేస్తున్న విశాఖ సిటీ పోలీసులు ఇప్పటి వరకు జరిగిన 80 బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తే కేవలం ఏడాది కాలంలోనే రూ.140 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. అయితే ఇంకా వందల్లో గుర్తించిన బ్యాంకు అకౌంట్లను పరిశీలించాల్సి ఉందని సమాచారం. వీటి లావాదేవీలను గమనిస్తే ఇంకా ఎన్ని వందల కోట్లకు చేరుతుందనేది ఊహకు కూడా అందడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.క్రికెట్ బెట్టింగ్‌లో కీలకంగా ఉన్న లగుడు రవితో పాటు బొబ్బిలి రవి జనసేన పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇందులో బొబ్బిలి రవిని స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు నాగబాబు సమక్షంలో కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. వీరిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ చేర్చడం గమనార్హం. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక లగుడు రవి కూడా జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇప్పటివరకు కేవలం లగుడు రవి ద్వారా వచ్చిన సమాచారంతో ఐదుగురిపై కేసులు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు.. తాజాగా మరో నలుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. వీరి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తే.. రూ.140 కోట్ల ఉండగా..ఇంకా మొత్తం అకౌంట్లు పరిశీలిస్తే ఇంకా ఎన్ని వందల కోట్లకు చేరుతుందోనని చర్చ సాగుతోంది.ఇంకా లెక్కతేలాల్సిందే..!వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ఇసుకతోట, శివాజీపాలెం వద్ద జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై వచ్చిన సమాచారం మేరకు ఈ నెల ఆరో తేదీన టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో లగుడు రవి కుమార్‌ను అదుపులో తీసుకున్నారు. అనంతరం జరిపిన విచారణలో ఇందులో మరో వ్యక్తి బొబ్బిలి రవి, త్రినాథ్, జిలానీ, కాకినాడకు చెందిన కార్తీక్‌ల పాత్ర కూడా తేలింది. ఇందులో ఇప్పటికీ బొబ్బిలి రవితో పాటు మిగిలిన వ్యక్తులు అందరూ పరారీలోనే ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులు కూడా ఇళ్లు వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు లగుడు రవిని విచారించిన తర్వాత 80 బ్యాంకు అకౌంట్లను పరిశీలించగా... ఏడాది కాలంలోనే ఈ అకౌంట్ల ద్వారా రూ. 140 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు విశాఖ సిటీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. అయితే బొబ్బిలి రవిని, కాకినాడకు చెందిన కార్తీక్‌ను కూడా అదుపులోకి తీసుకుంటే ఇంకా ఎన్ని వందల సంఖ్యలో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో తెలిసే అవకాశం ఉంది. ఇదే జరిగితే మొత్తం క్రికెట్ బెట్టింగ్ ముఠా జరిపిన ఒక్క ఏడాది లావాదేవీలే మరిన్ని వందల కోట్లు ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అదుపులోకి తీసుకోకుండా..!సుమారు 10 రోజుల క్రితం జరిగిన సంఘటనలో బొబ్బిలి రవి, త్రినాథ్‌లను అదుపులోనికి తీసుకోకుండా ఉండేందుకు కూటమి ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినట్టు విమర్శలున్నాయి. కూటమికి చెందిన ఎమ్మెల్యేతో పాటు పీఏలు కూడా అరెస్టు చేయవద్దంటూ సిఫారసులు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే బొబ్బిలి రవి పరారీలో ఉన్నారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ఇంట్లో ఉండకుండా జాగ్రత్తపడినట్టు తెలుస్తోంది.మరోవైపు వీరికి ముందస్తు బెయిల్ కోసం కూడా కూటమి ఎమ్మెల్యేలు కొందరు ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారని.. దుకోసం ఒక ఎమ్మెల్యే పీఏ ఒక్కో వ్యక్తి నుంచి రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ వసూలు చేశారనే ప్రచారం ఆ పార్టీల్లోనే జరుగుతోంది. ఇదిలాఉండగా తెర వెనుక కూటమి ఎమ్మెల్యే చేస్తున్న వ్యవహారం నగర పోలీసు కమిషనర్ దృష్టికి వెళ్లడంతో వారి ఆటలు సాగడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ సాధ్యం కాదని, వారిని కచ్చితంగా అదుపులో తీసుకుంటామని విశాఖ సిటీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.ఎవరీ కాకినాడ కార్తీక్!ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న కాకినాడ కార్తీక్ ఆచూకీ లభ్యం కాలేదు. కాకినాడకు వెళ్లి విచారించిన పోలీసులకు కార్తీక్ ఎవరనే విషయం మాత్రం బోధపడలేదని తెలుస్తోంది. కార్తీక్‌కు కాకినాడలో అనేక పేర్లతో వ్యవహారంలో ఉన్నాడని సమాచారం. ఒక్కొక్కరికి ఒక్కో పేరుతో కార్తీక్ పరిచయం కావడం గమనార్హం. అంతేకాకుండా పోలీసులు దర్యాప్తు కోసం వెళ్లే సమయానికే కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యారు. కార్తీక్‌కు విశాఖపట్నంతో పాటు హైదరాబాద్‌లో కూడా బెట్టింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. కార్తీక్‌ను కదిపితే బెట్టింగ్ మాఫియా వివరాలు మరిన్ని తెలిసే అవకాశం ఉంది. -
గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ 'నానా హైరానా'
రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్'. తాజాగా ఈ మూవీ నుంచి 'నానా హైరానా' అంటూ సాగే మెలొడీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచిస్తే.. సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ట్యూన్స్ అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు మాస్ పాటలు ప్రేక్షకులను మెప్పిస్తే.. టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది.సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న 'గేమ్ ఛేంజర్' చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రానుంది. ఇందులో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ సహ నిర్మాత. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగింది. ఎంజీ రోడ్డులోని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయ ప్రాంగణంలో పోలింగ్ నిర్వహించిన సీన్స్‌ను చిత్రీకరించారు. అక్కడ ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునే సీన్స్‌తో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన సన్నివేశాలను చిత్రీకరించారు.అయితే ఈ సన్నివేశాల్లో కేవలం జూనియర్ ఆర్టిస్ట్‌లు మాత్రమే పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కారు డ్రైవర్ నిర్బంధం
యశవంతపుర: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు కార్తీక్ పురోహిత్ అనే మరో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని సోమవారం విచారించారు. గత శనివారం కూడా నాలుగైదు గంటల పాటు ప్రశ్నించినట్లు తెలిసింది. ఓ ఎమ్మెల్యే కారు డ్రైవర్‌గా పని చేస్తున్న కార్తీక్ పురోహిత్, రేణుకాస్వామి మృతదేహాన్ని పారేసిన తరువాత నిందితుడు ప్రదోశ్ను అక్కడ నుంచి తీసుకెళ్లినట్లు విచారణలో బయట పడింది. తన కారులోనే ప్రదోశ్ను గిరినగరకు తీసుకెళ్లాడు. ఆ రోజు ఏమి జరిగిందనేది కార్తీక్ నుంచి పోలీసులు వివరాలను సేకరించారు. పవిత్ర స్నేహితురాలు సమత విచారణ పవిత్రగౌడ ఆప్త స్నేహితురాలు సమతను ఈ కేసులో పోలీసులు విచారించారు. నిందితుడు ధనరాజ్‌కు ఆమె రూ. 3 వేలు పంపిన అధారాలను సేకరించారు. ఈ డబ్బులతో ధనరాజ్ ఎలక్ట్రిక్ షాక్ పరికరాన్ని కొన్నట్లు అనుమానిస్తున్నారు. బసవేశ్వరనగర ఠాణాలో సమతను ప్రశ్నించారు. మరోవైపు దర్శన్, పవిత్రతో పాటు 17 మంది నిందితులు జైళ్లలో కస్టడీలో ఉన్నారు. దర్శన్ బెయిలు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
నా పెళ్లి విషయం తెలిసి ఆ హీరో ఏడ్చాడు: ఖుష్బూ
ఒకప్పుడు హీరోయిన్గా తనదైన నటనతో ఆకట్టుకున్న ఖుష్భూ.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా,టీవీ యాంకర్‌గా బిజీ అయింది. అప్పట్లో ఖుష్భూకి తమిళ్లోనే కాదు టాలవుడ్లోనూ ఫుల్ ప్యాన్ ఫాలోయింగ్ ఉండేది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘కలియుగ పాండవులు’అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమానే సూపర్ హిట్. ఆ తర్వాత తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగారు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 200పైగా సినిమాల్లో నటించారు. అప్పట్లో తమిళనాడులో అభిమానులు ఖుష్భూకి ఓ గుడినే కట్టించారంటే..ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే 2000 సంవత్సరంలో డైరెక్టర్ సుందర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సుందర్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ముఱై మామన్’లో ఖుష్బూ హీరోయిన్. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు.ఈ దంపతులకు అవంతిక, అనంతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూ తన పెళ్లిలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి చెప్పింది. ‘నేను, సుందర్ ప్రేమలో ఉన్న విషయం చాలా కాలం పాటు ఎవరికి చెప్పలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోబుతున్నామనే విషయం మొదటగా హీరో కార్తీక్‌కి సుందర్ చెప్పాడు. విషయం తెలిసిన వెంటనే కార్తీక్ నాకు ఫోన్ చేసి సంతోషంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే మా పెళ్లికి కూడా వచ్చాడు. అప్పుడు మేమిద్దరం ఆయన కాళ్లపై నమస్కరించి ఆశిస్సులు తీసుకున్నాం. ఆ సమయంలో కార్తీక్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు’ అని ఖుష్భూ చెప్పుకొచ్చింది. -
బ్రెజిల్ టు బెంగాల్ – ప్రేమకు దూరం తెలియదు
ఎక్కడి బ్రెజిల్? ఎక్కడి బెంగాల్? అయితే ప్రేమ బలంతో సుదూరప్రాంతాలు కూడా ఇరుగు పొరుగు గ్రామాలు అవుతాయి. వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి బ్రెజిల్ అమ్మాయి పశ్చిమ బెంగాల్‌లోని తన ప్రియుడిని వెదుక్కుంటూ వచ్చింది. బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన కార్తీక్‌కు నాలుగు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో బ్రెజిల్‌కు చెందిన మాన్యులా డి సిల్వాతో పరిచయం అయింది. గూగుల్ సాక్షిగా ఆ పరిచయం ప్రేమగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. భాష సమస్య వల్ల కార్తీక్ తల్లిదండ్రులు మాన్యులాతో మాట్లాడడానికి గూగుల్ ట్రాల్సేలెట్ యాప్‌ను ఉపయోగించేవారు. ఈ యాప్‌లో బెంగాలీలో టైప్ చేసి మాన్యులా కోసం ఇంగ్లిష్‌లోకి కన్వర్ట్ చేసేవారు. పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించారు. కాబోయే అత్తారింటికి వచ్చిన డి సిల్వా ఇప్పుడిప్పుడే బెంగాలీ వంటకాల రుచులకు అలవాటు పడుతోంది. బెంగాలీ పదాలు నేర్చుకుంటోంది. బెంగాల్లో జరగబోయే కూతురు పెళ్లికి హాజరు కావడానికి బ్రెజిల్‌లోని మాన్యులా తల్లిదండ్రులు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
కార్తీక్ తీడా రాసుకున్న రియల్ స్టోరీనే ‘తండేల్’
చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. నాగ చైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ శ్రీకాకుళంలో ప్లాన్ చేసింది. శ్రీకాకుళం ప్రాంతంలో జరిగిన రియల్ స్టోరీ కాబట్టి గత 2,3 రోజుల నుంచి రియల్ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుగుతోంది. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రచయిత కార్తీక్ తీడా ఎంతో రీసెర్చ్ ఈ రియల్ స్టోరీ రాశారట. ఫిషర్ మాన్స్ తో 2, 3 నెలలు స్వయంగా ఉండీ, వాళ్లతోనే తింటూ, వాళ్లలో ఒకడిగా ఉంటూ, వారితో ప్రయాణం చేస్తూ వారి జీవన శైలీని పూర్తిగా తెలుసుకొని స్టోరీ రాసినట్లు ఓ సందర్భంలో రచయిత కార్తీక్ తీడా చెప్పారు. సముద్రంలో వాళ్లకు ఎదురయ్యే సవాళ్లు, కస్టమ్స్ తో వాళ్లకున్న కష్టాలు, సవాళ్లు అన్ని పరిశీలించారట. అలా రాజు, బుజ్జిల కథను అత్యద్భుతంగా, సినిమాటిక్ విజన్ తో తీర్చిదిద్దారు. తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ లో స్టోరీని వినిపించగా కథ నచ్చడంతో ఇప్పుడు రూపం దాల్చుకుంది. రచయిత కార్తీక్ తీడా ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు. ఈ తరుణంలోనే శ్రీకాకుళంలో జరిగిన యదార్ధ సంఘటనను సినిమాగా రాయాలి అనే సంకల్పంతో తండెల్ కథ మొదలుపెట్టి అత్యద్భుతంగా రాసుకొచ్చారు. ఈ చిత్రంలో రాజుగా నాగచైతన్య నటిస్తుండగా.. ఆయనకు జోడిగా బుజ్జి పాత్రలో సాయి పల్లవి కనిపించబోతుంది. -
కర్రలతో కొట్టి.. గాయాలపై కారం చల్లి
కొత్తగూడ: చోరీకి పాల్పడ్డాడనే అనుమానంతో ఓ దళిత యువకుడిని కర్రలతో చావకొట్టి.. రక్తం కారుతున్న గాయాలపై కారం చల్లి చిత్ర హింసలు పెట్టిన అమానవీయఘటనకు సంబంధించిన వీడియో శనివారం కలకలం రేపింది. బాధితుడి కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం జంగవానిగూడెం(రాంపూర్) గ్రామానికి చెందిన యువకుడు వంకాయల కార్తీక్‌ను అదే మండలం పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన టెంట్‌హౌస్ యజమాని గద్ద అశోక్ పనికి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో డీజే(సౌండ్ బాక్స్)లో ఉపయోగించే యాంప్లిఫైయర్ చోరీకి గురైందని, దాన్ని ఖానాపూర్‌లో విక్రయించారని యజమాని అశోక్ గుర్తించాడు. దీంతో అశోక్ కొందరు వ్యక్తులను తీసుకుని ఈ నెల 19వ తేదీన జంగవానిగూడెం వెళ్లి కార్తీక్‌తో పని ఉందని చెప్పి కారులో ఎక్కించుకుని పొగుళ్లపల్లి సమీప అటవీప్రాంతానికి తీసుకెళ్లి కర్రలతో చితకబాదారు. తప్పించుకుని పారిపోయే క్రమంలో మళ్లీ పట్టుకుని పొగుళ్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చారు. ఒంటిపై షర్ట్ విప్పి కార్యాలయ కిటికీకి కట్టి కర్రలతో బాదారు. రక్తం కారుతుండగా గాయాలపై కారం చల్లుతూ చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనను మొత్తం వీడియో తీశారు. స్పృహ కోల్పోయిన కార్తీక్‌ను ఇంటి వద్ద వదిలేశారు. గాయాలతో మూలుగుతున్న యువకుడిని బంధువులు నర్సంపేట పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కార్తీక్‌పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసులు టెంట్‌హౌస్ యజమాని ఫిర్యాదు మేరకు కార్తీక్‌పై చోరీ కేసు, కార్తీక్‌పై దాడి చేసిన ఘటనలో అశోక్‌తోపాటు మరికొంత మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సమాచారం తెలుసుకున్న దళిత సంఘాలు మహబూబాబాద్ డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రాత్రి దాడి ఘటన వివరాలు బయటికి వచ్చాయి. -
హోలీ పండుగ మిగిల్చిన విషాదం!
ఆదిలాబాద్: పండుగ పూట ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. హోలీ ఆడుకుని స్నేహితులతో కలిసి కాలువలో స్నానానికి వెళ్లి ఈత రాక ఇంటర్మీడియెట్ విద్యార్థి నీటమునిగి చనిపోయిన ఘటన దండేపల్లి మండలంలో చోటు చేసుకుంది. దండేపల్లి ఎస్సై స్వరూప్‌రాజ్ కథనం ప్రకారం.. జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన గోపులపురం ప్రసాద్, అశ్విని దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రసాద్ ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. ఇంటర్మీడియెట్ విద్యార్థి, పెద్ద కుమారుడు కార్తీక్(18) గత ఐదు రోజుల క్రితం తల్లి అశ్వినితో కలిసి దండేపల్లి మండలం పాత మామిడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి ఆడుకున్నాడు. అనంతరం వారితో కలిసి తానిమడుగు వద్ద గూడెం ఎత్తిపోతల డెలివరీ పాయింట్ వద్ద కడెం ప్రధాన కాలువలో స్నానం చేసేందుకు వెళ్లాడు. దీంతో అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే అతన్ని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని వెంటనే మేదరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. అమ్మమ్మ ఇంటికి వచ్చి.. ఇంటర్ పరీక్షలు ముగియడంతో, కాలేజీకి సెలవులు వచ్చాయి. కార్తీక్ తన తల్లి అశ్వినితో కలిసి ఐదు రోజుల క్రితం పాతమామిడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి సంతోషంగా స్నేహితులతో గడుపుతున్నాడు. ఇంతలో సోమవారం హోలీ పండుగ రావడంతో, స్నేహితులతో కలిసి హోలీ ఆడుకున్నాడు. స్నానం కోసం కాలువ వద్దకు వెల్లిన అతను స్నానం చేసేందుకు నీటిలో దిగాడు. ఈత రాక నీటిలో మునిగి చనిపోయాడు. కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొడుకుపై పెట్టుకున్న ఆశలు అతని అకాల మృతితో ఆవిరయ్యాయి. ఆదిలాబాద్‌లో మరో విద్యార్థి.. పండుగ పూట స్నానానికి వెళ్లి వాగులో గల్లంతై విద్యార్థి మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో విషాదం నింపింది. ఆదిలాబాద్‌రూరల్ మండలం భీంసరి శివారులో గల వాగులో స్నానానికి వెళ్లి గుమ్ముల సాత్విక్ (14) అనే విద్యార్థి మృతి చెందాడు. ఎస్సై ముజాహిద్, స్థానికుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని జై జవాన్నగర్ కాలనీకి చెందిన గుమ్ముల స్వర్ణలతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు రావడంతో వారికి కొన్నేళ్ల క్రితం విడాకులయ్యాయి. ఇద్దరి పిల్లలను తల్లి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పోషిస్తోంది. చిన్నారులిద్దరూ పట్టణంలోని తిర్పెల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సాత్విక్ సోమవారం హోలీ సంబరాలు చేసుకొని అనంతరం స్నానానికి మిత్రులతో కలిసి వాగుకు వెళ్లాడు. స్నేహితులంతా వాగు ఒడ్డున నిలబడి ఉండగా.. స్నానం చేస్తానని సాత్విక్ అందులోకి దూకాడు. ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. ఈతగాళ్లు బయటకు తీసి చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇవి చదవండి: హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం! -
సైకలాజికల్ థ్రిల్లర్
హర్షివ్ కార్తీక్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘బహుముఖం’. ‘గుడ్, బ్యాడ్ అండ్ ది యాక్టర్’ అనేది ట్యాగ్‌లైన్ . ఈ చిత్రంలో స్వర్ణిమ సింగ్, మరియా మార్టినోవా హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ రిలీజ్ వేడుకకి అతిథిగా హాజరైన డైరెక్టర్ శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ– ‘‘బహుముఖం’ టీజర్ బాగుంది. టీజర్ చూస్తుంటే విజువల్స్‌తో పాటుగా సౌండ్‌కి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కార్తీక్ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అన్నారు. ‘‘అమెరికాలో చేసిన పక్కా తెలుగు సినిమా ఇది. ప్రేక్షకులకు గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రం చేశాం’’ అన్నారు హర్షివ్ కార్తీక్. చిత్ర సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్, నేపథ్య సంగీతం అందించిన శ్రీ చరణ్ పాకాల మాట్లాడారు. ఈ చిత్రానికి సహ–నిర్మాత అరవింద్ రెడ్డి. -
ఈ సినిమా చూసి నాకు ఒకరు మెయిల్ పెట్టారు
-
సస్పెన్స్ బహుముఖం
హర్షివ్ కార్తీక్ హీరోగా నటించి, రచించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘బహుముఖం’. ‘గుడ్, బ్యాడ్ – యాక్టర్’ అనేది ట్యాగ్‌లైన్. క్రిస్టల్ మౌంటైన్ ప్రోడక్షన్స్పై రూపొందిన ఈ చిత్రంలో స్వర్ణిమా సింగ్, మరియా మార్టినోవా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం నుంచి హర్షివ్ కార్తీక్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా హర్షివ్ కార్తీక్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, డ్రామా, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బహుముఖం’. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అరవింద్ రెడ్డి, కెమెరా: ల్యూక్ ఫ్లెచర్, నేపథ్య సంగీతం: శ్రీచరణ్ పాకాల, సంగీతం: ఫణి కల్యాణ్. -
సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగా.. గత ఎన్నికల్లోనే నా మొదటి ఓటు.. సెలబ్రిటీ కామెంట్..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగిన నేను చిన్నప్పటి నుంచీ ఎన్నికల సందడిని ఆసక్తిగానే గమనించేవాణ్ని. నాకు గత ఎన్నికల్లోనే తొలిసారి ఓటుహక్కు వచ్చింది. ఓటేయడం అద్భుతంగా అనిపించింది. రాష్ట్రం తలరాతను మనమే నిర్ణయిస్తున్నంత ఫీల్. ఎన్నికల్లో ఓటు వేయడం మనకు అందివచ్చే ఒక గొప్ప అవకాశం. మొదటి నుంచీ రాజకీయాలను, నేతలను దగ్గర నుంచీ పరిశీలిస్తూ ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటే చాలా చాలా గుడ్. కానీ అంత తీరిక అందరికీ ఉంటుందా అనేది సందేహమే. ఐదేళ్లూ మన చుట్టూ ఏం జరుగుతుందో మనం అంతగా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా.. పోలింగ్‌కు కొన్ని రోజుల ముందైనా సరే ఒక్కసారి మన చుట్టూ జరిగిన మంచీ చెడూ బేరీజు వేసుకుని మేనిఫెస్టోల్ని విశ్లేషించుకుని ఓటు తప్పకుండా వేయడం అవసరం. గెలుపోటముల గురించి పక్కన పెట్టేద్దాం. పోలింగ్ రోజున ఓటు మాత్రం తప్పకుండా వేద్దాం. – కార్తీక్, సినీనటుడు, కేరాఫ్ కంచరపాలెం ఫేం -
250 కిలోల అభిమానం
అభిమానులు తమ అభిమాన హీరో, హీరోయిన్లకు గుడి కట్టడం కొత్త కాదు. అయితే ఆ గుడి బయట ఎక్కడో ఉంటుంది. తమిళనాడులోని మదురైకి చెందిన కార్తీక్... రజనీకాంత్‌కు వీరాభిమాని. తన ఇంటిలోని ఒక పోర్షన్‌ను రజనీ గుడిగా మలిచాడు. ఇందులో 250 కిలోల బరువు ఉన్న రజనీ విగ్రహం ఉంది. రోజూ ధూపదీప నైవేద్యాలు ఉంటాయి. ‘రజనీకాంత్‌ను దేవుడి స్థాయిలో ఆరాధిస్తున్నాను’ అంటున్నాడు కార్తీక్. -
ఇడ్లీ హై జపానీ... టేస్ట్ హై హిందుస్థానీ
‘దేశం కాని దేశంలో మన దేశ వంటకాలను చూస్తే ప్రాణం లేచి రావడమే కాదు బ్రహ్మాండంగా భరతనాట్యం కూడా చేస్తుంది’ అంటున్నాడు ప్రసన్న కార్తిక్. ఈ ట్విట్టర్ ఖాతాదారుడు ఏదో పని మీద జపాన్‌లోని క్యోటో నగరానికి వెళ్లాడు. అక్కడ కనిపించిన ‘తడ్క’ అనే రెస్టారెంట్‌ను చూసి ‘కలయా? నిజమా? అనుకున్నాడు. ఈ రెస్టారెంట్ దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి. దోశ, ఇడ్లీలకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ రెస్టారెంట్ నిర్వాహకులు భారతీయులు మాత్రం కాదు... జపానీయులే. వీరు ప్రతి ఆరునెలలకు ఒకసారి చెన్నైకి వచ్చి కొత్త వంటకాలు నేర్చుకొని వెళుతుంటారు. ‘దోశ అండ్ ఇడ్లీ అన్బిలీవబుల్ అథెంటిక్. రెస్టారెంట్లో భారతీయుల కంటే జపాన్ వాళ్లే ఎక్కువమంది కనిపించారు. జపాన్‌లో తినడానికి చాప్–స్టిక్స్ ఉపయోగిస్తారు. అయితే ఈ రెస్టారెంట్ వాళ్లు మాత్రం చేతితో తినడంలోని మజాను బాగానే ప్రమోట్ చేసినట్లు ఉన్నారు. ఎవరూ చాప్–స్టిక్స్‌ను ఉపయోగించడం లేదు’ అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు కార్తిక్. -
స్విగ్గీకి మరో షాక్.. వేరుకుంపటికి సిద్ధమైన సీనియర్ వైస్ ప్రెసిడెంట్!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ గురుమూర్తి కంపెనీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇక్కడి నుంచి నిష్క్రమించి తన సొంత వెంచర్‌ను ప్రారంభించబోతున్నారని ఈ పరిణామాలు తెలిసిన వ్యక్తులను ఉటింకిస్తూ ‘మనీకంట్రోల్’ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. గత మార్చిలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ను ఏర్పాటు చేసిన గురుమూర్తి.. కొన్ని రోజులు తెరమరుగై మళ్లీ మే నెలలో స్విగ్గీ మాల్‌కు అధిపతిగా తిరిగి వచ్చారు. స్విగ్గీ మాల్‌ను గతంలో స్విగ్గి మ్యాక్స్ అని పిలిచేవారు. ఇది హైపర్‌లోకల్ ఆన్లైన్ షాపింగ్ విభాగం. కార్తీక్ గురుస్వామి ప్రారంభించనున్న వెంచర్ ఇప్పుడు స్విగ్గీ నిర్వహిస్తున్నలాంటిదే. అయితే ఇది ఆఫ్‌లైన్ స్పేస్‌లో ఉంటుంది. జర్మనీకి చెందిన సూపర్‌మార్కెట్ చైన్ ఆల్డీ లాంటి చవక ధరల భౌతిక దుకాణం మోడల్‌ను కార్తీక్ గురుస్వామి భారత్‌లో ప్రారంభించనున్నారు. కొన్ని నెలల క్రితం గురుమూర్తి తన వెంచర్ కన్వెనియోకు నిధుల కోసం మ్యాట్రిక్, యాక్సెల్ వంటి వెంచర్ క్యాపిటల్ సంస్థలను కలిశారు. ఈ వెంచర్ పేరునే ఆయన మార్చే అవకాశం ఉంది. అయితే దీనిపై గురుమూర్తి కానీ, స్విగ్గీ, మ్యాట్రిక్, యాక్సెల్ కంపెనీలు కానీ స్పందించలేదు. కాగా స్విగ్గీ మాల్‌కు అధిపతిగా దీపక్ కృష్ణమణిని నియమించింది. దీన్నిబట్టి గురుమూర్తి నిష్క్రమణకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. గత నెలలో స్విగ్గీలో చేరిన కృష్ణమణి అంతకుముందు అమెజాన్‌లో దాదాపు ఏడేళ్లు, దానికిముందు మారికోలో తొమ్మిదేళ్లు పనిచేశారు. వరుస నిష్క్రమణలు స్విగ్గీలో టాప్-లెవల్ నిష్క్రమణలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు జాబితాలో గురుమూర్తి కూడా చేరనున్నారు. కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేల్ వాజ్ కూడా తన సొంత వెంచర్‌ను ప్రారంభించడానికి నిష్క్రమించారు. కంపెనీ వైస్ ప్రెసిడెంట్, ఇన్‌స్టామార్ట్ రెవెన్యూ అండ్ గ్రోత్ హెడ్ నిషాద్ కెంక్రే కంపెనీ విడిచిపెట్టిన కొన్ని రోజులకే మే నెలలో వైస్ ప్రెసిడెంట్, బ్రాండ్ అండ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆశిష్ లింగంనేని కూడా కంపెనీని వీడారు. అదేవిధంగా, రెవెన్యూ అండ్ గ్రోత్ విభాగాన్ని నిర్వహించే సీనియర్ వైస్ ప్రెసిడెండ్ అనూజ్ రాఠి కూడా ఫిన్‌టెక్ కంపెనీ జూపిటర్‌లో చేరేందుకు స్విగ్గీ నుంచి నిష్క్రమించారు. -
వినోదాల ప్రేమ
కార్తీక్ రత్నం, సుప్యర్ద సింగ్ జంటగా ఆనంద్ బడా దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘లింగొచ్చా..’. ‘గేమ్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. జె.నీలిమ సమర్పణలో యాదగిరి రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ బడా మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్ నేపథ్యంలో సాగే లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘లింగొచ్చా..’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: బికాజ్ రాజ్, సహ నిర్మాత: మల్లేష్ కంజర్ల. -
మరో గ్లోబల్ కంపెనీ సీఈవోగా భారతీయుడు కార్తీక్‌రావు
Karthik Rao Named CEO of Nielsen అంతర్జాతీయ దిగ్గజాలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్ రీసెర్చ్ సంస్థ నీల్సన్‌కు సీఈవోగా కార్తీక్ రావు నియమితులయ్యారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. మరోవైపు 2018 నుంచి సీఈవోగా ఉన్న డేవిడ్ కెన్నీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పదోన్నతి పొందారు. ఇదీ చదవండి: బాలీవుడ్లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్ కార్తీక్ రావు సుదీర్ఘకాలంగా నీల్సన్‌లోని వివిధ విభాగాల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తదితర హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. చెన్నైలనోని లయోలా యూనివర్సిటీలో డిగ్రీ (ఎకనామిక్స్) చదివిన కార్తీక్ రావు, అమెరికాలోని ఇలినాయిస్ స్టేట్ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా పొందారు. నీల్సన్ ప్రపంచవ్యాప్తంగా 55 కంటే ఎక్కువ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. (ఆగస్టులో రిజిస్ట్రేషన్లు‘ భూమ్’! టాప్-5 లిస్ట్ ఇదే!) -
రవితేజ నిర్మించిన సినిమాలో హీరోగా చేయడం కలలా ఉంది: కార్తీక్ రత్నం
‘కేరాఫ్ కంచరపాలెం, నారప్ప’.. ఇలా నటుడిగా ఇప్పటివరకూ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేసిన నేను ‘ఛాంగురే బంగారురాజా’లో తొలిసారి ఓ కామెడీ రోల్ చేశాను. కామెడీ చేయడం కష్టం అంటుంటారు. కానీ మంచి స్క్రిప్ట్ ఉంటే కామెడీ చేయడం సులభమేనని నాకు అనిపించింది’ అన్నారు కార్తీక్ రత్నం. సతీష్ వర్మ దర్శకత్వంలో కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా నటించిన చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’. ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి హీరో రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తీక్ రత్నం మాట్లాడుతూ– ‘‘రంగస్థల నటుడిగా వందకుపైగా నాటకాలను ప్రదర్శించాను. మొదటి నాటకానికే నంది అవార్డు వచ్చింది. నాలా ఇండస్ట్రీకి వచ్చే కొత్తవారికి రవితేజ, నానీగార్లే స్ఫూర్తి. అలాంటిది రవితేజ నిర్మించిన సినిమాలో నేను హీరోగా నటించడం కలలా ఉంది. కొన్ని కొండ ప్రాంంతాల్లో లభించే విలువైన రంగు రాళ్ల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో మెకానిక్ బంగారు రాజా పాత్ర చేశాను. దర్శకుడు సతీష్వర్మగారికి రైటింగే బలం. స్పాట్లో ఆయన స్క్రిప్ట్‌ను ఇంప్రూవ్ చేస్తుంటారు. నేను నటించిన ‘శ్రీరంగ నీతులు’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ప్రకాశ్‌రాజ్, దర్శకుడు ఏఎల్ విజయ్‌లు కలిసి నిర్మిస్తున్న ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ఒప్పుకున్నాను. మరో ఎగ్జైటింగ్ప్రాంజెక్ట్ను త్వరలోనే ప్రకటిస్తాను’’ అన్నారు. -
చెడు వ్యసనాలకు బానిసై కెరీర్ నాశనం చేసుకున్న స్టార్ హీరో
సినిమాల్లో బోలెడన్ని ట్విస్టులు ఉంటాయి. కొన్నిసార్లు రియల్ లైఫ్‌లో అంతకన్నా ఎక్కువ ట్విస్టులే ఉంటాయి. ఊహించని మలుపులతో జీవితమే ఒక కథగా మారుతుంది. సీనియర్ హీరో కార్తీక్ జీవితం కూడా ఇందుకు అతీతం కాదు. సౌత్‌లో 100కు పైగా సినిమాలు చేసిన ఆయన భార్య చెల్లెలినే పెళ్లి చేసుకున్నాడు. అందుకు గల కారణాలేంటి? తన కెరీర్లో చోటు చేసుకున్న ఊహించని పరిణామాలపై ప్రత్యేక కథనం.. తండ్రి నుంచి వారసత్వం.. మురళి కార్తికేయన్ ముత్తురామన్.. 1960 సెప్టెంబర్ 13న జన్మించాడు. తండ్రి ఆర్ ముత్తురామన్ గొప్ప నటుడు, మచ్చలేని మనిషి. ఆయన నుంచే నటనను పుణికి పుచ్చుకున్నాడు కార్తీక్. అలైగళ్ ఒవతిల్లై(1981) అనే తమిళ చిత్రంతో కార్తీక్ నట ప్రస్థానం మొదలైంది. తన లుక్స్, నటన చూసి డైరెక్టర్స్ తమతో సినిమాలు చేయమని వెంటపడ్డారు. తక్కువకాలంలోనే కోలీవుడ్‌లో స్టార్ హీరోగా మారాడు. సీతాకోక చిలుక సినిమాతో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టాడు. కోలీవుడ్‌లో స్టార్ హీరోగా బిజీబిజీ అన్వేషణ, అభినందన, గోపాలరావు గారి అబ్బాయి, ఓమ్ 3D సినిమాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరో కార్తీక్/మురళిగా బాగా ఫేమస్ అయ్యాడు. అభినందన సినిమాకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. తమిళంలో ఏడాదికి 8-10 సినిమాలు చేస్తూ బిజీగా ఉండటంతో తెలుగులో ఎక్కువగా చిత్రాలు చేయలేకపోయాడు కార్తీక్. అప్పుడప్పుడూ తన గాత్రానికి పని చెప్తూ పాటలు సైతం ఆలపించాడు. స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న కార్తీక్ ఎప్పుడూ ఏదో ఒక హీరోయిన్‌తో ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వచ్చేవి. హీరోయిన్‌తో ప్రేమ.. పెళ్లి ఈ క్రమంలో హీరోయిన్ రాగిణిని ప్రేమించిన అతడు 1988లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గౌతమ్ కార్తీక్, జ్ఞాన్ కార్తీక్ అని ఇద్దరు పిల్లలు సంతానం. అయితే రాగిణి సోదరి రతిపైనా మనసు పారేసుకున్నాడు కార్తీక్. ఆమె కూడా అక్కతో పాటు అతడి ఇంట్లోనే ఉండటంతో.. తనతో ఎఫైర్ పెట్టుకున్నాడని.. దీంతో ఆమె గర్భం దాల్చిందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ఇంతలో 1992లో రాగిణి సోదరి రతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి తిరన్ కార్తీక్ అనే కుమారుడు జన్మించాడు. అయితే భార్య ఉండగా ఆమె చెల్లెలిని పెళ్లి చేసుకున్నందుకు నటుడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 2000వ దశకం నుంచి కార్తీక్ సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. హీరో కాస్తా విలన్‌గా మారాడు. తనకున్న చెడు వ్యసనాల వల్లే కెరీర్ నాశనమైందని స్వయంగా అతడే గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రాజకీయ ప్రస్థానం.. 2006లో రాజకీయాల్లోనూ అడుగుపెట్టాడు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన అతడు తర్వాతి కాలంలో సొంతంగా పార్టీ స్థాపించాడు. అఖిల ఇండియా నాదలమ్ మక్కల్ కచ్చి అని దీనికి పేరు పెట్టాడు. తన పార్టీ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అతడు దారుణంగా ఓడిపోయాడు. కార్తీక్‌కు కేవలం 15వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అతడు 2018లో మనిత ఉరిమైగల్ కాక్కమ్ కచ్చి అనే మరో పార్టీని స్థాపించాడు. అయితే ఏఐఏడీఎమ్‌కే కూటమికి తన మద్దతును ప్రకటించాడు. తను చేసిన తప్పిదాల వల్లే కార్తీక్ కెరీర్ అతలాకుతలమైందని తమిళ ప్రజలు ఇప్పటికీ చెప్పుంటూ ఉంటారు. చదవండి: గుండెపోటుతో నటి మృతి అంటూ ట్వీట్.. వెంటనే డిలీట్.. కానీ అప్పటికే.. 'అమ్మాయితో చాటింగ్ చేయడం వల్లే అంతా'.. నెట్టింట వైరల్! -
నిర్మాతకు డబ్బులొస్తే చాలు: డైరెక్టర్
‘ఎంతో కష్టపడితే దర్శకుడిగా ‘’తో తొలి చాన్స్ వచ్చింది. సినిమా బ్లాక్‌బస్టర్ అయిందా లేదా అన్నది కాదు.. నిర్మాతకు డబ్బులొస్తే అదే పెద్ద సక్సెస్’’ అని సాయి సునీల్ నిమ్మల అన్నారు. యామిన్ రాజ్, విరాట్ కార్తీక్, ప్రియాంక రేవ్రి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సీహెచ్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి అతిథులుగా హాజరైన నటులు అరవింద్ కృష్ణ, శివారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్,పాటలు చాలా బాగున్నాయి. సినిమా హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, డ్రామా ఉన్నాయి’’ అన్నారు యామిన్ రాజ్. -
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇల్లు చూశారా? ఎంత బాగుందో!
ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి.. కొందరికి రాయడం ఇష్టం.. కొందరికేమో పాడటం ఇష్టం.. పెయింటింగ్స్ వేయడం.. డ్యాన్స్ చేయడం, నటించడం.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కోటి నచ్చుతుంది. చాలామంది దాన్ని టైంపాస్‌గా భావిస్తారు. కానీ కళాకారులు మాత్రం వాటినే నమ్ముకుని అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. అలా హాస్యాన్ని నమ్ముకుని, అందరినీ నవ్వించడమే పనిగా పెట్టుకున్నవాళ్లు ఎంతోమంది ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నారు. వారిలో ఒకరే జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్. తన పంచులతో, స్కిట్లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కెవ్వు కార్తీక్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఏడాది క్రితం కొత్త ఇల్లు కొనుక్కున్న కార్తీక్ తాజాగా హోం టూర్ వీడియో చేశాడు. తన ఇంటి గేటు దగ్గరి నుంచి ప్రతీది ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు తెలిపాడు. 'గతంలో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు హోంటూర్ చేశాను. నేను సొంతంగా ఓ ఇల్లు కొనుకున్నాక మళ్లీ హోంటూర్ వీడియో చేయాలనుకున్నాను. ఏడాది క్రితమే ఈ ఇల్లు కొన్నప్పటికీ ఇంటీరియర్, వస్తువులు అన్నీ సమకూర్చుకునేసరికి ఇంత సమయం పట్టింది. ఇన్నాళ్లకు ఇల్లు పూర్తిగా రెడీ అవడంతో వీడియో చేశాను. గతంలో నేను కింద పడుకునేవాడిని. సోఫా కూడా ఉండేది కాదు. నాకంటూ సొంతిల్లు ఉన్నాకే అవన్నీ కొనుక్కోవాలనుకున్నాను. ఇప్పుడు అన్నీ మంచి క్వాలిటీతో ఉన్నవి కొనుక్కున్నాను' అంటూ ప్రతి గదిని క్షుణ్ణంగా చూపించాడు కార్తీక్. హాల్, పూజ గది, డైనింగ్ టేబుల్, కిచెన్, మూడు బెడ్రూమ్స్, బాల్కనీ అన్నింటినీ తనకు నచ్చినట్లుగా ఆర్గనైజ్ చేయించుకున్నాడు. తన అవార్డులు, గృహప్రవేశానికి వచ్చిన బహుమతులను సైతం చూపిస్తూ పోయాడు. తన బాల్కనీని మొత్తం గ్రీనరీతో నింపేశాడు. ఈ ఇంట్లో నెమళ్ల శబ్ధాలు కూడా వినిపిస్తుండటం విశేషం. కాంక్రీట్ జంగిల్లో కాకుండా కాస్త ప్రశాంత వాతావరణం ఉన్న ప్రదేశంలో కార్తీక్ తన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అభిమానులు సైతం ఇల్లు చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎమ్మెల్యేగా పోటీ? స్పందించిన రాహుల్ -
Bigg Boss Keerthi Engagement: బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి భట్- హీరో విజయ్ కార్తీక్ ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ఆందోళన
-
రాచర్లగొల్లపల్లిలో తల్లీ కుమారుడి అదృశ్యం
కరీంనగర్: మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన తల్లీకుమారుడు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై రమాకాంత్ వివరాల ప్రకారం.. రాచర్లగొల్లపల్లికి చెందిన కాటికాపల పోచమ్మ అనే యువతి గతేడాది భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పటినుంచి తన ఐదేళ్ల కుమారుడు కార్తీక్‌తో కలిసి తల్లిగారింట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 26న మధ్యాహ్నం 2 గంటలకు బస్టాండ్‌లో పని ఉందని చెప్పి, కుమారుడిని తీసుకొని వెళ్లి, కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యులు రెండు రోజులు గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోచమ్మ తల్లి దుర్గవ్వ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, తల్లీకుమారుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఐఐటీ విద్యార్థి విషాదాంతం
మిర్యాలగూడ టౌన్: వారం రోజుల క్రితం అదృశ్యమైన ఐఐటీ విద్యార్థి కార్తీక్ సోమవారం రాత్రి విశాఖపట్నంలోని జోడుగుళ్లపాలెం బీచ్‌లో శవమై తేలాడు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కార్తీక్ పరీక్షలో తప్పడంతో మనస్తాపానికి గురై బంగాళాఖాతంలో మునిగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్‌ట్యాంకు తండాకు చెందిన ధనావత్ ఉమ్లా నాయక్, సైదమ్మ దంపతులకు కుమారుడు ధనావత్ కార్తీక్ (20), కుమార్తె సాతి్వక ఉన్నారు. ఉమ్లా నాయక్ వ్యవసాయ పనులు చేస్తుండగా, సైదమ్మ చింతలపాలెంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. కాగా కార్తీక్ ఇటీవల విడుదలైన సెమిస్టర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న రాత్రి క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిన కార్తీక్ అప్పట్నుంచీ కన్పించకుండా పోయాడు. ఈ నెల 18న తల్లిదండ్రులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో వారు కళాశాలకు వెళ్లి ఆరా తీశారు. కార్తీక్ బయటకు వెళ్లి తిరిగి రాలేదని సిబ్బంది చెప్పడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జన్మభూమి ఎక్కి విశాఖలో దిగి.. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించగా..18వ తేదీ ఉదయం కార్తీక్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కినట్లు కన్పించింది. అతను అదేరోజు రాత్రి విశాఖలో దిగడం, రాత్రి 9.30 సమయంలో ఆర్కే బీచ్‌లోని ఓ బేకరీలో ఏవో కొనడం కూడా సీసీ టీవీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. కార్తీక్ విశాఖపట్నంలో కన్పించినట్టు పోలీసులు ఇచ్చి న సమాచారంతో అతని తల్లిదండ్రులు అక్కడి తమ బంధువులకు విషయం చెప్పారు. 19వ తేదీ నుంచి కుటుంబసభ్యులు, బంధువులు గాలించినా ఆచూకీ దొరకలేదు. కాగా ఈ నెల 21న విశాఖ జోడుగుళ్లపాలెం బీచ్‌కు ఓ యువకుడి మృతదేహం కొట్టుకొచ్చింది. ఆరిలోవ పోలీసులు గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి కేజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని పరిశీలించిన కార్తీక్ తల్లిదండ్రులు అది తమ కుమారుడేనని గుర్తించారు. కార్తీక్ వారం రోజుల క్రితమే బంగాళాఖాతంలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. అతడి మృతదేహం కుళ్లిపోయింది. సెల్‌ఫోన్ ఐఎంఈఐ నంబరు ద్వారా ఆ మృతదేహం కార్తీక్‌దే అని పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని జలచరాలు తినడంతో పోస్టుమార్టం చేసేందుకు కూడా వీలు కాలేదు. దీంతో శవాన్ని వెంటనే అంబులెన్సులో మిర్యాలగూడ వాటర్ ట్యాంకు తండాకు తరలించి సాయంత్రం వారి వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేశారు. అమ్మకు బంగారం కొనిస్తానంటివయ్యా.. ‘ఉద్యోగం వచ్చి న తర్వాత అమ్మకు బంగారం కొనిస్తానంటివి.. అందరినీ మంచిగా చూసుకుంటా అంటివి.. ఇప్పుడు కనిపించకుండా పోయావా కొడుకా’అంటూ ఉమ్లానాయక్ కుమారుడి మాటలను గుర్తు చేసుకుంటూ రోదించిన తీరు అందరినీ కదిలించింది. -
కొడుకా..! ఎక్కడున్నావురా..?
నల్గొండ: కొడుకా.. ఎక్కడ ఉన్నావురా..మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లావు.. ఇంటికిరా.. అంటూ కన్నీరుమున్నీరవుతోంది.. ఆ గిరిజన కుటుంబం. పరీక్షలో తప్పావని దిగులు చెందకు కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లతో అభయమిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంకు తండాకు చెందిన ధనావత్ ఉమ్లా నాయక్ –సైదమ్మల దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరిలో పెద్దవాడు ధనావత్ కార్తీక్, కుమార్తె సాత్విక. ధనావత్ ఉమ్లానాయక్ వ్యవసాయ పనులు చేసుకుంటుండగా తల్లి సైదమ్మ చింతలపాలెంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. రెండు సబ్జెక్టులు తప్పాడనేనా..? ధనావత్ కార్తీక్ సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో కార్తీక్ రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. అయితే, కార్తీక్ మనస్తాపం చెందాడో మరో కారణమో తెలియదు కానీ ఈ నెల 17న రాత్రి 7:40 గంటలకు కళాశాల హాస్టల్ నుంచి బయటికి వచ్చాడు. అనంతరం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకున్నాడు. రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఎక్కి వైజాగ్ వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌లు చూపిస్తున్నాయి. 18వ తేదీ రాత్రి 9: 30గంటలకు రైలు దిగి నడుచుకుంటూ ఆర్కే బీచ్ వరకు వెళ్లి సమీపంలో గల ఫేమస్ బేకరీలో 10:30గంటలకు తినుబండారాలు కొనుగోలు చేశాడు. అనంతరం తిరిగి బీచ్ వైపు వెళ్లి 2.38గంటల వరకు తిరిగినట్లు సీసీ ఫుటేజ్ చూయించింది. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో.. ఈ నెల 18న అర్ధరాత్రి దాటిన తర్వాత 2:58 గంటలకు బీచ్ సమీపంలోనే కార్తీక్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడి నుంచి కార్తీక్ ఎక్కడికి వెళ్లాడనేది అంతుచిక్కకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఈ నెల 19న సంగారెడ్డిలోని ఐఐటీ కళాశాలకు వెళ్లి విషయం ప్రిన్సిపాల్ దృష్టి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తల్లిదండ్రులు సంగారెడ్డిలోని కంది పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అప్పటికే వైజాగ్‌లో ఉన్న వారి బంధువులకు సమాచారం ఇచ్చిన ఉమ్లానాయక్–సైదమ్మలు 21న వైజాగ్‌కు వెళ్లారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు వైజాగ్ పోలీసులను ఆశ్రయించగా 60మంది బృందాలుగా ఏర్పడి కార్తీక్ కోసం ఐదు రోజులుగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గుండెలు బాదుకుంటున్న నాయనమ్మ, తాతయ్య నాకు ఒక్కడే కుమారుడు, నా కుమారుడికి ఒక్కడే కుమారుడు అంటూ కార్తీక్ నాయనమ్మ–తాతయ్య ధర్మి, వాలు కన్నీరుమున్నీరవుతున్నారు. కార్తీక్ అదృశ్యం అయినప్పటి నుంచి బంధువులు వస్తుండటంతో వారి కన్నీటిని అపడం ఎవరితరం కావడం లేదు. మనుమడా ఎక్కడా ఉన్నా రా.. అయ్యా అంటూ గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. -
Kevvu Karthik : హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న జబర్దస్త్ కెవ్వు కార్తిక్ (ఫొటోలు)
-
అమ్మాయిలతో ఫ్లర్టింగ్ ఎలా చేయాలో చెప్పిన కార్తీ
-
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ పెళ్లి ఫోటోలు చూశారా? (ఫొటోలు)
-
‘తమ్ముళ్లే’ ఆ గంజాయి బాబులు!
సాక్షి, పుట్టపర్తి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక.. ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ములేక టీడీపీ నేతలు విష సంస్కృతికి తెరలేపారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బలో గంజాయి సేవించి హల్చల్ చేసిన యువకులు టీడీపీ కార్యకర్తలు అయినప్పటికీ వారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనుచరులని తప్పుడు ప్రచారం చేస్తూ బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌కు సన్నిహితంగా ఉండే కార్తీక్.. ఈ నెల 23న తన స్నేహితులతో కలిసి గంజాయి సేవించి వాహనాలతో రోడ్లపై హడావుడి చేశారు. అడ్డొచ్చిన వాహనాలను ఢీకొట్టారు. ఎదురు మాట్లాడిన వ్యక్తిని చితకబాదారు. పోలీసులు పట్టుకుంటే ‘వైఎస్సార్సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి’ స్టిక్కర్ చూపించారు. తాము చేసిన అరాచకాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపైకి నెట్టేందుకే ఈ స్టిక్కర్’ చూపించినట్లు తెలుస్తోంది. బురద జల్లేందుకే.. నిజానికి.. 2019 ఎన్నికల్లో రాప్తాడు నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఘోరంగా ఓడిపోయిన పరిటాల శ్రీరామ్.. రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై బురదజల్లేందుకు ఆకతాయిలను రోడ్లపై వదిలినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. గంజాయి మత్తులో వీరంగం చేయడంతో పాటు అధికార పార్టీ నేతలను లాగాలని చూడటం తెలుగు తమ్ముళ్లకు సరికాదని వైఎస్సార్సీపీ శ్రేణులు సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చాయి. ఇక ముదిగుబ్బ పోలీసుల అదుపులో ఉన్న కార్తీక్ గురించి వైఎస్సార్సీపీ నేతలు ఆరా తీయగా పరిటాల శ్రీరామ్‌కు అత్యంత సన్నిహితుడిగా తేలింది. అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో దిగిన అతని ఫొటోలూ సేకరించారు. -
ఓ ఇంటివాడైన జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ (ఫొటోలు)
-
పెళ్లి చేసుకున్న కమెడియన్ కెవ్వు కార్తీక్
బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా పాపులర్ అయిన కమెడియన్ కెవ్వు కార్తీక్ ఓ ఇంటివాడు అయ్యాడు. కెవ్వు కార్తీక్, శ్రీలేఖల వివాహం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకకు బుల్లితెర నటులే కాకుండా పలువురు సినీ ప్రముఖులు కూడా హజరయ్యారు. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా తనకు అత్యంత ఆప్త మిత్రుడు అయిన గెటప్ శ్రీను సహా పలువురు కమెడియన్లు హాజరయ్యారు. వారందరూ కొత్త దపంతులను ఆశీర్వదించారు. (ఇదీ చదవండి: టక్కర్ సినిమా ట్విటర్ రివ్యూ, టాక్ ఎలా ఉందంటే?) ఈ మేరకు కొత్త దంపతులతో దిగిన ఫోటోలను గెటప్ శ్రీను షోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపాడు. అయితే, గతంలో తన భార్యను సిరి అని సంబోధించాడు కార్తీక్. కానీ, గెటప్ శ్రీను మాత్రం పెళ్లికుమార్తె పేరు శ్రీలేఖ అని పేర్కొన్నాడు. బహుశా సిరి అనేది ముద్దుపేరేమో. వరంగల్‌లో పుట్టిన కార్తీక్ ఇంజినీరింగ్ పూర్తి చేసి సినిమాలపై మక్కువతో హైదరాబాద్ వచ్చాడు. ఇప్పటికే టీవీ షోలతో పాటు పలు సినిమాల్లోనూ నటించాడు. గతేడాది విడుదలైన ‘ముఖచిత్రం’, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రాలతో ఆయన ప్రేక్షకులను మెప్పించాడు. (ఇదీ చదవండి: టాలీవుడ్లో ప్రేమ పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!) -
ఆవారాకు సీక్వెల్ రెడీ...! ఫాన్స్ కు గుడ్ న్యూస్
-
పెళ్లికి సిద్ధమైన జబర్దస్త్ కమెడియన్ .. అమ్మాయి ఎవరో చెప్పేశాడు!
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ శుభవార్తను అతడే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. తనతో కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను అంటూ నోట్ రాసుకొచ్చాడు. తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. అయితే ఇందులో ఆ అమ్మాయి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. అయితే తాజాగా మరోసారి తాను చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేస్తూ మరోసారి ఇన్‌స్టాలో ఫోటోలు పంచుకున్నారు. ఈ ఫోటోల్లో తనకు కాబోయే అమ్మాయి ముఖ పరిచయం చేశారు. అంతే కాకుండా ఫోటోలతో పాటు ఓ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు కెవ్వు కార్తీక్. ఇది చూసిన పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇది చదవండి: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!) కార్తీక్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ఫైనల్‌గా నేను చేసుకోబోయే అమ్మాయి. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని విన్నా. కానీ ఆ సమయంలో నాకు అర్థం కాలేదు. రెండు భిన్నమైన మనసులు, భిన్నమైన జీవితాలు, భిన్నమైన అభిప్రాయాలు, విభిన్న ప్రపంచాలు జీవిత ప్రయాణమనే పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఒకే హృదయంగా మారుతున్నాయి.. వెల్కమ్ టూ మై లైఫ్ సిరి.' అంటూ పోస్ట్ చేశారు. కాగా కెవ్వు కార్తీక్ ఎన్నో కష్టాలు దాటుకుని సెలబ్రిటీ స్థాయికి ఎదిగాడు. ఓ పక్క ఇంజనీరింగ్ చదువుతూనే మిమిక్రీలో డిప్లొమా పూర్తి చేసిన అతడు ఎంటెక్ చేసి ఉద్యోగం సంపాదించాడు. కానీ మిమిక్రీ, కామెడీపై ఉన్న ప్యాషన్‌తో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తర్వాత హైదరాబాద్ వచ్చి మిమిక్రీ ఆర్టిస్టుగా స్టేజీ షోలు చేశాడు. అనంతరం కామెడీ క్లబ్, జబర్దస్త్ షోలలో మెరిశాడు. జబర్దస్త్‌లో ఒక టీమ్‌లో సభ్యుడిగా మాత్రమే ఉన్న కార్తీక్ తర్వాత టీమ్ లీడర్‌గా మారాడు. (ఇది చదవండి: మరోసారి జంటగా లవ్ బర్డ్స్.. డేటింగ్‌పై మొదలైన చర్చ!) View this post on Instagram A post shared by Kevvu Kartheek (@kevvukartheek) -
అదే LSG కొంప ముంచింది ఇకనయినా కళ్ళు తెరవండి
-
తేజ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయినా డైరెక్టర్ కార్తీక్..
-
సుకుమార్ మాస్టర్ ప్లాన్ అక్కడి వరకే..
-
సైయంట్ సీఈవోగా కార్తీక్ నటరాజన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైయంట్ కొత్త సీఈవోగా కార్తీక్ నటరాజన్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, ఈడీగా ఉన్నారు. ఇప్పటివరకూ సీఈవోగా ఉన్న కృష్ణ బోదనపు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎండీగా పదోన్నతి పొందారు. ఏరోస్పేస్ తదితర విభాగాల గ్లోబల్ హెడ్ ప్రభాకర్ అట్ల.. సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. సంస్థను 2 విభాగాలుగా విడదీసే పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను కూడా సైయంట్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. సైయంట్ డీఎల్ఎం(డిజైన్ లెడ్ మాన్యుఫాక్చరింగ్) వ్యాపార విభాగం పబ్లిక్ ఇష్యూకి వచ్చే దిశగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. సైయంట్ డీఎల్ఎంకి ఆంటోనీ మాంటల్బానో సీఈవోగా వ్యవహరిస్తారు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఎల్కతుర్తి: ప్రాణస్నేహితులిద్దరూ చనిపోయారన్న బెంగతో ఒక డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రంలో సోమ వారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాలివి. తంగళ్లపెల్లి సంపత్, సుమలత దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. కార్తీక్(21) హనుమకొండలో డిగ్రీ ప్రథమ సంవత్సరం, చిన్న కుమారుడు వినయ్ 8వ తరగతి చదువుతున్నారు. కార్తీక్ మేనమామ కుమారుడు అఖిల్ ఆరేళ్ల క్రితం క్యాన్సర్‌తో చనిపోయాడు. మరో స్నేహితుడు రాకేష్ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ఈ ముగ్గురు చిన్ననాటి స్నేహితులు కావడంతో.. వారు చనిపోయినప్పటి నుంచి కార్తీక్ దిగాలుగా ఉండేవాడు. తాను కూడా వారి వద్దకు వెళ్తానంటూ.. అప్పుడప్పుడు తల్లిదండ్రులకు చెప్పేవాడు. దీంతో వారు అధైర్యపడొద్దని కుమారుడికి సర్దిచెప్పేవారు. కాగా, కార్తీక్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ‘నా చావుకు ఎవరూ కారణం కాదని’సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకున్నాడు. ఎస్ఐ పరమేశ్ కేసు నమోదు చేశారు. -
వివాహం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు.. తల్లిదండ్రులను పిలిపించి..
సాక్షి, చెన్నై(అన్నానగర్): తిరుచ్చి సుబ్రమణ్యపురానికి చెందిన కార్తీక్ (23) బీఏ చదివి బిస్కెట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న సెంతనీర్ పురం సమీపంలో ఉన్న వరగనేరి పిచ్చై పట్టణానికి చెందిన అంగుస్వామి కుమార్తె అభినయ(19)ను ప్రేమించాడు. వారిద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో తల్లిదండ్రులు తమను విడదీస్తారనే భయంతో సమయపురంలోని ఆది మారియమ్మన్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం సమయపురం పోలీసులను ఆశ్రయించారు. సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి చర్చలు జరిపారు. రాజీ కుదరడంతో పెళ్లికూమార్తెను వరుడితో పాటు పంపించారు. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. భర్త పలుమార్లు హెచ్చరించినా..) -
తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం
Actor Karthik Married His Wife Younger Sister: సీనియర్ హీరో కార్తిక్ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్ హీరో అయిన కార్తిక్ సీతాకోక చిలుక వంటి క్లాసిక్ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తర్వాత అనుబంధం, అన్వేషణ, పుణ్యస్త్రీ, అభినందన, గోపాల్ రావు గారి అబ్బాయి, మగ రాయుడుతోపాటు కల్యాణ్ రామ్ ఓమ్ 3డి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్ తీసుకున్న కార్తీక్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా రాణిస్తున్నాడు. అయితే కార్తీక తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి సుమారు 125కిపైగా చిత్రాల్లో నటించిన కార్తీక్ 1988లో సహనటి రాగిణిని వివాహం చేసుకున్నాడు. కార్తీక్, రాగిణి ఇద్దరూ సోలైకుయిల్ సిమాలో కలిసి నటించారు. వీరికి గౌతమ్ కార్తీక్, ఘైన్ కార్తీక్ కుమారులు ఉన్నారు. గౌతమ్ కార్తీక్ 'కడలి' మూవీతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం రాగిణి సోదరి రథిని 1992లో రెండో వివాహం చేసుకున్నాడు కార్తీక్. వీరిద్దరికి తిరన్ కార్తీక్ కొడుకు ఉన్నాడు. చదవండి: నా వల్లే భారతీయ రైల్వేస్‌కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్ అప్పటివరకు ఉజ్వలంగా సాగిన కార్తీక్ కెరీర్ 2000 సంవత్సరం తర్వాత ఒడిదొడుకులు ఎదుర్కొంది. 2005లో వచ్చిన నటుడు సత్యరాజ్ 'శివలింగం ఐపీఎస్' సినిమాలో తొలిసారి విలన్‌గా నటించాడు కార్తీక్. అయితే పలు అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. తనకున్న చెడు అలవాట్ల వల్లే తన కెరీర్ నాశనం అయిందని ఒక సందర్భంలో స్వయంగా కార్తీక్ తెలిపాడు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు -
మళ్లీ కూసిన గువ్వ
వలస పక్షుల కిల.. కిల.. రావాలతో శేషాచలం కళకళలాడుతోంది. రంగురంగుల ఈకలు.. చూడచక్కని ముక్కులతో.. కొమ్మరెమ్మలపై ఎగురుతూ.. నింగిలో ఆహ్లాదకరమైన విన్యాసాలు చేస్తూ.. వినసొంపైన కిల..కిల.. రావాలతో శేషాచలం అడవులకు వలస పక్షులు మరింత అందం తీసుకొచ్చాయి. ఇప్పటికే శేషాచల కొండల్లో 215 రకాల పక్షి జాతులుండగా.. ఇప్పుడు వలస పక్షులు వాటికి తోడయ్యాయి. మూడేళ్లుగా వర్షాలు బాగా కురుస్తుండటంతో శేషాచల అడవుల్లోని జంతువులకు, పక్షులకు ఆహారం సమృద్ధిగా లభిస్తోంది. దీనివల్లే ఉత్తర భారతదేశంతో పాటు వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి అరుదైన పక్షులు శేషాచలం బాట పట్టాయని శాస్త్రవేత్త కార్తీక్ చెప్పారు. వాటిలో కొన్నింటిని తన కెమెరాలో బంధించినట్లు తెలిపారు. –తిరుపతి అలిపిరి శేషాచలం చేరిన వాటిలో ప్రత్యేకమైనవి.. బ్లాక్ నేప్డ్ మోనార్క్ ఫ్లై క్యాచర్: సాధారణంగా ఈ రకంలో మగ పక్షులు బ్లూ కలర్‌లోనూ.. ఆడ పక్షులు గ్రే కలర్‌లోనూ ఉంటాయి. వీటికి సిగ్గు ఎక్కువ. స్ట్రీక్ త్రోటెడ్ ఉడ్‌పెకర్: ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. పచ్చగానూ.. తలపై ఆరెంజ్ కలర్ జుట్టుతోనూ దర్శనమిస్తుంటాయి. భారతదేశంలోని 12 రకాల ఉడ్ పెకర్స్లో ఈ జాతి అరుదైనది. గ్రీన్ ఇంపీరియల్ పీజియన్: అనేక ఏళ్ల తర్వాత ఇది కళ్యాణి డ్యాం ప్రాంతంలో కనిపించింది. అరుదైన పావురాల్లో ఇది ఒకటి. చైనా, మలేసియా, ఫిలిప్పీన్స్, నేపాల్‌లలో ఇవి కనిపిస్తుంటాయి. ఏసియన్ పారడైజ్ ఫ్లైక్యాచర్: చిన్న తల, పొడవాటి తోక, ఆరెంజ్ కలర్లో ఉండే ఈ పక్షి శేషాచలంలో అరుదుగా కనిపిస్తుంటుంది. చామల రేంజ్‌లోని కోటకాడపల్లి ప్రాంతంలో కెమెరాకు చిక్కింది. మధ్య ఆసియా దేశాల్లో ఈ పక్షులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇండియన్ స్కాప్స్ ఔల్: దక్షిణ ఆసియాలో కనిపించే గుడ్లగూబ ఇది. దీని అరుపులు చాలా వింతగా>.. భయాందోళనకు గురి చేస్తుంటాయి. దీని కళ్లు పెద్దగా ఉంటాయి. కళ్యాణి డ్యాం ప్రాంతంలో ఇటీవల ఇది దర్శనమిచ్చింది. ఎల్లో త్రోటెడ్ బుల్బుల్: పసుపు పచ్చగా.. ముద్దుగా కనిపించే ఈ పక్షులు ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంటాయి. చాలా అరుదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ఈ పక్షులు కపిలతీర్థం ప్రాంతంలో కనిపించడం విశేషం. టికెల్స్ బ్లూ ఫ్లైక్యాచర్: ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన అరుదైన జాతి పిట్ట ఇది. చిన్న ముక్కు, పసుపు రంగు గొంతు దీని ప్రత్యేకత. శేషాచలంలో ఈ పిట్టలు సందడి చేస్తున్నాయి. కాపర్ స్మిత్ బార్బెట్: ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’తో కాపర్ స్మిత్ బార్బెట్ను పోల్చవచ్చు. కాపర్ ప్లేట్‌పై సుత్తితో కొడితే ఎలా సౌండ్ వస్తుందో.. ఈ పిట్ట అరిస్తే అలా ఉంటుంది. వివిధ వర్ణాల్లో ఉండే ఈ పిట్ట.. తన అందంతో మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. బ్లాక్ హుడెడ్ ఓరియోల్: పసుపు, నలుపు రంగుల్లో అందంగా ఉండే ఈ పక్షి ప్రస్తుతం శేషాచలంలో దర్శనమిస్తోంది. ఆరెంజ్ హెడెడ్ త్రష్: ఆరెంజ్ కలర్లో ఉన్న ఈ పక్షి బ్రహ్మదేవ గుండంలో కనిపించింది. ఇది హిమాలయ ప్రాంతం నుంచి వచ్చినట్లుగా కార్తీక్ చెప్పారు. అనేక ఏళ్ల తర్వాత.. శేషాచలంలో ఇప్పటి వరకు 180 రకాల పక్షులను ఫొటోలు తీశాను. ఈ ఏడాది కళ్యాణి డ్యాం, కపిలతీర్థం, మామండూరు, బాలపల్లి, కలివిలేటి కోన, బ్రహ్మదేవ గుండం, మొగిలిపెంట, చామల రేంజ్‌లోని తలకోన, కోటకాడపల్లి తదితర ప్రాంతాల్లో అరుదైన పక్షులు కనిపించాయి. చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ దర్శనమిచ్చాయి. – కార్తీక్, బర్డ్స్మెన్, తిరుపతి -
యువతికి గర్భం.. ఏప్రిల్ 8న వివాహానికి ఒప్పుకొని, తెల్లారేసరికి..
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడిని రిమాండ్‌కు తరలించిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కాప్రా, గాంధీనగర్‌కు చెందిన గడ్డం కార్తీక్ (24), అదే కాలనీకి చెందిన ఓ యువతి (21), కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. దీంతో యువతి తనను వివాహాం చేసుకోవాలని పలుమార్లు ఒత్తిడి చేస్తుండటంతో తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలవడంతో కార్తీక్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ నెల 8న వివాహం చేస్తామని వారంతా ఒప్పుకున్నారు. తీరా మరుసటి రోజే ఇంటికి తాళం వేసుకొని పరారయ్యారు. కార్తీక్, అతడి కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం వెతికిన ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు కాపాడారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా శనివారం కార్తీక్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. చదవండి: (విషాదం: సంబంధాలు వస్తున్నాయి.. భూమి కొనడానికి ఎవరూ రాక..) -
చాలా కాలం తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న తమిళ నటుడు
తమిళసినిమా: సీనియర్ నటుడు కార్తీక్ తీ ఇవన్ చిత్రం కోసం ఫైట్ చేశారు. ఈయన చాలా కాలం తరువాత కథానాయకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. మనిదన్ సినీ ఆర్ట్స్ పతాకంపై నిర్మలాదేవి జయమురుగన్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి టి.ఎం.జయమురుగన్ కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు రోజా మలరే, అడడా ఎన్న అళగు, సింధుబాద్ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారన్నది గమనార్హం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పిన నటుడు కార్తీక్ పేర్కొంటూ దర్శకుడు కథ చెప్పినప్పుడే అందులోని సత్తా తనకు అర్థం అయ్యిందన్నారు. తమిళ సంప్రదాయాన్ని, మన జీవన విధానాన్ని అందంగా తెరపై చూపించారన్నారు. చిత్రాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారన్నారు. పాటల రూపకల్పన, చిత్రీకరణ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ఈ చిత్రం కోసం తాను నాలుగు పోరాట దృశ్యాల్లో నటించానని చెప్పారు. చాలా గ్యాప్ తరువాత నటించిన ఈ చిత్రం తన కెరీర్లో మంచి చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని కార్తీక్ పేర్కొన్నారు. చదవండి: Andrew Garfield: బ్రేకప్ చెప్పుకున్న ప్రేమజంట, కారణమే విడ్డూరంగా ఉంది! -
‘ఎస్కేప్’ కార్తీక్ దొరికాడు.. 80 ఇళ్లలో చోరీ, 17వసారి అరెస్ట్
సాక్షి, బెంగుళూరు: చోరీ కేసులో అరెస్ట్ అవడం.. జైలు నుంచి లేదా, పోలీసుల అదుపులో నుంచి తప్పించుకొని మళ్లీ దొంగతనాలు చేయడం అతనికి అలవాటుగా మారింది. కర్ణాటకలోని కల్యాణ్ నగర్లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల కార్తిక్ కుమార్ అలియాస్ (ఎస్కేప్ కార్తిక్)ను కామాక్షిపాళ్య పోలీసులు 17వసారి అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన ఓ చోరీ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులకు ఎస్కేప్ కార్తిక్ మళ్లీ పట్టుబడ్డాడు. అతని వద్ద ఉన్న సుమారు రూ.11లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 16 ఏళ్ల వయసు నుంచే కార్తిక్‌కు చోరీలు చేయటం అలవాటుగా మారిందని పోలీసులు పేర్కొన్నారు. సుమారు 80 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో వీధుల గుండా తిరుగుతూ ముందుగానే రెక్కీ నిర్వహించిన ఇళ్లలోకి వెళ్లి చోరీలు చేస్తాడని పోలీసులు వివరించారు. 2008లో ఓ చోరీ కేసులో అరెస్టై పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ఉన్న సమయంలో భోజనం పంపిణీ చేసేందుకు వచ్చిన ఫుడ్ వ్యాన్‌లో దాక్కొని పారిపోయాడు. దీంతో అతనికి ‘ఎస్కేప్ కార్తీక్’ అనే పేరు వచ్చింది. పోలీసులు 45 రోజుల తర్వాత అతన్ని పట్టుకున్నారు. 2010లో మరోసారి కార్తిక్ పోలీసుల కస్టడీ నుంచి పారిపోయాడు. కామాక్షిపాళ్య పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి.. బసవేశ్వర నగర్, కేపీ అగ్రహారాల్లో కూడా కేసులు నమోదైనట్లు గుర్తించారు. -
వ్యాయామం చేస్తూ కిందపడ్డ నటుడు, కాలికి గాయాలు
Karthik Hospitalised: సీనియర్ నటుడు కార్తీక్ బుధవారం ఆస్పత్రిలో చేరారు. కొంతకాలంగా కార్తీక్ రాజకీయాలకు స్వస్తి పలికి మళ్లీ సినిమాల్లో నటించడం మొదలెట్టారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంట్లో వ్యాయామం చేస్తుండగా కిందపడిపోయారు. దీంతో ఆయన కాలికి బలంగా దెబ్బ తగలడంతో వెంటనే స్థానిక అడయార్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఇంతకుముందు ప్రమాదంలో తగిలిన కాలుకే దెబ్బ తగలడంతో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. -
సీనియర్ నటుడికి అత్యవసర చికిత్స
చెన్నై: సీనియర్ నటులు కార్తీక్‌కు వైద్యులు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. బహుభాషా నటుడు కార్తీక్ చాలాకాలం క్రితమే రాజకీయ రంగప్రవేశం చేశారు. అయితే కొంతకాలం తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చాలా గ్యాప్ తర్వాత కార్తీక్ మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. అలాంటిది ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆయన అన్నాడీఎంకే పార్టీకి ప్రచారం చేస్తారని ప్రకటించారు. అన్నట్టుగానే ప్రచారంలో పాల్గొన్న కార్తీక్ గత నెల 21న అనూహ్యంగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు స్థానిక ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. శ్వాస సంబంధిత సమస్యలతోపాటు, రక్తపోటు కారణంగా కార్తీక్ అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయన కొన్ని రోజులు ఆస్పత్రిలోనే వైద్య చికిత్సలు పొంది ఆరోగ్యం చేకూరడంతో ఇంటికి వచ్చారు. ఆ తర్వాత కూడా కార్తీక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలా ఇటీవల ప్రచార కార్యక్రమాలు ముగించుకొని తిరిగి రాగా మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కార్తీక్‌ను మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన అత్యవసర చికిత్స వార్డులో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. అయినా కార్తీక్ శ్వాసకోశ సమస్య తీవ్రత తగ్గలేదు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. చదవండి: మళ్లీ అనారోగ్యానికి గురైన సీనియర్ నటుడు కార్తీక్ -
మళ్లీ అనారోగ్యానికి గురైన సీనియర్ నటుడు కార్తీక్
చెన్నై: సీనియర్ నటుడు కార్తీక్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కార్తీక్ అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేసి సొంతంగా పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొంతకాలం తర్వాత రాజకీయాలకు దూరమైన ఆయన పార్టీని కూడా రద్దు చేశారు. ఇటీవల అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా ప్రచారం చేయనునట్లు ప్రకటించారు. కాగా కార్తీక్ అనూహ్యంగా అనారోగ్యానికి గురై గత నెల 21న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వైద్యులు కార్తీక్ ను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. కార్తీక్ ఇటీవల మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం ప్రచారం ముగించుకుని ఇంటికి చేరుకున్న కార్తీక్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ను అడయార్‌లోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. కార్తీక్ శ్వాసకోస సంబంధిత సమస్యతో పాటు, అధిక రక్తపోటుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. చదవండి: కృతీ శెట్టి డ్యాన్స్ వీడియో చూశారా? -
ఆస్పత్రిలో సీనియర్ నటుడు
సాక్షి, చెన్నై: మనిద ఉరిమై కట్చి (మానవ హక్కుల పార్టీ) వ్యవస్థాపకుడు, సీనియర్ నటుడు కార్తీక్ అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా నటుడు కార్తీక్ సుపరిచితుడే. ఈయన వారసుడు సైతం ప్రస్తుతం సినిమాల్లోకి వచ్చారు. తాజాగా అప్పుడప్పుడు తెరపై కనిపించే కార్తీక్, ప్రస్తుతం రాజకీయ ప్రచారానికి సిద్ధమయ్యారు. మనిద ఉరిమై కట్చి వ్యవస్థాపకుడిగా ఉన్న కార్తీక్ తన మద్దతును అన్నాడీఎంకే–బీజేపీ కూటమికి ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ప్రచారం ముగించుకుని శనివారం రాత్రి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస సమస్య తలెత్తడంతో కుటుంబీకులు చెన్నై అడయార్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్ అని తేలింది. అయితే, ఆయనకు శ్వాససంబంధిత సమస్యలు ఉండడంతో పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. సుధీష్‌కు పాజిటివ్.. డీఎండీకే నేత విజయకాంత్ బావ మరిది, ఆ పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సుధీష్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. శనివారం రాత్రి ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షలో కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయనతో సంప్రదింపుల్లో ఉన్న వారందరూ పరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదవండి: హీటెక్కిస్తున్న‘సీటీమార్’ పెప్సీ ఆంటీ సాంగ్ ఆలియా.. అచ్చం సాగర కన్య! -
ఉద్వేగం.. వినోదం
జగపతిబాబు ప్రధాన పాత్రలో, కార్తీక్, అమ్ము అభిరామి జంటగా బాల నటి సహశ్రిత మరో కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఫాదర్–చిట్టి–ఉమ–కార్తీక్’. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. శ్రీ రంజిత్ మూవీస్ ప్రొడక్షన్స్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాను జనవరిలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కొంత విరామం తరువాత మళ్లీ వరుసగా సినిమాలు నిర్మించనున్నాను. ఇప్పటికే నాలుగు కథలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయగా, వాటిలో ‘ఫాదర్–చిట్టి–ఉమ–కార్తీక్’ ఒకటి. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. కథానుసారమే టైటిల్ నిర్ణయించాం. థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. మంచి చిత్రాలను కుటుంబ సమేతంగా థియేటర్లో చూసి ఆదరించే ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మా చిత్రం రూపొందింది’ అన్నారు. ‘‘ఫాదర్–చిట్టి–ఉమ–కార్తీక్ అనే పాత్రల మధ్య జరిగే ఈ చిత్రకథలో భావోద్వేగాలు, వినోదం సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి’’ అన్నారు విద్యాసాగర్ రాజు. ఈ చిత్రానికి కెమెరా: శివ.జి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
ప్రేమ.. జీవితం.. పకోడి
కార్తీక్, సంచిత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లవ్..లైఫ్ అండ్ పకోడి’. ‘మధుర’ శ్రీధర్ సమర్పణలో జయంత్ గాలి స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జయంత్ గాలి మాట్లాడుతూ – ‘‘నేటి తరం యువతీయువకులు ఏ రిలేషన్‌ని అయినా కమిట్ కావడానికి భయపడతారు. కన్ఫ్యూజ్ అవుతారు. కరెక్టా? కాదా? అనే సందేహాల్లో ఊగిసలాడతారు. వారి మధ్య ఆకర్షణలు, ప్రేమలు ఉంటాయి. కానీ వారి బాండింగ్‌కి ఎలాంటి రిలేషన్‌తో ముడిపెట్టడానికి ఇష్టపడతారన్నదే మా సినిమా కథ. ఆధునిక సంస్కృతిలో యువతరం జీవనశైలిని ప్రతిబింబించే ఈ కథ తప్పకుండా యూత్‌కు కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే మా సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేసుకుంటాం’’ అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: పవన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట సిద్ధారెడ్డి. -
కార్తీక్ హత్య కేసు విచారణ వేగవంతం
సాక్షి, గద్వాల : జిల్లాలో సంచలనం సృష్టించిన కార్తీక్ హత్య.. మరో వివాహిత ఆత్మహత్య కేసు విచారణ వేగవంతమైంది. ఫిబ్రవరి 24న కార్తీక్ దారుణహత్య.. 27న వివాహిత ఆత్మహత్య ఈ రెండు ఘటనలకు కారణం వివాహేతర సంబంధంగా పోలీసులు తేల్చి చెప్పారు. అయితే కార్తీక్ హత్య కేసులో రిమాండ్‌కు వెళ్లిన నిందితులను గద్వాల పోలీసులు కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు విచారణ అధికారి, శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్ఐ సత్యానారాయణ విచారణ చేపట్టారు. కార్తీక్ హత్యకు గల కారణాలు ఏంటనే దానిపై విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని వివాహిత.. ఏ1 రవికుమార్‌కు చెప్పిందా? లేక అతనితో ఎందుకు చనువుగా ఉంటున్నావు అంటూ వివాహితను రవికుమార్ నిలదీయడం.. తదితర కారణాలు హత్యకు ప్రేరేపించాయా అన్నదానిపై విచారించినట్లు సమాచారం. ఈ అంశాలపై నిందితులైన ఏ1 రవికుమార్ అలియాస్ దొంగరవి, ఏ2 వసంత్, ఏ3 అనిల్, ఏ4 వీరేష్, ఏ5 సునీల్‌ను విచారించారించినట్లు తెలిసింది. నిర్మానుష్య స్థలంలో పూడ్చమని చెప్పిందెవరు? కార్తీక్ హత్యకు ముందు ఎవరెవరు ఎవరితో మాట్లాడారు, హత్య చేసిన క్రమంలో మృతదేహాన్ని నిర్మానుష్య స్థలంలో పూడ్చమని చెప్పిందెవరు అనే విషయాలపై విచారణ చేసినట్లు సమాచారం. కార్తీక్ కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుపై పెద్దపల్లి అజయ్‌కు మీకు (నిందితుల)కు సంబంధం ఏంటని ఆరా తీస్తున్నట్లు సమాచారం. గతంలోను రవికుమార్, పెద్దపల్లి అజయ్ మరికొంత మంది కార్తీక్ ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురి చేశారనే అంశాలపై విచారించినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్‌లోనూ విచారణ ఇదిలాఉండగా, హత్యకు ముందు కార్తీక్‌ను నిందితులు మహబూబ్‌నగర్‌లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో కలిసిన విషయం విధితమే. మనం మనం మాట్లాడుకుందాం అంటూ.. కార్తీక్‌ను కారులో ఎక్కించుకొని గద్వాల పరిసరాలకు వచ్చాక హత్య చేసి పూడ్చి పెట్టారు. ఈమేరకు కేసు విషయంలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులను కలిసి ఆ రోజు మద్యం తాగేందుకు ఎంత మంది వచ్చారు, ఘర్షణ పడ్డారా అనే విషయమై వివరాలు రాబట్టారు. కార్తీక్ గ్రూప్‌లో నలుగురు, రవికుమార్ గ్రూప్‌లో నలుగురు మొత్తం 8 మంది అక్కడకు వచ్చరాని నిర్వాహకులు సమాధానం చెప్పినట్లు సమాచారం. దాడి చేసింది, సహకరించింది ఎవరెవరు అనే దానిపై పోలీసులు క్షుణ్ణంగా విచారణ చేస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం కార్తీక్ హత్య కేసుకు సంబంధిచిన విషయంలో కోర్టు అనుమతి మేరకు గురువారం రాత్రి ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాం. కేసులోని పలు విషయాల నివృత్తి కోసం కస్టడీలోకి తీసుకున్నాం. అజయ్ ప్రాత్రపై ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఐదుగురు నిందితులను శుక్రవారం సాయంత్రం గద్వాల కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించాం. మహబూబ్‌నగర్‌లోని బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకుల నుంచి సైతం వివరాలు రాబట్టాం. – వెంకటేశ్వర్లు, సీఐ, శాంతినగర్ -
వీడిన కార్తీక్ హత్య కేసు మిస్టరీ
గద్వాల క్రైం: మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాలలో సంచలనం సృష్టించిన కార్తీక్ హత్య, రాగసుధ ఆత్మహత్య కేసు చిక్కుముడి వీడింది. వివాహేతర సంబంధం కారణంగానే కార్తీక్ హత్యకు గురయ్యాడని.. ఆ నేరం తనపైకి వస్తుందనే ఆందోళనతో రాగసుధ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గద్వాల డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి శనివారం కేసు వివరాలు వెల్లడించారు. రాగసుధ, కార్తీక్ ఇంటర్లో క్లాస్మేట్స్.. రవి వీరి కంటే సీనియర్. కొన్నేళ్ల క్రితం రాగసుధకు మహబూబ్‌నగర్‌కు చెందిన ఉదయ్‌కుమార్‌తో వివాహమైంది. గతంలో రాగసుధకు కార్తీక్, రవితో ఉన్న పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే రవితో చనువుగా ఉండటం గమనించిన కార్తీక్.. రాగసుధను వేధించసాగాడు. ఈ నేపథ్యంలో కార్తీక్ నుంచి తనకు విముక్తి కలిగించాలని రాగసుధ రవికి చెప్పింది. దీంతో అతను కార్తీక్ అడ్డు తొలగించాలనుకున్నాడు. ఫిబ్రవరి 24న కార్తీక్ రాగసుధకు ఫోన్ చేయగా.. ఆ విషయాన్ని ఆమె రవికి చెప్పింది. (ప్రాణాలు తీసిన ఫేస్బుక్ చాటింగ్) కార్తీక్ ఎక్కడున్నాడో ఫోన్ చేసి తెలుసుకున్న రవి.. అతనిని శ్రీనివాస్‌నగర్ కాలనీలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో కలిశాడు. అక్కడ ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి కార్తీక్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు వసంత్, అనిల్‌ను రవి తన కారులో ఎక్కించుకుని రాత్రి ఒంటిగంట సమయంలో గద్వాల వెళ్లాడు. అక్కడ మరో మారు వాగ్వాదం జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రవి.. కార్తీక్ తలపై ఇనుప రాడ్‌తో బలంగా కొట్టాడు. దీంతో స్పృహ తప్పిన కార్తీక్‌ను కారు డిక్కీలో వేసుకుని రవి నిర్వహిస్తున్న డెకరేషన్ షాప్ వద్దకు తీసుకెళ్లారు. తెల్లవారుజామున కార్తీక్‌ను లేపేందుకు ప్రయత్నించగా.. అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. దీంతో అదే కారులో మేలచెర్వు గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లి పాతిపెట్టారు. మిస్సింగ్ కేసు నమోదుతో వెలుగులోకి.. కార్తీక్ 24వ తేదీన మహబూబ్‌నగర్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి సూరిబాబు ఫిబ్రవరి 25న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడిని గద్వాలకు చెందిన కొంతమంది బెదిరిస్తున్నారని చెప్పడంతో సెల్‌ఫోన్ సిగ్నల్స్, కాల్‌డేటా ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో కార్తీక్‌ను హత్య చేసినట్లుగా రవికుమార్, వసంత్, అనిల్‌లు ఒప్పుకున్నారు. హత్యకు గురైన కార్తీక్‌ను పూడ్చిన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం చేసి, బంధువులకు అప్పగించారు. అయితే ఈ కేసులో మరో ఆరుగురు ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. -
నలుగురు కుర్రాళ్ల కథ
హరీష్, వినోద్, కార్తీక్, వెంకట చరణ్ హీరోలుగా, గీత్ షా, సంజన, లాస్యశ్రీ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పంక్చర్’. చంద్రుడు క్రియేష¯Œ ్స సమర్పణలో శ్రీలక్ష్మి ప్రొడక్ష¯Œ ్స పతాకంపై శ్రీరంగం శేషశ్రీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో శ్రీరంగం శేషశ్రీ మాట్లాడుతూ– ‘‘ఇది నా మొదటి సినిమా. నలుగురు కుర్రాళ్ల మధ్య జరిగే పరిణామాల నేపథ్యంలోనే కథ ఉంటుంది. చక్కటి హాస్యంతో నిండిన కథతో రూపొందుతోంది’’ అన్నారు. ‘‘సమాజానికి ఉపయోగపడేలా మా సినిమా ఉంటుంది’’అన్నారు సమర్పకులు రాజు రాళ్లబండి. ‘‘ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. చిన్న చిత్రాలను ప్రోత్సహించాలి’’ అన్నారు సంగీత దర్శకుడు అర్జున్. ‘‘వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమా ఇది’’ అన్నారు రచయిత సాయినాథ్. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, ఎల్బీశ్రీరామ్, జయప్రకాష్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:ఎస్. శ్రీనివాస్. -
రాజ్‌తరుణ్ కారు కేసు: కార్తీక్ రూ.3లక్షలకు బేరం
సాక్షి, అమరావతి: హీరో రాజ్‌తరుణ్ కారు ప్రమాదం వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నటుడు, రాజ్‌తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఉద్దేశపూర్వకంగానే తనతో పాటు రాజ్‌తరుణ్‌పై కార్తీక్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆయన అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత వాట్సాప్ ద్వారా కార్తీక్ కొన్ని వీడియోలు పంపాడని, తనతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేసినట్లు రాజా రవీంద్ర పేర్కొన్నారు. కార్తీక్ మొదట రూ.5 లక్షలు డిమాండ్ చేశాడని, ఆ తర్వాత రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడని అన్నారు. కార్తీక్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే తమపై ఆరోపణలు చేస్తున్నట్లు రాజా రవీంద్ర తెలిపారు. దీనిపై తాము న్యాయపరంగా ముందుకు వెళతామని ఆయన ... రాజ్‌తరుణ్ వీడియోలతో కార్తీక్ తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ గురువారం సాయంత్రం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: రాజ్‌తరుణ్ కారు కేసులో కొత్త ట్విస్ట్ కాగా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్కాపూరిలో సోమవారం రాత్రి రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అదే సమయంలో స్థానికంగా నివాసం ఉండే కార్తీక్ అనే యువకుడు తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ప్రమాదం జరిగిన వెంటనే రాజ్ తరుణ్ కారు దిగి పరుగులు పెడుతున్నట్లు... అతడిని పట్టుకోగా...తాను మద్యం సేవించినట్టు, వదిలిపెట్టమని కోరిన దృశ్యాలు బయటకు వచ్చాయి. అయితే ఆ వీడియోలు ఇవ్వమని రాజా రవీంద్ర తనను ఫోన్లో బెదిరిస్తున్నాడంటూ కార్తీక్ మీడియా ముందుకు వచ్చాడు. తనకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రలోభపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచినా.. రాజ్‌తరుణ్‌ను పోలీసులు విచారణ చేయలేదు. అంతేకాకుండా కేసు వివరాలను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వెల్లడించలేదు. అయితే తాను సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్లే కారు ప్రమాదం నుంచి బయటపడినట్లు రాజ్ తరుణ్ మీడియాకు ఓ మెసేజ్ పెట్టిన విషయం విదితమే. -
సినిమా థియేటర్లో హీరోపై దాడి..
బంజారాహిల్స్: జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో సినిమా థియేటర్లో లేచి నిలబడలేదని తోటి ప్రేక్షకుడు ఓ యువకుడిపై దాడికి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని ఆర్కే సినీప్లెక్స్ పీవీఆర్ సినిమాస్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్రపురి కాలనీకి చెందిన సినీనటుడు కార్తీక్ అడుసుమిల్లి గురువారం ఉదయం ఆర్కే సినీప్లెక్స్ పీవీఆర్ సినిమాస్‌లో హిప్పీ సినిమా చూసేందుకు వచ్చాడు.సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించగా ప్రతి ఒక్కరూ గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. కార్తీక్ మాత్రం సీట్లోనే కూర్చున్నాడు. జాతీయ గీతం పూర్తయిన తర్వాత పక్క సీట్లో కూర్చున్న పద్మారావునగర్‌కు చెందిన వ్యాపారి ఆర్వీఎల్ శ్వేత్ హర్ష్ ఇదేం పద్ధతి అంటూ కార్తీక్‌ను నిలదీశాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కార్తీక్ అది తన ఇష్టమని, అడగడానికి నువ్వు ఎవరివంటూ అసభ్యంగా అతడిని దూషించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన శ్వేత్ హర్ష్ కార్తీక్‌పై దాడి చేయడంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు ఘర్షణ జరిగింది. దీంతో థియేటర్ నిర్వాహకులు, సెక్యూరిటీ గార్డులు అక్కడికి చేరుకొని వారిని శాంతింపజేశారు. ఐదు నిమిషాల తర్వాత కార్తీక్ మళ్లీ లేచి నన్నే కొడతావా అంటూ దూషించడంతో శ్వేత్ హర్ష్ మరోసారి అతడిపై దాడి చేయగా అక్కడే ఉన్న కార్తీక్ భార్య అతడిని అడ్డుకుంది. మాటామాటా పెరిగి వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కార్తీక్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై, తన భార్యపై దాడి చేసిన శ్వేత్ హర్ష్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో కూర్చోవడమే కాకుండా ఇదేమిటని అడిగినందుకు తనను దూషించిన కార్తీక్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా శ్వేత్ హర్ష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నటుడి కుమారుడిపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : నటుడు ఆహుతి ప్రసాద్ కుమారుడు కార్తీక్ ప్రసాద్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఆర్కే సినీప్లెక్స్‌లో చిత్ర ప్రారంభానికి ముందు జాతీయ గీతం వస్తుండగా కార్తీక్ ప్రసాద్ లేచి నిలబడలేదు. అక్కడున్న వారు జాతీయ గీతానికి గౌరవం ఇవ్వవా అని అడగడంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ బూతులతో వారిపై మండిపడ్డాడు. దీంతో కార్తీక్ ప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, క్యాన్సర్‌తో ఆహుతి ప్రసాద్ నాలుగేళ్ల కిందటే మరణించిన విషయం తెలిసిందే. -
చెక్క పెట్టెలో చిన్నారుల మృతదేహాలు
సాక్షి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం చిన్నయ్య పాలెం లో దారుణం చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు చివరికి చెక్క పెట్టెలో విగత జీవులుగా కనిపించారు. అనూహ్యంగా గ్రామంలోని పాడుబడిన పాఠశాలలో ఉన్న చెక్కపెట్టలో వీరిద్దరు శవాలుగా కనిపించారు. కాగా బేలెం ప్రశాంత్ కుమార్, చెడెం కార్తీక్ కనిపించడం లేదంటూ గత నెల 26న వారి తల్లిదండ్రులు జడ్డంగి పోలీసు స్టేషన్లో పిర్యాదు చేసారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కనిపించకుండా పోయిన చిన్నారుల గురించి వెతకటం ప్రారంభించారు. అయితే ఆడుకుంటూ వీరిద్దరూ పెట్టెలోకి దూరి ఉంటారని, మూత మూసుకుపోవడంతో బయటకు రాలేక చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు పెట్టెలో.. -
అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు పెట్టెలో..
-
అందరూ కనెక్ట్ అవుతారు
‘‘తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రం ‘కణా’. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు దర్శకునిగా భీమనేని శ్రీనివాసరావు అయితే కరెక్ట్ అనిపించింది. తనను సంప్రదించగానే ఇష్టంతో ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా చేశాడు’’ అని చిత్ర సమర్పకులు కేయస్ రామారావు అన్నారు. ఐశ్వర్యా రాజేశ్ టైటిల్ రోల్లో, రాజేంద్రప్రసాద్, కార్తీక్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కె.ఎ. వల్లభ నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ని భీమనేని విడుదల చేశారు. ఈ సందర్భంగా కేయస్ రామారావు మాట్లాడుతూ– ‘‘అందరూ కనెక్ట్ అయ్యే క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్గార్ల టైమ్‌లో ‘అమరసందేశం’ వంటి మంచిసినిమాలో హీరోగా నటించిన దివంగత హీరో అమర్నాథ్ మనవరాలు, హీరో రాజేశ్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయం అవుతున్నారు. తను చాలా మంచి నటి. తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి హీరోయిన్ వస్తోంది. తనతో మరో సినిమా కూడా చేయబోతున్నా. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కావస్తోంది. జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త కథలు కోరుకుంటారు. అలాంటి వాటికోసం వెతుకుతున్న టైమ్‌లో ‘కణా’ సినిమా చూశా. ఈ చిత్రం తెలుగు రీమేక్ కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటే నా వరకూ వస్తుందా? అనుకున్నా. ఓ రోజు రామారావుగారు ఫోన్ చేసి ‘కణ’ రీమేక్ హక్కులు కొన్నాను, మనం చేద్దామనగానే చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే ఆయన్ని కలిసి ‘ఈ కథ అంటే నాకు చాలా ఇష్టం సార్ చేద్దా’మన్నాను. ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అమ్మాయి క్రికెట్ నేర్చుకుని, అంతర్జాతీయ స్థాయిలో ఎలా రాణించింది? అన్నదే చిత్రకథ. ఇందులో తండ్రి, కూతురు మధ్య మంచి ఎమోషన్స్ ఉంటాయి. కథానాయిక తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్‌గారు నటించారు. తెలుగమ్మాయి అయిన ఐశ్వర్యారాజేష్ ఇతర భాషల్లో నటిగా నిరూపించుకుని మా సినిమాతో తెలుగుకి పరిచయం అవుతున్నారు. తనలో చాలా ప్రతిభ ఉంది. ఎమోషనల్ సీ¯Œ ్స తీస్తున్నప్పుడు ఒక్కరోజు కూడా గ్లిజరిన్ వాడలేదు. తను పిలిస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి’’ అన్నారు. కెమెరామెన్ ఆండ్రూ, ఆర్ట్ డైరెక్టర్ శివ శ్రీరాములు పాల్గొన్నారు. -
కార్తీక్‌కు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: బ్యాంకాక్ చెస్ క్లబ్ ఓపెన్ అంతర్జాతీయ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కార్తీక్ వెంకటరామన్ మూడో స్థానాన్ని సంపాదించాడు. థాయ్‌లాండ్‌లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో తిరుపతికి చెందిన 20 ఏళ్ల కార్తీక్ ఏడు పాయింట్లు సాధించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో కార్తీక్‌తోపాటు మరో ముగ్గురు కూడా ఏడు పాయింట్లు సాధించారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా కార్తీక్‌కు మూడో స్థానం ఖాయమైంది. 17 గ్రాండ్మాస్టర్లతో కలిపి మొత్తం 150 మంది పాల్గొన్న ఈ టోర్నీలో భారత్‌కే చెందిన దీప్‌సేన్ గుప్తా, జాన్ గుస్తాఫ్సన్ (జర్మనీ) 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. టైబ్రేక్ ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా గుస్తాఫ్సన్ చాంపియన్‌గా అవతరించాడు. దీప్‌సేన్ గుప్తా రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు 6.5 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు. -
ప్రి ఫైనల్ టీమ్ ఇదే!
ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్‌కు ముందు జరగబోతున్న ఆఖరి సిరీస్... ఇక్కడ ఎంపికైతే దాదాపుగా ఇంగ్లండ్ టికెట్ ఖరారైనట్లే... దాంతో ఆస్ట్రేలియాతో తలపడే భారత వన్డే జట్టుపై అందరి దృష్టీ నెలకొంది. అటు క్రికెట్ విశ్లేషకులు, ఇటు అభిమానుల అంచనాలకు అనుగుణంగానే ఎలాంటి సంచలనాలు లేకుండా టీమ్‌ను సెలక్టర్లు ప్రకటించారు. రెండో వికెట్ కీపర్‌గా అనుభవజ్ఞుడైన దినేశ్ కార్తీక్కంటే దూకుడైన రిషభ్ పంత్‌కే ఓటు వేయడం ఒక్కటే కొంత ఆశ్చర్యకర నిర్ణయం కాగా... లోకేశ్ రాహుల్ బ్యాటింగ్ సమర్థతపై కూడా సెలక్షన్ కమిటీ నమ్మకముంచింది. ఈ ఎంపిక ద్వారా లెఫ్టార్మ్ పేసర్, రెగ్యులర్ ఆఫ్ స్పిన్నర్ అవసరం లేదని తేల్చేయగా... ఏదో ఒక మూల ఆశలు పెంచుకున్న రహానేను పట్టించుకోలేదు. ప్రపంచ కప్‌కు ఇదే తుది జట్టు కాదంటూ ఎమ్మెస్కే ప్రసాద్ మాట వరసకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా... గాయాల సమస్య లేకపోతే ఇక మార్పులు ఉండకపోవచ్చు. ముంబై: దాదాపు మూడేళ్ల విరామం తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన అనంతరం 2017 నుంచి దినేశ్ కార్తీక్ 20 మ్యాచ్‌లు ఆడి ఫర్వాలేదనిపించే ప్రదర్శన కనబర్చాడు. ఎక్కువ సందర్భాల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం రాకపోయినా... జట్టు అవసరాలకు అనుగుణంగా అతను కీలక సమయాల్లో వేర్వేరు స్థానాల్లో రాణించాడు. 2018లో కార్తీక్ వరుసగా 21, 33, 31 నాటౌట్, 1, 44, 37, 12, 25 నాటౌట్, 38 నాటౌట్, 0 పరుగులు చేశాడు. ఫినిషర్‌గా తన పాత్రకు న్యాయం చేశాడు. అయితే ఇది వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికయ్యేందుకు సరిపోదని సెలక్టర్లు భావించినట్లున్నారు. కేవలం 3 వన్డేల అనుభవమే ఉన్నా... దూకుడులో ఈతరం ప్రతినిధిగా కనిపిస్తున్న రిషభ్ పంత్‌పైనే వారు దృష్టి పెట్టారు. మిడిలార్డర్లో ఒక ఎడంచేతి వాటం బ్యాట్స్‌మన్ బాగుంటుందని భావించడం కూడా అతనికి అదనపు బలంగా మారింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడే ఐదు వన్డేల సిరీస్ కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారం 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించింది. ఇందులో పంత్‌కు స్థానం లభించగా... ఇటీవల ఆసీస్, కివీస్ పర్యటనల్లో ఉన్న కార్తీక్‌పై వేటు పడింది. ఇదొక్కటే కాస్త చర్చనీయాంశంగా మారిన ఎంపిక. విశ్రాంతి అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి, పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చారు. ముందుగా అనుకున్నట్లుగా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం విశ్రాంతి ఇవ్వలేదు. రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఎంపికైన టీమ్‌లో పంజాబ్ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ఒక్కడే కొత్త ఆటగాడు. కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతినిస్తూ మార్కండేకు అవకాశం కల్పించారు. రాహుల్‌కు పిలుపు... ప్రధాన ఓపెనర్లు కాకుండా రిజర్వ్ ఓపెనర్‌గా లోకేశ్ రాహుల్‌పై సెలక్టర్లు నమ్మకముుంచారు. గత పది వన్డేల్లో రాహుల్ ఒకే ఒక అర్ధసెంచరీ చేసినా... అతని బ్యాటింగ్ శైలి, ఏ స్థానంలోనైనా ఆడగలిగే సత్తా కూడా ఎంపికకు కారణమైంది. టీవీ షో వివాదం తర్వాత మైదానంలో తిరిగి అడుగు పెట్టిన అనంతరం ఇంగ్లండ్ లయన్స్‌తో మ్యాచ్‌లలో రాహుల్ రెండు అర్ధ సెంచరీలు చేశాడు. ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు కూడా అదృష్టం కలిసొచ్చింది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా అసలు సీన్లోనే లేని అతను ఇటీవలి పరిమిత ప్రదర్శనతోనే సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఖలీల్‌పై వేటు... వరల్డ్ కప్‌లో వైవిధ్యం కోసం ఒక లెఫ్టార్మ్ పేసర్ ఉంటే బాగుంటుందని భావించిన సెలక్టర్లు ఇటీవల ఖలీల్ అహ్మద్‌కు రెండు ఫార్మాట్లలోనూ వరుసగా అవకాశాలు ఇచ్చారు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లలో అతను భారీగా పరుగులు ఇచ్చి అంచనాలు నిలబెట్టుకోలేకపోయాడు. దాంతో అతడిని తప్పించగా... ప్రత్యామ్నాయంగా కనిపించిన జైదేవ్ ఉనాద్కట్ పేరును కూడా పరిశీలించలేదు. ఆస్ట్రేలియాతో వన్డేలు ఆడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. టి20 సిరీస్‌తో పాటు తొలి రెండు వన్డేలకు భువనేశ్వర్‌కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో వన్డేలకు మాత్రం సిద్ధార్థ్ కౌల్‌ను ఎంపిక చేశారు. ఐపీఎల్‌తో గుర్తింపు... పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల మయాంక్ మార్కండేకు తొలిసారి భారత జట్టు పిలుపు లభించింది. దేశవాళీ జట్టు పంజాబే అయినా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడటంతోనే ఈ లెగ్ స్పిన్నర్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. 2018 ఐపీఎల్లో 14 మ్యాచ్‌లు ఆడిన అతను 8.36 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల భారత్ ‘ఎ’ తరఫున లయన్స్‌పై ఆడిన రెండు వన్డేల్లో 5 వికెట్లు తీసిన అతను... టీమిండియాకు ఎంపికైన రోజే 5 వికెట్లతో లయన్స్‌పై రెండో అనధికారిక టెస్టులో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దినేశ్ కార్తీక్‌కు దారులు మూసుకుపోలేదు. దీనికి ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లలో అతడిని ఆడించాం. ఆ సమయంలో పంత్‌కు విశ్రాంతినిచ్చాం. ఆ తర్వాత ఇంగ్లండ్ లయన్స్‌పై పంత్ బాగా ఆడాడు. అందుకే టి20 సిరీస్‌కు పంపించాం. వరల్డ్ కప్‌పై తుది నిర్ణయం తీసుకునే ముందు పంత్‌ను అందుకే కొన్ని వన్డేలు ఆడించాలని భావిస్తున్నాం. ఇటీవల కివీస్‌తో విజయ్ శంకర్ బాగా ఆడటంతో మా కూర్పు మార్చుకోవాల్సి వచ్చింది. అతను ఎంతో ప్రభావవంతమైన ఆటగాడు. తర్వాతి మ్యాచ్‌లు ఎలా ఆడతాడో చూస్తాం. మెగా టోర్నీకి ముందు అందరినీ పరీక్షించాలనేదే మా ప్రయత్నం. మరోవైపు వరల్డ్ కప్ కోసం 18 మందిని షార్ట్ లిస్ట్ చేశాం. వీరికి తగినంత విశ్రాంతినిస్తూ మ్యాచ్‌లు ఆడించే అంశంపై ఐపీఎల్ ఫ్రాంచైజీలతో చర్చించబోతున్నాం. – ఎమ్మెస్కే ప్రసాద్,సెలక్షన్ కమిటీ చైర్మన్ ఆస్ట్రేలియాతో టి20లకు భారత జట్టు కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, పంత్, దినేశ్ కార్తీక్, ధోని, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, విజయ్ శంకర్, చహల్, బుమ్రా, ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్, మయాంక్ మార్కండే. ఆస్ట్రేలియాతో వన్డేలకు భారత జట్టు కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, లోకేశ్ రాహుల్, ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, రిషభ్ పంత్, షమీ, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్ (తొలి 2 వన్డేలకు), భువనేశ్వర్ (చివరి 3 వన్డేలకు). -
మెరుపు వేగం.. గెలుపు దాహం!
ఆ కుర్రాడు బైక్ ఎక్కాడంటే వాయువేగంతో దూసుకుపోవాల్సిందే. ప్రత్యర్థులు చిత్తు కావాల్సిందే. చాంపియన్‌షిప్ కొట్టాల్సిందే. చిన్నవయసులోనే జాతీయ, అంతర్జాయతీ స్థాయిలో పోటీల్లో జయకేతనం ఎగరవేస్తూ తెలంగాణకే వన్నె తెస్తున్నాడు నగరానికి చెందిన కార్తీక్ మాతేటి. గల్లీలో ప్రారంభమైన అతని ప్రస్థానం అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకునే స్థాయికి చేరింది. 19 ఏళ్ల వయసులో మూడు నేషనల్ చాంపియన్‌షిప్‌లు, ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుని వారెవ్వా అనిపించుకున్నాడు కార్తీక్. హిమాయత్‌నగర్ :చింతల్‌కు చెందిన సతీష్‌కుమార్, విజయలక్ష్మి దంపతుల కుమారుడు కార్తీక్. ప్రస్తుతం సోమాజిగూడలోని రూట్స్ కాలేజీలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బైక్ రేసింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండటంతో రేసర్ కావాలనే కలలు కన్నాడు. అతను ఉండే గల్లీలో నిదానంగా హోండా యూనికార్న్‌తో బైక్ నడపడం నేర్చుకున్నాడు. ప్రొఫెషనల్‌గా తయ్యారయ్యేందుకు మూడేళ్ల సమయం పట్టింది. గల్లీలో ప్రారంభమైన తన ప్రస్థానం ఇటీవల ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ బైక్ రేసింగ్‌లో భారత్ తరఫున పాల్గొని చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. అంతర్జాతీయ రేసింగ్‌లో సత్తా.. గత ఏడాది నవంబర్‌లో ఢిల్లీలో జరిగిన ‘ఏషియన్ కప్ ఆఫ్ రోడ్స్ రేజింగ్’ చాంపియన్‌షిప్ పోటీల్లో జపాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఫిలిప్పీన్, థాయ్‌లాండ్‌ల నుంచి ఇద్దరేసి చొప్పున పాల్గొన్నారు. మన దేశం నుంచి అదీ తెలుగు రాష్ట్రాల నుంచి కార్తీక్, మిజోరం నుంచి కుల్స్వామిలుపాల్గొన్నారు. 5.5 కి.మీ రేసింగ్ ట్రాక్‌పై పోటీలు నిర్వహించగా.. కార్తీక్ విజయం సాధించాడు. దీంతో ‘ఏషియన్ కప్ ఆఫ్ రోడ్స్ రేసింగ్’ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుని తెలుగోడి సత్తాను చాటాడు. మూడు నేషనల్స్‌లోనూ టాప్.. దేశవ్యాప్తంగా నిర్వహించిన మూడు చాంపియషిప్లలో కార్తీక్ విజయ కేతనం ఎగరవేశాడు. గత ఏడాది ఫిబ్రవరిలో చెన్నైలో ‘ఎండ్యురెన్స్’ చాంపియన్‌షిప్‌లో 3.7 కి.మీ ట్రాక్‌పై 19 నిమిషాల పాటు ఏకధాటిగా రేసింగ్ చేసి టైటిల్ సాధించాడు. టీవీఎస్ వన్ మేక్ 150–సీసీ చాంపియన్షిప్ని, యమహా– ఆర్15 చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన పల్సర్ కప్‌లో వరసగా రెండేళ్లు రుయ్మంటూ మనోడే టాప్‌లో నిలిచాడు. స్ఫూర్తి వలంటీనో.. నాకు ఇటాలియన్ బైకర్ వలంటీనో అంటే చాలా ఇష్టం. అతని వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. అతి పిన్న వయసులో మూడు నేషనల్ చాంపియన్‌షిప్‌లతో పాటు ఒక ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నా. భవిష్యత్‌లో జరిగే ప్రతి ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని తెలంగాణ సత్తా చాటుతా. – కార్తీక్ -
కొత్త పార్టీని ప్రారంభించిన కార్తీక్
పెరంబూరు(చెన్నై): సీనియర్ నటుడు కార్తీక్ కొత్త పార్టీని ప్రారంభించారు. ఇంతకుముందు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించారు. ఆ తరువాత నాడాళుమ్ మక్కళ్ కట్చి పేరుతో సొంత పార్టీని నెలకొల్పారు. అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీచేసి డిపాజిట్లు కోల్పోయారు. ఆ తరువాత కార్తీక్ కొన్ని సమస్యల కారణంగా రాజకీయాలకు దూరం అయ్యారు. ఇటీవలే మళ్లీ నటించడం మొదలుపెట్టిన కార్తీక్ మనిద ఉరిమై కాక్కుం కట్చి పేరుతో మరో రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయనే శనివారం నెల్లైలో మీడియా సమావేశంలో వెల్లడించారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరువాత తాను సొంతంగా ప్రారంభించిన నాడాళుం మక్కళ్ కట్చిలోని సభ్యులే తనకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అందుకే ఆ పార్టీని రద్దు చేసినట్లు చెప్పారు. -
అడంగుమరుతో అత్తగారికి స్వాగతం
అడంగు మరు చిత్రంతో వెండి తెరకు నిర్మాతగా అత్తగారికి స్వాగతం పలుకుతున్నట్లు నటుడు జయంరవి పేర్కొన్నారు. ఈయన నటించిన తాజా చిత్రం అడంగుమరు. రాశీఖన్నా నాయకిగా నటించిన ఈ చిత్రం ద్వారా కార్తీక్ తంగవేల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని, సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చితాన్ని హోమ్ మూవీ మేకర్స్ పతాకంపై సుజాతా విజయకుమార్ నిర్మించారు. ఇంతకు ముందు బుల్లితెరకు పలు టీవీ.సీరియళ్లను నిర్మించిన ఈమె తొలిసారిగా చిత్ర నిర్మాతగా పరిచయం అవుతున్న చిత్రం అడంగుమరు. సుజాత విజయ్‌కుమార్ నటుడు జయం రవికి స్వయానా అత్త అన్నది గమనార్హం. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 21వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న చిత్ర కథానాయకి రాశీఖన్నా మాట్లాడుతూ జయంరవికి జంటగా నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. ఆయన చాలా స్వీట్ పర్సన్ అని, సహ నటుడిగా ఈ చిత్రంలో చాలా సహకరించారని చెప్పింది. నిజం చెప్పాలంటే జయంరవి నుంచి తాను చాలా నేర్చుకున్నానని అంది. నటిగా అడంగుమరు చిత్రం తనకు చాలా ముఖ్యమైనదని పేర్కొంది. తన పాత్ర చాలా డిఫెరెంట్‌గా ఉంటుందని చెప్పింది. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన దర్శక నిర్మాతలకు, నటుడు జయం రవికి కృతజ్ఞతలు అని చెప్పుకుంటున్నానని అంది. కథానాయకుడు జయంరవి మాట్లాడుతూ దర్శకుడు కార్తీక్తంగవేల్ను తన అత్త సుజాత జయకుమార్ తన వద్దకు పంపి కథ చెప్పమనడంతో సరేనన్నానని, అయితే కార్తీక్‌తంగవేల్ చూడగానే అరే నువ్వా అని అన్నానన్నారు. కారణం తన తాను నటించిన ఇదయ తిరుడన్ చిత్రం ద్వారా సహాయ దర్శకుడిగా పరిచయమైన వ్యక్తి అని చెప్పారు. తన అత్త సుజాత విజయకుమార్ విన్న తొలి కథనే ఎలా ఒకే చేశారనే అనుమానంతోనే తానూ కథను విన్నానని చెప్పారు. అయితే దర్శకుడు కార్తీక్‌తంగవేల్ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందన్నారు. అయితే కాస్త వయిలెన్స్ ఉండడంతో దానికి తేనె పూసినట్లు మార్చి రూపొందించినట్లు తెలిపారు. అడంగుమరు చిత్రం ద్వారా తన అత్తగార్ని వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ఇందులో ఈ తరానికి అవసరమైన మంచి సందేశం ఉంటుందని చెప్పారని జయంరవి అన్నారు. -
స్పిన్‌తో ‘సిడ్నీ’ వశం
ఆస్ట్రేలియా గడ్డపై తొలి అంకాన్ని భారత్ విజయవంతంగా ముగించింది. దురదృష్టవశాత్తూ తొలి మ్యాచ్‌లో చేజారిన విజయం, రెండో మ్యాచ్ రద్దు తర్వాత తమ అసలు సత్తాను ప్రదర్శించి సిరీస్‌ను సమం చేసింది. ఆసీస్ గడ్డపై దాదాపు సొంత మైదానంలాంటి సిడ్నీలో 37,339 మంది ప్రేక్షకుల్లో సగానికంటే ఎక్కువ మంది టీమిండియాకు మద్దతు పలుకుతుండగా భారత్ గెలుపు తీరం చేరింది. ముందుగా కుల్దీప్ స్పిన్‌ను ఎదుర్కోలేక ఒత్తిడికి లోనైన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మరో స్పిన్నర్ కృనాల్ పాండ్యాపై ఎదురుదాడి చేయబోయి నాలుగు వికెట్లు సమర్పించుకోవడంతో భారీ స్కోరుకు దూరమైంది. అనంతరం ఓపెనర్ల దూకుడుకు తోడు విరాట్ కోహ్లి తనదైన శైలిలో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. కంగారూలు ఒక్క సిక్స్ కూడా కొట్టలేక పేలవంగా ఆడితే... భారత్ ఏకంగా ఎనిమిది సిక్సర్లు బాది ఇరు జట్ల మధ్య తేడా ఏమిటో చూపించింది. సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. డార్సీ షార్ట్ (29 బంతుల్లో 33; 5 ఫోర్లు), ఆరోన్ ఫించ్ (23 బంతుల్లో 28; 4 ఫోర్లు) రాణించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (4/36), కుల్దీప్ యాదవ్ (1/19) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (41 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, శిఖర్ ధావన్ (22 బంతుల్లో 41; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిని ప్రదర్శించాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 117 పరుగులు చేసిన ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఈ పర్యటనలో టెస్టు సిరీస్‌కు ముందు భారత్ ఈ నెల 29 నుంచి ఇదే మైదానంలో జరిగే నాలుగు రోజుల మ్యాచ్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవన్‌తో తలపడుతుంది. కుల్దీప్ కట్టడి... ఆస్ట్రేలియాకు ఓపెనర్లు షార్ట్, ఫించ్ శుభారంభం అందించారు. ప్రతీ ఓవర్లో వీరిద్దరు కనీసం ఒక ఫోర్ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 49 పరుగులకు చేరింది. అనంతరం పాండ్యా వేసిన తొలి బంతికి ఫించ్ (22 వద్ద) ఇచ్చిన క్యాచ్‌ను లాంగాన్‌లో రోహిత్ వదిలేశాడు. ఆ ఓవర్లో ఆసీస్‌కు 12 పరుగులు లభించాయి. తొలి వికెట్‌కు 51 బంతుల్లో 68 పరుగులు జోడించిన తర్వాత కుల్దీప్ ఈ జోడీని విడదీశాడు. స్వీప్ షాట్ ఆడబోయి పాండ్యాకు ఫించ్ క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్లో మ్యాక్స్‌వెల్‌ను అంపైర్ ఔట్‌గా ప్రకటించినా... రివ్యూలో అతను బతికి పోయాడు. అయితే తర్వాతి ఓవర్లో ఆసీస్‌ను పాండ్యా దెబ్బ తీశాడు. స్వీప్ షాట్లు ఆడబోయి వరుస బంతుల్లో షార్ట్, మెక్‌డెర్మట్ (0) వెనుదిరిగారు. పాండ్యా తన తర్వాతి ఓవర్లో మ్యాక్స్‌వెల్ (13)ను కూడా ఔట్ చేశాడు. అతని చివరి ఓవర్లో వరుస బంతుల్లో రెండు ఫోర్లు కొట్టిన అలెక్స్ కారీ (19 బంతుల్లో 27; 4 ఫోర్లు) తర్వాతి బంతికి డీప్‌లో క్యాచ్ ఇచ్చాడు. బుమ్రా చక్కటి ఫీల్డింగ్‌కు లిన్ (13) రనౌట్ కావడం ఆసీస్ పరిస్థితిని దిగజార్చింది. ఈ దశలో స్టొయినిస్ (15 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు), కూల్టర్‌నీల్ (7 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు) దూకుడుగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. వీరిద్దరు చివరి 16 బంతుల్లో 33 పరుగులు రాబట్టారు. ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా లేకుండా ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఆసీస్‌దే కావడం గమనార్హం. ఓపెనర్ల జోరు... లక్ష్య ఛేదనలో భారత్ రెండుసార్లు ఒకే స్కోరు వద్ద రెండేసి వికెట్లు కోల్పోయినా... మొత్తంగా టాప్–3 ఆటగాళ్ల బ్యాటింగ్ ప్రదర్శనే మళ్లీ జట్టును గెలిపించింది. మరోసారి ఓపెనర్లు ధావన్, రోహిత్ (16 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆటను మొదలు పెట్టారు. అయితే రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడుతున్న స్టార్క్ ఆరంభంలో కొంత ఇబ్బంది పెట్టాడు. అతని తొలి 11 బంతుల్లో భారత్ 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే స్టార్క్ వేసిన మూడో ఓవర్ చివరి బంతికి ధావన్ అద్భుతమైన ఆఫ్డ్రైవ్తో ఫోర్ కొట్టడంతో జోరు మొదలైంది. తర్వాతి రెండు ఓవర్లలో జట్టు 4 సిక్సర్లు, 3 ఫోర్లతో ఏకంగా 42 పరుగులు రాబట్టడం విశేషం. కూల్టర్‌నీల్ ఓవర్లో రోహిత్ సిక్స్ బాదగా, ధావన్ వరుసగా 6, 4 కొట్టాడు. తొలి టి20 చివరి ఓవర్లో భారత్‌ను నిలువరించి హీరోగా మారిన స్టొయినిస్‌ను ఈసారి మన బ్యాట్స్‌మన్ చితక్కొట్టారు. అతను వేసిన ఏకైక ఓవర్లో రోహిత్ సిక్సర్, ధావన్ వరుసగా 6, 4, 4 కొట్టడంతో 22 పరుగులు లభించాయి. అయితే స్టార్క్ చక్కటి బంతితో ధావన్‌ను ఎల్బీగా ఔట్ చేయడంతో 67 పరుగుల (33 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. జంపా వేసిన తర్వాత ఓవర్లో వరుసగా నాలుగు డాట్ బంతులు ఆడిన రోహిత్ ఐదో బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. భారీ సిక్సర్‌తో ఖాతా తెరిచిన రాహుల్ (20 బంతుల్లో 14; 1 సిక్స్) ఎక్కువసేపు నిలబడలేకపోగా, తొలి బంతికే రిషభ్ పంత్ (0) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో భారత్ 41 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉండటంతో కొంత ఉత్కంఠ నెలకొంది. తర్వాతి 12 బంతుల్లో 6 పరుగులు మాత్రమే రావడంతో లక్ష్యం 29 బంతుల్లో 51 పరుగులుగా మారింది. అయితే ఛేజింగ్ మాస్టర్ కోహ్లి ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. టై ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన కోహ్లి తర్వాతి ఓవర్లో మరో సిక్సర్ బాదాడు. కార్తీక్ కూడా ఐదు బంతుల వ్యవధిలో సిక్స్, ఫోర్ కొట్టడంతో భారత్ పని సులువైంది. చివరి ఓవర్లో గెలిచేందుకు 6 పరుగులు కావాల్సి ఉండగా కోహ్లి వరుసగా రెండు ఫోర్లు కొట్టి రెండు బంతుల ముందే ఆట ముగించాడు. చివరి వరకు అండగా నిలిచిన దినేశ్ కార్తీక్ (18 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో ఐదో వికెట్‌కు కోహ్లి 39 బంతుల్లోనే అభేద్యంగా 60 పరుగులు జత చేశాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: షార్ట్ (ఎల్బీ) (బి) కృనాల్ 33; ఫించ్ (సి) కృనాల్ (బి) కుల్దీప్ 28; మ్యాక్స్‌వెల్ (సి) రోహిత్ (బి) కృనాల్ 13; మెక్‌డెర్మట్ (ఎల్బీ) (బి) కృనాల్ 0; కారీ (సి) కోహ్లి (బి) కృనాల్ 27; లిన్ (రనౌట్) 13; స్టొయినిస్ (నాటౌట్) 25; కూల్టర్‌నీల్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–68; 2–73; 3–73; 4–90; 5–119; 6–131. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–0; ఖలీల్ 4–0–35–0; బుమ్రా 4–0–38–0; కుల్దీప్ 4–0–19–1; కృనాల్ 4–0–36–4. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) జంపా 23; ధావన్ (ఎల్బీ) (బి) స్టార్క్ 41; కోహ్లి (నాటౌట్) 61; రాహుల్ (సి) కూల్టర్ నీల్ (బి) మ్యాక్స్‌వెల్ 14; పంత్ (సి) కారీ (బి) టై 0; కార్తీక్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–67; 2–67; 3–108; 4–108. బౌలింగ్: స్టార్క్ 4–0–26–1; కూల్టర్‌నీల్ 3–0–40–0; స్టొయినిస్ 1–0–22–0; జంపా 4–1–22–1; మ్యాక్స్‌వెల్ 4–0–25–1; టై 3.4–0–32–1. సిరీస్ 1–1తో సమం చేయడాన్ని బట్టి చూస్తే ఇరు జట్లు ఎలా ఆడాయో అంచనా వేయవచ్చు. ఇది మా ప్రదర్శనను ప్రతిబింబిస్తోంది. మొత్తంగా ఈ రోజు మేం ఆస్ట్రేలియాపై అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించాం. కనీసం 180 పరుగులు చేయాల్సిన ఈ పిచ్‌పై మిగిలిన ఆ 15 పరుగులను నిరోధించడంలోనే గెలుపు దాగి ఉంది. ఓపెనర్లు చెలరేగితే మా పని మరింత సులువు అవుతుంది. దినేశ్ కార్తీక్ కూడా చివర్లో చాలా బాగా ఆడాడు. –విరాట్ కోహ్లి 14: భారత్ తరఫున ఛేదనలో 14 సార్లు కోహ్లి నాటౌట్‌గా నిలవగా... అన్ని మ్యాచ్‌లలోనూ జట్టు నెగ్గింది. 1:ఆసీస్ గడ్డపై టి20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (4/36) నమోదు చేసిన స్పిన్నర్‌గా కృనాల్ పాండ్యా గుర్తింపు పొందాడు. -
మనసున్న డాక్టర్
అనంతపురం, కదిరి: ఈ చిన్నారి పేరు కార్తీక్. వయస్సు 12ఏళ్లు. పుట్టుకతోనే బుద్ధిమాంద్యం, అంగవైకల్యంతో జన్మించాడు. చిన్నారికి రెండేళ్లు కూడా నిండకనే తల్లి భారతి కడుపునొప్పితో కన్నుమూసింది. తండ్రి మల్లికార్జున బేల్దారి పనిచేస్తూ ఇంటికి వారానికో 10 రోజులకో వచ్చి వెళ్తుంటాడు. పిల్లాడి బాధ్యతలన్నీ అవ్వ(నాన్మమ్మ) వెంకటమ్మ చూసుకుంటోంది. ఈమెకు 80 ఏళ్లు. తనకు వచ్చే రూ.1000 పింఛన్‌తోనే కుటుంబాన్ని పోషిస్తూ చిన్నారి బాగోగులు కూడా చూస్తోంది. 90 శాతం అంగవైకల్యం సర్టిఫికెట్ చేతబట్టుకొని మనవడికి పింఛను ఇప్పించాలని ఈ అవ్వ తొక్కని గడపంటూ లేదు. తిరగని కార్యాలయం అంటూ లేదు. ‘నీకు రూ.1000 పింఛను ఇస్తున్నాం కదా.. మళ్లీ నీ మనవడికి కూడానా..? అలా కుదరదు. నువ్వు చస్తే నీ మనవడికి పింఛన్ వస్తుంది. లేదంటే కుదరదు.’ అని తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ స్థానిక నాయకుడు అన్నట్లు ఈ అవ్వ వాపోతోంది. ‘వాడి పింఛన్ కోసం నేను చావాలంట నాయనా.. నేను చస్తే వీడికి దిక్కెవరు? వీడికి అమ్మ లేదు. వీళ్ల నాయన అమావాస్యకో, పున్నానికో వస్తాడు..’ అని కన్నీరు పెట్టింది. ఈ పరిస్థితుల్లో ‘గుడ్‌మార్నింగ్ కదిరి’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి గురువారం అమీన్‌నగర్‌లో గడపగడపకూ వెళ్లి ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో తన కంటపడిన ఈ దివ్యాంగుడిని పలకరించాడు. అక్కడే ఉన్న ఓ మహిళ ‘సార్ పిల్లోడికి మాటలు రావు.. బుద్ధిమాద్యం’ అని చెప్పింది. పింఛన్ కోసం ఆ పిల్లోడి అవ్వ తిరిగి తిరిగి వేసారింది. ఎవ్వరూ పట్టించుకోలేదని ఆయన దృష్టికి తీసుకొచ్చింది. పిల్లాడికి సంబంధించిన అంగవైకల్యం సర్టిఫికెట్‌ను డాక్టర్ సిద్దారెడ్డి పరిశీలించారు. 90 శాతం అంగవైకల్యం ఉందే.. అంటూ పింఛన్ ఎందుకివ్వలేదని ఆరా తీశారు. ‘సరే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ అబ్బాయికి నెలకు రూ.3 వేల పింఛన్ ఇప్పిస్తాం. అంత వరకు నేనే నెలకు రూ.2 వేలు చొప్పున పింఛన్ రూపంలో నగదు ఇస్తా’ అని హామీ ఇచ్చారు. సిద్ధారెడ్డి నిర్ణయం పట్ల ఆ వీధి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ తామంతూ మీవెంటే ఉంటామని ఆశీర్వదించారు. -
నేటి నుంచే దేవధర్ ట్రోఫీ
న్యూఢిల్లీ: ఉనికి చాటేందుకు అటు సీనియర్లకు, సత్తా నిరూపించుకునేందుకు ఇటు కుర్రాళ్లకు మరో అవకాశం. ఢిల్లీ వేదికగా మంగళవారం నుంచే దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నీ. టీమిండియా వన్డే జట్టులోకి పునరాగమనం ఆశిస్తున్న అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తీక్‌లకు ఈ టోర్నీ కీలకంగా మారనుంది. దీంతోపాటు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత్ ‘ఎ’కు ఎంపికయ్యేందుకు కుర్రాళ్లకూ ఓ వేదిక కానుంది. మంగళవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’తో భారత్ ‘బి’ తలపడుతుంది. ఈ టోర్నీలో భాగంగా ప్రతి జట్టు రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఫైనల్ 27న జరుగుతుంది. అశ్విన్, పృథ్వీ షా, కరుణ్ నాయర్, కృనాల్ పాండ్యా, మొహమ్మద్ సిరాజ్‌లతో కూడిన భారత్ ‘ఎ’ జట్టుకు దినేశ్ కార్తీక్ సారథిగా వ్యవహరించనున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలోని ‘బి’ జట్టులో మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, రోహిత్ రాయుడు, దీపక్ చహర్‌లకు స్థానం దక్కింది. రహానే కెప్టెన్‌గా ఉన్న ‘సి’ జట్టులో సురేశ్ రైనా, అభినవ్ ముకుంద్, శుబ్‌మన్ గిల్, ఆర్. సమర్థ్, వాషింగ్టన్ సుందర్ తదితర ఆటగాళ్లున్నారు. -
హిమాచల్ టు పుణే
వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్ మనాలిలో షూటింగ్ షెడ్యూల్‌ను ‘దేవ్’ మూవీ టీమ్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. వరదల వల్ల చిత్రనిర్మాత లక్ష్మణ్‌కు దాదాపు కోటిన్నర నష్టం వాటిల్లిందట. కార్తీ హీరోగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమా ‘దేవ్’. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు కార్తీక్, రమ్యకృష్ణ కీలక పాత్రలు చేస్తున్నారు. హిమాచల్ షెడ్యూల్‌ని ఆపేసిన నేపథ్యంలో తదుపరి పుణేలో ప్లాన్ చేశారు. ఇప్పుడీ టీమ్ అక్కడే ఉంది. ఈ షూట్లో జాయిన్ అయ్యారు రకుల్‌ప్రీత్ సింగ్. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్ల పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడంతో పాటుగా ఓ సాంగ్‌ను కూడా షూట్ చేస్తారు. మనాలి షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వకూడదని అనుకున్న టైమ్‌లో కంప్లీట్ చేయాలని చిత్రబృందం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తోందట. -
అమ్మ బహుమతే ప్రపంచ స్థాయికి ప్రేరణ
చిత్తూరు, తిరుపతి సిటీ :ఎనిమిదేళ్ల ప్రాయంలో ఆ బాలుడికి తల్లి ఇచ్చిన పుట్టినరోజు బహుమతి ప్రపంచ స్థాయి క్రీడాకారునిగా ఎదిగేందుకు ప్రేరణ కలిగింది. ఆ ప్రేరణతోనే తిరుపతికి చెందిన 19 ఏళ్ల కార్తీక్ వెంకట్రామన్ చెస్ ఆటలో ‘గ్రాండ్ మాస్టర్’ (2,520 రేటింగ్) స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరో ఏడాది లోపు ‘సూపర్ గ్రాండ్ మాస్టర్’ రేటింగ్ తెచ్చుకోవాలన్నదే తన ముందున్న లక్ష్యమని తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు. చెస్ ఆటలో ఊహకందని ఎత్తులు వేస్తూ.. తనకంటే మెరుగైన బ్లిడ్జ్, ర్యాపిడ్, క్లాసికల్ విభాగాల్లో ఉన్న ఆటగాళ్లను చిత్తుచేస్తూ విజయాలను సొంతం చేసుకుంటూ వచ్చాడు. తాజాగా ఈ నెల 4 నుంచి 16వ తేది వరకు టర్కీలో జరిగిన చెస్ ప్రపంచ స్థాయి జూనియర్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని 4వ గ్రాండ్ మాస్టర్ స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం తిరుపతిలోని ఒక ప్రయివేట్ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కార్తీక్ వెంకట్రామన్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించాడు. సాక్షి : మీ కుటుంబ నేపథ్యమేంటి..? కార్తీక్ : మా తల్లిదండ్రులు ప్రవీణకుమారి, వెంకట్రామన్ పాకాల మండల కేంద్రంలోని సత్యమ్మగుడి వీధిలో నానమ్మ, తాతయ్యతో కలసి ఉండేవారు. అమ్మానాన్న మా చదువుల కోసం తిరుపతికి వచ్చి స్థిరపడ్డారు. నాన్న విజయభారతి టీవీఎస్ షోరూం, విజయభారతి టాటా కార్ల షోరూం అధినేతగా ఉన్నారు. అమ్మ గృహిణి. చెల్లాయి అనూష 10వ తరగతి చదువుతోంది. సాక్షి : చెస్ ఆటలో మీకు ప్రేరణ ఎవరు..? కార్తీక్ : నాకు ఏనిమిదేళ్ల వయసు వరకు చెస్ ఆటంటేనే తెలియదు. అమ్మ తన భర్తడే గిఫ్ట్‌గా చెస్ బోర్డును ఇచ్చింది. గేమ్ నియమనిబంధనలు చెప్పింది. అప్పట్నుంచి చెస్‌పై మక్కువ పెంచుకున్నా. సాక్షి : ఆ తర్వాత చెస్ ఆటలో ఎవరి వద్ద శిక్షణ తీసుకున్నారు..? కార్తీక్ :చెస్‌పై నాకున్న ఇంట్రస్ట్ చూసి నాన్న మొదట చెస్ సీనియర్ కోచ్ ఇంజం శివకేశవులు వద్ద కొన్ని నెలల పాటు శిక్షణ ఇప్పించారు. అనంతరం నవీన్ అనే కోచ్ చెస్ ఆటలో మెళకువలు నేర్పించి ప్రొత్సహించారు. తదుపరి మరింత మెరుగైన శిక్షణ కోసం వైజాగ్ నుంచి పి.రామకృష్ణ అనే కోచ్‌ను పిలిపించి 15 రోజుల పాటు శిక్షణ ఇప్పించారు నాన్న. ఆ తరువాత నేనే ఆటలోని మెళకువలను నేర్చుకుంటూ స్కూల్ గేమ్స్ స్థాయిలోనే చెస్ టోర్నమెంట్లకు వెళ్లేవాడిని. 5వ తరగతిలోనే టోర్నమెంట్లకు వెళుతూ 1606 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ తెచ్చుకున్నా. 7, 8, 9 తరగతుల సమయంలో చెస్ ఆటపైనే పూర్తిగా ఫోకస్ పెట్టా. ఆ సమయంలో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లి 1950 ఇంటర్నేషనల్ ర్యాకింగ్ సాధించా. 10వ తరగతి బెంగళూరులోని స్టాండర్డ్ ఇంటర్నేషనల్‌లో చది వాను. అప్పటికే 2,305 రేటింగ్‌లో ఉన్నా. అనంతరం తమిళనాడులోని వేళమ్మాల్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంఈసీ గ్రూప్ చదివి 95 శాతం పైగా(1141/1200) మార్కులు సాధించా. అటు చదువులోనూ, ఇటు చెస్లోనూ రాణిస్తూ వచ్చా. సాక్షి : ఇతర దేశాల ఆటగాళ్లతో మీ ఆటతీరు..? కార్తీక్ :మనదేశ ఆటగాళ్లు, యూరప్, యూఎస్, టర్కీ ఆటగాళ్ల ఆటతీరులో చాలా వ్యత్యాసం ఉంటుంది. మన ఆటగాళ్లు సేఫ్, పొజిషనల్గా ఆడుతారు. అదే వాళ్లైతే అగ్రస్సివ్గా, అటాకింగ్ స్టైల్లో ఆడతారు. సాక్షి : ఇతర దేశాల ఆటగాళ్లను ఎలా ఎదుర్కొంటారు..? కార్తీక్ : ఇతర దేశాల ఆటగాళ్లతో ఆడేటప్పుడు ముందుగా వారి ఆటతీరును ఆన్లైన్లో పరిశీలిస్తా. అందుకు సంబంధించిన బుక్స్ చదువుతా. ఇతర దేశాల్లో పోటీలు ఉన్నçప్పుడు ప్రతిరోజు అయిదారు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తా. సాక్షి : చెస్‌కు ఆదరణ ఉందంటారా..? కార్తీక్ : మన రాష్ట్రంలో చెస్ ఆటలో అప్‌కమింగ్ ప్లేయర్స్ రావటం లేదు. అండర్–19లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కొద్దిమంది మాత్రమే ఉన్నారు. చెస్ క్రీడను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సాక్షి : 5వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచినందుకు ఎలా ఫీలవుతున్నారు? కార్తీక్: ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రాండ్‌మాస్టర్ హోదాలో హరికృష్ణ, కోనేరు హంపి, హారిక, లలిత్‌బాబు సరసన 5వ ప్లేయర్‌గా నిలవడం సంతోషంగా ఉంది. సాక్షి : గ్రాండ్‌మాస్టర్ హోదాలో సీఎంను కలిశారా..? కార్తీక్ : లేదు. త్వరలో సీఎం చంద్రబాబునాయుడును కలవనున్నాం. చెస్ జిల్లా, రాష్ట్ర అసోషియేషన్ ప్రతినిధులతో కలసి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాం. సీఎం క్రీడలను బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే ఏడాదిలోపే సూపర్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధిస్తాననే నమ్మకం ఉంది. సాక్షి : క్రీడాకారులకు మీరిచ్చే సూచనలు..? కార్తీక్ : ఆటలో ఓటమి చెందినా నిరుత్సాహ పడకూడదు. ఆటను మరింత మెరుగుపరచుకోవాలి. ఆటలోని తప్పులను సరిదిద్దుకుని ముందుకెళ్లాలి. మనదేశంలో టోర్నమెంట్లు తక్కువ. అదే యూరప్ లాంటి దేశాల్లో టోర్నమెంట్లు ఎక్కువగా నిర్వహిస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ ఆటగాళ్లను అసోషియేషన్లు, ప్రభుత్వాలు ప్రొత్సహిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఆటగాళ్లను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. జీఎం టైటిల్‌కు సంబంధించిన వివరాలు.. ♦ 2017 ఆగస్టులో బార్సిలోనాలో జరిగిన అంతర్జాతీయ ఓపెన్ చెస్ పోటీల్లో తొలి జీఎంను కైవసం చేసుకున్నాడు. ♦ 2018లో జూన్ ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన కిట్ అంతర్జాతీయ టోర్నమెంట్లో ప్రథమ స్థానం సాధించి రెండవ జీఎం నార్మ్ సాధించాడు. ♦ ఈ ఏడాది ఆగస్టు 16న ఇటలీలో జరిగిన స్పిలిమ్బర్గ్ ఓపెన్‌లో 6 పాయింట్లు సాధించి 3వ జీఎం నార్మ్ కూడా పొంది గ్రాండ్‌మాస్టర్ హోదా సొంతం చేసుకున్నాడు. ♦ ఈ నెల 4 నుంచి 16వ తేది వరకు టర్కీ దేశంలో జరిగిన ప్రపంచ స్థాయి జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో 4వ గ్రాండ్‌మాస్టర్ స్థానం కైవసం చేసుకున్నాడు. కార్తీక్ సాధించిన విజయాలు.. ♦ అండర్–13 రాష్ట్ర చాంపియన్, అండర్–17 2017లో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం ♦ అండర్–17 జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్‌లో బంగారు పతకం ♦ అండర్–19 జాతీయ స్కూల్ గేమ్స్ పోటీల్లో సిల్వర్ మెడల్ ♦ ఏపీ స్టేట్ అండర్–9 గ్రూపులో ద్వితీయ స్థానం సాధించిన పతకాలు.. ♦ 2019లో తిరుపతి జూనియర్ చాంబర్ ఆధ్వర్యంలో చైల్డ్ ప్రాడిజీ అవార్డు ♦ 2010లో గోవాలో జరిగిన ఏపీ ఇన్ నేషనల్ స్కూల్ గేమ్స్ పోటీల్లో కాంస్య పతకం ♦ 2010లో శ్రీలంకలో జరిగిన ఏషీయన్ స్కూల్ గేమ్స్‌లో అండర్–11 విభాగంలో బంగారు పతకం సాధించి పోలెండ్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. ♦ శ్రీలంకలో జరిగిన టీమ్ ఏషియన్ స్కూల్ గేమ్స్‌లో టీమ్ మెడల్ సాధించి సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీలకు అర్హత ♦ 2018 జూలైలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ -
నిజమైన ప్రేమ
సూరజ్, అఖిల్ కార్తీక్ హీరోలుగా, సోనియా, ఫర హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘టు ఫ్రెండ్స్’. ‘ట్రూ లవ్’ అనేది ఉపశీర్షిక. శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకత్వంలో ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో ముళ్లగూరు అనంతరాముడు, ముళ్లగూరు రమేష్ నాయుడు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నేను నిర్మాత అయ్యేందుకు కారకులైన నారపురెడ్డి మిత్రులు ముళ్లగూరు ఆనంతరాముడుగారు నిర్మించిన ‘టు ఫ్రెండ్స్’ ట్రైలర్ విడుదల చేసే అవకాశం నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘విద్య, వ్యవసాయం, స్థిరాస్తి, ఫైనాన్స్.. వంటి పలు రంగాల్లో విజయాలు సాధించిన నేను సినిమా రంగంలోనూ విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. భవిష్యత్తులోనూ మరిన్ని మంచి సినిమాలు తీస్తా’’ అన్నారు ముళ్లగూరు అనంతరాముడు. ‘‘ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు అందించిన సహాయ సహకారాల వల్లే ఈ సినిమా బాగా వచ్చింది’’ అన్నారు శ్రీనివాస్ జి.ఎల్.బి. -
మైండ్ గేమ్
‘‘ఈ రోజుల్లో సినిమాలు ఒకసారి రిలీజ్ కావడమే కష్టంగా ఉంది. అలాంటిది ‘సూపర్ స్కెచ్’ చిత్రాన్ని రీ–రిలీజ్ చేస్తున్నాం. సినిమాపై మాకు ఉన్న నమ్మకమే ఇందుకు కారణం’’ అన్నారు నటుడు ఇంద్ర. నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్తా, కార్తీక్, చక్రి, మాగంటి ముఖ్య పాత్రల్లో రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూపర్ స్కెచ్’ సినిమాని ఇవాళ రీ–రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించిన ఇంద్ర మాట్లాడుతూ– ‘‘నేను కరాటే ప్రొఫెషనల్‌ని. వారియర్ కరాటే ఇంటర్న్షనల్ ఫౌండేషన్ ద్వారా కరాటే శిక్షణ ఇస్తున్నాం. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చా. మొదట్లో ఇబ్బందులు పడ్డా. ‘సై, సైనికుడు, ధృవ, శ్రీమన్నారాయణ’ వంటి సినిమాల్లో నటించాను. సోలో హీరోగా ‘పుత్రుడు, కుర్ కురే’ సినిమాలు చేశా. ‘సూపర్ స్కెచ్’ సినిమాలో విలన్‌గా నటించాను. మైండ్ గేమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ సినిమా నటుడిగా పూర్తి సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం ‘సైరా’ సినిమాలో ఓ పాత్ర చేస్తున్నా’’ అన్నారు. -
దైవ శక్తితో క్షుద్ర శక్తి పోరు
‘‘సంగకుమార్ అన్నీ తానై వరుసగా నాలుగు సినిమాలు నిర్మించడం ఆనందంగా ఉంది. థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘తాంత్రిక’ సినిమా హిట్ అవ్వాలి. యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలి’’ అని నిర్మాత సాయి వెంకట్ అన్నారు. సంగకుమార్ నటించి, నిర్మించిన చిత్రం ‘తాంత్రిక’. రాజ్‌కాంత్, కార్తీక్, మనీష, సంజన, గీతాషా, ఆర్య ముఖ్య పాత్రల్లో ఎం. శ్రీధర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జాన్, నాగవంశీ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత సాయి వెంకట్ విడుదల చేశారు. సంగకుమార్ నటించిన ‘పౌరుషం, నరసింహా ఏసీపీ, శివతాండవం’ సినిమాల ట్రైలర్స్‌ని కూడా ఇదే కార్యక్రమంలో రిలీజ్ చేశారు. నటుడు, నిర్మాత సంగకుమార్ మాట్లాడుతూ –‘‘ దైవ శక్తికీ, క్షుద్ర శక్తికీ మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు మా చిత్రం నచ్చుతుంది’’ అన్నారు. డైరెక్టర్ ఎం. శ్రీధర్, నటులు రాజ్‌కాంత్, సంజన మేరీ, ఎస్ఎస్ పట్నాయక్ పాల్గొన్నారు. -
గేమ్ ఆడండి..బహుమతి పట్టండి
తమిళసినిమా: మీ మొబైల్లో గేమ్ ఆడండి. బహుమతి పట్టండి అయితే అందుకు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటున్నారు మిస్టర్ చంద్రమౌళి చిత్ర యూనిట్. నటుడు కార్తీక్ ఆయన కొడుకు గౌతమ్ కార్తీక్ హీరోలుగా కలిసి నటించిన చిత్రం మిస్టర్ చంద్రమౌళి. నటి రెజీనా హీరోయిన్గా నటించిన ఇందులో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ కీలక పాత్రను పోషించారు. సతీష్, దర్శకుడు మహేంద్రన్, అగస్థ్యిన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందించారు. బోఫ్టా మీడియా వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత ధనుంజయన్, క్రియేటివ్ ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహించారు. చిత్రం జూలై 6న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రచారంలో భాగంగా దర్శక, నిర్మాతలు ప్రేక్షకులకు ఒక మొబైల్ గేమ్‌ను ప్రవేశ పెట్టారు. ఆ గేమ్‌ను సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గేమ్ వివరాలను నిర్మాత ధనుంజయన్ తెలుపుతూ ఇది మూవీ క్విజ్ తరహా మొబైల్ యాప్ గేమ్ అని తెలిపారు. ఈ గేమ్‌లో రోజూ మిస్టర్ చంద్రమౌళి చిత్రానికి సంబంధించిన 10 ప్రశ్నలు ఉంటాయన్నారు. ఈ గేమ్‌ను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని రెండు నిమిషాల్లో ఆ 10 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారికి వివో మొబైల్, వాచ్, టీషర్ట్, సినిమా టిక్కెట్స్‌లో ఏదో ఒకటి బహుమతిగా అందిస్తామని చెప్పారు. ఈ గేమ్ మంగళవారం నుంచి మొదలవుతుందని చెప్పారు. సమాధానాలు చెప్పిన వారు తమ వాట్సాప్ మొబైల్‌ఫోన్ నెంబర్‌ను రిజిస్టర్ చేయాలని చెప్పారు. ఎక్కువ మంది కరెక్ట్ సమాధానాలు చెబితే డ్రా విధానంలో రోజూ ఒకరికి బహుమతులను అందిస్తామన్నారు. ఈ గేమ్‌ను జూలై 6 వరకూ ఆడి బహుమతులను గెలుసుకోవచ్చునని నిర్మాత తెలిపారు. కార్యక్రమంలో నటుడు గౌతమ్‌కార్తీక్, నటి రెజీనా, వరలక్ష్మీ, సతీష్, దర్శకుడు తిరు చిత్ర వర్గాలు పాల్గొన్నాయి. -
మైండ్ గేమ్
‘శ్రీమన్నారాయణ, సామాన్యుడు, దగ్గరగా దూరంగా, విక్టరీ, ప్యార్ మే పడిపోయానే, ది ఎండ్’.. వంటి చిత్రాలు తెరకెక్కించిన రవి చావలి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘సూపర్ స్కెచ్’. నర్సింగ్ మక్కల, ఇంద్ర, సమీర్ దత్, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీ, విదేశీ నటులు సోఫియా, గ్యారీ టాన్ టోనీ (ఇంగ్లాండ్) ముఖ్య తారలు. యు అండ్ ఐ– ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ సహకారంతో బలరామ్ మక్కల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. బలరామ్ మాట్లాడుతూ– ‘‘జస్టిస్ ఈజ్ ఇన్ యాక్షన్ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్. ‘సూపర్ స్కెచ్’ టైటిల్ కథకు చక్కగా సరిపోతుంది. తొలి కాపీ సిద్ధమైంది. మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. రవి చావలి కెరీర్లో మరో హిట్ చిత్రం ఖాయం. సురేందర్ రెడ్డి ఛాయాగ్రహణం, కార్తీక్ కొడకండ్ల సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. -
స్పెల్లింగ్ బీ విజేత హైదరాబాదీ
హ్యూస్టన్: అమెరికాలో ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీలో భారత సంతతికి చెందిన కార్తీక్ నెమ్మాని(14) విజేతగా నిలిచాడు. టెక్సాస్‌లోని మెక్‌కిన్నీకి చెందిన కార్తీక్ ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కార్తీక్ తండ్రి కృష్ణ నెమ్మాని హైదరాబాద్ నుంచి అమెరికాకు వలసవెళ్లారు. కార్తీక్ తుది పోరులో భారత సంతతికే చెందిన నయాసా మోదీ అనే బాలికతో పోటీపడి విజయం సాధించాడు. తుదిపోరులో 'koinonia' అనే పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పి కార్తీక్ విజేతగా నిలిచాడు. టైటిల్ గెలిచిన కార్తీక్‌కు 40 వేల డాలర్లు, ట్రోఫీని ఇస్తారు. కార్తీక్‌కు మరియం–వెబ్‌స్టర్ నుంచి 2,500 డాలర్లు, న్యూయార్క్, హాలీవుడ్‌లలో ఉచితంగా పర్యటించే చాన్స్ ఇస్తారు. ఈ సారి పోటీలో మొత్తం 516 మంది విద్యార్థులు పోటీపడగా, ఫైనల్‌కు 16 మంది చేరుకున్నారు. వీరిలో 9 మంది బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నారు. గత 11 ఏళ్లుగా భారత సంతతి విద్యార్థులే ఈ పోటీల్లో గెలుస్తున్నారు. -
కోల్‌కతా దర్జాగా...
మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ చావోరేవోలాంటి మ్యాచ్‌లో చెలరేగింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఆతిథ్య జట్టును చిత్తు చేసి దర్జాగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. పనిలో పనిగా సొంతగడ్డపై సన్‌రైజర్స్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. ప్రస్తుత సమీకరణం ప్రకారం చెన్నై మ్యాచ్ తర్వాత కూడా కోల్‌కతా మూడో స్థానంలోనే ఉంటుంది. దీంతో నైట్ రైడర్స్ తమ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లోనే ఎలిమినేటర్‌తోపాటు గెలిస్తే రెండో క్వాలిఫయర్ కూడా అదే వేదికపై ఆడుతుంది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–11లో ప్లేఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఫలితంగా 16 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (39 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, కేన్ విలియమ్సన్ (17 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు), శ్రీవత్స్ గోస్వామి (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ప్రసిధ్ కృష్ణ 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (43 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో పాటు రాబిన్ ఉతప్ప (34 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. చివర్లో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (22 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఒత్తిడిలో మరో కీలక ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. ఒకే ఓవర్లో నలుగురు ఔట్... తొలి బంతికే ధావన్ కొట్టిన ఫోర్‌తో హైదరాబాద్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. మరోవైపు సీజన్లో తొలిసారి బ్యాటింగ్ చేసే అవకాశం లభించిన గోస్వామి చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ఒక పరుగు వద్ద రసెల్ బౌలింగ్‌లో అంపైర్ ఔట్‌గా ప్రకటించినా... గోస్వామి రివ్యూ కోరిన తర్వాత అది హెల్మెట్‌కు తగిలిందని తేలింది. ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్న గోస్వామి అదే ఓవర్లో ఒక సిక్సర్, 2 ఫోర్లతో చెలరేగాడు. ఓపెనర్లు ఇద్దరూ దూకుడుగా ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 60 పరుగులకు చేరింది. అయితే కుల్దీప్ చక్కటి బంతితో 79 పరుగుల (52 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర దించాడు. అనంతరం విలియమ్సన్ కూడా తన ఫామ్‌ను కొనసాగించడంతో రైజర్స్ దూసుకుపోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టిన అతను, ఆ తర్వాత సియర్ల్స్ ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాదాడు. అయితే అదే ఊపులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అదే ఓవర్లో వెనుదిరిగాడు. 45 పరుగుల వద్ద నరైన్ క్యాచ్ వదిలేసిన అనంతరం ధావన్ అర్ధ సెంచరీ (38 బంతుల్లో) పూర్తయింది. చివర్లో మనీశ్ పాండే (22 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించగా, తర్వాతి ఆటగాళ్లు అంతా విఫలమయ్యారు. చివరి ఓవర్లో ప్రసి«ధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టగా, మరో రనౌట్ కలిపి హైదరాబాద్ నాలుగు వికెట్లు కోల్పోయింది. లిన్ మెరుపులు... ఛేదనలో ఎప్పటిలాగే తనదైన శైలిలో సునీల్ నరైన్ (10 బంతుల్లో 29; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ షాట్లతో మొదలు పెట్టాడు. సందీప్ శర్మ వేసిన రెండో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను, చివరి బంతికి సిక్సర్ బాదాడు. ఆ తర్వాత షకీబ్ ఓవర్లోనూ వరుసగా 4, 6 కొట్టిన అనంతరం తర్వాతి బంతికి నరైన్ ఔటయ్యాడు. లిన్ కూడా ధాటిగా ఆడటంతో కోల్‌కతా రన్‌రేట్ దూసుకుపోయింది. పవర్‌ప్లేలో కేకేఆర్ 66 పరుగులు చేసింది. లిన్, ఉతప్ప మరో అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో కోల్‌కతా ఇన్నింగ్స్ చకచకా సాగింది. 11 పరుగుల వద్ద భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఉతప్ప ఇచ్చిన క్యాచ్‌ను రషీద్ వదిలేయగా... దీనిని వాడుకున్న ఉతప్ప... షకీబ్ ఓవర్లో 6,4 తో జోరు ప్రదర్శించాడు. సందీప్ బౌలింగ్‌లో కొట్టిన భారీ సిక్స్‌తో 36 బంతుల్లో లిన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే లిన్, ఉతప్పలతో పాటు రసెల్ (4), నితీశ్ రాణా(7) వెనుదిరిగినా కెప్టెన్ దినేశ్ కార్తీక్ మిగతా పనిని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ధావన్ ఎల్బీడబ్ల్యూ (బి) ప్రసిధ్ 50; గోస్వామి (సి) రసెల్ (బి) కుల్దీప్ 35; విలియమ్సన్ (సి) రసెల్ (బి) సియర్ల్స్ 36; మనీశ్ పాండే (సి) సబ్–రింకూ సింగ్ (బి) ప్రసిధ్ 25; యూసుఫ్ పఠాన్ (సి) ఉతప్ప (బి) నరైన్ 2; బ్రాత్‌వైట్ (సి) కార్తీక్ (బి) రసెల్ 3; షకీబ్ (సి) నరైన్ (బి) ప్రసిధ్ 10; రషీద్ ఖాన్ (సి) కార్తీక్ (బి) ప్రసిధ్ 0; భువనేశ్వర్ రనౌట్ 0; కౌల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–79, 2–127, 3–141, 4–147, 5–161, 6–168, 7–172, 8–172, 9–172. బౌలింగ్: నితీశ్ రాణా 1–0–5–0, ప్రసిధ్ 4–0–30–4, రసెల్ 3–0–31–1, నరైన్ 4–0–23–1, చావ్లా 2–0–19–0, కుల్దీప్ 4–0–35–1, సియర్ల్స్ 2–0–24–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: లిన్ (సి) పాండే (బి) కౌల్ 55; నరైన్ (సి) పాండే (బి) షకీబ్ 29; ఉతప్ప(సి) గోస్వామి (బి) బ్రాత్‌వైట్ 45; కార్తీక్ నాటౌట్ 26; రసెల్ (సి) పాండే (బి) కౌల్ 4; రాణా (సి) భువనేశ్వర్ (బి) బ్రాత్‌వైట్ 7; గిల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–52, 2–119, 3–149, 4–160, 5–172. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–0, సందీప్ శర్మ 2–0–30–0, కౌల్ 4–0–26–2, షకీబ్ 3–0–30–1, రషీద్ ఖాన్ 4–0–31–0, బ్రాత్‌వైట్ 2.4–0–21–2. -
సందేశాన్ని ఆశించొద్దు
తమిళసినిమా: ఇరుట్టు అరైయిల్ మొరట్టు కుత్తు చిత్రంలో ఎలాంటి సందేశాన్ని ఆశించొద్దని ఆ చిత్ర దర్శకుడు సంతోష్ పి.జయకుమార్ తెలిపారు. ఈయన హరహర మహాదేవకీ చిత్రం ద్వారా పరిచయం అయిన దర్శకుడన్నది గమనార్హం.ఆ చిత్ర నిర్మాణ సంస్థ బ్లూ ఘోస్ట్ పిక్చర్స్నే నిర్మిస్తున్న చిత్రం ఇరుట్టు అరైయిల్ మొరట్టు కుత్తు. అదే విధంగా ఆ చిత్ర హీరో గౌతమ్కార్తీక్నే ఈ చిత్రంలోనూ హీరోగా నటించారు. ఇక హీరోయిన్లుగా వైభవి శాండిల్య, యాషిక ఆనంద్, చంద్రిక రవి ముగ్గురు నటించారు. బాలమురళీ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం మే 4వ తేదీన తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర యూనిట్ విలేకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సంతోష్ పి.జయకుమార్ మాట్లాడుతూ చిత్ర షూటింగ్‌ను 23 రోజుల్లో పూర్తి చేశామని తెలిపారు. ఇది అడల్ట్ హర్రర్ కామెడీ కథా చిత్రంగా ఉంటుందని, అందువల్ల ఇందులో ఎలాంటి సందేశాన్ని ప్రేక్షకులు ఆశించరాదని అన్నారు. రెండు గంటల పాటు జాలీగా ఎంజాయ్ చేయవచ్చునని అన్నారు. మా చిత్రాన్ని ఎంటర్టెయియినర్గానే చూడాలని కోరుకుంటున్నామన్నారు. ఇక హీరో గౌతమ్ కార్తీక్ విషయానికి వస్తే ఆయనకు ఈ చిత్ర కథ గురించి ఏం చెప్పానో, ఆయన ఏం విన్నారో తనకే తెలియదన్నారు. చిత్రం యూనిట్ అంతా కలిసి చేసిన చిత్రం ఇదని చెప్పారు. చిత్ర హీరో గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించడం మంచి ఎక్స్పీరియన్స్ అని అన్నారు. అందరం కూర్చుని చర్చించుకుని చిత్రం చేశామని తెలిపారు. ఇలాంటి అడల్ట్ హర్రర్ కథా చిత్రంలో నటించడంపై మీ తండ్రి కార్తీక్ ఎలా స్పందించారు? అన్న ప్రశ్నకు నాన్న ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఆసక్తిగా ఉన్నారని బదులిచ్చారు. ఇదే సంస్థలో దర్శకుడు ముత్తయ్య దర్శకత్వంలో నటించే అవకాశాన్ని కల్పించిన నిర్మాత జ్ఞానవేల్‌రాజాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని గౌతమ్‌కార్తీక్ అన్నారు. నటి ఆషిక ఆనంద్ పాల్గొన్నారు. -
అన్ని ఉండవు.. సెన్సార్ బోర్డు కట్ చేస్తుంది
తమిళసినిమా : అలాంటి వాటి గురించి అస్సలు పట్టించుకోను అంటోంది నటి రెజీనా కాసాండ్రా. ఈ అమ్మడికి నటిగా సక్సెస్‌లు ఉన్నా, రావలసిన పేరు తెచ్చుకోలేకపోయిందనే చెప్పాలి. తమిళం, తెలుగు అంటూ బహుభాషా నటిగా రాణిస్తున్నా, స్టార్ హీరోయిన్ స్థాయికి ఇంకా ఎదగలేదు. దీంతో ఇక లాభం లేదనుకుందో ఏమో నటి కంటే గ్లామర్‌నే నమ్మకున్నట్లు ఈ అమ్మడి తాజా చిత్రం చూస్తే తెలుస్తోంది. రెజీనా నటించిన తాజా చిత్రం మిస్టర్ చంద్రమౌళి. ఇందులో సీనియర్ నటుడు కార్తీక్, ఆయన కొడుకు గౌతమ్ కార్తీక్‌లతో కలిసి నటించింది. తిరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెజీనా అందాలారబోత విషయంలో రెచ్చిపోయిందనే చెప్పాలి. ఈత దుస్తులు, బికినీలు అంటూ ఎన్ని విధాలుగా శృంగారాన్ని ఒలకబోయాల్లో అన్ని విధాలు శక్తివంచన లేకుండా చేసేసిందనే చెప్పాలి. ఏ స్థాయిలో నటించిందంటే ఆ పాట దృశ్యాలను చూసిన దర్శకుడు సుశీంద్రన్ పాటలో అన్ని దృశాలు ఉండవు. సెన్సార్ బోర్డు కట్ చేస్తుంది అని చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపైనే వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రెజీనా ఇచ్చిన భేటీ చూద్దాం. ప్ర: మిస్టర్ చంద్రమౌళి చిత్రంలో తండ్రీకొడుకులు కార్తీక్, గౌతమ్ కార్తీక్‌లతో కలిసి నటించిన అనుభవం గురించి? జ: సూపర్ జాలీ. కార్తిక్ స్పాట్లో ఉంటే సందడే సందడి. సాధారణంగా సీనియర్ నటులతో నటిస్తున్నప్పుడు కాస్త సంక ట పరిస్థితిని ఎదుర్కొం టాం.అలాంటిది కార్తీక్‌తో నటించడం చాలా జాలీ అని పించింది. మేమంతా ఆయన చుట్టూ కూర్చుంటాం. ఆయన తన చిత్రాల గురించి, అనుభవాల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను చెప్పేవారు. కార్తీక్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నటన కంటే కూడా జీవి తాన్ని ఎలా సంతోషంగా గడపాలన్నది కార్తీక్ నుంచి తెలుసుకున్నా ను. ఆయన కొడుకు గౌతమ్ కార్తీక్‌తో నీపై చా లా బాధ్యతఉందని చాలా సార్లు చెప్పాను. ప్ర: హీరోయిన్గా నటిస్తూ తెలుగు చిత్రం ‘అ’ లో చాలా చిన్న పాత్రలో నటించడానికి అంగీకరించారే? జ: నిజం చెప్పాలంటే నేను హీరోయిన్గా నటించడం మొదలు పెట్టినప్పటి నుంచి చిత్రంలో నా పాత్ర చిన్నదా, పెద్దదా అని ఆలోచించలేదు. కథలో నా పాత్రకు ఏ మేరకు ప్రాధాన్యత ఉందన్నది గ్రహించే ప్రతిభ నాకుంది అ చిత్రంలో అలాంటి పాత్రనే లభించింది. చిత్రం చూసిన పలువురు నా నటనను ప్రశంసించారు. అలాంటి ప్రశంసలు విన్నప్పుడు పడ్డ కష్టాలు మరిచిపోతాను. ఆ చిత్రం కోసం ముక్కుకు రింగ్ పెట్టుకున్నాను. జుట్టు కట్ చేసుకున్నాను. వీపు వెనుక టాట్టు పొడిపించుకున్నాను. ఒక్కసారి మేకప్ వేసుకుంటే 24 గంటల తరువాతే తీసేదాన్ని అంత కష్టపడి నటించాను. భవిష్యత్‌తో ఇలాంటి ఒక పాత్రలో నటించాను చూడండి అని ధైర్యంగా చెప్పుకోవచ్చు. ప్ర:దక్షిణ సినిమా చాలా మారుతోందని ఇటీవల పేర్కొన్నారు. ఆ మార్పులేమిటో వివరిస్తారా? జ:మూడేళ్ల ముందు కంటే ఇప్పుడు విభిన్న కథలు, కథనాలను వింటున్నాం. స్క్రీన్‌ప్లేతో సహా కథను పూర్తిగా ఈ మెయిల్లో పంపి చదవమంటున్నారు. మేము బాగా నటించగలిగినా రిహార్సల్స్‌కు రాగలరా అంటూ మర్యాదగా పిలుస్తున్నారు. టీమ్ వర్క్, ప్రమోషన్, ప్రణాళిక అంటూ అదరగొడుతున్నారు. ఇవన్నీ మంచి పరిణామాలేగా. ప్ర: సరే. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో హీరోహీరోయిన్లపై విమర్శలు, ఎగతాళి చేయడాలు అధికం అవుతుండడం గురించి? జ: నేను అన్ని కామెంట్స్‌ను చదవను. సమయం లభిస్తే అప్పుడప్పుడు చూస్తుంటాను. ఒక్కొక్కరి దృష్టి ఒక్కోలా ఉంటుంది. ఒక మహిళ రోడ్డులో వెళుతుంటే ఆమె ధరించిన దుస్తులు నాకు సూపర్‌గా ఉన్నాయనిపించవచ్చు. మరొకరికి అసభ్యంగా అనిపించవచ్చు. అది చూసే వారి దృష్టిని బట్టి ఉంటుంది కాబట్టి విమర్శలను, వెటకారాలను నేను పట్టించుకోను. ప్ర: హీరోయిన్లకు గ్లామర్ చాలా ముఖ్యం. దాన్ని కాపాడుకోవడానికి ఎలాంటివి పాటిస్తుంటారు? జ: ఇప్పుడు అందరికీ ఫిట్నెస్ చాలా ముఖ్యం. నేను కొన్ని సమయాల్లో షూటింగ్ పూర్తి అయిన తరువాత సంతోషంగా ఉంటే ఇంటికెళ్లగానే వర్కౌట్స్ చేస్తాను. నాకు జిమ్‌కు వెళ్లడం అస్సలు నచ్చదు. ఇంటి పక్కన ఉన్న పార్క్‌లోకి వెళ్లి జాగింగ్ చేస్తాను. అక్కడ నన్నెవ్వరూ గుర్తుపట్టరు. -
ఇండియన్ సినిమానే తిరిగి చూస్తుంది
తమిళసినిమా: తమిళసినిమాను ఇండియన్ సినిమానే తిరిగి చూస్తుందని నటుడు, నిర్మాతలమండలి అధ్యక్షుడు విశాల్ పేర్కొన్నారు. బాఫ్టా మీడియా వర్క్స్ సమర్పణలో క్రియేటివ్ మీడియా ఎంటర్టెయిన్మెంట్స్ పతాకంపై ధనుం జయన్ నిర్మించిన చిత్రం మిస్టర్ చంద్రమౌళి. సీనియర్ నటుడు కార్తీక్, ఆయన కొడుకు గౌతమ్‌కార్తీక్ కలిసి నటించిన క్రేజీ చిత్రం ఇది. నటి రెజీనా హీరోయిన్గా నటించిన ఇందులో నటి వరలక్ష్మీ కీలక పాత్రను పోషించారు. సీనియర్ దర్శకుడు మహేంద్రన్, అగస్త్యన్, సతీశ్ ముఖ్య పాత్రలను పోషించారు. తిరు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక సత్యం థియేటర్లో ఘనంగా జరిగింది. ఇందులో విశాల్ పాల్గొన్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రం ద్వారా నటుడు శివకుమార్ కూతురు బృందా గాయనిగా పరిచయం అవుతున్నారు. నా సోదరి కలను నెరవేర్చారు ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నటుడు సూర్య మాట్లాడుతూ కార్తీక్ నటించిన చిత్రాలు చూసి లవ్ చేయడం ఎలా అన్నది నేర్చుకున్నామన్నారు. నటుడు కార్తీక్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించడం చాలా గొప్ప అనుభవం అని పేర్కొన్నారు. నటుడు విశాల్ మాట్లాడుతూ చిత్రపరిశ్రమ సమ్మెకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. మరో 6 నెలల్లో తమిళ సినిమా భారతీయ సినిమానే తిరిగి చూసేలా ఉంటుందని అన్నారు. నటి వరలక్ష్మీశరత్‌కుమార్, విశాల్ పక్కపక్కనే కూర్చోవడం ఫొటోగ్రాఫర్లకు పండగే అయ్యింది. -
30 శాతం వృద్ధి లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 30 శాతం ఆదాయ వృద్ధి అంచనా వేస్తున్నట్లు జీవిత బీమా సంస్థ ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కార్తీక్ రామన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం స్థూల ప్రీమియం పరిమాణం .. పదహారు శాతం పెరిగి రూ. 1,783 కోట్లకు చేరిందని ఆయన వివరించారు. కొత్త ప్రీమియంలో 15 శాతం, రెన్యువల్లో 25 శాతం వృద్ధి సాధించామని సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు. నిర్వహణలో ఉన్న అసెట్స్ విలువ 23 శాతం పెరిగి రూ. 7,503 కోట్లకు చేరిందని, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి సుమారు 91 శాతం మేర ఉంటోందని వివరించారు. డీమానిటేజేషన్ అనంతరం భారీగా నిధులు బీమా సాధనంలోకి వచ్చాయని, దీంతో 2016–17 క్యూ4లో పాలసీ విక్రయాలు గణనీయంగా జరిగాయని రామన్ తెలిపారు. అయితే, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలోనూ .. అంతక్రితం క్యూ4 కన్నా మెరుగైన పనితీరే సాధించగలిగినట్లు పేర్కొన్నారు. సరళతరమైన పాలసీలపై దృష్టి.. సులభంగా అర్ధమయ్యే రీతిలో సరళమైన పాలసీలను అందుబాటులోకి తేవడంపై దృష్టి సారిస్తున్నామని రామన్ చెప్పారు. అంతేగాకుండా టెక్నాలజీ తోడ్పాటుతో పాలసీ జారీ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నామన్నారు. కస్టమర్ నుంచి సేకరించిన వివరాలు మొదలైనవి ట్యాబ్లెట్ ద్వారా అప్పటికప్పుడు అప్లోడ్ చేసి .. కొన్ని సార్లు గంటల వ్యవధిలోనే జారీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని రామన్ తెలిపారు. టెక్నాలజీ వినియోగం కారణంగా సంస్థ వ్యయాలు తగ్గి.. ఆ మేరకు వచ్చే ప్రయోజనాలు పాలసీదారులకు బదలాయించడానికి వీలవుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 20 పైగా రకాల పాలసీలను విక్రయిస్తున్నామని, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు (యులిప్), చైల్డ్ ప్లాన్స్ అత్యధికంగా విక్రయించే వాటిల్లో ఉన్నాయని చెప్పారు. మరింతమంది ఏజెంట్ల నియామకం.. 3 వేల పైచిలుకు ఫెడరల్, ఐడీబీఐ బ్యాంకుల శాఖల్లో పాలసీలు విక్రయిస్తున్నామని రామన్ పేర్కొన్నారు. అలాగే తమకు సొంతంగా 63 పైగా ఏజెన్సీ బ్రాంచీలు ఉండగా, నాలుగు శాఖలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం 10వేల పైచిలుకు ఏజెంట్లు ఉండగా వీరి సంఖ్యను క్రమంగా పెంచుకుంటున్నామని, ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 12,000–12,500 స్థాయికి పెంచుకోవాలని భావిస్తున్నామని ఆయన వివరించారు. మరోవైపు, జీవిత బీమాపై అవగాహన పెంచే దిశగా మారథాన్స్ మొదలైన వాటిని నిర్వహించడం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నామని రామన్ పేర్కొన్నారు. అలాగే, క్రీడలకు కూడా ప్రోత్సాహమిస్తూ.. యువ టాలెంట్‌ను గుర్తించి, తోడ్పాటు అందించేందుకు పుల్లెల గోపీచంద్ అకాడమీతో చేతులు కలిపినట్లు ఆయన వివరించారు. టాలెంట్ హంట్‌కి సంబంధించి దేశవ్యాప్తంగా వేల కొద్దీ దరఖాస్తులు రాగా 26 మందిని షార్ట్ లిస్ట్ చేసినట్లు, వీరిలో ఆరుగురు తెలంగాణ నుంచి ఉన్నట్లు రామన్ చెప్పారు. -
క్యూట్ లవ్ స్టోరీ
శ్రీరామ్, పల్లవి జంటగా ఓ కొత్త చిత్రం తెరకెక్కుతోంది. లాగిన్ మీడియా శ్రీధర్‌రెడ్డి ఆశీస్సులతో కృష్ణ కార్తీక్ దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. కృష్ణ కార్తీక్ మాట్లాడుతూ –‘‘ప్రయోగాత్మక చిత్రాలను ఎంకరేజ్ చేస్తున్న ఉదయ్‌గారు నాకు రెండో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇదొక క్యూట్ లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరి మనసును తాకే కథ. రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా రియలిస్టిక్ కథను సినిమాగా రూపొందిస్తున్నాం. షూటింగ్ మొత్తం తెలంగాణలో జరుగుతుంది. నెక్ట్స్ వీక్‌లో మొదటి షెడ్యూల్ ప్రారంభించి, 35రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో వస్తున్న రెండో చిత్రమిది. మంచి కథతో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు ఉదయ్‌భాస్కర్ గౌడ్. శ్రీరామ్, పల్లవి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కన్నా కోటి, సంగీతం: మహి మదన్ యంయం, సమర్పణ: వై. బాలరాజు గౌడ్, సహ నిర్మాత: వినయ్‌కుమార్ గౌడ్. -
ధోని యూనివర్సిటీ టాపరైతే... నేనింకా విద్యార్థినే
చెన్నై: మ్యాచ్‌లను ముగించడంలో మహేంద్ర సింగ్ ధోని యూనివర్సిటీ టాపరైతే తానింకా విద్యార్థినేనని నిదహస్ ట్రోఫీ ఫైనల్ హీరో దినేశ్ కార్తీక్ అంటున్నాడు. ధోనిని చూస్తూ ఎదిగినవారిలో తానూ ఒకడినని, ఇద్దరి ప్రయాణాలు వేర్వేరని పేర్కొన్నాడు. మంగళవారం చెన్నైలో దినేశ్ కార్తీక్ మీడియాతో మాట్లాడాడు. ‘ధోని అద్భుతమైన వ్యక్తి. ఒకప్పుడు సిగ్గరిగా ఉన్న అతడు నేడు యువకులకు అండగా నిలిచే వ్యక్తిగా మారాడు. తనతో నన్ను పోల్చడం సరికాదు. ప్రస్తుతం అందరూ నా గురించి మాట్లాడుతున్నారు. దీనిని మాటల్లో వర్ణించలేను. ఇదంతా కొన్నేళ్ల శ్రమ ఫలితం. నేనున్న స్థితి గురించి సంతృప్తిగా ఉన్నాను. ఇప్పుడిక కొత్తగా ఏం చేయనున్నానో చూస్తారు’ అని అన్నాడు. -
మేలో ‘మిస్టర్ చంద్రమౌళి’
తమిళసినిమా: సీనియర్ నటుడు కార్తీక్, ఆయన కుమారుడు గౌతమ్‌కార్తీక్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ చంద్రమౌళి. ఈ సినిమా మేలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. వరలక్ష్మీశరత్‌కుమార్, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తిరు దర్శకత్వంలో, బాప్టా మీడియా వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో క్రియేటీవ్ ఎంటర్టెయినర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం గురించి నిర్మాత ధనుంజయన్ తెలుపుతూ షెడ్యూల్ ప్రకారమే చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిందన్నారు. నాలుగు పాటల్లో ఇప్పటికే రెండు పాటలను చిత్రీకరించామన్నారు. మరో రెండు పాటల కోసం చిత్ర యూనిట్ థాయ్‌ల్యాండ్‌కు వెళ్లిందన్నారు. కాగా ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుగుతున్నాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్ర ఆడియో హక్కులను సోనీ మ్యూజిక్ సంస్థ సొంతంచేసుకుందన్నారు. ఏప్రిల్ రెండో వారంలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నామని, మేలో చిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్ల డించారు. ఈ చిత్రానికి శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఐలవ్యూ అంటే ఐలవ్యూ..!
కార్తీక్ ఆమెను మళ్లీ చూశాడు. ఆరోజు ఒక పెళ్లిలో చూసినప్పట్నుంచీ ఆమె గురించే ఆలోచిస్తున్నాడతను. ఆమె మళ్లీ కనిపించదన్న ఆలోచనే అతనికి ఎలాగో ఉండింది ఇన్నాళ్లూ. ఇప్పుడామె మళ్లీ కనిపించింది. కార్తీక్ ఉన్న లోకల్ ట్రైన్‌కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళుతోన్న ట్రైన్లో ఆమె కనిపించింది. ఆమె కార్తీక్‌నే చూస్తోంది. కార్తీక్ ఆమెనుండి చూపు తిప్పుకోలేకపోయాడు. కొన్ని క్షణాల్లో ఆ రైళ్లు వాటి వాటి దిశల్లో ముందుకెళ్లిపోయాయి. ఇద్దరూ దూరమైపోయారు. కార్తీక్ ఫ్రెండ్స్‌తో మీటింగ్ పెట్టాడు. ‘‘ఆమె ఎక్కడుంటుందో ఎలాగైనా కనిపెట్టి తీరాలి!’’ అన్నాడు వాళ్లతో. ఆమె మెడిసిన్ స్టూడెంట్ అన్న విషయం, లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తుందన్న విషయం తప్ప వాళ్లకు ఇంకేం తెలీదు. కానీ కనిపెట్టారు. ఆ వెంటనే కార్తీక్ ఆమె వెంటపడడాన్ని డైలీ రొటీన్‌గా మార్చేసుకున్నాడు. ఆమె రైలెక్కే ప్లేస్, ఇల్లు.. అన్నీ రౌండ్లు వేయడం మొదలుపెట్టాడు. ఆమెకూ ఇవన్నీ కొత్తగానే ఉన్నాయి. ఒకవిధంగా కార్తీక్ అలా వెంటపడ్డాన్ని ఆమె ఎంజాయ్ చేస్తోంది కూడా! ఒకరోజు ఆమె రైల్లో కాలేజీకి వెళుతోంటే, ఆమెకు దగ్గరగా వెళ్లి నిలబడ్డాడు కార్తీక్. ఈ ఐదారు రోజుల్లో అతనామెకు అంత దగ్గరగా వెళ్లడం అదే మొదటిసారి. ఆమె చేతిలో ఉన్న ఒక పుస్తకాన్ని లాక్కొని అందులో పేరు చూశాడు. ‘‘శాంతి..!’’ అన్నాడు నవ్వుతూ. శాంతి ఏం మాట్లాడలేదు. ‘‘నువ్వంటే నాకిష్టం లేదు. నీమీద ఆశ పడటం లేదు. నువ్వు అందగత్తెవు అనుకోవడం లేదు. కానీ ఇవన్నీ జరుగుతాయేమో అని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు..’’ రైలు కొంచెం కొంచెం కదులుతూ ఉంటే, చెప్పాలనుకున్నదంతా చెప్పేసి అక్కణ్నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు కార్తీక్. రైలు కూడా వేగమందుకొని ప్లాట్‌ఫామ్ దాటేసింది. శాంతి సిగ్గుపడుతూ నవ్వింది. తర్వాతిరోజు శాంతి చదువుతున్న కాలేజీకి వెళ్లాడు కార్తీక్. ‘ఇక్కడ కూడా వచ్చిపడ్డాడు..’ అనుకుంటూ శాంతి అతనికి దగ్గరగా వెళ్లింది. అతణ్ని సమీపిస్తున్నా కొద్దీ అంతకంతకూ పెరిగిపోతోన్న సిగ్గుతో ‘‘పేరేంటీ?’’ అనడిగింది. ‘‘కార్తీక్..’’శాంతి కార్తీక్ వైపు నవ్వుతూ చూసి, ‘‘కార్తీక్! నువ్వు డబ్బున్నవాడివా? క్లాస్‌లో లాస్టా? ఎక్కువసార్లు ఫెయిలవుతావా? ఎందుకంటే డబ్బున్న వాళ్లే బుద్ధిలేకుండా అన్నీ వదిలేసి ఇలా అమ్మాయిల వెంటపడుతుంటారు..’’ అని తిరిగి వెళ్లిపోతూంటే, ‘‘ఏయ్!’’ అన్నాడు కార్తీక్. శాంతి చిన్నగా నవ్వింది, ఆ పిలుపుకి వెనక్కి తిరుగుతూ. ‘‘హేయ్! తను నన్ను చూసి నవ్విందీ..’’ అంటూ గట్టిగా అరుస్తూ ఆ రోజంతా శాంతి పేరే తల్చుకుంటూ కూర్చున్నాడు కార్తీక్. శాంతి ఫోన్ నంబర్ కనుక్కున్నాడు కార్తీక్. ఫోన్ చేశాడు. శాంతి ఫోన్ ఎత్తింది. ‘‘హలో ఎవరూ?’’ ‘‘హలో!’’ అన్నాడు కార్తీక్. ‘‘ఏయ్! నంబర్ ఎలా తెలిసిందీ?’’ ‘‘నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశాను.’’‘‘పొయ్యి మీద చారు పెట్టొచ్చాను. రేపు ప్రాక్టికల్స్. అమ్మ ఇప్పుడే ఇంటికొచ్చింది. ఫర్వాలేదు.. ఓపిగ్గా వింటాను. చెప్పేంటి విషయం?’’ ‘‘ఆ! రేపు మా ఇంట్లో ఫంక్షన్.’’‘‘అయితే?’’‘‘అందుకని నువ్వు రావాలి..’’ ‘‘నేనా? ఎందుకు?’’ ‘‘ఇలా చూడూ! నేన్నిన్ను బీచ్‌కు రమ్మనలేదు. సినిమాకు రమ్మనలేదు. పార్క్‌కు రమ్మనలేదు. ఇంటికేగా రమ్మందీ..’’‘‘నేనెందుకు రావడం?’’ ‘‘నువ్విక్కడికి రాకపోతే, నేనే అక్కడికి వస్తాను. చక్కగా చీర కట్టుకొని రా..’’ తను చెప్పాలనుకున్నదంతా చెప్తూ, అడ్రెస్ కూడా చెప్పేసి ఫోన్ కట్ చేశాడు కార్తీక్. శాంతి చెప్తున్నదేదీ అతను వినిపించుకోలేదు. కార్తీక్ ఇంట్లో ఫంక్షన్. ‘నేనేందుకు రావాలి?’ అన్న శాంతి కూడా ఆ ఫంక్షన్‌కు వచ్చింది. ఇల్లంతా కార్తీక్ చుట్టాలు. ‘‘ఎవర్రా ఆ అమ్మాయి?’’ కార్తీక్‌ను అడిగింది వాళ్లమ్మ. ‘‘తనే నేను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి..’’ అన్నాడు కార్తీక్. ఆ మాట కార్తీక్ వాళ్లమ్మతో పాటు అక్కడున్న ఇంకో ఇద్దరు విన్నారు. వెంటనే ‘ఆ అమ్మాయినే అంట.. కార్తీక్ పెళ్లి చేసుకునేది.’ ఇల్లంతా పాకింది ఈ మాట. ఫంక్షన్ అయిపోయింది. శాంతి తిరిగి రైల్లో ఇంటికి వెళ్లిపోతోంది. కార్తీక్ కూడా ఆమెతో పాటే ఉన్నాడు. ‘‘అసలు నువ్వెందుకలా అన్నావ్?’’ అడిగింది శాంతి. ‘‘నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావని అన్లేదే? నేను ఆశపడుతున్నా అన్నాను. అది నిజమేగా!’’ ‘‘నన్నొక మాట అడగొచ్చుగా?’’ ‘‘సరే! ఇప్పుడడుగుతా..’’‘‘వద్దు..’’‘‘ఏయ్! అడక్కుండా చెప్తే కోప్పడతావ్. అడుగుతానంటే వద్దంటావ్?’’‘‘ఏమిటిది పెళ్లీ గిల్లీ అనీ..’’ కార్తీక్ శాంతి చెయ్యి పట్టుకొని ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ‘‘ఏయ్! చెప్పనా..?’’‘‘ఏంటి?’’‘‘ఐలవ్యూ..’’‘‘అంటే..? దానర్థమేమిటీ?’’‘‘ఐలవ్యూ అంటే ఐలవ్యూ..’’ ‘‘ఇప్పుడీ ప్రేమా గీమా అవసరమా?’’‘‘తెలీదు. కానీ ఐ లవ్యూ..’’ కార్తీక్ శాంతికి ఈమాట చెప్పిన కొన్ని రోజులకు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఆశపడి. -
చంద్రమౌళి మనిషి కాదు!
కార్తీక్ ఒకప్పటి లవర్‌బాయ్. ‘అభినందన’ సినిమా ఒక్కటి చాలు.. కార్తీక్‌ని గుర్తు చేయడానికి. ఫిఫ్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్న కార్తీక్ ఈ మధ్య సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. మణిరత్నం ‘కడలి’ చిత్రం ద్వారా ఆయన తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా పరిచయమయ్యాడు. విశేషం ఏంటంటే.. ఈ తండ్రీ కొడుకులిద్దరూ ‘మిస్టర్ చంద్రమౌళి’ అనే సినిమాలో నటిస్తున్నారు. టైటిల్ రోల్ తండ్రి చేశారా? కొడుకా? అన్నది ఏప్రిల్‌లో తెలిసిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే.. అసలు చంద్రమౌళి మనిషి కాదనే వార్త కూడా హల్చల్ చేస్తోంది. రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ పోస్టర్లో టైటిల్ లోగో కింద కారు సింబల్ ఉండటంతో ఈ సినిమా కథ అంతా కారు చూట్టూ తిరుగుతుందనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఆ కారు పేరు చంద్రమౌళి అన్నది కొందరి ఊహ. అన్ని ఊహలకు ఏప్రిల్ 27న సమాధానం దొరికేస్తుంది. ఆ రోజే ఈ సినిమా విడుదల కానుంది. తిరు కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రెజీనా, వరలక్ష్మీ శరత్‌కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. -
హత్యకు స్కెచ్
‘సామాన్యుడు, శ్రీమన్నారాయణ’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి చావలి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘సూపర్ స్కెచ్’. హత్య నేపథ్యంలో నడిచే ఈ థ్రిల్లర్ స్టోరీలో నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్త, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీ, సోఫియా (లండన్) కీలక పాత్రలు చేశారు. ఎరోస్ సినిమాస్ సమర్పణలో బలరామ్ మక్కల నిర్మించిన ఈ చిత్రం ఎడిటింగ్ జరుపుకుంటోంది. రవి చావలి మాట్లాడుతూ– ‘‘ఒక పోలీసాఫీసర్, ఓ ఫారిన్ అమ్మాయి, నలుగురు క్రిమినల్స్ మధ్య జరిగే కథ ఇది. పోలీసును ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన క్రిమినల్స్ పాత్రల నేపథ్యంలో తెరకెక్కించాం. పోలీస్ అధికారిగా నర్సింగ్ నటన ఈ సినిమాకి హైలైట్. శ్రీహరిగారికి ప్రత్యామ్నాయం అన్నట్టు చేశాడు. ఉత్కంఠభరితంగా సాగేలా టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, బాపట్ల సూర్యలంక బీచ్, వికారాబాద్ ఫారెస్ట్‌లో 50 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. ఫిబ్రవరి నెలాఖరున లేదా మార్చిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాణం: యూ అండ్ ఐ క్రియేషన్స్, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ, కెమెరా: సురేంద్ర రెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల. -
‘గ్యాంగ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
-
కటాకటాల్లోకి జ్యోతి
అడ్డాకుల (దేవరకద్ర): జీవితాంతం కలి సుంటానని భర్తతో ఏడడుగులు నడి చింది.. కానీ ఏడేళ్లు కూడా కాపురం చేయకుండానే ప్రియుడి మోజులో పడి.. కట్టుకున్నోడిని కర్కశంగా కడతేర్చి.. కన్నపిల్లలను వీధిన పడేసింది.. చివరికి తాను తవ్వుకున్న గోతిలో తానే పడినట్లు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్వా తిరెడ్డి కేసు మాదిరిగానే నాగరాజు హత్యకు గురవడం గమనార్హం. ఈ కేసులో నిందితులైన భార్య జ్యోతి, ఆమె ప్రియుడు కార్తీక్‌తోపాటు మరో ముగ్గురిని చౌటుప్పల్ పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ సంఘటనతో నాగరాజు, జ్యోతి దంపతుల ఇద్దరు పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పెళ్లికి ముందే పరిచయం.. 2012 డిసెంబర్లో రాచాలకు చెందిన కమ్మరి నాగరాజు(33)కు కోయిలకొండ మండలం అవంగపట్నం గ్రామానికి చెందిన జ్యోతి(24)తో పెళ్లి జరిపించారు. ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో నివాసముంటుండగా నాగరాజు వడ్రంగి పనిచేస్తున్నాడు. వారికి జీవిత(3), విక్కీ (10 నెలలు) పిల్లలున్నారు. అయితే పెళ్లికి ముందే జ్యోతికి హైదరాబాద్‌లో ఉండే కార్తీక్‌తో పరిచయం ఏర్పడగా ప్రేమాయణం సాగించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా జ్యోతి తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. ఇద్దరి కులాలు వేరు కావడంతో చివరికి జ్యోతిని నాగరాజుకు ఇచ్చి వివాహం చేశారు. ఇటీవల ప్రియుడు కార్తీక్‌తో జ్యోతి మళ్లీ వివాహేత సంబంధం నెరిపింది. ప్రియుడి మోజులో పడిన జ్యోతి అడ్డుగా ఉన్న భర్త నాగరాజును అంతమొందించాలని పక్కా పథకం రచించి కనికరం లేకుండా హత్య చేయించింది. తన భర్త కనిపించడం లేదని బంధువులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా జ్యోతి కాల్‌డేటా, నాగరాజు శవపరీక్ష నివేదిక ఆధారంగా చౌటుప్పల్ పోలీసులు చాకచక్యంగా హత్య కేసును ఛేదించారు. తల్లి జైలుకు.. పిల్లలు రాచాలకు! భర్త నాగరాజు హత్య కేసులో నిందితులైన భార్య జ్యోతి, ఆమె ప్రియుడు కార్తీక్, మరో ముగ్గురిని శుక్రవారం చౌటుప్పల్ పోలీసులు కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశం మేరకు నల్లగొండ జైలుకు తరలించారు. నాగరాజు పిల్లలిద్దరూ రెండు రోజులుగా ఠాణా వద్దే ఉన్నారు. తల్లిని జైలుకు తీసుకెళ్లడంతో నాగరాజు సోదరుడు శ్రీనివాసులు పిల్లలిద్దరిని తీసుకుని రాత్రి రాచాలకు బయలుదేరారు. తల్లిదండ్రులిద్దరూ లేకపోవడం.. పిల్లలిద్దరు రోదిస్తుండటంతో ఏం చేయాలో తోచడం లేదని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తల్లి చేసిన నేరం పిల్లలిద్దరూ తండ్రిని కోల్పోవడంతోపాటు వారి భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చింది. నిందితులను కఠినంగా శిక్షించాలని నాగరాజు కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. -
సవతి సోదరుల మధ్య ఘర్షణ.
పూర్వం ధర్మం ప్రకారం, అంటే అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి, సంఘం అంగీకారంతో చేసుకునే భార్యను ‘ధర్మపత్ని’ అనేవారట. ధర్మపత్ని అంటే మొదటి భార్య అని అర్థం. భర్త శారీరక, మానసిక అవస్థలపై ఆస్తులపై అధికారాలపై ఈమెకే సగభాగం దక్కుతుంది. ఈమె పిల్లలే వారసులు అవుతారు. అధికారిక హక్కుదారులు అవుతారు. రెండవ భార్యకు ఈ హక్కు ఉండదు. ఆమె సంతానానికీ ఉండదు. దశరథుడి ధర్మపత్ని కౌసల్యకు పుట్టిన రాముడే అయోధ్యకు వారసుడు. కాదని కారడవులకు పంపడం వల్లే రామాయణం జరిగింది. తండ్రి మీద హక్కు కోసం లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నడు పోరాడలేదు. కాని ‘ఘర్షణ’లో కార్తిక్ పోరాడాడు. రెండవ భార్య సంతానం కావడం వల్ల తండ్రి పేరును తన పక్కన పెట్టుకోవడానికి పోరాడాడు. తండ్రిని అతనే నా తండ్రి అని చెప్పుకోవడానికి పోరాడాడు. నీకే కాదు నాకూ హక్కు ఉంది అని మొదటి భార్య కుమారుడితో చెప్పడానికి పోరాడాడు. ఘర్షణ కథ ఇద్దరు సవతి సోదరుల మధ్య నడిచిన కథ. ఇలాంటి కథ భారతీయ సినిమాలలో ఇదే మొదటిది. చాలా ఇబ్బందిగా ఉంటుంది– రెండవ భార్య కుమారుడితో ‘నువ్వు పెద్ద భార్య కుమారుడివా?’ అని అడిగితే. చాలా ఇరకాటంగా ఉంటుంది– మొదటి భార్య కుమారుడితో ‘మీ నాన్నకు ఇంకో భార్య ఉందట కదా’ అని అడిగితే. సంఘం ఒక భార్య–ఒక భర్తనే అంగీకరిస్తుంది. చట్టాన్ని ఒప్పించి రెండో పెళ్లి చేసుకున్నా, రెండో ఇల్లు పెట్టినా వ్యక్తిగతంగా బాగానే ఉండొచ్చు కానీ సంఘప్రకారం అది తప్పు అవుతుంది. మీ నాన్న తప్పు చేశాడు... మీకు దక్కవలసిన ప్రేమను మరొకరి ద్వారా కలిగిన సంతానానికి పంచాడు అనే భావన ఏదో ఈ సినిమాలో విజయకుమార్ కుమారుడిగా వేసిన ప్రభు మనసులో ఉంది. అలాగే మా నాన్న మా అమ్మను పెళ్లి చేసుకుని ఆమెకు సంఘపరమైన మర్యాద ఇవ్వలేకపోయాడు. ఆమె కూడా నా భార్యే అని లోకానికి ధైర్యంగా చెప్పలేకపోయాడు. మమ్మల్ని తన పిల్లలుగా చేయి పట్టుకుని నలుగురి మధ్యలో నడిపించలేకపోయాడు. మాకు ఉంపుడుగత్తె పిల్లలు అనే హోదాను ఇచ్చాడు అనే భావన విజయకుమార్ రెండో భార్య జయచిత్రకు పుట్టిన కార్తిక్ మనసులో ఉంది. ప్రభు, కార్తిక్ ఇద్దరూ మంచి వయసులో ఉన్న కుర్రవాళ్లు. ఆ వయసులో ఉండే ఉత్సాహం, హుషారు వారిలో ఉండవు. ఇద్దరూ అశాంతితో రగలిపోతుంటారు. ప్రభు కార్తిక్‌ను యాక్సెప్ట్ చేయడు. ప్రభును కార్తిక్ తన సోదరుడిగా గౌరవించడు. ఇద్దరి మధ్యా ఘర్షణ. చాలా పెద్ద ఘర్షణ. మనిషి ఇన్స్టింక్స్ చాలా బలంగా ఉంటాయి. నాది అనే భావన సకల జీవరాశుల్లో ఉంటుంది. ప్రభు, కార్తిక్‌ల మధ్య ఘర్షణకు కారణం వారికి తండ్రి మీద ఉన్న గొప్ప ప్రేమకు ప్రచ్ఛన్నరూపం అనిపిస్తుంది. ఆ తండ్రి పెద్ద ప్రభుత్వ అధికారి. చాలా మంచివాడు. ఈ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో ఉన్నా భార్యతో, కుమారుడితో చాలా బాగా ఉంటాడు. అలాంటి తండ్రి మాకు మాత్రమే ఉండాలని పిల్లలు అనుకుంటారు. ప్రభు, కార్తిక్‌లు కూడా అనుకొని ఉండొచ్చు. కాని ప్రతి రోజూ ఆ తండ్రి ఏకకాలంలో రెండు ఇళ్లలోనూ ఉండలేడు కదా. ఇక్కడ కొన్నిరోజులు ఉంటే అక్కడివాళ్లకు కోపం. అక్కడ కొన్నిరోజులు ఉంటే ఇక్కడి వాళ్లకు చిన్నతనం. దీని మధ్య అతడు నలుగుతుంటాడు. ఒకటి మాత్రం వాస్తవం. పెద్ద భార్య ఇంట్లో అతడికి పూర్తి స్వేచ్ఛ లేదు. కిటికీలు మూతబడి గాలాడని భావన. అందుకే అతడు కాసింత ఓదార్పు కోసం, రెండో భార్య ఇంటి నడవలో, తులసి కోటకు కాసింత దూరంలో చేరగిలపడి, ఒక వైపు వాన కురుస్తుంటే మరో వైపు భార్య ఆమ్లెట్ తెచ్చి పెడుతుంటే సకల మర్యాదలు వదిలి హాయిగా కాసింత మందు బిగించే స్వేచ్ఛ కోసం అక్కడికి వస్తుంటాడు. నిజానికి అతడి స్వార్థం అతడు చూసుకున్నాడు కాని ఆ భార్యకు పుట్టిన, ఈ భార్యకు పుట్టిన పిల్లల మధ్య సఖ్యత ఉందా లేదా చూసుకోలేకపోయాడు. ఆ సఖ్యత కోసం అతడు ఆ తర్వాత ధైర్యంగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఒకవేళ ప్రయత్నించే సమయం వచ్చేసరికి ఇరు పక్షాల్లో ఘర్షణ చోటు చేసుకుని ఉంది. ప్రభు పోలీస్ కమిషనర్ అయ్యి కార్తిక్‌ను సిల్లీ కారణాల్లో అరెస్ట్ చేసేవరకు వెళతాడు. కార్తిక్ తన ఫ్రెండ్స్‌తో పెద్ద భార్య ఇంటికి వెళ్లి రాళ్లు విసిరి అద్దాలు పగలగొడతాడు. రోడ్డున పడి కొట్టుకునే ఈ అన్నదమ్ములు ఒకే తండ్రికి పుట్టారు. తల్లులు వేరైనందుకు శతృవులయ్యారు. మేమూ మేమూ ఉన్నప్పుడు మేము పాండవులం. వారు కౌరవులు. కాని బయటి నుంచి శతృవు వస్తే మేము నూటైదు మంది అన్నదమ్ములం అన్నాడు ధర్మరాజు. బయటి శతృవు వచ్చినప్పుడు రక్తం చేసే చాలనం చిత్రంగా ఉంటుంది. తన రక్తాన్ని తాను గుర్తించి కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే రక్తబంధం అంటారు. ఈ సినిమాలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న విలన్ మీద ఒన్ మేన్ కమిషన్‌గా విజయకుమార్ బాధ్యతలు తీసుకుంటాడు. ఫలానా తేదీ లోపల కమిషన్ రిపోర్ట్ అప్పగించాలి. ఆ విలన్ దోషి అని కమిషన్ తేల్చితే వెంటనే అతడు జైలుకు వెళతాడు. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి విజయకుమార్‌ను విలన్ బుజ్జగించే ప్రయత్నం చేస్తుంటాడు. కాని విజయకుమార్ స్ట్రిక్ట్ కనుక మాట వినడు. దాంతో విజయకుమార్నే చంపించే పనికి విలన్ దిగుతాడు. ఈ సంగతి అన్నదమ్ములకు తెలుస్తుంది. బయటి నుంచి ఎవరూ రానంత వరకే వారు సవతి సోదరులు. వచ్చాక సొంత అన్నదమ్ములు. తండ్రిని కాపాడటానికి ఇద్దరూ రంగంలో దిగుతారు. విలన్‌ను ఎదుర్కొని తండ్రిని కాపాడుకుంటారు. ఘర్షణలో శాశ్వతత్వం లేదు. శాంతిలోనే ఉంది. విడి చేతులలో బలం లేదు. చేతులు కలిపితేనే బలం. ఆ అన్నదమ్ములు ఇప్పుడు ఒక్కటయ్యారు. తండ్రి ఒకడే. తల్లులు వేరు. కాని అమ్మా అని పిలిస్తే ఏ తల్లి అయినా ఒకటే కదా. ఈ కుటుంబం ఇప్పుడు సమష్టిగా మారడం మనకు ఆనందాన్ని ఇస్తుంది. అనుబంధాలు విరిసేను.. పన్నీరు చిలికేను... వెరీగుడ్ మణి. అగ్నినక్షత్రం ‘నాయకుడు’ వంటి ఎపిక్ తీశాక మణిరత్నం 1988లో నెరేషన్‌ను, ఎమోషన్‌ను మిళితం చేసుకుంటూ తేలిక పద్ధతిలో చెప్పిన కథ ‘అగ్నినక్షత్రం’. తెలుగులో ‘ఘర్షణ’గా డబ్ అయ్యి పెద్ద విజయం సాధించింది. సవతి సోదరుల మధ్య ఘర్షణ ఉంటుంది అనే చిన్న పాయింట్ తప్ప కథంటూ ఏమీ లేని ఈ సినిమా కేవలం సంఘటనల వరుస ద్వారా సమ్మోహితం చేస్తుంది. ప్రభు జీవితంలో కొన్ని సంఘటనలు, ప్రేమ, కార్తిక్ జీవితంలోని కొన్ని సంఘటనలు, ప్రేమ వీటి మధ్యలో అక్కడక్కడా ఘర్షణ చూపిస్తూ మంచి పాటలతో సినిమాను ముగిస్తాడు దర్శకుడు. ఈ సినిమా వచ్చిన కొత్తల్లో ఇందులోని ఇళయరాజా పాటలకు, పి.సి.శ్రీరామ్ ఫొటోగ్రఫీకి ప్రేక్షకులు మోహాశ్చర్యాలకు లోనయ్యారు. పి.సి.శ్రీరామ్ చేసిన మెరుపు లైటింగ్ ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాలను వెంటాడింది. ఇందులోని ‘రాజా రాజాధి రాజా’ పాటలో ప్రభుదేవా గ్రూప్డాన్సర్గా కనిపిస్తాడు. ‘ఒక బృందావనం సోయగం’ పాట చిత్రలహరిలో కొన్ని వందలసార్లు ప్లే అయ్యింది. ఈ సినిమా నిరోషాకు తొలి సినిమా. అరుపులు, కేకలు, విగ్గుల విలన్ హయామ్లో చాలా మామూలు పెద్ద మనిషిగా ‘ఏం రాజా’ అని ఆత్మీయంగా పిలిచే విలన్ (మద్రాసులో ఆనంద్ థియేటర్ ఓనర్ జి.ఉమాపతి) కనిపించడం చాలా కొత్త. ఈ విలనీని ‘కర్తవ్యం’లో పుండరీ కాక్షయ్యకు వాడారు. ఈ సినిమాలో భార్య నాగమణి ఊరెళితే ఎగిరి గంతేసి పండగ చేసుకునే జనకరాజ్ క్యారెక్టర్ ఎంత హిట్టయ్యిందంటే ఇప్పటికీ జన సామాన్యంలో భార్య ఊరెళ్లిందని చెప్పడానికి ‘నాగమణి లేదు’ అనడం కద్దు. స్లో మోషన్లో ప్రభు, కార్తీక్ కోపంగా క్లోజప్‌లో ఒకరినొకరు చూసుకునే షాట్స్‌ను ఆ తర్వాత చాలా సినిమాల్లో అనుసరించారు. ఘర్షణ చాలావాటికి ట్రెండ్ క్రియేట్ చేసింది. అది నిజమైన ట్రెండ్ సెట్టర్. – కె నిరోషా, పి.సి. శ్రీరామ్, జనకరాజ్, మణిరత్నం -
సంధ్యపై అసత్య ప్రచారం
సాక్షి, హైదరాబాద్: తన కుమార్తెను దారుణంగా చంపిన కార్తీక్‌ను కఠినంగా శిక్షించాలని సంధ్యారాణి తల్లి సావిత్రమ్మ ప్రభుత్వాన్ని కోరారు. ‘నన్ను ఎలా కాల్చాడో అలానే అతన్ని కూడా కాల్చాలని’ ప్రాణంపోయే సమయంలో తన కూతురు కోరిందని ఆమె వెల్లడించారు. చనిపోయిన తర్వాత కూడా సామాజిక మాధ్యమాల్లో, కొన్ని చానల్స్‌లో సంధ్యపై అసత్య ప్రచారం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంధ్యారాణి సోదరుడు సాయికుమార్‌తో కలిసి ఆమె మాట్లాడుతూ.. నిందితుడు తన కూతురును రోజూ ఆఫీసుకు తీసుకువెళ్లి, తీసుకొచ్చేవాడన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించాలని, బస్తీ వాసులను విచారిస్తే ఈ విషయం తెలుస్తుందన్నారు. కార్తీక్‌కు, తన కుమార్తెకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఘటనలో నిందితుడి తల్లి హస్తం కూడా ఉందన్న అనుమానం కలుగుతోందని, ఆమెను కూడా విచారించాలని కోరారు. నిందితుని ఇంటివద్దకు వెళ్లి వారి కుటుంబం గురించి విచారించగా వారు ఎంతో దుర్మార్గులని తేలిందన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సంధ్యారాణి తల్లి సావిత్రమ్మ మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్ మాట్లాడుతూ.. సంధ్యారాణి హత్య మరో ఢిల్లీ నిర్భయ ఘటన లాంటిదే అన్నారు. మరణించిన తర్వాత కూడా సంధ్యపై అసత్య ప్రచారాలు చేయడంతో ఆమె ఆత్మకూడా శాంతించదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఒక మహిళను పెట్రోల్‌పోసి తగలబెట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సంధ్యారాణి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పక్కా ఇల్లు, సంధ్యారాణి తల్లి సావిత్రమ్మకు నెలకు రూ. 5 వేల ఫించన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పెండ్యాల భానుప్రసాద్, నిమ్మ బాబూరావు, ఉత్తమ్ శ్రీనివాస్, ప్రభాకర్ రావు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
సంధ్య అంటే 'టామీ'కి ఎంత ప్రేమో!
-
కార్తీక్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టాలి: బంధువులు
సాక్షి, హైదరాబాద్: ప్రేమించలేదని సంధ్యారాణిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన నిందితుడు కార్తీక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సంధ్యారాణి ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కిరాతకుడు కార్తీక్‌ను కఠినంగా శిక్షించాలని సంధ్యారాణి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అతన్ని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టాలని గట్టిగా కోరుతున్నారు. సంధ్యారాణి సజీవ దహనం నేపథ్యంలో నగరంలో మహిళల భద్రతపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు మాత్రం దీనిని ప్రత్యేక ఘటనగా చూడాలని, నగరంలో మహిళల భద్రతకు ఇది ముడిపెట్టకూడదని అంటున్నారు. ప్రేమోన్మాది కార్తీక్ నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలు సంధ్యారాణి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన దాడి తర్వాత 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం 7.20 గంటల ప్రాంతంలో కన్నుమూసింది. దీంతో హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చిన లాలాపేట్ పోలీసులు నిందితుడు కార్తీక్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని వాటితోపాటు మరికొన్ని సెక్షన్లు జోడించారు. -
‘మూర్ఖుడు.. ఏ శిక్ష వేసినా తప్పులేదు’
సాక్షి, హైదరాబాద్: తన కొడుకు మూర్ఖంగా ప్రవర్తించాడని, అతడికి ఎటువంటి శిక్ష వేసినా అభ్యంతరం లేదని కార్తీక్ తల్లి ఊర్మిళ అన్నారు. శుక్రవారం ఆమె ఓ వార్తా చానల్‌తో మాట్లాడుతూ... తన కొడుకు చేసిన తప్పు మరొకరు చేయొద్దని వేడుకున్నారు. సంధ్యతో కార్తీక్‌కు చాలా రోజులుగా పరిచయం ఉందని తెలిపారు. సంధ్య అప్పుడప్పుడు తమ ఇంటికి వచ్చేదని వెల్లడించారు. కార్తీక్ తన సంపాదన మొత్తం సంధ్యకే ఇచ్చేవాడని, కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య దూరంగా పెరిగిందన్నారు. వారం క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడని వెల్లడించారు. సంధ్య వెంటపడొద్దని కొడుక్కి నచ్చజెప్పినట్టు తెలిపారు. సమస్యలుంటే పెద్దవారితో మాట్లాడుకుకోవాలని, ఇలాంటి దారుణాలకు దిగొద్దని కోరారు. ఓ అమ్మాయి ప్రాణం తీశాడు.. తల్లి బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని చెప్పారు. కార్తీక్‌ను తానే తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పానని తెలిపారు. గురువారం సాయంత్రం లాలాపేట్ విద్యామందిర్ సమీపంలో సంధ్యారాణిపై కార్తీక్ కిరోసిన్ పోసి నిప్పంటించాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ప్రాణాలు విడిచింది. నిందితుడు కార్తీక్‌పై 307, 354డీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. -
ప్లాన్ ప్రకారమే కార్తీక్ దాడి : డీసీపీ సుమతి
సాక్షి, హైదరాబాద్ : సంధ్యారాణి హత్యకేసులో నిందితుడు కార్తీక్‌ను పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి కేసు వివరాలను మీడియా సమావేశంలో వివరించారు. ఈ ఘటన దురదృష్టకరమని ...పథకం ప్రకారమే కార్తీక్...సంధ్యారాణిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించినట్లు ఆమె తెలిపారు. ఈ కేసులో అన్ని వివరాలు సేకరించామని, కార్తీక్‌కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఏడాది కాలంగా కార్తీక్...సంధ్యారాణిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. సంధ్యారాణి అందంగా ఉండటమే కాకుండా, చక్కగా చదువుకుంది. అయితే కార్తీక్ మాత్రం ఏడో తరగతి ఫెయిల్ కావడమే కాకుండా ఆవారాగా తిరుగుతున్నాడు. దీంతో ఆమె అతడిని కాదనుకుంది. అంతేకాకుండా కార్తీక్ వేధింపుల విషయాన్ని సంధ్యారాణి తాను పని చేస్తున్న లక్కీ ట్రేడర్స్ యజమాని దృష్టికి తీసుకు వెళ్లింది. యజమాని కూడా అతడిని మందలించాడు. కార్తీక్...సంధ్యకు ఉద్యోగం చూపించినా, ఆమె స్వశక్తితోనే అక్కడ రాణిస్తోంది. అయితే సంధ్యారాణి తనను దూరం పెట్టడాన్ని సహించలేని కార్తీక్ ఈ వికృత చర్యకు పాల్పడ్డాడు. 64 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంధ్యారాణి ఈ రోజు ఉదయం మృతి చెందింది. నిందితుడు కార్తీక్‌పై 307, 354డీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశాం.’ అని తెలిపారు. మరోవైపు సంధ్యారాణి మృతదేహానికి వైద్యులు పోస్ట్‌మార్టం పూర్తి చేసి కుటుంబసభ్యులకు అందచేశారు. ఆమె మృతదేహాన్ని లాలాపేటకు తరలించారు. -
పథకం ప్రకారమే కార్తీక్...సంధ్యారాణిపై దాడి
-
నా కూతురు చావుకు కారణమైన కార్తీక్‌ను శిక్షించాలి
-
కార్తీక్ గురించి ఎప్పుడూ చెప్పలేదు..
సాక్షి, హైదరాబాద్ : తన కుమార్తె చావుకు కారణం అయిన కార్తీక్‌ను చంపేయాలంటూ మృతురాలు సంధ్యారాణి తల్లి సావిత్రి అన్నారు. ప్రేమించలేదనే అక్కసుతో కార్తీక్ అనే యువకుడు సంధ్యపై కిరోసిన్ పోసి నిప్పు అంటించడంతో...తీవ్ర గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. సంధ్యారాణి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందచేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి తల్లి మాట్లాడుతూ.. ‘నా కూతురు చావుకు కారణమైన కార్తీక్ ను కూడా చంపాలి. అప్పుడే నా కూతురుకు న్యాయం జరిగినట్టు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి వెంటనే కార్తీక్‌ను శిక్షించాలి. సంధ్య ఎప్పుడు కార్తీక్ గురించి నాకు చెప్పలేదు. కార్తీక్ ఎవరో మాకు తెలియదు.’ అని అన్నారు. సంధ్య కుటుంబాన్ని ఆదుకోవాలి మరోవైపు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ...ఈ రోజు ఉదయం మృతురాలు సంధ్యారాణి కుటుంబసభ్యులను పరామర్శించారు. నేరానికి పాల్పడ్డ కార్తీక్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి...సంధ్యారాణి కుటుంబాన్ని ఆదుకోవాలని బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలన్నారు. 24 గంటలు వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు ఈ కేసులో నిర్లక్ష్యం వహించారన్నారు. ఇలాంటి ఘటనలు వారానికి ఆరు కేసులు గాంధీ ఆస్పత్రికి వస్తున్నాయన్నారు. నగరంలో రోజురోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా సంధ్యారాణిని ప్రేమించా... సంధ్యారాణిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించిన కార్తీక్‌ను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై హత్యకేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో సందర్భంగా కార్తీక్ పలు విషయాలు వెల్లడించాడు. ‘ అయిదేళ్లుగా సంధ్యారాణిని ప్రేమిస్తున్నా. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కొద్దిరోజులుగా సంధ్యారాణి ప్రవర్తనలో మార్పు వచ్చింది. నిన్న కూడా ఆమెను బతిమిలాడాను. నన్ను ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. నన్ను నిరాకరించడంతోనే కిరోసిన్ పోసి నిప్పు అంటించాను. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాను.’ అని తెలిపాడు. -
ప్రేమోన్మాదం.. సంధ్యను చంపేశాడు..
సాక్షి, హైదరాబాద్: ఉన్మాది దాడిలో గాయపడ్డ సంధ్యారాణి శుక్రవారం ఉదయం కన్నుమూసింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంధ్యారాణి.. మృత్యువుతో పోరాడి అసువులు బాసింది. ప్రేమించలేదనే అక్కసుతో కార్తీక్ అనే యువకుడు సంధ్యారాణిపై కిరోసిన్ పోసి తగులబెట్టిన విషయం తెలిసిందే. ఆమె మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి డాక్టర్లు కుటుంబసభ్యులకు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ మధ్య రైల్వేలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న కార్తీక్ కొన్ని నెలల క్రితం సంధ్యారాణి ఎదుట ప్రేమ ప్రతిపాదన చేశాడు. కుటుంబ భారం తనపై ఉండటంతో అతని ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించింది. అయినా తన పంథా మార్చుకోని కార్తీక్ నేరుగా, ఫోన్ ద్వారా వేధింపులు మొదలెట్టాడు. దీంతో కొన్నాళ్లుగా సంధ్యారాణి అతడిని దూరం పెట్టింది. గురువారం సం«ధ్యారాణి, కార్తీక్ మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. తనను ప్రేమించకపోతే అంతు చూస్తానంటూ కార్తీక్ బెదిరించగా.. సంధ్యారాణి అతడిని మందలించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న కార్తీక్ అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. సంధ్యారాణి రోజూ విధులు ముగించుకున్న తర్వాత లాలాపేట్ విద్యామందిర్ మీదుగా ఇంటికి నడిచి వెళ్తుంటుంది. గురువారం సాయంత్రం కార్తీక్ కిరోసిన్ డబ్బాతో ఆ ప్రాంతానికి చేరుకుని కాపు కాశాడు. సంధ్యారాణి 6 గంటల ప్రాంతంలో అటుగా రావడం గమనించి.. మరోసారి వేధింపులకు దిగాడు. అతడి ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో విచక్షణ కోల్పోయి.. వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఆమెపై పోశాడు. షాక్‌కు గురైన సంధ్యారాణి వెంటనే తేరుకుని పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో జనం ఉండే ప్రాంతానికి పరిగెత్తింది. ఈ లోపే ఆమె వెంట పరిగెత్తిన కార్తీక్ నిప్పుపెట్టాడు. శరీరం కాలుతున్న బాధతో ఆమె హాహాకారాలు చేస్తుంటే కార్తీక్ అక్కడ నుంచి పారిపోయాడు. కాలుతున్న శరీరంతోనే దాదాపు 200 మీటర్లు పరిగెత్తిన సంధ్యారాణి అక్కడ కుప్పకూలిపోయింది. ఇది గమనించిన స్థానికులు ఆమె వద్దకు చేరుకుని నీళ్లుపోసి మంటలార్పి.. పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. గాంధీ ఆసుపత్రిలో కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న సంధ్యారాణి ఈరోజు ఉదయం ప్రాణాలు విడిచింది. సంధ్య మృతితో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
అంకె మారింది. ఎనిమిది కాదు.. తొమ్మిది!
మేళ్లమడుగు ఎన్కౌంటర్ మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ తొమ్మిదో మృతదేహం.. ఎన్నెన్నో సందేహాలను మిగిల్చింది.. మరెన్నో ప్రశ్నలను లేవనెత్తింది. తుపాకీ తూటాలు సాగించిన ఈ నరమేధం.. పోలీసులు చెబుతున్నట్టుగా ఎన్‌కౌంటరేనా..? కొందరు ఆరోపిస్తున్నట్టుగా బూటకమా..? పొదల్లో ఈ మృతదేహం ఎందుకుంది..? ఎన్కౌంటర్ నిజమేననడానికి ఇది నిదర్శనమా..? ‘పోలీసులే పొదల్లో పడేశార’న్నది వాస్తవమా..? ఎన్‌కౌంటరా..? హత్యలా..? ఈ ప్రశ్నలకు జవాబులేవి..??!! ఇల్లెందు: ఇల్లెందు సబ్ డివిజన్ టేకులపల్లి మండలం మేళ్లమడుగులో గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన ‘సీపీఐ(ఎంఎల్) సీపీ బాట’ అజ్ఞాత దళం సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఆ రోజున ఎనిమిదిమంది చనిపోయారని పోలీసులు ప్రకటించారు. కాల్పులు జరిగిన ప్రదేశంగా పోలీసులు చెప్పిన స్థలానికి కొద్ది దూరంలోగల చెట్ల పొదల నుంచి మరో మృతదేహాన్ని పోలీసులే శనివారం స్వాధీనపర్చుకున్నారు. రాచకొండ కిరణ్ అలియాస్ కార్తీక్‌గా గుర్తించారు. ఎవరీ కిరణ్ అలియాస్ కార్తీక్..? మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన రాచకొండ వీరన్న–కౌసల్య దంపతుల కుమారుడే కిరణ్ అలియాస్ కార్తీక్. ఇతని వయసు 30 ఏళ్ల లోపు ఉంటుంది. చిన్నతనంలోనే తండ్రి మృతిచెందాడు. తల్లి, అక్క లావణ్య, చెల్లి సౌజన్య ఉన్నారు. అక్కకు వివా«హమైంది. చెల్లి, డిగ్రీ మధ్యలోనే ఆపేసి ఇంటివద్దనే ఉంటోంది. ఇతడు దాదాపుగా పదేళ్ల నుంచి తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఇన్నేళ్లలో ఒకే ఒక్కసారి మాత్రమే తన ఇంటికి వెళ్లాడు. ఉమ్మడి న్యూడెమోక్రసీలో ఏడెనిమిది సంవత్సరాలపాటు పనిచేశాడు. న్యూడెమోక్రసీలో చీలికకు ముందు ఇతడు పాల్వంచ ఏరియా విజయ్, రాము దళాల్లో పనిచేశాడు. పార్టీలో చీలిక తరువాత చంద్రన్న వర్గంలోని రాము దళంలోకి వెళ్లాడు. ఆరు నెలల క్రితం వరకు ఇందులోనే ఉన్నాడు. ఈ దళం సభ్యురాలైన సుమలత అలియాస్ గీతను పెళ్లి చేసుకున్నాడు (అప్పటికి వీరిద్దరూ ఇదే దళంలో సభ్యులుగా ఉన్నారు). గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె తన పుట్టింటికి వెళ్లింది. బాబు జన్మించిన తరువాత నుంచి దళం వైపు తిరిగి రాలేదు. కిరణ్ అలియాస్ కార్తీక్ మాత్రం అప్పుడప్పుడు తన భార్య వద్దకు వెళ్లి రెండు మూడు రోజుల వరకు ఉండేవాడు. అతడు క్రమంగా మద్యానికి బానిసగా మారాడు. ఈ నేపథ్యంలో, అతడిని రాము దళం దూరంగా పెట్టింది. అప్పటి నుంచి ఇతడు పాల్వంచ వద్దనే కుటుంబంతో నివాసముంటూ, పైపుల కంపెనీలో పనిచేస్తున్నాడు. తన స్వగ్రామంలోని స్నేహితుడు రషీద్ అలియాస్ విజయ్ (సీపీ బాట వ్యవస్థాపకుల్లో ఇతడు కూడా ఉన్నాడు) ద్వారా ఆరు నెలల క్రితం సీపీ బాటలో చేరాడు. మేళ్లమడుగులో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల తీరుతో అనుమానాలు ♦ మేళ్లమడుగు కాల్పుల ఘటన(ఎన్కౌంటర్) వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటి ఆధారంగానే, మొత్తం ఈ ఎన్‌కౌంటరే బూటకమని వాదిస్తున్నారు. ఆ అనుమానాలు ఇవీ... ♦ గురువారం ఉదయం ఐదారు గంటల మధ్య ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు చెప్పారు. మృతదేహాలను మధ్యాహ్నం తరలించారు. అప్పటి వరకు ఆ ప్రదేశానికి ప్రజలనుగానీ, పార్టీల నాయకులనుగానీ, మీడియానుగానీ పోలీసులు అనుమతించలేదు. అక్కడ జరిగింది నిజంగా ఎన్‌కౌంటరే అయినట్టయితే.. ఇంత దాపరికం ఎందుకు? మీడియాను ఎందుకు అనుమతించలేదు..? ♦ మృతదేహాలను ట్రాక్టర్లోకి చేర్చక ముందే.. దానికి (ట్రాక్టర్ ట్రక్కుకు) రక్తపు మరకలు ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? (ప్రజాసంఘాలు, ఎన్డీ, పౌర–మానవ హక్కుల సంఘాలు వ్యక్తం చేస్తున్న అనుమానమిది). ♦ సాధారణంగా ఎన్కౌంటర్ జరిగినప్పుడు, అక్కడి నుంచి సుమారు కిలోమీటర్ దూరం వరకు పరిసర ప్రాంతాలకు స్థానికులను పోలీసులు పంపించి సోదా చేయిస్తారు. మేళ్లమడుగు ఘటన జరిగిన రోజున ఇలా చేయలేదు. కనీసంగా మీడియాను కూడా మధ్యాహ్నం వరకు అనుమతించలేదు. ఎందుకు..? ♦ ‘అక్కడ జరిగింది ఎన్‌కౌంటరేనని నమ్మించేందుకే గుబురు పొదల్లో మృతదేహాన్ని పోలీసులే పడేశారా..?’ అని, ఎన్డీ నేతలు గుమ్మడి నర్సయ్య, మధు, సాధినేని వెంకటేశ్వరరావు తదితరులు ప్రశ్నిస్తున్నారు. ‘ఇది ఎన్కౌంటర్ కాదు. పోలీసులు చేసిన హత్యలు’ అని వారు గట్టిగా వాదిస్తున్నారు. ఇవి దేనికి సంకేతాలు..? మొన్ననేమో ఎన్డీ అజ్ఞాత దళాల అగ్ర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నిన్ననేమో మేళ్లమడుగు కాల్పుల్లో దళ సభ్యులు తొమ్మిదిమంది చనిపోయారు. ఈ పార్టీ – ఆ పార్టీ అనే తేడా లేకుండా మొత్తంగా సాయుధ (అజ్ఞాత) దళాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ‘తుపాకీ సంస్కృతి’ని తుదికంటా తొలగించేందుకు కంకణం కట్టుకుంది. ఇకపై మరింత కఠినంగా ఉంటామని చేతల్లో చూపుతోంది. మరో మృతదేహం దొరికింది టేకులపల్లి: టేకులపల్లి మండలం మేళ్ళమడుగు అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ‘ఎన్కౌంటర్లో చనిపోయింది ఎనిమిదిమంది కాదు.. తొమ్మిదిమంది’ అని పోలీసులు ప్రకటించారు. ఎలా కనిపించిందంటే... గురువారం రోజంతా, కాల్పుల ప్రదేశం నుంచి మృతదేహాల తరలింపుతోనే పోలీసులకు సరిపోయింది. వాటిని గుర్తించడంతో, కుటుంబీకులకు అప్పగించడంతో శుక్రవారం గడిచింది. కాల్పుల స్థలాన్ని పునఃపరిశీలించేందుకు శనివారం అక్కడకు ఇల్లెందు డీఎస్పీ జి.ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో టేకులపల్లి, గుండాల సీఐలు టి.రవి, దోమల రమేష్, టేకులపల్లి, బోడు ఎస్ఐలు అరుకల అనిల్, ఒడ్డేపల్లి మురళి, స్పెషల్ పార్టీ పోలీసులు వెళ్లారు. పరిసరాల్లో ముమ్మరంగా తనిఖీలు సాగిస్తున్నారు. ఎన్కౌంటర్ ప్రాంతంలోగల కోడెవాగు అవతలనున్న చెట్ల పొదల నుంచి దుర్వాసన వస్తుండడాన్ని పోలీసులు పసిగట్టారు. దగ్గరగా వెళ్లి చూసేసరికి మృతదేహం కనిపించింది. దగ్గరగా వెళ్లారు. ఒంటిపై జర్కిన్ ఉంది. లోపల ఖాకీ చొక్కా ధరించాడు. పక్కనే 8 ఎంఎం రైఫిల్‌తోపాటు బుల్లెట్లు కనిపించాయి. అక్కడే చిన్న నోట్ బుక్ కూడా ఉంది. దాని ఆధారంగా, అతడిని మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన రాచకొండ కిరణ్ అలియాస్ కార్తీక్((28)గా గుర్తించారు. మృతదేహానికి అక్కడే టేకులపల్లి తహసీల్దార్ సరికొండ అంజంరాజు, డిప్యూటీ తహసీల్దార్ వీరభద్ర నాయక్, వీఆర్వో నాగమణి కలిసి పంచనామా నిర్వహించారు. ఆ తరువాత, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ ఏం చెప్పారంటే... ఈ తొమ్మిదో మృతదేహానికి సంబంధించి ఇల్లెందు డీఎస్పీ జి.ప్రకాశ్‌రావు ఇలా ప్రకటించారు. ‘‘మేళ్ళమడుగు అటవీ ప్రాంతంలో గురువారం ఎన్కౌంటర్ జరిగిన తరువాత రెండు రోజుల నుంచి ఆ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతోంది. ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయేమోనని పరిశీలిచేందుకు ఆ అటవీ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాం. కోడెవాగు అవతల చెట్ల పొదల నుంచి దుర్వాసన వచ్చింది. వెళ్లి చూస్తే.. మృతదేహం కనిపించింది. పక్కన 8 ఎంఎం బుల్లెట్లు 50 రౌండ్లు, ఒక 8 ఎంఎం తుపాకీ, చిన్న నోట్‌బుక్ ఉన్నాయి. ఆ నోట్ బుక్ ఆధారంగా మృతదేహాన్ని సీపీఐ (ఎంఎల్) సీపీ బాట దళానికి చెందిన రాచకొండ కిరణ్ అలియాస్ కార్తీక్(28)గా గుర్తించాం’’. ఈ అరెస్టులు.. కాల్పులు.. నక్సల్స్ దళాలకు ప్రభుత్వం ఇచ్చిన సంకేతాలు..! -
పొంగల్‌కి వరోమ్
... అంటే పొంగలి తింటారా? అని అడుగుతున్నామేమో అనుకుంటున్నారా? నో చాన్స్. వరోమ్ అంటే వస్తాం అని అర్థం. సంక్రాంతిని తమిళంలో పొంగల్ అంటారు. వచ్చే సంక్రాంతికి సూర్య ఇటు తెలుగు అటు తమిళ సినిమాల రిలీజ్ రేస్‌లో ఉన్నారు. ఆయన హీరోగా ‘తానా సేంద కూట్టమ్’ అనే చిత్రం రూపొందుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ కథానాయిక. తెలుగులో ‘గ్యాంగ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. శనివారం ‘గ్యాంగ్’ ఫస్ట్ లుక్‌తోపాటు సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. ‘‘షూటింగ్ కంప్లీట్ అయింది. సూర్య సార్, విఘ్నేష్ శివన్.. మొత్తం యూనిట్‌ని మిస్ అవుతున్నా. పొంగల్‌కి వరోమ్’’ అన్నారు కీర్తీ సురేశ్. ‘‘సూర్య చిత్రాన్ని మా బ్యానర్లో రిలీజ్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. అనిరు«ద్ మంచి సంగీతం అందిచారు. కీర్తీ సురేశ్ నటన హైలైట్. కార్తీక్, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటించారు’’ అన్నారు వంశీ, ప్రమోద్. -
చంద్రమౌళి ఎవరు?
రాజమౌళి అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుసు. కానీ, తమిళ సినిమాల్లో హూ ఈజ్ మిస్టర్ చంద్రమౌళి? స్క్రీన్‌పై అతని కథ ఏంటి? అంటే.. ఇప్పుడే చెబితే కిక్ ఏముంటుంది? సినిమాకు ఇప్పుడేగా కొబ్బరికాయ కొట్టాం. గుమ్మడికాయ కొట్టి, దిష్టి తీసి థియేటర్లో బొమ్మ వేసేంత వరకూ ఆగండి అంటున్నారు రెజీనా. అయినా చంద్రమౌళితో రెజీనాకు రిలేషన్ ఏంటి? అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. తిరుకృష్ణమూర్తి దర్శకత్వంలో తండ్రి కార్తీక్, తనయుడు గౌతమ్ కార్తీక్, రెజీనా ముఖ్య పాత్రల్లో చేస్తున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ సినిమాకు ‘మిస్టర్ చంద్రమౌళి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని కోలీవుడ్ ఖబర్. -
కథ విని షాకయ్యా – సుమంత్
విడిపోయి పదమూడేళ్లు గడిచిన తర్వాత కూడా ప్రత్యేకంగా ఒకరిని గుర్తుపెట్టుకుంటే, ఆ వ్యక్తిపై ప్రేమ అయినా ఉండాలి. ద్వేషం అయినా ఉండాలి. కార్తీక్ కూడా అంజలిని గుర్తుపెట్టుకున్నాడు. మరి ప్రేమతోనా?.. ద్వేషంతోనా? అనేది తెలియాలంటే మా సినిమా చూడాలంటున్నారు కథానాయకుడు సుమంత్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘మళ్ళీ రావా..’. ఆకాంక్షా సింగ్ కథానాయిక. రాహుల్ నక్క నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేయనునున్నారు. తాజాగా చిత్రం ఆడియో టీజర్‌ను రిలీజ్ చేశారు. సుమంత్ మాట్లాడుతూ– ‘‘ఏడాది క్రితం గౌతమ్ చెప్పిన కథ విని షాక్ అయ్యా. కళ్లు మూసుకుని సినిమా చేయవచ్చు అనిపించింది. నేచురల్ లవ్‌స్టోరీ. ‘గోదావరి’ చిత్రం తర్వాత అంత సంతృప్తినిచ్చిన చిత్రమిది’’ అన్నారు. ‘‘కార్తీక్– అంజలిల మధ్య నడిచే లవ్‌స్టోరీ డ్రామానే చిత్రకథ. 30 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశాం. శ్రవణ్ మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు దర్శకుడు. ‘‘మంచి అవుట్‌పుట్ వచ్చింది. సుమంత్‌గారు బాగా సపోర్ట్ చేశారు. ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు రాహుల్. -
తమ్ముడిలాంటి వాడివని చెప్పేస్తా!
సీన్ మాది – టైటిల్ మీది ఈతరం ప్రేమకథలను అందంగా తెరకెక్కించగలడన్న పేరున్న స్టార్ డైరెక్టర్ తీసిన సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. హీరో, హీరోయిన్లకు టాలీవుడ్లో హాట్ కపుల్ అన్న పేరుంది. ఈ సన్నివేశాలున్న ఆ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం? కార్తీక్ జెస్సీని చూడడం అదే మొదటిసారి. కార్తీక్ ఫ్యామిలీ జెస్సీ వాళ్ల ఇంట్లోకి అద్దెకు దిగిన రోజది. ఆమెను చూడడమే ఎవరో ‘స్టాప్’ అంటే ఆగిపోయినట్టు చూస్తూ ఉండిపోయాడు. బయటకెళ్లేప్పుడు, ఇంట్లోకి వచ్చేప్పుడు, వీధిలో నిలబడి, జెస్సీ ఆఫీసుకు వెళ్లే టైమ్‌లో రోడ్‌పై బండి మీద కూర్చొని.. ఎక్కడెక్కడ జెస్సీ కనబడే అవకాశం ఉందో అన్ని చోట్లా ఆమెను చూడడం కోసం తిరగడమే పనిగా పెట్టుకున్నాడు కార్తీక్. సడెన్‌గా ఒకరోజు. కార్తీక్ ఇంట్లో జెస్సీ. అతడి చెల్లెలు అనుతో మాట్లాడుతూ కనిపించింది. క్యాజువల్‌గా వెళ్లి వాళ్ల ముందు నిల్చున్నాడు. అను అతడ్ని జెస్సీకి పరిచయం చేసింది. ‘‘హేయ్! రా! దిస్ ఈజ్ జెస్సీ. జెస్సీ.. మా అన్నయ్య. మీరిద్దరూ ఇంతవరకు మీట్ అవ్వలేదు కదా!’’ జెస్సీకి కార్తీక్‌ను పరిచయం చేస్తూ అడిగింది అను. ‘‘హాయ్! కార్తీక్!’’ తనను తాను పరిచయం చేసుకున్నాడు కార్తీక్. జెస్సీని పలకరించిన ఆనందం అతడి కళ్లల్లో చూడొచ్చు. ‘‘తెలుసు! మీ ఇంట్లో అందరూ అన్నిటికీ పిలుస్తూనే ఉంటారు కదా రోజంతా.. కార్తీక్.. కార్తీక్.. కార్తీక్.. పైకి వినిపిస్తుంది.’’ నవ్వుతూ జెస్సీ.‘‘సో అంటే.. నేను ఇంట్లో పని పాట లేకుండా కూర్చున్నానని మీకూ తెలిసిపోయిందంటారా?!’’ అడిగాడు కార్తీక్. జెస్సీతో మాట్లాడుతున్న ఆనందం అతడిలో ఏమాత్రం తగ్గలేదు. ‘‘నేను అలా అన్లా!’’ సర్దిచెప్పుతూ జెస్సీ. ‘‘మీరు మలయాళి కదా! తెలుగు బాగానే మాట్లాడుతున్నారు?’’ కార్తీక్. ‘‘అవును. కానీ మలయాళం కన్నా తెలుగు బాగా వచ్చు నాకు’’‘‘అవునా! ఎప్పట్నుంచి ఉంటున్నారిక్కడ?’’‘‘పుట్టినప్పట్నుంచీ..’’వారి మాటలలా సాగిపోతూనే ఉన్నాయి. కార్తీక్ అడిగేవన్నీ జెస్సీ చెప్తూ పోతోంది. వీరిద్దరి మాటల మధ్య అను ఒక మూడో మనిషి మాత్రమే! ఆ మూడో మనిషి మాట కూడా కార్తీక్‌కు డిస్టర్బెన్స్‌గా కనిపిస్తోంది. అంతలా జెస్సీకి దగ్గరవ్వాలన్నంత కోరిక పుట్టింది అతడికి. వీరి మాటల మధ్యలో కల్పించుకొని కావాలనే, అను.. ‘‘కార్తీక్! ఇంక బయలుదేరతావా!’’ అని మెల్లిగానే అడిగింది. కార్తీక్‌కు అక్కణ్నుంచి వెళ్లిపోవాలన్న ఆలోచనే లేదు. కానీ తప్పదు. వెళ్లిపోయాడు. మధ్యలో జెస్సీ, అను మాట్లాడుకుంటున్నప్పుడల్లా రూమ్‌లోకి ఏదో పనున్నట్లు వస్తూ, జెస్సీని చూస్తూ పోతున్నాడు కార్తీక్. అప్పటికే జెస్సీకి కార్తీక్ పడిపోయాడు. కార్తీక్‌కు ఇప్పుడు కెరీర్ గోల్ ఎంత ముఖ్యమో, జెస్సీ కూడా అంతే! జెస్సీ ఎక్కడ పనిచేస్తుందో కనుక్కున్నాడు. ఆమెను చూడడం కోసం చుట్టుపక్కలే తిరుగుతున్నాడు. అలా తిరుగుతుండగానే ఒకసారి ఆమె ఆఫీస్‌కు పక్కన్నే ఉన్న ఫుడ్‌కోర్ట్‌లో కార్తీక్ కనిపించాడు. ‘ఇతనేంటి ఇక్కడ?’ అని చూస్తూ, అతడికి దగ్గరగా కదిలింది. ‘‘హాయ్!’’ అన్నాడు కార్తీక్. ‘‘హలో!’’ అంది జెస్సీ.ఫుడ్ ఆర్డర్ చేసేందుకు క్యూలో నిలబడింది జెస్సీ. ఆమెకు పక్కనే వెళ్లి నిల్చున్నాడు కార్తీక్.అతణ్ని కొద్దిసేపు అలాగే చూస్తూ.. ‘‘నువ్ నన్ను.. ఫాలో చేయట్లేదు కదా?’’ అడిగింది జెస్సీ. దానికి నవ్వుతూ.. ‘‘హూ.. మీరు నన్ను ఫాలో చేయట్లేదు కదా?’’ అన్నాడు కార్తీక్. ‘‘హ్మ్.. మా ఆఫీస్ ఇక్కడే ఉంది. ఐ వర్క్ హియర్!’’ ‘‘కబాబ్స్ కూడా ఇక్కడే ఉంటుంది. అందుకే వచ్చా. నాకు బాగా ఇష్టం.’’ కార్తీక్ నవ్వుతూ చెప్పాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. నవ్వుతూనే ఇంకొన్ని మాటలు పంచుకున్నారు. ‘బై’ చెప్పి ఫ్రెండ్స్‌తో వెళ్లిపోయింది జెస్సీ. కార్తీక్ జెస్సీకి పూర్తిగా పడిపోయాడు. మరో రోజు. జెస్సీ రెడీ అయి ఆఫీస్‌కు వెళుతోంది. ఆమె కోసమే కింద తనింట్లో ఎదురుచూస్తూ నిల్చున్న కార్తీక్ కూడా ఆమెను చూడ్డమే వెంట నడిచాడు.‘‘హాయ్! ఆఫీస్‌కా?’’ అడిగాడు.‘‘కాదు. క్రికెట్ ఆడటానికి! వస్తావా?’’ విసురుకుంటూ సమాధానమిచ్చింది జెస్సీ.కార్తీక్ ఏం మాట్లాడలేదు. జెస్సీ సమాధానం అలా ఉంది.ఏదో అనాలనుకుంటున్నాడు. అనలేకపోతున్నాడు. నడుస్తున్నాడు. జెస్సీని చూస్తున్నాడు. జెస్సీ మాత్రం తమను ఎవరన్నా చూస్తున్నారా అన్న భయంతో వెనక్కి తిరిగి తిరిగి చూస్తోంది. అది గమనించిన కార్తీక్, అడిగేశాడు వెంటనే.. ‘‘ఏంటలా వెనక్కి తిరిగి చూస్తున్నారు?’’ అని.‘‘నీతో మాట్లాడడం మా నాన్న చూస్తే చంపేస్తారు.’’ జెస్సీ మాటలకు కార్తీక్ ఏం మాట్లాడలేదు. ‘‘నీ వయసెంత?’’ జెస్సీనే మళ్లీ.‘‘ట్వంటీ టూ..’’‘‘నాకు ట్వంటీ ఫోర్. పర్లేదు.. నాన్నడిగితే నాకు తమ్ముడి లాంటివాడివని చెప్పేస్తా!’’ అంది. కార్తీక్ కాసేపు అక్కడే నిలబడిపోయాడు. మళ్లీ తేరుకొని, ‘‘ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఇక నుంచి నాకు సిస్టర్సే! ఒక్క నువ్వు తప్ప’’ అన్నాడు. ‘‘ఎందుకలా?’’ అడిగింది.‘‘బికాజ్ ఆమ్ ఇన్ లవ్ విత్ యూ జెస్సీ.’ -
కలిసి వస్తున్నారు!
తమిళసినిమా: నవరసనాయకుడుగా అభిమానులు పిలుచుకునే కార్తీక్, ఆయన కొడుకు యువ నటుడు గౌతమ్‌కార్తీక్ కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. బహుభాషా నటుడు కార్తీక్ చాలా గ్యాప్ తరువాత అనేగన్ చిత్రంతో రీఎంట్రి అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత అడపాదడపా ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్న కార్తీక్‌ను ఆయన వారసుడు గౌతమ్కార్తీక్ను కలిసి నటింపజేయడానికి చాలా మంది ప్రయత్నించినా మంచి కథ కోసం ఎదురు చూస్తున్నట్లు కార్తీ చెప్పారు. ఇటీవల రంగూన్, ఇవన్ తందిరన్ చిత్రాల విజయాలతో ఫేమ్‌లోకి వచ్చిన గౌతమ్కార్తీక్ను ఆయన తండ్రితో కలిసి నటింపచేసే విషయంలో దర్శకుడు తిరు సఫలమయ్యారు. నాన్ సిగప్పుమనిదన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఈయన తయారు చేసుకున్న కథ కార్తీక్‌కు తెగ నచ్చేయడంతో అందులో తన కొడుకు గౌతమ్‌కార్తీక్‌తో కలిసి నటించడానికి పచ్చ జెండా ఊపారట. ఈ విషయాన్ని క్రియేటివ్ ఎంటర్టెయినర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ అధినేత ధనుంజయన్ తెలిపారు. ఈయన నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి తెలుపుతూ నవంబర్‌లో చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నామని చెప్పారు. చిత్రంలో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు నటించనున్నారని, వారితో పాటు మరి కొందరు నటీనటుల వివరాలను, చిత్ర టైటిల్‌ను త్వరలోనే వెల్లడించనున్నటు చెప్పారు. చిత్ర టైటిల్‌ను ఇప్పటికే రిజిస్టర్ చేశామని, అయితే అదేవిటో గెస్ చేయాల్సిందిగా ప్రేక్షకులకు పజిల్ పెట్టినట్లు తెలిపారు. కరెక్ట్‌గా గెస్ చేసిన వారిలో ఐదుగురిని (ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు)ఎంపిక చేసి చిత్రంలో రెండు మూడు సన్నివేశాల్లో నటించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. -
పాఠం ఆడియో ఆవిష్కరణ
తమిళసినిమా: అన్నీ ప్రైవేట్ సంస్థల ఆధీనంలోకి వెళ్లిపోతున్నాయి. ఇక ప్రభుత్వం పనేంటి అని ప్రశ్నించారు దర్శకుడు, నామ్ తమిళర్ పార్టీ అధ్యక్షుడు సీమాన్. మన దేశ విద్యా విధానాన్ని మార్చాలన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం పాఠం. రోలాన్ మూవీస్ పతాకంపై పీఎస్.జుపిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఇ.రాజశేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు రాజేశ్ శిష్యుడు. నవ జంట కార్తీక్, మోనా హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి మనో ఛాయాగ్రహణం, గణేశ్ రాఘవేంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ సోమవారం ఉదయం స్థానిక సత్యం థియేటర్లో జరిగింది. ఈ వేడుకలో అతిథిగా పాల్గొన్న సీమాన్ మాట్లాడుతూ... ఈ చిత్రం పలు అవార్డులను గెలుచుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదువుకోవడం విద్యార్థుల హక్కు అని, దాన్ని సక్రమంగా అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు విద్య, వైద్యం, అన్నీ వ్యాపారం అయిపోయాయని ఆరోపించారు. మనం అన్నిటికీ పన్నులు చెల్లిస్తున్నా, ఏదీ అందుబాటులోకి రావడం లేదన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం పనేంటి? అని ప్రశ్నించారు. జయలలిత లాంటి వారే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారని, అంటే పాలకులకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై నమ్మకం లేనట్టేగా అని నిలదీశారు. ఇక్కడ డబ్బున్నోళ్లే ప్రాణా లను కాపాడుకుంటారని, లేనోళ్లు ప్రాణాలు కోల్పోవాల్సిందేనని సీమా న్ వ్యాఖ్యానించారు. -
అనంతపురంలో స్నేహితులు!
ప్రేమ కంటే స్నేహం గొప్పదనే కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న సినిమా ‘టు ఫ్రెండ్స్’. సూరజ్ హీరోగా జి.ఎల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో మళ్ళగూరు అనంతరాముడు, మళ్ళగూరు రమేశ్‌నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాలో రవీంద్రతేజ, కార్తీక్, సానియా, ఫరా, స్నిగ్ధ ముఖ్యతారలు. ప్రస్తుతం అనంతపురంలోని అనంతలక్ష్మీ ఇంజినీరింగ్ కాలేజీలో స్వర్ణ మాస్టర్ నేతృత్వంలో ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘వినోదంతో కూడిన సందేశాత్మక చిత్రమిది. హైదరాబాద్‌లో కొన్ని సీన్లు చిత్రీకరించిన తర్వాత యూనిట్ అనంతపురం చేరుకుంది. నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. దీని తర్వాతి షెడ్యూల్ బెంగళూరులో ఉంటుంది. తెలుగు, కన్నడ భాషల్లో సినిమాను తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: టి. సురేందర్‌రెడ్డి, కథ, మాటలు, సంగీతం: పోలూర్ ఘటికాచలం. -
తనయుడి చేతిలో తండ్రికి గాయాలు
ఓడీ చెరువు (పుట్టపర్తి) : మద్యం మత్తులో తనపై దాడిచేయబోయిన తండ్రి నుంచి తప్పించుకునే క్రమంలో తనయుడు గొడ్డలి లాక్కున్నాడు. ఈ ఘటనలో తండ్రికి గాయాలయ్యాయి. ఓడీ చెరువు మండల కేంద్రానికి చెందిన గాండ్ల నాగప్ప కుమారుడు కార్తీక్ గౌనిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతూ అక్కడే ఉన్న బీసీ హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం పాఠశాలకు సెలవు ఉండటంతో శుక్రవారం ఇంటికి వచ్చాడు. సాయంత్రం నాగప్ప మద్యం మత్తులో తూలుతూ ఇంటికి వచ్చాడు. కుమారుడు కనిపించడంతో ‘ఎందుకొచ్చవావ్.. హాస్టల్లోనే ఉండకూడదా’ అంటూ గొడ్డలితో దాడిచేయబోయాడు. తప్పించుకున్న కార్తీక్ గొడ్డలిని లాక్కోబోయే క్రమంలో తండ్రి నాగప్పకు గాయాలయ్యాయి. వెంటనే అతడిని భార్య ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. -
నాన్నకు ఆమే సరైన జోడీ
నాన్న కార్తీక్‌కు నటి నగ్మా సరైన జోడీ అని ఆయన కొడుకు, యువ నటుడు గౌతమ్ కార్తీక్ అన్నారు. కడల్ చిత్రం ద్వారా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం పరిచయం చేసిన నటుడు గౌతమ్ కార్తీక్. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా సరైన గుర్తింపు రాలేదు. తాజాగా గౌతమ్ కార్తీక్ నటించిన రంగూన్ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం ఇవన్ తందిరన్ చిత్రంలో నటిస్తున్నారు శ్రద్ధా కథానాయకి. కండేన్ కాదలై చిత్రం ఫేమ్ ఆర్.కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎంకే.రామ్ ప్రసాద్‌తో కలిసి ఆయనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం రెండురోజుల క్రితం చెన్నైలో జరిగింది. నటుడు గౌతమ్ కార్తీక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సరైన తరుణంలో విలేకరులతో మాట్లాడాలని భావించానన్నారు. అందుకు ఇది సరైన తరుణం అనిపించిందన్నారు. తాను నటించిన రంగూన్ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడటం సంతోషంగా ఉందన్నారు. సిపాయ్, ఇవన్ తందిరన్, హరహర మహాదేవకీ చిత్రాలను పూర్తి చేశానని, ప్రస్తుతం విజయ్‌సేతుపతితో కలిసి నల్ల నాళ్ పార్తు సొల్రేన్ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. నాన్న కార్తీక్ నటించిన చిత్రాల్లో అగ్నినక్షత్రం మంచి కథా చిత్రం అని పేర్కొన్నారు. ఆ చిత్రం రీమేక్‌లో నటించనని అన్నారు. తనకు నటనపై ఆసక్తి కలిగించిన చిత్రం కడల్ అని పేర్కొన్నారు. తనకు ఎప్పుడైతే నిసత్తు కలిగి ఉంటానో అప్పుడు తనను ఉత్సాహపరిచేది అమ్మేనన్నారు. అమ్మంటే తనకు చాలా ఇష్టం అని అన్నారు. ఇకపోతే తనది కచ్చితంగా ప్రేమ వివాహమే అవుతుందన్నారు. అయితే 35–40 వయసులోనే పెళ్లి చేసుకోవాలన్నది తన భావన అని పేర్కొన్నారు. తన తండ్రి, తాత చిత్రాలను తప్పకుండా చూస్తున్నానని చెప్పారు. నటుడిగా నాన్న లెజెండ్ అని పేర్కొన్నారు. షూటింగ్ స్పాట్లో ఆయన గురించి చెబుతున్నప్పుడు తనకు అర్థమైందని అన్నారు. కథానాయికల్లో ఆయనకు సరైన జోడీ నగ్మా, రేవతి అని అన్నారు.ఇకపై నటనలో మరింత శ్రద్ధ చూపుతానని గౌతమ్‌కార్తీక్ చెప్పారు. -
‘మాల్’ మేనేజర్ లైంగిక వేధింపులు
= బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన కృష్ణరాజపుర: బెంగళూరులో మరో లైంగిక వేధింపుల ఘటన ఆసల్యంగా మంగళవారం వెలుగుచూసింది. నగరంలోని బాణసవాడి రింగ్‌రోడ్‌లో ఉన్న ఓ ప్రముఖ షాపింగ్‌మాల్ మేనేజర్ కార్తీక్ గత కొద్ది కాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ షాపింగ్‌మాల్‌లో బ్యూటీ అడ్వైజర్‌గా పని చేస్తున్న యువతి ఆరోపించారు. మాల్లో వస్తువులను ఇచ్చే క్రమంలో తనను అసభ్యకర రీతిలో తాకుతూ తరచూ లైంగిక వేధిపులకు పాల్పడుతున్నాడని అనేకసార్లు హెచ్చరించినా ఫలితం లేదని తెలిపారు. ఇటీవల మరోసారి అదేవిధంగా లైంగిక వేధింపులకు పాల్పడగా ప్రతిఘటించడంతో తనకు సహకరించకుంటే దొంగతనం చేసావంటూ పోలీసు కేసు బనాయిస్తానంటూ బెదిరించినట్లు తెలిపారు. దీంతో యువతి రామ్మూర్తినగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మేనేజర్ కార్తీక్‌పై చర్యలు తీసుకోకుండా వదిలేసారంటూ ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తనను ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా ఈ విషయాన్ని మీడియాకు తెలియజేస్తే మరెక్కడా ఉద్యోగం దొరక్కుండా చేస్తామంటూ బెదిరించినట్లు ఆమె తెలిపారు. కార్తీక్‌కు షాపింగ్‌మాల్ అసిస్టెంట్ స్టోర్ మేనేజర్ కిరణ్, హెచ్ఆర్ సంతోష్, మరి కొంత మంది సీనియర్లు కూడా సహకరించారని ఆమె ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసుకోవడానికి మొదట పోలీసులు కూడా వెనుకడుగేసారని కానీ మీడియాకు తెలిస్తే సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో నామమాత్రంగా కార్తీక్, సంతోష్ తదితరులపై కేసులు నమోదు చేసారంటూ ఆమె ఆరోపించారు. తనతో పాటు షాపింగ్‌మాల్‌లో పని చేస్తున్న మరో ఐదుగురు యువతులను కూడా ఇదే విధంగా లైంగిక వేధిస్తున్న కార్తీక్‌తో పాటు అతడికి సహకరిస్తున్న సంతోష్, షాపింగ్‌మాల్ సీనియర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేశారు. -
విజయ హజరే ట్రోఫి తమిళనాడు కైవసం
న్యూఢిల్లీ: విజయ హజరే క్రికెట్ ట్రోఫి ఫైనల్ తమిళనాడు- బెంగాల్ జట్ల మధ్య మార్చి 20 ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు విజయం సాధించి ట్రోఫిని కైవసం చేసుకుంది. 37 పరుగుల తేడాతో ప్రత్యర్ధి బెంగాల్ జట్టును మట్టికరిపించి విజయం సాధించింది. 50 ఓవర్ల మ్యాచ్ ఫార్మాట్లో తమిళనాడు ప్రత్యర్ధి బెంగాల్‌ను ఓడించడం ఇది మూడోసారి. తమిళనాడు విజయ హజరే ట్రోఫిని 2002- 03లో గెలుచుకుంది. అంతేకాక 2004-05లో కూడా ఉత్తరప్రదేశ్‌తో కలిసి సమానంగా ట్రోఫిని కైవసం చేసుకున్నాయి. మొదట బ్యాటింగ్ చేసినా తమిళనాడు 47.2 ఓవర్ల లో 217పరుగులకే ఆలౌట్ అయింది. తమిళనాడు బ్యాట్స్‌మెన్స్ ఎవరు అంతగా రాణించలేకపోయారు. ఒక కార్తీక్ మాత్రమే 112 పరుగులు చేశాడు. బెంగాల్ బౌలర్లు మహ్మమద్ సమీ 4 వికెట్లు, అశోక్ దిండా 3 వికెట్లు తీశారు. తమిళనాడు బౌలర్ల దాటికి బెంగాల్ 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. తమిళనాడు బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి విజయంపై ఆశలు పెంచారు. అమీర్ గనీ(0/42/10), ప్రజ్ఞాన్ ఓజా(0/49//10) ఇద్దరు కలిసి 20 ఓవర్లకు 91 పరుగులు ఇచ్చారు. విజయ్ హజారే ట్రోఫిని తమిళనాడు కైవసం చేసుకోవడం ఇది రెండోసారి. ఈ విజయంలోబౌలర్ల పాత్ర మరవలేనిది. -
ధనుష్, కార్తీలతో నదియా ఢీ
స్టార్ హీరోలు ధనుష్, కార్తీలతో సీనియర్ నటి నదియా ఢీ కొట్టడానికి సిద్ధం అవుతున్నారు. సాధారణంగా స్టార్ హీరోల చిత్రాల విడుదల సమయంలో వాటికి పోటీగా విడుదల చేయడానికి ఇతర చిత్రాల దర్శక నిర్మాతలు సాహసం చేయరు. అలాంటిది నదియా తన సహ నటీమణులు, యువ నాయికలతో పోటీకి సై అంటుండడం విశేషం. వివరాల్లోకెళితే నటుడు ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన కొడి, కార్తీ త్రిపాత్రాభినయం చేసిన కాష్మోరా చిత్రాలు దీపావళికి తెరపైకి రానున్నాయి. వాటికి పోటీగా నదియా, కోవైసరళ, ఇనియ,ఆర్తి, ఈడన్, హారతి మొదలగు నాటి నేటి ప్రముఖ తారామణులు నటించిన చిత్రం తిరైక్కు వరాద కథై. ఈ చిత్రంలో ప్రధాన విశేషం ఏమిటంటే ఒక్క నటుడు కూడా మచ్చుకైనా కనిపించడు. అందరూ తారామణులతో తెరకెక్కిన తొలి చిత్రం ఇదే అని చెప్పవచ్చు. నటి నదియా ఇందులో పోలీస్ అధికారిగా ఒక పవర్ఫుల్ పాత్రలో నటించారు. చాలా కాలం తరువాత ఆమె నటించిన తమిళ చిత్రం ఇది. మలయాళంలో సూపర్‌స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి వారితో చిత్రాలు చేసిన ప్రముఖ దర్శకుడు తులసిదాస్ రూపొందించిన చిత్రం తిరైక్కు వరాద కథై. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎంజేడీ ప్రొడక్షన్స్ పతాకంపై కే.మణికంఠన్ భారీ ఎత్తున నిర్మించారు. కళాశాలలో చదువుకుంటూ హాస్టల్లో నివసించే స్నేహితుల ఇతివృత్తంగా రూపొందిన ఇందులో ఇంతకు ముందు పెద్ద వివాదానికి దారి తీసిన హిందీ చిత్రం ఫైర్ తరహా సన్నివేశాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. ఇద్దరు యువతుల మధ్య ప్రేమ పెళ్లికి దారి తీసే పాశ్చాత్య దేశాల సంస్కృతికి అద్దం పట్టే విధంగా తిరైక్కు వరాద కథై చిత్రంలో కొన్ని సన్నివేశాలు చోటు చేసుకుంటాయన్నారు. ప్రేమ, ఈర్ష్య కారణంగా స్నేహితురాళ్ల మధ్య జరిగే పరిణామాల తీవ్రత ఎలా ఉంటుందనే కోణంలో ఆవిష్కరించిన చిత్రం ఇదని చెప్పారు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు,కన్నడం,మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు. తెలుగులో కొన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల అధినేతలు హక్కులను అడుగుతున్నారని, వారితో చర్చలు జరుగుతున్నాయని నిర్మాత మణికంఠన్ చెప్పారు. -
ఢిల్లీ టు చెన్నై వయా హైదరాబాద్!
ఢిల్లీలో పుట్టి, పెరిగిన రాశీఖన్నా ఇప్పుడు తెలుగింటి ఆడపడుచు అయిపోయింది. ‘ఊహలు గుసగుసలాడే’ ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమై, ఇక్కడి సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. చివరికి హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కుని, రాశి ఇక్కడే సెటిలైపోయింది. ఎంచక్కా తెలుగు కూడా నేర్చేసుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు తమిళ భాష నేర్చుకునే పనిలో కూడా పడింది. ఎందుకంటే ఓ తమిళ చిత్రంలో కథానాయికగా నటించడానికి అంగీకరించింది. సిద్ధార్థ్ హీరోగా కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. దీనికి ‘సైతాన్ కా బచ్చా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అనుష్క, తమన్నా, శ్రుతీహాసన్... ఇలా తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకున్నవాళ్లందరూ ఆ తర్వాత తమిళంలో కూడా స్టారడమ్‌ని సొంతం చేసుకున్నారు. సో.. రాశీఖన్నాకు కూడా కోలీవుడ్ కలిసొస్తుందని ఊహించవచ్చు. -
విజేతలు హర్షిత, కార్తీక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజినల్ ఐసీఎస్ఈ- ఐఎస్సీ స్కూల్ స్పోర్ట్స్ మీట్లో ట్రిపుల్ జంప్ విభాగంలో హర్షిత, కార్తీక్‌లు విజేతలుగా నిలిచారు. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన పోటీల్లో ట్రిపుల్ జంప్ సీనియర్ బాలికల కేటగిరీలో సెయింట్ జోసెఫ్ స్కూల్‌కు చెందిన హర్షిత పసిడిని దక్కించుకోగా... శ్రీరిన్ (సెయింట్ ఆన్స్), ఐశ్వర్య (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్) రజత కాంస్యాలను సాధించారు. సీనియర్ బాలుర కేటగిరీలో కార్తీక్ సింగ్ (సుజాత స్కూల్), షణ్ముఖ్ సారుు తేజ, కౌశిక్ తొలి మూడు స్థానాల్లో నిలిచారు. జూనియర్ బాలికల కేటగిరీలో రక్షిత (ఈఎస్ఆర్హెచ్ఎస్) తొలి స్థానంలో నిలవగా... మానస (ఈఎస్ఆర్హెచ్ఎస్), కస్తూరి (ఎన్ఏఎస్ఆర్) ద్వితీయ, తృతీయ స్థానాల్ని సంపాదించుకున్నారు. ఇతర విభాగాల్లో విజేతల వివరాలు సీనియర్ బాలికలు జావెలిన్ త్రో: 1. శ్రీవియా గణపతి (సెయింట్ జోసెఫ్ హైస్కూల్), 2. ఎన్. నవ్యశ్రీ (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్), 3. సుష్మా (జాన్సన్ గ్రామర్ స్కూల్). వాకింగ్: 1. వర్ష చౌదరీ (షేర్వుడ్ పబ్లిక్ స్కూల్), 2. సాక్షి జైన్ (సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్), 3.ముస్కాన్ (ఎన్ఏఎస్ఆర్). హైజంప్: 1. ఇషిత (ఎన్ఏఎస్ఆర్), 2. టి. ప్రవళిక (జాన్సన్ గ్రామర్ స్కూల్), 3. దివ్య (హెచ్‌పీఎస్). 200మీ. పరుగు: 1. జి. నిత్య (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 2. విన్నీ (సెరుుంట్ ఆన్స హైస్కూల్). 3. ఆత్రేయ చక్రవర్తి (గీతాంజలి) డిస్కస్ త్రో: 1. రియా (టింపనీ స్కూల్), 2. శ్రీవియా (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 3. క్రిసాల్డా (సెయింట్ ట్ ఆన్స్ స్కూల్). సీనియర్ బాలురు వాకింగ్: 1. రోషన్ (షేర్వుడ్ పబ్లిక్ స్కూల్), 2. జై (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్), 3. వర్ధన్ (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్). 1500మీ: 1. పవన్ తేజ (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 2. సాయి చంద్ర (జాన్సన్ గ్రామర్ స్కూల్), 3. అనిల్ (ఫ్యూచర్కిడ్స స్కూల్). 200మీ: 1. రూపేశ్ (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్), 2. మనీశ్ (సెయింట్ ట్ జార్జ్ స్కూల్), 3. దివాకర్ (హెచ్‌పీఎస్). జూనియర్ బాలికలు హైజంప్: 1. జి. దివ్య (సెయింట్ ఆన్స్), 2. విజయవాంగి (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 3. కీర్తన (రమాదేవి పబ్లిక్ స్కూల్). 200మీ. : 1. నిఖితా రెడ్డి (శ్రీసాయి పబ్లిక్ స్కూల్), 2. శ్రీలక్ష్మీ (శ్రీ సాయి పబ్లిక్ స్కూల్), 3. సి. లక్ష్య (సెయింట్ జోసెఫ్ స్కూల్). జావెలిన్ త్రో: 1. జి. గీతాంజలి (శ్రీసాయి పబ్లిక్ స్కూల్), 2. నందిని (సుజాత స్కూల్), 3. అనన్య (సుజాత స్కూల్). 3కి.మీ వాక్: 1. నవ్యశ్రీ (ఈఎస్ఆర్హెచ్ఎస్), 2. శ్రీవాసవి (శ్రీసాయి పబ్లిక్ స్కూల్), 3. వైష్ణవి (షేర్వుడ్ పబ్లిక్ స్కూల్). -
లాన్ టెన్నిస్ విజేతలు కార్తీక్, కృష్ణసాయి
హైదరాబాద్: స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి లాన్ టెన్నిస్ టోర్నమెంట్లో కార్తీక్, కృష్ణసాయి విజేతలుగా నిలిచారు. సరూర్‌నగర్ స్టేడియంలో ఆదివారం జరిగిన అండర్-14 బాలుర ఫైనల్స్‌లో కార్తీక్ (సిటీ మోడల్ హైస్కూల్ ) 6-4తో కౌశిక్ కుమార్ (డీఏవీ పబ్లిక్ స్కూల్)పై గెలుపొందాడు. అండర్-17 బాలుర ఫైనల్లో కృష్ణసాయి (భవన్స్ సైనిక్‌పురి) 6-2 తో జయంత్ (సెయింట్ పీటర్స్, నాచారం)పై విజయం సాధించాడు. అండర్-14 బాలుర సెమీఫైనల్స్ ఫలితాలు: కార్తీక్ (సిటీ మోడల్ హైస్కూల్) 5-1తో వర్షిత్ కుమార్ (సెయింట్ జాన్స్ హైస్కూల్)పై, కౌశిక్ కుమార్ (డీఏవీ పబ్లిక్ స్కూల్) 5-0తో శ్రీశరణ్ (డీఏవీ పబ్లిక్ స్కూల్)పై గెలుపొందారు. అండర్ -17 బాలుర సెమీఫైనల్స్ ఫలితాలు: జయంత్ (సెయింట్ పీటర్స్ స్కూల్) 5-1తో హరి హశ్వంత్ (శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్)పై, కృష్ణసాయి (భవన్స్ స్కూల్) 5-0తో యువరాజ్ (శ్రీచైతన్య టెక్నో స్కూల్)పై విజయం సాధించారు. -
ప్రేమ పేరుతో విద్యార్థిని నమ్మించి...
అనంతపురం : అనంతపురం నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థిని నమ్మించి... వంచించిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన కార్తీక్ అనే యువకుడు ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. ఆ క్రమంలో ఆమెకు తెలియకుండా సెల్ ఫోన్‌తో నగ్నంగా ఫొటోలు తీసి వాటిని తన స్నేహితుడు అమర్నాథ్కి చూపించాడు. ఆ క్రమంలో ఇద్దరు కలసి సదరు యువతిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. గత కొంత కాలంగా ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం సాగిస్తున్నారు. వాళ్ల వేధింపులు తాళలేక సదరు విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
పోటీలో కార్తిక్ పార్టీ
టీనగర్ : కార్తిక్ ఆధ్వర్యంలోని విడియల్ కూట్టని తమిళనాడు, పుదుచ్చేరిలలో పోటీ చేసేందుకు నిర్ణయించింది. నటుడు కార్తిక్ ఉసిలంపట్టి లేదా కోవిల్పట్టిలో పోటీ చేయనున్నట్లు సమాచారం. నాడాలుం మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు కార్తిక్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ప్రచారంలో పాల్గొన్నారు. ఇలావుండగా ఆయన ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్ద పార్టీలతో మంతనాలు జరిపారు. అయితే పెద్ద పార్టీలతో కూటమి ఏర్పాటుకు సాధ్యం కాలేదు. దీంతో కార్తిక్ ఆరు చిన్న పార్టీలను కలుపుకుని విడియల్ కూట్టని పేరుతో కొత్త కూటమిని శుక్రవారం ఏర్పాటుచేశారు. ఈ కూటమిలో కార్తిక్ నాడాలుం మక్కల్ కట్చి, డాక్టర్ సేతురామన్ అఖిల భారత మూవేందర్ మున్నని కళగం, విద్యాధరన్ నేతృత్వంలోని లోక్‌జన్ శక్తి పార్టీ, సత్యశీలన్ ఆధ్వర్యంలోని దళిత్సేన, శక్తివేలు ఆధ్వర్యంలోని మక్కల్ మానాడు కట్చి, గోపి నారాయణన్ యాదవ్ ఆధ్వర్యంలోని తమిళగ మక్కల్ కట్చి చోటుచేసుకున్నాయి. మరికొన్ని చిన్న పార్టీలతో కూటమికి కార్తిక్ చర్చలు జరుపుతున్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలలో అన్ని నియోజకవర్గాల్లో విడియల్ కూట్టని ద్వారా అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించేందుకు కార్తిక్ నిర్ణయించారు. త్వరలో అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. నటుడు కార్తిక్ ఉసిలంపట్టి లేదా కోవిల్పట్టిలో పోటీ చేయనున్నట్లు సమాచారం. -
సుజనచౌదరి కుమారునిపై కేసు
హైదరాబాద్: కేంద్ర మంత్రి సుజనా చౌదరి కుమారుడు కార్తీక్ పై జుబ్లీహిల్స్ పోలీసులు రాష్ డ్రైవింగ్ చేసినందుకు కేసును నమోదు చేశారు. నిన్నరాత్రి సేఫ్ డ్రైవింగ్ లోభాగంగా ప్రత్యేక విధులు నిర్మహిస్తున్న పోలీసులు వేగంగా దూసుకొస్తున్న కారును గమనించారు. ఈ కారును జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు నుంచి కేబీఆర్ పార్కువైపు రాష్ డ్రైవింగ్ చేస్తూ కార్తీక్ పట్టుపడ్డాడు. దీంతో అతనిపై కేసును నమోదు చేసినట్టు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎన్. విద్యాసాగర్ తెలిపారు. కార్తీక్ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు సీజ్ చేశారు. కార్తీక్ ను అరెస్టు చేయలేదని, అతనికి జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తన్న మరి కొంత మందిపై సైతం కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
జబర్దస్త్ కార్తీక్
టీవీ షోలు, పదికిపైగా సినివూల్లో నటించే అవకాశం కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు పగలు కాలేజీ, రాత్రి ఈవెంట్స్ అవకాశాలను అందిపుచ్చుకొని విజయాలు సాధిస్తున్న యువతేజం రెండో తరగతిలో ఉండగా జనవరి 26 సందర్భంగా వేసుకున్న మహాత్మా గాంధీ వేషధారణ అతడిలోని నటనా పటిమకు బీజాలు వేసింది. ఎలాగైనా అత్యుత్తమ కళాకారుడిగా ఎదగాలనే సంకల్పం పాఠశాల దశలోనే ఆ కుర్రాడి మదిలో మెదిలేది. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అహర్నిశలు కష్టపడ్డాడు. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు అర్ధరాత్రి దాకా మిమిక్రీ ప్రోగ్రామ్స్ చేసేవాడు. మళ్లీ ఉదయాన్నే బీటెక్ క్లాస్‌లకు హాజరయ్యేవాడు. రూ.200 రెమ్యునరేషన్‌తో మొదలైన ఆయన కళా ప్రస్థానం ప్రస్తుతం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. సినిమాల్లోనూ నటించే అవకాశాలు వరించారుు. కృషి చేస్తే ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తున్న ఖానాపురం మండలం బుధరావుపేట యువతేజం కార్తీక్‌పై కథనమిది. - ఖానాపురం ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన ఓడపల్లి యూదగిరి, కరుణ దంపతుల కుమారుడు కార్తీక్. కార్తీక్ 2వతరగతిలో ఉండగా జనవరి 26న వుహాత్మాగాంధి వేషధారణలో చక్కటి హావభావాలతో అందరి మన్ననలు అందుకున్నాడు. అలా మొదలైన నటనా ప్రస్థానం తరగతులు పెరుగుతున్న కొద్దీ ఇనుమడిస్తూ పోరుుంది. పాఠశాల స్థారుులో హిందీ ఉపాధ్యాయుుడు రఫీ, తెలుగు ఉపాధ్యాయుుడు సురేష్ ఆయనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చేవారు. బడిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కార్తీక్‌తో మిమిక్రీ, యూంకరింగ్ చేరుుంచేవారు. ఈ అభ్యాసం హన్మకొండలోని రావుప్ప ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌లో చేరిన తర్వాత కూడా కార్తీక్‌కు ఎంతో ఉపయోగపడింది. కళాశాలలో జరిగే కార్యక్రమాల్లో తోటి విద్యార్థుల నడుమ నటనా చాతుర్యాన్ని ప్రదర్శించే అవకాశం దక్కింది. రూ.200 రెమ్యునరేషన్‌తో మొదలు అప్పటిదాకా ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్న కార్తీక్ తండ్రి యూదగిరికి పరకాలకు బదిలీ అరుుంది. ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్లిన తర్వాత, కొద్దిరోజులకు అనివార్య కారణాలతో ఉద్యోగం పోరుుంది. దీంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగారుు. అప్పుడు కార్తీక్ బీటెక్ చేస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ఉదయం కాలేజీ, రాత్రి ఈవెంట్స్‌కు వెళ్లేవారు. రెమ్యునరేషన్ రూ.200 కు మించి వచ్చేదికాదు. ఆ తర్వాత మెజీషియున్ కల్యాణ్‌తో కలిసి రాష్ట్రస్థాయి ఈవెంట్స్‌లో పాల్గొన్నారు కార్తీక్. ‘జబర్దస్త్’తో.. సినిమా చాన్స్ ‘ఈటీవీ’లో తఢాఖా కార్యక్రమం కోసం ఆడిషన్స్‌లో 400 వుంది పాల్గొనగా కేవలం 20 మందినే ఎంపికచేశారు. వారిలో కార్తీక్ కూడా ఉన్నారు. 2014 డిసెంబర్లో ఓ రోజు జబర్దస్త్‌లో పని చేస్తున్న ధన్‌రాజ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ కార్యక్రమంలో కార్తీక్ 4 ఎపిసోడ్లలో పని చేశాడు. ఆ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్‌లో ప్రకాశ్ టీంలో చేరారు. కొన్ని రోజుల తర్వాత రాకెట్ రాఘవ టీంలోకి మారారు. వుుసలవ్ము, తాగుబోతు రమేష్ క్యారెక్టర్లతో గుర్తింపు సంపాదించారు. శంకరాభరణం, ఇటీవల విడుదలైన ఎమ్మెల్యే భరత్, మరో 10 సినివూల్లో నటించే అవకాశాలు వరించారుు. బుల్లితెరపై తొలి అవకాశం బీటెక్ చివరి సంవత్సరంలో ఉండగా కార్తీక్‌కు ‘జీతెలుగు’ చానల్లో 2011 సంవత్సరంలో కామెడీ క్లబ్లో మిమిక్రీ ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించింది. అందులో 3 ఎపిసోడ్లు చేశారు. మరో 2 నెలలకే ‘వూ గోల్డ్’ చానల్లో గోల్డ్ కెఫే కార్యక్రమంలో మిమిక్రీ ప్రదర్శించారు. అనంతరం హైదరాబాద్‌లో కార్తీక్ నిర్వహించిన ఓ ఈవెంట్‌ను టీవీ-1 డెరైక్టర్ సురేష్ చూసి, 2013 దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో ప్రదర్శన ఇచ్చే అవకాశమిచ్చారు. అమ్మానాన్నల ప్రోత్సాహం మరువలేనిది పాఠశాల దశ నుంచే నాకు నటన అంటే ఇష్టం. వుంచి ఆర్టిస్టు కావాలనే లక్ష్యంతో ఎన్నో ఈవెంట్స్ నిర్వహించా. నా పురోగతి వెనుక అమ్మానాన్నల ప్రోత్సాహం ఉంది. వారి సహాయ సహకారాలు లేకుంటే ఈ స్థారుుకి వచ్చేవాడిని కాదు. ‘మంచి కళాకారుడిగా ఎదగాలి బిడ్డా’ అంటూ అమ్మానాన్న చెప్పిన మాటలే తారక మంత్రాల్లా పనిచేసి నన్ను ముందుకు నడిపారుు. -
ప్రేమించాలా... వద్దా?
కార్తీక్, శ్వేతా వర్మ జంటగా నౌషాద్ దర్శకత్వంలో జీవి. రమణ, సి.సంతోష్ కుమార్ నిర్మించిన చిత్రం ‘లవ్ చేయాలా? వద్దా?’ ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ అందరినీ అలరిస్తుంది’’ అని చెప్పారు. ‘‘వైజాగ్, పాండిచ్చేరీ, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. మ్యూజికల్‌గా కూడా ఈ చిత్రానికి మంచి పేరు వస్తుంది. ఆడియన్స్‌కు కనెక్టవుతుంది’’ అని దర్శ కుడు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గౌతం డానీ, కెమెరా: ప్రవీణ్ కె. -
ఆ ఇద్దరి ప్రేమ!
అందమైన ప్రేమకథ నేపథ్యంలో సాగే ఎంటర్టైనర్గా ఓ చిత్రం రూపొందనుంది. కార్తీక్, భాను జంటగా నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్ పాటిల్ నిర్మించనున్న చిత్రం ‘ఇద్దరి మధ్య 18’. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరా బాద్‌లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి శివరాజ్ పాటిల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ కొట్టారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా రూపొందిస్తున్నాం’’ అని అన్నారు. ‘‘నాని చెప్పిన కథ కొత్తగా ఉంది. యువతరానికి మెచ్చే సందేశాత్మక చిత్రమిది’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.ఎమ్. క్రిష్, సంగీతం: ఘంటాడి కృష్ణ. -
పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు హాజరు
రావుకుప్పం/యాదమరి(చిత్తూరు జిల్లా): పుట్టెడు దుఃఖంలోనూ పదోతరగతి పరీక్షకు హాజరై తండ్రుల ఆశయాలను నెరవేర్చారు చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు. యాదమరి మండలం వరదరాజలుపల్లెకు చెందిన సురేంద్రరెడ్డి ఆదివారం సాయంత్రం మరణించాడు. అతని కుమార్తె చేతన సోమవారం పుట్టెడు దుఃఖంతో పరీక్షకు హాజరై తండ్రి ఆశయాలను నెరవేర్చింది. అలాగే రావుకుప్పం వుండలం పల్లికుప్పం గ్రామానికి చెందిన సోమశేఖర్ కుమారుడు కార్తీక్ పదోతరగతి చదువుతున్నాడు. కార్తీక్ తండ్రి సోమవారం హఠాత్తుగా మరణించాడు. కానీ ఈ విషయాన్ని విద్యార్థికి తెలియనీయకుండా అధికారులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు జాగ్రత్త పడ్డారు. పరీక్ష రాసిన తర్వాత విషయం తెలుసుకున్న కార్తీక్ బోరున విలపించాడు. -
శ్రుతిని కలవరపెడుతున్న తోళా విజయం
తోళా చిత్ర విజయం నటి శ్రుతిహాసన్‌ను కలవరానికి గురి చేసిందా? దీనికి చిత్ర వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. అదేమిటి తోళా చిత్రం విజయవంతమైతే శ్రుతి కేమిటి చింతా అనేదేగా మీ సందేహం. ఒక్కోసారి పరిస్థితుల ప్రభావంతోనో, ఇతర కారణాల వల్లో మంచి అవకాశాలను వదులుకుని ఆ తరువాత బాధ పడడం అనేది చాలా మందికి జరుగుతుంటుంది. నటి శ్రుతిహసన్ విషయంలోనూ ఇలాంటిదే జరిగింది. నాగార్జున, కార్తీ కలసి న టించిన ద్విభాషా చిత్రం తోళా. తెలుగులో ఊపిరిగా తెరకెక్కి ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోంది. ఇందులో నాయకిగా నటించిన తమన్నా ఖాతాలో మరో విజయం నమోదైంది. దీంతో ఆమె ఆనందానికి పట్ట పగ్గాలు లేకుండా పోయింది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా,తోళా చిత్ర విజయం మాత్రం నటి శ్రుతిహాసన్‌కు మింగుడు పడడంలేదట. కారణం ఈ విజయం తనకు దక్కాల్సింది. ఎస్ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్గా ఎంపికైంది శ్రుతిహాసన్‌నే. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా పుచ్చుకున్న ఈ క్రేజీ బ్యూటీ ఆ తరువాత కాల్షీట్స్ కేటాయించకుండా చిత్ర యూనిట్‌కు సమస్యలు సృష్టించారనే ప్రచారం కూడా జరిగింది.అంతే కాదు శ్రుతిహసన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిత్ర నిర్మాతల వర్గం పోలీసుల ఫిర్యాదు వరకూ వెళ్లారు. ఈ విషయాలు పక్కన పెడితే మొత్తం మీద శ్రుతిహాసన్ ఆ చిత్రం నుంచి వైదొలగారు. ఆమె పాత్రలో నటించే అవకాశాన్ని మిల్కీబ్యూటీ తమన్న దక్కించుకుంది.ఇప్పుడు తోళా చిత్రం విజయం సాధించడం శ్రుతిహసన్‌ను కలవరపెడుతోందని పరిశ్రమ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. -
ఇంట్లో పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కార్వాన్‌పేట ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో జయశ్రీ (30), ఆమె కుమారుడు సాయి కార్తీక్ (6)కు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో జయశ్రీ భర్త కర్నూలులో ఉన్నారు. ఆయన ఎస్బీఐ ఉద్యోగి. -
ఇదో.. హారర్.. థ్రిల్లర్!
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుండటంతో ఈ తరహా చిత్రాలను క్యాష్ చేసుకునే పని మీద చాలామంది ఉన్నారు. ఈ ట్రెండ్‌ని అనుసరిస్తూ, హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శక-నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘దృశ్యకావ్యం’. శ్రీకాంత్, కామ్నా జెఠ్మలాఠిట జంటగా ‘వీడికి దూకుడె క్కువ’ చిత్రంతో నిర్మాతగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన బెల్లం రామకృష్ణారెడ్డి ఇప్పుడీ హార ర్ చిత్రంతో దర్శకునిగా మారారు. కార్తీక్, కశ్మీర జంటగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల అయింది. కథ: ఓ పాప తన తండ్రి ప్రతి రోజు రాసుకుంటున్న డైరీ చదవడంతో ప్రస్తుతంలో ఉన్న కథ ఐదేళ్ల వెనక్కి వెళుతుంది. అఖిల్ (కార్తీక్), అభినయ (కశ్మీర) ఇద్దరూ బీటెక్‌లో ఉన్నప్పుడే ప్రేమలో పడతారు. జాబ్ వచ్చాక తల్లితండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కట్ చేస్తే... అభినయ జీవితంలో పెను విషాదం. ఆమె తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తారు. అందర్నీ కోల్పోయి అనాథగా మారిన అభినయ జీవితానికి అండగా నిలుస్తాడు అఖిల్. ఈలోగా బీటెక్ పూర్తి కావడం, ఇద్దరికీ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు రావడం చకచకా జరిగిపోతాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్ సమక్షంలో ఇద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. అఖిల్, అభినయలకు మరో ఫ్రెండ్ పెళ్లిళ్ల బ్రోకర్ అయిన అన్వేష్ (మధు) అన్ని వేళలా తోడుగా నిలుస్తాడు. ఇలా కాలం వేగంగా పరుగులు తీస్తుంది. వీరిద్దరి ప్రతిరూపంగా పుట్టిన హనీతో అఖిల్, అభినయల జీవితం రంగులకలగా సాగిపోతూ ఉంటుంది. ఇంతలో ఉద్యోగార్థం యూరోప్ ట్రిప్‌కు వెళ్లడానికి అఖిల్ సిద్ధమవుతాడు. కానీ, అభినయ, హనీలకు అతను వెళ్లడం ఇష్టం ఉండదు. ఎందుకంటే రెండేళ్ల తర్వాత గానీ అఖిల్ ఇండియాకు రాడు. కూతురు హనీ భవిష్యత్తు కోసం తప్పనిసరిగా వెళ్లాల్సిందే అనుకుంటాడు అఖిల్. ఎయిర్‌పోర్ట్‌కు వెళుతుండగా కారు ప్రమాదంలో అతను చనిపోయాడని టీ వీలో బ్రేకింగ్ న్యూస్. ఈ వార్త చూసిన అన్వేష్ ఈ విషయం అభినయకు చెప్పడానికి వెళతాడు. కానీ అక్కడ ఇద్దరూ అన్వేష్‌తో ఫోన్లో మాట్లాడటం చూసి షాక్ కు గురవుతాడు. అసలు అఖిల్ నిజంగా చనిపోయాడా? లేదా అని రూఢి చేసుకోవడానికి మార్చ్యురీకి వెళతాడు. నిజమే అక్కడ ఉన్నది అఖిల్ శవమే. అతని ఐడీ కార్డ్, చొక్కా అన్వేష్‌కి ఇస్తారు మార్చ్యురీ సిబ్బంది. ఈ విషయం చెబుదామని అఖిల్ ఇంటికి వెళ్లిన అన్వేష్‌కు ఆ ఇంటి నుంచి రకరకాల శబ్దాలు, ఓ పాప అరుపులు, వినిపించడంతో అక్కడి నుంచి పారిపోతాడు. గందరగోళానికి గురైన అన్వేష్ తర్వాత రోజు మార్చ్యురీకి వెళితే అఖిల్ శవం ఉండదు. అఖిల్ చనిపోయాడా? లేదా? అనేది మిగతా కథ. ‘ప్రాణం’, ‘వాన’ చిత్రాల ద్వారా సంగీతదర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘ప్రాణం’ కమలా కర్ స్వరపరచిన పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. ‘ఏ కలలో...’ పాట బాగుంది. సంతోష్ కెమెరా పనిత నం కనిపిస్తుంది. -
ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
అనంతపురం జిల్లా కదిరి శివారులో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఐదు ఎర్రచందనం దుంగలను, మూడు మోటార్‌సైకిళ్లు, రెండు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నారాయణ, అమరేందర్‌రెడ్డి, చిన్నయ్య, శంకరప్ప, వెంకటరమణ, కార్తీక్‌లను అరెస్ట్ చేసి అర్బన్ స్టేషన్‌కు తరలించారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని చిన్నారి మృతి
నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందాడు. శ్రీధర్ అనే వ్యక్తి భార్యా, ఇద్దరు పిల్లలతో కలసి బైక్‌పై వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కార్తీక్ (4) అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం నెల్లూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'నా భార్యను రక్షించిన వాయుసేనకు వందనం'
చెన్నై: ఆమె పేరు దీప్తి(28). తొమ్మిది నెలల గర్భిణీ. మరో వారం రోజుల్లోనో అంతకంటే ముందుగానో తల్లిగా మారబోతున్నాని ఆనందం.. ఇంతలో అకాల వర్షాలు.. ఇళ్లు మునిగిపోయేలా వచ్చిన వరదలు.. తల్లిగా మారబోతున్న ఆమహిళ మనసులో ప్రశాంతత దూరమై ఆందోళన అలుముకుంది. ఎందుకంటే అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి.. సర్వత్రా జలమయం. సాయం చేసేందుకు ఎవరూ రాలేని పరిస్థితి. వైద్యం కూడా అందుతుందో లేదో అని అనుమానం. ఈ సమాచారం తెలుసుకున్న భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ రానే వచ్చింది. ఆమెకు దన్నుగా నిలిచింది. ఇంటిపై భాగంలో తన రెక్కలు రెపరెపలాడిస్తూ తన ఒడిలో కూర్చోబెట్టుకుని సురక్షితంగా ఆస్పత్రికి చేర్చింది. డిసెంబర్ 2న ఈ దృశ్యం ఆవిష్కృతంగా కాగా ఇప్పుడు ఆమె పండంటి ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. తల్లి దీప్తితో సహా ఇద్దరు పిల్లలు చక్కటి ఆరోగ్యంతో ఉన్నారు. ఈ సందర్బంగా ఆమె భర్త కార్తిక్ వెల్చామీ తాను పడిన ఆందోళన, భయాన్ని మీడియాతో పంచుకున్నాడు. చెన్నైకి సమీపంలోని వర్ష ప్రభావానికి గురైన గిండీకి సమీపంలోని రామపురం ప్రాంతం తమదని, నిండు గర్భవతి అయిన తన భార్యను ఏ విధంగా రక్షించుకోవాలా అని ఎంతో భయానికి లోనయ్యానని, ఆ సమయంలో తాను బెంగళూరులో ఉన్నానని, డిసెంబర్ 2న ఆమెను హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా ఆస్పత్రికి తరలించడంతో డిసెంబర్ 4న ప్రసవించిందని చెప్పాడు. ఈ సందర్భంగా ఎంతో భావోద్వేగానికి లోనవుతూ భారత వాయు సేనకు కార్తిక్ ధన్యవాదాలు తెలిపాడు. తమను ఎవరూ కాపాడలేరనుకున్న సమయంలోనే వాయుసేన రక్షించిందని చెప్పారు. -
సెప్టెంబర్ 13న పుట్టిన రోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: కార్తీక్ (నటుడు), మహిమా చౌదరి (నటి) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది గురుసంఖ్య కాబట్టి వీరు ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. సద్గురువులు, సజ్జనుల సాంగత్యం ఏర్పడటం వల్ల ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. పుట్టిన తేదీ 13. ఇది రాహు సంఖ్య. ఇది సూర్య, గురుల కలయి కతో ఏర్పడటం వల్ల రాజయోగాన్నిస్తుంది. అయితే ఈ యోగం జీవితం ప్రథమార్ధంలో కొంత కష్టాలను ఇచ్చి 35 సంవత్సరాల తరవాత నుంచి మంచి అభివృద్ధి, పేరు ప్రఖ్యాతులు, స్థిరాస్తులు ఇస్తుంది. కంప్యూటర్ రంగంలోని వారికి, ఎం.బి.ఎ; సి.ఎ; ఎల్.ఎల్.బి చదివిన వారికి మంచి అవకాశాలు వస్తాయి. పోటీపరీక్షల్లో విజయం. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి బాగా కలిసి వస్తుంది. సొంత ఇంటికల నెరవేరుతుంది. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. లక్కీ నంబర్స్: 3,4,5, 6; లక్కీ కలర్స్: వయోలెట్, క్రీమ్, గోల్డెన్, రెడ్, శాండల్; లక్కీ డేస్: బుధ, శుక్ర, శని, సోమవారాలు. సూచనలు: అహంకారాన్ని తగ్గించుకోవడం, గురువులను, మతపెద్దలను, పండితులను గౌరవించడం, దుర్గాదేవిని ఆరాధించడం, దక్షిణామూర్తిని అభిషేకించడం, పేదవితంతువులకు సాయం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
రొమాంటిక్ కొరియర్ బోయ్
ప్రేమకథలైనా, యాక్షన్ కథలైనా తన దైన శైలిలో డీల్ చేస్తూ తమిళ, తెలుగు భాషల్లో అభిమానులను సంపాదించుకున్న దర్శకుడు గౌతమ్ మీనన్. నిర్మాతగా కూడా ఆయనది ప్రత్యేకమైన శైలి. నితిన్‌తో ఆయన ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ చిత్రాన్ని నిర్మించారు. నితిన్, యామీ గౌతమ్ జంటగా గురు ఫిలింస్ పతాకంపై మల్టీడెమైన్షన్ భాగస్వామ్యంతో నిర్మించిన ఈ చిత్రానికి ప్రేమ్ సాయి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం పాటల వేడుక ఈ నెల 23న జరగనుంది. గౌతమ్ మీనన్ మాట్లాడుతూ -‘‘కొరియర్‌బాయ్‌గా పనిచేసే ఓ యువకుని జీవితంలో జరిగిన సంఘటనలే ఈ చిత్రం.రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సత్య పోన్మార్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్. -
ప్రేమకు మరణం లేదు!
స్వచ్ఛమైన ప్రేమకు మరణం లేదనే కథాంశంతో సువర్ణ సమర్పణలో పవన్‌కుమార్ గౌడ్ నిర్మించిన చిత్రం ‘కోమలి’. నూతన దర్శకుడు స్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా సవీన్ రాయ్, సాకేత్, కార్తీక్, సాయి క్రిష్ణ, కాజల్, సంజన, కవిత హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ -‘‘స్వచ్ఛమైన ప్రేమ గెలవడం ఖాయమని చెప్పే చిత్రం ఇది. అంతర్లీనంగా మంచి సందేశం ఉంది. నిజామాబాద్ టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కమలాకర్ రావు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయడం విశేషం. నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో పాటలు విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కబీర్ రఫీ, రచన: సురేష్ జై, ఎడిటింగ్: యాదగిరి. -
త్వరలో డెరైక్షన్ చేస్తా!
‘‘ ‘పాండవుల్లో ఒకడు’ మాతృక ‘కప్పల్’ను వాస్తవానికి తమిళంలో వేరే నిర్మాత తీశారు. దిగ్దర్శకుడు శంకర్ కు ఈ సినిమా బాగా నచ్చి, తమిళంలో ఆయనే విడుదల చేశారు’’ అని నటుడు వైభవ్ తెలిపారు. ఆయన హీరోగా కార్తీక్ జి. క్రిష్ దర్శక త్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కప్పల్’ను దర్శకుడు మారుతి తెలుగులో ‘పాండవుల్లో ఒకడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ నెల 24న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా వైభవ్ మాట్లాడుతూ- ‘‘పెళ్లయితే స్నేహం చెడి పోతుందన్న ఉద్దేశంతో ఓ అయిదుగురు యువకులు అమ్మాయిలకు దూరంగా ఉంటారు. కానీ అను కోని పరిస్థితుల్లో వాసు అనే యువకుడు ప్రేమలో పడతాడు. వాసు ప్రేమను చెడగొట్ట డానికి వాళ్లు ఎలాంటి ప్లాన్లు వేస్తారు? మరి.. వాసూకి పెళ్లవుతుందా? అనే కథాంశంతో హాస్యభరితంగా ఈ చిత్రం సాగుతుంది. ఇందులో వాసుగా నటించాను. సోనమ్ బజ్వా నాయిక. నటరాజన్ శంకరన్ పాటలు హైలైట్’’ అని చెప్పారు. కాగా, గతంలో ‘అమ్మా నాన్న తమిళ అమ్మాయి’, ‘శివమణి’కి దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవమున్న వైభవ్ త్వర లోనే డెరైక్ష న్ చేయాలనే ఆలోచన ఉందన్నారు. -
అమ్మాయి మాయ!
ఆ కుర్రాడిని ఓ అమ్మాయి మాయ చేసింది. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘అందమైన మాయ’. కార్తీక్, భవశ్రీ జంటగా నాగరాజు కొట్టే నిర్మించిన ఈ చిత్రానికి మణీంద్రన్ దర్శకుడు. ఈ సినిమా పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ‘మా’ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. ఈ చిత్రం విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నోముల నర్శింహయ్య, చిన శ్రీశైలం యాదవ్, కొట్టే బాలయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్తీక్ weds సందీప్!
కాలిఫోర్నియాలో పెళ్లాడిన భారతీయ అమెరికన్ గేలు బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా వేడుక సీన్ అర్థమైపోయింది కదా. ఇద్దరు అబ్బాయిల వింత పెళ్లి. వరూవరుళ్లు సందీప్, కార్తీక్. భారతీయ అమెరికన్లయిన వీరు స్వలింగ సంపర్కులు. అమెరికాలో గే పెళ్లిళ్లు కొత్తేం కాదుకదా అని తీసిపారేయకండి. వీరిది ఆషామాషీ పెళ్లికాదు. బోలెడంత ప్రత్యేకత ఉంది. తిరువనంతపురంలో పుట్టి అమెరికాలో సెటిలై న సందీప్‌కు అమెరికాలో పుట్టిన కార్తీక్‌తో 2012లో ఓ డేటింగ్ వెబ్సైట్లో పరిచయమైంది. ప్రేమపక్షులు ఒకరికొకరు తెగ నచ్చేశారు. పరిచయం ముదిరి ప్రేమగా మారింది. పెళ్లిబంధంతో ఒకటి కావాలనుకున్నారు. 2013లో తమ తల్లిదండ్రులకు సంగతి చెప్పి అనుమతి కోరారు. తల్లిదండ్రులు తొలుత షాక్ తిన్నా తర్వాత విశాల హృదయంతో ఒప్పేసుకున్నారు. ఇంకేం అబ్బాయిలు ఎగిరి గంతేశారు. పెళ్లిని అంగరంగవైభోగంగా, అగ్నిసాక్షిగా పక్కా మలయాళీ సంప్రదాయం ప్రకారం జరుపుకోవాలనుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. తర్వాత పెళ్లి ఏర్పాట్లు మొదలెట్టారు. సిగ్గుపడకుండా బంధుమిత్రుల ఇళ్లకెళ్లి ‘మా పెళ్లికి సకుటుంబసమేతంగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి’ అంటూ ఆహ్వాన పత్రికలు పంచారు. ఈ ఏడాది జనవరి 18న శుభముహూర్తంలో కాలిఫోర్నియాలో పెళ్లిపీటలెక్కారు. పురోహితుడు వేదమంత్రాలు పఠిస్తుండగా, బంధుమిత్రులు అక్షింతలు చల్లుతుండగా కార్తీక్.. సందీప్ మెడలో తాళి కట్టాడు. తర్వాత అగ్నిగుండం చుట్టూ ఏడడుగులు నడిచారు. వరుడు తన అర్ధాంగుడి చేయిపట్టుకుని అరుంధతీ నక్షత్రం చూపించాడు. ఆహూతులు కొత్తజంటకు కానుకలు సమర్పించి ఎవరికి తోచినట్లు వారు ఆశీర్వదించారు. కొబ్బరి దండిగా చేర్చి వండిన కమ్మని కేరళ వంటకాలతో ఆహూతులు భోంచేశారు. వీరి పెళ్లి సంగతి ఇటీవల సోషల్ మీడియాలో బయటకొచ్చి, గేలకు నూతనోత్తేజం ఇస్తోంది. -
కో సీక్వెల్‌కు సిద్ధం
కో చిత్ర కొనసాగింపునకు కథ సిద్ధం అయ్యిందంటున్నారు నిర్మాత ఎల్ రెడ్ కుమార్. జీవా, కార్తీక్ జంటగా నటించిన చిత్రం కో. విశేష ప్రజాదరణ పొందిన ఆ చిత్రాన్ని ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై ఎల్ రెడ్ కుమార్ నిర్మించారు. గత చిత్రాల పునర్ నిర్మాణాలకు కొనసాగింపు నిర్మాణాలకు ఆసక్తి, ఆదరణ పెరుగుతుండడంతో కో-2కు రెడీ అవుతున్నట్లు నిర్మాత ఎల్ రెడ్ కుమార్ తెలిపారు. ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కో చిత్రానికి సీక్వెల్ తీయాలని చాలా కాలంగా అనుకుంటున్నానన్నారు. ఒక చిత్రాన్ని సీక్వెల్ అంటే ముందు చిత్రానికి పని చేసిన నటీనటులు, సాంకేతిక వర్గం పని చేయాలని ఏమీ లేదన్నారు. దర్శకులు విష్ణువర్ధన్, చక్రితోలేటి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన శరత్ చెప్పిన కథ నచ్చడంతో దాన్ని కో-2గా నిర్మించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ఇటీవల సహాయ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్న బాబిసింహా హీరోగాను, నటి నిక్కి గల్రాణి హీరోయిన్‌గాను నటించనున్న ఈ చిత్రంలో నటుడు ప్రకాష్‌రాజ్ ముఖ్యపాత్ర పోషించనున్నట్లు వెల్లడించారు. కో చిత్రం మాదిరిగానే ఈ సీక్వెల్ కథ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని ఆశాభావాన్ని నిర్మాత వ్యక్తం చేశారు. చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. -
పుట్టెడు దుఃఖంలోనూ మొక్కవోని దీక్ష
తండ్రి మరణవార్తను దిగమింగి పరీక్ష రాసిన విద్యార్థి చౌడేపల్లె: తండ్రి మరణవార్త విని పుట్టెడు దుఃఖంలోనూ పదోతరగతి పరీక్షకు హాజరయ్యాడు చౌడేపల్లె మండలానికి చెందిన ఓ విద్యార్థి. చౌడేపల్లె మండలం చారాల గ్రామానికి చెందిన బి.నరసింహారెడ్డి(49) బుధవారం మృతిచెందాడు. ఆయన కుమారుడు కార్తీక్ దుఃఖాన్ని దిగమింగుకుని బుధవారం పరీక్షకు హాజరయ్యాడు. గైర్హాజరైతే ఒక యేడాది వృధా అవుతోందని పరీక్ష రాసిన అనంతరం తండ్రి అంత్యక్రియలను పూర్తిచేశారు. వడదెబ్బతో తండ్రి మృతి కార్తీక్ తండ్రి నరసింహారెడ్డి కూలి పనులు చేసుకుని జీవించేవాడు. వారం క్రితం వడదెబ్బ తగలడంతో విరేచనాలు అయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అతను కోలుకోవడంతో ఇంటికి తీసుకొచ్చారు. బుధవారం మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. -
కార్తీక్ పెద్ద హీరో అవుతాడు
‘‘పంపిణీదారునిగా ‘వైజాగ్’ రాజుకి మంచి పేరుంది. కార్తీక్ రాజు హీరోగా, సంగీతంలో రారాజైన మణిశర్మ స్వరసారథ్యంలో వైజాగ్ రాజు తీసిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. పలు విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన డీవీ సీతారామరాజు (వైజాగ్ రాజు) తన కుమారుడు సత్య కార్తీక్ రాజుని హీరోగా పరిచయం చేస్తూ, నిర్మించిన చిత్రం ‘టిప్పు’. జగదీష్ దానేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్న పాత్రుడు సీడీని ఆవిష్కరించి రాఘవేంద్రరావుకి ఇచ్చారు. పచార చిత్రాలూ, పాటలు బాగున్నాయనీ కార్తీక్ మంచి హీరోగా నిలదొక్కుకోవాలని అయ్యన్న పాత్రుడు అన్నారు. కార్తీక్ నటించిన కొన్ని సీన్స్‌ని ఓ ప్రముఖ దర్శకుడు చూసి, మంచి భవిష్యత్తు ఉందని అభినందించారని వైజాగ్ సత్యానంద్ చెప్పారు. కేయస్ రామారావు మాట్లాడుతూ -‘‘వైజాగ్ రాజుతో నాది 40 ఏళ్ల స్నేహం. ఆయనో సినిమా పంపిణీ చేస్తే, కచ్చితంగా హిట్ అనే సెంటిమెంట్ ఉండేది. ఈ చిత్రంతో ఆయన తనయుడు పెద్ద హీరోగా నిలబడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత చెప్పారు. ఈ వేడుకలో టి. సుబ్బిరామిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ్, బి. గోపాల్, ఆర్. నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
'మిస్ లీలావతి' స్టిల్స్
-
ప్రణయం ప్రళయమైతే...
ఎన్నో యుద్ధాలు, ప్రళయాలు మనిషి వల్లే ఇప్పటిదాకా సంభవించాయి. స్త్రీ, పురుష సంబంధాలకు ఇదే వర్తిస్తుందన్న కథాంశంతో హుద్‌హుద్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మిస్ లీలావతి’. కార్తీక్, లీలావతి, మహేశ్ ముఖ్యతారలుగా శ్రావ్య ఫిలింస్ పతాక ంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన ఈ చిత్రానికి పి. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ -‘‘సెన్సార్ పూర్తయింది. ప్రేమకథ నేపథ్యంలో సాగే ఈ చిత్రం మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి. బాపిరాజు, సహనిర్మాతలు: కుర్రా విజయ్‌కుమార్, శాంతయ్య. -
అమరన్ సీక్వెల్‌కు సిద్ధం
అమరన్ చిత్ర సీక్వెల్ నటుడు కార్తీక్ సిద్ధమవుతున్నారు. 90స్లో ప్రముఖ నటుడుగా వెలుగొంది న నటుల్లో కార్తీక్ ఒకరు. నటుడిగా మంచి ఫామ్ లో ఉండగానే రాజకీయరంగ ప్రవేశంచేసి సొంతంగా పార్టీని కూడా నెలకొల్పారు. ఆ తరువా త ఆ పార్టీని రద్దుచేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కాగా అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తున్న కార్తీక్ ఇటీవల కేవీ.ఆనంద్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన అనేగన్ చిత్రంలో ముఖ్య భూమికను పోషించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో కార్తీక్‌కు పలు అ వకాశాలు రావడం మొద లెట్టాయి. కాగా ఈయన 1992లో సొంతంగా నిర్మించి హీరోగా నటించిన అమరన్ చిత్రం సీక్వెల్‌ను రూపొందించాలనే నిర్ణయానికి వచ్చారు. ఒక పక్క కార్తీక్ కొడుకు గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తుంటే ఇప్పుడు ఈయన కూడా కథా నాయకుడిగా నటించడానికి తయారవ్వడం విశే షం. అమరన్ యాక్షన్ అంశాలతో కూడిన కమర్షియల్ చిత్రం ఈ చిత్రానికి రాజేశ్వర్ దర్శకుడు. ఇప్పుడు సీక్వెల్‌కు ఆయన దర్శకత్వం వహించనున్నారట. దీని గురించి కార్తీక్ తెలుపుతూ ఆ మధ్య చిత్రాన్ని రాజేశ్వర్ చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఆయన తనకుమంచి మిత్రుడు అని అన్నారు. ఇదయ తామరై చిత్రానికి ఆయన దర్శకుడు. మళ్లీ ఇన్నాల్టికి కలసి పనిచేయబోవడం సంతోషంగా ఉంది అని అన్నారు. త్వరలోనే దర్శకుడు రాజేశ్వరన్‌ను కలిసి అమరన్-2 చిత్రం గురించి చర్చించనున్నట్లు కార్తీక్ వెల్లడించారు. -
లేడీ దేవదాస్...!
ప్రేమలో విఫలమైన అబ్బాయిలను దేవదాస్‌తో పోల్చడం కామన్. కానీ, ఇప్పుడు ఓ అమ్మాయి దేవదాస్ అయితే ఎలా ఉంటుంది? అనే కథతో డి. రామకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘అమ్మాయి దేవదాస్ అయితే’. కార్తీక్, వృషాలి గోసావి జంటగా బి. శ్రీనివాస్ రెడ్డి, కె. కిశోర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారి అద్భుతమైన నటనతో రూపొందిన ‘దేవదాస్’ ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. మా లేడీ దేవదాస్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఇందులో మంచి పాత్ర చేశానని కార్తీక్ అన్నారు. -
అనుబంధం...అనురాగం!
తల్లీ కొడుకుల అనుబంధాన్నీ, ప్రేయసీ ప్రియుల అనురాగాన్నీ ఆవిష్కరిస్తూ రూపొందుతోన్న చిత్రం ‘మొహబ్బత్ మే’. కార్తీక్, హమీదా జంటగా మహేశ్ సూర్య దర్శకత్వంలో రమా రవిశంకర్ నిర్మిస్తోన్న ఈ హిందీ టైటిల్ తెలుగు సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెలలో పాటలను, వచ్చే నెల 14న చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇందులో అమ్మ పాట హైలైట్ అని సంగీత దర్శకుడు మీనాక్షీ భుజంగ్ చెప్పారు. కార్తీక్, అనిత తదితరులు సినిమా బాగా వచ్చిందని అన్నారు. -
సర్ప్రైజింగ్ స్టోరీ
మరో ఛాయాగ్రాహకుడు మెగాఫోన్ పట్టారు. ‘కార్తికేయ’ చిత్రానికి ఛాయాగ్రహణం సమకూర్చిన కార్తీక్ ఘట్టమనేనిని దర్శకునిగా పరిచయం చేస్తూ నిఖిల్ హీరోగా ‘సూర్య వర్సెస్ సూర్య’ రూపొందుతోంది. బేబీ త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. స్వామి రారా, కార్తికేయ చిత్రాల తరహాలో విభిన్నమైన ఇతివృత్తంతో వినోదాత్మకంగా ఈ సినిమా రూపొందుతోందని నిర్మాత తెలిపారు. ఇందులో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని దర్శకుడు చెప్పారు. త్రిదా చౌదరి నాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: సత్యమహవీర్, మాటలు: చందు మొండేటి -
పాఠశాల సెలవు...ఓ బాలుడి ప్రాణం తీసింది
పెనుమూరు : ఆ అబ్బాయికి పాఠశాల అంటే ఎంతో ఇష్టం. రోజూ క్రమం తప్పకుండా బడికి వెళ్లేవాడు. టీచర్లతో ఎంతో అన్యోన్యంగా మెలిగేవాడు. అతడంటే టీచర్లకు ఎంతో ఇష్టం. తల్లిదండ్రులు లేక లేక కలిగిన ఆ అబ్బాయిని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయి తే రెండవ శనివారం వచ్చిన పాఠశాల సెలవు అతని ప్రాణం తీసింది. ఈ సంఘటన పెనుమూరు మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, స్నేహితులతో కలిసి గుడికి వెళ్లిన పద్నాలుగేళ్ల ఆ బాలుడు ట్రాక్టర్ ప్రమాదంలో ప్రాణాలొదిలాడు. ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు, పెనుమూరు ఎస్ఐ ప్రతాపరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నారుు. పెనుమూరు మండలం మోపిరెడ్డిపల్లె పంచాయతీ బాలాజీనగర్‌కు చెందిన పి.సుబ్రమణ్యానికి ఎంతో ఆలస్యంగా పెళ్లరుున 20 ఏళ్ల తర్వాత అబ్బారుు పుట్టాడు. అతనికి కార్తీక్ అనే పేరు పెట్టారు. ఒక్కడే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు. ఉగ్రాణపల్లెలో తొమ్మిదో తరగతి చదువుతున్న కార్తీక్ క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లడం, బాగా చదవుతుండడంతో టీచర్లు అభినందించేవారు. క్రమశిక్షణ, దైవభక్తి చూసి గ్రామస్తులు కూడా ప్రశంసించేవారు. ఈ నేపధ్యంలో శనివారం పాఠశాలకు సెలవు కావడంతో గ్రామానికి సమీపంలో ఉన్న కొండపై జరిగే పూజకు స్నేహితులు, గ్రామస్తులతో కలిసి ఓ ట్రాక్టర్లో కొబ్బరి మట్టలు, మామిడి తోరణాలు, అరటి చెట్లు తీసుకుని వెళ్లాడు. వాటిని ట్రాక్టర్‌పై నుంచి కిందికి దించాడు. స్వామిని దర్శించుకున్నాడు. సాయంత్రం ఆలయం వద్ద జరిగే పూజకు సామాన్లు తీసుకు రావడానికి ట్రాక్టరుపై బయలుదేరాడు. గ్రామస్తులు, స్నేహితులతో కలిసి కార్తిక్ ట్రాక్టర్ ట్రాలీలో కుర్చున్నాడు. కొండపై నుంచి ట్రాక్టర్ కిందకు దిగే సమయంలో డ్రైవర్ అదుపుచేయలేక పోయాడు. ట్రాలీలో అతనితోపాటు ఉన్న పవన్(14), రంజిత్ కుమార్(16), హేమంత్(16) ఎగిరి కిందకు దూకేశారు. కార్తీక్ భయంతో ట్రాలీలోనే కూర్చున్నాడు. ట్రాక్టర్ ట్రాలీ ఇంజిన్ నుంచి విడిపోయి బోల్తా పడింది. కార్తీక్ ట్రాలీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాలీలోనే ఉన్న మరో ముగ్గురు స్వల్పగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు సంఘటనా స్థలం చేరుకొని బోరున విలపించారు. స్వామి నీ వద్దకు భక్తితో వస్తే ప్రాణాలు తీశావా ! అంటూ తల్లిదండ్రులు కన్నీరు పెట్టారు. తల్లి అనారోగ్యంతో ఉన్నా కొండపైకి వచ్చి మృత్యువాత పడ్డ కుమారుడిని చూసి సొమ్మసిల్లి పడిపోరుుంది. పెనుమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. -
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలకు కొదవలేదు
క్లిష్టపరిస్థితుల్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన ఈవీకేఎస్ ఇళంగోవన్ ఇంటగెలిచి రచ్చగెలవాలని భావిస్తున్నారు. పార్టీని బలపరచుకున్న తరువాత ఎన్నికల బరిలో దిగేందుకు పార్టీని సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే సీనియర్ నటుడు కార్తీక్, తాను స్థాపించిన నాడాళుం మక్కల్ కట్చి పార్టీని బుధవారం కాంగ్రెస్‌లో విలీనం చేశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలకు కొదవలేదు. ప్రస్తుత టీఎన్ సీసీ అధ్యక్షుడు ఇళంగోవన్, కేంద్ర మాజీ మంత్రులు జీకే వాసన్, పీ చిదంబరం, తంగబాలు వేర్వేరు గ్రూపులుగానే వ్యవహరిస్తున్నారు. తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైన తరువాత ఆ పార్టీ అధినేత జీకే వాసన్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఈ కారణంగా మిగిలిన ముగ్గురు వర్గ నేతలు పార్టీ కార్యాలయ ముఖం చూడడం మానివేశారు. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జ్ఞానదేశికన్ సైతం జీకే వాసన్ వర్గమే. కొత్త పార్టీ పెట్టేందుకు జీకేవీ, జ్ఞానదేశికన్ కాంగ్రెస్ నుంచి వైదొలగడంతో దూరంగా ఉన్న మూడు వర్గాలు ఏకమయ్యూరుు. పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, తంగబాలు, జయంతి నటరాజన్ తదితరులు సత్యమూర్తి భవన్‌కు చేరుకుని ఇళంగోవన్‌ను అభినందించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేలను కలిగి ఉండగా, వీరిలో ఇద్దరు జీకే వాసన్‌తో వెళ్లిపోయారు. పార్టీపరమైన 58 జిల్లా అధ్యక్షుల్లో 24 మంది జిల్లా అధ్యక్షులు వాసన్ వెంట నడుస్తున్నారు. 400 మంది మాజీ ఎమ్మెల్యేల్లో 380 మంది కాంగ్రెస్‌తోనే ఉన్నారని ఇళంగోవన్ అంటున్నారు. జీకే వాసన్ పార్టీని ప్రకటించేనాటికి మరింత మంది ఆయనను వీడి సొంతగూటికి చేరుకుంటారని ఆయన నమ్మకంతో ఉన్నారు. విలీనం అఖిల భారత నాడాళుం మక్కల్ కట్చి వ్యవస్థాపక అధ్యక్షుడు, నటుడు కార్తీక్ బుధవారం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. సీనియర్ నటుడు ముత్తురామన్ తనయుడైన కార్తీక్ సీతాకోకచిలుక, అభినందన వంటి పలు తెలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. తాను స్థాపించిన పార్టీతో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసినా ఒక్కచోట గెలవలేదు. కుటుంబ సభ్యుల ఆస్తితగాదాలు, పోలీస్ కేసులతో ఇటీవల వార్తల్లో వ్యక్తిగా మారిన కార్తీక్ సుమారు 200 మంది అనుచరులతో బుధవారం సత్యమూర్తి భవన్‌కు చేరుకుని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు సూర్యమూర్తి, పీఎంకే నేత మణిరత్నం సైతం తమ అనుచరుగణంతో కాంగ్రెస్‌లో చేరారు.