![Cyient Appoints Karthik Natarajan As CEO - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/4/CYIENT-CEO.jpg.webp?itok=rwq4KzKA)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైయంట్ కొత్త సీఈవోగా కార్తీక్ నటరాజన్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, ఈడీగా ఉన్నారు. ఇప్పటివరకూ సీఈవోగా ఉన్న కృష్ణ బోదనపు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎండీగా పదోన్నతి పొందారు. ఏరోస్పేస్ తదితర విభాగాల గ్లోబల్ హెడ్ ప్రభాకర్ అట్ల.. సీఎఫ్‌వోగా నియమితులయ్యారు.
సంస్థను 2 విభాగాలుగా విడదీసే పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికను కూడా సైయంట్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. సైయంట్ డీఎల్‌ఎం(డిజైన్ లెడ్ మాన్యుఫాక్చరింగ్) వ్యాపార విభాగం పబ్లిక్ ఇష్యూకి వచ్చే దిశగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. సైయంట్ డీఎల్‌ఎంకి ఆంటోనీ మాంటల్‌బానో సీఈవోగా వ్యవహరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment