cyient
-
హైదరాబాద్‌లో సైయెంట్–అలెగ్రో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటెలిజెంట్ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్, సెన్సింగ్ సొల్యూషన్స్ సంస్థ అలెగ్రో మైక్రోసిస్టమ్స్ కలిసి హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) ఏర్పాటు చేశాయి. ఇది ప్రధానంగా ఆటోమోటివ్ పరిశ్రమకు కావాల్సిన కొత్త తరం మ్యాగ్నెటిక్ సెన్సార్లు, పవర్ సెమీకండక్టర్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది.ఇందులో పోస్ట్–సిలికాన్ వేలిడేషన్, డిజైన్ వెరిఫికేషన్ తదితర విభాగాల్లో 100 పైచిలుకు నిపుణులైన ఇంజినీర్లు ఉంటారు. ఇరు సంస్థల భాగస్వామ్యం మరింత పటిష్టమయ్యేందుకు ఇది దోహదపడగలదని సైయెంట్ ఎండీ కృష్ణ బోదనపు తెలిపారు. భారత్‌లో ఆటోమోటివ్ మార్కెట్ విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాపార అవకాశాలు గణనీయంగా ఉంటాయని అలెగ్రో మైక్రోసిస్టమ్స్ సీఈవో వినీత్ నర్గోల్వాలా పేర్కొన్నారు. -
ఎన్నికల బాండ్లు.. ఇన్ఫోసిస్ ఏ పార్టీకి విరాళం ఇచ్చిందంటే..
ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఇన్ఫ్రా, ఫార్మా కంపెనీలతోపాటు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వాటిలో ఐటీ కంపెనీలు ఉండడం విశేషం. తాజాగా ఎస్బీఐ విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాల ప్రకారం.. ఐటీ రంగంలో సియెంట్ కంపెనీ గరిష్ఠంగా రూ.10 కోట్లు విలువ చేసే బాండ్లను కొనుగోలు చేసింది. అయితే ఆ కంపెనీ ఏ పార్టీకి విరాళం ఇచ్చిందో తెలియరాలేదు. తదుపరి స్థానంలో జెన్సర్ టెక్నాలజీస్ మే 2019లో రూ.3 కోట్లు విలువచేసే వివిధ పార్టీలకు సంబంధించిన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. మూడో స్థానంలో ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ 2018 కర్ణాటక ఎన్నికల ముందు దేవెగౌడకు చెందిన జనతాదళ్(సెక్యూలర్) పార్టీకి రూ.1 కోటి విరాళం ఇచ్చినట్లు తెలిసింది. రాజకీయ పార్టీలకు కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని.. అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో ఎస్బీఐ ఇటీవల వివరాలు వెల్లడించింది. ఇదీ చదవండి: ఆఫీస్‌కు రాకపోతే పదోన్నతులుండవు.. ప్రముఖ టెక్ కంపెనీ కీలక నిర్ణయం కంపెనీల వారీగా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వివరాలు.. ఫ్యుచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ పీఆర్ రూ.1,368 కోట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ రూ.966 కోట్లు క్విక్ సప్లైచెయిన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.410 కోట్లు వేదాంత లిమిటెడ్ రూ.400 కోట్లు హల్దియా ఎనర్జీ రూ.377 కోట్లు భారతి గ్రూప్ రూ.247 కోట్లు ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.224 కోట్లు వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్సిమిషన్ కంపెనీ లిమిటెడ్ రూ.220 కోట్లు కెవెంటర్ ఫుడ్‌పార్క్ ఇన్ఫ్రా లిమిటెడ్ రూ.195 కోట్లు మదన్‌లాల్ లిమిటెడ్ రూ.185 కోట్లు -
సైయంట్ లాభం రూ.173 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో సైయంట్ లాభం 11.5 శాతం పెరిగి రూ.173 కోట్లు నమోదు చేసింది. ఎబిటా రూ.239 కోట్లు, ఎబిటా మార్జిన్ 16 శాతం నమోదైంది. ఆర్డర్ల రాక 21.9 శాతం పెరిగింది. టర్నోవర్ 8 శాతం ఎగసి రూ.1,491 కోట్లకు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే సైయంట్ షేరు ధర బీఎస్ఈలో గురువారం 1.39 శాతం క్షీణించి రూ.2,018.95 వద్ద స్థిరపడింది. -
సైయంట్ లాభం 14 శాతం జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్చి త్రైమాసికంలో సైయంట్ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం ఎగసి రూ.176 కోట్లు సాధించింది. ఎబిటా రూ.249 కోట్లు, ఎబిటా మార్జిన్ 14.2 శాతం నమోదైంది. గ్రూప్ ఆదాయం 48 శాతం అధికమై రూ.1,751 కోట్లకు చేరుకుంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నికరలాభం 8.2 శాతం పెరిగి రూ.565 కోట్లు దక్కించుకుంది. గ్రూప్ టర్నోవర్ 32.7 శాతం దూసుకెళ్లి రూ.6,016 కోట్లను తాకింది. మొత్తం డివిడెండ్ ఇప్పటి వరకు అత్యధికంగా ఒక్కో షేరుకు రూ.26కు చేరడం విశేషం. -
సైయంట్ సీఈవోగా కార్తీక్ నటరాజన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైయంట్ కొత్త సీఈవోగా కార్తీక్ నటరాజన్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, ఈడీగా ఉన్నారు. ఇప్పటివరకూ సీఈవోగా ఉన్న కృష్ణ బోదనపు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎండీగా పదోన్నతి పొందారు. ఏరోస్పేస్ తదితర విభాగాల గ్లోబల్ హెడ్ ప్రభాకర్ అట్ల.. సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. సంస్థను 2 విభాగాలుగా విడదీసే పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను కూడా సైయంట్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. సైయంట్ డీఎల్ఎం(డిజైన్ లెడ్ మాన్యుఫాక్చరింగ్) వ్యాపార విభాగం పబ్లిక్ ఇష్యూకి వచ్చే దిశగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. సైయంట్ డీఎల్ఎంకి ఆంటోనీ మాంటల్బానో సీఈవోగా వ్యవహరిస్తారు. -
ఐపీవోకు సైయంట్ డీఎల్ఎం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ తయారీ సేవల (ఈఎంఎస్) సంస్థ సైయంట్ డీఎల్ఎం పబ్లిక్ ఇష్యూకు (ఐపీవో) వస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రాస్పెక్టస్ ముసాయిదాను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసింది. దీని ప్రకారం ఐపీవో ద్వారా రూ. 740 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ నిధులను మూలధనం, రుణాల చెల్లింపు, ఇతర సంస్థల కొనుగోలు తదితర అవసరాల కోసం వినియోగించుకోనుంది. ఈ ఇష్యూలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో షేర్ల విక్రయం ఉండదు. పూర్తిగా కొత్త షేర్లను జారీ చేయనున్నారు. ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ రౌండులో రూ. 148 కోట్ల వరకు విలువ చేసే షేర్లను జారీ చేసే అవకాశం ఉంది. ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్‌కు ఇది అనుబంధ సంస్థగా ఉంది. దీనికి హైదరాబాద్, బెంగళూరు, మైసూర్లో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. చదవండి: అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. ఈసారి ఎంతమంది అంటే? -
సైయంట్ మధ్యంతర డివిడెండ్ రూ.10
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సేవల కంపెనీ సైయంట్ 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను ఒక్కో షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని బోర్డ్ నిర్ణయించింది. సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 34.8 శాతం తగ్గి రూ.79 కోట్లు నమోదు చేసింది. ఎబిటా 10.2 శాతం తగ్గి రూ.186 కోట్లు, ఎబిటా మార్జిన్ 532 బేసిస్ పాయింట్లు తగ్గి 13.4 శాతంగా ఉంది. టర్నోవర్ 25 శాతం ఎగసి రూ.1,396 కోట్లు సాధించింది. చదవండి: బ్యాంక్ కస్టమర్లకు వార్నింగ్.. ఆ యాప్‌లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్ చేసేయండి! -
బీవీఆర్ మోహన్ రెడ్డి ‘ఇంజనీర్డ్ ఇన్ ఇండియా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైయంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్ రెడ్డి రచించిన ‘ఇంజినీర్డ్ ఇన్ ఇండియా–ఫ్రమ్ డ్రీమ్స్ టు బిలియన్ డాలర్ సైయంట్’ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. ఓ వ్యాపారవేత్తగా ఎదగాలని, దేశ నిర్మాణంలో తన వంతు పాలుపంచుకోవాలని కలలుకంటూ ఐఐటీ కాన్పూర్ నుంచి 1974లో బయటకు అడుగుపెట్టిన ఓ యువకుని సాహసోపేత కథ ఇది అని పెంగ్విన్ తెలిపింది. భారత్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి ముందు అనుభవలేమి, మూలధన అవసరాలను సమకూర్చుకోవడమనే అవరోధాలను సైతం అధిగమించి మోహన్ రెడ్డి సాగించిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇది వెల్లడిస్తుందని వివరించింది. -
సైయంట్ తుది డివిడెండ్ రూ.14
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సేవల కంపెనీ సైయంట్ 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.14 తుది డివిడెండ్ ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాదితో పోలిస్తే మార్చి త్రైమాసికంలో 49% అధికమై రూ.154 కోట్లు నమోదు చేసింది. నికరలాభం మూడేళ్లలో ఇదే గరిష్టం అని కంపెనీ వెల్లడించింది. ఎబిటా రూ.171 కోట్లు, ఎబిటా మార్జిన్ 14.5 శాతంగా ఉంది. టర్నోవర్ 8 శాతం అధికమై రూ.1,181 కోట్లు సాధించింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి నికరలాభం 43 శాతం దూసుకెళ్లి రూ.522 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ 9.7 శాతం పెరిగి రూ.4,534 కోట్లు దక్కించుకుంది. చదవండి:నిధుల బాటలో ఐనాక్స్ విండ్..ఎన్ని వందల కోట్లంటే! -
సైయంట్ 5జీ నెట్వర్క్స్ సీవోఈ ఏర్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్, తయారీ, డిజిటల్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ సైయంట్ తాజాగా తమ ప్రైవేట్ 5జీ నెట్వర్క్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను (సీవోఈ) ఏర్పాటు చేసింది. దీనికి పరిశోధన భాగస్వామిగా హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ–హెచ్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని సైయంట్ కేంద్రంలో ఈ సీవోఈని ఏర్పాటు చేశారు. ప్రైవేట్ 5జీ నెట్వర్క్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేందుకు, పరీక్షించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఐఐటీ–హెచ్ అభివృద్ధి చేసిన 5జీ కోర్ ప్లాట్‌ఫామ్.. వివిధ అవసరాలకు ఏ విధంగా ఉపయోగపడగలదో ఇందులో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. అత్యాధునిక రీసెర్చ్, ఆవిష్కరణలకు పేరొందిన ఐఐటీ–హెచ్ అనుభవం .. సీవోఈకి ఎంతో ఉపయోగకరంగా ఉండగలదని సైయంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ అట్ల తెలిపారు. ఇప్పటికే వివిధ అంశాల్లో సైయంట్‌తో కలిసి పని చేస్తున్నామని, ప్రైవేట్ 5జీ సీవోఈతో ఈ బంధం మరింత బలపడగలదని ఐఐటీ–హెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి చెప్పారు. -
సైయంట్ చేతికి వర్క్‌ఫోర్స్ డెల్టా
న్యూఢిల్లీ: కన్సల్టింగ్ సంస్థ వర్క్‌ఫోర్స్ డెల్టాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయంట్ వెల్లడించింది. కంపెనీ విలువను 2.7 మిలియన్ డాలర్లుగా (రూ. 21.5 కోట్లుగా) లెక్కగట్టి ఈ డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపింది. తమ అనుబంధ సంస్థ సైయంట్ ఆస్ట్రేలియా ద్వారా వర్క్‌ఫోర్స్ డెల్టాను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. వారం రోజుల వ్యవధిలో ఈ ఒప్పందం పూర్తి కాగలదని భావిస్తున్నట్లు వివరించింది. మొబైల్ వర్క్‌ఫోర్స్ నిర్వహణకు సంబంధించి ప్రాసెస్ కన్సల్టింగ్ నుంచి సొల్యూషన్స్ అమలు దాకా సమగ్రమైన సేవలు అందించేందుకు ఈ కొనుగోలు తోడ్పడగలదని సైయంట్ ఎండీ కృష్ణ బోదనపు తెలిపారు. 2015లో ఏర్పాటైన వర్క్‌ఫోర్స్ డెల్టాలో 11 మంది కన్సల్టెంట్లు ఉన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో 2.9 మిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. -
ఆ కంపెనీలో మహిళలతో సమానంగా పురుషులకు ప్రసూతి సెలవులు
ప్రముఖ గ్లోబల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ సైయెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో మహిళలతో సమానంగా పురుషులకు 12 వారాల పాటు ప్రసూతి సెలవులు ఇస్తున్నట్లు కొత్త విధానాన్ని బుధవారం ప్రకటించింది. ఈ కొత్త విధానం కింద సైయెంట్ ఉద్యోగులు లింగ భేదంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 12 వారాల పాటు ప్రసూతి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెలవుల సమయంలో ఉద్యోగులు పూర్తి వేతనాన్ని అందుకొనున్నారు. దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పాలసీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైయెంట్ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. "సైయెంట్ సంస్థను పని చేయడానికి గొప్ప ప్రదేశంగా మార్చడానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నాము. తల్లిదండ్రులు తమ కుటుంబాలతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఈ విధానం సహాయపడుతుంది" అని సైయెంట్ ప్రెసిడెంట్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ పీఎన్ఎస్వీ నరసింహం తెలిపారు. "తల్లిదండ్రులైన వారికి కొన్ని దేశాల్లో ఇస్తున్న సెలవులు సరిపోవడం లేదని తమ దృష్టికి తీసుకొనిరావడంతో ఈ కొత్త విధానాన్ని ప్రకటించినట్లు, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఇద్దరు సమాన బాధ్యతలు పంచుకునేందుకు కొత్త విధానం తోడ్పడుతుందని" సైయెంట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కృష్ణ బోడనాపు తెలిపారు. -
సైయెంట్ జోరు- ఎల్అండ్టీ టెక్ డీలా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీలు సైయెంట్ లిమిటెడ్, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ కౌంటర్లకు ఇన్వెస్టర్ల నుంచి మిశ్రమ స్పందన ఎదురవుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో సైయెంట్ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 296 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 311 వరకూ ఎగసింది. అయితే మరోవైపు ఎల్అండ్టీ టెక్నాలజీస్ షేరు దాదాపు 4 శాతం పతనమైంది. రూ. 1390 దిగువన కదులుతోంది. తొలుత రూ. 1341 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఫలితాల వివరాలు చూద్దాం.. సైయెంట్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో సైయెంట్ నికర లాభం 80 శాతం జంప్‌చేసి రూ. 81 కోట్లను అధిగమించింది. త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 9 శాతం క్షీణించి రూ. 1089 కోట్లను తాకింది. అయితే వార్షిక ప్రాతిపదికన నికర లాభం 10 శాతం తగ్గడం గమనార్హం. ఇక పన్నుకు ముందు లాభం సైతం 26 శాతం ఎగసి రూ. 109 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. కాగా.. అంచనాలకంటే అధికంగానే క్యూ1లో 13.06 కోట్ల డాలర్ల ఆదాయాన్ని సాధించినట్లు సైయెంట్ ఎండీ, సీఈవో బి.కృష్ణ చెప్పారు. ఏరోస్పేస్ మినహా మిగిలిన విభాగాలలో పటిష్ట డిమాండ్ కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్అండ్టీ టెక్నాలజీస్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో ఎల్అండ్టీ టెక్నాలజీస్ రూ. 117 కోట్ల నికర లాభం ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికన ఇది 42 శాతం క్షీణతకాగా.. మొత్తం ఆదాయం 4 శాతం తక్కువగా రూ. 1295 కోట్లను తాకింది. డాలర్ల రూపేణా ఆదాయం 17.1 కోట్లకు చేరింది. ఇక నిర్వహణ లాభ మార్జిన్లు 12.1 శాతంగా నమోదయ్యాయి. ఈ కాలంలో టెక్సాస్ కంపెనీ ఆర్కెస్ట్రా టెక్నాలజీలో 100 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు ఎల్అండ్టీ టెక్నాలజీస్ పేర్కొంది. కోవిడ్ కారణంగా కంపెనీ పనితీరు ప్రభావితమైనట్లు తెలియజేసింది. -
నిబంధనలు సరళిస్తేనే మరిన్ని వీసాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత టెక్నాలజీ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టాలన్నా, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నా నిబంధనల సరళీకరణ కీలకమని, సులభతర వ్యాపార నిబంధనలుంటేనే స్థానిక ప్రభుత్వానికి ఆదాయంతో పాటు, ఉద్యోగాలూ వస్తాయని సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి చెప్పారు. భారతీయ టెక్నాలజీ కంపెనీలు యూఎస్‌లో బిలియన్ల డాలర్ల కొద్దీ పెట్టుబడులు పెట్టి లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాయని తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సీఈఓల సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పాల్గొన్న మోహన్ రెడ్డి.. టెక్నాలజీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ట్రంప్ ముందు ప్రస్తావించారు. ఆ వివరాలు ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘హెచ్1బీ వీసాలకు సంబంధించి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) గతేడాది నవంబర్‌లో 50:50 కంపెనీ చార్జెస్ నిబంధనలను తెచ్చింది. అంటే.. అమెరికాలోని భారతీయ కంపెనీల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులుంటే.. హెచ్1బీ వీసా కింద 4 వేల డాలర్లు, ఎల్1 కింద 4500 డాలర్ల రుసుము చెల్లించాలి. నిజానికి కొత్త హెచ్1బీ లేదా ఎల్1 వీసాల జారీలో ఈ నిబంధనలు ఓకే. కానీ రెన్యువల్ వీసాలకూ ఈ రుసుములు చెల్లించాలంటున్నారు. ఇది భారతీయ కంపెనీలకు పెనుభారమే. హెచ్1బీ ఉద్యోగుల స్థానంలో అమెరికన్స్‌కే ఉద్యోగాలిద్దామంటే.. ఉద్యోగ అనుభవం అడ్డొస్తుంది. కొత్తగా వెళ్లే కంపెనీలు కూడా 50:50 కంపెనీ చార్జీల భారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి ఉద్యోగులను తీసుకెళ్లే బదులు స్థానిక అమెరికన్స్‌కే ఉద్యోగాలిస్తున్నాయి. ఇక హెచ్1బీ వీసా వారి గ్రీన్‌కార్డ్ కోటా తొలగించటం వంటి లెజిస్లేటివ్ నిబంధనలూ ఇలాంటివే. ఈ విషయాన్ని ట్రంప్‌తో మేం ప్రస్తావించాం’’ అని మోహన్‌రెడ్డి వివరించారు. ట్రంప్ ఏం చెప్పారంటే... వచ్చే 3–6 నెలల్లో అమెరికాలోని భారతీయ టెక్నాలజీ కంపెనీలకు సంబంధించి నియంత్రణలను సరళీకరిస్తామని ట్రంప్ హామీ ఇచ్చినట్లు మోహన్‌రెడ్డి వెల్లడించారు. ‘‘గతంలో ఏ ప్రభుత్వమూ చేయనివిధంగా ట్రంప్ సర్కారు గత మూ డేళ్లలో నియంత్రణల్ని సడలించినట్లు చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ నిబంధనల తొలగింపును ప్రారంభించామని, వాటిని నోటిఫై చేయాల్సి ఉందని చెప్పారాయన’’ అని మోహన్‌రెడ్డి వివరించారు. -
ఇది ఆరంభం మాత్రమే
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ ఐటీరంగం విస్తరణలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారుతోంది. వరంగల్‌లో టెక్ మహీంద్రా, సైయంట్ ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇది ఆరంభం మాత్రమే. ఈ రెండు కంపెనీలు రావడంతోనే సంతృప్తి చెందట్లేదు. హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం వరంగల్. ఇంకా చాలా కంపెనీలు రావాలి. వేలాది మందికి ఉద్యోగాలు లభించాలి. వరంగల్‌కు తొలుత ఒక్క సైయంట్ కంపెనీ వచ్చింది. ఆ తర్వాత టెక్ మహీంద్రా వచ్చింది. ఒక దాని తర్వాత మరో కంపెనీ వస్తుంది. హైదరాబాద్, వరంగల్ కాదు.. కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మంతో పాటు దశల వారీగా అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తాం. దీంతో స్థానిక యువతకు ఉద్యోగాలు లభించాలన్నదే సీఎం కేసీఆర్ కల. ఈ కల సాకారం కానుంది’అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని ఐటీ సెజ్‌లో ఏర్పాటు చేసిన టెక్ మహీం ద్రా, సైయంట్ ఐటీ ఇంక్యుబేషన్ సెంట ర్లను కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమ రంగంలో రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా ఉందని.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. మడికొండలోని ఐటీ సెజ్‌లో టెక్ మహీంద్రా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సీఈఓ గురునాని, మంత్రి కేటీఆర్ పారిశ్రామిక కారిడార్.. ‘రెండేళ్ల కిందట ఆనంద్ మహీంద్రా, బీవీఆర్ మోహన్‌రెడ్డిని కలిసి వరంగల్‌లో కంపెనీ పెట్టాలని కోరాం. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వారు కంపెనీలు పెట్టారు. ఐటీ తెలం గాణ జిల్లాల కు విస్తరించడం వరంగల్ నుంచి ప్రారంభమైంది. టెక్ మహీంద్రా, సైయంట్ కంపెనీ ల ఏర్పాటు ద్వారా హైదరాబాద్ కాకుండా తెలంగాణ జిల్లాల్లో శ్రీకారం జరిగింది. ఈ కంపెనీల ద్వారా వరంగల్‌లో 10 వేల మందికి ఉపాధి కల్పించాలి’అని కేటీఆర్ కోరారు. హైదరాబాద్–వరంగల్ మార్గం పారిశ్రామిక కారిడార్‌గా మారబోతోందని స్పష్టం చేశారు. ఆలేరు, భువనగిరి, జనగామ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబాబాద్‌లో ఆహారశుద్ధి ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఐటీ, వ్యాపార, పరిశ్రమల వరంగల్ ప్రాంతాలను మరింత విస్తరించేందుకు మామునూరు ఎయిర్‌పోర్టును తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేస్తామన్నారు. జీఎంఆర్ సంస్థనే ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు వివరించారు. ఈ దిశగా సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారని, సానుకూలంగా స్పందించే అవకాశముందన్నారు. అప్పటి వరకు హెలీపోర్ట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. మరో హరిత విప్లవం.. రాష్ట్రంలో త్వరలోనే రెండో హరిత విప్లవం రాబోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సాగు, తాగు నీటి విషయంలో సీఎం కేసీఆర్ విజన్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలనకు విప్లవాత్మకమైన మార్పులతో టీఎస్ ఐపాస్ ద్వారా పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నట్లు గుర్తుచేశారు. ప్రభుత్వ పథకాలు యజ్ఞంలా కొనసాగుతున్నాయని, కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కాలంతో పోటీ పడి నిర్మించుకుంటున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో 1.25 కోట్ల ఎకరాల భూమి సాగులోకి రానుందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టామని, ఇప్పటికీ 12 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చామని, తద్వారా రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 13 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పించామని వివరించారు. కొరియాకు చెందిన యంగ్టక్ కంపెనీ 8 ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని తెలిపారు. మరో 18 సంస్థలు టెక్స్టైల్స్ పార్కులో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు వస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్‌లు దాస్యం వినయ్‌భాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, సైయంట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్ నాని, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ఎంపీలు బండ ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సైయంట్ చేతికి బీఅండ్‌ఎఫ్ డిజైన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయంట్ తాజాగా అమెరికాకు చెందిన బీఅండ్‌ఎఫ్ డిజైన్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ ఎంతన్నది వెల్లడించనప్పటికీ సుమారు 5.5 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని తెలుస్తోంది. తమ అనుబంధ సంస్థ సైయంట్ డిఫెన్స్ సర్వీసెస్ ద్వారా 100 శాతం వాటాల కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని సైయంట్ తెలిపింది. రేమండ్ ఫోర్జియోన్ కుటుంబ వ్యాపారంగా 1965లో బీఅండ్‌ఎఫ్ డిజైన్‌ను ప్రారంభించినట్లు వివరించింది. తొలుత స్థానిక తయారీ కంపెనీలకు డిజైన్ సర్వీసులు అందించిన ఈ సంస్థ ఆ తర్వాత పనిముట్ల తయారీ తదితర వ్యాపారాల్లోకి కూడా విస్తరించింది. ప్రస్తుతం ఇంజిన్ అసెంబ్లీ యంత్రపరికరాల తయారీ, ఇంజిన్ ఫ్యాక్టరీ ఆధునికీకరణ సేవలు తదితర కార్యకలాపాలు సాగిస్తోంది. బీఅండ్‌ఎఫ్ డిజైన్‌లో 47 మంది ఉద్యోగులు ఉండగా, ఆదాయాలు 8–9 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. ఆరో కొనుగోలు.. ’డిజైన్–బిల్డ్–మెయింటెయిన్’ వ్యూహం కింద సైయంట్ గత మూడేళ్లుగా కొనుగోలు చేసిన సంస్థల్లో బీఅండ్‌ఎఫ్ ఆరోది అవుతుంది. ప్రస్తుతం 155 మిలియన్ డాలర్ల మేర నగదు నిల్వలు ఉన్నాయని, తమ వ్యూహానికి అనుగుణమైన సంస్థలను కొనుగోలు చేసే అవకాశాలు అన్వేషిస్తూనే ఉంటామని సైయంట్ పేర్కొంది. నిర్మాణం, నిర్వహణ సేవలను మరింతగా మెరుగుపర్చుకునే దిశగా బీఅండ్‌ఎఫ్ డిజైన్ కొనుగోలు తోడ్పడుతుందని సైయంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ విభాగం) ఆనంద్ పరమేశ్వరన్ తెలిపారు. -
‘డిఫ్ట్రానిక్స్– 2017’తో హైదరాబాద్‌కు గుర్తింపు
సైయింట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్‌రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్: రక్షణ రంగంలో ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించి ‘డిఫ్ట్రానిక్స్–2017’ పేరిట ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగనున్న సదస్సు ద్వారా హైదరాబాద్‌కు మరింత గుర్తింపు వస్తుందని సైయింట్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి చెప్పారు. శుక్రవారమిక్కడి జెనెక్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమికండక్టర్ అసొసియేషన్ (ఐఈఎస్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న డిఫ్ట్రానిక్స్–2017 సదస్సు ప్రాధాన్యాన్ని వివరించారు. రక్షణ రంగంలో ఎలక్ట్రానిక్స్ యంత్రాల తయారీకి కేంద్రం డీపీపీ–16, బై ఇండియా, ఐడీడీఎం వంటి ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఆచరణలో వృద్ధి సాధిస్తే ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. తెలంగాణ ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కరమ్‌పురి మాట్లాడుతూ డిఫ్ట్రానిక్స్–2017లో తెలంగాణ ప్రభుత్వం కంపెనీల స్థాపన కోసం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తామని చెప్పారు. -
సైయంట్ లాభం రూ.88 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్ 2017–18 ఏడాది జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 18.7% అధికమై రూ.87.8 కోట్లు నమోదు చేసింది. 2016–17 జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.74 కోట్ల నికర లాభం పొందింది. క్రితంతో పోలిస్తే టర్నోవర్ రూ.8.6% అధికమై రూ.907 కోట్లకు ఎగసింది. నిర్వహణ లాభం క్రితం ఏడాదితో పోలిస్తే 6.5% పెరిగి రూ.116 కోట్లుగా ఉంది. 2017–18లో డిజైన్ ఆధారిత తయారీ విభాగం 20% వృద్ధి నమోదు చేస్తుందని కంపెనీ భావిస్తోంది. బీఎస్ఈలో గురువారం కంపెనీ షేరు ధర 1.36% తగ్గి రూ.515.60 వద్ద స్థిరపడింది. -
సైయంట్ చేతికి సెర్టన్ సాఫ్ట్వేర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్ తాజాగా అమెరికాకు చెందిన ఇంజ నీరింగ్ సర్వీసుల కంపెనీ సెర్టన్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి 100% షేర్లను కొనుగోలు చేసేందుకు తమ అనుబంధ సంస్థ సైయంట్ ఇన్కార్పొరేటెడ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఈ డీల్ విలువ ఎంతన్నది వెల్లడించలేదు. 2006లో ప్రారంభమైన సెర్టన్లో ప్రస్తుతం 45 మంది సిబ్బంది ఉన్నారు. ఆదాయం 6 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. దాదాపు 127 మిలియన్ డాలర్ల నగదు నిల్వలు ఉన్నాయని, ఇకపై కూడా అధిక వృద్ధి సాధన దిశగా ఉపయోగపడే కంపెనీలను కొనుగోలు చేయడం కొనసాగిస్తామని సైయంట్ తెలిపింది. గడిచిన రెండున్నరేళ్లలో సైయంట్ కొనుగోలు చేసిన కంపెనీల జాబితాలో ఇది అయిదోది. ఏవియోనిక్స్ విభాగంలో వృద్ధికి ఈ కొనుగోలు తోడ్పడగలదని సైయంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ పరమేశ్వరన్ చెప్పారు. -
నాలుగు విభాగాల్లో లీడర్‌గా సైయంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయంట్.. నాలుగు వ్యాపార విభాగాల్లో ఆధిపత్య రేటింగ్ దక్కించుకుంది. అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ జిన్నోవ్ రూపొందించిన జిన్నోవ్ జోన్స్ 2016 ప్రోడక్ట్ ఇంజినీరింగ్ సర్వీసెస్ నివేదికలో సైయంట్‌కు ఈ ర్యాంకింగ్ దక్కింది. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఎనర్జీ అండ్ యుటిలిటీస్, రవాణా, కన్స్ట్రక్షన్ అండ్ మెషినరీ విభాగాల్లో సైయంట్‌ను లీడర్‌గా జిన్నోవ్ రేటింగ్ ఇచ్చింది. అలాగే మెకానికల్ ఇంజినీరింగ్ సేవల్లో కీలకమైన సంస్థగా పేర్కొంది. క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా పనిచేయడం, పదునైన కొనుగోళ్ల వ్యూహాలు మొదలైనవి ఈ ర్యాంకింగ్‌లకు దోహదపడ్డాయని సైయంట్ సీఈవో కృష్ణ బోదనపు పేర్కొన్నారు. -
సైయంట్ లాభం రూ. 97 కోట్లు
రూ. 3 మధ్యంతర డివిడెండ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 97 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ఆర్జించింది. క్రితం క్యూ2లో లాభం రూ. 99 కోట్లతో పోలిస్తే కొంత క్షీణించగా.. అయితే, సీక్వెన్షియల్ ప్రాతిపదికన మాత్రం రూ. 74 కోట్ల నుంచి దాదాపు 31 శాతం వృద్ధి కనపర్చింది. మరోవైపు ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ2లోని రూ. 772 కోట్ల నుంచి దాదాపు 18 శాతం వృద్ధితో రూ. 914 కోట్లకు పెరిగింది. విదేశీ మారక విలువ హెచ్చుతగ్గులు, రజతోత్సవ వ్యయాలు మొదలైన సవాళ్లు ఎదురైనప్పటికీ .. మెరుగ్గా ఫలితాలు సాధించగలిగినట్లు సంస్థ వెల్లడించింది. రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై కంపెనీ రూ. 3 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రజతోత్సవం సందర్భంగా ఇప్పటికే ప్రకటించిన 50 శాతం ప్రత్యేక డివిడెండ్‌కు ఇది అదనమని వివరించింది. అక్టోబర్ 25 రికార్డు తేదీ కాగా, చెల్లింపు తేది నవంబర్ 3. గత రెండో క్యూ2లో, తాజా క్యూ1లో రెండు కంపెనీల కొనుగోలు కారణంగా.. ఆర్థిక ఫలితాలు పోల్చి చూడరాదని కంపెనీ పేర్కొంది. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) క్యూ1లో 21.5 శాతం, క్యూ2లో 22.7 శాతం మేర ఊహించిన దానికన్నా అధికంగా నమోదైంది. అయితే, క్యూ4 నాటికి దీన్ని 17-18 శాతానికి తగ్గించే దిశగా పనిచేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. క్యూ2లో 23 కొత్త క్లయింట్లు.. కమ్యూనికేషన్ 24 శాతం, యుటిలిటీస్ 14 శాతం, మెడికల్ .. హెల్త్‌కేర్ విభాగం 7 శాతం మేర వృద్ధి చెందినట్లు ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ ఎండీ కృష్ణ బోదనపు తెలిపారు. గత త్రైమాసికంలో ప్రారంభించిన ప్రాగ్ ఇంజనీర్ సెంటర్ కూడా ఆదాయాల పెరుగుదలకు తోడ్పడినట్లు చెప్పారు. క్యూ2లో కొత్తగా 23 కస్టమర్లు జతయినట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం మిగతా కాలంలో సర్వీసెస్ విభాగం రెండంకెల స్థాయిలో, డీఎల్ఎం (డిజైన్ ఆధారిత తయారీ) వ్యాపార విభాగం 50 శాతం మేర వృద్ధి కనపర్చగలదని అంచనా వేస్తున్నట్లు కృష్ణ చెప్పారు. నిర్వహణ మార్జిన్లు ఒక మోస్తరు స్థాయిలో పెరిగి రెండంకెల స్థాయి వృద్ధికి దోహదపడగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో గురువారం సైయంట్ షేరు బీఎస్ఈలో 11.52% ఎగిసి రూ. 538.80 వద్ద ముగిసింది. -
నూతన ఆవిష్కరణల బ్రాండ్‌గా సైయంట్
♦ 2020 నాటికి 3 రెట్ల ఆదాయం.. ♦ 18,000లకు ఉద్యోగుల సంఖ్య ♦ సైయంట్ ఫౌండర్ మోహన్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా నూతన ఆవిష్కరణల బ్రాండ్‌గా నిలవాలని సైయంట్ లక్ష్యంగా చేసుకుంది. వచ్చే ఐదేళ్లలో డిజైన్, బిల్డ్, మెయింటెయిన్ వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్‌రెడ్డి తెలిపారు. కంపెనీ ఇటీవలే 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 1991లో జియోస్పటికల్ సర్వీసులతో ప్రారంభమై విభిన్న విభాగాలకు విస్తరించామన్నారు. 21 దేశాలు, 38 కేంద్రాలతో మొత్తం 13,200 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వివరించారు. మార్కెట్ క్యాప్ రూ.5,000 కోట్లకు ఎగసిందన్నారు. 1997లో రూ.10,000 పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్‌కు 300 రెట్ల ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. రెండేళ్లలో బిలియన్ డాలర్.. గత ఆర్థిక సంవత్సరంలో సైయంట్ రూ.3,100 కోట్ల టర్నోవర్ సాధించింది. 2020 నాటికి ఆదాయం మూడు రెట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు సైయంట్ ఎండీ కృష్ణ బోధనపు తెలిపారు. రెండేళ్లలో 1 బిలియన్ డాలర్ కంపెనీగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్, కమ్యూనికేషన్స్ రంగాలు రానున్న రోజుల్లో మెరుగ్గా ఉంటాయని అన్నారు. ఈ రంగాలపై ఫోకస్ చేస్తామని చెప్పారు. కంపెనీల కొనుగోళ్లు ఉంటాయని అన్నారు. తాము సేవలందిస్తున్న రంగాల్లోని స్టార్టప్స్‌లో పెట్టుబడి చేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల సంఖ్య వచ్చే ఐదేళ్లలో మొత్తం 18,000లు దాటొచ్చని అంచనాగా చెప్పారు. గతేడాది మాదిరిగానే ప్రస్తుత ఏడాది నియామకాలు 1,000 దాకా ఉండొచ్చని అన్నారు. -
సైయంట్ ప్రత్యేక డివిడెండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఐటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయంట్ .. సిల్వర్ జూబిలీ వేడుకల సందర్భంగా ప్రత్యేక డివిడెండు ప్రకటించింది. రూ. 5 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై రూ. 2.50 (50 శాతం) అందించనున్నట్లు వివరించింది. ప్రత్యేక డివిడెండు రూపంలో మొత్తం రూ. 34 కోట్లు చెల్లించనున్నట్లు సైయంట్ పేర్కొంది. ప్రత్యేక డివిడెండుకు రికార్డు తేది సెప్టెంబర్ 9 కాగా, చెల్లింపు తేది సెప్టెంబర్ 16. మరోవైపు, ఉద్యోగులకు రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ (ఆర్ఎస్యూ) పథకం కింద షేర్లను కేటాయించనున్నట్లు, ఆర్థికంగా దీని ప్రభావం రూ. 34 కోట్ల మేర ఉండనున్నట్లు సంస్థ తెలిపింది. -
సైయంట్ లాభం రూ. 74 కోట్లు
ఆదాయం 14% అప్.. రూ. 830 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఐటీ ఇంజినీరింగ్ సేవలు అందించే సైయంట్ (గతంలో ఇన్ఫోటెక్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 74 కోట్ల నికర లాభం ప్రకటించింది. క్రితం క్యూ1లో నమోదైన రూ. 76 కోట్లతో పోలిస్తే లాభం సుమారు 2 శాతం తగ్గింది. మరోవైపు ఆదాయం మాత్రం రూ. 726 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ. 830 కోట్లకు చేరిందని సంస్థ ఎండీ కృష్ణ బోదనపు గురువారం తెలిపారు. ఏరోస్పేస్ .. రక్షణ, రవాణా, కమ్యూనికేషన్స్ బిజినెస్ విభాగాల ఊతంతో సేవల వ్యాపార విభాగం 5 శాతం వృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. యుటిలిటీ, జియోస్పేషియల్, డిజైన్ ఆధారిత తయారీ (డీఎల్ఎం) విభాగాల మినహా మిగతా అన్ని వృద్ధి చెందినట్లు కృష్ణ తెలిపారు. వేతనాల పెంపు కారణంగా మార్జిన్లపై కొంత ప్రభావం పడి ందన్నారు. వ్యాపార స్వభావం కారణంగా డీఎల్ఎంలో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ.. ఆర్డర్లు పుష్కలంగా ఉండటం వల్ల ద్వితీయార్ధంలో ఇది పుంజుకోగలదని చెప్పారు. క్యూ2లో పటిష్టమైన పనితీరు కనపర్చగలమని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సర్వీసుల విభాగంలో రెండంకెల స్థాయి, డీఎల్ఎంలో 50 శాతం వార్షిక ఆదాయ వృద్ధి సాధించగలమని కృష్ణ ధీమా వ్యక్తం చేశారు. డాలర్ మారకంలో చూస్తే క్యూ1లో నికర లాభం 7.2 శాతం తగ్గుదలతో 11 మిలియన్ డాలర్లకు క్షీణించగా, ఆదాయం 8.7 శాతం వృద్ధితో 124 మిలియన్ డాలర్లకు చేరింది. ఏరోస్పేస్ విభాగం 5%, రవాణా 9%, మెడికల్..హెల్త్‌కేర్ 16 శాతం, కమ్యూనికేషన్ విభాగం 13 శాతం పెరిగాయి. క్యూ1లో కొత్తగా 22 క్లయింట్స్ జత కాగా, ఉద్యోగుల సంఖ్య 12,965గా ఉంది. -
29% తగ్గిన సైయంట్ లాభం
♦ నికర లాభం రూ.66 కోట్లు ♦ ఆదాయం రూ.816 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్ 2015-16 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితం ఏడాదితో పోలిస్తే 29 శాతంపైగా తగ్గింది. సమీక్ష కాలంలో నికర లాభం రూ.94 కోట్ల నుంచి రూ.66 కోట్లకు పడిపోయింది. ఈ త్రైమాసికంలో వన్ టైం పేమెంట్ కింద రూ.84.3 కోట్లు చెల్లించడం లాభం తగ్గడానికి కారణమని కంపెనీ వెల్లడించింది. ఆదాయం రూ.730 కోట్ల నుంచి రూ.816 కోట్లకు ఎగిసింది. ఇక ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.353 కోట్ల నుంచి రూ.326 కోట్లకు వచ్చి చేరింది. ఆదాయం 13 శాతం అధికమై రూ.2,736 కోట్ల నుంచి రూ.3,095 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం 6 శాతం ఎగిసి రూ.425 కోట్లను నమోదు చేసింది. నాలుగు కంపెనీల కొనుగోళ్లతోపాటు పెరిగిన డివిడెండు చెల్లింపులతో కూడా క్యాష్ బ్యాలెన్స్ అత్యధికంగా రూ.774 కోట్లు నమోదు చేసిందని కంపెనీ వెల్లడించింది. నిరాశ పర్చిన ఏడాది..: 2015-16లో కొత్తగా 91 క్లయింట్లు తోడయ్యారని కంపెనీ తెలిపింది. కంపెనీకి 2015-16 సవాల్‌తో కూడిన సంవత్సరమని సైయంట్ ఎండీ కృష్ణ బోదనపు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘కీలకమైన ఇంజనీరింగ్, డేటా నెట్వర్క్ ఆపరేషన్ విభాగాలు నిలకడగా ఉన్నాయి. ఈ విభాగాల మార్జిన్లు 100 పాయింట్లు పెరిగాయి. ఈ ఏడాది ఆదాయం అంచనాల కంటే తగ్గి నిరాశపర్చింది. 2016-17 బాగుంటుందన్న ధీమా ఉంది. కీలక విభాగాలు రెండంకెల వృద్ధి నమోదు చేస్తాయి. మార్జిన్లు 150 పాయింట్లు మెరుగవుతాయన్న అంచనాలు ఉన్నాయి’ అని చెప్పారు. బీఎస్ఈలో సైయంట్ షేరు 3.94% తగ్గి రూ.482.15 వద్ద ముగిసింది.