హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటెలిజెంట్ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్, సెన్సింగ్ సొల్యూషన్స్ సంస్థ అలెగ్రో మైక్రోసిస్టమ్స్ కలిసి హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) ఏర్పాటు చేశాయి. ఇది ప్రధానంగా ఆటోమోటివ్ పరిశ్రమకు కావాల్సిన కొత్త తరం మ్యాగ్నెటిక్ సెన్సార్లు, పవర్ సెమీకండక్టర్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది.
ఇందులో పోస్ట్–సిలికాన్ వేలిడేషన్, డిజైన్ వెరిఫికేషన్ తదితర విభాగాల్లో 100 పైచిలుకు నిపుణులైన ఇంజినీర్లు ఉంటారు. ఇరు సంస్థల భాగస్వామ్యం మరింత పటిష్టమయ్యేందుకు ఇది దోహదపడగలదని సైయెంట్ ఎండీ కృష్ణ బోదనపు తెలిపారు. భారత్‌లో ఆటోమోటివ్ మార్కెట్ విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాపార అవకాశాలు గణనీయంగా ఉంటాయని అలెగ్రో మైక్రోసిస్టమ్స్ సీఈవో వినీత్ నర్గోల్‌వాలా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment