
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం కొత్త రూ.195 డేటా-ఓన్లీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ డేటా యాడ్-ఆన్ వోచర్‌గా వస్తుంది. ఇది అదనపు డేటాతోపాటు జియోహాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ కొనుగోలు చేయకుండా జియోహాట్‌స్టార్‌లో లైవ్ క్రికెట్, ఇతర కంటెంట్‌ను వీక్షించాలనుకునే వారి కోసం ఈ ప్లాన్‌ను రూపొందించారు.
రూ.195 ప్లాన్ ప్రయోజనాలు
రూ.195 డేటా ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 15GB డేటాను అందిస్తుంది. క్రీడలు, వినోద ప్రియులకు ఇది తగిన ఎంపికగా ఉంటుంది. ఇతర ప్రామాణిక రీఛార్జ్ ప్లాన్‌ల మాదిరిగా ఈ ఆఫర్‌లో వాయిస్ లేదా ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో లభించే జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ 90 రోజుల మొబైల్ ప్లాన్ మాత్రమే. అంటే యూజర్లు జియోహాట్‌స్టార్‌ను మొబైల్‌లో మాత్రమే వీక్షించగలరు.
రీచార్జ్ ఇలా..
వినియోగదారులు ఈ ఆఫర్‌ను మైజియో (MyJio) యాప్, జియో వెబ్‌సైట్ లేదా అధీకృత జియో రిటైలర్ల ద్వారా పొందవచ్చు. రీఛార్జ్ ప్రక్రియ ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల మాదిరిగానే ఉంటుంది. థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.
మరో ప్లాన్
రూ.195 డేటా ప్లాన్‌తోపాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా వచ్చే మరో స్టాండర్డ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అదే రూ.949 ప్లాన్. దీనికి 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 2GB రోజువారీ డేటా, అపరిమిత 5G డేటా, 84 రోజుల పాటు జియో హాట్‌స్టార్ ఉచిత మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment