
యాపిల్ ఇటీవలే తన ఐఫోన్ 16ఈ లాంచ్ చేసింది. కంపెనీ ఫ్రీ ఆర్డర్స్ తీసుకోవడం శుక్రవారం (ఫిబ్రవరి 21) ప్రారంభించింది. కాగా డెలివరీలు 28 నుంచి ఉంటాయని సమాచారం. అయితే ఈ ఫోన్ కొనుగోలుపైన సంస్థ డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
'ఐఫోన్ 16ఈ'ను అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఐసీఐసీఐ బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 4000 తగ్గింపు లభిస్తుంది. ఇక ఎక్స్‌ఛేంజ్ కింద రూ. 6000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది మీరు ఎక్స్‌ఛేంజ్ చేసే మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది.
వింటర్ బ్లూ, లేక్ గ్రీన్, నలుపు, తెలుపు రంగులలో లభించే కొత్త ఐఫోన్ 16ఈ 125 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ కెపాసిటీలతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 59,900. 256GB & 512GB మోడళ్ల ధరలు వరుసగా రూ. 69,900.. రూ. 89,900గా ఉన్నాయి.
ఐఫోన్ 16ఈలో.. వినియోగదారులకు ఇష్టమైన ఐఫోన్ 16 లైనప్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇది సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్, టఫ్ బ్యాక్ గ్లాస్‌తో కూడిన 6.1 ఇంచెస్ సూపర్ రెటినా XDR డిస్‌ప్లే పొందుతుంది. సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్ అనేది.. స్మార్ట్‌ఫోన్ గ్లాస్ కంటే పటిష్టంగా ఉండే లేటెస్ట్ ఫార్ములేషన్‌ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది.
ఏ18 చిప్ ద్వారా శక్తిని పొందే.. ఐఫోన్ 16ఈ ఫోన్ ఇంటిగ్రేటెడ్ 2x టెలిఫోటో లెన్స్‌తో 48MP ఫ్యూజన్ కెమెరాను పొందుతుంది. అంతే కాకుండా ఎయిర్‌పాడ్‌లు, ఆపిల్ విజన్ ప్రో లేదా సరౌండ్ సౌండ్ సిస్టమ్‌తో ఇమ్మర్సివ్ లిజనింగ్ కోసం స్పేషియల్ ఆడియోలో వీడియోను కూడా రికార్డ్ చేస్తుంది. మొత్తం మీద ఈ లేటెస్ట్ ఫోన్ అన్ని విధాలా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.