
సాక్షి, ముంబై: ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్స్, ముచ్చటైన యాపిల్ ఐఫోన్ 12 మినీ సొంతం చేసుకోవాలనేకునే కస్టమర్లకు గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ కూడా ఉంది. అంతేకాదు ఈఎంఐ ఆప్షన్ ద్వారా రోజుకు కేవలం 73 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అదెలా అంటారా? (సల్మాన్ బ్రాండ్ న్యూ బుల్లెట్ ప్రూఫ్ కార్: ఇంటర్నెట్‌లో వీడియో హల్‌చల్)
ఐఫోన్ 12 మినీ ప్రారంభ ధర రూ. 69,900, అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 5,901 తగ్గింపు తర్వాత యాపిల్ ఐఫోన్ 12 మినీ రూ.53,999గా ఉంది. దీనికి అదనంగా, హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై బ్యాంక్‌లో రూ. 2,000 తగ్గింపును పొందవచ్చు. దీంతో ధర రూ.51,999 దిగి వచ్చింది. కొనుగోలుదారులు 24 నెలల వరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్‌పై నో కాస్ట్ EMIని పొందవచ్చు.ఐఫోన్ 12 మినీ కోసం నెలకు కేవలం రూ. 2250 చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం రోజుకు కేవలం రూ.73 అన్నమాట. (గుడ్ న్యూస్: యథాతథంగా కీలక వడ్డీరేట్లు)
Apple iPhone 12, Apple iPhone 12 Pro, Apple iPhone 12 Pro Maxతో పాటు 2020లో లాంచ్ చేసింది యాపిల్.దీన్ని యాపిల్ అమ్మకాలను నిలిపివేసినా , ఫ్లిప్‌కార్ట్, ఇదితర ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. యాపిల్ ఐఫోన్ 12 మినీ: 5.4-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, A14 బయోనిక్ చిప్, 12ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment