దేశంలో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా యాపిల్ సంస్థ ఐఫోన్13 పై భారీ ఆఫర్లు ప్రకటించింది. గతేడాది విడుదలైన క్యూ3 ఫలితాల్లో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో రెండో స్థానంలో ఉన్న చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీకి యాపిల్ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఐఫోన్13 విడుదలతో యాపిల్ రెండవ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్13 క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఐఫోన్13పై భారీ డిస్కౌంట్‌లు అందిస్తున్నట్లు యాపిల్ తెలిపింది.
గతేడాది విడుదలైన ఐఫోన్13' 128 జీబీ స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ. 79,900గా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది. యాపిల్ రీసెల్లర్ ఇండియా ఐ స్టోర్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్.. కోటక్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.6 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అంటే ఈఫోన్ ధర రూ.73,990కి తగ్గింది.
కస్టమర్లు పాత స్మార్ట్‌ఫోన్ (ఉదాహరణకు 64జీబీతో ఐఫోన్11) ఉంటే ఎక్స్చేంజ్‌పై రూ.15,000, దీంతో పాటు ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.3వేలని దక్కించుకోవచ్చు. దీంతోపై ఆఫర్‌లన్నీ సొంతం చేసుకుంటే రూ. 79,900 ఉన్న ఐఫోన్‌ను రూ.55,900కే కొనుగోలు చేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment