iPhone 13
-
ఐఫోన్ 13 రూ.11కే..?
ఐఫోన్ 13 కేవలం రూ.11కే లభ్యమవుతోందని ఫ్లిప్‌కార్ట్‌లో వెలిసిన ప్రకటనపై కస్టమర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టినా స్టాక్ అయిపోయిందని పాప్అప్ మెసేజ్ రావడంతో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ మాధ్యమాల్లో వినియోగదారులు పెడుతున్న పోస్టులుకాస్తా వైరల్‌గా మారుతున్నాయి.ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 22న రాత్రి 11 గంటలకు కేవలం రూ.11కే ఐఫోన్ 13 బుక్ చేసుకోవచ్చనేలా బ్యానర్లు వెలిశాయి. దాంతో వినియోగదారులు సరిగ్గా రాత్రి 11 గంటలకు ఆర్డర్ పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో స్టాక్ అయిపోయిందని పాప్అప్ మెసేజ్ రావడం గమనించారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అదే తంతు కొనసాగడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. దాంతో వివిధ సామాజిక మాధ్యమాల్లో విభిన్నరీతిలో స్పందించారు.Flipkart Deserves Belt Treatment From GovtThey Put a Banner of iPhone 13 at Just ₹11Product Went Out of Stock But Helps Them in Free Marketing On Social Media, WhatsAppIn Other Countries, They’ll Pay Penalty For Such Malpractices On The Name of Sale & Discount— Ravisutanjani (@Ravisutanjani) September 22, 2024 ‘ఫ్టిప్‌కార్ట్ వినియోగదారులను తప్పదోవ పట్టించేలా ప్రకటనలు విడుదల చేస్తుంది. వాట్సప్, సోషల్ మీడియాలో ఉచిత పబ్లిసిటీ కోసం దిగుజారుతుంది. ఇతరదేశాల్లో ఇలా చీప్ ట్రిక్స్ అమలు చేస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి’ అని ఒకరు స్పందించారు. ‘ఈ ఆఫర్ నిజంగా నిరాశపరిచింది. నిత్యం తప్పుడు ప్రకటనలు వస్తూన్నాయి. సంస్థ దీనిపై తగిన విధంగా స్పందించాలి. తప్పుదోవ పట్టించే ప్రచారాలకు ఫ్లిప్‌కార్ట్ బాధ్యత వహించాలి’ అని ఇంకొక యూజర్ తెలిపారు. ‘వాహ్ తర్వాత ఏమిటి? మ్యాక్‌బుక్ ప్రో రూ.11?’ అని మరో యూజర్ స్పందించారు. ఏదేమైనా, తప్పు ఎవరు చేసినా దానికి ఫ్లిప్‌కార్ట్ బాధ్యత వహించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.ఇదీ చదవండి: ఏఐకు కొత్త అర్థం చెప్పిన ప్రధానిఇటీవల ఐఫోన్ 16 సిరీస్ అమ్మకాలు ప్రారంభించిన యాపిల్ దానికంటే ముందు మోడళ్ల రేట్లను తగ్గిస్తుందనే వార్తలు వస్తున్నాయి. దాంతో ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో ఇలాంటి ప్రకటనలు చూసి చాలా మంది వినియోగదారులు తక్కువ ధరకే ఇస్తున్నారని భ్రమపడే అవకాశం ఉంటుంది. ఏదైనా ఆఫర్ ప్రకటించినపుడు విభిన్న ప్లాట్ఫామ్ల్లో ఆ మోడల్ ధరను పోల్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నమ్మశక్యంగా లేని ఆఫర్‌గా అనిపిస్తే ఆ ప్రకటన ఇస్తున్న కంపెనీ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి వివరాలు ధ్రువీకరించుకోవాలని సూచిస్తున్నారు. కంపెనీలు కూడా కస్టమర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు నిలిపేయాలని చెబుతున్నారు. -
స్మార్ట్‌ఫోన్స్ కొనేవారికి గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ డీల్స్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ (Flipkart Big Saving Days) పేరుతో తాజా సేల్ ఈవెంట్‌ను ప్రకటించింది. ఈ సేల్ జూన్ 10న ప్రారంభమై జూన్ 14 వరకు కొనసాగనుంది. ఈ పరిమిత కాల సేల్‌లో ఐఫోన్ 13, శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్23, పోకో ఎక్స్5తో సహా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ డీల్స్, ఆకర్షణీయ తగ్గింపులను అందిస్తోంది. వీటితోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. టాప్ బ్రాండ్స్.. ఫ్లాట్ డిస్కౌంట్స్ ⮞ ఐఫోన్13 (iPhone 13) 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ.58,749 నుంచి ఆఫర్ చేస్తోంది. ఇది యాపిల్ ఆన్లైన్ స్టోర్‌లో రూ.69,900 ఉంది. అంటే రూ. 11,151 ఫ్లాట్ తగ్గింపు . అదనంగా, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్లు అదనంగా 10 శాతం తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా రూ.57,999లకే ఐఫోన్13ను కొనుగోలు చేయవచ్చు . ⮞ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 (Samsung Galaxy F23) 5Gని రూ.13,499లకే అందిస్తోంది. మార్చిలో లాంచ్ అయినప్పుడు దాని అసలు ధర రూ.17,499. రూ.6,500 తగ్గింపు అంటే ఎవరు వదులుకుంటారు? ఇంకా తక్కువ ధరకు ఫోన్ కావాలనుకునే వారికి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) రూ. 10,999 లకే అందుబాటులో ఉంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎం14 (Samsung Galaxy M14)ని అయితే ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,327 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ⮞ ఇక రూ.15,499 ఉన్న మోటో జీ62 (Moto G62) రూ. 14,499లకు, 15,499 ఉన్న పోకో ఎక్స్5 (Poco X5 5G)ని రూ.14,999లకు కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.4,000 తగ్గింపు అందుబాటులో ఉంది. ఇదీ చదవండి: గాల్లో డబుల్ డెక్కర్: భలే డిజైన్ చేశారు.. ఫొటో వైరల్ -
సూపర్ ఆఫర్: ఐపోన్13పై ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్
న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ ప్రకారం 'బెస్ట్ సెల్లర్' ఐఫోన్ 13పై దాదాపు 36వేల దాకా తగ్గింపుతో రూ.25,900కి వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ 14 ను పోలిన స్పెసిఫికేషన్సే ఐఫోన 13లో కూడా ఉన్నాయి. 2021లో లాంచ్ అయినపుడు ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 79,900. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 36,099 తగ్గింపు తర్వాత రూ. 25,900కి అందుబాటులో ఉంది. (తక్కువ ధరలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ధర ఎంతంటే?) ప్రస్తుతం రూ. 7,901 తగ్గింపుతో రూ. 61,999 వద్ద లిస్ట్ అయింది. అయితే కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రూ. 33 వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆపర్ కూడా లభ్యం. ఈ ఆఫర్లన్నీ వర్తిస్తే యాపిల్ ఐఫోన్ 13 రూ. 25,900కే సొంతం చేసుకోవచ్చు. (మస్క్‌కు మరో ఝలక్: కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్‌బై) ఐఫోన్ 13 స్పెసిఫికేషన్స్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే A15 బయోనిక్ చిప్సెట్ 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 12 ఎంపీ సెల్ఫీ కెమెరా 3227 ఎంఏహెచ్ బ్యాటరీ ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? -
ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్: ఐఫోన్13పై రూ.10 వేలు డిస్కౌంట్!
యాపిల్ ఐఫోన్13పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 13 ఒక సంవత్సరం పాతదే అయినా ఇప్పటికీ చాలా మంది దాన్ని కొనడానికి చూస్తున్నారు. యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఐఫోన్ 13 ధర రూ.69,990. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. ఐఫోన్13 128జీబీ వేరియంట్ రూ.60 వేల కంటే తక్కువకే లభిస్తోంది. యాపిల్ ఐఫోన్13 128జీబీ వేరియంట్ అసలు ధర రూ.69,990. దీనిపై ఫ్లిప్‌కార్ట్ రూ.10,901 డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో రూ.58,999కే ఐఫోన్13ను సొంతం చేసుకోవచ్చు. మరోవైపు యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించడం ద్వారా అదనంగా మరో రూ.1,000 తగ్గింపు పొందవచ్చు . అంటే రూ.57,999కే ఐఫోన్13 మీ చేతికి వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న సమ్మర్ సేల్‌లో భాగంగా ఈ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ సమ్మర్ సేల్ ఏప్రిల్ 17న ముగియనుంది. ఐఫోన్13 ఫీచర్లు ఇవే.. సిరామిక్ షీల్డ్‌తో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే సాధారణ పరిస్థితుల్లో 800 నిట్లు, HDRతో 1200 నిట్ల బ్రైట్నెస్ Apple A15 బయోనిక్ చిప్సెట్, iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్ 12MP + 12MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ పోర్ట్రెయిట్ మోడ్, ఆటోమేటిక్ నైట్ మోడ్, 4K వీడియో రికార్డింగ్, స్లో మోషన్ వంటి అనేక రకాల ఫీచర్లు ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే! -
ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపరాఫర్!..మరీ ఇంత డిస్కౌంటా?
హోలీ సందర్భంగా కొనసాగుతున్న బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో ఐఫోన్ 13,ఐఫోన్ 14 ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక సేల్‌లో దాదాపు 1000 కి పైగా బ్రాండ్స్‌కి చెందిన దాదాపు లక్షకుపైగా ప్రోడక్ట్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. వీటితో పాటు పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లైన ఐఫోన్ 13,ఐఫోన్ 14 మోడళ్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లకే అందిస్తున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆఫర్లో భాగంగా ఐఫోన్ 13 ధర రూ.61,999 ఉండగా..రూ.59,999కే కొనుగోలు చేయొచ్చు. ఫోన్‌పై ఎక్ఛేంజ్ ఆఫర్ సౌకర్యం ఉంటే ఆ ధర కాస్త రూ.23,000 వరకు తగ్గుతుంది. అదే సమయంలో ఐఫోన్ 14 ధర రూ.71,999 ఉండగా..సేల్‌లో రూ.67,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక స్మార్ట్ఫోన్లు కాకుండా గృహోపకరణాలు, వంటగదిలో వినియోగించే వస్తువులు,హోమ్ అప్లయెన్సెస్ పై 70శాతం, రిఫ్రిజిరేటర్లపై 60శాతం డిస్కౌంట్స్, ల్యాప్‌ట్యాప్స్‌పై 45శాతం డిస్కౌంట్ పొందవచ్చు. -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్: ఐఫోన్13పై కళ్లు చెదిరే ఆఫర్
సాక్షి, ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రానున్న దీపావళి సందర్భంగా బిగ్ సేల్ ప్రకటించింది. ఈ సందర్బంగా 30వేల లోపు స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్స్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సాధారణ యూజర్లకు సంబంధించిన ఈ సేల్ అక్టోబర్ 16 వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా నథింగ్, గూగుల్, శాంసంగ్, రియల్ మీ, పోకోతో పాటు పలు బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఎస్బీఐ కార్డుకొనుగోళ్లపై అదనపు తగ్గింపు కూడా లభ్యం. (Maiden Pharma వివాదాస్పద మైడెన్కు భారీ షాక్: అక్టోబరు 14 వరకు గడువు) ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ 13పై కళ్లు చెదిరే అఫర్ అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్సైట్లో ఆపిల్ ఐఫోన్ 128 జీబీ ధర రూ. 58,900. దీనికి రూ. 2 వేల అదనపు తగ్గింపును పొందవచ్చు. అలాగే రూ.16,900 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ డిస్కౌంట్ల తరువాత ఐఫోన్ 13ని దాదాపు రూ. 45,000కి సొంతం చేసుకోవచ్చన్న మాట. రెండు నెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో దాదాపు రూ. 27,000కి అందుబాటులో ఉంది. దీనికి ఎస్బీఐ ఆఫర్ కూడా అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3 స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ తగ్గింపు తర్వాత రూ.59,999కి అందుబాటులో ఉంది. ఇంకా గూగుల్ పిక్స్ల్ 6ఏ ఫోను రూ. 27,999కి అందుబాటులో ఉంది. వీటి కొనుగోళ్లపై అదనంగా ఎస్బీఐ 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. గృహోపకరణాలపై 75 శాతం, టీవీలపై కూడా ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్టీ సందర్భంగా టీవీలు, ఆడియో ఉత్పత్తులపై తగ్గింపులను కూడా అందిస్తుంది. గృహోపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపు ఉంటుందని కంపెనీ తెలిపింది. వినియోగదారులు రూ. 17,249కే 4కె టీవీలను కొనుగోలు చేయవచ్చు. అలాగే సాధారణ హెచ్డీ స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. -
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు బంపరాఫర్!
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు బంపరాఫర్. దేశంలో దసరా ఫెస్టివల్ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్, అమెజాన్లు ప్రత్యేక సేల్ ను నిర్వహించనున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 30వరకు నిర్వహించనున్న సేల్‌లో ల్యాప్ ట్యాప్స్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. యాపిల్ లేటెస్ట్గా విడుదల చేసిన ఐఫోన్లను సైతం డిస్కౌంట్‌కే అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ప్రస్తుతం ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ ధరల్ని ఫ్లిప్‌కార్ట్ తన సైట్లో లిస్ట్ చేసింది. లిస్టింగ్ చేసిన ధరల ప్రకారం.. ఐఫోన్ 13 ప్రారంభ ధర రూ.69,900, ఐఫోన్ 13 ప్రో ప్రారంభ ధర రూ.1,19,900, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,26,000గా ఉంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో తగ్గించనుంది. ప్రస్తుతం ఆ ధరలు ఇలా ఉన్నాయంటూ ఫ్లిప్ కార్ట్‌తో పాటు పలు టెక్ బ్లాగ్లు కథనాల్ని ప్రచురించాయి. ఆ వివరాల ప్రకారం.. యాపిల్ ఐఫోన్ ధరలు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్‌లో ఐఫోన్ 13ప్రో ప్రారంభ ధర రూ.89,900, ఐఫోన్ 13ప్రో మ్యాక్స్ ధర రూ.99,990గా ఉంది. అయితే ఐఫోన్ 13 ధర రూ.49,990 కంటే తక్కువ ధరకే లభించనుంది. ఐఫోన్ 12 సిరీస్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్‌లో ఐఫోన్ 12 మిని రూ.39,990 అంతకంటే తక్కువగా ఐఫోన్ 11 ధర రూ.29,990 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ తగ్గింపు ధరలతో పాటు ఇతర ఐఫోన్ సిరీస్‌ల కొనుగోళ్లపై డిస్కౌంట్స్, ఆఫర్స్ అందించనుంది. కాగా, ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 12 మిని ప్రారంభ ధర రూ.55,359 ఉండగా, ఐఫోన్ 11 ప్రారంభం ధర రూ.43,990గా ఉంది. వీటి ధర సెప్టెంబర్ 23నుంచి భారీగా తగ్గనున్నాయి. ఎప్పుడు విడుదలయ్యాయంటే? ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక సేల్‌లో డిస్కౌంట్ ధరలకే లభ్యమయ్యే ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ గతేడాది అక్టోబర్ నెలలో యాపిల్ సంస్థ విడుదల చేసింది. అమెరికా క్యాలిఫోర్నియా యాపిల్ ప్రధాన కార్యాలయం క్యూపర్టినో వేదికగా క్యాలిఫోర్నియా స్ట్రీమింగ్ పేరుతో ఈవెంట్‌ను నిర్వహించింది. ఆ ఈవెంట్లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ విడుదలైంది. అక్టోబర్ 2020లో ఐఫోన్ 12 మినీ, సెప్టెంబర్ 2019లో ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లను యాపిల్ మార్కెట్‌కు పరిచయం చేసింది. చదవండి👉 దుమ్మురేపుతున్న ఫీచర్లు, ఐఫోన్ 14 సిరీస్ విడుదల! -
దుమ్మురేపుతున్న ఫీచర్లు, ఐఫోన్ 14 సిరీస్ విడుదల!
ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 14సిరీస్ ను యాపిల్ విడుదల చేసింది. భారత కాలమానం ప్రకారం..బుధవారం రాత్రి 10.30 గంటలకు 'యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్' జరిగింది. ఈ ఈవెంట్లో సీఈవో టిమ్ కుక్ ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను విడుదల చేశారు. వాటిలోని ఐఫోన్ 14 (Iphone 14), ఐఫోన్ 14 ప్లస్ (Iphone 14 Plus) ఫోన్ ధరలతో పాటు.. ఈ-సిమ్స్,శాటిలైట్ కనెక్టివిటీ,యానిమేషన్ రూపంలో నోటిఫికేషన్ వంటి ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అదిరిపోయేలా ఐఫోన్ 14 ఫీచర్లు.. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మిడ్ నైట్ స్టార్‌లైట్, పర్పుల్, రెడ్ వంటి ఐయిదు వేరియంట్ కల్సర్‌లో లభ్యం కానుంది. ఈ ఫోన్లలో ఏ15 బయోనిక్ చిప్, 6-కోర్ సీపీయూతో రెండు హై ఫర్మామెన్స్తో నాలుగు ఎఫెషెన్స్ కోర్లు, ఒక న్యూరల్ ఇంజిన్ ఉంది. ఐఫోన్ 14 లార్జర్ సెన్సార్లతో 12ఎంపీ మెయిన్ కెమెరా, 1.9 మైక్రాన్ పిక్సెల్స్, F1.5 ఎపర్చ్యూర్ (కెమెరా హోల్) OISతో వస్తుంది. ఓన్లీ ఈ-సిమ్స్ యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లలో eSIMని పరిచయం చేసింది. తద్వారా ఎక్కువ సంఖ్యలో eSIMలను స్టోర్ చేసుకోవడానికి, సురక్షితంగా ఉంచుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక్క యూఎస్ ఐఫోన్ 14 సిరీస్‌లో మాత్రమే ఈ ఈ-సిమ్ సౌకర్యం ఉంది. ఎందుకంటే ఆ మోడళ్లలో ఫిజికల్ సిమ్ కార్డ్ పెట్టుకునే సిమ్ ట్రేస్‌లు లేవు శాటిలైట్ కనెక్టివిటీ యాపిల్ తన ఐఫోన్లో మొదటిసారి శాటిలైట్ కనెక్టివిటీని పరిచయం చేసింది. ఇప్పుడు, ఐఫోన్ 14 వినియోగదారులు ప్రాణ పాయ స్థితిలో ఉన్నా, లేదంటే ఎక్కడైనా చిక్కుకున్నా అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ శాటిలైట్ కనెక్టివిటీ సాయంతో ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. గేమ్ ఛేంజ్ టెక్నాలజీని కమ్యూనికేషన్ ప్రవేశపెట్టడానికి తమకు సంవత్సరాలు పట్టిందని యాపిల్ తెలిపింది. యానిమేషన్ రూపంలోఐఫోన్ 14లో ఐఫోన్ 14 చిన్న పిల్ ఆకారపు నాచ్‌తో కొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంది. డిస్ ప్లే వెనుక భాగంలో ప్రాక్సిమిటీ సెన్సార్, నోటిఫికేషన్లు యానిమేషన్ రూపంలో పాప్ అవుట్ అవుతాయి. యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ధరలు ఐఫోన్ 14 ప్రారంభ ధర 799 డాలర్లు (సుమారు రూ. 79,900) ఉండగా, ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర 899 డాలర్లు (సుమారు రూ.89,900)గా ఉంది. ఈఫోన్ల ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవుతాయి. ఐఫోన్ 14 సెప్టెంబర్ 16న, ఐఫోన్ 14 ప్లస్ అక్టోబర్ 7 నుండి అందుబాటులో ఉంటుంది. నవంబర్ నాటికి ఈ ఫోన్లు అమెరికా, కెనడా కొనుగోలు దారులకు అందనున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్!
ఐఫోన్ ప్రియులకు శుభవార్త. త్వరలో విడుదల కానున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ధరల్ని ఐఫోన్ 13 ధరలకే యాపిల్ అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 14 మోడల్ ప్రారంభ ధర దాదాపు రూ. 80,000 ఉండవచ్చంటూ ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. కొరియన్ టెక్ బ్లాగ్ Naverలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, పరిమిత సంఖ్యలో సప్లయ్ చైన్ సమస్యలు ఇతర కారణాల్ని పరిగణలోకి తీసుకున్న యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు యాపిల్ 14 ధరల్ని పెంచే యోచన లేదని టెక్ బ్లాగ్ పేర్కొంది. అయితే స్తబ్ధుగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్, డిమాండ్ తగ్గుదల కారణంగా యాపిల్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ నిర్ణయం తీసుకున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే యుఎస్‌లో ఐఫోన్14 ధర 799 డాలర్లు ఉండగా.. మనదేశంలో ఆ ఫోన్ ధర రూ. 63,200కే లభ్యం కానుంది. జీఎస్టీ, దిగుమతి సుంకం,ఇతర ఛార్జీల్ని కలుపుకొని ఈ ఫోన్ ధర పెరిగే అవకాశం ఉండనుంది. కానీ, గతేడాది యూఎస్ మార్కెట్లో ఐఫోన్ 13 ఫోన్ సిరీస్‌కు సమానంగా భారత్ మార్కెట్లో అదే సిరీస్ ఫోన్ లభ్యమయ్యాయని.. కాబట్టి భారత్‌లో సైతం ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ధరలు పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది. -
అదిరిపోయే ఫీచర్లతో ఐఫోన్ 14, ట్రెండ్ సెట్ చేస్తుందా!
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త. యాపిల్ ఐఫోన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు సెప్టెంబర్ 13న విడుదల కానున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ఐఫోన్ 14 ప్రాసెసర్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గతేడాది సెప్టెంబర్ 24 వరకు విడుదలైన ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల వరకు ఏ15 ప్రాసెసర్ ఉండేది. అయితే మరికొన్ని నెలల్లో మార్కెట్‌కు పరిచయం కానున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లైన ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్,ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లలో ఏ15కు అడ్వాన్స్ వెర్షన్‌గా ఏ16 ప్రాసెసర్ ఉంటుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కానీ గేమింగ్ ఫర్మామెన్స్ కోసం యాపిల్ సంస్థ ఐఫోన్ 14 ప్రో ఫోన్లలో మాత్రమే ఈ ఏ16 ప్రాసెసర్ ను వినియోగించినట్లు సమాచారం. ఏ16 బయోనిక్ ప్రాసెసర్ ప్రత్యేకతలివే మ్యాక్ వరల్డ్ నివేదిక ప్రకారం..ఏ 16 బయోనిక్ ప్రాసెసర్ చాలా ప్రత్యేకమైందని తెలుస్తుంది. టీఎస్ఎంసీ 5ఎన్ఎంతో ఈ అడ్వాన్స్ వెర్షన్ ప్రాసెసర్‌ను తయారు చేశారు. 18 బిలియన్ నుండి 20 బిలియన్ ట్రాన్సిస్టర్లతో (A15లో 15.8 బిలియన్ల నుండి పెరిగింది) రానుంది. ఐఫోన్ 14 స్పెసిపికేషన్ ఐఫోన్14 ఫోన్ 6.1 అంగుళాల డిస్ప్లే . వీడియోలు చూసేందుకు, గేమ్స్ ఆడేందుకు 1170*2532 పిక్సెల్స్ రెజెల్యూషన్, 4జీబీ ర్యామ్ ప్లస్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇక డ్యూయల్ సెటప్ రేర్ కెమెరా ఉంది. ఫోన్‌తో అద్భుతమైన ఫోటోల్ని తీసేందుకు 12ఎంపీ ప్లస్ 12ఎంపీ కెమెరాలు,సెల్ఫీలు దిగేందుకు, వీడియో కాల్స్ చేసుకునేందుకు ఫోన్ ముందు భాగంలో 12ఎంపీ ప్లస్ ఎస్ఎల్ 3డీ కెమెరాతో రానుంది. ఐఓఎస్ వీ 15 ఆపరేటింగ్ సిస్టం, 3115 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీంతో పాలు పలు రకాలైన కనెక్టివిటీ ఆప్షన్ ఉన్నాయి. ముఖ్యంగా వైఫై,మొబైల్ హాట్ స్పాట్, బ్లూటూత్, 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుండగా..ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ప్రారంభ ధర రూ. 64వేల నుంచి రూ.71,500వరకు ఉండనున్నట్లు అంచనా. -
ఐఫోన్-13 పై బంపరాఫర్!
ఐఫోన్-13ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో బంపరాఫర్. అమెరికాలోని టెలికమ్యునికేషన్స్ హోల్డింగ్ కంపెనీ ఏటీ అండ్‌టీ ఐఫోన్-13పై భారీ ఆఫర్ అందిస్తోంది. నెలకు కేవలం 2.78 డాలర్ల ఈఎంఐతో ఐఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. గతేడాది సెప్టెంబర్‌లో ఆపిల్ సంస్థ ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఫోన్ అమ్మకాలు నిర్విరామంగా కొనసాగుతుండగా.. అమెరికాకు చెందిన ఏటీ అండ్ టీ సంస్థ 128జీబీ ఐఫోన్-13 వేరియంట్ ఫోన్లపై ఆఫర్‌ను అందిస్తుంది. ఐఫోన్-13 స్పెసిఫికేషన్లు ♦ట్రిపుల్ కెమెరా విత్ లేజర్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ ♦లైడార్ సెన్సార్ ♦5 జీ కనెక్టవిటీ సపోర్ట్ ♦వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ♦పవర్ ఎఫిసియంట్ ఎల్‌టీవో డిస్ప్లే ♦ఏ15 బయోనిక్ చిప్సెట్ అండ్ అల్వేస్ ఆన్ డిస్ప్లే ♦ఐఫోన్ 13 మినీ- 2,406 ఎంఏహెచ్ బ్యాటరీ ♦ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో-3,095 ఎంఏహెచ్ బ్యాటరీ ♦ఐఫోన్ 13 ప్రో మాక్స్ -4352 ఎంఏహెచ్ బ్యాటరీ -
గుడ్‌న్యూస్: అదిరిపోయే డిస్కౌంట్లు, ఐఫోన్ 13పై బంపరాఫర్లు!
స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా?అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఐఫోన్13పై బంపరాఫర్ ప్రకటించింది. అమెజాన్ అందిస్తున్న స్టన్నింగ్ డీల్‌లో కొనుగోలు దారులు భారీ డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లో తక్కువ ధరకే ఐఫోన్ 13ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్(అంచనా మాత్రమే)లో టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్(డబ్ల్యూ డబ్ల్యూ డీసీ) నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో యాపిల్ ఐఫోన్14ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో అమెజాన్ ఐఫోన్ 13లపై డిస్కౌంట్లు ప్రకటించింది. రూ.28,550 డిస్కౌంట్‌తో 128జీబీ ర్యామ్‌తో ఐఫోన్ 13ను కేవలం రూ.51,350కే అందిస్తుంది. అమెజాన్‌లో ఐఫోన్ 13ధర తగ్గింపు ఒరిజనల్‌గా 128జీబీ యాపిల్ ఐఫోన్ 13ఫోన్ ధర రూ.79,900 ఉండగా ఈ ఫోన్ అమెజాన్ రూ.51,350కే అందిస్తుంది. ముందుగా ఈ ఫోన్ కొనుగోలు దారులు రూ.10వేల ఫ్లాట్ డిస్కౌంట్‌తో ఆ ఫోన్ ధర రూ.69,990కి తగ్గుతుంది. దీంతో ఎక్ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ.18,550 తగ్గగా.. ఆఫోన్ అసలు ధర కంటే రూ.28,550 తగ్గి రూ.51,350కే వస్తుంది. ఐఫోన్ 13 ఫీచర్లు యాపిల్ ఐఫోన్ 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.1 అంగుళాల రెటీనా డిస్ప్లే,ఏ15 బయోనిక్ చిప్ సెట్, యాపిల్‌కు చెందిన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్(జీపీయూ), డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ విత్ 12ఎంపీ ప్రైమరీ లెన్స్, ఫ్రంట్ సైడ్ 12 ఎంపీ ఆల్ట్రా వైడ్ లెన్స్, రెటీనా ఫ్లాష్‌తో 12ఎంపీ సెల్ఫీ కెమెరా,128జీబీ స్టోరేజ్ ఫీచర్లు ఉన్నాయి. చదవండి👉 భారత్‌లో ఐఫోన్ అమ్మకాలు అదరగొట్టేస్తున్నాయ్, రూ.10వేల కోట్లకు యాపిల్ ఎగుమతులు! -
యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు.. లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ తక్కువ ధరలోనే...
ప్రముఖ రిటైల్ చైన్ స్టోర్ దిగ్గజం విజయ్ సేల్స్ యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును ప్రకటించింది.ఈ తగ్గింపులు యాపిల్ డేస్ సేల్‌లో భాగంగా కొనుగోలుదారులకు ఆయా యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ సేల్ ఏప్రిల్ 15 నుంచి మొదలవ్వగా.. ఏప్రిల్ 21 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఈ సేల్ లో భాగంగా iPhone SE (2022), iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max, iPhone 11, iPhone 12 స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లపై డిస్కౌంట్, ఇతర ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్లు కూడా రూ. 10,000 క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చును. ఈ ఆఫర్లు అన్ని విజయ్ సేల్స్ రిటైల్ స్టోర్స్, ఆన్ లైన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. iPhone 13 ని రూ. 58,900. కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ. 79,900, ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సుమారు రూ. 21,000 వరకు తగ్గింపును పొందవచ్చును. iPhone 13 Pro ధర రూ. 1,12,300 కు లభించనుంది iPhone 13 Pro Max రూ. 1,22,000 కే రానుంది ఐఫోన్ 11 రూ.44,490 నుంచి ప్రారంభం కానుంది iPhone 12 రూ. 53,900 కు అందుబాటులో ఉండనుంది. -
ఐఫోన్13 పై ఆఫర్ మామూలుగా లేదుగా,నెలకు రూ.760కే..అస్సలు మిస్ చేసుకోవద్దు!
ఐఫోన్ కొనడం కొందరికి అందని ద్రాక్షనే. ఎందుకంటే ఆ ఫోన్ ఖరీదు ఎక్కువ. కాకపోతే ఇతర ఫోన్లతో పోలిస్తే లుకింగ్‌తో పాటు, టెక్నాలజీ పరంగా ఐఫోన్లు చాలా అడ్వాన్స్‌గా ఉంటాయి. అందుకే ఖరీదైనా సరే ఆ ఫోన్లను కొనుగోలు చేసేందుకు యూజర్లు మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్13 పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన వైర్లెస్ నెట్ వర్క్ ఆపరేటర్ (జియో టైప్) వెరిజోన్ ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.నెలకు ఈఎంఐ రూ.760 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. యాపిల్‌కు చెందిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్-13 వరల్డ్ వైడ్‌గా హాట్ కేకుల్లా అమ్ముడవతున్న ఫోన్. తాజాగా ఈ ఫోన్లో యాపిల్ సంస్థ ఏ15 బయోనిక్ చిప్, గ్రీన్ గ్రీన్ ఫినిషెస్ తో డిజైన్ చేసిన ఐఫోన్‌ను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఆ ఫోన్‌ను వెరిజోన్ సంస్థ నెలకు 10డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.760) చెల్లించి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. నెలకు 10 డాలర్లు, 36 నెలలు వెరిజోన్ సంస్థ ప్రస్తుతం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. అమెరికన్లు నెలకు 10 డాలర్లను సుమారు 36నెలలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆ ఫోన్ ధర ప్రస్తుత మార్కెట్లో 699డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.53,355.79) ఉండగా, ఈ ఆఫర్ దక్కించుకున్న యూజర్లకు 360 డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.27,479.38) కే పొందవచ్చు. చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్ -
యాపిల్ కీలక నిర్ణయం..! ఐఫోన్-13 తయారీ భారత్‌లోనే.. ఎక్కడంటే..?
అమెరికాకు చెందిన టెక్ కంపెనీ యాపిల్ తన తాజా మోడల్ 'ఐఫోన్ 13' తయారీని భారత్‌లో ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా చొరవ మేరకు ఐఫోన్-13 స్మార్ట్ఫోన్లను తయారుచేయాలని యాపిల్ నిర్ణయం తీసుకుంది. సరికొత్త యాడ్-ఆన్ ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్స్ చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఉత్పత్తి కానుంది. కొద్ది రోజుల క్రితమే ఐఫోన్-12ను భారత్‌లోనే ఉత్పత్తి చేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఇప్పుడు వీటితో పాటుగా యాపిల్ పోర్ట్‌ఫోలియోలోని ఐఫోన్ సిరీస్ స్మార్ట్ఫోన్లను తయారుచేయాలని యాపిల్ సన్నద్ధమైంది. ఐఫోన్ 13ను భారత్‌లో తయారు చేస్తోన్నందుకు సంతోషంగా ఉన్నామని యాపిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. స్థానిక కస్టమర్స్ కోసం అందమైన డిజైన్, అద్భుతమైన ఫోటోలు, వీడియోల కోసం అధునాతన కెమెరా సిస్టమ్‌లు, A15 బయోనిక్ చిప్‌తో ఐఫోన్-13 తయారు చేస్తామని యాపిల్ పేర్కొంది. కాగా ఐఫోన్-13 సరికొత్త మోడల్ భారత్‌లోనే ఉత్పత్తి అవ్వడం విశేషం. గణనీయమైన వృద్ధి..! గత రెండు సంవత్సరాలలో యాపిల్ స్మార్ట్‌ఫోన్స్‌కు భారత్‌లో భారీ డిమాండ్ నెలకొంది. భారత్‌లో ముఖ్యంగా మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు ఉత్పత్తులను అందించే ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్స్‌లో ఐఫోన్ అమ్మకాలు భారీగా అమ్ముడయ్యాయి. ఇక భారత్‌లో యాపిల్ ఐఫోన్-13 స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి అవ్వడంతో ఈ ఫోన్ ధర తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఐఫోన్-13 ధరల్లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా యాపిల్ తన స్మార్ట్ఫోన్ల అసెంబ్లీను చైనాలో, సాఫ్ట్వేర్ తదితర టెక్నాలజీ ఫీచర్స్‌ను కాలిఫోర్నియాలో తయారుచేస్తుంది. చదవండి: హెచ్చరిక..! మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఈ యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయండి..లేకపోతే..! -
అతి తక్కువ ధరకు ఐఫోన్ 13ను అందిస్తోన్న క్రోమా..! ధర ఎంతంటే..?
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలు యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును, ఎక్సేఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నాయి. ఈ-కామర్స్ సంస్థలకు ధీటుగా ప్రముఖ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైల్చైన్ సంస్థ క్రోమా ఐఫోన్ 13పై భారీ తగ్గింపును అందిస్తోంది. అతి తక్కువ ధరకే ఐఫోన్ -13ను అందించేందుకుగాను క్రోమా పలు బ్యాంకులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఐసీఐసీఐ, కోటక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల క్రెడిట్ కార్డుతో కొనుగోలుచేస్తే రూ. 6000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా అదనంగా మీరు పాత ఫోన్ ఎక్సేఛేంజ్ చేస్తే కూడా దానిపై కొంత తగ్గింపును క్రోమా ఇస్తుంది. ఐఫోన్ 12, ఐఫోన్ 11పై భారీ ఎక్సేఛేంజ్ ఆఫర్ లభిస్తోంది. క్రోమా ఐఫోన్ 13ని రూ.73,990 ప్రారంభ ధరకు విక్రయిస్తోంది. ఆయా బ్యాంకుల క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే iPhone 13 128GB స్టోరేజ్ మోడల్‌ను రూ. 67,990కి పొందగలరు. అదనంగా, పాత ఐఫోన్‌ను ఎక్సేఛేంజ్ చేస్తే...ఐఫోన్ 13 ధర మరింత తగ్గనుంది. iPhone 12 128GB స్టోరేజ్ మోడల్‌పై ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద దాదాపు రూ. 24,500 అందిస్తోంది. దీంతో iPhone 13 ధరను దాదాపు రూ. 43,500కు తగ్గనుంది. చదవండి: ఇప్పుడు గ్యాస్ సిలిండర్ వంతు..భారీగా పెరిగిన ధరలు...! కొత్త ధరలు ఇవే.. -
భారత్‌లో ఐఫోన్ అమ్మకాలు అదరగొట్టేస్తున్నాయ్, రూ.10వేల కోట్లకు యాపిల్ ఎగుమతులు!
ప్రముఖ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్ టెక్ మార్కెట్లో సత్తా చాటుతోంది. దేశంలో యాపిల్ ఐఫోన్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవడంతో, ఆఫోన్ల అమ్మకాలు అదరగొట్టేస్తున్నాయి. దీంతో దేశీయంగా యాపిల్ ప్రొడక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. అందుకే ఇక్కడ తయారు చేస్తున్న ఆ సంస్థ ఉత్పత్తుల ఎగుమతుల విలువ ఫైనాన్షియల్ ఇయర్ 2022కి రూ.10వేల కోట్లకు చేరనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంవత్సరంలోనే.. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశంలో తయారీ పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో ఎంపికైన సంస్థలకు ప్రత్యేక రాయితీలు అందిస్తుంది. ఈ నేపథ్యంలో యాపిల్ ప్రొడక్ట్‌లను తయారు చేసేందుకు పరిశ్రమల్ని స్థాపించేందుకు పీఎల్ఐ స్కీమ్‌కు అప్లయి చేసింది. ఇందులో యాపిల్ ఐఫోన్లను విస్ట్రాన్, ఫాక్స్‌కాన్,పెగాట్రాన్ లు ఎంపికయ్యాయి. విస్ట్రాన్ కర్ణాటకలో ఉండగా, ఫాక్స్‌కాన్ తమిళనాడులో కర్ణాటకలో విస్ట్రాన్ కంపెనీ ఐఫోన్ మోడల్‌లు ఎస్ఈ 2020లను తయారు చేస్తుండగా..తమిళనాడులో ఫాక్స్‌కాన్ ఐఫోన్ 11,ఐఫోన్12, ఐఫోన్13లను తయారు చేస్తుంది. పెగాట్రాన్ సైతం ఏప్రిల్1 నుంచి దేశీయంగా ఐఫోన్ల తయారీ కార్యాకలాపాల్ని ప్రారంభించనుంది. అయితే పీఎల్ఐ స్కీమ్‌లో భాగంగా ఉత్పత్తిని ప్రారంభించిన తొలి ఏడాది యాపిల్ సంస్థ కేవలం 10నుంచి 15శాతం ఉత్పత్తి చేసింది. అనూహ్యంగా దేశీయ మార్కెట్లో ఐఫోన్13తో పాటు ఇతర ఐఫోన్ సిరీస్ ఫోన్లతో పాటు ఇతర ప్రొడక్ట్‌ల అమ్మకాలు భారీ ఎత్తున జరిగాయి. దీంతో ఉత్పత్తుల శాతం గణనీయంగా పెరిగి..75 నుంచి 80శాతం ఉత్పత్తి చేసింది.ఈ ఉత్పత్తుల మార్కెట్ విలువ 10వేలకోట్లకు చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: చావు బతుకుల్లో నేహ భర్త.. కాపాడినందుకు టిమ్ కుక్కు థ్యాంక్స్! -
ఐఫోన్ 13పై అమెజాన్ అదిరిపోయే ఆఫర్..!
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఆపిల్ తన ఐఫోన్ 13పై భారీ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ అమెజాన్ ఈ-కామర్స్ పోర్టల్'లో మాత్రమే లభిస్తుంది. అది కూడా ఐఫోన్ 13 128జీబీ వేరియంట్ మీద మాత్రమే అందుబాటులో ఉంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ ఒప్పందాలతో ఐఫోన్ 13ను కేవలం రూ.53,550కు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 13 అసలు ధర మొదట రూ.79,900 కాగా, అమెజాన్‌లో రూ.74,900కు లభిస్తుంది. అంతే కాదు మీ దగ్గర ఉన్న పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేస్తే మీకు రూ.15,350 వరకు ధర తగ్గనుంది. దీంతో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఐఫోన్ 13 ధర రూ.59,550కు తగ్గుతుంది. ఇంకా, ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి మొబైల్ కొనుగోలు చేససటే మీకు రూ.6,000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఐఫోన్ 13 128జీబి వేరియంట్ రూ.53,550కు లభించనుంది. ఒకవేళ మీకు ఆసక్తి ఉన్నట్లయితే, ఇప్పుడే మీరు కొనుగోలుచేయవచ్చు. అంతిమంగా మీకు ఈ మొబైల్ మీద రూ.26350(రూ.5000 + రూ.15,350 + రూ.6000 ) వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఐఫోన్ 13 డిస్ప్లే 6.1 అంగుళాలు, మినీ డిస్ప్లే 5.4 అంగుళాలుగా ఉంటుంది. (చదవండి: ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్ దాటేసిన గౌతమ్ అదానీ..!) -
Rajasthan: ఆహా.. ఏమి అదృష్టం! ఫ్రీగా ఐఫోన్లు
Rajasthan Budget 2022: ఈ ఫ్రీ ఐఫోన్ ఆఫర్ కేవలం అక్కడి ప్రజాప్రతినిధులకు మాత్రమే.. గమనించగలరు. ప్రజాసేవ సంగతి ఏమోగానీ.. ప్రజాప్రతినిధులకు అందే సౌకర్యాలు మాత్రం ఘనంగా ఉంటాయి. అందుకు మరో ఉదాహరణ.. రాజస్థాన్‌లో బుధవారం కనిపించిన దృశ్యాలు. బుధవారం రాజస్థాన్ అసెంబ్లీలో బడ్జెట్‌ను సమర్పించింది ప్రభుత్వం. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల అనంతరం.. ఎమ్మెల్యేలకు ఆనవాయితీగా లెదర్ బ్రీఫ్‌కేసులు అందించారు. అయితే ఈసారి రాజస్థాన్ 200 మంది ఎమ్మెల్యేలకు అందించిన బ్రీఫ్‌కేసులో సర్ప్రైజ్గా బ్రాండ్ న్యూ ఐఫోన్ 13ను కానుకగా ఇచ్చింది ప్రభుత్వం. ఆ ఫోన్ కాస్ట్ 75 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల మధ్య ఉంది. ఇంతే కదా అనుకోకండి.. కిందటి ఏడాది ఇలాగే బడ్జెట్ సందర్భంగా ఐప్యాడ్లను ఎమ్మెల్యేలకు అందించింది అశోక్ గెహ్లాట్ సర్కార్. సాధారణంగా.. ఎమ్మెల్యేలకు బడ్జెట్ అయిపోగానే.. ఆ ప్రతులను ఉంచిన బ్యాగులు ఇవ్వడం పరిపాటి. కానీ, అక్కడేమో బడ్జెట్ పేపర్స్‌తో పాటు ఇలా కాస్ట్లీ గాడ్జెట్స్ అందించేస్తున్నారు. ఈసారి అందించిన ఐఫోన్ కానుకల విలువ మొత్తం కోటిన్నర రూపాయలుగా తేలింది. పార్టీలకతీతంగా సంబురంగా ఆ కానుకలు తీసుకుని.. కొత్త ఫోన్‌తో ఫొటోలకు ఫోజులిచ్చారు అక్కడి ఎమ్మెల్యేలు. ఇక అశోక్ గెహ్లాట్ సర్కార్.. ఎమ్మెల్యేల కోసం ఖరీదైన ఐఫోన్లను కొనుగోలు చేయడానికి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని కొందరు ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. -
మీ కంపెనీ సర్వీస్ చెత్తగా ఉంది,లక్షన్నర ఫోన్ ఆర్డర్ ఇస్తే శానిటైజర్ ఇచ్చారు!!
ఫోన్ ఆర్డర్ చేస్తే ఇటుకలు, అట్టముక్కలు రావడం సర్వ సాధారణమయ్యాయి. తాజాగా ఓ మహిళ తనకెంతో ఇష్టమైన ఐఫోన్ బుక్ చేసింది. అయితే ఐఫోన్ బుక్ చేసిన ఆమెకు అనూహ్యంగా శానిటైజర్ డబ్బా డెలివరీ అయ్యింది. దీంతో కంగుతిన్న బాధితురాలు లక్షన్నర ఫోన్ ఆర్డర్ ఇస్తే శానిటైజర్ డబ్బా వచ్చింది! ఏం చేసుకోను అంటూ ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. లండన్ కు చెందిన 32 ఏళ్ల ఖవ్లా లఫాహిల్ గతేడాది యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 13 మ్యాక్స్‌ప్రో ను బుక్ చేసింది. యూకేలో ఆ ఫోన్ ధర 2,031 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం(సుమారు రూ.1,51,713.67) బుక్ చేసిన కొన్నిరోజల తర్వాత తన ఇంటికి వచ్చిన ఐఫోన్ పార్శిల్ ఓపెన్ చేసి చూడగా అందులో శానిటైజర్ ఉండడంతో అవాక్కు అవ్వడం ఆమె వంతైంది. అంతే ఐఫోన్‌కు బదులు శానిటైజర్ రావడంతో ఆగ్రహానికి గురైంది.మీ కంపెనీ సర్వీస్ చెత్తగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దిగివచ్చిన యాజమాన్యం బాధితురాలికి క్షమాపణలు చెప్పింది. త్వరలోనే ఐఫోన్ 13 మ్యాక్స్ ప్రోను అందిస్తామని సదరు డెలివరీ సంస్థ నిర్వాహకులు హామీ ఇచ్చారు. -
యాపిల్ అదిరిపోయే డీల్.. ఏకంగా రూ.23 వేల తగ్గింపు..!
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ప్రముఖ మొబైల్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ 11 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్ మీద భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ సిరీస్ మొబైల్స్ మీద ఏకంగా రూ.15 వేల తగ్గింపు ప్రకటించింది. ఐఫోన్ 11 సిరీస్ అసలు ధర కంటే రూ.15 వేలు తక్కువకు లభించాలంటే మీ దగ్గర ఉన్న పాత ఐఫోన్ 7 సిరీస్ మొబైల్ ఎక్స్ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, ఐఫోన్ 13 సిరీస్ మీద రూ.23 వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 13 మొబైల్ అసలు ధర కంటే రూ.15 వేలు తక్కువకు లభించాలంటే మీ దగ్గర ఉన్న పాత ఐఫోన్ 10ఆర్ సిరీస్ మొబైల్ ఎక్స్ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ రెండు ఆఫర్స్ కూడా కేవలం ఇండియాస్టోర్ మాత్రమే లభిస్తున్నాయి. ఐఫోన్ 11 64జీబీ స్టోరేజీ అసలు ధర రూ.49,900 అయితే, ఇండియాస్టోర్ నెట్ వర్క్ స్టోర్లలో మీరు దీనిని రూ. 34,900 వరకు పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు ద్వారా ఈఎమ్ఐ విధానంలో కొనుగోలు చేసినట్లయితే అసలు ధర కంటే రూ.4,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంటే, మొబైల్ ధర రూ.45,900కు తగ్గుతుంది. అయితే, మీ దగ్గర పాత ఐఫోన్ 7 128 జీబీ మోడల్ ఉంటే ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ రూపంలో రూ.11,000 తక్కువకు మొబైల్ పొందవచ్చు. అంటే, మొత్తంగా ధర రూ.34,900కు తగ్గుతుంది. అలాగే, మీరు ఐఫోన్ 13 సిరీస్ మొబైల్ కొనాలని చూస్తుంటే? దాని అసలు ధర రూ.1,29,900గా ఉంది. మీరు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు ద్వారా ఈఎమ్ఐ విధానంలో కొనుగోలు చేసినట్లయితే అసలు ధర కంటే రూ.5,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంటే, మొబైల్ ధర రూ.1,24,900కు తగ్గుతుంది. అయితే, మీ దగ్గర పాత ఐఫోన్ 10ఆర్ 64 జీబీ మోడల్ ఉంటే ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో రూ.18,000 తక్కువకు మొబైల్ పొందవచ్చు. అంటే, మొత్తంగా ధర రూ.1,06,900కు తగ్గుతుంది. (చదవండి: క్రిప్టో కరెన్సీ దెబ్బకు విలవిల్లాడుతున్న ఇన్వెస్టర్లు..!) -
అదిరిపోయే డిస్కౌంట్లు, ఐఫోన్‌పై బంపరాఫర్లు!
దేశంలో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా యాపిల్ సంస్థ ఐఫోన్13 పై భారీ ఆఫర్లు ప్రకటించింది. గతేడాది విడుదలైన క్యూ3 ఫలితాల్లో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో రెండో స్థానంలో ఉన్న చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీకి యాపిల్ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఐఫోన్13 విడుదలతో యాపిల్ రెండవ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్13 క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఐఫోన్13పై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు యాపిల్ తెలిపింది. గతేడాది విడుదలైన ఐఫోన్13' 128 జీబీ స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ. 79,900గా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది. యాపిల్ రీసెల్లర్ ఇండియా ఐ స్టోర్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్.. కోటక్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.6 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అంటే ఈఫోన్ ధర రూ.73,990కి తగ్గింది. కస్టమర్లు పాత స్మార్ట్‌ఫోన్ (ఉదాహరణకు 64జీబీతో ఐఫోన్11) ఉంటే ఎక్స్చేంజ్పై రూ.15,000, దీంతో పాటు ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.3వేలని దక్కించుకోవచ్చు. దీంతోపై ఆఫర్లన్నీ సొంతం చేసుకుంటే రూ. 79,900 ఉన్న ఐఫోన్‌ను రూ.55,900కే కొనుగోలు చేయొచ్చు. చదవండి: ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
5జీ నెట్ వర్క్ హవా, 39 రోజుల్లో 1 మిలియన్ల మడత ఫోన్లు అమ్ముడయ్యాయి
1980 సంవత్సంరలో 1జీ(జనరేషన్)ను వాయిస్ కాల్స్ మాత్రమే చేసుకునే సదుపాయం ఉంది. 1990 సంవత్సరంలో 2జీ - ఈ ఫోన్లో ఫోన్ కాల్స్, మెసేజ్‌లు పంపేవాళ్లం. 2000 సంవత్సరంలో 3జీ - మొబైల్లో ఇంటర్నెట్ను వినియోగించడం ప్రారంభించాం. 2010 సంవత్సరంలో 4జీ- ఈ 4జీతో మొబైల్ డేటా వినియోగం పెరిగింది. అధిక సంఖ్యలో ఉన్న డేటాను పంపడంతో పాటు ఎంటర్టైన్మెంట్ కోసం వినియోగించే వాళ్లం. 2020 సంవత్సరంలో 5జీ - ఈ 5జీ నెట్ వర్క్ ఏకకాలంలో మరిన్ని డివైజ్‌లను మొబైల్ ఇంటర్నెట్కు కనెక్ట్ చేయడం, అప్లోడ్, డౌన్లోడ్ స్పీడ్ వేగం పెరగడంతోపాటు స్మార్ట్ గ్లాస్ మీద ఆగ్మెంటెడ్ రియాలిటీ, మొబైల్ వర్చువల్ రియాలిటీ, హై క్వాలిటీ వీడియో, నగరాల్ని మరింత స్మార్ట్‌గా చేసే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్..ఇవన్నీ సాధ్యమవుతాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ 5జీ నెట్ వర్క్‌ను వినియోగించుకునేందుకు పోటీపడుతున్నాయి. అయితే మిగిలిన దేశాలన్నింటిలో సౌత్ కొరియా 5జీ నెట్ వర్క్ వినియోగంలో ముందంజలో ఉన్నట్లు తేలింది. ఇటీవల సౌత్ కొరియా సైన్స్ అండ్ ఐసీటీ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం..నవంబర్ నెల నాటికి 5జీ మొబైల్ నెట్ వర్క్ యూజర్లు 20.19మిలియన్లకు చేరారు. 5జీ నెట్ వర్క్‌ను కమర్షియలైజ్ చేసిన 2019 నుంచి ఈ స్థాయిలో 5జీ యూజర్లు పెరగడం ఇదే తొలిసారి అని రిపోర్ట్ హైలెట్ చేసింది. దేశం మొత్తంలో 72.57 మిలియన్ల మొబైల్ యూజర్లు ఉండగా వారిలో 28 శాతం మంది 5జీ నెట్ వర్క్‌ను వాడుతున్నట్లు రిపోర్ట్ లో పేర్కొన్నాయి. 85 నగరాల్లో 5జీ నెట్ వర్క్ 52 మిలియన్ల జనాభా కలిగిన సౌత్ కొరియా, 2019, ఏప్రిల్‌లో తొలిసారి 5G నెట్‌వర్క్‌లను వాణిజ్య పరంగా వినియోగించేలా అనుమతులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆదేశానికి చెందిన 85 నగరాల్లో 5జీ నెట్ వర్క్‌ను అందిస్తుంది. తాజా డేటా ప్రకారం..అక్టోబర్‌లో 19.38 మిలియన్ల 5జీ సబ్స్క్రిప్షన్ల పెరిగాయి. అందుకు కారణం 5జీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో విడుదల కావడంతో యూజర్ల సంఖ్య పెరిగినట్లు యోన్హాప్ వార్తా సంస్థ నివేదించింది. 5జీ స్మార్ట్ ఫోన్లలో శాంసంగ్ సంస్థ గతేడాది ఆగస్ట్‌లో కొత్త ఫోల్డబుల్ ఫోన్లు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. విడుదలైన ఫోల్డబుల్ ఫోన్(మడత)లు యూజర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఆ ఫోన్ల అమ్మకాలు ప్రారంభించిన 39 రోజుల్లోనే 1 మిలియన్ల ఫోన్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో 5జీ నెట్ వర్క్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. చదవండి:జస్ట్ మూడేళ్ల కంపెనీ..! 5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో దిగ్గజ కంపెనీలకు గట్టిపోటీ.! -
ఐఫోన్ కొనేవారికి శుభవార్త.. రూ.18 వేలు డిస్కౌంట్..!
మీరు కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక గుడ్‌న్యూస్. విజయ్ సేల్స్ అనే కంపెనీ డిసెంబర్ 24 - 31 వరకు యాపిల్ డేస్ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా ఎవరైనా ఐఫోన్ 13 కొనుగోలు చేస్తే వారికి రూ.18000 డిస్కౌంట్ లభించనున్నట్లు పేర్కొంది. కానీ, ఈ ఆఫర్ అందరికీ లభించదు. యాపిల్ కంపెనీ కొత్తగా లాంఛ్ చేసిన ఐఫోన్ 13 వాస్తవ ధర రూ.79,900. ఈ యాపిల్ డేస్ సేల్‌లో ఈ ఐఫోన్ 13 మీద రూ.4 వేల డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే, ఎవరైనా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుల సహయంతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే వారికి అదనంగా మరో రూ.6,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. కేవలం ఈ రెండు ఆఫర్లు మాత్రమే కాదు మరో ఆఫర్ కూడా ఉంది. ఎవరైనా తమ దగ్గర ఉన్నపాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.8,000 డిస్కౌంట్ పొందొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ రూ.5,000 + ఎక్స్ట్రా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ.3,000 వస్తుంది. ఇలా రూ.5,000 విలువ గల స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు సహాయంతో ఐఫోన్ 13 కొనుగోలు చేస్తే మీకు రూ.18000(రూ.4000 + రూ.6000 + రూ.5000 + రూ.3000) వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతిమంగా ఈ ఐఫోన్ 13 రూ.61,900కు వస్తుంది. విజయ్ సేల్‌లో ఐఫోన్లతో పాటు 7 సిరీస్ వాచ్, ఎయిర్ పాడ్స్ 3వ జనరేషన్, ఎయిర్ పాడ్స్ ప్రో, మాక్ బుక్స్, ఐప్యాడ్, వాచీలు, హోమ్ పాడ్ మినీ, యాపిల్ కేర్ వంటి మీద కూడా భారీగా డిస్కౌంట్ లభిస్తుంది. ఐప్యాడ్ కేటగిరీలో ఐప్యాడ్ 9వ జెన్ ₹26, 600కు ఐప్యాడ్ ఎయిర్ 4వ జెన్ ₹46, 900కు, ఐప్యాడ్ ప్రో 63,500 ₹వద్ద లభిస్తున్నాయి. -
సంచలన ఆవిష్కరణ: బుల్లెట్లను తట్టుకునే స్మార్ట్‌ఫోన్
Bulletproof iphone 13 series Price And Details: పై హెడ్డింగ్ చదివాక.. సాంకేతికత ఎంతగా వృద్ధి చెందినా.. స్మార్ట్‌ఫోన్ ఉండేది కేవలం వాడుకోవడానికే కదా అనే అనుమానం కలగవచ్చు. కానీ, ఇప్పుడు చెప్పబోయే ఫోన్ అందరికీ అందుబాటులో ఉండేది కాదు. చాలా ప్రత్యేకత సంతరించుకుంది మరి!. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌కి బుల్లెట్ తగిలితే.. దూసుకెళ్లి తునాతునకలు అవుతుంది. కానీ, ఈ ఫోన్లు మాత్రం తీవ్రతను తట్టుకుని చక్కగా పని చేస్తాయి. ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ కంపెనీ ‘కేవియర్’ స్టీల్త్ ఐఫోన్ పేరుతో సిరీస్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. కిందటి ఏడాది ఐఫోన్ 12లో లగ్జరీ మోడల్‌ను తీసుకొచ్చిన కేవియర్.. ఇప్పుడు దానికి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా స్టీల్త్ 2.0 ఐఫోన్ 13 సిరీస్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. బుల్లెట్లను సైతం తట్టుకోగలుగుతుంది. స్టీల్త్ వెర్షన్ 2.0 ఐఫోన్లు.. బీఆర్-2 క్లాస్2కి చెందిన బుల్లెట్‌ప్రూఫ్ కవచంతో తయారు చేయించింది. బుల్లెట్‌ప్రూఫ్ కవచాలతో ఆయుధ వాహనాల్ని, యుద్ధ విమానాల్ని రూపొందించే ఎన్పీవో టీసీఐటీ సహకారంతో కేవియర్ ఈ ఐఫోన్‌ను పైప్యానెల్ను ప్రత్యేకంగా రూపొందించారు. అంతేకాదు పిస్టోల్స్ ఈ ఫోన్లను కాల్చి మరీ డెమోలను చూపించింది కంపెనీ. అదే టైంలో ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దంటూ ప్రజలకు సూచించింది కూడా. సాధారణ ఫోన్లకు గనుక బుల్లెట్ తగిలితే.. అది ఫోన్ పై ప్యానెల్ గుండా ఫోన్ బాడీలోకి చీల్చుకుపోతుంది. ఫోన్‌ను పనికి రాకుండా డ్యామేజ్ చేస్తుంది. కానీ, ఈ ఫోన్ మాత్రం బుల్లెట్ తీవ్రతను తట్టుకుని పైన ప్యానెల్‌ను పగలగొట్టి సరిపెట్టుకుంది. విశేషం ఏంటంటే.. బుల్లెట్ తగిలాక కూడా ఆ ఫోన్ కండిషన్‌తో పని చేయడం. బుల్లెట్‌ప్రూఫ్ ఫోన్లుగా ఇప్పటికే కొన్ని మార్కెట్లో చెలామణి అవుతుండగా.. వాటన్నింటికంటే ఇది స్టాండర్డ్‌గా తేలడం విశేషం. ఇక కేవియర్ ఇలాంటి ఫోన్లను కేవలం 99 యూనిట్లు(పీసులను) మాత్రమే తయారు చేయించింది. ప్రారంభ ధర 6, 370 డాలర్లుగా(మన కరెన్సీలో 4, 86 వేల రూపాయలకు పైనే) ఉంటుంది. గరిష్టంగా ఈ తరహా బుల్లెట్ ఐఫోన్‌ను(ఐఫోన్ ప్రో మ్యాక్స్.. 1 టీబీ స్టోరేజ్) 7, 980 డాలర్లకు అందించనుంది. కాబట్టి, బాగా డబ్బున్నోళ్ల కోసం, సెక్యూరిటీ భయం ఉన్నవాళ్ల కోసం ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు అర్థమవుతోంది కదా!. 2010 నుంచి ఇటాలియన్ నగల వ్యాపారి ఇలియా గియకోమెట్టి ఆధ్వర్యంలో ‘కేవియర్’(1861 నుంచి వ్యాపారంలో ఉంది).. ఫ్లోరెన్స్(ఇటలీ) వేదికగా లగ్జరీ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తోంది. ఐఫోన్, శాంసంగ్‌లతో పాటు పలు రకాల బ్రాండ్లకు విలాసవంతమైన సొగసులు అద్ది(బంగారం, వజ్రాలు ఇతరత్రాలు) లిమిటెడ్ యూనిట్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఓ బ్రాండ్‌గా ముద్రను సంపాదించుకుంది. చదవండి: వారం పాటు బ్యాటరీ వచ్చే స్మార్ట్‌ఫోన్! ఏదంటే.. -
టిమ్ కుక్కు కొత్త తలనొప్పులు, చివాట్లు పెడుతున్న ఐఫోన్ యూజర్లు
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కు భారీ షాక్ తగిలింది. రానున్న రోజుల్లో ఐఫోన్లకు బదులుగా వాటి స్థానంలో అగుమెంటెడ్ రియాల్టీ హెడ్‌సెట్స్‌తో రీప్లేస్ చేసే పనిలో పడింది. కానీ యాపిల్ సంస్థకు అనుకోని విధంగా ఐఫోన్ వినియోగదారులతో పాటు పలు ఆటోమొబైల్ సంస్థల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. యాపిల్ ఇటీవల ఐఫోన్ 12, ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లలో ఐఓఎస్ 15ను అప్ డేట్ చేసింది. ఆ ఐఓఎస్15 ను అప్డేట్ చేసుకున్న యూజర్ల ఫోన్లలో బ్లూటూత్ పనిచేయడం లేదని యాపిల్‌ను చివాట్లు పెడుతున్నారు. 9టూ 5 మాక్ కథనం ప్రకారం.. చాలా మంది ఐఓఎస్ 15.1 వినియోగదారులు కార్లలో బ్లూటూత్ హ్యాండ్స్ ఫ్రీ సిస్టమ్‌లతో కనెక్షన్ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అయితే ఆ బగ్‌లను పరిష్కరించకుండా యాపిల్ వదిలేసిందని విమర్శిస్తున్నారు. ఈ సమస్యలు ఎక్కువగా ఐఫోన్ 12, ఐఫోన్ 13 మోడళ్లతో కనిపిస్తుండగా.. ఆ సమస్య ఆటోమొబైల్ రంగంపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా టయోటా, ఆడి, వోల్వోతో పాటు అకురా,బీఎండబ్ల్యూ, చేవ్రొలెట్, ఫోర్డ్,హోండా,హూందాయ్,లింకన్, మాజ్డా, మెర్సిడిస్ బెంజ్, మిత్సుబిషి, ఫోర్ష్ కార్ల వినియోగదారులకు ఈ బ్లూటూత్ కనెక్టివిటీ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై వాహనదారులు సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వరుస ఫిర్యాదులతో ఆటోమొబైల్ సంస్థల ప్రతినిధులు సైతం యాపిల్‌పై గుర్రుగా ఉన్నారు. ఐఫోన్ 12, ఐఫోన్ 13 కోసమే ఐఫోన్ 12, ఐఫోన్ 13 యూజర్ల సౌలభ్యం కోసం కాల్ డ్రాప్ పనితీరును మెరుగు పరిచేందుకు యాపిల్ సంస్థ ఐఓఎస్ 15.1.1 వెర్షన్‌ను విడుదల చేసింది. కానీ ఆ వెర్షన్ విడుదల యాపిల్ సంస్థకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. కోవిడ్ దెబ్బకు చిప్ షార్టేజ్ తలెత్తింది. అదే సమయంలో ఐఫోన్ 13ను పూర్తి స్థాయిలో యూజర్లకు అందించే విషయంలో వెనక్కి తగ్గడంతో యాపిల్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు ఈ కొత్త సమస్య యాపిల్‌ను ఎంత అప్రతిష్టపాలు చేస్తుందోనని ఆ సంస్థ ప్రతినిధులు బయపడుతున్నారు. మరోవైపు యాపిల్ సంస్థ ఐఫోన్లను రీప్లేస్ చేస్తూ ఆగుమెంటెడ్ రియాల్టీ హెడ్ సెట్లపై పనిచేయడంపై యూజర్లు సెటైర్లు వేస్తున్నారు. ఐఫోన్ లను రీప్లేస్ చేయడం సరే, ఈ సాంకేతిక సమస్యల్ని పరిష్కరించాలని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: యాపిల్ పరువు తీసి పడేశాడు.. కొత్తేం కాదుగా! -
షావోమీ కొంపముంచిన చిప్స్..! ఆ పొజిషన్ యాపిల్ కైవసం..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీకి మరో గట్టి దెబ్బ తగిలింది. క్యూ3 ఆదాయ విషయంలో సమీప ప్రత్యర్థి కంపెనీల నుంచి గట్టి పోటీతో పాటుగా చిప్స్ కొరత షావోమీ కొంపముంచింది. చిప్స్ కొరతతో షావోమీకి గట్టి దెబ్బ..! ప్రపంచవ్యాప్తంగా పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు, ఆటోమొబైల్ కంపెనీలను సెమికండక్టర్స్ (చిప్స్) కొరత తీవ్రంగా వేధిస్తోంది. చిప్స్ కొరతతో సతమతమవుతున్న కంపెనీల జాబితాలో షావోమీ కూడా నిలిచింది. చిప్స్ కొరత కారణంగా క్యూ3లో కంపెనీ వృద్ధి రేటు నెమ్మదించింది. చిప్ కొరత ఉన్నప్పటికీ, షావోమీ 2021లో దాదాపు 190 మిలియన్ స్మార్ట్ఫోన్లను విక్రయించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 29 శాతం పెరిగిన కూడా యాపిల్ లాంటి కంపెనీలు షావోమీకు భారీ దెబ్బను వేశాయి. క్యూ3లో దాదాపు రూ. 90,910 కోట్ల విక్రయాలను జరిపిన షావోమీ అంచనాలను చేరుకోలేకపోయింది. రెండో స్థానం నుంచి ..! ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్స్ కొరత, చైనాలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల తగ్గుదల కారణంగా...ప్రపంచంలోని టాప్ స్మార్ట్‌ఫోన్స్ జాబితాలో షావోమీ రెండోస్ధానం నుంచి మూడో స్ధానానికి పడిపోయింది. తాజాగా యాపిల్ రెండోస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఐఫోన్-13 రాకతో షావోమీ అమ్మకాలు ఒక్కింతా పడిపోయాయి. ఐఫోన్-13ను రిలీజ్ కావడంతో ఇతర ఐఫోన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ రేట్లు అమాంతం తగ్గాయి. దీంతో షావోమీ అంచనాలు తారుమారు అయ్యాయి. చదవండి: ఈవీ ఛార్జింగ్ సదుపాయాల కల్పన కోసం మెజెంటా భారీ పెట్టుబడులు -
ఓర్నీ..! డైనోసార్ పళ్లతో ఫోన్ డిజైన్, కొనేందుకు ఎగబడుతున్న బిలియనీర్లు..!
ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న హై అండ్ మోడల్ స్మార్ట్ ఫోన్ ధర ఎంతుంటుంది..? మహా అయితే రూ.లక్ష,లేదంటే లక్షన్నర ఉంటుంది. కానీ ఈ ఫోన్ ధర అక్షరాల రూ. 6.83 లక్షలు. ఎందుకంత కాస్ట్ ఉంటుందని అనుకుంటున్నారా? మీరు ఊహించినట్లు ఫోన్‌ని వజ్రాలు, వైడుర్యాలతో డిజైన్ చేయలేదు. అది కేవలం ఫోన్ మాత్రమే. కానీ దానికో స్పెషాలిటీ ఉంది. అందుకే అంత కాస్ట్ ఉంది. ఐఫోన్ 13 సిరీస్ ఇటీవల టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఐఫోన్ 13 సిరీస్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్ 13ప్రో ఫోన్ ధర రూ.119,900, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ధర రూ.129,900 ఉండగా..ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఐఫోన్ 13సిరీస్ ఫోన్ల ధరలు రూ. 6.4లక్షలు, రూ.6.8లక్షలుగా ఉంది. అందుకు కారణం ఆ ఐఫోన్ ప్యానలే. వరల్డ్ వైడ్‌గా ఐఫోన్లు, స్మార్ట్ ఫోన్లకు కేవియర్ అనే సంస్థ లగ్జరీ కేసెస్‌ను తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తుంది. తాజాగా అదే కేవియర్ సంస్థ నిజమైన డైనోసార్ పళ్లతో ఐఫోన్ కెసెస్ను తయారు చేసింది. ప్రస్తుతం ఆ ఫోన్ నెట్టింట్లో సందడి చేస్తుండగా.. ఆ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు బిలియనీర్లు ఎగబడుతున్నారు. 80 మిలియన్ సంవత్సరాల క్రితం కేవియర్ సంస్థ 80 మిలియన్ సంవత్సరాల క్రితానికి చెందిన డైనోసార్ల పళ్లతో ప్రత్యేకంగా ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13ప్రో మ్యాక్స్ ఫోన్ కేసెస్‌లను డిజైన్ చేసింది. 'Tyrannosaurus rex(T. rex)' అనే పేరుతో ఆఫోన్ కేసెస్‌లను మార్కెట్లో విడుదల చేసింది. 1 టెరా బైట్ స్టోరేజ్ ఉన్న ఐఫోన్ 13ప్రో ధర రూ. 6.8 లక్షలుగా ఉండగా ఈ ఫోన్ల గురించి కేవియర్ ప్రతినిధుల పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఈ ఐఫోన్ కేసెస్‌ను డిజైన్ చేసిన డైనోసార్ పళ్లు 80 మిలియన్ సంవత్సరాలని తెలిపారు. డైనోసార్లలో అత్యంత బలమైన జాతి టైరన్నోసారస్. టైరన్నోసారస్ జాతికి చెందిన డైనోసార్లు మనుషుల కంటే 125 రెట్ల శక్తివంతమైందని తెలిపారు. 4 మీటర్ల ఎత్తు,12.3 మీటర్ల పొడవు వరకు ఉండే ఈ డైనోసార్లలో అత్యంత ప్రసిద్ధ జాతులలో ఒకటిగా అభివర్ణించారు. కాబట్టే వినియోగదారుల్ని ఆకర్షించేందుకు డైనోసార్ పళ్లతో ఫోన్ కేసెస్‌ను తయారు చేసినట్లు చెప్పారు. ఫోన్ లో డైనోసార్ పళ్లు టీ రెక్స్ (T. rex) అని పిలిచే ఫోన్ వెనుక ప్యానల్లో కేవియర్ సంస్థ నిజమైన డైనోసార్ పళ్లను ఇమిడ్చింది. ఆ ఫోన్ ప్యానల్‌ను నలుపు, పీవీడీ(Physical vapor deposition) పూతతో, టైటానియంతో తయారు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫోన్ ప్యానల్లో ఉండే డైనోసార్ పళ్లను ఎక్కడ సేకరించారనే విషయాన్ని కేవియర్ సంస్థ వెల్లడించలేదు. చదవండి : యాపిల్ లోగోలో ఇంత విషయం ఉందా..! టచ్ చేసి చూడండి..అదిరిపోద్దంతే..! -
యాపిల్‌పై పిడుగు..! ఇప్పట్లో ఐఫోన్ 13లేనట్లే..!
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల విడుదలైన క్యూ3 ఫలితాలతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. యాపిల్ ఎన్నడు లేనంతగా ఐఫోన్ 13తో ఇండియన్ మార్కెట్లో సత్తచాటడంపై తెగ సంబరపడిపోయారు. కానీ ఆ ఆనందం అంతలోనే ఆవిరైంది. చిప్ కొరత కారణంగా ఆ ప్రభావం ఐఫోన్ 13పై పడింది. దీంతో భారత్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఐఫోన్ల కొరత ఏర్పడనుంది. ఈ కొరత యాపిల్ కు భారీ నష్టాన్ని మిగల్చనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల మనదేశంలో స్మార్ట్ ఫోన్ మూడో త్రైమాసిక (జులై,ఆగస్ట్, సెప్టెంబర్) ఫలితాలు విడుదలయ్యాయి. త్రైమాసికంలో ఐఫోన్13 తో యాపిల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా ఐఫోన్13 తో యాపిల్ ఇండియన్ మార్కెట్లో పట్టు సాధించిందని మార్కెట్ వర్గాలు అభివర్ణించాయి. దీంతో ఐఫోన్13ను భారత్‌లో పెద్ద ఎత్తున అమ్ముకాలు ప్రారంభించాలని టిమ్ కుక్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంతులోనే 'డిగిటైమ్స్ ఏషియా' రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం..ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్13 సిరీస్ స్టాక్ లేవని తెలిపింది. ఫిబ్రవరిలోపు వినియోగదారులకు తగినంత ఐఫోన్లను అందించలేదని రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే డిమాండ్‌కు తగ్గట్లు చిప్ ఉత్పత్తులను పెంచితే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి గ్లోబల్‌గా చిప్కొరత డిమాండ్ తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఐఫోన్ 13 పై భారీ ప్రభావం వరల్డ్ వైడ్‌గా టెక్నాలజీ, ఆటోమొబైల్‌తో పాటు ఇతర రంగాలు సెమీకండక్టర్ చిప్‌పై ఆధారపడ్డాయి. గ్లోబల్ చిప్ కొరత కారణంగా సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్13 అమ్మకాలపై ప్రభావం పడింది. ఇప్పుడు ఆ చిప్ కొరత మనదేశంలో డిమాండ్ ఉన్న ఐఫోన్ 13 సిరీస్ లోని ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్ లపై పడిందని డిగిటైమ్స్ ఏషియా వెల్లడించింది. కానీ డిమాండ్‌కు తగ్గట్లు ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు లేవని స్పష్టం చేసింది. యాపిల్ కు భారీ నష్టమే క్యూ3 (త్రైమాసికం)లో చిప్ కొరత కారణంగా యాపిల్ సుమారు 6 బిలియన్ డాలర్లను కోల్పోయింది. దీంతో పాటు చాలా దేశాల్లో ఫెస్టివల్ సీజన్ కారణంగా పెరిగిన సేల్స్‌కు అనుగుణంగా ప్రొడక్ట్‌లు లేకపోవడం, చిప్ కొరత ఏర్పడడం మరో కారణమని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. అదే సమయంలో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల కోసం యాపిల్ ఐపాడ్లతో పాటు మిగిలిన ప్రొడక్ట్‌ల ఉత్పత్తిని తగ్గించింది. ఐఫోన్లకు చిప్‌లను అందించింది. కానీ తాజాగా భారత్‌తో పాటు మిగిలిన దేశాల్లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు తగినంత లేకపోవడం యాపిల్ భారీ ఎత్తున నష్టపోయే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు చిప్‌లు అందుబాటులో ఉంటేనే నష్టాల్ని నివారించ వచ్చనేది మరికొన్ని రిపోర్ట్లు నివేదికల్లో పేర్కొంటున్నాయి. ఏది ఏమైనా చిప్ కొరత యాపిల్‌కు పెద్ద దెబ్బేనని, ఆటోమోటివ్ రంగంలో మహమ్మారి, పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఏడాది ప్రారంభం నుంచి సెమీకండక్టర్ కొరత ఏర్పడింది. 2023లోపు ఈ సమస్య ఇలాగే కొనసాగుతుందని ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ అన్నారు. చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్ -
యాపిల్ భారీ మార్పులు, ఐఫోన్-14 ఫీచర్స్ లీక్..మాములుగా లేవుగా!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ ఫీచర్లు లీకయ్యాయి. లీకైన ఫీచర్ల యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటుండగా ఐఫోన్ 14సిరీస్ ఫోన్లలో 48 మెగా పిక్సెల్ ప్రైమరీ షూటర్, న్యూ చిప్ సెట్ తో పాటు 3ఎన్ఎమ్ లేదంటే 4ఎన్ఎమ్ ప్రాసెసర్లు ఉండనున్నాయి. కొత్తగా వస్తున్న ఐఫోన్ 14సిరీస్ నుంచి ఇకపై అన్నీ ఫోన్లకు పోర్ట్ లెస్ డిజైన్‌తో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఐఫోన్ 13 సిరీస్‌తో యూజర్లను ఆకట్టుకున్న యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ విడుదలతో అన్నీదేశాల స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఐఫోన్ 14 ఫీచర్లు ►వచ్చే ఏడాది స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదల కానున్న ఐఫోన్ 14 సిరీస్ ఫీచర్లు యూజర్లను కట్టిపడేస్తున్నాయి.యాపిల్ సంస్థ ఐఫోన్ 13 సిరీస్‌లో ఐఫోన్ మిని, ఐఫోన్ 13, ఐఫోన్ 13ప్రో, ఐఫోన్ 13ప్రో మ్యాక్స్‌లను విడుదల చేసింది. ఐఫోన్ 14సిరీస్‌లో మాత్రం 6.1 అంగుళాలతో ఐఫోన్ 14ప్లస్, 6.7అంగుళాలతో ఐఫోన్ 14మ్యాక్స్ మోడల్స్‌తో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ►ఇక డిజైన్ విషయంలో యాపిల్ సంస్థ ఐఫోన్ 14సిరీస్ లో భారీ మార్పులు చేయనుంది. ఇప్పటికే డిజైన్ల మార్పులపై యాపిల్ ప్రతినిధులు పనిచేస్తున్నారని ప్రముఖ స్మార్ట్ ఫోన్ ఎనలిస్ట్ మార్క్ గుర్మాన్ తెలిపారు. ►మారనున్న డిజైన్లపై ఐఫోన్లను భారీ ఎత్తున అమ్మకాలు జరిపే 'జాన్ ప్రాసెసర్ మాట్లాడుతూ..ఐఫోన్లలో నాచ్ డిజైన్‌ను తొలగించి..ఐఫోన్ 14సిరీస్ నుంచి పంచ్ హోల్ కెమెరా ఉండగా, ప్రోమోడల్స్లో లిమిటెడ్‌గా ఓఎల్ఈడీ ప్యానల్ కింద ఫేస్ ఐడి సెన్సార్లను డిజైన్ చేయనున్నట్లు' తెలిపారు. ► ఐఫోన్ 14లో..ఐఫోన్ 4 డిజైన్లు ఉండనున్నాయి. ముఖ్యంగా ఫోన్ ఫ్లాట్ సైడ్ భాగంలో ఉండే వ్యాల్యూమ్, మ్యూట్ బటన్లు రౌండ్‌గా ఉండనున్నాయి. ఫోన్ వెనక భాగంలో ఫినిషింగ్ గ్లాస్ ఉండగా..సైడ్లు టైటానియంతో తయారు చేసే అవకాశం ఉందని జాన్ ప్రాసెసర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్యానెల్ కెమెరా బంప్ లేకుండా పూర్తిగా ఫ్లాట్‌గా ఉండనుంది. ►లీకైన రిపోర్ట్‌ల ప్రకారం.. ఐఫోన్ 14లో టచ్ ఐడి ఉండనుంది. ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీలో టచ్ ఐడి పవర్ బటన్‌లో డిజైన్‌తో ఉంది. ►ఐఫోన్ 14 సిరీస్ మోడళ్లకు 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, 60హెచ్‌జెడ్ ఎల్టీపీఎస్ ప్యానెల్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఆటో ఫోకస్ ఫీచర్, వెనుక కెమెరా 12మెగాపిక్సెల్ సెన్సార్ నుండి అప్గ్రేడింగ్తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను పొందుతుంది. ►విడుదలయ్యే ఐఫోన్లలో స్టాండడ్ చిప్సెట్లు ఉండనున్నాయి. ఐఫోన్ 13లో 3 ఎన్ఎం చిప్ సెట్లు ఉండగా..ఐఫోన్ 14 చిప్సెట్లు 4 ఎన్ఎంలు ఉండనున్నాయి. ►ఐఫోన్లు పూర్తిగా పోర్ట్‌లెస్ డిజైన్‌కు మారుతాయని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. కానీ ఐఫోన్ 13లో సైతం ఈ పోర్ట్ లెస్ డిజైన్‌తో విడుదల చేయలేదు. అయితే ఐఫోన్14 వైర్‌లెస్‌గా మారే అవకాశం ఉంది. ఐఫోన్ 14 విడుదల, ధర యాపిల్ ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో నిర్వహించే ఈవెంట్లో ఐఫోన్లను విడుదల చేస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 14 యాపిల్ ఐఫోన్ 13 ని విడుదల చేసింది. వచ్చే ఏడాది యాపిల్ ఈవెంట్లో ఐఫోన్ 14సిరీస్ ఫోన్లు విడుదల కానున్నాయి.ఇక ఐఫోన్ 14సిరీస్ 128జీబీ స్టోరేజ్ ఐఫోన్ 13 బేస్ వేరియంట్ రూ.79,990గా ఉండగా ఐఫోన్ 14 ధర కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉందని లీకైన రిపోర్ట్‌ల ఆధారంగా తెలుస్తోంది. చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్ -
దివాళీ బంపర్ ఆఫర్, ఐఫోన్‌పై కళ్లు చెదిరేలా భారీ డిస్కౌంట్లు
మనదేశంలో దసరా, దివాళీ ఫెస్టివల్ సేల్స్ కొనసాగుతున్నాయి. ఈ ఫెస్టివల్ సేల్స్‌లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు భారీ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఊహించని రీతిలో ఐఫోన్ 13 సేల్స్ జరగడంపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సైతం ఆనందంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పనిలో పనిగా భారత్‌లో ఐఫోన్13పై భారీ ఆఫర్లను ప్రకటించారు. యాపిల్ సంస్థ సెప్టెంబర్ 14న ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా ఐఫోన్ 13 ను విడుదల చేసింది. దాని ధర రూ.79,900 ఉంది. తాజాగా ఈ ఫోన్‌పై రూ.14 వేల నుంచి రూ.24వేల వరకు ఆఫర్‌ను ప్రకటించారు. ఐఫోన్ 13ను డిస్కౌంట్, ఎక్ఛేంజ్, క్యాష్‌బ్యాక్ తో రూ.55.900కే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 13పై డిస్కౌంట్ ఐఫోన్ 13పై రూ.24 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ వినియోగదారులు రూ.6 వేల వరకు డిస్కౌంట్‌తో పాటు, 64జీబీ పాత ఐఫోన్ ఎక్స్ఆర్ ఫోన్ పై ఎక్ఛేంజ్ కింద రూ.15వేలు, అదనంగా మరో రూ.3వేలు బోనస్ అందిస్తున్నట్లు యాపిల్ సంస్థ తెలిపింది. సంతోషంలో టిమ్ కుక్ ఇటీవల న్యూజూ గణాంకాల ప్రకారం.. 91.2 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో చైనా తొలిస్థానంలో ఉండగా భారత్ 43.9 కోట్ల మంది యూజర్లతో రెండో స్థానంలో ఉన్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో యాపిల్ సంస్థ బలంగా ఉన్న..భారత్‌లో యాపిల్‌కు చెందిన ఐఫోన్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరిగేవికావు. సేల్స్ పెంచేందుకు టిమ్ కుక్ సైతం భారత్‌పై ఫోకస్ చేశారు. దేశంలో సొంత యాపిల్ స్టోర్లు, మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను ప్రారంభించే పనిలో ఉన్నారు. అదే సమయంలో యాపిల్ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే 'యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్' ను ఈ ఏడాది నిర్వహించింది. అయితే ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా సెప్టెంబర్ 14న నిర్వహించిన ఈవెంట్లో టిమ్‌కుక్ ఐఫోన్ 13ను విడుదల చేశారు. విడుదల తరువాత యాపిల్ ఫోన్ అమ్మకాలు జోరుగా సాగాయి. ఇదే విషయాన్ని టిమ్ కుక్ బహిరంగంగా ప్రకటించారు. పనిలో పనిగా దీపావళి సందర్భంగా ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. చదవండి: అమెజాన్ అదిరిపోయే ఆఫర్, ఐఫోన్ 11పై భారీ డిస్కౌంట్ -
యాపిల్‌కు భారీ షాక్, ఒక్క సెకన్లో ఐఫోన్13 హ్యాక్
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమిని వెనక్కి నెట్టిన యాపిల్ సంస్థకు భారీ షాక్ తగిలింది. ఇటీవల యాపిల్ విడుదల చేసిన 'ఐఫోన్ -13 ప్రో'ను సెకన్ల వ్యవధిలో 'వైట్ హ్యాట్' హ్యాకర్స్ హ్యాక్ చేశారని చైనాకు చెందిన టెక్ అనాలసిస్ సంస్థ ఐథోమ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. షావోమిని వెనక్కి నెట్టింది.. కానీ గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ ప్రకారం..ఈ ఏడాది క్యూ3 (జులై నుంచి సెప్టెంబర్) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో టెక్ దిగ్గజం యాపిల్ 15 శాతం వాటాతో.. చైనాకు చెందిన షావోమిని అధిగమించింది. తిరిగి రెండో స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. అందుకు కారణం ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌కు విపరీతమైన డిమాండ్ పెరగడమేనని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. యాపిల్ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే 'యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్'ను ఈ ఏడాది నిర్వహించింది. ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా సెప్టెంబర్ 14న నిర్వహించిన ఈవెంట్లో యాపిల్ సంస్థ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. సెక్యూరిటీ విషయంలో తిరుగు లేదు ఈ సందర్భంగా యాపిల్ ప్రతినిధులు మాట్లాడుతూ తాము విడుదల చేసే, లేదంటే విడుదల కానున్న ఐఫోన్లలో ప్రైవసీ,సెక్యూరిటీ విషయంలో రాజీపడబోమని తెలిపారు. కానీ చైనా 'వైట్ హ్యాట్' హ్యాకర్స్ మాత్రం ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లను ఎలా హ్యాక్ చేయొచ్చో..తాజాగా యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 13సిరీస్ ఫోన్లను సెకన్లలో హ్యాక్ చేయొచ్చని తెలిపారు. ఒక్క సెకన్లో హ్యాక్ చేశారు ఇటీవల చైనాలో 4వ 'టియాన్ఫు కప్' ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ కాంటెస్ట్ జరిగింది. ఈ కాంటెస్ట్‌లో వైట్ హ్యాట్ హ్యాకర్ ఐఫోన్ 13 ప్రోని సెకన్లలో హ్యాక్ చేశాడు. హ్యాక్ చేసిన హ్యాకర్ ఐఫోన్లో ఉన్న ఫోటో ఆల్బమ్, యాప్‌లకు యాక్సెస్ చేశాడు. అంతేకాదు అందులో ఉన్న డేటాను ఈజీగా డిలీట్ చేయడం సాధ్యమైందని ఐథోమ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. మరి ఈ ఐఫోన్13 ప్రో హ్యాకింగ్ పై ఐఫోన్ ప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. వైట్ హ్యాట్ హ్యాకర్లు అంటే ఎవరు వైట్ హ్యాట్ హ్యాకర్లు లేదా ఎథికల్ హ్యాకర్స్. ఈ హ్యాకర్స్‌ను ఆయా సంస్థల్లో లేదంటే, టెక్నాలజీలోని లోపాల్ని గుర్తిస్తారు. నిబంధనలకు అనుగుణంగా లోపాల్ని గుర్తించేలా పనిచేసే వీళ్లని ఆయా టెక్ సంస్థలు, లేదంటే ప్రభుత్వాలు సైతం నియమించుకుంటాయి. చదవండి : ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
ఐఫోన్13 ఎంట్రీతో షావోమీకు భారీ షాక్...!
ఎట్టకేలకు గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఆపిల్ ప్రముఖ చైనీస్ కంపెనీ షావోమీని అధిగమించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (క్యూ 3) ఆపిల్ 15 శాతం వాటాతో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెండవ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌కు వీపరితమైన డిమాండ్ రావడంతో షావోమిను వెనక్కి నెట్టేసింది. ఎప్పటిలాగానే శాంసంగ్ మొదటి స్థానంలో నిలిచింది. గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో శాంసంగ్ 23 శాతం వాటాను దక్కించుకుంది. చదవండి: నోకియా నుంచి టఫెస్ట్ స్మార్ట్‌ఫోన్...! లాంచ్ ఎప్పుడంటే.. గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ అందించిన ప్రాథమిక డేటా ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో షావోమీ 14 శాతం వాటాను దక్కించుకోగా వివో, ఒప్పో స్మార్ట్‌ఫోన్స్ 10 శాతం వాటాతో తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు 6 శాతం మేర తగ్గినట్లు పేర్కొంది. చిప్స్ కొరత.. అంతర్జాతీయంగా సెమికండక్టర్స్ కొరతతో పలు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తీవ్రంగా సతమతమయ్యాయి. చిప్స్ కొరత ఉన్నప్పటికీ పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఉత్పత్తి విషయంలో రాజీ పడలేదు. చిప్స్ కొరత పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఫోన్ ధరలను కూడా పెంచాయని కానలిస్ ప్రిన్సిపల్ ఆనలిస్ట్ బెన్ స్టాన్టాన్ వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు చిప్స్ కొరత 2022 వరకు వేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' మరో రికార్డు -
ఆపిల్ కొంపముంచిన చిప్స్...!
ప్రపంచవ్యాప్తంగా సెమికండక్టర్స్(చిప్) కొరత పలు కంపెనీలను తీవ్రంగా వేధిస్తోంది. చిప్స్ కొరతతో పలు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. తాజాగా చిప్స్ కొరత ఆపిల్‌ను కూడా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపిల్‌కు భారీ దెబ్బ...! గత నెలలో ఆపిల్ ఐఫోన్13 స్మార్ట్ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.కాగా ఇప్పుడు సెమికండక్టర్ కొరత ఐఫోన్13 స్మార్ట్ఫోన్ల తయారీపై పడనుంది. దీంతో ఆపిల్‌కు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. చిప్ కొరతతో సుమారు 10 మిలియన్ల ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లపై తయారీ భారీ ప్రభావం పడనుంది. ఈ ఏడాది చివరినాటికి సుమారు 90 మిలియన్ల ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఉత్పతి చేయాలని ఆపిల్ భావించింది. ఆపిల్ చిప్స్‌ను అందిస్తోన్నబ్రాడ్కామ్, టెక్సాస్ ఇన్స్ట్రూమెంట్స్ చిప్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి.దీంతో ఐఫోన్13 స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిపై భారీ ప్రభావమే చూపనున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. చదవండి: సౌరవ్ గంగూలీపై కోకాకోలా కీలక నిర్ణయం..! ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో పోలిస్తే బెటర్...! ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో పోలిస్తే ఆపిల్‌పై చిప్స్ కొరత ప్రభావం తక్కువగా ఉన్నట్లు ఆపిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. చైనా, తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో కరోనా కారణంగా టెక్ దిగ్గజం ఆపిల్‌తో సహా ఇతర టెక్ కంపెనీలకు అందించే ఫోన్ విడి భాగాల(కాంపోనెంట్స్)పై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో ఊహించిన దానికంటే చిప్ సెట్ల కొరత చాలా ఎక్కువ ఉందని పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. చదవండి: భారత్ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం..! ఇండియన్స్‌తో మామూలుగా ఉండదు..! -
'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్
doctor uses iPhone 13 Pro Max camera for eye treatment. వైద్య చరిత్రలో ఇదో అద్భుతం.అతి సున్నితమైన కంటి చూపును మెరుగు పరిచేందుకు ఓ డాక్టర్ యాపిల్ ఐఫోన్13ను ఉపయోగించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.ఫోన్లో ఉన్న మ్యాక్రోమోడ్ టెక్నాలజీని జోడించి కంటి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్లు సైతం 'డాక్టర్ బాబు'..కార్నియా రాపిడి నయమైందని అంటున్నారు.వినడానికి వింతగా ఉన్న ఇది మెడికల్ మిరాకిల్ అని అంటున్నారు వైద్య నిపుణులు. అమెరికా కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో అనే ప్రాంతానికి చెందిన టామీ కార్న్ టెక్సాస్ సౌత్ వెస్ట్రన్ మెడికల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. అనంతరం 21 సంవత్సరాలుగా కంటి వైద్యుడిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం షార్ప్ మెమోరియల్ ఆస్పత్రిలో ప్రముఖ ఆప్తమాలజిస్ట్‌గా,డిజిటల్ ఇన్నోవేటర్(టెక్నాలజీతో చేసే వైద్యం)గా పనిచేస్తున్నారు. అయితే తాజాగా ఈయన,ఐఫోన్13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్‌ని ఉపయోగించి'ఐ'ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంతేకాదు ఈ టెక్నాలజీ ద్వారా కంటి చూపు ఏ స్థాయిలో ఉందో గుర్తించి ఫోటోల్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఆ ఫోటోల సాయంతో కార్నియా ఆపరేషన్ తరువాత వచ్చే రాపిడి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఇలా సాధారణ ట్రీట్మెంట్తో పరిష్కరించలేని ఎన్నో సున్నితమైన సమస్యల్ని మ్యాక్రోమోడ్ ఫీచర్ తో కంటికి ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో లింక్డిన్లో పోస్ట్ చేశారు. మ్యాక్రోమోడ్ ఫీచర్ అంటే? ప్రొఫెషనల్‌గా ఫోటోలు తీయాలంటే ఫోటోగ్రాఫర్ కావాల్సిన అవసరం లేదు. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. సినిమాటిక్ మోడ్, మ్యాక్రోమోడ్ ఫీచర్ల సాయంతో సాధారణ లొకేషన్లలో అందంగా ఫోటోల్ని క్యాప్చర్ చేయోచ్చు.ఇప్పుడు ఐఫోన్13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్ ఫీచర్‌ను ఉపయోగించే డాక్టర్ టామీ కార్న్ కంటి వైద్యం చేస్తున్నారు. ఫోన్లో ఎన్ని ఫోటో ఫీచర్స్ ఉన్నా..మ్యాక్రోమోడ్ చాలా ప్రత్యేకం. ఉదాహరణకు కంట్లో ఉన్న అతి సూక్ష్మమైన నలుసుని సైతం అడ్వాన్స్డ్ మ్యాక్రోమోడ్ టెక్నాలజీతో హెచ్డీ క్వాలిటీ ఫోటోల్ని తీయొచ్చు. ఐఫోన్13 ప్రో మ్యాక్స్‌తో ట్రీట్మెంట్.. కంటిలో ముందు భాగాన్ని కార్నియా అంటారు. ఇది చాలా పలచగా ఉంటుంది. వెలుతురిని కంటి లోపలి భాగాలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఇటీవల ఓ వ్యక్తి కార్నియా ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ ఆపరేషన్ తరువాత తాత్కాలికంగా కంటి లోపల రాపిడి జరుగుతుంది. ఆ సమస్యను అధిగ మించేలా ఐఫోన్ 13లో ఉన్న మ్యాక్రో మోడ్‌తో కంట్లో కార్నియాను చెక్ చేశారు. అనంతరం ఆ సమస్య గురించి డాక్టర్ టామీకార్న్ పేషెంట్‌ను అడగ్గా..తన కంటి చూపు మెరుగుపడిందని సంతోషంగా చెప్పాడు. ఆ పేషెంట్‌కు అందించిన ట్రీట్మెంట్ విధానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: ఎవరబ్బా ఈ వీడియో తీసింది.. ఓ రేంజ్లో ఉంది -
ఎవరబ్బా ఈ వీడియో తీసింది.. ఓ రేంజ్లో ఉంది
అందమైన ఫొటోలు, వీడియోలు తీయాలంటే ప్రొఫెషనల్ కెమెరాపర్సన్ అయ్యి ఉండాలా?. చేతిలో ఫోన్, కెమెరాలు ఉంటే చాలూ తీసేయొచ్చు. కాకపోతే ఈరోజుల్లో సోషల్‌మీడియాలో షేర్ చేయడానికి ‘జస్ట్ వాంట్ టు షూట్ ఏ లిటిల్ వీడియో’ అనుకునే వాళ్లు.. అది కచ్చితంగా అందరూ మాట్లాడుకునేలా ఉండాలని అనుకుంటున్నారు. ఇందుకోసం ‘క్వాలిటీ’ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. అలాంటి వాళ్ల కోసం సినిమాటిక్ మోడ్‌ను అందిస్తోంది ఐఫోన్ 13. పైన మీరు చూస్తున్నది మెక్సికో సిటీలో గత కొంతకాలంగా తీసిన దృశ్యాలు. ఎంత బాగున్నాయో కదా! ఏదో హాలీవుడ్ రేంజ్ వీడియోలాగా అనిపిస్తుందా? కానీ, ఇది తీసింది ఓ ఫోన్‌తో. అదీ ఐఫోన్ 13 ప్రోతో. ఇందులోని సినిమాటిక్ మోడ్ వెర్షన్ ఇప్పుడు యూత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీడియోగ్రాఫర్ జె.మారిసన్, సింగర్ జూలియ వోల్ఫ్(ఫాలింగ్ ఇన్ లవ్ సాంగ్ ఫేమ్) మ్యూజిక్ వీడియోలను స్టూడియోలలో కాకుండా రోడ్ల మీద చిత్రీకరించి శబ్భాష్ అనిపించుకున్నాడు. దీనికి కారణం ఐఫోన్13 సినిమాటిక్ మోడ్ అంటాడు మారిసన్. ‘ఐఫోన్13 ప్రో నా చేతుల్లోకి తీసుకోగానే మొదట నేను ఆసక్తితో పరీక్షించింది సినిమాటిక్ మోడ్. చాలా షార్ప్ అనిపించింది. మీలో టాలెంట్ తక్కువైనా సరే, సాధారణ లొకేషన్స్ అయినా సరే ఖరీదైన లుక్ తీసుకురావచ్చు. కిట్ భారం లేకుండా ట్రావెల్ వీడియోలకు సినిమాటిక్ లుక్ ఇవ్వొచ్చు’ అంటున్నాడు మారిసన్. అడ్వాన్స్డ్ వీడియో రికార్డింగ్ ఫీచర్ ‘సినిమాటిక్ మోడ్’ ఐఫోన్13 నాలుగు మోడల్స్‌లోనూ అందుబాటులో ఉంది. చదవండి: ఐఫోన్-13 ప్రీ-బుకింగ్స్‌లో దుమ్మురేపిన ఇండియన్స్..! సెప్టెంబర్ 14 ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్ ఈవెంట్’ జరిగిన తరువాత యాపిల్ ఐఫోన్13 సిరీస్‌లోని లాంగర్ బ్యాటరీలైఫ్, హైయర్ స్క్రీన్బ్రైట్నెస్, మెరుగైన కెమెరాసిస్టమ్...ఇలా ఆసక్తికరమైన విషయాలు, ఫెంటాస్టిక్ అప్గ్రేడ్ల గురించి మాట్లాడుకోవడం ఎక్కువైంది. వీటిలో యూత్‌ను ఆకట్టుకుంటున్న ఫీచర్... సినిమాటిక్ మోడ్. డిజిటల్ ఫొటోగ్రఫీ శకం మొదలైన తరువాత ఆనాటి ఫిల్మ్కెమెరాలతో సాధ్యమైనవి సాధ్యం చేయడం తోపాటు ‘రీల్’కు అందని సూక్ష్మఅంశాలను కాప్చర్ చేయడం, పరిమితులతో కూడిన విన్యెటింగ్(రిడక్షన్ ఆఫ్ ఇమేజెస్ బ్రైట్నెస్) పరిధిని పెంచడం లాంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ వీడియో ప్రేమికులను ఆకట్టుకునే ఫీచర్లకు ప్రాధ్యానత ఇస్తుంది. తాజా ‘సినిమాటిక్ మోడ్’ హెడ్లైన్ న్యూఫీచర్గా నిలిచింది. ‘సినిమాటిక్ మోడ్’తో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే, ముఖ్యంగా...వీడియో బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేయవచ్చు. ఆటో–ఫోకస్ సెట్ చేసుకోవచ్చు. పోట్రాయిట్ మోడ్ వీడియోలకు, ఫోకస్ పాయింట్లను ఎంపిక చేసుకోవడానికి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ట్రెడిషనల్ వీడియో మోడ్‌తో పోల్చితే ‘స్పెషల్’ మోడ్‌గా చెప్పే దీనిలో రిజల్యూషన్, ఫ్రేమ్‌రేట్ మెరుగ్గా ఉంటుంది. డెప్త్ ఇన్ఫర్మేషన్(సైట్లో ఉండే అబ్జెక్ట్స్కు కెమెరాకు మధ్య ఉండే దూరం)ను రికార్డ్ చేస్తుంది. ఈ సమాచారంతో వీడియో షూట్ చేసిన తరువాత కూడా సీన్లో ఫోకస్‌ను షిఫ్ట్ చేసుకోవచ్చు. మోడ్రన్ డే మూవీస్‌లో ‘డెప్త్ ఆఫ్ ఫీల్డ్’ కీలక పాత్ర పోషిస్తుంది. ‘డెప్త్ ఆఫ్ ఫీల్డ్’ను ఎడిట్ చేసుకోవడానికి ఇక ప్రొఫెషనల్ కెమెరాలు మాత్రమే అవసరం లేదు. మూవీస్‌లో కనిపించే ‘ఐకానిక్ విజువల్ ఎఫెక్ట్’ను సినిమాటిక్మోడ్తో పునఃసృష్టి చేసే ప్రయత్నం చేసింది ఐఫోన్ 13. డాల్బీ విజన్ హెచ్‌డీఆర్‌లో సినిమాటిక్మోడ్ వీడియోలను రికార్డ్ చేస్తుంది. స్థూలంగా చెప్పాలంటే స్టూడియో లు, ప్రొఫెషనల్ లైటింగ్, ఖరీదైన సాంకేతిక పరికరాలు అవసరం లేకుండానే... వీడియోలకు సినిమాటిక్ లుక్ తీసుకు రావచ్చు. చదవండి: Apple iPhone 13 .. యాపిల్ అదిరిపోయే ఆఫర్ -
ఐఫోన్-13పై చిప్ దెబ్బ..కొన్ని వారాలు ఎదురు చూడాల్సిందేనా?
ప్రపంచ దేశాల్ని సెమీ కండక్టర్ల(చిప్) కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఇప్పుడు ఆ సమస్య ఇండియాలో యాపిల్ ఐఫోన్ -13 అమ్మకాలపై పడింది. సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమైన ఐఫోన్-13 సిరీస్ మోడల్ అమ్మకాల్లో ఉన్న ఫోన్ సేల్స్ పూర్తయ్యాయి.దీంతో ఐఫోన్-13 ఫోన్ల కొరత ఏర్పడింది. మళ్లీ కొత్త ఫోన్లను కొనుగోలు చేయాలంటే ఒకటి నుంచి ఐదువారాల వరకు ఎదురు చూడాల్సి ఉందని ఎకనమిక్ టైమ్స్ రిపోర్ట్ విడుదల చేసింది. ఎకనమిక్ టైమ్ ప్రకారం.. చైనా, తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో కరోనా కారణంగా టెక్ దిగ్గజం యాపిల్‌తో సహా ఇతర టెక్ కంపెనీలకు అందించే ఫోన్ విడి బాగాల(కాంపోనెంట్స్)పై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో ఊహించిన దానికంటే చిప్ సెట్ల కొరత చాలా ఎక్కువ ఉందని పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు సెమీ కండక్టర్ల కొరతపై మార్కెట్ ట్రాకర్ ఐడిసి ఇండియా రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ మాట్లాడుతూ..ఐఫోన్ 13 కొత్త మోడళ్లు ఇండియన్ మార్కెట్లో లేకపోవడానికి చిప్ సెట్లు, ఫోన్ విడిభాగాల కొరతే కారణమని అన్నారు. కాబట్టే భారత్‌లో యాపిల్ వాచ్‌తో పాటు ఇతర ప్రాడక్ట్‌ల విడుదల తేదీల్ని ఖరారు చేయలేకపోతున్నట్లు తెలిపారు. ఐఫోన్ 12 సిరీస్ మోడళ్ల కొరత చాలా తక్కువగా ఉందని, ఆ మోడల్ ఫోన్లు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. చదవండి: ఇండియన్ మార్కెట్లో ఐఫోన్13 సిరీస్ ధరలు -
యాపిల్ అదిరిపోయే ఆఫర్, ఐఫోన్ 13పై రూ.46వేల వరకు..
ఐఫోన్ లవర్స్‌కు టెక్ దిగ్గజం యాపిల్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ కొనుగోలుదారులకు రూ.46 వేల వరకు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ ఆఫర్‌ను దక్కించుకోవాలంటే ఐఫోన్ 13 లవర్స్ 'ట్రేడ్ ఇన్ ఆఫర్'లో పాల్గొనాల్సి ఉంటుంది. ఎక్సేంజ్ ఆఫర్లు ఎలా ఉన్నాయి ట్రేడ్ ఇన్ ఆఫర్లో ఐఫోన్ 12ప్రో మ్యాక్స్ ఎక్ఛేంజ్‌లో రూ.46,120 వరకు, ఐఫోన్ 12 ప్రో పై రూ.43,255, బేసిక్ ఐఫోన్ 12పై రూ.31,120, ఐఫోన్ 12 మినీ పై రూ.25,565, ఆండ్రాయిడ్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఫోన్ పై రూ.13,085వరకు సొంతం చేసుకోవచ్చు. ట్రేడ్ ఇన్ ఆఫర్లో ఎలా పాల్గొనాలి యాపిల్ ఆన్లైన్ షాప్ ద్వారా ఐఫోన్13 ఫోన్ బుక్ చేసుకునే ముందు.. కొనుగోలు దారులు ట్రేడ్ ఇన్ ఆఫర్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆన్ లైన్లో జరిగే ట్రేడ్ ఇన్ ఆఫర్లో యాపిల్ సంస్థ మీ పాత ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. మీరు ఇచ్చిన సమాధానాల ఆధారంగా మీకు ఐఫోన్ 13 ఫోన్‌కు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను ప్రకటిస్తుంది. మీరు కరెక్ట్‌గా సమాధానం చెప్పి ఐఫోన్ 13 ఫోన్ ను బుక్ చేసుకోవచ్చు. అనంతరం ఆన్లైన్లో మీకు ఐఫోన్ 13ఫోన్ డెలివరీ టైం, డేట్ చూపిస్తుంది. ఆ టైం కు ఐఫోన్ ప్రతినిధులు ఐఫోన్ 13 ఫోన్‌ను మీరు ఇచ్చిన అడ్రస్‌కు డెలివరీ చేస్తారు. ఎక్ఛేంజ్ ఆఫర్లో ఐఫోన్ 13ను తీసుకోవాలి ఐఫోన్ 13 డెలివరీ టైంకు ట్రేడ్ ఇన్ ఆప్షన్లో ఇచ్చిన అడ్రస్‌కు ఆపిల్ ప్రతినిధులు వస్తారు. వచ్చే ముందు మీరు ఏ ఫోన్ పై ట్రేడ్ ఇన్ ఆప్షన్ నిర్వహించారో ఆ ఫోన్లను సిద్ధం చేసుకోవాలి. ప్రతినిధులు మీ అడ్రస్‌కు వచ్చిన వెంటనే మీ పాత ఐఫోన్ 12 సిరీస్ ఫోన్, ఆండ్రాయిండ్ ఫోన్లను వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్లు మీరు ట్రేడ్ ఇన్ ఆప్షన్ లో మీరు మీఫోన్ గురించి చెప్పినట్లుగా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. అనంతరం మీరు చెప్పింది నిజమే అయితే ఆన్లైన్ లో అప్రూవల్ ఇస్తారు. ఐఫోన్ 13ను మీకు ఆఫర్ ప్రైస్‌కే అందిస్తారు. చదవండి: ఐఫోన్-14 ఫీచర్స్ లీక్.. మాములుగా లేవుగా! -
ఐఫోన్-13 ప్రీ-బుకింగ్స్‌లో దుమ్మురేపిన ఇండియన్స్..!
ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఈ నెల 14న ఆపిల్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను సెప్టెంబర్ 17 నుంచి ప్రీ-బుకింగ్ ఆర్డర్స్ జరుగుతాయని ఆపిల్ ప్రకటించింది. తాజాగా జరిగిన ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ ప్రీ-బుకింగ్స్‌లో ఇండియన్స్ దుమ్మురేపారు. విశ్వసనీయ రిటైల్ ట్రేడ్ వర్గాల ప్రకారం.. గత ఏడాది లాగానే రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా ఐఫోన్-13 స్మార్ట్ఫోన్లపై అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రేండ్ ప్రకారం గత త్రైమాసికంలో ఐఫోన్-12 సిరీస్ స్మార్ట్ఫోన్ల అమ్మకాల తరహాలో ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. చదవండి: Vodafone Idea Offers On IPhone 13: ఐఫోన్-13 కొనుగోలుపై వోడాఫోన్-ఐడియా బంపర్ ఆఫర్...! ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలతో ఈ త్రైమాసికంలో ఆపిల్ గణనీయమైన వృద్దిని సాధిస్తుందని వ్యాపార నిపుణులు అంచనా వేశారు. వరుసగా వస్తోన్న పండుగల సీజన్‌తో భారత్‌లో ఆపిల్ భారీ వృద్దిని నమోదుచేస్తోందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరక్టర్ తరుణ్ పాఠక్ పేర్కొన్నారు. అందుకు ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్ల ప్రీ-బుకింగ్స్ ఆర్డర్సే స్పష్టంచేస్తుందని తెలిపారు. ఐడిసి ఇండియా, దక్షిణాసియా రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ మాట్లాడుతూ, రాబోయే పండుగ సీజన్లో ఐఫోన్-12 సిరీస్, పాక్షికంగా ఐఫోన్-13, 13 ప్రో స్మార్ట్‌ఫోన్స్ ద్వారా యాపిల్ మంచి ఊపందుకుంటుందని చెప్పారు. సెప్టెంబర్ 24 నుంచి ఈ నాలుగు కొత్త ఐఫోన్ -13 స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ రూ. 69,900 నుంచి ప్రారంభించి ప్రో మాక్స్ రూ .1,29,900 వరకు అందుబాటులో ఉన్నాయి. చదవండి: ఐఫోన్-13ను ఎగతాళి చేసిన గూగుల్ నెక్సస్..! -
ఫీచర్లు లీక్ : ఐఫోన్13 కంటే చిన్నది, అరచేతిలో ఇమిడిపోతుంది
స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం శాంసంగ్ విడుదల చేయనున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. అయితే ఈ ఫీచర్లు అచ్చం ఐఫోన్ 13తరహాలో ఉండడంతో యూజర్లు ఈ ఫోన్ గురించి తెలుసుకునేందుకు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. యూజర్లను ఆకట్టుకున్న శాంసంగ్ కు చెందిన 'టిప్‌స్టర్, ఐసీఆ యూనివర్స్' ఫోన్ తరహాలో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ఆకట్టుకోనుందని ప్రముఖ టెక్ రివ్యూవర్ (టిప్‌స్టార్) యోగేష్ బ్రార్ తెలిపారు. ఈ ఫోన్ ఫీచర్లు..ఐఫోన్ 13 ఫీచర్ల మాదిరిగా లెగ్త్, విడ్త్,థిక్ నెస్‌లు ఉన్నాయని చెప్పారు. వీటితో పాటు 3,700ఎంఏహెచ్ బ్యాటరీ, టిన్నీ స్టాండర్డ్‌లో ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్, పవర్ కన్జ్యూమింగ్ కు ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 22 సైజ్ ఐఫోన్ 13 కంటే చాలా చిన్నగా ఉంటుందని.. అరచేతిలో ఇమిడిపోతుందని తెలిపారు. ఐఫోన్ 13 కంటే గెలాక్సీ ఎస్ 22 పొడవు, వెడల్పు చిన్నగా ఉంటుందని చెప్పిన యోగేష్.. ఫోన్ సైజ్ 146.7 x 71.5 x 7.7 మిల్లీ మీటర్లుగా ఉందని కాబట్టే ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్22.. ఐఫోన్ 13కంటే చిన్నగా ఉందన్నారు. 6.06-అంగుళాల డిస్ప్లేతో గెలాక్సీ ఎస్ 22 ఆండ్రాయిడ్ మార్కెట్లో అత్యంత కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌లలో ఒకటిగా నిలవగా.. చివరిసారిగా శాంసంగ్ 5.8-అంగుళాల స్క్రీన్ సైజు గెలాక్సీ ఎస్10 ఈ'ని విడుదల చేసింది. కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది, ఇది 5.8-అంగుళాల స్క్రీన్ సైజు కలిగిన గెలాక్సీ ఎస్ 10 ఇ. అయితే గెలాక్సీ ఎస్ 22 6.06-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. గెలాక్సీ ఎస్ 22+,గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా అందించే ఛార్జింగ్ స్పీడ్లతో పోలిస్తే 25వాల్డ్ల ఫాస్ట్ ఛార్జింగ్ తో గెలాక్సీ ఎస్ 22 నెమ్మదిగా ఉంది. ఫోన్ వీడియో క్వాలిటీకోసం శామ్సంగ్ జీఎన్1,జీఎన్2 కెమెరా సెన్సార్లపై స్కిప్పింగ్ ను తో పాటు ఐఎస్ఓసెల్ జీఎన్5 కెమెరా సెన్సార్‌ని వినియోగించుకోవచ్చని టెక్ రివ్యూవర్ యోగేష్ బ్రార్ తెలిపారు చదవండి : ఆకట్టుకునే ఫీచర్లు, మార్కెట్లో విడుదలైన మరో స్మార్ట్ ఫోన్ -
ఐఫోన్-13 కొనుగోలుపై వోడాఫోన్-ఐడియా బంపర్ ఆఫర్...!
ఐఫోన్ -13 సిరీస్ స్మార్ట్ఫోన్లను సెప్టెంబర్ 14 ఆపిల్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ప్రీ ఆర్డర్లు నేటి నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ 13 స్మార్ట్ఫోన్లను మైవీఐ.కామ్, వీఐ యాప్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఫ్లాట్‌ఫాంలో ప్రీబుకింగ్స్ చేసుకోవచ్చును. తాజాగా వోడాఫోన్ అధికారిక వెబ్సైట్ నుంచి ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను ప్రీ-ఆర్డర్ చేసిన కొనుగోలుదారులకు ప్రత్యేక డీల్, క్యాష్‌బ్యాక్ అందిస్తామని వోడాఫోన్-ఐడియా ప్రకటించింది. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వోడాఫోన్-ఐడియా పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వీఐ- వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసిన కస్టమర్లకు ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను సెప్టెంబర్ 25న పొందవచ్చును. చదవండి: Amazon Great Indian Festival Sale: బ్లాక్‌బస్టర్ డీల్స్‌తో..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఐఫోన్-13 సిరీస్ కొనుగోలుపై వీఐ అందిస్తోన్న ఆఫర్లు...! వీఐ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసిన కస్టమర్లు వీఐ రెడ్ఎక్స్ ప్లాన్లను కచ్చితంగా సబ్‌స్రైబ్ చేసుకొని ఉండాలి. రెడ్ఎక్స్ ప్లాన్స్ రూ. 1099, రూ. 1699,ఫ్యామీలీ ప్యాక్ రూ. 2299 పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను వీఐ అందించనుంది. క్యాష్‌బ్యాక్ ఆరు నెలల వ్యవధిలో రిఫ్లెక్ట్ అవుతోందని వీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, కాంప్లిమెంటరీ ఇంటర్నేషనల్ రోమింగ్, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, ప్రీమియం కస్టమర్ సర్వీస్ , మరెన్నో వాటితో పాటు ప్రీమియం ఎంటర్టైన్మెంట్తో సహా రెడ్ఎక్స్ ప్లాన్‌లో భాగంగా ప్రయోజనాలను పొందవచ్చును. అదనంగా, రూ .299 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్‌పై ఐఫోన్ 13 కొనుగోలుదారులకు డబుల్ డేటా ప్రయోజనాలను అందిస్తున్నట్లు వీఐ ప్రకటించింది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్‌లతో సహా ఐఫోన్ 13 సిరీస్ అన్ని మోడళ్ల కొనుగోలుపై ఈ ఆఫర్లన్నీ అందుబాటులో ఉన్నాయి. చదవండి: 20 నిమిషాల ఛార్జింగ్‌తో 482 కి.మీ ప్రయాణం..! -
ఐఫోన్-14 ఫీచర్స్ లీక్..మాములుగా లేవుగా!
గత వారం యాపిల్ దిగ్గజం విడుదల చేసిన ఐఫోన్ 13 సిరీస్ మోడల్ ఫోన్ అమ్మకాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి.దీంతో ఐఫోన్ 14సిరీస్ గురించి చర్చ మొదలైంది.ఐఫోన్ 14మోడల్ ఫోన్లు ఎప్పుడు విడుదలవుతాయి.వాటి ధరలు ఎలా ఉంటాయి. ఏఏ ఫీచర్లు ఉండనున్నాయి. అనే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ఫీచర్స్ చైనాలో యాపిల్ ఐఫోన్ అమ్మకాలు జరిపే సంస్థల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఆ దేశానికి చెందిన టెక్నాలజీ బ్లాగ్ 'గిజ్చైనా' కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..2022లో ఐఫోన్ 14 సిరీస్ మోడల్ ఫోన్లు కనీసం మూడు మోడల్ ఫోన్లను యాపిల్ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది విడుదల కావాల్సిన యాపిల్ 14సిరీస్‌లోని ఓ మోడల్ ఫోన్ 120హెచ్‌జెడ్ డిస్ప్లే, మరో ఫోన్ 60హెచ్‌జెడ్ ఎల్‌టిపిఎస్ ఓఎల్ఇడి డిస్ప్లేతో రానుంది. ఇదే నిజమైతే ఐఫోన్ 14 సిరీస్ బేసిక్ ఫోన్ ఐఫోన్ 14 మినీ 60హెచ్ స్క్రీన్‌తో విడుదల కానుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఐఫోన్ 13 ధరల కంటే ఐఫోన్ 14సిరీస్ ఫోన్ తక్కువ ధరకే లభ్యం కానుంది. ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ విడుదల ఎప్పుడంటే ? యాపిల్ సంస్థ ఐఫోన్ 14మోడల్ ఫోన్లను 2022లో విడుదల చేస్తుందని చైనా టెక్ బ్లాగ్ తన కథనంలో పేర్కొంది. అయితే 2022లో ఐఫోన్ 14 సిరీస్‌తో వచ్చే ఫీచర్లు గురించి ఇప్పుడే కాదు. గతంలో సైతం విడుదలైన నివేదికల్లో ఐఫోన్ 14 మాక్స్ విడుదల చేసినా ఐఫోన్ 14 మినీని విడుదల చేయకపోవచ్చనే నివేదికలు సూచించాయి. అది అయిపోతే, ఐఫోన్ 14 ,ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మాక్స్,ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడళ్లతో విడుదల కానుంది. ఐఫోన్ 14 మోడల్స్ ఆపిల్ ఏ16 చిప్సెట్,ప్రొటెక్ట్ కోసం ఫేస్ఐడీ, టచ్ ఐడి ఫీచర్లతో ఐఫోన్ 14 విడుదల కానుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుండగా..ఐఫోన్ 14ఫోన్ మోడళ్ల ఎల్టీపీఓ (A low-temperature polycrystalline oxide (LTPO) display ) డిస్ ప్లే తయారీ కోసం ఎల్జీ యాపిల్‌తో చేతులు కలపనుంది. చదవండి: ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
ఐఫోన్ 13.. భారత్‌లో మరీ అంత రేట్లా?
Iphone 13 Series Price In India: 'కాలిఫోర్నియా స్ట్రీమింగ్' వర్చువల్ లాంచ్ ఈవెంట్లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు అట్టహాసంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ సందర్భంగా భారత్‌లో ఐఫోన్ 12 సిరీస్ ధరలకే.. ఐఫోన్ 13 మోడల్స్‌ను విక్రయిస్తామని యాపిల్ సంస్థ ప్రకటించింది కూడా. కానీ పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. కొనుగోలుదారులు ఐఫోన్ 13సిరీస్ మోడల్ని బట్టి భారీ ఎత్తున ట్యాక్స్ పే చేయాల్సి రానుంది. ఈ సిరీస్‌లోని ఒక్కో ఫోన్‌కు మినిమమ్ ఇరవై వేల రూపాయల నుంచి గరిష్టంగా రూ.40,034 వరకు పన్నులు చెల్లించాల్సి వస్తుందనేది ఇప్పుడు అంచనా. సెప్టెంబర్ 24 నుంచి ఐఫోన్13 అమ్మకాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో బేసిక్ మోడల్ ఫోన్‌ను భారత్‌లో కొనుగోలు చేస్తే రూ.79,900 చెల్లించాల్సి ఉండగా.. అమెరికాలో రూ.51,310కే సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దేశాల మధ్య ధరల వ్యత్యాసం భారీగా ఉండడంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తయారీ యూనిట్లు లేవు భారత్‌లో యాపిల్ ఫోన్లు అమ్మకాలు థర్డ్ పార్టీ స్టోర్ల ఆధారంగా అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. దిగుమతుల వల్ల పన్నులూ అదే స్థాయిలో విధించాల్సి వస్తోంది. ఇప్పుడు ఇదే అంశం భారత్‌లో ఐఫోన్ ధరలు భారీగా ఉండటానికి కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా నుంచి భారత్ కు వచ్చే ఐఫోన్ 13(మిని) సిరీస్ ఫోన్‌పై కొనుగోలు దారులు కస్టమ్ డ్యూటీ 22.5శాతం కింద రూ.10,880 చెల్లించాల్సి ఉంది. కస్టమ్ డ్యూటీతో పాటు జీఎస్టీ రూ.10,662గా ఉంది. ఏ ఫోన్‌కు ఎంత ట్యాక్స్ అంటే.. భారత్ లో ఐఫోన్ 13 సిరీస్ మోడల్‌ను బట్టి ట్యాక్స్ పేచేయాల్సి ఉంటుంది. ఐఫోన్ ప్రో మ్యాక్స్ పై రూ.40,034, ఐఫోన్ 13 మినీలో 21,543, ఐఫోన్ 13 పై 24,625, ఐఫోన్ 13 ప్రోపై రూ. 36,952 ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుందని లెక్కలేస్తున్నారు. -
3,500 స్టోర్లు, ఇండియాలో భారీ ఎత్తున ఐఫోన్ 13 అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాపిల్ ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ దేశవ్యాప్తంగా 3,500 ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని రెడింగ్టన్ ప్రకటించింది. అలాగే వినియోగదార్లకు క్యాష్ బ్యాక్ అందించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్ మోడళ్లను కంపెనీ ఇటీవల ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. భారత్‌తోసహా 30 కిపైగా దేశాల్లో శుశ్రవారం (సెప్టెంబర్ 17) నుంచి ప్రీ–ఆర్డర్స్ ప్రారంభం అయ్యాయి. ముందస్తుగా బుక్ చేసుకున్న వినియోగదార్లకు ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు కోసం సమయాన్ని నిర్ధేశిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ 24 నుంచి స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లో తళుక్కుమంటాయి. ధరల శ్రేణి మోడల్‌నుబట్టి రూ.69,900 నుంచి రూ.1,79,900 వరకు ఉంది. చదవండి: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్ : తగ్గిన ధరలు -
ఐఫోన్-13ను ఎగతాళి చేసిన గూగుల్ నెక్సస్..!
ఐఫోన్-13 సిరీస్ ఫోన్లను ఆపిల్ మంగళవారం రోజున లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్-13 సిరీస్ ఫోన్లపై కొంతమంది నెటిజన్లు మాత్రం విపరీతంగా ట్రోల్ చేశారు. నెటిజన్స్‌తో పాటుగా జోమాటోకూడా ఐఫోన్-13 డిజైన్‌పై ట్రోల్ చేసింది. తాజాగా ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ కూడా ఐఫోన్-13 దారుణంగా ట్రోల్ చేసింది. చదవండి: ఐఫోన్- 13 రిలీజ్..! విపరీతంగా ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు..! అందులో జోమాటో కూడా.. గూగుల్ తన సొంత ట్విటర్ ఖాతా నుంచి కాకుండా గతంలో గూగుల్ నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్స్ గూగుల్ నెక్సస్ ట్విటర్ ఖాతా నుంచి ‘నేను గూగుల్ పిక్సెల్6 వచ్చేదాకా నిరీక్షిస్తానని’ తన ట్విట్లో పేర్కొందని 9టూ5గూగుల్ పేర్కొంది. ఇక్కడ విషయమేమిటంటే గూగుల్ నెక్సస్ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేసింది. గూగుల్ త్వరలోనే పిక్సెల్ 6 శ్రేణి ఫోన్లను లాంచ్ చేయనుంది. ఫోటో కర్టసీ: 9టూ5గూగుల్.కామ్ ఐఫోన్-13 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ అనే నాలుగు వేరియంట్లను ఆపిల్ రిలీజ్ చేసింది. ఐఫోన్-13 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్-17 నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చునని ఆపిల్ పేర్కొంది. సెప్టెంబర్ 24 నుంచి ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 12తో ఐఫోన్-13 భిన్నంగా కనిపించకపోయినా, ఐఫోన్ 13 లోపల వేగవంతమైన ప్రాసెసింగ్, మెరుగైన బ్యాటరీ జీవితం, కొత్త కెమెరా , వీడియో రికార్డింగ్ మోడ్లతో సహా అనేక అప్గ్రేడ్లను కలిగి ఉందని ఆపిల్ తన లాంచ్ ఈవెంట్ పేర్కొంది. చదవండి: బ్యాంక్, ఆధార్ వివరాలపై గూగుల్ పే యాక్సెస్.. యూజర్ల భద్రతకు ముప్పు! -
24 నుంచి ఐఫోన్ 13 విక్రయాలు
న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు ఈ నెల 24 నుంచి భారత మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. అమెరికా, జపాన్ తదితర చాలా దేశాల్లో అదే రోజు నుంచి విక్రయాలను మొదలవుతాయని తెలిపింది. యాపిల్ ఇండియా వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ఆధారంగా.. ఐఫోన్ 13 మినీ ధరలను రూ.69,900 నుంచి 99,900 మధ్య నిర్ణయించింది. ఐఫోన్ 13 ధరలు రూ.79,900–1,09,900.. ఐఫోన్ 13 ప్రో ధరలు రూ.1,19,900–169,900, ఐఫోన్ 13 ప్రోమ్యాక్స్ ధరలు రూ.1,29,900–179,900 మధ్య ఉండనున్నాయి. ఇందులో ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌ను 5జీ సపోర్ట్‌తో, మరిన్ని బ్యాండ్లతో యాపిల్ తీసుకొచ్చింది. అదే విధంగా కొత్త ఐప్యాడ్ (9వ జనరేషన్) ధర రూ.30,900 నుంచి.. ఐప్యాడ్ మినీ ధర రూ.46,900 నుంచి ఆరంభమవుతుంది. ప్రీమియం ఫోన్ల జోరు.. కౌంటర్‌పాయింట్ అంచనాల ప్రకారం.. భారత్‌లో ప్రీమియం (ఖరీదైన) స్మార్ట్ఫోన్ల మార్కెట్ జూన్‌లో 122 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ప్రీమియం ఫోన్ల వాటా 7 శాతంగా ఉంది. దేశీ ప్రీమియం మార్కెట్లో వన్‌ప్లస్ 34 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంటే, యాపిల్ 25 శాతం వాటాతో రెండో స్థానంలోను, శామ్సంగ్ 13 శాతం వాటాతో మూడో స్థానంలో, వివో 12%, షావోమీ 7% వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
ఐఫోన్- 13 రిలీజ్..! విపరీతంగా ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు..! అందులో జోమాటో కూడా..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐఫోన్-13 సిరీస్ ఫోన్లను ఆపిల్ మంగళవారం రోజున లాంచ్ చేసిన విషయం తెలిసిందే. లాంచ్ ఈవెంట్లో భాగంగా బాలీవుడ్ క్లాసిక్ దమ్ మారో దమ్ సాంగ్‌ను ప్లే చేసింది. ఐఫోన్-13 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ అనే నాలుగు వేరియంట్లను ఆపిల్ రిలీజ్ చేసింది. ఐఫోన్-13 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్-17 నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చునని ఆపిల్ పేర్కొంది. సెప్టెంబర్ 24 నుంచి ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. చదవండి: Apple : సెప్టెంబర్ 14నే ఐఫోన్-13 రిలీజ్..! కారణం అదేనా..! విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు...! తాజాగా ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లపై కొంత మంది నెటిజన్లు మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఐఫోన్-12, ఐఫోన్-13 రెండింటి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదంటూ ట్విటర్లో నెటిజన్లు మీమ్సీ షేర్ చేస్తున్నారు. నెటిజన్లే కాకుండా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో కూడా ట్విటర్లో ఐఫోన్-12, ఐఫోన్-13 మోడళ్లపై తన దైన శైలిలో ట్రోల్ చేసింది. జోమాటో తన ట్విటర్లో ఐఫోన్-13 విషయంలో కెమెరాలను సమాంతరంగా కాకుండా, డయాగోనల్‌గా ఏర్పాటుచేసిందంటూ ట్విట్ చేసింది. ట్విటర్లో..ఐఫోన్-13 లో కేవలం ఒక చిప్‌నే మార్చగా... మిగతా హర్డ్వేర్స్కు ‘న్యూ’ జోడించి న్యూ ఎక్స్పీరియన్స్ పేరిట ఆపిల్ లాంచ్ చేసినట్లు ఓ నెటిజన్ తెలిపాడు. మరో నెటిజన్ మీ దగ్గర ఐఫోన్-12 ఉండి ఉంటే ఐఫోన్-13 మీకు కోసం కాదు అంటూ..ఐఫోన్-13 డిజైన్ విషయంలో ఫోటోషాప్ చేసిన వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు. భిన్నంగా కన్పించపోయినా.. ఐఫోన్ 12తో ఐఫోన్-13 భిన్నంగా కనిపించకపోయినా, ఐఫోన్ 13 లోపల వేగవంతమైన ప్రాసెసింగ్, మెరుగైన బ్యాటరీ జీవితం, కొత్త కెమెరా , వీడియో రికార్డింగ్ మోడ్లతో సహా అనేక అప్గ్రేడ్లను కలిగి ఉందని ఆపిల్ తన లాంచ్ ఈవెంట్ పేర్కొంది.భారత్‌లో ఐఫోన్ 13 మినీ 128జీబీ మోడల్ ధర రూ. 69,900. 256జీబీ మోడల్ రూ .79,900 , 512జీబీ మోడల్ రూ .99,900 లకు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 13 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ .79,900, 256జీబీ ధర రూ .89,900 , 512జీబీ మోడల్ ధర రూ. 109,900 గా ఉండనుంది. iPhone 12 vs iPhone 13 pic.twitter.com/V3hzWb0eSQ — zomato (@zomato) September 14, 2021 Here are some big differences between the iphone 12 and 13. What about "new experience"? 😂 #iPhone13 #AppleEvent pic.twitter.com/MgkLWoSsy6 — Dexignko Studio (@dexignko) September 15, 2021 pic.twitter.com/5ynxAV2fky If you currently have iPhone 12, iPhone 13 isn't for you. Save your money.#iPhone13 #AppleEvent — Ƙɑɾɑղ (@karanverma__) September 15, 2021 చదవండి: iPhone: భారీగా తగ్గిన ధరలు, ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త! -
ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్ : తగ్గిన ధరలు
ఐఫోన్ ప్రియులకు యాపిల్ శుభవార్త చెప్పింది. తాజాగా ఐఫోన్ 13 సిరీస్ మోడళ్లను లాంచ్ చేసిన సందర్భంగా కొన్ని మోడళ్ల ధరలను తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. కొత్త సిరీస్ లాంచ్ తరువాత పాత మోడళ్లైన యాపిల్ ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఫోన్ ధరల్ని తగ్గించడం ఆసక్తికరంగా మారింది. కాగా యాపిల్ 'కాలిఫోర్నియా స్ట్రీమింగ్' వర్చువల్ ఈవెంట్లో ఐఫోన్ 13 సిరీస్, యాపిల్ వాచ్ సిరీస్ 7, 10.2 అంగుళాల ఐపాడ్, ఐపాడ్ మినీలను యాపిల్ సీఈఓ టీమ్ కుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఐఫోన్ 11, ఐఫోన్ 12 , ఐఫోన్ 12 మినీ ధరలు మోడల్ ఓల్డ్ ప్రైస్ న్యూ ప్రైస్ ఐఫోన్ 11 64జీబీ Rs 54,900 Rs 49,900 ఐఫోన్ 11 128జీబీ Rs 59,900 Rs 54,900 ఐఫోన్ 12 మినీ 64జీబీ Rs 69,900 Rs 59,900 ఐఫోన్ 12 మినీ 128జీబీ Rs 74900 Rs 64,900 ఐ ఫోన్ 12 మినీ 256జీబీ Rs 84,900 Rs 74,900 ఐఫోన్ 12 64 జీబీ Rs 79,900 Rs 65,900 ఐఫోన్ 12 128 జీబీ Rs 84,900 Rs 70,900 ఐఫోన్ 12 256 జీబీ Rs 94,900 Rs 80,900 చదవండి : ఇండియన్ మార్కెట్లో ఐఫోన్13 సిరీస్ ధరలు -
యాపిల్ ఈవెంట్లో 'దమ్ మారో దమ్'
యాపిల్ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే 'యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్' ను ఈ ఏడాది నిర్వహించింది. అయితే ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా సెప్టెంబర్ 14న నిర్వహించిన ఈవెంట్ ఇండియన్స్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఐఫోన్ 13 లాంచ్ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో బాలీవుడ్ సాంగ్ దమ్ మారో దమ్ మ్యూజిక్ వినిపించి యాపిల్ సీఈఓ టీమ్ కుక్ ట్విస్ట్ ఇచ్చారు. లాంచ్ చేసే ప్రోడక్ట్స్‌తోపాటు వాటిని లాంచ్ చేసే విధానంలోనూ తనదైన మార్క్ చూపిస్తూ ఇండియన్ మార్కెట్‌పై ఫోకస్ చేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ భారత్ అవతరించింది. కానీ భారత్‌లో యాపిల్ మార్కెట్ కేవలం 3 శాతం మాత్రమే ఉంది. ఆ మార్కెట్ షేర్‌ను పెంచేందుకు బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరో దేవానంద్ నటించిన ఇండియన్ మ్యూజికల్ డ్రామా ఫిల్మిం 'హరేరామ హరేకృష్ణా' సినిమాలోని ప్రముఖ ఆర్డీ బర్మన్-ఆశా భోస్లే'లు పాడిన 'దమ్ మారో దమ్' మ్యాజిక్‌ను వాడారు. దీంతో యాపిల్ బాలీవుడ్ మ్యూజిక్ వాడటంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. క్యూపర్టినోలో జరిగిన ఈవెంట్లో ఫోన్‌ను లాంచ్ చేయడానికి సీఈవో టిమ్ కుక్ వస్తున్న సమయంలోనూ ఈ మ్యూజిక్ వినిపించింది. దీంతో ఔత్సాహికులు ఐఫోన్ 13 సిరీస్‌లోని ఐఫోన్ 13 తో పాటు ఎంట్రీ లెవల్ పాడ్, ఐపాడ్, యాపిల్ వాచ్ సిరీస్ 7 ఫీచర్ల కంటే ఎక్కువగా ఈ మ్యూజిక్ గురించే చర్చిస్తున్నారు. ఇక యూట్యూబ్ లో సైతం ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. ఐఫోన్ 13 ఫోన్ ఎలాంటి ప్రమాదాల్లోనైనా చెక్కు చెదరకుండా ఉంటుందని ఓ వీడియోను రిలీజ్ చేసింది యాపిల్. ఆ వీడియోలో ఓ యువకుడు తన బైక్‌పై కస్టమర్లకు పార్శిళ్లను అందిస్తుండగా 'దమ్ మారో దమ్' సాంగ్ ఆడియా ట్రాక్ ప్లే అవ్వడం నెట్టింట్లో సందడి చేస్తోంది. చదవండి : ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
ఇండియన్ మార్కెట్లో ఐఫోన్13 సిరీస్ ధరలు ఇలా ఉన్నాయి
iPhone 13 Pro and iPhone 13 series in India.టెక్ దిగ్గజం యాపిల్..ఐఫోన్ 13, ఐఫోన్ 13మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లను విడుదల చేసింది. కాలిఫోర్నియా స్ట్రీమింగ్ పేరిట జరిగిన కార్యక్రమంలో యాపిల్ చీఫ్ టిమ్ కుక్ మార్కెట్లో ప్రవేశపెట్టారు. అయితే స్టాటిస్టా లెక్కల ప్రకారం భారత్‌లో కేవలం 3 శాతం మార్కెట్‌కే పరిమితమైన యాపిల్..ఆ మార్కెట్‌ను పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ వర్చువల్ ఈవెంట్లో యాపిల్ చీఫ్ టిమ్ కుక్ ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ ధరల్ని ప్రకటించారు. వాటి ధరలు ఇలా ఉన్నాయి. ఇండియాలో ఐఫోన్ 13 సిరీస్ ధరలు ఐఫోన్ 13ప్రో మ్యాక్స్ 128జీబీ: రూ.1,29,900 256జీబీ: రూ. 1,39.900 512జీబీ: రూ. 1,59,900 1టెరాబైట్ : రూ. 1,79,900 ఐఫోన్ 13 ప్రో 128జీబీ: రూ. 1,19,900 256జీబీ: రూ. 1,29,900 512జీబీ:రూ. 1,49,900 1టెరాబైట్ : రూ. 1,69,900 ఐఫోన్ 13 128జీబీ: రూ.79,900 256జీబీ: రూ. 89,900 512జీబీ: రూ. 1,09,900 ఐఫోన్ 13 మినీ 128జీబీ: రూ. 69,900 256జీబీ: రూ. 79,900 512జీబీ: రూ. 99,900 ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ ప్రీ ఆర్డర్లు అప్పుడే యాపిల్ విడుదల చేసిన ఐఫోన్13 సిరీస్ ఫోన్ ప్రీ ఆర్డర్లు సెప్టెంబర్17,శుక్రవారం సాయంత్రం 5:30నుంచి ప్రారంభం కానుండగా..సెప్టెంబర్ 24 శుక్రవారం నుంచి అందుబాటులో ఉంటాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో..
క్యుపర్టినో, అమెరికా: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో ఐఫోన్ 13, మినీ, ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఐఫోన్ 13 గులాబీ, నీలం తదితర అయిదు రంగుల్లో లభిస్తుంది. వెనుకవైపు అధునాతన డ్యుయల్ కెమెరాలు, 5జీ, 6 కోర్ సీపీయూ, 4 కోర్ జీపీయూ, కొత్త ఏ15 బయోనిక్ చిప్సెట్ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 13 డిస్ప్లే 6.1 అంగుళాలు, మినీ డిస్ప్లే 5.4 అంగుళాలుగా ఉంటుంది. ఐఫోన్ 12 మినీతో పోలిస్తే 13 మినీ బ్యాటరీ సామర్థ్యం 1.5 గంటలు, ఐఫోన్ 12తో పోలిస్తే ఐఫోన్ 13 బ్యాటరీ సామర్థ్యం 2.5 గంటలు ఎక్కువగా ఉంటుంది. ఐఫోన్ 13 మినీ రేటు 699 డాలర్ల నుంచి, ఐఫోన్ 13 ధర 799 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. స్టోరేజీ విషయానికొస్తే ఇవి 128 జీబీ నుంచి లభిస్తాయి. ఐఫోన్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అటు ఐఫోన్ 13 సిరీస్‌తో పాటు కొత్త ఐప్యాడ్, యాపిల్ వాచ్ 7 సిరీస్ మొదలైన ఉత్పత్తులను కూడా యాపిల్ ఆవిష్కరించింది. వాచ్ 7 సిరీస్ రేటు 399 డాలర్ల నుంచి ఉంటుంది. ప్రో ధర 999 డాలర్ల నుంచి, ప్రో మ్యాక్స్ రేటు 1,099 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. 128 జీబీ నుంచి 1టీబీ దాకా స్టోరేజీతో లభిస్తుంది. ఐఫోన్ 13 ప్రీ ఆర్డర్లు ఈ నెల 17 నుంచి, డెలివరీలు 24 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: APPLE: యాపిల్ మెగా ఈవెంట్.. 13 సిరీస్‌పై ఉత్కంఠ -
APPLE: యాపిల్ మెగా ఈవెంట్.. 13 సిరీస్‌పై ఉత్కంఠ
iPhone 13 Launch Event: ప్రతీ ఏడాదిలాగే ఈ సెప్టెంబర్‌లోనూ మెగా ఈవెంట్‌కు యాపిల్ సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి(సెప్టెంబర్ 14) 10గం.30 ని. ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ఈవెంట్ ద్వారా యాపిల్ కొత్త ప్రొడక్టులను లాంఛ్ చేయనుంది. కరోనా వల్ల వర్చువల్‌గా ఈవెంట్ నిర్వహిస్తుండడం యాపిల్‌కు ఇది రెండోసారి. ఇక వారం నుంచి ఈ మెగా ఈవెంట్ కోసం ఐఫోన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో లీకేజీల పేరిట పలు ఫీచర్లు తెరపైకి వస్తున్నాయి. ఐఫోన్ 13 సిరీస్‌లో ఐఫోన్ 13, మినీ, ప్రో, ప్రో మ్యాక్స్ మొత్తం నాలుగు మోడల్స్ ఒకేసారి రిలీజ్ చేయడం ద్వారా సంచలనానికి యాపిల్ తెర తీయబోతోందనే ప్రచారం నడుస్తోంది. ఐఫోన్ 13, మినీ మోడల్స్‌లో లార్జ్ కెమెరా సెన్సార్లు ఉండొచ్చని, ప్రొ-ప్రొమ్యాక్స్లో అల్ట్రా వైడర్ కెమెరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఇదే ఈవెంట్లో యాపిల్ స్మార్ట్‌వాచ్ 7 సిరీస్, థర్డ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్(Airpods 3) కూడా రిలీజ్ చేయొచ్చని భావిస్తున్నారు. కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీలోని క్యూపర్టినో యాపిల్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఈ ఈవెంట్ టెలికాస్ట్ కానుంది. యాపిల్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా లైవ్ వీక్షించొచ్చు. ఇక యాపిల్ టీవీ యూజర్స్.. యాప్ ద్వారా కీనోట్‌ను చూడొచ్చు. సిమ్ లేకుండానే.. ఐఫోన్ 13కి సంబంధించి ఇప్పటికే అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. సిమ్ కార్డ్ అవసరం లేకుండా లియో టెక్నాలజీ ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుందని, ఎమర్జెన్సీ మెసేజ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని ఇలా రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అలాగే ఫోన్ వెయిట్, మందం కిందటి ఏడాది మోడల్స్ కంటే ఎక్కువగా ఉండొచ్చని చెప్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం టూమచ్ ప్రచారం.. అయితే 13 అనేది ఫారిన్ దేశాల్లో అచ్చీరాని నెంబర్. ఈ మూఢనమ్మకంతో 13 సిరీస్‌ను తప్పించి.. 14 సిరీస్‌ను యాపిల్ రిలీజ్ చేస్తుందేమో అనే ఊహాగానాలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. అందుకే సెప్టెంబర్ 13వ తేదీన కాకుండా.. 14వ తేదీన లాంఛ్‌కు ముహూర్తం పెట్టిందనే టాక్ కూడా సోషల్ మీడియాలో నడిచింది. కానీ, ఇలాంటి నమ్మకాల్ని పట్టించుకోకుండా యాపిల్ 13 సిరీస్ ద్వారానే రాబోతోందని తెలుస్తోంది. క్లిక్ చేయండి: ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు! ధర అటుఇటుగా.. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం అమెరికాలో ఐఫోన్ 13 సిరీస్ కనిష్ట ధర 799 డాలర్లుగా ఉంది. అయితే భారత మార్కెట్‌కి వచ్చే సరికి స్థానిక ట్యాక్సుల ఆధారంగా ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వెర్షన్ అమెరికా (భారత్) ఐఫోన్ 13 799 డాలర్లు (రూ. 58,600) ఐఫోన్ 13 మినీ 699 డాలర్లు (రూ. 51,314) పై రెండు 64జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌తో రావొచ్చు!. బ్లాక్, బ్లూ, పింక్, పర్పుల్, రెడ్, వైట్ కలర్స్‌లో ఫోన్లు రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. ప్రతీకాత్మక చిత్రం ఐఫోన్ 13 ప్రో 999 డాలర్లు (రూ.73,300) ఐఫోన్ 13ప్రో మ్యాక్స్ 1,099 డాలర్లు (రూ 80,679) 128జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టెరేజ్ వెర్షన్లలో రిలీజ్ కావొచ్చు. అయితే ఈ రెండు వెర్షన్లలో 1టీబీ స్టోరేజ్ మోడల్ అంటూ ఒక పుకారు సైతం చక్కర్లు కొడుతోంది. బ్లాక్, బ్రౌన్, గోల్డ్, సిల్వర్ కలర్స్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే పైన చెప్పుకున్న ఫీచర్లు, ధరలన్నీ అంచనాలు, ఊహాగానాలు మాత్రమే. యాపిల్ సంస్థ పైవాటిలో ఏ ఒక్కదానిని అధికారికంగా ధ్రువీకరించలేదు. కేవలం ఎక్స్పర్ట్స్, టెక్ వెబ్సైట్ల అంచనాలను బట్టే ఇస్తున్నాం. చదవండి: యాపిల్ మార్కెట్ ఢమాల్! భారమంతా ఐఫోన్ 13 పైనే? -
ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు...!
iPhone 12 Series: సెప్టెంబర్ 14న ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేయడానికి ఆపిల్ సన్నాద్ధం అవుతోంది. ఐఫోన్-13 ను లాంచ్ చేస్తున్న నేపథ్యంలో ఐఫోన్-12 సిరీస్ స్మార్ట్ఫోన్లపై ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును ప్రకటించింది.ఫ్లిప్‌కార్ట్ పలు ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై సుమారు రూ. 12 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ 12 మినీ 64జీబీ, 128జీబీ వెర్షన్లు వరుసగా రూ .59,999, రూ. 64,999 లకు అందుబాటులో ఉన్నాయి.ఈ రెండు వేరియంట్ల అసలు ధరలు వరుసగా రూ .69,900 , రూ .74,900గా ఉంది. 256జీబీ వేరియంట్ ధర రూ .74,999 అందుబాటులో ఉంది. ప్లిప్‌కార్ట్ సుమారు 22 శాతం మేర డిస్కౌంట్లను అందిస్తోంది. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! ఆపిల్ ఐఫోన్ 12 మోడల్ 64 జీబీ వేరియంట్‌పై సుమారు రూ. 12 వేల తగ్గింపుతో రూ. 66,999 అందించనుంది. 128జీబీ వేరియంట్ రూ. 12901 తగ్గింపుతో రూ .71,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్-12 256జీబీ వేరియంట్ రూ. 81,999 కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. చదవండి: Apple : సెప్టెంబర్ 14నే ఐఫోన్-13 రిలీజ్..! కారణం అదేనా..! ఐఫోన్ 12 ప్రో 128జీబీ వేరియంట్ రూ. 1,15,900, 256జీబీ వేరియంట్ ధర రూ .1,25,900. 512జీబీ వేరియంట్ ధర రూ .1,45,900కు లభించనుంది. అంతేకాకుండా ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌పై కూడా ఫ్లిప్‌కార్ట్ తగ్గింపును ప్రకటించింది. 128జీబీ, 256జీబీ, 512జీబీ వేరియంట్లు వరుసగా రూ. 1,25,900, రూ .1,35,900 , రూ .1,55,900 కు లభించనున్నాయి. చదవండి: Xiaomi: ఆయా దేశాల్లో స్మార్ట్ఫోన్లను బ్లాక్ చేసిన షావోమీ..! -
సెప్టెంబర్ 14నే ఐఫోన్-13 రిలీజ్..! కారణం అదేనా..!
Is Apple Superstitious?: మొబైల్ లవర్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తోన్న ఐఫోన్-13 సిరీస్ ఫోన్లను ఆపిల్ సంస్థ సెప్టెంబర్ 14 న కాలిఫోర్నియా వేదికగా రిలీజ్ చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్-13 సిరీస్ ఫోన్ల కోసం ఆపిల్ మొబైల్స్ ప్రియులు కళ్లలో వత్తులువేసుకొని కూర్చున్నారు. ఇక ఈ మొబైల్ లాంచింగ్ విడుదలను వీక్షించేందుకు ఈవెంట్‌ను కూడా ఆ సంస్థ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాలు చేసింది. అయితే, ఆపిల్‌కు ఇక్కడో విచిత్రమైన సమస్య ఎదురైంది. ఆపిల్ సంస్థ మూఢ నమ్మకాలను నమ్ముతోందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఐఫోన్-13 సిరీస్ మొబైల్స్‌ను సెప్టెంబర్ 14న లాంచ్ చేయడమే దీనికి కారణం. ఎటువంటి మూఢకాలను నమ్మని నేపథ్యంలో ఐఫోన్-13 సిరీస్ మొబైల్స్‌ను సెప్టెంబర్14 కు బదులు 13 వ తేదీన విడుదల చేయొచ్చు కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ట్విటర్లో #iPhone14 పేరిట హాష్టాగ్ ట్రెండ్ చేస్తున్నారు. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! వచ్చిందంతా పదమూడు నంబర్‌తోనే..! అనేక పాశ్చాత్యదేశాల్లో పదమూడో నంబర్‌ను దురదృష్టసంఖ్యగా భావిస్తారు. ఈ సంఖ్య ఒక గుడ్డి మూఢనమ్మకంగా ఆయా దేశాల్లోని ప్రజల్లో ఉండిపోయింది. పదమూడో నంబర్ ఆయా ప్రజలు ఎంతగా గుడ్డిగా నమ్ముతారో అనేదానికి అనేక ఉదాహరణలు మన ముందు ఉన్నాయి. ఉదాహరణకు, స్ట్రెస్ మేనేజ్మెంట్ సెంటర్ ఫోబియా ఇనిస్టిట్యూట్ అంచనా ప్రకారం 700 నుంచి 800 మిలియన్ డాలర్లు ప్రతి శుక్రవారం 13 వ ఆయా దేశాల స్టాక్‌ఎక్సేచేంజ్ మార్కెట్లో కోల్పోతారు. ఇదిలా ఉండగా కొన్ని హోటళ్లు 13 వ నంబర్ ఫ్లోర్‌ను దాటవేస్తారు. కొన్ని విమాన సంస్థలు పదమూడో నంబర్‌ను పూర్తిగా తీసివేస్తాయి. తాజాగా నెటిజన్లు ఐఫోన్-13 నంబర్ సిరీస్ నంబర్ మొబైల్ కొన్నవారిపై, ఆపిల్ కంపెనీ దుష్ప్రభావాలు చూపుతోందని ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. మూఢనమ్మకాలకు స్వస్తి చెప్పుతూ.. నేటి టెక్నాలజీ యుగంలో మూఢనమ్మకాలకు తావు ఇవ్వకుండా ఆపిల్ తన పనిని తాను చేసుకుంటుంది. ప్రజల్లోని మూఢనమ్మకాలకు స్వస్తి పలకాలనే ఉద్ధేశ్యంతో ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను కంపెనీ రిలీజ్ చేయనుంది. ఆపిల్‌కు ఈ విచిత్రమైన పరిస్ధితి ఇప్పుడు వచ్చిందంటే పొరపడినట్లే ..! 2010లో ఆపిల్ ఐఫోన్-4 విడుదలకు ముందుకూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంది. నాలుగో నంబర్‌ను చైనా, కొన్ని ఆసియా దేశాల్లో మరణానికి సూచకంగా భావిస్తారు. ఒక నివేదిక ప్రకారం ఐఫోన్-4 అమ్మకాలు భారీగా జరిగాయి. ఐఫోన్-4 రిలీజైనా కొన్ని గంటలకే ఫోన్లన్ని అమ్ముడయ్యాయి. ఇదిలాఉండగా కొన్ని దిగ్గజ కంపెనీలు కెనాన్, నోకియా మాత్రం మూఢనమ్మకాలకు బలం చేకూర్చేలా నాలుగో నంబర్‌ను స్కిప్ చేస్తూ గాడ్జెట్స్‌ను మార్కెట్లోకి వదిలాయి. Iphone 14 is trending? Did we just skip 13 altogether? pic.twitter.com/I2LVg2v1Af — Konrad Juengling (@PDX_er) September 8, 2021 How do all the people speculating about the iPhone 14 (relative to the "iPhone 13") not realize that Apple's gonna skip the 13 altogether, like most high rises skip the 13th floor? pic.twitter.com/2tXNkdbIA1 — James 劉 Mielke (@LimitedRunJames) September 8, 2021 చదవండి: Google Photos: మీ స్మార్ట్ఫోన్లలో డిలీటైనా ఫోటోలను ఇలా పొందండి...! -
ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త
ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త. ఆపిల్ సంస్థ ప్రతినిధులు 'ఐఫోన్13 సిరీస్' విడుదల తేదీని ప్రకటించి సస్పెన్స్‌కు తెరదించినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా ఐఫోన్ వినియోగదారులు ఐఫోన్ 13 విడుదల కోసం ఎంతగానే ఎదురు చూస్తున్నారు. రకరకాల కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఐఫోన్ 13 సిరీస్ సెప్టెంబర్ 17 న విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. చైనా సోషల్ మీడియా దిగ్గజం వైబూ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. సెప్టెంబర్ లోనే ఐఫోన్ 13ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ తో పాటు సెప్టెంబర్ 30న ఆపిల్ తన సంస్థకు చెందిన మరో నాలుగు కొత్త ప్రాడక్ట్ లను విడుదల చేయనుంది' అంటూ కొన్ని స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ స్క్రీన్ షాట్ల ప్రకారం ఐఫోన్ 13 సిరీస్ తో పాటు ఐఫోన్ 13ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లను సెప్టెంబర్ 17 నుంచి అమ్మకాలు జరపాల్సి ఉండగా..సెప్టెంబర్ తరువాత ఎయిర్ పాడ్స్3 ని విడుదల చేయనుంది. అధికారికంగా ఐఫోన్ 13 విడుదల తేదీ ఎప్పుడనేది కన్ఫాం కాకపోయినప్పటికీ..ఆపిల్ మాత్రం సెప్టెంబర్ 17న విడుదల చేస్తుందని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఆపిల్ ప్రాడక్ట్ తేదీ విడుదల ఎప్పుడనే అంశంపై సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. ఆ వార్తల్ని ఖండించని ఆపిల్ సంబంధిత తేదీల్లోనే విడుదల చేయడం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు ఊతమిచినట్లైంది. చదవండి : ఆకట్టుకునే ఫీచర్లకు పెట్టింది పేరు ఈ స్మార్ట్ ఫోన్ -
వచ్చేస్తోంది..ఐఫోన్-13..! లాంఛ్ ఎప్పుడంటే..!
ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కంపెనీ ఉత్పత్తులకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. ఆపిల్ ఐఫోన్లకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది ఆపిల్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐఫోన్ -13 ఫోన్లను వచ్చే నెల సెప్టెంబర్ మూడో వారంలో రిలీజ్ చేస్తున్నట్లు ఊహగానాలు వస్తున్నాయి. కాగా ఈ ఫోన్ ఐఫోన్ 12కు తదనంతర ఫోన్‌గా రానుంది. అమెరికాలో ప్రముఖ చైనా కంపెనీ హువావేపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఐఫోన్ 13 అమ్మకాలు గణనీయంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐఫోన్-13 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆపిల్ రిలీజ్ చేయనుంది. పెర్ల్, సన్‌సెట్ గోల్డ్ వేరియంట్లతో ఐఫోన్-13 రానుంది. ఐఫోన్-13 ఫీచర్లు ట్రిపుల్ కెమెరా విత్ లేజర్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ లైడార్ సెన్సార్ 5 జీ కనెక్టవిటీ సపోర్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ పవర్ ఎఫిసియంట్ ఎల్‌టీవో డిస్ప్లే ఏ15 బయోనిక్ చిప్సెట్ అండ్ అల్వేస్ ఆన్ డిస్ప్లే ఐఫోన్ 13 మినీ- 2,406 ఎంఏహెచ్ బ్యాటరీ ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో-3,095 ఎంఏహెచ్ బ్యాటరీ ఐఫోన్ 13 ప్రో మాక్స్ -4352 ఎంఏహెచ్ బ్యాటరీ -
లీకైన ఐఫోన్ 13 ఫీచర్లు
ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కంపెనీ ఉత్పత్తులకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. ఆపిల్ ఐఫోన్లకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్. ఆపిల్ ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోని రిలీజ్ చేయనున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఐఫోన్ 13 కు సంబంధించి పలు ఫీచర్లు ఆన్లైన్లో లీకైయ్యాయి. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 12 సిరీస్‌తో పోల్చితే ఐఫోన్ 13లో పెద్ద వైర్లెస్ ఛార్జింగ్ కాయిల్‌ను అమర్చారు. దీంతో ఛార్జింగ్ కాయిల్ వేడేక్కె అవకాశం తక్కువగా ఉండనుంది. ఐఫోన్ 13 మోడళ్లలో పోర్ట్రెయిట్ మోడ్ వీడియో ఫీచర్ ఉంటుందని తెలుస్తోంది. ఆపిల్ కొత్త ఐఫోన్ 13 సిరీస్‌ను సెప్టెంబర్‌లో ఆవిష్కరిస్తోందని టెక్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఫోన్ 13 వస్తోన్న నేపథ్యంలో..ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 12 బేసిక్ మోడల్‌పై సుమారు రూ. 9000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఐఫోన్ 12 సిరీస్ మొబైల్ మోడళ్లపై భారీ తగ్గింపును ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ నుంచి పొందవచ్చును. భవిష్యత్తులో ఐఫోన్ 12 మోడళ్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఈ ఏడాది చివరలో ఐఫోన్ 13..!
ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కంపెనీ ఉత్పత్తులకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. ఆపిల్ ఐఫోన్లకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్. ఆపిల్ నుంచి ‘ఐఫోన్ 13’ సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తాయని తెలుస్తోంది. కాగా ఈ ఫోన్ ఐఫోన్ 12కు తదనంతర ఫోన్‌గా రానుంది. అమెరికా ప్రముఖ చైనా కంపెనీ హువావేపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఐఫోన్ 13 అమ్మకాలు గణనీయంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ మింగ్ చి కుయో మాట్లాడుతూ..2022 మొదటి అర్థభాగంలోనే ఆపిల్ కొత్త 5జీ ఐఫోన్ ఎస్ఈ విడుదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు విడుదలైన ఐఫోన్ మోడల్స్‌లో ఈ మోడల్ అత్యంత చౌక ధర వద్దే లభించే అవకాశం ఉంది. ఐఫోన్ 13 ఫోన్ పోర్ట్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి సరికొత్త ఫీచర్లతో రానుంది. చదవండి: సరికొత్త టెక్నాలజీ.. సౌండ్ ద్వారానే ఫోన్లు ఛార్జింగ్