ప్రపంచ దేశాల్ని సెమీ కండక్టర్ల(చిప్) కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఇప్పుడు ఆ సమస్య ఇండియాలో యాపిల్ ఐఫోన్ -13 అమ్మకాలపై పడింది. సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమైన ఐఫోన్-13 సిరీస్ మోడల్ అమ్మకాల్లో ఉన్న ఫోన్ సేల్స్ పూర్తయ్యాయి.దీంతో ఐఫోన్-13 ఫోన్ల కొరత ఏర్పడింది. మళ్లీ కొత్త ఫోన్‌లను కొనుగోలు చేయాలంటే ఒకటి నుంచి ఐదువారాల వరకు ఎదురు చూడాల్సి ఉందని ఎకనమిక్ టైమ్స్ రిపోర్ట్ విడుదల చేసింది.
ఎకనమిక్ టైమ్ ప్రకారం.. చైనా, తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో కరోనా కారణంగా టెక్ దిగ్గజం యాపిల్‌తో సహా ఇతర టెక్ కంపెనీలకు అందించే ఫోన్ విడి బాగాల(కాంపోనెంట్స్)పై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో ఊహించిన దానికంటే చిప్ సెట్ల కొరత చాలా ఎక్కువ ఉందని పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు.
మరోవైపు సెమీ కండక్టర్ల కొరతపై మార్కెట్ ట్రాకర్ ఐడిసి ఇండియా రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ మాట్లాడుతూ..ఐఫోన్ 13 కొత్త మోడళ్లు ఇండియన్ మార్కెట్‌లో లేకపోవడానికి చిప్ సెట్‌లు, ఫోన్ విడిభాగాల కొరతే కారణమని అన్నారు. కాబట్టే భారత్‌లో యాపిల్ వాచ్‌తో పాటు ఇతర ప్రాడక్ట్‌ల విడుదల తేదీల్ని ఖరారు చేయలేకపోతున్నట్లు తెలిపారు. ఐఫోన్ 12 సిరీస్ మోడళ్ల కొరత చాలా తక్కువగా ఉందని, ఆ మోడల్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment