ఐఫోన్‌-13 ప్రీ-బుకింగ్స్‌లో దుమ్మురేపిన ఇండియన్స్‌..! | Apple Witnesses Record Iphone 13 Pre Orders In India | Sakshi
Sakshi News home page

Apple Witnesses Record Iphone 13 Pre Orders: ఐఫోన్‌-13 ప్రీ-బుకింగ్స్‌లో దుమ్మురేపిన ఇండియన్స్‌..!

Published Tue, Sep 21 2021 4:23 PM | Last Updated on Tue, Sep 21 2021 4:27 PM

Apple Witnesses Record Iphone 13 Pre Orders In India - Sakshi

ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను ఈ నెల 14న  ఆపిల్‌ లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను సెప్టెంబర్‌ 17 నుంచి ప్రీ-బుకింగ్‌ ఆర్డర్స్‌ జరుగుతాయని ఆపిల్‌ ప్రకటించింది. తాజాగా జరిగిన ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ప్రీ-బుకింగ్స్‌లో ఇండియన్స్‌ దుమ్మురేపారు. విశ్వసనీయ రిటైల్ ట్రేడ్ వర్గాల ప్రకారం.. గత ఏడాది లాగానే రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా ఐఫోన్‌-13 స్మార్ట్‌ఫోన్లపై అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రేండ్‌ ప్రకారం గత త్రైమాసికంలో ఐఫోన్‌-12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల తరహాలో ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. 
చదవండి: Vodafone Idea Offers On IPhone 13: ఐఫోన్‌-13 కొనుగోలుపై వోడాఫోన్‌-ఐడియా బంపర్‌ ఆఫర్‌...!

ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలతో ఈ  త్రైమాసికంలో ఆపిల్‌ గణనీయమైన వృద్దిని సాధిస్తుందని వ్యాపార నిపుణులు అంచనా వేశారు.  వరుసగా వస్తోన్న పండుగల సీజన్‌తో భారత్‌లో  ఆపిల్‌  భారీ వృద్దిని నమోదుచేస్తోందని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ డైరక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ పేర్కొన్నారు. అందుకు ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ప్రీ-బుకింగ్స్‌ ఆర్డర్సే స్పష్టంచేస్తుందని తెలిపారు. ఐడిసి ఇండియా,  దక్షిణాసియా రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ మాట్లాడుతూ, రాబోయే పండుగ సీజన్‌లో ఐఫోన్‌-12 సిరీస్‌, పాక్షికంగా ఐఫోన్‌-13, 13 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌ ద్వారా యాపిల్ మంచి ఊపందుకుంటుందని చెప్పారు.

సెప్టెంబర్ 24 నుంచి ఈ నాలుగు కొత్త ఐఫోన్‌ -13 స్మార్ట్‌ఫోన్స్‌ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ రూ. 69,900 నుంచి ప్రారంభించి ప్రో మాక్స్ రూ .1,29,900 వరకు అందుబాటులో ఉన్నాయి.
చదవండి: ఐఫోన్‌-13ను ఎగతాళి చేసిన గూగుల్‌ నెక్సస్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement