iPhone 12
-
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కి బంపరాఫర్!
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కి బంపరాఫర్. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లను తక్కువ ధరకే అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఇతర ఎక్ఛేంజ్ ఆఫర్లు అన్నీ కలుపుకుని రూ.30,000లోపే దక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఐఫోన్ 12 సిరీస్ మార్కెట్ ధర రూ.49,900 ఉండగా రూ.40,999కే ఫ్లిప్ కార్ట్ విక్రయిస్తుంది. ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా చేసే ఐఫోన్ కొనుగోలుపై 17 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇతర బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉండగా.. దీని ధర మరింత తగ్గనుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, సిటీబ్యాంక్ క్రిడెట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై ఈఎంఐలో ఐఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. మీ వద్ద పాత ఫోన్ ఉంటే దానిని ఇచ్చేసి ఈ యాపిల్ ఫోన్‌ను ఎక్ఛేంజ్ కింద తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 12 అమ్మకాలు నిలిపివేత ఈ ఏడాది సెప్టెంబరులో ఫ్రాన్స్ అధికారులు ఐఫోన్ 12 అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఐఫోన్ 12 అనుమతించిన దానికంటే ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేస్తుంది. అయితే, ఐఫోన్ 12 గ్లోబల్ రేడియేషన్ ప్రమాణాలకు అనుగుణంగా అంతర్జాతీయ సంస్థలు ధృవీకరించాయని యాపిల్ తనను తాను సమర్థించుకుంది. టెక్ దిగ్గజం ఫ్రాన్స్‌లోని ఐఫోన్ 12 వినియోగదారుల కోసం ఫ్రెంచ్ రెగ్యులేటర్లు ప్రోటోకాల్‌కు అనుగుణంగా సాఫ్ట్వేర్ అప్డేట్ను కూడా విడుదల చేసింది. అదే సమయంలో , ఫ్రాన్స్ యూరోపియన్ యూనియన్ రేడియేషన్ ఎక్స్పోజర్ పరిమితులను ఉల్లంఘించినందున దేశంలో ఐఫోన్ 12 అమ్మకాలను నిలిపివేసింది. ఐఫోన్ 12 అక్కడ అమ్ముడవుతుందో లేదో తెలుసుకునేందుకు తమ ఏజెంట్లను యాపిల్ స్టోర్లకు పంపుతామని ఆ దేశ అధికారులు చెప్పారు. అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఫోన్ ఇప్పటికీ విక్రయిస్తున్నట్లు గుర్తించేతే ఇప్పటికే వినియోగదారులకు విక్రయించిన ఫోన్లను రీకాల్ చేస్తామని వారు తెలిపారు. -
ఇది కదా ఆఫర్ అంటే, ఐఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోండి ఇలా!
టెక్ ప్రియులకు శుభవార్త. అనకాపల్లి నుంచి అమెరికా దాకా ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడే ఐఫోన్లు ఇప్పుడు తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. తక్కువ ధర అంటే? ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లను కొనే ధరలోనే ఐఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అదెలా అంటారా? ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్స్ నిర్వహిస్తుంది. ప్రత్యేకంగా నిర్వహించే అమ్మకాల్లో యాపిల్ ఐఫోన్ 12ని రూ.35,000 లోపే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 12 మార్కెట్ ధర రూ.38,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్ రూ.3,000తో దాని ధర రూ. 35,999కి చేరుతుంది. ఎక్ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ.3,000 తగ్గుతుంది. అదే ఫోన్‌ను రూ.32,999కే కొనుగోలు చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీకెంతో ఇష్టమైన ఐఫోన్ ను ఇప్పుడే సొంతం చేసుకోండి. ఐఫోన్12 ఫీచర్లు ఐఫోన్ 12లో 6.1, 5.4 అంగుళాల స్క్రీన్, స్పోర్ట్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, 12 ఎంపీ డ్యూయల్ రియల్, వైడ్ యాంగిల్, అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా డ్యూయల్ సిమ్ (నానో+ఇ-సిమ్), అత్యంత శక్తిమంతమైన ఏ14 బయోనిక్ చిప్ మొదలైన ఫీచర్లు ఐఫోన్ 12లో ఉన్నాయి. -
యాపిల్‌కి మరోషాక్: ఆ ఐఫోన్ అమ్మకాలపై బ్యాన్
France Bans Apple iphone 12 స్మార్ట్ఫోన్దిగ్గజం యాపిల్‌కు మరో భారీ షాక్ తగిలింది. పరిమితికి మించి స్పెసిఫిక్ అబ్జార్పషన్ రేటు (SAR) విడుదల చేస్తోందంటూ ఐఫోన్ 12వాడకాన్ని ఫ్రాన్స్ బ్యాన్ చేసింది.ఇప్పటికే చైనాలో అధికారులు, ఇతర ఏజెన్సీల ఐఫోన్ల వాడకంపై ఆంక్షల మధ్య తాజా నిషేధం ఐఫోన్ లవర్స్‌కు షాకిచ్చింది. (యాపిల్ మెగా ఈవెంట్లో పీవీ సింధు: టీమ్ కుక్‌తో సెల్ఫీ పిక్స్ వైరల్) థ్రెషోల్డ్ రేడియేషన్ స్థాయిల కంటే ఎక్కువ ఉన్నందున ఐఫెన్ 12 మోడల్‌ను ఫ్రాన్స్‌లో విక్రయించడం మానేయాలని ఫ్రాన్స్ డిజిటల్ ఎకానమీ జూనియర్ మంత్రి ప్రకటించారు. అనుమతించిన విద్యుదయస్కాంత తరంగాల కంటే ఎక్కువగా విడుదల చేస్తుందని రెగ్యులేటరీ ఫ్రాన్స్‌కు చెందిన నేషనల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ (ANFR) పేర్కొంది. అధిక స్థాయిలో రేడియేషన్ రిలీజ్ చేస్తున్నఈ ఫోన్ విక్రయాలను వెంటనే నిలిపివేయాలని వెల్లడించింది. (యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్ ) ఐఫోన్ 12 సిగ్నల్స్‌లో స్పెసిఫిక్ అబ్జార్పషన్ రేటు అధికంగా ఉందని, ఐఫోన్ 12 చేతుల్లో ఉన్నా, జేబులో ఉన్నా కూడా 5.74 వాట్స్ పవర్ రిలీజ్ అవుతున్నట్లు గుర్తించింది. మూడేళ్ల యాపిల్ స్మార్ట్‌ఫోన్‌తో సహా, 141 ఫోన్లను ఏజెన్సీ పరీక్షించింది. మరోవైపు 2020 సెప్టెంబర్‌లో ఐఫోన్ 12నిలాంచ్ చేసింది. ఇప్పటికే పది మిలియన్ల యూనిట్లను విక్రయించింది. అలాగే ఐఫోన్ 15ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఐఫోన్12 అమ్మకాలను నిలిపి వేసింది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ నిషేధం అమ్మకాలపై ప్రభావం చూపక పోవచ్చంటున్నారు నిపుణులు. (గోల్డ్ లవర్స్‌కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం) -
గ్రేట్ ఆఫర్: రూ. 22,999కే ఐఫోన్.. కానీ
ఇటీవల కాలంలో ఆపిల్ ఐఫోన్‌ను ఉపయోగించడానికి దాదాపు అందరూ ఆసక్తి చూపుతారు. అయితే ధర ఎక్కువగా ఉన్న కారణంగా చాలామంది కొనుగోలు చేయలేకపోతారు. అయితే అలాంటి వారికోసం కంపెనీ ఒక బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఇప్పుడు యాపిల్ మొబైల్ కొనాలనుకునే వినియోగదారులు రూ. 22,999 చెల్లించి ఫ్లిప్‌కార్ట్‌లో 'ఐఫోన్ 12 మినీ' కొనుగోలు చేయవచ్చు. నిజానికి ఈ మొబైల్ ధర రూ. 59,900. క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 10,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కావున రూ. 49,999కే లభిస్తుంది. అదే సమయంలో ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 27,000 తగ్గుతుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే మొబైల్ బ్రాండ్, స్థితి వంటి వాటిమీద ఆధారపడి ఉంటుంది. కొనుగోలుదారులు తప్పకుండా ఈ విషయాన్ని గమనించాలి. కంపెనీ తెలిపిన అన్ని షరతులను మీరు పాటిస్తే రూ. 22,999తో యాపిల్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: Volkswagen ID.2all EV: ఫోక్స్‌వ్యాగన్ నుంచి రానున్న మొదటి ఎలక్ట్రిక్ కారు, ఇదే) ఆపిల్ ఐఫోన్ 12 మినీ 5.4 ఇంచెస్ సూపర్ రెటీనా XDE డిస్ప్లే కలిగి, IP68 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ పొందుతుంది. అంతే కాకుండా ఈ మొబైల్ ఫోన్ A 14 బయోనిక్ చిప్సెట్, 64 GB ఇంటర్నల్ మెమరీ వంటివి పొందుతుంది. కంపెనీ ఈ మొబైల్ మీద ఆరు నుంచి ఏడు సంవత్సరాల సెక్యూరిటీ, ఇతర అప్డేట్లను అందిస్తుంది. -
వావ్..ఇంత తక్కువ ధరలో యాపిల్ ఐఫోన్!
సాక్షి,ముంబై: యాపిల్ ఐఫోన్ ఇపుడు అతి తక్కువ ధరలో యాపిల్ లవర్స్‌కు అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యాపిల్ ఐఫోన్ 12 రూ. 27,401 భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఐఫోన్12 కంపెనీ అధికారిక ఆన్లైన్ స్టోర్‌లో రూ. 59,900గా లిస్ట్‌కాగా, ఫ్లిప్‌కార్ట్‌తో రూ. 3,901 ధర తగ్గింపుతో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఈ 55,999కి లిస్ట్ కాగా, అయితే ప్రస్తుత ఆఫర్లతోఈ ఫోన్ రూ. 32,499కి లభిస్తోంది. (జర్నలిస్టులపై బ్యాన్,ట్విటర్ స్పేసెస్‌కు బ్రేక్..బైడెన్‌పై సెటైర్లు) ఐడీఎఫ్సీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10శాతం తక్షణ తగ్గింపుతో ఐఫోన్ 12 ధర దిగి వచ్చింది. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఐఫోన్ 12 ను కొనుగోలు చేసినట్లయితే, 5 శాతం అదనంగా క్యాష్ బ్యాక్ లభ్యం. దీనికితోడు రూ. 5,000 అంతకంటే ఎక్కువ ఆర్డర్లపై రూ. 3,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది ఫ్లిప్‌కార్ట్ ద్వారా. అలాగే పాత స్మార్ట్‌ఫోన్ మార్పిడి ద్వారా ఫ్లిప్‌కార్ట్ రూ. 21,500 వరకు తగ్గింపును అందిస్తోంది. అన్ని బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్ , డిస్కౌంట్స్ తరువాత 28,401 తగ్గింపుతో ఐఫోన్ 12 ను కేవలం రూ. 32,499తో కొనుగోలు చేయవచ్చు. యాపిల్ ఐఫోన్ 12 స్పెసిఫికేషన్స్ 6.1 అంగుళాల ఓఎల్ఈడీ సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే ఏ14 బయోనిక్ చిప్ సెట్ ఐఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టం 64 జీబీ ర్యామ్,, 128 జీబీ స్టోరేజ్ 12+12 డ్యుయల్ రియర్ కెమెరా 12 ఎంసీ సెల్ఫీ కెమెరా 2815 ఎంఏహెచ్ బ్యాటరీ -
యాపిల్ డివైజ్‌లకు 5జీ అప్‌గ్రేడ్
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తమ పరికరాలు 5జీని సపోర్ట్ చేసేలా ప్రయోగాత్మకంగా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దేశీ టెలికం సంస్థల నుంచి 5జీ నెట్‌వర్క్‌కు యాక్సెస్ లభించిన యూజర్లు .. ఐఫోన్ల ద్వారా సదరు సర్వీసులను పొందడానికి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. ఈ బీటా ప్రోగ్రాం కోసం యూజర్లు యాపిల్ వెబ్సైట్లో నమోదు చేసుకుని, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐఫోన్ 12 అంతకు మించిన వెర్షన్లకు ఇది పని చేస్తుంది. టెలికం సంస్థ జియో ప్రస్తుతం తాము 5జీ సర్వీసులు అందిస్తున్న నగరాల్లో యూజర్లకు జియో వెల్కమ్ ఆఫర్ పేరిట ప్రత్యేక ఆహ్వానాలు పంపుతోంది. వారికి ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా 1 జీబీపీఎస్ స్పీడ్‌తో అపరిమిత 5జీ డేటా అందిస్తోంది. అయితే, ఇందుకోసం ప్రీపెయిడ్ కస్టమర్లు రూ. 239 అంతకు మించిన ప్లాన్ ఉపయోగిస్తుండాలి. పోస్ట్ పెయిడ్ యూజర్లు అందరూ ఈ ఆఫర్‌కు అర్హులే. మరోవైపు, ఎయిర్టెల్ మాత్రం ఇటువంటి ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడం లేదు. తాజా యాపిల్ బీటా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకున్నాక యూజర్లు తమ ప్రస్తుత ప్లాన్‌లో భాగంగానే 5జీ సర్వీసులను ట్రయల్ ప్రాతిపదికన ఉపయోగించుకోవచ్చు. -
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు బంపరాఫర్!
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు బంపరాఫర్. దేశంలో దసరా ఫెస్టివల్ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్, అమెజాన్లు ప్రత్యేక సేల్ ను నిర్వహించనున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 30వరకు నిర్వహించనున్న సేల్‌లో ల్యాప్ ట్యాప్స్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. యాపిల్ లేటెస్ట్గా విడుదల చేసిన ఐఫోన్లను సైతం డిస్కౌంట్‌కే అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ప్రస్తుతం ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ ధరల్ని ఫ్లిప్‌కార్ట్ తన సైట్లో లిస్ట్ చేసింది. లిస్టింగ్ చేసిన ధరల ప్రకారం.. ఐఫోన్ 13 ప్రారంభ ధర రూ.69,900, ఐఫోన్ 13 ప్రో ప్రారంభ ధర రూ.1,19,900, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,26,000గా ఉంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో తగ్గించనుంది. ప్రస్తుతం ఆ ధరలు ఇలా ఉన్నాయంటూ ఫ్లిప్ కార్ట్‌తో పాటు పలు టెక్ బ్లాగ్లు కథనాల్ని ప్రచురించాయి. ఆ వివరాల ప్రకారం.. యాపిల్ ఐఫోన్ ధరలు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్‌లో ఐఫోన్ 13ప్రో ప్రారంభ ధర రూ.89,900, ఐఫోన్ 13ప్రో మ్యాక్స్ ధర రూ.99,990గా ఉంది. అయితే ఐఫోన్ 13 ధర రూ.49,990 కంటే తక్కువ ధరకే లభించనుంది. ఐఫోన్ 12 సిరీస్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్‌లో ఐఫోన్ 12 మిని రూ.39,990 అంతకంటే తక్కువగా ఐఫోన్ 11 ధర రూ.29,990 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ తగ్గింపు ధరలతో పాటు ఇతర ఐఫోన్ సిరీస్‌ల కొనుగోళ్లపై డిస్కౌంట్స్, ఆఫర్స్ అందించనుంది. కాగా, ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 12 మిని ప్రారంభ ధర రూ.55,359 ఉండగా, ఐఫోన్ 11 ప్రారంభం ధర రూ.43,990గా ఉంది. వీటి ధర సెప్టెంబర్ 23నుంచి భారీగా తగ్గనున్నాయి. ఎప్పుడు విడుదలయ్యాయంటే? ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక సేల్‌లో డిస్కౌంట్ ధరలకే లభ్యమయ్యే ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ గతేడాది అక్టోబర్ నెలలో యాపిల్ సంస్థ విడుదల చేసింది. అమెరికా క్యాలిఫోర్నియా యాపిల్ ప్రధాన కార్యాలయం క్యూపర్టినో వేదికగా క్యాలిఫోర్నియా స్ట్రీమింగ్ పేరుతో ఈవెంట్‌ను నిర్వహించింది. ఆ ఈవెంట్లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ విడుదలైంది. అక్టోబర్ 2020లో ఐఫోన్ 12 మినీ, సెప్టెంబర్ 2019లో ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లను యాపిల్ మార్కెట్‌కు పరిచయం చేసింది. చదవండి👉 దుమ్మురేపుతున్న ఫీచర్లు, ఐఫోన్ 14 సిరీస్ విడుదల! -
ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022 నేటి (జూలై 23న) అర్థరాత్రి ప్రారంభం కానుంది. ఈసేల్‌లో ఐఫోన్ 12 రూ. 52,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. దీనికి సిటీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లేదా ఆర్బీఎల్ బ్యాంక్ కార్డ్‌లతో షాపింగ్ చేసినవారు అదనంగా.1,000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఐఫోన్ 11 ధర 40 వేల దిగువకు చేరగా. ఐ ఫోన్ 12ను రూ. 51,999కే సొంతం చేసుకోవచ్చు. iPhone 11 64GB బ్లాక్ వేరియంట్‌ను రూ. 2,000 బ్యాంక్ తగ్గింపుతో రూ. 39,999 ధరకు పొందవచ్చు. మోటో జీ 60 కూడా తగ్గింపుతో లభిస్తుంది. బ్యాంకు ఆఫర్‌తో కలిసి మోటో జీ60 ధర రూ. 13,999కి లభ్యం. పోకో ఎం4 ప్రొ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో షావోమి, వివో, రెడ్మినోట్ ఫోన్లు కూడా డిస్కౌంట్ ధరల్లో అందిస్తోంది. ఇది కూడా చదవండి: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్:స్పెషల్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ -
యాపిల్ యూజర్లకు బంపరాఫర్!
టెక్ దిగ్గజం యాపిల్ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. క్రోమా యాపిల్ ఫెస్టివల్ సేల్ 2022 సందర్భంగా ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటు ఇతర ప్రొడక్ట్‌లను సైతం తక్కువ ధరకే కొనుగోలు చేయోచ్చని తెలిపింది. యాపిల్ సంస్థ క్రోమా యాపిల్ ఫెస్టివల్ 2022 సేల్ సందర్భంగా పలు ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లను అందిస్తుంది. ఈ సేల్ సందర్భంగా ఐఫోన్, మాక్ బుక్, ఐపాడ్, యాపిల్ వాచెస్, ఎయిర్ పాడ్స్ల ధరల్ని భారీగా తగ్గించేసింది. పలు బ్యాంకుల ద్వారా జరిపే చెల్లింపులపై ఆఫర్లు, ఎక్ఛేంజ్ డీల్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం క్రోమాలో యాపిల్ ఐఫోన్12ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 64జీబీ స్టోరేజ్ 4జీబీ ర్యామ్ వేరియంట్‌తో ఉన్న ఫోన్‌ను పై 14శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్ అసలు ధర రూ.65,900 ఉండగా రూ.53,900కే కొనుగోలు చేయోచ్చు.ఒకవేళ మీ వద్ద పాత ఫోన్ ఉంటే ఎక్ఛేంజ్ కింద రూ.15,610 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు నెలకు రూ.2,683 ఈఎంఐ చెల్లించుకోవచ్చు. -
బంపర్ ఆఫర్: రూ. 20 వేలకే లేటెస్ట్ ఐఫోన్
సాక్షి, ముంబై: యాపిల్ ఐఫోన్‌ను సొంతంచేసుకునేందుకు ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రేమికులకు బంపర్ ఆఫర్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఒక ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది. యాపిల్ లేటెస్ట్ ఫోన్ ఐఫోన్ 12 మిని పై భారీ తగ్గింపును ప్రకటించింది. తాజా డిస్కౌంట్లో ఐఫోన్ 12 మిని 64 జీబీ వేరియంట్‌ను రూ.20 వేల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్ కలిపి ఈ తగ్గింపును అందిస్తోంది. యాపిల్ ఐఫోన్ 12 మినీ: ఫ్లిప్‌కార్ట్ డీల్ ఐఫోన్ 12 మిని 64 జీబీ వేరియంట్ ఎంఆర్పీ ధర రూ. 59,900. దీన్ని ఫ్లిప్‌కార్ట్ రూ.49,999కి లిస్ట్ చేసింది. అంటే రూ.9901 తగ్గింపు. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేస్తే రూ. 30వేల వరకు ఎక్స్ఛేంజ్ ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. అంటే తాజా ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా, 49,999 రూపాయలకి బదులుగా దాదాపు రూ. 20 వేలకే సొంతం చేసుకోవచ్చన్నమాట. దీంతోపాటు ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌పై 10 శాతం తక్షణ తగ్గింపును, అలాగే యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. అయితే ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ స్మార్ట్‌ఫోన్ మోడల్, దాని కండిషన్, లాంటి ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది అనేది గమనార్హం. ఐఫోన్ 12 మిని 64 జీబీ స్పెసిఫికేషన్స్ 5.4 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే ప్రాసెసర్: యాపిల్ ఏ14 బయోనిక్ చిప్సెట్ 64జీబీ ర్యామ్, 128జీబీ మెమొరీ 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 12ఎంపీ సెల్ఫీ కెమెరా. స్టీరియో స్పీకర్లు, 5జీ కనెక్టివిటీ. -
ఐఫోన్ లవర్స్‌కు బంఫరాఫర్!
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 12పై డిస్కౌంట్లు ప్రకటించింది. యాపిల్‌కు చెందిన రీటెయిల్ ఔట్లెట్లలో ఈఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్లు పొందవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీంతో రీటెయిల్ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్, ఎక్ఛేంజ్ ఆఫర్‌తో ఐఫోన్ 12ను రూ.32వేలకే సొంతం చేసుకోవచ్చు. యాపిల్ ప్రీమియం ఫోన్లను అమ్మే యూనికార్న్ స్టోర్ ఐఫోన్12ని రూ.32వేలకే అందిస్తుంది. ఫోన్ అసలు ధర రూ.56,674 ఉండగా స్టోర్ 14శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. దీంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ.3వేల తగ్గింపు, రూ.3వేల విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కలిపి ధర ఉంటుందని ప్రకటన స్పష్టంగా పేర్కొంది. ఐఫోన్ 12ను కొనుగోలు కోసం హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే రూ.3వేల క్యాష్ బ్యాక్, పాత ఐఫోన్11 లేదా ఐఫోన్ ఎక్స్ ఆర్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.19,000 వరకు పొందవచ్చు. యూనికార్న్ స్టోర్ రూ.3వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. మీ పాత ఫోన్‌కి రూ.20వేలు పొందగలిగితే పొందగలిగితే, మీరు దాదాపు రూ.33వేలకే ఐఫోన్ 12ని పొందవచ్చు. మీ పాత ఫోన్‌కు మీరు పొందే ధర పూర్తిగా మీ ఫోన్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఐఫోన్లో బ్యాటరీ పనితీరు మందగించినా, లేదా స్క్రాచ్‌లు పడినా ఐఫోన్ ధర తగ్గుతుంది. ఐఫోన్ 12ఫీచర్లు ఐఫోన్ 12 నెక్ట్స్ జనరేషన్ న్యూరల్ ఇంజన్ ప్రాసెసర్‌తో ఏ14 బయోనిక్ చిప్‌తో వస్తుంది. 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్ప్లేను కలిగి ఉంది. ముందు భాగంలో నైట్ మోడ్, 4కే డాల్బీ విజన్ హెచ్‌డీఆర్‌తో రికార్డింగ్‌తో కూడిన 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా ఉంది. ప్రొటక్షన్ కోసం ఐఫోన్ 12 సిరామిక్ షీల్డ్ కోటింగ్‌ను కలిగి ఉంది. చదవండి👉ఐఫోన్13 పై ఆఫర్ మామూలుగా లేదుగా,నెలకు రూ.760కే..అస్సలు మిస్ చేసుకోవద్దు! -
యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు.. లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ తక్కువ ధరలోనే...
ప్రముఖ రిటైల్ చైన్ స్టోర్ దిగ్గజం విజయ్ సేల్స్ యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును ప్రకటించింది.ఈ తగ్గింపులు యాపిల్ డేస్ సేల్‌లో భాగంగా కొనుగోలుదారులకు ఆయా యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ సేల్ ఏప్రిల్ 15 నుంచి మొదలవ్వగా.. ఏప్రిల్ 21 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఈ సేల్ లో భాగంగా iPhone SE (2022), iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max, iPhone 11, iPhone 12 స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లపై డిస్కౌంట్, ఇతర ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్లు కూడా రూ. 10,000 క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చును. ఈ ఆఫర్లు అన్ని విజయ్ సేల్స్ రిటైల్ స్టోర్స్, ఆన్ లైన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. iPhone 13 ని రూ. 58,900. కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ. 79,900, ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సుమారు రూ. 21,000 వరకు తగ్గింపును పొందవచ్చును. iPhone 13 Pro ధర రూ. 1,12,300 కు లభించనుంది iPhone 13 Pro Max రూ. 1,22,000 కే రానుంది ఐఫోన్ 11 రూ.44,490 నుంచి ప్రారంభం కానుంది iPhone 12 రూ. 53,900 కు అందుబాటులో ఉండనుంది. -
భారత్‌లో ఐఫోన్ అమ్మకాలు అదరగొట్టేస్తున్నాయ్, రూ.10వేల కోట్లకు యాపిల్ ఎగుమతులు!
ప్రముఖ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్ టెక్ మార్కెట్లో సత్తా చాటుతోంది. దేశంలో యాపిల్ ఐఫోన్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవడంతో, ఆఫోన్ల అమ్మకాలు అదరగొట్టేస్తున్నాయి. దీంతో దేశీయంగా యాపిల్ ప్రొడక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. అందుకే ఇక్కడ తయారు చేస్తున్న ఆ సంస్థ ఉత్పత్తుల ఎగుమతుల విలువ ఫైనాన్షియల్ ఇయర్ 2022కి రూ.10వేల కోట్లకు చేరనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంవత్సరంలోనే.. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశంలో తయారీ పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో ఎంపికైన సంస్థలకు ప్రత్యేక రాయితీలు అందిస్తుంది. ఈ నేపథ్యంలో యాపిల్ ప్రొడక్ట్‌లను తయారు చేసేందుకు పరిశ్రమల్ని స్థాపించేందుకు పీఎల్ఐ స్కీమ్‌కు అప్లయి చేసింది. ఇందులో యాపిల్ ఐఫోన్లను విస్ట్రాన్, ఫాక్స్‌కాన్,పెగాట్రాన్ లు ఎంపికయ్యాయి. విస్ట్రాన్ కర్ణాటకలో ఉండగా, ఫాక్స్‌కాన్ తమిళనాడులో కర్ణాటకలో విస్ట్రాన్ కంపెనీ ఐఫోన్ మోడల్‌లు ఎస్ఈ 2020లను తయారు చేస్తుండగా..తమిళనాడులో ఫాక్స్‌కాన్ ఐఫోన్ 11,ఐఫోన్12, ఐఫోన్13లను తయారు చేస్తుంది. పెగాట్రాన్ సైతం ఏప్రిల్1 నుంచి దేశీయంగా ఐఫోన్ల తయారీ కార్యాకలాపాల్ని ప్రారంభించనుంది. అయితే పీఎల్ఐ స్కీమ్‌లో భాగంగా ఉత్పత్తిని ప్రారంభించిన తొలి ఏడాది యాపిల్ సంస్థ కేవలం 10నుంచి 15శాతం ఉత్పత్తి చేసింది. అనూహ్యంగా దేశీయ మార్కెట్లో ఐఫోన్13తో పాటు ఇతర ఐఫోన్ సిరీస్ ఫోన్లతో పాటు ఇతర ప్రొడక్ట్‌ల అమ్మకాలు భారీ ఎత్తున జరిగాయి. దీంతో ఉత్పత్తుల శాతం గణనీయంగా పెరిగి..75 నుంచి 80శాతం ఉత్పత్తి చేసింది.ఈ ఉత్పత్తుల మార్కెట్ విలువ 10వేలకోట్లకు చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: చావు బతుకుల్లో నేహ భర్త.. కాపాడినందుకు టిమ్ కుక్కు థ్యాంక్స్! -
యాపిల్ ఐఫోన్ లవర్స్ కు బంపరాఫర్,భారీ డిస్కౌంట్లకే!
iPhone 12 Discount: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు యాపిల్ ఐఫోన్12పై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నాయి. దీంతో ఐఫోన్ 12 ఫోన్ రీటైల్ మార్కెట్ లో ఉన్న ధర కంటే భారీగా తగ్గనుంది. ఐఫోన్ 12 మోడల్స్ ధర ఉన్న స్టాక్‌తో పాటు కలర్ వేరియంట్ ఆధారంగా ఆఫర్ పొందవచ్చు. అమెజాన్‌లో ఐఫోన్-12 64 జీబీ బ్లాక్ వేరియంట్ ఫోన్ ను కేవలం రూ.42,049కి కొనుగోలు చేయోచ్చు. అయితే, మీరు ఎక్ఛేంజ్ ఆఫర్‌తో ఫోన్ ధరను మరింత తగ్గించుకోవచ్చు. ఎక్ఛేంజ్ ఆఫర్ల ద్వారా రూ.14,950 వరకు తగ్గిస్తుంది. ఇంకా, ఐఫోన్12ను సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ.1500 తక్షణ తగ్గింపు, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై డిస్కౌంట్లు,హెచ్డీ ఎఫ్‌సీ బ్యాంక్ మనీబ్యాక్+ క్రెడిట్ కార్డ్‌లు, మనీబ్యాక్ క్రెడిట్ కార్డ్‌లపై అమెజాన్ డిస్కౌంట్/క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. మరోవైపు, మీరు ఫ్లిప్‌కార్ట్ సైతం ఐఫోన్ పై ఆఫర్లు ప్రకటించింది. 64జీబీ బ్లాక్ కలర్ వేరియంట్ ఐఫోన్ 12ని రూ. 44,799కి కొనుగోలు చేయోచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5,601 తగ్గింపుతో రూ.60,299కి విక్రయిస్తోంది. ఎక్ఛేంజ్ ఆఫర్ల ద్వారా రూ. 15,500 వరకు తగ్గుతుంది. దీంతో ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లో రూ.44,799 వద్ద స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయోచ్చు. -
ఐఫోన్ 12 కొనేవారికి ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్..!
మీరు కొత్తగా ఐన్ఫో కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ పేరుతో నిర్వహిస్తున్న సేల్ లో భాగంగా యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ మొబైల్ మీద భారీ ధర తగ్గింపును ప్రకటించింది. రిటైల్ అవుట్ లెట్ల కంటే చౌక ధరకు ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మొబైల్స్ అసలు ధర కంటే ₹19,000 తక్కువకు లభిస్తుంది. ఆఫర్స్ ఇవే: ఐఫోన్ 12 64 జీబీ వేరియంట్ ఒరిజినల్ ధర ₹ 65,900. ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌లో ₹53,999 ధరకు లభిస్తుంది. ఐఫోన్ 12128 జీబీ వేరియంట్ ఒరిజినల్ ధర ₹ 70,900. ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌లో ₹64,999 ధరకు లభిస్తుంది. ఐఫోన్ 12 మినీ 64 జీబీ వేరియంట్ ఒరిజినల్ ధర ₹59,900. ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌లో ₹40,999 ధరకు లభిస్తుంది. ఐఫోన్ 12 మినీ 128 జీబీ వేరియంట్ ఒరిజినల్ ధర ₹ 64,900. ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌లో ₹54,999 ధరకు లభిస్తుంది. ఫీచర్స్: డ్యూయల్ సిమ్(నానో + ఈసిమ్) ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ యాపిల్ మొబైల్స్ ఏ14 బయోనిక్ చిప్ సహాయంతో పనిచేస్తాయి. దీనిలో స్పోర్ట్ సూపర్ రెటీనా ఎక్స్‌డిఆర్ ఓఎల్ఈడి డిస్ ప్లే ఉంది. ఇవి యాపిల్ సిరామిక్ షీల్డ్ గ్లాస్ తో సంరక్షించబడతాయి. ఐఫోన్ 12 6.1 అంగుళాల స్క్రీన్ ను కలిగి ఉండగా, ఐఫోన్ 12 మినీలో చిన్న 5.4 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లు ఐఓఎస్ 14తో లాంఛ్ చేసిన 2021లో ఐఓఎస్ 15కు అప్ డేట్ అయ్యాయి. ఈ రెండు మోడల్స్ లో ఒక వైడ్-యాంగిల్ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాను కలిగి ఉన్న 12 మెగా పిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరాలతో వస్తాయి. ఐఫోన్ 12 ఎఫ్/1.6 అపెర్చర్ అయితే, ఐఫోన్ 12 మినీ అపెర్చర్ ఎఫ్/2.4గా ఉంది.మీరు ఎంచుకున్న రంగు, వేరియెంట్ బట్టి ధరలు మారవచ్చని గమనించాలి. ఈ ఆఫర్ ఈ రోజు అర్దరాత్రి వరకు మాత్రమే అవకాశం ఉంది. (చదవండి: గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు అలర్ట్.. యూపీఐ సర్వర్ డౌన్!) -
ఐఫోన్ 12 ప్రో కొనుగోలుపై రూ. 25 వేల వరకు తగ్గింపు..!
ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..! ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఐఫోన్ 12 ప్రో కొనుగోలు ఏకంగా రూ. 25,000 భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. డిస్కౌంట్ అన్ని స్టోరేజ్ వేరియంట్లపై అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లో రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. అంటే వినియోగదారులు తమ పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఐఫోన్ 12 ప్రో ధరను మరింత దిగిరానుంది. అమెజాన్‌లో రూ 1,19,000 ఖరీదైన ఐఫోన్ 12 ప్రొ 128జీబీ రూ 95,900కే రానుంది. దీంతో పాటుగా రూ పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ 14,900 తగ్గింపు వర్తించనుంది. ఐఫోన్ 12 ప్రో ఫీచర్స్..! 6.1 ఇంచ్ సిరామిక్ షీల్డ్ కోటెడ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే ఏ14 బయోనిక్ చిప్ 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా 4 కె డాల్బీ విజన్ హెచ్‌డిఆర్ రికార్డింగ్ 4x ఆప్టికల్ జూమ్ రేంజ్ 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా చదవండి: మరోసేల్, రెండు రోజులు మాత్రమే..స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు..! -
టిమ్ కుక్కు కొత్త తలనొప్పులు, చివాట్లు పెడుతున్న ఐఫోన్ యూజర్లు
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కు భారీ షాక్ తగిలింది. రానున్న రోజుల్లో ఐఫోన్లకు బదులుగా వాటి స్థానంలో అగుమెంటెడ్ రియాల్టీ హెడ్‌సెట్స్‌తో రీప్లేస్ చేసే పనిలో పడింది. కానీ యాపిల్ సంస్థకు అనుకోని విధంగా ఐఫోన్ వినియోగదారులతో పాటు పలు ఆటోమొబైల్ సంస్థల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. యాపిల్ ఇటీవల ఐఫోన్ 12, ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లలో ఐఓఎస్ 15ను అప్ డేట్ చేసింది. ఆ ఐఓఎస్15 ను అప్డేట్ చేసుకున్న యూజర్ల ఫోన్లలో బ్లూటూత్ పనిచేయడం లేదని యాపిల్‌ను చివాట్లు పెడుతున్నారు. 9టూ 5 మాక్ కథనం ప్రకారం.. చాలా మంది ఐఓఎస్ 15.1 వినియోగదారులు కార్లలో బ్లూటూత్ హ్యాండ్స్ ఫ్రీ సిస్టమ్‌లతో కనెక్షన్ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అయితే ఆ బగ్‌లను పరిష్కరించకుండా యాపిల్ వదిలేసిందని విమర్శిస్తున్నారు. ఈ సమస్యలు ఎక్కువగా ఐఫోన్ 12, ఐఫోన్ 13 మోడళ్లతో కనిపిస్తుండగా.. ఆ సమస్య ఆటోమొబైల్ రంగంపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా టయోటా, ఆడి, వోల్వోతో పాటు అకురా,బీఎండబ్ల్యూ, చేవ్రొలెట్, ఫోర్డ్,హోండా,హూందాయ్,లింకన్, మాజ్డా, మెర్సిడిస్ బెంజ్, మిత్సుబిషి, ఫోర్ష్ కార్ల వినియోగదారులకు ఈ బ్లూటూత్ కనెక్టివిటీ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై వాహనదారులు సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వరుస ఫిర్యాదులతో ఆటోమొబైల్ సంస్థల ప్రతినిధులు సైతం యాపిల్‌పై గుర్రుగా ఉన్నారు. ఐఫోన్ 12, ఐఫోన్ 13 కోసమే ఐఫోన్ 12, ఐఫోన్ 13 యూజర్ల సౌలభ్యం కోసం కాల్ డ్రాప్ పనితీరును మెరుగు పరిచేందుకు యాపిల్ సంస్థ ఐఓఎస్ 15.1.1 వెర్షన్‌ను విడుదల చేసింది. కానీ ఆ వెర్షన్ విడుదల యాపిల్ సంస్థకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. కోవిడ్ దెబ్బకు చిప్ షార్టేజ్ తలెత్తింది. అదే సమయంలో ఐఫోన్ 13ను పూర్తి స్థాయిలో యూజర్లకు అందించే విషయంలో వెనక్కి తగ్గడంతో యాపిల్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు ఈ కొత్త సమస్య యాపిల్‌ను ఎంత అప్రతిష్టపాలు చేస్తుందోనని ఆ సంస్థ ప్రతినిధులు బయపడుతున్నారు. మరోవైపు యాపిల్ సంస్థ ఐఫోన్లను రీప్లేస్ చేస్తూ ఆగుమెంటెడ్ రియాల్టీ హెడ్ సెట్లపై పనిచేయడంపై యూజర్లు సెటైర్లు వేస్తున్నారు. ఐఫోన్ లను రీప్లేస్ చేయడం సరే, ఈ సాంకేతిక సమస్యల్ని పరిష్కరించాలని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: యాపిల్ పరువు తీసి పడేశాడు.. కొత్తేం కాదుగా! -
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ ఫోన్లు ఇవే!
ప్రపంచ మొబైల్ మార్కెట్లో ఐఫోన్ అమ్మకాల పరంగా రికార్డు సృష్టిస్తుంది. 2021 ఏడాదిలో మొదటి తొమ్మిది నెలల్లో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఐదు స్మార్ట్ ఫోన్లలో నాలుగు ఐఫోన్లు, ఒక శామ్సంగ్ మొబైల్ నిలిచింది. ఐడీసీ విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రపంచ అమ్మకాల పరంగా చూస్తే ఐఫోన్ 12 మొదటి స్థానంలోను, శామ్సంగ్ ఏ12 రెండవ స్థానంలో, ఐఫోన్ 11 మూడవ స్థానంలో, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ నాల్గవ స్థానంలో, ఐఫోన్ 12 ప్రొ ఐదవ స్థానంలో నిలిచాయి. 2021 మొదటి మూడు నెలల్లో ఐఫోన్ 12 ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ ఫోన్‌గా నిలిచింది. 2021లో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌గా శామ్ సంగ్ గెలాక్సీ ఏ12 మాత్రమే నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ ఫోన్లలో టాప్ 5లో 2వ స్థానాన్ని ఆక్రమించింది. ఈస్మార్ట్ ఫోన్ 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. దీని ధర మన దేశంలో రూ.15,599గా ఉంది. గెలాక్సీ ఏ12 ఈ ర్యాంకింగ్ లో అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్. మిగిలిన యాపిల్ మోడల్స్ ధరలు భారీగా ఉన్నాయి. 4 out of the 5 most sold smartphones in the first three quarters of 2021 are from @Apple pic.twitter.com/B750knoyZC — Francisco Jeronimo (He/Him) (@fjeronimo) November 22, 2021 (చదవండి: దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల బ్యాన్..! క్లారిటీ ఇచ్చిన నితిన్ గడ్కరీ!) -
అమెజాన్‌లో ఐఫోన్ 12 ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేస్తే..లబోదిబో!!
ఓ వ్యక్తి అమెజాన్‌లో ఐఫోన్ 12 ఆర్డర్ చేశాడు. ఆర్డర్ ప్యాక్ ఓపెన్ చేసి చూసి సృహతప్పి పడిపోయాడు!! అందులో ఏముందంటే.. కేరళలోని కొచ్చికి చెందిన నూరుల్ అమీన్ అనే వ్యక్తి రూ. 70,900ల ఖరీదైన ఐఫోన్ 12ను అమెజాన్‌లో అక్టోబర్ 12న ఆర్డర్ చేశాడు. అమెజాన్ పే కార్డ్‌తో బిల్ కూడా కట్టేశాడు. అక్టోబర్ 15న ఆర్డర్ ప్యాక్ వచ్చింది. ఉత్సాహంతో తెరిచాడు.. తీరా చూస్తే లోపల అంట్లు తోమే సోప్, 5 రూపాయల కాయిన్ ఉన్నాయట. దీంతో సదరు ఎన్నారై సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చదవండి: Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట! ఐతే నూరుల్ ఆర్డర్ చేసిన ఐఫోన్‌ను అప్పటికే జార్ఖండ్‌కి చెందిన ఓ వ్యక్తి సెప్టెంబర్ నుంచి వినియోగిస్తున్నాడనే విస్తుపోయే వాస్తవం బయటపడింది. దీంతో సైబర్ పోలీసులు అమెజాన్ అధికారులను సంప్రదించగా.. సెప్టెంబర్ 25 నుండి జార్ఖండ్‌లో ఈ ఫోన్ వాడుకలో ఉందని, నూరుల్ నుంచి అక్టోబర్‌లో ఆర్డర్ వచ్చింది కానీ అప్పటికే స్టాక్ అయిపోయిందని, అతను చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వబడుతుందని వెల్లడించారట. తనకెదురైన ఈ వింత సంఘటనను నూరుల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే అది వైరల్ అయ్యింది. ఐఫోన్ బదులుగా ఆకుపచ్చ రంగు విమ్ డిష్ వాష్ సబ్బు, రూ .5 నాణెం కనిపించే ఒక చిత్రం కూడా సోషల్ మీడియా సైట్లలో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులకు బదులు ఇటుకలు, సబ్బులు.. ఆర్డర్ ప్యాకుల్లో రావడం మామూలైపోయింది. సో.. కస్టమర్లు ఆన్లైన్ పర్చేజింగ్తో కాస్త జాగ్రత్త మరి. చదవండి: Mystery Case: 5 యేళ్ల క్రితం హత్యచేశారు.. కానీ.. -
స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఎయిర్‌పాడ్స్ ఉచితం...!
Free Airpods: భారత్‌లో దసరా, దీపావళి పండుగ సీజన్స్ మొదలైనాయి. దీంతో పలు ఈ కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఆపిల్ కూడా దీపావళి సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ ఆపిల్ ఇండియా అధికారిక వెబ్సైట్లో లైవ్‌గా నడుస్తోంది. ఐఫోన్ 12 , ఐఫోన్ 12 మినీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఆపిల్ ఫస్ట్-జెన్ ఎయిర్పాడ్లను ఉచితంగా అందిస్తున్నట్లు ఆపిల్ గురువారం ప్రకటించింది. చదవండి: ఆ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ బ్యూటీ..! ఆపిల్ తన ఇండియా స్టోర్ పేజీలో దీపావళి సేల్ ఆఫర్ల వివరాలను ప్రకటించింది. ఐఫోన్ 13 సిరీస్ ప్రారంభించిన తర్వాత ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ధరలను ఆపిల్ భారీగా తగ్గించింది. ఐఫోన్ 12 మినీ 64 జీబీ మోడల్ రూ. 59,900 కే లభిస్తుంది. 128 జీబీ మోడల్ ధర రూ. 64,900. 256జీబీ మోడల్ రూ .74,900కు ఆపిల్ తన వెబ్సైట్లో విక్రయిస్తోంది. మరోవైపు,ఐఫోన్ 12 బేసిక్ మోడల్ 64జీబీ వేరియంట్ ధర రూ. 65,900, 128జీబీ వేరియంట్ ధర రూ. 70,900 వద్ద అందుబాటులో ఉంది. 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .80,900 వద్ద రిటైల్ అవుతోంది. సెప్టెంబర్ 14 న ఆపిల్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను వినియోగించిన విషయం తెలిసిందే. చదవండి: కోకాకోలా ఇప్పుడు సరికొత్తగా ...! -
యాపిల్ అదిరిపోయే ఆఫర్, ఐఫోన్ 13పై రూ.46వేల వరకు..
ఐఫోన్ లవర్స్‌కు టెక్ దిగ్గజం యాపిల్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ కొనుగోలుదారులకు రూ.46 వేల వరకు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ ఆఫర్‌ను దక్కించుకోవాలంటే ఐఫోన్ 13 లవర్స్ 'ట్రేడ్ ఇన్ ఆఫర్'లో పాల్గొనాల్సి ఉంటుంది. ఎక్సేంజ్ ఆఫర్లు ఎలా ఉన్నాయి ట్రేడ్ ఇన్ ఆఫర్లో ఐఫోన్ 12ప్రో మ్యాక్స్ ఎక్ఛేంజ్‌లో రూ.46,120 వరకు, ఐఫోన్ 12 ప్రో పై రూ.43,255, బేసిక్ ఐఫోన్ 12పై రూ.31,120, ఐఫోన్ 12 మినీ పై రూ.25,565, ఆండ్రాయిడ్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఫోన్ పై రూ.13,085వరకు సొంతం చేసుకోవచ్చు. ట్రేడ్ ఇన్ ఆఫర్లో ఎలా పాల్గొనాలి యాపిల్ ఆన్లైన్ షాప్ ద్వారా ఐఫోన్13 ఫోన్ బుక్ చేసుకునే ముందు.. కొనుగోలు దారులు ట్రేడ్ ఇన్ ఆఫర్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆన్ లైన్లో జరిగే ట్రేడ్ ఇన్ ఆఫర్లో యాపిల్ సంస్థ మీ పాత ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. మీరు ఇచ్చిన సమాధానాల ఆధారంగా మీకు ఐఫోన్ 13 ఫోన్‌కు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను ప్రకటిస్తుంది. మీరు కరెక్ట్‌గా సమాధానం చెప్పి ఐఫోన్ 13 ఫోన్ ను బుక్ చేసుకోవచ్చు. అనంతరం ఆన్లైన్లో మీకు ఐఫోన్ 13ఫోన్ డెలివరీ టైం, డేట్ చూపిస్తుంది. ఆ టైం కు ఐఫోన్ ప్రతినిధులు ఐఫోన్ 13 ఫోన్‌ను మీరు ఇచ్చిన అడ్రస్‌కు డెలివరీ చేస్తారు. ఎక్ఛేంజ్ ఆఫర్లో ఐఫోన్ 13ను తీసుకోవాలి ఐఫోన్ 13 డెలివరీ టైంకు ట్రేడ్ ఇన్ ఆప్షన్లో ఇచ్చిన అడ్రస్‌కు ఆపిల్ ప్రతినిధులు వస్తారు. వచ్చే ముందు మీరు ఏ ఫోన్ పై ట్రేడ్ ఇన్ ఆప్షన్ నిర్వహించారో ఆ ఫోన్లను సిద్ధం చేసుకోవాలి. ప్రతినిధులు మీ అడ్రస్‌కు వచ్చిన వెంటనే మీ పాత ఐఫోన్ 12 సిరీస్ ఫోన్, ఆండ్రాయిండ్ ఫోన్లను వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్లు మీరు ట్రేడ్ ఇన్ ఆప్షన్ లో మీరు మీఫోన్ గురించి చెప్పినట్లుగా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. అనంతరం మీరు చెప్పింది నిజమే అయితే ఆన్లైన్ లో అప్రూవల్ ఇస్తారు. ఐఫోన్ 13ను మీకు ఆఫర్ ప్రైస్‌కే అందిస్తారు. చదవండి: ఐఫోన్-14 ఫీచర్స్ లీక్.. మాములుగా లేవుగా! -
ఐఫోన్-13 ప్రీ-బుకింగ్స్‌లో దుమ్మురేపిన ఇండియన్స్..!
ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఈ నెల 14న ఆపిల్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను సెప్టెంబర్ 17 నుంచి ప్రీ-బుకింగ్ ఆర్డర్స్ జరుగుతాయని ఆపిల్ ప్రకటించింది. తాజాగా జరిగిన ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ ప్రీ-బుకింగ్స్‌లో ఇండియన్స్ దుమ్మురేపారు. విశ్వసనీయ రిటైల్ ట్రేడ్ వర్గాల ప్రకారం.. గత ఏడాది లాగానే రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా ఐఫోన్-13 స్మార్ట్ఫోన్లపై అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రేండ్ ప్రకారం గత త్రైమాసికంలో ఐఫోన్-12 సిరీస్ స్మార్ట్ఫోన్ల అమ్మకాల తరహాలో ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. చదవండి: Vodafone Idea Offers On IPhone 13: ఐఫోన్-13 కొనుగోలుపై వోడాఫోన్-ఐడియా బంపర్ ఆఫర్...! ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలతో ఈ త్రైమాసికంలో ఆపిల్ గణనీయమైన వృద్దిని సాధిస్తుందని వ్యాపార నిపుణులు అంచనా వేశారు. వరుసగా వస్తోన్న పండుగల సీజన్‌తో భారత్‌లో ఆపిల్ భారీ వృద్దిని నమోదుచేస్తోందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరక్టర్ తరుణ్ పాఠక్ పేర్కొన్నారు. అందుకు ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్ల ప్రీ-బుకింగ్స్ ఆర్డర్సే స్పష్టంచేస్తుందని తెలిపారు. ఐడిసి ఇండియా, దక్షిణాసియా రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ మాట్లాడుతూ, రాబోయే పండుగ సీజన్లో ఐఫోన్-12 సిరీస్, పాక్షికంగా ఐఫోన్-13, 13 ప్రో స్మార్ట్‌ఫోన్స్ ద్వారా యాపిల్ మంచి ఊపందుకుంటుందని చెప్పారు. సెప్టెంబర్ 24 నుంచి ఈ నాలుగు కొత్త ఐఫోన్ -13 స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ రూ. 69,900 నుంచి ప్రారంభించి ప్రో మాక్స్ రూ .1,29,900 వరకు అందుబాటులో ఉన్నాయి. చదవండి: ఐఫోన్-13ను ఎగతాళి చేసిన గూగుల్ నెక్సస్..! -
ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్ : తగ్గిన ధరలు
ఐఫోన్ ప్రియులకు యాపిల్ శుభవార్త చెప్పింది. తాజాగా ఐఫోన్ 13 సిరీస్ మోడళ్లను లాంచ్ చేసిన సందర్భంగా కొన్ని మోడళ్ల ధరలను తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. కొత్త సిరీస్ లాంచ్ తరువాత పాత మోడళ్లైన యాపిల్ ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఫోన్ ధరల్ని తగ్గించడం ఆసక్తికరంగా మారింది. కాగా యాపిల్ 'కాలిఫోర్నియా స్ట్రీమింగ్' వర్చువల్ ఈవెంట్లో ఐఫోన్ 13 సిరీస్, యాపిల్ వాచ్ సిరీస్ 7, 10.2 అంగుళాల ఐపాడ్, ఐపాడ్ మినీలను యాపిల్ సీఈఓ టీమ్ కుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఐఫోన్ 11, ఐఫోన్ 12 , ఐఫోన్ 12 మినీ ధరలు మోడల్ ఓల్డ్ ప్రైస్ న్యూ ప్రైస్ ఐఫోన్ 11 64జీబీ Rs 54,900 Rs 49,900 ఐఫోన్ 11 128జీబీ Rs 59,900 Rs 54,900 ఐఫోన్ 12 మినీ 64జీబీ Rs 69,900 Rs 59,900 ఐఫోన్ 12 మినీ 128జీబీ Rs 74900 Rs 64,900 ఐ ఫోన్ 12 మినీ 256జీబీ Rs 84,900 Rs 74,900 ఐఫోన్ 12 64 జీబీ Rs 79,900 Rs 65,900 ఐఫోన్ 12 128 జీబీ Rs 84,900 Rs 70,900 ఐఫోన్ 12 256 జీబీ Rs 94,900 Rs 80,900 చదవండి : ఇండియన్ మార్కెట్లో ఐఫోన్13 సిరీస్ ధరలు -
ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో..
క్యుపర్టినో, అమెరికా: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో ఐఫోన్ 13, మినీ, ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఐఫోన్ 13 గులాబీ, నీలం తదితర అయిదు రంగుల్లో లభిస్తుంది. వెనుకవైపు అధునాతన డ్యుయల్ కెమెరాలు, 5జీ, 6 కోర్ సీపీయూ, 4 కోర్ జీపీయూ, కొత్త ఏ15 బయోనిక్ చిప్సెట్ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 13 డిస్ప్లే 6.1 అంగుళాలు, మినీ డిస్ప్లే 5.4 అంగుళాలుగా ఉంటుంది. ఐఫోన్ 12 మినీతో పోలిస్తే 13 మినీ బ్యాటరీ సామర్థ్యం 1.5 గంటలు, ఐఫోన్ 12తో పోలిస్తే ఐఫోన్ 13 బ్యాటరీ సామర్థ్యం 2.5 గంటలు ఎక్కువగా ఉంటుంది. ఐఫోన్ 13 మినీ రేటు 699 డాలర్ల నుంచి, ఐఫోన్ 13 ధర 799 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. స్టోరేజీ విషయానికొస్తే ఇవి 128 జీబీ నుంచి లభిస్తాయి. ఐఫోన్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అటు ఐఫోన్ 13 సిరీస్‌తో పాటు కొత్త ఐప్యాడ్, యాపిల్ వాచ్ 7 సిరీస్ మొదలైన ఉత్పత్తులను కూడా యాపిల్ ఆవిష్కరించింది. వాచ్ 7 సిరీస్ రేటు 399 డాలర్ల నుంచి ఉంటుంది. ప్రో ధర 999 డాలర్ల నుంచి, ప్రో మ్యాక్స్ రేటు 1,099 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. 128 జీబీ నుంచి 1టీబీ దాకా స్టోరేజీతో లభిస్తుంది. ఐఫోన్ 13 ప్రీ ఆర్డర్లు ఈ నెల 17 నుంచి, డెలివరీలు 24 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: APPLE: యాపిల్ మెగా ఈవెంట్.. 13 సిరీస్‌పై ఉత్కంఠ -
ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు...!
iPhone 12 Series: సెప్టెంబర్ 14న ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేయడానికి ఆపిల్ సన్నాద్ధం అవుతోంది. ఐఫోన్-13 ను లాంచ్ చేస్తున్న నేపథ్యంలో ఐఫోన్-12 సిరీస్ స్మార్ట్ఫోన్లపై ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును ప్రకటించింది.ఫ్లిప్‌కార్ట్ పలు ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై సుమారు రూ. 12 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ 12 మినీ 64జీబీ, 128జీబీ వెర్షన్లు వరుసగా రూ .59,999, రూ. 64,999 లకు అందుబాటులో ఉన్నాయి.ఈ రెండు వేరియంట్ల అసలు ధరలు వరుసగా రూ .69,900 , రూ .74,900గా ఉంది. 256జీబీ వేరియంట్ ధర రూ .74,999 అందుబాటులో ఉంది. ప్లిప్‌కార్ట్ సుమారు 22 శాతం మేర డిస్కౌంట్లను అందిస్తోంది. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! ఆపిల్ ఐఫోన్ 12 మోడల్ 64 జీబీ వేరియంట్‌పై సుమారు రూ. 12 వేల తగ్గింపుతో రూ. 66,999 అందించనుంది. 128జీబీ వేరియంట్ రూ. 12901 తగ్గింపుతో రూ .71,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్-12 256జీబీ వేరియంట్ రూ. 81,999 కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. చదవండి: Apple : సెప్టెంబర్ 14నే ఐఫోన్-13 రిలీజ్..! కారణం అదేనా..! ఐఫోన్ 12 ప్రో 128జీబీ వేరియంట్ రూ. 1,15,900, 256జీబీ వేరియంట్ ధర రూ .1,25,900. 512జీబీ వేరియంట్ ధర రూ .1,45,900కు లభించనుంది. అంతేకాకుండా ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌పై కూడా ఫ్లిప్‌కార్ట్ తగ్గింపును ప్రకటించింది. 128జీబీ, 256జీబీ, 512జీబీ వేరియంట్లు వరుసగా రూ. 1,25,900, రూ .1,35,900 , రూ .1,55,900 కు లభించనున్నాయి. చదవండి: Xiaomi: ఆయా దేశాల్లో స్మార్ట్ఫోన్లను బ్లాక్ చేసిన షావోమీ..!