క్యుపర్టినో, అమెరికా: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో ఐఫోన్ 13, మినీ, ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఐఫోన్ 13 గులాబీ, నీలం తదితర అయిదు రంగుల్లో లభిస్తుంది.
వెనుకవైపు అధునాతన డ్యుయల్ కెమెరాలు, 5జీ, 6 కోర్ సీపీయూ, 4 కోర్ జీపీయూ, కొత్త ఏ15 బయోనిక్ చిప్‌సెట్ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 13 డిస్‌ప్లే 6.1 అంగుళాలు, మినీ డిస్‌ప్లే 5.4 అంగుళాలుగా ఉంటుంది. ఐఫోన్ 12 మినీతో పోలిస్తే 13 మినీ బ్యాటరీ సామర్థ్యం 1.5 గంటలు, ఐఫోన్ 12తో పోలిస్తే ఐఫోన్ 13 బ్యాటరీ సామర్థ్యం 2.5 గంటలు ఎక్కువగా ఉంటుంది. ఐఫోన్ 13 మినీ రేటు 699 డాలర్ల నుంచి, ఐఫోన్ 13 ధర 799 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది.
స్టోరేజీ విషయానికొస్తే ఇవి 128 జీబీ నుంచి లభిస్తాయి. ఐఫోన్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అటు ఐఫోన్ 13 సిరీస్‌తో పాటు కొత్త ఐప్యాడ్, యాపిల్ వాచ్ 7 సిరీస్ మొదలైన ఉత్పత్తులను కూడా యాపిల్ ఆవిష్కరించింది. వాచ్ 7 సిరీస్ రేటు 399 డాలర్ల నుంచి ఉంటుంది. ప్రో ధర 999 డాలర్ల నుంచి, ప్రో మ్యాక్స్ రేటు 1,099 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. 128 జీబీ నుంచి 1టీబీ దాకా స్టోరేజీతో లభిస్తుంది. ఐఫోన్ 13 ప్రీ ఆర్డర్లు ఈ నెల 17 నుంచి, డెలివరీలు 24 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment