
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకోసం మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ ఆగస్టు 5న ప్రారంభమై ఆగస్టు 9న ముగియనుంది. ఈ సేల్‌లో భాగంగా పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై, స్మార్ట్‌ఫోన్లపై ఆసక్తికర ఆఫర్లను కస్టమర్లకు అందించింది. తాజాగా ఆపిల్ ఐఫోన్ 12 మిని మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 12 మినిపై సుమారు రూ. 10 వేల వరకు తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు అందిస్తోంది.
ఐఫోన్ 12 మినీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లలోకి ప్రారంభ ధర రూ. 69,900 అమ్మకాలను మొదలుపెట్టింది. వచ్చేనెల సెప్టెంబర్‌లో ఐఫోన్ 13 లాంచ్ అవుతున్న నేపథ్యంలో ఐఫోన్ 12 మినీ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేయాలని ఆపిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 12 మినీ ధర భారీగా తగ్గినట్లు మార్కెట్ నిపుణుల భావిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ భాగంగా ఐఫోన్ 12 మినీపై రూ .9,901 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది.దీంతో ఐఫోన్ 12 మినీ రూ .59,999కే రానుంది.
కొనుగోలు చేసే సమయంలో ఫ్లిప్‌కార్ట్ మరిన్ని డీల్స్‌ను కూడా అందించనుంది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై కొనుగోలు జరిపితే అదనంగా 10 శాతం సుమారు రూ. 1000 వరకు తగ్గింపును ఫ్లిప్‌కార్టు అందిస్తోంది. ఇతర స్మార్ట్‌ఫోన్‌తో ఎక్సేచేంజ్ చేస్తే సుమారు రూ. 15 వేల వరకు తగ్గింపు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment