
టెక్ ప్రియులకు శుభవార్త. అనకాపల్లి నుంచి అమెరికా దాకా ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడే ఐఫోన్‌లు ఇప్పుడు తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. తక్కువ ధర అంటే? ఇతర ఆండ్రాయిడ్ ఫోన్‌లను కొనే ధరలోనే ఐఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అదెలా అంటారా?
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్స్ నిర్వహిస్తుంది. ప్రత్యేకంగా నిర్వహించే అమ్మకాల్లో యాపిల్ ఐఫోన్ 12ని రూ.35,000 లోపే సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 12 మార్కెట్ ధర రూ.38,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్ రూ.3,000తో దాని ధర రూ. 35,999కి చేరుతుంది. ఎక్ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ.3,000 తగ్గుతుంది. అదే ఫోన్‌ను రూ.32,999కే కొనుగోలు చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీకెంతో ఇష్టమైన ఐఫోన్ ను ఇప్పుడే సొంతం చేసుకోండి.
ఐఫోన్12 ఫీచర్లు
ఐఫోన్ 12లో 6.1, 5.4 అంగుళాల స్క్రీన్, స్పోర్ట్ సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, 12 ఎంపీ డ్యూయల్ రియల్, వైడ్ యాంగిల్, అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా డ్యూయల్ సిమ్ (నానో+ఇ-సిమ్), అత్యంత శక్తిమంతమైన ఏ14 బయోనిక్ చిప్ మొదలైన ఫీచర్లు ఐఫోన్ 12లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment