Big Billion Days sale
-
పావుశాతం వరకు పెరిగిన అమ్మకాలు
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఈసారి 20-25 శాతం పెరిగాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇప్పటికే సంస్థలు వివిధ పేర్లతో ఫెస్టివల్ సేల్స్‌ను ప్రారంభించాయి. ఇందులో విభిన్న వస్తువులపై ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు చెప్పాయి. దాంతో 27న(26న ప్రైమ్ వినియోగదారులకు వర్తించాయి.) మొదలైన అమ్మకాలు గతేడాది ఇదే సీజీన్లోని మొదటి మూడు రోజులతో పోలిస్తే ఈ సారి 20-25 శాతం వృద్ధి చెందినట్లు డాటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ నివేదించింది.సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..సెప్టెంబర్ 26(ఫ్లిప్‌కార్ట్ ప్లస్, అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఒకరోజు ముందుగానే ఆఫర్లు వర్తించాయి)-28 రోజుల్లో ఆన్లైన్ రిటైలర్ల అమ్మకాలు గత సంవత్సరంతో పోల్చితే దాదాపు 26% పెరిగాయి. సుమారు రూ.26,500 కోట్లు (3.2 బిలియన్ డాలర్లు) మేర వ్యాపారం జరిగినట్లు అంచనా. ఈ పండగ సీజన్ పూర్తయ్యే సమయానికి రూ.లక్ష కోట్లు (12 బిలియన్ డాలర్లు) స్థూల విక్రయాలు జరిగే అవకాశం ఉంది. ఇది గతేడాదితో పోలిస్తే 23% వృద్ధిని సూచిస్తుంది. ఆన్లైన్ రిటైల్ అమ్మకాల్లో ప్రధానంగా మొబైల్, ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇంటీరియర్ వస్తువులు, ఫ్యాషన్, గ్రోసరీ, బ్యూటీ, పర్సనల్ కేర్ వస్తువులు కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులోనే రూ.నాలుగు లక్షల కోట్లు ఆవిరి!కంపెనీలు ఇలాంటి ఫెస్టివ్ సీజన్లో ఆఫర్లు తీసుకురావడం సహజం. కానీ కొనాలనుకునే వస్తువుపై ఏదోఒక ఆఫర్ ఉందని కొంటున్నామా? లేదా నిజంగా ఆ వస్తువు అవసరమై కొంటున్నామా..అనేది చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు ఆఫర్ల ట్రాప్‌లో పడి విచ్చలవిడిగా షాపింగ్ చేసి అప్పులపాలు కాకూడదని సూచిస్తున్నారు. ప్రధానంగా చాలామంది క్రెడిట్‌కార్డులు వాడుతూ, ఈఎంఐ ఎంచుకుంటూ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇప్పటికే మీకు ఇతర ఈఎంఐలు ఉంటే మాత్రం జాగ్రత్తపడాలని చెబుతున్నారు. నెలవారీ సంపాదనలో కేవలం 20-25 శాతం మాత్రమే ఈఎంఐలకు కేటాయించాలంటున్నారు. లేదంటే ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోవాల్సి ఉంటుందన్నారు. -
పండుగ సీజన్లో ఫ్లిప్‌కార్ట్ జోరు: రెండు రోజుల్లో 33 కోట్లు..
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు ఫెస్టివల్ సేల్స్ ప్రారభించేసాయి. ఈ తరుణంలో స్వదేశీ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వీఐపీ, కస్టమర్ల కోసం 2024 సెప్టెంబర్ 26 నుంచి ముందస్తు యాక్సెస్‌తో 2024 బిగ్ బిలియన్ డేస్ 11వ ఎడిషన్‌ను సెప్టెంబర్ 27న ప్రారంభించింది.2024 బిగ్ బిలియన్ డేస్ ప్రారంభమైన (యాక్సెస్ ప్రారంభించిన రోజు, మొదటి రోజు) సెప్టెంబర్ 26, 27వ తేదీల్లో ఫ్లిప్‌కార్ట్‌ను ఏకంగా 33కోట్ల మంది సందర్శించారు. దీన్ని బట్టి చూస్తే భారతదేశంలో పండుగ ఉత్సాహం ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతోంది.పండుగ సీజన్లో ప్రారంభమైన బిగ్ బిలియన్ డేస్ రోజు.. ఎక్కువగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, లార్జ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ ప్రొడక్ట్స్ వంటి వాటిని ఎక్కువగా సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు వంటి అగ్ర మెట్రో నగర వాసులు మొదటి 24 గంటల్లో ఎక్కువగా ఫ్లిప్‌కార్ట్‌ను సందర్శించారు. మొత్తం మీద మొదటిరోజు బిగ్ బిలియన్ డేస్ ప్రారంభ యాక్సెస్, 1వ రోజులో అధిక డిమాండ్‌ను చూసింది.కస్టమర్లు ఫ్యాషన్, లైఫ్ స్టైల్ వంటి వాటికి సంబంధించిన సరికొత్త ఆఫర్లను గురించి కూడా ఎక్కుగా సెర్చ్ చేసారు. ట్రెండింగ్ ఉత్పత్తులను కూడా ఆసక్తి చూపినట్లు సమాచారం. జనరేషన్ జెడ్ ప్రేక్షకులు బ్యాగీ బాటమ్స్, జీన్స్, బ్లాక్ ప్రింట్ కుర్తాలు, డెమూర్ డ్రెస్‌లు, రెట్రో రన్నర్స్, యుటిలిటీ కార్గోస్, మల్టీ పాకెట్డ్ షర్ట్స్, కో-ఆర్డ్ సెట్, జపనీస్ స్టైల్ టీ-షర్టులు సెర్చ్ చేశారు.ఇదీ చదవండి: దేశంలోనే పెద్ద కరెన్సీ నోటు.. ఎందుకు రద్దు చేశారంటే?ప్రీ-ఫెస్టివ్ సీజన్‌తో పోల్చితే.. ఈ సీజన్లో కస్టమర్లు 70 శాతం ఎక్కువ సందర్శించినట్లు తెలిసింది. లైఫ్ స్టైల్, హోమ్ & కిచెన్ వంటివి రెండు రెట్లు, బ్యూటీ పర్సనల్ కేర్ వంటివి మూడురెట్లు వృద్ధిని సాధించింది. మొత్తం మీద లావాదేవీలు 2.8 రెట్లు పెరిగింది. బిగ్ బిలియన్ డేస్ ప్రారంభమైన మొదటి 12 గంటల్లో అత్యధికంగా ఎలక్ట్రానిక్స్ ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టాబ్లెట్లు, డెస్క్‌టాప్ వంటివి అమ్ముడయ్యాయి. -
ఆ స్మార్ట్‌ఫోన్లంటే ప్రాణం!, నిమిషానికి ఎన్ని ఫోన్లు కొనుగోలు చేస్తున్నారంటే!
భారత్‌లో రెండు ఈ -కామర్స్ సంస్థలు నువ్వా..నేనా..సై..అంటూ భారీ డిస్కౌంట్లతో కాలుదువ్వుతున్నాయి. దీన్ని అదునుగా భావిస్తున్న కోట్లాది మంది కస్టమర్లు కూర్చున్న చోటుకే కావాల్సినవి వస్తుండటంతో సెకన్ల వ్యవధిలో తమకు కావాల్సిన వస్తువుల్ని ఆర్డర్లు పెడుతున్నారు. ఆర్డర్లు సంగతి సరే. ఇంతకీ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పోర్టల్‌లో ఏ వస్తువు ఎక్కువగా అమ్ముడవుతుంది? యూజర్లు ఏ బ్రాండ్ ఫోన్లు ఎక్కువగా కొంటున్నారు? దేశీయ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్స్, అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్స్‌లో సరికొత్త రికార్డ్లను నమోదు అవుతున్నాయి. స్పెషల్ సేల్‌లో భారీ ఎత్తున డిస్కౌంట్స్ అందిస్తుండడంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సైట్లకు కస్టమర్లు పోటెత్తుతున్నారు. దీంతో ఆయా సెగ్మెంట్లలోని వస్తువులు నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో రోజుకి 9.1 కోట్ల మంది కస్టమర్లు కొనుగోలు దారుల డిమాండ్ దృష్ట్యా ఫ్లిప్ కార్ట్ వెబ్‌సైట్‌ను రోజువారీ లావాదేవీలపై 9.1 కోట్ల మంది కస్టమర్లు సందర్శించారు. ఆర్డర్లు సైతం 7 రెట్లు పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ ప్రత్యేక సేల్‌లో కొనుగోలు దారులు మొబైల్, గృహోపకరణాలు (Appliance), లైఫ్‌స్టైల్, బ్యూటీ అండ్ జనరల్ మెర్చెండైజ్ ఉత్పత్తులు అంటే షూ’లు, దుస్తులు,ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్, జ్యువెలరీ, ఫుడ్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ►ఫ్లిప్ కార్ట్‌లో టైర్-2 ప్లస్ కస్టమర్లు రూ.20,000 ధర కంటే ఎక్కువగా ఉన్న ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేసింది. ►ఇక, అదే సైట్లో 1-2 అండ్ 3 టైర్ సిటీస్‌కు చెందిన కస్టమర్లు మొబైల్స్, అప్లయెన్సెస్, లైఫ్ స్టైల్, బ్యూటీ అండ్ జనరల్ మెర్చెండైజ్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు 60 శాతం ఆర్డర్లు పెట్టారు. అమెజాన్‌లో 9. కోట్ల మంది మరోవైపు అమెజాన్ అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు కొనసాగుతున్న అమ్మకాలు సైతం భారీ ఎత్తున జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ మొదటి 48 గంటల్లో 9.5 కోట్ల మంది కస్టమర్లు అమెజాన్ సైట్‌ని వీక్షించారు. ఆఫోన్ అంటే మాకు ప్రాణం.. నిమిషానికి 100 ఆర్డర్లు అమెజాన్ పోర్టల్‌లో ఎక్కువగా కొనుగోలు చేసిన ప్రొడక్ట్‌లలో స్మార్ట్ ఫోన్లు అత్యధికంగా ఉన్నాయి. సాధారణ కస్టమర్ల కంటే ముందే ప్రైమ్ సబ్స్క్రైబర్లు అక్టోబర్ 7న కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే, ఆ ఒక్కరోజే ప్రైమ్ మెంబర్లు సెకనుకు 75 కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు ఆర్డర్ పెట్టారు. ఆ ఫోన్లలో వన్‌ప్లస్, శామ్ సంగ్, యాపిల్ ఐఫోన్లు ఎక్కువగా ఉండగా.. తొలి 48 గంటల్లో ప్రతి నిమిషానికి 100 వన్ ప్లస్ ఫోన్‌ను కొనుగోలు చేశారు. ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో శాంసంగ్ డిమాండ్ ఎక్కువగా ఉంది. 75 శాతం స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 2-3 టైర్ (సిటీస్/టౌన్ల) ప్రాంతాల కస్టమర్ల ఆర్డర్లకు అనుగుణంగా 75 శాతం స్మార్ట్ఫోన్లు అమ్మినట్లు అమెజాన్ తెలిపింది. బడ్జెట్ ధర, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్ఛేంజ్ ఆఫర్ సౌకర్యం ఉండడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.30,000 కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం స్మార్ట్ఫోన్ల సేల్స్ 3 శాతం వృద్ది సాధించినట్లు వెల్లడించింది. నిమిషానికో టీవీ తాము నిర్వహిస్తున్న అమ్మకాల తొలి రెండ్రోజుల్లో ప్రతి సెకనుకు 1.2లక్షల కస్టమర్లు గృహోపకరకాణాల్ని కొనుగోలు చేశారు. ఆ సెకనులోని సగం మంది కస్టమర్లు ధర ఎక్కువగా ఉన్న అప్లయెన్సెస్ కోసం ఆర్డర్ పెట్టారు. 2-3 టైర్ నగరాల ప్రజలు ప్రతి నిమిషానికి ఒక టీవిని కొనుగోలు చేశారు. అందం మీద ఆసక్తితో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ స్పెషల్ సేల్‌పై ప్రముఖ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ ఓ ఆసక్తిరమైన రిపోర్ట్‌ను విడుదల చేసింది. బిగ్ బిలియన్ డే సేల్‌లో ఒకరోజు ముందే షాపింగ్ చేసుకునే అవకాశం ఉన్న ఫ్లిప్ కార్ట్ ఫ్లస్ సబ్స్క్రైబర్లు గ్రూమింగ్ సంబంధిత ప్రొడక్ట్‌లతో పాటు ఫుడ్ అండ్ న్యూట్రీషియన్, మేకప్, స్ప్రే బాటిల్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు రెడ్రీస్ నివేదించింది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో గత ఏడాదిలో అమెజాన్ నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌తో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాల్లో తొలి 48 గంటల్లో 35శాతం కంటే ఎక్కువగా ప్రీమియం స్మార్ట్ ఫోన్లను విక్రయించగా.. ప్రతి నిమిషానికి 10 ప్రీమియం నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్‌ను కొనుగోలు చేశారు. ఈ ప్రాంతాల నుంచే ఎక్కువ ఆర్డర్లు ఫ్లిప్‌కార్ట్‌లో బెంగళూరు,ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల నుంచి ఎక్కువ మంది ఆర్డర్లు పెట్టగా.. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై,పూణే, అహ్మదాబాద్,కోల్‌కతా, చెన్నై, గూర్ గావ్ నుంచి ఉన్నారు. ఆసక్తికరంగా ఫెస్టివల్ సీజన్లో షాపింగ్ ఎక్కువ చేసిన ప్రధాన నగరాల జాబితాలో హిసార్,లక్నో, పాట్నాలు ఉన్నాయి. -
మరో వివాదంలో బిగ్ బీ అమితాబ్: ఇంత దారుణమా అంటూ తీవ్ర ఆగ్రహం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి యాడ్ వివాదంలో చిక్కుకున్నారు. బిగ్‌బీ నటించిన తాజా ప్రకటన ఒకటి వివాదాస్పద మైంది. ఫ్లిప్‌కార్ట్ ‘ది బిగ్ బిలియన్ డేస్’ కోసం ఇటీవల ఆయన చేసిన ప్రకటన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా ఉందంటూ వ్యాపార సంఘం మండిపడింది. అంతేకాదు మోసపూరితంగా వినియోగదారులను ప్రభావితం చేస్తున్న ఈ యాడ్ ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అమితాబ్ బచ్చన్‌కు లేఖ రాసింది. Shri @SrBachchan ji, STOP HURTING SMALL BUSINESSES! You are the greatest showman of Bharat, which also means you have tremendous responsibility towards the nation and the citizens. In this advertisement for Flipkart you are demeaning the retailers of our nation by making… pic.twitter.com/wtHQkuw8M2 — Sumit Agarwal 🇮🇳 (@sumitagarwal_IN) September 30, 2023 ఫ్లిప్‌కార్ట్ ఇటీవలి ప్రకటన చూసి చాలా నిరుత్సాహపడ్డాం. స్థానిక వ్యాపారాలను దెబ్బతీసేదిగా ఉన్న ఈ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామంటూ సియాట్ లేఖ రాసింది. దుకాణదారుల వద్ద డీల్‌లు , ఆఫర్లు అందుబాటులో లేవని, తద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టించడం, ప్రభావితం చేయడమే. ఏ కారణంతో అలాంటి మాటలు చెప్పారో వివరించాలని కోరింది.అలాగే తప్పుదోవ పట్టించే స్టేట్మెంట్లు లేదా ద్రవ్య లాభాల కోసం ప్రకటనలతో కస్టమర్లను ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల మళ్లించడం మానుకోవాలంటూ అభ్యర్థించింది. మొబైల్ రీటైల్ అసోసియేషన్ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఒకవైపు దుకాణదారుల జీవనోపాధిని అనైతికంగా ,అన్యాయంగా ప్రభావితం చేస్తూనే మరోవైపు కస్టమర్లను తప్పుదారి పట్టిస్తున్నందున, ప్రకటనను ఉపసంహరించు కోవాలని కోరింది. 📢 AIMRA India condemns the misleading advertisements by @SrBachchan for #Flipkart, and millions of shopkeepers seek immediate correction! 🛍️ We expect our Mahanayak to stand by the country's traders and avoid damaging their business with deceptive ads. 🙏 #StopMisleadingAds… pic.twitter.com/5Ex9Y6jINC — ALL INDIA MOBILE RETAILERS ASSOCIATION (@AimraIndia) September 29, 2023 జాగో గ్రాహక్ జాగో నినాదానికి తూట్లు పొడుస్తున్న ఫ్లిప్‌కార్ట్ యాడ్‌పై CAIT , AIMRA డిమాండ్‌ను అమితాబ్ పట్టించుకోలేదంటూ సియాట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జోక్యాన్ని కోరనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దీనిపై ఫ్లిప్‌కార్ట్ , లేదా బిగ్‌బీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. Deep regrets that Shri @SrBachchan has ignored the demand of @CAITIndia & @AimraIndia for rejecting his endorsement on #Flipkart which has caused irreparable damage to the integrity of traders though @jagograhakjago has laid down a policy for not running any deceptive &… — Praveen Khandelwal (@praveendel) October 1, 2023 -
ఇది కదా ఆఫర్ అంటే, ఐఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోండి ఇలా!
టెక్ ప్రియులకు శుభవార్త. అనకాపల్లి నుంచి అమెరికా దాకా ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడే ఐఫోన్లు ఇప్పుడు తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. తక్కువ ధర అంటే? ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లను కొనే ధరలోనే ఐఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అదెలా అంటారా? ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్స్ నిర్వహిస్తుంది. ప్రత్యేకంగా నిర్వహించే అమ్మకాల్లో యాపిల్ ఐఫోన్ 12ని రూ.35,000 లోపే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 12 మార్కెట్ ధర రూ.38,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్ రూ.3,000తో దాని ధర రూ. 35,999కి చేరుతుంది. ఎక్ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ.3,000 తగ్గుతుంది. అదే ఫోన్‌ను రూ.32,999కే కొనుగోలు చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీకెంతో ఇష్టమైన ఐఫోన్ ను ఇప్పుడే సొంతం చేసుకోండి. ఐఫోన్12 ఫీచర్లు ఐఫోన్ 12లో 6.1, 5.4 అంగుళాల స్క్రీన్, స్పోర్ట్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, 12 ఎంపీ డ్యూయల్ రియల్, వైడ్ యాంగిల్, అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా డ్యూయల్ సిమ్ (నానో+ఇ-సిమ్), అత్యంత శక్తిమంతమైన ఏ14 బయోనిక్ చిప్ మొదలైన ఫీచర్లు ఐఫోన్ 12లో ఉన్నాయి. -
ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ సృష్టికర్త ఈమే..
ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్‌కు అత్యంత ఆదరణ తీసుకొచ్చింది బిగ్‌బిలియన్ డేస్ సేల్. ఇది దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్. ఈ సేల్ నిర్వహించినప్పుడు కొనుగోళ్లు విపరీతంగా ఉంటాయి. కారణం ఈ సమయంలో లభించే ఆఫర్లు. అయితే ఈ బిగ్‌బిలియన్ డేస్ సేల్ సృష్టికర్త ఎవరో తెలుసా? మింత్రా దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ మార్కెట్ ప్లేస్‌లలో ఒకటి. వాల్-మార్ట్ యాజమాన్యంలో ఉన్న ఈ ఈ-కామర్స్ వెబ్సైట్ ఒక సూపర్ ఉమన్ సీఈవోగా ఉన్నారు. ఆమే నందితా సిన్హా. అంచెలంచెలుగా ఎదిగి కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యారు. నందితా సిన్హా 2022 జనవరి 1న మింత్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యారు. ఈ-కామర్స్, ఎఫ్ఎంసీజీ రంగాలలో ఆమెకు 16 సంవత్సరాల అనుభవం ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్‌లో కెరీర్ ప్రారంభించిన ఆమె బ్రిటానియా లో కూడా పనిచేశారు. సమ్మర్ ట్రైనీగా ప్రారంభించి 2009లో కస్టమర్ మేనేజర్‌గా నిష్క్రమించారు. ఐదేళ్లపాటు హెచ్‌యూఎల్‌లో కొనసాగారు. బ్రిటానియాలో ఆమె ప్రోడక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. మీడియా ప్లానింగ్, కమ్యూనికేషన్‌కు బాధ్యత వహించారు. ఆ తరువాత ఆమె మైబేబీకార్ట్ (MyBabyCart.com) అనే ఈ-కామర్స్ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. నందితా సిన్హా 2013లో ఫ్లిప్‌కార్ట్‌లో చేరారు. ఆ తర్వాత ఆ కంపెనీ మింత్రాను కొనుగోలు చేసింది. ఫ్లిప్‌కార్ట్ వాల్‌మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లింది. నందితా సిన్హా ఎనిమిదేళ్లకుపైగా ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్నారు. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆమె కస్టమర్ల ఆకర్షణ, గ్రోత్ ఫంక్షన్‌కు నాయకత్వం వహించారు. ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్‌ను నిర్మించడంలో ఆమె పాత్ర కీలకమైనది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నడిపించింది ఈమే. మింత్రా సీఈవో కావడానికి ముందు నందితా సిన్హా కస్టమర్ గ్రోత్, మీడియా, ఎంగేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు. లక్నోకు చెందిన ఆమె ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారనాసీ (బనారస్ హిందూ యూనివర్సిటీ) నుంచి బీటెక్ చేసిన ఆమె ప్రతిష్టాత్మక ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎఫ్ఎంఎస్) నుంచి మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీలో ఎంబీఏ చేశారు. -
వావ్..ఇంత తక్కువ ధరలో యాపిల్ ఐఫోన్!
సాక్షి,ముంబై: యాపిల్ ఐఫోన్ ఇపుడు అతి తక్కువ ధరలో యాపిల్ లవర్స్‌కు అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యాపిల్ ఐఫోన్ 12 రూ. 27,401 భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఐఫోన్12 కంపెనీ అధికారిక ఆన్లైన్ స్టోర్‌లో రూ. 59,900గా లిస్ట్‌కాగా, ఫ్లిప్‌కార్ట్‌తో రూ. 3,901 ధర తగ్గింపుతో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఈ 55,999కి లిస్ట్ కాగా, అయితే ప్రస్తుత ఆఫర్లతోఈ ఫోన్ రూ. 32,499కి లభిస్తోంది. (జర్నలిస్టులపై బ్యాన్,ట్విటర్ స్పేసెస్‌కు బ్రేక్..బైడెన్‌పై సెటైర్లు) ఐడీఎఫ్సీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10శాతం తక్షణ తగ్గింపుతో ఐఫోన్ 12 ధర దిగి వచ్చింది. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఐఫోన్ 12 ను కొనుగోలు చేసినట్లయితే, 5 శాతం అదనంగా క్యాష్ బ్యాక్ లభ్యం. దీనికితోడు రూ. 5,000 అంతకంటే ఎక్కువ ఆర్డర్లపై రూ. 3,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది ఫ్లిప్‌కార్ట్ ద్వారా. అలాగే పాత స్మార్ట్‌ఫోన్ మార్పిడి ద్వారా ఫ్లిప్‌కార్ట్ రూ. 21,500 వరకు తగ్గింపును అందిస్తోంది. అన్ని బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్ , డిస్కౌంట్స్ తరువాత 28,401 తగ్గింపుతో ఐఫోన్ 12 ను కేవలం రూ. 32,499తో కొనుగోలు చేయవచ్చు. యాపిల్ ఐఫోన్ 12 స్పెసిఫికేషన్స్ 6.1 అంగుళాల ఓఎల్ఈడీ సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే ఏ14 బయోనిక్ చిప్ సెట్ ఐఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టం 64 జీబీ ర్యామ్,, 128 జీబీ స్టోరేజ్ 12+12 డ్యుయల్ రియర్ కెమెరా 12 ఎంసీ సెల్ఫీ కెమెరా 2815 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే..జాక్ పాట్! ఆపిల్‌కు దిమ్మదిరిగే కౌంటర్లు
సాక్షి,ముంబై: ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే విలువైన వస్తువుకు బదులు చీప్‌గా సబ్బులు, ఇతర పనికిరాని వస్తువులు, ఒక్కోసారి రాళ్లు వచ్చిన సంఘటనలు గతంలో చాలా చూశాం. దీనికి సంబంధించి ఫ్లిప్‌కార్ట్ గతంలో విస్తృతంగా ట్రోల్ అయింది కూడా. అలాగే ఇటీవలి సేల్‌లో కస్టమర్లకు చివరి నిమిషాల్లో ఆర్డర్లను రద్దు చేసిందంటూ ఫ్లిప్‌కార్ట్ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఒక ఆసక్తికరమైన ఉదంతం చోటు చేసుకుంది. ఒక వినియోగ దారుడు ఐఫోన్13ని ఆర్డర్ చేస్తే.. దీనికి బదులుగా లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్ 14 అందుకోవడం చర్చకు దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ట్విటర్ యూజర్ అశ్విన్ హెడ్జ్ ట్వీట్ చేశారు. అయితే దీనికి నెటిజన్లు రియాక్షన్ మాత్రం అల్టిమేట్. ఐఫోన్ 13, 14 అయినా ఒకటేగా పెద్దగా తేడా ఏముంది అంటూ వ్యంగ్యంగా కమెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన నెటిజన్లు..రెండూ ఒకటేగా..ఆపిల్‌కే అయోమయంగా ఉంది. అయినా వాళ్ల తప్పేముంది.. నిజానికి రెండూ ఒకటేగా అంటూ సెటైర్లతో తమ కసి అంతా తీర్చుకుంటున్నారు. One of my follower ordered iPhone 13 from Flipkart but he recieved iPhone 14 instead of 13 😂 pic.twitter.com/FDxi0H0szJ — Ashwin Hegde (@DigitalSphereT) October 4, 2022 Even Apple got confused "ki dono same hi hai" https://t.co/V9HAjh2W5a — Raghav Aggarwal (@Raghav_285) October 5, 2022 Can't blame them, they literally are same devices. 😂 https://t.co/1PZGYFoCDZ — Vaibhav Sharma (@TheVaibhavShrma) October 5, 2022 -
ఫ్లిప్‌కార్ట్ పేటీఎంతో డీల్: ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్
సాక్షి,ముంబై: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 సెప్టెంబర్ 23న ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ ఉత్పత్తులపై 80 శాతందాకా డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే ఆపిల్ ఐఫోన్13, నథింగ్ ఫోన్ (1), గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్ఫోన్లు సహా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. దీంతోపాటు పేటీఎం ద్వారా ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌లను అందించనుంది. పేటీఎం యూపీఐ, పేటీఎం వాలెట్ చెల్లింపులపై ఆఫర్లను అందివ్వనుంది. ఇందుకోసం పేటీఎంతో డీల్ కుదుర్చుకుంది. ఈ సందర్భంగా, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 250 అంతకంటే ఎక్కువ షాపింగ్ చేసినట్లయితే రూ.25 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను, పేటీఎం యూపీఐ, వాలెట్ 500 రూపాయలు అంతకంటే ఎక్కువున్న చెల్లింపులపై రూ. 50 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022తో భాగస్వామ్యంపై పేటీఎం ప్రతినిధి సంతోషం ప్రకటించారు. దీని ద్వారా భారతదేశంలోని చిన్న నగరాలు పట్టణాల్లోని మిలియన్ల మంది షాపర్లకు సురక్షితమైన చెల్లింపుల అనుభవాన్ని అందించనున్నామన్నారు. బిగ్ బిలియన్ డే 2022 ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై డిస్కౌంట్లను, ఇంకా దుస్తులు, పాదరక్షలు, ఫర్నిచర్, బ్యూటీ ఉత్పత్తులు, బొమ్మలు తదితర అనేక ఉత్పత్తులపై ఆఫర్లను కూడా పొందవచ్చు. ఇప్పటికే ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్కొనుగోళ్లపై 10శాతం, గరిష్టంగా రూ.1500 దాకా ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. -
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు బంపరాఫర్!
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు బంపరాఫర్. దేశంలో దసరా ఫెస్టివల్ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్, అమెజాన్లు ప్రత్యేక సేల్ ను నిర్వహించనున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 30వరకు నిర్వహించనున్న సేల్‌లో ల్యాప్ ట్యాప్స్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. యాపిల్ లేటెస్ట్గా విడుదల చేసిన ఐఫోన్లను సైతం డిస్కౌంట్‌కే అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ప్రస్తుతం ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ ధరల్ని ఫ్లిప్‌కార్ట్ తన సైట్లో లిస్ట్ చేసింది. లిస్టింగ్ చేసిన ధరల ప్రకారం.. ఐఫోన్ 13 ప్రారంభ ధర రూ.69,900, ఐఫోన్ 13 ప్రో ప్రారంభ ధర రూ.1,19,900, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,26,000గా ఉంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో తగ్గించనుంది. ప్రస్తుతం ఆ ధరలు ఇలా ఉన్నాయంటూ ఫ్లిప్ కార్ట్‌తో పాటు పలు టెక్ బ్లాగ్లు కథనాల్ని ప్రచురించాయి. ఆ వివరాల ప్రకారం.. యాపిల్ ఐఫోన్ ధరలు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్‌లో ఐఫోన్ 13ప్రో ప్రారంభ ధర రూ.89,900, ఐఫోన్ 13ప్రో మ్యాక్స్ ధర రూ.99,990గా ఉంది. అయితే ఐఫోన్ 13 ధర రూ.49,990 కంటే తక్కువ ధరకే లభించనుంది. ఐఫోన్ 12 సిరీస్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్‌లో ఐఫోన్ 12 మిని రూ.39,990 అంతకంటే తక్కువగా ఐఫోన్ 11 ధర రూ.29,990 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ తగ్గింపు ధరలతో పాటు ఇతర ఐఫోన్ సిరీస్‌ల కొనుగోళ్లపై డిస్కౌంట్స్, ఆఫర్స్ అందించనుంది. కాగా, ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 12 మిని ప్రారంభ ధర రూ.55,359 ఉండగా, ఐఫోన్ 11 ప్రారంభం ధర రూ.43,990గా ఉంది. వీటి ధర సెప్టెంబర్ 23నుంచి భారీగా తగ్గనున్నాయి. ఎప్పుడు విడుదలయ్యాయంటే? ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక సేల్‌లో డిస్కౌంట్ ధరలకే లభ్యమయ్యే ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ గతేడాది అక్టోబర్ నెలలో యాపిల్ సంస్థ విడుదల చేసింది. అమెరికా క్యాలిఫోర్నియా యాపిల్ ప్రధాన కార్యాలయం క్యూపర్టినో వేదికగా క్యాలిఫోర్నియా స్ట్రీమింగ్ పేరుతో ఈవెంట్‌ను నిర్వహించింది. ఆ ఈవెంట్లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ విడుదలైంది. అక్టోబర్ 2020లో ఐఫోన్ 12 మినీ, సెప్టెంబర్ 2019లో ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లను యాపిల్ మార్కెట్‌కు పరిచయం చేసింది. చదవండి👉 దుమ్మురేపుతున్న ఫీచర్లు, ఐఫోన్ 14 సిరీస్ విడుదల! -
వచ్చేస్తోంది..మరో అదిరిపోయే సేల్, వీటిపై 80 శాతం భారీ డిస్కౌంట్!
దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని దేశీయ ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్‌ను ప్రకటించింది. మరో ఈకామర్స్ కంపెనీ అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్-2022ను నిర్వహించనుంది. సెప్టెంబర్ 23నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు జరిగే ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ల్యాప్ ట్యాప్స్,స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్‌లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే సేల్‌లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వినియోగించి ప్రొడక్ట్ కొనుగోలు దారులకు 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, పేటీఎం ట్రాన్సాక్షన్లపై 10శాతం డిస్కౌంట్ అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్‌తో రూ.1లక్ష వరకు రుణం ఇస్తుంది. ఈ రుణాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. “కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్‌ను ఇతర ప్రీపెయిడ్ థర్డ్ పార్టీ కార్డ్‌ల ద్వారా చెల్లించవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు హోల్డర్లకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది” అని ఇ-కామర్స్ దిగ్గజం తెలిపింది. ఇటీవల ఫ్లిప్‌కార్ట్ తన యాప్‌ను అప్డేట్ చేసింది. దీంతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే 2022 సేల్ సమయంలో కూపన్ రెయిన్, ట్రెజర్ హంట్, స్పిన్ ది బాటిల్ వంటి గేమిఫికేషన్ కార్యక్రమాలు కస్టమర్లు సేల్ సమయంలో ఆఫర్లను పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. 80శాతం డిస్కౌంట్ ప్రింటర్లు, మానిటర్లతో పాటు కంప్యూటర్ ఎక్విప్‌మెంట్‌పై 80 శాతం డిస్కౌంట్, టీవీలపై 80 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. సేల్ సందర్భంగా, ప్రతిరోజూ ఉదయం 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు 'క్రేజీ డీల్స్', 'రష్ అవర్స్'లో 'ఎర్లీ బర్డ్ స్పెషల్' ఐటెమ్‌లపై డిస్కౌంట్లు 'టిక్ టాక్ డీల్స్' ను అందిస్తుంది. భారీ తగ్గింపు సేల్ సమయంలో నథింగ్ ఫోన్ 1, గూగుల్ పిక్సెల్ 6 ఎ ధర తగ్గనుంది. నథింగ్ ఫోన్ 1 ప్రారంభ ధర రూ. 28,999, గూగుల్ పిక్సెల్ 6 ఎ ప్రారంభ ధర రూ. 27,699గా ఉంది. -
ఫ్లిప్‌కార్ట్ సేల్, గూగుల్పిక్సెల్ ఫోన్‌పై భారీ తగ్గింపు
సాక్షి,ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. అయితే ముందుగానే నథింగ్ ఫోన్ (1), గూగుల్ పిక్సెల్ 6ఏ వంటి కొన్ని పాపులర్ స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ ప్రకటించింది. డిస్కౌంట్ఆఫర్తో వాస్తవ ధరకంటే చాలా తక్కువకే వీటిని ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లు సుమారు రూ. 30వేల కంటే తక్కువకే అందించనుంది. ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 6ఏ కొనుగోలుపై గరిష్టంగా 20వేల రూపాయల వరకు ధర తగ్గనుంది. బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కలిపి ఈ తగ్గింపు ఉండనుంది. మరోవైపు అమెజాన్ తన మెగా సేల్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 23న కూడా నిర్వహించనుంది. గూగుల్ పిక్సెల్ 6ఏ డీల్: రూ. 43,999కి లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 6ఎ, రానున్న సేల్‌లో రూ.27,699లకే లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ చెబుతోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై ఫ్లిప్‌కార్ట్ 10 శాతం తగ్గింపును అందిస్తుంది. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌గా రూ. 20వేల వరకు ఆఫర్ చేస్తోంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఫోన్ మోడల్, పరిస్థితిపై ఆధారపడి ఉంటుందనేది గమనించాలి. గూగుల్ పిక్సెల్ 6ఏ స్పెసిఫికేషన్స్ 6.1అంగుళాల OLED డిస్ప్లే టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్ ఆక్టా-కోర్ Google Tensor SoC కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 12.2+ 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4,410mAh బ్యాటరీ -
అదిరిపోయే సేల్: భారీ తగ్గింపు ఆఫర్లు..ఏకంగా 80 శాతం డిస్కౌంట్!
దేశీయ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్‌ను ప్రకటించింది. దసర పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈసేల్‌లో స్మార్ట్ ఫోన్లపై తగ్గింపులతో పాటు, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లపై 80శాతం డిస్కౌంట్ పొందవచ్చు. గతేడాది అక్టోబర్ 3 నుంచి 10 వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించింది. అలాగే ఈ ఏడాది సైతం ఈ సేల్ అదే సమయంలో ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే పలు నివేదికల ప్రకారం..సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. దీనిపై ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టత ఇవ్వాల్సి ఉండగా.. ఈ సేల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బ్యాంక్ కార్డ్‌లపై ఆఫర్లు 8 రోజుల పాటు సుధీర్ఘంగా జరిగే ఈ ప్రత్యేక అమ్మకాల్లో ఈ కామర్స్ సంస్థ ఎప్పటి లాగే ఆఫర్లను అందించనుంది. ముఖ్యంగా ఐసిఐసిఐ, యాక్సిస్ క్రెడిట్ కార్డులపై 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇవ్వనుంది. కొనుగోళ్లను బట్టి డిస్కౌంట్ ఉంటుంది. దీంతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ,ఎక్ఛేంజ్ ఆఫర్,ప్రిపెయిడ్ ఆఫర్స్ ఉన్నాయి. ఐఫోన్ 14సైతం వచ్చే నెల చివరిలో ప్రారంభయ్యే ఈ సేల్ 24 గంటల ముందే ఫ్లిప్ కార్ట్ ప్లస్ వినియోగదారులు కొనుగోలు చేసే సౌకర్యం కల్పిస్తుంది. ఇందులో భాగంగా ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 13 అమ్మకాలు జరపనుంది. దీంతో పాటు మరో ఈ బుధవారం విడుదలయ్యే ఐఫోన్ 14సిరీస్ ఫోన్ సైతం అమ్మనుంది. వీటితో పాటు రియల్ మీ, పోకో, వివో,యాపిల్,శాంసంగ్ ఫోన్లను డిస్కౌంట్ ధరలకే సొంతం చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు ,టీవీలు, గృహోపరకరణలపై 80శాతం డిస్కౌంట్ పొందవచ్చు. సేల్ జరిగే 12ఏఎం, 8ఏఎం, 4పీఎం సమయంలో అదనపు డిస్కౌంట్లను సొంతం చేసుకోవచ్చు. -
వచ్చేస్తోంది..ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్..! 80 శాతం మేర భారీ తగ్గింపు..!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కొనుగోలు దారులకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. దీపావళి సందర్భంగా పలు రకాల ప్రొడక్ట్‌లపై 80 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్స్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ కళ్లు చెదిరే డిస్కౌంట్లు అందించగా.. తాజాగా మరో సారి డిస్కౌంట్లు ఇస్తుండడంతో వినియోగదారులు వారికి నచ్చిన బ్రాండ్లను కొనుగోలు చేసుందుకు ఉవ్విళ్లూరుతున్నారు. బిగ్ బిలియన్ డేస్ సేల్స్ దసరా ఫెస్టివల్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 10 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించింది. తాజాగా దివాళీ సందర్భంగా అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 23 వరకు 'బిగ్ దివాళీ సేల్' ను నిర్వహించనుంది. ఈ సేల్‌లో ప్రీమియం (ప్లస్) మెంబర్స్‌కు అక్టోబర్ 16న మధ్యహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై ప్రొడక్ట్‌లను కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్ లభించనుంది. ఈ ప్రొడక్ట్‌లపై 80 డిస్కౌంట్ అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న బిగ్ దివాళీ సేల్‌లో స్మార్ట్ ఫోన్, ట్యాబ్స్‌పై ఫ్లిప్ కార్ట్ 80శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.అదనంగా ఎలక్ట్రానిక్స్, యాక్స్సరీస్, టీవీ, అప్లయన్సెస్‌పై 75శాతం డిస్కౌంట్లో సొంతం చేసుకోవచ్చు. చదవండి: మార్కెట్లో మరో బడ్జెట్ ఫోన్, ఫీచర్లు మాత్రం అదుర్స్ -
కస్టమర్‌కి షాకిచ్చిన ఫ్లిప్‌కార్టర్ట్: ఐఫోన్ ఆర్డర్ చేస్తే...
ముంబై: మనం ఆన్లైన్లో ఏదైన ఆర్డర్ చేస్తే మనం ఆర్డర్ చేసింది కాకుండా వేరేది వచ్చి అది కూడా మనం వేలు ఖరీదు చేసే ఆర్డర్‌కి పొంతన లేకుండా కేవలం రూపాయల్లో ఖరీదు చేసే వస్తువు వస్తే మనకి ఎంతో టెన్షన్‌గా అనిపిస్తోంది కదూ. అలాంటి సంఘటనే ఒకటి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో జరిగింది. అసలేం జరిగిందంటే దసరా పండుగ సీజన్ పురస్కరించుకొని అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు బిగ్ బిలయన్ డే సేల్ ప్రారంభించి భారీగా ఆఫర్ల కురిపించిన సంగతి తెలిసిందే. చాలా మంది స్పెషల్ డిస్కౌంట్ సమయాల్లో తమకు కావాల్సిసిన వాటిని ఆర్డర్ చేసుకుంటారు. అలానే సిమ్రాన్ పాల్ సింగ్ అనే వ్యక్తి భారీ డిస్కౌంట్ లభిస్తుండటంతో 50 వేలు ఖరీదు చేసే ఆపిల్ ఐ ఫోన్12 సిరీస్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేశాడు. తన ఐఫోన్ ఎప్పుడూ వస్తుందా అని చాలా ఎగ్జాయిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నాడు. ఆర్డర్ వచ్చాకా ఎంతో ఉత్సాహంగా ప్యాకెట్‌ని ఒపెన్ చేశాడు. దాంట్లో ఉన్న వాటిని చూసి షాకయ్యాడు. ఎందుకంటే తను ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. ఫ్లిప్‌కార్ట్ నిర్మా సబ్బులు పంపింది. దీంతో ఒకస్కారిగా సింగ్ షాక్‌కి గురైయ్యాడు. వెంటన్ సింగ్ కస్టమర్ కేర్‌కి కంప్లయిట్ చేయడంతో ఫ్లిప్ కార్ట్ తన తప్పుని అంగీకరించి వెంటనే ఆ ఆర్డర్‌ని కేన్సిల్ చేసి డబ్బుని సదరు వ్యక్తి కి వాపస్ చేసింది. అయితే సింగ్ ఈ ఘటనను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ప్రముఖ దిగ్గజ కంపెనీ ఈ విధంగా చేయడం ఏమిటంటూ నెటిజన్లు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏది ఏమైన డెలివరీని కస్టమర్లకు పంపించే ముందు ఒక్కసారి చెక్ చేసి పంపించాలి మరీ ఇలాంటి అత్యంత ఖరీదైన వస్తువుల విషయంలో తగు జాగ్రత్త అవసరం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: భారత స్పేస్ అసోసియేషన్‌ని ప్రారంభించనున్న మోదీ) -
స్మార్ట్ఫోన్లపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్ ఇవే...!
Amazon Great Indian Festival Flipkart Big Billion Days 2021 Best Offers On Mobile Phones: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ ను ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను అక్టోబర్ 3 నుంచి ఒక నెల రోజుల పాటు అమెజాన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 10 వరకు జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్ఫోన్లపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్‌పై ఒక లుక్కేయండి...! చదవండి: ప్రైమ్ యూజర్లకు బంపర్ఆఫర్ ప్రకటించిన అమెజాన్..! స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్...! ఆపిల్ ఐఫోన్ 11 గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కొనుగోలుదారులకు ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 38,999 కు లభించనుంది. స్మార్ట్‌ఫోన్ ఎక్సేచేంజ్‌పై సుమారు రూ. 12,350 తక్షణ డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. 64జీబీ ఆపిల్ ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 68,300. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువ ధరలో రూ. 36,990 కే కొనుగోలుదారులకు లభించనుంది. స్మార్ట్‌ఫోన్ ఎక్సేచేంజ్‌పై సుమారు రూ. 12,350 తక్షణ డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 74,999. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ కొనుగోలుదారులకు రూ. 32,999కు లభించనుంది. ఎక్సేచేంజ్‌పై సుమారు రూ. 12,350 తక్షణ డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 47,900. ఐక్యూ జెడ్3 5జీ వివో సబ్ బ్రాండ్ ఐనా ఐక్యూ కంపెనీ స్మార్ట్‌ఫోన్ ఐక్యూ జెడ్3 5జీ స్మార్ట్‌ఫోన్ (6జీబీ+128 జీబీ) వేరియంట్ కొనుగోలుదారులకు రూ. 17,990 కే లభించనుంది. అంతేకాకుండా 9 నెలల నో కాస్ట్ ఈఎమ్ఐ, ఆర్నెల్ల ఫ్రీ స్క్రీన్ రిప్లేస్మెంట్ను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 22,990. రెడ్మీ నోట్ 10ప్రో రెడ్మీనోట్ 10 ప్రో కొనుగోలుదారులకు రూ. 16,499 కే లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 19,999. స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్...! ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ బిగ్‌బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు రూ. 26, 999 కు లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 39, 900. గూగుల్ పిక్సెల్ 4ఏ బిగ్‌బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు రూ. 25,999 కు లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 31, 999. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ బండిల్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. గూగుల్ నెస్ట్ ను కేవలం రూ. 1, గూగుల్ పిక్సెల్ బడ్స్ ఏ సిరీస్‌ను కేవలం రూ. 4999కు అందించనుంది. అంతేకాకుండా కొనుగోలు సమయంలో యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుపై 10 శాతం తక్షణ తగ్గింపు కూడా రానుంది. పోకో ఎక్స్ 3 ప్రో పోకో ఎక్స్ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు రూ. 16,999కే అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 23, 999. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ రూ. 19,999కే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 24, 999. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం మేర తక్షణ తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. చదవండి: యాక్సిస్ బ్యాంకుతో షాపింగ్ చేస్తే 45 శాతం మేర క్యాష్‌బ్యాక్...! -
బంపర్ ఆఫర్, రూ.18,499 తగ్గనున్న ఐఫోన్ ధర
ఐఫోన్ లవర్స్‌కు ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి 10 జరగనున్న బిగ్ బిలియన్ డే సేల్స్‌లో ఆపిల్ ప్రాడక్ట్‌పై భారీ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపింది. గతేడాది ఆపిల్ విడుదల చేసిన ఐఫోన్ ఎస్ఈ సిరీస్ 64జీబీ మోడల్ ధర రూ.39,900 ఉండగా, డిస్కౌంట్లో రూ.25,999కే అందిస్తుంది. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ ఫీచర్స్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్‌లో అమ్మకానికి సిద్ధంగా యాపిల్ ఐఫోన్ ఎస్ఈ ఫోన్ ఐఓఎస్15కి అప్ డేట్ అవ్వొచ్చు. 4.7 అంగుళాలు, రెటీనా హెచ్డీ డిస్ప్లే, యాంబినెట్ లైటింగ్, హెచ్డీఆర్ 10 కాంపర్ట్బులిటీతో డాల్బీ విజన్,ఆపిల్ ఏ13 బయోనిక్ చిప్, యాపిల్ ఐఫోన్ 11 లైనప్, ఏ13 బయోనిక్‌లో సెకను వ్యవధిలో ట్రిలియన్ కార్యకాలపాల్ని చేసే సామర్ధ్యం, 8-కోర్ న్యూరల్ ఇంజిన్, సీపీయూలో రెండు మెషిన్ లెర్నింగ్ యాక్సిలరేటర్లతో పాటు కొత్తగా మెషిన్ లెర్నింగ్ కంట్రోలర్లు కూడా ఉన్నాయి. 18వాల్ట్‌ల వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు వైర్లెస్ ఛార్జింగ్ అందుబాటులో ఉంది. డెబిట్ కార్ట్, క్రెడిట్ కార్డ్‌లపై ఆఫర్ ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 5,000 కంటే ఎక్కువ ఆర్డర్లపై రూ .1500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదే బ్యాంకు డెబిట్ కార్డు వినియోగదారులు రూ .1,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పాత ఫోన్లపై రూ.15,000 వరకు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 7 (పని తీరును బట్టి ) ఎక్ఛేంజ్‌లో సుమారు రూ. 6,000, అదనపు బ్యాంక్ ఆఫర్‌తో ఐఫోన్ ఎస్ఈ ధర రూ.18,499 తగ్గుతుంది. ఇక ఎక్ఛేంజ్ ఆఫర్ సమయంలో ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 7 బ్లాక్, రెడ్,వైట్ కలర్లలో అందుబాటులో ఉండనున్నాయి. చదవండి:నువ్వా..! నేనా..! అన్నట్లుగా అమెజాన్- ఫ్లిప్‌కార్ట్...! కస్టమర్లకు మాత్రం పండగే...! -
నువ్వా..! నేనా..! అన్నట్లుగా అమెజాన్- ఫ్లిప్‌కార్ట్...! కస్టమర్లకు మాత్రం పండగే...!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అమెజాన్-ప్లిప్‌కార్ట్ సంస్థలు నువ్వానేనా...! అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్ల కోసం బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటించిన కొద్ది రోజులకే అమెజాన్ ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. చదవండి: వీటిపై ఇన్వెస్ట్ చేస్తే లాభాలే..లాభాలు...! అమెజాన్ తొలుత ది గ్రేట్ ఇండియన్ సేల్‌ను అక్టోబర్ 4 నుంచి ప్రారంభమౌతుందని ప్రకటించగా...ఇప్పుడు ఈ సేల్ ఒకరోజు ముందుగానే అక్టోబర్ 3నే జరపనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ముందుగానే ది గ్రేట్ ఇండియన్ సేల్‌లో పాల్గొనే అవకాశం ఉంది.ది గ్రేట్ ఇండియన్ సేల్ మాత్రం ఒక నెలపాటు జరగనున్నట్లు తెలస్తోంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్లిప్‌కార్ట్ అక్టోబర్ 7 నుంచి ప్రకటించగా..తిరిగి సేల్ డేట్ మారుస్తూ ఫ్లిప్‌కార్ట్ నిర్ణయం తీసుకుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 10 వరకు కొనసాగనుంది. దీంతో కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరి మధ్య నెలకొన్న పోటీ కస్టమర్లకు లాభం చేకురేలా విధంగా ఉంది. బిగ్‌బిలియన్ డేస్ సేల్, అమెజాన్ ది గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా కస్టమర్లకు ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్, మొబైల్ యాక్సెరీస్, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను ప్రకటించనున్నాయి. చదవండి: ప్రైమ్‌వీడియోస్‌లో డిస్కవరీ ప్లస్ ఇంకా మరెన్నో.. -
ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ఫెస్టివల్ సీజనల్ ఉద్యోగాలు
ప్రముఖ రీటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీగా సీజనల్ ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టింది. పండుగ సీజన్‌తో పాటు తన బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఆఫర్ రోజుల సందర్భంగా నెలకొనే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా 4 వేల మందికి ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో వ్యక్తులు, సర్వీస్ ఏజెన్సీలు, టెక్నీషియన్లకు అవకాశాలను కల్పిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ ట్రా పేరుతో వారికి ఉద్యోగ అవకాశాలు సృష్టించింది. ఫెస్టివల్ సీజన్‌కు ముందు డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ఫ్లిప్‌కార్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వినియోగదారులకు పండుగ అమ్మకాల సమయంలో అంతరాయం లేకుండా వేగంగా డెలివరీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం దసరా, దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇతర ఈ-కామర్స్ సంస్థలు భారీగా సేల్స్ తో ముందుకు వస్తాయి. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి మరిన్ని కేటగిరీలపై డిస్కౌంట్లను అందిస్తాయి. ఆ డిమాండ్ కాలంలో వేగంగా డెలివరీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్ బోర్డింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ ట్రా(Flipkart Xtra) పేరుతో ఒక స్టాండ్ ఎలోన్ యాప్ లాంఛ్ చేసింది. ఉద్యోగార్థుల బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ కొరకు ఈ యాప్ ఉపయోగించవచ్చు. వారు తమ విద్యార్హతలు, పని అనుభవం వంటి అవసరమైన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది వ్యక్తులు, టెక్నీషియన్లు, సర్వీస్ ఏజెన్సీలకు స్వల్ప కాలం పని చేయడానికి ఈ కొత్త యాప్ సహాయపడుతుంది. -
వచ్చేస్తోంది.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్..! 80 శాతం మేర భారీ తగ్గింపు...!
Flipkart Big Billion Days Sale 2021: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది జూన్ 13-16 తేదీల్లో బిగ్ సేవింగ్ డేస్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బిగ్ బిలియన్ డేస్ సేల్కు సంబంధించిన టీజర్‌ను ఫ్లిప్‌కార్ట్ తన వెబ్సైట్లో ప్రదర్శించింది. ప్రతి ఏడాది మాదిరిగానే, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్,బ్యూటీ, మరిన్నింటితో సహా అనేక రకాల ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అందించనుంది. చదవండి: జియో నుంచి మరో సంచలనం..! త్వరలోనే లాంచ్..! బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లకు అదనపు డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ అందించనుంది. అంతేకాకుండా కొనుగోలు చేసిన వస్తువులపై పేటీఎం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందించనుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అందించే ఆఫర్లను, డిస్కౌంట్లను వెబ్సైట్లో ఉంచింది. భారీ తగ్గింపు...ఆఫర్లు..! ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ టీజర్లో భాగంగా సౌండ్ బార్లు, బోట్ కంపెనీ ఉత్పత్తులపై సుమారు 80 శాతం వరకు, స్మార్ట్‌వాచ్‌లపై సుమారు 70 శాతం వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. డిజో బ్రాండెడ్ వైర్లెస్ హెడ్సెట్ పై 60 శాతం వరకు, ఇంటెల్ ల్యాప్‌టాప్ 40 శాతం వరకు తగ్గింపును అందించనుంది. ల్యాప్‌టాప్‌లు, హెల్త్ కేర్ డివైజెస్ , స్మార్ట్ వేరబుల్స్, హెడ్ఫోన్లు, స్పీకర్లతో సహా ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీలపై కొనుగోలుదారులు 80% వరకు తగ్గింపును ఆశించవచ్చును. టీవీలపై 70% వరకు తగ్గింపును, రిఫ్రిజిరేటర్లపై 50% వరకు గృహోపకరణాలపై 70% వరకు తగ్గింపును అందించనుంది. బిగ్బిలియన్డేస్లో భాగంగా ప్రతిరోజు 12, 8 గంటలకు సాయంత్రం 4 గంటలకు రష్ ఆవర్స్ పేరిట ఫ్లాఫ్ సేల్స్‌ను ప్రకటించింది. కాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ నెల చివరలో లేదా అక్టోబర్ నెలలో జరగనున్నట్లు తెలుస్తోంది. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! -
బిగ్ బిలియన్ డేస్ : రూ. 6 వేలకే టీవీ
సాక్షి, ముంబై : యూరప్‌కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ థామ్సన్ తక్కువ ధరలకే స్మార్టీవీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. అక్టోబర్ 16 - 21 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో జరగనున్న బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో ఈ బంపర్ ఆఫర్ కొనుగోలుదారులకు అందించనుంది. 'బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టీవీ ఆఫర్' పేరుతో దీన్ని తీసుకువచ్చింది. గత 3 సంవత్సరాలుగా భారత మార్కెట్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న థామ్సన్ ప్రస్తుతం హర్ బాత్ బాధి పేరిట మార్కెటింగ్ నిర్వహిస్తోంది. ఆర్9 సిరీస్ థామ్సన్ టీవీ డీల్స్ రూ .5999 నుండి ప్రారంభమవుతాయి. ఆండ్రాయిడ్ థామ్సన్ స్మార్ట్ టీవీ ధర రూ.10999 నుండి ప్రారంభం. (విద్యార్థులకు ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్) ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో టీవీ ఆఫర్లు ఆర్ 9 సిరీస్ కింద రెండు టీవీలు 24 హెచ్డీ బేసిక్ 5,999 రూపాయలు, 32 హెచ్డీ బేసిక్ ధర 8,499 రూపాయల వద్ద అందుబాటులో ఉంటాయి. (ఆపిల్ దివాలీ గిఫ్ట్ : కళ్లు చెదిరే ఆఫర్) పాథ్ సిరీస్ థామ్సన్ మోడళ్లు 32 పాథ్ 0011 ధర - 10,999 రూపాయలు 32 పాథ్ 0011బీఎల్ ధర -11,499 రూపాయలు 40 పాథ్ 7777 ధర - 15,999 రూపాయలు 43 పాథ్ 0009ధర - 18,999 రూపాయలు 43 పాథ్ 4545 ధర -22,499 రూపాయలు 50 పాథ్1010 ధర -24,499 రూపాయలు 55 పాథ్ 5050 ధర - 28,999 రూపాయలు ఆథ్రో సిరీస్ థామ్సన్ టీవీ మోడల్స్ 43 ఆథ్రో 2000 - 22,499 రూపాయలు 50 ఆథ్రో 1212 - 27,499 రూపాయలు 55 ఆథ్రో 0101 - 30,999 రూపాయలు 65 ఆథ్రో 2020 - 45,999 రూపాయలు 75ఆథ్రో 2121 - 94,499 రూపాయలు సాధ్యమైనంతవరకు తమ వినియోగదారుడిని ఆనందపరిచేందుకే చూస్తున్నామనీ, ఈ సీజన్ లో 200,000 యూనిట్ల అమ్మకాన్ని అంచనా వేస్తున్నామని థామ్సన్ టీవీ ఇండియా బ్రాండ్ లైసెన్సీ, సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో గూగుల్ భాగస్వామ్యంతో సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీలను తీసుకొచ్చిన థామ్సన్ ప్రీమియం, బడ్జెట్ ధరల్లో సెమీ, ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను కూడా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. (నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు) -
నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు
సాక్షి, ముంబై: బిగ్ బిలియన్ షాపింగ్ డేస్ సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నోకియా స్మార్ట్ టీవీలపై ఆఫర్లు అందిస్తోంది. పండుగ సీజన్ సమీపిస్తుండటంతో నోకియాకొత్తగా ఆరు ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలను పరిచయం చేస్తోంది. 32, 43, 50, 55 65 అంగుళాల స్మార్ట్ టీవీలను సరసమైన ధరలలో విక్రయిస్తుంది. అక్టోబర్ 16నుండి ప్రారంభం కానున్న బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ ఆరు నోకియా స్మార్ట్ టీవీలను భారతదేశంలోనే తయారు చేసినట్టు నోకియా ప్రకటించింది. నోకియా స్మార్ట్ టీవీల ధరలు 32 అంగుళాల టీవీ రూ .12,999 హెచ్డీ రెడీ 43 అంగుళాల టీవీ ధర రూ .22,999 ఫుల్ హెచ్డీ వేరియంట్ ధర రూ. 28,999 50 అంగుళాల టీవీ ధర రూ. 33,999 55 అంగుళాల ధర 39,999 రూపాయలు 65 అంగుళాల టీవీ ధర 59,999 రూపాయలు నోకియా బ్రాండ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా పూర్తిగా కొత్త స్మార్ట్ టీవీ శ్రేణికి విస్తరించడం తమ విజయానికి నిదర్శమని నోకియా బ్రాండ్ పార్ట్నర్షిప్ వైస్ ప్రెసిడెంట్ విపుల్ మెహ్రోత్రా తెలిపారు. గత ఏడాది భారతదేశంలో తొలిసారిగా లాంచ్ చేసినప్పటినుంచి తమ టీవీలకు స్పందన బావుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. పండుగ సీజన్ షాపింగ్‌ను ప్లాన్ చేస్తున్న వినియోగదారులకు అందుబాటులో ధరల్లో నోకియా సహకారంతో వైవిధ్యమైన స్మార్ట్ టీవీలను అందిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ అయ్యర్ అన్నారు. నోకియా స్మార్ట్ టీవీలు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సందర్భంగా స్పాటిఫై ఆఫర్లతో కలిసి లభిస్తాయి. ఈ నోకియా టీవీలు ఒన్కియో సౌండ్ ద్వారా ట్యూన్, సౌండ్‌బార్‌తో అమర్చబడి 6డీ సౌండ్ అనుభవాన్ని అందిస్తాయి. ఆరు కొత్త నోకియా టీవీలు ఆండ్రాయిడ్ 9.0, క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. -
ఫ్లిప్‌కార్ట్‌లో 70వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ : ప్రముఖ రీటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీగా సీజనల్ ఉద్యోగ నియామకాలకు తెరతీసింది. పండుగ సీజన్‌తో పాటు తన బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఆఫర్ రోజుల సందర్భంగా నెలకొనే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా 70వేల ప్రత్యక్ష, లక్షలాది పరోక్ష ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో ప్రత్యక్ష నియామకాల్ని తన సప్లై చెయిన్‌లో ఎగ్జిక్యూటివ్స్, పిక్కర్స్, ప్యాకర్స్, సార్టర్స్ పోస్టుల్లో భర్తీ చేయనుండగా, పరోక్ష ఉద్యోగ అవకాశాల్ని తన అమ్మకపు భాగస్వామ్య లొకేషన్లు, కిరాణషాపుల్లో కల్పించనుంది. సప్లయి చైన్ విస్తరణ, బలోపేతంతో రానున్న పండుగల సీజన్లో లక్షల మంది ఈ–కామర్స్ కస్టమర్లు ఆన్లైన్లో సాఫీగా షాపింగ్ చేసుకునే సౌకర్యాన్ని కలి్పంచేందుకు ఈ భారీ నియామకాలను చేపట్టినట్లు కంపెనీ తెలిపింది. కొత్తగా ఎంపికైన వారికి కస్టమర్ సర్వీస్, డెలివరీ, ఇన్స్టాలేషన్, సేఫ్టీ, శానిటైజేషన్‌తో పాటు పీఓఎస్ మెషీన్లు, స్కానర్లు, మొబైల్ అప్లికేషన్లను ఆపరేట్ చేయడం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తామని కంపెనీ పేర్కొంది. ‘‘ఈ–కామర్స్ వ్యవస్థ పురోగతికి అదనపు అవకాశాల సృష్టి అవసరం. ఇది కేవలం పరిశ్రమకు పరిమితం కాకుండా కస్టమర్ల ప్రయోజనాలకు ముఖ్యమే.’’ అని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేష్ ఝా అన్నారు. ఆర్డర్లను చివరి మైలురాయి వరకు చేర్చేందుకు దేశంలో 50 వేల చిన్న కిరాణాషాపులు, పెద్ద హోల్‌సేల్ దుకాణాలతో ఫ్లిప్‌కార్ట్ గతవారం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కామర్స్ కంపెనీలు పండుగ సీజన్లో వచ్చే ఆర్డర్ల దృష్ట్యా భారీగా ఉద్యోగ సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. గతేడాదిలో ఇదే పండుగ సీజన్లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కంపెనీలు దాదాపు 1.4లక్షల తాత్కాలిక ఉద్యోగాలను నియమించుకున్నాయి. ఇక ఇప్పటికే లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఈ–కామ్ ఎక్స్‌ప్రెస్ 30,000 ఉద్యోగాలను ప్రకటించింది. -
ఫ్లిప్‌కార్ట్ 'ది బిగ్ బిలియన్ డేస్ సేల్' ఆఫర్లు
సాక్షి, ముంబై: ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్కు మరోసారి తెరతీసింది. 'ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్' కోలాహలం సెప్టెంబర్ 29 న ప్రారంభమై అక్టోబర్ 4 వరకు ఉంటుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ప్లస్ సభ్యుల కోసం 28, 29 తేదీల్లో ఉదయం 8 గంటలనుంచే ఈ ఆఫర్ ముందస్తుగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆరు రోజుల గ్రాండ్ షాపింగ్ ఫెస్టివల్ సేలక్ష వివిధ గృహోపరకరణాలు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లపై భారీ అఫర్లను (90శాతం) అందిస్తోంది. రియల్‌మి, ఆసుస్, గూగుల్, లెనోవా మోటరోలా, వివో, మోటో జీ7, మోటరోలా వన్‌విజన్, లెనోవా జెడ్ 6ప్రొ, కే10 నోట్ ,తదితర డివైస్ల పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9 ప్లస్ కూడా తగ్గింపు ధరలో అందిస్తోంది. బడ్జెట్ స్మార్ట్ఫోన్లకు మాత్రమే కాకుండా మిడ్-రేంజ్, ప్రీమియం వాటికి కూడా వర్తిస్తుంది. అలాగే యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు కొనుగోళ్లపై 10శాతం డిస్కౌంట్ అదనం. రూ.2,000 ఎక్స్చేంజ్ తోపాటు మొబైల్ ప్రొటెక్షన్ లాంటి ఆఫర్లుకూడా ఉన్నాయి. 'ది బిగ్ బిలియన్ డేస్ సేల్' ఆఫర్లు లెనోవో జెడ్ 6 ప్రొ 2 వేలు తగ్గింపుతో రూ. 31,999 లకే అందుబాటులోఉండనుంది లెనోవో ఏ 6 నోట్‌పై వెయ్యిరూపాయల తగ్గింపు రియల్‌మి 5 ప్రో -1,000 రూపాయల తగ్గింపు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఇంకా రియల్‌మి స్మార్ట్ఫోన్లలోని రియల్‌మి 5, రియల్‌మి ఎక్స్‌టి, రియల్‌మి ఎక్స్, రియల్‌మి 3ఐను వరుసగా రూ. 8,999, రూ. 15,999, రూ. 15,999, 7,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఎంట్రీ-సెగ్మెంట్ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 5 (క్వాడ్-కెమెరా) రూ 2 వేల తగ్గింపుతో రూ. 8,999లకే పొందవచ్చు. మిగిలిన వివరాలు ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్సైట్లో చూడగలరు. -
ఫెస్టివల్ గిఫ్ట్: ఫ్లిప్‌కార్ట్‌లో 30వేల ఉద్యోగాలు
బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ఆఫర్స్‌తో పాటు, భారీగా ఉద్యోగాల జాతరకు తెరలేపింది. రాబోతున్న ఫెస్టివల్ సేల్ కోసం 30వేల సీజనల్ ఉద్యోగాలను అందించింది. ఈ ఉద్యోగాలు ఎక్కువగా సప్లయి చైన్, లాజిస్టిక్స్ ఆపరేషన్లలో కల్పించింది. ఈ పండుగ సేల్‌లో అమెజాన్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు, ఫ్లిప్‌కార్ట్ ఈ మేరకు సన్నద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ తన నాలుగో ఎడిషన్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను అక్టోబర్ 10 నుంచి 14 వరకు నిర్వహించబోతుంది. ఈ సేల్ జరిగే సమయంలో, ఫ్లిప్‌కార్ట్ విక్రయ భాగస్వాములు కూడా తమ ప్రాంతాల్లో పరోక్షంగా ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. తమ వినియోగదారులకు సజావుగా షాపింగ్ అనుభవాన్ని అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. సప్లయి చైన్ వ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్ ఈ సీజనల్ ఉద్యోగాలను కల్పించింది. వీటిలో వేర్‌హౌజ్‌లు, మదర్ హబ్స్, డెలివరీ హబ్స్ ఉన్నాయి. ప్యాకేజింగ్, వేర్‌హౌజ్ మేనేజ్మెంట్లలో అదనంగా పరోక్ష ఉద్యోగాలను కూడా సృష్టించింది ఫ్లిప్‌కార్ట్. ఫెస్టివల్ సేల్‌లో ఎక్కువ మొత్తంలో వచ్చే ఆర్డర్లను సజావుగా చేపట్టేందుకు ఈ-కామర్స్ కంపెనీలు ప్రతి సీజన్లోనూ వేలమంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటాయి. అమెజాన్ ఇండియా కూడా దేశవ్యాప్తంగా 50వేల సీజనల్ ఉద్యోగాలను సృష్టించింది. రాబోతున్న ఫెస్టివల్ సేల్‌లో 20 మిలియన్‌కు పైగా వినియోగదారలు పలు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై షాపింగ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి వాటికి 3 బిలియన్ డాలర్ల విక్రయాలు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని రీసెర్చ్ సంస్థ రెడ్‌షీర్ రిపోర్టు పేర్కొంది. ఆఫ్‌లైన్ రిటైలర్లకు కూడా ఈ దసరా, దివాళి ఫెస్టివల్ సీజన్లో విక్రయాలు భారీగానే నమోదవుతాయి. వార్షిక విక్రయాలను పెంచుకోవడానికి ఈ కంపెనీలకు సెప్టెంబర్-నవంబర్ కాలమే అత్యంత కీలకం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు స్నాప్‌డీల్ కూడా ‘మెగా దివాళి సేల్’ను అక్టోబర్ 10 నుంచి 14 వరకు నిర్వహించబోతుంది. ప్రస్తుతం నియమించుకున్న ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ ఉద్యోగులు టెక్‌తో నడిచే సప్లయి చైన్, ఫుడ్ టెక్, ఇతర సంబంధిత పరిశ్రమల్లో పనిచేసేందుకు ఈ అనుభవం ఉపయోగపడనుంది.