
Flipkart Big Billion Days Sale 2021: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది జూన్ 13-16 తేదీల్లో బిగ్ సేవింగ్ డేస్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు సంబంధించిన టీజర్‌ను ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో ప్రదర్శించింది. ప్రతి ఏడాది మాదిరిగానే, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్,బ్యూటీ, మరిన్నింటితో సహా అనేక రకాల ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అందించనుంది.
చదవండి: జియో నుంచి మరో సంచలనం..! త్వరలోనే లాంచ్..!
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లకు అదనపు డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ అందించనుంది. అంతేకాకుండా కొనుగోలు చేసిన వస్తువులపై పేటీఎం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందించనుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అందించే ఆఫర్లను, డిస్కౌంట్లను వెబ్‌సైట్‌లో ఉంచింది.
భారీ తగ్గింపు...ఆఫర్లు..!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ టీజర్‌లో భాగంగా సౌండ్ బార్లు, బోట్ కంపెనీ ఉత్పత్తులపై సుమారు 80 శాతం వరకు, స్మార్ట్‌వాచ్‌లపై సుమారు 70 శాతం వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. డిజో బ్రాండెడ్ వైర్‌లెస్ హెడ్‌సెట్ పై 60 శాతం వరకు, ఇంటెల్ ల్యాప్‌టాప్ 40 శాతం వరకు తగ్గింపును అందించనుంది. ల్యాప్‌టాప్‌లు, హెల్త్ కేర్ డివైజెస్ , స్మార్ట్ వేరబుల్స్, హెడ్‌ఫోన్‌లు, స్పీకర్‌లతో సహా ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీలపై కొనుగోలుదారులు 80% వరకు తగ్గింపును ఆశించవచ్చును. టీవీలపై 70% వరకు తగ్గింపును, రిఫ్రిజిరేటర్‌లపై 50% వరకు గృహోపకరణాలపై 70% వరకు తగ్గింపును అందించనుంది.
బిగ్‌బిలియన్‌డేస్‌లో భాగంగా ప్రతిరోజు 12, 8 గంటలకు సాయంత్రం 4 గంటలకు రష్ ఆవర్స్ పేరిట ఫ్లాఫ్ సేల్స్‌ను ప్రకటించింది. కాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ నెల చివరలో లేదా అక్టోబర్ నెలలో జరగనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..!