ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఈసారి 20-25 శాతం పెరిగాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇప్పటికే సంస్థలు వివిధ పేర్లతో ఫెస్టివల్ సేల్స్‌ను ప్రారంభించాయి. ఇందులో విభిన్న వస్తువులపై ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు చెప్పాయి. దాంతో 27న(26న ప్రైమ్ వినియోగదారులకు వర్తించాయి.) మొదలైన అమ్మకాలు గతేడాది ఇదే సీజీన్‌లోని మొదటి మూడు రోజులతో పోలిస్తే ఈ సారి 20-25 శాతం వృద్ధి చెందినట్లు డాటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ నివేదించింది.
సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..సెప్టెంబర్ 26(ఫ్లిప్‌కార్ట్ ప్లస్, అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఒకరోజు ముందుగానే ఆఫర్లు వర్తించాయి)-28 రోజుల్లో ఆన్‌లైన్ రిటైలర్ల అమ్మకాలు గత సంవత్సరంతో పోల్చితే దాదాపు 26% పెరిగాయి. సుమారు రూ.26,500 కోట్లు (3.2 బిలియన్ డాలర్లు) మేర వ్యాపారం జరిగినట్లు అంచనా. ఈ పండగ సీజన్ పూర్తయ్యే సమయానికి రూ.లక్ష కోట్లు (12 బిలియన్ డాలర్లు) స్థూల విక్రయాలు జరిగే అవకాశం ఉంది. ఇది గతేడాదితో పోలిస్తే 23% వృద్ధిని సూచిస్తుంది. ఆన్‌లైన్ రిటైల్ అమ్మకాల్లో ప్రధానంగా మొబైల్, ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇంటీరియర్ వస్తువులు, ఫ్యాషన్, గ్రోసరీ, బ్యూటీ, పర్సనల్ కేర్ వస్తువులు కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.
ఇదీ చదవండి: ఒక్కరోజులోనే రూ.నాలుగు లక్షల కోట్లు ఆవిరి!
కంపెనీలు ఇలాంటి ఫెస్టివ్ సీజన్‌లో ఆఫర్లు తీసుకురావడం సహజం. కానీ కొనాలనుకునే వస్తువుపై ఏదోఒక ఆఫర్ ఉందని కొంటున్నామా? లేదా నిజంగా ఆ వస్తువు అవసరమై కొంటున్నామా..అనేది చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు ఆఫర్ల ట్రాప్‌లో పడి విచ్చలవిడిగా షాపింగ్ చేసి అప్పులపాలు కాకూడదని సూచిస్తున్నారు. ప్రధానంగా చాలామంది క్రెడిట్‌కార్డులు వాడుతూ, ఈఎంఐ ఎంచుకుంటూ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇప్పటికే మీకు ఇతర ఈఎంఐలు ఉంటే మాత్రం జాగ్రత్తపడాలని చెబుతున్నారు. నెలవారీ సంపాదనలో కేవలం 20-25 శాతం మాత్రమే ఈఎంఐలకు కేటాయించాలంటున్నారు. లేదంటే ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోవాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment