Great Indian Festival
-
పావుశాతం వరకు పెరిగిన అమ్మకాలు
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఈసారి 20-25 శాతం పెరిగాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇప్పటికే సంస్థలు వివిధ పేర్లతో ఫెస్టివల్ సేల్స్‌ను ప్రారంభించాయి. ఇందులో విభిన్న వస్తువులపై ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు చెప్పాయి. దాంతో 27న(26న ప్రైమ్ వినియోగదారులకు వర్తించాయి.) మొదలైన అమ్మకాలు గతేడాది ఇదే సీజీన్లోని మొదటి మూడు రోజులతో పోలిస్తే ఈ సారి 20-25 శాతం వృద్ధి చెందినట్లు డాటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ నివేదించింది.సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..సెప్టెంబర్ 26(ఫ్లిప్‌కార్ట్ ప్లస్, అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఒకరోజు ముందుగానే ఆఫర్లు వర్తించాయి)-28 రోజుల్లో ఆన్లైన్ రిటైలర్ల అమ్మకాలు గత సంవత్సరంతో పోల్చితే దాదాపు 26% పెరిగాయి. సుమారు రూ.26,500 కోట్లు (3.2 బిలియన్ డాలర్లు) మేర వ్యాపారం జరిగినట్లు అంచనా. ఈ పండగ సీజన్ పూర్తయ్యే సమయానికి రూ.లక్ష కోట్లు (12 బిలియన్ డాలర్లు) స్థూల విక్రయాలు జరిగే అవకాశం ఉంది. ఇది గతేడాదితో పోలిస్తే 23% వృద్ధిని సూచిస్తుంది. ఆన్లైన్ రిటైల్ అమ్మకాల్లో ప్రధానంగా మొబైల్, ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇంటీరియర్ వస్తువులు, ఫ్యాషన్, గ్రోసరీ, బ్యూటీ, పర్సనల్ కేర్ వస్తువులు కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులోనే రూ.నాలుగు లక్షల కోట్లు ఆవిరి!కంపెనీలు ఇలాంటి ఫెస్టివ్ సీజన్లో ఆఫర్లు తీసుకురావడం సహజం. కానీ కొనాలనుకునే వస్తువుపై ఏదోఒక ఆఫర్ ఉందని కొంటున్నామా? లేదా నిజంగా ఆ వస్తువు అవసరమై కొంటున్నామా..అనేది చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు ఆఫర్ల ట్రాప్‌లో పడి విచ్చలవిడిగా షాపింగ్ చేసి అప్పులపాలు కాకూడదని సూచిస్తున్నారు. ప్రధానంగా చాలామంది క్రెడిట్‌కార్డులు వాడుతూ, ఈఎంఐ ఎంచుకుంటూ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇప్పటికే మీకు ఇతర ఈఎంఐలు ఉంటే మాత్రం జాగ్రత్తపడాలని చెబుతున్నారు. నెలవారీ సంపాదనలో కేవలం 20-25 శాతం మాత్రమే ఈఎంఐలకు కేటాయించాలంటున్నారు. లేదంటే ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోవాల్సి ఉంటుందన్నారు. -
ఈ–కామర్స్ పండుగ సేల్ 26 నుంచి షురూ..
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా సెప్టెంబర్ 26 నుంచి వార్షిక పండుగ సేల్ ప్రారంభించనున్నాయి. 27 నుంచి అందరికీ సేల్ అందుబాటులోకి వస్తుందని, అంతకన్నా 24 గంటల ముందు తమ పెయిడ్ సబ్స్క్రయిబర్స్కు యాక్సెస్ లభిస్తుందని ఇరు సంస్థలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. ది బిగ్ బిలియన్ డేస్ (టీబీబీడీ) 2024 పేరిట ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (ఏజీఐఎఫ్) పేరుతో అమెజాన్ ఇండియా వీటిని నిర్వహించనున్నాయి. 20 నగరాలవ్యాప్తంగా 2 లక్షల పైచిలుకు ప్రోడక్టు కేటగిరీల్లో ఉత్పత్తులను అదే రోజున అందించేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈసారి విక్రేతలకు 20 శాతం అధికంగా రివార్డులు ఉంటాయని పేర్కొంది. మరోవైపు, ఏజీఐఎఫ్లో భాగంగా 14 లక్షల మంది పైగా విక్రేతలు, ప్రోడక్టులను విక్రయించనున్నట్లు అమెజాన్ పేర్కొంది. -
48 గంటల్లో 9.5 కోట్ల మంది విజిటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత సీజన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన తొలి 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో 9.5 కోట్ల మంది పైచిలుకు కస్టమర్లు తమ పోర్టల్‌ను సందర్శించినట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డైరెక్టర్ (స్మార్ట్ఫోన్లు, టీవీలు) రంజిత్ బాబు తెలిపారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు, టీవీల విక్రయాలకు సంబంధించి తమ టాప్ 3 మార్కెట్లలో రాష్ట్రాలపరంగా తెలంగాణ, నగరాలవారీగా హైదరాబాద్ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సీజన్లో తెలంగాణలో టీవీలకు రెండు రెట్లు డిమాండ్ కనిపించగా, 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు 60 శాతం పెరిగాయని రంజిత్ బాబు చెప్పారు. ఎక్కువగా ప్రీమియం స్మార్ట్ఫోన్లు, పెద్ద స్క్రీన్ టీవీలవైపు కస్టమర్లు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి తమ ప్లాట్‌ఫాంపై 50,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారని గురువారమిక్కడ ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన అమెజాన్ ఎక్స్పీరియన్స్ ఎరీనా (ఏఎక్స్ఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇందులో వివిధ ఉత్పత్తులను ప్రదర్శించే జోన్లను ఏర్పాటు చేశారు. మరికొన్నాళ్లు కొనసాగే ఫెస్టివల్లో బ్యాంకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, ఎక్సే్చంజ్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆకర్షణీయ ఆఫర్లు ఇస్తున్నట్లు రంజిత్ బాబు వివరించారు. -
ఆ స్మార్ట్‌ఫోన్లంటే ప్రాణం!, నిమిషానికి ఎన్ని ఫోన్లు కొనుగోలు చేస్తున్నారంటే!
భారత్‌లో రెండు ఈ -కామర్స్ సంస్థలు నువ్వా..నేనా..సై..అంటూ భారీ డిస్కౌంట్లతో కాలుదువ్వుతున్నాయి. దీన్ని అదునుగా భావిస్తున్న కోట్లాది మంది కస్టమర్లు కూర్చున్న చోటుకే కావాల్సినవి వస్తుండటంతో సెకన్ల వ్యవధిలో తమకు కావాల్సిన వస్తువుల్ని ఆర్డర్లు పెడుతున్నారు. ఆర్డర్లు సంగతి సరే. ఇంతకీ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పోర్టల్‌లో ఏ వస్తువు ఎక్కువగా అమ్ముడవుతుంది? యూజర్లు ఏ బ్రాండ్ ఫోన్లు ఎక్కువగా కొంటున్నారు? దేశీయ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్స్, అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్స్‌లో సరికొత్త రికార్డ్లను నమోదు అవుతున్నాయి. స్పెషల్ సేల్‌లో భారీ ఎత్తున డిస్కౌంట్స్ అందిస్తుండడంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సైట్లకు కస్టమర్లు పోటెత్తుతున్నారు. దీంతో ఆయా సెగ్మెంట్లలోని వస్తువులు నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో రోజుకి 9.1 కోట్ల మంది కస్టమర్లు కొనుగోలు దారుల డిమాండ్ దృష్ట్యా ఫ్లిప్ కార్ట్ వెబ్‌సైట్‌ను రోజువారీ లావాదేవీలపై 9.1 కోట్ల మంది కస్టమర్లు సందర్శించారు. ఆర్డర్లు సైతం 7 రెట్లు పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ ప్రత్యేక సేల్‌లో కొనుగోలు దారులు మొబైల్, గృహోపకరణాలు (Appliance), లైఫ్‌స్టైల్, బ్యూటీ అండ్ జనరల్ మెర్చెండైజ్ ఉత్పత్తులు అంటే షూ’లు, దుస్తులు,ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్, జ్యువెలరీ, ఫుడ్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ►ఫ్లిప్ కార్ట్‌లో టైర్-2 ప్లస్ కస్టమర్లు రూ.20,000 ధర కంటే ఎక్కువగా ఉన్న ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేసింది. ►ఇక, అదే సైట్లో 1-2 అండ్ 3 టైర్ సిటీస్‌కు చెందిన కస్టమర్లు మొబైల్స్, అప్లయెన్సెస్, లైఫ్ స్టైల్, బ్యూటీ అండ్ జనరల్ మెర్చెండైజ్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు 60 శాతం ఆర్డర్లు పెట్టారు. అమెజాన్‌లో 9. కోట్ల మంది మరోవైపు అమెజాన్ అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు కొనసాగుతున్న అమ్మకాలు సైతం భారీ ఎత్తున జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ మొదటి 48 గంటల్లో 9.5 కోట్ల మంది కస్టమర్లు అమెజాన్ సైట్‌ని వీక్షించారు. ఆఫోన్ అంటే మాకు ప్రాణం.. నిమిషానికి 100 ఆర్డర్లు అమెజాన్ పోర్టల్‌లో ఎక్కువగా కొనుగోలు చేసిన ప్రొడక్ట్‌లలో స్మార్ట్ ఫోన్లు అత్యధికంగా ఉన్నాయి. సాధారణ కస్టమర్ల కంటే ముందే ప్రైమ్ సబ్స్క్రైబర్లు అక్టోబర్ 7న కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే, ఆ ఒక్కరోజే ప్రైమ్ మెంబర్లు సెకనుకు 75 కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు ఆర్డర్ పెట్టారు. ఆ ఫోన్లలో వన్‌ప్లస్, శామ్ సంగ్, యాపిల్ ఐఫోన్లు ఎక్కువగా ఉండగా.. తొలి 48 గంటల్లో ప్రతి నిమిషానికి 100 వన్ ప్లస్ ఫోన్‌ను కొనుగోలు చేశారు. ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో శాంసంగ్ డిమాండ్ ఎక్కువగా ఉంది. 75 శాతం స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 2-3 టైర్ (సిటీస్/టౌన్ల) ప్రాంతాల కస్టమర్ల ఆర్డర్లకు అనుగుణంగా 75 శాతం స్మార్ట్ఫోన్లు అమ్మినట్లు అమెజాన్ తెలిపింది. బడ్జెట్ ధర, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్ఛేంజ్ ఆఫర్ సౌకర్యం ఉండడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.30,000 కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం స్మార్ట్ఫోన్ల సేల్స్ 3 శాతం వృద్ది సాధించినట్లు వెల్లడించింది. నిమిషానికో టీవీ తాము నిర్వహిస్తున్న అమ్మకాల తొలి రెండ్రోజుల్లో ప్రతి సెకనుకు 1.2లక్షల కస్టమర్లు గృహోపకరకాణాల్ని కొనుగోలు చేశారు. ఆ సెకనులోని సగం మంది కస్టమర్లు ధర ఎక్కువగా ఉన్న అప్లయెన్సెస్ కోసం ఆర్డర్ పెట్టారు. 2-3 టైర్ నగరాల ప్రజలు ప్రతి నిమిషానికి ఒక టీవిని కొనుగోలు చేశారు. అందం మీద ఆసక్తితో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ స్పెషల్ సేల్‌పై ప్రముఖ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ ఓ ఆసక్తిరమైన రిపోర్ట్‌ను విడుదల చేసింది. బిగ్ బిలియన్ డే సేల్‌లో ఒకరోజు ముందే షాపింగ్ చేసుకునే అవకాశం ఉన్న ఫ్లిప్ కార్ట్ ఫ్లస్ సబ్స్క్రైబర్లు గ్రూమింగ్ సంబంధిత ప్రొడక్ట్‌లతో పాటు ఫుడ్ అండ్ న్యూట్రీషియన్, మేకప్, స్ప్రే బాటిల్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు రెడ్రీస్ నివేదించింది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో గత ఏడాదిలో అమెజాన్ నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌తో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాల్లో తొలి 48 గంటల్లో 35శాతం కంటే ఎక్కువగా ప్రీమియం స్మార్ట్ ఫోన్లను విక్రయించగా.. ప్రతి నిమిషానికి 10 ప్రీమియం నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్‌ను కొనుగోలు చేశారు. ఈ ప్రాంతాల నుంచే ఎక్కువ ఆర్డర్లు ఫ్లిప్‌కార్ట్‌లో బెంగళూరు,ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల నుంచి ఎక్కువ మంది ఆర్డర్లు పెట్టగా.. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై,పూణే, అహ్మదాబాద్,కోల్‌కతా, చెన్నై, గూర్ గావ్ నుంచి ఉన్నారు. ఆసక్తికరంగా ఫెస్టివల్ సీజన్లో షాపింగ్ ఎక్కువ చేసిన ప్రధాన నగరాల జాబితాలో హిసార్,లక్నో, పాట్నాలు ఉన్నాయి. -
ఆన్లైన్ షాపింగ్ వైపు .. కొత్త తరం చూపు
కొత్త తరం కస్టమర్లు (11–26 ఏళ్ల వయస్సువారు– జెన్ జీ) కొనుగోళ్ల కోసం భారీగా ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఫ్యాషన్ ఇండియా వీపీ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు. వివిధ సెగ్మెంట్లలో కస్టమర్లు ఎక్కువగా ప్రీమియం ఉత్పత్తులపై ఆసక్తిగా ఉంటున్నట్లు ఆయన వివరించారు. అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ (ఏజీఐఎఫ్) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్‌లో ప్రివ్యూ నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ విషయం వివరించారు. ఆన్లైన్ షాపింగ్‌కు సంబంధించి ఫ్యాషన్, బ్యూటీకి ఎక్కువగా డిమాండ్ కనిపిస్తుండగా మొబైల్ ఫోన్లు, ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు ఆల్‌టైమ్ ఫేవరెట్స్‌గా ఉంటున్నాయని శ్రీవాస్తవ చెప్పారు. ఈసారి ఏజీఐఎఫ్లో అమ్మకాలు కొత్త గరిష్ట స్థాయిని తాకగలవని అంచనా వేస్తున్నట్లు వివరించారు. రాబోయే పండుగ సీజన్లో ఆన్లైన్ అమ్మకాలు 20 శాతం వరకు వృద్ధి చెంది రూ. 90,000 కోట్లకు చేరే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
అద్భుతమైన ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ‘ఫినాలే డేస్’ సేల్
కొనుగోలు దారులకు ప్రముఖ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ శుభవార్త చెప్పింది. దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నెల రోజుల పాటు నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగియడంతో ..‘ఫినాలే డేస్’ పేరుతో మరో ఎగ్జైటింగ్ సేల్‌ను ప్రకటించింది. దీపావళి సందర్భంగా కొనుగోలు దారుల కోసం ‘ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్’ పేరుతో ఫినాలే డేస్ సేల్‌ను ప్రారంభించింది. అక్టోబర్ 17నుంచి ప్రారంభమై అక్టోబర్ 24 వరకు జరిగే సేల్‌లో ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్స్, టీవీలు, హెల్త్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, బేబీ ప్రొడక్ట్స్‌తో పాటు పలు రకాల ఉత్పత్తులపై ఢీల్స్, ఆఫర్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా టెక్నో, ఐక్యూ, మైక్రోసాఫ్ట్, ప్యాంపర్స్, షావోమీ స్మార్ట్ ఫోన్స్, టీవీ, పీ అండ్ జీ ప్రొడక్ట్‌లపై స్పెషల్ ఆఫర్లను పొందవచ్చు. రివార్డ్ పాయింట్లు అమెజాన్ ఫినాలే డేస్ సేల్‌లో ఐసీఐసీఐ, సిటీ, కొటాక్, రూపే క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు అండ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్లు నిర్వహించే కస్టమర్లకు 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, షాపింగ్ బడ్జెట్‌ను బట్టి బజాజ్ ఫిన్ సర్వ్, అమెజాన్ పే లేటర్ వంటి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులపై జీరోకాస్ట్ ఈఎంఐ, అమెజాన్ పే ఇన్స్ట్రుమెంట్ ద్వారా చేసే చెల్లింపులపై రివార్డు పాయింట్లను సొంతం చేసుకోవచ్చు. డైమండ్స్ ధమాకా అక్టోబర్ 15 నుంచి కస్టమర్లకు డైమండ్ ధమాకా ఆఫర్ అందుబాటులోకి తెచ్చామని అమెజాన్ ప్రతినిధులు తెలిపారు. అక్టోబర్ 15వ తేదీ నుండి కస్టమర్లు 750 డైమండ్స్‌ని రీడీమ్ చేయడం ద్వారా రూ. 1500 కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే, రూ. 150 క్యాష్‌బ్యాక్ డైమండ్స్ ధమాకా ఆఫర్‌ను పొందవచ్చు. రూ. 3 వేలు అంతకంటే ఎక్కువ షాపింగ్‌పై 1000 డైమండ్లను రీడమ్ చేయడం ద్వారా రూ. 300 క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఈ రెండు ఆఫర్లు అక్టోబర్ 24న ముగుస్తాయి. ఎగ్జిస్టింగ్ ఆఫర్లు,డైమండ్స్‌ను సంపాదించేందుకు డైమండ్స్ పేజీని సందర్శించండి గాడ్జెట్లను అప్‌గ్రేడ్ చేసుకోండి దివాళీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని కొనుగోలు దారులకు మొబైల్స్, యాక్సెసరీస్‌పై 40 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. వన్ ప్లస్, షావోమీ, శాంసంగ్, ఐక్యూ, రియల్ మీ, యాపిల్, టెక్నో తో పాటు ఇతర స్మార్ట్ ఫోన్ల ప్రారంభ ధర రూ.5219 కొనుగోలుతో రూ. 499 విలువైన ఇయర్ ఫోన్స్ ఉచితంగా పొందవచ్చు. ప్రారంభ ధర రూ.10799తో 5జీ ఫోన్ కొనుగోళ్లపై ఇతర ఆఫర్లను దక్కించుకోవచ్చు. రూ. 17990తో ప్రారంభమయ్యే ల్యాప్‌టాప్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్లు, రూ.999తో ప్రారంభమయ్యే స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం డిస్కౌంట్, రూ. 6999తో ప్రారంభమయ్యే టాబ్లెట్లపై 60 శాతం డిస్కౌంట్ , డీఎస్ఎల్ఆర్లో 70శాతం వరకు తగ్గింపుతో కెమెరాలు, రూ.4999 ప్రారంభ ధరతో మిర్రర్ లెస్, యాక్షన్ & డ్యాష్ కెమెరా యాక్సెస్లపై డిస్కౌంట్, ప్రారంభ ధర రూ.5199 లభించే హోమ్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ (టీవీలు, ప్రొజెక్టర్ల)పై 60 శాతం డిస్కౌంట్లు, రూ.10499 తో ప్రారంభమయ్యే సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీలైన వన్ ప్లస్, మి, శాంసంగ్, ఎల్జీ, సోనీలపై ప్రత్యేక మైన ఆఫర్లు ఈ సేల్ ఉన్నాయి. మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి పండుగ రోజుల్లో ఇంటిని అందంగా అలకరించేందుకు ఇష్ట పడుతుంటాం. అలాంటి వారి కోసం అమెజాన్ సంస్థ యురేకా ఫోర్బ్స్, హావెల్స్, స్టోరీ@హోమ్, అజంతా, విప్రో, ప్రెస్టీజ్, బటర్‌ఫ్లై, మిల్టన్, సోలిమో వంటి బ్రాండ్లకు చెందిన హోమ్, కిచెన్ & అవుట్డోర్ ప్రొడక్ట్‌లపై 70శాతం వరకు తగ్గింపు అందిస్తుంది. బెడ్రూమ్ రీడెకరేషన్/అప్‌గ్రేడ్ కోసం, 350K+ ఎంపిక చేసిన ఫర్నిచర్ & పరుపులపై 85% వరకు తగ్గింపు, ఫర్నీచర్, టాప్ బ్రాండ్ల నుండి బాత్ & కిచెన్ ఫిట్టింగ్‌లపై 70శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. స్టైలిష్‌గా తయారవ్వండి 4.5 లక్షల స్టైల్స్‌పై డీల్‌లతో అమెజాన్ ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్‌లపై 50శాతం నుంచి 80 శాతం తగ్గింపు, బిబా, డబ్ల్యూ ఫర్ ఉమెన్, మ్యాక్స్, అలెన్ సోలీ, వాన్ హ్యూసెన్ లాంటి మరెన్నో ప్రసిద్ధ బ్రాండలకు చెందిన పురుషులు, మహిళల ఫ్యాషన్ ఉత్పత్తులపై 50శాతం నుండి 80శాతం వరకు తగ్గింపు! లగ్జరీ బ్యూటీ, పెర్ఫ్యూమ్‌లపై 60శాతం డిస్కౌంట్, మేకప్..గ్రూమింగ్ ప్రొడక్ట్‌లపై 70శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఇవి కాకుండా ప్రీమియం దుస్తులు, గడియారాలు, హ్యాండ్‌బ్యాగ్‌లు 60శాతం తగ్గింపు, ది డిజైనర్ బోటిక్ నుంచి 80శాతం వరకు అమెజాన్ సేల్‌లో పొందవచ్చు. స్పెషల్ ఆఫర్ మీకోసమే అమెజాన్ బిజినెస్ కస్టమర్లు జీఎస్టీ ఇన్ వాయిస్‌తో 28శాతం అదనంగా, 40శాతం ఎక్కువ ఆదా చేసుకోవచ్చు.ఇప్పటికే అమెజాన్.ఇన్ వంటి ఆఫర్లతో పాటు డీల్స్, బ్యాంక్ డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్, బిజినెస్ ఎక్స్‌క్లూజివ్ ద్వారా బిజినెస్ కస్టమర్లు 10% వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ www.amazon.in/business లో జీఎస్టీ నెంబర్ లేదా పాన్‌కార్డుతో లాగిన్ అవ్వండి. లబ్ధి పొందండి. (అడ్వర్టోరియల్) -
వచ్చేస్తోంది..మరో అదిరిపోయే సేల్, వీటిపై 80 శాతం భారీ డిస్కౌంట్!
దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని దేశీయ ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్‌ను ప్రకటించింది. మరో ఈకామర్స్ కంపెనీ అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్-2022ను నిర్వహించనుంది. సెప్టెంబర్ 23నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు జరిగే ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ల్యాప్ ట్యాప్స్,స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్‌లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే సేల్‌లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వినియోగించి ప్రొడక్ట్ కొనుగోలు దారులకు 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, పేటీఎం ట్రాన్సాక్షన్లపై 10శాతం డిస్కౌంట్ అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్‌తో రూ.1లక్ష వరకు రుణం ఇస్తుంది. ఈ రుణాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. “కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్‌ను ఇతర ప్రీపెయిడ్ థర్డ్ పార్టీ కార్డ్‌ల ద్వారా చెల్లించవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు హోల్డర్లకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది” అని ఇ-కామర్స్ దిగ్గజం తెలిపింది. ఇటీవల ఫ్లిప్‌కార్ట్ తన యాప్‌ను అప్డేట్ చేసింది. దీంతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే 2022 సేల్ సమయంలో కూపన్ రెయిన్, ట్రెజర్ హంట్, స్పిన్ ది బాటిల్ వంటి గేమిఫికేషన్ కార్యక్రమాలు కస్టమర్లు సేల్ సమయంలో ఆఫర్లను పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. 80శాతం డిస్కౌంట్ ప్రింటర్లు, మానిటర్లతో పాటు కంప్యూటర్ ఎక్విప్‌మెంట్‌పై 80 శాతం డిస్కౌంట్, టీవీలపై 80 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. సేల్ సందర్భంగా, ప్రతిరోజూ ఉదయం 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు 'క్రేజీ డీల్స్', 'రష్ అవర్స్'లో 'ఎర్లీ బర్డ్ స్పెషల్' ఐటెమ్‌లపై డిస్కౌంట్లు 'టిక్ టాక్ డీల్స్' ను అందిస్తుంది. భారీ తగ్గింపు సేల్ సమయంలో నథింగ్ ఫోన్ 1, గూగుల్ పిక్సెల్ 6 ఎ ధర తగ్గనుంది. నథింగ్ ఫోన్ 1 ప్రారంభ ధర రూ. 28,999, గూగుల్ పిక్సెల్ 6 ఎ ప్రారంభ ధర రూ. 27,699గా ఉంది. -
కొనుగోలుదారులకు బంపరాఫర్, 75 శాతం వరకు భారీ డిస్కౌంట్!
దసరా ఫెస్టివల్ సీజన్ సందర్భంగా కొనుగోలు దారులకు ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ బంపరాఫర్ ప్రకటించింది.సెప్టెంబర్ 23 నుంచి గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా కొనుగోలు దారులు ఎస్బీఐ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్,10 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎం, ఐక్యూ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు పొందవచ్చని అమెజాన్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రైమ్ మెంబర్లు ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 22నే ఈ సేల్‌లో పాల్గొనవచ్చు.ఈ సేల్‌లో వన్ ప్లస్, శాంసంగ్, షావోమీ, ఐక్యూ ఫోన్ల కొనుగోలు దారులకు 40శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కొత్తగా మార్కెట్లో విడుదలైన రెడ్మీ 11 ప్రైమ్ 5జీ, ఐక్యూ జెడ్ 6 లైట్ 5జీ,ఐఫోన్ 14 సిరీస్ తో పాటు ఇతర స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇక ఇదే సేల్‌లో ల్యాప్‌ట్యాప్స్,స్మార్ట్ వాచెస్,హెడ్ ఫోన్స్‌తో పాటు ఇతర గాడ్జెట్స్‌పై 75శాతం డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సందర్భంగా ప్రతి 6 గంటలకొకసారి విడుదలయ్యే కొత్త ఆఫర్లతో కస్టమర్లు కొత్త కొత్త డీల్స్ అందిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. వన్‌ప్లస్ 9 ప్రోపై రూ.15వేల వరకు డిస్కౌంట్, స్మార్ట్ఫోన్లు,ఆండ్రాయిడ్ టీవీలలో అందుబాటులో ఉన్న ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నట్లు.. అదనంగా, క్రాస్‌బీట్స్ టార్, బోట్ ఎయిర్‌డోప్స్ 441 ప్రో వంటి టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్లు తగ్గింపు ధరలతో అందుబాటులోకి ఉండనున్నాయని అమెజాన్ పేర్కొంది. -
అమెజాన్, 10 లక్షల మంది ఏ రేంజ్ ఫోన్లు కొన్నారో తెలుసా..!
అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ సందర్భంగా ఈ ఫెస్టివల్ సేల్‌లో 79శాతం మంది కొత్త కస్టమర్లు టైర్‌టూ, త్రీ టైర్ నగరాల నుంచి షాపింగ్ చేశారని తెలిపింది. అంతేకాదు అమెజాన్‌లో మొత్తం 30వేల మంది అమ్మకం దార్లు లాభపడ్డారని, వారిలో 70శాతం మంది నాన్ మెట్రో నగరాలకు చెందినవారేనంటూ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ► ఈ సీజన్లో స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాలతో తమ ఇళ్లను భద్రపరచుకోవాలనే వినియోగదారుల ఆసక్తి పెరిగింది. కంపెనీ ప్రకారం, టాప్ బ్రాండ్ల నుండి మునుపటి కంటే ఎక్కువ సెక్యూరిటీ కెమెరాల అమ్మకాలు జరిగాయి. ► స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాలు, టీవీలు, ఫ్యాషన్, బ్యూటీ, కాస్మోటిక్స్ వస్తువులు ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసినట్లు తెలిపింది. ►తొలిసారి అమెజాన్‌లో 10 లక్షల మంది స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేశారని, వారిలో మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లలో 84 శాతం కంటే ఎక్కువ 5జీ ఫోన్లు ఉన్నట్లు చెప్పింది. ► లక్ష మంది కస్టమర్లు తొలిసారి అమెజాన్ నుండి మొక్కల కుండీలు, గార్డెనింగ్ టూల్స్, మట్టి సప్లిమెంట్లు, తోటపని ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ► అమెజాన్ ఎకో, ఫైర్ టీవీ పరికరాలు ఈ పండుగ సీజన్లో కస్టమర్లకు ఇష్టమైనవిగా కొనసాగుతున్నాయని, ఈ సమయంలో అమెజాన్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తుల్లో ఎకో డాట్ (3వ తరం), ఫైర్ టీవీ స్టిక్ (3వ తరం) ఉన్నాయని కంపెనీ తెలిపింది. ► అమెజాన్ అమ్మకందారులలోని స్థానిక దుకాణాలు 2 రెట్లు పెరిగాయి. ప్రతి నిమిషానికి 10కి పైగా ఉత్పత్తులను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. ► అమెజాన్ లాంచ్‌ప్యాడ్ ప్రోగ్రామ్‌లో అనుసందానంగా ఉన్న స్టార్టప్‌లు, బ్రాండ్లు ప్రతి 2.5 సెకన్లకు ఒక ప్రత్యేకమైన ప్రొడక్ట్‌లను విక్రయిస్తున్నాయని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ అన్నారు. చదవండి: అమెజాన్ బంపర్ ఆఫర్: బంగారం, వెండి నాణేలపై భారీ డిస్కౌంట్ -
ఈ ల్యాప్ ట్యాప్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా..
ల్యాప్ ట్యాప్ కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఏసర్ స్విఫ్ట్3 ల్యాప్ ట్యాప్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. అంతేకాదు వీటితో పాటు అమెజాన్ సేల్‌లో కొత్తగా విడుదలైన వెయ్యికి పైగా కొత్త గాడ్జెట్స్‌పై ఆఫర్లను అందిస్తుంది. 'ఏసర్ స్విఫ్ట్ 3' ఫీచర్లు ఏసర్ స్విఫ్ట్3 ల్యాప్‌ట్యాప్ 64బిట్,విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్ట్ చేస్తుంది. 1920x1080పి రెజెల్యూషన్‌తో 14 అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే,18జీబీ డీడీఆర్4 ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ, ఏఎండీ రైజెన్5 5500యూ హెక్సా-కోర్ ప్రాసెసర్‌ను అందిస్తుంది. హైక్వాలిటీ వీడియోల్ని రెండరింగ్ చేసేందుకు వీలుగా ఏఎండీ రేడియన్ గ్రాఫిక్స్, ఫాస్ట్‌గా డేటాను స్టోర్ చేసేందుకు ఎస్ఎస్డీ డ్రైవ్ కూడా ఉంది. వీటితో పాటు కలర్ కాంట్రాస్ట్ కోసం ఎల్ఈడీ బ్యాక్ కంఫైవ్యూ టెక్నాలజీని అందిస్తుంది.సెక్యూరిటీ పర్పస్ కోసం ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ,వాయిస్ అలర్ట్ ఇచ్చేందుకు అలెక్సా సౌకర్యం కూడా ఉంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు ఇక ఏసర్ స్విఫ్ట్3 ల్యాప్ ట్యాప్ ధర రూ.89,999 ఉండగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.30వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. పాత ల్యాప్‌ట్యాప్‌పై ఎక్ఛేంజ్ కింద రూ.18,100 వరకు ఆఫర్ పొందవచ్చు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను రూ.1,750 వరకు పొందవచ్చు.సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్, ఈఎంఐపై రూ.1,750, ఈఎంఐ సౌకర్యం లేని ట్రాన్సాక్షన్లపై రూ. 1,500 డిస్కౌంట్, రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ రూ. 500వరకు,ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.1,750 వరకు, ఈఎంఐ సౌకర్యం లేని ట్రాన్సాక్షన్లపై రూ.1,500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. చదవండి: ఈ ఆఫర్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు -
ఈ ఆఫర్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు
ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు వరుస బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.ప్రముఖ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్ కార్ట్లు నాలుగు రోజుల్లో రూ.20250 కోట్ల బిజినెస్ నిర్వహించినట్లు తెలిపింది. ముఖ్యంగా ఈ నాలుగు రోజుల వ్యవధిలో 50శాతం గాడ్జెట్స్, గృహోపకరణాల్ని కొనుగులు చేసినట్లు తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా అమెజాన్ పలు ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. యాపిల్ మాక్‌బుక్ ఎయిర్ గతేడాది యాపిల్ సంస్థ ఎం1 ఎస్‌ఓఎస్‌తో యాపిల్ మాక్ బుక్ ఎయిర్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.92,000 వేలు ఉండగా..ఫెస్టివల్ సేల్‌లో రూ.79,900కే సొంతం చేసుకోవచ్చు.ఇక పీ3 వైడ్ కలర్లో 13.3 అంగుళాల రెటీనా డిస్ప్లే, 8కోర్ సీపీయూ, 8కోర్ జీపీయూ, 16కోర్ న్యూరాల్ ఇంజిన్ ఫీచర్లు ఉన్నాయి. 8జీబీ మెమరీ ఎస్ఎస్డీ స్టోరేజ్‌ను అందిస్తుంది. ఏసర్ నైట్రో 5 15.6 అంగుళా 144హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌తో హెచ్డీ క్వాలిటీ డిస్ ప్లే 11జనరేషన్ మోడల్ ఇంటెల్ కోర్ ఐ5 - 11400 హెచ్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్..32 ఎక్స్‌పాండబుల్, 4జీబీ జీడీడీఆర్6 వీ ర్యామ్‌తో ఎన్విడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 3050, 256జీబీ పీసీఐఆ జెన్3 ఎన్వీఎంఈ ఎస్ఎస్డీ, 1 టెరాబైట్ 2.5 అంగుళాల ఆర్పీఎం హెచ్‌డీడీతో అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో దీని ధర రూ.లక్ష ఉండగా సేల్ లో రూ.69,990కే లభిస్తుంది. విక్టస్ బై హెచ్‌పీ 16.1 అంగుళా ఫుల్ హెచ్డీ క్వాలిటీతో మైక్రో ఎడ్జ్ స్క్రీన్ బ్రైట్ 250నిట్స్‌తో వస్తుంది. 5జనరేషన్ ఏఎండీ రైజెన్ 55600హెచ్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, నివిడియా జీఈఫోర్స్ జీటీఎక్స్ 1650 గ్రాఫిక్స్ కార్డ్, 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్‌తో మార్కెట్లో లభ్యం అవుతుండగా..ఈ ధర రూ.76,020 ఉంది.ఈ ఫెస్టివల్ సేల్‌లో రూ.61,990కే సొంతం చేసుకోవచ్చు. ఆసుస్ వివోబుక్ 14(2021) అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఆసుస్ వివోబుక్ 14 (2021 మోడల్) రూ.41,990కే లభిస్తుంది. 11జనరేషన్‌తో ఇంటెల్ కోర్ ఐ3-1115జీ4 ప్రాసెసర్, 8జీబీ డీడీఆర్4 ర్యామ్‌తో..256జీబీ ఎం.2 ఎన్వీఎంఈ పీసీఐఈ ఎస్ఎస్డీ ఫీచర్లు ఉన్నాయి. 2.5 అంగుళాలున్న ఈ వివోబుక్ ప్రస్తుతానికి విండోస్10లో పనిచేస్తుంది.విండోస్ 11కి అప్ గ్రేడ్ చేసుకునే సౌకర్యం ఉందని ఆసుస్ వివోబుక్ ప్రతినిధులు తెలిపారు. లెనోవో ఐడియాపా స్లిమ్5 300నిట్స్ బ్రైట్ నెస్‌తో 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్యానల్‌ను అందిస్తుంది. 11జెనరేషన్ ఇంటెల్ టైగర్ లేక్ కోర్ ఐ5-1135జీ7 ప్రాసెసర్, 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ ఫీచర్లు ఉండగా...విండోస్10కి సపోర్ట్ చేస్తుంది. ఉచితంగా విండోస్11కి అప్‌గ్రేడ్ అవ్వొచ్చు.ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ ఉన్న ఈ లెనోవో ఐడియాపాడ్ స్లిమ్5 ధర రూ.62,990గా ఉంది. -
స్మార్ట్ఫోన్లపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్ ఇవే...!
Amazon Great Indian Festival Flipkart Big Billion Days 2021 Best Offers On Mobile Phones: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ ను ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను అక్టోబర్ 3 నుంచి ఒక నెల రోజుల పాటు అమెజాన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 10 వరకు జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్ఫోన్లపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్‌పై ఒక లుక్కేయండి...! చదవండి: ప్రైమ్ యూజర్లకు బంపర్ఆఫర్ ప్రకటించిన అమెజాన్..! స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్...! ఆపిల్ ఐఫోన్ 11 గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కొనుగోలుదారులకు ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 38,999 కు లభించనుంది. స్మార్ట్‌ఫోన్ ఎక్సేచేంజ్‌పై సుమారు రూ. 12,350 తక్షణ డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. 64జీబీ ఆపిల్ ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 68,300. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువ ధరలో రూ. 36,990 కే కొనుగోలుదారులకు లభించనుంది. స్మార్ట్‌ఫోన్ ఎక్సేచేంజ్‌పై సుమారు రూ. 12,350 తక్షణ డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 74,999. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ కొనుగోలుదారులకు రూ. 32,999కు లభించనుంది. ఎక్సేచేంజ్‌పై సుమారు రూ. 12,350 తక్షణ డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 47,900. ఐక్యూ జెడ్3 5జీ వివో సబ్ బ్రాండ్ ఐనా ఐక్యూ కంపెనీ స్మార్ట్‌ఫోన్ ఐక్యూ జెడ్3 5జీ స్మార్ట్‌ఫోన్ (6జీబీ+128 జీబీ) వేరియంట్ కొనుగోలుదారులకు రూ. 17,990 కే లభించనుంది. అంతేకాకుండా 9 నెలల నో కాస్ట్ ఈఎమ్ఐ, ఆర్నెల్ల ఫ్రీ స్క్రీన్ రిప్లేస్మెంట్ను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 22,990. రెడ్మీ నోట్ 10ప్రో రెడ్మీనోట్ 10 ప్రో కొనుగోలుదారులకు రూ. 16,499 కే లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 19,999. స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్...! ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ బిగ్‌బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు రూ. 26, 999 కు లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 39, 900. గూగుల్ పిక్సెల్ 4ఏ బిగ్‌బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు రూ. 25,999 కు లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 31, 999. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ బండిల్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. గూగుల్ నెస్ట్ ను కేవలం రూ. 1, గూగుల్ పిక్సెల్ బడ్స్ ఏ సిరీస్‌ను కేవలం రూ. 4999కు అందించనుంది. అంతేకాకుండా కొనుగోలు సమయంలో యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుపై 10 శాతం తక్షణ తగ్గింపు కూడా రానుంది. పోకో ఎక్స్ 3 ప్రో పోకో ఎక్స్ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు రూ. 16,999కే అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 23, 999. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ రూ. 19,999కే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 24, 999. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం మేర తక్షణ తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. చదవండి: యాక్సిస్ బ్యాంకుతో షాపింగ్ చేస్తే 45 శాతం మేర క్యాష్‌బ్యాక్...! -
వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు...!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అక్టోబర్ 3 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్ఫోన్లపై, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను ప్రకటించనుంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు సంబంధించిన ఆఫర్లను, క్యాష్‌బ్యాక్ అమెజాన్ తన అధికారిక వెబ్సైట్లో టీజ్ చేస్తోంది. తాజాగా వన్‌ప్లస్ 9, 9 ప్రో మోడళ్లపై కొనుగోలుదారులకు భారీ తగ్గింపుతో అమెజాన్ అందించనుంది. అందుకు సంబంధించిన ఆఫర్‌ను అమెజాన్ తాజాగా టీజ్ చేసింది. చదవండి: జియో ఫోన్ లాంచ్‌కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్ అంబానీ కన్ను..! వన్‌ప్లస్ 9 ప్రో సుమారు 50 వేల కంటే తక్కువ ధరలో, వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్ 40 వేల కంటే తక్కువ ధరలో కొనుగోలుదారులకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో లభించనుంది. వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ ధర రూ. 64,999 కాగా, వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ ధర రూ. 54,999 గా ఉంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ 9, 9 ప్రో వేరియంట్లపై వరుసగా పదివేలు, 15 వేల డిస్కౌంట్లను అమెజాన్ అందించనుంది. 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12జీబీ, 256జీబీ వేరియంట్లలో వన్‌ప్లస్ 9 ప్రో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. వన్‌ప్లస్ 9 వేరియంట్ 8జీబీ, 12 జీబీ ర్యామ్స్తో కూడా లభించనున్నాయి. చదవండి: ఒక్కసారిగా పేలిన ఫోన్ ఛార్జర్...! స్పందించిన కంపెనీ...! -
నువ్వా..! నేనా..! అన్నట్లుగా అమెజాన్- ఫ్లిప్‌కార్ట్...! కస్టమర్లకు మాత్రం పండగే...!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అమెజాన్-ప్లిప్‌కార్ట్ సంస్థలు నువ్వానేనా...! అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్ల కోసం బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటించిన కొద్ది రోజులకే అమెజాన్ ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. చదవండి: వీటిపై ఇన్వెస్ట్ చేస్తే లాభాలే..లాభాలు...! అమెజాన్ తొలుత ది గ్రేట్ ఇండియన్ సేల్‌ను అక్టోబర్ 4 నుంచి ప్రారంభమౌతుందని ప్రకటించగా...ఇప్పుడు ఈ సేల్ ఒకరోజు ముందుగానే అక్టోబర్ 3నే జరపనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ముందుగానే ది గ్రేట్ ఇండియన్ సేల్‌లో పాల్గొనే అవకాశం ఉంది.ది గ్రేట్ ఇండియన్ సేల్ మాత్రం ఒక నెలపాటు జరగనున్నట్లు తెలస్తోంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్లిప్‌కార్ట్ అక్టోబర్ 7 నుంచి ప్రకటించగా..తిరిగి సేల్ డేట్ మారుస్తూ ఫ్లిప్‌కార్ట్ నిర్ణయం తీసుకుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 10 వరకు కొనసాగనుంది. దీంతో కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరి మధ్య నెలకొన్న పోటీ కస్టమర్లకు లాభం చేకురేలా విధంగా ఉంది. బిగ్‌బిలియన్ డేస్ సేల్, అమెజాన్ ది గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా కస్టమర్లకు ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్, మొబైల్ యాక్సెరీస్, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను ప్రకటించనున్నాయి. చదవండి: ప్రైమ్‌వీడియోస్‌లో డిస్కవరీ ప్లస్ ఇంకా మరెన్నో.. -
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో బంపర్ ఆఫర్లు
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021 అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీని అమెజాన్ తన అధికారిక వెబ్సైట్లో టీజ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ను ప్రకటించిన కొన్ని రోజులకే అమెజాన్ ప్రకటించడం విశేషం. అక్టోబర్ 4 నుంచి నెల రోజుల పాటు ఈ సేల్ నిర్వహించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఒక రోజు ముందుగానే డీల్స్‌ను అందుకునే అవకాశం ఉంటుంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్‌లో అమెజాన్ పోటీదారు ఫ్లిప్‌కార్ట్ కూడా పండుగ ఆఫర్లతో దూసుకు వస్తోంది. అక్టోబర్ నెల 7వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో కస్టమర్లను ఆకర్షించడం కోసం అమెజాన్ వివిధ మొబైల్ ఫోన్ మోడల్స్, యాక్ససరీలు, స్మార్ట్ వాచ్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు సహా గృహోపకరణాలపై డిస్కౌంట్లను సూచించే మైక్రోసైట్ రూపొందించింది. అమెజాన్ ఎకో, ఫైర్ స్టిక్, కిండ్లే డివైజ్‌లనూ తక్కువ ధరకే అందించనుంది. దీంతో పాటు యాపిల్, ఆసుస్, ఫాజిల్, హెచ్‌పీ, లెనోవో, వన్‌ప్లస్, శాంసంగ్, సోనీ, షావోమికి చెందిన వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులను సేల్‌లో భాగంగా లాంచ్ చేయనున్నారు.(చదవండి: ఎలక్ట్రిక్ వాహనదారుల ఛార్జింగ్ కష్టాలకు చెక్!) -
బ్లాక్‌బస్టర్ డీల్స్‌తో..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ త్వరలోనే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను జరపనుంది. గ్రేట్ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను అమెజాన్ తన అధికారిక వెబ్సైట్లో టీజ్ చేసింది. ఈ సేల్ తేదీలను అమెజాన్ ఇంకా ఖరారు చేయలేదు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ను ప్రకటించిన కొన్ని రోజులకే అమెజాన్ ప్రకటించడం విశేషం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దీపావళి పండుగ నేపథ్యంలో అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ మొదటి వారంలో ఈ సేల్‌ను అమెజాన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: Forbes Billionaires 2021: ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీ..? అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ 24 గంటలకు ముందే ఈ సేల్‌లో పాల్గొనవచ్చును. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లపై 30 శాతం, ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు, ఫ్యాషన్‌పై సుమారు 40 శాతం నుంచి 80 శాతం మేర ఆఫర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలుపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను అందించనుంది. ఫ్యాషన్ ఉత్పత్తుల కొనుగోలు అదనంగా రూ. 300 క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఫ్రీ స్క్రీన్ రిప్లేస్మెంట్ ఆఫర్‌ను అందించనుంది. ఫైర్ టీవీ స్టిక్, ఎకో డివైజెస్, కిండెల్ లాంటి అమెజాన్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందించనుంది. చదవండి: 20 నిమిషాల ఛార్జింగ్‌తో 482 కి.మీ ప్రయాణం..! -
స్మార్ట్ఫోన్లు, భారీ ఉపకరణాలకు డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో (జీఐఎఫ్) స్మార్ట్ఫోన్లు, భారీ ఉపకరణాలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు గణనీయంగా డిమాండ్ నెలకొందని ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ వెల్లడించారు. వన్‌ప్లస్, శాంసంగ్, యాపిల్, షావోమీ తదితర సంస్థల ఉత్పత్తులు భారీగా అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. ఈసారి జీఐఎఫ్‌కు మరింత స్పందన లభిస్తోందని, ప్రారంభమైన తొలి 48 గంటల్లో రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయని ఆయన తెలిపారు. చిన్న, మధ్య తరహా సంస్థలకు సంబంధించి 5,000 పైచిలుకు విక్రేతలు పాల్గొన్నారని తివారీ చెప్పారు. గతేడాది ఫెస్టివల్ సేల్ మొత్తం మీద అమ్ముడైన ఐఫోన్లకు మించి ఈసారి ఒక్కరోజులోనే అమ్ముడవడం గమనార్హమని తివారీ తెలిపారు. నవంబర్ 13 దాకా జరిగే ‘ఫినాలే డేస్’ సందర్భంగా భారీ ఉపకరణాలు, టీవీలపై 75 శాతం దాకా, గృహోపకరణాలపై 80 శాతం దాకా, స్మార్ట్ఫోన్లపై 40 శాతం దాకా డిస్కౌంట్లు ఇస్తున్నట్లు వివరించారు. అలాగే, కనీస ఆర్డర్ పరిమితికి లోబడి ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం బ్యాంక్ డిస్కౌంటు ఉంటుందని తెలిపారు. పెరిగిన విక్రేతలు.. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో గతంతో పోలిస్తే కొత్త విక్రేతల రిజిస్ట్రేషన్ల సంఖ్య 50 శాతం పెరిగిందని తివారీ వివరించారు. వ్యక్తిగత గ్రూమింగ్ ఉత్పత్తులు, స్టడీ ఫ్రం హోమ్‌కి అవసరమైన ఉత్పత్తులు, గృహోపకరణాలు మొదలైన వాటికి ఆర్డర్లు గణనీయంగా వస్తున్నాయన్నారు. కరోనా నేపథ్యంలో డిమాండ్‌కి అనుగుణంగా వేగవంతంగా, సురక్షితంగా ఉత్పత్తులను డెలివర్ చేయడానికి అమెజాన్ భారీ సన్నాహాలు చేసిందని తివారీ చెప్పారు. కొత్తగా దాదాపు 200 డెలివరీ స్టేషన్లు, వేలకొద్దీ డెలివరీ పార్ట్నర్స్ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న 8 స్టోర్ సెంటర్లను విస్తరించడంతో పాటు మరో అయిదింటిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పండుగ సీజన్ నేపథ్యంలో సుమారు 1,00,000 పైచిలుకు సీజనల్ ఉపాధి అవకాశాలు కల్పించగలిగామని చెప్పారు. -
ఐఫోన్‌పై అదిరిపోయే ఆఫర్
న్యూఢిల్లీ: ఐఫోన్ ప్రియులకు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ తీపి కబురు అందించింది. ‘గ్రేట్ ఇండియాన్ ఫెస్టివల్’ పేరిట ఈనెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు జరపనున్న సేల్స్‌లో ఐఫోన్లపై భారీగా తగ్గింపు ప్రకటించింది. యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్పై ఏకంగా రూ.10 వేలు తగ్గించింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు ముందుగా కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. తగ్గింపు తర్వాత ఐఫోన్ ఎక్స్ఆర్ 68 జీబీ మోడల్ రూ. 39,999, 128 జీబీ వేరియంట్ రూ. 44,999, 256 జీబీ ఫోన్ రూ.57,999 ధరలకు లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ పరిమిత సమయంలో మాత్రమే ఉంటుందని అమెజాన్ ఇండియా తెలిపింది. ఐఫోన్ ఎక్స్ఆర్ ఇంత తక్కువ ధరకు ఇంతకుముందెన్నడూ లభ్యం కాలేదని వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు కానివారు నెలకు రూ.129, సంవత్సరానికి రూ. 999 చెల్లించి సభ్యత్వం పొందవచ్చు. (చదవండి: అమెజాన్ పండగ ఆఫర్లు) ఐఫోన్ ఎక్స్ఆర్ ఫీచర్లు డ్యూయల్ సిమ్ 6.1 లిక్విడ్ రెటీనా ఎల్సీడీ డిస్ప్లే 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా రీచార్జ్‌బుల్ లిథియం ఐయాన్ బ్యాటరీ వైర్లెస్ చార్జింగ్, ఫేస్ ఐడీ వాటర్, డస్ట్ రెసిస్టింగ్ ఏ12 బయోనిక్ చిప్ ప్రాసెసర్ ఆరు రంగుల్లో లభ్యం -
భారీ ఆఫర్లతో అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’
న్యూఢిల్లీ: పండుగల సీజన్ సందర్భంగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్.. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ పేరిట ఆఫర్లను ప్రకటించింది. ఈనెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు ఆఫర్ ఉంటుందని తెలిపింది. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం కలిగినవారు సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 12 గంటలకే ఆఫర్లను అందుకోవచ్చు. భారత్‌లో ఆరేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా ఈసారి ఆఫర్లో భారీ డిస్కౌంట్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు పూర్తిచేసివారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఇస్తున్నట్లు వివరించింది. స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ పలు అధునాతన స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్, అదనపు క్యాష్‌బ్యాక్, ఎక్సే్ఛంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ, ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ వంటి ప్రత్యేక ఆఫర్లను గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో అందించనుంది. శాంసంగ్, వన్‌ప్లస్, షావోమీ, ఓపో, వివో వంటి ప్రఖ్యాత బ్రాండ్లు అందుబాటులో ఉండగా.. ఎక్సే్ఛంజ్ ఆఫర్ కింద రూ. 6,000 వరకు ఇవ్వనుంది. మొబైల్ కేసులు, కవర్ల ప్రారంభ ధర రూ. 69గా ప్రకటించింది. బ్లూ టూత్‌లపై 70 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. టీవీ, ఫ్రిజ్‌లపై భారీ తగ్గింపు గృహోపకరణాలు, టీవీలపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఉండనుంది. శాంసంగ్, ఎల్జీ, సోనీ వంటి బ్రాండెడ్ ఉత్పత్తులు ఈ విభాగంలో ఉన్నట్లు తెలిపింది. టాప్లోడ్ వాషింగ్ మెషిన్ ప్రారంభ ధర రూ. 9,999 కాగా, స్ప్లిట్ ఏసీలపై 45 శాతం వరకు తగ్గింపు ఉందని ప్రకటించింది. కిచెన్ ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు ఉండగా.. ఈ విభాగంలో 50వేలకు మించి ఉత్పత్తులు ఉండనున్నాయి. వీటిలో సగానికి పైగా వస్తువులపై 50 శాతం కనీస డిస్కౌండ్ ఉన్నట్లు వెల్లడించింది. రూ. 99 ప్రారంభ ధర నుంచి ఉత్పత్తులు ఉన్నట్లు తెలిపింది. ఫ్యాషన్‌పై 90 శాతం డిస్కౌంట్ లక్షకు మించిన ఫ్యాషన్ డీల్స్, 1200 బ్రాండ్స్ ఈసారి ప్రత్యేకతగా అమెజాన్ వెల్లడించింది. దుస్తులు, పాదరక్షలు, వాచీలపై 80 శాతం, నగలపై 90 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఇక నిత్యావసర వస్తువులు, ఆట బొమ్మలపై భారీ డిస్కౌంట్ ఉన్నట్లు తెలిపింది. బెస్ట్ సెల్లింగ్ బుక్స్‌పై 70 శాతం వరకు ఆఫర్ ఉన్నట్లు వెల్లడించింది. మీ చెంతకే ‘హౌస్ ఆన్ వీల్స్’.. దేశంలోని 13 నగరాల్లో ‘హౌస్ ఆన్ వీల్స్’ పేరిట 600 ఉత్పత్తులను వినియోగదారుల చెంతకే చేర్చనుంది. మూడు హెవీ కంటైనర్లను కలిపి రూపొందించిన ఈ ప్రత్యేక వాహనం ఢిల్లీ, విశాఖపట్నం, చెన్నై, మధుర, ఆగ్రా, లక్నో, ఇండోర్, అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా, కొచ్చిల్లో మొత్తం 6,000 కిలోమీటర్లు ప్రయాణించనుంది. -
మరోసారి అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ సేల్’
ఆన్లైన్ ఫెస్టివల్ సీజన్ సేల్స్ ఇంకా ముగియలేదు. గత కొన్ని రోజుల క్రితమే అమెజాన్ గ్రాండ్ సక్సెస్‌తో ముగించిన గ్రేట్ ఇండియన్ సేల్, మరోసారి ప్రారంభం కాబోతుంది. రెండో రౌండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 24 నుంచి మొదలవుతుందని అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ 24 అర్థరాత్రి నుంచి ప్రారంభమై, అక్టోబర్ 28 అర్థరాత్రి వరకు కొనసాగనుంది. రెండో రౌండ్ ఫెస్టివల్ సీజన్ సేల్‌లో ఎక్స్‌క్లూజివ్ లాంచ్‌లు, ఆఫర్లు ఉండనున్నాయి. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ఎల్ఈడీ టీవీలు, హోమ్ అప్లియెన్సెస్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి వాటిపై పలు డీల్స్‌ను ప్రకటించింది. బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు యూజర్లకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను తీసుకొస్తోంది. ఈ ఆన్లైన్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. అమెజాన్ పే యూజర్లకు రూ.250 విలువైన క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది. ఈ సేల్‌లో కొత్త అమెజాన్ కస్టమర్లందరికీ ఫ్రీ షిప్పింగ్ ఉండనుంది. ఈ సారి గ్రేట్ ఇండియన్ సేల్‌లో ప్రతి రోజూ రెడ్మి 6ఏ ఫ్లాష్ సేల్ నిర్వహించనుంది. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, మూడో జనరేషన్ ఎకో స్మార్ట్ స్పీకర్స్ ఆకర్షణీయమైన డిస్కౌంట్లో అందుబాటులోకి రానున్నాయి. అలెక్స్ ఆధారిత డివైజ్‌లకు 70 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. బెస్ట్ సెల్లింగ్ బుక్స్‌ను కేవలం రూ.19కే అమెజాన్ విక్రయిస్తోంది. ఈ సేల్‌ను కరెక్ట్‌గా దివాళిగా ముందు తీసుకొస్తోంది. గత కొన్ని రోజుల క్రితమే తొలి రౌండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగిసింది. ఇప్పుడు నిర్వహించబోయేది రెండో రౌండ్ ఫెస్టివల్ సేల్. -
వన్‌ప్లస్ 6పై భారీ డిస్కౌంట్
మరికొన్ని రోజుల్లో వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానున్న నేపథ్యంలో, వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌పై ఆ కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా ఈ డిస్కౌంట్‌ను అందించనున్నట్టు తెలిపింది. వన్‌ప్లస్ 6 బేస్ వేరియంట్(6జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్)ను అమెజాన్‌లో రూ.29,999కే అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొంది. వన్‌ప్లస్ 6 ఇతర వేరియంట్ల ధరలను కూడా తగ్గించింది ఆ కంపెనీ. 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.34,999కు, 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.38,999కు అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొంది. ఈ ధరలు, లాంచింగ్ ధరల కంటే 5వేల రూపాయలు తక్కువ. అంటే రూ.5000 మేర డిస్కౌంట్లో వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో లభిస్తుంది. వన్‌ప్లస్ 6టీ లాంచ్ అయిన తర్వాత ఆ డిస్కౌంట్‌ను శాశ్వతంగా అందించనుంది వన్‌ప్లస్ కంపెనీ. అక్టోబర్ 17న వన్‌ప్లస్ 6టీ లాంచ్ కాబోతుంది. వన్‌ప్లస్ 6టీకి అతిపెద్ద స్క్రీన్, టాప్‌లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్లో కంపెనీ అందించబోతుంది. అయితే ప్రస్తుతం డిస్కౌంట్ అందించిన వన్‌ప్లస్ 6 ఫీచర్లు ఏ విధంగా ఉన్నాయో ఓసారి చూడండి... ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీజెన్‌ఓఎస్ 5.1 డ్యూయల్-సిమ్(నానో) 6.28 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఫుల్ ఆప్టిక్ అమోలెడ్ డిస్ప్లే 84 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో గొర్రిల్లా గ్లాస్ 5 క్వాల్కామ్ 845 ఎస్ఓసీ 6జీబీ ర్యామ్ లేదా 8జీబీ ర్యామ్ 16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫేస్ అన్‌లాక్ ఫీచర్(0.4 సెకన్లలో అన్‌లాక్) వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 64జీబీ, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లు 3300ఎంఏహెచ్ బ్యాటరీ కాగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కాబోతుంది. ఆ సేల్ అక్టోబర్ 15 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, అతిపెద్ద ఉపకరణాలు, టీవీలు, హోమ్, కిచెన్ ప్రొడక్ట్‌లు, ఫ్యాషన్, కన్జ్యూమరబుల్ ప్రొడక్ట్‌లపై అమెజాన్ డిస్కౌంట్లు అందిస్తుంది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుంది. అమెజాన్ పే బ్యాలెన్స్‌లో రూ.300ను క్యాష్‌బ్యాక్‌గా అందిస్తుంది. -
10 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దసరా, దీపావళి సీజన్ సందర్భంగా భారీ ఆఫర్లు, డీల్స్‌తో ఈ నెల 10 నుంచి 15 వరకు ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ను నిర్వహిస్తున్నట్లు ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది. ఈ సారి కూడా తమ ప్రైమ్ కస్టమర్లకు ఈ డీల్స్‌ను, ఆఫర్లను ముందే చూసే అవకాశం ఉంటుందని తెలియజేసింది. స్మార్ట్ఫోన్లు, టీవీల వంటి గృహోపకరణాలు, హోమ్–కిచెన్ ఉత్పత్తులు, ఫ్యాషన్ వస్తువులతో పాటు గ్రోసరీ, కన్సూమర్ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తదితరాలపై ఈ 5 రోజులూ భారీ ఆఫర్లు కొనసాగుతాయని ఈ సందర్భంగా అమెజాన్ తెలియజేసింది. అక్టోబరు 10న అర్ధరాత్రి 12 గంటలకు మొదలయ్యే ఈ ఫెస్టివల్... అక్టోబరు 15 రాత్రి 11.59కి ముగుస్తుంది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లించేవారికి 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు అమెజాన్ వాలెట్లో సొమ్ము వేస్తే అదనంగా రూ.300 క్యాష్‌బ్యాక్ ఉంటుంది. -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ : బిగ్ సేల్స్‌తో ఒకేసారి పోటీ
రెండు ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. ఈ పండుగ సీజన్లో ఒకేసారి బిగ్ సేల్స్‌తో కస్టమర్ల ముందుకు వస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ తన అతిపెద్ద బిగ్ బిలియన్ డేస్ సేల్కు తెరలేపుతుండగా.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ధూంధాంగా నిర్వహించబోతుంది. ఈ రెండు సేల్స్ కూడా ఒకేసారి అంటే అక్టోబర్ 10 నుంచే ప్రారంభం కాబోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 10 నుంచి నిర్వహించబోతున్నట్టు ప్రకటించగానే.. అమెజాన్ సైతం తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను కూడా అక్టోబర్ 10 నుంచే ప్రారంభించబోతున్నట్టు పేర్కొంది. అక్టోబర్ 10న ప్రారంభమయ్యే అమెజాన్ సేల్, అక్టోబర్ 15 అర్థరాత్రితో ముగుస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ అక్టోబర్ 14తో క్లోజవుతుంది. ముందస్తు మాదిరిగానే అమెజాన్ స్మార్ట్ఫోన్లు, అతిపెద్ద ఉపకరణాలు, టీవీలు, హోమ్, కిచెన్ ఉత్పత్తులు, ఫ్యాషన్, గ్రోసరీ, బ్యూటీ, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ఆఫర్లను అందించనున్నట్టు ప్రకటించింది. ప్రైమ్ మెంబర్లకు ఈ సేల్ కాస్త ముందుగానే అందుబాటులోకి వస్తుంది. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్స్‌కు 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభించనుంది. అమెజాన్ పే బ్యాలెన్స్ కూడా 300 రూపాయలను క్యాష్‌బ్యాక్ రూపంలో అందించనుంది. బజాజ్ ఫిన్సర్వ్తో పాటు పలు బ్యాంక్‌లకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్, ఎక్స్చేంజ్ ఆఫర్లు, పలు స్మార్ట్‌పోన్లపై పూర్తి డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తుంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ నిర్వహించనున్న సేల్‌లో మొబైల్స్, గాడ్జెట్లు, టీవీలు, అతిపెద్ద ఉపకరణాలు వంటి అన్ని ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లను, ఆఫర్లను అందించనున్నట్టు చెప్పింది. ఈ ఏడాది తన కస్టమర్లకు బహుళ పేమెంట్ ఆప్షన్లపై ఆఫర్లను అందించడానికి మాస్టర్‌కార్డుతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు కూడా వెల్లడించింది ఫ్లిప్‌కార్ట్. దీని సేల్ ఐదు రోజులు కొనసాగనుంది. తొలి రోజు సేల్‌లో ఫ్యాషన్, టీవీ, అప్లియెన్స్, ఫర్నీచర్, స్మార్ట్ డివైజ్‌లపై ఆఫర్లను అందించనుంది. రెండో రోజు సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై బంపర్ డీల్స్‌ను ఆఫర్ చేస్తుంది. చివరి మూడు రోజులు అన్ని కేటగిరీల వస్తువులపై ఆఫర్లను ప్రకటించనుంది. సాధారణంగా సేల్‌లో భాగంగా అందించే డిస్కౌంట్లతో పాటు, ప్రతి గంట గంటకు ఫ్లాష్ సేల్స్, ఎనిమిది గంటలకు ఒక్కసారి కొత్త కొత్త డీల్స్‌ను ఆఫర్ చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ ఫెస్టివ్ సీజన్లో ఫ్లిప్‌కార్ట్ ఎక్కువ మొత్తంలో పేమెంట్ ఆప్షన్లను అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్లకు పేమెంట్ ఆఫర్లు, బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డులతో పాటు ఎంపిక చేసిన కార్డులకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, రూ.60వేల వరకు కార్డులెస్ పేమెంట్ వంటివి ఆఫర్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లలాగా.. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఎక్స్‌క్లూజివ్‌గా ముందస్తు యాక్సస్, సేల్ ప్రారంభం కావడానికి కంటే మూడు గంటల ముందే డీల్స్ యాక్సస్ లభిస్తాయి. ఫోన్‌పే యూజర్లు కూడా క్యాష్‌బ్యాక్ ఆఫర్ల యాక్సస్ పొందుతారు. ట్రావెల్, మొబైల్ రీఛార్జ్‌లపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుంది. ఈ సేల్ కోసం సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, విరాట్ కోహ్లితో ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీంతో ఈ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ మరింత ప్రమోట్ చేయనుంది. -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో డిస్కౌంట్ల పండుగ
సాక్షి, న్యూఢిల్లీ : మళ్లీ డిస్కౌంట్ల ఉత్సవం ప్రారంభం కాబోతుంది. ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండూ ఒకేసారి తన సేల్ ఆఫర్లకు తెరతీయబోతున్నాయి. అమెజాన్ తన తర్వాతి ఎడిషన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీలను బహిర్గతం చేసింది. అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 17 వరకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహించనున్నట్టు పేర్కొంది. అదే రోజుల్లో ఫ్లిప్‌కార్ట్ కూడా తన బిగ్ దివాలి సేల్‌ను నిర్వహిస్తోంది. అమెజాన్ ఈ దివాలి సేల్‌లో భాగంగా మొబైల్, యాక్ససరీస్, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, హెడ్ఫోన్లు, స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వంటి వాటిపై డీల్స్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుదారులకు ఈ సేల్‌లో అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా వచ్చేస్తుంది. 30వేల వరకు ఉత్పత్తులపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే రూ.500 క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు పేర్కొంది. మొబైల్ఫోన్లపై 40 శాతం వరకు, యాక్ససరీస్‌పై 80 శాతం వరకు, పవర్ బ్యాంకులపై 65 శాతం వరకు, మొబైల్ కేసులపై 80 శాతం వరకు, బ్లూటూత్ హెడ్సెట్లపై 20 శాతం వరకు తగ్గింపును ఇవ్వనుంది. ఇతర కేటగిరీ ఉత్పత్తులు టీవీలపై 40 శాతం వరకు, ల్యాప్‌టాప్‌లపై రూ.20వేల వరకు, హెడ్ఫోన్లు, స్పీకర్లపై 60 శాతం వరకు, స్టోరేజ్ డివైజ్‌లపై 50 శాతం వరకు, వీడియో గేమ్‌లపై 60 శాతం వరకు, నెట్వర్కింగ్ డివైజ్‌లపై 60 శాతం వరకు తగ్గింపును యూజర్లు పొందవచ్చు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోల్డెన్ అవర్స్ డీల్స్‌ను అమెజాన్ ఆఫర్ చేయనుంది. స్పెషల్ ధన్‌తెరాస్ ఆఫర్లు కూడా ఉన్నాయి. -
మరోసారి అమెజాన్ ఆఫర్ల పండుగ
సాక్షి, న్యూఢిల్లీ: దసరా పండుగ ఆఫర్లను ముగించిన పదిరోజుల్లోనే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌కు తెరతీసింది. దీపావళి కానుకగా నేటి నుంచి మళ్లీ అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ ఫెస్టివల్లో టాప్ బ్రాండ్స్లోని ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. రూ.4500 విలువ గల కిండ్లీపై కూల్స్ డీల్స్‌ను, సిటీ బ్యాంకు కార్డు యూజర్లపై అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌లను అందిస్తున్నట్టు అమెజాన్ చెప్పింది. మొబైల్ ఫోన్లు... ఈ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మొబైల్ ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపును, యాక్ససరీస్‌పై 80 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. రెడ్మి 4 ఫోన్లపై కస్టమర్లు రూ.1500 వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాక ఎక్స్చేంజ్పై అదనంగా రూ.500 తగ్గింపును ఆఫర్ చేస్తోంది. కొన్ని టాప్ డీల్స్... ఆసుస్ జెన్‌ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ రూ.11,999కే అందుబాటు(ఈ ఫోన్ అసలు ధర రూ.22,999) శాంసంగ్ గెలాక్సీ జే7(16జీబీ) స్మార్ట్‌ఫోన్ రూ.10,590కే విక్రయం(ఈ ఫోన్ అసలు ధర రూ.16,900) ఆపిల్ ఐఫోన్ 6(32జీబీ) స్మార్ట్‌ఫోన్ రూ.20,999కే అందుబాటు( అసలు ధర రూ.29,500) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ రూ.9999కే విక్రయం(అసలు ధర రూ.13,999) లార్జ్ అప్లియెన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్... వర్ల్‌పూల్, ఎల్జీ, శాంసంగ్, సోనీ, పానాసోనిక్, బీపీఎల్ వంటి బ్రాండుల టీవీలపై 40 శాతం వరకు, వాషింగ్ మిషన్లపై 35 శాతం వరకు, ఎయిర్కండీషన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్లను అమెజాన్ యూజర్లకు ఆఫర్ చేస్తోంది. బీపీఎల్ 32 అంగుళాల హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీని రూ.14,900కు (40శాతం తగ్గింపు), పానాసోనిక్ 40 అంగుళాల ఫుల్ హెచ్డీ ఎల్ఈడీ టీవీని రూ.26,990కు(39శాతం తగ్గింపు), శాంసంగ్ 32 అంగుళాల హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీపై 38 శాతం తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్లను కూడా ఈ దీపావళి సేల్‌లో భాగంగా తీసుకొచ్చింది. ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టయిల్... ఫ్యాషన్ రంగ విషయంలో అమెజాన్‌కు మార్కెట్లో బాగా పోటీ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా దుస్తులపై 80 శాతం వరకు, హ్యాండ్ బ్యాగ్స్, ఫుట్‌వేర్‌పై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్చేస్తోంది. వాచ్‌లపై 60 శాతం, మేకప్, బ్యూటీ ప్రొడక్ట్‌లపై 35 శాతం తగ్గింపును అందించనున్నట్టు అమెజాన్ ప్రకటించింది.