మరోసారి అమెజాన్‌ ఆఫర్ల పండుగ | Ten days after first festival, Amazon relaunches 80% online sale  | Sakshi
Sakshi News home page

మరోసారి ఆఫర్ల పండుగకు తెరతీసిన అమెజాన్‌

Published Wed, Oct 4 2017 10:39 AM | Last Updated on Wed, Oct 4 2017 4:23 PM

Ten days after first festival, Amazon relaunches 80% online sale 

సాక్షి, న్యూఢిల్లీ: దసరా పండుగ ఆఫర్లను ముగించిన పదిరోజుల్లోనే ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరోసారి గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌కు తెరతీసింది. దీపావళి కానుకగా నేటి నుంచి మళ్లీ అమెజాన్‌ ఇండియా గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తోంది. ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ ఫెస్టివల్‌లో టాప్‌ బ్రాండ్స్‌లోని ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. రూ.4500 విలువ గల కిండ్లీపై కూల్స్‌ డీల్స్‌ను, సిటీ బ్యాంకు కార్డు యూజర్లపై అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌లను అందిస్తున్నట్టు అమెజాన్‌ చెప్పింది. 
 

మొబైల్‌ ఫోన్లు...
ఈ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ మొబైల్‌ ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపును, యాక్ససరీస్‌పై 80 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. రెడ్‌మి 4 ఫోన్లపై కస్టమర్లు రూ.1500 వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాక ఎక్స్చేంజ్‌పై అదనంగా రూ.500 తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది.
 

కొన్ని టాప్‌ డీల్స్‌...
ఆసుస్‌ జెన్‌ఫోన్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ రూ.11,999కే అందుబాటు(ఈ ఫోన్‌ అసలు ధర రూ.22,999)
శాంసంగ్‌ గెలాక్సీ జే7(16జీబీ) స్మార్ట్‌ఫోన్‌ రూ.10,590కే విక్రయం(ఈ ఫోన్‌ అసలు ధర రూ.16,900)
ఆపిల్‌ ఐఫోన్‌ 6(32జీబీ) స్మార్ట్‌ఫోన్‌ రూ.20,999కే అందుబాటు( అసలు ధర రూ.29,500)
మైక్రోమ్యాక్స్‌ కాన్వాస్‌ ఇన్‌ఫినిటీ రూ.9999కే విక్రయం(అసలు ధర రూ.13,999)

లార్జ్‌ అప్లియెన్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌...
వర్ల్పూల్, ఎల్‌జీ, శాంసంగ్‌, సోనీ, పానాసోనిక్‌, బీపీఎల్‌ వంటి బ్రాండుల టీవీలపై 40 శాతం వరకు, వాషింగ్‌ మిషన్లపై 35 శాతం వరకు, ఎయిర్‌కండీషన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్లను అమెజాన్‌ యూజర్లకు ఆఫర్‌ చేస్తోంది. బీపీఎల్‌ 32 అంగుళాల హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ టీవీని రూ.14,900కు (40శాతం తగ్గింపు), పానాసోనిక్‌ 40 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీని రూ.26,990కు(39శాతం తగ్గింపు), శాంసంగ్‌ 32 అంగుళాల హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ టీవీపై 38 శాతం తగ్గింపును అమెజాన్‌ అందిస్తోంది.  నో కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్చేంజ్‌ ఆఫర్లను కూడా ఈ దీపావళి సేల్‌లో భాగంగా తీసుకొచ్చింది. 

ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌స్టయిల్‌...
ఫ్యాషన్‌ రంగ విషయంలో అమెజాన్‌కు మార్కెట్లో బాగా పోటీ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో భాగంగా దుస్తులపై 80 శాతం వరకు, హ్యాండ్‌ బ్యాగ్స్‌, ఫుట్‌వేర్‌పై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్‌చేస్తోంది. వాచ్‌లపై 60 శాతం, మేకప్‌, బ్యూటీ ప్రొడక్ట్‌లపై 35 శాతం తగ్గింపును అందించనున్నట్టు అమెజాన్‌ ప్రకటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement