
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పోటాపోటీ
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా సెప్టెంబర్ 26 నుంచి వార్షిక పండుగ సేల్ ప్రారంభించనున్నాయి. 27 నుంచి అందరికీ సేల్ అందుబాటులోకి వస్తుందని, అంతకన్నా 24 గంటల ముందు తమ పెయిడ్ సబ్‌స్క్రయిబర్స్‌కు యాక్సెస్ లభిస్తుందని ఇరు సంస్థలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి.
ది బిగ్ బిలియన్ డేస్ (టీబీబీడీ) 2024 పేరిట ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (ఏజీఐఎఫ్) పేరుతో అమెజాన్ ఇండియా వీటిని నిర్వహించనున్నాయి. 20 నగరాలవ్యాప్తంగా 2 లక్షల పైచిలుకు ప్రోడక్టు కేటగిరీల్లో ఉత్పత్తులను అదే రోజున అందించేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈసారి విక్రేతలకు 20 శాతం అధికంగా రివార్డులు ఉంటాయని పేర్కొంది. మరోవైపు, ఏజీఐఎఫ్‌లో భాగంగా 14 లక్షల మంది పైగా విక్రేతలు, ప్రోడక్టులను విక్రయించనున్నట్లు అమెజాన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment