e-commerce
-
వి వాంట్.. డిస్కౌంట్
సాక్షి, అమరావతి: డిస్కౌంట్.. కొద్దికాలంగా భారతీయులను అత్యంత ఎక్కువగా ఆకర్షించే పదం ఇది. గతంలో కంటే ఎక్కువగా వినియోగదారులు డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా పండుగ సీజన్లలో ఇచ్చే డిస్కౌంట్ల కోసం చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. దేశంలో 70 శాతానికి పైగా అమ్మకాలు డిస్కౌంట్ల వల్లే జరుగుతున్నాయి. దుస్తులు, ఎలక్ట్రానిక్, గృహోపకరణ వస్తువులను 50 శాతానికిపైగా డిస్కౌంట్ ఉన్నప్పుడే ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. ఇలా 2024 పండుగ సీజన్లలోనే రూ.4.25 లక్షల కోట్ల అమ్మకాలు జరిగినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. ముఖ్యంగా దీపావళి, దసరా పండుగుల సీజన్లలో కొనుగోళ్లు ఇంకా ఎక్కువగా ఉంటున్నాయని, ఆ సమయంలో వివిధ బ్రాండ్లు ఇచ్చే డిస్కౌంట్లు, చేసే ప్రమోషన్లు కొనుగోళ్లను బాగా ప్రభావితం చేస్తున్నాయని వెల్లడించింది. మొబైల్ షాపింగ్‌కి పెరుగుతున్న ఆదరణఆన్లైన్ షాపింగ్‌లోనూ మొబైల్ షాపింగ్ అంతకంతకు పెరుగుతోంది. ఈ–కామర్స్ అమ్మకాలు పెరగడంలో మొబైల్ షాపింగ్ ఎక్కువగా ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రిటైల్ అమ్మకాల్లో 50 శాతం మొబైల్ షాపింగ్ ద్వారానే జరుగుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ అమ్మకాల్లో ముందున్నాయి. ఇలాంటి సంస్థలు సోషల్ మీడియా ద్వారానే వినియోగదారులకు దగ్గరవుతున్నాయి. వారి అభిరుచులకు తగ్గట్టు వ్యూహాలు మార్చుకుంటూ అన్ని రకాల వస్తువుల అమ్మకాలను పెంచుకుంటున్నాయి.ఆన్లైన్ షాపింగ్‌కే ఓటు..గతంలో మాదిరిగా షాపులకు వెళ్లి కావాల్సినవి కొనుగోలు చేయడం కంటే ఇంట్లోనే కూర్చుని ఆఫర్లు ఉన్నప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది. డిస్కౌంట్‌తోపాటు డోర్ డెలివరీ అనేది కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తోందని తెలిపింది. ప్రజల అభిరుచి మేరకు వివిధ రకాల వస్తువులను అందించే ఆన్లైన్ స్టోర్లు, పోర్టల్స్ పెరిగిపోయాయి. రోజువారీ నిత్యావసర వస్తువుల నుంచి అత్యాధునిక సాంకేతికత వరకు అన్ని రకాల ఉత్పత్తులను సులభంగా కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తున్నాయి.ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు పెరగడం వెనుక పండుగ షాపింగ్ అత్యంత కీలకంగా ఉంటోంది. సెలవుల సీజన్లలో వివిధ కంపెనీలు తరచూ కొత్త వాటితోపాటు పాత స్టాకుపై గణనీయమైన తగ్గింపులను ఇస్తున్నాయి. క్యాష్ బ్యాక్ డీల్స్, బై వన్– గెట్ వన్, బై టు–గెట్ త్రీ వంటి ఆఫర్లతో అదనపు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్’, మింత్రాలో ‘ఫ్లాష్ సేల్స్‘, అమెజాన్‌లో ‘గ్రేట్ ఫెస్టివ్ సేల్‘ వంటి పేర్లతో విస్తృతంగా అమ్మకాలు చేపడుతున్నాయి. ఇలాంటి సంస్థల మార్కెటింగ్ వ్యూహాలు అమ్మకాల పెరుగుదలకు బాగా దోహదం చేస్తున్నాయి. దేశంలోని సంస్కృతి, సంప్రదాదాలు, సెలవు రోజులు, ప్రజల మూడ్‌కు అనుగుణంగా భారతీయులకు దగ్గరవుతూ అమ్మకాలను ఈ సంస్థలు రోజురోజుకూ పెంచుకుంటున్నాయి. -
షీఇన్లో రిలయన్స్ ఉత్పత్తులు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ వేదిక అయిన షీఇన్ ఇండియా ఫాస్ట్ ఫ్యాషన్ యాప్‌లో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అనుబంధ కంపెనీ నెక్ట్స్‌జెన్ ఫాస్ట్ ఫ్యాషన్ తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. భారత్‌కు చెందిన రెడీమేడ్స్ తయారీ కంపెనీల నుంచి ఈ ఉత్పత్తులను నెక్సŠట్జెన్ కొనుగోలు చేస్తోందని పరిశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలు వీటిలో ఉన్నాయని చెప్పారు. అయిదేళ్ల నిషేధం తర్వాత రిలయన్స్ రిటైల్ ద్వారా షీఇన్ భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించింది. ‘కొత్త షీఇన్ ఇండియా ఫాస్ట్ ఫ్యాషన్ యాప్ భారత్‌లో రూపుదిద్దుకుంది. దీని యాజమాన్యం, నియంత్రణ ఎల్లప్పుడూ రిలయన్స్ రిటైల్ చేతుల్లోనే ఉంటుంది. భారత కంపెనీలో షీఇన్‌కు వాటా లేదు. భారత్ నుంచి అప్లికేషన్‌ను నడిపిస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి వచి్చన షీఇన్ ఇండియా ఫాస్ట్ ఫ్యాషన్ యాప్‌తో షీఇన్ గతంలో నిర్వహించిన షీఇన్.ఇన్ వెబ్‌సైట్‌తో సంబంధం లేదు’ అని ఆయన చెప్పారు. అయిదేళ్ల నిషేధం తర్వాత.. రిలయన్స్ రిటైల్ నుండి షీఇన్ ఇండియా ఫాస్ట్ ఫ్యాషన్ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో 10,000కి పైగా డౌన్లోడ్స్ నమోదయ్యాయి. యాపిల్ స్టోర్‌లో ఫ్యాషన్ ఈ–కామర్స్ కంపెనీల్లో టాప్ 10లో స్థానం పొందింది. చైనాతో ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత జూన్ 2020లో ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిషేధించిన యాప్‌లలో షీఇన్ ఒకటి. భారత్‌లో దాదాపు మూడు సంవత్సరాల నిషేధం తర్వాత బిలియనీర్ ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్‌తో షీఇన్‌ను ప్రమోట్ చేస్తున్న రోడ్గెట్ బిజినెస్ 2023లో భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్వదేశీ ఈ–కామర్స్ రిటైల్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడానికి రోడ్గెట్ బిజినెస్‌తో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ సాంకేతిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ నుంచి వచి్చన అభ్యర్థన మేరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించిన అనంతరం ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ప్రతిపాదనపై ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని పరిశ్రమ ప్రతినిధి వివరించారు. -
ఇక ఈ–కామర్స్ గాడిలో..
న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ను మరింత జవాబుదారీగా చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ షాపింగ్ రంగంలో మోసపూరిత పద్ధతుల నుండి వినియోగదారులను రక్షించడానికి.. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌కు స్వీయ–నియంత్రణ చర్యలను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ’ఈ–కామర్స్–ప్రిన్సిపుల్స్ అండ్ గైడ్‌లైన్స్ ఫర్ సెల్ఫ్ గవర్నెన్స్’ పేరుతో ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఈ నియమాలను రూపొందించింది. భాగస్వాముల నుంచి ఫిబ్రవరి 15లోపు అభిప్రాయాలను కోరింది. లావాదేవీకి ముందు, ఒప్పందం, కొనుగోలు తదనంతర దశలను కవర్ చేస్తూ మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టారు. ఈ నియమాలు అమలులోకి వస్తే కస్టమర్లు, ఈ–కామర్స్ కంపెనీల మధ్య జరిగే లావాదేవీల్లో పారదర్శకత మరింత పెరగనుంది. నిషేధిత ఉత్పత్తుల విక్రయాలకు అడ్డుకట్ట పడుతుంది. అట్టి ఉత్పత్తులు ఏవైనా లిస్ట్ అయితే ఫిర్యాదులకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మార్గదర్శకాల ప్రకారం.. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా వ్యాపార భాగస్వాముల సంపూర్ణ కేవైసీని నిర్వహించాలి. ముఖ్యంగా థర్డ్ పార్టీ విక్రేతల పూర్తి వివరాలు ఉండాల్సిందే. ఉత్పత్తుల ప్రయోజనం, ఫీచర్లను అంచనా వేయడంలో వినియోగదారులకు సహాయం చేయడానికి టైటిల్, విక్రేత చిరునామా, గుర్తింపు సంఖ్య, వీడియోల వంటి సపోరి్టంగ్ మీడియాతో సహా వివరణాత్మక ఉత్పత్తి జాబితాను తప్పనిసరి చేస్తారు. ఉత్పత్తులు దిగుమతి చేసుకున్నట్టయితే దిగుమతిదారు వివరాలు, ప్యాకింగ్ చేసిన కంపెనీ, విక్రేతల వివరాలు ఉండాల్సిందే. ప్రాసెసింగ్ చార్జీలు ముందే వెల్లడించాలి. ఒప్పంద సమయంలో కస్టమర్ సమ్మతి, లావాదేవీని సమీక్షించే అవకాశం, క్యాన్సలేషన్‌కు, ఉత్పత్తి వెనక్కి ఇవ్వడానికి, రిఫండ్స్‌కు పారదర్శక విధానం అమలు చేయాల్సి ఉంటుంది. లావాదేవీల పూర్తి వివరాలను నమోదు చేయాలి. చెల్లింపులు పూర్తి సురక్షితంగా జరిగేలా పేమెంట్ సిస్టమ్ అమలులోకి తేవాలి. చట్టాలకు లోబడి కస్టమర్లకు ఈ సమాచారం అందుబాటులో ఉంచాలి. విక్రేతలందరినీ కంపెనీలు సమానంగా చూడాల్సిందే. ఏ విక్రేతకూ ప్రాధాన్యత ఇవ్వకూడదు. -
బుద్ధుడిలా ట్రంప్ విగ్రహాలు
డొనాల్డ్ ట్రంప్. ఎప్పుడూ కాసింత చిరాకు ప్రతిబింబించే ముఖం. అలాంటి ముఖానికి హాంగ్ జిన్ షి అనే చైనా గ్రామీణ కళాకారుడు బుద్ధుడి ప్రశాంతతను ఆపాదించాడు. శాంతచిత్తంతో ఉన్న ట్రంప్ విగ్రహాలను తయారు చేశాడు. బుద్ధుని మాదిరిగా కళ్లు మూసుకుని దైవ చింతనలో కూర్చుని ఉన్న విగ్రహాలను పింగాణీతో రూపొందించాడు. సైజును బట్టి వీటిని 140 నుంచి 2,700 డాలర్ల దాకా విక్రయిస్తున్నాడు. 2021లో ఇ–కామర్స్ ప్లాట్‌ఫాం టావోబావోలో వైరలైన ఈ ట్రంప్ విగ్రహాలు ఆయన రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో మరోసారి ఆకర్షిస్తున్నాయి. సరదాగా మొదలెట్టి... 47 ఏళ్ల హాంగ్ ఇప్పటిదాకా కొన్ని వందల సిరామిక్ వస్తువులను తయారు చేశాడు. ‘‘రాజకీయ నాయకులు సాధారణంగా బోరింగ్‌గా ఉంటారు. కానీ ట్రంప్ అందుకు భిన్నమైన నేత. అందుకే తొలుత సరదాగా ఆయన విగ్రహాలను రూపొందించా. ట్రంప్ వ్యక్తిత్వం, విగ్రహం ఆకారం పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. దాంతో వాటిని కొనేందుకు బాగా ఇష్టపడుతున్నారు’’అని చెప్పుకొచ్చాడు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’నినాదంతో ట్రంప్ గెలిస్తే, హాంగ్ మాత్రం ప్రతి విగ్రహం ప్యాక్‌పైనా ‘మీ కంపెనీని మళ్లీ గొప్పగా చేయండి’అని రాస్తున్నాడు. దీన్ని అనుసరిస్తూ అమెరికాలో పలు ఆన్లైన్ షాపింగ్ ఫ్లాట్‌ఫాంలలో కొన్ని వెర్షన్లు వచ్చాయి. ట్రంప్ పాలనలో ప్రధాన పాత్ర పోషించనున్న కుబేరుడు ఎలాన్ మస్క్ విగ్రహాన్ని కూడా హాంగ్ డిజైన్ చేస్తున్నాడు. అందులో మస్‌్కను ఐరన్ మ్యాన్‌గా చూపిస్తున్నాడు. ట్రంప్‌కు చైనాలో ఇప్పటికీ చాలామంది అభిమానులున్నారని చెప్పాడు చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డిజిటల్ కామర్స్‌లో విప్లవం.. విస్తరిస్తున్న ఓఎన్డీసీ
చిన్న వ్యాపారాల కోసం డిజిటల్ కామర్స్‌ను (Digital Commerce) అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) విస్తరిస్తోంది. ఈ ప్లాట్ఫామ్లో ఇప్పటివరకు 7 లక్షలకుపైగా విక్రేతలు, సర్వీస్ ప్రొవైడర్లు నమోదయినట్లు కేంద్రం వెల్లడించింది.2021లో ప్రభుత్వం చొరవతో ఓఎన్డీసీ ప్రారంభమైంది. చిన్న రిటైలర్లు తమ వ్యాపారాన్ని ఆన్లైన్లో విస్తరించుకోవడానికి ఓఎన్డీసీ దోహదపడుతుంది. ఈ–కామర్స్ (e-Commerce) రంగంలో పెద్ద సంస్థల ఆధిపత్యాన్ని ఈ ప్లాట్‌ఫామ్ తగ్గిస్తుంది. అన్ని రకాల ఈ–కామర్స్ కోసం ఓపెన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు దీని లక్ష్యం. లాభాపేక్షలేకుండా ఇది సేవలను అందిస్తోంది.విక్రేతలు, లాజిస్టిక్స్ ప్రొవైడర్లు, లేదా పేమెంట్ గేట్‌వే ఆపరేటర్లు స్వచ్ఛందంగా అనుసరించాల్సిన ప్రమాణాలను ఇందులో పొందుపరచడం జరిగింది. ఓఎన్డీసీ చిన్న వ్యాపారాలను బలోపేతం చేయడంలో అలాగే ఈ–కామర్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఓఎన్డీసీ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.గత మూడు సంవత్సరాల్లో ఓఎన్డీసీ చిన్న వ్యాపారాలకు విస్తృత స్థాయి వేదికను కల్పించినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. ఓఎన్డీసీ ఇప్పటి వరకూ 200 నెట్వర్క్ భాగస్వామ్యులతో 150 మిలియన్ల లావాదేవీలు పూర్తి చేసింది.ఓఎన్డీసీ అనేది ఈ-కామర్స్‌కు యూపీఐ లాంటిది. ఆన్లైన్ పేమెంట్స్‌లో యూపీఐ ఒక సంచలనం. అలాగే ఈ-కామర్స్‌లోనూ ఓఎన్డీసీ విప్లవం తీసుకురానుంది. ఇది ఈజీ యాక్సెస్ ట్రేడింగ్ యాప్ సిస్టమ్ అన్నమాట. చిన్న వ్యాపారాలను ప్రొత్సహించడం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్‌లకు ఇది చెక్ పెట్టనుంది. ఈ-కామర్స్ సాధారంగా రెండు పద్ధతుల్లో పని చేస్తుంది. ఒకటి ఇన్వెంటరీ మోడల్, రెండోది మార్కెట్ ప్లేస్ మోడల్. ఇన్వెంటరీ మోడల్ అంటే ఉత్పత్తిదారుల నుంచి నేరుగా వస్తువులను కొని కస్టమర్లకు అమ్ముతారు. మార్కెట్ ప్లేస్ మోడల్ అంటే ఇండిపెండెంట్ బయ్యర్లు, సెల్లర్లు ఉంటారు. వీటిని వెబ్సైట్, మెుబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేస్తారు. -
ఈ–కామర్స్‌కు పోటీగా క్విక్ కామర్స్
న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంప్రదాయ ఈ–కామర్స్ దిగ్గజాలకు క్విక్ కామర్స్ పోటీనిస్తుందని జెప్టో కో–ఫౌండర్, సీఈవో ఆదిత్ పాలీచా అన్నారు. భారత్‌లో అమెజాన్/ఫ్లిప్‌కార్ట్ స్థాయి ఫలితాన్ని సృష్టించగల సామర్థ్యాన్ని క్విక్ కామర్స్ కలిగి ఉందని 2024లో ప్రజలు గ్రహిస్తారని జెప్టో గతేడాది ప్రకటించిందని నూతన సంవత్సరం సందర్భంగా లింక్డ్ఇన్లో చేసిన పోస్టులో ఆయన గుర్తు చేశారు. 2025లో క్విక్ కామర్స్ కూడా ఈ–కామర్స్‌తో పోల్చదగిన స్థాయిని చేరుకుంటుందని తెలిపారు. ఐపీవో బాటలో ఉన్న జెప్టో 2023–24లో నిర్వహణ ఆదాయం 120 శాతం పెరిగి రూ.4,454 కోట్లకు చేరుకుంది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జోమాటో బ్లింకిట్ వంటి పోటీ కంపెనీలను అధిగమించింది. ప్రతి కంపెనీకి సవాలు.. కార్యకలాపాలను అసాధారణంగా అమలు చేయడంపై క్విక్ కామర్స్ విజయం ఆధారపడి ఉంటుందని ఆదిత్ నొక్కిచెప్పారు. ఆ స్థాయిలో అమలు చేయడం ప్రతి కంపెనీకి ఒక సవాలుగా ఉంటుందని అన్నారు. ‘2025లో క్విక్ కామర్స్ యొక్క ప్రాథమిక అంశాలు నాటకీయంగా అభివృద్ధి చెందుతాయి. కస్టమర్ చేసే చెల్లింపులకు తగ్గ విలువ మరింత వేగంగా పెరుగుతుంది. నిర్వహణ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆర్థికాంశాలు, కార్యక్రమాలు మారతాయి. 2023, 2024తో పోలిస్తే ఈ పరిశ్రమకు క్యాపిటల్ మార్కెట్ వాతావరణం కూడా భిన్నంగా కనిపిస్తుంది’ అని అన్నారు. నమ్మశక్యం కాని రీతిలో 2025 ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జెప్టో వేదికగా నూతన సంవత్సర అమ్మకాల్లో 200 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించారు. రికార్డుల న్యూ ఇయర్.. డిసెంబర్ 31న అత్యధిక విక్రయాలను సాధించామని బ్లింకిట్ ప్రకటించింది. ఒక నిమిషంలో, ఒక గంటలో అత్యధిక ఆర్డర్లతోపాటు.. ఒక రోజులో డెలివరీ భాగస్వాములు అందుకున్న టిప్స్ సైతం అత్యధికమని బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధిండ్సా మైక్రో–బ్లాగింగ్ సైట్ ఎక్స్ వేదికగా తెలిపారు. అర్ధరాత్రి 12 ద్రాక్ష పండ్లను తినే సంప్రదాయాన్ని భారతీయులు స్వీకరించినందున నూతన సంవత్సర వేడుక రోజున ఒక రోజులో అత్యధికంగా ద్రాక్షలను విక్రయించినట్లు బ్లింకిట్ పేర్కొంది. స్పానిష్ సంస్కృతిలో పాతుకుపోయిన ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారిందని వివరించింది. -
క్విక్ కామర్స్‌లోకి మింత్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా క్విక్ కామర్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ’ఎం–నౌ’ పేరుతో 30 నిమిషాల్లోనే ఉత్పత్తులను డెలివరీ చేయనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం బెంగళూరులో ఈ సేవలను అందిస్తోంది. రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా మెట్రో, నాన్–మెట్రో నగరాల్లో విస్తరించడానికి సిద్ధంగా ఉన్నామని మింత్రా సీఈవో నందిత సిన్హా తెలిపారు. ఉత్పత్తుల కొనుగోలు కోసం సమయం వృ«థా కాకుండా ఎం–నౌ సౌకర్యవంతమైన పరిష్కారం అని చెప్పారు. అంతర్జాతీయ, దేశీయ బ్రాండెడ్ లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను వినియోగదార్లు కేవలం 30 నిమిషాల్లోనే అందుకోవచ్చని కంపెనీ ప్రకటన తెలిపింది. ఫ్యాషన్, బ్యూటీ, యాక్సెసరీస్, గృహ విభాగంలో 10,000 కంటే ఎక్కువ ఉత్పత్తుల శ్రేణిని ప్రస్తుతం ఎం–నౌ లో అందిస్తోంది. 3–4 నెలల్లో ఈ సంఖ్యను లక్షకు పైచిలుకు చేర్చనున్నట్టు మింత్రా వెల్లడించింది. మార్పిడి, వెనక్కి ఇచ్చే సౌకర్యం.. నవంబర్‌లో బెంగళూరులో మింత్రా క్విక్ కామర్స్ పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించింది. పైలట్ ప్రాజెక్టులో కస్టమర్ల నుంచి సానుకూల స్పందన లభించిందని సిన్హా వ్యాఖ్యానించారు. ఇది ప్రారంభం మాత్రమేనని, మరింతగా విస్తరిస్తామని చెప్పారు. ఇతర క్విక్ కామర్స్ కంపెనీల మాదిరిగా కాకుండా ఉత్పత్తుల మార్పిడి, వెనక్కి ఇచ్చే సౌకర్యం కూడా ఉందని నందిత వెల్లడించారు. కాగా, మెట్రో నగరాల్లో మింత్రా ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవలకు 2022లో శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఆర్డర్ పెట్టిన 24–48 గంటల్లో ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. మరోవైపు క్విక్ కామర్స్ రంగంలో ఉన్న సంస్థలు బ్యూటీ, ఫ్యాషన్ విభాగాలను జోడిస్తున్న తరుణంలో.. క్విక్ కామర్స్ లోని ఎంట్రీ ఇస్తున్న తొలి ఫ్యా షన్ ప్లాట్‌ఫామ్ మింత్రా కావడం గమనార్హం. -
ఫుడ్ డెలివరీకి కొత్త రూల్..
ఆహారోత్పత్తులు విక్రయించే ఈ–కామర్స్ కంపెనీలకు ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కొత్త నిబంధన విధించింది. ఏదైనా ఆహారోత్పత్తి గడువు ముగిసే తేదీకి కనీసం 30 శాతం లేదా 45 రోజులు ముందుగా కస్టమర్‌కు చేరాలని స్పష్టం చేసింది. అంటే షెల్ఫ్ లైఫ్ కనీసం 45 రోజులు ఉన్న ఉత్పత్తులను డెలివరీ చేయాల్సి ఉంటుంది.కాలం చెల్లిన, గడువు తేదీ సమీపిస్తున్న ఉత్పత్తుల డెలివరీలను కట్టడి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ & సర్టిఫికేషన్‌కి మద్దతుగా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని కూడా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ సూచించినట్లు తెలుస్తోంది. కల్తీని నివారించడానికి ఆహారం, ఆహారేతర వస్తువులను వేర్వేరుగా డెలివరీ చేయాలని స్పష్టం చేసింది.గడువు ముగిసే ఆహార ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించిన సమస్యలు ఇటీవల అధికమయ్యాయి. ముఖ్యంగా డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డెలివరీ అయ్యే వస్తువులపై గడువు తేదీలు ఉండటం లేదంటూ అనేక ఫిర్యాదు వచ్చాయి. డెలివరీ చేస్తున్న వస్తువులపై ఎంఆర్పీ, "బెస్ట్ బిఫోర్" తేదీలు లేకపోవడంపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) గత నెలలో క్విక్-కామర్స్, ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. -
బీమా విస్తరణకు టెల్కోల సాయం
ముంబై: దేశంలో బీమాను అందరికీ చేర్చేందుకు టెలికం, ఈ–కామర్స్, ఫిన్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ సీఈవో, ఎండీ సిద్ధార్థ మొహంతి అన్నారు. ‘ఏజెంట్లు, బ్రోకర్లు, బ్యాంక్–ఇన్సూరెన్స్‌తో సహా ప్రస్తుత ఛానెల్‌లు ప్రభావవంతంగా ఉన్నాయి. విస్తారమైన, మారుమూల గ్రామీణ మార్కెట్‌కు బీమాను విస్తరించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో పరిమితులు ఉన్నాయి. భవిష్యత్తులో సంప్రదాయేతర విధానాలను అమలు పర్చాల్సిందే. అందరికీ బీమాను చేర్చాలంటే పంపిణీ, మార్కెటింగ్ అంశాలను పునరాలోచించాలి. టెలికం, ఈ–కామర్స్, ఫిన్‌టెక్ వంటి సంప్రదాయేతర కంపెనీల సహకారంతోనే బీమా పాలసీలను పెద్ద ఎత్తున జారీ చేసేందుకు వీలవుతుంది. ఈ సంస్థలు దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకూ విస్తరించాయి. వీటితో భాగస్వామ్యం చేయడం ద్వారా సరసమైన, అందుబాటులో ఉండే కవరేజ్ అందరికీ లభిస్తుంది. కొత్త విధానాన్ని అనుసరించడం వల్ల వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చడానికి బీమా సంస్థలు పెద్ద ఎత్తున ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తాయి. 100 కోట్ల మందికిపైగా బీమా చేర్చడం అంత సులువు కాదు. గ్రామీణ, తక్కువ–ఆదాయ వర్గాలను చేరుకోవడానికి డిజిటల్ టెక్నాలజీ కీలకం. ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్, ఆటోమేషన్ వంటి సాంకేతికతలు, ప్లాట్‌ఫామ్‌లు మొత్తం బీమా రంగాన్ని విప్లవాత్మకంగా, మరింత కస్టమర్–ఫ్రెండ్లీగా మారుస్తున్నాయి’ అని సీఐఐ సదస్సులో వివరించారు. -
ఈ–కామర్స్ పండుగ సేల్ 26 నుంచి షురూ..
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా సెప్టెంబర్ 26 నుంచి వార్షిక పండుగ సేల్ ప్రారంభించనున్నాయి. 27 నుంచి అందరికీ సేల్ అందుబాటులోకి వస్తుందని, అంతకన్నా 24 గంటల ముందు తమ పెయిడ్ సబ్స్క్రయిబర్స్కు యాక్సెస్ లభిస్తుందని ఇరు సంస్థలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. ది బిగ్ బిలియన్ డేస్ (టీబీబీడీ) 2024 పేరిట ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (ఏజీఐఎఫ్) పేరుతో అమెజాన్ ఇండియా వీటిని నిర్వహించనున్నాయి. 20 నగరాలవ్యాప్తంగా 2 లక్షల పైచిలుకు ప్రోడక్టు కేటగిరీల్లో ఉత్పత్తులను అదే రోజున అందించేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈసారి విక్రేతలకు 20 శాతం అధికంగా రివార్డులు ఉంటాయని పేర్కొంది. మరోవైపు, ఏజీఐఎఫ్లో భాగంగా 14 లక్షల మంది పైగా విక్రేతలు, ప్రోడక్టులను విక్రయించనున్నట్లు అమెజాన్ పేర్కొంది. -
ఈ–కామర్స్ ఎగుమతులకు భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ప్రస్తుతం చైనా నుంచి ఈ–కామర్స్ ఎగుమతులు 300 బిలియన్ డాలర్లుగా ఉంటే, భారత్‌నుంచి కేవలం 5 బిలియన్ డాలర్లే ఉన్నట్టు వెల్లడించారు. కనుక రానున్న సంవత్సరాల్లో భారత్ నుంచి ఈ–కామర్స్ ఎగుమతులను 50–100 బిలియన్ డాలర్లకు చేర్చే సామర్థ్యాలున్నట్టు వివరించారు. టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్, రత్నాభరణాల వంటి వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తులను (ఎఫ్ఎంజీ) సమీకరించే సామర్థ్యం ఉన్న కంపెనీలు ఈ–కామర్స్ ఎగుమతుల కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. కాకపోతే ఈ ఉత్పత్తులను సమీకరించే చక్కని నెట్వర్క్, లాజిస్టిక్స్ సదుపాయాలు, గోదాముల వసతులు అవసరమన్నారు. ఈ కామర్స్ ఎగుమతుల కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహా్వనించగా.. త్వరలో ఆయా కంపెనీలతో డీజీఎఫ్టీ సమావేశం కానున్నట్టు చెప్పారు. 4–5 రోజుల్లో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. ‘‘ఏ అగ్రిగేటర్ అయినా లేదా సంస్థ.. ఫాస్ట్ మూవింగ్ ఈ–కామర్స్ గూడ్స్ అయిన టెక్స్టైల్స్, రత్నాభరణాలు, చేనేత ఉత్పత్తులు, ఆయు‹Ù, వెల్నెస్ ఉత్పత్తులను డిమాండ్‌కు అనుగుణంగా డెలివరీ చేయగలిగే సామర్థ్యాలు ఉంటే ఎగుమతుల కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు’’అని వివరించారు. ఈ తరహా ఎగుమతుల కేంద్రాల ఏర్పాటుకు తగిన సామర్థ్యాలు షిప్‌రాకెట్, డీహెచ్ఎల్ సంస్థలకు ఉన్నట్టు చెప్పారు. -
భారీ ఉద్యోగాలకు డోర్లు తెరవనున్న Flipkart
-
పేటీఎం ఈ–కామర్స్ ఇక పాయ్ ప్లాట్‌ఫామ్స్
న్యూఢిల్లీ: పేటీఎం ఈ–కామర్స్ పేరు పాయ్ ప్లాట్‌ఫామ్స్‌గా మారింది. పేరు మార్పు కోసం మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకోగా ఫిబ్రవరి 8న రిజి్రస్టార్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఆమోదం లభించిందని సంస్థ శుక్రవారం తెలిపింది. పేటీఎం ఈ–కామర్స్‌లో ఎలివేషన్ క్యాపిటల్‌కు మెజారిటీ వాటా ఉంది. పేటీఎం ఫౌండర్, సీఈవో విజయ్ శేఖర్ శర్మతోపాటు సాఫ్ట్ బ్యాంక్, ఈబే సైతం ఈ కంపెనీలో పెట్టుబడి చేశాయి. అలాగే ఓఎన్డీసీ వేదికగా విక్రయాలు సాగిస్తున్న ఇన్నోబిట్స్ సొల్యూషన్స్ (బిట్సిలా) అనే కంపెనీని పేటీఎం ఈ–కామర్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం. 2020లో బిట్సిలా కార్యకలాపాలు ప్రారంభించింది. ఓఎన్డీసీలో టాప్ –3 సెల్లర్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటిగా నిలిచింది. నిబంధనలు పాటించడంపై కమిటీ: పేటీఎం అసోసియేట్ పేమెంటు బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో నిబంధనల పాటింపు, నియంత్రణపరమైన వ్యవహారాలపై తగు సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేటీఎం బ్రాండు మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. దీనికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ ఎం దామోదరన్ నేతృత్వం వహిస్తారని వివరించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మాజీ ప్రెసిడెంట్ ఎంఎం చితాలే, ఆంధ్రా బ్యాంక్ మాజీ సీఎండీ ఆర్ రామచంద్రన్ ఇందులో సభ్యులుగా ఉంటారని పేర్కొంది. -
ఈ – కామర్స్ వర్తక శకంలో...
వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసే విపణిలో ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగదారులే. మారుతున్న కాలాన్ని బట్టి నేడు సామాన్యుడు సైతం అంతర్జాలంలో వస్తువులు, సేవలు కొనుగోలు చేస్తున్నారు. డిజిటల్ రూపంలో నగదు చెల్లింపుల లావాదేవీలు పెరుగుతున్నాయి. ఇది ఎంతో ఉపయుక్తంగా ఉన్నా.. నేరస్థులకు నగదు దోచుకునేందుకు దగ్గరిదారిగా మారింది. గత ఏడాది మనదేశంలో 14 లక్షల సైబర్ నేరాలు జరగడం దీనికి తార్కాణం. ‘వినియోగదారుల రక్షణ చట్టం –2019’లో ‘ఈ–కామర్స్’ లావా దేవీలను స్పష్టంగా నిర్వచించడం జరిగింది. ‘డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ నెట్ వర్క్ ద్వారా డిజిటల్ ఉత్పత్తులతో సహా వస్తువులు లేదా సేవలను కొను గోలు చేయడం లేదా విక్రయించడం’ ఈ–కామర్స్‌గా నిర్వచించబడింది. ‘మీకు లాటరీలో బహుమతి వచ్చింద’నీ; ‘కారు, టీవీ, మోటార్ సైకిల్ గెలుచుకున్నార’ంటూ తప్పుడు ప్రకటనల ద్వారా సైబర్ నేరస్థులు రెచ్చి పోతున్నారు. నిరుద్యోగులే కాదు ఇందులో ఉన్నత చదువులు చదువుకున్న వైద్యులు, ఇంజనీర్లు సైతం చిక్కుకుంటున్నారు. ఇటీవల హైదరాబాదుకు చెందిన యువ వైద్యునికి రోజుకు రూ. 5 వేలు సంపాదించవచ్చంటూ రూ. 20 లక్షల రూపాయలు కాజేసిన ఘటన తెలిసిందే. గ్యాస్ ఏజెన్సీలు ఇస్తా మనీ; హోటళ్ళకు, సినిమాలకు రేటింగ్ ఇస్తామనీ, వ్యాపారంలో భాగ స్వామ్యం అనే ప్రకటనలతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదిక–2021 ప్రకారం చూస్తే, గత ఐదేళ్ళలో సైబర్ నేరాల సంఖ్య 141 శాతం పెరిగింది. న్యాయమైన వాణిజ్య పద్ధతుల్లో ఆర్థికంగా నష్టం చేకూర్చడం, వినియోగదారులను మోసం చేయడం ద్వారా వినియోగదారుల హక్కులకు ఆటంకం కలిగించే సంస్థలు/కంపెనీలు/వ్యాపారుల గురించి ప్రజలకు తెలియజెప్పడం కోసం భారత్ 1986 డిసెంబర్ 24న ‘వినియోగదారుల రక్షణ చట్టా’న్ని తెచ్చింది. ఆ రోజును ప్రతి ఏడాదీ ‘జాతీయ వినియోగ దారుల హక్కుల దినం’గా పాటిస్తున్నారు. భద్రత హక్కు, ఎంచుకునే హక్కు, సమాచారం పొందే హక్కు, వినే హక్కు, పరిహారం కోరుకునే హక్కు, వినియోగదారుల విద్య హక్కులను పరిరక్షించడానికీ, వినియోగదారుల ప్రయోజనాలకు హాని కలిగించే లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన విషయాలను నియంత్రించడానికీ 2020 జూలై 20 నుండి ‘సెంట్రల్ కన్సూ్యమర్ ప్రొటెక్షన్ అథారిటీ’ (సీసీపీఏ) స్థాపించబడింది. చెల్లుబాటు అయ్యే ఇండియన్ స్టాండర్డ్స్ (ఐఎస్ఐ) మార్క్ లేని వస్తువులను కొనుగోలు చేయకుండా వినియోగదారులను హెచ్చరిస్తూ ఈ సంస్థ రెండు భద్రతా నోటీసులను కూడా జారీ చేసింది. ఆన్లైన్ షాపింగ్ చేసే చాలా మంది వ్యక్తులు తప్పుడు లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలు, లోపభూయిష్ఠ ఉత్పత్తులు, ఉత్పత్తుల నకిలీ డెలివరీలు, అసురక్షిత ఉత్పత్తులు, చెల్లింపు సమస్యలు, భద్రత– గోప్యతా సమస్యలు, ఏకపక్ష ఒప్పందాలు వంటి వాటి కారణంగా బాధితులుగా మారారు. కానీ, అధికార పరిధుల సమస్యల కారణంగా చట్టాలను సరిగా అమలు చేయకపోవడం వల్ల బాధిత వినియోగదారులను రక్షించడంలో చట్టాలు విఫలమవుతున్నాయి. ఆన్లైన్ లావాదేవీలతో వ్యవహరించేటప్పుడు నేటి జనాభా ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలక్ట్రానిక్ ఒప్పందాలను నియంత్రించేందుకు వినియోగదారుల రక్షణ చట్టం –2019లో అనేక అంశాలు చేర్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగదారుల రక్షణ చట్టం– 2019ని బలో పేతం చేసేందుకు పాఠశాలలో విద్యార్థులతో సుమారు 6,000 వినియోగ దారుల క్లబ్బుల ఏర్పాటు చేయడం జరిగింది. వినియోగదారుల వ్యవహా రాలపై, ఆహార, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వారికి అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులకు ఈ చట్టంపై శిక్షణ ఇచ్చారు. విద్యార్థి దశ నుండే చట్టంపై అవగాహన కలిగించేందుకు ‘మేము సైతం’ అనే పుస్తకాన్నీ, సుమారు 10 రకాలైన గోడపత్రాలను పౌర సరఫరాల శాఖ రూపొందించింది. తూనికలు కొలతల శాఖ వారు 3 రకాలైన గోడపత్రాలను రూపొందించడం జరిగింది. గోడపత్రాలనూ పాఠశాలతో పాటు గ్రామ/వార్డు సచి వాలయాలలో, పెట్రోలు బంకులలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరింతగా ఈ చట్టం పట్ల అవగాహన ప్రజలలో కల్పించేందుకు ‘మేలుకొలుపు’ అనే మాస పత్రికను కూడా పౌర సరఫరాల శాఖ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ చట్టం పట్ల ప్రజలందరికీ అవగాహన ఉంటే కొనుగోలు చేసే వస్తువులు / సేవలు / ఆన్లైన్ లావాదేవీలలో జరిగే నష్టాలకు పరిహారం పొందే అవకాశం ఉంటుంది. దాసరి ఇమ్మానియేలు వ్యాసకర్త ఏపీ వినియోగదారుల సంఘాల సమాఖ్య చైర్మన్ ‘ 90599 90345 (నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం) -
ఫ్లిప్‌కార్ట్‌కు 600 మిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు అమెరికన్ రిటైల్ దిగ్గజం 600 మిలియన్ డాలర్లు సమకూర్చనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత వేల్యుయేషన్‌కు అదనంగా 5–10% లెక్కగట్టి వాల్‌మార్ట్ ఈ నిధులు అందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, తాజా నిధుల సమీకరణ తర్వాత కంపెనీ వేల్యుయేషన్ ఎంత స్థాయిలో ఉంటుందనేది వెల్లడి కాలేదు. ఇది 40 బిలియన్ డాలర్ల లోపే ఉంటుందని ఇతర వర్గాలు తెలిపాయి. ఫ్లిప్‌కార్ట్ చివరిసారి 37.6 బిలియన్ డాలర్ల విలువతో జీఐసీ, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 2 తదితర సంస్థల నుంచి 3.6 బిలియన్ డాలర్లను సమీకరించింది. -
ఈ–కామర్స్, ఉద్యోగాల పేరిట అత్యధిక సైబర్ మోసాలు
సాక్షి, అమరావతి: ఈ–కామర్స్‌లో విక్రయాలు, ఉద్యోగాలు.. దేశంలో సైబర్ నేరగాళ్లకు ప్రధాన ఆయుధాలు. సైబర్ నేరాల్లో ఈ రెండే మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. విపరీతంగా పెరుగుతున్న ఆన్లైన్ షాపింగ్ అభిరుచి, ఉద్యోగాల కోసం యువత ప్రయత్నాలను ఆసరా చేసుకుని సైబర్ ముఠాలు భారీగా మోసాలకు పాల్పడుతున్నాయి. ప్రధానంగా నగర, పట్టణవాసులను లక్ష్యంగా చేసుకునే ఈ ముఠాలు చెలరేగుతున్నాయని ప్రముఖ మార్కెటింగ్ రిసెర్చ్ సంస్థ ‘యు గవ్’ సర్వేలో వెల్లడైంది. ఆన్లైన్ మోసాలపై ఈ ఏడాది నవంబరులో దేశంలో 180 నగరాలు, పట్టణాల్లో ఆ సంస్థ సర్వే చేసింది. సర్వేలోని ప్రధానాంశాలు.. ♦ దేశంలో సైబర్ ఆర్థి క నేరాలు భారీగా పెరుగుతున్నాయి. 2022లో మోసాలకంటే ఈ ఏడాది (2023లో) ఇప్పటికే ఈ మోసాలు రెట్టింపయ్యాయి. కేంద్ర హోం శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమరి్పంచిన నివేదిక ప్రకారం 2023 నవంబర్‌నాటికే దేశంలో రూ.5,574 కోట్లు కొల్లగొట్టారు. 2022లో రూ.2,296కోట్లు కొల్లగొట్టారు. ♦ దేశంలో జరిగిన సైబర్ నేరాల్లో ఈ–కామర్స్ పేరిట జరిగినవి 35 శాతం, ఉద్యోగావకాశాల పేరిట జరిగినవి 28శాతం. ♦ ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ రూపంలో సైబర్ ముఠాలు వారానికి ఓసారి అయినా ప్రయత్నిస్తున్నాయని 54 శాతం మంది చెప్పారు. రోజూ అటువంటి మోసపూరిత ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ వస్తున్నట్లు 30 శాతం మంది తెలిపారు. ♦ సైబర్ నేరాల బారిన పడి మోసపోయామని 20 శాతం మంది చెప్పారు. స్నేహితులు, పరిచయస్తులు ఆన్లైన్ మోసాలతో నష్టపోయారని 47 శాతం మంది తెలిపారు. ♦ సైబర్ మోసగాళ్ల బాధితుల్లో మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు. ప్రతి వంద మంది పురుషుల్లో 35 శాతం, అలాగే ప్రతి వంద మంది మహిళల్లో 24 శాతం వారు ఆన్లైన్ మోసానికి గురైనట్లు వెల్లడించారు. ♦ దేశంలో సైబర్ నేరాల బాధితుల్లో అత్యధికంగా 23 శాతం మంది ద్వితీయ శ్రేణి నగరాల ప్రజలు ఉన్నారు. ♦ సైబర్ మోసాల బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మాత్రం సుముఖత చూపడం లేదు. 59 శాతం మంది వారు మోసపోయినప్పటికీ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ♦ పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో 48 శాతం మంది వారు కోల్పోయిన డబ్బును తిరిగి పొందారు. ♦ సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉంటున్న వారిలో 69 శాతం మంది వారి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించడంలేదు. 59 శాతం మంది అనుమానాస్పద ఫోన్ నంబర్లు, ఈ మెయిల్స్ బ్లాక్ చేస్తున్నారు. 57 శాతం మంది అనుమానాస్పద సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకోవడంలేదు. 47 శాతం మంది తెలియని వారికి వస్తువుల కొనుగోలు ఇతరత్రా వ్యవహారాల పేరిట ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు బదిలీ చేయడంలేదు. ఈ జాగ్రత్తలతో వారు సైబర్ నేరగాళ్ల వల నుంచి తప్పించుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది. -
ఫ్యాషన్ స్టార్టప్స్‌లో అజియో పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 100 డైరెక్ట్ టు కస్టమర్ ఫ్యాషన్ స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టాలని లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ ఈ–కామర్స్ కంపెనీ అజియో భావిస్తోంది. ఈ స్టార్టప్స్ తయారు చేసే, విక్రయించే దుస్తులు, పాదరక్షలు, యాక్సెసరీస్ వంటి ఉత్పత్తులను డైరెక్ట్ టు కంన్జ్యూమర్ వేదిక అయిన అజియోగ్రామ్లో అందుబాటులో ఉంచనుంది. భారతీయ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ విభాగంలోని 200 బ్రాండ్స్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా అజియోగ్రామ్లో వచ్చే ఏడాదికల్లా చేర్చనున్నట్టు వెల్లడించింది. ఈ బ్రాండ్స్ విస్తరణకు, ఆదాయ వృద్ధికి పూర్తి సహకారం అందించనున్నట్టు అజియో ప్రకటించింది. -
‘ఆ డిస్కౌంట్లు అనైతికం.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’
ఈ-కామర్స్ రంగంలో ధరలు పెంచి డిస్కౌంట్లను అందించడం వంటి అనైతిక పద్ధతులను అరికట్టడానికి ప్రభుత్వం, సంబంధిత నియంత్రణ సంస్థలు తక్షణమే చర్యలు తీసుకోవాలని వినియోగదారులకు సంబంధించిన మేధో సంస్థ ‘కట్స్ ఇంటర్నేషనల్’ (CUTS International) తాజాగా విడుదల చేసిన నివేదికలో సూచించింది. అసలు ధరలు ఎక్కువగా చూపి పొదుపుపై తప్పుడు అవగాహన కల్పించడం ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నారని పేర్కొంది. ఫ్లాష్ సేల్స్‌పై పూర్తిగా నిషేధం విధించే బదులు, వినియోగదారుల రక్షణ చర్యలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, మార్కెట్లో వ్యాపార సంస్థలన్నింటికీ సమాన అవకాశాలు ఉండేలా చూడాలని సూచించింది. న్యాయమైన, స్థిరమైన ఈ-కామర్స్ వ్యవస్థను ప్రోత్సహించడానికి, విక్రేతలు తమ ఉత్పత్తుల ధరలను నిర్ణయించే స్వయంప్రతిపత్తిని కలిగి ఉండటం చాలా కీలకం. డిస్కౌంట్ భారాన్ని విక్రేతలపై మోపడం ఆర్థిక ఒత్తిడికి దారి తీస్తుందని, వారి లాభాల మార్జిన్లు క్షీణించవచ్చని నివేదిక పేర్కొంది. వినియోగదారుల సంక్షేమం కోసం, అమ్మకందారులందరూ మార్కెట్లో నిలదొక్కుకోవడం కోసం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఉత్పత్తులు/విక్రయదారుల 'సెర్చ్, ర్యాంకింగ్' పరంగా స్వీయ-ప్రాధాన్యత వంటి పద్ధతులలో పాల్గొనకూడదని సిఫార్సు చేసింది. -
ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్త ఫీచర్!
Flipkart price lock Feature: పండుగల సమయంలో ఆన్లైన్ షాపింగ్ చేసేవారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులు.. తాము కొనుగోలు చేసేంత వరకూ ధరలు పెరగకుండా లాక్ చేసుకునేలా 'ప్రైస్ లాక్' ఫీచర్ (price lock feature)ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తాజాగా ప్రకటించారు. (ఇంత కంటే చీప్ ఇంకేమైనా ఉందా? రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లు రూ.100కే..) "పండుగ సీజన్లలో తమకు కావాల్సిన ఉత్పత్తులు అమ్ముడైపోయాయని లేదా నిమిషాల్లోనే అందుబాటులో లేకుండా పోతున్నాయని కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దీనికి పరిష్కారంగా ప్రైస్ లాక్ ఫీచర్‌తో కస్టమర్లు తమకు అవసరమైన ఇన్వెంటరీని లాక్ చేసుకోవచ్చు" అని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రాడక్ట్ అండ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO) జయందరన్ వేణుగోపాల్ ఫ్లిప్‌కార్ట్ మాతృ సంస్థ వాల్‌మార్ట్ నిర్వహించిన కన్వర్జ్ ఈవెంట్లో తెలిపారు. అయితే, ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనేది ఆయన చెప్పలేదు. 'ప్రైస్ లాక్' ఫీచర్ ఇలా.. ఫ్లిప్‌కార్ట్ తీసుకొస్తున్న 'ప్రైస్ లాక్' ఫీచర్ కింద కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను లాక్ చేసుకునేందుకు కొంత మొత్తం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పండుగ సమయాల్లో ఆయా వస్తువులకు డిమాండ్ పెరిగినప్పటికీ, లాక్ చేసుకున్న కస్టమర్లకు అవి అందుబాటులో ఉండేలా చేస్తారు. అలాగే ధరలు పెరిగినప్పటికీ లాక్ చేసుకున్న ధరకే ఆయా వస్తువులను కొనుక్కోవచ్చు. సాధారణంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల అమ్మకాలలో 50 శాతం పండుగ సీజన్లలోనే జరుగుతాయి. -
ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌కు మరిన్ని వాటాలు
న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ తమ వాటాలను మరింతగా పెంచుకుంది. ఇందులో భాగంగా నియంత్రణాధికారాలు లేని వాటాదారుల నుంచి షేర్ల కొనుగోలు కోసం జూలై 31తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో 3.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 28,953 కోట్లు) చెల్లించింది. 2018లో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ 77 శాతం వాటాను దక్కించుకోగా తాజాగా దాన్ని 80.5 శాతానికి పెంచుకుంది. ఇందుకోసం హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్, యాక్సెల్ పార్ట్నర్స్, ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ నుంచి వాటాలు కొనుగోలు చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ను లిస్టింగ్ చేసే యోచనలో కూడా ఉంది. -
ఎగుమతుల ప్రోత్సాహకానికి సమావేశాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే మార్గాలపై అవగాహన పెంచేందుకు నెలవారీ వర్క్‌షాప్‌లను నిర్వహించాలని నిర్ణయించినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. వర్క్‌షాప్‌ల ద్వారా విదేశాలకు సరుకు రవాణా, పోస్టల్, కస్టమ్స్ సమ్మతి, చెల్లింపులకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతిపాదిత వర్క్‌షాప్‌లు ప్రతి నెల మొదటి వారంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారు. సాధ్యమయ్యే చోట వ్యక్తిగతంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అనుభవాలను పంచుకోవడానికి, కొత్త వ్యవస్థాపకులకు సలహా ఇవ్వడానికి ప్రముఖ ఈ–కామర్స్ ఎగుమతిదారులను ఆహా్వనించినట్టు వెల్లడించింది. -
ఓఎన్డీసీతో ఆర్థిక సేవలు, తయారీకి దన్ను
న్యూఢిల్లీ: చిన్న రిటైలర్లకు కూడా ఈ–కామర్స్ ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)తో నాలుగు కీలక రంగాల వృద్ధికి ఊతం లభించగలదని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఒక నివేదికలో వెల్లడించింది. ఆర్థిక సేవలు, వ్యవసాయం, తయారీ, ఈ–కామర్స్ రిటైల్ వీటిలో ఉంటాయని పేర్కొంది. రుణ అవసరాల కోసం ప్రభుత్వ పథకాలు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఎక్కువగా ఆధారపడే చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఆర్థిక సేవల సంస్థలు చేరువయ్యేందుకు ఓఎన్డీసీ ఉపయోగపడగలదని వివరించింది. సాధారణంగా ఎంఎస్ఎంఈల ఆర్థిక గణాంకాల సరిగ్గా అందుబాటులో లేకపోవడం వల్ల వాటి రుణ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుంటాయి. అయితే, ఓఎన్డీసీ ద్వారా అవి నిర్వహించే లావాదేవీల డేటా అంతా వ్యవస్థలో డిజిటల్‌గా నిక్షిప్తం కావడం వల్ల వాటికి అనువైన ఆర్థిక సాధనాలను రూపొందించడానికి ఫైనాన్షియల్ సంస్థలకు వీలవుతుందని నివేదిక పేర్కొంది. ‘పరిస్థితికి అనుగుణంగా మారగలిగే స్వభావం, భద్రత, లాభదాయకత.. ఏకకాలంలో ఈ మూడింటి మేళవింపుతో ఓఎన్డీసీ ఎంతో విశిష్టంగా రూపొందింది. ఇది సరఫరా, డిమాండ్ మధ్య వ్యత్యాసాలను భర్తీ చేయగలదు. నవకల్పనలకు తోడ్పాటునివ్వగలదు. తద్వారా కొత్త తరం వినూత్నంగా ఆలోచించేందుకు బాటలు వేయగలదు‘ అని డెలాయిట్ దక్షిణాసియా ప్రెసిడెంట్ (కన్సలి్టంగ్) సతీష్ గోపాలయ్య తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు ఓఎన్డీసీ ఒక గొప్ప అవకాశం కాగలదని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని వివరాలు.. ► కోవిడ్ మహమ్మారి అనంతరం భోగోళిక–రాజకీయ ఉద్రిక్తతల కారణంగా తయారీ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వాణిజ్య పరిస్థితులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, పరికరాల కొరత, కమోడిటీల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. తయారీ సంస్థలు ఈ సవాళ్లను వ్యాపార అవకాశాలుగా మల్చుకునేందుకు ఓఎన్డీసీ ఉపయోగపడవచ్చు. ఓఎన్డీసీలో లాజిస్టిక్స్ సేవలు అందించే సంస్థలు పుష్కలంగా ఉన్నందున.. లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గించుకునేందుకు, మరింత సమర్ధంగా డిమాండ్‌కి అనుగుణంగా స్పందించేందుకు వీలవుతుంది. ► ఆన్లైన్ అమ్మకాలకు ప్రాధాన్యం పెరుగుతున్నందున, రిటైల్ పరిశ్రమ భాగస్వాములు (బ్రాండ్లు, రిటైలర్లు, పంపిణీదారులు, సరఫరాదారులు) తమ వ్యవస్థలో అంతర్గతంగా మిగతా వర్గాలతో కలిసి పనిచేసేందుకు, అలాగే కస్టమర్లను చేరుకునేందుకు కూడా ఓఎన్డీసీ సహాయకరంగా ఉండనుంది. ► గత కొద్ది నెలలుగా నిత్యావసరాలు, ఫుడ్ డెలివరీ, గృహాలంకరణ, ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్, సౌందర్య.. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఫార్మా తదితర విభాగాల సంస్థలు ఓఎన్డీసీ నెట్‌వర్క్‌ను సమర్ధమంతంగా వినియోగించుకుంటున్నాయి. ► డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసాన్ని తక్కువ వ్యయాలతో పరిష్కరించుకోవడానికి బ్రాండ్స్/రిటైలర్లు/ఎంఎస్ఎంఈలకు ఓఎన్డీసీ ద్వారా అవకాశం లభిస్తుంది. బ్రాండ్లు నేరుగా రిటైలర్లను చేరుకోవడానికి, పంపిణీదారులు తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవడానికి కూడా ఇది తోడ్పడగలదు. ఇందుకోసం ఆయా సంస్థలు ఇరవై నాలుగ్గంటలూ ఆర్డర్ చేసేందుకు వెసులుబాటు, మరుసటి రోజే డెలివరీ, ఆటో ఆర్డరింగ్ వంటి సదుపాయాలను కలి్పంచవచ్చు. ► బ్రాండ్స్/రిటైలర్లు తమ సరఫరాదారుల వ్యవస్థను విస్తరించుకునేందుకు, ముడి వనరులు లేదా తయారీ ఉత్పత్తుల సేకరణ వ్యయాలను తగ్గించుకునేందుకు ఓఎన్డీసీ ఉపయోగకరంగా ఉండగలదు. ► ఇటు కొనుగోలుదారులను, అటు విక్రేతలను ఒకే వేదికపైకి తెచ్చే అవకాశం ఉన్నందున దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచేందుకు ఇది సహాయకరంగా ఉండగలదు. ప్రాచుర్యం పొందడంలో సవాళ్లు ఎదుర్కొంటున్న అగ్రిటెక్ అంకుర వ్యవస్థలకు ఈ నెట్వర్క్ ఒక వరంగా మారగలదు. కంపెనీలు, ప్రభుత్వ సంస్థల నుంచి రైతు ఉత్పత్తి సంస్థలకు (ఎఫ్‌పీవో) ముడి సరుకు, సాంకేతికత, పరికరాలు, సేవలు అందుబాటులోకి రాగలవు. -
పనిమంతులకు ‘పండుగే’.. హైదరాబాద్, విజయవాడల్లో డిమాండ్
► పండుగల సీజన్ మొదలై క్రమంగా పుంజుకుంటున్న కొద్దీ వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా వినియోగదారులు ప్రత్యక్షంగా ప్రభావం చూపే ఈ–కామర్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్ తదితర రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. – లోహిత్ భాటియా, ప్రెసిడెంట్–వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్, క్వెస్ సాక్షి, హైదరాబాద్: త్వరలో ప్రారంభం కానున్న పండుగల సీజన్ వివిధ రంగాల్లో అవకాశాలకు తలుపులు తెరుస్తూ ఉద్యోగార్థుల్లో నయాజోష్ ను నింపుతోంది. ఈ నెలాఖరులో ‘రక్షాబంధన్’తో మొదలై కొత్త ఏడాది, ఆపై కాలం వరకు సుదీర్ఘ ఫెస్టివల్ సీజన్ జోరు కొనసాగనుంది. ఈ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని... వివిధ వర్గాల వినియోగదారుల పండుగ మూడ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పటికే పలు కంపెనీలు, సంస్థలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో వివిధ రంగాల్లో సేవలందించే ఉద్యోగులకు కూడా ఒక్కసారిగా డిమాండ్ పెరిగినట్టుగా పలు అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. ఇదీ అధ్యయనం..: రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని గడిచిన ఏప్రిల్ నుంచి ఈనెల ఆగస్టు వరకు స్టాఫ్ డిమాండ్ 23 శాతం పెరిగినట్టుగా ప్రముఖ బిజినెస్ సర్వీసెస్ ప్రొవైడర్ సంస్థ క్వెస్ తాజా పరిశీలనలో వెల్లడైంది. ఈ కాలంలోనే 32 వేల ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడడంతో పాటు ఏడాది చివర్లో పండుగల సీజన్ ముగిసే దాకా ఈ– కామర్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్స్ తదితరాల్లో ప్రతీనెల 5 వేల చొప్పున ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్, టెలికం తదితర రంగాలు, విభాగాల్లో అవకాశాలు పెరిగినట్లు ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్–ఆగస్టు మధ్యకాలంతో పోల్చితే ఈ ఏడాది అదే కాలంలో ‘మాన్యుఫాక్చరింగ్, ఇండస్ట్రియల్ సెగ్మెంట్’లో 245 శాతం మేర వృత్తినిపుణుల డిమాండ్ పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. రిక్రూట్మెంట్ విషయానికొస్తే...దసరా, దీపావళి పండుగల సందర్భంగా అత్యధికంగా వాహనాల కొనుగోలుకు మొగ్గు నేపథ్యంలో ఆటోమొబైల్ పరిశ్రమ ముందంజలో (ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా) ఉంది. ఫెస్టివల్ సీజన్ దృష్ట్యా... బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ (బీఎఫ్ఎస్ఐ)కి సంబంధించి మ్యాన్‌పవర్ కోసం 27 శాతం డిమాండ్, టెలికాం రంగంలో 14 శాతం డిమాండ్ పెరిగినట్టు తెలిపింది. హైదరాబాద్ సహా మెట్రోలు, విజయవాడల్లో డిమాండ్ ఈ పండుగల సీజన్ నేపథ్యంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన వివిధ రకాల సేవలు, నూతన రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో, తదనుగుణంగా అవసరమైన ‘మ్యాన్‌పవర్’అందించడంలో హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రోనగరాలతో పాటు నోయిడా, పుణె నగరాలు అత్యధిక డిమాండ్ కలిగి ఉన్నట్టు క్వెస్ పరిశీలన వెల్లడించింది. వీటికి ఏమాత్రం వెనకబడకుండా విజయవాడ, కోయంబత్తూరు, జంషెడ్పూర్, రాంఛీ వంటి నగరాల్లోని వివిధరంగాలకు చెందిన వర్క్‌ఫోర్స్‌కు మంచి ఉద్యోగ అవకాశాలున్నట్టు తెలిపింది. ఏ ఉద్యోగాలకు డిమాండ్ అధికం అంటే.. ప్రొడక్షన్ ట్రైనీ, సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ రిలేషన్షిప్ ఆఫీసర్, బ్రాంచ్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్, కలెక్షన్ ఆఫీసర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, బ్రాడ్ బ్యాండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, వేర్‌హౌస్ అసోసియేట్ తదితర ఉద్యోగాలకు అధిక డిమాండ్ ఏర్పడింది. ఈ–కామర్స్, లాజిస్టిక్స్ ఇండస్ట్రీలో దాదాపు మూడులక్షల దాకా ఉద్యోగులకు అవకాశాలు కల్పించే అంచనాలతో ముందువరసలో నిలుస్తోంది. ఇందులో భాగంగానే వేర్‌హౌస్, డెలివరీ ఆపరేషన్స్ వంటివి కూడా అంతర్భాగంగా ఉంటాయి. పండుగల సీజన్ మొదలై క్రమంగా పుంజుకుంటున్న కొద్దీ వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా వినియోగదారులు ప్రత్యక్షంగా ప్రభావం చూపే ఈ–కామర్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్, తదితర రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. –లోహిత్ భాటియా, ప్రెసిడెంట్–వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్, క్వెస్ -
Radhika Aggarwal: ఆత్మవిశ్వాసమే గెలుపు మంత్రం
రాధిక అగర్వాల్ తండ్రి సైన్యంలో పనిచేసేవారు. తండ్రి ఉద్యోగరీత్యా జో«ద్‌పూర్ నుంచి అహ్మద్‌నగర్ వరకు ఎన్నో చోట్ల చదువుకుంది రాధిక. వాషింగ్టన్ యూనివర్శిటీలో ఎంబీయే చేసిన రాధిక అగర్వాల్‌కు ఎంటర్‌ప్రెన్యూర్‌గా పెద్ద పేరు తెచ్చుకోవాలనే కల ఉండేది. అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్లలో పోస్ట్–గ్రాడ్యుయేషన్ కూడా చేసింది. ‘చదువు ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇక వ్యాపారంలోకి నిస్సందేహంగా అడుగు పెట్టవచ్చు’ అనుకోలేదు ఆమె. అనుభవ జ్ఞానం విలువ ఏమిటో రాధిక అగర్వాల్‌కు తెలియనిదేమీ కాదు. చదువు పూర్తయిన తరువాత లైఫ్‌స్టైల్, ఇ–కామర్స్, ఫ్యాషన్, పబ్లిక్ రిలేషన్స్, రిటైల్ రంగాలలో 14 సంవత్సరాల పాటు పనిచేసింది. ఎన్నో రంగాలలో ఎంతో అనుభవాన్ని సంపాదించిన రాధిక అగర్వాల్ ఛండీగఢ్‌లో ఒక యాడ్ ఏజెన్సీకి శ్రీకారం చుట్టింది. ఆ తరువాత ప్రవాస భారతీయుల కోసం ‘ఫ్యాషన్ క్లూస్’ పేరుతో ఒక వెబ్సైట్ మొదలు పెట్టింది. మొదటి రెండు వ్యాపారాల విషయం ఎలా ఉన్నా... ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘షాప్ క్లూస్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేసింది రాధిక అగర్వాల్. రెండు సంవత్సరాల క్రితం బ్యూటీ, న్యూట్రీషన్, హోమ్కేర్కు సంబంధించి ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘కైండ్ లైఫ్’ ప్రారంభించి మరోసారి విజయం సాధించింది. ‘ఒకసారి వెనక్కి చూస్తే... విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ కనిపిస్తాయి. అవి ఎప్పుడూ నన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా ఉండమని చెబుతాయి. వ్యాపారంలో విజయానికి వినియోగదారులకు మనపై ఉండే విశ్వాసం అనేది ముఖ్యం. అది గెలుచుకుంటే కచ్చితంగా గెలుపు మనదే. దీనికి వ్యూహాల కంటే మన నిజాయితీ అనేది ముఖ్యం. వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనడం ద్వారానే ఇంత పెద్ద విజయాన్ని సాధించగలిగాం’ అంటుంది రాధిక అగర్వాల్. ప్రతి సంవత్సరం ‘ఉమెన్స్ డే’ సందర్భంగా ఎక్కడో ఒకచోట మహిళలతో సమావేశం నిర్వహించి తన వ్యాపార ప్రస్థానాన్ని వారితో పంచుకుంటుంది. అగర్వాల్ స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు వ్యాపారవేత్తలుగా విజయం సాధించారు. ‘వ్యాపారంలో విజయం సాధించాలంటే ఉత్సాహం మాత్రమే సరిపోదు. బరిలోకి దిగే ముందు మన గురించి మనం విశ్లేషించుకోవాలి. ఎంతోమందితో మాట్లాడాలి. అయినా సరే, ఎప్పటికప్పుడు ఒక కొత్త సవాలు ఎదురవుతూనే ఉంటుంది. దానికి జవాబు చెప్పి ముందుకు కదలాలి. దీనికి కావాల్సింది ఆత్మవిశ్వాసం’ అంటుంది రాధిక అగర్వాల్. -
ఎన్ఎస్ఈతో కలసి ఓఎన్డీసీ అకాడమీ
న్యూఢిల్లీ: ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ), ఎన్ఎస్ఈ సబ్సిడరీ అయిన ఎన్ఎస్ఈ అకాడమీ భాగస్వామ్యంతో ఓ విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కామర్స్ వ్యాపారాన్ని సులభంగా ఎలా నిర్వహించాలనే దానిపై ఓపెన్ నెట్వర్క్ భాగస్వామ్యులు, విక్రేతలకు శిక్షణ ఇవ్వనుంది. టెక్స్ట్, వీడియో ఫార్మాట్ రూపంలో విక్రేతలకు కావాల్సిన సమాచారాన్ని ఓఎన్డీసీ అకాడమీ అందించనుంది. ఈ విషయాన్ని డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ సంజీవ్ వెల్లడించారు. ఓ గ్రామస్థుడు ఈకామర్స్ పట్ల ఎలాంటి అవగాహన లేకపోయినా, సెల్లర్ యాప్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవచ్చని వివరించారు. టెక్నాలజీ పరిజ్ఞానం అవసరం లేకుండానే సొంత యాప్‌ను తయారు చేసుకోవచ్చని చెప్పారు. ఈ కామర్స్ ప్రయాణాన్ని విజయవంతంగా ఎలా కొనసాగించాలనే సమాచారాన్ని సైతం ఈ అకాడమీ నుంచి పొందొచ్చు. ఓఎన్డీసీ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ ఈకామర్స్ నెట్వర్క్ కావడం గమనార్హం. -
12 శాతం అధికంగా నియామకాలు
ముంబై: దేశంలో ఉద్యోగ నియామకాలు ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో (జనవరి–మే) 12 శాతం పెరిగినట్టు ఆల్‌సెక్ టెక్నాలజీస్ ప్రకటించింది. నైపుణ్య సేవలు, తయారీరంగం, బీఎఫ్ఎస్ఐ, ఈ కామర్స్, ఐటీ/ఐటీఈఎస్ రంగాల్లో నియామకాలు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది. ‘‘ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న అనిశి్చత పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలపై ప్రభావం చూపిస్తున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా కంపెనీలు కఠిన విధానాలను అవలంబిస్తున్నాయి. కానీ, భారత్‌లో మాత్రం నియామకాలు గతేడాదితో పోలిస్తే మెరుగుపడ్డాయి. 2023 జనవరి–మే మధ్య నియామకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 12 శాతం పెరిగాయి. భారత కంపెనీలు అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతులను అధిగమించేందుకు కృషి చేస్తున్నాయి. ఇంధనం, మౌలిక సదుపాయాల రంగాల్లో భారత్ పెట్టుబడులు కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నాం. ఇది రానున్న సంవత్సరాల్లో ఉపాధికి ఊతమిస్తుంది’’అని ఆల్‌సెక్ టెక్నాలజీస్ సీఈవో నాజర్ దలాల్ తెలిపారు. భారత్ వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పలు అంతర్జాతీయ సంస్థలు ఆశావహంగా ఉన్నట్టు చెప్పారు. నిపుణులకు డిమాండ్ నైపుణ్య సేవల రంగంలో నియామకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు రెట్టింపయ్యాయి. ట్యాక్సేషన్, బిజినెస్ కన్సలి్టంగ్, రిస్క్ అడ్వైజరీ, డీల్ అడ్వైజరీ, టెక్నాలజీ సేవలు, పర్యావరణం, సామాజిక, కార్పొరేట్ గవర్నెన్స్ (ఈఎస్జీ) సేవల్లో నియామకాల జోరు కనిపించింది. తయారీ రంగంలో నియామకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూడగా 50 శాతం వృద్ధి కనిపించింది. భారత ఉత్పత్తులకు స్థానికంగానే కాకుండా, అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతుండడం సానుకూలంగా ఈ నివేదిక తెలిపింది. ఫలితంగా ఇది ఉపాధికి మద్దతుగా నిలుస్తున్నట్టు వివరించింది. బీఎఫ్ఎస్ఐ, ఈ–కామర్స్ రంగాల్లోనూ నియామకాలు 16 శాతం అధికంగా జరిగాయి. బ్యాంక్‌లు పనితీరు మెరుగుపడడం, రుణాలకు డిమాండ్ పెరగడం వంటి అంశాలను నివేదిక ప్రస్తావించింది. ఇంటర్నెట్ విస్తరణ ఈ కామర్స్ రంగానికి అనుకూలమని తెలిపింది. వ్యాపారానికి మరింత అనుకూలమైన వాతావరణం, భారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా చేయాలని కేంద్రం భావిస్తుండడం భవిష్యత్తులో మరింతగా ఉపాధి కల్పనకు దారితీస్తుందని విశ్లేశించింది. -
ఊరు.. షాపింగ్ జోరు.. ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు.. కారణాలివే!
సాక్షి, హైదరాబాద్: భారత్ ఆన్లైన్ షాపింగ్, ఈ–కామర్స్ మార్కెటింగ్‌లో ద్వితీయశ్రేణి, అంతకంటే తక్కువస్థాయి పట్టణాలు కూడా సత్తా చాటుతున్నాయి. మెట్రో నగరాలకు ఏమాత్రం తగ్గకుండా కొన్ని సందర్భాల్లో అగ్రశ్రేణి నగరాల కంటే కూడా చిన్న నగరాల్లోని వినియోగదారులు ఆన్లైన్ కొనుగోళ్లలో ముందుంటున్నాయి. ఆన్లైన్ షాపర్స్ ఏడాదికి సగటున 149 గంటలు ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై కాలక్షేపం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ రిటైల్ మార్కెట్లో చోటుచేసుకుంటున్న మార్పుచేర్పులు, ఆన్లైన్ షాపింగ్ చేసే వారి ప్రాధమ్యాలు, ప్రాధాన్యతలు, అలవాట్లు, షాపింగ్ చేసే పద్ధతులపై సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) అధ్యయనం నిర్వహించింది. కన్జూమర్ యాస్పిరేషన్ అండ్ ఈ–కామర్స్ ఇన్ భారత్ పేరిట జరిపిన ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఆన్లైన్ షాపింగ్‌కు మొగ్గు ఎందుకంటే... ఆన్లైన్ షాపింగ్ వైపు కస్టమర్లు ఆకర్షితులు కావడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. ఆకర్షణీయమైన ధరలు, కలర్, సైజులు మొదలైనవి నచ్చకపోతే రిటర్న్ లేదా ఎక్స్ఛేంజ్ చేసుకొనే సదుపాయం, ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్ల వంటివి ప్రభావితం చేస్తున్నట్లు ఈ పరిశీలనలో గుర్తించారు. ఈ అంశాల ప్రాతిపదికన భారత్‌లో ఈ–కామర్స్ మార్కెట్ గణనీయమైన వృద్ధి సాధించడంతోపాటు పెద్ద సంఖ్యలో ద్వితీయశ్రేణి నగరాల ప్రజలు ఆకర్షితులవుతున్నట్లు సర్వే పేర్కొంది. ముఖ్యాంశాలివే... ♦ ఆన్లైన్ షాపింగ్‌కు వారానికి రెండున్నర గంటల సమయాన్ని ద్వితీయశ్రేణి నగరాల్లోని పౌరులు వెచ్చిస్తున్నారు. ♦ తమ ఆదాయంలో 16% ఆన్లైన్ కొనుగోళ్లకు వారు ఖర్చు చేస్తున్నారు. ప్రథమశ్రేణి నగరాల్లో ఇది 8% గానే ఉంటోంది. ♦ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో అధికంగా కాలక్షేపం చేస్తున్న వారిలో గువాహటి, కోయంబత్తూరు, లఖ్‌నవూ వంటి ద్వితీయశ్రేణి నగరాల ప్రజలు ముందువరుసలో నిలుస్తున్నారు. ♦ ప్రథమశ్రేణి నగరాల్లో బెంగళూరువాసులు వారానికి 4 గంటలపాటు ఆన్లైన్ షాపింగ్‌లో కాలం వెళ్లబుచ్చుతున్నారు ♦ గత 6 నెలల్లో మూడింట రెండు వంతుల మంది వినియోగదారులు సగటున రూ. 20 వేలు ఆన్లైన్ షాపింగ్ చేశారు. ♦ ఈ విషయంలో ముంబై అత్యధిక సగటు రూ. 24,200 వ్యయంతో తొలిస్థానంలో నిలిచింది. ♦ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో అమెజాన్ ఆ తర్వాత ఫ్లిప్‌కార్ట్ వైపు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. ♦ దుస్తులు, బెల్ట్‌లు, బ్యాగ్‌లు, పర్సులతోపాటు ఎల్రక్టానిక్ పరికరాలను ఎక్కువగా కొంటున్నారు. ♦ నాగ్‌పూర్‌లో అత్యధికంగా 81 శాతం మంది ఆన్లైన్లో ఎల్రక్టానిక్ వస్తువులు, పరికరాలు కొన్నారు. -
రికార్డు స్థాయిలో వేర్ హౌస్ డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో లాజిస్టిక్స్, రిటైల్ రంగాల నుంచి గోదాములకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఫలితంగా గడిచిన ఆర్థిక సంత్సరంలో (2022–23) ఎనిమిది ప్రధాన పట్టణాల్లో రికార్డు స్థాయిలో గోదాముల లీజు పరిమాణం 51.32 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా భారత వేర్ హౌసింగ్ (గోదాములు) మార్కెట్‌పై మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఎనిమిది పట్టణాలకు గాను ఏడుపట్టణాల్లో గోదాముల అద్దె 3–8 శాతం మధ్య పెరిగింది. తయారీ/అసెంబ్లింగ్ కోసం పారిశ్రామిక రంగం నుంచి కూడా గిడ్డంగులకు డిమాండ్‌ను పెంచుతోంది. ఈ నివేదిక ప్రకారం 2022–23లో గోదాముల మొత్తం లీజు పరిమాణం 5,13,24,201 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. 2021–22లో ఇది 5,12,94,933 చదరపు అడుగులుగానే ఉండడం గమనార్హం. ప్రధానంగా ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో గోదాముల లీజు డిమండ్ పెరగ్గా, హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, చెన్నై, అహ్మదాబాద్ మార్కెట్లలో తగ్గింది. హైదరాబాద్‌లో డౌన్ హైదరాబాద్‌లో గోదాముల లీజు పరిమాణం 2022–23లో 7 శాతం తగ్గి 5.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. బెంగళూరులో అత్యధికంగా 25 శాతం మేర లీజు పరిమాణం పెరిగింది. 7.4 మిలియన్ దరపు అడుగులకు చేరింది. ఆ తర్వాత కోల్‌కతాలో 18 శాతం పెరిగి 5.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్లో 5 శాతం తగ్గి 8.6 మిలియన్ చదరపు అడుగులుగా, పుణెలో 2 శాతం తక్కువగా 74 మిలియన్ చదరపు అడుగులుగా, చెన్నైలో 11 శాతం క్షీణించి 4.5 మిలియన్ చదరపు అడుగులుగా, అహ్మదాబాద్‌లో 29 శాతం పడిపోయి 3.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. అత్యధికంగా లాజిస్టిక్స్ రంగం 39 శాతం లీజుకు తీసుకుంది. రిటైల్ రంగం వాటా 13 శాతంగా ఉంటే, తయారీ, ఇతర రంగాల వాటా 30 శాతంగా ఉంది. ఈ కామర్స్ సంస్థల వేర్‌హౌసింగ్ లీజు పరిమాణం గత ఆర్థిక సంవత్సరంలో తగ్గింది. కరోనా సంక్షోభ సమయంలో ఎక్కువ సామర్థ్యాలను నిర్మించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. 2021–22లో గోదాముల్లో ఈ కామర్స్ రంగం లీజు వాటా 23 శాతంగా ఉంటే, 2022–23లో 7 శాతానికి పరిమితమైంది. ఎనిమిది ప్రధాన పట్టణాల్లో మొత్తం 412 మిలియన్ చదరపు అడుగుల వేర్ హౌసింగ్ సామర్థ్యం అందుబాటులో ఉండగా, ఇందులో 12 శాతం ఖాళీగా ఉంది. -
లక్ష కోట్ల డాలర్లకు ఇంటర్నెట్ ఎకానమీ
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ విభాగం దన్నుతో దేశీ ఇంటర్నెట్ ఎకానమీ 2030 నాటికి ఆరింతలు పెరగనుంది. 1 లక్ష కోట్ల డాలర్లకు చేరనుంది. గూగుల్, టెమాసెక్, బెయిన్ అండ్ కంపెనీ విడుదల చేసిన సంయుక్త నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022లో భారత ఇంటర్నెట్ ఎకానమీ 155–175 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. బీ2సీ ఈ–కామర్స్ విభాగం, బీ2బీ ఈ–కామర్స్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్విస్ ప్రొవైడర్లు, ఓవర్ ది టాప్ సంస్థల (ఓటీటీ) వంటి ఆన్లైన్ మీడియా దేశీ ఇంటర్నెట్ ఎకానమీకి వృద్ధి కారకాలుగా ఉండగలవని గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ సంజయ్ గుప్తా తెలిపారు. భవిష్యత్తులో చాలా మటుకు కొనుగోళ్లు డిజిటల్‌గానే జరగనున్నాయని పేర్కొన్నారు. డిజిటల్ ఆవిష్కరణలకు అంకుర సంస్థలు బాటలు వేయగా, కోవిడ్ మహమ్మారి అనంతరం చిన్న–మధ్య–భారీ తరహా సంస్థలు మార్కెట్లో దీటుగా పోటీపడేందుకు డిజిటల్ సాంకేతికతలను గణనీయంగా ఉపయోగించడం ఆరంభించాయన్నారు. ప్రపంచ జీడీపీ వృద్ధికి భారత్ కొత్త ఆశాదీపంగా మారిందని టెమాసెక్ ఎండీ (ఇన్వెస్ట్మెంట్స్) విశేష్ శ్రీవాస్తవ్ తెలిపారు. డిజిటల్ సాంకేతికతలను ఆర్థిక కార్యకలాపాల్లో విస్తృతంగా వినియోగించే ఆర్థిక వ్యవస్థను ఇంటర్నెట్ ఎకానమీగా పరిగణిస్తారు. నివేదిక ప్రకారం.. ♦ బీ2సీ ఈ–కామర్స్ 2022లో 60–65 బిలియన్ డాలర్లుగా ఉండగా 2030 నాటికి 5–6 రెట్లు పెరిగి 350–380 బిలియన్ డాలర్లకు చేరనుంది. ♦ బీ2బీ ఈ–కామర్స్ 8–9 బిలియన్ డాలర్ల నుంచి 13–14 రెట్లు పెరిగి 105–120 బిలియన్ డాలర్లకు ఎగియనుంది. ♦ సాఫ్ట్వేర్–యాజ్–ఎ–సర్వీస్ విభాగం 5–6 రెట్లు వృద్ధి చెంది 12–13 బిలియన్ డాలర్ల నుంచి 65–75 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
ఈ–కామర్స్ విధానంపై చర్చలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ విధానాన్ని రూపొందించడంపై అంతర్–మంత్రిత్వ శాఖల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డీపీఐఐటీ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. పరిశ్రమ సమ్మిళిత వృద్ధి సాధించడానికి అనువైన పరిస్థితులను కల్పించే వ్యూహాల రూపకల్పన అనేది ఈ విధానం ప్రధాన లక్ష్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేలా నియంత్రణ విధానాలను క్రమబద్ధీకరించడం, కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడం, సరఫరా వ్యవస్థలను సమగ్రపర్చడం, ఈ–కామర్స్ మాధ్యమం ద్వారా ఎగుమతులను పెంచడం తదితర అంశాలపై అంతర్–మంత్రిత్వ శాఖలు దృష్టి పెడుతున్నాయని సింగ్ వివరించారు. అటు జాతీయ రిటైల్ వాణిజ్య విధానంపై కూడా డీపీఐఐటీ కసరత్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. భౌతిక రిటైల్ రంగం వృద్ధిని ప్రోత్సహించేందుకు, క్రమబద్ధీకరించేందుకు ఉపయోగపడే మార్గదర్శకాలను ఇందులో పొందుపర్చనున్నారు. -
ఓఎన్ డీసీతో ఈ–కామర్స్ విప్లవం?
ఈ–కామర్స్ రంగంలో ఈ మధ్యకాలంలో ఓ విషయం హల్చల్ చేస్తోంది. భారత రిటైల్ రంగాన్ని సమూలంగా మార్చేయగల సత్తా ఉందని చెప్పు కుంటున్న దాని పేరు... ‘ఓఎన్ డీసీ’. వస్తువులు అమ్ముకునే వారికీ, కొనేవారికీ వేదికగా నిలవగల, అందరికీ అందుబాటులో ఉండే నెట్వర్క్ ఇది. స్థూలంగా చెప్పాలంటే దేశంలోని లక్షలాది చిన్న కంపెనీలు అతితక్కువ ఖర్చుతో ఈ–కామర్స్ ప్లాట్ఫార్మ్పై తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఈ ప్లాట్ఫార్మ్కు కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సాహం అందిస్తోంది. అలాగని ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాదు. ప్రైవేట్ రంగంలోనే లాభాపేక్ష లేని సంస్థగా కొనసాగనుంది. ఈ–రిటైలింగ్ దేశం నలుమూలలకూ విస్తరించేందుకు ఇదో గొప్ప సాధనమవుతుందని అంచనా! ‘ఓఎన్ డీసీ’ అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. వ్యాపారులు, వినియోగ దారులిద్దరికీ చాలా అనుకూలంగా ఉండే ఈ ప్లాట్ఫార్మ్కు కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సాహం అందిస్తోంది. అలాగని ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాదు. ప్రైవేట్ రంగంలోనే లాభాపేక్ష లేని సంస్థగా కొన సాగనుంది. బ్యాంకుల్లాంటి ఆర్థిక సంస్థలు, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలెకని వంటివారు ఈ ఓఎన్ డీసీకి దన్నుగా నిలిచారు. నందన్ నీలెకని ఈ మొత్తం ప్రయత్నానికి సూత్రధారి అని కూడా చెబుతున్నారు. ఈ– కామర్స్ రంగాన్ని ప్రజాస్వామ్య పథం పట్టించే సామర్థ్యమున్న అతి పెద్ద ఆవిష్కరణ ఇదని నందన్ చెబుతున్నారు. ఓఎన్ డీసీకి ఇచ్చిన నిర్వచనాన్ని పరిశీలించినా ఈ విషయం అర్థమవుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ప్లాట్‌ఫార్మ్‌లపై ఏ సంస్థ అయినా తమ ఉత్పత్తులను అమ్ముకోవాలంటే వాటిల్లో ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మకాల్లో గరిష్ఠంగా 35 శాతం కమిషన్‌ను ఈ ప్లాట్ఫార్మ్లు పొందుతూంటాయి. ఓఎన్ డీసీలో ఈ అవసరం ఉండదు. వినియోగదారులకూ ఇది వర్తిస్తుంది. చిన్న చిన్న కంపెనీలు నేరుగా ఓఎన్ డీసీ ప్లాట్ఫార్మ్పై తమ ఉత్పత్తులను అమ్ము కునేందుకు వీలేర్పడుతోంది. ఈ ఉత్పత్తులను వినియోగదారులు మాత్రమే కాకుండా... అమెజాన్ వంటి పెద్ద రిటైయిలర్లూ కొనుగోలు చేయవచ్చు. ఓఎన్ డీసీలో కమిషన్ కేవలం రెండు నుంచి ఐదు శాతం మాత్రమే ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే దేశంలోని లక్షలాది చిన్న కంపెనీలు అతితక్కువ ఖర్చుతో ఈ–కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లపై తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఓఎన్ డీసీని అప్పుడే యూపీఐతో పోలు స్తున్నారు. దేశంలో ఇప్పటికే భారీ విజయం సాధించిన ఈ చెల్లింపుల విధానాన్ని అమలు చేసేందుకు, లేదా యూపీఐలోనే భాగంగా మారేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. యూపీఐ సాయంతో గూగుల్ పే, ఫోన్ పే, జియో, అమెజాన్ వంటి అనేక పేమెంట్ పోర్టళ్ల నుంచి చెల్లింపులు చేయవచ్చునన్నది మనకు తెలిసిన విషయమే. ఓఎన్ డీసీ ఆలోచన చాలా బాగున్నప్పటికీ ప్రస్తుతానికి అది బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. మైక్రోసాఫ్ట్, పేటీఎం, ఫోన్ పే వంటి దిగ్గజ కంపెనీలూ దీంట్లో భాగస్వాములయ్యాయి. ఓఎన్ డీసీ నెట్‌వర్క్‌ను వినియోగదారులు భిన్నరీతుల్లో ఉపయోగిస్తున్నారు. దీనివల్ల కొన్ని వివాదాలూ వస్తున్నాయి. ఉదాహరణకు... కొంత మంది ఓఎన్ డీసీ నెట్‌వర్క్‌పై ఆహారాన్ని ఆర్డర్ చేస్తూండటం. జొమాటో, స్విగ్గీ వంటి అప్లికేషన్ల జోలికి పోకుండా వినియోగదారులు నేరుగా ఓఎన్ డీసీ ప్లాట్ఫార్మ్ పైనే ఫుడ్ ఆర్డర్లు పెడుతూండటం... కమిషన్లు తక్కువగా ఉన్న కారణంగా ధరలు తక్కువగా ఉండటం రెస్టారెంట్లను ఆకర్షిస్తోంది. స్విగ్గీ, జొమాటో లాంటి పెద్ద కంపెనీలు తమను నియంత్రిస్తున్నాయన్న భావనలో ఉన్న రెస్టారెంట్లు ఇప్పుడు ఓఎన్ డీసీ వైపు మళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. సమస్యల్లా ఒక్కటే. సరకుల రవాణా బాధ్యత ఏ కంపెనీ తీసుకోవాలి? ఈ నైపుణ్యం డెలివరీ అప్లికేషన్లది! ఒకవేళ ఆర్డర్లు సరైన సమయానికి వినియోగదారులకు చేరకపోతే, అందిన సరుకులు సక్రమంగా లేకపోతే బాధ్యత ఎవరిది? ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఫుడ్ డెలివరీకి మాత్రమే కాదు, ఇతర విక్రయాలకూ ఈ సమస్యల పరిష్కారం అత్యవసరం. రవాణా సమస్యల పరిష్కారానికి ‘లాజిస్టిక్స్’ రంగంలోని స్టార్టప్‌లతో ప్రయత్నాలు మొదలయ్యాయని ఓఎన్ డీసీ చెబుతోంది. డెలివరీ సమస్యలను ఇవి చూసుకుంటాయని అంటోంది. అయితే కొన్ని అంశాలను ఇంకా సరిచేయాల్సిన అవసరముంది. డిస్కౌంట్లు, తక్కువ కమిషన్ వంటివి ఇలాగే ఎక్కువ కాలంపాటు కొనసాగే అవకాశాలు తక్కువ. ఓఎన్ డీసీ నిర్వాహకులు కూడా పలు సంద ర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నెట్వర్క్ ఆరంభానికీ, ప్రాచుర్యానికీ ఈ డిస్కౌంట్లు ఉపయోగపడతాయి కానీ... దీర్ఘకాలంలో వీటి రూపురేఖలు మార్కెట్ శక్తులపై ఆధారపడి ఉంటాయని వారు చెబుతున్నారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఓఎన్ డీసీలో 36,000 మంది విక్రయదారులున్నారు. గత ఏడాది సెప్టెంబరులో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ సాధించిన పురోగతి ఇది. అలాగే నెట్వర్క్ భాగస్వాముల సంఖ్య 45గా ఉంది. సగటున వారానికి 13 వేల రిటైల్ ఆర్డర్లు వస్తూండగా... గరిష్ఠంగా ఒక్క రోజులో 25 వేల వ్యవహారాలు నడిచాయి. ఈ–రిటైల్ రంగం సామర్థ్యం భారీ ఎత్తున పెరగనుందని కూడా ఓఎన్ డీసీ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. సుమారు 14 కోట్ల మంది ఆన్లైన్ వినియో గదారులతో చైనా, అమెరికా తరువాత భారత్ మూడో స్థానంలో ఉందని లెక్క. అయితే దేశంలో ఈ–రిటైల్ చొచ్చుకుపోయింది చాలా తక్కువ. చైనాలో 25 శాతం ప్రాంతాలకు విస్తరించగా, కొరియాలో ఇది 26 శాతంగా ఉంది. అలాగే యూకేలో ఈ–రిటైల్ విస్తరణ 23 శాతముంటే, భారత్‌లో కేవలం 4.3 మాత్రమే. దేశంలో ఉండే 75 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులను పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా తక్కువ. బెయిన్ అండ్ ఆక్సీల్ సంస్థ లెక్కల ప్రకారం 2027 నాటికి దాదాపు కోటీ యాభై లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఆన్లైన్ క్రయ విక్రయాలకు దిగనున్నాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 60 లక్షలు మాత్రమే. ఈ నేపథ్యంలోనే ఓఎన్ డీసీకి ప్రాధాన్యమేర్పడుతోంది. ఈ–రీటెయిలింగ్ దేశం నలుమూలకూ విస్తరించేందుకు ఇదో గొప్ప సాధనమవుతుందని అంచనా. ఓఎన్ డీసీ పుట్టి నెలలు కూడా గడవకముందే దీనిపై కొందరు ఇది పనిచేయదని పెదవి విరిచేస్తున్నారు. పనిభారం ఎక్కువవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంటర్నెట్ దిగ్గజ కంపెనీలు ఓఎన్ డీసీలో భాగం కాకపోతే విజయవంతమయ్యే అవకాశాలు తక్కువన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. గూగుల్ ఈ నెట్‌వర్క్‌లో భాగస్వామి అవుతుందని గత ఏడాది మధ్యలో కొన్ని వదంతులైతే వచ్చాయి. కానీ ఆ తరువాత ఎలాంటి సద్దు లేదు. ఈ–కామర్స్ సంస్థలు అమెజాన్, వాల్‌మార్ట్ ఆధ్వర్యంలోని ఫ్లిప్‌కార్ట్ ఇంకా ఓఎన్ డీసీలో చేరలేదు. అయితే వాల్‌మార్ట్‌కే చెందిన ఫోన్ పే ఇప్పటికే ఇందులో భాగస్వామి కావడం గమనార్హం. ఫోన్ పే... ‘పిన్ కోడ్’ అనే ప్రత్యేకమైన అప్లికేషన్‌తో ఓఎన్డీసీలో చేరింది. ఓలా, ఊబర్‌లను కూడా చేర్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఈ రంగంలో ఇప్పటివరకూ బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ‘నమ్మ యాత్రి’ అన్న రైడ్ హెయి లింగ్ సంస్థ మాత్రమే ఓఎన్ డీసీలో భాగంగా ఉంది. ఓఎన్ డీసీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న నెట్వర్క్. పూర్తి సామర్థ్యాన్ని అందుకునేందుకు కొంత సమయం పడుతుంది. ఈ నెట్‌వర్క్‌లో ఇప్పుడే భాగస్వాములుగా చేరాలనీ, భవిష్యత్తులో చేర్చుకోమనీ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ వ్యాఖ్యానించడం దీని అభివృద్ధికి అంతగా సహకరించేది కాదు. ఓఎన్డీసీ జయాపజయాలు ఆర్థికంగా ఎంతమేరకు అనుకూలం అన్నది భాగస్వాముల చేరిక, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి అంశాలపై ఆధారపడి ఉంది. యూపీఐ, ఆధార్ల మాదిరిగా ఓఎన్డీసీ కూడా విప్లవాత్మకమైన ఆలోచనైతే అది దాని సృజనాత్మక డిజైన్ కారణంగానే అవు తుంది కానీ ప్రభుత్వ మార్గదర్శకత్వాల కారణంగా కాదు. ఈ కొత్త ఈ–కామర్స్ ప్రపంచం ఎలా పరిణమించనుందో తెలుసుకోవాలంటే వేచి చూడటం కంటే వేరు మార్గం లేదు. సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఆర్థిక వ్యవహారాల జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
క్రెడిట్ కార్డ్‌లు వినియోగిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!
న్యూఢిల్లీ: దేశీయంగా చోటు చేసుకుంటున్న మోసాల్లో 57 శాతం పైగా ఉదంతాలు ‘ప్లాట్‌ఫామ్’ ఆధారితమైనవే ఉంటున్నాయని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. కోవిడ్ మహమ్మారి రాక తర్వాత ఈ తరహా నేరాలు భారీగా పెరిగాయని తెలిపింది. రిమోట్ పని విధానం, ఈ–కామర్స్, డెలివరీ యాప్‌లు, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు మొదలైనవన్నీ కూడా ఇటువంటి మోసాల పెరుగుదలకు దారి తీశాయని ‘ఆర్థిక నేరాలు, మోసాల సర్వే 2022’ నివేదికలో పీడబ్ల్యూసీ వివరించింది. సోషల్ మీడియా, ఈ–కామర్స్, ఎంటర్ప్రైజ్, ఫిన్‌టెక్ వేదికలను ప్లాట్‌ఫామ్‌లుగా పరిగణిస్తున్నారు. ప్లాట్‌ఫామ్ మోసాల వల్ల 26 శాతం దేశీ సంస్థలు 1 మిలియన్ డాలర్ల పైగా (దాదాపు రూ. 8.2 కోట్లు) నష్టపోయినట్లు పేర్కొంది. 111 సంస్థలపై సర్వే ఆధారంగా పీడబ్ల్యూసీ ఈ నివేదిక రూపొందించింది. ఇందులో టెక్నాలజీ, ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లు, రిటైల్, విద్య, హెల్త్‌కేర్ తదితర రంగాల కంపెనీలు ఉన్నాయి. ప్లాట్‌ఫామ్‌ల వినియోగం వేగవంతం.. గడిచిన కొన్నాళ్లుగా భారతీయ వినియోగదారులు, సంస్థల్లో కొత్త ప్లాట్‌ఫామ్‌ల వినియోగం చాలా వేగంగా పెరిగిందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ పునీత్ గర్ఖెల్ తెలిపారు. ‘సగటున ఒక భారతీయ కంపెనీ అయిదు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లపై తన వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ–కామర్స్, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు, హోమ్ డెలివరీ విధానాలు, రిమోట్ పని విధానం మొదలైనవి వివిధ రకాల ప్లాట్‌ఫాం ఆధారిత ఆవిష్కరణలకు దారి తీసినప్పటికీ నేరగాళ్లకు కూడా కొత్త మార్గాలు లభించినట్లయింది‘ అని పేర్కొన్నారు. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తగా ముంచుకొచ్చే ముప్పుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని.. మోసాలను ముందస్తుగా గుర్తించి, నివారించడంపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నివేదిక సూచించింది. ఇందులోని మరిన్ని అంశాలు.. ► ప్రతి 10 ప్లాట్‌ఫామ్ మోసాల్లో నాలుగు .. అంతర్గత కుట్రదారుల వల్లే చోటుచేసుకున్నాయి. ► లోపలి వారు, బైటివారు కుమ్మక్కై చేసిన మోసాలు 26 శాతం ఉన్నాయి. కంపెనీలు అంతర్గతంగా పటిష్టమైన చర్యలు అమలు చేస్తే మూడింట రెండొంతుల ప్లాట్‌ఫామ్ మోసాలను నివారించవచ్చని దీని ద్వారా తెలుస్తోందని నివేదిక తెలిపింది. ► కస్టమర్లు మోసపోయిన కేసుల్లో 92 శాతం మోసాలు చెల్లింపులపరమైనవిగా ఉన్నాయి. ప్రధానంగా క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్ల ద్వారా ఇలాంటివి చోటు చేసుకున్నాయి. -
ప్రైమ్బుక్ చవక ల్యాప్‌టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ తాజాగా విద్యార్థుల కోసం ప్రైమ్బుక్ 4జీ ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ఆన్‌డ్రాయిడ్–11 ఆధారిత ప్రైమ్‌ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పనిచేస్తుంది. మీడియాటెక్ ఎంటీకే8788 ప్రాసెసర్, 11.6 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, వైఫై, బ్లూటూత్, 4జీ సిమ్ స్లాట్, ఫుల్ హెచ్డీ 2 ఎంపీ కెమెరా ఏర్పాటు ఉంది. బరువు 1.065 కిలోలు. ఒక ఏడాది ఆన్సైట్ వారంటీ ఉంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచారు. 10 గంటలకుపైగా బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని కంపెనీ తెలిపింది. 200 జీబీ వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాంక్, స్టూడెంట్ ఆఫర్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆరు నెలల ఉచిత చందా, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లతో రూ.11,827 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ వివరించింది. ధర వేరియంట్‌నుబట్టి 4జీబీ/64 జీబీ రూ. 16,990, అలాగే 4జీబీ/128 జీబీ రూ.18,990 ఉంది. ఈ ల్యాప్‌టాప్ దేశీయంగా తయారైంది. విద్యార్థుల కోసం ఉద్ధేశించిన ల్యాప్టాప్స్ విక్రయా లు తమ వేదికపై గడిచిన మూడేళ్లలో 1.5 రెట్లు పెరిగాయని ఫ్లిప్‌కార్ట్ లార్జ్ అప్లయాన్సెస్, ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ హరి కుమార్ తెలిపారు. -
షాపర్‌టైన్‌మెంట్‌కు స్వాగతం
తాము ఇష్టపడే వస్తువును కొనడానికి వెబ్సైట్లలోకి వెళ్లే యువతరం... అక్కడ కనిపించే సుదీర్ఘమైన సమాచారాన్ని చదవడం బోర్‌గా ఫీలవుతున్నారు.అలా అని వస్తువుగురించి పూర్తిగా తెలుసుకోకుండా కొనుగోలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో లైవ్ ‘షాపర్‌టైన్‌మెంట్’ను ఇష్టపడుతున్నారు.వెబ్సైట్లలో వన్‌సైడ్ కమ్యూనికేషన్ ఇష్టపడని వారికి లైవ్ కామర్స్ యాప్‌లు దగ్గరయ్యాయి. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన 25 సంవత్సరాల కనిక షిండే యాక్టివ్ ఆన్లైన్ షాపర్. రియల్ టైమ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్కు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు ఆమె నోట పదేపదే వినిపిస్తున్నమాట షాపర్‌టైన్‌మెంట్. ‘షాపర్టైన్మెంట్లో షాప్‌కు వెళ్లి సరదాగా షాపింగ్ చేసిన అనుభూతి కలుగుతుంది. లిప్‌స్టిక్ నుంచి ఐ షాడోస్ వరకు మనం ఎంపిక చేసుకునే వస్తువుల విషయంలో స్పష్టత వస్తుంది. ఆ వస్తువులకు సంబంధించి సందేహాలకు వెంటనే సమాధానాలు దొరుకుతాయి’ అంటుంది కనిక. నాసిక్‌లోని కనిక షిండే మాత్రమే కాదు మన దేశంలో చిన్న, పెద్ద పట్టణాలు అనే తేడా లేకుండా జెన్–జెడ్, మిలీనియల్స్ రియల్ టైమ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ‘షాపర్‌టైన్‌మెంట్’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడది వారికి ఫ్యాషన్‌గా కూడా మారింది. చైనీస్ డిజిటల్ మార్కెట్లో పుట్టిన ‘షాపర్‌టైన్‌మెంట్’ (కాంబినేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇ– కామర్స్, వీడియో కంటెంట్) ట్రెండ్ ఇప్పుడు మన దేశంలోనూ హల్చల్ చేస్తోంది.చైనాలో ‘షాపర్‌టైన్‌మెంట్’ అనేది పాపులర్ ట్రెండ్‌గా ఉంది. చైనాకు చెందిన దిగ్గజ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ‘టవ్భావ్’ షాపర్‌టైన్‌మెంట్‌కు ఊపు ఇచ్చింది. అమ్మకాల్లో కొత్త చరిత్ర సృష్టించింది. ‘ఇది కేవలం మరో మార్కెటింగ్ ట్రెండ్ కాదు. రిటైల్ ఇండస్ట్రీ ముఖచిత్రాన్ని మార్చే పరిణామం’ అంటున్నారు విశ్లేషకులు.చైనాలోని షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్స్ దౌయిన్, క్లైష్ ‘షాపర్‌టైన్‌మెంట్’ ట్రెండ్ దూసుకుపోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నసంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు ‘షాపర్‌టైన్‌మెంట్’కు పెద్ద పీట వేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫాం ‘మింత్రా’ లైవ్ వీడియో స్ట్రీమింగ్ యాప్ లాంచ్ చేసింది. 2026 కల్లా ‘షాపర్‌టైన్‌మెంట్’ అమ్మకాలు గణనీయంగా పెరగనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇ–కామర్స్ ప్రపంచంలో కస్టమర్ రివ్యూలు కొనుగోలు ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ఇవి కొన్నిసార్లు గందరగోళంగా మారి ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలోకి నెడతాయి. ఇలాంటి సమయంలోనే షాపర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యత పెరుగుతుంది. – హరిత, కోజికోడ్ (కేరళ) వెబ్సైట్లలో కనిపించే సుదీర్ఘమైన సమాచారం చదవాలంటే బోర్‌గా ఉంటుంది. మనం కావాలనుకున్న వస్తువును కంటితో చూసి కొనుగోలు చేయడంలోనే మానసిక తృప్తి ఉంటుంది. – శాంతిస్వర, చెన్నై -
సంచలనం:దేశీయ తొలి చాట్‌బాట్ ‘లెక్సీ’ వచ్చేసిందిగా..!
న్యూడిల్లీ: ఒకవైపు ఓపెన్ ఏఐ చాట్‌బాట్ చాట్ జీపీటీ సంచలనం కొనసాగుతుండగానే దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్‌ను ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ వెలాసిటీ లాంచ్ చేసింది. ఈ చాట్‌బాట్‌కు కంపెనీ 'లెక్సీ' అని పేరు పెట్టింది. వినియోగదారులకు సులువైన, మెరుగైన సేవలు అందిస్తామని వెలాసిటీ సంస్థ కో ఫౌండర్ అభిరూప్ మెధేకర్ పేర్కొన్నారు. కంపెనీ ప్రకారం, వెలాసిటీ ఇన్సైట్లను ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్యాప్ వాట్సాప్ ఇంటర్ఫేస్లో ChatGPTని ఇంటిగ్రేట్ చేసింది. తద్వారా ఈ-కామర్స్ వ్యాపారులకు వారి వ్యాపారాలపై విశ్లేషణలు ,రోజువారీ వ్యాపార నివేదికలు (ఇన్సైట్స్ )పంపిస్తుందనీ, క్లిష్టమైన వ్యాపార విధుల కోసం సమయాన్ని ఖాళీ చేస్తుందని కంపెనీ తెలిపింది. లెక్సీ ప్రారంభించినప్పటి నుండి వెలాసిటీ ఇన్సైట్స్ తమ బ్రాండ్ ఆదాయాన్ని మార్కెటింగ్ ఖర్చులను పర్యవేక్షించడంలో సహాయపడిందని నేచర్ప్రో సీఈవో, పౌండర్ వ్యవస్థాపకుడు మోహిత్ మోహపాత్ర ఒక ప్రకటనలో తెలిపారు. -
పీవోఎస్, యూపీఐ లావాదేవీలకు ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: పాయింట్ ఆఫ్ సేల్, ఈ కామర్స్ సంస్థలకు రూపే డెబిట్ కార్ట్‌తో చేసే చెల్లింపులు, వరక్తుల వద్ద భీమ్ యూపీఐ ప్లాట్‌ఫామ్ సాయంతో చేసిన తక్కువ విలువ లావాదేవీలకు ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ ఉంచారు. రూపే కార్డు, భీమ్ యూపీఐ లావాదేవీ రూ.2,000లోపున్న వాటిపై ఈ ప్రోత్సాహకాలు అందనున్నాయి. పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్లపై, ఈ కామర్స్ సైట్లపై రూపే డెబిట్ కార్డుతో చెల్లింపులు చేసినప్పుడు.. స్వీకరించే బ్యాంకులకు 0.4 శాతం, గరిష్టంగా రూ.100 ప్రోత్సాహకంగా లభిస్తుంది. భీమ్ యూపీఐ ఆధారిత లావాదేవీలపై చెల్లింపులను స్వీకరించే బ్యాంకులకు 0.25 ప్రోత్సాహకం లభిస్తుంది. ఇవి రిటైల్ చెల్లింపులకు సంబంధించినవి. అలా కాకుండా ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వం, విద్య, రైల్వే తదితర రంగాల్లోని లావాదేవీలపై ప్రోత్సాహకాలు భిన్నంగా ఉన్నాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రోత్సాహకాలు ఏడాది పాటు అమల్లో ఉంటాయి. గరిష్టంగా రూ.2,600 కోట్లను ఈ ప్రోత్సాహకాల కోసం కేంద్రం కేటాయించింది. -
ఈ–కామర్స్ నియంత్రణకు వ్యవస్థ: సీఏఐటీ డిమాండ్
న్యూఢిల్లీ: పటిష్ట ఈ–కామర్స్ విధానాన్ని రూపొందించడంతోపాటు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని వ్యాపారుల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సెబీ, ఆర్బీఐ మాదిరిగా ఈ–కామర్స్ వ్యాపార నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండెల్వాల్ అభిప్రాయపడ్డారు. వినియోగదారుల రక్షణ చట్టం కింద ప్రభుత్వం ఈ–కామర్స్ నిబంధనలను ప్రకటించడంతోపాటు ఎఫ్‌డీఐ రిటైల్ పాలసీ–2018 ప్రెస్ నోట్–2 స్థానంలో కొత్త ప్రెస్ నోట్‌ను విడుదల చేయాలని అన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థను సరళీకృతం చేయడం, హేతుబద్ధీకరించడంతోపాటు జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని రూపొందించాలని సీఏఐటీ కోరింది. -
సెబీ మాదిరిగా..ఈ - కామర్స్‌కు ప్రత్యేక వ్యవస్థ ఉండాలి..సీఏఐటీ డిమాండ్
న్యూఢిల్లీ: పటిష్ట ఈ–కామర్స్ విధానాన్ని రూపొందించడంతోపాటు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని వ్యాపారుల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సెబీ, ఆర్బీఐ మాదిరిగా ఈ–కామర్స్ వ్యాపార నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండెల్వాల్ అభిప్రాయపడ్డారు. వినియోగదారుల రక్షణ చట్టం కింద ప్రభుత్వం ఈ–కామర్స్ నిబంధనలను ప్రకటించడంతోపాటు ఎఫ్‌డీఐ రిటైల్ పాలసీ–2018 ప్రెస్ నోట్–2 స్థానంలో కొత్త ప్రెస్ నోట్‌ను విడుదల చేయాలని అన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థను సరళీకృతం చేయడం, హేతుబద్ధీకరించడంతోపాటు జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని రూపొందించాలని సీఏఐటీ కోరింది. -
ఈ– కామర్స్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మెరుగుపడాలి
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థల ఫిర్యాదుల పరిష్కార విధానం గుర్తించదగిన స్థాయిలో పటిష్టంగా లేదని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. నేషనల్ కన్సూ్యమర్ హెల్ప్‌లైన్‌కు (ఎన్సీహెచ్) వచ్చిన ఫిర్యాదుల సంఖ్య గత నాలుగేళ్లలో భారీగా పెరిగిందని కూడా చెప్పారు. పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2021 నవంబర్‌నాటికి నేషనల్ కన్సూ్యమర్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 40,000 ఉంటే, 2022 నవంబర్ నాటికి ఈ సంఖ్య 90,000కు చేరిందని అన్నారు. నాలుగేళ్ల క్రితం మొత్తం ఫిర్యాదుల్లో ఈ– కామర్స్ లావాదేవీలకు సంబంధించినవి 8 శాతం ఉంటే, గత నెల్లో ఇది 48 శాతంగా నమోదయినట్లు వెల్లడించారు. ఈ–కామర్స్ సంస్థల ఫిర్యాదుల పరిష్కార విధానం సరిగా లేదన్న విషయం దీనిని బట్టి అర్థం అవుతోందని అన్నారు. కీలక చర్యలకు శ్రీకారం.. వినియోగదారుల బలహీనపడుతున్న పరిస్థితుల్లో మంత్రిత్వజోక్యం పాత్ర కీలకమవుతోందని అన్నారు. ప్రస్తుతం 10 భాషల్లో ఎన్సీహెచ్ సేవలు అందిస్తోందని, భవిష్యత్తులో ఇవి 22కి పెరుగుతాయని చెప్పారు. వినియోగ హక్కుల పరిరక్షణకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 5.27 లక్షల కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన సింగ్, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న మొత్తం కేసుల్లో 1.8 లక్షలు బీమా రంగానికి సంబంధించినవి కాగా మరో 80,000 కేసులు బ్యాంకింగ్‌కు సంబంధించినవని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే ఉత్పత్తుల ప్రకటన విషయాన్ని ప్రస్తావిస్తూ, దీనిపై త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు తెలిపారు. ‘‘మేము ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ల కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసాము. అది త్వరలో విడుదలవుతుంది. ఉత్పత్తిని ఆమోదించి, ప్రచారం చేసిన వారు డబ్బు తీసుకున్నారో, లేదో వెల్లడించాలి’’ అని ఆయన అన్నారు. కృత్రిమ మేధస్సు, స్థిర ప్యాకేజింగ్‌పై ప్రమాణాలను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు. -
పండుగల్లో తారాజువ్వలా ఈ కామర్స్ విక్రయాలు
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో (అక్టోబర్‌లో) ఈ కామర్స్ సంస్థ అమ్మకాలు జోరుగా సాగాయి. కస్టమర్ల డిమాండ్‌తో అమ్మకాల్లో 25 శాతం వృద్ధిని చూశాయి. రూ.76,000 కోట్ల అమ్మకాలు నమోదైనట్టు మార్కెట్ పరిశోధనా సంస్థ రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ వెల్లడించింది. పండుగల సీజన్ తొలి వారానికి తాము వేసిన అంచనాలకు అనుగుణంగానే ఈ కామర్స్ కంపెనీల విక్రయాలున్నట్టు రెడ్‌సీర్ పార్ట్నర్ ఉజ్వల్ చౌదరి చెప్పారు. ‘‘రూ.83,000 కోట్ల అమ్మకాలు ఉంటాయని మేము అంచనా వేశాం. చివరికి గ్రాస్ మర్చండైజ్ వ్యాల్యూ (విక్రయించిన ఉత్పత్తుల విలువ) రూ.76,000 కోట్లుగా నమోదైంది. మా తొలి అంచనాల కంటే 8–9 శాతం తక్కువ. అయినప్పటికీ ఈ మొత్తం కూడా చెప్పుకోతగ్గ గరిష్ట స్థాయి. గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే 25 శాతం అధికం’’అని ఉజ్వల్ చౌదరి వివరించారు. ఫ్లిప్‌కార్ట్ గ్రూపు (మింత్రా, షాప్సీ సహా) రూ.40వేల కోట్ల విక్రయాలతో 62 శాతం వాటా ఆక్రమించినట్టు రెడ్‌సీర్ నివేదిక తెలిపింది. ఆ తర్వాత అమెజాన్ వాటా 26 శాతంగా ఉంది. ఫ్యాషన్ ఉత్పత్తులు 32 శాతం, మొబైల్ ఫోన్లు 7 శాతం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు (గృహోపకరణలు సహా) 13 శాతం, ఇతర విభాగాల్లో అమ్మకాలు 86 శాతం చొప్పున పెరిగాయి. మొబైల్ ఫోన్లు అధిక మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. -
వచ్చే ఏడాదిలోనూ ఉద్యోగాల్లో కోతలు
న్యూయార్క్: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ప్రారంభమైన ఉద్యోగాల కోతలు వచ్చే ఏడాది వరకూ కొనసాగనున్నాయి. ఎంత మందిని తొలగించేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని కంపెనీ సీఈవో ఆండీ జస్సీ పేర్కొన్నారు. వార్షిక సమీక్ష ప్రక్రియ వచ్చే ఏడాది వరకు కొనసాగుతుందని, కస్టమర్ల అవసరాలు.. కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏయే విభాగాల్లో ఎంత మంది సిబ్బందిని తగ్గించుకోవాలనే దానిపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఉద్యోగులకు పంపిన నోట్లో జస్సీ పేర్కొన్నారు. తీసివేతల గురించి డివైజ్‌లు, బుక్స్ విభాగాల సిబ్బందికి బుధవారం తెలియజేశామని, కొందరికి స్వచ్ఛందంగా పదవీ విరమణ అవకాశాలను కూడా ఆఫర్ చేశామని ఆయన వివరించారు. తాను సీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర కాలంలో సిబ్బందిని తగ్గించుకునే అంశం అత్యంత కష్టతరమైన నిర్ణయమని జస్సీ పేర్కొన్నారు. అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది పైగా సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది గంటలవారీగా పని చేసే వర్కర్లు ఉన్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని తమ కార్యాలయాల్లో 260 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్న విషయాన్ని మూడు రోజుల క్రితం అధికారులకు తెలియజేసింది. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్న పలు టెక్ కంపెనీలు .. తాజాగా సిబ్బందిని తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 11,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ట్విటర్‌ను టేకోవర్ చేశాక ఎలాన్ మస్క్ సగానికి పైగా ఉద్యోగులను తీసివేశారు. -
అమెజాన్‌లో 10 వేల ఉద్యోగాలు కట్..
న్యూయార్క్: టెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగాల్లో కోతల పర్వం కొనసాగుతోంది. తాజాగా ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల తరహాలోనే ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా రాబోయే రోజుల్లో దాదాపు 10,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్యలో ఇది మూడు శాతం కాగా అంతర్జాతీయంగా ఉన్న సిబ్బంది సంఖ్యలో ఒక్క శాతం కన్నా తక్కువని న్యూయార్క్ టైమ్స్ (ఎన్‌వైటీ) ఒక కథనాన్ని ప్రచురించింది. వాయిస్ అసిస్టెంట్ అలెక్సాతో పాటు డివైజ్‌ల విభాగం, రిటైల్, మానవ వనరుల విభాగంలో ఈ కోతలు ఉండనున్నాయని పేర్కొంది. కొన్నాళ్లుగా అమెజాన్‌లో ఈ ధోరణులు కనిపిస్తూనే ఉన్నాయని ఎన్‌వైటీ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో అమెజాన్ 80,000 పైచిలుకు సిబ్బందిని తగ్గించుకున్నట్లు పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది గంటల ప్రాతిపదికన పని చేసేవారే ఉన్నట్లు వివరించింది. చిన్న బృందాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్‌ను సెప్టెంబర్‌లోనే నిలిపివేసిందని, అలాగే అక్టోబర్‌లో కీలకమైన రిటైల్ వ్యాపారంలోనూ 10,000 పైచిలుకు ఖాళీలను భర్తీ చేయకుండా ఆపేసిందని ఎన్‌వైటీ పేర్కొంది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు బాగా లేకపోవడంతో వ్యాపారాన్ని వేగంగా క్రమబద్ధీకరించుకునేలా అమెజాన్‌పై ఒత్తిడి పెరిగిపోతోందని వివరించింది. ఎలాన్ మస్క్ చేతికి వచ్చిన తర్వాత మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో దాదాపు సగం మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. మెటా (ఫేస్బుక్ మాతృ సంస్థ) కూడా 11,000 మంది పైచిలుకు సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. -
ఫైనాన్స్ వ్యాపారంలోకి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్
ముంబై: సజ్జన్ జిందాల్ సారథ్యంలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తాజాగా రుణాల వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఈ–కామర్స్ విభాగమైన జేఎస్‌డబ్ల్యూ వన్ ప్లాట్‌ఫామ్స్ (జేఎస్‌డబ్ల్యూవోపీ) కింద గ్రూప్‌లోని సంస్థల అవసరాల కోసం జేఎస్‌డబ్ల్యూ వన్ ఫైనాన్స్ పేరిట నాన్–బ్యాంక్ ఫైనాన్స్ సంస్థ (ఎన్బీఎఫ్సీ)ని ఏర్పాటు చేస్తోంది. అందులో రెండేళ్ల వ్యవధిలో రూ. 350– రూ. 400 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు త్రైమాసికంలో లైసెన్సు కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేసుకోనున్నట్లు, ఆ తర్వా 7–9 నెలల్లో నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు జేఎస్‌డబ్ల్యూవోపీ సీఈవో గౌరవ్ సచ్‌దేవా చెప్పారు. ఇందులో దాదాపు 200 మంది వరకూ సిబ్బంది ఉంటారు. ఆ తర్వాత క్రమంగా గ్రూప్‌లోని సిమెంటు, స్టీల్, పెయింట్స్ తదితర ఇతర కంపెనీలకు ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ అందిస్తుంది. తమ క్లయింట్లుగా ఉన్న లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు బ్యాంకింగ్ రంగం నుంచి తోడ్పాటు ఎక్కువగా లభించదని, ఈ నేపథ్యంలోనే వాటి అవసరాలను తీర్చేందుకు ఎన్బీఎఫ్సీని ఏర్పాటు చేస్తున్నట్లు సచ్‌దేవా చెప్పారు. -
Srishti Bakshi: గ్రేట్ ఛేంజ్మేకర్
కొన్ని సంవత్సరాల క్రితం...‘ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో తల్లీకూతుళ్లు సామూహిక అత్యాచారానికి గురయ్యారు’ అనే వార్త చదివిన తరువాత శ్రీష్ఠి బక్షీ మనసు మనసులో లేదు. కళ్ల నిండా నీళ్లు. బాధ తట్టుకోలేక తాను చదివింది కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకుంది. ‘ఇలాంటివి మన దేశంలో సాధారణం’ అన్నారు వాళ్లు. ఈ స్పందనతో శ్రీష్ఠి బాధ రెట్టింపు అయ్యింది. ఇలా ఎవరికి వారు సాధారణం అనుకోవడం వల్లే పరిస్థితి దిగజారిపోతుంది. ఒక దుస్సంఘటన జరిగితే దానిపై ఆందోళన, ఆవేదన వ్యక్తం అవుతుంది తప్ప నిర్దిష్టమైన కార్యాచరణ మాత్రం కనిపించడం లేదు’ అనుకుంది. ఆరోజంతా శ్రిష్ఠి అదోలా ఉంది. ఈ నేపథ్యంలోనే తన వంతుగా ఏదో ఒకటి చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. మహిళలకు సంబంధించిన భద్రత, హక్కుల గురించి అవగాహన కలిగించడానికి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుంది. దీనికి ముందు రకరకాల కేస్‌స్టడీలు, పరిశోధన పత్రాలు చదివింది. ఆధునిక సాంకేతిక జ్ఞానంతో అపూర్వ విజయాలు సాధించిన సాధారణ మహిళల గురించి అధ్యయనం చేసింది. బెంగాల్‌లోని ఒక పనిమనిషి సరదాగా యూట్యూబ్‌లో వంటలకు సంబంధించిన రకరకాల వీడియోలను పోస్ట్ చేసేది. కొద్దికాలంలోనే ఆమె యూట్యూబ్ స్టార్‌గా ఎదిగి ఆర్థికంగా బాగా సంపాదించడాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. ఆశీర్వాదం తీసుకుంటూ... తమిళనాడు గ్రామీణ ప్రాంతానికి చెందిన తల్లీకూతుళ్లు వాట్సాప్ కేంద్రంగా దుస్తుల వ్యాపారం మొదలుపెట్టి ఘన విజయం సాధించారు... ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయక విజయాల గురించి తెలుసుకుంది. ఇలాంటి ఎన్నో విజయగాథలను తన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంది. ‘టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్‌ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు’ అనుకుంది శ్రిష్ఠి బక్షీ. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల గుండా 3,800 కి.మీల పాదయాత్ర చేసింది. ఈ యాత్రలో ఎంతోమంది మహిళలు ఎన్నో సమస్యలను తనతో పంచుకున్నారు. పరిష్కార మార్గాల గురించి లోతైన చర్చ జరిగిదే. ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. తాజా విషయానికి వస్తే... హక్కుల నుంచి సాధికారత వరకు వివిధ విషయాల్లో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన శ్రిష్టి బక్షీని ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక ‘ఛేంజ్మేకర్’ అవార్డ్ వరించింది. 150 దేశాలకు చెందిన 3000 మంది మహిళల నుంచి ఈ అవార్డ్‌కు శ్రిష్ఠిని ఎంపికచేశారు. ‘యూఎన్ ఎస్డీజీ యాక్షన్ అవార్డ్‌ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సోషల్ ఛేంజ్మేకర్స్తో మాట్లాడే అవకాశం లభిస్తుంది. వారి అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. వ్యక్తిగతంగానే కాదు సమష్టిగా కూడా సమాజం కోసం పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది’ అంటుంది శ్రిష్ఠి. ‘సమీకరణ, స్ఫూర్తి, ఒకరితో ఒకరు అనుసంధానం కావడం ద్వారా సుందర భవిష్యత్‌ను నిర్మించుకోవచ్చు. మనం ఎలా జీవిస్తే మంచిది అనే విశ్లేషణకు ఇవి ఉపయోగపడతాయి. పునరాలోచనకు అవకాశం ఉంటుంది’ అంటుంది ఎస్డీజీ యాక్షన్ క్యాంపెయిన్ కమిటీ. ఇ–కామర్స్ స్ట్రాటజిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రిష్ఠి హాంకాంగ్‌లో పెద్ద ఉద్యోగం చేసేది. ‘నా జీవితం ఆనందమయం’ అని ఆమె అక్కడే ఉండి ఉంటే ‘ఛేంజ్మేకర్’గా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేది కాదు. టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్‌ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు. ఆ వార్త చదివిన తరువాత తన కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ‘నేనేం చేయలేనా!’ అని భారంగా నిట్టూర్చింది. అంతమాత్రాన శ్రిష్ఠి బక్షీ బాధలోనే ఉండిపోలేదు. బాధ్యతతో ముందడుగు వేసింది... -
ఐ థింక్ లాజిస్టిక్స్
హైదరాబాద్: సాస్ ఆధారిత షిప్పింగ్ సేవల ప్లాట్‌ఫామ్ ‘ఐ థింక్ లాజిస్టిక్స్’.. దేశీ ఈ కామర్స్ విక్రేతల కోసం అంతర్జాతీయ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల దేశీ ఈ కామర్స్ విక్రేతలు (ఎంఎస్ఎంఈలు), డీ2సీ బ్రాండ్లు అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించొచ్చని సంస్థ తెలిపింది. ఐథింక్ లాజిస్టిక్స్ ఇంటర్నేషనల్ భాగస్వామ్య సంస్థల ద్వారా ఇందుకు వీలు కల్పిస్తున్నట్టు తెలిపింది. భారత్ నుంచి సీమాంతర షిప్పింగ్ సేవల విలువ 2025 నాటికి 129 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఆధారిత టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఐథింక్ లాజిస్టిక్స్ భారత ఈ కామర్స్ విక్రేతల వృద్ధి అవకాశాలకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ఒక్క క్లిక్‌తో ఐథింక్ లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్.. అమెజాన్, ఈబే, షాపిఫై, మెజెంటో, వూకామర్స్ సంస్థలతో అనుసంధానించనున్నట్టు తెలిపింది. -
రైతు.. ప్రభుత్వం.. ఫ్లిప్‌కార్ట్
సాక్షి, అమరావతి: రైతుల నుంచి మెరుగైన ధరలకు వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు కొనుగోలు చేయించేలా ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. తొలుత అపరాలు.. ఆ తర్వాత దశల వారీగా వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కంటే మెరుగైన ధర చెల్లించి కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందుకోసం రాష్ట్ర వ్యవసాయ శాఖతో త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సూచన మేరకు ఫ్లిప్‌కార్ట్ ముందుకు వచ్చింది. ఆన్లైన్ విక్రయాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లిప్‌కార్ట్ మాల్స్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఎఫ్‌పీవోల ద్వారా కొనుగోళ్లు వ్యవసాయ ఉత్పత్తులను ఇతర బహుళ జాతి సంస్థల మాదిరిగా మధ్యవర్తులు, వ్యాపారులు, మిల్లర్ల ద్వారా కాకుండా రైతుల నుంచి నేరుగా ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తుంది. అనంతపురం, గుంటూరు రీజియన్ పరిధిలో పనిచేస్తున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవోల) ద్వారా కొనుగోళ్లు జరుపుతుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ హరికిరణ్‌తో ఫ్లిప్‌కార్ట్ బృందం మంగళవారం సమావేశం కానుంది. తొలి దశలో కందులు, మినుములు, పెసలు తదితర పప్పు దినుసులను ఎఫ్‌పీవోల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించనున్నామని, త్వరలో ఎంవోయూ చేసుకోనున్నామని ఫ్లిప్‌కార్ట్ ఏపీ ప్రతినిధి గిరిధర్ ‘సాక్షి’కి తెలిపారు. రైతులకు మేలు చేసేలా ఒప్పందం రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ సంస్థ ముందుకురావడం శుభపరిణామం. ఆహార ఉత్పత్తుల సరఫరా చైన్ మేనేజ్మెంట్ను రాష్ట్రంలో బలోపేతం చేస్తున్న వేళ ఫ్లిప్‌కార్ట్ ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయబోతోంది. తద్వారా చిన్న, సన్నకారు రైతులకు సైతం మేలు కలుగుతుంది. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ప్రారంభం ఈ – కామర్స్ మార్కెట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి గ్రోసరీ ఫుల్ఫిల్మెంట్ కేంద్రాన్ని విజయవాడలో ఏర్పాటు చేసింది. విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఏర్పాటు చేసిన ఈ నూతన ఫెసిలిటీని సోమవారం ప్రారంభించింది. ఈ కేంద్రం ప్రారంభంతో ఫ్లిప్‌కార్ట్ సరఫరా చైన్ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించింది. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి కలగడంతో పాటు వేలాది మంది స్థానిక విక్రేతలు, ఎంఎస్ఎంఈలు, చిన్న రైతులకు మార్కెట్ అవకాశాలు లభిస్తాయి. ఈ ఫెసిలిటీతో రాబోయే ప్రతిస్టాత్మక ఫ్లిప్‌కార్ట్ కార్యక్రమం బిగ్ బిలియన్ డేస్ 2022లో రోజుకు 4 వేల గ్రోసరీ ఆర్డర్లును నిర్వహించగలదు. ఈ కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాను మించిపోయిన్ భారత్.. ఆన్లైన్ @ 34.6 కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్, డిజిటల్ పేమెంట్స్ వంటి ఆన్లైన్ లావాదేవీలు జరుపుతున్న భారతీయుల సంఖ్య సుమారు 34.6 కోట్లకు చేరుకుంది. ఈ సంఖ్య 33.1 కోట్లుగా ఉన్న యూఎస్ జనాభా కంటే అధికం కావడం విశేషం. ‘భారత్‌లో ఇంటర్నెట్’ పేరుతో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ సంస్థ కాంటార్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం.. 2019లో దేశంలో ఆన్లైన్ లావాదేవీలు జరిపిన వారి సంఖ్య 23 కోట్లు. కరోనా మహమ్మారి కాలంలో ఈ సంఖ్య 51 శాతం పెరగడం గమనార్హం. ఇంటర్నెట్ వినియోగం పరంగా సామాజిక మాధ్యమాలు, వినోదం, సమాచార కార్యకలాపాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. సమాచార విభాగంలో టెక్ట్స్, ఈ–మెయిల్ అత్యంత ప్రజాదరణ పొందాయి. వాయిస్, దేశీయ భాషల వినియోగం భవిష్యత్తులో వృద్ధికి కీలకాంశాలుగా ఉంటాయి. గ్రామీణ భారతదేశంలో ఓటీటీ వేదికల వినియోగం పట్టణ భారత్‌తో సమానంగా ఉంది. ఆన్లైన్ గేమింగ్, ఈ–కామర్స్, డిజిటల్ చెల్లింపుల వ్యాప్తి ఇప్పటికీ పట్టణ ప్రాంతాల్లోనే అధికం. దేశవ్యాప్తంగా 69.2 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 35.1 కోట్లు, పట్టణ ప్రాంతాల నుంచి 34.1 కోట్ల మంది ఉన్నారు. 2025 నాటికి నెటిజన్ల సంఖ్య భారత్‌లో 90 కోట్లను తాకుతుంది. యూపీఐ వినియోగం భేష్: ప్రధాని న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) జూలైలో ఆరు బిలియన్ల లావాదేవీలను నమోదు చేయడం ‘అత్యద్భుతమైన అంశమని‘ అని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రశంసించారు. కొత్త టెక్నాలజీలను స్వీకరించడానికి, ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా, పారదర్శకంగా మార్చడానికి ప్రజల సమిష్టి సంకల్పాన్ని ఇది సూచిస్తోందని ఆయన అన్నారు. ‘‘యూపీఐ జూలైలో 6 బిలియన్ల లావాదేవీలను నమోదు చేసింది. 2016 నుండి ఎన్నడూ లేని విధంగా ఈ భారీ లావాదేవీలు జరిగాయి’’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో డిజిటల్ పేమెంట్ సర్వీసుల పాత్ర ఎంతో కీలకంగా ఉందని కూడా మోదీ పేర్కొన్నారు. -
ఫ్యూచర్‌పై దివాలా చర్యలు షురూ!
ముంబై: రుణ ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్)పై దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ బుధవారం ఆదేశించింది. ఈ విషయంలో ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. రూ.3,495 కోట్ల రుణ డిఫాల్ట్‌ల నేపథ్యంలో కంపెనీకి వ్యతిరేకంగా దివాలా పరిష్కార ప్రక్రియను కోరుతూ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఏప్రిల్‌లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బీఓఐ కుమ్మక్కై ఈ పిటిషన్ దాఖలు చేసిందని అమెజాన్ పేర్కొంది. బ్యాంక్ పిటిషన్‌ను ఎన్సీఎల్టీ ఆమోదిస్తే, ఫ్యూచర్ రిటైల్‌కు సంబంధించి తమ న్యాయ పోరాట ప్రయోజనాలు దెబ్బతింటాయని ఈ కామర్స్ దిగ్గజం వాదించింది. -
ఆన్లైన్లో ఆయుర్వేద మందుల్ని కొనుగోలు చేస్తున్నారా!
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఆయుర్వేద ఔషధాల విక్రయాలను నిర్వహించే కంపెనీలకు సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. కొన్ని ఎంపిక చేసిన ఆయుర్వేద, సిద్ధ, యునానీ ఔషధాలను, చెల్లుబాటు అయ్యే వైద్యుడి ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేసిన తర్వాతే, నిర్ధారించుకుని విక్రయించాలని పేర్కొంది. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ నిబంధనలు 1945 చట్టంలోని షెడ్యూల్ ఈ (1)లో పేర్కొన్న ఔషధాలకు ఈ నిబంధనలు అమలవుతాయని తెలిపింది. ఆయుర్వేద, సిద్ధ, యునానీకి సంబంధించి విషపూరితమైన పదార్థాలతో తయారు చేసిన ఔషధాల జాబితా షెడ్యూల్ ఈ(1)లో ఉంది. ఈ ఔషధాలను వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలని చట్టం చెబుతోంది. -
చిన్న సంస్థలకు ఈ–కామర్స్‌తో దన్ను
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి, మార్కెటింగ్ వ్యయాలను తగ్గించుకోవడానికి, కొత్త మార్కెట్లలో విస్తరించడానికి ఈ–కామర్స్ ఎంతగానో తోడ్పడుతోందని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ తెలిపారు. చిన్న వ్యాపారాలు తమ మేనేజ్మెంట్ నైపుణ్యాలను, టెక్నాలజీని మరింతగా మెరుగుపర్చుకోవాలని ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన భారతీయ ఎంఎస్ఎంఈల సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఎంఎస్ఎంఈలు దేశీయంగా ఉపాధి కల్పనలోనూ, తయారీ కార్యకలాపాలను విస్తరించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో వాటిపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వర్మ చెప్పారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ చేయూత.. కరోనా మహమ్మారి కష్టకాలంలో కూడా చిన్న పరిశ్రమలు ఎదురొడ్డి నిల్చాయని మంత్రి తెలిపారు. కొన్ని యూనిట్లు ఆర్థిక కష్టాలతో మూతబడే పరిస్థితికి వచ్చినా ప్రభుత్వం జోక్యం చేసుకుని తగు తోడ్పాటునివ్వడంతో గట్టెక్కాయని ఆయన చెప్పారు. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకే కేంద్రం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌ను (ఈసీఎల్జీఎస్) ఆవిష్కరించినట్లు మంత్రి వివరించారు. దీని కింద చిన్న సంస్థలకు రూ. 3.1 లక్ష కోట్ల మేర నిధులను కేటాయించినట్లు ఎంఎస్ఎంఈ శాఖ కార్యదర్శి బీబీ స్వెయిన్ తెలిపారు. డీ2సీ మార్కెట్ నివేదిక ఆవిష్కరణ.. కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రాక్సిస్, షిప్‌రాకెట్, సీఐఐ సంయుక్తంగా రూపొందించిన భారత డీ2సీ మార్కెట్ నివేదికను మంత్రి ఆవిష్కరించారు. దీని ప్రకారం ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని నేరుగా కస్టమర్లకు పంపే చాలా మటుకు డీ2సీ (డైరెక్ట్ టు కస్టమర్స్) సంస్థలకు ఢిల్లీ, బెంగళూరు, ముంబై ప్రధాన సరఫరా, డిమాండ్ హబ్‌లుగా ఉంటున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో నిత్యావసరాలు మొదలైన ఉత్పత్తుల మార్కెట్ పరిమాణం 571 బిలియన్ డాలర్లుగా, ఆభరణాల మార్కెట్ 82 బిలియన్ డాలర్లు, దుస్తులు.. పాదరక్షలు 81 బిలియన్ డాలర్లు, ఎలక్ట్రానిక్స్ మార్కెట్ 9.4 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. -
చిరుద్యోగి నుంచి సీయీవో దాకా!
జనబాహుళ్యంలోకి ఆన్లైన్ మార్కెట్ వచ్చాక తయారీదారుల నుంచి కస్టమర్ల దాకా ఆందరూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ కామర్స్ మార్కెట్‌ను సరిగ్గా ఒడిసి పట్టుకుంటే అందనంత ఎత్తుకు ఎదగవచ్చని గ్రహించిన ఓ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ వినూత్న ఆలోచనలతో అనుబంధ సంస్థను దేశంలోని టాప్ ఫైవ్ కంపెనీలలో ఒకటిగా నిలబెట్టింది. కంపెనీలో కంటెంట్ రైటర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టి, అనతికాలంలోనే ‘వీ కమిషన్’ కంపెనీకి సీఈఓ అయిన ఎంట్రప్రెన్యూర్ మరెవరో కాదు పారుల్ తరంగ్ భార్గవ. పదేళ్లుగా కంపెనీ సీఈఓగా విజయవంతంగా రాణిస్తూ తాజాగా గ్లోబర్ అఫిలియేట్ నెట్వర్క్ కేటగిరిలో ‘‘ప్రామిసింగ్ ఉమెన్ సీఈఓ ఆఫ్ ద ఇయర్– 2022 విశేష సత్కారం అందుకుని నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది పారుల్. ఏంజిల్ ఇన్వెస్టర్, స్పీకర్, లీడర్, వీ కమిషన్ సహవ్యవస్థాపకురాలు పారుల్ తరంగ్ భార్గవ ఢిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. తల్లిదండ్రుల మాట జవదాటకుండా నడుచుకునేది. స్కూలు విద్యాభ్యాసం అంతా ఆడుతూ పాడుతూ గడిపిన పారుల్కు... కాలేజీ చదువులు ప్రారంభమయ్యాక అసలైన ప్రçపంచం మనిషి మనుగడ, పేరు ప్రఖ్యాతులకోసం పడే తాపత్రయం, ఉన్నతంగా ఎదగడానికి ఎదుర్కోవాల్సిన పోటీని ప్రత్యక్షంగా తెలుసుకుంది. గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్శిటీలో బిటెక్(ఐటీ) చదివే సమయంలోనే ప్రస్తుత జీవిత భాగస్వామి గురుగావ్‌కు చెందిన తరంగ్ భార్గవ పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం, తర్వాత ప్రేమ చిగురించి జీవిత భాగస్వాములయ్యారు. వీకమిషన్.. ఇంజినీరింగ్ అయ్యాక తరంగ్ 2006లో పేరిట ‘వీకమిషన్’ అఫిలియేట్ కంపెనీని ప్రారంభించారు. వివిధ ఈ కామర్స్ కంపెనీలకు అనుబంధ మార్కెటర్స్‌ను అందించడమే ఈ కంపెనీ ముఖ్యమైన పని. దీనిలో కంటెంట్ రైటర్‌గా చేరింది పారుల్. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే ప్రస్తుత మార్కెట్ ట్రెండింగ్ అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వీ కమిషన్ ఎదుగుదలకు సరికొత్త ఐడియాలను అన్వేషించి అమలు చేసేది. దీంతో వీ కమిషన్ అభివృద్ధి బాట పట్టింది. ఈ కామర్స్ మార్కెట్లో తనదైన ముద్రవేయడంతో 2008లో వీ కమిషన్‌కు సహవ్యవస్థాపకురాలిగా మారింది పారుల్. నమ్మకాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా.. ఇండియన్ అఫిలియేట్ మార్కెట్లపై విదేశీ కంపెనీలకు మంచి అభిప్రాయం లేదని గ్రహించిన పారుల్ ముందుగా ఆయా కంపెనీల నమ్మకాన్ని గెలుచుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే యూఎస్, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలను లక్ష్యంగా పెట్టుకుని చిగురుటాకులా ఉన్న వీకమిషన్‌ను అనతి కాలంలోనే అతిపెద్ద కంపెనీగా నిలబెట్టింది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న పాపులర్ అఫిలియేట్ ప్లాట్‌ఫామ్‌లలో వీ కమిషన్ కూడా ఒకటి. యాడ్‌వేస్ వీసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎయిర్టెల్, ఫ్లిప్‌కార్ట్, ఈబే, అమెజాన్, డోమినోస్, ఏసియన్ పెయింట్స్, పీఅండ్‌జీ వంటి ప్రముఖ కంపెనీలకు అనుబంధంగా వీ కమిషన్ పనిచేస్తోంది. ఈ– కామర్స్, ట్రావెల్, ఫైనాన్స్, ఇన్సురెన్స్, ఐ గేమింగ్, నేచురల్ ప్రోడక్ట్స్, డొమైన్ కంపెనీలకు అఫిలియేటర్‌గా, వాల్‌మార్ట్, అలీబాబా, మింత్రా, అగోడా, షాపీ, ఖతార్ ఎయిర్వేస్కు అనుబంధంగా పనిచేసింది. పది స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది. ఇలా అనేక పరిశ్రమ వర్గాల నమ్మకాన్ని చూరగొని 2015లో టాప్–50 అలెక్సా ర్యాంకింగ్స్‌లో ఒకటిగా నిలిచింది. చకచకా దూసుకుపోతూ దశాబ్దకాలంలోనే ల„ý ల నెట్వర్క్ అఫిలియేట్స్‌ను చేరుకుని 80 మిలియన్ల నెలవారి ట్రాఫిక్, నెలకు రెండు బిలియన్ల జీఎమ్‌వీతో ఏషియాలోనే అతిపెద్ద కంపెనీగా వీ కమిషన్ నిలవడానికి పారుల్ ఇచ్చిన సలహాలు, సూచనలు, టిప్పులు ట్రిక్స్, కృషే కారణం. బెస్ట్ ఈ–కామర్స్ కంపెనీగా... ప్రస్తుతం అంతా ఆన్లైన్ మార్కెట్ నడుస్తోంది. ఆయా ఈ కామర్స్ యాజమాన్యాల దగ్గర నుంచి వస్తువుల లింక్ తీసుకుని వివిధ అనుబంధ మార్కెటర్స్‌తో విక్రయించడమే అఫిలియేట్ చేసే పని. ఇలా లక్షలమంది అఫిలియేట్ మార్కెటర్స్‌ను జాతీయ అంతర్జాతీయ కంపెనీలకు పనిచేసేలా చేయడంతో, ఈ కామర్స్ ఫ్లాట్‌ఫాంకు మంచి లాభాలు వచ్చాయి. ఈ కామర్స్ కంపెనీల నమ్మకాన్ని చూరగొనడంతో మా వీకమిషన్ బెస్ట్ ఈ కామర్స్ కంపెనీగా నిలిచింది. కస్టమర్ల అభిరుచులు తెలుసుకుని విభిన్నంగా ఆలోచిస్తే ఎవరైనా మంచి ఎంట్రప్రెన్యూర్‌గా ఎదగవచ్చు. – పారుల్ తరంగ్ భార్గవ్, ‘వీకమిషన్’ సిఈఓ -
కరోనా దెబ్బకు..ఈ-కామర్స్ రంగానికి పెరిగిన డిమాండ్! ఎంతలా అంటే!
సాక్షి, హైదరాబాద్: కరోనాతో దేశీయ స్థిరాస్తి రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటే.. గిడ్డంగుల విభాగానికి మాత్రం మహమ్మారి బూస్ట్‌లాగా పనిచేసింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ–కామర్స్ వినియోగం పెరిగింది. దీంతో ఆయా కంపెనీలు ఔట్లెట్లు, వేర్‌హౌస్‌ల ఏర్పాటుపై దృష్టిసారించాయి. ఫలితంగా గతేడాది ముగింపు నాటికి దేశంలో గ్రేడ్–ఏ వేర్‌హౌస్ స్పేస్ 14 కోట్ల చ.అ.లకు చేరిందని అనరాక్ రీసెర్చ్ తెలిపింది. ఇందులో ఎన్సీఆర్ వాటా దాదాపు 15–20 శాతం వాటా ఉందని పేర్కొంది. 2018–21 మధ్య కాలంలో ఈ పరిశ్రమ వార్షిక వృద్ధి రేటు 16 శాతంగా ఉందని తెలిపింది. దేశంలోని 70 శాతం మోడ్రన్ వేర్‌హౌస్ స్పేస్‌లు ముంబై, ఎన్సీఆర్, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పుణే నగరాలలో కేంద్రీకృతమై ఉన్నాయని అనరాక్ క్యాపిటల్ ఎండీ, సీఈఓ శోభిత్ అగర్వాల్ తెలిపారు. ఆన్లైన్ వ్యాపారాలలో స్థిరమైన వృద్ధి నమోదవుతుండటంతో ప్రధాన నగరాలలో మల్టీలెవల్ వేర్‌హౌస్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు. దేశీయ, అంతర్జాతీయ ప్రైవేట్ సంస్థలు గిడ్డంగుల స్థలాల కోసం విస్తృతంగా శోధిస్తున్నారని, అదే సమయంలో నిర్వహణ వ్యయం తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. -
ఫ్యూచర్ రిటైల్‌పై బీవోఐ దివాలా అస్త్రం
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్‌పై బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) దివాలా అస్త్రం ప్రయోగించింది. దివాలా చర్యలు ప్రారంభించాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో పిటిషన్ దాఖలు చేసింది. విజయ్ కుమార్ వీ అయ్యర్‌ను ఫ్యూచర్ రిటైల్ సంస్థ ఐఆర్పీ (మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్/లిక్విడేటర్)గా నియమించాలని ఎన్సీఎల్టీని బ్యాంక్ ఆఫ్ ఇండియా అభ్యర్థించింది. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో కొనసాగుతున్న వ్యాజ్యాలు, సంబంధిత ఇతర సమస్యల కారణం గా ఈ నెల ప్రారంభంలో ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్‌ఎల్‌ఆర్) తన రుణదాతలకు రూ. 5,322.32 కోట్లు చెల్లించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో దివాలా కోడ్, 2016లోని 7వ సెక్షన్ కింద రుణ దాతల కన్షార్షియంకు నేతృత్వం వహిస్తున్న బీవోఐ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. తాను పిటిషన్ కాపీని అందుకున్నానని, న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటామని ఫ్యూచర్ గ్రూప్ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. వార్తా పత్రికల్లో ఇప్పటికే నోటీసులు.. బీవోఐ గత నెల వార్తా పత్రికలలో ఒక పబ్లిక్ నోటీసు జారీ చేస్తూ, ఫ్యూచర్ రిటైల్ ఆస్తులపై తన క్లెయిమ్‌ను ప్రకటించింది. కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ఆస్తులతో లావాదేవీలు జరపరాదని ఈ ప్రకటన ద్వారా హెచ్చరించింది. 2020 ఆగస్టులో ఫ్యూచర్ గ్రూప్ ప్రకటించిన రూ.24,713 కోట్ల డీల్‌లో ఫ్యూచర్ రిటైల్ ఒక భాగం. ఈ డీల్‌లో భాగంగా రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 19 కంపెనీలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)కు విక్రయిస్తున్నట్లు గ్రూప్ ప్రకటించింది. ఈ ఒప్పంద ప్రతిపాదన ప్రకారం, 19 కంపెనీలు అన్నీ కలిసి ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక్క ఒక్క కంపెనీగా విలీనమై తదుపరి ఆర్ఆర్వీఎల్లకు బదిలీ అవుతాయి. 20 నుంచి సమావేశాలపై ఉత్కంఠ కాగా, రిలయన్స్‌తో డీల్ ఆమోదం కోసం 2022 ఏప్రిల్ 20–23 తేదీల మధ్య ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలు తమ సంబంధిత వాటాదారులు రుణదాతలతో సమావేశాలను నిర్వహిస్తుండడం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ఈ డీల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెజాన్ ఈ సమావేశాల నిర్వహణను తీవ్రంగా తప్పు బడుతుండడమే దీనికి కారణం. -
లాజిస్టిక్స్‌కు సానుకూలం..
ముంబై: లాజిస్టిక్స్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–9 శాతం మేర వృద్ధిని చూస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. అయితే చమురు, కమోడిటీల ధరలు పెరుగుతున్న దృష్ట్యా ఈ రంగంలోని కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి ఉంటుందని పేర్కొంది. లాజిస్టిక్స్ రంగంపై ఒక నివేదికను ఇక్రా గురువారం విడుదల చేసింది. 2021–22లో ఈ రంగంలో వృద్ధి కరోనా ముందు నాటితో పోలిస్తే 14–17 శాతం అధికంగా ఉంటుందని తెలిపింది. మధ్య కాలానికి ఆదాయంలో వృద్ధి అన్నది ఈ కామర్స్, ఎఫ్ఎంసీజీ, రిటైల్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ఇండస్ట్రియల్ గూడ్స్ నుంచి వస్తుందని పేర్కొంది. జీఎస్టీ, ఈవేబిల్లు అమలు తర్వాత లాజిస్టిక్స్ సేవల్లో సంస్థాగత వాటా పెరుగుతున్నట్టు వివరించింది. బహుళ సేవలను ఆఫర్ చేస్తుండడం కూడా ఆదరణ పెరగడానికి కారణంగా పేర్కొంది. పైగా ఈ రంగంలోని చిన్న సంస్థలతో పోలిస్తే పెద్ద సంస్థలకు ఉన్న ఆర్థిక సౌలభ్యం దృష్ట్యా, వాటికి ఆదరణ పెరుగుతోందని.. ఈ రంగంలో రానున్న రోజుల్లో మరింత వ్యాపారం సంస్థాగతం వైపు మళ్లుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. క్రమంగా పెరుగుతున్న డిమాండ్ కొన్ని నెలలుగా రవాణా కార్యకలాపాలు పుంజుకుంటున్నట్టు ఇక్రా తెలిపింది. పలు రంగాల్లో డిమాండ్ పుంజుకోవడం ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. కరోనా మూడో విడత వేగంగా సమసిపోవడంతో ఆంక్షలను ఎత్తేయడం కలిసి వచ్చినట్టు వివరించింది. కమోడిటీల ధరలు పెరిగిపోవడం, రవాణా చార్జీలన్నవి స్వల్పకాలంలో సమస్యలుగా ప్రస్తావించింది. వినియోగ డిమాండ్‌పై మార్జిన్లు ఆధారపడి ఉంటాయని అంచనా వేసింది. ‘‘త్రైమాసికం వారీగా లాజిస్టిక్స్ రంగం ఆదాయం 2021–22 రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి వెళ్లింది. పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం కలిసొచ్చింది’’అని ఇక్రా తన నివేదికలో తెలిపింది. 2022 జనవరి–ఫిబ్రవరి నెలల్లో ఈవే బిల్లుల పరిమాణం, ఫాస్టాగ్ వసూళ్లలో స్థిరత్వం ఉన్నట్టు ఇక్రా నివేదిక వివరించింది. -
వ్యాపార విస్తరణలో స్నాప్‌డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ తమ కార్యకలాపాల విస్తరణపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం, టెక్నాలజీపరంగా మరిన్ని ఆవిష్కరణలు చేయడం, లాజిస్టింక్స్ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికి ప్రాధాన్యమిస్తోంది. దీనికోసం ఐపీవో ద్వారా రూ. 1,250 కోట్లు సమీకరించనున్నట్లు సంస్థ తెలిపింది. కొత్తగా ఈక్విటీల జారీ, ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో పబ్లిక్ ఇష్యూ ఉంటుందని పేర్కొంది. సాఫ్ట్‌బ్యాంక్, బ్లాక్‌రాక్, టెమాసెక్, ఈబే తదితర సంస్థలు స్నాప్‌డీల్‌లో ఇన్వెస్ట్ చేశాయి. మొత్తం 71 షేర్హోల్డర్లలో 8 మంది మాత్రమే స్వల్ప వాటాలను విక్రయించనున్నట్లు సంస్థ వివరించింది. సంయుక్తంగా 20.28 శాతం వాటా ఉన్న కంపెనీ వ్యవస్థాపకులు కునాల్ బెహల్, రోహిత్ కుమార్ బన్సల్ తమ వాటాలను ఐపీవోలో విక్రయించడం లేదని స్నాప్‌డీల్ తెలిపింది. -
ఆ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్.. ఇక ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు..!
ప్రముఖ సోషల్ ఈ-కామర్స్ యునికార్న్ కంపెనీ మీషో తన ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా కంపెనీ ఉద్యోగులు పని చేయొచ్చు అని సంస్థ ప్రకటించింది. ఈ విషయం గురించి మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రే తన ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. "మేము శాశ్వతంగా సరిహద్దులేని పని విధానాన్ని అవలంబిస్తున్నాము. ఇక ఉద్యోగులు సౌకర్యవంతంగా పనిచేసుకోవచ్చు" అని తెలిపారు. "ఈ అనిశ్చిత ప్రపంచంలో, వ్యాపార వృద్ధి వాస్తవానికి స్థితిస్థాపక & ఉత్పాదక శ్రామిక శక్తిపై ఆధారపడి ఉంటుందని నిర్ధారించడానికి మేము బహుళ నమూనాలను అధ్యయనంచేశాము!" అని ఆయన అన్నారు. ఉద్యోగుల మానసిక, శారీరక భద్రత పని చేసే స్థానం కంటే ముఖ్యమని వ్యాపార నాయకులు అంగీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మీషో అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో చిన్న కార్యాలయాలను తెరుస్తుందని, ప్రధాన కార్యాలయం బెంగళూరులో కొనసాగుతుందని ఆత్రే తెలిపారు. It's arguably been one of the most exciting ways to kickstart our week at @Meesho_Official! We’re permanently adopting a Boundaryless Workplace model 💼 Meeshoites now have the power to define workplace flexibility and convenience 🥳 🧵 — Vidit Aatrey (@viditaatrey) February 7, 2022 మీషో "మీషో".. సప్లయర్స్, రీసెల్లర్స్, కస్టమర్స్ అనే విభాగాలుగా నడుస్తోంది. ఇందులో నమోదైన రీసెలర్లు సరఫరా దారుల నుంచి అన్ బ్రాండెడ్ ఫ్యాషన్, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. వాటికి బ్రాండింగ్ ఇచ్చి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా విక్రయిస్తారు. సోషల్ మీడియా ద్వారానే కాకుండా నేరుగానూ మీషో భారీగా విక్రయాలు చేపట్టి ఫేస్బుక్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థలకు పోటీగా మారింది. క్రీడలు, క్రీడా సామగ్రి, ఫిట్నెస్, పెట్ సప్లైయిస్, ఆటోమోటివ్ పరికారాలనూ మీషో విక్రయిస్తుండటం గమనార్హం. (చదవండి: పలు కార్ల మోడళ్లపై తగ్గింపును ప్రకటించిన హోండా మోటార్స్) -
రూ. 7,000 కోట్ల పెట్టుబడికి ‘సమర’ సిద్ధం
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్‌ను (ఎఫ్ఆర్ఎల్) రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సమర క్యాపిటల్ సిద్ధంగా ఉందని ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించింది. ఎఫ్ఆర్ఎల్ నుంచి బిగ్ బజార్ తదితర సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా సుమారు రూ. 7,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి సుముఖంగానే ఉందని తెలిపింది. ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లకు జనవరి 22న రాసిన లేఖలో ఈ విషయాలు వెల్లడించింది. రుణదాతలకు జరపాల్సిన చెల్లింపుల కోసం జనవరి 29 డెడ్‌లైన్ లోగా రూ. 3,500 కోట్లు సమకూర్చగలరా లేదా అన్నది తెలియజేయాలంటూ ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లు గతంలో రాసిన లేఖపై అమెజాన్ ఈ మేరకు స్పందించింది. 2020 జూన్ 30 నాటి టర్మ్ షీట్ ప్రకారం రూ. 7,000 కోట్లకు ఎఫ్ఆర్ఎల్ వ్యాపారాలను (బిగ్ బజార్, ఈజీడే, హెరిటేజ్ మొదలైనవి) కొనుగోలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని సమర క్యాపిటల్ తమకు తెలిపిందని అమెజాన్ పేర్కొంది. ఇందుకోసం ఎఫ్ఆర్ఎల్ వ్యాపారాలను మదింపు చేసేందుకు అవసరమైన వివరాలను సమరకు అందించాలని తెలిపింది. అయితే, సమర క్యాపిటల్ ఆ విషయాన్ని నేరుగా ఎఫ్ఆర్ఎల్కు తెలపకుండా అమెజాన్‌తో ఎందుకు చర్చిస్తోందన్న అం శంపై వివరణ ఇవ్వలేదు. సుమారు రూ. 24,713 కోట్లకు బిగ్ బజార్ తదితర వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ చేస్తున్న యత్నాలను ఎఫ్‌ఆర్‌ఎల్‌లో పరోక్ష వాటాదారైన అమెజాన్ అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదంపై న్యాయపోరాటం సాగిస్తోంది. -
ఫ్లిప్‌కార్ట్ చేతికి యాంత్రా
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ తాజాగా ఎలక్ట్రానిక్స్ ’రీ–కామర్స్’ కంపెనీ ’యాంత్రా’ను కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత మొత్తం వెచ్చించినదీ వెల్లడి కాలేదు. గ్రూప్ సంస్థ ఎఫ్1 ఇన్ఫో సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ ఈ డీల్ కుదుర్చుకుంది. 2013లో జయంత్ ఝా, అంకిత్ సరాఫ్, అన్మోల్ గుప్తా కలిసి యాంత్రాను ప్రారంభించారు. ఇది స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన కన్జూమర్ టెక్నాలజీ ఉత్పత్తులను రిపేరు చేసి విక్రయిస్తుంది. మరోవైపు, ఎఫ్1 ఇన్ఫో సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ .. ప్రధానంగా వ్యాపార వర్గాల కోసం వివిధ ఉత్పత్తులకు (కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఐటీ..ఐటీ పెరిఫెరల్స్ మొదలైనవి) రిపేరు, రీఫర్బిష్మెంట్ సర్వీసులు అందిస్తోంది. యాంత్రా కొనుగోలుతో రీఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ మరింత చౌకగా అందుబాటులోకి తేవడానికి వీలవుతుందని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ సికారియా తెలిపారు. టెక్నాలజీని చౌకగా, అందరికీ అందుబాటులోకి తేవాలన్నదే తమ ఉమ్మడి లక్ష్యమని యాంత్రా సహ వ్యవస్థాపకుడు జయంత్ ఝా తెలిపారు. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. -
గేమ్ పేరుతో రూ.1,100 కోట్లు నొక్కేసిన చైనా కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: గేమ్ ఆఫ్ చాన్స్‌గా పరిగణించే ‘కలర్ ప్రెడిక్షన్’ను ఆన్లైన్లో నిర్వహించిన చైనా కంపెనీలు ఇక్కడివారి నుంచి కాజేసిన మొత్తంలో రూ.1,100 కోట్లు హాంకాంగ్‌కు తరలించేశాయి. ఢిల్లీలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, వాటి పేర్లతో ముంబైలో బ్యాంకు ఖాతాలను తెరిచిన కేటుగాళ్లు నకిలీ ఎయిర్ వే బిల్లుల సహకారంతో ఈ పని పూర్తి చేశారు. 2020లో ఈ కలర్ ప్రిడెక్షన్ గుట్టురట్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసులు నమోదు చేసి చైనీయులు సహా ఉత్తరాదికి చెందిన పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసుల ఆధారంగా ముందుకు వెళ్లిన ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసింది. దీంతో నకిలీ ఎయిర్ వే బిల్లుల విషయం బయటపడింది. మోసానికి సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే అధికారం ఈడీకి లేకపోవడంతో హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈడీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ బి.రవీందర్‌రెడ్డి లోతుగా దర్యాప్తు చేయడంతో రూ.1,100 కోట్లు దేశం దాటినట్లు తేలింది. ఈ–కామర్స్ కంపెనీల పేరుతో... భారత్‌లో కలర్ ప్రెడిక్షన్ (రంగు సెలక్షన్ ప్రక్రియతో కూడిన జూదం) దందా నడపాలని నిర్ణయించుకున్న చైనీయులు ఢిల్లీ, ముంబైకి చెందిన కొందరితో కలిసి పథకం ప్రకారం వ్యవహరించారు. లింక్‌యున్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, డోకీపే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్పాట్‌పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థల్ని ఏర్పాటు చేశారు. ఈ–కామర్స్ వ్యాపారం పేరుతో వెబ్‌సైట్స్‌ను రిజిస్టర్ చేశారు. వీటి ముసుగులోనే ఆన్లైన్ గేమ్ కలర్ ప్రిడెక్షన్‌ను నిర్వహించారు. ఆ 3 సంస్థల పేరుతోనే పేమెంట్ గేట్వేస్ అయిన కాష్ ఫ్రీ, పేటీఎం, రేజర్ పే, ఫోన్ పే, గూగుల్ పేలతో ఒప్పందాలు చేసుకున్నారు. సోషల్‌మీడియా ద్వారా సర్క్యులేట్ అయిన ఈ గేమ్ హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా యువతను నిండా ముంచింది. పేమెంట్ గేట్‌వేల నుంచి.. ఈ గేమ్ ఆడేవాళ్లు ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఈ పేమెంట్ గేట్‌వేల ద్వారానే చేపట్టారు. వీటి ద్వారా గేమ్ ఆడినవాళ్ల నుంచి దోచుకున్న సొమ్మును లింక్‌యున్, డోకీపే, స్పాట్‌పే ఖాతాల్లోకి మళ్లించారు. ఈ సంస్థల నుంచి సొమ్ము మళ్లించడానికి ఢిల్లీలో గ్రేట్ ట్రాన్స్ ఇంటర్నేషనల్, ఏషియా పసిఫిక్ కార్గో కంపెనీ, రేడియంట్ స్పార్క్ టెక్నాలజీస్, ఆర్చీవర్స్ బిజ్ ఇంటర్నేషనల్, కనెక్టింగ్ వరల్డ్ వైడ్, జెనెక్స్ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. వీటికి ముంబైలో బ్రాంచ్‌లు ఉన్నట్లు పత్రాలు సృష్టించి వెస్ట్ ముంబై జోగీశ్వరి ప్రాంతంలోని ఎస్బీఐ, ముంబైలోని నారీమన్ పాయింట్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ రహేజా సెంటర్లో 6 ఖాతాలు తెరిచి సొమ్ము తరలించారు. ఈ ప్రకియంతా నకిలీ పత్రాలతోనే నడిపారు. -
అమెజాన్ సెల్లర్ సర్వీసెస్‌కు తగ్గిన నష్టాలు..
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో (2020–21) ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత విభాగమైన అమెజాన్ సెల్లర్ సర్వీస్ నష్టాలు కొంత తగ్గి రూ. 4,748 కోట్లకు పరిమితమయ్యాయి. ఆదాయం 49 శాతం పెరిగి రూ. 16,200 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర నష్టం రూ. 5,849 కోట్లు కాగా ఆదాయం రూ. 10,848 కోట్లు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ సమర్పించిన పత్రాల ద్వారా ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం సమీక్షా కాలంలో అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ మొత్తం వ్యయాలు రూ. 16,877 కోట్ల నుంచి రూ. 21,127 కోట్లకు చేరాయి. ఉద్యోగులపై వ్యయాలు రూ. 1,383 కోట్ల నుంచి రూ. 1,820 కోట్లకు చేరాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో మాతృ సంస్థ నుంచి అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ మూడు విడతల్లో రూ. 4,360 కోట్లు సమకూర్చుకుంది. ప్రతిగా అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్, అమెజాన్డాట్కామ్డాట్ ఐఎన్సీఎస్లకు 2020 జూన్‌లో రూ. 2,310 కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 1,125 కోట్లు, డిసెంబర్లో రూ. 925 కోట్ల విలువ చేసే షేర్లను కేటాయించింది. -
2021లో ఈ-కామర్స్ రంగాల్లో భారీగా పెరిగిన నియామకాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది (2021) ఈ-కామర్స్, అనుబంధ రంగాల్లో ఉద్యోగ నియామకాలు 28 శాతం పెరిగాయి. ఎకానమీ రికవరీ, వేగవంతమైన టీకాల ప్రక్రియ వంటి అంశాల దన్నుతో ఈ సెగ్మెంట్లో రిక్రూట్మెంట్ వచ్చే ఏడాది మరింతగా పుంజుకోనుంది. కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్ సర్వీసెస్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ఈ-కామర్స్ రంగం 2020లో 8 శాతం, 2021లో 30 శాతం మేర వృద్ధి చెందింది. 2024 నాటికి ఇది 111 బిలియన్ డాలర్లకు, 2026 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ విభాగం..ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, ఉద్యోగావకాశాలకు ఊతమిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఈ–కామర్స్, అనుబంధ రంగాల్లో (ఈ-కామర్స్, ఆన్లైన్లో నిత్యావసర సరుకులు మొదలైనవి) ఈ ఏడాది ఉద్యోగావకాశాలు 28 శాతం మేర పెరిగినట్లు టీమ్‌లీజ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ థామస్ తెలిపారు. వచ్చే ఏడాది 32 శాతం వరకూ అప్.. ఈ–కామర్స్, స్టార్టప్‌లలో 2022లో కొత్తగా మరిన్ని ఉద్యోగాల కల్పన జరగగలదని, నియాకాల వృద్ధి 32 శాతం వరకూ నమోదు కావచ్చని థామస్ పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థ నిర్వహణ, వేర్‌హౌస్‌లో వివిధ ఉద్యోగాలు, సపోర్టు సేవలు, కస్టమర్ సర్వీస్ నిర్వహణ తదితర విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ నెలకొందని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు కూడా ఈ-కామర్స్ విస్తరిస్తుండటంతో కేవలం ప్రథమ శ్రేణి నగరాల్లోనే కాకుండా ద్వితీయ శ్రేణి నుంచి నాలుగో శ్రేణి ప్రాంతాల వరకూ అన్ని చోట్ల హైరింగ్ జోరు అందుకుందని నివేదిక పేర్కొంది. ఈ రంగాల్లో వేతనాల పెంపు సగటున 20–30 శాతం స్థాయిలో ఉంటోందని, చాలా కంపెనీలు అటెండెన్స్ విధానాలను సడలించడం, అదనంగా సిక్ లీవులు ఇవ్వడం మొదలైన రూపాల్లో ఉద్యోగులకు ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నాయని తెలిపింది. ఈ-కామర్స్, టెక్ స్టార్టప్‌లకు వచ్చే ఏడాది మరింత ఆశావహంగా ఉండగలదని అయితే ఆయా విభాగాలు వృద్ధి చెందడానికి మరిన్ని సంస్కరణలు, ఆర్థిక సహా యం అవసరమవుతాయని వివరించింది. ఉత్పత్తు లు, సర్వీసుల విభాగాల్లో కొత్త వ్యాపార విధానాల ను రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం కూడా గుర్తించి, తగు తోడ్పాటు ఇవ్వాలని నివేదిక తెలిపింది. (చదవండి: బీమా కంపెనీల ఆఫర్.. పెళ్లి క్యాన్సిల్ అయితే రూ.10 లక్షలు!) -
కొత్త ఏడాదిలో ఈ-కామర్స్ సంస్థల ఆటలు చెల్లవు..!
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ ప్రత్యేక సేల్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 వేల ల్యాప్‌టాప్ 40 వేలు మాత్రమే అని.. 42 ఇంచుల టీవీ జస్ట్ 15 వేలకే అని ఓ ఉదరగొడుతాయి. తీర కొనుగోలు చేసే సమయానికి కొన్ని షరతులు పెడతాయి. ఈ-కామర్స్ సంస్థల జిమ్మిక్కులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త ఈ- కామర్స్ పాలసీని తీసుకొని రాబోతుంది. ఇప్పటి వరకు ఉన్న ఈ- కామర్స్ నిబంధనలను సవరించి కొత్తగా మరో పాలసీని తీసుకొచ్చేందుకు సిద్దం అవుతుంది. మార్కెట్‌ప్లేస్‌లు, రైడ్ కంపెనీలు, టికెటింగ్, పేమెంట్ కంపెనీలతో సహా అన్ని డిజిటల్ కామర్స్ & సర్వీస్ ప్రొవైడర్లను కవర్ చేస్తూ, అన్ని ఆన్లైన్ లావాదేవీలకు సమగ్ర మార్గదర్శకాలను వివరిస్తూ ప్రభుత్వం త్వరలో కొత్త ఈ-కామర్స్ పాలసీని తీసుకొని రావాలని చూస్తుంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) ఆన్లైన్ వాణిజ్యం, డిజిటల్ ఈ-కామర్స్ పాలసీలోని ఇబ్బందులను పరిష్కరించడానికి ఈ-కామర్స్ పాలసీ ముసాయిదాను విడుదల చేయాలని భావిస్తుంది. మోసపూరిత ఫ్లాష్ సేల్స్, ఉత్పత్తులు.. సర్వీసులను మోసపూరితంగా విక్రయించడం వంటి వాటిని నిషేధించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను ప్రతిపాదించింది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వినియోగదారుల హక్కులను రక్షించడానికి కొత్త ఈ-కామర్స్ నియమాలను జారీ చేస్తుంది. కొత్తగా తీసుకొస్తున్న పాలసీలో ఇటు భారతీయ కంపెనీలతోపాటు విదేశీ పెట్టుబడి కంపెనీలకు కూడా ఈ పాలసీ వర్తిస్తుంది. ఈ నివేదిక ప్రకారం.. ఈ విషయంపై అవగాహన ఉన్న వ్యక్తి భారతదేశంలో పనిచేస్తున్న అన్ని ఈ-కామర్స్ కంపెనీలకు ఇది సమగ్ర విధానం అని చెప్పారు. వీటిపై పరిశ్రమ వర్గాలు, ప్రజలు అభిప్రాయాలు తెలియజేయడానికి కొద్ది సమయం ఇచ్చింది. (చదవండి: పాన్ కార్డుతో ఎన్ని లాభాలో.. అవేంటో తెలుసా?) -
ఆన్లైన్లో ప్రెషర్ కుక్కర్ కొంటున్నారా?.. అయితే, జర జాగ్రత్త!
మీరు ఆన్లైన్లో కొత్త ప్రెషర్ కుక్కర్ కొనాలని చూస్తున్నారా? అయితే, జాగ్రత్త. బిఐఎస్ ప్రమాణాలను ఉల్లంఘించే ఈ-కామర్స్ కంపెనీలకు, అమ్మకందారులకు సీసీపీఏ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వాటిలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇతర సంస్థలు కూడా ఉన్నాయి. బిఐఎస్ ప్రమాణాలను ఉల్లంఘించే గృహోపకరణ వస్తువులను వినియోగదారులను కొనుగోలు చేయకుండా ఉండటానికి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) భద్రతా నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని సెక్షన్ 18(2)(జె) కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. బిఐఎస్ ప్రమాణాలను ఉల్లంఘించి ప్రెషర్ కుక్కర్లను విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఈ కామర్స్ సంస్థలు, అమ్మకందారులపై సుమోటోగా చర్యలు తీసుకుంది. ఇటువంటి ఉల్లంఘనలకు Pressure Cookersసంబంధించి ఇప్పటికే 15 సార్లు నోటీసులు జారీ చేసినట్లు ఒక ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది. దేశీయ ప్రెషర్ కుక్కర్ల అమ్మకందారులు క్యూసీఓ(క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్) నిబందనలు ఉల్లంఘించినందుకు ఈ -కామర్స్ సంస్థలపై 3 సార్లు, హెల్మెట్ల విక్రయం విషయంలో 2 సార్లు నోటీసులు జారీ చేసినట్లు సీసీపీఏ తెలిపింది. ప్రమాదాల భారీ నుంచి వినియోగదారులను రక్షించడానికి ఈ చర్య తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. క్యూసీఓ ఆర్డర్ ప్రకారం దేశీయ ప్రెషర్ కుక్కర్లు ఇండియన్ స్టాండర్డ్ ఐఎస్ IS 2347:2017కి అనుగుణంగా ఉండాలి. 1 ఆగస్ట్ 2020 నుంచి అమలులోకి వచ్చే బిఐఎస్ నుంచి లైసెన్స్ కింద స్టాండర్డ్ మార్క్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. క్యూసీఓ పేర్కొన్న ప్రమాణాలను ఉల్లంఘించడం అంటే ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడమే కాకుండా, వినియోగదారులను తీవ్రమైన గాయాలకు గురిచేస్తుందని సీసీపీఏ తెలిపింది. గృహోపకరణాల విషయంలో కుటుంబ సభ్యులు అటువంటి వస్తువులకు సమీపంలో ఉంటారు. కాబట్టి, వారికి ఏదైనా ప్రమాదం కలిగే అవకాశం ఎక్కువ. క్యూసీఓ ప్రమాణాలను ఉల్లంఘించే హెల్మెట్, ప్రెషర్ కుక్కర్లు, వంట గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయకుండా వినియోగదారులు ఉండటానికి డిసెంబర్ 6న సీసీపీఏ దేశవ్యాప్తంగా ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ విషయంలో వినియోగదారుల హక్కుల ఉల్లంఘనను పరిశోధించడానికి సీసీపీఏ ఇప్పటికే దేశవ్యాప్తంగా జిల్లా మేజిస్ట్రేట్లకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. (చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గుడ్‌న్యూస్..!) -
జనవరి నుంచి జీఎస్టీలో కొత్త మార్పులు అమల్లోకి..
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ)లో చేసిన పలు మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్యాసింజర్ల రవాణా .. రెస్టారెంటు సర్వీసులు మొదలైన వాటిని అందించే ఈ–కామర్స్ కంపెనీలు ఈ సేవలపై పన్నులు చెల్లించాల్సి రానుంది. ఇక పాదరక్షలు, టెక్స్టైల్ రంగాలకు కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. ధరతో సంబంధం లేకుండా అన్ని రకాల పాదరక్షలకు 12 శాతం, కాటన్ మినహా అన్ని రకాల టెక్స్టైల్ ఉత్పత్తులకు (రెడీమేడ్ గార్మెంట్స్ సహా) 12 శాతం జీఎస్టీ వర్తించనుంది. అలాగే ఈ–కామర్స్ కంపెనీలు గానీ ప్యాసింజర్ రవాణా సర్వీసులు అందిస్తే 5 శాతం రేటు వర్తిస్తుంది. ఆఫ్‌లైన్ విధానంలో ఈ సేవలు అందించే ఆటో రిక్షా డ్రైవర్లకు మినహాయింపు ఉంటుంది. ఇక స్విగ్గీ, జొమాటో వంటి ఆహార డెలివరీ సేవలు అందించే ఈ–కామర్స్ ఆపరేటర్లు జనవరి 1 నుంచి .. ఆయా హోటల్స్ నుంచి జీఎస్టీ వసూలు చేసి, డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇన్వాయిస్లు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే కస్టమర్ల నుంచి రెస్టారెంట్లు జీఎస్టీ వసూలు చేస్తున్న నేపథ్యంలో అంతిమంగా కస్టమరుపై అదనపు భారం పడదు. జీఎస్టీ డిపాజిట్ బాధ్యతలను మాత్రమే ఫుడ్ డెలివరీ సంస్థలకు బదలాయించినట్లవుతుంది. -
నైకా లిస్టింగ్ బంపర్ హిట్.. ఒక్కరోజులోనే లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్
ముంబై: సౌందర్య, సంరక్షణ ఉత్పత్తుల ఈ–కామర్స్ వేదిక ‘నైకా’ లిస్టింగ్‌లో అదరగొట్టింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.1,125తో పోలిస్తే 80 శాతం ప్రీమియంతో రూ.2,018 వద్ద లిస్ట్ అయ్యింది. స్టాక్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడిలో ట్రేడ్ అవుతున్నప్పటి.., ఈ షేరుకు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. ఓ దశలో ఏకంగా 100% శాతం దూసుకెళ్లి రూ.2,248 స్థాయిని అందుకుంది. చివర్లో అతి స్వల్ప లాభాల స్వీకరణ జరగడంతో 96 శాతం లాభంతో రూ.2,206 ట్రేడింగ్‌ను ముగిచింది. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 3.43 కోట్ల షేర్లు చేతులు మారాయి. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ లక్ష కోట్ల పైన రూ.1.04 లక్షల వద్ద స్థిరపడింది. తద్వారా దేశీయ ఎక్సే్చంజీల్లోని లిస్టెడ్ కంపెనీల్లో 55వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ–కామర్స్ విభాగంలో ఈ స్థాయి లాభాలతో ఎక్సే్చంజీల్లో లిస్టయిన తొలి కంపెనీ ఇది. నైకా బంపర్ లిస్టింగ్ ఊతంతో కంపెనీ వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్ కుటుంబ సంపద ఏకంగా 7.5 బిలియన్ డాలర్లకు ఎగిసింది. కంపెనీలో ప్రమోటర్ కుటుంబానికి 54.22% వాటాలు ఉన్నాయి. క్లోజింగ్ ధర ప్రకారం వీటి విలువ సుమారు 55,900 కోట్లు (7.5 బిలియన్ డాలర్లు). చదవండి: వాట్ ఏ టెర్రిఫిక్ స్టోరీ - మంత్రి కేటీఆర్ -
జాక్–మా ఏమయ్యాడో? ఎక్కడున్నాడో
Alibaba CEO Jack Ma Missing Story: ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు! అలాగే ఏదైనా ఒక్క పొరపాటు, లేదా నిర్ణయం కూడా మనిషిని అమాంతం అగాధంలోకి నెట్టేయవచ్చు... ఈ–కామర్స్ కుబేరుడు ‘జాక్–మా’ విషయంలోనూ ఇదే జరిగింది. అలీబాబా పోర్టల్‌తో చైనా వస్తువులను ప్రపంచమంతా ఎగుమతి చేస్తూ... కోట్లకు కోట్లు వెనకేసుకుని సుఖాసీనుడై ఉన్న దశలో... అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను... కలవాలని బుద్ధి పుట్టడం కాస్తా అతని పాలిట శాపమైంది... ‘జాక్–మా’ ప్రాభవాన్ని అనూహ్యంగా తగ్గించేసింది. ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినా... కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం కన్నెర్ర చేస్తే.. ఎక్కడున్నాడో... ఏమైపోయాడో? తెలియనంతగా జాక్–మా అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఉక్కుపిడికిలిలో చిక్కిన ఉడుతలా విలవిల్లాడిపోయాడు. ఏమా కథ కమామిషు!!! సరిగ్గా ఏడాది క్రితం నాటి మాట. అలీబాబాతో అప్పటికే ఈ కామర్స్ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిన జాక్–మా దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం ఐపీవోకు వెళుతన్న సమయం అది. ‘ఆల్ ఈజ్ వెల్’ అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఆకస్మాత్తుగా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం అలీబాబా సామ్రాజ్యంపై పంజా విసిరింది. రాత్రికి రాత్రి జాక్–మా రెక్కలు కత్తిరించేసింది. ఆ తరువాత జాక్–మా ఏమయ్యాడో? ఎక్కడున్నాడో కొంత కాలం పాటు ఎవరికీ తెలియలేదు. జైలు నిర్బంధంలో ఉన్నాడని కొందరు, దేశం వదిలి పోయాడని ఇంకొందరు చెప్పుకొచ్చారు కానీ.. వాస్తవం ఏమిటో జాక్–మా, చైనా ఉన్నతాధికారులకు మాత్రమే తెలుసు. సుదీర్ఘ విరామం తరువాత జాక్ తొలిసారి కొన్ని రోజుల క్రితం యూరప్‌లో మళ్లీ ప్రత్యక్షమవడం అతడి ఆంట్ కార్పొరేషన్లో పెట్టుబడులు పెట్టినవారికి ఎంతో ఉత్సాహం కలిగించింది. యూరప్‌లో జాక్ తాజా వ్యాపకం ఏమిటో తెలుసా? ఉద్యానవన పంటలు పండించడం అట! అంతా బాగానే ఉంది కానీ... ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తులో ఉన్న ఈ ఈకామర్స్ రాజు రాత్రికి రాత్రి అధఃపాతాళానికి ఎలా పడిపోయాడు? ఏం జరిగింది? ఈ విషయం తెలుసుకోవాలంటే... నాలుగేళ్ల వెనక్కు వెళ్లాలి. ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో జాక్–మా చైనా నవతరం ప్రతినిధి. అప్పట్లో జాక్–మా ప్రాభవం అంతా ఇంతా కాదు. చైనా తరఫు దౌత్యవేత్త స్థాయిలో ఉండేవాడు. తెరవెనుక ఏం జరిగిందన్నది మనకు తెలియకపోయినా ఓ శుభ ముహూర్తంలో ఈయన అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఎన్నికై అధికార బాధ్యతలు చేపట్టాల్సిన డొనాల్డ్ ట్రంప్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. 2017లో న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్స్‌లో జనవరి తొమ్మిదిన ట్రంప్‌తో సిట్టింగ్ వేయడమే కాకుండా.. ఓ పదిలక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలిచ్చేస్తానని భరోసా కూడా ఇచ్చేశారు. అంత పెద్ద వాణిజ్యవేత్త కదా.. ఉద్యోగాలు కల్పిస్తే ఏమిటి తప్పు? అని అనుకోవచ్చు. అయితే ఇక్కడే ఉంది మతలబు. జాక్ – మా హామీలు మాత్రమే కాదు.. ట్రంప్‌తో అతడి సమావేశంపై చైనా ప్రభుత్వానికి వీసమెత్తు అవగాహన లేదు. ట్రంప్‌తో సమావేశం జరిగిన కొన్ని రోజులకు అలీబాబా ప్రధాన కార్యాలయం లాబీలో జాక్–మా నిర్వహించిన పత్రికా సమావేశం ద్వారా ఇతరులతోపాటు చైనా ప్రభుత్వానికీ ఈ సంగతులన్నీ తెలిశాయి! ఇది ప్రభుత్వ పెద్దలకు అంతగా రుచించలేదు. ఇరుపక్షాల మధ్య వైరానికి బీజం పడింది ఇక్కడే! అప్పటికే ఉప్పు.. నిప్పు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో చైనాపై తీవ్రస్థాయి విమర్శలు చేసిన నేపథ్యంలో అతడు అధ్యక్ష పదవి చేపట్టే నాటికే ట్రంప్‌కు, చైనాకు మధ్య వ్యవహారం ఉప్పు–నిప్పు చందంగానే ఉండింది. ఆ దశలో జాక్–మా, ట్రంప్‌ల మీటింగ్ జరగడంతో సమస్య మొదలైంది. ఆ తరువాత కూడా జాక్– మా 2018– 2020 మధ్యలో పలువురు దేశాధ్యక్షులు, ఉన్నతాధికారులను కలుస్తుండటం జిన్ పింగ్ నేతృత్వంలోని చైనా ప్రభుత్వానికి అంతగా రుచించలేదు. గత ఏడాది అక్టోబరులో జాక్ – మా ఓ ఉపన్యాసం చేస్తూ.. చైనాలో సృజనాత్మకతను తొక్కేస్తున్నారని వ్యాఖ్యానించడంతో వ్యవహారం ముదిరింది. నవంబరు 5న జాక్–మా ఐపీవో ఉండగా రెండు రోజుల ముందే దాన్ని రద్దు చేశారు. బోర్డును రద్దు చేసి పునఃవ్యవస్థీకరించాలని చెప్పడంతోపాటు మా కంపెనీలపై దాడులు మొదలయ్యాయి. పలు అక్రమాలు జరిగాయంటూ మా చేత ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 275 కోట్ల డాలర్ల జరిమానా కట్టించుకున్నారు. ఒకానొక దశలో జాక్–మా దాదాపు మూడు నెలలపాటు అజ్ఞాతంలోనే ఉండాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది. మారిపోయిన సీన్... చైనా ప్రభుత్వం దాడుల తరువాత జాక్ – మా పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈ ఏడాది మొదట్లో ‘మా’ జిన్‌పింగ్‌కు ఒక లేఖ రాస్తూ.. జీవితాంతం చైనా గ్రామీణుల విద్యాభివృద్ధికి కేటాయిస్తానని, కనికరించమని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. గత నెలలో జాక్–మా కే చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక మా వ్యవసాయ, పర్యావరణ సంబంధిత అధ్యయనం కోసం యూరప్ వెళుతున్నారని ప్రకటించడంతో ఆయన ఉనికి మళ్లీ ప్రపంచానికి తెలిసింది. వారం రోజుల క్రితం మా ఓ పూలకుండీతో ఫొటో కనిపించడం ఇన్వెస్టర్లకు కొంత ఊరటినిచ్చిందని అంటున్నారు. జాక్–మా భాగస్వామిగా, అలీబాబా సహ వ్యవస్థాపకుడు జోసెఫ్ సి త్సాయి జూన్ నెలలో సీఎన్‌బీసీ టీవీతో మాట్లాడుతూ... ‘‘జాక్–మా తో రోజూ మాట్లాడుతున్నాను. అతడికేదో అపారమైన అధికారం ఉందని అనుకుంటున్నారు. అదేమంత నిజం కాదు. అతడూ మనందరి మాదిరిగానే ఓ సామాన్య వ్యక్తి’’ అనడం కొసమెరుపు!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ-కామర్స్ అమ్మకాలలో కుమ్మేస్తున్న టైర్ 3 నగరాలు
దసరా పండుగ సీజన్ పురస్కరించుకొని అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు భారీగా ఆఫర్ల కురిపించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది స్పెషల్ డిస్కౌంట్ సమయాల్లో ఈ-కామర్స్ అమ్మకాల్లో పాల్గొంటున్నారు. అయితే, ఈ సారి ఎక్కువగా డిమాండ్ టైర్ 3 నగరాల నుంచి రావడం విశేషం. ధన్ బాద్, కరీంనగర్, వరంగల్, గోరఖ్ పూర్, చిత్తూరు, కర్నూలు, గుంటూరు, వైజాగ్ వంటి నగరాల నుంచి భారీగా ఆర్డర్లు వచ్చినట్లు ఈ-కామర్స్ సంస్థలు పేర్కొన్నాయి. దేశీయ ఆర్ధిక వ్యవస్థ తిరిగి పుంజుకున్నట్లు మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. షాపింగ్ పోర్టల్స్ అమ్మకాల సమయంలో దాదాపు సగం ఆర్డర్లు టైర్-3 నగరాలు వచ్చాయి. టెలివిజన్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో ఎక్కువగా అమ్ముడయ్యాయి. షాపింగ్ చేసిన ప్రతి ఐదుగురు కస్టమర్లలో ఒకరు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశారు. ఫెస్టివల్ సేల్ ప్రారంభమైన మొదటి కొన్ని రోజులు పాట్నా, లక్నో, వైజాగ్ వంటి నగరాలు ఇతర మెట్రో నగరాలతో పోటీ పడ్డాయి. రాను రాను అన్ని ఆర్డర్లలో దాదాపు సగానికి మించి టైర్-3 నగరాలు నుంచి వచ్చాయి. "మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, జీవనశైలి, సాధారణ మర్కండైజింగ్, ఇంటి వంటి కేటగిరీలు అత్యధిక డిమాండ్ కలిగి ఉన్నాయి" అని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. (చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మహిళా ధనవంతురాలు ఈమే..!) -
ఉద్యోగుల కోసం పోటీ పడుతున్న కంపెనీలు
దేశంలో ఆర్ధిక వృద్ది తిరిగి పెరగడంతో ప్రతిభ గల ఉద్యోగుల కోసం చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీనికోసం కంపెనీలు బయట నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడం కోసం తమ ఉద్యోగులకు భారీగా వేతనాన్ని పెంచడానికి సిద్ద పడుతున్నాయి. వేతన పెంపు విషయమై అయాన్ అనే సంస్థ 39 పరిశ్రమల్లో 1,300 సంస్థలతో 26వ వార్షిక వేతన పెంపు సర్వేను నిర్వహించిది. ఈ సర్వే ప్రకారం.. ఇండియా ఇంక్ 2022లో సగటున వేతనాన్ని 9.4 శాతం పెంచే అవకాశం ఉంది. ఈ సూచిక బలమైన ఆర్ధిక రికవరీని సూచిస్తుంది. గత సంవత్సరం వేతన పెంపు కంటే 8.8 శాతం ఎక్కువ. (చదవండి: కరోనా చికిత్సకు ‘హెటెరో’ బూస్ట్) అయాన్ నివేదిక ప్రకారం.. దేశంలో వ్యాపార కార్యకలాపాలు వేగంగా తిరిగి పుంజుకుంటున్నాయి. 2022లో టెక్నాలజీ, ఈ-కామర్స్, ఐటీ ఆధారిత రంగాలలో అత్యధిక వేతన పెంపు ఉండే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ సేవలు, శక్తి, ఆతిథ్యం వంటి రంగాలలో అతి తక్కువ పెంపు అనేది ఉండనుంది. ఇంకా, 98.9 శాతం కంపెనీలు ఏడాది క్రితం 97.5 శాతంతో పోలిస్తే 2022లో ఉద్యోగుల వేతనాన్ని పెంచాలని భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇది ఇలా ఉంటే ఎటువంటి వేతన పెంపు అమలు చేయని కంపెనీల సంఖ్య 2.5 శాతం నుంచి 1.1 శాతానికి తగ్గింది. చాలా మంది ఉద్యోగులు ఎక్కువ వేతనాన్ని ఆఫర్ చేసే సంస్థలో జాయిన్ అవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. కరోనా మహమ్మరి తర్వాత డిజిటల్ టెక్నాలజీకి డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో చాలా కంపెనీలు అత్యుత్తమ మానవ వనరులకు ఎక్కువ జీతాన్ని అందించడానికి సిద్దపడుతున్నాయి. ఉత్తమ ప్రతిభ గల ఉద్యోగుల కోసం సంస్థలు తమ వ్యూహాలను రచిస్తున్నాయని సర్వేలో తేలింది. "అత్యధిక అట్రిషన్ రేటు గల రంగాలలో ఐటీ టెక్నాలజీ, ఈ-కామర్స్, ఆర్థిక సంస్థలు" ముందు వరుసలో ఉన్నాయని ఇటీవల రూపంక్ చౌదరి చెప్పారు. అలాగే ఆడిట్, పన్ను, చట్టపరమైన సేవలకు భారీ డిమాండ్ ఉన్నందున వృత్తిపరమైన సేవ రంగాలలో కూడా అధిక అట్రిషన్ రేటు ఉన్నట్లు ఆయన అన్నారు. -
అమెజాన్ భారీ నియామకాలు
ముంబై: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది భారత్‌లో 8,000 మందిని కొత్తగా నియమించుకోనుంది. కార్పొరేట్, టెక్నాలజీ, కస్టమర్ సరీ్వస్, ఆపరేషన్స్ విభాగాల్లో హైదరాబాద్‌సహా మొత్తం 35 నగరాల్లో ఈ నియామకాలు ఉంటాయని కంపెనీ తెలిపింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2025 నాటికి 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కలి్పంచాలన్నది లక్ష్యమని అమెజాన్ హెచ్ఆర్ లీడర్ దీప్తి వర్మ తెలిపారు. ఇప్పటికే దేశంలో 10 లక్షల ఉద్యోగాలు సృష్టించినట్టు చెప్పారు. మహమ్మారి కాలంలో మూడు లక్షల మందికి ఉపాధి లభించిందని వివరించారు. -
కేంద్ర మంత్రి సీతారామన్‌తో ఫ్లిప్‌కార్ట్ సీఈవో భేటీ
ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఇరువురి భేటీకి సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌పై కేంద్ర ఆర్థిక శాఖ పోస్ట్ చేసింది. సమావేశం వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు.. విక్రయదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలతో(ఎంఎస్ఎంఈ) ఫ్లిప్‌కార్ట్‌కు ఉన్న భాగస్వామ్యం, హస్తకళాకారులకు తాము అందిస్తున్న మద్దతు గురించి కృష్ణమూర్తి వివరించారు. అలాగే, డిజిటల్ వేదికల ద్వారా మరింత మంది కొనుగోలుదారులకు చేరువ అవుతున్న తీరును కూడా తెలియజేశారు. ఫ్లిప్‌కార్ట్ వేదికపై మూడు లక్షలకు పైగా విక్రేతలు నమోదై ఉన్నారు. ఇందులో 60% మంది ద్వితీయ శ్రేణి, అంతకంటే చిన్న పట్టణాలకు చెందినవారే ఉం టారు. హోల్‌సేల్ వ్యాపారం ద్వారా 16లక్షల కిరాణా స్టోర్లతోనూ ఫ్లిప్‌కార్ట్‌కు భాగస్వామ్యం కొనసాగుతోంది. ఫ్లిప్‌కార్ట్‌కు 35 కోట్ల యూజర్లున్నారు. -
2030కి 40 బిలియన్ డాలర్లకు చేరనున్న ఈ-కామర్స్ మార్కెట్
భారతదేశంలో ఈ-కామర్స్ మార్కెట్ విలువ 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరుకొనున్నట్లు కెర్నీ నివేదిక తెలిపింది. 2019లో 4 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ విలువ నుంచి 40 బిలియన్ డాలర్లకు పెరగనుంది. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరగడం, ఎక్కువ మంది ఆన్లైన్ షాపింగ్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్లు కెర్నీ నివేదిక తెలిపింది. భారతదేశంలో డిజిటల్ టెక్నాలజీ వినియోగం టైర్ 3 పట్టణాల నుంచి టైర్ 4 పట్టణాలతో పాటు గ్రామాలకు విస్తరిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం 4 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ-కామర్స్ మార్కెట్ విలువ వేగంగా వృద్ది చెందడం వల్ల 2026 నాటికి 20 బిలియన్ డాలర్లకు, 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 2019లో $ 90 బిలియన్లగా జీవనశైలి రిటైల్ మార్కెట్ విలువ 2026 నాటికి $156 బిలియన్లకు, 2030 నాటికి $215 బిలియన్లను తాకనున్నట్లు అంచనా వేసింది. ఇందులో దుస్తులు, పాదరక్షలు, ఫ్యాషన్ యాక్ససరీలు, కాస్మోటిక్స్, చిన్న ఉపకరణాలు, ఇల్లు వంటి కేటగిరీలు ఉంటాయి. "భారతదేశంలో రిటైల్ మార్కెట్ కోవిడ్ నుంచి తిరిగి పుంజుకోవడంతో ఆన్లైన్ దుకాణదారుల సంఖ్య పెరుగుతోంది. ఇది భారతదేశం ఈ-కామర్స్ ల్యాండ్ స్కేప్ ను పునరుద్ధరిస్తోంది. ఈ విభాగం వేగంగా వృద్ధి చెందడం వల్ల 2030 నాటికి 215 బిలియన్ డాలర్ల మార్కెట్ గా ఆవిర్భవిస్తుంది" అని కెర్నీ పార్టనర్ సిద్ధార్థ్ జైన్ తెలిపారు.ప్రస్తుతం ఉన్న మార్కెట్ డిమాండ్ లో కేవలం 4 శాతం మాత్రమే నేడు ఆన్లైన్ ద్వారా సేవలందిస్తుండగా, ఇది 2030 నాటికి 19 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. దీంతో భారతదేశంలో ఈ-కామర్స్ 40 బిలియన్ డాలర్ల మార్కెట్ ను సృష్టిస్తుందని ఆయన అన్నారు. -
‘ఫ్యూచర్’ కేసులో ఆర్బిట్రేషన్ తీర్పు అమలు చేయండి
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్‌తో విలీన ఒప్పందం విషయంలో ముందుకెళ్లరాదంటూ ఫ్యూచర్ రిటైల్‌కు సింగపూర్‌లోని ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్ (ఈఏ) ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ చెల్లుబాటు అవుతాయని, అవి అమలయ్యేలా చూడాలని సుప్రీం కోర్టును ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కోరింది. ఇవే ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కూడా తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలియజేసింది. అయితే, ఈ విషయంలో ఫ్యూచర్ గ్రూప్‌కు అనుకూలంగా హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇవ్వడం సరికాదని పేర్కొంది. రిలయన్స్–ఫ్యూచర్ డీల్ అంశంపై అత్యున్నత న్యాయస్థానంలో మంగళవారం ఈ మేరకు తమ వాదనలు వినిపించింది. సుప్రీం కోర్టు దీనిపై గురువారం లేదా వచ్చే మంగళవారం తదుపరి విచారణ చేపట్టనుంది. రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్‌ను విలీనం చేసే దిశగా ఫ్యూచర్ గ్రూప్ దాదాపు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఫ్యూచర్ గ్రూప్‌లో వాటాదారైన అమెజాన్.. ఈ ఒప్పందం చట్టవిరుద్ధమంటూ న్యాయస్థానాలను, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. -
ఈ–కామర్స్‌పై మరింతగా ఐటీసీ దృష్టి
న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌పై, ఆధునిక వ్యాపార విధానాలపై పారిశ్రామిక దిగ్గజం ఐటీసీ మరింతగా దృష్టి పెడుతోంది. ఉత్పాదకతను పెంచుకోవడానికి, వ్యయాలను తగ్గించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మొదలైన ఆధునిక డిజిటల్ టెక్నాలజీలను వినియోగించుకుంటోంది. 2020–21 వార్షిక నివేదికలో కంపెనీ ఈ విషయాలు వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వినియోగదారులు ఇళ్ల నుంచే కొనుగోళ్లు జరిపేందుకు ప్రాధాన్యమిస్తుండటంతో ఈ–కామర్స్‌కు ఊతం లభించిందని పేర్కొంది. ఇంటర్నెట్ వినియోగం .. డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు పెరగడం, ఆకర్షణీయమైన పథకాలు, ఉత్పత్తుల విస్తృత శ్రేణి, వేగవంతమైన డెలివరీలు మొదలైనవి ఈ విభాగం మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చేందుకు దోహదపడుతున్నాయని ఐటీసీ అభిప్రాయపడింది. ఇలాంటి అంశాలన్నింటి తోడ్పాడుతో గత నాలుగేళ్లుగా తమ మార్జిన్లు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొంది. డోమినోస్, స్విగ్గీ, జొమాటో, డుంజో వంటి సంస్థలతో చేతులు కలపడం ద్వారా వినియోగదారులకు ఉత్పత్తుల లభ్యత పెరిగిందని ఐటీసీ తెలిపింది. ’ఐటీసీ స్టోర్ ఆన్ వీల్స్’ మోడల్‌తో 13 నగరాల్లో 900 పైగా రెసిడెన్షియల్ కాంప్లెక్సులకు ఉత్పత్తులను అందిస్తున్నట్లు పేర్కొంది. గతేడాది సరిగ్గా లాక్‌డౌన్‌కు ముందు ప్రారంభించిన ఐటీసీ ఈ–స్టోర్‌కు మంచి స్పందన లభిస్తోందని, రాబోయే నెలల్లో దీన్ని మరింత వేగవంతంగా విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. -
చట్టాలు ఉల్లంఘించిన ఈ–కామర్స్ కంపెనీలు
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారం చేస్తున్న చాలా మటుకు బడా ఈ–కామర్స్ కంపెనీలు అనేక రకాలుగా, యథేచ్ఛగా దేశ చట్టాలను ఉల్లంఘించాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ వ్యాఖ్యానించారు. అన్ని ఈ–కామర్స్ కంపెనీలు కచ్చితంగా దేశ చట్టాలను కచ్చితంగా పాటించి తీరాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అర్థబలం.. అంగబలంతో ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించరాదని ఒక సెమినార్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. పలు కంపెనీలు పాటిస్తున్న విధానాలు.. వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ–కామర్స్ కంపెనీల కోసం కేంద్రం నిబంధనల ముసాయిదాను రూపొందించిందని, వీటిని దేశ విదేశ సంస్థలు అన్నీ పాటించి తీరాల్సిందేనని గోయల్ చెప్పారు. నిబంధనలను మార్చొద్దు: సీఏఐటీ విజ్ఞప్తి కాగా, ఈ–కామర్స్ సంస్థల విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గరాదని, నిబంధనల ముసాయిదాలో ఎటువంటి మార్పులు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ విజ్ఞప్తి చేసింది. సిఫార్సులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని నిబంధనలను తక్షణం నోటిఫై చేయాలని కోరింది. పుష్కలంగా విదేశీ నిధులు పొందిన ఈ–కామర్స్ కంపెనీల అనైతిక వ్యాపార విధానాల వల్ల దేశంలో అనేక దుకాణాలు మూతబడ్డాయని సీఏఐటీ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: పెట్టుబడికి ఐడియా ఒక్కటే సరిపోదు.. -
ఈ-కామర్స్‌కు కఠిన నిబంధనలు.. ఫ్లాష్ సేల్స్ నిషేధం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో ఫ్లాష్ సేల్స్‌తో ఈ–కామర్స్ కంపెనీల హడావిడి గుర్తుందిగా. భారీ డిస్కౌంట్‌తో అతి తక్కువ ధరకు ఫలానా ఉత్పత్తిని, ఫలానా సమయానికి అమ్ముతామంటూ చేసే ఆర్భాటాలకు కొద్ది రోజుల్లో అడ్డుకట్ట పడనుంది. ఒక వస్తువును ప్రదర్శించి మరో వస్తువును అంటగట్టినా, ఉత్పాదనను, సేవను అందించడంలో విక్రేత విఫలమైనా ఆ బాధ్యత ఈ–కామర్స్ కంపెనీదే. ఈ మేరకు వినియోగదారుల రక్షణ (ఈ– కామర్స్) నిబంధనలకు సవరణలు చేయాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) సోమవారం సూచించింది. చదవండి : ఐటీలో భవిష్యత్ అంతా వీటిదే ప్రతిపాదిత సవరణలపై తమ అభిప్రాయాలు, సూచనలను తెలియజేసేందుకు ఈ–కామర్స్ కంపెనీలు, పారిశ్రామిక సంఘాలకు జూలై 6 వరకు ఎంసీఏ సమయం ఇచ్చింది. మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కొందరు విక్రేతలకే ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ కంపెనీలపై కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ జరుపుతున్న తరుణంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆఫ్‌లైన్ విక్రేతలను దెబ్బతీసేలా ఆఫర్ చేస్తున్న భారీ డిస్కౌంట్లపైనా సీసీఐ దర్యాప్తు చేస్తోంది. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే ఈ–కామర్స్ కంపెనీల్లో జవాబుదారీ పెరుగుతుంది. వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా దేశంలో ఈ–కామర్స్ రంగంలో కఠిన నిబంధనలు రానున్నాయి. ప్రతిపాదిత సవరణల్లో ఏముందంటే.. అధికారుల నియామకం కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ఈ–కామర్స్ కంపెనీలు తగు వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. చీఫ్ కాంప్లియాన్స్ ఆఫీసర్‌ను నియమించాలి. భారతీయ పౌరుడైన ఈ–కామర్స్ ఉద్యోగిని రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియమించాలి. చట్టాన్ని అమలు చేసే సంస్థలు సంప్రదింపుల కోసం ఈ అధికారి అందుబాటులో ఉండాలి. ప్రతి ఈ–కామర్స్ సంస్థ వీలైనంత త్వరగా లేదా ఆర్డర్ అందిన 72 గంటల్లోగా సమాచారాన్ని ప్రభుత్వ సంస్థలకు అందించాలి. ప్రైవేట్ లేబుల్స్ ప్రైవేట్ లేబుల్స్ అమ్మకాలకు, ప్రమోషన్‌కు ఈ–కామర్స్ కంపెనీ తన బ్రాండ్‌ను వినియోగించరాదు. ఆధిపత్యానికి చెక్ ఏ విభాగంలోనైనా ఆధిపత్య స్థానం కలిగి ఉన్న ఈ–కామర్స్ సంస్థ దాని మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేయడానికి అనుమతించరు. ఒక నిర్దిష్ట విక్రేత లేదా సెల్లర్స్ సమూహాన్ని మాత్రమే విక్ర యించడానికి వీలు కల్పించే ఫ్లాష్ సేల్స్ నిషేధం. విదేశీ ఉత్పత్తులు ఈ–కామర్స్ కంపెనీలు వినియోగదారుల కోసం ముందస్తు కొనుగోలు దశలో వాటి మూలం ఆధారంగా వస్తువులను గుర్తించి, వడపోత యంత్రాంగాన్ని అందించాలి. దేశీయ అమ్మకందారులకు న్యాయమైన అవకాశాన్ని కల్పించేందుకు ఆన్లైన్ కంపెనీలు దిగుమతి చేసుకునే వస్తువులకు ప్రత్యామ్నాయాలను చూపించాలి. ప్రాధాన్యతకు అడ్డుకట్ట ఈ–కామర్స్ కంపెనీలకు చెందిన ఏ సంస్థ కూడా సెల్లర్‌గా నమోదు కారాదు. ఈ సంస్థలు అన్యాయమైన ప్రయోజనం కోసం ఆన్లైన్ ప్లాట్‌ఫాం నుంచి వినియోగదార్లకు చెందిన సమాచారం సేకరించరాదు. డెలివరీ సేవలు అందించే ఏ కంపెనీకి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వరాదు. -
ఫ్యూచర్ డీల్‌పై సుప్రీం కోర్టుకు అమెజాన్
న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూప్–రిలయన్స్ డీల్ వివాదంపై ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ ఒప్పందానికి సంబంధించిన స్టేను ఎత్తివేస్తూ ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ మార్చి 22న ఇచ్చిన ఆదేశాలను సవాలు చేసింది. ఈ వివాదంపై తాము గతంలో వేసిన పిటిషన్ మీద తుది ఉత్తర్వులు వచ్చేదాకా డివిజన్ బెంచ్ ఆదేశాలపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. వివరాల్లోకి వెడితే .. కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాలతో సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్ గ్రూప్ తమ ఫ్యూచర్ రిటైల్ సంస్థ (ఎఫ్ఆర్ఎల్) వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌కి (ఆర్ఆర్వీఎల్) విక్రయించేందుకు గతేడాది ఆగస్టులో డీల్ కుదుర్చుకుంది. దీని విలువ సుమారు రూ. 24,713 కోట్లు. అయితే, అప్పటికే ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌లో అమెజాన్ వాటాలు కొనుగోలు చేసింది. ఫ్యూచర్ కూపన్స్ సంస్థ ఎఫ్‌ఆర్‌ఎల్‌లో వాటాదారు కావడంతో పరోక్షంగా అమెజాన్‌కు కూడా స్వల్ప వాటాలు లభించాయి. ఈలోగా రిలయన్స్‌తో ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకోవడం నిబంధనలకు విరుద్ధమంటూ న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఈ క్రమంలో రిలయన్స్‌కు ఫ్యూచర్ గ్రూప్ అసెట్స్ విక్రయించకుండా స్టే విధిస్తూ మార్చి 18న ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, మార్చి 22న డివిజనల్ బెంచ్ వీటిని పక్కన పెట్టింది. ప్రస్తుతం దీనిపైనే అమెజాన్ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. -
ఈ–కామర్స్ వేదికపై మన హస్తకళలు
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న అవకాశాలను రాష్ట్ర హస్తకళాకారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సహకారంతో ఈ–కామర్స్ పోర్టళ్ల వేదికగా తమ ఉత్పత్తులకు ఆన్లైన్ బ్రాండింగ్ చేసుకుంటున్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులైన హస్త కళాకారులు తమ ఉత్పత్తులను ఆన్లైన్ మార్కెట్లో విక్రయించేందుకు మెప్మా చేపట్టిన కార్యాచరణ విజయవంతమవుతోంది. ఇప్పటికే 450 రకాల హస్తకళా ఉత్పత్తులు ఈ–కామర్స్ పోర్టళ్లలో బ్రాండింగ్ దక్కించుకోవడం విశేషం. మెప్మా కార్యాచరణ రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 94,533 మంది హస్త కళాకారులు డ్వాక్రా సంఘాల సభ్యులుగా ఉన్నారు. సంప్రదాయ కళా నైపుణ్యాన్ని ఆలంబనగా చేసుకుని వారు స్వయంఉపాధి రంగంలో రాణించేందుకు మెప్మా కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం ముందుగా స్వయం ఉపాధి పథకాల కోసం గ్రూపు రుణాలు, వ్యక్తిగత రుణాల కింద రూ.118.49 కోట్లు మంజూరు చేసింది. అంతేకాకుండా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే బాధ్యతను కూడా చేపట్టింది. ప్రధానంగా విస్తృతమవుతున్న ఆన్లైన్ మార్కెటింగ్ రంగం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించింది. మహిళలు తమ ఇళ్లలో తయారుచేసిన హస్త కళారూపాలను మార్కెటింగ్ చేసుకునేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ–కామర్స్ పోర్టళ్లలో రిజిస్ట్రేషన్ చేయించింది. అదేవిధంగా ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ సౌజన్యంతో డ్వాక్రా సభ్యులకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించింది. 450 రకాల ఉత్పత్తులు ఈ–కామర్స్ ద్వారా మార్కెటింగ్ కోసం జిల్లాలవారీగా హస్తకళలను మెప్మా ఎంపిక చేసింది. దాంతో ఆయా జిల్లాల డ్వాక్రా మహిళలు ఆ ఉత్పత్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రస్తుతం ఏకంగా 450 రకాల హస్త కళా ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోర్టళ్లలో బ్రాండింగ్ పొందడం విశేషం. మహిళల స్వయంఉపాధికి ఊతం రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెస్తున్న హస్తకళా ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. దీంతో మహిళల స్వయంఉపాధి అవకాశాలు పెరిగి మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది. ఇప్పటివరకు 450 రకాల ఉత్పత్తులకు ఆన్లైన్లో బ్రాండింగ్ చేయించాం. రానున్న రోజుల్లో మరిన్ని ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం. – వి.విజయలక్ష్మి, మిషన్ డైరెక్టర్, మెప్మా -
డిజిటల్ ట్యాక్స్‌పై కేంద్రం వెనకడుగు
న్యూఢిల్లీ: సమాన అవకాశాలు కల్పించే దృష్టితో విదేశీ ఈ కామర్స్ సంస్థలపై అమలు చేస్తున్న 2 శాతం డిజిటల్ పన్ను విషయంలో కేంద్రం కొంత వెనక్కి తగ్గింది. భారత అనుబంధ విభాగాల ద్వారా విదేశీ ఈ కామర్స్ సంస్థలు విక్రయాలు నిర్వహిస్తే డిజిటల్ పన్ను ఉండదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సవరించిన ఆర్థిక బిల్లు 2021లో కేంద్రం స్పష్టతనిచ్చింది. భారత్‌లో శాశ్వత విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నా లేదా ఇక్కడ ఆదాయపన్ను చెల్లిస్తున్నా 2 శాతం సమానత్వలెవీని చెల్లించక్కర్లేదని కేంద్రం పేర్కొంది. అయితే భారత్‌లో ఆదాయపన్ను చెల్లించకుండా ఈ కామర్స్ విక్రయాలు చేపట్టే విదేశీ సంస్థలపై ఇక ముందూ 2 శాతం పన్ను కొనసాగుతుందని స్పష్టం చేసింది. వార్షిక ఆదాయాలు రూ.2 కోట్లు దాటిన విదేశీ సంస్థలపై డిజిటల్ ట్యాక్స్‌ను 2020 ఏప్రిల్‌లో కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన విషయం గమనార్హం. ‘సవరణ ద్వారా ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను. భారత్‌లో నివసించే వారికి సంబంధించిన వస్తువులపై సమానత్వ పన్ను అమలు కాదు. భారత్‌లో పన్నులు చెల్లించే భారత వ్యాపార సంస్థలు.. అదే సమయంలో భారత్‌లో ఎటువంటి పన్నులు చెల్లించకుండా ఈ–కామర్స్ విక్రయాలు నిర్వహించే విదేశీ కంపెనీల మధ్య సమాన అవకాశాల కోణంలోనే దీన్ని ప్రవేశపెట్టాం’ అని ఆర్థిక మంత్రి సీతారామన్ లోక్‌సభకు తెలిపారు. డిజిటల్ ట్యాక్స్ అన ్నది అమెరికా కంపెనీల పట్ల వివక్ష చూపించడమేనంటూ అమెరికా గతంలో ఆరోపించింది. భారత రేటింగ్ తగ్గదు భారత్‌కు పెట్టుబడుల రేటింగ్ కొనసాగుతుందని.. రేటింగ్ డౌన్‌గ్రేడ్‌కు అవకాశాల్లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లోనే ఉండడం, అధిక జీడీపీ వృద్ధి, రికార్డు స్థాయి విదేశీ పెట్టుబడులు, తక్కువ ద్రవ్యలోటు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలిచే అంశాలుగా పేర్కొన్నారు. యూపీఏ హయంలో 2009–14 మధ్య సగటు జీడీపీ 6.7 శాతంగా ఉంటే, ఎన్డీఏ హయాంలో 2014–19 మధ్య 7.5 శాతంగా ఉన్నట్టు చెప్పారు. కాంగ్రెస్ హయంలోని యూపీఏ సర్కారు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యçస్తం చేయగా, మోదీ సర్కారు దీన్ని సరైన దారిలో పెట్టినట్టు తెలిపారు. ఆర్థిక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం ఆర్థిక బిల్లు 2021కి రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. మంగళవారం లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు బుధవారం రాజ్యసభ ముందుకు వచ్చింది. చర్చలో భాగంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతారామన్ సమాధానమిచ్చారు. చర్చ అనంతరం మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో బడ్జెట్ 2021–22కు పార్లమెంటు ఆమోదం పూర్తయింది. పీఎఫ్ సభ్యులకు పన్ను లేని చందా రూ.5 లక్షలకు పెంచడం సహా పలు సవరణలను బిల్లులో ప్రతిపాదించారు. -
ఆన్లైన్ లో ఫేక్ వస్తువులు అమ్మితే ఇక అంతే!
ప్రస్తుతం కరోనా పుణ్యమా అని చాలా మంది ప్రజలు బయటికి ఎక్కువగా వెళ్ళడానికి ఇష్ట పడటం లేదు. ప్రతి చిన్న వస్తువును కొనుక్కోవడానికి కూడా ఆన్ లైన్ షాపింగ్ మీద ఆధారపడుతున్నారు. కరోనా రాక ముందు కంటే వచ్చిన తర్వాతే ప్రజలు ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నట్లు కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్న వస్తువులపై ప్రజలకు చాలా సందేహాలు ఉన్నాయి. ఇందులో కొనే వస్తువు నిజమా కదా?, ఫేక్ వస్తువు వస్తే ఏం చేయ్యాలి ? అనే సందేహాలు వారి మదిలో మెదులుతున్నాయి. ఈ మధ్య కాలంలోఈ కామర్స్ సైట్లలో కొన్ని ఫేక్ ప్రొడక్ట్స్ వస్తున్నట్లు వినియోగదారులు కంప్లైంట్ చేస్తున్నారు. ఇలాంటి వాటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకు సంబంధించిన కొన్ని నియమాలను నేషనల్ ఈ కామర్స్ పాలసీ ముసాయిదాలో పొందుపరిచింది. ప్రైవేట్, ప్రైవేట్యేతర డాటాపై ప్రభుత్వం ముసాయిదా ప్రక్రియలా పాలసీని పేర్కోంది. పరిశ్రమ అభివృద్ధి కోసం డేటా వినియోగంపై నూతన విధానం తీసుకురాబోతుంది. దీనిలో ప్రతి ఉత్పతులకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని వినియోగదారులకు తెలిసే విధంగా కొత్త ముసాయిదా తీసుకురానున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఏదైనా కంపెనీ ఉత్పత్తి ఆన్ లైన్ లో అమ్మాలని అనుకుంటే దానికి సంబందించిన ప్రతి సమాచారం యూజర్లకు అందించాల్సి ఉంటుంది. ఈ కామర్స్ కంపెనీలు తమ ఫాట్ ఫాంలలో విక్రయించే ఉత్పత్తులు నకిలీవి కాదని ముందే నిర్దారించుకోవడం కోసం సేఫ్ గార్డ్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆన్లైన్ లో నకిలీ ఉత్పత్తిని అమ్మితే అది అన్ లైన్ కంపెనీతోపాటు, అమ్మంకందారుల బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ చర్య పారిశ్రామిక అభివృద్ధికి డేటా షేరింగ్ సహకరిస్తుందని తెలిపింది. ఇందుకోసం మరిన్ని డేటా నిబంధనలు రానున్నట్లుగా తెలిపింది. ఈ కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. చదవండి: ఈ యాప్స్ ను వెంటనే డిలీట్ చేయండి -
రూ. 8 లక్షల కోట్లకు ఈ–కామర్స్!
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో డిజిటల్ టెక్నాలజీల వాడకం విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఈ–కామర్స్ విభాగం గణనీయంగా వృద్ధి చెందనుంది. గతేడాది (2020లో) 60 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ–కామర్స్ 2024 నాటికి దాదాపు 111 బిలియన్ డాలర్ల్ల (సుమారు 8 లక్షల కోట్లు) స్థాయికి చేరనుంది. దాదాపు 84 శాతం వృద్ధి సాధించనుంది. ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ ఎఫ్ఐఎస్ విడుదల చేసిన 2021 గ్లోబల్ పేమెంట్స్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దాదాపు 41 దేశాల్లో ప్రస్తుత, భవిష్యత్ చెల్లింపుల ధోరణులను ఈ నివేదికలో విశ్లేషించారు. దీని ప్రకారం కోవిడ్–19 పరిణామాలతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారుల ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచ్చాయి. చెల్లింపుల కోసం కొత్త విధానాలను ఉపయోగించడం పెరిగింది. ‘కోవిడ్–19 నేపథ్యంలో భారత్‌లో ఈ–కామర్స్ విభాగం భారీగా పెరిగింది. భవిష్యత్‌లో మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉంది‘ అని ఎఫ్ఐఎస్ వరల్డ్‌పే ఎండీ (ఆసియా పసిఫిక్) ఫిల్ పామ్ఫోర్డ్ తెలిపారు. పెరగనున్న మొబైల్ షాపింగ్..: నివేదిక ప్రకారం ఈ–కామర్స్ వృద్ధికి మొబైల్ ద్వారా కొనుగోళ్లు జరపడం ప్రధానంగా దోహదపడనుంది. వచ్చే నాలుగేళ్లలో మొబైల్ షాపింగ్ వార్షికంగా 21 శాతం మేర వృద్ధి చెందనుంది. 2020లో అత్యధికంగా ఉపయోగించిన చెల్లింపు విధానాల్లో డిజిటల్ వ్యాలెట్లు (40%), క్రెడిట్ కార్డు.. డెబిట్ కార్డులు (చెరి 15%) ఉన్నాయి. ఆన్లైన్ చెల్లింపుల మార్కెట్లో డిజిటల్ వ్యాలెట్ల వాటా 2024 నాటికి 47 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా దేశీయంగా ఆన్లైన్ పేమెంట్లకు సంబంధించి ’బై నౌ పే లేటర్’ (ముందుగా కొనుక్కోవడం, తర్వాత చెల్లించడం) విధానం కూడా గణనీయంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రస్తుతానికి దీని మార్కెట్ వాటా 3%గానే ఉన్నప్పటికీ ... 2024 నాటికి ఇది 9%కి పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. పీవోఎస్ మార్కెట్ 41 శాతం వృద్ధి.. డిజిటల్ మాధ్యమం ద్వారా చెల్లింపులు జరిపేలా కస్టమర్లకు వెసులుబాటు కల్పించే సంస్థలే రాబోయే రోజుల్లో రిటైల్, ఈ–కామర్స్ మార్కెట్లో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోగలవని పామ్ఫోర్డ్ తెలిపారు. నివేదిక ప్రకారం దేశీయంగా పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మార్కెట్ 2024 నాటికి 41 శాతం వృద్ధి చెంది 1,035 బిలియన్ డాలర్లకు చేరనుంది. స్టోర్స్‌లో చెల్లింపులకు అత్యధికంగా నగదు (34 శాతం), డిజిటల్ వ్యాలెట్లు (22 శాతం), డెబిట్ కార్డ్ (20 శాతం) విధానాలను ఉపయోగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఆసియా పసిఫిక్ 13 శాతం అప్.. వర్ధమాన దేశాల్లో అధిక వృద్ధి ఊతంతో.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ–కామర్స్ మార్కెట్ 2024 నాటికి 13 శాతం వార్షిక వృద్ధి నమోదు సాధించే అవకాశం ఉంది. చైనాలో అత్యధికంగా ఈ–కామర్స్ వినియోగం అత్యధిక స్థాయిలో కొనసాగనుంది. -
అమెరికన్ కంపెనీలపై వివక్ష లేదు
న్యూఢిల్లీ: విదేశీ ఈ–కామర్స్ సంస్థలపై రెండు శాతం పన్ను విధింపు విధానంతో అమెరికన్ కంపెనీల పట్ల వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. దీనిపై అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) నివేదికలో పొందుపర్చిన అంశాలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్ స్పష్టం చేశారు. ఈ–కామర్స్ సరఫరాలపై భారత్ రెండు శాతం డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ విధించడం అమెరికన్ కంపెనీల పట్ల వివక్ష చూపటమేనని, ఇది అంతర్జాతీయ పన్ను సూత్రాలకు విరుద్ధమని యూఎస్టీఆర్ గత నెల ఒక నివేదికలో పేర్కొంది. దీనిపైనే తాజాగా వాధ్వాన్ స్పందించారు. విదేశీ సంస్థలు .. బిలియన్ల డాలర్ల కొద్దీ ఆదాయాలు పొందుతున్న దేశాల్లో పన్నులు చెల్లించడం తప్పదని ఆయన పేర్కొన్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) దేశాలు కూడా ఇదే దిశగా చర్యలు తీసుకుంటున్నాయని వాధ్వాన్ వివరించారు. ఫేస్బుక్, గూగుల్, అమెజాన్ వంటి సంస్థల రూపంలో ఆయా రంగాల్లో ఆధిపత్యం ఉన్నందునే కొన్ని దేశాలు ఇలాంటి పన్నులను వ్యతిరేకిస్తున్నాయని ఆయన చెప్పారు. మినీ వాణిజ్య ఒప్పందంపై చర్చలు.. అమెరికా, భారత్ మధ్య ప్రతిపాదిత మినీ వాణిజ్య ఒప్పందంపై స్పందిస్తూ .. పలు అంశాలపై ఇరు దేశాల చర్చలు కొనసాగుతూనే ఉంటాయని, వీటికి ముగింపు ఉండదని వాధ్వాన్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింతగా పెంచుకునే దిశగా ప్రతిబంధకంగా ఉన్న కొన్ని వివాదాలను పరిష్కరించుకోవడంపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ) కింద తమ ఎగుమతులకు ప్రాధాన్యత హోదాను పునరుద్ధరించాలని అమెరికాను భారత్ కోరుతోంది. మరోవైపు, వ్యవసాయం, తయారీ, డెయిరీ, వైద్య పరికరాలు తదితర విభాగాల్లో తమ కంపెనీలను మరింత విస్తృతంగా అనుమతించాలని అమెరికా కోరుతోంది. -
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మూడో క్వార్టర్ నుంచి అమెజాన్ సీఈఓ పదవి నుంచి తాను తప్పుకోబోతున్నట్లు ప్రకటించారు. కేవలం ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఉద్యోగులకు రాసిన లేఖలో 'అమెజాన్' అంటే ఒక ఆవిష్కరణ అని అన్నారు. జెఫ్ బెజోస్ స్థానంలో అమెజాన్ వెబ్ సర్వీస్ హెడ్ ఆండీ జెస్సీ తదుపరి సీఈవోగా నియామకం కానున్నారు. ఆండీ జెస్సీ బయట ప్రపంచానికి అంతగా తెలియకపోవచ్చు కానీ అతను సంస్థలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. జెస్సీ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే 1997లో అమెజాన్ కంపెనీలో చేరారు.(చదవండి: క్రిప్టో కరెన్సీ చరిత్రలో మరో సంచలనం!) అమెజాన్ కంపెనీ వరుసగా క్వార్టర్స్ లో కూడా సంస్థ లాభాలను ఆర్జించడమే కాకుండా.. 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా సేల్స్ ను ఈ క్వార్టర్ లో నమోదు చేయడం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్‌గా మారడంతో నికర అమ్మకాలు 125.56 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 57 ఏళ్ల బెజోస్ 27 సంవత్సరాల క్రితం 1994లో అమెజాస్‌ను స్థాపించారు. ఇంటర్నెట్లో పుస్తకాలు అమ్మెందుకు ఈ సంస్థను ప్రారంభించారు. చిన్న సంస్థగా మొదలైన అమెజాన్ అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజ సంస్థగా నిలిచింది. అంతేకాదు సంస్థతో పాటు బెజోస్ ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం అమెజాన్ ఆస్తుల విలువ 1.6 ట్రిలియన్ డాలర్లు. ప్రస్తుతం అమెజాన్ ఎర్త్ ఫండ్, బ్లూ ఆర్జిన్ స్పేస్‌షిప్, అమెజాన్ డే1 ఫండ్2పై ఆయన మరింత దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. (అమెజాన్ కొత్త సీఈఓ ప్రత్యేకతలేంటో తెలుసా?) -
గందరగోళం సృష్టిస్తోంది..
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో డీల్ విషయంలో మోకాలడ్డుతున్న అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఫ్యూచర్ గ్రూప్ ప్రమోటర్ కిషోర్ బియానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు అక్కరకు రాని వ్యవహారంలో తలదూరుస్తూ అమెజాన్ గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఫ్యూచర్ గ్రూప్ ఉద్యోగులకు లేఖ రాశారు. అమెజాన్‌తో వివాదం విషయంలో ఉద్యోగులకు భరోసా కల్పించేందుకు బియానీ ప్రయత్నం చేశారు. ‘అలెగ్జాండర్ యావత్ ప్రపంచాన్ని గెలిచినా.. భారత్‌లో విఫలమయ్యాడని చరిత్ర చెబుతోంది. భారతీయ వినియోగదారులకు అందిస్తున్న సేవలు, మీ అండతో దేశ ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రాథమిక హక్కులను కాపాడుకునేందుకు పోరాటం కొనసాగిస్తాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఫ్యూచర్ గ్రూప్ చట్టబద్ధంగానే ముందుకు సాగుతోందని .. స్టాక్ ఎక్సే్చంజీలు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి కూడా డీల్‌కు అనుమతులు పొందిందని పేర్కొన్నారు. లిటిగేషన్లతో వేధిస్తోంది ..అమెజాన్ ఒక ప్రణాళిక ప్రకారం మీడియాలో దుష్ప్రచారం సాగిస్తోందని, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని లీక్ చేస్తోందని కిషోర్ బియానీ ఆరోపించారు. ఫ్యూచర్ రిటైల్, డైరెక్టర్ల బోర్డు, రుణదాతలతో పాటు తనతో పాటు తండ్రి, పిల్లలు, కుటుంబసభ్యులను కూడా విడిచి పెట్టడం లేదని పేర్కొన్నారు. కరోనా వైరస్‌పరమైన ఆర్థిక సంక్షోభం కారణంగా రిలయన్స్ గ్రూప్‌తో నిర్మాణాత్మక డీల్ కుదుర్చుకోవడం మినహా మరో గత్యంతరం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. ఫ్యూచర్ గ్రూప్‌లోని అన్లిస్టేడ్ సంస్థ ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు 2019 ఆగస్టులో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫ్యూచర్ కూపన్స్‌కి వాటాలు ఉన్న ఫ్యూచర్ రిటైల్ సంస్థలో కొన్నేళ్ల తర్వాత అమెజాన్ కూడా వాటాలు కొనుగోలు చేయొచ్చు. అయితే, కరోనా దెబ్బతో రిటైల్‌ను రిలయన్స్‌కు సుమారు రూ. 24,713 కోట్లకు విక్రయించాలని ఫ్యూచర్ గ్రూప్ నిర్ణయించుకోవడంతో వివాదం వచ్చి పడింది. ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ అమెజాన్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా .. దానికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. మరోవైపు, ఫ్యూచర్ గ్రూప్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. నియంత్రణ సంస్థలు దీనిపై నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో.. ఒప్పంద ఉల్లంఘనకు గాను బియానీని అరెస్ట్ చేయడంతో పాటు ఆస్తులను కూడా జప్తు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో అమెజాన్ పిటిషన్ దాఖలు చేసింది. -
బిగ్‌బాస్కెట్‌పై సైబర్ దాడి!
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ బిగ్‌బాస్కెట్ డేటాబేస్ చోరీకి గురైందని సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబల్ వెల్లడించింది. సంస్థ నుంచి తస్కరించిన 2 కోట్ల మంది పైగా యూజర్ల డేటాను హ్యాకర్లు సుమారు రూ. 30 లక్షలకు అమ్మకానికి ఉంచారని పేర్కొంది. ‘విధుల్లో భాగంగా డార్క్ వెబ్‌ను పరిశీలిస్తుండగా సైబర్ క్రైమ్ మార్కెట్లో బిగ్ బాస్కెట్ డేటాబేస్‌ను 40,000 డాలర్లకు హ్యాకర్లు అమ్మకానికి ఉంచినట్లు మా రీసెర్చి విభాగం గుర్తించింది. సుమారు 15 జీబీ పరిమాణం ఉన్న ఎస్‌క్యూఎల్ ఫైల్లో దాదాపు 2 కోట్ల మంది పైగా యూజర్ల డేటా ఉంది. ఇందులో పేర్లు, ఈమెయిల్ ఐడీలు, మొబైల్ నంబర్లు, చిరునామాలు, పుట్టిన తేదీ, ఐపీ అడ్రస్‌లు మొదలైన వివరాలు ఈ డేటాలో ఉన్నాయి‘ అని సైబల్ తెలిపింది. అక్టోబర్ 30న సైబర్ దాడి జరిగినట్లు తాము గుర్తించామని, అదే విషయం బిగ్‌బాస్కెట్‌కు సత్వరం తెలియజేశామని సైబల్ తెలిపింది. మరోవైపు, డేటా చౌర్యం అవకాశాలపై వార్తలొచ్చిన నేపథ్యంలో దీన్ని కట్టడి చేయడానికి సైబర్‌సెక్యూరిటీ నిపుణులతో కలిసి పనిచేస్తున్నామని, బెంగళూరులోని సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు కూడా చేశామని బిగ్‌బాస్కెట్ తెలిపింది. యూజర్లకు సంబంధించిన క్రెడిట్ కార్డు నంబర్లు తదితర వివరాలేమీ తమ దగ్గర ఉండవని, అలాంటి డేటాకు వచ్చిన ముప్పేమీ ఉండబోదని పేర్కొంది. -
అమెజాన్‌తో జట్టు కట్టిన యమహా
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్‌తో ఒప్పందం చేసుకుంది. దీంతో కస్టమర్లు యమహా ఇండియా టీషర్ట్స్, జాకెట్స్, స్టిక్కర్స్, కీచెయిన్స్ వంటి ఇతరత్రా యాక్ససరీలను అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేయవచ్చు. ఒక మోటార్ కంపెనీ అపెరల్స్, యాక్ససరీలను ఆన్లైన్లో విక్రయించే ఒప్పందం చేసుకోవటం దేశంలోనే తొలిసారని యమహా మోటార్ ఇండియా గ్రూప్ చైర్మన్ మోటోఫుమీ శిటారా ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవలే యమహా కంపెనీ ఆన్లైన్లో వాహన విక్రయాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు వాటాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్‌లో (ఏబీఎఫ్ఆర్ఎల్) 7.8 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 1,500 కోట్లు వెచ్చించనుంది. ఈ డీల్ ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌కు 7.8 శాతం వాటాలు దక్కే విధంగా ప్రిఫరెన్స్ షేర్లు జారీ చేయనున్నట్లు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ తెలిపింది. షేరు ఒక్కింటి ధర రూ. 205గా ఉంటుందని పేర్కొంది. గురువారం నాటి షేరు ముగింపు ధర రూ. 153.4తో పోలిస్తే ఇది 33.6 శాతం అధికం. షేర్ల కేటాయింపు తర్వాత ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ప్రస్తుత ప్రమోటర్ల వాటా 55.1 శాతంగా ఉంటుంది. ‘భారత్‌లో దుస్తుల పరిశ్రమ వచ్చే అయిదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుతుంది. భవిష్యత్ అవకాశాలపై గల ధీమాకు ఈ డీల్ నిదర్శనం. పటిష్టమైన ఫండమెంటల్స్ ఊతంతో దేశీయంగా ఫ్యాషన్ రిటైల్ గణనీయ వృద్ధి సాధించగలదు‘ అని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. డీల్ ద్వారా వచ్చే నిధులను వ్యాపార వృద్ధిని వేగవంతం చేసుకునేందుకు ఉపయోగించుకోవాలని ఏబీఎఫ్ఆర్ఎల్ వెల్లడించింది. ‘నాణ్యత, విలువను కోరుకునే దేశీ వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా సేవలు అందించేందుకు తోడ్పడే కొత్త భాగస్వామ్యాలను నిర్మించుకోవడంపై ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ ప్రధానంగా దృష్టి పెడుతోంది‘ అని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. 3,000 పైగా స్టోర్స్..: భారీ మార్జిన్లు ఉండే ఫ్యాషన్ వ్యాపారంలో స్థానం దక్కించుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌కు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఏబీఎఫ్ఆర్ఎల్ పోర్ట్‌ఫోలియోలో పలు అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లు ఉండటం ఫ్లిప్‌కార్ట్‌కు లాభించనుంది. అమెజాన్‌డాట్‌కామ్, రిలయన్స్‌కి గట్టి పోటీనిచ్చేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇక, మార్చి 31 నాటికి దాదాపు రూ. 2,776 కోట్ల మేర ఉన్న రుణభారాన్ని తగ్గించుకోవడానికి ఏబీఎఫ్ఆర్ఎల్కు కూడా ఈ డీల్ ఉపయోగకరంగా ఉండనుంది. ఫరెవర్ 21, అమెరికన్ ఈగిల్ అవుట్‌ఫిట్టర్స్, రాల్ఫ్ లారెన్ వంటి అంతర్జాతీయ బ్రాండ్స్ విక్రయానికి అదిత్య బిర్లా ఫ్యాషన్‌కు హక్కులు ఉన్నాయి. ప్యాంటలూన్స్తో పాటు దేశవ్యాప్తంగా 3,000 పైచిలుకు స్టోర్స్ నెట్వర్క్ ఉంది. సుమారు 23,700 పైగా మల్టీబ్రాండ్ అవుట్‌లెట్స్ ద్వారా కూడా విక్రయాలు జరుపుతోంది. తమ వృద్ధి ప్రణాళికలకు ఈ డీల్ ఉపయోగపడుతుందని ఏబీఎఫ్ఆర్ఎల్ ఎండీ ఆశీష్ దీక్షిత్ తెలిపారు. శుక్రవారం బీఎస్ఈలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ షేరు సుమారు 8 శాతం పెరిగి రూ.165 వద్ద క్లోజయ్యింది. -
ఉపాధికి పండుగ సీజన్!
న్యూఢిల్లీ: పండుగ సీజన్ అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని ఈ–కామర్స్ కంపెనీలు, డెలివరీ సేవల సంస్థలు గణనీయంగా తాత్కాలిక సిబ్బందిని తీసుకుంటున్నాయి. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా సుమారు ఒక లక్ష పైచిలుకు సీజనల్ ఉద్యోగావకాశాలు కల్పించినట్లు వెల్లడించింది. అలాగే, రవాణా భాగస్వామ్య సంస్థలు, ప్యాకేజింగ్ వెండార్లు, డెలివరీ భాగస్వాములు, అమెజాన్ ఫ్లెక్స్ పార్ట్నర్స్, హౌస్‌కీపింగ్ ఏజెన్సీల ద్వారా పరోక్షంగా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించగలిగినట్లు తెలిపింది. సాంకేతికత, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ మొదలైన వాటిపై పెట్టుబడులు కొనసాగించడం ద్వారా 2025 నాటికి భారత్‌లో 10 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యసాధనకు ఇవి తోడ్పడనున్నాయని అమెజాన్ తెలిపింది. ‘ఈ పండుగ సీజన్లో దేశం నలుమూలలా ఉన్న కస్టమర్లకు అత్యంత వేగవంతంగా, సురక్షితంగా ఉత్పత్తులను చేర్చడం ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం‘ అని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు. డెల్హివెరీలో ఇలా... సరఫరా సేవల సంస్థ డెల్హివెరీ కూడా వచ్చే కొద్ది వారాల్లో వివిధ విభాగాల్లో 15,000 పైచిలుకు సీజనల్ సిబ్బందిని తీసుకోనున్నట్లు వెల్లడించింది. రాబోయే పండుగ సీజన్లో దాదాపు 6.5–7.5 కోట్ల ప్యాకేజీలను హ్యాండిల్ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 100% అధికమని వివరించింది. ‘ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనపై గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నాం. గడిచిన ఏడాది కాలంలో బిలాస్పూర్, బెంగళూరు, భివండి వంటి ప్రాంతాల్లో మెగా ట్రక్ టెర్మినల్స్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. వచ్చే 18–24 నెలల్లో విస్తరణపై దాదాపు రూ. 300 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నాం‘ అని డెల్హివెరీ ఎండీ సందీప్ బరాసియా వెల్లడించారు. మూడు లక్షల ఉద్యోగ అవకాశాలు : రెడ్‌సీర్ ఈ ఏడాది పండుగ సీజన్లో ఈ–కామర్స్, లాజిస్టిక్స్ సంస్థల ద్వారా దాదాపు మూడు లక్షల పైచిలుకు ఉపాధి అవకాశాల కల్పన జరగవచ్చని కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ అంచనా వేస్తోంది. వీటిలో 30 శాతం ఉద్యోగాలు లాజిస్టిక్స్ సంస్థల్లో ఉండనున్నాయి. ఈ పండుగ సీజన్లో ఆన్లైన్లో అమ్ముడయ్యే ఉత్పత్తుల స్థూల విలువ (జీఎంవీ) దాదాపు 7 బిలియన్ డాలర్ల పైచిలుకు ఉంటుందని రెడ్‌సీర్ అంచనా. గతేడాది ఇది 3.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ ఫర్నిషింగ్ మొదలైన ఉత్పత్తులకు గణనీయంగా డిమండ్ ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
టాటా.. ఆన్ లైన్ బాట!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ తాజాగా ఈ–కామర్స్ విభాగంలో అమెజాన్, రిలయ¯Œ ్సకు గట్టి పోటీనిచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని రకాల వినియోగ ఉత్పత్తులు, సర్వీసులను డిజిటల్ మాధ్యమం ద్వారా కస్టమర్లకు చేరువ చేసే దిశగా ప్రత్యేక ఈ–కామర్స్ యాప్‌ను రూపొందించుకుంటోంది. ఇప్పటికే దీని నమూనా సిద్ధమైంది. ఈ ఏడాది ఆఖర్లో లేదా వచ్చే ఏడాది తొలినాళ్లలో ఆవిష్కరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆల్–ఇన్ –వన్ ..: టాటా గ్రూప్ కంపెనీలు ప్రస్తుతం.. కార్లు, ఎయిర్‌కండీషనర్లు, స్మార్ట్ వాచీలు, టీ మొదలైన అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. అలాగే లగ్జరీ హోటల్స్, ఎయిర్‌లై¯Œ్స, బీమా వ్యాపారం, డిపార్ట్మెంటల్ స్టోర్స్, సూపర్‌మార్కెట్ చెయిన్ మొదలైనవి నిర్వహిస్తున్నాయి. టెట్లీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రతిష్టాత్మక బ్రాండ్లు టాటా పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. రిటైల్ వినియోగదారులతో నేరుగా సంబంధాలు నెరపే ఈ వ్యాపార విభాగాల ఉత్పత్తులు, సర్వీసులన్నింటికీ ఈ ఆల్–ఇన్–వన్‌యాప్ ఉపయోగపడనుంది. టా టా డిజిటల్ విభాగం సీఈవో ప్రతీక్ పాల్ ఈ యాప్ రూపకల్పనకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాల్‌కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో 3 దశాబ్దాల అనుభవం ఉంది. రిటైల్ విభాగం గ్లోబల్ హెడ్‌గా వ్య వహరించిన సమయంలో వాల్‌మార్ట్, టెస్కో, ఆల్డి, టార్గెట్, బెస్ట్ బై, మార్క్స్ అండ్ స్పెన్సర్ గ్రూప్ వంటి అంతర్జాతీయ రిటైల్ దిగ్గజాలు డిజిటల్ బాట పట్టడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. -
నేపాల్ సంస్థతో ఫ్లిప్‌కార్ట్ జోడీ..
ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ చిన్న మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎమ్ఈ) రంగంలో అడుగుపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో నేపాల్ ఈ కామర్స్ దిగ్గజం సాస్టోడీల్‌తో కలిసి పనిచేయనుంది. సాస్టోడీల్‌కు చెందిన 5,000 ఉత్పత్తులను ఫ్టిప్‌కార్ట్ సంస్థలో నమోదు చేయనున్నట్లు తెలిపారు. కాగా ఫ్లిప్‌కార్ట్ హెడ్ జగజీత్ హరోడే స్పందిస్తూ.. ఫ్లిప్‌కార్ట్, సాస్టోడీల్ కలయికతో వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడమే కాకుండా, దేశీయ అమ్మకాలు పుంజుకుంటాయని పేర్కొన్నారు. మరోవైపు సాస్టోడీల్ సీఈఓ అమున్ థాపా స్పందిస్తూ.. ఫ్లిప్‌కార్ట్‌తో జోడీ వల్ల నేపాల్‌లోని వినియోగదారులకు మెరుగైన క్వాలిటీతో కూడిన ఉత్పత్తులను అందించవచ్చని తెలిపారు. ఇరు సంస్థలు కలయికతో ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లెయెన్సెస్, ఫర్నిషింగ్స్ తదితర విభాగాలలో మెరుగైన సేవలు అందిస్తామని సంస్థల ఉన్నతాధికారులు పేర్కొన్నారు. నేపాల్, భారత వినియోగదారుల అభిరుచులు ఒకే విధంగా ఉంటాయని సాస్టోడీల్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఫ్లిప్‌కార్ట్‌కు 2లక్షల మంది అమ్మకందార్లు ఉన్నారని, 50శాతం ఉత్పత్తులు జైపూర్, లక్నో, మీరట్, కాన్పూర్, కోయంబత్తూర్, అహ్మదాబాద్ తదితర నగరాల నుంచే వస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. చదవండి: ఫ్లిప్‌కార్ట్ సేల్ : బంపర్ ఆఫర్లు -
ఫ్లిప్‌కార్ట్.. ఇక హోల్‌సేల్
న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా హోల్‌సేల్ వ్యాపార విభాగంలోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా వాల్‌మార్ట్ ఇండియాను కొనుగోలు చేసింది. అయితే ఈ డీల్ విలువ ఎంతన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ పేరిట వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సంస్థ గురువారం తెలిపింది. ప్రధానంగా బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) విభాగంలో కార్యకలాపాల కోసం ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ఏర్పాటైనట్లు వివరించింది. వాల్‌మార్ట్ సారథ్యంలోని ఇన్వెస్టర్ గ్రూప్ నుంచి 1.2 బిలియన్ డాలర్లు సమీకరించిన వారానికే ఫ్లిప్‌కార్ట్ తాజా ప్రకటన చేయడం గమనార్హం. ‘ఒకవైపు విక్రేతలు, తయారీదారులను మరోవైపు కిరాణా దుకాణదారులు, చిన్న మధ్యతరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) అనుసంధానం చేసేలా ఈ మార్కెట్‌ప్లేస్ ఉంటుంది‘ అని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆదర్శ్ మీనన్ చెప్పారు. కిరాణా దుకాణదారులు, ఎంఎస్ఎంఈల అవసరాలను తీర్చే సామర్థ్యాలను పెంచుకునేందుకు వాల్‌మార్ట్ ఇండియా కొనుగోలు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘ఫినిష్డ్ ఉత్పత్తులకు సంబంధించి బీ2బీ మార్కెట్ విలువ సుమారు 650 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఇందులో ముందుగా ఫ్యాషన్, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ వంటి కేటగిరీలు ఉన్న సుమారు 140 బిలియన్ డాలర్ల మార్కెట్‌పై మేం దృష్టి సారిస్తున్నాం‘ అని మీనన్ చెప్పారు. భారత్‌లో వాల్‌మార్ట్ ఇలా.. ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ సంస్థ అయిన అమెరికన్ కంపెనీ వాల్‌మార్ట్ గతంలో భారతీ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యంతో భారత్‌లో హోల్‌సేల్ కార్యకలాపాలు ప్రారంభించింది. 2013లో రెండు సంస్థలు విడిపోయినప్పటికీ వాల్‌మార్ట్ మాత్రం సొంతంగా బెస్ట్ ప్రైస్ పేరిట క్యాష్–అండ్–క్యారీ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఇందులో సుమారు 3,500 మంది ఉద్యోగులు ఉన్నారు. బెస్ట్ ప్రైస్‌కు తొమ్మిది రాష్ట్రాల్లో 28 స్టోర్స్, 15 లక్షల పైచిలుకు సభ్యులు ఉన్నారు. త్వరలోనే తిరుపతిలో కొత్తగా క్యాష్–అండ్–క్యారీ స్టోర్ ఏర్పాటు చేస్తోంది. వాల్‌మార్ట్‌కి పూర్తి అనుబంధ సంస్థగా వాల్‌మార్ట్ ఇండియా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2018లో సుమారు 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ 77 శాతం వాటాలు కొనుగోలు చేసింది. కొత్త సంస్థ స్వరూపం..: ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ వ్యాపార విభాగానికి మీనన్ సారథ్యం వహిస్తారు. ప్రస్తుతం వాల్‌మార్ట్ ఇండియా సీఈవోగా వ్యవహరిస్తున్న సమీర్ అగర్వాల్.. బాధ్యతల బదలాయింపు సజావుగా పూర్తయ్యే దాకా ఉంటారు. ఆ తర్వాత వాల్మార్ట్లోనే మరో హోదాకు మారతారు. వాల్‌మార్ట్ ఇండియాలోని ఉద్యోగులు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లోకి మారతారు. వాల్‌మార్ట్ టెక్నాలజీ విభాగం తమ వాల్‌మార్ట్ ల్యాబ్స్ ఇండియాను విడిగా నిర్వహించడం కొనసాగిస్తుంది. కిరాణా షాపులు కీలకం.. కరోనా వైరస్ పరిణామాల నేపథ్యంలో కిరాణా దుకాణదారులు గతంలో కన్నా మరిన్ని మార్గాల్లో కొనుగోళ్లు జరుపుతున్నారని, బెస్ట్ ప్రైస్ విషయానికొస్తే తమ ఈ–కామర్స్ వ్యాపార విభాగం లావాదేవీలు నాలుగు రెట్లు పెరిగాయని సమీర్ అగర్వాల్ తెలిపారు. కిరాణా దుకాణదారులు ఇటు ఆన్లైన్, అటు ఆఫ్‌లైన్ మార్గంలో కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న సంగతి దీని ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. రిటైల్ వ్యాపారంలో కిరాణాలు, సంఘటిత బీ2బీ సంస్థలు కీలకమని తెలిపారు. ఇందులో ఆన్లైన్ వ్యా పార విభాగం వృద్ధి గణనీయంగా ఉంటుందన్నారు. ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం ద్వారా కిరాణా దుకాణదారులు, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) సులభ రుణ సదుపాయాలు, వ్యాపారం.. ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు మరిన్ని లభించగలవని అగర్వాల్ చెప్పారు. -
ఆహార రిటైల్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు నో ఎంట్రీ!
న్యూఢిల్లీ: ఆహారోత్పత్తుల రిటైల్ వ్యాపార విభాగంలో ప్రవేశించాలనుకున్న ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) తిరస్కరించింది. నియంత్రణపరమైన అంశాలు ఇందుకు కారణంగా పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో పర్మిట్ కోసం మరోసారి దరఖాస్తు చేయాలని భావిస్తున్నట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ‘టెక్నాలజీ, నవకల్పనల ఆధారిత మార్కెట్ విధానాలతో దేశీయంగా రైతులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి మరింత విలువ చేకూరుతుందని, సమర్థత, పారదర్శకత పెరుగుతుందని మేం విశ్వసిస్తున్నాం. చిన్న వ్యాపార సంస్థలకు ఊతమిచ్చే విధంగా పర్మిట్ కోసం మరోసారి దరఖాస్తు చేయాలని భావిస్తున్నాం‘ అని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ గతేడాది దేశీయంగా ఆహార రిటైల్ విక్రయాల కోసం ఫ్లిప్‌కార్ట్ ఫార్మర్‌మార్ట్ పేరిట కొత్తగా విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు లైసెన్స్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. -
పల్లె వాకిట.. ఆన్లైన్ స్టోర్..!
సాక్షి, హైదరాబాద్: ఈ–కామర్స్... ఒకప్పుడు మెట్రో సిటీలకే పరిమితమైంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఆన్లైన్లో సరుకులు బుక్ చేస్తే వ్యాపారులు వాటిని ఇంటికే పంపిస్తారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్ లాంటి బడా సంస్థలు ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నప్పటికీ...మెజారిటీ పల్లెలకు ఈ సంస్థలు ఇంకా వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఈ–కామర్స్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ పల్లెల్లో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను పెంచేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ శాఖకు అనుబంధంగా కొనసాగుతున్న సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్స్) ద్వారా ఈ–కామర్స్ వ్యాపారాన్ని విస్తృతం చేస్తోంది. దీనికి ప్రత్యేకంగా సీఎస్సీ గ్రామీణ్ ఈ–స్టోర్ యాప్‌ను రూపొందించింది. దీనిద్వారా క్షేత్రస్థాయిలో ఈ–కామర్స్‌ను పరిచయం చేసిన సీఎస్సీ... తాజాగా ఔత్సాహిక వ్యాపారులను ప్రోత్సహిస్తోంది. సరుకులు అనేకం... ప్లాట్‌ఫామ్ ఒకటే... ఆన్లైన్ వ్యాపారంలో వేగాన్ని పెంచేందుకు సీఎస్సీ ప్రత్యేకంగా సీఎస్సీ గ్రామీణ్ ఈ స్టోర్ యాప్‌ను రూపొందించింది. దీనికి అనుబంధంగా సరుకుల మేనేజ్మెంట్, ఆర్డర్లు తీసుకోడానికి మరో రెండు సపోర్టింగ్ యాప్లుంటాయి. సీఎస్సీలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వీఎల్ఈ(విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్)కు ప్రత్యేకంగా ఈ యాప్‌ను పరిచయం చేస్తోంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకుని వివరాలను నమోదు చేసుకున్న వీఎల్ఈకి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను జారీ చేస్తుంది. దీని ద్వారా సరుకుల లభ్యత, ధరల నిర్ధారణ తదితరాలను సపోర్టింగ్ యాప్ ‘మై గ్రోసరీస్’లో చేయాలి. కస్టమర్ నుంచి వచ్చిన ఆర్డర్‌ను గుర్తించి సరుకులు డెలివరీ చేసేందుకు ఆర్డర్ సిస్టంలో చూడాలి. ఈ యాప్ ద్వారా కేవలం నిత్యావసర సరుకులే కాకుండా జనరల్ స్టోర్, స్టేషనరీతో పాటు అందుబాటులో ఉన్న రకాలను ఇందులో నమోదు చేసి మేనేజ్ చేయవచ్చు. ఈ వ్యాపారాన్ని నిర్వహించేందుకు మూడు రకాల యాప్‌లను వీఎల్ఈ మేనేజ్ చేసినప్పటికీ కస్టమర్ మాత్రం గ్రామీణ్ ఈస్టోర్ యాప్‌ను వినియోగిస్తే సరిపోతుంది. ప్రమోట్ చేస్తే సరి... క్షేత్రస్థాయిలో గ్రామీణ్ ఈ స్టోర్ యాప్‌ను వీఎల్ఈ ప్రచారం చేసుకోవాలి. యాప్‌పై వినియోగదారునికి అవగాహన కల్పించి తన దుకాణాన్ని యాప్‌లో సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక బుక్ చేసే ఆర్డర్లన్నీ ఎంపిక చేసిన వీఎల్ఈకి చేరతాయి. ఆ మేరకు సరుకులను సరఫరా చేస్తారు. సీఎస్సీ రూపొందించిన గ్రామీణ్ ఈస్టోర్ యాప్‌లో సరుకుల లభ్యతను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే వినియోగదారుడికి కూడా స్పష్టత ఉంటుంది. అదేవిధంగా ధరలను కూడా వీఎల్ఈ నిర్ధారించిన ప్రకారం ప్రత్యక్షమవుతాయి. తక్కువ లాభాలను ఆశించి సరసమైన ధరలతో ప్రారంభిస్తే ఎక్కువ కస్టమర్లను ఆకట్టుకోవచ్చని అధికారులు సైతం చెబుతున్నారు. ప్రస్తుతం యాప్‌పై సీఎస్సీ గ్రామాల్లో అవగాహన కల్పిస్తోంది. అవగాహనతోనే వ్యాపార వృద్ధి... గ్రామాల్లో వీఎల్ఈ ప్రారంభించే ఈ–కామర్స్ వ్యాపారానికి.. గ్రామం లేదా సమీపంలోని టౌన్లో ఉన్న హోల్‌సేల్ కిరాణా స్టోర్‌తో సరుకుల సరఫరాకు అవగాహన చేసుకోవాలి. యాప్ ద్వారా వచ్చిన ఆర్డర్ల మేరకు సరుకులను ప్యాక్ చేసి కస్టమర్‌కు బట్వాడా చేస్తే లక్ష్యం పూర్తయినట్లే. కిరాణా దుకాణం తోనే కాకుండా జనరల్ స్టోర్, స్టేషనరీ, ఇతర హోల్‌సేల్ దుకాణాలతో ఒప్పందం చేసుకుని వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని సీఎస్సీ సూచిస్తోంది. -
లాక్డౌన్లో మరిన్ని సడలింపులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గుర్తించిన కోవిడ్–19 హాట్స్పాట్లు, కట్టడి జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కొన్ని కార్యకలాపాలను అనుమతిస్తూ ఈ నెల 15వ తేదీన జారీ చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం మరికొన్ని సడలింపులను చేర్చింది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాలు గుర్తించిన కంటైన్మెంట్ జోన్లకు ఈ సడలింపులు వర్తించవని తెలిపింది. హాట్స్పాట్లు, కంటైన్మెంట్ జోన్లపై గతంలో ప్రకటించిన ఆంక్షలు మే 3వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపింది. రెస్టారెంట్లు, హెయిర్ సెలూన్లు తెరవరాదనీ, మద్యం, సిగరెట్లు, గుట్కా అమ్మకాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి సడలింపులపై అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని పేర్కొంది. అత్యవసర వస్తువులను సరఫరా చేసే ఈ–కామర్స్ సంస్థలకు సడలింపు కొనసాగుతుందని స్పష్టత ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాలు (పురపాలక సంఘాల వెలుపలి ప్రాంతాలు): గ్రామీణ ప్రాంతాల్లోని రాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం కింద నమోదై ఉన్న షాప్స్. రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, మార్కెట్ కాంప్లెక్స్‌లలో ఉన్న షాపులకూ సడలింపు వర్తిస్తుంది. అయితే సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ మాల్స్‌కు మాత్రం ఇది వర్తించదు. అంటే షాపింగ్ మాల్స్ ప్రాంగణాల్లోని వాటికి వర్తించదు. అలాగే 50% మించకుండా సిబ్బంది పనిచేయాలి. వారంతా మా స్కులు ధరించి ఉండాలి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలి. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం కింద నమోదై ఉన్న షాప్స్‌కు సడలింపు వర్తిస్తుంది. ఇరుగుపొరుగున ఉన్న షాపులు, స్టాండ్ ఎలోన్ షాపులు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లలో ఉన్న షాపులకూ ఇది వర్తిస్తుంది. ఈ జాబితాలో దుస్తులు, సెల్‌ఫోన్, హార్డువేర్, స్టేషనరీ దుకాణాలు తెరవచ్చు. అయితే, మార్కెట్ కాంప్లెక్స్‌లలోని షాపులకు, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లోని షాపులకు, సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ మాల్స్‌కు ఇది వర్తించదు. అలాగే 50 శాతం మించకుండా సిబ్బంది పనిచేయాలి. వారంతా మాస్కులు ధరించి ఉండాలి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలి. -
జియోకు ఫేస్బుక్.. లైక్
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు రిలయన్స్ గ్రూప్, ఫేస్బుక్ తాజాగా దేశీ టెక్నాలజీ రంగంలో భారీ డీల్‌కు తెరతీశాయి. రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ వెల్లడించింది. ఈ డీల్ విలువ 5.7 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 43,574 కోట్లు) ఉండనుంది. ఫేస్బుక్లో భాగమైన మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఊతంతో దేశీ ఈ–కామర్స్ రంగంలో దూసుకుపోయేందుకు ఈ డీల్ రిలయన్స్‌కు తోడ్పడనుండగా.. భారత మార్కెట్లో మరింత చొచ్చుకుపోయేందుకు ఫేస్‌బుక్‌కు కూడా ఉపయోగపడనుంది. అలాగే 2021 నాటికల్లా రుణ రహిత సంస్థగా ఆవిర్భవించాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లక్ష్యం సాకారం కావడానికి కూడా తోడ్పడనుంది. ‘రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ. 43,574 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాం. తద్వారా అందులో అతి పెద్ద మైనారిటీ షేర్‌హోల్డరుగా ఉంటాం‘ అని ఫేస్బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఫేస్బుక్ డీల్‌తో జియో ప్లాట్‌ఫామ్స్ విలువను రూ. 4.62 లక్షల కోట్లుగా లెక్కగట్టినట్లవుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ప్రకటనలో పేర్కొంది. 2014లో వాట్సాప్ కొనుగోలు డీల్ తర్వాత ఫేస్బుక్ ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రథమం. సాధారణంగా మీడియా, ఆన్లైన్ సంస్థల్లోనే ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేస్తున్న ఫేస్బుక్ తాజాగా జియోలో పెట్టుబడులు పెట్టడాన్ని బట్టి చూస్తే.. భారత్‌లో వేగంగా పెరుగుతున్న ఆన్లైన్ పేమెంట్, ఈ–కామర్స్ విభాగాల్లోని భారీ వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునే వ్యూహంలో ఉండవచ్చని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. డీల్ ఇలా.. డీల్ ప్రకారం.. జియో ప్లాట్‌ఫామ్స్.. ఫేస్‌బుక్‌కు కొత్తగా షేర్లు జారీచేయడంతో పాటు బోర్డులో స్థానం కూడా కల్పిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంతానం ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీలు కూడా బోర్డులో ఉంటారు. తమ డిజిటల్ వ్యాపారాలన్నింటినీ కలిపి రిలయన్స్ గ్రూప్ గతేడాది అక్టోబర్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేసింది. తాజా డీల్ ద్వారా వచ్చే నిధుల్లో రూ. 15,000 కోట్లను ఇది తన దగ్గరే అట్టిపెట్టుకుని, మిగతా మొత్తాన్ని సుమారు రూ. 40,000 కోట్ల పైచిలుకు రుణాల్లో కొంత తీర్చేందుకు ఉపయోగించుకుంటుంది. ఇది నాన్–ఎక్స్‌క్లూజివ్ డీల్‌గా ఉండనుంది. అంటే జియోతో మాత్రమే కాకుండా ఇతరత్రా భారత, విదేశీ కంపెనీలతో కూడా కావాలనుకుంటే ఫేస్బుక్ ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. కాగా, ఈ ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుమతులు తెలపాల్సి ఉంటుంది. రిలయన్స్‌కు ప్రయోజనాలు.. గతేడాది డిసెంబర్ త్రైమాసికం ఆఖరు నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మొత్తం రుణభారం రూ. 3,06,851 కోట్లుగా ఉంది. చేతిలో నగదు రూ. 1,53,719 కోట్లు ఉండటంతో నికర రుణ భారం రూ. 1,53,132 కోట్లుగా ఉండనుంది. 2021 నాటికల్లా రుణ రహిత గ్రూప్‌గా ఆవిర్భవించాలని రిలయన్స్ నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా తమ చమురు, రసాయనాల వ్యాపార విభాగాల్లో 20 శాతం వాటాను చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కోకు విక్రయించడం ద్వారా 15 బిలియన్ డాలర్లు సమీకరించే ప్రయతాల్లో ఉంది. ఇప్పటికే ఇంధన రిటైల్ విభాగంలో వాటాలను బ్రిటన్ సంస్థ బీపీకి రూ. 7,000 కోట్లకు విక్రయించింది. తాజాగా ఫేస్బుక్ డీల్‌తో రుణ భారం తగ్గించుకునే దిశగా మరో అడుగు ముందుకు పడినట్లయింది. అలాగే, టెక్నాలజీలో ఫేస్బుక్ అనుభవం, నైపుణ్యాల ఊతంతో జియోను భారీ డిజిటల్ కంపెనీగా తీర్చిదిద్దేందుకు రిలయన్స్‌కు ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది. జియో డిజిటల్‌కు ఊతం: విశ్లేషకులు డిజిటల్ వ్యాపార విభాగాల ద్వారా ఆదాయార్జన, 2021 నాటికి రుణరహిత సంస్థగా ఆవిర్భవించాలన్న రిలయన్స్ లక్ష్యాల సాకారానికి ఫేస్బుక్ డీల్ ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ‘రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ విభాగం .. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్ పరిధిలో లేదు. వాట్సాప్‌తో జట్టు కట్టడం ద్వారా కిరాణా దుకాణదారు, కొనుగోలుదార్లను అనుసంధానం చేయొచ్చు‘ అని క్రెడిట్ సూసీ ఒక నివేదికలో పేర్కొంది. ఇది రెండు పక్షాలకూ వ్యూహాత్మక ఒప్పందమని బెర్న్‌స్టెయిన్ తెలిపింది. ‘ఫేస్బుక్, దాని అనుబంధ సంస్థలు పలు ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ డీల్‌తో వుయ్‌చాట్ లాంటి యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు 38 కోట్ల పైచిలుకు యూజర్లు ఫేస్‌బుక్‌కు లభిస్తారు. జియోమార్ట్‌లోని 6 కోట్ల చిన్న వర్తకులతో పాటు జియో కస్టమర్లకూ కొత్త సొల్యూషన్స్ అందించవచ్చు’ అని వివరించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా జియోమార్ట్ .. ఈ డీల్ సందర్భంగా జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటైల్, వాట్సాప్ కూడా వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ తెలిపింది. రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ విభాగం జియోమార్ట్ వ్యాపార కార్యకలాపాలను వాట్సాప్ ద్వారా మరింత విస్తరించేందుకు ఇది ఉపయోగపడనుంది. అటు చిన్న వ్యాపార సంస్థలకు కూడా ఊతమివ్వనుందని ఆర్ఐఎల్ వివరించింది. ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు దీటుగా ఎదిగేందుకు ఇది తోడ్పడనుంది. దీనికి నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు రావాల్సి ఉంది. రిలయన్స్‌కు ప్రయోజనాలు.. గతేడాది డిసెంబర్ త్రైమాసికం ఆఖరు నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మొత్తం రుణభారం రూ. 3,06,851 కోట్లుగా ఉంది. చేతిలో నగదు రూ. 1,53,719 కోట్లు ఉండటంతో నికర రుణ భారం రూ. 1,53,132 కోట్లుగా ఉండనుంది. 2021 నాటికల్లా రుణ రహిత గ్రూప్‌గా ఆవిర్భవించాలని రిలయన్స్ నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా తమ చమురు, రసాయనాల వ్యాపార విభాగాల్లో 20 శాతం వాటాను చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కోకు విక్రయించడం ద్వారా 15 బిలియన్ డాలర్లు సమీకరించే ప్రయతాల్లో ఉంది. ఇప్పటికే ఇంధన రిటైల్ విభాగంలో వాటాలను బ్రిటన్ సంస్థ బీపీకి రూ. 7,000 కోట్లకు విక్రయించింది. తాజాగా ఫేస్బుక్ డీల్‌తో రుణ భారం తగ్గించుకునే దిశగా మరో అడుగు ముందుకు పడినట్లయింది. అలాగే, టెక్నాలజీలో ఫేస్బుక్ అనుభవం, నైపుణ్యాల ఊతంతో జియోను భారీ డిజిటల్ కంపెనీగా తీర్చిదిద్దేందుకు రిలయన్స్‌కు ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది. ఫేస్‌బుక్‌కు ఏంటి... కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం 2017లో దేశీయంగా 45 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2022 నాటికి 85 కోట్లకు పెరగనుంది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌కు భారత్‌లో 25 కోట్ల మంది యూజర్లు ఉండగా, అందులో భాగమైన వాట్సాప్‌నకు 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. మరో విభాగం ఇన్‌స్ట్రాగామ్‌కు కూడా ఇబ్బడిముబ్బడిగా యూజర్లు భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఇక టెలికం కార్యకలాపాలు సాగిస్తున్న జియోకు 38.8 కోట్ల పైగా ఫోన్ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. జియోతో జట్టు కట్టడం ద్వారా కోట్ల కొద్దీ యూజర్లకు మరింతగా చేరువ కావడానికి ఫేస్‌బుక్‌కి ఈ డీల్ ఉపయోగపడనుంది. పేమెంట్ సర్వీసులను కూడా ప్రారంభించే సన్నాహాల్లో ఉన్న ఫేస్‌బుక్‌కు స్థానికంగా ఒక భాగస్వామి ఉంటే నియంత్రణలపరమైన అడ్డంకులను అధిగమించేందుకు.. ప్రైవసీ, లోకల్ స్టోరేజీ నిబంధనల పాటించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. విద్య.. వైద్యంలోకి విస్తరణ: అంబానీ ఫేస్బుక్ భాగస్వామ్యంతో భారీ వ్యాపార ప్రణాళికలను ఆవిష్కరించారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. స్థానిక కిరాణా దుకాణాల నుంచి కొనుగోలుదారుల ఇళ్లకే సరుకులు చేర్చడం మొదలుకుని క్రమంగా విద్య, వైద్య రంగాల్లోకి కూడా విస్తరించబోతున్నామని వెల్లడించారు. ‘రెండు దిగ్గజ సంస్థలు చేతులు కలపడం ద్వారా ప్రతీ ఒక్కరికి ఉపయోగపడే కొంగొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తాయి. జియోమార్ట్, వాట్సాప్ భాగస్వామ్యం వల్ల.. సమీప భవిష్యత్‌లో ఇరుగుపొరుగుల్లో ఉండే ప్రతి కస్టమరుతో డిజిటల్ లావాదేవీలు జరిపేలా దాదాపు 3 కోట్ల పైచిలుకు చిన్న స్థాయి కిరాణా దుకాణదారులకు తోడ్పాటు లభిస్తుంది. అంతేకాదు.. ఈ విజయవంతమైన భాగస్వామ్యంతో మన రైతులు, చిన్న.. మధ్య తరహా సంస్థలు, మన విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య సేవలందించేవారు .. అందరికన్నా ముఖ్యంగా నవభారతానికి వెన్నెముకలాంటి యువత, మహిళలకు మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ప్రపంచంలోనే అగ్రగామి డిజిటల్ దేశంగా భారత్ ఎదుగుదలకు ఇది ఉపయోగపడుతుంది ‘ అని సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. జియోతో జట్టు... మరిన్ని అవకాశాలు లక్షలాది మంది ప్రజలు, చిన్న వ్యాపారాలు ఆన్‌లైన్‌లోకి రావడానికి జియో వంటి సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఏ ఆర్థిక వ్యవస్థకైనా చిన్న వ్యాపారాలు చాలా కీలకం. భారత్‌లో 6 కోట్లకు పైగా చిన్న వ్యాపార సంస్థలున్నాయి. కోట్లాదిమంది ప్రజలు ఈ వ్యాపారాలపై ఆధారపడి ఉన్నారు. ప్రపంచమంతా లాక్డౌన్లో ఉన్న నేపథ్యంలో వ్యాపార వృద్ధి, వినియోగదారులతో సంబంధాల నిమిత్తం ఈ వ్యాపార సంస్థలకు డిజిటల్ టూల్స్ అవసరం. ఈ డిజిటల్ టూల్స్ అందించడం కోసమే జియోతో జట్టు కట్టాం. రిలయన్స్‌తో మా భాగస్వామ్యం... భారత్‌లోని చిన్న వ్యాపార సంస్థలకు మరిన్ని కొత్త అవకాశాలను అందించనున్నది. రిలయన్స్ జియోతో కలిసి కొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లను చేపట్టనున్నాం. ఈ ప్రాజెక్ట్‌ల కారణంగా భారత్‌లో చాలా మందికి వాణిజ్య అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. –మార్క్ జుకర్‌బర్గ్ అంబానీకి మహీంద్రా అభినందనలు ఫేస్‌బుక్‌తో డీల్ విషయంలో ముకేశ్ అంబానీకి అభినందనలు తెలియజేశారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర. ‘వైరస్‌పరమైన సంక్షోభ సమయంలో కుదిరిన ఈ ఒప్పందం .. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌కి దక్కే ప్రాధాన్యం గురించి చాటిచెబుతోంది. వృద్ధికి నూతన కేంద్రంగా ప్రపంచమంతా భారత్‌వైపే చూస్తుందన్న వార్తలకు బలం చేకూరుస్తోంది‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేశారు. -
నిత్యావసరాలకే ఈ–కామర్స్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసుల్లేని గ్రీన్ జోన్లలో ఈ నెల 20 నుంచి పూర్తి స్థాయిలో ఈ కామర్స్ కార్యకలాపాలకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయం నుంచి కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. కేవలం నిత్యావసరాలకే తప్ప (ఆహారోత్పత్తులు, ఔషధాలు, వైద్య పరికరాలు), ఇతర ఉత్పత్తుల విక్రయాలకు ఈ కామర్స్ కంపెనీలకు అనుమతి లేదంటూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకుందన్న ప్రశ్నకు.. అత్యవసరం కాని వస్తువుల విక్రయాలకు ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను అనుమతించడం వల్ల లౌక్‌డౌన్ పటిష్ట అమలుపై ప్రభావం చూపిస్తుందని గ్రహించడంతో నిర్ణయాన్ని మార్చుకోవడం జరిగినట్టు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పున్య సలీల శ్రీవాస్తవ తెలిపారు. ఈ కామర్స్ సంస్థలను అనుమతించినట్టు, తమను కూడా విక్రయాలకు అనుమతించాలని రిటైల్ వర్తకుల నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే కేంద్రం తన విధానాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. -
ఈ రాష్ట్రాల్లో ‘ఈ–కామర్స్’కు అనుమతి
న్యూఢిల్లీ: ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ‘ఈ–కామర్స్’సంస్థల కార్యకలాపాలకు తమ రాష్ట్రాల్లో అనుమతి ఇస్తున్నట్లు మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు, ఒడిశా ప్రకటించాయి. నిత్యావసర వస్తువులతో పాటు, అన్ని ఉత్పత్తుల అమ్మకాలకు అనుమతినిస్తున్నట్లు తెలిపాయి. అయితే, ఆయా ఉత్పత్తుల సరఫరా సమయంలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి. ఈ కామర్స్ సంస్థలు అమ్మకాలు జరుపుకోవచ్చంటూ ఆనుమతినిచ్చిన కేంద్రం.. స్థానిక పరిస్థితులను బట్టి తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించింది. ఆహారం, ఔషధాలు, సహా అన్ని నిత్యావసర, గృహావసర వస్తువుల అమ్మకాలకు అనుమతిస్తున్నట్లు మహారాష్ట్ర పేర్కొంది. కాగా, ‘ఈ –కామర్స్’అమ్మకాలపై తెలంగాణ, హరియాణా, కర్ణాటక రాష్ట్రాలు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. లాక్డౌన్ నేపథ్యంలో అన్ని సంస్థలు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించడంతో లాప్టాప్స్, వైఫై రౌటర్స్, స్మార్ట్‌ఫోన్స్ తదితర వస్తువులకు భారీ డిమాండ్ ఏర్పడిందని ఈ –కామర్స్ సంస్థల ప్రతినిధులు తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే, వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు ప్రయత్నిస్తామని ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ప్రకటించాయి. -
ఆన్లైన్లో మళ్లీ టీవీలు, ఫ్రిజ్‌లు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను క్రమంగా ఎత్తివేసే ప్రక్రియలో భాగంగా ఈ–కామర్స్‌లో విక్రయాలకు కేంద్రం అనుమతించింది. దీంతో ఏప్రిల్ 20 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఈ–కామర్స్ పోర్టల్స్‌లో మళ్లీ మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఉత్పత్తుల అమ్మకం ప్రారంభం కానుంది. మే 3 దాకా పొడిగించిన లాక్డౌన్ మార్గదర్శకాలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ మేరకు వివరణనిచ్చారు. టీవీలు, మొబైల్ ఫోన్స్ కూడా ఆన్లైన్ పోర్టల్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయితే, ఈ–కామర్స్ కంపెనీల డెలివరీ వ్యాన్లు.. రోడ్ల మీదికి రావాలంటే ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాలన్నారు. మార్చి 25న తొలిసారిగా లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఈ–కామర్స్ సంస్థలు కేవలం ఔషధాలు, ఆహారపదార్థాలు వంటి నిత్యావసరాలే విక్రయించడానికి అనుమతినిచ్చారు. సరుకు రవాణా, డెలివరీ మొదలైన సర్వీసుల ద్వారా చాలా మంది ఉపాధి పొందుతుండటంతో వారి ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్రం ఈ నిర్ణ యం తీసుకుంది. దీనికి సంబంధించి బుధవారం ప్రకటించిన మార్గదర్శకాలపై నెలకొన్న సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసింది. -
ఫ్లిప్‌కార్ట్‌పై సీసీఐ దర్యాప్తును ఆదేశించిన ఎన్సీఎల్ఏటీ
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌పై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఆదేశించింది. సీసీఐ తన డైరెక్టర్ జనరల్ (డీజీ) చేత ఈ దర్యాప్తును జరిపించాలని బుధవారం సూచించింది. జస్టిస్ ఎస్.జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. సీసీఐ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టి, తాజా దర్యాప్తునకు ఆదేశించింది. ఫ్లిప్‌కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అన్‌ఫెయిర్ ప్రాక్టీసెస్‌కు పాల్పడిందని అఖిల భారత ఆన్లైన్ వెండార్స్ అసోసియేషన్ (ఏఐఓవీఏ) 2018 నవంబర్‌లో సీసీఐను ఆశ్రయించిన విషయం తెలిసిందే కాగా.. ఈ వాదనలో నిజం లేదని తేల్చింది. అయితే, ఈ విషయమై కేసు ఎన్సీఎల్ఏటీ వరకు వెళ్లగా.. డీజీ చేత పూర్తిస్థాయి దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. ఆన్లైన్ ప్లాట్‌ఫాం ద్వారా చిన్న వర్తకులు నేరుగా వినియోగదారులకు వస్తువులను విక్రయించాల్సి ఉండగా.. ఇందుకు భిన్నంగా క్లౌడ్‌టైల్, డబ్ల్యూఎస్ రిటైల్ వంటి పెద్ద వర్తకులు, సప్లయర్లతో కుమ్మౖMð్క విక్రయాలు నిర్వహించేందుకు ఫ్లిప్‌కార్ట్ అవకాశం కల్పించిందని ఏఐఓవీఏ ఆరోపిస్తోంది. ‘కరోనా’పై సెబీ అప్రమత్తం ముంబై: క్యాపిటల్ మార్కెట్లపై కరోనా వైరస్ ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే విషయమై సెబీ అంతర్గతంగా మదింపు చేస్తోంది. కరోనా వైరస్ గురించి, అది మార్కెట్‌పై చూపగల ప్రభావం గురించి సెబీకి తగిన అవగాహన ఉందని సెబీ హోల్–టైమ్ మెంబర్ ఎస్.కె. మోహంతి పేర్కొన్నారు. అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని వివరించారు. ఆసోచామ్ ఇక్కడ నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్)లకు సంబంధించి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) విషయమై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని హామీ ఇచ్చారు. -
భారత్‌కు ఉపకారమేమీ చేయడం లేదు..
న్యూఢిల్లీ: భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్.. భారత్‌కు పెద్ద ఉపకారమేమీ చేయడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్ వ్యాఖ్యానించారు. పోటీ సంస్థలను దెబ్బతీసేటువంటి రేట్లతో అమ్మితే భారీ నష్టాలు రాక.. లాభాలెలా వస్తాయంటూ ప్రశ్నించారు. భారత చట్టాలను ఈ–కామర్స్ కంపెనీలు త్రికరణ శుద్ధిగా పాటించాల్సిందేనని గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గోయల్ స్పష్టం చేశారు. చట్టాల్లో లొసుగులను అడ్డం పెట్టుకుని మల్టీ–బ్రాండ్ రిటైల్ రంగంలోకి దొడ్డిదారిన చొరబడదామనుకుంటే కుదిరే ప్రసక్తే లేదన్నారు. భారత పర్యటనలో ఉన్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ప్రభుత్వ వర్గాలతో కూడా సమావేశం కానున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఈ–కామర్స్ మార్కెట్ ప్లేస్ అనేది కొనుగోలుదారులు, విక్రేతలను అనుసంధానం చేసే ఐటీ ప్లాట్‌ఫాం మాత్రమే. ఇలాంటి ప్లాట్‌ఫాం అందించే సంస్థకు ఎందుకు భారీ నష్టాలు వస్తున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారత్‌లో ఆ సంస్థ (అమెజాన్) బిలియన్ల కొద్దీ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఆ క్రమంలో బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టాలు వస్తే వాటిని కూడా భరించక తప్పదు. ఇన్వెస్ట్మెంట్ల ద్వారా భారత్‌కు ఆ సంస్థ ఏదో ఒరగబెడుతోందని అనుకోవడానికి లేదు‘ అని గోయల్ వ్యాఖ్యానించారు. సముచితమైన విధానాలను పాటిస్తూ, 10 బిలియన్ డాలర్ల పైగా టర్నోవరు సాధిస్తున్న కంపెనీ.. బిలియన్ డాలర్ల కొద్దీ నష్టాలు నమోదు చేస్తోందంటే కచ్చితంగా సందేహాలు వస్తాయని ఆయన చెప్పారు. అనుచిత వ్యాపార విధానాలో లేదా పోటీ సంస్థలను దెబ్బతీసేటువంటి రేట్లతో అమ్మితేనో తప్ప ఇంత భారీ నష్టాలు రావన్నారు. అధికారుల విచారణలో ఈ సందేహాలన్నింటికీ సమాధానం దొరకగలదని ఆశిస్తున్నట్లు గోయల్ చెప్పారు. భారీ డిస్కౌంట్లు, విక్రేతలతో ఒప్పందాలు వంటి అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయన్న ఆరోపణలతో ఈ–కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై కాంపిటీషన్ కమిటీషన్ (సీసీఐ) ఇటీవలే విచారణకు ఆదేశించింది. -
భారత్‌లో అమెజాన్ రూ. 1,700 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్‌లో జోరుగా కార్యకలాపాలు విస్తరిస్తున్న అమెరికన్ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్.. చెల్లింపులు, హోల్‌సేల్ వ్యాపార విభాగాల్లోకి రూ. 1,700 కోట్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. అమెజాన్ పే ఇండియా విభాగానికి అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్, అమెజాన్‌డాట్‌కామ్‌డాట్‌ఐఎన్‌సీఎస్ నుంచి రూ. 1,355 కోట్లు వచ్చాయి. ఇందుకు ప్రతిగా ఆయా సంస్థలకు అమెజాన్ పే ఇండియా షేర్లు కేటాయించింది. ఆ రెండు సంస్థల నుంచి రూ. 360 కోట్లు అందుకున్న అమెజాన్ హోల్‌సేల్ (ఇండియా) కూడా షేర్లు కేటాయించింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సమర్పించిన పత్రాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. గతేడాది అక్టోబర్‌లోనే వివిధ విభాగాలపై అమెజాన్ రూ. 4,400 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఆర్థిక ఉగ్రవాద సంస్థలు!
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఆర్థిక ఉగ్రవాద సంస్థలని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) తీవ్రంగా విమర్శించింది. ఇవి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘించాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. చిన్న వ్యాపారస్తులు గత ఏడాది కాలంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇంకా ఇతర ఈ–కామర్స్ సంస్థల చేతుల్లో విలవిలలాడుతున్నాయని, ఫలితంగా వాటి వ్యాపారం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, భారతలోని చట్టాల ప్రకారమే వ్యాపారం చేస్తున్నామని, ఎలాంటి ఎఫ్‌డీఐ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది. -
భారీ ఉద్యోగాల ‘డెలివరీ’!!
న్యూఢిల్లీ: ఈ కామర్స్ సంస్థలు, స్విగ్గీ, గ్రోఫర్స్ వంటి స్టార్టప్ సంస్థలు డెలివరీ విభాగాన్ని విస్తరించటంపై దృష్టి పెట్టాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా అన్ని ప్రాంతాలకూ చేరుకునేలా సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నాయి. మార్కెట్లో పోటీ తీవ్రం కావడంతో కస్టమర్లను సొంతం చేసుకునేందుకు సరఫరా వ్యవస్థపై ఇవి దృష్టి పెట్టాయి. స్విగ్గీ, గ్రోఫర్స్, మిల్క్‌బాస్కెట్, షాడోఫాక్స్ తమ డెలివరీ ఉద్యోగులను ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు చేసుకోనున్నాయి. ఇక అమెజాన్, బిగ్‌బాస్కెట్ ఈ విషయంలో ఇంకా దూకుడు కనబరుస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 51,500 డెలివరీ ఏజెంట్ల అవసరం ఉందని టీమ్‌లీజ్ సర్వీసెస్ అంచనా. ఏడాది చివరికి ఇది 1,21,600కు పెరుగుతుందని టీమ్‌లీజ్ సహ వ్యవస్థాపకుడు రీతుపర్ణ చక్రవర్తి చెప్పారు. మరో హెచ్ఆర్ సంస్థ రాండ్‌స్టాండ్ ఇండియా సైతం తొలి ఆరునెలల కాలంలో 50వేల వరకు డెలివరీ ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది. విస్తరణపై భారీగానే ఖర్చు ప్రముఖ డెలివరీ సంస్థలు పెద్ద ఎత్తున నిధులను ఇప్పటికే సమీకరించగా, ఇందులో గణనీయమైన వాటాను డెలివరీ సామర్థ్యాల విస్తరణకే ఖర్చు చేయనున్నట్లు రాండ్‌స్టాండ్ ఇండియా ఎండీ పౌల్ డుపియస్ చెప్పారు. ‘‘మెట్రోల వెలుపలికీ విస్తరించాలన్నది ఈ సంస్థల లక్ష్యం. కార్యకలాపాల విస్తరణే ఉద్యోగుల నియామకాల పెరుగుదలకు కారణం’’ అని డుపియస్ వివరించారు. గ్రోసరీ ప్లాట్‌ఫామ్ గ్రోఫర్స్... సాఫ్ట్ బ్యాంకు విజన్ ఫండ్ ద్వారా గత నెలలో 60 మిలియన్ డాలర్లను సమీకరించింది. ఈ నిధులతో ప్రస్తుత 3,000 డెలివరీ బృందాన్ని రెట్టింపు చేయనున్నట్టు ఈ సంస్థ హెచ్ఆర్ విభాగం హెడ్ అంకుష్ అరోరా చెప్పారు. బిగ్‌బాస్కెట్ కూడా మరో 150 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించనుంది. తద్వారా దేశవ్యాప్తంగా అదనంగా 4,000–5,000 మంది డెలివరీ సిబ్బందిని నియమించుకోనుంది. ప్రస్తుత వ్యాపారంలో వృద్ధితోపాటు నూతన వ్యాపార అవకాశాల ఫలితమే ఇదని గ్రోఫర్స్ హెచ్ఆర్ జీఎం తనుజా తివారి చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ డెలివరీ విభాగం విస్తరణపై పెట్టుబడులు పెట్టనున్నట్టు అమెజాన్ సైతం స్పష్టం చేసింది. అండమాన్స్‌లోని హావ్లాక్ ఐలాండ్, అసోంలోని మజూలి ఐలాండ్‌కు సైతం తాము డెలివరీ చేస్తున్నట్టు పేర్కొంది. జోమాటో జోరు... ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు గతేడాది సెప్టెంబర్ నాటికి 38 పట్టణాల్లో 74,000 మంది డెలివరీ భాగస్వాములుండగా, వీరి సంఖ్యను 213 పట్టణాల్లో 1,80,000కు పెంచుకుంది. మరో ఫుడ్ డెలివరీ స్విగ్గీ సైతం వచ్చే ఏడాదికి డెలివరీ భాగస్వాముల సంఖ్యను 1,25,000కు పెంచుకోనున్నట్టు తెలిపింది. షాడోఫాక్స్‌కు ప్రస్తుతం 12,000 మంది డెలివరీ ఏజెంట్లుండగా, వచ్చే ఏడాది ఇదే సమయానికి 25,000కు పెంచుకోవాలన్న ప్రణాళికతో ఉన్నట్టు సంస్థ సీఈవో అభిషేక్ బన్సాల్ తెలిపారు. మిల్క్ బాస్కెట్‌కు 1,500 మంది డెలివరీ బృందం ఉండగా, ఈ ఏడాది చివరికి రెట్టింపు చేసుకోవాలనుకుంటోంది. -
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్
శాన్ఫ్రాన్సిస్కో: ఫేస్బుక్ సొంతమైన ఇన్స్టాగ్రామ్ ఈ కామర్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అత్యంత ప్రజాదారణ పొందన ఈ కామర్స్ వ్యాపారం ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవాలని చూస్తోంది. ఎంచుకున్న బ్రాండ్ల ఉత్పత్తులు కొనుగోలు చేసుకునే ఒక షాపింగ్ ఫీచర్‌ను జోడించింది. ఈమేరకు సంస్థ మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. బీటా వెర్షన్లో "చెక్అవుట్" బటన్ అమెరికాలో లాంచ్ చేశామని ఫేస్బుక్ వెల్లడించింది. త ద్వారా మీరు ఇష్టపడే ఉత్పత్తిని యాప్ ద్వారానే కొనుగోలు చేయవచ్చని తెలిపింది. చెక్అవుట్ బటన్‌ను క్లిక్ చేసి, సైజ్, రంగు ఆప్షన్స్ ఎంచుకుని, చెల్లింపులు చేయవచ్చని పేర్కొంది. ముఖ్యంగా ఆడిడాస్, బుర్బెర్రీ, డియోర్, హెచ్ అండ్ ఎం, నైక్, ఆస్కార్ డి లా రెంటా, ప్రాడా, గ్లాసెస్ రీటైలర్ వార్బీ పార్కర్ లాంటి పరిమిత బ్రాండ్ల ఉత్పత్తులను తమ ప్లాట్‌ఫాంలో జోడించినట్టు తెలిపింది. -
ఈ–కామర్స్ నిబంధనలు సరైనవే
ముంబై: విదేశీ పెట్టుబడులున్న ఈ– కామర్స్ కంపెనీలకు సంబంధించి కేంద్రం కొత్తగా ప్రకటించిన నిబంధనలు సరైనవేనని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. ఈ–కామర్స్ సంస్థలు కారు చౌక రేట్లతో.. స్థానిక వ్యాపార సంస్థలను నాశనం చేస్తున్నాయన్నారు. భారత్‌లో అంతర్జాతీయ సంస్థలు గుత్తాధిపత్యం చలాయిస్తే చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదని టైకాన్ 2019 స్టార్టప్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ–కామర్స్ నిబంధనలను ప్రకటించిన తీరు అభ్యంతరకరంగా ఉన్నా, ఈ నిబంధనలు కొంత సముచితమైనవేనన్నారు. మరోవైపు, ఇందులో వ్యాపారాలకు ప్రోత్సాహాన్నిచ్చే కోణం కన్నా ఓటు బ్యాంక్ రాజకీయాల కోణమే ఎక్కువగా కనిపిస్తోందని సదస్సులో పాల్గొన్న స్టార్టప్ సంస్థల లాయర్ కరణ్ కల్రా వ్యాఖ్యానించారు. ఒక ప్రత్యేక వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ నిబంధనలు ప్రవేశపెట్టినట్లుగా అనిపిస్తోందని సీనియర్ లాయర్ నిశిత్ దేశాయ్ అభిప్రాయపడ్డారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులున్న ఈ–కామర్స్ కంపెనీలు.. తమ అనుబంధ సంస్థల ఉత్పత్తులను సొంత ప్లాట్‌ఫాంపై విక్రయించరాదని, ధరలను ప్రభావితం చేసేలా ప్రత్యేక మార్కెటింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి చేయరాదని కేంద్రం ఎఫ్‌డీఐ నిబంధనలు కఠినతరం చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. అంతకు ముందు అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫాంపై 4 లక్షల పైచిలుకు చిన్న స్థాయి విక్రేతలు ఉండేవారు. తాజా నిబంధనలతో అమెజాన్‌కి చెందిన క్లౌడ్‌టెయిల్, అపారియో సంస్థల కార్యకలాపాలు నిల్చిపోయాయి. ఆశావహంగా వాల్‌మార్ట్.. నిబంధనలు కఠినం చేసినప్పటికీ భారత మార్కెట్‌పై ఆశావహంగానే ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్ చేసిన అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్ వెల్లడించింది. భారత మార్కెట్లో దీర్ఘకాలిక వ్యాపారానికి కట్టుబడి ఉన్నామని వాల్‌మార్ట్ ఏషియా రీజనల్ సీఈవో డర్క్ వాన్ డెన్ బెర్గీ తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఉపాధి కల్పన, చిన్న వ్యాపార సంస్థలు ..రైతులకు తోడ్పాటు ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధిలో భాగం అవ్వాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. -
ఈ కామర్స్ సంస్థలకు గడువు పొడిగింపు లేదు
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విషయంలో ఈ కామర్స్ సంస్థలకు సవరించిన నిబంధనల అమలుకు ఫిబ్రవరి 1గా ఇచ్చిన గడువును పొడిగించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువును కనీసం మూడు నెలల వరకైనా పొడిగించాలని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఇప్పటికే కేంద్రాన్ని కోరాయి. ‘‘ఈ కామర్స్ రంగానికి సంబంధించి ఎఫ్‌డీఐల పాలసీ నిబంధనల అమలుకు ఇచ్చిన గడువు పొడిగించాలంటూ అభ్యర్థనలు వచ్చాయి. వీటిని పరిశీలించిన తర్వాత గడువును పొగించకూడదని నిర్ణయించాం’’ అని పారిశ్రామిక ప్రోత్సాహక మండలి (డీపీఐటీ) పేర్కొంది. కొత్త నిబంధనల కార్యాచరణను పూర్తిగా అర్థం చేసుకునేందుకు గాను గడువు పొడిగించాలని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కేంద్రాన్ని కోరాయి. జూన్ 1వరకు పొడిగింపు ఇవ్వాలని అమెజాన్ కోరగా, ఆరు నెలల సమయాన్ని ఫ్లిప్‌కార్ట్ కోరింది. ఇందుకోసం తమ వంతు ప్రయత్నాలు చేశాయి. నూతన నిబంధనలకు అనుగుణంగా తమ వ్యాపార నమూనాను మార్చుకోవాల్సి ఉంటుందని అధికారులకు వివరించాయి. భారత్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడులకు తాము నిర్ణయించుకున్నామని, ఈ పెట్టుబడులకు రిస్క్ ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ, దేశీయ వర్తకుల సమాఖ్య సీఏఐటీ మాత్రం గడువు పొడిగించొద్దని డిమాండ్ చేసింది. అమెరికా కంపెనీల ఒత్తిడికి తలగొద్దని దేశీయ ఈ కామర్స్ సంస్థలు స్నాప్‌డీల్, షాప్‌క్లూస్ సైతం కోరాయి. కాగా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తరహా ఈ రిటైలింగ్ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లపై తమకు వాటాలున్న కంపెనీల ఉత్పాదనలను 25 శాతానికి మించి విక్రయించకుండా నిషేధిస్తూ గత డిసెంబర్ 26న కేంద్రం నూతన నిబంధనలను ప్రకటించింది. కొన్ని కంపెనీల ఉత్పత్తులను ఎక్స్‌క్లూజివ్‌గా తమ ప్లాట్‌ఫామ్‌పైనే విక్రయించే ఒప్పందాలను సైతం నిషేధించింది. మరోవైపు ప్రభుత్వం గడువు పొడిగించకపోతే నిబంధనల అమలుకు గాను ప్లాన్–బిని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సిద్ధం చేసుకున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం: అమెజాన్ నూతన నిబంధనల విషయంలో మరింత స్పష్టత కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని, తమ కస్టమర్లు, విక్రయదారులపై ప్రభావాన్ని పరిమితం చేసేందుకు కృషి చేస్తామని అమెజాన్ ప్రకటించింది. ‘‘అన్ని చట్టాలు, నిబంధనలను పాటించేందుకు కట్టుబడి ఉంటాం. ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకుని మా భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకుంటాం. ఈ ప్రభావాన్ని పరిమితం చేసేందుకు చర్యలు తీసుకుంటాం’’ అని అమెజాన్ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతం: స్నాప్‌డీల్ చిన్న ఈ కామర్స్ సంస్థలు స్నాప్‌డీల్, షాప్‌క్లూస్ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. దేశంలో సచ్ఛీలమైన, బలమైన ఈ కామర్స్ రంగానికి ప్రభుత్వ నిర్ణయం దారితీస్తుందని స్నాప్‌డీల్ పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఇది విజయం వంటిదని షాప్‌క్లూస్ సీఈవో విజయ్సేతి అభివర్ణించారు. -
ఈ–కామర్స్ రంగంపై అంతర్జాతీయ ఒప్పందం!
దావోస్: వేగంగా మారుతున్న ప్రపంచంతో పాటు మారకపోతే బహుళపక్ష వాణిజ్య వ్యవస్థలు, డబ్ల్యూటీఓ వంటి సంస్థలు కనుమరుగు కాక తప్పదని డబ్ల్యూటీఓ చీఫ్ రొబెర్టో అజెవెడో హెచ్చరించారు. దీనిని నివారించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. జోరుగా వృద్ధి చెందుతున్న ఈ–కామర్స్ కోసం అంతర్జాతీయ బహుళపక్ష ఒప్పందం అవసరమన్నారు. ఇక్కడి ప్రపంచ ఆర్థిక సదస్సులో (డబ్ల్యూఈఎఫ్) ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, రక్షణాత్మక విధానాలు పెరుగుతుండటం వంటి కారణాల వల్ల వాణిజ్య రంగంలో గతంలో కంటే సవాళ్లు మరింత క్లిష్టమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు నిజానికి రాజకీయ సమస్య అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుంటెరస్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయని, వీటిని సవ్యంగా పరిష్కరించలేకపోతే పెను విపత్తు తప్పదని ఆయన హెచ్చరించారు. కాగా ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంశాలను దేశాలు త్వరితంగా పరిష్కరించుకోవాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) చీఫ్ క్రిస్టీనా లగార్డ్ సూచించారు. అందుకే అం తర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించామన్నా రు. కాగా, కృత్రిమ మేధ నియంత్రణకు నిబంధనల ను రూపొందించాల్సిన అవసరముందని మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. గోప్యతను మానవ హక్కుగా పరిగణించాలని పేర్కొన్నారు. డిజిటల్ డిక్లరేషన్... డిజిటల్ యుగంలో నైతికంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామనే డిజిటల్ ప్రతినకు 40కు పైగా అంతర్జాతీయ వ్యాపార ప్రముఖులు సంఘీభావం తెలిపారు. ఈ డిజిటల్ డిక్లరేషన్‌పై మన దేశానికి చెందిన భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ తొలి సంతకం చేశారు. ఎరిక్సన్, ఐబీఎమ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, నోకియా, శామ్సంగ్, షార్ప్, వెరిజాన్, వొడాఫోన్, షియోమి తదితర సంస్థలు ఈ డిజిటల్ డిక్లరేషన్‌కు సంఘీభావం తెలిపాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్.. 6,200 కోట్ల డాలర్లు ప్రతీ ఏడాదీ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(ఈ–వేస్ట్) విపరీతంగా పెరిగిపోతున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 5 కోట్ల టన్నులుగా (ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా తయారైన వాణిజ్య విమానాల బరువు కంటే ఇది అధికం) ఉన్న ఈ–వేస్ట్ 2050 కల్లా 12 కోట్ల టన్నులకు పెరుగుతుందని పేర్కొంది. ఫలితంగా తీవ్రమైన ఆరోగ్య, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని వివరించింది. ఏటా పేరుకుపోతున్న ఈ–వ్యర్థాల విలువ 6,200 కోట్ల డాలర్ల మేర ఉంటుందని, ఇది మొత్తం ప్రపంచ వెండి ఉత్పత్తి విలువకు మూడు రెట్లకు సమానమని వివరించింది. ప్రతి ఏటా ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్స్ ఉత్పత్తుల్లో 20 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నట్లు తెలియజేసింది. -
చిన్న సంస్థలూ పోటీ పడగలగుతాయి
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులున్న ఈ–కామర్స్ కంపెనీల నిబంధనలను కేంద్రం కఠినతరం చేయడం.. చిన్న సంస్థలకు ప్రయోజనకరంగా ఉండగలదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటిదాకా నిబంధనలను బాహాటంగా ఉల్లంఘిస్తున్న పెద్ద కంపెనీలకు అడ్డదారులన్నీ మూసుకుపోతాయని షాప్‌క్లూస్, స్నాప్‌డీల్ వంటి సంస్థలు వ్యాఖ్యానించాయి. ‘బడా విదేశీ కంపెనీలు ముందు నుంచీ ఈ పాలసీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్న సంగతిని ప్రభుత్వం గుర్తించిందనేది తాజా నిబంధనల ద్వారా వెల్లడైంది‘ అని షాప్‌క్లూస్ సీఈవో సంజయ్ సేథి చెప్పారు. విక్రేతలందరూ ఈ–కామర్స్ ప్రయోజనాలు పొందేందుకు తాజా మార్పులు దోహదపడగలవని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ పేర్కొన్నారు. ‘పెద్ద సంస్థలతో సమానంగా చిన్న సంస్థలు కూడా అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తాజా నిబంధనలు ఉపయోగపడతాయి. లఘు వ్యాపార సంస్థలు కూడా ఈ–కామర్స్ ప్రయోజనాలు అందుకోవచ్చు‘ అని ఇన్‌స్టామోజో సీఈవో సంపద్ స్వైన్ తెలిపారు. ఇకపై ఈ–కామర్స్ సంస్థలు భారత్‌లో తమ వ్యాపార వ్యూహాలను సవరించుకోవాల్సి వస్తుందని ఈవై ఇండియా నేషనల్ లీడర్ (పాలసీ అడ్వైజరీ అండ్ స్పెషాలిటీ సర్వీసెస్) రాజీవ్ చుగ్ అభిప్రాయపడ్డారు. చర్చించి ఉండాల్సింది: ఫ్లిప్‌కార్ట్ మరోవైపు, పరిశ్రమ వృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాలు చూపే నిబంధనలను రూపొందించేటప్పుడు.. ప్రభుత్వం సంబంధిత వర్గాలతో సమాలోచనలు జరపడం ముఖ్యమని ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ–కామర్స్ వ్యవస్థతో చిన్న సంస్థలకు తోడ్పాటు లభిస్తుండటంతో పాటు వేల కొద్దీ ఉద్యోగాల కల్పన జరుగుతోందని తెలిపింది. ఇది ఆరంభం మాత్రమేనని, దేశ ఎకానమీకి ఈ పరిశ్రమ వృద్ధి చోదకంగా మారగలదని పేర్కొంది. ఇక, నిబంధనల సర్క్యులర్‌ను అధ్యయనం చేస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. నిబంధనలు కచ్చితంగా అమలవ్వాలి.. ఈ–కామర్స్ సైట్లలో అమ్మకాలకు సంబంధించిన కొత్త నిబంధనలన్నీ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ ప్రభుత్వాన్ని కోరింది. ‘మేం లేవనెత్తిన ప్రధాన అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై క్యాష్‌బ్యాక్ అమ్మకాలు, డిస్కౌంట్లు, ఎక్స్‌క్లూజివ్ విక్రయాల్లాంటివి ఉండబోవు. ప్రభుత్వ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. అలాగే వీటిని కఠినంగా అమలు కూడా చేస్తుందని ఆశిస్తున్నాం‘ అని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. దిగ్గజాలకు సమస్యలు.. కొత్త నిబంధనలతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలపైనే ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీటి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం ప్రకటించిన నిబంధనల ప్రకారం.. తమకు వాటాలు ఉన్న ఇతర సంస్థల ఉత్పత్తులను ఈ–కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫాంపై విక్రయించడానికి లేదు. అలాగే, ఎక్స్‌క్లూజివ్ అమ్మకాల కోసం ఏ సంస్థతోనూ ఒప్పందాలు కుదుర్చుకోరాదు. పోటీని దెబ్బతీసేలా భారీ డిస్కౌంట్లు ప్రకటించడానికి లేదు. దాదాపు 16 బిలియన్ డాలర్లు వెచ్చించి ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌లో 77% వాటాలు కొన్న అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ లాంటి వాటికి ఈ నిబంధనలు సమస్యాత్మకమే. అవి సొంత ప్రైవేట్ బ్రాండ్స్‌ను విక్రయించుకోవడానికి ఉండదు. అలాగే, ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలపై ఆంక్షల ప్రభావం అసూస్, వన్‌ప్లస్, బీపీఎల్ వంటి బ్రాండ్స్‌పై పడనుంది. -
‘ఈ–కామర్స్’కు కళ్లెం..!
న్యూఢిల్లీ: చిన్న వ్యాపారస్తుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విదేశీ పెట్టుబడులున్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ కంపెనీల నిబంధనలను కఠినతరం చేస్తూ కేంద్రం చర్యలు తీసుకుంది. తాజా నిబంధనల ప్రకారం... తమకు వాటాలున్న కంపెనీల ఉత్పత్తులను ఈ–కామర్స్ సంస్థలు తమ సొంత పోర్టల్స్‌లో విక్రయించడం కుదరదు. ధరను ప్రభావితం చేసేలా ఏ ఉత్పత్తులను ఎక్స్‌క్లూజివ్‌గా తమ పోర్టల్స్‌లోనే విక్రయించేలా ఈ–కామర్స్ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. తమ షాపింగ్ పోర్టల్స్‌లో విక్రయించే విక్రేతలకు సర్వీసులు అందించడంలో ఈ–కామర్స్ సంస్థలు పక్షపాతం, వివక్ష చూపించకూడదు. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, అడ్వర్టైజ్మెంట్, మార్కెటింగ్, పేమెంట్స్, ఫైనాన్సింగ్ మొదలైన సర్వీసులు ఇందులో ఉంటాయి. ఈ–కామర్స్ సంస్థకు చెందిన గ్రూప్ కంపెనీలు.. కొనుగోలుదారులకు అందించే క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్ల విషయంలో న్యాయబద్ధంగా, వివక్ష లేకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక ఈ–కామర్స్ సైట్లో విక్రేతలు తమ దగ్గరున్న నిల్వల్లో 25 శాతం ఉత్పత్తులకు మించి విక్రయించరాదు. ఉదాహరణకు, 4,000 యూనిట్ల ఉత్పత్తులు ఉంటే.. ఒక ఈ–కామర్స్ పోర్టల్‌లో 1,000 మాత్రమే విక్రయించవచ్చు. నిబంధనలన్నింటినీ పాటిస్తున్నట్లుగా ప్రతి ఆర్థిక సంవత్సరం ఆడిట్ సర్టిఫికెట్‌ను ఈ– కామర్స్ కంపెనీలు ఆ పై ఏడాది సెప్టెంబర్ 30 లోగా రిజర్వ్ బ్యాంక్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి సవరించిన కొత్త విధానంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పుష్కలంగా నిధులున్న ఈ–కామర్స్ సంస్థల తీవ్ర పోటీ నుంచి దేశీ వ్యాపార సంస్థల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఈ నిబంధనలు రూపొందించినట్లు వివరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ప్రస్తుత విధానం ప్రకారం విక్రేత, కొనుగోలుదారుకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించే మార్కెట్‌ప్లేస్ తరహా ఈ–కామర్స్ సంస్థల్లో మాత్రమే ప్రస్తుతం 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులు ఉన్నాయి. ఇలాంటి సంస్థలు తాము స్వయంగా కొనుగోళ్లు జరిపి, ఉత్పత్తులను నిల్వ చేసుకుని, విక్రయించడానికి లేదు. కొనుగోలుదారులకు ఈ–కామర్స్ కంపెనీలు భారీ డిస్కౌంట్లిస్తూ తమ వ్యాపారాలను దెబ్బ తీస్తున్నాయంటూ దేశీ వ్యాపార సంస్థల నుంచి పెద్ద యెత్తున ఫిర్యాదులు రావడంతో ఈ–కామర్స్ సంస్థలను నియంత్రించే క్రమంలో కేంద్రం తాజా చర్యలు ప్రకటించింది. పెట్టుబడులకు ప్రతికూలం.. కొత్త నిబంధనలపై పరిశ్రమవర్గాలు మిశ్రమంగా స్పందించాయి. కొత్తగా మరింత మంది విక్రేతలను ఆన్లైన్ ప్లాట్‌ఫాం వైపు ఆకర్షించే దిశగా పెడుతున్న పెట్టుబడులపై ఇవి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ–కామర్స్ రంగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వ్యాఖ్యానించారు. సర్క్యులర్ ను పరిశీలిస్తున్నామని అమెజాన్ ఇండియా ప్రతి నిధి వెల్లడించారు. అయితే, తాజా నిబంధనలను ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ స్వాగతించింది. ‘మార్కెట్‌ప్లేస్‌లనేవి నికార్సయిన, స్వతంత్ర వెం డార్ల కోసం ఉద్దేశించినవి. వీటిలో చాలా సంస్థలు చిన్న, మధ్యస్థాయివే. కొత్త మార్పులతో.. అందరికీ సమాన అవకాశాలు లభించగలవు‘ అని స్నాప్‌డీల్ సీఈవో కునాల్ బెహల్ వ్యాఖ్యానించారు. స్వాగతించిన సీఏఐటీ.. తాజా నిబంధనలను ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ స్వాగతించింది. ఈ–కామర్స్ రంగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని, ఈ–కామర్స్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని కోరింది. ‘సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న విజయం ఇది. దీన్ని సక్రమంగా అమలు చేస్తే.. ఈ–కామర్స్ కంపెనీలు పాటించే అనుచిత వ్యాపార విధానాలు, పోటీ లేకుండా చేసే ధరల విధానాలు, భారీ డిస్కౌంట్లు మొదలైనవి ఇకపై ఉండబోవు‘ అని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ వ్యాఖ్యానించారు. ఈ నిబంధనలను వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి కాకుండా ఈ ఏడాది ఏప్రిల్ నుంచే వర్తింపచేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలన్నారు. -
ఈ–కామర్స్‌లో పారదర్శకతకు పెద్దపీట
న్యూఢిల్లీ: ఆన్లైన్ వ్యాపారంలో పారదర్శకతను పెంపొందించే దిశగా కొత్త ఈ–కామర్స్ విధానం ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. ధరలు, డిస్కౌంట్లలో పారదర్శకతతో పాటు ఇటు రిటైలర్లు అటు కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కొత్త విధానం ముసాయిదాపై కసరత్తు చేస్తోందని, వచ్చే 2–3 వారాల్లో సంబంధిత వర్గాల అభిప్రాయాల కోసం దీన్ని వెల్లడిస్తామని ప్రభు తెలిపారు. ‘ఈ–కామర్స్ వ్యాపార నిర్వహణను సులభతరం చేయడమనేది పాలసీ ప్రధాన లక్ష్యం. ఇటు రిటైలర్లకు... అటు వినియోగదారులకు ఇది ప్రయోజనకరంగా ఉండాలి. ఈ–కామర్స్ వ్యాపారంలో ధరలు, డిస్కౌంట్ల విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలి‘ అని ఆయన చెప్పారు. ‘డిస్కౌంట్లు ఇవ్వొచ్చని గానీ ఇవ్వొద్దని గానీ మేం నిర్దేశించబోము. ఏది చేసినా పారదర్శకంగా ఉండాలన్నదే మా ఉద్దేశం‘ అని మంత్రి వివరించారు. వాణిజ్య శాఖ గతంలో తయారు చేసిన ముసాయిదాలోని సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని కొత్త ముసాయిదాను ఖరారు చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు, భారత్‌లో తయారీ కేంద్ర ఏర్పాటు విషయంలో కొన్ని మినహాయింపులు కోరుతున్న అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ప్రతినిధులతో వచ్చే నెల దావోస్‌లో భేటీ కానున్నట్లు సురేశ్ ప్రభు తెలిపారు. ఇప్పటికే యాపిల్‌తో చర్చలు జరుగుతున్నాయని, ఆ సంస్థ కోరుతున్న మినహాయింపులను ప్రభుత్వం పరిశీలించే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. -
ఆలీబాబా సింగిల్స్ డే రికార్డు..
షాంఘై: చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా ఆదివారం నిర్వహించిన సింగిల్స్ డే సేల్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. గతేడాది సింగిల్స్ డే రోజు నమోదైన 25 బిలియన్ డాలర్ల విక్రయాలను కేవలం 16 గంటల్లోనే సాధించి తన రికార్డు తానే తిరగరాసుకుంది. ప్రధానంగా స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌తో పాటు పాలపౌడరు, డైపర్లు మొదలైనవి కూడా అత్యధికంగా అమ్ముడైన వాటిల్లో ఉన్నాయి. జంటల కోసం ఉద్దేశించినదైన వేలంటైన్స్ డేకి భిన్నంగా పదకొండో నెల పదకొండో తారీఖుని సింగిల్స్ (ఒంటరి) డేగా చైనా యువత పాటిస్తుంది. దీన్ని పురస్కరించుకుని వ్యాపార సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈసారి సింగిల్స్ డే తొలి గంటలోనే ఆలీబాబా సుమారు 10 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. అయితే, అమ్మకాలు భారీగానే ఉన్నప్పటికీ.. ఏడాది పొడవునా ఏదో ఒక ఆఫరు అందుబాటులో ఉంటున్నందున కస్టమర్లు క్రమంగా సింగిల్స్ డే కోసమే ఎదురుచూడటం తగ్గుతోందని, ఫలితంగా అమ్మకాలపై కూడా ప్రతికూల ప్రభావం పడొచ్చని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. -
మాది చేనేతల ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం. చేనేతల ప్రభుత్వం. రాష్ట్రంలో ఒక్క నేతన్న కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడనే మాట విన్పించొద్దనేదే మా విధానం’అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నేతన్న బాగుంటే, ఆత్మగౌరవంతో, సంతృప్తిగా ఉంటే రాష్ట్రానికి, ప్రజలకు అన్ని రకాలుగా మేలు కలుగుతుందని పేర్కొన్నారు. చేనేత కళాకారుల సంక్షేమానికి మరెన్నో కార్యక్రమాలపై సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు. వీటిపై ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర మంత్రివర్గంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. జా తీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజాలో చేనేత వస్త్రాల ప్రదర్శనశాలను కేటీఆర్ ప్రారంభించారు. చేనేత ఉ త్పత్తుల ప్రాధాన్యం గుర్తించడం, ప్రోత్సహించడం, మార్కెటింగ్ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోం దని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్ర తదితర ప్రముఖ ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకు ని ఆన్లైన్ ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మల్టీప్లెక్స్, మాల్స్‌లో చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నామని, టెస్కో వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విక్రయాలు జరుపుతామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని విధంగా చేనేత, జౌళి శాఖకు రూ.1,200 కోట్ల కేటాయించామని, అందులో రూ.400 కోట్లను చేనేత రంగానికే వెచ్చిస్తున్నట్లు వివరించారు. ప్రతి పైసా చేనేత కళాకారులకే అందేలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మగ్గాలకు జియో ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 17,573 మగ్గాలు, వాటికి అనుబంధంగా 22,875 మంది కలిపి మొత్తం 40 వేల చేనేత కళాకారులు ఉన్నారని తెలిపారు. పద్మశాలి ఇంట్లో కేసీఆర్ చదువు.. సీఎం కేసీఆర్ పుట్టిన చింతమడక గ్రామంలో హైస్కూల్ లేకపోవడంతో ఆయన ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబ్బాకకు రోజూ నడిచి వెళ్లేవారని కేటీఆర్ చెప్పారు. దీంతో కేసీఆర్‌ను దుబ్బాకలోని ఓ పద్మశాలి సోదరుడి ఇంట్లో ఉంచి చదివించారని గుర్తుచేశారు. కేసీఆర్ పద్మశాలీల కష్టసు ఖా లు దగ్గరగా ఉండి తెలుసుకున్నారని కేటీఆర్ పేర్కొ న్నారు. చేనేత కార్మికుడి ఇంట్లో పురుషుడు మగ్గం నేస్తే, మహిళలు బీడీలు చుట్టేవారని, దీని కారణంగా చేనేత, బీడీ కార్మికుల కష్టసుఖాల పట్ల కేసీఆర్‌కు అవగాహన ఉందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు నేతన్న ల వేతనం పెంచాలనే ఉద్దేశంతో చేనేత మిత్ర పేరు తో పథకాన్ని ప్రవేశపెట్టి 50% సబ్సిడీపై నూలు, రసాయనాలు, అద్దకాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పా రు. ఈ పథకంలో 18,683 మంది చేనేతకారు లు నమోదు చేసుకున్నారని, ఇప్పటికే రూ.20 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. చేనేతకారుల సామాజిక భద్రత కోసం నేతన్నలకు చేయూత పేరుతో పొదుపు పథకాన్ని ప్రారంభించామని, ఇందులో 19,125 మంది చేనేత కార్మికులు చేరారని, ప్రభు త్వం రూ.60 కోట్లు కేటాయించిందన్నారు. కళాకారు ల కుటుంబానికి ప్రతీ నెలా రూ.6 వేల నుంచి రూ.8 వేల ఆదాయం వచ్చేలా ఈ 2 పథకాలు అమలు చేసు ్తన్నామన్నారు. 12 వేల మంది నేతన్నలకు సంబంధిం చిన రూ.40 కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. రుణాలు కట్టిన వారికి తిరిగి చెల్లిస్తామన్నారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు చేనేత వస్త్రాలకు మార్కెట్ భద్రత కల్పించేందుకు టెస్కో షోరూంల ద్వారా కొనుగోలు చేసి మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించేలా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. పోచంపల్లిలో మైక్రోసాఫ్ట్ సహకారంతో డిజైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించేందుకు సినీ, టీవీ కళాకారుల సేవలను వినియోగిస్తున్నామని, ఈ క్రమంలో నటి సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించామని పేర్కొన్నారు. రూ.10.2 కోట్లతో 2,600 మంది కళాకారుల కోసం ఇప్పటికే రాష్ట్రంలో 8 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేశామని, కొత్తగా 18 క్లస్టర్లు మంజూరు చేయాలని కేం ద్రాన్ని కోరామన్నారు. రూ.15 కోట్లతో పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు పునరుద్ధరణ, రూ.14 కోట్లతో గద్వాలలో చేనేత పార్కు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాçపూజీ పేరుతో 30 మంది కళాకారులకు చేనేత పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, డైరెక్టర్ శైలజా రామయ్యర్, ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ గుండు సుధారాణి పాల్గొన్నారు. -
టెలికం, ఈ కామర్స్ దోస్తీ!
న్యూఢిల్లీ: మీరు ఎయిర్టెల్ కస్టమరా..? అయితే, అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఏడాదిపాటు ఉచితం. వొడాఫోన్ కస్టమర్ అయితే, అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం తొలి ఏడాది ఫీజులో సగం రాయితీ. ఇవన్నీ తమ కస్టమర్లకు టెలికం కంపెనీలు అందిస్తున్న రాయితీలు!!. టెలికం, ఈ–కామర్స్ కంపెనీల మధ్య వ్యాపార బంధానికి ఉదాహరణలు కూడా. ఈ కామర్స్, డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్ సేవలతో మార్కెట్‌ను షేక్ చేసేందుకు జియో వస్తుండడంతో, పోటీలో నిలబడేందుకు ప్రత్యర్థి సంస్థలు ఇప్పటి నుంచే ఏకమవుతున్నాయి. రిలయన్స్ జియోతో పోటీ పడేందుకు ఈ కామర్స్ సంస్థలు, హ్యాండ్సెట్ తయారీ సంస్థలతో కలిసి మరిన్ని ఆఫర్లు తెస్తామని ఓ టెలికం కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు కూడా. ఎయిర్టెల్ అయితే, ఈ కామర్స్ సంస్థలతో దోస్తీ విషయంలో ఎంతో ఆశాభావంతో ఉంది. కొత్త వేదికలను కూడా అన్వేషిస్తున్నట్టు కంపెనీ ఉద్యోగి ఒకరు చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ నెల ఆరంభంలోనే మాట్లాడుతూ... జియో ఇన్ఫోకామ్, రిలయన్స్ రిటైల్ చైన్ కలిసి ఆన్లైన్– ఆఫ్‌లైన్ రిటైల్ వెంచర్‌గా మారనున్నట్లు ప్రకటించడం తెలిసిందే. తప్పనిసరి కాబట్టే..! ఈ కామర్స్, డీటీహెచ్, డిజిటల్ సేవలు, టెలికం సేవల విషయంలో రిలయన్స్ ప్రతిష్టాత్మక ప్రణాళికల నేపథ్యంలో ఇతర టెలికం కంపెనీలు, ఈ కామర్స్ కంపెనీలు ఒక్కటై నడవాల్సిన పరిస్థితులు తప్పనిసరవుతున్నాయనేది నిపుణుల విశ్లేషణ. ‘‘టెలికం కంపెనీలకు చివరిదాకా కస్టమర్లతో సంబంధం ఉంటుంది. కానీ, దాన్ని లాభదాయకంగా మార్చుకోవాలి. పారదర్శకమైన వాటా కోసం అవి మరింత మెరుగైన సేవలందించే స్థితిలో ఉండాలి’’ అని డెలాయిట్ ఇండియా మీడియా, టెక్నాలజీ పార్ట్నర్ హేమంత్ ఎం జోషి చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ కామర్స్, ఇతర కంపెనీలతో టారిఫ్‌లు, పరికరాలు, కంటెంట్ విషయంలో మరిన్ని భాగస్వామ్యాలు అవసరం ఉందన్నారు. జియో పోటీకి భయపడి కాదు అయితే, మొబైల్ ఆపరేటర్లతో సంయుక్తంగా అందించే ఆఫర్లు జియో ఈ కామర్స్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని చేస్తున్నవి కాదని అమెజాన్ ప్రైమ్ ఇండియా హెడ్ అక్షయ్‌సాహి చెప్పారు. ఈ భాగస్వామ్య చర్యలను గతేడాది జూలై నుంచే ప్రారంభించినట్టు సాహి పేర్కొన్నారు. ‘‘టెలికం కంపెనీలతో ఒప్పందాలు కస్టమర్లను చేరుకునేందుకే. దాంతో వారు అమెజాన్ ప్రైమ్ సేవలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకోగలరు’’ అని సాహి చెప్పారు. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వారు ప్రైమ్ యాప్ ద్వారా తెలుగుతో పాటు ఎన్నో భాషలకు చెందిన సినిమాలు, ఇతర వీడియో కంటెంట్ ఉచితంగా చూడొచ్చు. అలాగే, ఉచితంగా పాటలను ‘ప్రైమ్ మ్యూజిక్’ ద్వారా వినొచ్చు. పైపెచ్చు వీరికి అమెజాన్‌లో కొనుగోళ్లపై ఉచిత డెలివరీ, ఫాస్ట్ డెలివరీ ప్రయోజనాలూ ఉన్నాయి. ‘‘అమెజాన్ ప్రైమ్ అన్నది భారత్‌లో ఇంకా ఆరంభంలోనే ఉంది. దీని గురించి చాలా మందికి తెలియదు. టెలికం కంపెనీలతో టైఅప్ అవడం వెనుక ఉద్దేశం మరింత మందిని చేరటమే’’ అని అక్షయ్ వివరించారు. టల్కోలతో తమకు ఈ తరహా భాగస్వామ్యాల్లేవని, ఇందుకు సంబంధించి చర్యలు కూడా లేవని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ‘‘కస్టమర్ల పరంగా ఓవర్‌ల్యాప్‌కు (రెండు సంస్థలకూ ఒకే కస్టమర్) ఎక్కువగా అవకాశాలున్నాయి. అధికాదాయ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లతో అమెజాన్ టైఅప్ అవడం తెలివైన యోచన అవుతుంది’’ అని కన్సల్టింగ్ సంస్థ ఏటీ కెర్నే పార్ట్నర్ అభిషేక్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. ఆఫర్లు ఇవీ... ♦ ఎయిర్ టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ.499 అంతకంటే అధిక విలువ కలిగిన ప్లాన్లలో ఉంటే అమెజాన్ ఏడాది కాల ప్రైమ్ సభ్యత్వం ఉచితంగా లభిస్తుంది. ♦ వొడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ కస్టమర్లు ఏడాది కాల ఉచిత అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌కు అర్హులు. 18–24 ఏళ్ల మధ్యనున్న యువ ప్రీపెయిడ్ కస్టమర్లు అయితే రూ.999కు బదులు కేవలం రూ.499 చెల్లించి అమేజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని పొందొచ్చు. -
ఈ–కామర్స్ వ్యాపారం 52 బిలియన్ డాలర్లకు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ విభాగం ఆదాయం 2022 నాటికి 52 బిలియన్ డాలర్ల (రూ.3.53లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా. 2017 నాటికి ఇది 25 బిలియన్ డాలర్లు(రూ.1.7లక్షల కోట్లు)గా ఉందని మార్కెటింగ్ కంపెనీ ‘అడ్మిటాడ్’ అధ్యయన నివేదిక తెలియజేసింది. 37 శాతం జనాభా ఇంటర్నెట్ వినియోగిస్తుండగా, వీరిలో 14 శాతం ఆన్లైన్ కొనుగోళ్లు చేస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్ యూజర్లు 2021 నాటికి 45 శాతం పెరుగుతారని అంచనా వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఆన్లైన్ కొనుగోలుదారులు 90 శాతం పెరుగుతారని పేర్కొంది. డెస్క్‌టాప్ ద్వారా కొనుగోళ్లు 56 శాతంగాను, స్మార్ట్ఫోన్ల ద్వారా 30 శాతం జరుగుతాయని నివేదికలో వివరించింది. మొబైల్ వినియోగం మరింత పెరగనున్న నేపథ్యంలో ఎం–కామర్స్‌కు అధిక అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. భారత్‌లో 57 శాతం మంది డెలివరీ సమయంలో చెల్లింపులకు మొగ్గు చూపుతున్నారని, 11 శాతం మంది క్రెడిట్ కార్డుల ద్వారా, 15 శాతం మంది డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తున్నట్టు తెలిపింది. అయితే, ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ ధోరణిలో మార్పులు చోటు చేసుకోవచ్చని పేర్కొంది. -
ఆ ఆయుధాల విక్రయం నిలిపేశాం
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో అక్రమంగా ఆయుధాలు విక్రయిస్తున్న ఆరోపణలపై హైదరాబాద్‌లో కేసులు నమోదు కావడంతో స్నాప్‌డీల్ సంస్థ దిగివచ్చింది. తమ వెబ్సైట్లో ఉన్న ఆయా ఆయుధాల మెనూను తొలగించామని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తామని నగర పోలీసులకు వివరణ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావును కలసి స్నాప్‌డీల్ లీగల్ టీమ్ సంజాయిషీ ఇచ్చుకుంది. స్నాప్‌డీల్ చేస్తున్న ఆయుధ వ్యాపారాన్ని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత వారం గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయుధ చట్టం ప్రకారం 9 అంగుళాల కంటే ఎక్కువ పొడవు, రెండు అంగుళాల కంటే ఎక్కువ వెడల్పుతో కూడిన ఆయుధాలు సరైన అనుమతులు లేకుండా కలిగి ఉండటం, విక్రయించడం, ఖరీదు చేయడం నేరం. ఖరీదు చేసినందుకు సిటీకి చెందిన పలువురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు విక్రయించిన ఆరోపణలపై స్నాప్‌డీల్‌కు నోటీసులు జారీ చేశారు. పునరావృతం కాకుండా చూస్తాం.. దీంతో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను కలసి ఆ సంస్థ లీగల్ టీమ్ సంజాయిషీ ఇచ్చుకుంది. తాము నేరుగా ఎలాంటి ఉత్పత్తుల విక్రయాలు చేయమని, అటు విక్రేతలు.. ఇటు కొనుగోలుదారులకు మధ్య అనుసంధానకర్తగా మాత్రమే పని చేస్తామని వివరణ ఇచ్చింది. ఈ ఆయుధాలను గుజరాత్‌కు చెందిన సంస్థ తమ సైట్ ద్వారా విక్రయిస్తోందని పేర్కొంది. అయితే క్రయవిక్రయాలకు ప్లాట్‌ఫామ్‌గా వ్యవహరించిన నేపథ్యంలో స్నాప్‌డీల్‌కు విక్రేత కొంత మేరకు కమీషన్ చెల్లిస్తాడు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం బాధ్యులవుతారని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో తమ వెబ్సైట్ నుంచి పరిమితికి మించిన పొడవు, వెడల్పులతో ఉన్న ఆయుధాల మెనూను తొలగించామని, విక్రయాలు ఆపేశామని స్పష్టం చేశారు. దీంతో గుజరాత్ సంస్థకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన పోలీసులు.. స్నాప్‌డీల్‌పై చర్యలకు సంబంధించి న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించారు. ఇతర వెబ్సైట్లలోనూ... స్నాప్డీల్లోనే కాదు.. ఏ ఈ–కామర్స్ సైట్లలో చూసినా కత్తులు విక్రయానికి సిద్ధంగా ఉంటున్నాయని పోలీసులు గుర్తించారు. రూ.వెయ్యి నుంచి రూ.8 వేల వరకు వివిధ ఆకృతులు, సైజుల్లో వీటిని విక్రయించేస్తున్నారని ఆధారాలు సేకరించారు. వీటిని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఆయా వెబ్సైట్లకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆన్లైన్లో కత్తులు అందుబాటులోకి రావడంతో అనేక మంది అవసరం ఉన్నా లేకున్నా, చట్ట విరుద్ధమని తెలిసో తెలియకో వీటిని ఖరీదు చేసి తమ వద్ద ఉంచుకుంటున్నారు. -
ఈ–కామర్స్ మార్కెట్@ 50 బిలియన్ డాలర్లు
ముంబై: దేశీ ఈ–కామర్స్ మార్కెట్ వచ్చే ఏడాది 50 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించనుంది. ఇంటర్నెట్ వినియోగం, ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతుండటం ఇందుకు తోడ్పడనుంది. దేశీ డిజిటల్ కామర్స్ మార్కెట్ ప్రస్తుతం 38.5 బిలియన్ డాలర్లుగా ఉంది. పరిశ్రమల సమాఖ్య అసోచామ్–కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం 2013లో 13.6 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఈ–కామర్స్ మార్కెట్ 2015లో 19.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొబైల్స్.. ఇంటర్నెట్ వినియోగం, ఎం–కామర్స్ అమ్మకాలు పెరగడం, రవాణా.. చెల్లింపులకోసం అత్యాధునిక ఆప్షన్స్ అందుబాటులో ఉండటం, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మొదలైనవి ఈ–కామర్స్ అసాధారణ వృద్ధికి ఊతమిస్తున్నాయని నివేదిక వివరించింది. సీవోడీకే ప్రాధాన్యం.. ►ఆన్లైన్ చెల్లింపులకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సురక్షితమైన విధానాలను అందుబాటులోకి తెచ్చినా .. కొనుగోలుదారులు ఎక్కువగా క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) విధానాన్నే ఎంచుకుంటున్నట్లు వెల్లడైంది. ► ఆన్లైన్ చెల్లింపు విధానాలపై నమ్మకం లేకపోవడం, క్రెడిట్.. డెబిట్ కార్డుల వినియోగం తక్కువగా ఉండటం, భద్రతపరమైన అంశాలపై సందేహాలు మొదలైనవి ఇందుకు కారణం. ►50 శాతం పైచిలుకు ఆన్లైన్ లావాదేవీలు సీవోడీ విధానంలోనే ఉంటున్నాయి. మరోవైపు ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో ప్రతి ముగ్గురు కస్టమర్లలో ఒకరు మొబైల్స్ ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారని, మొబైల్ లావాదేవీల పెరుగుదలకు ఇది నిదర్శనమని నివేదిక పేర్కొంది. ►ఆన్లైన్ షాపర్స్‌లో 65% మంది పురుషులే ఉంటుండగా, 35% మహిళలు ఉంటున్నారు. ►2017లో అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తుల్లో మొబైల్ ఫోన్స్, దుస్తులు, ఆహార ఉత్పత్తులు, ఆభరణాలు మొదలైనవి ఉన్నాయి. ► తరచూ షాపింగ్ చేసే వారిలో 28 శాతం మంది 18–25 సంవత్సరాల మధ్య వయస్సుగలవారు కాగా, 42 శాతం మంది 26–35 సంవత్సరాల గ్రూప్‌లో ఉన్నా రు. 36–45 సంవత్సరాల గ్రూప్ వారు 28 శాతం మంది, 45–60 ఏళ్ల మధ్య వారు 2% మంది ఉంటున్నారు. -
కాగిత పరిశ్రమకు ఈ–వాణిజ్యం దన్ను..
న్యూఢిల్లీ: కాగిత పరిశ్రమ అభివృద్ధికి ఈ–వాణిజ్యం కొత్త బాటలు వేస్తోందని పేపర్‌ఎక్స్ ప్రదర్శనలో పాల్గొన్న సంస్థలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. కాలుష్యం కారణంగా చైనాలో చిన్నస్థాయి ప్యాకేజింగ్ సంస్థలపై నిషేధం విధించడంతో ఈ–వాణిజ్య కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయని ఎన్ఆర్ అగర్వాల్ ఇండస్ట్రీస్ ఎండీ ఆర్ఎన్ అగర్వాల్అన్నారు. రీసైక్లింగ్ ప్యాకేజింగ్‌లో ఏటా డిమాండ్ 9.5 శాతం పెరుగుతోందని సెంచురీ పేపర్ సీఈఓ ఎంజేపీ నరైన్ తెలిపారు. పేపర్ రీసైక్లింగ్‌కు అవకాశం ఉండటంతో అభివృద్ధి చెందిన దేశాలు కాగితాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నాయని ఐటీఈ ఇండియా డైరెక్టర్ సంజీవ్ బాత్రా తెలిపారు. -
ఈ-కామర్స్ పెట్టుబడులపై బియానీ కీలకవ్యాఖ్యలు
కోల్ కత్తా : ఫ్యూచర్ గ్రూప్ అధినేత, సీఈవో కిషోర్ బియానీ అందరికీ సుపరిచితమే. ఆఫ్ లైన్ రిటైల్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆఫ్ లైన్ రిటైలర్లకు గట్టి పోటీగా నిలుస్తున్న ఆఫ్ లైన్ రిటైలర్లలో పెట్టుబడులపై ఆయన స్పందించిన తీరు చూస్తే, నిజంగా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ఈ-కామర్స్ లో పెట్టుబడులు పెట్టాలనుకోవడం అత్యంత మూర్ఖమమైన నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. కనీసం రెండేళ్ల వరకు తాను ఈ-కామర్స్ రంగంలో పెట్టుబడులు పెట్టబోనని స్పష్టీకరించారు. ఆయన ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కూడా కారణాలున్నాయంట. ఈ గ్రూప్ ఇప్పటికే రూ.300 కోట్ల మేర నష్టాల్లో మునిగిపోయిందని, పరిశ్రమల మెగా ప్రకటనల వల్ల కంపెనీ భారీగా నష్టాలను చవిచూస్తున్నాయని తెలిసింది. కంపెనీ ఎక్కువ ఆదాయాలను ఆర్జించడానికి మొదటి నుంచి తమ సంప్రదాయ ఆదాయాల్లోనే వెచ్చిచూస్తూ వస్తోందని బియానీ చెప్పారు. ఆన్ లైన్ స్పేస్ లో పెట్టుబడులు అనేవి చాలా మూర్ఖమమని ఆయన అన్నారు. ప్రస్తుతం భారతీయ ఈ-కామర్స్ ఇండస్ట్రీ రూ.2500 కోట్లతో ఉందని, కానీ అంతేమొత్తంలో నష్టాలు కూడా ఉన్నట్టు తెలిపారు. మొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆన్ లైన్ లో నగదును ఆర్జించిపెట్టడం లేదన్నారు. ఒకవేళ ఆన్ లైన్ లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే, కనీసం రెండేళ్ల బ్రేక్ తర్వాతనే దీని గురించి ఆలోచించాలని నిర్ణయించామని బియానీ చెప్పారు. 10 ఏళ్ల క్రితమే ఈ గ్రూప్ ఆన్ లైన్ లో తొలి వెంచర్ ప్రారంభించింది. అది ఫ్యూచర్ బజార్.కామ్. కానీ ప్రస్తుతం ఇది రూ.250 కోట్ల నష్టాల్లో ఉంది. ఇతర వెబ్ వెంచర్లు బిగ్ బజార్ డైరెక్ట్, ఫ్యాబ్ ఫర్నిష్ లు ఏకంగా మూత పడ్డాయి. ప్రస్తుతం తమ గ్రూప్ డిపార్ట్ మెంటల్ చైన్ బిజినెస్ లలో ప్రత్యర్థులు షాపర్స్ స్టాప్, లైఫ్ స్టయిళ్లను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుందని బియానీ చెప్పారు. కొత్తగా 15 సెంట్రల్ స్టోర్లను ఈ ఏడాది ఏర్పాటుచేయడానికి రూ.300 కోట్లను పెట్టుబడులుగా పెట్టాలనుకుంటున్నామని బియానీ తెలిపారు. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 50ని అధిగమిస్తుందన్నారు. తమ వృద్ధి రేటు కూడా 40 శాతం పెరుగుతుందని చెప్పారు. జీఎస్టీ అమలుకు రిటైలర్లు సిద్ధంగా ఉన్నాయని, ప్యాక్డ్ ఫుడ్, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలు కిందకి దిగొస్తాయని పేర్కొన్నారు. -
యూఎస్‌లో ‘ఇండియా బజార్’ హవా
► భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ డిమాండ్ ► విక్రయాలకు అవకాశమిస్తున్న అమెజాన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విభిన్నమైన ఉత్పత్తులు. నాణ్యతకు ఏమాత్రం తీసిపోవు. ఇక ధర అంటారా.. అందరికీ అందుబాటులోనే. ఇంకేముంది భారతీయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటోంది. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వేదికగా ఇప్పుడు 4.5 కోట్లకుపైగా ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లలో కొలువుదీరాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 13 లక్షలు ఉన్నాయి. మొత్తంగా భారత్ నుంచి ప్రతి రోజు 1,80,000 ప్రొడక్టులు అమెజాన్ గ్లోబల్ వెబ్సైట్లలో నమోదవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. కస్టమర్ల ఆదరణతో యూఎస్‌లో ఇండియా బజార్ పేరుతో ప్రత్యేక పేజీని ప్రారంభించామని అమెజాన్ ఇండియా గ్లోబల్ సెల్లింగ్ హెడ్ అభిజిత్ కమ్రా గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. భారతీయ ప్రొడక్టులకు యూఎస్, యూకే, జర్మనీలు టాప్–3 మార్కెట్లుగా ఉన్నాయని చెప్పారు. హోమ్ ఫర్నీషింగ్, అపారెల్, జువె ల్లరీకి ఎక్కువగా డిమాండ్ ఉందని వివరించారు. విక్రేతలకు వెన్నంటే..: అమెజాన్ 2015 మే నుంచి భారతీయ ఉత్పత్తులను విదేశాల్లో అమ్మడం ప్రారంభించింది. 20,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారు. వీరిలో 50 శాతంపైగా అమ్మకందారులు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ఉన్నారని అభిజిత్ తెలిపారు. ‘విక్రేతలకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. మధ్యవర్తులు లేరు. ధర నిర్ణయం అమ్మకందారులదే. అమెజాన్‌కు చెల్లించే కమీషన్ పూర్తిగా పారదర్శకం. ఇక వర్తకులకు భారత కరెన్సీలో ఆదాయం సమకూరుతోంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ట్రేడర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పైగా ఉత్పత్తుల నమోదు, ఎగుమతి బాధ్యతలు మావే. వివిధ మార్కెట్లలో డిమాండ్ ఉన్న ఉత్పత్తులు, డిజైన్ల గురించి ముందే అలర్ట్ చేస్తున్నాం. తరచూ శిక్షణ, అవగాహన చేపడుతున్నాం. మే 20న హైదరాబాద్‌లో ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం’ అని అభిజిత్ చెప్పారు. -
100 కోట్ల ఉత్పత్తుల్ని విక్రయిస్తాం: అమెజాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త ఉత్పత్తుల నమోదులో ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ జోష్‌మీద ఉంది. ప్రస్తుతం కంపెనీ 10 కోట్ల ప్రొడక్టులను భారత్‌లో విక్రయిస్తోంది. రోజుకు 2 లక్షల ఉత్పత్తులు తన వెబ్సైట్లో నమోదు చేస్తోంది. రానున్న రోజుల్లో 100 కోట్ల ప్రొడక్టుల నమోదుకు ఆస్కారం ఉందని కంపెనీ కేటగిరీ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ మీడియాకు తెలిపారు. బీపీఎల్, వన్ ప్లస్, టీసీఎల్, సాన్యో వంటి కంపెనీలు భారత్‌లో కేవలం అమెజాన్ ద్వారానే మార్కెట్లో విస్తరిస్తున్నాయని చెప్పారు. 1,80,000కుపైగా విక్రేతలు అమెజాన్‌తో చేతులు కలిపారు. విక్రేతలు, తయారీ కంపెనీలు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఆన్లైన్ సులువైన మార్గం. మారుమూల ప్రాంతాల్లోనూ ఖరీదైన డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు, పెద్ద టీవీలకు డిమాండ్ ఉంది. డెలివరీతోపాటు ఎక్సే్ఛంజ్ బాధ్యతలనూ తీసుకుంటున్నాం. ఈఎంఐ ఆఫర్ చేస్తున్నాం. ఇలాంటి సౌకర్యాలతో అన్ని కంపెనీల వ్యాపారాలు వృద్ధిలో ఉన్నాయి. మే 11–14 తేదీల్లో గ్రేట్ ఇండియన్ సేల్‌ను నిర్వహిస్తున్నాం. సాధారణ రోజుతో పోలిస్తే సేల్ సమయంలో రెండు రెట్ల అమ్మకాలు నమోదు చేస్తున్నాం’ అని వివరించారు. -
బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ విలీనం!
♦ విలీన సంస్థలో సాఫ్ట్‌బ్యాంక్ 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి? ♦ 800 డాలర్ల విలువను ఆశిస్తున్న బిగ్‌బాస్కెట్ ♦ గ్రోఫర్స్ వేల్యుయేషన్.. 150–200 మి.డాలర్లు! ♦ చర్చలు మొదలు; ఏకాభిప్రాయంతోనే డీల్ న్యూఢిల్లీ: ఈ–కామర్స్ రంగంలో విలీనాలు, కొనుగోళ్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా నిత్యావసర సరుకుల ఆన్లైన్ సంస్థలు బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ విలీన ప్రతిపాదనపై చర్చలు మొదలయ్యాయి. ఒకవేళ ఈ డీల్ సాకారమైతే గ్రోఫర్స్ ఇండియాలో పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్... కొత్తగా ఏర్పడే విలీన సంస్థలో సుమారు 60–100 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చని సమాచారం. మరోవంక బిగ్‌బాస్కెట్ కూడా గ్రోఫర్స్‌తో చర్చల నేపథ్యంలో తమకు కనీసం 700–800 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్ లభిస్తుందని భావిస్తోంది. గ్రోఫర్స్ విలువ 150–200 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికైతే చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటికీ.. ఇరుపక్షాలు ఈ డీల్‌పై ఆసక్తిగానే ఉన్నట్లు వివరించాయి. ఒప్పందం గానీ కుదిరితే... విలీన సంస్థలో సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే, వేల్యుయేషన్స్‌పై అంతా ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని ఆయా వర్గాలు తెలిపాయి. బిగ్‌బాస్కెట్ కథ ఇదీ .. అబ్రాజ్ గ్రూప్, బెసీమర్ వెంచర్ పార్ట్నర్స్, శాండ్స్ క్యాపిటల్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ తదితర ఇన్వెస్టర్ల నుంచి బిగ్‌బాస్కెట్ ఇప్పటిదాకా 220 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. సుమారు 450–500 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో గతేడాది మార్చిలో బిగ్‌బాస్కెట్ 150 మిలియన్ డాలర్లు సమీకరించింది. ప్రస్తుతం నెలకు 6 మిలియన్ డాలర్ల మేర వ్యయాల భారం ఉంటున్న బిగ్‌బాస్కెట్ .. మరిన్ని నిధులు సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే... వాల్–మార్ట్ స్టోర్స్, అమెజాన్, టెన్సెంట్ హోల్డింగ్స్, ఫోసన్ ఇంటర్నేషనల్ తదితర సంస్థలతో మరిన్ని పెట్టుబడుల కోసం చర్చలు జరిపింది. కానీ వీటిలో పురోగతేమీ కనిపించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గ్రోఫర్స్ విలీనం ద్వారా... అందులో ఇన్వెస్టర్ సాఫ్ట్‌బ్యాంక్ నుంచి నిధులు రాబట్టడంపై బిగ్‌బాస్కెట్ దృష్టి పెట్టినట్లు వివరించాయి. గ్రోఫర్స్ నెలవారీ వ్యయాలు 2 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా.. సంస్థ దగ్గర 50–60 మిలియన్ డాలర్ల నిధులు ఉన్నాయని అంచనా. గ్రోఫర్స్ కహానీ.. స్థానికంగా ఇరుగుపొరుగు నిత్యావసర సరుకుల వ్యాపారస్తుల నుంచి ఉత్పత్తులు తీసుకుని.. వినియోగదారులకు డెలివరీ చేసే హైపర్‌లోకల్ గ్రాసరీ డెలివరీ స్టార్టప్ సంస్థగా 2013 డిసెంబర్లో గ్రోఫర్స్ కార్యకలాపాలు ప్రారంభించింది. డెలివరీ ఫీజు కింద ఆర్డరు మొత్తంలో సింగిల్ డిజిట్ కమీషన్ తీసుకునేది. అయితే, వచ్చే కమీషన్ కన్నా డెలివరీ ఖర్చులు ఎక్కువగా ఉంటుండటంతో గడిచిన ఎనిమిది నెలల్లో గ్రోఫర్స్ క్రమంగా హైపర్‌లోకల్ విధానం నుంచి ఇన్వెంటరీ, అధిక మార్జిన్స్ ఉండే ప్రైవేట్ బ్రాండ్స్ వ్యాపార విధానాలవైపు మళ్లుతోంది. ఫ్రెష్బరీ, బెస్ట్ వేల్యూ పేరిట స్నాక్స్ మొదలైనవాటిని విక్రయిస్తోంది. గ్రోఫర్స్ ఇప్పటిదాకా టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, సాఫ్ట్‌బ్యాంక్ తదితర సంస్థల నుంచి 165 మిలియన్ డాలర్లు సమీకరించింది. చివరిసారిగా 2015 అక్టోబర్‌లో సుమారు 350–400 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో గ్రోఫర్స్ 120 మిలియన్ డాలర్లు సమీకరించింది. బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ వ్యాపార విధానాలు దాదాపు ఒకే తరహాలో ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాఫ్ట్‌బ్యాంకు నుంచి పెట్టుబడులు దక్కించుకోగలగడం ఒక్కటే బిగ్‌బాస్కెట్‌కి ప్రయోజనకర అంశమని పేర్కొన్నాయి. నష్టాల్లోనే ఇరు కంపెనీలు.. బిగ్‌బాస్కెట్‌కి ఫ్రెషో, రాయల్, టేస్టీస్, హ్యాపీషెఫ్ తదితర సొంత బ్రాండ్స్ ఉన్నాయి. మార్చి ఆఖరు నాటికి తమ ఆదాయంలో 45 శాతం వాటా .. ప్రైవేట్ లేబుల్స్దే ఉండగలదని కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వూ్యలో బిగ్‌బాస్కెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హరి మీనన్ చెప్పారు. 2016–17లో సుమారు రూ. 1,800–2,000 కోట్ల ఆదాయం సాధించాలని బిగ్‌బాస్కెట్ లక్ష్యంగా పెట్టుకుంది. 2016 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బిగ్‌బాస్కెట్ రూ. 580 కోట్ల ఆదాయంపై రూ. 278 కోట్ల నష్టం, గ్రోఫర్స్ మాత్రం రూ.14.3 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, రూ.225 కోట్ల నష్టాన్ని నమోదు చేసినట్లు రీసెర్చ్ సంస్థ టోఫ్లర్ వెల్లడించింది. -
వాలెట్ పోటీకి అమెజాన్ రెడీ..!
► పేటీఎం, ఫ్లిప్‌కార్ట్ ఫోన్‌పే, స్నాప్‌డీల్ ఫ్రీచార్జ్‌తో ఢీ ► వాలెట్ సేవల ద్వారా బస్సు, రైలు, విమాన టికెట్ల కొనుగోలుకు వీలు ► కరెంటు, నీటి బిల్లులు మొదలైన చెల్లింపులకూ వెసులుబాటు ► నగదు హ్యాండ్లింగ్ వ్యయాల్ని భారీగా తగ్గించుకునే ప్రయత్నం న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా... ఈ–వాలెట్ల విభాగంలో పోటీకి సిద్ధమయింది. ఇటీవలే డిజిటల్ వాలెట్ లైసెన్సు దక్కడంతో ఇప్పటిదాకా తమ పోర్టల్‌కి మాత్రమే పరిమితమైన వాలెట్ సేవల్ని మరింతగా విస్తరించనుంది. వినియోగదారులు ఇప్పటిదాకా ‘అమెజాన్ పే’లో డబ్బులు లోŠడ్ చేస్తే... వాటిని అమెజాన్‌లో షాపింగ్‌కు మాత్రమే వినియోగించాల్సి వచ్చేది. ఇకపై ఆ డబ్బులతో బిల్లుల చెల్లింపు, బస్సు, రైలు, విమాన టికెట్లు కొనుగోళ్లు... ఇవన్నీ చేయొచ్చు. ‘ఆర్బీఐ మాకు ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (పీపీఐ) లైసెన్సు ఇవ్వడం సంతోషంగా ఉంది. పీపీఐల తుది మార్గదర్శకాలను నిర్ణయించే ప్రక్రియ కొనసాగుతోంది. కస్టమర్లకు సౌకర్యవంతమైన, విశ్వసనీయమైన నగదురహిత చెల్లింపుల సేవలు అందించాలన్నది మా లక్ష్యం’ అని అమెజాన్ ఇండియా వీపీ (పేమెంట్స్ విభాగం) శ్రీరామ్ జగన్నాథన్ తెలియజేశారు. అమెజాన్ ఇప్పటిదాకా అమెజాన్ పే పేరిట క్లోజ్డ్ మొబైల్ వాలెట్ సేవలే అందిస్తోంది. ఈ విధానంలో కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ల ద్వారా అమెజాన్ పేలోని తమ ఖాతాకి ముందస్తుగా కొంత నగదును బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమెజాన్ ఇండియా పోర్టల్‌లో జరిపే కొనుగోళ్లకు ఈ ఖాతాలో డబ్బును ఉపయోగించవచ్చు. నగదు చెల్లింపుల ప్రసక్తి లేకుండా సులభంగా, వేగవంతంగా షాపింగ్ చేసేందుకు, రీఫండ్లు పొందేందుకు ఈ విధానం ఉపయోగపడుతోంది. అయితే, అమెజాన్ పోర్టల్‌లో కొనుగోళ్లకు మాత్రమే ఇది పరిమితం అవుతుండగా.. తాజాగా పీపీఐ లైసెన్సుతో పేటీఎం, మొబిక్విక్ తదితర వాలెట్ల తరహాలోనే.. మిగతా చోట్ల కొనుగోళ్లు, ఇతరత్రా చెల్లింపులు జరిపేందుకు కూడా వీలవుతుంది. ప్రత్యర్థులకు పోటీ.. పీపీఐ లైసెన్సు దక్కించుకున్న అమెజాన్ ఇండియా మరో ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కి చెందిన ఫోన్‌పే, అటు చైనా దిగ్గజం ఆలీబాబా పెట్టుబడులున్న పేటీఎంతో పాటు స్నాప్‌డీల్‌కి చెందిన ఫ్రీచార్జ్ తదితర సంస్థలకు గట్టి పోటీనివ్వనుంది. ఈ మూడు సంస్థలు చెల్లింపుల విభాగంలో ఆధిపత్యం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పేటీఎంలో ఇన్వెస్ట్ చేసిన ఆలీబాబా.. చైనా ఈ–కామర్స్ మార్కెట్లో డిజిటల్ వాలెట్లను విస్తృతంగా వాడకంలోకి తెచ్చింది. మరోవైపు, ఇటీవలే టెన్సెంట్, మైక్రోసాఫ్ట్, ఈబే తదితర సంస్థల నుంచి 140 కోట్ల డాలర్లు సమీకరించిన ఫ్లిప్‌కార్ట్.. తమ ‘ఫోన్‌పే’పై భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. తగ్గనున్న నగదు హ్యాండ్లింగ్ వ్యయాలు.. ఇప్పటికీ చాలా మటుకు ఈ–కామర్స్ కంపెనీలకు చెల్లింపులు ఎక్కువగా నగదు రూపంలోనే ఉంటున్నాయి. ఈ నగదును హ్యాండిల్ చేసేందుకు అవుతున్న ఖర్చులు కూడా ఆయా సంస్థలకు భారీగానే ఉంటున్నాయి. డిజిటల్ వాలెట్ల ద్వారా కార్యకలాపాలతో అమెజాన్, దాని పోటీ సంస్థలు ఈ వ్యయాలను గణనీయంగా తగ్గించుకునే వీలుంటుంది. యూపీఐ విధానంలో మొబైల్ ఆధారిత చెల్లింపులు మార్చిలో గణనీయంగా పెరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో యూపీఐ ఆధారిత చెల్లింపులు రూ.1,660 కోట్లుగా ఉండగా.. మార్చిలో 20శాతం మేర పెరిగి రూ. 2,000 కోట్లకు చేరాయి. ఇందులో సింహభాగం .. రూ. 1,800 కోట్ల లావాదేవీలు మొబైల్ వాలెట్ల ద్వారానే జరిగాయి. ప్రస్తుతం దేశీయంగా సుమారు 35 కోట్ల మంది మొబైల్ వాలెట్ వినియోగదారులు ఉన్నారని అంచనా. సగటు లావాదేవీ విలువ రూ. 50 నుంచి రూ. 4,000 మధ్యలో ఉంటోంది. -
ఈ ఏడాది రూ.1,000 కోట్లు టార్గెట్
ఎంటీఆర్ ఫుడ్స్ సీఈవో సంజయ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ ఎంటీఆర్ ఈ ఏడాది రూ.1,000 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా చేసుకుంది. 2016లో కంపెనీ రూ.800 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇందులో రూ.140 కోట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సమకూరింది. మూడేళ్లలో తెలుగు రాష్ట్రాల వాటాను రెండింతలకు చేరుస్తామని ఎంటీఆర్ ఫుడ్స్ సీఈవో సంజయ్ శర్మ తెలిపారు. గురువారమిక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పైసీ సాంబార్ పౌడర్‌ను విడుదల చేసిన సందర్భంగా ఎంటీఆర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ రెజి మాథ్యూతో కలిసి మీడియాతో మాట్లాడారు. కర్ణాటక తర్వాత కంపెనీకి అధిక ఆదాయాన్ని అందిస్తున్న తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశామని, ఇందులో భాగంగానే నూతన ఉత్పాదనను పరిచయం చేశామన్నారు. 1,500 మంది కస్టమర్ల ఆమోదం తర్వాత స్పైసీ సాంబార్ పౌడర్‌ను విడుదల చేసినట్టు చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల్లో 1.50 లక్షల దుకాణాల్లో సంస్థ ఉత్పత్తులు లభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ–కామర్స్ ద్వారా కూడా కంపెనీ ప్రొడక్టులను అమ్ముతోంది. -
స్నాప్‌డీల్‌లో 15% వేతనాల పెంపు!
న్యూఢిల్లీ: నిధుల కొరత ఎదుర్కొంటున్న ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్.. ఉద్యోగుల్లో భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి 15 శాతం దాకా వేతనాలు పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మధ్య, జూనియర్ స్థాయి ఉద్యోగుల జీతాలు సగటున 12–15 శాతం పెరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులకు పెంపు 9–12 శాతంగా ఉండొచ్చని... అసాధారణ పనితీరు కనపర్చిన వారికి 20–25 శాతం దాకా ఉండగలదని వివరించాయి. పే రివిజన్ ఏప్రిల్ 1 నుంచి వర్తింపచేయవచ్చని సమాచారం. ఉద్యోగులకు షేర్లు కూడా... కంపెనీ షేర్లలో 1 శాతాన్ని సుమారు 150 మంది ఉద్యోగులకు పంపిణీ చేయవచ్చని స్నాప్‌డీల్ వర్గాలు తెలియజేశాయి. స్నాప్‌డీల్ ఈ–కామర్స్ కార్యకలాపాల్లో 3,000 మంది పైచిలుకు ఉద్యోగులున్నారు. ఇది కాకుండా మొబైల్ వాలెట్ (ఫ్రీచార్జ్), లాజిస్టిక్స్ (వల్కన్) కార్యకలాపాలు కూడా కంపెనీకి ఉన్నాయి. ప్రస్తుత, మాజీ ఉద్యోగులందరికీ కలిపి స్నాప్‌డీల్‌లో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ రూపంలో 5–6 శాతం వాటాలున్నాయి. అత్యధికంగా పెట్టుబడులున్న సాఫ్ట్‌బ్యాంక్ సంస్థ.. నిధుల కొరత ఎదుర్కొంటున్న స్నాప్‌డీల్‌ను విక్రయించే యత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. వేల్యుయేషన్‌పై ఏకాభిప్రాయం సాధించేందుకు మిగతా భాగస్వాములైన కలారి క్యాపిటల్, నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్‌తో కూడా సాఫ్ట్‌బ్యాంక్ చర్చలు జరుపుతోంది. ఇటీవలే 1.4 బిలియన్ డాలర్లు సమకూర్చుకున్న పోటీ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. స్నాప్‌డీల్ కొనుగోలు రేసులో ముందుంది. -
కొత్త వ్యాపారాల్లో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులు
కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ బెంగళూరు: ఇటీవలే సమకూర్చుకున్న నిధులను ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థలు, ఫోన్‌పే వంటి కొత్త వ్యాపార విభాగాల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ తెలిపారు. ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ విభాగంలో అవకాశాలు పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. ‘ఇటీవలే టెన్సెంట్, మైక్రోసాఫ్ట్, ఈబే నుంచి భారీ స్థాయిలో నిధులు సమీకరించాం. వీటిని కొత్త వ్యాపారాలు.. ముఖ్యంగా ఫోన్‌పే, ఫిన్‌టెక్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఫోన్‌పే లాంటి ప్లాట్‌ఫాంల ద్వారా నగదు బదిలీ లావాదేవీలు గణనీయంగా జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ విభాగంలో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బన్సల్ చెప్పారు. అలాగే నిత్యావసరాలు, ఫర్నిచర్, ప్రైవేట్ లేబుల్స్ మొదలైన కొత్త వ్యాపార విభాగాల్లో కూడా భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈబేతో భాగస్వామ్యంపై స్పందిస్తూ.. దేశీ విక్రేతలకు అంతర్జాతీయ వేదిక కల్పించేందుకు ఇది ఉపయోగపడగలదని బన్సల్ చెప్పారు. దీనితో లక్షల మంది భారతీయ వ్యాపారస్తులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించుకోగలరని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌ను నాస్డాక్లో లిస్ట్ చేస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యాల మీద నుంచి దృష్టి మరల్చుకునే యోచనేదీ లేదన్నారు. -
15 శాతానికి తగ్గిన వేకెన్సీ: జేఎల్ఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2013లో దేశంలోని ప్రధాన నగరాల్లో 18.5 శాతంగా ఉన్న గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ ఖాళీలు... 2016 నాటికి 15 శాతానికి తగ్గినట్లు జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. గత ఎనిమిదేళ్లతో పోలిస్తే ఇదే అత్యల్పమని పేర్కొంది. తయారీ రంగం, లాజిస్టిక్, ఎఫ్ఎంసీజీ, ఈ–కామర్స్, స్టార్టప్స్ వంటి కంపెనీలలో వృద్ధే ఇందుకు కారణమని జేఎల్ఎల్ ఇండియా సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు. అయితే వచ్చే ఏడాది కాలంలో స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్) వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వంటి వాటితో ఈ విభాగానికి పెను సవాళ్లు ఎదురుకానున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై నగరాల్లోని ఆఫీస్ స్పేస్ మార్కెట్ దెబ్బతింటుందన్నారు. అయితే గ్రేడ్–బీ ఆఫీస్ స్పేస్ సరఫరా తగ్గడంతో ఈ విభాగంలో అద్దెలు పెరిగిపోయాయని తెలిపారు. పుణె, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో మౌలిక రంగంలో భారీగా వస్తున్న పెట్టుబడులతో ఆయా నగరాల్లో 2017లో ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్‌కు రీట్స్ పెట్టుబడులు మంచి అవకాశంగా మారతాయని చెప్పారు. -
బిలియన్ డాలర్ల సమీకరణలో ఫ్లిప్‌కార్ట్
ముంబై: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా మరో బిలియన్ డాలర్లు (సుమారు రూ. 6,671 కోట్లు) సమీకరించనుంది. ఇందుకోసం ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సంబంధిత వర్గాల కథనం ప్రకారం ఫ్లిప్‌కార్ట్ రెండంకెల స్థాయిలో సుమారు 10 బిలియన్ డాలర్లకు పైగా వేల్యుయేషన్‌తో నిధులను సమీకరించాలని భావిస్తోంది. అయితే, ఈ వేల్యుయేషన్ 8 బిలియన్ డాలర్ల స్థాయికే పరిమితం కావొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. సుమారు 15 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఫ్లిప్‌కార్ట్ గతంలో పెట్టుబడులు సమీకరించడం తెలిసిందే. అమెజాన్, స్నాప్‌డీల్‌తో తీవ్ర పోటీ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ నిధుల సమీకరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్, యాక్సెల్ పార్ట్నర్స్, డీఎస్టీ గ్లోబల్ వంటి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఇప్పటి దాకా కంపెనీలో 3 బిలియన్ డాలర్ల పైగా నిధులు సమీకరించింది. -
విలీన బాటలో స్నాప్‌డీల్, పేటీఎం ఈ–కామర్స్
ముంబై: ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్‌డీల్, పేటీఎం ఈ–కామర్స్ సంస్థ విలీనంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా స్టాక్స్ డీల్‌గా ఉండొచ్చునని తెలుస్తోంది. దాదాపు నెల రోజుల క్రితమే ఈ అంశంపై చర్చలు జరిగినట్లు, ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైతే సంప్రతింపులు మళ్లీ ప్రారంభం కావొచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. చెల్లింపుల బ్యాంక్ లైసెన్స్ పొందిన పేటీఎం సంస్థ ఆర్బీఐ నిబంధనల ప్రకారం మార్చి 31లోగా తమ మార్కెట్‌ప్లేస్ వ్యాపార విభాగాన్ని విక్రయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్నాప్‌డీల్‌తో ఈ–కామర్స్ వ్యాపార విభాగం విలీనంపై వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరు సంస్థల్లోనూ వాటాలు ఉన్న చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా ఈ డీల్‌కు సారథ్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలీబాబాకు పేటీఎంలో 40%, స్నాప్‌డీల్‌లో 3% వాటాలు ఉన్నాయి. పేటీఎం ఈ–కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం ఆలీబాబా, ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్ నుంచి నిధులు సమీకరించే ప్రయత్నాల్లో ఉంది. ఒకవేళ స్నాప్‌డీల్, పేటీఎం ఈ–కామర్స్ విలీనం జరిగిందంటే కొత్తగా ఏర్పడే సంస్థలో ఆలీబాబా అతి పెద్ద వాటాదారుగా అవతరిస్తుంది. ఈ మొత్తం డీల్‌లో జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్ కూడా ప్రయోజనం పొందనుంది. స్నాప్‌డీల్‌లో భారీగా ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్‌బ్యాంక్‌కి అటు ఆలీబాబాలో కూడా గణనీయమైన వాటాలు ఉన్నాయి. ఆలీబాబా ఇటీవలే పేటీఎం ఈ–కామర్స్‌లో రూ. 1,350–1,700 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసింది. తద్వారా భారత మార్కెట్లో ఆన్లైన్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లతో పోటీపడుతోంది. పేటీఎం వేల్యుయేషన్ దాదాపు 4.8 బిలియన్ డాలర్లుగా ఉంది. పేటీఎంలో రిలయన్స్ క్యాప్ వాటా సేల్..! పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో తమకున్న 1 శాతం వాటాను విక్రయించాలని రిలయన్స్ క్యాపిటల్ యోచిస్తోంది. తద్వారా 50–60 మిలియన్ డాలర్లు సమీకరించాలని భావిస్తోంది. అయితే రిలయన్స్ క్యాపిటల్ వర్గాలు ఈ వార్తలపై స్పందించేందుకు నిరాకరించాయి. -
2021కి ఈ–కామర్స్ 55 బిలియన్ డాలర్లు!
ముంబై: ఈ–కామర్స్ మార్కెట్ 2021 నాటికి 50–55 బిలియన్ డాలర్లకి చేరుతుందని అంచనా. ప్రస్తుతం మార్కెట్ విలువ 6–8 బిలియన్ డాలర్లుగా ఉంది. రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌లు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డిజిటలైజేషన్ పెరిగే కొద్ది ఈ–కామర్స్‌లో కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, దుస్తులు, గృహోపకరణాలు, ఫుడ్ అండ్ గ్రాసరీ, ఎఫ్ఎంసీజీ వంటి తదితర విభాగాల జోరు పెరుగుతుందని నివేదిక పేర్కొంది. 2025 నాటికి ఈ–కామర్స్ రంగంలో కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ విస్తరణ గరిష్టంగా 38–42% శ్రేణిలో ఉండొచ్చని తెలిపింది. -
ఈ–కామర్స్‌లోకి బాంబే డైయింగ్..
• రిటైల్ బ్రాండ్‌గా కొనసాగుతాం • తయారీ పూర్తిగా నిలిపివేత • కంపెనీ సీఈవో నగేశ్ రాజన్న హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్స్టైల్ రంగంలో ఉన్న బాంబే డైయింగ్ సొంతంగా ఈ–కామర్స్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇప్పటికే పలు ఈ–కామర్స్ సంస్థలు కంపెనీ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి.ఫిబ్రవరికల్లా ఈ–కామర్స్‌లోకి అడుగు పెడుతున్నట్టు బాంబే డైయింగ్ రిటైల్ సీఈవో నగేశ్ రాజన్న సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. తయారీ పూర్తిగా నిలిపివేశామని, థర్డ్ పార్టీకి చెందిన ప్లాంట్ల నుంచిఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రిటైల్ పైన ఫోకస్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 30 దాకా సబ్ బ్రాండ్లలో 5,000 రకాల బెడ్ షీట్లు, బ్లాంకెట్లు, టవల్స్ విక్రయిస్తున్నట్టు చెప్పారు.ఏటా 400 కొత్త రకాలను ప్రవేశపెడుతున్నట్టు వివరించారు. అంతర్జాతీయ డిజైనర్లతో చేతులు కలపడం ద్వారా వినూత్న ఉత్పత్తులను తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది రిటైల్ విభాగం లాభాల్లోకి వస్తుందని తెలిపారు. భారీ లక్ష్యంతో ముందుకు..: కంపెనీకి దేశవ్యాప్తంగా 30 సొంత, 200 ఫ్రాంచైజీ ఔట్లెట్లు ఉన్నాయి. 5,000లకు పైగా దుకాణాల్లో బాంబే డైయింగ్ ఉత్పత్తులు లభిస్తున్నాయి. 2020 లక్ష్యంలో భాగంగా బ్రాండ్ స్టోర్ల సంఖ్య500లకు, టచ్ పాయింట్లను 10 వేలకు చేర్చనున్ననట్టు నగేశ్ వెల్ల డించారు. ‘వచ్చే నాలుగేళ్లలో బ్రాండ్ ప్రమోషన్‌కు రూ.100 కోట్లు వ్యయం చేస్తాం. 10% ఆదాయం సమకూరుస్తున్న ప్రధాన మార్కెట్లయిన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లో 20% ఖర్చు పెడతాం. సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో నియామకాలు ఉంటాయి. రిటైల్ ద్వారా 2015–16లో రూ.305 కోట్ల ఆదాయం సమకూరింది. 2020 నాటికి దీనిని రూ.1,000 కోట్లకు చేరుస్తాం’ అనివివరించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్లో 50% అమ్మకాలు తగ్గాయని... చైనా నుంచి దిగుమతులూ పడిపోయాయని గుర్తు చేశారు. -
క్యాష్‌బ్యాక్ ఆఫర్ నిబంధనలు వర్తిస్తాయ్...
• క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందేమో చూడండి • అక్కడే నిబంధనలు, పరిమితులూ ఉంటాయ్ • ధర విషయంలో ఒకటికి మూడు సైట్లలో విచారించుకోవాలి ఈ కామర్స్ కొనుగోళ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చివరికి ఉప్పు, పప్పు వంటి నిత్యావసరాలను కూడా ఇవి అమ్మేస్తున్నాయి. క్యాష్‌బ్యాక్ (కొన్న మొత్తం విలువలో నిర్ణీత శాతం మేర తిరిగి వెనక్కి వస్తుంది) కోసం డిస్కౌంట్ తదితర ఆఫర్లతో కస్టమర్లకు ఈ సంస్థలు గాలం వేస్తున్నాయి. నిజానికి ఈ ఆఫర్లు కస్టమర్లకు కూడా ఉపయోగకరమే. అయితే, ఈ ఆఫర్ల ప్రయోజనాన్ని అందుకోవాలంటే కొనుగోలు సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు అభిరామ్ ఎల్జీ 8కిలోల ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకున్నాడు. క్యాష్ బ్యాక్, తగ్గింపు వంటి ఆఫర్లు ఏవైనా ఉన్నాయేమోనని ఆన్లైన్ పోర్టల్స్‌ను పరిశీలించాడు. అమెజాన్ సైటులో హెచ్డీఎఫ్సీ డెబిట్ కార్డులపై 5 శాతం, స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం ఆఫర్ ఉందని తెలిసింది. పూర్తి వివరాలు తెలుసుకోకుండా కొనేస్తే పూర్తి ప్రయోజనం రాకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఆఫర్లకు పరిమితులు, నిబంధనలు ఉంటాయి. నిర్ణీత కాలపరిమితి అనేది కూడా ఉంటుంది. ఒక్కొక్క సమయంలో ఒక్కో బ్యాంకు కార్డులపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. క్యాష్ బ్యాక్ అంటే...? ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో టైఅప్ అయ్యి ఆయా బ్యాంకు ఖాతాదారులు క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే కొనుగోళ్లపై ఈ కామర్స్ పోర్టల్స్ అదనపు తగ్గింపును క్యాష్ బ్యాక్ రూపంలో అందిస్తుంటాయి. ఈ క్యాష్ బ్యాక్ ఆయా కస్టమర్ల బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ అవుతుంది. ఉదాహరణకు అమెజాన్ సైట్లో వాషింగ్ మెషిన్ ధర రూ.20వేలు ఉందనుకోండి. ఎస్బీఐ డెబిట్/క్రెడిట్‌కార్డు దారులకు 10 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తే ఆ ఉత్పత్తి నికర కొనుగోలు విలువ రూ.18వేలు. సాధారణ తగ్గింపునకు ఈ క్యాష్ బ్యాక్ అదనం. ఇలాంటి ఆఫర్ ఉన్న సమయంలో ఉత్పత్తి ధర చాలా తక్కువకే వస్తుంది. కానీ, అదే సమయంలో ఇతర ఈకామర్స్ పోర్టల్స్‌లో అదే ఉత్పత్తి ధర ఎంతుందన్న అంశాన్ని పరిశీలించుకోవాలి. ఆఫర్లకు పరిమితులు క్యాష్ బ్యాక్ ఆఫర్ల విషయంలో పరిమితులు కూడా ఉంటాయని తెలుసుకోవాలి. ఉదాహరణకు రూ.20వేల వాషింగ్ మెషిన్‌పై 15 శాతం క్యాష్ ఉందనుకోండి. ఈ లెక్కన రూ.3,000 క్యాష్ బ్యాక్ రూపంలో వెనక్కి రావాలి. కానీ అక్కడ కార్డు సంస్థ గరిష్ట క్యాష్ బ్యాక్ రూ.2,000కే పరిమితం అనే నిబంధన విధించి ఉండవచ్చు. ఇక, కనీస లావాదేవీ విలువ అంటూ మరో నిబంధన కూడా ఉంటుంది. రూ.2,000 లేదా రూ.5,000 అంతకంటే ఎక్కువ కొనుగోలు విలువ ఉండాలని షరతు విధించి ఉండవచ్చు. అలాగే, ఒక క్రెడిట్ కార్డుపై ఒక్కసారి జరిపే లావాదేవీకే క్యాష్ బ్యాక్ పరిమితం చేయవచ్చు. క్యాష్ బ్యాక్లలో రకాలు ఈ క్యాష్బ్యాక్లలో నూ రకాలు ఉ న్నాయి. ఒక విధానంలో తక్షణమే క్యాష్ బ్యాక్ ప్రయోజనం లభి స్తుం ది. అంటే అప్పటికప్పుడే ఆఫర్ మేర బిల్లు మొత్తంలో తగ్గింపు లభిస్తుంది. అది పోను మిగిలిన విలువమేర చెల్లిస్తే సరిపోతుంది. మరో విధానంలో కొనుగోలు తర్వాత కొన్ని రోజులకు గానీ ఆ క్యాష్ బ్యాక్ రాదు. ఇక క్యాష్ బ్యాక్ ఆఫర్ అప్పటికప్పుడు చెల్లింపుల ద్వారా చేసే కొనుగోళ్లకే పరిమితం కాదు. ఈఎంఐ విధానంలో కొనుగోళ్లపైనా అందుబాటులో ఉండవచ్చు. అయితే, చెల్లింపులు చేసే ముందు అక్కడున్న నిబంధనలు, మినహాయింపులు, పరిమితుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. -
ఈ-రిటైల్‌లో 14.5 లక్షల జాబ్స్
లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగాల్లో అత్యధికం 2021 నాటికి సాకారం: కేపీఎంజీ అప్పటికల్లా 103 బిలియన్ డాలర్లకు ఈ-కామర్స్ న్యూఢిల్లీ: మున్ముందు ఈ-రిటైల్ రంగం ఉపాధి అవకాశాల హబ్‌గా మారనుంది. 2021 నాటికి దేశీయ ఈ-రిటైల్ రంగం, దానికి అనుబంధంగా పనిచేసే లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ (గోదాములు), ఐటీ/ఐటీఈఎస్ వంటి రంగాల్లో ఏకంగా 14.5 లక్షల కొత్త ఉద్యోగాలొస్తాయని స్నాప్‌డీల్, కేపీఎంజీ నివేదిక తెలియజేసింది. ఈ రెండు సంస్థలూ ‘దేశంలో ఉపాధి అవకాశాలపై ఈ-కామర్స్ ప్రభావం’ పేరుతో సంయుక్త అధ్యయన నివేదికను విడుదల చేశారుు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం ద్వారా ఈ-కామర్స్ రంగం సామాజిక, ఆర్థిక రంగంపై చెప్పుకోతగ్గ ప్రభావం చూపిస్తుందని ఈ నివేదిక పేర్కొంది. ప్రధాన రంగంతోపాటు దాని అనుబంధ రంగాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాల కల్పన, నూతన వ్యాపార అవకాశాలు, సామాజిక - ఆర్థిక వ్యవస్థలను ఏ విధంగా ప్రభావితం చేయనున్నదీ ఈ నివేదిక ద్వారా తెలియజేయాలనుకున్నట్టు స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ బెహల్ తెలిపారు. నివేదికలోని అంశాలు లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగం అత్యధికంగా 10 లక్షల మేర ప్రత్యక్ష ఉద్యోగాలను తీసుకురానుంది. ఈటైల్ రంగంలో అధిక నైపుణ్యాలతో కూడుకున్న 4 లక్షల ఉద్యోగాలు ఏర్పడతారుు. ఈ-కామర్స్ రంగంలో కొత్తగా రానున్న ప్రతీ ఉద్యోగంతో దాని అనుబంధ రంగాల్లో మూడు నుంచి నాలుగు కొత్త ఉద్యోగాలు ఏర్పడతారుు. 2020 నాటికి ఈ కామర్స్ రంగం 103 బిలియన్ డాలర్ల (రూ.6.9లక్షల కోట్లు) స్థారుుకి చేరుకుంటుంది. ఇందులో ఈటైల్ రంగం వాటా 67 శాతం (68 బిలియన్ డాలర్లు). ఆన్లైన్ విక్రేతల సంఖ్య సైతం 2020 నాటికి 13 లక్షల సంఖ్యకు వృద్ధి చెందుతుంది. 70 శాతం ఆన్లైన్ విక్రేతలు చిన్న పట్టణాల నుంచి రానున్నారు. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు వీలుగా పరిశోధన అభివృద్ధిపై పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, కార్మిక సంస్కరణలను మెరుగుపరచడం, వృత్తిపరమైన శిక్షణ ద్వారా ప్రభుత్వం వైపు నుంచి సహకారం అవసరం. -
రెండో అతిపెద్ద ఈ-కామర్స్ మార్కెట్‌గా భారత్!
న్యూఢిల్లీ: భారత్ వచ్చే రెండు దశాబ్దాల కాలంలో అమెరికాను వెనక్కునెట్టి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈ-కామర్స్ మార్కెట్గల దేశంగా అవతరించనుంది. అలాగే నెంబర్‌వన్ స్థానం కోసం చైనాతో నువ్వానేనా అన్నట్లు పోటీపడనుంది. ప్రముఖ గ్లోబల్ పేమెంట్స్ సంస్థ వరల్డ్‌పే తన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. ప్రపంచ ఈ-కామర్స్ మార్కెట్ వృద్ధికి అభివృద్ధి చెందుతున్న దేశాలు బాగా దోహదపడనున్నారుు. మరీముఖ్యంగా భారత ఈ-కామర్స్ మార్కెట్లో 2016-2020 మధ్యకాలంలో 28 శాతం వార్షిక వృద్ధిరేటు నమోదవుతుంది. దీంతో 2034 నాటికి ఇండియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈ-కామర్స్ మార్కెట్ గల దేశంగా అవతరిస్తుంది. దీనికి ఇంటర్నెట్ విస్తరణ, స్మార్ట్ఫోన్స విని యోగం పెరుగుదల వంటి అంశాలు కారణంగా నిలుస్తారుు. -
అక్టోబర్ 2న హోమ్షాప్18 స్పెషల్ సేల్స్
హైదరాబాద్: అక్టోబర్ అమ్మకాలకు ఈ కామర్స్ సంస్థలన్నీ సిద్ధమవటంతో తానూ బరిలో ఉన్నట్లు హోమ్షాప్-18 సంస్థ ప్రకటించింది. అక్టోబర్ 2న తమ ప్రత్యేక అమ్మకాలు మొదలవుతాయని, ఆ రోజు ఉదయం 6 గంటల నుంచీ తమ చానల్లో ప్రత్యేక వస్తువుల ప్రదర్శన ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ఆఫర్లన్నీ హోమ్షాప్-18 వెబ్ పోర్టల్‌లో కూడా లభిస్తాయని తెలిపింది. -
4జీతో ఈ-కామర్స్‌కు రెక్కలు!
• చౌక డేటాతో మరింత మంది ఆన్‌లైన్‌లోకి • తక్కువ ధరలోనే 4జీ ఫోన్లు • ఇవన్నీ లాభిస్తాయంటున్న ఈ-కామర్స్ పరిశ్రమ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో టెలికం రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు... ఇటు టెలికం వినియోగదారులతో పాటు అటు ఈ-కామర్స్ విక్రయాల పెరుగుదలకూ దోహదం చేస్తాయనే అంచనాలు పెరుగుతున్నాయి. తాజా పరిణామాలతో అత్యాధునిక 4జీ స్మార్ట్ఫోన్లు సైతం రూ.3 వేల నుంచే లభించటం మొదలెట్టాయి. ఒకవైపు స్మార్ట్ ఫోన్లు, మరోవైపు చౌక 4జీ... ఈ రెండూ కలసి నెటిజన్లు ఎక్కువసేపు బ్రౌజింగ్ చేయటానికి ఉపకరిస్తాయని, దీంతో తమ అమ్మకాలు కూడా పెరుగుతాయని ఈ-కామర్స్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం మొబైల్ కస్టమర్లలో 10 శాతం మందే ఇంటర్నెట్ను విస్తృతంగా వాడుతున్నారు. ఇంటర్నెట్ ఉపయోగాలు వీరికి బాగా తెలుసు. డేటా చార్జీలు ఎక్కువగా ఉండడం, కనెక్టివిటీ సమస్యలతో మరో 30 శాతం మంది పరిమితంగా వాడుతున్నారు. మిగిలిన వారు నెట్ బ్రౌజింగ్‌కు ఇంకా అలవాటు పడాల్సి ఉందని ‘షాప్‌క్లూస్ డాట్‌కామ్’ మార్కెటింగ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నితిన్ అగర్వాల్ చెప్పారు. ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు సగటున నెలకు 320 ఎంబీ డేటా వినియోగిస్తున్నారు. జియో రాకతో కొద్ది రోజుల్లో ఇది 1జీబీ దాటుతుందని ఇండస్ ఓఎస్ కంపెనీ చెబుతోంది. 90 రోజులపాటు ఉచితంగా డేటా, వాయిస్ కాల్స్‌ను జియో అందిస్తున్న సంగతి తెలిసిందే. జియోకు ధీటుగా ఇప్పటికే మిగిలిన టె లికం కంపెనీలు డేటా చార్జీలను భారీగా తగ్గించాయి. ఈ పరిణామంతో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగి కస్టమర్లు ఎక్కువ సమయం సర్ఫింగ్‌కు కేటాయిస్తారని, తద్వారా ఈ-కామర్స్ కంపెనీల అమ్మకాలు పెరగడం ఖాయమని అమెజాన్ కేటగిరీ మేనేజ్మెంట్ డెరైక్టర్ నూర్ పటేల్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. స్మార్ట్ఫోన్ల ధరలు కూడా దిగిరావడం కలసివచ్చే పరిణామమని చెప్పారాయన. అమెజాన్ ద్వారా జరుగుతున్న స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో 80 శాతం 4జీ మోడళ్లేనని తెలియజేశారు. సింహభాగం మొబైల్ నుంచే.. ఈ-కామర్స్ కంపెనీలకు 70 శాతానికి పైగా ట్రాఫిక్ మొబైల్స్ నుంచే సమకూరుతోంది. అంటే మొబైల్ నుంచే ఉత్పత్తులకు ఆర్డర్లిస్తున్నారు. వాస్తవానికి ప్రధాన ఈ-కామర్స్ కంపెనీల్లో ఒకొక్కటీ ఎంతకాదన్నా 6-10 కోట్ల ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి. అందుకే కస్టమర్లను మరింత ఆకట్టుకోవడానికి యూజర్ ఎక్స్‌పీరియన్స్‌పై పెద్ద ఎత్తున దృష్టి పెట్టాయి. కస్టమర్లు సర్చ్ చేస్తున్నప్పుడు టాప్ సెల్లింగ్ ఉత్పత్తులను సూచించడం ఈ కోవలోకే వస్తుంది. అలాగే కావాల్సిన ఉత్పాదనను సులువుగా ఎంచుకునేలా, ఆర్డరు ఇచ్చేందుకు వీలుగా యాప్స్‌ను అప్డేట్ చేస్తున్నాయి. ఉత్పత్తులను విభజించి కేటగిరీల వారీగా ప్రమోట్ చేస్తున్నాయి. ఇక మొబైల్ తయారీ కంపెనీలు సైతం ఇన్‌బిల్ట్‌గా టాప్ ఈ-కామర్స్ సైట్ల యాప్స్‌ను జోడిస్తున్నాయని సెల్కాన్ సీఎండీ వై.గురు తెలియజేశారు. ఇదీ ఈ-కామర్స్ మార్కెట్.. మొబైల్ ఇంటర్నెట్పై కస్టమర్లు చేస్తున్న వ్యయం 2014లో 54 శాతం, 2015లో 64 శాతం వృద్ధి చెందింది. దేశంలో ప్రస్తుతం 33 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లున్నారు. వీరిలో 6 కోట్ల మంది ఆన్ లైన్ కొనుగోలుదారులు. 2013లో ఆన్లైన్ వినియోగదారులు 1.5 కోట్లలోపే. ఇక 2019-20 నాటికి ఆన్లైన్ కస్టమర్ల సంఖ్య 11 కోట్లకు చేరుతుందని బ్రోకరేజ్ కంపెనీ కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన రీసెర్చ్ నివేదికలో వెల్లడించింది. తద్వారా ఈ-టైలింగ్ పరిమాణం 28 బిలియన్ డాలర్లకు ఎగుస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఈ-టైలింగ్ పరిమాణం 15 బిలియన్ డాలర్లుంది. ఆన్లైన్ షాపింగ్ 2014లో 14 శాతం వృద్ధి చెందితే, 2016లో 27 శాతం అధికమయింది. -
రిటైల్‌లో రూ.3,350 కోట్లు
హెచ్1 2016లో రికార్డు స్థాయిలో పీఈ నిధుల వెల్లువ సాక్షి, హైదరాబాద్: దేశీయ చిల్లర వర్తకం (రిటైల్ రంగం)లో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. 2008 నుంచి ఇప్పటివరకు ఏనాడు రాని స్థాయిలో 2016 హెచ్1లో రికార్డు స్థాయిలో పెట్టుబడులొచ్చాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. 2015 హెచ్1లో రిటైల్ రంగంలో రూ.250 కోట్ల పీఈ పెట్టుబడులు రాగా.. ఈ ఏడాది హెచ్1లో రూ.3,350 కోట్లు వచ్చాయని పేర్కొంది. రిటైల్ రంగంలో లీజు కార్యకలాపాలు పెరగడం, రీట్స్ వంటి పెట్టుబడి విధానాల్లో ప్రభుత్వం సడలింపునివ్వటం వంటివి ఈ వృద్ధికి కారణమని నివేదిక వెల్లడించింది. గతేడాది కాలంగా కస్టమర్ల జీవన వృద్ధి కూడా 10 శాతం పెరిగిందని, ఈ-కామర్స్ రంగం అభివృద్ధి కూడా పీఈ పెట్టుబడులకు కలిసొచ్చాయని సంస్థ ఎండీ అన్షుల్ జైన్ పేర్కొన్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలు హైదరాబాద్, బెంగళూరుల్లో గిడ్డంగుల ఏర్పాటుకు ముందుకొచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలోని 8 ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్సీఆర్, హైదరాబాద్, పుణె, కోల్కత్తా, ముంబైల్లో 2015 హెచ్1లో 0.2 మిలియన్ చ.అ.ల్లో మాల్స్ రాగా.. ఈ ఏడాది హెచ్1లో 4.8 మిలియన్ చ.అ.ల్లో కొత్త మాల్స్ వచ్చాయి. కొత్త మాల్స్ సరఫరాలో 64 శాతంతో ఢిల్లీ ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే మాల్ వెకన్సీలో మాత్రం 33 శాతంతో అహ్మదాబాద్ తొలి స్థానంలో నిలవగా.. ఢిల్లీ-ఎన్సీఆర్, పుణెల్లో 20 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ముంబైలో 16 శాతం, బెంగళూరులో 12 శాతం వెకన్సీ ఉన్నాయి. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
ఆఫ్రికన్ల కోసం ఆన్లైన్ షాపింగ్ పోర్టల్
ఘనా: ఆఫ్రికన్ల కోసం భారతీయ యువ పారిశ్రామికవేత్త రాహుల్ కాల్రా ఆన్లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 2025 నాటికి ఆఫ్రికన్లలో ఎక్కువ మంది ఆన్లైన్ షాపింగ్ ద్వారానే కొనుగోళ్లు చేస్తారని తాను బలంగా నమ్ముతున్నానని, అందుకే ప్రత్యేకించి ఆఫ్రికన్ల కోసం ఈ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్‌ను ప్రారంభిస్తున్నానని కాల్రా తెలిపారు. Africakart.comపేరుతో ప్రారంభించిన ఈ పోర్టల్ ద్వారా అన్నిరకాల వస్తువులను కొనుగోలు చేసుకునే వీలుందన్నారు. మూడేళ్ల కిందట ఘనాకు వెళ్లిన రాహుల్.. తండ్రి రాజ్ కాల్రాతో కలిసి అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకున్నారు. ప్రపంచంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆఫ్రికన్లకు ఆన్లైన్ విక్రయాలు అంతగా అందుబాటులో లేవు. దీంతో ప్రత్యేకించి ఆఫ్రికన్ల కోసమే ఓ పోర్టల్‌ను ప్రారంభించడం ద్వారా ఆన్లైన్ షాపింగ్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో Africakart.comను ప్రారంభించాడు. -
ఈ-కామర్స్‌లో 120లక్షల ఉద్యోగాలు!
న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో భారత్‌లో ఈ-కామర్స్ రంగానికి ఆదరణ గణనీయంగా పెరుగుతుందట. వచ్చే 10ఏళ్లలో ఈ సెక్టార్, దాదాపు 120 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అందిస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది ఈ సెక్టార్ లో ఉద్యోగాలు అందుకుంటున్నారని, సర్వీసు సెక్టార్ రంగంలో ఈ-కామర్స్ ఓ కొత్త మార్గంగా రూపుదిద్దుకోబోతుందని హెచ్ఎస్బీసీ రిపోర్టు వెల్లడించింది. యువ జనాభా పెరగడం, స్మార్ట్ఫోన్లకు డిమాండ్ వేగవంతంగా పెరగడం, డిజిటల్ పేమెంట్ల విప్లవం ఇవన్నీ ఈ-కామర్స్ రంగం గణనీయమైన వృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొంది. అయితే, ఇంటర్నెట్ వ్యాప్తికి, ఆన్ లైన్ కొనుగోలుకు చైనా కంటే భారత్ ఏడేళ్లు వెనుకబడి ఉందని రిపోర్టు తెలిపింది. ప్రస్తుతం భారత్ సృష్టిస్తున్న ఉద్యోగాలతో పోలిస్తే ఈ-కామర్స్ రంగంలో ఉద్యోగాలు ఎక్కువ ప్రొడక్టివ్‌గా ఉంటాయని రిపోర్టు అధ్యయనం కనుగొంది. ఆన్లైన్ కొనుగోలు పెరుగుతున్నా కొద్ది ఈ-కామర్స్ దిగ్గజాలు లాజిస్టిక్స్& డెలివరీ, కస్టమర్ కేర్, ఐటీ అండ్ మేనేజ్ మెంట్లలో 20 మిలియన్ ఉద్యోగాలను సృష్టిస్తాయని హెచ్ఎస్బీసీ వెల్లడించింది. వచ్చే దశాబ్దంలో భారత్ లో క్రియేట్ అయ్యే 24 మిలియన్ ఉద్యోగాల్లో, సగం ఈ-కామర్స్ రంగమే భర్తీ చేస్తుందని ఈ రిపోర్టు తెలిపింది. చైనాలో గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న డిజిటల్ షాపుల మాదిరిగా.. భారత్‌లోనూ 5 మిలియన్ గ్రామీణ వర్తకులతో ఈ రెవల్యూషన్ ప్రారంభంకాబోతుందని వెల్లడించింది. దీంతో వచ్చే పదేళ్లలో మరిన్ని జీవనోపాధి అవకాశాలు గ్రామాల్లో అందుబాటులోకి వస్తాయని హెచ్ఎస్బీసీ రిపోర్టు పేర్కొంది. -
ఆరోగ్య బీమాపై అవగాహన పెరుగుతోంది
* రూ. 50 లక్షల హెల్త్ పాలసీలు కూడా తీసుకుంటున్నారు * సగటు సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షల స్థాయిలో ఉంటోంది ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి అవగాహన పెరుగుతోందని, దీంతో పాలసీదారులు ఎంచుకునే కవరేజీ సగటున రూ.4-5 లక్షల స్థాయికి చేరిందని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ అండర్‌రైటింగ్ విభాగం అధిపతి అమిత్ భండారీ చెప్పారు. మెట్రో నగరాల్లో రూ. 50 లక్షల పాలసీలూ తీసుకుంటున్న వారు కూడా ఉన్నారని చెప్పారాయన. పాలసీదారులకు ప్రయోజనకరంగా ఉండేలా మరిన్ని సేవలు ప్రవేశపెడుతున్నామని ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇంటర్వ్యూలో ఏమన్నారంటే... అధిక కవరేజీపై పెరుగుతున్న ఆసక్తి.. దేశీయంగా ప్రైవేట్ బీమా పాలసీలు తీసుకునేవారు 5 శాతమే ఉంటున్నారు. ఆరోగ్యశ్రీ.. బీమా సురక్ష యోజన మొదలైన ప్రభుత్వపరమైన పథకాలతో కలిపితే ఇది సుమారు 20 శాతం మేర ఉంటుంది. అయితే, ఆరోగ్య బీమాపై ప్రస్తుతం అవగాహన పెరుగుతోంది. గడిచిన ఐదారేళ్లలో గణనీయమైన మార్పులొచ్చాయి. అప్పట్లో సగటున సమ్ అష్యూర్డ్ సుమారు రూ.3 లక్షలుంటే ఇపుడది రూ. 4- 5 లక్షలుంటోంది. మెట్రో నగరాల్లోనైతే కొందరు రూ. 50 లక్షల కవరేజీ కూడా తీసుకుంటున్నారు. అలాగే వినూత్నమైన పాలసీలూ కోరుకుంటున్నారు. ప్రివెంటివ్, ఓపీడీ కవరేజీ లాంటి వాటి గురించి అడుగుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు పాలసీ ప్రీమియాల్లో డిస్కౌంట్లు అడుగుతున్నారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో పాలసీదారులు తీసుకునే కవరేజి మొత్తం కాస్త తక్కువగా ఉంటోంది. బహుశా దక్షిణాదిలో చికిత్స ఖర్చు కొంత తక్కువగా ఉండటం కారణం కావొచ్చు. వినూత్న పాలసీలు..: పాలసీదార్ల డిమాండ్లకు అనుగుణంగా మేం వినూత్న ఆప్షన్లూ ఇస్తున్నాం. పూర్తి స్థాయి హెల్త్ ఇన్సూరెన్స్ పథకంతో పాటు ఇటీవలే హెల్త్ బూస్టర్‌ను కూడా ప్రవేశపెట్టాం. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించే వారికి నిర్దిష్ట రివార్డ్ పాయింట్లు ఇచ్చి, ఆ మేరకు డిస్కౌంట్లు లేదా అధిక కవరేజీని అందిస్తున్నాం. వివిధ అంశాలను బట్టి మొత్తం 8,000-10,000 దాకా పాయింట్లు కేటాయించాం. ఉదాహరణకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మారథాన్లలో పాల్గొనడం మొదలైన వాటికి నిర్దిష్ట పాయింట్లుంటాయి. ఒకో పాయింటు విలువ సుమారు పావలా. ఎనిమిది వేల పాయింట్లూ లభిస్తే సుమారు రూ.2,000 మేర డిస్కౌంటు ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటించే వారికిది ప్రోత్సాహమే. పాలసీదారులకు ప్రయోజనకరంగా మరిన్ని సేవలు .. మా నెట్‌వర్క్‌లో సుమారు 2,500 పైగా ఆస్పత్రులున్నాయి. పాలసీదారులు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ వారికి మరిన్ని ఆప్షన్లుండేలా చూడాలన్నది మా ఉద్దేశం. ఇక బేస్ పాలసీతో పాటు క్రిటికల్ ఇల్నెస్ మొదలైన వాటన్నింటితో కలిపి చూస్తే సుమారు 10 వరకూ పాలసీలు అందిస్తున్నాం. అధిక చికిత్సా వ్యయాలపై ఆస్పత్రులతో బీమా సంస్థలు చర్చించిన మీదట... నగదు చెల్లించేవారితో పోలిస్తే పాలసీదార్లకు సుమారు 10- 15 శాతం దాకా ఆస్పత్రి వ్యయాలు తగ్గుతున్నాయి. చిన్న ఆస్పత్రులైతే ఈ తగ్గుదల 25 శాతం దాకా కూడా ఉండొచ్చు. మా సంస్థపరంగా స్థానికంగా అందుబాటులో ఉండే వివిధ ఆస్పత్రుల్లో చికిత్స వ్యయాలు, మౌలిక సదుపాయాలు, చికిత్స నాణ్యత తదితర అంశాలను పోల్చి చూసుకునేందుకు ప్రత్యేకంగా హెల్త్ అడ్వైజర్ ప్లాట్‌ఫాంను కూడా అందుబాటులోకి తెచ్చాం. హైదరాబాద్‌లో దాదాపు 140 పైగా ఆస్పత్రులను, 30 పైగా కీలక చికిత్సలను ఇందులో చేర్చాం. మా పాలసీదారులే కాకుండా మిగతావారు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ-కామర్స్ సైట్లలో హెల్త్ పాలసీలు.. ఈ-కామర్స్ సైట్లలో బీమా పాలసీల విక్రయమనేది తక్షణమే రాకపోవచ్చు. ఎందుకంటే మిగతా రకాల పాలసీలతో పోలిస్తే హెల్త్ పాలసీ అండర్‌రైటింగ్ చేయాలంటే సదరు వ్యక్తి ఆరోగ్య సమస్యలు (డయాబెటిస్ వంటివి) తెలిస్తేనే సాధ్యం. వాహనాల పాలసీల్లాగా వీటిని ఆన్లైన్లో ఆషామాషీగా జారీచేయడం కుదరదు. బహుశా మిగతా రకాల పథకాలు వచ్చిన కొన్నాళ్లకు హెల్త్ పాలసీలూ ఈ-కామర్స్ సైట్లలోకి రావొచ్చు. అది కూడా స్టాండర్డ్ పథకంగా పలు పరిమితులతో ఉండొచ్చు. - అమిత్ భండారీ ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్త్ అండర్‌రైటింగ్ విభాగం హెడ్ -
దూసుకుపోతున్న లీమాల్
భారత ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టిన 'లీమాల్' శరవేగంతో దూసుకుపోతోంది. ఇటీవలే లాంచ్ చేసిన తమ స్టార్ల్ ఫోన్లకు లే 2, లే మ్యాక్స్ 2 లకు భారీ ఆదరణ లభిస్తోందని తెలిపింది. భారతదేశంలో తమ మొదటి ఫ్లాష్ సేల్స్ లో లక్ష పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని లీ మెయిల్ .కామ్ వెల్లడించింది. జూన్ 28 ఉదయం11గం. నుంచి మధ్యాహ్నం 1గం. ముగిస్తే... అమ్మకాలు 12 గం.నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది. అలాగే భారత ఆన్ లైన్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రివర్స్ ఇన్-ఇయర్ హెడ్ ఫోన్లు, ఆల్ మెటల్ ఇయర్ ఫోన్లు, బ్లూటూత్ హెడ్ ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు తదితర డివైస్ ల అమ్మకాలు లీఇకో ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లీ మాల్ లో ప్రవేశపెట్టింది. లీమాల్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ అని, ఈ నేపథ్యంలో భారత్ మార్కెట్లో అడుగు పెట్టడం, లీ ఇకో వ్యాపార అభివృద్ధికి ఒక మైలురాయి లాంటిదని కంపెనీ పేర్కొంది. అమెరికాలో ఈ ఏడాది జనవరిలో లీమాల్ లో రిజిస్టర్ అయిన 30 వేలమందితో కలిపి మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 60వేలకు చేరింది. అలాగే హాంకాంగ్ లో 12,423మంది తన సూపర్ ఫోన్ల కోసం పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపింది. 2013లో మొదటిసారి చైనాలో లీ మాల్ ప్రారంభించగా ప్రస్తుతం అమెరికా, హాంగ్ కాంగ్ లో లీమాల్ ప్లాట్ ఫామ్ తో భారీ విజయాన్ని సాధించింది. అదే తరహాలో భారత్ మార్కెట్ లో కూడా దూసుకుపోవాలనేదే తమ ధ్యేయమని కంపెనీ తెలిపింది. ఇండియా మార్కెట్లో సముచిత స్థానాన్ని దక్కించుకున్న చైనీస్ ఇంటర్నెట్ అండ్ ఎకో సిస్టమ్ తన అధికార ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ను భారత్ లో జూన్ 8న మెగా ఈవెంట్ తో దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్లాట్ ఫామ్ ను లాంచ్ చేసిన సంగతితెలిసిందే. -
2 లక్షల కోట్లకు దేశీ డిజిటల్ కామర్స్!
న్యూఢిల్లీ: దేశీ డిజిటల్ కామర్స్ పరిశ్రమ మంచి ఊపుమీదుంది. ఈ-కామర్స్ రంగపు బలమైన వృద్ధి నేపథ్యంలో గతేడాది డిసెంబర్ నాటికి రూ.1.2 లక్షల కోట్లుగా ఉన్న డిజిటల్ కామర్స్ ఈ ఏడాది చివరకు 68 శాతం వృద్ధితో రూ.2.1 లక్షల కోట్లకు చేరొచ్చని ఐఏఎంఏఐ-ఐఎంఆర్బీ నివేదిక పేర్కొంటోంది. ఇందులో ఆన్లైన్ ట్రావెల్ వాటా 1.2 లక్షల కోట్లకు పెరగొచ్చని అంచనా వేసింది. నివేదిక ప్రకారం.. ♦ గతేడాది చివరి నాటికి... డిజిటల్ కామర్స్‌లో ఆన్లైన్ ట్రావెల్ వాటా 61 శాతంగా (రూ.76,396 కోట్లు) ఉంది. ఇక నాన్ ట్రావెల్ (ఈ-టెయిలింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటివి) వాటా రూ.49,336 కోట్లుగా నమోదయ్యింది. ♦ 2014 డిసెంబర్ నాటికి రూ.1,965 కోట్లుగా ఉన్న ఆన్లైన్ హోటల్ బుకింగ్స్ 2015 అదే నెలకు వచ్చేసరికి 165 శాతం వృద్ధితో రూ.5,200 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ఆన్లైన్ రైల్వే టికెట్ బుకింగ్స్ కూడా 34 శాతం వృద్ధితో రూ.16,200 కోట్ల నుంచి రూ.21,708 కోట్లకు ఎగశాయి. ఇక ఈ-టెయిలింగ్‌లో 57 శాతం వృద్ధి నమోదయ్యింది. ♦ ట్రాన్సాక్షన్స్ ప్రకారం చూస్తే.. ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ 2015 చివరి నాటికి రూ.5,231 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో ఆన్లైన్ మూవీ టికెట్స్, గ్రోసరీ, ఫుడ్ డెలివరీ వాటి మార్కెట్ రూ.3,823 కోట్లుగా నమోదయ్యింది. -
ఈ-కామర్స్ లోకి దూసుకొస్తున్న లీ మాల్
న్యూఢిల్లీ : భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సముచిత స్థానాన్ని దక్కించుకున్న చైనీస్ ఇంటర్నెట్ అండ్ ఎకో సిస్టమ్ సమ్మేళనం లీఇకో, భారత ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టబోతోంది. తన అధికార ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ 'లీమాల్' ను భారత్ లో ఆవిష్కరించబోతోంది. జూన్ 8న మెగా ఈవెంట్ తో దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్లాట్ ఫామ్ ను లాంచ్ చేస్తున్నామని లీఇకో కంపెనీ వెల్లడించింది. 2013లో మొదటిసారి చైనాలో ఈ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం అమెరికా, హాంగ్ కాంగ్ లో లీమాల్ ప్లాట్ ఫామ్ లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రివర్స్ ఇన్-ఇయర్ హెడ్ ఫోన్లు, ఆల్ మెటల్ ఇయర్ ఫోన్లు, లెమె బ్లూటూత్ హెడ్ ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు లాంటివి లీఇకో ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంటున్నాయి. అదేవిధంగా తర్వాతి తరం 'సూపర్ ఫోన్లు' రెండింటిని 'టూ ఫ్యూచర్స్ ' ఈవెంట్ టైటిల్ తో లీఇకో ప్రారంభించనుంది. అయితే గత నెల ఏప్రిల్ లోనే ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఫీచర్(పీడీఏఎఫ్)తో ఈ సూపర్ ఫోన్లను చైనాలో ప్రవేశపెట్టింది. 16మెగాపిక్సెల్ పీడీఏఎఫ్ ప్రైమరీ కెమెరాతో లీ 2ను, యునిక్ ఓఐఎస్ ఫీచర్ తో 21 మెగాపిక్సెల్ కెమెరాను లీఇకో స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. -
గతవారం బిజినెస్
ఈ-కామర్స్‌లోకి టాటా గ్రూప్ టాటా గ్రూప్ తాజాగా ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ‘టాటాక్లిక్.కామ్’ అనే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీన్ని టాటా యూనిస్టోర్ నిర్వహించనున్నది. టాటాక్లిక్లో టాటా ఇండస్ట్రీస్ 90 శాతం వాటాను, గ్రూప్ రిటైల్ విభాగం ట్రెంట్ మిగిలిన 10 శాతం వాటాను కలిగింది. ఈ-కామర్స్ మార్కెట్లో తొలిసారిగా ‘ఫిజిటల్’ విధానాన్ని ఆవిష్కరిస్తున్నామని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ తెలిపారు. ఈ విధానంలో ఆన్లైన్లో ప్రొడక్ట్‌ను కొనుగోలు చేసి, దాన్ని సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న 530 స్టోర్లలో ఎక్కడైనా తీసుకోవచ్చని వివరించారు. మొబైల్స్‌కు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై! స్మార్ట్ఫోన్ల డిజైన్, తయారీకి దూరంగా ఉంటామని మైక్రోసాఫ్ట్‌కు ఫిన్లాండ్లో చీఫ్ షాప్ స్టివార్డ్‌గా వ్యవహరిస్తున్న కల్లే కీలి చెప్పారు. సాఫ్ట్‌వేర్‌పైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ‘ఎక్కడైతే మేం ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నామో.. ఆ విభాగంపైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తాం’ అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా తెలిపారు. తాజాగా కంపెనీ దాదాపు 1,850 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కాగా కంపెనీ ఇటీవలే నోకియా ఫీచర్ ఫోన్ల హక్కులను హెచ్ఎండీ గ్లోబల్‌కు, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ అనుబంధ సంస్థ ఎఫ్ఐహెచ్ మొబైల్‌కు విక్రయించింది. టాప్-10లో ఏడు మారుతీ కార్లే ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ... దేశీ మార్కెట్లో తన హవా కొనసాగిస్తోం ది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 ప్యాసెంజర్ కార్లలో ఏడు మారుతీవే కావటం గమనార్హం. ఏప్రిల్ నెలకు సంబంధించి విడుదలైన ఈ గణాంకాల్లో మారుతీ ఆల్టో అగ్రస్థానంలో ఉంది. దీని విక్రయాలు 16,583 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆటో మొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) గణాంకాల ప్రకారం.. అల్టో తర్వాతి స్థానాల్లో మారుతీ స్విఫ్ట్ (15,661 యూనిట్లు), మారుతీ వేగన్ ఆర్ (15,323 యూనిట్లు) వంటి తదితర మోడళ్లు ఉన్నాయి. భారత్‌లో చుక్కల్లో స్పెక్ట్రం ధర: సిస్టెమా భారత్‌లో స్పెక్ట్రం ధర చాలా ఎక్కువగా ఉందని రష్యాకు చెందిన సిస్టెమా కంపెనీ భారత టెలికం విభాగం ఎస్ఎస్టీఎల్ పేర్కొంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లను కొనసాగించడం చాలా కష్టమని సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్ (ఎస్ఎస్టీఎల్) సీఈవో సెర్జీ సవ్కెన్నో వ్యాఖ్యానించారు. ఎస్ఎస్టీఎల్ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సినీపొలిస్ రూ.400 కోట్ల పెట్టుబడులు! మెక్సికన్ మల్టీప్లెక్స్ చైన్ ‘సినీపొలిస్’ భారత్‌లో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టి, వచ్చే ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా కొత్తగా 160 సినిమా స్క్రీన్లను ఏర్పాటు చేయనుంది. సినీపొలిస్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ జేవియర్ సోటోమేయర్ ఈ విషయం వెల్లడించారు. మెక్సికో తర్వాత భారతే తమకు అతిపెద్ద మార్కెట్ అన్నారు. టాప్-60 పట్టణాల్లో విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో కొత్త స్క్రీన్ల ఏర్పాటు ఆరు నెలల్లో పూర్తవుతుందని సంస్థ తెలిపింది. ఈ-వ్యర్ధాల విడుదలలో 5వ స్థానంలో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ ఉన్న దేశం భారత్. ఇక్కడ ఏటా 18.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు (ఈ-వేస్ట్) వెలువడుతున్నాయని, ఇది ప్రపంచంలో 5వ స్థానమని తాజా అధ్యయనం పేర్కొంది. అందులోనూ 12 శాతం టెలికం పరికరాల నుంచే ఈ-వ్యర్ధాలు వస్తున్నాయని అసోచామ్-కేపీఎంజీ సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. 4,200 కంపెనీలపై డి-లిస్టింగ్ వేటు! స్టాక్ మార్కెట్ నిబంధనలను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా సెబీ కీలక చర్యలకు సమాయత్తమవుతోంది. ముఖ్యంగా ట్రేడింగ్ లావాదేవీలు జరగని కంపెనీలపై సెబీ కొరడా ఝళిపిస్తోంది. ఇలాంటి 4,200కు పైగా లిస్టెడ్ కంపెనీలను ఎక్స్ఛేంజీల నుంచి తొలగించే ప్రణాళికల్లో ఉంది. మార్కెట్ నిపుణుల కోసం ఎన్ఎస్ఈ అకాడెమీ ఫైనాన్షియల్ మార్కెట్లో నిపుణుల డిమాండ్‌ను ద ృష్టిలో ఉంచుకొని... అలాంటి వారిని తయారు చేయాలనే లక్ష్యంతో ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ ‘ఎన్ఎస్ఈ’ తాజాగా ఒక అకాడెమీని ఏర్పాటు చేసింది. ఎన్ఎస్ఈ ఈ కొత్త అకాడెమీ ద్వారా ఔత్సాహికుల కోసం పలు ఫైనాన్షియల్ కోర్సులను అందుబాటులో ఉంచింది. తొలిగా గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్‌కు సంబంధించి 11 నెలల పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తున్నట్లు ఎన్ఎస్ఈ తెలిపింది. రెగ్యులర్ తరగతులు జూలై 27 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ అకాడె మీ శాఖ హైదరాబాద్‌లో కూడా ఉంది. నాల్కో షేర్ల బైబ్యాక్‌కు డెరైక్టర్ల బోర్డు ఆమోదం అల్యూమినియం తయారు చేసే ప్రభుత్వ రంగ కంపెనీ నాల్కో షేర్ల బైబ్యాక్‌కు ఆ కంపెనీ డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. 64.43 కోట్ల షేర్లకు (చెల్లించిన మూలధనంలో 25 శాతం వాటా) మించకుండా బై బ్యాక్ కోసం నాల్కో కంపెనీ రూ.2,835 కోట్లు వ్యయం చేయనుంది. ఒక్కో షేర్‌ను రూ.44కు కొనుగోలు చేయనున్నామని పేర్కొంది. ప్రి-ఓన్డ్ కార్ల వ్యాపారంలోకి రెనో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘రెనో’ తాజాగా ప్రి-ఓన్డ్ కార్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే బెంగళూరులో ‘రెనో సెలెక్షన్’ అనే ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. దీని ద్వారా అన్ని బ్రాండ్లకు చెందిన ప్రి-ఓన్డ్ కార్ల కొనుగోలు, విక్రయం, ఎక్స్ఛేంజ్ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తామని రెనో తెలిపింది. అలాగే పాత కార్లకు 24ఁ7 రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఫైనాన్స్ సదుపాయం, వారెంటీ వంటి సదుపాయాలను కల్పిస్తున్నామని పేర్కొంది. ఫోర్బ్స్ ప్రపంచ అతిపెద్ద కంపెనీల్లో మనవి 56 ఫోర్బ్స్ రూపొందించిన వార్షిక ‘గ్లోబల్ 2,000 అతిపెద్ద, శక్తివంతమైన కంపెనీలు’ జాబితాలో భారత్ నుంచి 56 కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. వీటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్‌లో ఉంది. ఇది 121వ స్థానంలో నిలిచింది. దీని మార్కెట్ విలువ 50.6 బిలియన్ డాలర్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాతి స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (149వ స్థానం) ఉంది. దీని మార్కెట్ విలువ 23.3 బిలియన్ డాలర్లు. ఇక ఫోర్బ్స్ జాబితా టాప్-3లో ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ), చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్, అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా అనే అన్ని చైనా బ్యాంకులే ఉన్నాయి. నియామకాలు హిందుజా గ్రూప్ ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ)గా మళ్లీ వినోద్ కె దాసరి నియమితులయ్యారు. ఐదేళ్ల పదవీ కాలంతో వినోద్ కె దాసరి నియామకానికి డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని అశోక్ లేలాండ్ బీఎస్ఈకి నివేదించింది. -
జారిపోతున్న మైక్రోమ్యాక్స్..!
ఏడాదిలో 8% తగ్గిన మార్కెట్ వాటా * 22 శాతం నుంచి 14.1 శాతానికి తగ్గిన తీరు * తగ్గిన నాణ్యత, రిపేర్ల కోసం కస్టమర్ల క్యూ * విక్రయానంతర సేవలు తగ్గటంతో అసంతృప్తి * తక్కువ ధర ఫోన్లతో చైనా కంపెనీల పోటీ * వేగంగా పట్టు పెంచుకుంటున్న డ్రాగన్ మైక్రోమ్యాక్స్!!. పేరుకు తగ్గట్టే మ్యాక్స్ స్థాయి నుంచి మైక్రోకు జారిపోతోందా? పరిస్థితులు చూస్తుంటేఅవుననే సమాధానమే వస్తోంది. 2014లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఏకంగా 22 శాతం వాటాతో నెంబర్-1కు కాస్తంత దూరంలో నిలిచిన ఈ సంస్థ... జస్ట్ ఏడాదిలో ఏకంగా 8 శాతం వాటాను కోల్పోయింది. 2015 డిసెంబరు క్వార్టర్లో దీని వాటా కేవలం 14.1 శాతానికి పరిమితమైందని ఐడీసీ చెబుతోంది. ఒకవైపు దేశీ మొబైల్ మార్కెట్ బాగా వృద్ధి చెందుతున్నా... మైక్రోమ్యాక్స్ కూడా విపరీతంగా మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నా... అవేవీ కస్టమర్లను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఆ వైఫల్యం అంకెల్లో కనిపిస్తోంది కూడా!!. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత మొబైల్ మార్కెట్ వృద్ధి మామూలుగా లేదు. 2015లో స్మార్ట్‌ఫోన్స్ విపణి ఏకంగా 29% వృద్ధి చెంది 10.3 కోట్ల యూనిట్లు నమోదు చేసింది. స్మార్ట్‌ఫోన్ విప్లవంతో ఈ వృద్ధి మరికొన్నేళ్లు అంతకంతకూ పెరుగుతుందనే అంచనాలున్నాయి. చైనా కంపెనీలు దీన్ని అందిపుచ్చుకోవాలనుకున్నాయి. దీంతో ఒకప్పుడు దేశీ కంపెనీలకు... అవి చెప్పినట్లుగా ఫోన్లు తయారు చేసి ఇచ్చిన చైనా సంస్థలు... నేరుగా భారత మార్కెట్లోకి తమ సొంత బ్రాండ్లతో వచ్చేశాయి. యాపిల్‌తో సహా వివిధ దిగ్గజ బ్రాండ్లకు తయారీ సంస్థగా ఉన్న ఫాక్స్‌కాన్‌తో పాటు.. షావొమీ, జియోనీ, కూల్‌ప్యాడ్, ఓపో తదితర ప్రముఖ సంస్థలు వరుస కట్టాయి. అలాగే వన్‌ప్లస్, వివో, లెనోవో, ప్యానాసోనిక్, మోటరోలా వీటికి తోడయ్యాయి. ఫలితం.. గడచిన ఏడాదిలో చైనా కంపెనీల వాటా ఏకంగా 12 నుంచి 22 శాతానికి చేరినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) వెల్లడించింది. అంతేకాదు! 2015లో బ్రాండింగ్‌కు, ప్రకటనలకే చైనా కంపెనీలు రూ.1,200 కోట్ల దాకా వెచ్చించాయి. వీటిలో వివో, ఓపో, జియోనీ, ఎల్ఈ ఎకో 55% ఖర్చు చేశాయి. వివో ఏకంగా ఐపీఎల్‌కే ప్రధాన స్పాన్సర్‌గా మారింది. దేశీ బ్రాండ్లయిన సెల్కాన్, కార్బన్, వీడియోకాన్, లావా, ఇంటెక్స్ కూడా మెల్లగా తమ వాటా పెంచుకుంటూ పోతున్నాయి. ఈ పరిణామాలన్నీ మైక్రోమ్యాక్స్‌ను తిరోగమన బాట పట్టేలా చేశాయి. సర్వీసింగ్‌లో విఫలం..! ఒకప్పుడు మైక్రోమ్యాక్స్ బలం దాని విక్రయానంతర సేవలే. ఇపుడు అవి సరిగా లేకపోవటమే దాని బలహీనతగా మారింది. ఈ మధ్య కాలంలో కంపెనీ భారీగా మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. వీటిలో నాణ్యత కొరవడిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ‘‘ఏ కంపెనీకైనా విక్రయానంతర సేవలే బలం. వాటిలో మైక్రోమ్యాక్స్ విఫలమైంది’’ అని మొబైల్స్ విక్రయ సంస్థ టెక్నోవిజన్ ఎండీ సికందర్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోతో చెప్పారు. ఒకప్పుడు అంతర్జాతీయ బ్రాండ్ల ధరతో పోలిస్తే సగం ధరకే మోడళ్లను కంపెనీ తెచ్చిందని, తక్కువ ధరకే అధిక ఫీచర్లున్న ఫోన్లు వస్తున్నాయి కదా అని కస్టమర్లు కొన్నారని ఆయన చెప్పారు. ‘‘నాణ్యత లేదు. సర్వీసింగ్ కేంద్రాల్లో కస్టమర్లు క్యూ కడుతున్నారు. మొబైల్లో చిన్న సమస్య వచ్చినా, పరిష్కారానికి రోజుల కొద్దీ వేచి చూడాల్సి వస్తోంది. అమ్మకాలపై చూపిన శ్రద్ధను సర్వీసింగ్‌పై కంపెనీ చూపడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. పెద్ద కంపెనీల ధరల మంత్రం.. నిజానికి మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీల విజయ రహస్యం ధరలే. కానీ ఇపుడు శామ్సంగ్తో పాటు చైనా కంపెనీలన్నీ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. శామ్సంగ్ ఇటీవల తక్కువ ధరలో స్మార్ట్ఫోన్లను తీసుకురాగా... ఇన్ఫోకస్ బ్రాండ్‌తో ఫాక్స్‌కాన్ కూడా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. చైనా బ్రాండ్లన్నీ అధిక ఫీచర్లతో అందుబాటు ధరలో మోడళ్లను తెస్తుండటంతో ఆ ప్రభావం మైక్రోమ్యాక్స్కే గట్టిగా తగిలింది. మున్ముందు ఈ కంపెనీకి తీవ్ర పోటీ తప్పదని కౌంటర్‌పాయింట్ రిసర్చ్ అనలిస్ట్ తరుణ్ పాఠక్ చెప్పారు. 2015 చివరి త్రైమాసికంలో మొబైల్ పరిశ్రమ 15.4% పెరగ్గా మైక్రోమ్యాక్స్ విక్రయాలు 12% తగ్గాయని ఐడీసీ వెల్లడించింది. డిసెంబర్ క్వార్టర్లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దేశంలో శామ్సంగ్కు 26.8%, మైక్రోమ్యాక్స్ 14.1, లెనోవో గ్రూప్ 11.6, ఇంటెక్స్ 9.4, లావా 7, ఇతర కంపెనీలు 31.1% వాటా ఉంది. వాటా కొనలేదు... ఐపీఓ రాలేదు ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా... మైక్రోమ్యాక్స్‌లో 20 శాతం వాటా కొనుగోలు చేయాలని భావించినా ఒప్పందం బెడిసి కొట్టింది. జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ నుంచి రుణం పొందే ప్రయత్నాలు కూడా విజయవంతం కాలేదు. అంతెందుకు! పబ్లిక్ ఇష్యూకు రావటానికి ఈ సంస్థ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. గతంలో ఓ సారి మైక్రోమాక్స్ సంస్థ సెబీకి ప్రాస్టెక్టస్ కూడా దాఖలు చేసింది. కానీ ఐపీఓ ఆగిపోయింది. వీటన్నిటికీ తోడు సంస్థలో కీలక వ్యక్తులుగా ఉన్న సీఈవో వినీత్ తనేజా, చైర్మన్ సంజయ్ కపూర్లు దూరం కావడమూ గట్టిదెబ్బే. కంపెనీకి, సంజయ్‌కి మధ్య నడుస్తున్న వివాదం బాగా ముదురుతోంది. తనను చట్ట విరుద్ధంగా తొలగించారని చెబుతున్న సంజయ్... అందుకు రూ.600-700 కోట్లు పరిహారం చెల్లించాలంటూ మైక్రోమ్యాక్స్పై దావా వేసే అవకాశం కనిపిస్తోంది. -
‘ఈ-కామర్స్’ ఫిర్యాదులపై కమిటీ
15 రోజుల్లో నివేదిక న్యూఢిల్లీ: ఈ-కామర్స్ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నది. ఈ కామర్స్ జోరుగా పెరుగుతోందని, అలాగే వినియోగదారుల ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయని, దీని నివారణ కోసం త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారు. ఆర్డర్ చేసిన వస్తువులు రాకపోవడం, సకాలంలో వస్తువులు డెలివరీ కాకపోవడం, నాణ్యత లేని వస్తువులు డెలివరీ కావడం తదితర సమస్యలు ఆన్లైన్ కొనుగోళ్లలో జరుగుతున్నాయని వివరించారు. ఇక్కడ జరిగిన సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్(సీసీపీసీ) 30వ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించామని, ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. ఈ కమిటీ సూచనలను ప్రతిపాదిత వినియోగదారుల రక్షణ బిల్లులో పొందుపరుస్తామని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ బిల్లుపై పార్లమెంటరీ స్థాయి సంఘం కసరత్తు చేస్తోందని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తన నివేదికను సమర్పిస్తుందని వివరించారు. -
అమెజాన్‌తో 14 వేల ఉద్యోగాలు
- నగరంలో భారీ క్యాంపస్ ఏర్పాటు - శంకుస్థాపన చేసిన కేటీఆర్ - 10 ఎకరాల్లో.. రూ.1,400 కోట్లతో నిర్మాణం - అమెరికా తర్వాత అమెజాన్‌కు ఇదే అతిపెద్ద కేంద్రం - 2019 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి.. - త్వరలో యాపిల్, గూగుల్ కార్యాలయాలు: కేటీఆర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ సంస్థ నగరంలో భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది. నానక్‌రామ్‌గూడలోని ఐటీ, ఐటీఈఎస్ సెజ్ వద్ద నిర్మిస్తున్న ఈ క్యాంపస్‌కు మంత్రి కె.తారకరామారావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ క్యాంపస్ ద్వారా ప్రత్యక్షంగా 14,000 మందికి ఉపాధి లభించనున్నట్లు అంచనా. అమెజాన్ క్యాంపస్ కోసం ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అందులో భారత్‌తో పాటు అంతర్జాతీయ కార్యకలాపాలకు బ్యాక్ ఆఫీస్‌గా ఉండటం కోసం రూ.1,400 కోట్లతో 28 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అమెజాన్ కార్యాలయాన్ని నిర్మిస్తోంది. అమెరికా తరువాత అమెజాన్ సంస్థకు ఇదే అతి పెద్ద కేంద్రం కావడం గమనార్హం. నగరానికి సమీపంలోని కొత్తూరు వద్ద 2.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అమెజాన్ భారీ గిడ్డంగిని నిర్మించిన సంగతి తెలిసిందే. ఏడాదిలోపే మరోసారి తెలంగాణలో భారీ పెట్టుబడులకు ఆ సంస్థ ముందుకు రావ డం విశేషం. 2019లో ఈ క్యాంపస్ పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. ఇందులో ప్రత్యక్షంగా 14,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. జూన్‌లో యాపిల్ రాక..: రాష్ట్రంలో అమెజాన్ అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుండటంతో ఇది మరిన్ని ఈ-కామర్స్, ఐటీ కంపెనీలు రావటానికి దోహదపడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో ఐటీ, ఐటీఈఎస్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందనటానికి ఇది సూచన. రాష్ట్రంలో పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు ఈ-కామర్స్ కంపెనీల కోసం నియంత్రణపరమైన అడ్డంకులను తొలగించాం. స్థానిక చేతివృత్తుల ఉత్పత్తులను కూడా అమెజాన్‌లో విక్రయించేలా ఆ సంస్థతో కలసి పనిచేస్తున్నాం. ఈ సంస్థతో దీర్ఘకాలిక బంధాన్ని కొనసాగిస్తాం. హైదరాబాద్‌లో గూగుల్ కొత్త క్యాంపస్‌కు మే లేదా జూన్‌లో శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కూడా హైదరాబాద్‌లో ప్రతిపాదిత టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనుంది. అది కూడా జూన్‌లో జరిగే అవకాశం ఉంది...’’ అని చెప్పారు. కాగా సంస్థ పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్య దేశాల్లో భారత్ ఒకటని అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ జపోస్కీ చెప్పారు. కంపెనీ ఐటీ కార్యకలాపాలకు 2005 నుంచి తెలంగాణ కేంద్ర బిందువైందని పేర్కొన్నారు. నాణ్యమైన మానవ వనరులు, మౌలిక వసతులు, ప్రగతిశీల ప్రభుత్వం.. వీటన్నిటివల్లే ఈ భారీ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
ఈ-కామర్స్‌లోకి మరిన్ని ఎఫ్‌డీఐలు
♦ ‘మార్కెట్ ప్లేస్’ సంస్థల్లోకి ♦ 100% ఆటోమేటిక్ అనుమతులు ♦ ఈ-కామర్స్‌పై డీఐపీపీ మార్గదర్శకాలు న్యూఢిల్లీ: రిటైల్ ఈ-కామర్స్ విభాగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ఆకర్షించే దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘మార్కెట్ ప్లేస్’ తరహా రిటైల్ కార్యకలాపాలు సాగించే ఈ-కామర్స్ సంస్థల్లో ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం పెట్టుబడులను అనుమతిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. అమెజాన్, ఈబే తదితర విదేశీ దిగ్గజాలు.. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి దేశీ కంపెనీలకు ఇది ఊతమివ్వనుంది. పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ-కామర్స్‌పై స్పష్టతనిచ్చేలా మార్కెట్ ప్లేస్, ఇన్వెంటరీ ఆధారిత మోడల్స్‌లో లావాదేవీలు నిర్వహించే సంస్థలను, వాటి కార్యకలాపాలను ఇందులో నిర్వచించింది. ప్రస్తుతం ఆన్లైన్లో వ్యాపార సంస్థల మధ్య క్రయ, విక్రయాలకు(బి2బి) వెసులుబాటునిచ్చే ఈ-కామర్స్ సంస్థల్లో మాత్రమే 100% దాకా ఎఫ్‌డీఐలకు ఆటోమేటిక్‌గా అనుమతిస్తున్నారు. సాధారణ వినియోగదారులకు విక్రయాలు జరిపే(బి2సి) ఈ-కామర్స్ సంస్థల్లో ఎఫ్‌డీఐలకు నిర్దిష్ట పరిమితులు పెట్టారు. దేశీ ఆన్లైన్ రిటైలర్లు ఎఫ్‌డీఐలను సులువుగా సమీకరించేందుకు తాజా మార్గదర్శకాలు తోడ్పడనున్నాయి. స్పష్టత వచ్చింది..: భారత్‌లో ఈ-కామర్స్ పరిశ్రమ శరవేగంగా 60% వృద్ధి రేటుతో ఎదిగింది. 2016లో పరిశ్రమ పరిమాణం 38 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, 2020 నాటికి 50 బిలియన్ మార్కును దాటొచ్చని అంచనా. ఈ నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు దేశీ ఈ-కామర్స్ పరిశ్రమపై స్పష్టతనిచ్చాయని స్నాప్‌డీల్ పేర్కొంది. భారత్‌లో ఈ-కామర్స్ వృద్ధికి ఇవి తోడ్పడగలవని ట్యాక్స్ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. అయితే విక్రేత అమ్మకాలపై 25% పరిమితుల విషయంలో ఆపరేటర్లు కాస్త కసరత్తు చేయాల్సి ఉం టుందని పీడబ్ల్యూసీ పార్ట్నర్ ఆకాశ్ గుప్త్ తెలిపారు. మార్గదర్శకాలు ఇవీ... ఈ-కామర్స్, ఇన్వెంటరీ ఆధారిత విధానం, మార్కెట్ ప్లేస్ విధానాలను డీఐపీపీ స్పష్టంగా నిర్వచించింది. వస్తువులు, సేవలను డిజిటల్, ఎలక్ట్రానిక్ నెట్వర్క్ ద్వారా అమ్మడం, కొనడాన్ని ‘ఈ-కామర్స్’గా పేర్కొంది. విక్రేత, కొనుగోలుదారుల మధ్య క్రయవిక్రయ లావాదేవీలకు వెసులుబాటునిస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లాట్‌ఫాంను అందించే విధానాన్ని ‘మార్కెట్ ప్లేస్’ తరహాగా తెలిపింది. ఇక, ఈ-కామర్స్ సంస్థ స్వయంగా సర్వీసులు, సరుకులను నిల్వ చేసుకుని, కొనుగోలుదారులకు నేరుగా విక్రయించిన పక్షంలో దాన్ని ‘ఇన్వెంటరీ ఆధారిత’ విధానంగా పరిగణించ నున్నట్లు వివరించింది. ♦ మార్గదర్శకాల ప్రకారం ఈ-కామర్స్ సంస్థ ప్లాట్‌ఫాంపై ఏ ఒక్క వెండార్/గ్రూప్ కంపెనీల అమ్మకాలు 25% మించి ఉండకూడదు. మార్కెట్‌ప్లేస్ విధానంలో వస్తువులు, సర్వీసులను విక్రయించే సంస్థల పేరు, చిరునామా, ఇతర వివరాలన్నీ వెబ్సైట్లో పొందుపర్చాలి. ♦ విక్రయానంతరం సంతృప్తికరంగా కస్టమర్లకు చేరవేయడం విక్రేత బాధ్యతగా ఉంటుంది. వారంటీ/గ్యారంటీ బాధ్యత కూడా సెల్లర్దే ఉంటుంది. ♦ మార్కెట్‌ప్లేస్ ఈ-కామర్స్ సంస్థలు సదరు ఉత్పత్తులు, సర్వీసుల ధరలను ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ప్రభావితం చేయకూడదు. విక్రయించే సంస్థలన్నింటికీ సమాన అవకాశాలు కల్పించాలి. ♦ విక్రేతలకు కావాలంటే గిడ్డంగులు, రవాణా, కాల్ సెంటర్, పేమెంటు కలెక్షన్ తదితర సర్వీసులను ఈ-కామర్స్ సంస్థలు అందించవచ్చు. అయితే అంత మాత్రం చేత సదరు ఉత్పత్తులపై వాటికి యాజమాన్య హక్కులు దఖలుపడవు. ఒకవేళ ఆ విధంగా చేస్తే దాన్ని ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ సంస్థగా కాకుండా ఇన్వెంటరీ ఆధారిత సంస్థగా పరిగణిస్తారు. ఇలాంటి వాటిల్లోకి ఆటోమేటిక్ పద్ధతిలో 100% ఎఫ్‌డీఐల రాకకు అనుమతి ఉండదు. -
యూనిఫామ్స్ బిజినెస్ లోకి మఫత్‌లాల్
‘ఈ కామర్స్’లోనూ అందుబాటు... ముంబై: అరవింద్ మఫత్‌లాల్ గ్రూప్‌కు చెందిన మఫత్‌లాల్ ఇండస్ట్రీస్ రెడీమేడ్ స్కూల్, కార్పొరేట్ యూనిఫామ్ దుస్తుల సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఈ సెగ్మెంట్లో ఐదేళ్లలో రూ.500 కోట్ల వ్యాపారం సాధించడం లక్ష్యమని మఫత్‌లాల్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్) ఎం.బి.రఘునాధ్ చెప్పారు. కార్పొరేట్ రేడిమేడ్ యూనిఫార్మ్ వ్యాపారంలో ఈ ఏడాది రూ.75 కోట్ల టర్నోవర్ సాధిస్తామని అంచనాలున్నాయని పేర్కొన్నారు. భారత యూనిఫార్మ్ మార్కెట్ రూ.8,000 కోట్లని, ప్రతి ఏడాది 10 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోందని వివరించారు. తమ యూనిఫార్మ్ ఉత్పత్తులు మఫత్‌లాల్ ఫ్యామిలీ షాప్‌లు, యూనిఫార్మ్ స్టోర్స్, ఇతర రిటైల్ అవుట్‌లెట్లలలో కూడా లభిస్తాయని పేర్కొన్నారు. యూనిఫార్మ్స్ కోసం ఈ కామర్స్ సైట్‌ను కూడా ప్రారంభించామని తెలిపారు. ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌కు ఈ ఈ కామర్స్ సైట్ సర్వీస్ ప్రొవైడర్‌గా కూడా వ్యవహరిస్తుందని వివరించారు. వివిధ రకాల వస్త్రాలను 1905 నుంచి విక్రయిస్తున్న మఫత్‌లాల్ ఇండస్ట్రీస్ ఏడాదికి 8.5 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తులను అమ్ముతోంది. -
ఇమ్వాంటేజ్ పేమెంట్స్.. అమెజాన్ పరం
ముంబై: ఆన్లైన్ చెల్లింపుల సేవలందించే ఇమ్వాంటేజ్ పేమెంట్స్ కంపెనీని ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీ కొనుగోలు కారణంగా వినియోగదారులు చెల్లింపులు మరింత సులభతరం అవుతాయని అమెజాన్ పేర్కొంది. అయితే ఈ కంపెనీ కొనుగోలుకు ఎంత ధర వెచ్చించింది అమెజాన్ వెల్లడించలేదు. ఈ డీల్‌లో భాగంగా ఇమ్వాంటేజ్ ఉద్యోగులు అమెజాన్‌కు చెందిన చెల్లింపుల విభాగంలో చేరతారని అమెజాన్ పేమెంట్స్ ఇండియా డెరైక్టర్ శ్రీనివాస్ రావు చెప్పారు. వీరితో కలసి తమ చెల్లింపుల విభాగం ఉద్యోగులు మరింత వినూత్నమైన చెల్లింపుల సొల్యూషన్లను అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. వచ్చే నెల చివరికల్లా ఈ డీల్ పూర్తవుతుందని తెలిపారు. -
2020 నాటికి 50 బిలియన్ డాలర్లకు భారత్ ఈ-కామర్స్!
ముంబై: భారత్‌లో ఈ-కామర్స్ మార్కెట్ పరిమాణం 2020 నాటికి 40-50 బిలియన్ డాలర్లకు చేరనున్నది. ప్రస్తుతం ఇది 8-12 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో ఈ-కామర్స్ మార్కెట్లో ట్రావెల్ విభాగం 60 శాతం వాటాను, ఎలక్ట్రానిక్స్ 30 శాతం వాటాను ఆక్రమించే అవకాశముంది. ఈ విషయాలు బోస్టాన్ కన్సల్టింగ్ గ్రూప్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాల సంయుక్త నివేదికలో వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం.. డిజిటల్ రిటైల్ వృద్ధి ప్రధానంగా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని, ప్రస్తుతం 26 కోట్లుగా ఉన్న యూజర్ల సంఖ్య 2020 నాటికి 65 కోట్లకు పెరిగే అవకాశముంది. ఇదే సమయంలో పట్టణ ప్రాంత యూజర్లు 12 కోట్లకు చేరవచ్చు. అలాగే మహిళా యూజర్ల వాటా కూడా 29 శాతం నుంచి 40 శాతానికి పెరిగే అవకాశం ఉంది. -
మోగ్లిక్స్ లో రతన్ టాటా పెట్టుబడులు
న్యూఢిల్లీ: స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడుల పరంపరను కొనసాగిస్తూ.. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా మరో సంస్థ మోగ్లిక్స్లో ఇన్వెస్ట్ చేశారు. పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించి ఈ-కామర్స్ కంపెనీ అయిన మోగ్లిక్స్ను 2015 ఆగస్టులో గూగుల్ మాజీ ఉద్యోగి రాహుల్ గర్గ్ ప్రారంభించారు. మోగ్లిక్స్ ఇటీవలే యాక్సెల్ పార్ట్నర్స్, జంగిల్ వెంచర్స్ తదితర ఫండ్స్ నుంచి నిధులు సమీకరించింది. సంస్థ వ్యాపార వృద్ధి, విస్తరణ తదితర అంశాల్లో రతన్ టాటా తగు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఆయన ఈ ఏడాది ఇప్పటిదాకా డాగ్‌స్పాట్‌డాట్‌ఇన్, ట్రాక్సన్, క్యాష్‌కరో, ఫస్ట్‌క్రై, టీబాక్స్ మొదలైన అయిదు సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారు.