ముంబై: దేశీ ఈ–కామర్స్ మార్కెట్ వచ్చే ఏడాది 50 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించనుంది. ఇంటర్నెట్ వినియోగం, ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతుండటం ఇందుకు తోడ్పడనుంది. దేశీ డిజిటల్ కామర్స్ మార్కెట్ ప్రస్తుతం 38.5 బిలియన్ డాలర్లుగా ఉంది. పరిశ్రమల సమాఖ్య అసోచామ్–కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం 2013లో 13.6 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఈ–కామర్స్ మార్కెట్ 2015లో 19.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొబైల్స్.. ఇంటర్నెట్ వినియోగం, ఎం–కామర్స్ అమ్మకాలు పెరగడం, రవాణా.. చెల్లింపులకోసం అత్యాధునిక ఆప్షన్స్ అందుబాటులో ఉండటం, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మొదలైనవి ఈ–కామర్స్ అసాధారణ వృద్ధికి ఊతమిస్తున్నాయని నివేదిక వివరించింది.
సీవోడీకే ప్రాధాన్యం..
►ఆన్‌లైన్ చెల్లింపులకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సురక్షితమైన విధానాలను అందుబాటులోకి తెచ్చినా .. కొనుగోలుదారులు ఎక్కువగా క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) విధానాన్నే ఎంచుకుంటున్నట్లు వెల్లడైంది.
► ఆన్‌లైన్ చెల్లింపు విధానాలపై నమ్మకం లేకపోవడం, క్రెడిట్.. డెబిట్ కార్డుల వినియోగం తక్కువగా ఉండటం, భద్రతపరమైన అంశాలపై సందేహాలు మొదలైనవి ఇందుకు కారణం.
►50 శాతం పైచిలుకు ఆన్‌లైన్ లావాదేవీలు సీవోడీ విధానంలోనే ఉంటున్నాయి. మరోవైపు ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో ప్రతి ముగ్గురు కస్టమర్లలో ఒకరు మొబైల్స్ ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారని, మొబైల్ లావాదేవీల పెరుగుదలకు ఇది నిదర్శనమని నివేదిక పేర్కొంది.
►ఆన్‌లైన్ షాపర్స్‌లో 65% మంది పురుషులే ఉంటుండగా, 35% మహిళలు ఉంటున్నారు.
►2017లో అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తుల్లో మొబైల్ ఫోన్స్, దుస్తులు, ఆహార ఉత్పత్తులు, ఆభరణాలు మొదలైనవి ఉన్నాయి.
► తరచూ షాపింగ్ చేసే వారిలో 28 శాతం మంది 18–25 సంవత్సరాల మధ్య వయస్సుగలవారు కాగా, 42 శాతం మంది 26–35 సంవత్సరాల గ్రూప్‌లో ఉన్నా రు. 36–45 సంవత్సరాల గ్రూప్ వారు 28 శాతం మంది, 45–60 ఏళ్ల మధ్య వారు 2% మంది ఉంటున్నారు.
ఈ–కామర్స్ మార్కెట్@ 50 బిలియన్ డాలర్లు
Published Tue, Dec 26 2017 1:02 AM | Last Updated on Tue, Dec 26 2017 1:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment