
ముంబై: రుణ ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్‌ఆర్‌ఎల్)పై దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ బుధవారం ఆదేశించింది. ఈ విషయంలో ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది.
రూ.3,495 కోట్ల రుణ డిఫాల్ట్‌ల నేపథ్యంలో కంపెనీకి వ్యతిరేకంగా దివాలా పరిష్కార ప్రక్రియను కోరుతూ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఏప్రిల్‌లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బీఓఐ కుమ్మక్కై ఈ పిటిషన్ దాఖలు చేసిందని అమెజాన్ పేర్కొంది.
బ్యాంక్ పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ ఆమోదిస్తే, ఫ్యూచర్ రిటైల్‌కు సంబంధించి తమ న్యాయ పోరాట ప్రయోజనాలు దెబ్బతింటాయని ఈ కామర్స్ దిగ్గజం వాదించింది.
Comments
Please login to add a commentAdd a comment