న్యూఢిల్లీ: కాగిత పరిశ్రమ అభివృద్ధికి ఈ–వాణిజ్యం కొత్త బాటలు వేస్తోందని పేపర్‌ఎక్స్ ప్రదర్శనలో పాల్గొన్న సంస్థలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. కాలుష్యం కారణంగా చైనాలో చిన్నస్థాయి ప్యాకేజింగ్ సంస్థలపై నిషేధం విధించడంతో ఈ–వాణిజ్య కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయని ఎన్‌ఆర్ అగర్వాల్ ఇండస్ట్రీస్ ఎండీ ఆర్‌ఎన్ అగర్వాల్‌అన్నారు. రీసైక్లింగ్ ప్యాకేజింగ్‌లో ఏటా డిమాండ్ 9.5 శాతం పెరుగుతోందని సెంచురీ పేపర్ సీఈఓ ఎంజేపీ నరైన్ తెలిపారు. పేపర్ రీసైక్లింగ్‌కు అవకాశం ఉండటంతో అభివృద్ధి చెందిన దేశాలు కాగితాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నాయని ఐటీఈ ఇండియా డైరెక్టర్ సంజీవ్ బాత్రా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment