షీఇన్‌లో రిలయన్స్‌ ఉత్పత్తులు  | Reliance Retail has launched Shein India Fast Fashion app | Sakshi
Sakshi News home page

షీఇన్‌లో రిలయన్స్‌ ఉత్పత్తులు 

Published Sun, Feb 9 2025 6:05 AM | Last Updated on Sun, Feb 9 2025 6:05 AM

Reliance Retail has launched Shein India Fast Fashion app

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ వేదిక అయిన షీఇన్‌ ఇండియా ఫాస్ట్‌ ఫ్యాషన్‌ యాప్‌లో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ అనుబంధ కంపెనీ నెక్ట్స్‌జెన్‌ ఫాస్ట్‌ ఫ్యాషన్‌ తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. భారత్‌కు చెందిన రెడీమేడ్స్‌ తయారీ కంపెనీల నుంచి ఈ ఉత్పత్తులను నెక్సŠట్‌జెన్‌ కొనుగోలు చేస్తోందని పరిశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలు వీటిలో ఉన్నాయని చెప్పారు. 

అయిదేళ్ల నిషేధం తర్వాత రిలయన్స్‌ రిటైల్‌ ద్వారా షీఇన్‌ భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించింది. ‘కొత్త షీఇన్‌ ఇండియా ఫాస్ట్‌ ఫ్యాషన్‌ యాప్‌ భారత్‌లో రూపుదిద్దుకుంది. దీని యాజమాన్యం, నియంత్రణ ఎల్లప్పుడూ రిలయన్స్‌ రిటైల్‌ చేతుల్లోనే ఉంటుంది. భారత కంపెనీలో షీఇన్‌కు వాటా లేదు. భారత్‌ నుంచి అప్లికేషన్‌ను నడిపిస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి వచి్చన షీఇన్‌ ఇండియా ఫాస్ట్‌ ఫ్యాషన్‌ యాప్‌తో షీఇన్‌ గతంలో నిర్వహించిన షీఇన్‌.ఇన్‌ వెబ్‌సైట్‌తో సంబంధం లేదు’ అని ఆయన చెప్పారు.  

అయిదేళ్ల నిషేధం తర్వాత.. 
రిలయన్స్‌ రిటైల్‌ నుండి షీఇన్‌ ఇండియా ఫాస్ట్‌ ఫ్యాషన్‌ యాప్‌ ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌లో 10,000కి పైగా డౌన్‌లోడ్స్‌ నమోదయ్యాయి. యాపిల్‌ స్టోర్‌లో ఫ్యాషన్‌ ఈ–కామర్స్‌ కంపెనీల్లో టాప్‌ 10లో స్థానం పొందింది. చైనాతో ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత జూన్‌ 2020లో ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిషేధించిన యాప్‌లలో షీఇన్‌ ఒకటి. 

భారత్‌లో దాదాపు మూడు సంవత్సరాల నిషేధం తర్వాత బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ రిటైల్‌తో షీఇన్‌ను ప్రమోట్‌ చేస్తున్న రోడ్‌గెట్‌ బిజినెస్‌ 2023లో భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్వదేశీ ఈ–కామర్స్‌ రిటైల్‌ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడానికి రోడ్‌గెట్‌ బిజినెస్‌తో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ సాంకేతిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టెక్స్‌టైల్స్‌ మంత్రిత్వ శాఖ నుంచి వచి్చన అభ్యర్థన మేరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించిన అనంతరం ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ ప్రతిపాదనపై ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని పరిశ్రమ ప్రతినిధి వివరించారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement