సౌందర్య ప్రియులు,బ్యూటీ ఇండస్ట్రీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రముఖ కొరియన్ చర్మ సంరక్షణ మేకప్ సంచలనం టిర్‌టిర్( TIRTIR) ఇండియాలో లాంచ్ అయింది. రిలయన్స్ రిటైల్‌కు చెందిన టిరాతో కలిసి ఇది ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. భారతీయ బ్యూటి ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని రిలయన్స్ ప్రకటించింది. Tira స్టోర్‌లు, Tira యాప్ ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ సందర్బంగా కొనుగోలుదారులకు ఆఫర్లను కూడా అందిస్తోంది.
ముఖ్యంగా మాస్క్ ఫిట్ రెడ్ కుషన్ ఫౌండేషన్,ఆకట్టుకునే 30 షేడ్స్‌తో తీసుకొచ్చింది. మిల్క్ స్కిన్ టోనర్, సిరామిక్ మిల్క్ ఆంపౌల్, మాస్క్ ఫిట్ మేకప్ ఫిక్సర్ లాంటి అద్భుతమైన ఉత్పత్తులను లాంచ్ చేసినట్టు కంపెనీ తెలిపింది.
చర్మ సంరక్షణ-జాగ్రత్తలు
ఏ సీజన్‌లో అయినా చర్మ ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం. చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు జాగ్రత్తలు పాటించాలి.తాజా పండ్లు, కూరగాయలతోపాటు సరిపడా నీళ్లు తాగాలి. చర్మ సంరక్షణకు హైడ్రేటింగా ఉండటం, రిఫ్రెషింగ్ చాలా కీలకం.
చర్మం కాంతివంతంగా ప్రకాశించేలా ఉండాలంటే ఎండలో ఉన్నా, నీడలో ఉన్నా సన్ స్క్రీన్ లోషన్ వాడాలి.
దుమ్ముధూళికి దూరంగా ఉండాలి.
కెమికల్స్ వాడని సహజమైన సౌందర్య ఉత్పత్తులను వినియోగించాలి. నాణ్యమైన బ్రాండ్‌లను ఎంచుకోవాలి.
ఒత్తిడికి, ఆందోళనకు దూరంగా ఉండాలి.
మ్యాకప్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే మరిన్ని సమస్యలొచ్చే ప్రమాదం ఉంది.
బ్యూటీ నిపుణులు, స్కిన కేర్ వైద్య నిపుణుల సలహాల మేరకు ఉత్పత్తులను వాడాలి.
ఎప్పటికపుడు మేకప్‌ను రిమూవ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం
Comments
Please login to add a commentAdd a comment