Korean
-
దెబ్బకు రూట్ మార్చిన మెగా ప్రిన్స్
-
రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో కొరియన్ స్కిన్‌కేర్ & మేకప్ బ్రాండ్ ఎంట్రీ
సౌందర్య ప్రియులు,బ్యూటీ ఇండస్ట్రీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రముఖ కొరియన్ చర్మ సంరక్షణ మేకప్ సంచలనం టిర్టిర్( TIRTIR) ఇండియాలో లాంచ్ అయింది. రిలయన్స్ రిటైల్‌కు చెందిన టిరాతో కలిసి ఇది ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. భారతీయ బ్యూటి ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని రిలయన్స్ ప్రకటించింది. Tira స్టోర్లు, Tira యాప్ ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ సందర్బంగా కొనుగోలుదారులకు ఆఫర్లను కూడా అందిస్తోంది.ముఖ్యంగా మాస్క్ ఫిట్ రెడ్ కుషన్ ఫౌండేషన్,ఆకట్టుకునే 30 షేడ్స్‌తో తీసుకొచ్చింది. మిల్క్ స్కిన్ టోనర్, సిరామిక్ మిల్క్ ఆంపౌల్, మాస్క్ ఫిట్ మేకప్ ఫిక్సర్ లాంటి అద్భుతమైన ఉత్పత్తులను లాంచ్ చేసినట్టు కంపెనీ తెలిపింది.చర్మ సంరక్షణ-జాగ్రత్తలుఏ సీజన్లో అయినా చర్మ ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం. చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు జాగ్రత్తలు పాటించాలి. తాజా పండ్లు, కూరగాయలతోపాటు సరిపడా నీళ్లు తాగాలి. చర్మ సంరక్షణకు హైడ్రేటింగా ఉండటం, రిఫ్రెషింగ్ చాలా కీలకం. చర్మం కాంతివంతంగా ప్రకాశించేలా ఉండాలంటే ఎండలో ఉన్నా, నీడలో ఉన్నా సన్ స్క్రీన్ లోషన్ వాడాలి.దుమ్ముధూళికి దూరంగా ఉండాలి. కెమికల్స్ వాడని సహజమైన సౌందర్య ఉత్పత్తులను వినియోగించాలి. నాణ్యమైన బ్రాండ్లను ఎంచుకోవాలి.ఒత్తిడికి, ఆందోళనకు దూరంగా ఉండాలి. మ్యాకప్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే మరిన్ని సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. బ్యూటీ నిపుణులు, స్కిన కేర్ వైద్య నిపుణుల సలహాల మేరకు ఉత్పత్తులను వాడాలి.ఎప్పటికపుడు మేకప్‌ను రిమూవ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం -
స్క్విడ్ గేమ్ సిరీస్‌లో మన హీరోలు.. ఈ వీడియో చూశారా?
ఇటీవల విడుదలై ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోన్న వెబ్ సిరీస్ స్క్విడ్‌గేమ్-2(Squid Game-2) . గతంలో వచ్చిన సీజన్-1కు కొనసాగింపుగా ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అంతేకాదు స్క్విడ్ గేమ్ -3 కూడా త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే అది పొరపాటుగా పోస్ట్ చేశామని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు. ఈ కొరియన్ వెబ్ సిరీస్‌కు(web series) ఇండియాలోనూ ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. ఈ సిరీస్ అంతా ఆడియన్స్‌ను ఉత్కంఠకు గురి చేస్తుంది.అంతలా ఆదరణ దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్‌లో మన హీరోలు నటిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహా ఎంత బాగుందో కదా? మరి అదే నిజమైతే బాగుండని మీకు అనిపిస్తోంది కదా? అవును.. మన హీరోలు ఆ గేమ్‌ను ఎలా ఆడతారో అనే ఆసక్తి ప్రతి ఒక్క సినీ ప్రియుడికి ఉంటుంది. అందుకే అసాధ్యం కాని వాటిన సుసాధ్యం చేయొచ్చని మరోసారి నిరూపించారు. అదెవరో కాదండి.. అదే మానవాళికి సవాలు విసురుతోన్న ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్). తాజాగా ఏఐ సాయం రూపొందించిన స్క్విడ్ గేమ్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.ఈ వీడియోలో మన స్టార్ హీరోలు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, పవన్ కల్యాణ్, ప్రభాస్ వీరంతా కనిపించారు. అంతేకాకుండా బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు హీరోలు, కమెడియన్స్ సైతం ఈ స్క్విడ్‌గేమ్ వెబ్సిరీస్లోని పాత్రలతో వీడియోను రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చేసిన ఈ వీడియో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక అభిమాన హీరోల ఏఐ ఇమేజ్‌ల వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సొంతం చేసుకున్న వెబ్‌సిరీస్‌ల్లో స్క్విడ్ గేమ్ ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన స్క్విడ్‌గేమ్ సీజన్-2 ఓటీటీలో రికార్టులు సృష్టిస్తోంది. మొదటివారంలోనే అత్యధికంగా 68 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 92 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ర్యాకింగ్స్లో మొదటి స్థానంలో కొనసాగుతోంది.సీజన్-3పై అప్డేట్..స్క్విడ్ గేమ్ సీజన్-2కు (Squid Game Season-2) ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇటీవలే సీజన్-3 అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. కొత్త ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత పొరపాటున డేట్ రివీల్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు.స్క్విడ్ గేమ్ స్టోరీ ఏంటంటే..ఒక్కమాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఉహించలేం!జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్‌గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ. This is so good !! AI Generated !! 💥💥💥#SquidGameSeason2 ft #TFI pic.twitter.com/QqAyf3kTQ8— Priyanka Reddy - Rayalaseema 🌬 (@BerrySmile112) January 7, 2025 -
'ఎలిమినేట్ అయితే చంపేస్తారు'.. స్క్విడ్ గేమ్ ట్రైలర్ చూశారా?
2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్లో తెరకెక్కించిన ఈ సిరీస్ ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్‌కు దక్కిన ఆదరణతో స్క్విడ్ గేమ్ సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సీజన్-2 ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొదటి సీజన్ లాగే ఆర్థికంగా ఇబ్బందులు పడే కొంతమంది వ్యక్తులు.. డబ్బు సంపాదించడం కోసం ఈ గేమ్‌లో భాగమవుతారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.తెలుగులోనూ విడుదలైన ట్రైలర్ ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకుంటోంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్ వంటి గేమ్స్ ఈ సీజన్లో చూపించనున్నారు. ట్రైలర్లో సన్నివేశాలు, ప్రమాదకరమైన గేమ్స్ చూస్తుంటే హారర్ థ్రిల్లర్ లాంటి ఫీలింగ్ వస్తోంది. గేమ్‌లో పాల్గొన్న వారంతా ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ స్క్విడ్ గేమ్ సీజన్- 2 డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.అసలు ఈ స్క్విడ్ గేమ్ ఏంటంటే..జీవితంలో అప్పులపాలైన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్‌లైట్, గ్రీన్‌లైట్, టగ్ ఆఫ్ వార్ లాంటి చిన్నపిల్లలు ఆడుకొనే పోటీలు నిర్వహిస్తారు. ఇందులో మొత్తం సిక్స్ గేమ్స్ ఉంటాయి. చివరి గేమ్ పేరే స్క్విడ్ గేమ్. అయితే ఈ గేమ్స్‌లో ఓడిపోయిన వారిని ఎలిమినేషన్ పేరుతో చంపేస్తుంటారు. సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. -
కే–పాప్ కాంటెస్ట్‌లో విజేతలు వీరే..
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో కొరియన్ పాప్ సంగీతం(కే–పాప్)కు నగరంలోనూ క్రేజ్ పెరిగిన నేపథ్యంలో యువత ఆసక్తిని ప్రోత్సహించేందుకు కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియాతో కలిసి ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా నిర్వహించిన కే–పాప్ సంగీత పోటీల్లో కోల్‌కతాకు చెందిన అభిప్రియ చక్రవర్తి విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరం నుంచి పలువురు కే–పాప్ యూత్‌ను ఆకట్టుకున్న ఈ పోటీల్లో డ్యాన్సింగ్ విభాగంలో టైటిల్‌ను ది ట్రెండ్ ఫ్రమ్ ఇటానగర్ ఆల్బమ్ సొంతం చేసుకుందని, విజేతలకు కొరియా ట్రిప్‌ను బహుమతిగా అందించనున్నట్లు వివరించారు.అలరించిన.. సంగీత్ సమారోహ్ మాదాపూర్‌లోని సీసీఆర్టీ (సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్స్ ట్రైనింగ్)లో పండిత్ జష్రాజ్ 52వ పండిత్ మోతీరాం పండిత్ మనీరాం సంగీత్ సమారోహ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రిషి, మహిమా ఉపాధ్యాయులు పాకవజ డ్యూయోట్ను, నటి శోభన భరతనాట్య ప్రదర్శన, అభిషేక్ రఘురాం కర్ణాటక సంగీతంతో ఆకట్టుకున్నారు. పద్యనాటకం.. నటన అద్భుతం పురాకృతి దశమ వార్షికోత్సవాలు చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన పౌరాణిక పద్య నాటకాలు అలరించాయి. పాదుకా పట్టాభిషేకం, భక్త పోతన, శ్రీకృష్ణ రాయభారం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన సమావేశంలో కళాకారుడు ఉప్పలపాడు షేక్ సైదులుకు జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. అదే విధంగా ప్రముఖ నటులు మల్లాది గోపాలకృష్ణ, ఇందిరాదేవికు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు శ్రీహరిరావు, సాంబశివారెడ్డి, షేక్‌లాల్ అహ్మద్, పొత్తూరు సుబ్బారావు, నాగేశ్వర్రావు, కళ్యాణ్, మల్లాది వెంకటరమణ, పుట్రేవు పరివారం తదితరులు పాల్గొన్నారు. భగవద్గీతతో జీవన నిర్వహణగీతా సారాంశాన్ని అర్థం చేసుకోవడం, ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనడం, మానవ సంబంధాలను మెరుగుపర్చుకోవడం, సమతుల్యమైన జీవితాన్ని గడపడం వంటి అవసరమైన అంశాలపై ఆధ్యాత్మిక బోధనలను ఆధ్యాత్మిక గురువు సుఖబోధానంద స్వామి వివరించనున్నారు. ఈ నెల 30, వచ్చే నెల 1వ తేదీల్లో భగవద్గీతతో జీవన నిర్వహణ అనే అంశంపై రెండు రోజుల పాటు విశ్వేశ్వరయ్య భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
ప్రభాస్ సలార్ 2 లో కొరియన్ సూపర్ స్టార్..
-
'ఈ గేమ్ ఆడితే అందరం చస్తాం'.. భయపెట్టిస్తోన్న టీజర్!
ప్రస్తుతం సినీ ప్రియులు ఓటీటీలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సైతం సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ మరో క్రేజీ వెబ్ సిరీస్‌తో సిద్ధమైంది. 2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్లో తెరకెక్కించిన ఈ సిరీస్ ఇండియాలో క్రేజ్‌ను దక్కించుకుంది.ఈ వెబ్ సిరీస్ దక్కిన ఆదరణతో స్క్విడ్ గేమ్ సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సీజన్-2 టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగులోనూ విడుదలైన ఈ టీజర్ మరింత ఆకట్టుకుంటోంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్ వంటి గేమ్స్ ఈ సీజన్లో చూపించనున్నారు. టీజర్లో సన్నివేశాలు చూస్తుంటే హారర్ థ్రిల్లర్ లాంటి ఫీలింగ్ వస్తోంది. గేమ్‌లో పాల్గొన్న వారంతా ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ స్క్విడ్ గేమ్ సీజన్- 2 డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
కొరియన్ నోట భారతీయ సంగీతం..'ఔరా' అంటున్న నెటిజన్లు
‘సౌత్ ఇండియన్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఆసక్తి. పాటలు వింటాను. మ్యూజిక్ వీడియోలు చూస్తుంటాను’ అంటున్న కొరియన్ ఆర్టిస్ట్ ఔర సింగర్–సాంగ్ రైటర్ శిరీష భాగవతులతో కలిసి ‘థీ థీ తారా’ (కుట్టనాడన్ డ్రీమ్స్) ఆలపించాడు. గత సంవత్సరం చివరిలో బిగ్‌బాస్ సీజన్ 17లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా కనిపించాడు.ఈ సంవత్సరం ప్రారంభంలో ఝలక్ దిఖ్లా సీజన్ 11లో కూడా కనిపించాడు. ఈ క్రమంలో ఇండియన్ మ్యూజిక్‌పై లవ్ పెంచుకున్నాడు. ‘ఛలో’ ‘రోకో’లాంటి పదాలు పలుకుతున్న ఔర హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాడు.‘ఔరా ఉచ్చారణ చాలా భిన్నంగా ఉంటుంది. దీని కోసం ఐదు వారల పాటు పనిచేశాడు. అతడి అంకితభావం నాకు ఎంతగానో నచ్చింది’ అంటున్న శిరీష ఔరాను మన దేశంలోని ఇంటిపేరుగా అభివర్ణించింది. ‘మార్నింగ్ నూన్ ఈవెనింగ్’ ‘బ్లూ ఒషియన్’ ‘ఫైర్‌వర్క్’....ఇలాంటి ఎన్నో సింగిల్స్‌తో పేరు తెచ్చుకున్న ఔరా 2014లో బాయ్ బ్యాండ్ ఎఎతో కెరీర్ ప్రారంభించాడు. (చదవండి: ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయి ఐఏఎస్..కట్‌చేస్తే నేడు ఆమె..!) -
భారత షట్లర్లకు నిరాశ
సియోల్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. బరిలోకి దిగిన యువ షట్లర్లు అష్మిత చాలిహా, మాళవిక, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. బుధవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ 53వ ర్యాంకర్ అష్మిత 8–21, 13–21తో 17వ ర్యాంకర్ పోన్‌పావీ చోచువాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్ మాళవిక 21–18, 15–21, 17–21తో 18వ ర్యాంకర్ లిన్ హోజ్మార్క్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయింది. ఆకర్షి 15–21, 15–21తో లిన్ క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ఆయుశ్ రాజ్ గుప్తా–శ్రుతి జంట 7–21, 12–21తో కో సంగ్ హ్యాన్–ఇయోమ్ హ్యూ వోన్ (కొరియా) జోడీ చేతిలో ఓడింది. -
Unlocked Review: పోగొట్టుకున్న ఫోన్ సీరియల్ కిల్లర్‌కు దొరికితే!
ఈ రోజుల్లో కాసేపు ఊపిరి బిగపట్టుకుని ఉండమన్నా ఉంటారేమో కానీ సెల్‌ఫోన్ లేకుండా క్షణం ఉండలేరు. ప్రతిదాంట్లో మంచి చెడు ఉన్నట్లే దీనివల్ల కూడా ఉపయోగం, ప్రమాదం.. అన్నీ ఉన్నాయి. మన ఫోన్ అవతలి వ్యక్తి చేతిలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్టే అన్లాక్డ్.కథతింటున్నా, ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్తున్నా, షికారుకు వెళ్లినా, జర్నీ చేస్తున్నా, ఏం చేసినా సరే.. ప్రతీది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది నామీ. ఒకరోజు బస్‌లో తన ఫోన్ మర్చిపోతుంది. అది కాస్త సీరియల్ కిల్లర్‌కు దొరుకుతుంది. నిజానికి పాస్వర్డ్ తెలియకపోవడంతో అతడు ఏమీ చేయలేక కోపంతో ఫోన్‌ను పగలగొడతాడు. పొరపాటున ఫోన్ కిందపడి అద్దం పగిలిందని, బాగు చేసి ఇస్తానని అమ్మాయిని పిలుస్తాడు. ఆపై పాస్వర్డ్ చేప్పమని అడుగుతాడు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది.తన నిశ్శబ్ధమే..ఈ క్రమంలో అక్కడికి వచ్చిన నామీ తటపటాయిస్తూనే తన పాస్వర్డ్ చెప్తుంది. దీంతో అతడు ఆమె ఫోన్‌ను హ్యాక్ చేసి ఇచ్చేస్తాడు. తన ప్రతి కదలికను గమనిస్తుంటాడు. నెమ్మది నెమ్మదిగా ఆమె జీవితాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని తనకు సంతోషమనేదే లేకుండా చేస్తాడు. అయితే ఇక్కడ సీరియల్ కిల్లర్ ఎక్కువ నిశ్శబ్ధంగా ఉండటం వల్ల నెక్స్ట్ ఏం చేస్తాడన్న ఉత్సుకత కలగక మానదు.పాస్వర్డ్ అడగడమే విడ్డూరంసినిమాలో క్యారెక్టర్ల గురించి పెద్దగా పరిచయం చేయకపోవడంతో చివర్లో కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. పెద్ద ట్విస్టులు లేకుండా కథ ఒకే లైన్లో ముందుకు సాగుతుంది. అయితే ఫోన్ స్క్రీన్ మార్చడానికి పాస్వర్డ్ అక్కర్లేదు. అలాగే షాపులోని వ్యక్తి (సీరియల్ కిల్లర్)కి పాస్వర్డ్ రాసివ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ ఇక్కడ షాపువాడు ఫోన్ పాస్వర్డ్ అడగడం, ఆమె రాసిచ్చేయడం కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది.ఒక గంట 57 నిమిషాల నిడివి ఉన్న ఈ కొరియన్ థ్రిల్లర్ మూవీని ఓసారి చూసేయొచ్చు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. -
Sleep Movie Review: నిద్రతోనే భయపెట్టే సినిమా
టైటిల్: స్లీప్(కొరియన్ మూవీ)దర్శకత్వం: జాసన్ యూనిర్మాణ సంస్థ లోటే ఎంటర్టైన్మెంట్జోనర్: హారర్ థ్రిల్లర్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్(తెలుగులోనూ అందుబాటులో ఉంది)నిడివి: 95 నిమిషాలుహారర్ సినిమా అంటే మనందరికీ గుర్తొచ్చేది దెయ్యమే. ఆ సబ్జెక్ట్ లేకుండా హారర్ సినిమా తీయడం చాలా అరుదు. తెలుగు చాలా హారర్ చిత్రాలు వచ్చాయి. కానీ దెయ్యం ఎక్కడా కనిపించకుండా ఆడియన్స్‌ను భయపెట్టేలా సినిమాలు చాలా తక్కువే ఉంటాయి. అలాంటి సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన చిత్రమే స్లీప్. 2023లో వచ్చిన కొరియన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉండో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా మొత్త ఇద్దరు దంపతుల చుట్టే తిరుగుతుంది. సౌత్ కొరియాలో హైయోన్-సూ (లీ సన్-క్యున్), సూ-జిన్ (జంగ్ యు-మి) కొత్తగా పెళ్లి చేసుకుని ఓ ఫ్లాట్‌లో నివసిస్తుంటారు. ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తూ హాయిగా జీవనం సాగిస్తుంటారు. కానీ అనుకోకుండా ఓ రాత్రి జరిగిన సంఘటనతో వారి జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ సంఘటన తర్వాత సూ జిన్‌లో భయం మొదలవుతుంది. అసలు తన భర్త ఎందుకిలా చేస్తున్నాడో భయంతో వణికిపోతుంది.ఆ తర్వాత తన భర్త హయన్ సూతో కలిసి వైద్యుని సంప్రదిస్తుంది సూ జిన్. ఆ తర్వాత ఆమె భర్తకు ఉన్న విచిత్రమైన, భయంకరమైన వింత సమస్య గురించి ఆమెకు అసలు నిజం తెలుస్తుంది. దీంతో భర్తను కాపాడుకునేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నిస్తుంది. అసలు అతనికి ఏమైంది? భయంకరమైన డిజార్డరా? లేక దెయ్యం ఆవహించిందా?.. అలాగే వీరికి పుట్టిన బాబును ఎలా రక్షించుకుంది? అనేది తెలియాలంటే స్లీప్ ఓసారి చూడాల్సిందే. ఎలా ఉందంటే..స్లీప్.. హారర్ మూవీ అయినప్పటికీ డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్‌ను సినీ ప్రియులకు పరిచయం చేశాడు. దెయ్యాన్ని చూపించకుండానే ఆడియన్స్‌ను భయపడేలా చేశాడు. ఇందులో విచిత్రమైన డిజార్డర్‌ను పరిచయం చేస్తూ.. హారర్‌తో పాటు ఆడియన్స్‌లో సస్పెన్స్ క్రియేట్ చేశాడు. అతనికి ఉన్నది డిజార్డరా? లేక నిజంగానే దెయ్యం పట్టిందా? అన్న అనుమానాన్ని ఆడియన్స్‌లో రేకెత్తించాడు. అక్కడక్కడా మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించినా.. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌ను మరింత భయపెట్టేస్తాయి. కొన్ని సీన్స్ అయితే ఒళ్లు గగుర్పొడ్చేలా ఉన్నాయి. అలాగే చివర్లో వచ్చే డ్రిల్లింగ్ మిషన్ సీన్ చిన్నపిల్లలకు చూపించకపోవడం మంచిది. మొత్తంగా ఓటీటీలో సస్పెన్ష్ థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసే ఆడియన్స్ స్లీప్ చూసేయొచ్చు. -
ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలు మనకు బాగా అలవాటు అయిపోయాయి. ఎంతలా అంటే కొన్నాళ్ల ముందు వరకు తెలుగు సినిమాలు మాత్రమే మనోళ్లు చూసేవాళ్లు. ఇప్పుడు బాగుందని తెలిస్తే భాషతో సంబంధం లేకుండా ఏ మూవీని వదలట్లేదు. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ మూవీస్ తీసేది ఎవరని అడిగితే చాలామంది చెప్పే పేరు కొరియన్. థ్రిల్లర్, డ్రామా, యాక్షన్.. ఇలా ఏ జానర్ చిత్రాలు అయినా కొరియన్స్ బాగా తీస్తారనే పేరుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)అలా ఇప్పుడు పలు ఓటీటీల్లో ది బెస్ట్ అని చూసిన ప్రతి ఒక్కరూ అంటున్న కొన్ని కొరియన్ మూవీస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇంతకీ ఇవి ఏ ఓటీటీలో ఉన్నాయి. స్టోరీ లైన్ ఏంటనేది దిగువన లిస్టులో చూద్దాం.ఫర్గాటెన్ (2017) - ఇదో మిస్టరీ థ్రిల్లర్. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. గతం మరిచిపోయిన ఓ వ్యక్తి.. సొంత తమ్ముడినే కిడ్నాప్ చేస్తాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ.మెమొరీస్ ఆఫ్ మర్డర్ (2003) - ఇది మర్డర్ మిస్టరీ మూవీ. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఇద్దరు డిటెక్టివ్స్... వరస హత్యల గురించి ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. వాళ్లకు తెలిసిన నిజమేంటనేదే మెయిన్ స్టోరీ.ఐ సా ద డెవిల్ (2010) - ఇదో యాక్షన్ థ్రిల్లర్ సినిమా. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఓ ఊరిలో సంబంధం లేకుండా కొన్ని హత్యలు జరుగుతుంటాయి. ఇంతకీ ఎవరు చేస్తున్నారు? సీక్రెట్ ఏజెంట్ కనిపెట్టాడా లేదా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))ద గ్యాంగస్టర్ ద కాప్ ద డెవిల్ (2019) - ఇదో యాక్షన్ మూవీ, అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఓ సైకోని.. గ్యాంగస్టర్, పోలీస్ కలిసి ఎలా మట్టుబెట్టారనేదే స్టోరీ.ట్రెన్ టూ బుసాన్ (2016) - ఇది హారర్ మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. బుసాన్ అనే ఊరికి వెళ్లేందుకు ఓ వ్యక్తి, కూతురితో కలిసి ట్రైన్ ఎక్కుతాడు. కానీ అందులోని మనుషులు.. జాంబీలుగా మారి అందరినీ చంపేస్తుంటారు. మరి వీళ్లు బతికి బయటపడ్డారా లేదా అనేదే స్టోరీ.ద ఔట్ లాస్ (2017) - ఇది క్రైమ్ యాక్షన్ సినిమా. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. కొరియన్, చైనీస్ గ్యాంగ్స్ మధ్య గొడవ జరిగితే.. ఓ డిటెక్టివ్ దాన్ని ఎలా డీల్ చేసాడనేదే స్టోరీ.ద హ్యాండ్ మెయిడెన్ (2016) - ఇది రొమాంటిక్ థ్రిల్లర్. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. 1930ల్లో ఓ రాజకుమారి దగ్గర పనిచేయడానికి ఓ అమ్మాయి వెళ్తుంది. కానీ తర్వాతర్వాత ఊహించని సంఘటనలు జరుగుతాయి. అదే స్టోరీ. 18 ప్లస్ సీన్లు ఉంటాయి. ఒంటరిగానే చూడండి!.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా)పారాసైట్ (2019) - ఆస్కార్ గెలుచుకున్న కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఓ నిరుపేద ఫ్యామిలీ.. మాయమాటలు చెప్పి ఓ ధనవంతుల ఇంట్లో పనికి చేరుతారు. ఆ తర్వాత జరిగే సంఘటనల సమహారమే అసలు కథ.ద క్లాసిక్ (2003) - ఇది రొమాంటిక్ డ్రామా. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఓ కాలేజీ స్టూడెంట్‌కి పాత డైరీ దొరుకుతుంది. అందులో తన తల్లి ట్రాయాంగిల్ లవ్ స్టోరీ గురించి ఉంటుంది. చివరకు ఆ కుర్రాడికి ఏం తెలిసిందనేదే స్టోరీ.ఓల్డ్ బాయ్ (2003) - ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఏమి లేనీ ఓ ఖైదీకి అన్ని వసతులు సమకూర్చిన.. లేని పోని గొడవల్లో ఇరుక్కుంటాడు. చివరకు ఏమైందనేదే అసలు కథ.ద అడ్మైరల్ (2014) - ఇది పీరియాడికల్ యాక్షన్ మూవీ. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. కేవలం 13 యుద్ధనౌకలు ఉన్న ఓ యోధుడు.. 300 యుద్ధ నౌకలున్న జపాన్ యోధులతో ఎలా తలపడ్డాడనేదే స్టోరీ.ఏ ట్యాక్సీ డ్రైవర్ (2017) - ఇది యాక్షన్ కామెడీ మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. రియల్ లైఫ్ సంఘటనలతో తీసిన ఈ సినిమా ఓ సాధారణ ట్యాక్సీ డ్రైవర్, ఊహించని వివాదాల్లో చిక్కుకుంటే ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'ఈ-మెయిల్స్' వివాదంలో మంచు విష్ణు.. అసలేం జరిగిందంటే?) -
వెదురు సారంతో కొరియన్ గ్లాస్ చర్మం..!
కొరియన్ చర్మానికి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. పైగా అందుకు సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నాయి కూడా. అయితే అవన్నీ ఆ బ్రాండ్లకు తగ్గ రేంజ్ ధరల్లోనే ఉంటాయనేది తెలిసిందే. అలా కాకుండా మనకున్న అందుబాటులోని వనరులతో కూడా కొరియన్ గ్లాస్ చర్మాన్ని పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!వెదుర రసంతో కొరియన్ల లాంటి గ్లాస్ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. చక్కగా వారిలా ప్రకాశవంతమైన మచ్చలేని చర్మాన్ని సొంతం చేసుకోవచ్చట. వెదురు సారం ముఖాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తుందట. ఇందులో ఉండే సిలికాన్ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఖనిజంలా పనిచేస్తుంది. చర్మాన్ని దృఢంగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్ది వచ్చే సిలికా స్థాయిలు తగ్గుతాయి.ముడతలు వచ్చి చర్మం ఆకృతి మారిపోయి, వృధాప్య సంకేచ్చేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాంటివి రాకూడదంటే చర్మ సంరక్షణలో భాగంగా వెదురు సారాన్ని ముఖానికి అప్లై చేస్తే సిలికా స్థాయిలు పెరగడమే గాక యవ్వనవంతమైన మెరిసే చర్మ మీ సొంతం అవుతుంది. దీనిలో ఉండే హైడ్రేటింగ్, మాయిశ్చరైజింగ్ కారకాలు చర్మాన్ని బొద్దుగా , మృదువుగా చేస్తాయి. ఇందులో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మంలోని తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ముడతలు, గీతలు వంటివి పడకుండా ఉండేలా రిపేర్ చేస్తుంది. పొడి చర్మం వారికి ఈ వెదురుసారం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే చర్మంపై ఉండే మంట, చికాకులను దూరం చేస్తుంది. వెదురుసారం శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను కలిగి ఉంది. అకాల వృద్ధాప్యం, నీరసానికి దారితీసే కాలుష్యం, యూవీ కిరణాలు వంటి పర్యావరణ నష్టం నుంచి చర్మాన్ని రక్షించే యాంటీఆక్సిడిడెంట్లు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇది సహజ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. ఎర్రటి మెటిమలు, చికాకు వంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతేగాదు వెదురుసారంలో ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్లు ఉన్నాయి. ఇవి నిస్తేజంగా అయిపోయిన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, కోమలంగా మారుస్తుంది. ఈ వెదురుసారానికి హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, కలబంద వంటి ఇతర హైడ్రేటింగ్ పదార్థాలను జోడిస్తే మరింత తొందరగా కొరియన్ గ్లాస్ చర్మాన్ని పొందగలరని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఈ వెదురు సారం పొడిగా లేదా ద్రవ రూపంలో వినియోగించవచ్చు. దీన్ని మీకు ఇష్టమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులకు జోడించడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: అంతుపట్టని ఆ వ్యాధిని పది సెకన్లలో నిర్థారించిన పనిమనిషి..! షాక్‌లో వైద్యుడు) -
కే బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ కూతురు!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్ స్టన్నింగ్ లుక్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సార్ గ్లాస్‌లాంటి స్కిన్‌తో అత్యంత అందంగా ఉంటుంది. ఇప్పటికే ఆమె 2021లో అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ సెల్ఫ్ పోర్ట్రెయిట్ ప్రకటనల్లో కనిపించి మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడూ గ్లామర్ రంగంలో ఎంట్రీ ఇస్తూ..ప్రఖ్యాత భారతీయ కొరియన్ స్కిన్ కేర్ బ్రాండ్ లానీజ్ అంబాసిడర్‌గా వ్యవవహరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. సారా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ..ఆరోగ్యకరమైన మెరస్తున్న చర్మం కోసం లానీజ్ బ్రాండ్‌ని ఎంపిక చేసుకుని సరికొత్త ముఖంతో థ్రిల్‌గా ఉన్నాను. మీరు కూడా నాలాగే ప్రకాశవంతమైన చర్మంతో ఉండటానికి సిద్ధంగా ఉండండి అంటూ సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది. తాను ఆ బ్రాండ్ ఆవిష్కరణ, నిబద్ధతను అభినందిస్తున్నాని చెప్పింది. తాను కొంతకాలంగా ఈ ఉత్పత్తులను వినయోగిస్తున్నట్లు తెలిపింది. ప్రతి వ్యక్తి కాంతివంతంగా ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. తాను ఈ లానీజ్తో మరింత అందంగా కనిపించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చింది అని రాసుకొచ్చింది సారా. సారా గ్లామర్ పరంగా సింపుల్ మేకప్‌తో క్యూట్ లుక్‌తో సందడి చేస్తుంది. మస్కరాతో నిండిన కనురెప్పలతో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంది. పైగా అందమంతా గుది గుచ్చినట్లుగా ఉంటుంది సారా. అందుకు తగ్గట్లు ఆమె ధరించే డిజైన్‌వేర్‌లు ఆమె అందాన్ని మరింత ఇనమడింప చేస్తాయి. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) ( చదవండి: ఈ ఏడాది మెట్ గాలాలో మరోసారి సందడి చేయనున్న సుధారెడ్డి! ఎవరీమె..?) -
'యూ, యూ, యూ, లైక్ ఇట్స్'.. ఈ మాగ్నటిక్ సాంగ్‌ను విన్నారా!?
కొరియన్–పాప్ సెన్సేషన్ ‘ఇలిట్’ మ్యూజిక్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. డెబ్యూ–సింగిల్ ‘మాగ్నెటిక్’ బిల్బోర్డ్ చార్ట్ ‘హాట్ 100’లో చోటు సాధించడం ద్వారా ‘ఇలిట్’ గ్లోబల్ స్టేజీపై గ్రౌండ్ బ్రేకింగ్ విజయాన్ని సొంతం చేసుకుంది. యునహ్, మింజుచ, మోకా, వోన్హీ, ఇరోహ అనే అయిదుగురు అమ్మాయిల బృందంతో ‘ఇలిట్’ మ్యూజిక్ బ్యాండ్ గత నెల ప్రారంభమైంది. తొలి అడుగుల్లోనే స్పాటిఫై ‘డైలీ టాప్ సాంగ్ గ్లోబల్’ చార్ట్‌లో చోటు సంపాదించింది. యూకే ‘అఫిషియల్ సింగిల్స్ టాప్ 100’లో మెరిసింది. ‘మాగ్నెటిక్’ సాంగ్‌ను ‘ఇలిట్’ సభ్యుల ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించారు. ఈ గ్రూప్ డెబ్యూ ఆల్బమ్... సూపర్ రియల్ మీ. ‘మై వరల్డ్’, ‘మాగ్నటిక్’, ‘మిడ్నైట్ ఫిక్షన్’, ‘లక్కీ గర్ల్ సిండ్రోమ్’ అనే నాలుగు ట్రాక్‌లు ఈ ఆల్బమ్‌లో ఉంటాయి. తొలి వారంలోనే ‘సూపర్ రియల్ మీ’ అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది. ‘యూ, యూ, యూ, లైక్ ఇట్స్ మాగ్నటిక్/ యూ, యూ, యూ, సూపర్’ అంటూ ‘మాగ్నటిక్’ను పాడాలనుకుంటే ఇప్పుడే వినండి మరి! ఇవి చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..! -
ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు!
పాపులర్ ‘కె–పాప్’ మనకు సుపరిచితం. మరి ‘కె–ఖవ్వాలి అంటే?’ అని అడిగితే ‘అదేమిటీ!’ అని మిక్కిలి ఆశ్చర్యపోయేవారితో పాటు ‘ఎక్కడి ఖవ్వాలీ? ఎక్కడి కొరియా’ అని దూరాభారాలను కూడా లెక్కవేసే వాళ్లు ఉంటారు. ‘కొరియన్ సింగర్స్ సింగింగ్ ఖవ్వాలి’ ట్యాగ్‌లైన్‌తో పోస్ట్ చేసిన ఈ ‘కె –ఖవ్వాలి’ వీడియో వైరల్ అయింది. కల్చరల్ ఎక్స్చేంజ్కు అద్దం పట్టే ఈ వీడియోలో కొరియన్ గాయకులు సంప్రదాయక ఖవ్వాలి మెలోడీలను అద్భుతంగా ఆలపించే దృశ్యం, హార్మోని సుమధుర శబ్దం నెటిజనుల చేత ‘వహ్వా వహ్వా’ అనిపిస్తోంది. ‘బ్యూటీఫుల్ కల్చరల్ ఎక్స్చేంజ్’ లాంటి ప్రశంసలు కామెంట్ సెక్షన్లో కనిపించాయి. ఇవి చదవండి: ప్రముఖ కొరియన్ సింగర్ అనుమానాస్పద మరణం: షాక్‌లో ఫ్యాన్స్ -
డైట్లో ఈ వంటకాన్ని చేరిస్తే..మెరిసే గ్లాస్ స్కిన్ మీ సొంతం!
కొరియన్ గ్లాస్ స్కిన్‌లా చర్మం ఉండాలని చాలామంది కోరుకుంటారు. అందుకోసం అని కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్‌లను ట్రై చేస్తుంటారు. వాటన్నింటి కంటే కూడా ఈ కొరియన్ వంటకాన్ని మీ డైట్లో చేర్చుకుంటే చక్కటి మచ్చలేని మెరిసే చర్మాన్ని పొందొచ్చు. అకాల వృద్ధాప్యా ఛాయలను కూడా దూరం చేస్తుంది. ఏంటా వంటకం అంటే.. కొరియన్ కిమ్చి అనే ప్రసిద్ధ వంటకం మీ చర్మాన్ని ఆరోగ్యంగా కాంతిమంతంగా చేయడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కిమ్చి అనేది సాంప్రదాయ కొరియన్ పులియబెట్టిన ఆహారం. దీన్ని కొరియన్లు ప్రతిరోజు తమ ఆహరంలో భాగం చేసుకుంటారు. ఇది సాధారణంగా చక్కెర, ఉప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, మిరపకాయ మసాల వంటి వాటిని జోడింది పులియబెట్టిన క్యాబేజీతో తయారు చేస్తారు. ఈ కిమ్చిని కావాలంటే ముల్లంగా, సెలెరీ, క్యారెట్, దోసకాయ, బచ్చలి కూర వంటి ఇతర కూరగాయలను ఉపయోగించి కూడా తయారు చేయవచ్చు. ఇది పులియబెట్టడం వల్ల ఉబ్బినట్లుగా ఉండి, పుల్లని రుచిని కలిగి ఉంటుంది. దీన్నీ మన రోజువారీ డైట్లో భాగం చేసుకుంటే కొరియన్లలాంటి గ్లాస్ స్కిన్‌ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మెటిమలు లేని, మృదువైన హైడ్రేటెడ్ చర్మాన్ని పొందొచ్చని చెబుతున్నారు కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ నీతి గౌర్. ఈ వంటకం చర్మాన్ని ఏవిధంగా మేలు చేస్తుందా సవివరంగా చూద్దాం. ప్రోబయోటిక్స్: కిమ్చిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి పేగు ఆరోగ్యానికి తోడ్పడే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా. ఇందులో ఉండే గట్ మైక్రోబయోమ్ చర్మ సంరక్షణ తోపాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది . శరీరంలో ప్రోబయోటిక్స్ సమతుల్య గట్ వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. తద్వారా సంభావ్యంగా చర్మం మంటను తగ్గించి..మొటిమలు, తామర వంటి వాటిని రాకుండా చేస్తుంది యాంటీఆక్సిడెంట్లు: కిమ్చిలో వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. వీటిలో విటమిన్లు ఏ, సీ ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి కీలకమైనవి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్, పర్యావరణ ఒత్తిళ్లు, యూవీ రేడియేషన్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సీడెంట్లు ఒత్తిడిని తగ్గించి..ముఖాన్ని యవ్వనంగా నిగనిగలాడేలా చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్: కిమ్చీని తయారీలో కిణ్వ ప్రక్రియ కారణంగా ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ వంటి బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉత్పత్తి అవుతాయి, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. మొటిమలు, రోసేసియా, అకాల వృద్ధాప్యం వంటివి దూరం చేస్తుంది. అలాగే ఎక్కువగా చర్మ పరిస్థితులలో వచ్చే వాపు వంటివి రానియ్యదు. విటమిన్లు, మినరల్ కంటెంట్: కిమ్చిలో విటమిన్లు ఏ,సీ, కే వంటి పోషకాలకు మంచి మూలం. అలాగే కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. ఈ పోషకాలు చర్మ ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. కొల్లాజెన్ సంశ్లేషణ, గాయం వంటి వాటి నుంచి సంరక్షిస్తుంది. (చదవండి: నాజూగ్గా ఉండే శిల్పాశెట్టి ఇంతలా ఫుడ్‌ని లాగించేస్తుందా..!) -
కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ వ్యవస్థాపకురాలిగా సత్తా చాటుతున్న టీచర్!
కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా ఆ ప్రొడక్ట్‌లన్నీ సహజసిద్ధమైన వాటితోనే తయారు చేయడంతో ఆ ప్రొడక్ట్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. అందులోనూ కొరియన్ మహిళలు మచ్చలేని చందమామలా కనిపించడంతో ఆ దేశ ప్రొడక్ట్‌లను కొనేందుకు ప్రజలు ఎగబడుతుంటారు. ముఖ్యంగా వాళ్ల గ్లాస్ స్కిన్ మరింతగా కట్టిపడేస్తుంది. అలాంటి ప్రముఖ కొరియన్ బ్రాండ్లలో ఒక ప్రసిద్ధ బ్రాండ్‌ని ప్రారంభించి.. ఓ టీచర్ సత్తా చాటుంది. వ్యాపారవేత్తగా విజయపథంలో దూసుకుపోతోంది. ఆమె సక్సెస్ జర్నీ ఎలా ప్రారంభమయ్యిందంటే.. చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో కొరియన్ బ్రాండ్లదే అగ్రస్థానం అని చెప్పాలి. కొరియన్ల మచ్చలేని చర్మం కారణంగానే ఆ ప్రొడక్టలకు ఇంత ప్రజాధరణ అని చెప్పొచ్చు. ముఖ్యంగా కొరియన్ డ్రామాలు, సినిమాలకు భారత్ అంతటా వేలాదిగా అభిమానులు ఉన్నారు. బహుశా ఆ కారణం వల్ల కూడా ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్టలకీ మార్కెట్లో ఇంతలా డిమాండ్ ఉంది. అయితే ఈ కొరియన్ ప్రొడక్టలకీ కేవలం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ ఉంది. అలాంటి కొరియన్ బ్యూటీ ప్రొడక్టలలో ప్రసిద్ధ బ్రాండ్ అయినా బ్యూటీ బార్న్ వ్యవస్థాపకురాలు నాగలాండ్కి చెందిన తోయినాలి చోఫీ . ఈ కే బ్యూటీ బ్రాండ్‌ని చోఫీ 2016లో స్థాపించింది. ఇందులో బార్న్ COSRX నత్త మ్యూసిన్, క్లైర్స్ జ్యూస్డ్ విటమిన్ డ్రాప్, హోలికా సిరమైడ్ క్రీమ్ తదితర ఫేమస్ బ్యూటీ ప్రొడక్ట్‌లను తయారు చేస్తారు. ప్రారంభంలో కేవలం 500 ఆర్డర్లు మాత్రమే వచ్చినట్లు చోఫీ పేర్కొంది. అయితే కాల క్రమేణ ఉత్పత్తుల నాణ్యత కారణంగా ఆ సంఖ్య విపరీతంగా పెరిగి, భారత్‌లో ఉన్న మిగతా ప్రసిద్ద కొరియన్ బ్రాండ్లలో ఇది కూడా ఒకటిగా దూసుకుపోవడం ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇక చోఫీ ఈ వ్యాపారం గురించి మాట్లాడుతూ ఆఫ్‌లైన్‌లో అమ్మకాలు బాగానే ఉన్నాయని చెప్పారు. అయితే ఈ బ్రాండ్‌ని తాను కేవలం నాగాలండ్కే పరిమితం చేయాలనుకోవడం లేదని, భారతదేశమంతటా విస్తరించనున్నట్లు తెలిపింది. ఇక తాను టీనేజ్‌లో ఉన్నప్పుడూ ముఖంపై వచ్చిన మొటిమలు, మచ్చలతో ఇబ్బంది పడుతుండేదాన్ని అని చెప్పారు. అప్పుడే తన స్నేహితులు ఈ కొరియన్ చర్మసంరక్షణ ప్రొడక్ట్‌లు బెటర్ అని సూచించడంతో తనకు వాటి గురించి తెలిసిందని చెప్పుకొచ్చింది. అవి తనకు బాగా పనిచేయడంతోనే ఈ బ్యూటీ ప్రొడక్టలను తయారు చేసే వ్యాపారం చేయాలని అనుకున్నట్లు తెలిపారు. ఆ ఆసక్తి కారణంగానే టీచర్ ఉద్యోగాన్ని వదిలి మరీ ఈ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టానని చెప్పుకొచ్చింది. ఇక ఆమె బ్రాండ్‌కి చెందిన అధికారిక ఇన్‌స్టాగ్రాంలో 45 వేల మందికి పైగా ఫాలోవర్లు, అభిమానులు ఉండటం విశేషం. ఆసక్తి ఉంటే టీ (చదవండి: డౌన్ సిండ్రోమ్‌తో డౌన్ అయిపోలే..! ఏకంగా మోడల్‌గా..!) -
గ్లాసీ స్కిన్ సీక్రెట్ : కొరియన్ బ్యూటీలు కూడా కుళ్లు కోవాల్సిందే!
మెరిసే చర్మం, మచ్చలేని అందమైన ముఖం అనేగానే అందరికీ గుర్తొచ్చేది కొరియన్ బ్యూటీస్. అందులోనూ ఇటీవల కొరియన్ బాండ్ మ్యూజిక్, సినిమాలు, సిరీస్‌లపై యూత్‌లో బాగా క్రేజ్ పెరిగింది. దీంతో కొరియన్ బ్యూటీల్లాగా గ్లాసీ స్కిన్‌తో మెరిసి పోవాలని కోరుకోవడం సహజమే. అందుకే మచ్చలేని మహారాణి, రాజులా మెరిసిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. ఫేషియల్ ఎక్స్‌ర్‌సైజ్ ముందుగా వ్యాయామాలు చాలా ముఖ్యం. శరీర ఆకృతికి వ్యాయామాలు చేసినట్టుగానే ముఖానికి కొన్ని నిర్దేశిత వ్యాయామాలున్నాయి. రోజులో రెండు సార్లు కచ్చితంగా చేస్తే వీ-జాలైన్ మీ సొంతమవుతుంది. సరిపడినన్ని నీళ్లు తాగడం చాలా కీలకం. క్లెన్సింగ్ కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలంటే డీప్ క్లెన్సింగ్ కీలకం. నీరు, గ్లిజరిన్ వంటి మాయిశ్చరైజర్లు , తేలికపాటి సర్ఫ్యాక్టెంట్లనుతో తయారుచేసిన మైకెల్లార్ క్లెన్సింగ్ వాటర్‌తో ముఖాన్ని రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇది ఆల్కహాల్ ఫ్రీ కూడా. చర్మాన్ని టోన్ చేస్తుంది. క్మురికి, మేకప్, ఆయిల్‌ను డీప్‌గా శుభ్రం చేస్తుంది. లేదంటే నిమ్మకాయ కలిపిన ఫేస్‌వాష్‌తో అయినా శుభ్రం చేసుకోవచ్చు. పులిసిన బియ్యం కడిగిన నీళ్లు ఫేస్‌వాష్‌లు, కెమికల్ సబ్బుల జోలికిపోకుండా రైస్ వాటర్‌ను ఫేస్ వాష్‌గా వాడతారట కొరియన్స్. ఇది న్యాచురల్ క్లెన్సర్‌లా పనిచేస్తుంది. చర్మాన్ని ఎక్కువసేపు హైడ్రేట్‌గా ఉంచుతుంది. శుభ్రంగా కడిగిన బియ్యం నానబెట్టిన నీటి, తరువాత వడకట్టుకోవాలి. 24 గంటలు దీన్ని పులియ నివ్వాలి. మేజిక్ వాటర్‌తో ముఖం కడుక్కుంటే ప్రకాశవంతంగా తేమగా ముఖం మెరిసిపోతుంది. చర్మ సంరక్షణలో పెరుగు చాలా ముఖ్యమైన భాగం. పెరుగులో కొద్దిగా కస్తూరి పసుపు కలిపి, ఈ మిశ్రమంతో మృదువుగా మసాజ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఫేస్ మాస్క్ తేనె, నిమ్మరసం మాస్క్, గ్రీన్ టీ మాస్క్, చార్కోల్ సీరమ్ ఫేస్ మాస్క్ లేదా గ్రీన్-టీ సీరమ్ షీట్ మాస్క్‌ని ఉపయోగించి గ్లాసీ స్కిన్‌ను కూడా పొందవచ్చు.గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని డిటాక్సిఫై చేస్తుంది. నిమ్మరసం, తేనె మాస్క్ చర్మంపై పేరుకున్న మలినాలను, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. తేనె చర్మానికి తేమనందిస్తుంది. నిమ్మరసం టాన్ తొలగించి, స్కిన్ టోన్ లైట్ చేస్తుంది. చర్మాన్నిఆరోగ్యంగా, ముడతల్లేకుండా ఉంచేందుకు వాష్‌క్లాత్‌లతో ముఖాన్ని మసాజ్ చేస్తారు. గోరువెచ్చని నీటిలో మెత్తని గుడ్డను ముంచి, సున్నితంగా (ఎగువ దిశలో) తుడవాలి. దీంతో దుమ్ము , ధూళిని తొలగి తేటగా అవుతుంది. ట్యాపింగ్ ఫేషియల్ రిలాక్సేషన్ కోసం ట్యాపింగ్ టెక్నిక్‌ను కొరియన్లు బాగా వాడతారు. ఇది చర్మానికి మంచి రక్షణ అందించడంతోపాటు, రక్త ప్రసరణను పెంచుతుంది. అంతేకాదు తొందరగా వయసు సంబంధిత ముడతలు రాకుండా కాపాడుతుంది. టోనింగ్ అండ్ క్లీనింగ్ కొరియన్ చర్మ సంరక్షణలో మరో ముఖ్యమైంది టోనింగ్. పురాతన కాలంలో, కొరియన్లు తమ చర్మాన్ని టోన్ చేయడానికి దోసకాయ, టమోటా, పుచ్చకాయ వంటి సహజంగా నీరు లభించే వాటిని ఉపయోగించేవారట. కాబట్టి ఏదైనా టోనర్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఈ పదార్థాలను గుర్తు పెట్టుకొంటే మంచిది. వీటితోపాటు, జెన్సింగ్, గ్రీన్‌టీ రోస్ట్ బార్లీ టీకి కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఇక చివరగా రాత్రి పడుకునే ముందు ముఖచర్మ రక్షణ చర్యల్ని అస్సలు మర్చిపోరు. ప్రధానంగా అలెవెరా జెల్‌ను ముఖమంతా అప్లయ్ చేసుకుని, ఉదయం చల్లటి నీటితో కడుక్కుంటారు. -
22 ఏళ్లకే వరల్డ్ నంబర్ వన్‌గా! బ్యాడ్మింటన్‌లో ఎన్నో సంచలనాలు
దాదాపు ఏడాది క్రితం... దుబాయ్‌లో బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్ జరుగుతోంది. భారత్, కొరియా మధ్య పోరు... మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ పీవీ సింధు... ఎదురుగా ప్రత్యర్థి ఒక వర్ధమాన షట్లర్... ఆమె ఆట గురించి సింధుకు కూడా బాగా తెలుసు. అందుకే తనదైన వ్యూహాలతో సన్నద్ధమై బరిలోకి దిగింది. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌ను సింధు 21–18తో గెలుచుకుంది. కానీ అటు వైపు ఉన్న అమ్మాయి వెంటనే కోలుకుంది. అంతే ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. తర్వాతి రెండు గేమ్‌లను అలవోకగా 21–5, 21–9తో సొంతం చేసుకొని మ్యాచ్‌ను తన ఖాతాలో వేసేసుకుంది. సింధు ముఖంలో తీవ్ర నిరాశ... ఎందుకంటే ఆమె చేతిలో సింధు ఓడిపోవడం ఇది మొదటిసారి కాదు. ఇద్దరూ 6 మ్యాచ్‌లలో తలపడితే ఆరోసారి కూడా కొరియా ప్లేయరే విజయం సాధించింది. 2019 నుంచి ప్రయత్నిస్తున్నా ఒక్క మ్యాచ్‌లో కూడా సింధు గెలవలేకపోయిందంటే అతిశయోక్తి కాదు. రెండు ఒలింపిక్స్ పతకాల విజేత, వరల్డ్ చాంపియన్, పెద్ద సంఖ్యలో సూపర్ సిరీస్‌లు సాధించి వరల్డ్ బ్యాడ్మింటన్ గ్రేట్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సింధును కూడా ఒక ఆటాడుకుంటున్న ఆ అమ్మాయి పేరే ఆన్ సె యంగ్... టీనేజ్ దాటకముందే టాప్ షట్లర్లందరినీ ఓడిస్తూ దూసుకు వచ్చి ఆపై విశ్వ విజేతగా కూడా నిలిచిన 22 ఏళ్ల కొరియన్ స్టార్ షట్లర్. ‘కొరియాను ఆదుకున్న స్కూల్ గర్ల్’... ప్రతిష్ఠాత్మక ఉబెర్ కప్‌లో గ్రూప్ దశలో డెన్మార్క్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆన్ సె యంగ్ విజయం తర్వాత కొరియా అంతటా కనిపించిన హెడ్‌లైన్స్ ఇవి. ఈ పోరులో తొలి నాలుగు మ్యాచ్‌ల తర్వాత టీమ్ స్కోరు 2–2తో సమంగా ఉన్న దశలో ఆఖరి మ్యాచ్‌లో ఆమె బరిలోకి దిగింది. తీవ్ర ఒత్తిడి మధ్య సత్తా చాటిన యంగ్ తన డెన్మార్క్ ప్రత్యర్థి లైన్ క్రిస్టోఫర్‌సెన్‌ను ఓడించడంతో అందరి దృష్టీ ఆమెపై పడింది. ఈ టోర్నీలో కొరియా జట్టుకు కాంస్య పతకం అందించడంలో కూడా 16 ఏళ్ల యంగ్ కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో కొరియా సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి స్కూల్గర్ల్గా ఈ అమ్మాయి గుర్తింపు పొందింది. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఆపై ఇవే విజయాలను కొనసాగిస్తూ ఉన్నతస్థానానికి దూసుకుపోయింది. అంతకు ముందు ఏడాదే కొరియా జూనియర్ టీమ్ తరఫున ఆసియా చాంపియన్‌షిప్ గెలిచినప్పుడే ఈ టీనేజర్లో ఎంతో సత్తా ఉందని, సంచలనాలు సృష్టించడం ఖాయమని అంతా నమ్మారు. వాటిని వమ్ము చేయకుండా ఆన్ సె యంగ్.. నిజం చేసి చూపించింది. స్టార్ షట్లర్లను ఓడించి... కరోలినా మరీన్, అకీనా యమగూచి, సైనా నెహ్వాల్... బ్యాడ్మింటన్‌లో ఈ ముగ్గురూ సూపర్ స్టార్లు. ఎన్నో గొప్ప విజయాలు వీరి ఖాతాలో ఉన్నాయి. మరి ఈ ముగ్గురినీ ఒకే టోర్నమెంట్లో ఒక ప్లేయర్ ఓడగొడితే ఆ ప్లేయర్ స్థాయి ఏంటో ప్రపంచమంతటికీ అర్థమవుతుంది. ఆన్ సె యంగ్ విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఉబెర్ కప్‌లో సీనియర్ల చాటున జూనియర్‌గా టీమ్ ఈవెంట్లో మంచి ప్రదర్శన కనబరచిన యంగ్ 2019 ఆరంభం నుంచే వ్యక్తిగత టోర్నీల్లో ప్రదర్శనతో సత్తా చాటింది. సూపర్–100 నుంచి సూపర్–300 స్థాయి వరకు వరుసగా నాలుగు టోర్నీల్లో ఆమె విజేతగా నిలిచింది. ఇందులో ఒక టోర్నీలో 2012 ఒలింపిక్స్ విజేత లీ జురుయ్‌ని ఫైనల్లో ఓడించగలిగింది. అయితే ప్రతిష్ఠాత్మక, పెద్ద టోర్నీల్లో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750లో ఆటతో ఆన్ సె యంగ్ స్థాయి మరింత పెరిగింది. పై ముగ్గురు స్టార్లను ఓడించి టైటిల్ సొంతం చేసుకోవడంతో యంగ్‌కు ఎదురు లేకుండా పోయింది. 2019లో ఏకంగా ఐదు టైటిల్స్ గెలుచుకొని మరోదాంట్లో రన్నరప్‌గా నిలవడంతో సహజంగానే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అందించే ‘మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఆమె ఎంపికైంది. ఈ అవార్డు సాధించడం అంటే ఈ అసాధారణ ప్లేయర్ ఇక ముందు ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసించేందుకు సిద్ధంగా ఉందని అర్థం. యంగ్ విషయంలోనూ అదే జరిగింది. తర్వాతి రెండేళ్లలో డెన్మార్క్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్, వరల్డ్ టూర్ ఫైనల్స్, ఆల్ ఇంగ్లండ్, కొరియా ఓపెన్, మలేసియా మాస్టర్స్, జపాన్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్... ఇలా వేదిక మారడమే తప్ప యంగ్ విజయాల్లో మార్పు లేదు. వరుసగా టోర్నీలు ఆమె ఖాతాలో చేరాయి. 2022 ముగిసే సరికి సీనియర్ కెరీర్లో అప్పటికే 11 బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్స్ గెలుచుకొని మరో 5 టోర్నీల్లో సె యంగ్ రన్నరప్‌గా నిలవడం ఆమె ఆధిపత్యానికి నిదర్శనం. సూపర్ 2023... చాలామంది టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్లతో పోలిస్తే ఆన్ సె యంగ్ ఆట శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. సాధ్యమైనంత తక్కువ శారీరక కదలికలతోనే ప్రత్యర్థిని బోల్తా కొట్టించే తత్వం ఆమెది. కోర్టులో అన్ని వైపులా పరుగెత్తుతూ సమాధానమిచ్చే శైలికి యంగ్ దూరం. కెరీర్ తొలుతలో దూకుడుగా ఆడుతూ అటాకింగ్‌ను ఇష్టపడిన ఆమె ఇప్పుడు ఎక్కువ భాగం డిఫెన్స్‌తోనే పాయింట్లు రాబడుతోంది. అటు వైపు షట్లర్ ఎంత వేగంగా షటిల్‌ను సంధించినా ప్రశాంతంగా రిటర్న్ ఇవ్వగలదు. దాంతోనే వారి దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ ఒత్తిడిలోకి నెట్టడం, ఫలితంగా విన్నర్ల ద్వారానే పాయింట్లు రాబట్టగలగడం యంగ్ ఆటతీరులో కనిపిస్తుంది. ఇదే ఆట ఆమెకు 2023లో అద్భుతాలను అందించింది. తిరుగులేని ఆటతో ఒకటి, రెండు కాదు... ఏకంగా 9 బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్స్ ఆమె గెలుచుకోగలిగింది. ఇందులో బ్యాడ్మింటన్‌లో అన్నింటికంటే అత్యున్నత స్థాయి అయిన సూపర్ 1000 టైటిల్స్ మూడు ఉన్నాయి. మరో రెండు టోర్నీల్లో యంగ్ రన్నరప్‌గా నిలిచింది. ఒక్కమాటలో చెప్పాలంటే మరో ప్లేయర్ ఎవరూ ఆమె దరిదాపుల్లోకి కూడా రాని విధంగా ఏకఛత్రాధిపత్యంతో ఈ కొరియా అమ్మాయి ఆటను శాసించింది. విశ్వవిజేతగా... నంబర్‌వన్‌గా... ఆన్ సె యంగ్ సత్తా, స్థాయి ఏమిటో ఇతర అగ్రశ్రేణి స్టార్ షట్లర్లతో ముఖాముఖీ సమరాల్లోనే తెలుస్తుంది. పీవీ సింధుపై ఏకపక్ష ఆధిపత్యం మాత్రమే కాదు... ప్రపంచ బ్యాడ్మింటన్‌లో రికార్డు స్థాయిలో 214 వారాల పాటు వరల్డ్ నంబర్ ఉన్న తై జు యింగ్, మరీన్, ఒకుహారాలపై విజయాలపరంగా ఆమెదే పైచేయి. 2016 నుంచి ఇటీవలి వరకు ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసించిన తై జుపై 10–3 విజయాల ఆధిక్యం ఉందంటే ఆమె స్థానాన్ని యంగ్ అందుకొని కొత్త తరం ఘనతకు శ్రీకారం చుట్టినట్లే. 2023లో మరో మూడు ప్రత్యేకతలు యంగ్‌ను వరల్డ్ బ్యాడ్మింటన్‌లో హాట్ స్టార్‌ను చేశాయి. డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఆమె ఈ ఘనత సాధించిన తొలి కొరియా మహిళగా రికార్డులకెక్కింది. హాంగ్జూలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ స్వర్ణం సాధించి ఇక్కడా కొరియా తరఫున తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. ఇన్ని విజయాల తర్వాత సహజంగానే ర్యాంకింగ్స్‌లో శిఖరానికి చేరడం లాంఛనంగానే మిగిలింది. ఊహించినట్లుగానే ఆగస్టులో వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచి ఆపై వరుస టైటిల్స్‌లో తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. గత ఒలింపిక్స్‌లో అనూహ్యంగా క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగినా... ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ మాత్రం పతకం కోసం ఆమెను పిలుస్తోంది. యంగ్ ప్రస్తుత ఫామ్ చూస్తే అదేమీ పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ కొరియా ప్లేయర్ ఇప్పటికే సాధించిన ఘనతలే చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 22 ఏళ్ల వయసులోనే ఈ స్థాయిలో చెలరేగుతున్న ఆమె మున్ముందు ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
మందుపాతరలను పసిగడుతుంది
చూడటానికి పిల్లలు ఆడుకునే కారుబొమ్మలా కనిపిస్తుంది గాని, ఇది మందుపాతరలను పసిగడుతుంది. కొరియన్ విద్యార్థులు సుబిన్ కిమ్, జిహూన్ పార్క్ ‘వార్డెన్’ పేరుతో ఈ మైన్ డిటెక్టింగ్ రోబోకు రూపకల్పన చేశారు. ఇది ఎగుడుదిగుడు రహదారులు, బాగా ఎత్తుపల్లాలు ఉండే కొండ దారుల్లో కూడా నిర్దేశించిన మార్గంలో సునాయాసంగా ముందుకు సాగిపోగలదు. దీని అడుగుభాగంలో మోవింగ్ అటాచ్‌మెంట్‌ను అమర్చడంతో దారిలో అడ్డొచ్చే గడ్డి, కలుపు మొక్కలను పీకిపడేస్తూ చకచక ముందుకు కదిలిపోగలదు. పగటి వేళలోనే కాకుండా, రాత్రి కటికచీకట్లోనూ ఇది పనిచేయగలదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ రోబో మైన్డిటెక్టర్ మందుపాతరలను అమర్చిన ప్రదేశాలను అత్యంత కచ్చితంగా గుర్తించి, వెనువెంటనే ఆ సమాచారాన్ని యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తుంది. కొరియన్ విద్యార్థులు ప్రస్తుతం దీనిని ప్రయోగాత్మకంగా రూపొందించారు. మరింత మెరుగుపరచిన తర్వాత దీనిని రక్షణ అవసరాల కోసం అందుబాటులోకి తేనున్నారు. -
విదేశీయుని వద్ద రూ.5000 చలానా వసూలు చేసిన పోలీసు.. రిసిప్ట్ ఇవ్వకుండానే..
ఢిల్లీ: ఢిల్లీలో అక్రమంగా ట్రాఫిక్ చలానా వసూలు చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కొరియా దేశస్థుని వద్ద కానిస్టేబుల్ రిసిప్ట్ ఇవ్వకుండానే రూ. 5000 చలానా వసూలు చేశాడు. నెలక్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. కానిస్టేబుల్ మహేష్ చంద్.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కొరియా దేశస్థునికి రూ.5000 జరిమానా విధించినట్లు చెప్పారు. కానీ విదేశీయుడు రూ.500 ఇచ్చాడు. తను అడిగిన డబ్బు రూ. 500 కాదని, రూ. 5000 అని చెప్పి కానిస్టేబుల్ మళ్లి అడిగాడు. చేసేది లేక విదేశీయుడు కానిస్టేబుల్‌కు మిగిలిన డబ్బును ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇద్దరు హ్యాండ్స్ షేక్ చేసుకుని వెళ్లిపోతారు. కానీ జరిమానాకు సంబంధించిన పత్రాన్ని ఆ బాధిత విదేశీయునికి కానిస్టేబుల్ ఇవ్వలేదు. Video: Delhi Cop Fines Korean Man ₹5,000 Without Receipt, Suspended https://t.co/EaheIf2LvI pic.twitter.com/bX5lLND7vM — NDTV (@ndtv) July 23, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు పోలీసు కానిస్టేబుల్‌ను విధుల నుంచి తప్పించారు. సంబంధిత వీడియోపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. జరిమానాకు సంబంధించిన పత్రాన్ని ఇచ్చేలోపే ఆ విదేశీయుడు వెళ్లిపోయినట్లు కానిస్టేబుల్ చెబుతున్నాడు. ఇదీ చదవండి: సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్.. -
తీవ్ర విషాదం.. బాత్రూమ్లో విగతజీవిలా మారిన సింగర్!
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియన్ సింగర్ లీ సాంగ్ యున్ శవమై తేలింది. తన ప్రదర్శనకు కొద్ది నిమిషాల ముందే బాత్రూమ్లో విగతజీవిలా కనిపించింది. జూలై 6న జరిగిన ఘటన ఆమె అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ప్రస్తుతం ఆమె మృతికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. (ఇది చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల) స్థానిక కొరియన్ మీడియా కథనం ప్రకారం.. బాత్రూమ్లో లీ సాంగ్ యున్ మృతదేహాన్ని గుర్తించిన ఈవెంట్ సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. ఆమె ప్రదర్శన ఇవ్వడానికి ముందే ఈ విషాదం జరగడంతో ప్రతి ఒక్కరూ శోకసంద్రంలో మునిగిపోయారు. దీంతో ఈ మిస్టరీ మరణంపై అక్కడి అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. లీ సాంగ్ యున్ తనదైన టాలెంట్‌తో సోప్రానో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సియోల్ నేషనల్ యూనివర్శిటీ చదువుకున్న ఆమె సంగీతంలో అసాధారణమైన ప్రతిభను కనబరిచింది. సంగీతం పట్ల ఆమెకున్న అంకితభావంతో న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మకమైన మన్నెస్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించింది. ఈ విషాద ఘటనతో పలువురు ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు. (ఇది చదవండి: అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్.. నన్ను కూడా గుర్తుపట్టలేదు: యాంకర్) -
జాన్వీ కపూర్ సమర్పించు... గోచుజాంగ్
జాన్వీ కపూర్ ఫేవరెట్ ఫుడ్... గోచుజాంగ్. ఈ కొరియన్ ఫుడ్ గురించి ఒక యూట్యూబ్ వీడియోలో చవులూరించేలా మాట్లాడింది. లాక్డౌన్ టైమ్‌లో బోలెడు కుకింగ్ వీడియోలు, ట్రావెల్ వీడియోలు చూసింది జాన్వీ, క్విక్ నూడుల్స్ ‘గోచుజాంగ్’ తనను బాగా ఆకట్టుకుంది. అట్టే శ్రమ పడకుండా క్విక్‌గా ఈ నూడుల్స్‌ను తయారు చేయవచ్చు. రకరకాల ప్రోటీన్లు జత చేసి గోచుజాంగ్కు తనదైన హెల్తీ ట్విస్ట్ ఇచ్చింది జాన్వీ. ఈ వంటకం పుట్టుపుర్వోత్తరాలతో పాటు, ఎలా చేయాలి? ఏం వాడాలి... మొదలైన వివరాలు తెలుసుకోవడానికి జాన్వీ అభిమానులతో పాటు భోజన అభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో సింగర్ మృతి.., హత్యా? ఆత్మహత్యా?
దక్షిణ కొరియా యూత్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ సింగర్ చోయ్ సంగ్ బాంగ్(33) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దక్షిణ సియోల్‌లోని తన నివాసంలో విగతజీవిగా పడున్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు..మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన దర్యాప్తును ప్రారంభించారు. చోయ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైన హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక విచారణలో మాత్రం చోయ్ ఆత్మహత్య చేసుకున్నాడనే తేలిందట. చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన యూట్యూబ్ చానెల్లో ఓ లేఖను అప్లోడ్ చేసిన ఆయన.. తన వల్ల ఇబ్బంది పడినవారందరికి క్షమాపణలు చెప్పారు. 2011లో రియాలిటీ సింగింగ్ పోటీ ‘కొరియాస్ గాట్ టాలెంట్’లో రెండో స్థానం పొందిన తర్వాత చోయ్ మరింత ఫేమస్ అయ్యాడు. చిన్న వయసులోనే స్టార్ సింగర్‌గా ఎదిగిన ఆయనకు..అదే స్థాయిలో వివాదాలు కూడా చుటుటముట్టాయి. ముఖ్యంగా తాను క్యాన్సర్ బారిన పడ్డానని, చికిత్స కోసం డబ్బులు కావాలంటూ విరాళాలు వసూలు చేయడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. డబ్బు కోసమే క్యాన్సర్ బారిన పడినట్లు అబద్దం చెప్పినట్లు స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. తనకు వచ్చిన విరాళాలు కూడా తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చాడు. అయితే కొన్నాళ్లుగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఒంటరిగా ఉంటున్న చోయ్..ఇప్పుడు విగతజీవిగా మారడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.