
‘లక్కీ కీ’ పోస్టర్; సురేశ్ బాబు
ఇటీవలే కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ని సమంతతో ‘ఓ బేబి’గా తెరకెక్కించింది సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. తాజాగా మరో కొరియన్ సినిమాను రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించారు నిర్మాత సురేశ్ బాబు. 2016లో విడుదలైన ‘లక్కీ కీ’ అనే కొరియన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నట్లు, భారతీయ భాషలన్నింటి రైట్స్‌ను దక్కించుకున్నట్టు తెలిపారు. 2012లో విడుదలైన ‘కీ ఆఫ్ లైఫ్’ అనే జపనీస్ చిత్రాన్ని ‘లక్కీ కీ’ పేరుతో కొరియన్ పరిశ్రమ రీమేక్ చేసింది. ఇప్పుడు ఈ కొరియన్ సినిమా ఆధారంగా తెలుగు రీమేక్ రూపొందనుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న యాక్టర్, కిరాయికి హత్యలు చేసే రౌడీ అనుకోకుండా ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్తే ఏం జరిగింది? అనేది ఈ చిత్రకథాంశం. ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తారని, ఇందులో ఓ పెద్ద స్టార్ నటిస్తారని ప్రకటించారు. గురు ఫిలింస్, యస్ కే గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలసి సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
Comments
Please login to add a commentAdd a comment