Japanese
-
భారత్‌లో జపాన్ సెమీకండక్టర్ యూనిట్లు!
న్యూఢిల్లీ: భారత్‌లో సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు జపాన్ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్టు డెలాయిట్ సంస్థ వెల్లడించింది. ఈ రంగంలో జపాన్ కంపెనీలకు ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయని, అవి భారత్‌లో భాగస్వామ్యాలకు ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలిపింది. నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు, నిధుల లభ్యత, ప్రభుత్వం నుంచి మద్దతు భారత్‌లో ఈ రంగం వృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు అనుకూలించనున్నట్టు పేర్కొంది.జపనీస్ కంపెనీలు భారత మార్కెట్ పట్ల ఎంతో ఉత్సాహం చూపిస్తున్నట్టు డెలాయిట్ ఏపీ, డెలాయిట్ జపాన్ ఎస్ఆర్టీ లీడర్ షింగో కామయ తెలిపారు. భారత్‌లో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి చేతులు కలిపిన వాటిల్లో యూఎస్ తర్వాత రెండో క్వాడ్ భాగస్వామి జపాన్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. సెమీకండక్టర్ డిజైన్, తయారీ, ఎక్విప్మెంట్, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి భారత్, జపాన్ మధ్య అవగాహన ఒప్పందాలు కుదరడాన్ని ప్రస్తావించారు. 100 సెమీకండక్టర్ ప్లాంట్లతో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ కలిగిన టాప్ 5 దేశాల్లో జపాన్ ఒకటిగా డెలాయిట్ పేర్కొంది.చిప్‌ల తయారీలో వాడే వేఫర్లు, కెమికల్, గ్యాస్, లెన్స్‌ల తయారీలో జపాన్ టాప్‌లో ఉన్నట్టు వివరించింది. భారత్ 10 ఏళ్లలో 10 సెమీకంక్టర్ కంపెనీల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుందని.. ఈ దిశగా జపాన్ మెరుగైన భాగస్వామి అవుతుందని అంచనా వేసింది. సెమీకండక్టర్ పరంగా జపాన్ కంపెనీలకు ఉన్న టెక్నాలజీ, ప్రత్యేక నైపుణ్యాలను ప్రస్తావించింది. ఏదో ఒక ఫ్యాక్టరీ ఏర్పాటుతో సెమీకండక్టర్ లక్ష్యం నెరవేరదని, మొత్తం ఎకోసిస్టమ్ (సమగ్ర వ్యవస్థ) ఏర్పా టు చేయాల్సి ఉంటుందని డెలాయిట్ పేర్కొంది. -
20 కిలోల బరువు: దీని దుంపతెగ! మూములు పీత కాదిది, రాకాసి పీత!
సముద్రంలో కనిపించే ఎండ్రపీతల్లో ఇది చాలా అరుదైన పీత. సాలీడు ఆకారంలో ఉండే ఈ రాకాసిపీత పూర్తిగా ఎదిగాక మనిషికి రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. దీని కాళ్లు చాలా పొడవుగా ఉంటాయి. దీని శరీరం అడుగున్నర ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాళ్ల పంజా నుంచి పంజా వరకు పొడవు చూస్తే ఏకంగా పన్నెండు అడుగుల వరకు ఉంటుంది. దీని బరువు గరిష్ఠంగా ఇరవై కిలోల వరకు ఉంటుంది. అతిపెద్ద పీత జాతుల్లో ‘అమెరికన్ లోబ్స్టర్’ తర్వాతి స్థానంలో ఈ రాకాసిపీత ఉంటుంది. ఇది ఎక్కువగా జపాన్ తీర పరిసరాల్లోని సముద్రంలో చాలా లోతు ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటుంది. అందుకే దీనికి ‘జపానీస్ స్పైడర్ క్రాబ్’ అనే పేరు వచ్చింది. సముద్రంలో ఈరకం పీతలు దాదాపు రెండువందల అడుగుల నుంచి రెండువేల అడుగుల లోతులో తిరుగుతుంటాయి. ఇవి వేటగాళ్ల వలలకు చిక్కడం చాలా అరుదు. ఇవీ చదవండి: బ్యాక్ ప్యాక్ కూలర్ బ్యాగుఅరుదైన జబ్బుతో అర్జున్ కపూర్ : ఎమోషనల్ కామెంట్స్,అంత ప్రమాదకరమా? -
జపాన్ వనితలా స్లిమ్‌గా ఉండాలంటే..! ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ప్రస్తుతం మనదేశంలో చాలమంది టీనేజర్లు అధిక బరువుతో బాధపడుతున్నారు. ప్రతి పదిమందిలో ఐదుగురు అధిక బరువు సమస్యతో బాధపుతున్నారంటే..పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. అయితే జపాన్, కొరియా లాంటి దేశాల్లో అమ్మాయిలు బొమ్మల్లా, భలే అందంగా ఉంటారు. పెళ్లి అయ్యిందో లేదో కూడా చెప్పలేం అంత స్లిమ్‌గా యవ్వనంగా కనిపిస్తారు. మరీ వాళ్లు అంతలా ఉండేందుకు గల ఫిటెనెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.ఏం చేయాలంటే..జపాన్ వాళ్లు నాజుగ్గా ఉండేందకు కఠినమైన ఆహార నియమావళిని ఫాలో అవుతారట. ఇది వారికి ఆరోగ్యంగా ఉండేదుకే గాక దీర్ఘాయువుతో ఉండటానికి ఉపయోగపడుతుందట. వాళ్లు కడుపు నిండుగా అస్సలు తినరట. భోజనం చేసేటప్పుడు ఉదర ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తింటారట. కేలం 80 శాతమే తిని మిగతా భాగం సాఫీగా అరిగిపోయేందుక వీలుగా ఖాళీగా ఉంచుతారట. అందువల్ల జీర్ణ సమస్యలు ఉండువు, బానపొట్టలా రాదు కూడా. అలాగే వాళ్లు ఫుడ్ ప్లేట్లు చిన్నవే ఎంచుకుంటారట. ఇలా చేస్తే ఆహారం ప్లేటు నిండుగా ఉన్న ఫీల్ తోపాటు ఎక్కువ తింటున్నాం అనే అనుభుతి కలగడంతో తక్కువగానే తింటామని వారి నమ్మకం. అలాగే రెండోసారి వేసుకుని తినడానికి ఆలోచిస్తారట. నచ్చిందని గమ్మున వేసుకుని తినేయరట. అదీగాక భోజనం చేసేటప్పుడూ మొబైల్స్, టీవీ, కంప్యూటర్లు చూస్తు అస్సలు తినరు. భోజనంపై ధ్యాస ఉంచి తినడానికి ప్రాధాన్యత ఇస్తారట. అలాగే నమిలినమిలి మైండ్‌ఫుల్‌నెస్‌తో తింటారట. ఇలా చేయడం వల్ల మంచిగా ఆహారం జీర్ణమవ్వడమే గాక అధిక బరువు వంటి సమస్యలను ఎదుర్కొనరు. పైగా నాజుగ్గా అందంగా ఉంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరీ..!.(చదవండి: 'లైట్‌హౌస్ పేరెంటింగ్': పిల్లలు ప్రయోజకులయ్యేందుకు ది బెస్ట్!) -
12 ఏళ్లుగా అతనిది 30 నిమిషాల నిద్రే!..!
మంచిగా నిద్రపోకపోతే ఉదయం వేళ చురుకుగా పనిచేయడం సాధ్యం కాదు. ఏదో విధమైన చికాకు, కోపం ఎక్కువగా ఉంటాయి. అదీగాక వైద్యులు ఆరోగ్యకరమైన వ్యక్తికి సగటున ఆరు నుంచి 8 గంటలు నిద్ర అవసరమని సిఫార్సు చేస్తుంటారు. అలాంటిది ఓ జపాన్ వ్యక్తి కేవలం 30 నిమిషాల నిద్రపోతున్నాడట. అయినా ఎలాంటి సమస్యలు లేకుండా చాలా చురుగ్గా తన పనులు చేసుకుంటున్నాడు. ఇలా అరంగంట నిద్రతోనే తన పనిసామర్థ్యం మరింత మెరుగుపడిందని చెబుతుండటం విశేషం. వివరాల్లోకెళ్తే..జపాన్‌లో హ్యూగో ప్రిఫెక్చర్‌కు చెందిన డైసుకే హోరీ గత 12 ఏళ్లుగా అరగంటే నిద్రపోతున్నాడట. దీనివల్ల తన పని సామర్థ్యం మెరుగుపడిందని చెబుతున్నాడు. ఇలా 30 నిమిషాలే నిద్రపోయేలా తన శరీరానికి, మెదడుకు శిక్షణ ఇచ్చానని, అందుల్ల తాను అలిసిపోనని చెప్పాడు. తాను 12 ఏళ్ల క్రితం నుంచి ఇలా నిద్రను తగ్గించుకోవడం ప్రారంభించానని అలా ప్రస్తుతం తన నిద్రను రోజుకు 30 నుంచి 45 నిమిషాలకు తగ్గించుకోగలిగానని వెల్లడించాడు. తాను భోజనానికి ఒక గంట ముందు క్రీడలు లేదా కాఫీ తాగడం వంటివి చేసి నిద్ర వస్తుందనే భావన రాదని అంటున్నాడు. అలాగే తమ పని సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనుకునే వాళ్లు సుదీర్ఘ నిద్రకంటే నాణ్యమైన నిద్రతోనే ఎక్కువ ప్రయోజనం పొందగలరని చెబుతున్నాడు. ఇలాంటి టెక్నీక్తోనే సదా అప్రమత్తంగా ఉండే వైద్యులు, అగ్నిమాపక సిబ్బంది తక్కువసేపు నిద్రపోయినా అధిక సార్థ్యాన్ని కలిగి ఉంటారని చెప్పాడు. జపాన్‌లోని యోమియూరి టీవీ ఛానల్ డైసుకే ఎలా జీవిస్తున్నాడో చూపించే ఒక రియాలిటీ షో చేసింది. ఈ షో పేరు “విల్ యు గో విత్ మీ?”.వారు మూడు రోజుల పాటు డైసుకేని గమనించారు. అయితే ఒక ఎపిసోడ్లో డైసుకే కేవలం 26 నిమిషాలు మాత్రమే నిద్రపోయాడు.ఆ తర్వాత చాలా ఉత్సాహంగా లేచి, బ్రేక్‌ఫాస్ట్ చేసి పనికి వెళ్లడం, జిమ్ చేయడం వంటివి చేశాడు. ఇదంతా నమ్మశక్యంగా అనిపించకపోయినా అదే రియల్‌గా జరిగింది. అంతేగాదు 2016లో హోరీ జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసీయేషన్ని స్థాపించాడు. అక్కడ రెండు వేలకు పైగా విద్యార్థులకు తనలాగే తక్కువసేపు నిద్రపోవడం ఎలాగో నేర్పించాడు.అయితే ఈ అల్ట్రా షార్ట్ స్లీపర్స్‌కు ఎందుకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావడం లేదనేది శాస్త్రవేత్తలకు అర్థకాని చిక్కుప్రశ్నలా ఉంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఇది ఎలానో నేర్చుకోవాలనుకుంటున్నామని, మరికొందరూ అందరికీ సరిపోదని, దీని వల్ల పలు సమస్యలు వస్తాయని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: నటుడు ఆశిష్ విద్యార్థి ఇష్టపడే బెస్ట్ ఫుడ్ ప్లేస్‌లు ఇవే..!) -
ఓవర్ థింకింగ్ నుంచి తప్పించే ఏడు జపనీస్ టెక్నిక్స్...
మనసు కోతిలాంటిది. ఎప్పుడూ ఒకచోట కుదురుగా ఉండదు. ఈ క్షణం ఒక అంశం గురించి ఆలోచిస్తుంటే, మరుక్షణం మరో అంశంపైకి గెంతుతుంది. కొందరు ఒకే విషయం గురించి అతిగా ఆలోచిస్తూ బాధపడుతుంటారు. సకల మానవ దు:ఖానికి కారణమైన మనసును నియంత్రించడం కోసం అనాదిగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. యోగ: చిత్తవృత్తి నిరోధక: అనే సూత్రంతోనే పతంజలి యోగసూత్రాలు మొదలవుతాయి. అష్టాంగమార్గం ద్వారానే దు:ఖాన్ని తప్పించుకోగలమని బౌద్ధం బోధిస్తుంది. జపాన్ లోని బౌద్ధులు కూడా మనసును నియంత్రించుకోవడం గురించి అన్వేషించి ఏడు టెక్నిక్స్ అందించారు. సైకాలజీ అనేది పుట్టకముందే, వేల సంవత్సరాల కిందటే మొదలైన ఈ టెక్నిక్స్ ను ఇప్పటికీ అక్కడ చాలామంది ఉపయోగిస్తున్నారు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. 1. షోగనై: మీ కంట్రోల్ లో ఉన్న విషయాల గురించి, మీ కంట్రోల్ లేని విషయాల గురించి బాధపడకూడదు. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కదా. సింపుల్. మీ కంట్రోల్ లో ఉన్న విషయాల గురించి బాధపడటం ఎందుకు? వాటిని ప్రయత్నించి సాధించాలి. మీ కంట్రోల్ లేని విషయాల గురించి ఎంత ఆలోచించినా, ఎంత ప్రయత్నించినా అర్థం లేదు కదా. ఈ వైఖరిని అనుసరిస్తే అనవసర ఆలోచనలు మీ మనసులోకి రానే రావు. మీజీవితంలో కష్టాలూ రావు. వచ్చినా... మీ కంట్రోల్ లో ఉన్నదైతే పరిష్కరించుకుంటారు, లేనిదైతే వదిలేసి ముందుకు సాగవచ్చు. 2. షిరిన్-యోకు: బిజీ బిజీ జీవితంతో విసిగిపోయినప్పుడు.. ‘‘అబ్బ, ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్తే ప్రాణానికి హాయిగా ఉంటుందబ్బా’’ అని అనుకుని ఉంటారుగా. అంతదూరం వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఉన్న ప్రకృతితో మమేకం అవ్వండి. పచ్చదనంలో సమయం గడపండి. అతిగా ఆలోచించకుండా ఉండటానికి ఇది ఉత్తమమైన మార్గం. మీ మనసును శాంతపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. 3. నేన్ బుత్సు: అతిగా ఆలోచించడం నుంచి మనసును మళ్లించడానికి సులువైన మార్గం జపం. అంటే మీరు విశ్వసించే, మీకు నచ్చిన పదాన్ని జపించండి. ఏ పని చేస్తున్నా దానిపైనే ధ్యాస నిలపండి. దానివల్ల ఇతర అంశాల గురించే ఆలోచించే అవకాశం తగ్గుతుంది, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. 4. జాజెన్: ఇది జెన్ బౌద్ధమతంలో విస్తృతంగా అభ్యసించే ధ్యానం యొక్క రూపం. చాలా సులువైన విధానం. మీ ఆలోచనలను మీరు ఎలాంటి జడ్జ్ మెంట్ లేకుండా పరిశీలించడం. అంటే ఒక సాక్షిలా ఆలోచనలను పరిశీలించడం. ఎప్పుడైతే మీరు ఆలోచనలకు స్పందించకుండా, విశ్లేషించకుండా ఉంటారో అప్పుడవి ఆటోమేటిక్ గా తగ్గుతాయి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. 5. గమాన్: జీవితం సుఖదుఖాల, విజయాపజయాల మిశ్రమం. ఒక్కోసారి అనుకోని తీరులో కష్టం ఎదురవ్వవచ్చు. అప్పుడు కుంగిపోకూడదు. నాకే ఎందుకిలా జరిగిందంటూ ఆలోచిస్తూ ఉండిపోకూడదు. ఆలోచనల వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని, అడుగు వేసినప్పుడే ఫలితాలు వస్తాయని గుర్తించి.. ముందడుగు వేయాలి. 6. వాబీ-సాబీ: జీవితంలో అన్నీ తాత్కాలికమేననీ, ఏదీ శాశ్వతం పరిపూర్ణం కావని గుర్తించమని చెప్పే జపనీస్ టెక్నిక్ ఇది. ఎప్పడైతే ఈ విషయాన్ని అంగీకరిస్తారో, అప్పడు పర్ ఫెక్ట్ గా ఉండాలనే ఒత్తిడి నుంచి మీరు తప్పించుకోగలరు. అప్పుడు అతిగా ఆలోచించడం నుంచి మీరు తప్పించుకోగలరు, ప్రశాంతంగా ఉండగలరు. 7. ఇకబెనా: ఇది పువ్వులను అందంగా అమర్చే ఆసక్తికరమైన టెక్నిక్. మీరు పువ్వులను అమర్చేటప్పుడు మీ ధ్యాస మొత్తం వాటిపైనే ఉండాలి. వాటిపై శ్రద్ధ నిలపడం ద్వారా మీ మనసు అందాన్ని సృష్టించడంలో మునిగిపోతుంది. అతిగా ఆలోచించడం నుంచి తప్పించుకుని ప్రశాంతంగా ఉండగలరు. దీన్నే ఫ్లో స్టేట్ అంటారు. మరెందుకు ఆలస్యం వీటిలో మీకు నచ్చిన టెక్నిక్ ఉపయోగించి ఓవర్ థింకింగ్ నుంచి తప్పించుకోండి. అయితే ఇవి మానసిక సమస్యలున్నవారికి కాదని, సైకోథెరపీకి ప్రత్యామ్నాయం కాదనే ఎరుకతో ఉండండి. ఈ ప్రయత్నాలేవీ మీ ఓవర్ థింకింగ్ ను ఆపలేకపోతే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లోని కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ ద్వారా మీ ఓవర్ థింకింగ్ ను తప్పించుకునేందుకు సహాయపడగలరు. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
దటీజ్ తలైవర్! జపాన్ తాతగారి ఆట, పాట.. వైరల్ వీడియో
సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిల్‌కి పెట్టింది. ప్రతీ సినిమాలోనూ తన మార్క్ డైలాగ్గానీ, స్టయిల్ గానీ క్రియేట్ చేస్తాడు. ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తాడు. చిన్నపిల్లల్ని దగ్గరనుంచి, పండు ముదుసలి దాకా ఆయన స్టయిల్‌కు ఫిదా అవ్వాల్సిందే. జపాన్ కంపెనీ మిత్సుబిషి ఎగ్జిక్యూటివ్, 77 ఏళ్ల పెద్దాయన చేసిన డ్యాన్స్ చూస్తే మీరు కూడా అదే మాట అంటారు. విషయం ఏమిటంటే.. మిత్సుబిషి కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన కుబోకి శాన్ను ప్రత్యేక అతిథిగా పాండిచ్చేరి యూనివర్శిటీ ఆహ్వానించింది. ‘GLOBIZZ'24’ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అలా మాట్లాడుతూనే రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ముత్తు’లోని ‘ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలంచాడు యేనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు’ అనే పాటకు తమిళ వెర్షన్‌ను పాడుతు డ్యాన్స్ చేస్తూ విద్యార్థును ఆశ్చర్యచకితుల్ని చేశాడు. విద్యార్థులు షాక్ అవ్వడమే కాదు, పాండిచ్చేరి యూనివర్శిటీలోని అడ్మినిస్ట్రేటర్లు , ప్రొఫెసర్లు అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. (మెడ పట్టేసిందా?ఈ చిట్కాలు పాలో అవ్వండి! ) ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. జపాన్‌లో తలైవర్ క్రేజ్ అలాంటిది మరి అని కొందరు "వావ్. ..జపాన్‌కు చెందిన ఒక వ్యక్తి తమిళ పాడటం ఎప్పుడూ వినలేదు" అంటే మరొకరు కామెంట్ చేశారు.(ప్రెగ్నెన్సీ ప్రకటించారో లేదో.. ‘ట్విన్స్’ అంటూ సందడి చేస్తున్న ఫ్యాన్స్) కాగా రజనీకాంత్ నటించిన 'ముత్తు', 1995లో బాక్సాఫీస్ వద్ద 400 మిలియన్ల జపనీస్ యెన్లు( దాపు 23.5 కోట్లు) సాధించి జపనీస్ చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. అయితే ఈ రికార్డును రాంచరణ్; జూఎన్టీర్, రాజమౌళి కామలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 2022లో 24 ఏళ్ల ఈ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. (అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి?) At the age of 77, Mr. Kuboki San of Mitusubishi Corporation Ltd, Japan, at the GLOBIZZ'24 event conducted by Pondicherry University! He enthralled the MBA students with the Tamil Song from Rajnikanth starred movie "Muthu", which has been rocking in Japan since 1995! #Rajinikanth pic.twitter.com/ILG9WIkKie — Ananth Rupanagudi (@Ananth_IRAS) March 2, 2024 -
మిస్ జపాన్‌గా ‘ఉక్రెయిన్’ యువతి!
టోక్యో: ఆమె పేరు కరోలినా షినో. వయసు 26 ఏళ్లు. ప్రఖ్యాత మోడల్. తాజాగా జరిగిన మిస్ నిప్పన్ (జపాన్ పాత పేరు) పోటీల్లో విజేతగా నిలిచింది. ఆమె మిస్ జపాన్ కిరీటం నెగ్గడంపై దేశమంతటా విపరీతమైన చర్చ జరుగుతోంది. ఆమె జన్మతః ఉక్రేనియన్ కావడమే ఇందుకు కారణం! షినోకు ఐదేళ్ల వయసులో ఆమె తల్లి ఓ జపనీయున్ని పెళ్లాడింది. ఆ వెంటనే తల్లితో పాటు ఆమె ఉక్రెయిన్ వీడి జపాన్ వచ్చేసింది. గతేడాదే షినోకు జపాన్ పౌరసత్వం కూడా లభించింది. తాను నూరుపాళ్లు జపాన్ పౌరురాలినేనని షినో చెబుతోంది. ‘‘కాకపోతే ఆ గుర్తింపు కోసం ఏళ్ల తరబడి పోరాడాల్సి వచి్చంది. పదేపదే జాతి వివక్షను ఎదుర్కొన్నా. మిస్ జపాన్ కిరీటం దక్కినందున ఆ అవమానాలకు ఇకనైనా తెర పడుతుందనే అనుకుంటున్నా’’ అంటూ ఆశాభావం వెలిబుచ్చింది. జపాన్ భిన్న జాతులకు ఆలవాలం. గతంలోనూ విదేశీ మూలాలున్న పలువురు మిస్ జపాన్ కిరీటం నెగ్గారు. -
AP: వావ్.. వాట్ ఏ గ్రేట్ మెనూ.. జపాన్ వాసుల కితాబు
యాదమరి(చిత్తూరు జిల్లా): వాట్ ఏ గ్రేట్ మెనూ.. యువర్ సీఎం కేరింగ్ ఈజ్ సూపర్ ఆన్ మిడ్ డే మీల్స్ అంటూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై జపాన్ వాసులు ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాదు.. పాఠశాలలో అమలవుతున్న మెనూ విధానాన్ని పరిశీలించి సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. రోజుకో స్పెషల్ కూరతో ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న భోజన విధానంపై ప్రభుత్వ కల్పిస్తున్న సదుపాయాలను వారు కొనియాడారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కె.గొల్లపల్లె ఉన్నత పాఠశాలను జపాన్ దేశస్తులు శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కనకాచారికి జపాన్‌కి చెందిన స్టాన్లీ స్నేహితుడు. కనకాచారి కోరిక మేరకు క్రిస్మస్ వేడుక కోసం స్టాన్లీ అతని జపాన్ స్నేహితులు కోటరో, హిరోమి, ష్కాలర్ ఇక్కడ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండగా అక్కడి వాతావరణాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంత పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేసేదెవరని ఆరా తీశారు. అలాగే పాఠశాలకు కల్పించిన మౌలిక వసతులకు మంత్రముగ్థులై విషయాలన్నీ కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. నాడు-నేడు అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందని, దీనివల్ల ఇక్కడి పాఠశాలల స్వరూపం పూర్తిగా మారిపోయిందని కనకాచారి వారికి వివరించారు. దీనికోసం సీఎం జగన్మోహనరెడ్డి మహోద్యమం చేస్తున్నారని, మధ్యాహ్న భోజన పథకంలో మెనూ తీసుకొచ్చి రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారని వారి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆశ్చర్యం చెందినవారు వెంటనే అక్కడ అందిస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. ఇంతటి సదుపాయాలు కల్పిస్తున్న సీఎం జగన్మోహనరెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. పాఠశాల హెచ్ఎం లలితతోపాటు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇదీ చదవండి: మనసున్న సీఎం వైఎస్ జగన్ -
భారతీయ వంటకాలకు జపాన్ అంబాసిడర్ ఫిదా!
భారత వంటకాలను ఇష్టపడే విదేశీయలు ఎందరో ఉన్నారు. ఇప్పుడూ ఆ లిస్ట్‌లోకి జపాన్ వచ్చింది. సాక్షాత్తు జపాన్ అంబాసిడర్ మన భారతీయ వంటకాలను రుచి చుడటమే గాక వాటిని వండిని చెఫ్‌ని కూడా ప్రశంసలతో ముంచెత్తాడు. కచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో మీరు వంటకాలను ప్రదర్శించగలరని కితాబు కూడా ఇచ్చేశాడు. ఇంతకీ ఆయన రుచిన చూసిన వంటకం ఏంటీ? ఆ అదృష్టాన్ని దక్కించుకున్న చెఫ్ ఎవరంటే..? భారత్‌లోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి తన సతీమణితో కలిసి ఢిల్లీలోని ప్రముఖ సరోజినీ నగర్ మార్కెట్‌ని సందర్శించారు. అక్కడ ఆలు టిక్కాను ఆస్వాదించినప్పుడూ ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దీని రుచి జపాన్ రాయబారి హిరోషికి ఎంతగానో నచ్చింది. దీంతో దాన్ని తయారు చేసిన నాగాలాండ్ చెఫ్ జోయెల్ బసుమతారిని పొగడ్తలతో ముంచెత్తాడు. అంతేగాదు అతడి చేతితో తయారు చేసిన భోజనాన్ని కూడా ఆస్వాదించాడు. చాలా రుచికరంగా ఉందని మెచ్చుకోవడమే గాక భవిష్యత్తులో మంచి పాక నిపుణుడిగా పేరొస్తుందని ప్రశంసించారు. అందుకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. పైగా ఆ చెఫ్‌ని కూడా తన వంటకాల గురించి మాట్లాడమని కూడా చెప్పారు. ఆ చెఫ్ తాను భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈశాన్య వంటకాలను ఎలా ప్రచారం చేయాలనుకుంటున్నారో వివరించారు. మీరు చేసిన ఈశాన్య వంటకాలు చాలా రుచిగా ఉన్నాయి. కచ్చితం మీరు ఈ విషయంలో సక్సెస్ అవుతారని మెచ్చుకున్నారు జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి . అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది చూడండి. Enjoyed wonderful dinner prepared by Nagaland’s star chef Mr. Joel Basumatari. Chef Joel promotes North Eastern cuisine around the world. Wish him great success in the future !! pic.twitter.com/FLNHWvcoex — Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) December 7, 2023 (చదవండి: 'సైంటిస్ట్‌గా ఓ భార్యగా గెలిచింది'!..భర్త ప్రాణాలను కాపాడిన నవయుగ సావిత్రి ఆమె!) -
అప్పట్లో జైలు.. త్వరలోనే విలాసవంతమైన హోటల్‌గా..!
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న సువిశాల భవంతి ఆరేళ్ల కిందటి వరకు జైలుగా ఉండేది. దీనిని 2017 మార్చిలో మూసివేశారు. ఇప్పుడు దీనిని పర్యాటకులకు బస కల్పించే హోటల్‌గా మారుస్తున్నారు. జపాన్‌లో హోన్షు దీవిలోని నారా నగరంలో ఉన్న ఈ జైలు బాల నేరస్థుల కారాగారంగా ఉండేది. దాదాపు 115 ఏళ్ల పాటు ఇది బాల నేరస్థుల కారాగారంగానే కొనసాగింది. ఖైదీలు బాగా తగ్గిపోవడంతో జపాన్ ప్రభుత్వం ఈ జైలును మూసివేసింది. ప్రభుత్వం నుంచి దీనిని ఇటీవల హోషినో రిసార్ట్స్ సంస్థ కొనుగోలు చేసింది. పర్యాటకులను ఆకట్టుకునేలా దీనిని హోటల్‌గా మార్చడానికి సన్నాహాలు ప్రారంభించింది. జైలు నిర్మాణాన్ని పెద్దగా మార్చకుండానే, ఇందులో పర్యాటకులకు ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించింది. అతిథులకు జైలులో బస చేసిన అనుభూతి కలిగించడానికి అనువుగా దీని మౌలిక నిర్మాణంలో మార్పులేవీ చేయడం లేదని, అదనంగా ఆధునిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని హోషినో రిసార్ట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ అసాకో సాటో మీడియాకు చెప్పారు. ఇందులో 48 మంది అతిథులు బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని, హోటల్‌గా మారుస్తున్న జైలు ప్రాంగణంలోని గార్డ్స్ క్వార్టర్లు యథాతథంగా ఉంటాయని, వాటిలో గార్డులు ఎప్పటి మాదిరిగానే ఉంటారని తెలిపారు. ఈ ప్రాంగణంలో రెస్టారెంట్, మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిని 2026 నాటికి ప్రారంభించనున్నట్లు చెప్పారు. (చదవండి: పిల్లల గణతంత్ర ప్రపంచం!) -
సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా.. భారత్‌లోనే
ఈ భూమ్మీదచాలా మందికి అందంగా కనపడాలనే ఆశ ఉంటుంది. పురుషుల కంటే మగువల్లో ఈ అందంగా కనిపించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. కురుల నిగారింపు కోసం షాంపూలు, ఆయిల్లు.. చర్మ సౌందర్యానికి సబ్బులు, లోషన్లు, మాయిశ్చరైజర్లు.. పెదాలకు లిప్ కేర్లు.. కాళ్లు చేతులకు మెహందీలు.. గోర్లకు నెయిల్ పాలిష్‌లు.. కనులకు, కనుబొమ్మలకు ఐ లైనర్లు.. అంటూ మహిళలు నిత్యం అందం కోసం ఆరాటపడుతుంటారు. కాబట్టే భారత్ కాస్మోటిక్ రంగం గణనీయంగా వృద్ది సాధిస్తోంది. ఇటీవల కాంటార్ వరల్డ్ ప్యానెల్ నివేదిక ప్రకారం..ఈ ఏడాది భారతీయ మహిళలు తొలి ఆరు నెలల కాలంలో లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్ నుండి ఐలైనర్ వరకు 100 మిలియన్లకు పైగా కాస్మెటిక్ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఫలితంగా కాస్మోటిక్ సంస్థలు రూ. 5,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. వీటిలో బ్యూటీ ప్రొడక్ట్‌ల కోసం మహిళలు సగటున రూ.1,214 ఖర్చు చేయగా.. దాదాపు 40 శాతం కొనుగోళ్లు ఆన్లైన్లో జరిగాయని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఈ తరుణంలో అంతర్జాతీయ కాస్మోటిక్ సంస్థలు భారతీయ మహిళల్ని ఆకట్టుకునేలా స్టార్ హీరోయిన్లను తమ బ్రాండ్ ప్రచారకర్తలుగా నియమించుకుంటున్నాయి. ఇక జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2, భోళా శంకర్, జైలర్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నాను జపాన్ కాస్మోటిక్ దిగ్గజం షిసిడో (Shiseido) భారత్ బ్రాండ్ అంబాసీడర్‌గా నియమించింది. షిసిడో బ్రాండ్ అంబాసీడర్‌గా నియాకం ఆశ్చర్యానికి గురి చేసిందన్న మిల్కిబ్యూటీ.. దాదాపూ 100 ఏళ్లకు పైగా కాస్మోటిక్ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతున్న షిసిడో బ్రాండ్ అంబాసీడర్‌గా ఎంపికవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. కాగా, తమన్నా - షిసిడో మధ్య ఒప్పందం భారత్ ఎంటర్టైన్ మెంట్ పాటు కాస్మోటిక్ రంగంలో రాణించేందుకు దోహదం చేస్తుందని షిసిడో యాజమాన్యం భావిస్తుంది. -
జపనీస్ కుర్రాళ్లకు గడ్డం ఎందుకు ఉండదు?
జపనీస్ కుర్రాళ్లను మనం సినిమాల్లో, ఇంటర్నెట్లో చూసేవుంటాం. వారెవరూ గడ్డాలు పెంచుకోరనే విషయాన్ని మనం గమనించే ఉంటాం. జపాన్‌లో సాధారణ యువకుడు మొదలుకొని ప్రముఖ సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరూ క్లీన్ షేవ్‌తో కనిపిస్తుంటారు. దీంతో జపాన్ పురుషులకు గడ్డం పెరగదా లేకా వారు గడ్డం పెంచుకోవడాన్ని ఇష్టపడరా అనే ప్రశ్న మన మదిలో తలెత్తుతుంది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. జపనీస్ కుర్రాళ్లకు జట్టు పెరగదా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర పురుషుల మాదిరిగానే జపనీస్ కుర్రాళ్లు గడ్డం పెంచుకోగలుగుతారు. అయితే వారి జుట్టు పెరుగుదల ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటుంది. దీని వెనుక చాలా కారణాలున్నాయి. ఉదాహరణకు చల్లని ప్రాంతాల్లో నివసించే వారి శరీరంపై ఎక్కువ వెంట్రుకలు ఉంటాయి. వేడి ప్రదేశాలలో నివసించే వారి శరీరంపై తక్కువ వెంట్రుకలు ఉంటాయి. తూర్పు ఆసియా ప్రజలదీ అదేతీరు. అయితే జపాన్ విషయంలో ఈ సూత్రం వర్తించదు. ఈడీఏఆర్ జన్యువు కారణంగా జపాన్ పురుషుల ముఖంపై తక్కువగా వెంట్రుకలు పెరుగుతాయి. ఈ వారసత్వం కొత్త తరాలకు బదిలీ అవుతుంది. వెంట్రుకల పెరుగుదలకు టెస్టోస్టెరాన్ హార్మోన్ కారణంగా నిలుస్తుంది. 19 నుండి 38 సంవత్సరాల వయస్సు గల యువకులలో టెస్టోస్టెరాన్ స్థాయి డెసిలీటర్కు 264-916 నానోగ్రాముల మధ్య ఉండాలి (ng/dl). అయితే దీనిలో అనిశ్చితి కారణంగా తూర్పు ఆసియా ప్రజలలో జుట్టు తక్కువగా పెరుగుతుంది. గడ్డం ఎందుకు పెంచుకోరు? జపనీస్ కుర్రాళ్లలో కొద్దిమంది మాత్రమే గడ్డం పెంచుతారు. చిన్నపాటి గడ్డం కలిగిన పురుషులు జపనీస్ చరిత్రలో కనిపిస్తారు. కొన్ని దేశాల్లో గడ్డం కలిగి ఉండటం మగతనానికి చిహ్నంగా పరిగణిస్తుంటారు. అయితే గడ్డం దట్టంగా ఉండటమనేది సోమరితనానికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే జపనీస్ పురుషులు గడ్డం పెంచుకోరు. జపనీయుల భావనలో అందం అనేది కళ్లలో ఉంటుంది. అందుకేవారు వారు గడ్డం పెంచుకోవడంపై అంతగా దృష్టిపెట్టరు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? -
కుక్కలా మారిన వ్యక్తి..ఆడ కుక్కతో ప్రేమలో..
ఓ జపాన్ వ్యక్తి ఇటీవల కుక్కలా మారి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి ఓ ప్రముఖ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో.. కుక్కలా మారిన తర్వాత తన అసాధారణ జీవితం ఎలా ఉందో వివరిస్తూ..చాలా షాకింగ విషయాలు చెప్పాడు. అతడు చెప్పిన విషయాలు చూస్తే వామ్మో ఇవేం కోరికలు అనిపించేలా ఉన్నాయి. వివరాల్లోకెళ్తే..ఇటీవలే జపాన్‌కి చెందిన వ్యక్తి తనకెంతో ఇష్టమైన "కోలీ" అనే కుక్కలా మారి ఆశ్చర్యపర్చాడు. అందుకోసం ఎన్నో కంపెనీలు సంప్రదించగా ఓ కంపెనీ ముందుకు వచ్చి కుక్కను తలిపించే కాస్ట్యూమ్ డిజైన్ చేసేందుకు ముందుకు వచ్చింది. . ఇటీవలే అచ్చం కుక్కలా కనిపించే ఆ కాస్ట్యూమ్ని ధరించి వీధుల్లో హల్చల్ చేసి నెట్టింట వైరల్‌గా మారాడు కూడా. ఇప్పుడా వ్యక్తి తనకు ఇలా కుక్క జీవితం ఎంతో నచ్చిందని చెబుతున్నాడు. కుక్క మాదిరిగా నాలుగు కాళ్లపై నడవడం ఇబ్బందిగా ఉన్నా సంతృప్తిగా ఉందని చెప్పడం విశేషం. ఆ వ్యక్తి ఆ కుక్కలా కనిపించే కాస్ట్యూమ్స్ కోసం ఒకటి, రెండు కాదు ఏకంగా రూ. 12 లక్షలు ఖర్చుపెట్టాడు. అంత ఖర్చుపెట్టాడు కాబట్టి ఇష్టపడక ఏం చేస్తాడులే! అని అనుకోకండి. పైగా కుక్కలా అసాధారణ జీవితం గడుపుతున్న అతడికి కలుగుతున్న కోరికలు వింటే మాత్రం ఓర్నీ ఇవేం కోరికలు అని నోరెళ్లబెట్టడం ఖాయం. ఇంతకీ ఆ కుక్కలా మారిన వ్యక్తి తనలానే కుక్కలా మారాలనుకునే స్త్రీ కూడా ఉంటే బాగుండనని, ఆమెతో ప్రేమలో పడాలని అనుకుంటున్నాడట. అంతేకాదు కుక్కలా ఉన్న తనకు సినిమాలో నటించే అవకాశం వస్తే బావుండనని అంటున్నాడు. ఒక్క అవకాశం ఇస్తే తానేంటో చూపించుకుంటానని చెబుతున్నాడు. ఇలా జీవితం గడపడం ఎంత అసౌకర్యంగా అసాధారణంగా ఉన్నా తనకు అలా ఉండటమే ఇష్టమని తేల్చి చెప్పాడు. కోలీ జాతి కుక్కలంటే తనకెంతో ఇషమని అలా ఉండాలన్న కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉందని మరీ చెబుతున్నాడు. ఓర్నీ వెర్రీ వెయ్యి రకాలు అంటే ఏంటో అనుకున్నాం. ఇలానే ఉంటుందేమో కదా!. (చదవండి: వధువు ఎంట్రీ మాములుగా లేదుగా!ఐడియా అదుర్స్) -
ఈ టెక్నిక్ పాటిస్తే.. ఈజీగా డబ్బు సంపాదించగలరు!
పొద్దిన లేచిన దగ్గర నుంచి డబ్బు లేకుండా ఒక్క పని కూడా కాదు. దీంతో అందరూ డబ్బు సంపాదించే మార్గాలను తెగ అన్వేషిస్తుంటారు. ఎలా సంపాదించాలి. ఏవిధంగా ఈజీగా సంపాదించగలం అని రకరకాలు ఆలోచించేస్తుంటారు. ఆ క్రమంలో వారికి తెలియకుండానే ఒత్తిడికి గురవ్వడం, నిద్రలేమి తదితర సమస్యల బారిన పడతారు. పోనీ అంతలా ట్రై చేసినా.. సక్సెస్ అయ్యేవారు కొందరే. చాలామంది రీచ్ అవ్వరు. అలాంటివాళ్లు ఈ టెక్నీక్ ఫాలో అయితే ఎక్కువ డబ్బు సంపాదించడమే కాదు ఆరోగ్యంగా కూడా ఉండగలరు. జపనీస్ వాళ్లు ఈ టెక్నిక్‌నే ఫాలో అవుతారట. ఇంతకీ ఆ టెక్నిక్ ఏంటంటే.. "అరిగాటో".. అంటే.. జపనీస్ భాషలో "ధన్యవాదాలు" అని అర్థం. ఏంటిది? డబ్బు సంపాదించడానికి "ధన్యవాదాలకు" సంబంధం ఏంటీ అని కొట్టిపడేయొద్దు. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా సంతృప్తి అనేది ఉండదు. ఇప్పుడు ఉన్న ట్రెండ్‌కి.. మనకు, మన కుటుంబ అవసరాలు.. రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి. అందుకోసం రెక్కలు ముక్కలు చేసుకుని పడరాని పాట్లు పడతాం. పోనీ అంతలా కష్టపడ్డా.. సంతోషంగా మాత్రం ఉండం. నిరాశ నిస్ప్రుహలకు లోనే మళ్లీ జీరో పొజిషన్‌కి వచ్చే ప్రమాదం లేకపోలేదు. దీంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా చేజేతులారా తెలియకుండానే నాశనం చేసుకుంటాం. అందువల్ల ముందు పాజిటివ్ దృక్పథాన్ని అనుసరిస్తూ దాన్నే మననం చేస్తే డబ్బులు హాయిగా సంపాదించడమే కాదు, కొత్త కొత్త ఐడియాలు తట్టి మరింత సంపాదించే అవకాశాలు రావచ్చు. ఇంతకీ ధన్యవాదాలు అంటున్నారు.. ఎవ్వరికి చెప్పాలనే కదా!. మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకు? అనే కదా..నిజానికి మనం సంపాదించే డబ్బు రెండు రకాలుగా ఉంటుంది. (1) సంతోషాన్నిచ్చే డబ్బు, (2) ఎలాంటి సంతోషం ఇవ్వని డబ్బు. సంతోషాన్నిచ్చే డబ్బు అంటే.. మీరు ఆనందించే వస్తువులను కొనడానికి ఉపయోగించే డబ్బు లేదా మీరు ప్రేమించే వ్యక్తులకు వినియోగించే డబ్బు అన్నమాట. ఇందులోకి మంచి పనులకు ఆనందంగా ఎంతకొంత కేటాయించేది కూడా వస్తుంది. ఇక్కడ మీరు సంతోషంగా వినియోగిస్తే అది విశ్వంలోకి చేరి మీకు తెలియకుండానే అధిక డబ్బు తిరిగి పొందే అవకాశం వస్తుంది. ఎలాంటి సంతోషం ఇవ్వని డబ్బు.. డబ్బుకి ఎలాంటి విలువ ఇవ్వకుండా ఇష్టానుసారం ఖర్చు చేసేది. నచ్చని ఉద్యోగం చేస్తూ.. సంపాదించేది. బిల్లులు లేదా అప్పులు చెల్లించడం కోసం భారంగా చేసేది. కుటుంబాన్ని చూసుకోవాలి కాబట్టి తప్పక చేసేది. ఇది మీకు తెలియకుండానే డబ్బుపై వ్యతిరేకతను విశ్వంలోకి పంపుతుంది తద్వారా మనఃశాంతి కోల్పోతాం. అది మన ప్రేరణతోనే జరుగుతోందని గమనించం అంతే. మనసతత్వ నిపుణులు కూడా చెప్పేది ఇదే. పాజిటివ్ మైండ్‌తో ఉంటే దేన్నైనా సునాయాసంగా సాధించగలరని పదే పదే చెబుతుంటారు. అందుకే ముందు మీరు సంపాదించేది ఎంతైనా సరే.. చాలా చిన్న మొత్తం డబ్బైనా వస్తున్నందుకు ధన్యావాదాలు చెప్పుకోండి అంటే ఇక్కడ అర్థం దేవుడిన నమ్మే వాళ్ల అయితే దేవుడికి లేదా ఇంతైనా సంపాదించగలుగుతున్నా అని మీకు మీరు కృతజ్క్షతలు చెప్పుకుని సంతృప్తిగా ఫీలవ్వండి. ఎంత వచ్చినా దాన్ని మీరు కరెక్ట్‌గా ఖర్చుపెట్టడాన్ని గ్రేట్‌గా భావించండి. ఆ డబ్బును సరైన రీతిలో ఖర్చు బెట్టి బతకగలుగుతున్నందుకు హ్యపీగా ఫీలవ్వండి. ఆ డబ్బును వినియోగిస్తున్న సంతోషంగానే భావించండి తప్ప ఏదో సంపాదిస్తున్నానే లే అన్నట్లు మీకు మీరుగా మిమ్మిల్ని తక్కువ చేసుకోవద్దు. ఇలా పాజిటివిటిని మీ మనుసు తరంగాల ద్వారా విశ్వంలోకి పంపితే అదే మీకు తిరిగి అధిక డబ్బును ఏదో ఒక రూపంలోనో లేక మంచి ఆలోచనల రూపంలోనో అందిస్తుంది. మంచిగా డబ్బు సంపాదించడమే కాదు అధికంగా కూడా ఆర్జించగలుగుతారు కూడా. అందుకనే పెద్దలు చెప్పేది మీ మీద మీరు నమ్మకంతో చేసే ఏ పనైనా సఫలమే గాని విఫలం కాదని. ఇందులో ఉన్న సూక్ష్మాన్ని గ్రహించి సర్వత్రా పాజిటివ్ మైండ్‌ని నింపి మంచి విజయాలు అందుకోండి. మంచైనా చెడైయినా అంతా మన మంచికే అని ఊరికే అనలేదు పెద్దలు. ఇలా భావిస్తే మనం ముందుగా పోగల ధైర్యం లభిస్తుంది. సో ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు ఎంత వచ్చినా మ్యానేజ్ చేసి హాయిగా బతకగలుగుతున్నాం అన్నదే ముఖ్యం. (చదవండి: గమ్యస్థానాలకు చేర్చే "ట్రావెలింగ్ పార్క్"..చూస్తే ఫిదా అవ్వడం ఖాయం!) -
జొమాటోలో వాటా విక్రయం
న్యూఢిల్లీ: జపనీస్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ తాజాగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోలో 1.16 శాతం వాటా విక్రయించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 10 కోట్ల షేర్ల(1.16 శాతం వాటా)ను అమ్మివేసింది. అనుబంధ సంస్థ ఎస్వీఎఫ్ గ్రోత్(సింగపూర్) పీటీఈ షేరుకి రూ. 94.7 సగటు ధరలో రూ. 947 కోట్లకు విక్రయించింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏబీ సన్‌లైఫ్, యాక్సిస్, కొటక్ మహీంద్రాతోపాటు సొసైటీ జనరాలి, మోర్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్, నోమురా సింగపూర్ తదితరాలు జొమాటో షేర్లను కొనుగోలు చేశాయి. ఈ లావాదేవీ తదుపరి జొమాటోలో సాఫ్ట్‌బ్యాంక్ వాటా 3.35% నుంచి 2.19 శాతానికి క్షీణించింది. ఈ వార్తలతో జొమాటో షేరు 5.3 శాతం జంప్ చేసి రూ. 100 సమీపంలో ముగిసింది. -
'జైలర్' సినిమా.. జపాన్ ఫ్యాన్స్ రచ్చ ఓ రేంజులో!
రజనీకాంత్ ‘జైలర్’ రిలీజ్ సందర్భంగా మన దేశంలో ఉన్న జపాన్ అంబాసిడర్ రజనీలా స్టయిల్‌గా కళ్లద్దాలు ధరించి ‘బెస్ట్ విషెస్’ చెప్పాడు. ఇక ‘ముత్తు’ నాటి నుంచి రజనీకి ఫ్యాన్స్‌గా ఉన్న ఒక జంట ఏకంగా జపాన్ నుంచి చెన్నైకి వచ్చింది సినిమా చూడటానికి!రజనీ హవా అలా ఉంది. ‘హుకుమ్... టైగర్ కా హుకుమ్’ అని రజనీకాంత్ చెప్పిన డైలాగ్ సినిమా హాల్లో విజిల్స్‌ను మోతెక్కిస్తోంది. ప్రపంచాన్ని ఇప్పుడు రజనీ చుట్టుముట్టి ఉన్నాడు– జైలర్ సినిమాతో. అసలే రజనీ అనుకుంటే అతనికి తోడు మోహన్‌లాల్, జాకీష్రాఫ్, శివ రాజ్‌కుమార్ కూడా సినిమాలో ఉండేసరికి మాస్ ఆడియెన్స్ పోటెత్తుతున్నారు. అయితే ఈ సంబరంలో ఇండియన్స్ మాత్రమే లేరు... జపనీయులు కూడా ఉన్నారు. ‘ముత్తు’ కాలం నుంచి ఇండియాలో రజనీ ఎంతో జపాన్‌లో కూడా అంతే. అంత ఫాలోయింగ్ ఉంది అక్కడ. అందుకే ఇండియాలో ఉన్న జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకీ ఒక వీడియో రిలీజ్ చేసి అందులో రజనీలా స్టయిల్‌గా కళ్లద్దాలు ధరించి ‘రజనీ యూ ఆర్ జస్ట్ సూపర్.. విష్ యూ గ్రేట్ సక్సెస్’ అని చెప్పాడు. ఇలాంటి మర్యాద ఏ స్టార్‌కూ దక్కలేదు. ఇక జపాన్‌లోని ఒకాసా నుంచి యసుదా హిదెతోషి అనే ఆసామి తన భార్యతో ఏకంగా చెన్నైలో ల్యాండ్ అయ్యాడు ‘జైలర్’ చూసేందుకు. అతను జపాన్‌లో ఆల్ జపాన్ రజనీ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ అట. నెల్సన్ డైరెక్ట్ చేసిన ‘జైలర్’ ప్రస్తుతం కలెక్షన్ల హవా సృష్టిస్తోంది. -
జోకర్ వేషంలో కల్లోలం సృష్టించాడు..చివరికీ అదే..
ఓ వ్యక్తి ఎలాంటి కారణం లేకుండా మనుషులను చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఎందుకు? ఏమిటీ అనే కారణాలతో సంబంధం లేకుండా దారుణాలకు ఒడిగట్టాడు. దొరకననే ధైర్యమా లేక టైం పాస్‌కి అలా చేశాడో తెలియదు. చివరికీ ప్రజలంతా అతడ్ని చంపేయాలని తీర్మానించారు. అప్పుడైనా మార్పు వచ్చిందో లేదో గానీ అకారణంగా అమాయకులు ప్రాణాలు బలిగ్నొ దుర్మార్గుడిగా నిలిచిపోయాడు. వివరాల్లోకెళ్తే..ఓ వ్యక్తి కామిక్ బుక్‌లో ఉండే జోకర్లా వేషం ధరించి టోక్యలోని ఓ రైలులో మారణకాండకు తెగబడ్డాడు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 70 ఏళ్ల వృద్ధిడితో సహా దాదాపు 12 మంది వ్యక్తులను నిర్ధాక్షిణ్యంగా చంపేశాడు. ఆ దారుణం 2021లో జరిగింది. ఐతే ఆ టైంలో ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఎవ్వరో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు. ఎందువల్ల ఇలా చేశాడని ఎంతలా ఆరా తీసినా? ఎవరా వ్యక్తి? అనేది ఓ మిస్టరీలా మిగిలిపోయింది. ఐతే చేసిన పాపం వదిలిపెట్టదు కదా. ఎట్టకేలకు పోలీసులు శతవిధాల చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యి ఆగంతకుడిని పట్టించేలా చేసింది. పోలీసులు ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిని క్యోటా హట్టోరి(26)గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి..కోర్టు ముందు హాజరుపర్చారు. విచారణలో తాను ప్రజలు చంపాలనుకున్నట్లు ఒప్పుకున్నాడు కూడా. దీంతో కోర్టు అతడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దొరక్కూడదని చేసిన ఏ చిన్న నేరమైన ఏదో రూపంలో దోషిగా నిలబెట్టేస్తుంది. ఇక ఆ సమయంలో నువ్వు బాధపడినా ప్రయోజనం ఉండదు. (చదవండి: ఓ వ్యక్తి 'మానవశునకం'గా రూపాంతరం.. కుక్కలా వీధుల్లో సంచరిస్తూ..) -
ఇచ్చట రెక్కలు అద్దెకు ఇవ్వబడును
‘నీలాగ నాకు పది చేతులు లేవు’ అనే డైలాగ్ ఇక ముందు వినిపించవచ్చు. జపాన్‌లోని ‘యూనివర్శిటీ ఆఫ్ టోక్యో’ కు చెందిన ప్రొఫెసర్ మసహకో ఇనామి నేతృత్వంలోని పరిశోధక బృందం ‘జీజై ఆర్మ్స్’ పేరుతో వేరబుల్ రోబో ఆర్మ్స్ను తయారు చేసింది. డ్యాన్స్లాంటి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ వరకు ఈ రోబో ఆర్మ్స్ ఉపయోగపడతాయి. ‘జీజై’ అంటే జపనీస్‌లో స్వాతంత్య్రం, స్వయంప్రతిపత్తి అని అర్థం. యసునరి అనే రచయిత రాసిన ఒక కథ చదివిన తరువాత ప్రొఫెసర్ మసహకో ఇనామికి ‘వేరబుల్ ఆర్మ్స్’ ఐడియా వచ్చింది. ‘జీజై ఆర్మ్స్’కు సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అయింది -
జపాన్ భాషలో ఆర్ఆర్ఆర్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం గత ఏడాది మార్చి 25న విడుదలైన విషయం తెలిసిందే. కాగా ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు వెర్షన్‌ని జపనీస్ సబ్ టైటిల్స్‌తో 2022 అక్టోబరు 21న జపాన్‌లో విడుదల చేశారు. జపాన్ బాక్సాఫీస్ వద్ద రూ. 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిందీ చిత్రం. ఇంకా అక్కడ ప్రదర్శితమవుతోంది. దీంతో ఈ చిత్రాన్ని జపాన్ భాషలో రిలీజ్ చేస్తున్నట్లుగా శుక్రవారం చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘‘జపాన్ సబ్‌టైటిల్స్‌తో కూడిన తెలుగు వెర్షన్ ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది. ఇప్పుడు జూలై 28న ఈ సిని మాను జపాన్ భాషలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాం’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. -
హీహీహీ... హాహ్హాహ్హా అంతే!
నవ్వు ఆరోగ్యానికి మంచిదని మనందరికి తెలుసు. తీరికలేని లైఫ్‌స్టైల్, బాధ్యతలు, బరువులతో నవ్వడం కూడా మర్చిపోతున్నాం. ఇది చాలదన్నట్లు రెండేళ్లపాటు ప్రపంచాన్ని శాసించిన కరోనా పుణ ్యమా... ముఖానికి మాస్కుల తాళం పడింది. శానిటైజర్లు ఆవిరైపోయినట్లే ముఖాల మీద నవ్వులు మాయ మయ్యాయి. ఇప్పుడు చాలామందికి చక్కగా నవ్వడం ఎలాగో తెలియడం లేదు. ఈ జాబితాలో జపాన్ వాసులు ముందు వరుసలో ఉన్నారు. గత కొద్దికాలంగా నవ్వడం మర్చిపోయిన జపనీయులు ప్రస్తుతం నవ్వులు ్రపాక్టీస్ చేయడం కోసం కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఇది కాస్త చిత్రంగా, మనకు నవ్వొస్తున్నా సరే... హహ్హా నవ్వుల కోసం వారు తెగ హడావుడి చేస్తున్నారు. నవ్వు ఆరోగ్యమేగాక, నవ్వడం వల్ల ముఖ కండరాలకు మంచి వ్యాయామం జరిగి ముఖం మరింత గ్లోగా కనిపిస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది. ఎక్కడైనా పని లేదా ఉద్యోగం చేయాలన్నా ముఖం మీద చిరునవ్వు తప్పనిసరి. దానితోనే నలుగురితోపాటు ముందుకు సాగగలం. ఇదే విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జపనీయులు శ్రద్ధగా నేర్చుకుని మరీ నవ్వుతున్నారు. అక్కడి స్మైలింగ్ కోచింగ్ సెంటర్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. కోవిడ్ ఆంక్షలు, కొన్ని రకాల ఫ్లూల వల్ల దాదాపు మూడేళ్లపాటు మాస్కులు ధరించిన జపనీయులు నవ్వడం మర్చిపోయారు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో ‘స్మైలింగ్ లెసన్స్’ నేర్చుకుంటున్నారు. చక్కగా నవ్వేందుకు ఏకాగ్రతతో పాఠాలు వింటున్నారు. ఒక్కో స్మైలింగ్ ట్రైనర్ దగ్గర మూడు వేలమంది క్లాసులకు హాజరవుతున్నారంటే అక్కడి డిమాండ్ ఏంటో తెలుస్తోంది. హాలీవుడ్ స్మైల్... గతంలో రేడియో హోస్ట్‌గా పనిచేసిన కైకో క్వానో స్మైలింగ్ ఇన్స్టిట్యూట్ను నడుపుతున్నారు. ‘‘హాలీవుడ్ స్టైల్ స్మైలింగ్ టెక్నిక్’’ను నేర్పించడం ఈమె ప్రత్యేకత. కళ్లను నెలవంకలా తిప్పి, బుగ్గలను గుండ్రంగా పెట్టి పై దవడలోని ఎనిమిది దంతాలు కనిపించేలా నవ్వడమే హాలీవుడ్ స్మైల్. ప్రస్తుతం జపనీస్ విద్యార్థులు ఈ నవ్వుని ఎగబడి నేర్చుకుంటున్నారు. ‘‘విద్యార్థులు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో మా దగ్గర క్లాసులు చెప్పించుకుంటున్నారు. భవిష్యత్‌లో చేయబోయే ఉద్యోగాలకు నవ్వు ముఖ్యమని వారంతా క్లాసులకు హాజరవుతున్నారు. స్మైల్ ఎడ్యుకేషన్ గతంలోకంటే ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగింది. ఒక్కోక్లాసుకు మన రూపాయల్లో సుమారు రూ.4,500 తీసుకుంటున్నాము. నవ్వుతూ ఎవరిని పలకరించినా అ΄్యాయంగా దగ్గరవుతారు’’ అని క్వానో చెబుతోంది. నవ్వితే ముత్యాలేమీ రాలిపోవు, నాలుగు రకాలుగా మంచే జరుగుతుంది కాబట్టి మనం కూడ మనసారా నవ్వుదాం. ‘‘నవ్వు అనేది సహజసిద్ధంగా జరగాల్సిన ఒక ప్రక్రియ. ఇది చాలా ముఖ్యమైనది. ఎవరినైనా కలిసినప్పుడు మొదట మన నవ్వే పలకరిస్తుంది. మంచి మర్యాదలు మన నవ్వులోనే కనిపిస్తాయి. నవ్వడం మానేస్తే ముఖ కండరాలను ఎలా వాడాలో మెదడు మర్చిపోతుంది అని నిపుణులు చెబుతున్నారు. అందుకే నవ్వడం చాలా ముఖ్యం’’ అని స్మైలింగ్ ఇన్స్ట్రక్టర్ మిహోకిటానో చెబుతున్నారు. -
ముంబై: మన గడ్డపై జపాన్ సుమోల సందడి (ఫొటోలు)
-
అంతరిక్షంలో అడుగు పెట్టనున్న భారతీయ నటుడు..ఎవరంటే?
Indian Actor Dev Joshi:స్పేస్ టూరిజంలో మరో సరికొత్త సంచలనం సృష్టించేందుకు అపరకుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది 8 మందిని అంతరిక్షంలోకి పంపించనున్నారు. తాజాగా నింగిలోకి వెళ్లేందుకు సిద్ధమైన ఆ ఎనిమిది మంది ఎవరనేది జపాన్ బిలియనీర్ యుసాకు మాయఝావా రివిల్ చేశారు. ఎందుకంటే? మూన్ ట్రిప్ కోసం స్పేస్ ఎక్స్‌కు చెందిన స్పేస్ షిప్ స్పేస్ క్రాఫ్ట్ సీట్లు కొనుగోలు చేసింది ఆయన కాబట్టి. ఇక స్పేస్‌లోకి వెళ్లే ప్రయాణికుల్లో ఓ భారతీయ నటుడు ఉండటం విశేషం.ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా? జపాన్‌లో అత్యంత ధనవంతుల జాబితాలో బిజినెస్ టైకూన్ యుసాకు మేజావా (Yusaku Maezawa) ఒకరు. ఎలాన్ మస్క్ తరహాలో ప్రమోషన్ కోసం సోషల్ మీడియాలో.. ముఖ్యంగా ట్విటర్లో ట్వీట్లు చేస్తూ అందర్ని ఆకర్షిస్తుంటారు. అందుకు ఉదాహరణే ఈ ట్వీట్. 2020 జనవరి 1న మేజావా చేసిన ఓ ట్వీట్‌ను ఎవరైతే ఎక్కువ సార్లు రీట్వీట్ చేస్తారో..వారిలో 1000 మందిని ఎంపిక చేసి 1 మిలియన్ యెన్ ($7300) చెల్లిస్తానని ప్రకటించారు. ఎందుకు ఇలా ఫ్రీగా ఇస్తున్నారని ప్రశ్నిస్తే ఇదొక సోషల్ ఎక్స్పెరిమెంట్. నేనిచ్చే డబ్బులు వారికి ఆనందాన్ని ఇస్తుందో లేదో చూడాలని ఇలా ప్రకటించినట్లు తెలిపారు. ఉచితంగానే ఇప్పుడు అదే మేజావా ప్రపంచ వ్యాప్తంగా 8 మందిని ఎంపిక చేసి వారిని ఉచితంగా చంద్రుని మీదకు పంపించేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది ‘డియర్ మూన్ క్రూ’ పేరుతో అంతరిక్ష ప్రయాణం ప్రారంభం కానుంది. నింగిలోకి వెళ్లనున్న ఆ 8 మంది మొత్తం ఆరు రోజుల ప్రయాణం చేయనుండగా .. మూడు రోజులు పాటు చంద్రుడి చుట్టూ తిరిగి భూమి మీదికి రానున్నారు. ఆ 8 మంది ఎవరంటే ఆకాశాన్నీ దాటి అంతరిక్షంలోకి వెళ్లనున్న 8 మందిలో మనదేశానికి చెందిన నటుడు దేవ్ జోషితో పాటు జపనీస్ ఫ్యాషన్.. అమెరికన్ డిజె, నిర్మాత స్టీవ్ అయోకి, Czech artist యెమి ఎడి, అమెరికన్ యూట్యూబర్ టిమ్ డాడ్, బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ కరీం ఇలియా, ఐరిష్ ఫోటోగ్రాఫర్ రియానన్ ఆడమ్, దక్షిణ కొరియా కె-పాప్ బ్యాండ్ స్టార్ చోయ్ సెయుంగ్-హ్యూన్ (Choi Seung-hyun) అమెరికన్ చిత్రనిర్మాత బ్రెండన్ హాల్ ఉన్నారు. భారత్‌కు చెందిన ఆ నటుడు ఎవరంటే వారిలో మనదేశంలోని గుజరాత్‌కు చెందిన దేవ్ జోషి చిన్నప్పట్నుంచి పలు సీరియల్స్, సినిమాల్లో బాలీవుడ్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఇతనికి కేవలం 22 సంవత్సరాలే. పలు నివేదికల ప్రకారం.. భారతీయ నటుడు, గుజరాత్‌కు చెందిన దేవ్ జోషి 3 ఏళ్ల వయస్సులో బాల నటుడిగా బుల్లితెరకు పరిచయం అయ్యాడు. అలా సోనీ (సోనీ సాబ్) టీవీ అక్టోబర్ 8, 2012లో విడుదల చేసిన బాల్ వీర్లో, బాల్ వీర్ రిటర్న్‌తో సీరియల్స్ తో పాటు 20కి పైగా గుజరాతీ సినిమాలు, ఇతర అడ్వటైజ్మెంట్లలో యాక్ట్ చేశారు. తాజాగా ఉచితంగా అంతరిక్షంలోకి వెళ్లే అదృష్టాన్ని దక్కించుకున్నారు. That's our Flight Path to the Moon and Back! 💙🚀 https://t.co/LtLxGuvNKW — Dev Joshi (@devjoshi10) December 10, 2022 -
అదిరిపోయే గ్యాడ్జెట్.. కొత్తగా చూసేవాళ్లు కొరివిదెయ్యమని భయపడతారు!
లాంతరు నడవటమేంటి? లాంతరు పట్టుకుని మనిషి నడవాలి కదా అనుకుంటున్నారా? ఈ హైటెక్ లాంతరు మాత్రం తనంతట తానే నడుస్తుంది. రాత్రివేళ ఇంట్లో దీపాలార్పేసి, దీన్ని వెలిగించుకుంటే ఇల్లంతా కలియదిరుగుతూ రంగు రంగుల్లో వెలుగులు విరజిమ్ముతుంది. కొత్తగా చూసేవాళ్లు ఇదేదో కొరివిదెయ్యంలా ఉందనుకుని భయపడే అవకాశాలూ లేకపోలేదు. మామూలుగా చార్జింగ్ చేసుకుని వాడుకునే ఎమర్జెన్సీ దీపాల్లాగానే దీనిని వాడుకోవచ్చు. అయితే, దీనికింద సాలీడు కాళ్లలాంటి రోబోటిక్ కాళ్లను అమర్చడం వల్ల ఇది నడవగలుగుతుంది కూడా. జపాన్‌కు చెందిన ఐటీ ఇంజనీర్ ఇయానియస్ తన ప్రాజెక్టులో భాగంగా దీనికి రూపకల్పన చేశాడు. దీని తయారీ కోసం త్రీడీ ప్రింటింగ్ ద్వారా ముద్రించిన విడిభాగాలను ఉపయోగించాడు. దీని పనితీరును ప్రత్యక్షంగా చూపడానికి తీసిన వీడియో ‘ట్విట్టర్’లో పెడితే, కొద్ది గంటల్లోనే అది వైరల్‌గా మారింది. చదవండి: ‘బకరాల్ని చేశాడు.. మస్క్ ట్వీట్‌తో మబ్బులు వీడాయ్’ -
జపనీస్ భాష నేర్చుకుంటున్న ఎన్టీఆర్.. యువతులతో సరదా సంభాషణ..!
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ జపాన్‌లో బిజీగా ఉన్నారు. కుటుంబ సమేతంగా జపాన్ వెళ్లిన యంగ్ టైగర్ ఫ్యాన్స్‌తో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. జపాన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎన్టీఆర్ సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా జపనీస్ యువతులతో ఆయన సరదాగా ముచ్చటించారు. జపనీస్ భాష నేర్చుకుంటూ ఉత్సాహంగా కనిపించారు. వారితో కలిసి జపానీస్ భాష నేర్చుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. జపాన్‌లో రెండు పదాలు నేర్చుకున్నానంటూ వారితో సరదాగా మాట్లాడారు. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫోటోలు వైరల్) ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్‌లోనూ ఈనెల 21న విడుదలైంది. ఇందు కోసం చిత్రబృందం జపాన్‌లో పర్యటించింది. ఇటీవలే ఓ హోటల్ జూనియర్ వెళ్లగా ఫ్యాన్స్ సందడి చేశారు. ఎన్టీఆర్‌తో ఫోటోలు దిగేందుకు జపనీయులు ఎగబడ్డారు. జపాన్‌లోనూ ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ ఫాలోయింద్ తగ్గలేదు. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రూ. రూ.1200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇంతటి ప్రజాధారణ పొందిన ఈ చిత్రం భారతదేశం నుంచి ఆస్కార్‌కు ఎంపికవుతుందని అందరూ భావించారు. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలవాలని కోరుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ మూవీ ఛైల్లో షోను ఆస్కార్స్‌కు నామినేట్ చేసింది. -
వీసా లేకుండా విదేశాలకు వెళ్లొచ్చు..!
-
ట్రాఫిక్ సమస్యకి చెక్.. జుయ్‌మంటూ ఎగిరే బైకులు రాబోతున్నాయ్!
ప్రస్తుత రోజుల్లో నగరవాసులకు అతి పెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది ట్రాఫిక్ జామ్. దీని వల్ల వాళ్ల సమయం వృథా కావడంతోపాటు వారి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇక సిటీ లైఫ్‌లో ట్రాఫిక్ సమస్య కూడా ఓ భాగమే అనుకుని ప్రజలు ముందుకు సాగిపోతున్నారు. అయితే త్వరలో ఈ సమస్యకు చెక్ పెడుతూ ట్రాఫిక్ చిక్కులు లేకుండా త్వరగా గమ్యం చేరుకోవచ్చట. ఎలా అంటారా.. జపనీస్ కంపెనీ తాజాగా గాల్లో ఎగిరే బైకును తయారు చేసింది. ఇటీవలే ఆ బైక్‌ను మీడియా ముందు ప్రదర్శించింది. జుయ్‌మంటూ వచ్చేస్తోంది ఎగిరే బైక్.. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే బైక్. దీనికి XTURISMO hoverbike అని పేరు పెట్టారు. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్( AERWINS) టెక్నాలజీస్ తయారు చేసిన ఈ ఫ్లయింగ్ బైక్ గురువారం యునైటెడ్ స్టేట్స్‌లోని డెట్రాయిట్ నందు జరిగిన ఆటో షోలో ప్రదర్శించారు. ఈ హోవర్‌బైక్ ప్రముఖ స్టార్ వార్స్ సినిమాలోని బైక్‌లతో పొలిక ఉండడంతో అందరినీ ఆకర్షించింది. ఈ బైక్ గరిష్టంగా 100 kph (గంటకు 62 మైళ్లు) వేగంతో 40 నిమిషాల పాటు ప్రయాణించగలదు.ఈ బైకుపై ఒకరు కూర్చుని ప్రయాణం చేయవచ్చు. వచ్చే ఏడాది ఈ బైక్ అమెరికన్ మార్కెట్లోకి రానుంది. జపాన్‌లో ఇప్పటికే ఈ బైక్‌లు అమ్మకంలో ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఈ బైక్ ధర చాలా ఎక్కువగా ఉంది. ఈ హోవర్‌బైక్ ధర $7,77,000 (భారత కరెన్సీ ప్రకారం 6 కోట్లు) ఉంటుంది. అయితే కంపెనీ సీఈఓ మాట్లాడుతూ.. ఈ మోడల్ ధరను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని అందుకోసం కంపెనీకి మరో 2-3 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. This is the world's first flying bike. The XTURISMO hoverbike is capable of flying for 40 minutes and can reach speeds of up to 62 mph pic.twitter.com/ZPZSHJsmZm — Reuters (@Reuters) September 16, 2022 చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! -
ఎంతటి సాహాసయాత్ర! 83 ఏళ్ల వయసులో ఒంటరిగా మహా సముద్రాన్ని...
Japanese Man solo, non-stop trip across the Pacific: భూమి పై గల మహాసముద్రాలన్నిటిలోకి పసిఫిక్ మహాసముద్రం పెద్దది. అలాంటి పసిఫిక్ మహాసముద్రాన్ని 83 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా చుట్టోచ్చేశాడు. ఒంటరిగా సమద్రయానం చేసిన తొలి వృద్ధుడిగా నిలిచాడు. ఇంతకి అతను ఎవరు? ఎలా అంత పెద్ద సాహసయాత్రను చేయగలిగాడో అనే కదా! వివరాల్లోకెళ్తే... జపాన్‌కి చెందిన 83 ఏళ్ల కెనిచి హోరీ పసిఫిక్ మహాసమ్రుదం మీదుగా ఒంటరిగా సముద్రయానం చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. సముద్ర సాహసికుడు. చిన్నతనం నుంచి ఇలాంటి సముద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలు చేయడమంటే అతని అత్యంత ఆసక్తి. అతను 1962లో 23 ఏళ్ల వయసులోనే జపాన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణించి, పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన ప్రపంచలోనే తొలి వ్యక్తిగా పేరుగాంచాడు. అయితే ఆసమయంలో పాస్‌పోర్ట్ లేకుండా అమెరికాలో ప్రయాణిస్తున్నప్పుడూ చాలా ఒత్తిడికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. ఇలా సమద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలను వరుసగా 1974, 1978, 1982, 2008 వరకు చేశాడు. తదనంతరం మళ్లీ ఇప్పుడూ హోరీ మార్చిలో శాన్ ఫ్రాన్సిస్కోలోని యాచ్ హార్బర్ నుంచి తన తొలి సాహాసయాత్రను ప్రారంభించాడు. ఈ సాహసయాత్రను విజయవంతంగా ముగించుకుని శనివారం తెల్లవారుజామున జపాన్‌లోని కియ్ జలసంధికి చేరుకోవడంతో ముగిసింది. ఈ అరుదైన సాహాసయాత్రతో పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన తొలి అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు. (చదవండి: భారత యువసైంటిస్ట్ మేధస్సుకు ఐన్‌స్టీన్ ఫిదా! ప్చ్.. నోబెల్ మాత్రం దక్కలేదు!) -
ఉక్రెయిన్‌కు భారీ సాయం... పెద్ద మనసు చాటుకున్న బిలియనీర్!
Japan Billionaire in a letter addressed to Ukraines President: జపనీస్ బిలియనీర్ ఇ-కామర్స్ దిగ్గజం రకుటెన్ వ్యవస్థాపకుడు హిరోషి మిక్కి మికిటాని ఉక్రెయిన్ ప్రభుత్వానికి రూ. 65 కోట్లు విరాళంగా అందిస్తానని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీకి రాసిన లేఖలో తెలిపారు. అంతేకాదు ఉక్రెయిన్‌లో హింసకు గురైన వ్యక్తులకు సహాయం చేయడానికి, మానవతా కార్యకలాపాల నిమిత్తం ఈ విరాళం అందజేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన ఆలోచనలు అన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడి, ప్రజలు చుట్టూనే తిరుగుతున్నాయని కూడా లేఖలో రాశారు. "శాంతియుత ప్రజాస్వామ్య ఉక్రెయిన్ను అన్యాయమైన శక్తితో తొక్కడం ప్రజాస్వామ్యానికి సవాలు అని నేను నమ్ముతాను. రష్యా, ఉక్రెయిన్ ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోగలవని, ఉక్రెయిన్ ప్రజలు వీలైనంత త్వరగా శాంతిని పొందాలని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను" అని లేఖలో పేర్కొన్నారు. తాను 2019లో ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను సందర్శించి జెలెన్స్కీని కలిశానని కూడా మికిటాని చెప్పారు. రష్యా దండయాత్ర ప్రధాన ప్రజాస్వామ్య దేశాల నుంచి విస్తృత ఆర్థిక ఆంక్షలను ప్రేరేపించేలా చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, సంస్థలు ఉక్రెయిన్‌కు సహాయం చేయడానికి విరాళాలను అభ్యర్థించాయి కూడా. జపాన్ ప్రభుత్వం మాస్కోపై ఆస్తులను స్తంభింపజేయడమే కాక రష్యన్ మిలిటరీకి సంబంధించిన సంస్థలకు సెమీకండక్టర్స్ వంటి కీలక ఎగుమతులను నిషేధించడంతో సహా పలు ఆంక్షలను ప్రకటించింది. (చదవండి: ఉక్రెయిన్ అధ్యక్షుడి నాటి డ్యాన్సింగ్ వీడియో!) -
షీప్ కాదు.. జపనీస్ పప్పీ
‘‘పత్తిపూల మెరుపు.. పట్టుకుచ్చులందం.. వెన్నెల పోతపోసుకున్న వెన్నముద్ద’’ ఈ ఫొటోలో తెల్లటి అందమైన గొర్రెను తలపిస్తున్నది ఓ బుజ్జి కుక్కపిల్ల. ఇది పూడిల్ జాతికి చెందిన జపనీస్ పప్పీ. మైదానంలో కుందేలులా గంతులేస్తున్న గోమా(కుక్కపిల్లపేరు)... ఇన్‌స్టాలో అందరి హృదయాలను గెలుచుకుంది. హెయిర్‌కట్‌కు ముందు.. హెయిర్ కట్ తరువాత... ప్రొఫెషనల్ మోడల్లా ఫొటోలకు పోజులిచ్చింది. -
యువరాణి పెళ్లికి ముహూర్తం ఫిక్స్
టోక్యో: జపాన్ యువరాణి మాకో తన చిరకాల ప్రేమికుడు కీయ్ కౌమురోను పెళ్లి చేసుకోబోతోంది. తన ప్రేమ కోసం తన వారసత్వ సంపదగా వచ్చే పెద్ద మొత్తాన్ని వదులు కోవడానికి సిద్ధపడి వార్తల్లో నిలిచిన మాకో ఎట్టకేలకు తన ప్రియుడిని మనువాడేందుకు సిద్ధమైంది. మాజీ కాలేజీ క్లాస్‌మేట్‌ను అక్టోబర్ 26 న వివాహం చేసుకోనుంది. పలు విమర్శలు, నిశిత పరిశీలన తర్వాత జపాన్ రాజకుటుంబ వ్యవహారాలు చూసే ఇంపీరియల్ హౌస్‌హోల్డ్ ఏజెన్సీ ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అయితే యువరాణి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడుతోందని, దాన్నుంచి కోలుకునేందుకు ఇంత సమయం పట్టిందని కూడా ప్రకటించింది. సంప్రదాయ వివాహం అనంతరం ఆమె రాజ కుటుంబాన్ని విడిచిపెడుతుందనీ, సాధారణ రాజ వివాహానికి సంబంధించిన వేడుకలేవీ జరగవని స్పష్టం చేసింది. జపనీస్ రాయల్ వెడ్డింగ్‌తో పాటు జరిగే అన్ని ఆచారాలకు విరుద్ధంగా ఈ వివాహం ఉంటుందని తెలిపింది. చక్రవర్తి అఖిహిటో ముని మనవరాలు, నరుహిటో మేనకోడలైన మాకో, కౌమురో ఎంగేజ్మెంట్ 2017లోనే జరిగింది. కానీ కౌమురో తల్లికి, ఆమె మాజీ ప్రియుడి మధ్య ఉన్న ఆర్థిక వివాదం కారణంగా 2018లో జరగాల్సిన వీరి పెళ్లి ఆలస్యమవుతూ వచ్చింది. వీరి ప్రేమ వార్త జపాన్ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో పెద్ద చర్చకుదారి తీసింది. ఈ జంట తమ వివాహాన్ని స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో నమోదు చేసుకుంటారని యువరాణి 110 మిలియన్ జపనీస్ యెన్స్ లేదా 1.4 మిలియన్ డాలర్లను వదులుకుందని అధికారిక ప్రకటన తెలిపినట్టు స్థానికమీడియా నివేదించింది. యువరాణి.. సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వారికి రాయల్టీ కింద కొంత సొమ్మును ముట్టజెబుతారు. కానీ ప్రిన్సెస్ మాకో 1.4 మిలియన్ డాలర్లను రిజెక్ట్ చేసి మరీ పెళ్లి సిద్ధంగావడం విశేషంగా నిలిచింది. అలాగే కౌమురోతో పెళ్లి అనంతరం జపాన్ రాజకుటుంబ వారసత్వాన్ని కూడా ప్రిన్సెస్ మాకో కోల్పోనుంది. కియో కౌమురో పోనీటైల్‌తో దర్శనమిచ్చి మీడియాను ఆకర్షించాడు. కౌమురో ఈ సంవత్సరం ఫోర్డ్హామ్ లా స్కూల్లో చదువు పూర్తి చేయడంతోపాటు, లా ప్రాక్టీస్ కోసం బార్ ఎగ్జామ్ పూర్తి చేశాడు. తాజా మీడియా నివేదికల ప్రకారం, అతను అమెరికాలో ఒక లా ఆఫీసులో ఉద్యోగాన్ని సంపాదించాడు. ఈ నేపథ్యంలో తన ప్రియుడు కౌమురోను పెళ్లి చేసుకొని అమెరికాకు షిఫ్ట్ కానుంది మాకో. కాగా డైలీ మైనీచి ఇటీవల నిర్వహించిన పోల్‌లో 38 శాతం మంది వీరి వివాహానికి మద్దతునివ్వగా, 35 శాతం మంది వ్యతిరేకించారు. 26 శాతం తటస్థంగా ఉండిపోయారు. -
ఒలింపిక్స్‌పై ఆసక్తి చూపని ప్రపంచం.. తాజా సర్వేలో వెల్లడి
టోక్యో: నాలుగేళ్లకోసారి జరిగే విశ్వక్రీడల కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కరోనా మహమ్మారితోపాటు హైప్రొఫైల్ అథ్లెట్లు(గోల్ఫ్ మాజీ నంబర్ వన్ ఆడమ్ స్కాట్, ఫుట్‌బాల్ స్టార్ నెయ్మార్, టెన్నిస్ స్టార్లు ఫెదరర్, నదాల్, సెరెనా విలియమ్స్ తదితరులు) ఈసారి ఒలింపిక్స్‌కు దూరంగా ఉండటంతో.. టోక్యో వేదికగా జరగనున్న ఈ క్రీడలపై ఎవరూ ఆసక్తి చూపడం లేదని తాజా సర్వే ఒకటి తేల్చింది. ఇప్సోస్ అనే సంస్థ 28 దేశాల్లో నిర్వహించిన సర్వేలో కేవలం 46 శాతం మంది మాత్రమే ఒలింపిక్స్‌పై ఆసక్తిగా ఉన్నట్లు తేలింది. ఇక విశ్వక్రీడలకు వేదిక అయిన జపాన్‌లో అయితే కేవలం 35 శాతం మంది మాత్రమే ఒలింపిక్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తేలడం గమనార్హం. ఇదిలా ఉంటే, ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా ఈ గేమ్స్‌కు ప్రేక్షకులెవరినీ అనుమతించడం లేదు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన అథ్లెట్లు టోక్యో చేరుకోగా, వారిలో కొందరికి కరోనా పాజిటివ్‌గా తేలడం మరింత ఆందోళన కలిగిస్తోంది. -
7 మామిడి పండ్లకు నలుగురు బాడీగార్డ్స్.. ఎందుకో తెలుసా!
భోపాల్: వేసవికాలం వచ్చిందటే మనకు ముఖ్యంగా గుర్తుకు వచ్చేవి రెండే రెండు ..ఒకటి మండే ఎండలు..రెండోది మామిడి పండ్లు... మమాలుగా సీజన్ ఉన్నప్పుడు ఒక కేజీ మామిడి పండ్ల రేటు ఎంత ఉంటుంది.. మహా అయితే రూ. 50, అసలు మామిడి పండ్ల దిగుబడి మరి తక్కువగా ఉన్నప్పుడు రూ. 100-150 వరకు వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి. కాగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జబల్పూర్ వాసి పండించిన మామిడి పండ్లు ఒక కేజీ ఏకంగా రూ. 2 లక్షల 70వేలు. ఏంటి షాక్ గురవుతున్నారా..! కేజీ మామిడి పండ్లు మరి ఇంతా ధర ఉంటాయాని విస్తుపోతున్నారా.. అవును మీరు చూసింది నిజమే..! ఒక కేజీ మామిడి పండ్ల ధర అక్షరాల రెండు లక్షల డెభైవేలు. ఈ మామిడి పండ్లు ప్రపంచంలోనే చాలా అరుదైనవి. జబల్పూర్కు చెందిన పరిహర్ ఈ మామిడి పండ్లను పండిస్తున్నాడు. ఈ పండ్లు జపాన్‌కు చెందిన మియాజాకి అనే అరుదైన మామిడి వంగడం. పరిహర్ చెన్నై వెళ్తున్న సమయంలో రైలులో ఉన్న వ్యక్తి తనకు ఈ మామిడి మొక్కను ఇచ్చాడని తెలిపాడు. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధర పలికే జపనీస్ మియాజాకి మామిడి వంగడమని అతనికి తెలియదు. ప్రస్తుతం ఈ చెట్టుకు కాసిన ఏడు మామిడి పండ్లను కాపాడటం కోసం ఏకంగా నలుగురు కాపల సిబ్బందిని, ఆరు కుక్కలను ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఒక వ్యాపారవేత్త ఒక మామిడి పండు కోసం ఏకంగా రూ. 21 వేలను వెచ్చించి తీసుకున్నాడు. చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్ గుర్తించి, ఏకంగా 22 లక్షలు దక్కించుకున్నాడు! -
చంద్రుడి పైకి ‘ఫ్రీ’గా తీసుకెళతాడు
చంద్రుడిపైకి వెళ్లాలని ఎవరికి మాత్రం ఉండదు! మనం శాస్త్రవేత్తలం కాదు కాబట్టి వెళ్లలేము. శాస్త్రం తో సంబంధం లేని సామాన్యులు కూడా చంద్రుడిపైకి వెళ్లబోతున్నారట కదా..అంటే వాళ్లేమో బాగా డబ్బున్న వాళ్లు. ఇక చంద్రుడిపైకి ఎలా వెళ్లగలం? సరిగ్గా మనలాంటి వారి కోసమే వచ్చింది ‘డీయర్మూన్’ అనే బంఫర్ ఆఫర్. ‘డబ్బు గురించి ఆలోచించకండీ. కాణీ ఖర్చు లేకుండా చంద్రుడి పైకి తీసుకెళతాను’ అంటున్నాడు జపనీస్ కుబేరుడు యుసకు మజవా. స్పేస్ఎక్స్ ఫ్లైట్ 2023 (ఫస్ట్ సివిలియన్ ట్రిప్) లో ఎనిమిది మందిని ఉచితంగా చంద్రుడి పైకి తీసుకెళతానని ప్రకటించాడు యుసకు. మొదట్లో ఆర్టిస్ట్‌లను మాత్రమే తీసుకెళదామని అనుకున్నాడు. ‘ప్రతివ్యక్తిలో ఒక ఆర్టిస్ట్ ఉంటాడు’ అనే ఆలోచన వచ్చిన తరువాత ‘ఆర్టిస్ట్‌లకు మాత్రమే’ అనే నిబంధనను మార్చాడు. ‘ప్రపంవ్యాప్తంగా ఎవరైనా ఈ ఫ్రీ ట్రిప్‌కు అప్లై చేసుకోవచ్చు’ అని ట్విట్టర్లో ప్రకటించాడు ఫ్యాషన్ మొగల్ యుసకు. ఈ వీడియోలో అప్లికేషన్ వివరాలకు సంబంధించిన లింక్‌ను షేర్ చేశాడు. ఎంపిక ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలను మార్చి15 తరువాత తెలియజేస్తారట. ‘ఈ ట్రిప్‌ను ఫన్ ట్రిప్‌గా మార్చుదాం’ అంటున్నాడు యుసకు. ఆ ఎనిమిదిమంది అదృష్టవంతులు ఎవరో వేచి చూద్దాం. -
మరో కొరియన్ రీమేక్
ఇటీవలే కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ని సమంతతో ‘ఓ బేబి’గా తెరకెక్కించింది సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. తాజాగా మరో కొరియన్ సినిమాను రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించారు నిర్మాత సురేశ్ బాబు. 2016లో విడుదలైన ‘లక్కీ కీ’ అనే కొరియన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నట్లు, భారతీయ భాషలన్నింటి రైట్స్‌ను దక్కించుకున్నట్టు తెలిపారు. 2012లో విడుదలైన ‘కీ ఆఫ్ లైఫ్’ అనే జపనీస్ చిత్రాన్ని ‘లక్కీ కీ’ పేరుతో కొరియన్ పరిశ్రమ రీమేక్ చేసింది. ఇప్పుడు ఈ కొరియన్ సినిమా ఆధారంగా తెలుగు రీమేక్ రూపొందనుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న యాక్టర్, కిరాయికి హత్యలు చేసే రౌడీ అనుకోకుండా ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్తే ఏం జరిగింది? అనేది ఈ చిత్రకథాంశం. ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తారని, ఇందులో ఓ పెద్ద స్టార్ నటిస్తారని ప్రకటించారు. గురు ఫిలింస్, యస్ కే గ్లోబల్ ఎంటర్టైన్మెంట్తో కలసి సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. -
వైరల్: జూనియర్ ఎన్టీఆర్ పాటకు స్టెప్పులు
జూనియర్ ఎన్టీఆర్, సమీరారెడ్డి నాయకానాయికలుగా నటించిన చిత్రం అశోక్. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకుడు. 2006లో వచ్చిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. అయితే, జపాన్‌లోని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జంట అశోక్ సినిమాలోని ‘గోలాగోలా రంగోలా గుండెల్లోనా రాగాలా.. గోదారేదో పొంగే వేళ’పాటకు స్టెప్పులేసి అదరగొట్టింది. క్యాస్ట్యూమ్స్ కూడా హీరోహీరోయిన్లను పోలినట్టుగా ఉండటం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కామెంట్ల వర్షం కురుస్తోంది. అచ్చం జూనియర్ ఎన్టీఆర్, సమీరాలాగానే స్టెప్పులేశారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక తెలుగు సినిమాల్లోని పాపులర్ పాటలకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ ఇటీవల టిక్‌టాక్ చేసి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ‘అల వైకుంఠపురములో..’ సినిమాలోని బుట్టబొమ్మ, సరిలేరు నీకెవ్వరూ సినిమాలోని మైండ్ బ్లాక్ పాటలకు వార్నర్ దంపతులు డ్యాన్సుల వైరల్ అయ్యాయి. (చదవండి: యంగ్ టైగర్ అభిమానులకు గుడ్ న్యూస్!) -
స్టెప్పులతో అదరగొట్టిన జపాన్ జంట
-
ఉనికి సైతం ఉత్త భ్రమే
‘నా ఉనికి సైతం ఉత్త భ్రమే’ అని తెలుసుకున్నాడు మసనోబు ఫుకుఓకా (1913–2008). ‘ఈ జనన మరణ చక్రాలలో పాల్గొని, అనుభూతి పొంది, ఆనందించగలిగితే అంతకు మించి సాధించాల్సిన అవసరం లేదు’ అనుకున్నాడు. తన ఆలోచనను ఆచరణలో రుజువు చేసుకోవడానికిగానూ నగరంలో చేస్తున్న ఉద్యోగం వదిలి సొంతవూరికి వెళ్లిపోయాడు. భూమిని దున్నకుండా, రసాయనిక ఎరువులు వేయకుండా ప్రకృతి వ్యవసాయాన్ని సాధన చేశాడు. ప్రకృతి దానికదే అన్నీ అమర్చి పెట్టిందని నమ్మి, దానిమీద ‘గెలిచి’ ఆ అమరిక చెదరగొట్టకుండా, దానితో సమన్వయంతో బతికేందుకు ప్రయత్నించాడు. ‘నేను కనుగొన్న విషయం చాలా విలువైనదయినంత మాత్రాన నాకేదో ప్రత్యేక విలువ ఉన్నట్లు కాదు’ అని ప్రకటించుకున్నాడు. ఆ ఆలోచనా ప్రయాణాన్ని వివరించే పుస్తకం జపనీస్ నుంచి ఇంగ్లిష్‌లోకి వన్ స్ట్రా రెవల్యూషన్‌గా 1978లో వచ్చింది. అది తెలుగులోకి గడ్డిపరకతో విప్లవంగా అనువాదమైంది. ఆ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ఫుకుఓకా విద్యార్థి, సాధకుడు ల్యారీ కార్న్ ఇలా అంటారు: ‘తన సిద్ధాంతం ఏ మతంపైనా ఆధారపడి లేదని ఫుకుఓకా చెపుతారు. కానీ అతని బోధనా పద్ధతిపైనా, ఉపయోగించే పదజాలంపైనా జెన్, బౌద్ధం, టావోయిజమ్ల ప్రభావం బాగా ఉంది. అప్పుడప్పుడు అతను చెపుతున్న దానిని మరింత బాగా వివరించటానికో, చర్చను ప్రేరేపించటానికో బైబిల్ నుంచీ, క్రైస్తవ మతం నుంచీ ఉదాహరణలు ఇస్తుంటాడు. ‘వ్యక్తి ఆధ్యాత్మిక ఆరోగ్యం నుంచి ప్రకృతి సేద్యం పుట్టుకొస్తుందని ఫుకుఓకా నమ్మకం. భూమిని బాగుపరచటం, మానవ ఆత్మను ప్రక్షాళన చేయటం ఒకటేనని అతని అభిప్రాయం. ఆధ్యాత్మికంగా సంతృప్తికరమయిన జీవితానికి దారితీసే రోజువారీ పనులు ప్రపంచాన్ని సుందరంగా, అర్థవంతంగా మారుస్తాయని నిరూపించటమే అతను మనకిచ్చిన కానుక.’ దీనికే రాసిన ముందుమాటలో అమెరికా రచయిత, పర్యావరణ కార్యకర్త వెండెల్ బెర్రీ ఇలా వ్యాఖ్యానిస్తారు: ‘కేవలం వ్యవసాయం గురించే ఈ పుస్తకంలో ఉంటుందనుకొనే పాఠకులు ఆహారం గురించీ, ఆరోగ్యం గురించీ, సాంస్కృతిక విలువల గురించీ, మానవ జ్ఞాన పరిమితుల గురించీ కూడా ఇందులో ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. ఈ పుస్తకంలోని తత్వసిద్ధాంతాల గురించి ఆ నోటా ఈ నోటా విన్న పాఠకులు దీంట్లో వరి, శీతాకాలపు పంటలు, పండ్లు, కూరగాయలు ఎలా పండించాలో ఉండటం చూసి ఆశ్చర్యపోతారు.’ ‘ప్రగతి, పురోగమనం ఎందుకు సాధించాలి? సాధారణమయిన జీవితం గడుపుతూ అన్నిటినీ తేలికగా తీసుకోగలగటం కంటే మించినది మరేదయినా ఉందా?’ అని ప్రశ్నించే ఫుకుఓకా తత్వం ఈ హడావుడి లోకరీతికి పూర్తి భిన్నమైనది. పూర్తిగా కావాల్సినది కూడానేమో! -
ఉద్యోగాన్నే స్టోర్ చేసుకున్న మహిళ
సయకా మురాటా రాసిన జాపనీస్ నవలిక ‘కన్వీనియన్స్ స్టోర్ వుమన్’లో, 36 ఏళ్ళ కీకో– టోక్యోలో ఉన్న ‘స్మైల్ మార్ట్ కన్వీనియన్స్ స్టోర్’లో తనకి 18 ఏళ్ళున్నప్పటినుంచీ పని చేస్తుంటుంది. ఆమెకు సామాజిక ప్రవర్తన గురించి తెలియని సమస్య ఉంటుందని తప్ప, అదే జబ్బో పేర్కొనరు రచయిత్రి. ప్రేమించే కుటుంబం ఉన్న కీకోకి– ప్రేమ, శృంగారం, పెళ్ళి, ఉద్యోగంలో ఎదగడం వంటి విషయాలు పట్టవు. తనకిచ్చిన స్టోర్ యూనిఫార్మ్ చూసుకుని మురిసిపోతుంది. ట్రెయినింగ్ వీడియో చూస్తూ ‘ముఖ కవళికలెలా ఉండాలో, ఎలా మాట్లాడాలో అన్నది ఎవరైనా నాకు చెప్పడం ఇదే మొదటిసారి’ అనుకుంటుంది. కొనుగోలుదార్లకు ‘స్వాగతం, అవును, లేదు’ అని చెప్పడం మినహా సహోద్యోగులతో ఎక్కువ మాట్లాడే అవసరం పడదు. కాకపోతే, ‘స్వాభావికం’గా కనబడేలా ప్రవర్తిస్తూ, వారితో ఇమడ్డానికి ప్రయత్నిస్తుంది. ‘ఈ స్టోర్ భోజనంతోనే నా శరీరం నిండి ఉంది. ఇక్కడున్న కాఫీ మెషీన్‌లాగా, పత్రికల స్టేండ్లలాగా నేనూ దీనికి భాగం’ అనుకుంటుంది. ‘రాత్రిళ్ళు నిద్రపట్టనప్పుడు, చీకట్లో కూడా జీవంతో తొణికిసలాడే స్టోర్ ఆక్వేరియంని గుర్తు తెచ్చుకుంటే నిద్ర పట్టేస్తుంది’ అన్నంత ఇష్టం కీకోకి స్టోర్ అంటే. అన్నేళ్ళల్లో ఎందరో మానేజర్లు మారుతారు కానీ కథకురాలైన కీకో మాత్రం సేల్స్గర్ల్గానే మిగిలిపోతుంది. పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనమనీ, ప్రమోషన్ తెచ్చుకొమ్మనీ– ఇంట్లోవారూ స్నేహితులూ ఆమెని పోరుతుంటారు. ఆమె సంతృప్తిగా, స్వతంత్రంగానే జీవిస్తోందని వారు అర్థం చేసుకోరు. ‘ఒక పురుషుడూ స్త్రీ కలిసి ఉన్నప్పుడు నిజం ఏదైనప్పటికీ కనీసం ఇతరులు సంతోషపడతారు’ అనుకున్న కీకో– కుటుంబ ఒత్తిడి భరించలేక, తన నిర్లక్ష్య ధోరణి వల్ల అదే స్టోర్‌లో ఉద్యోగం పోగొట్టుకున్న స్వార్థపరుడూ, పోట్లాటలకు నెపాలు వెతికేవాడూ అయిన షిరహాను తన అపార్టుమెంట్లో ఉండమంటుంది. అతను బాత్‌టబ్బులో పడుకుని ట్యాబ్లెట్లో సినిమాలు చూసుకుంటూ గడుపుతాడు. ఆమెకు లైంగిక కోరికలు కలగవు. అతనికి ఆమె పైన ఆసక్తి ఉండదు. అయినప్పటికీ, సమాజం కోసం ఇద్దరూ తమ బంధాన్ని చట్టబద్ధం చేసుకోవాలనుకుంటారు. ఆర్థికంగా కీకోమీద ఆధారపడే షిరహా, తన అప్పులు తీర్చడానికని ఎక్కువ జీతం దొరికే ఉద్యోగం చూసుకొమ్మని ఆమెను వొప్పిస్తాడు. స్టోర్‌లో పని మానేశాక, తన జీవితపు లక్ష్యాన్ని కోల్పోయి, ‘ఇప్పటివరకూ– నిద్రపోవడం, శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవడం, మంచి భోజనం చేయడం కూడా ఉద్యోగంలో భాగమే అయి ఉండేవి. ఇక ఏ ప్రమాణాలతో జీవించాలో తెలియట్లేదు’ అని బాధ పడుతుందామె. మరో ఉద్యోగానికి ఇంటర్వూ్య ఇచ్చేందుకు వెళ్తూ, దార్లో కనిపించిన ఒక కన్వీనియంట్ స్టోర్ చిరపరిచితమైన శబ్దాల వల్ల ఆకర్షింపబడి, లోపలికి అడుగుపెడుతుంది. అక్కడ సరిదిద్దవలసిన లోపాలని ఇట్టే పట్టేస్తుంది. ఎవరేమనుకున్నా కానీ తన ఉనికి స్టోర్‌తోనే ముడిపడుందని ఆ క్షణంలోనే గ్రహిస్తుంది. 163 పేజీల యీ నవలిక పాఠకులను ఆలోచనలో పడేస్తుంది. ఒక వ్యక్తి సమాజంలో ఇమిడే తీరాలా! ప్రతీ ఒక్కరికీ సంతోషం కలిగించేది ఒకటే అయి ఉండాలా? రచయిత్రి– స్టోరును ఆధునిక సమాజానికి రూపకంగా ఉపయోగిస్తారు. కీకో తన సహోద్యోగులని అనుకరించడం హాస్యంగా అనిపిస్తుంది. కథాంశంలో క్లిష్టత ఉండదు. పొట్టి, సరళమైన వాక్యాలున్న యీ నవలికని చదివిన తరువాత సూపర్ మార్కెట్ల ఉద్యోగులని చూసే దృక్పథం మారుతుంది. పుస్తకాన్ని ఇంగ్లిష్‌లోకి అనువదించిన టేపీ టెకెమొరీ– జాపనీస్ నమ్మే యథాతథవాద మనస్తత్వాన్నీ, కీకో అనుభూతులనూ సరిగ్గా అంచనా వేస్తారు. తొలి ప్రచురణ 2016లో. ఆ ఏడాదికి అకుటగవా ప్రైజ్ గెలుచుకుంది. ఇంగ్లిష్‌లో 2018లో ప్రచురించినది గ్రోవ్ ప్రెస్. -కృష్ణ వేణి -
వాకూల్ రూ.100 కోట్ల పెట్టుబడులు
ముంబై: జపాన్‌కు చెందిన ప్రీమియం లోదుస్తుల బ్రాండ్ ‘వాకూల్’ భారత్‌లో పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. అంతర్జాతీయ వృద్ధి ప్రణాళికలో భాగంగా రానున్న మూడేళ్ల కాలంలో 2021 నాటికి భారత్‌లో రూ.100 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్టు తెలిపింది. భారత్‌లో విక్రయాలు పెంచుకునేందుకు గాను ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల సంఖ్యను 12 నుంచి 70కు పెంచనున్నట్టు, షాప్ ఇన్ షాప్ స్టోర్లను 80కి, దేశవ్యాప్తంగా స్టోర్లను 150కి పెంచనున్నట్టు ప్రకటించింది. ముంబై, ఢిల్లీ, పుణె, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా మార్కెట్లలో మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేయడంతోపాటు, దేశంలోని నాలుగు ప్రాంతాల్లోనూ టాప్ 10 పట్టణాలపై మరింత దృష్టి పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. టైర్–1, 2 ప్రాంతాల్లో 30 పట్టణాలకు విస్తరించనున్నట్టు పేర్కొంది. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు మింత్రా, జబాంగ్, టాటా క్లిక్, వాకూల్ ఇండియా డాట్ కామ్ ద్వారా విక్రయాలను పెంచుకునే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. -
వాకూల్ రూ.100 కోట్ల పెట్టుబడులు
ముంబై: జపాన్‌కు చెందిన ప్రీమియం లోదుస్తుల బ్రాండ్ ‘వాకూల్’ భారత్‌లో పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. అంతర్జాతీయ వృద్ధి ప్రణాళికలో భాగంగా రానున్న మూడేళ్ల కాలంలో 2021 నాటికి భారత్‌లో రూ.100 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్టు తెలిపింది. భారత్‌లో విక్రయాలు పెంచుకునేందుకు గాను ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల సంఖ్యను 12 నుంచి 70కు పెంచనున్నట్టు, షాప్ ఇన్ షాప్ స్టోర్లను 80కి, దేశవ్యాప్తంగా స్టోర్లను 150కి పెంచనున్నట్టు ప్రకటించింది. ముంబై, ఢిల్లీ, పుణె, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా మార్కెట్లలో మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేయడంతోపాటు, దేశంలోని నాలుగు ప్రాంతాల్లోనూ టాప్ 10 పట్టణాలపై మరింత దృష్టి పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. టైర్–1, 2 ప్రాంతాల్లో 30 పట్టణాలకు విస్తరించనున్నట్టు పేర్కొంది. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు మింత్రా, జబాంగ్, టాటా క్లిక్, వాకూల్ ఇండియా డాట్ కామ్ ద్వారా విక్రయాలను పెంచుకునే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. -
వాకూల్ రూ.100 కోట్ల పెట్టుబడులు
ముంబై: జపాన్‌కు చెందిన ప్రీమియం లోదుస్తుల బ్రాండ్ ‘వాకూల్’ భారత్‌లో పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. అంతర్జాతీయ వృద్ధి ప్రణాళికలో భాగంగా రానున్న మూడేళ్ల కాలంలో 2021 నాటికి భారత్‌లో రూ.100 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్టు తెలిపింది. భారత్‌లో విక్రయాలు పెంచుకునేందుకు గాను ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల సంఖ్యను 12 నుంచి 70కు పెంచనున్నట్టు, షాప్ ఇన్ షాప్ స్టోర్లను 80కి, దేశవ్యాప్తంగా స్టోర్లను 150కి పెంచనున్నట్టు ప్రకటించింది. ముంబై, ఢిల్లీ, పుణె, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా మార్కెట్లలో మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేయడంతోపాటు, దేశంలోని నాలుగు ప్రాంతాల్లోనూ టాప్ 10 పట్టణాలపై మరింత దృష్టి పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. టైర్–1, 2 ప్రాంతాల్లో 30 పట్టణాలకు విస్తరించనున్నట్టు పేర్కొంది. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు మింత్రా, జబాంగ్, టాటా క్లిక్, వాకూల్ ఇండియా డాట్ కామ్ ద్వారా విక్రయాలను పెంచుకునే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. -
సన్ ఫార్మా చేతికి జపాన్ పోలా ఫార్మా
న్యూఢిల్లీ: భారత ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా... జపాన్‌కు చెందిన పోలా ఫార్మా కంపెనీని కొనుగోలు చేయనుంది. పోలా ఫార్మాను 10 లక్షల డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు సన్ ఫార్మా వెల్లడించింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.7 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా చర్మ సంబంధిత ఔషధాల సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకోవడం లక్ష్యంగా పోలా ఫార్మాను టేకోవర్ చేస్తున్నామని సన్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్ కీర్తి గనోర్కార్ తెలిపారు. దీని కోసం పోలా ఫార్మాతో ఒక నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు. ఈ కంపెనీ టేకోవర్ వచ్చే ఏడాది జనవరి 31 కల్లా పూర్తవుతుందన్నారు. పోలా ఫార్మా స్థానిక నైపుణ్యం, సన్ ఫార్మా అంతర్జాతీయ పటిష్టతలు కలగలసి జపాన్‌లో మరింత వృద్ధిని సాధిస్తామని సన్ ఫార్మా జపాన్ హెడ్ జునిచి నకమిచి వ్యాఖ్యానించారు. పోలా ఫార్మా ఆదాయం 11 కోట్ల డాలర్లు.... పోలా ఫార్మా కంపెనీ జపాన్‌లో జనరిక్, బ్రాండెడ్ ఔషధాలకు సంబంధించి పరిశోధన, తయారీ, విక్రయం, మార్కెటింగ్ కార్యకలాపాలను సాగిస్తోంది. ప్రధానంగా చర్మ సంబంధిత ఔషధాలను ఈ కంపెనీ తయారు చేస్తోంది. ఈ కంపెనీకి జపాన్‌లో రెండు ప్లాంట్లున్నాయి. గత ఏడాదిలో ఈ కంపెనీ 11 కోట్ల డాలర్ల ఆదాయాన్ని, 70 లక్షల డాలర్ల నికర నష్టాన్ని చవిచూసింది. సన్ ఫార్మా కంపెనీ జపాన్ ఫార్మా మార్కెట్లోకి 2016లో ప్రవేశించింది. నొవార్టిస్‌కు చెందిన 14 ప్రిస్క్రిప్షన్ బ్రాండ్ల కొనుగోళ్ల ద్వారా సన్ ఫార్మా జపాన్ మార్కెట్లోకి అడుగిడింది. జపాన్ ఫార్మా మార్కెట్ 8,480 కోట్ల డాలర్ల రేంజ్లో ఉంటుందని అంచనా. 1.13 లక్ష కోట్ల డాలర్ల ప్రపంచ ఫార్మా మార్కెట్లో జపాన్ ఫార్మా మార్కెట్ వాటా 7.5 శాతంగా ఉంది. పోలా ఫార్మా టేకోవర్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో సన్ ఫార్మా షేర్ 3 శాతం వరకూ నష్టపోయి రూ.511 వద్ద ముగిసింది. -
ఇక ఆఫీస్‌లో నిద్ర పోలేరు...
టోక్యో : తిన్న తర్వాత కాసేపు ఓ కునుకు తీయాలనిపించడం సహజం. కానీ ఆఫీస్‌లో కూడా ఇలా కునుకు తీయాలనిపిస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కారణం ఆఫీస్‌లో నిద్రపోతే ఊరుకోరు.. మరో విషయం ఏంటంటే అలా నిద్ర వస్తున్న భావన ఉన్నప్పుడు చేసే పని మీద సరిగ్గా దృష్టి కేంద్రికరించలేము. ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ సమస్య ఎక్కడైనా సాధారణమే. శ్రమ జీవులుగా పేరు తెచ్చుకొన్న జపాన్ వాసులను ఈ నిద్ర సమస్య మరింత వేధిస్తోందంట. దాంతో ఉద్యోగులను మెలకువగా ఉంచడం ఎలా అంటూ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు ఆ దేశ శాస్త్రవేత్తలు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తుల మీద పరిశోధనలు నిర్వహించారు. దానిలో భాగంగా ప్రయోగంలో పాల్గొన్న వారికి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చి వాటిని పరిష్కరించమని చెప్పారు. అలానే వారు ఉన్న గదిలో వేర్వేరు వాతావరణ పరిస్థితులు కల్పించారు. దీనిలో భాగంగా ఒకసారి గదిలో ఉష్ణోగ్రతను తగ్గించడం బాగా చల్లగా ఉండేలా చూడటం, మరోసారి వెలుతురు బాగా వచ్చేలా చేయడం.. గదిలో వివిధ పరిమళాలు వ్యాపించేలా చేశారు. అయితే వీటన్నింటిలో.. గదిలో ఉష్ణోగ్రతలు తగ్గించినప్పుడు మెరుగైన ఫలితాలు కనిపించాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఉద్యోగులకు నిద్ర మత్తుగా అనిపించినప్పుడు గదిలో ఉష్ణోగ్రతలు తగ్గించి, చల్లగా ఉండేలా చేస్తే వారు మళ్లీ చురుగ్గా మారుతున్నారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఈ ప్రయోగం ఆధారంగా జపాన్‌కు చెందిన రెండు దిగ్గజ తయారీ కంపెనీలు డైకిన్(ఏసీల తయారీ కంపెనీ), ఎలాక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీ ఎన్‌ఈసీలు ఒక నూతన సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోన్నాయి. దీనిలో భాగంగా వీరు ఉద్యోగుల కంప్యూటర్‌కు కెమరాలను అమర్చారు. అవి ఉద్యోగుల కంటి కదలికలను గమినిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వారి కళ్లు నిద్రలోకి జారుకున్నట్లు మత్తుగా అనిపిస్తాయో అప్పుడు వెంటనే గది ఉష్ణోగ్రతను తగ్గించి, చల్లగా ఉండే ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో ఉద్యోగులు మళ్లీ చురుగ్గా తయారవుతున్నారు. ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న ఈ పద్ధతిని పూర్తిగా అభివృద్ధి చేసి 2020 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. జపాన్ శ్రామిక చట్టాల ప్రకారం అక్కడి ఉద్యోగులు ఎవరైనా వారంలో ఐదు రోజులు కేవలం నాలుగు గంటలు మాత్రమే పనిచేయాలి. కానీ ఈ నియమాలను అక్కడి యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికే జపాన్ వాసులు సగటున వారానికి 60 గంటలు పనిచేస్తున్నారు. ఈ అధిక పని గంటల వల్ల వారు త్వరగా మృత్యువాత పడుతున్నట్లు అక్కడి నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయినప్పటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. -
‘నా భార్య జపనీస్.. కాదు, కాదు చైనీస్’
బీజింగ్ : బ్రిటన్ నూతన విదేశాంగ మంత్రి జెరెమీ హంట్ తాజాగా చైనాలో చేపట్టిన తన తొలి పర్యటనలోనే తడబడ్డారు. తన భార్య చైనీయురాలిని గుర్తుచేసి.. చైనీయుల మనసు గెలుచుకుందామని ఆయన అనుకున్నారు. కానీ, ఆ విషయాన్ని చెప్పడంలో తడబడ్డారు. తన భార్య జపనీస్ అంటూ చెప్పేశారు. వెంటనే నాలుక కర్చుకున్న ఆయన.. కాదు.. కాదు చైనీస్ అంటూ సర్దిచెప్పారు. చైనా-జపాన్ దేశాలు శతాబ్దాలుగా సంప్రదాయ ప్రత్యర్థులు కావడంతో ఆయన చేసిన పొరపాటుతో ఒకింత ఇబ్బందిపడాల్సి వచ్చింది. చైనా-జపాన్ మధ్య దౌత్య సంబంధాలు ఇటీవల కొంత మెరుగుపడినప్పటికీ 1930-40లో చైనా భూభాగాలను జపాన్ ఆక్రమించిన విషయం తెలిసిందే. పొరపాటున వెంటనే గుర్తించిన హంగ్ తేరుకుని వివరణ కూడా ఇచ్చాడు. ‘నా భార్య చైనీస్, మా పిల్లలకు చైనా మూలాలున్నాయి. చైనాలోని జియాన్ ప్రావిన్స్‌లో నా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు’ అని అన్నారని చెప్తూ.. చైనీయులు మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు. బ్రిటన్ మంత్రి అయిన హంట్.. చైనీ మూలాలున్న లూసియా గుయోను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. గత ఏడాది బ్రెగ్జిట్ ద్వారా యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ నిష్కమించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈయూతో బ్రిటన్ పూర్తిగా వాణిజ్య సంబంధాలను తెంచుకోనుంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ నూతన విదేశాంగ మంత్రిగా నియమితులైన హంట్ చైనాతో దౌత్యపరమైన, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు సోమవారం బీజింగ్‌లో పర్యటించారు. వర్తకం, అభివృద్ధి, భద్రత వంటి అంశాల్లో బ్రిటన్-చైనా కలిసి పనిచేస్తాయని హంగ్ తెలిపారు. -
‘మగధీర’ పనుల్లో రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా మగధీర. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసింది. పునర్జన్మల నేపథ్యంలో ఫాంటసీ కథాశంతో తెరకెక్కిన మగధీర సినిమా రాజమౌళిని టాప్ డైరెక్టర్‌గా నిలిపింది. 2009లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. బాహుబలి సినిమాతో రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపాన్‌లో బాహుబలి చిత్రానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఇప్పుడు మగధీర సినిమాను కూడా జపనీన్ భాషలతో డబ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. అయితే గతంలోనే మగధీర జపనీస్ సబ్‌టైటిల్స్‌తో అక్కడ రిలీజ్ అయ్యింది. కానీ ఆ సమయంలో రాజమౌళికి జపాన్‌లో ఎలాంటి ఇమేజ్ లేదు. బాహుబలి సినిమాతో రాజమౌళి పేరు జపాన్‌లోనూ మారుమోగిపోయింది. అందుకే మగధీరను డబ్ చేసి రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారట. అయితే విషయంపై చిత్రయూనిట్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
జపాన్ కుబేరుడికి భారీ ఊరట
బ్యాంకాక్: బేబీ ఫ్యాక్టరీ కేసులో జపాన్ కుబేరుడికి థాయ్‌లాండ్ కోర్టులో భారీ ఊరట లభించింది. చిన్నారుల అక్రమ వ్యాపారం చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త మిట్సుటోకి షింగెటా (28)కి తీపి కబరు వచ్చింది. 13 మంది సర్రొగేట్ చిన్నారుల ఆలనా పాలనా చూసుకునేందుకు అనుమతినిస్తూ థాయ్ కోర్టు తీర్పు వెల్లడించింది. వివరాల్లోకెళ్తే.. జపాన్ కు చెందిన మిట్సుటోకి షింగెటా కుబేరుడు. ఎన్నో వ్యాపార సంస్థల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆయనకు వివాహం కాలేదు. అయితే 2014లో బ్యాంకాక్‌లో ఆయనకు చెందిన ఓ అపార్ట్మెంట్లో 13 మంది ఏడాదిలోపు వయసున్న చిన్నారులను పోలీసులు గుర్తించారు. పసివాళ్లను అక్రమ రవాణా చేయడం, చిన్నారులతో ఏదో వ్యాపారం చేస్తున్నారని థాయ్‌లాండ్ పోలీసులు భావించారు. దీంతో ఆ పసివాళ్ల ఆలనాపాలనను ప్రభుత్వం చూసుకునేలా చేశారు. వ్యాపారవేత్త మిట్సుటోకి షింగెటాపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దాదాపు నాలుగేళ్ల అనంతరం ఈ కేసు చివరి విచారణ అనంతరం స్థానిక కోర్టు.. 13 మంది చిన్నారుల ఆలనాపాలనను సరోగేట్ ఫాదర్ మిట్సుటోకి చూసుకోవచ్చునని తీర్పు వచ్చింది. పోలీసులు చిన్నారులను గుర్తించేసమయానికి ఆ పసివాళ్లు ఆరోగ్యంగా ఉన్నారని, వారి ఆలనా పాలనా చూసేందుకు ఏడుగురు మహిళలు ఉన్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితుడిగా ఉన్న మిట్సుటోకి జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజమని తమకు అప్పట్లో తెలియదని, ఆయన 9 మంది థాయ్‌లాండ్ మహిళల సాయంతో సరోగసి (అద్దె గర్భం) పద్ధతిలో పిల్లల కోసం చూడగా.. 13 మంది జన్మించారని వివరించారు. అయితే అక్రమంగా సరోగసిని పాటిస్తూ సరోగేట్ మదర్స్ డబ్బులు తీసుకుంటున్నారని, అనంతరం పుట్టిన పిల్లల్ని విదేశాలకు అధిక మొత్తాలకు విక్రయిస్తున్నట్లు తాము భావించినట్లు కోర్టులో పోలీసులు చెప్పారు. ఈ కేసు విచారణ జరుగుతున్నంత కాలం నెలకోసారి చిన్నారుల నానమ్మ(మిట్సుటోకి తల్లి) పసివాళ్లను చూసేందుకు జపాన్ నుంచి వచ్చి వెళ్లేవారు. దాంతోపాటుగా ఆ చిన్నారులకు ఇంగ్లీష్, జపనీస్ భాషలు నేర్పేందుకు ట్యూషన్ టీచర్లను సరోగేట్ ఫాదర్ మిట్సుటోకి నియమించారు. వ్యాపారి మిట్సుటోకికి మొత్తం 17 మంది సంతానం, కాగా వీరంతా సరోగసి పద్ధతిలో జన్మించారు. అయితే నలుగురు సంతానంలో ఇద్దరు భారత మహిళల నుంచి పుట్టిన సంతానం. అయితే బ్యాంకాక్‌లో పోలీసుల ఆకస్మిక దాడులకు ముందే నలుగురు చిన్నారుల్ని జపాన్‌లో విక్రయించిన కొత్త ఇంట్లో మిట్సుటోకి సంరక్షణలో ఉన్నారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత థాయ్ కోర్టు వ్యాపారి మిట్సుటోకి నిర్దోషి అని తేలుస్తూ బ్యాంకాక్ రైడ్‌లో దొరికిన 13 మంది చిన్నారులను సరోగేట్ ఫాదర్‌కు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. 2015లో సరోగసిపై థాయ్‌లాండ్ చట్టాన్ని తీసుకొచ్చి కొన్ని ఆంక్షలు విధించిన విషయం విదితమే. -
20ఏళ్ల నుంచి మాటల్లేవ్..!
-
తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే అంతే..
కుమమోటో భూకంపం జపాన్ ను కుదిపేసిన విషయం తెలిసిందే. అటువంటి ప్రకృతి బీభత్సాలు జరిగినప్పుడు జనం ఏ వార్త విన్నా నమ్మే అవకాశం ఉంటుంది. అదే అదనుగా తీసుకున్న ఓ వ్యక్తి.. ఓ కాల్పనిక కథను సృష్టించి ఫోటోతోపాటు ట్విట్టర్ లో పోస్టు చేసి అరెస్టయ్యాడు. ఆన్ లైన్లో అసత్య కథనాలు పోస్టు చేస్తే శిక్షతప్పదని జపాన్ పోలీసులు మరోసారి నిరూపించారు. కుమమోటో భూకంపం తర్వాత ట్విట్టర్లో రూమర్లు పోస్టు చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. కనాగావాకు చెందిన 20 ఏళ్ళ వ్యక్తి.. ట్విట్టర్ లో ఓ సింహం చిత్రాన్ని పోస్ట్ చేసి, అది కుమమోటో వీధుల్లో తిరుగుతున్నట్లు చెప్పి జనాన్ని నమ్మించాడు. ఏప్రిల్ 14న కుమమోటోలో సంభవించిన వినాశకరమైన భూకంపం తర్వాత.. అసలే ప్రాణభయంతో ఉన్న ప్రజలను వీధుల్లో సింహం తిరుగుతోందన్న పుకారు నిజంగానే భయభ్రాంతులకు గురి చేసింది. భూకంపం ప్రభావంతో జ్యూ నుంచి తప్పించుకున్న సింహం.. కుమమోటోలోని మా ఇంటి దగ్గరలో కనిపించింది అంటూ ఓ సింహం చిత్రాన్ని పోస్టు చేయడంతోపాటు.. తన పోస్టుకు టైటిల్ కూడా పెట్టాడు. ఇంకేముందీ అసలే భూకంపం భయంతో వణికిపోతున్న ప్రజలు.. అతడు పోస్ట్ చేసిన ట్వీట్ ను 17000 సార్లు రీ ట్వీట్ చేయడంతోపాటు... కుమమోటో జ్యూ అండ్ బొటానికల్ గార్డెన్ కు వందలకొద్దీ ఫోన్లు చేసి, తప్పించుకున్న సింహం గురించి ఆరా తీశారు. ట్విట్టర్ పోస్టుతో సింహం వార్త కలకలం సృష్టించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సింహం వార్త పోస్టు చేసిన వ్యక్తి గురించి ఆరా తీశారు. చివరికి అదంతా తప్పుడు సమాచారం అని నిర్థారించారు. అతడు పోస్టు చేసిన ఫోటో.. సౌత్ ఆఫ్రికా కు చెందిన ఓ చిత్రంలోని దృశ్యంగా తెలుసుకున్నారు. ప్రాక్టికల్ జోక్ వేసి జనాల్ని భయపెట్టినందుకు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. పుకార్లు పుట్టించేవారిని అరెస్టు చెయ్యడం బహుశా ఇదే మొదటిసారి అని స్థానిక మీడియా చెప్తోంది. నిజానికి అటువంటి పుకార్లు పోస్టు చేయడం ఒక్కోసారి తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని, అదీ ఇంటర్నెట్, వెబ్ సైట్లలో పోస్టు చేసే వార్తలు ఒక్క జపాన్ వరకే పరిమితం కాక, ప్రపంచం దృష్టి సారిస్తాయన్న కారణంతో మరోసారి ఎవ్వరూ అటువంటి తప్పు చేయకుండా ఉండేందుకు సదరు వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అసత్య కథనాల ప్రచారం ఎవరు చేసినా శిక్ష తప్పదని తెలిసేలా చేశారు. -
నగ్న రెస్టారెంటులో ఊబకాయులకు నో ఎంట్రీ!
భోజనప్రియుల కోసం టోక్యోలో కొత్త కాన్సెప్ట్ తో ప్రారంభం కానున్న నగ్న రెస్టారెంట్ (నేకెడ్ రెస్టారెంట్) అతిథులకు కొన్ని నిబంధనలను విధించింది. విభిన్న రుచులతో రెస్టారెంట్ లో భోజనం చేయాలని ఉవ్విల్లూరే వారికి నగ్నంగా భోజనం చేసే సదుపాయం అందిస్తున్న రెస్టారెంట్... తమ నిబంధనల ప్రకారం ఊబకాయులకు అనుమతి నిరాకరిస్తోంది. సరికొత్త డైనింగ్ అనుభవాలను పొందాలనుకుంటే తమ వెబ్ సైట్ లోని నియమాల జాబితాను తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందేనని నిక్కచ్చిగా చెప్తోంది. టోక్యోలో ప్రారంభం కానున్న జపనీస్ నేకెడ్ రెస్టారెంట్ వినియోగదారులకు కఠిన నిబంధనలను విధిస్తోంది. ముఖ్యంగా ఊబకాయులకు ప్రవేశాన్ని నిషేధించడంతోపాటు, వయో నిబంధనలను కూడ అమలుచేస్తోంది. రెస్టారెంట్ విధించిన నిబంధనల ప్రకారం వయసుతోపాటు బరువును కూడా పాటించగలిగే వారే అక్కడ నగ్నంగా భోజనం చేసే అవకాశం పొందుతారు. లండన్, మెల్బోర్న్ సంస్థలను అనుసరిస్తూ.. కేవలం 16 - 60 ఏళ్ల మధ్య వయస్కులనే అనుమతించడంతోపాటు... వచ్చిన వారి బట్టలను చెక్ చేసి, పేపర్లో ఉంచి వారికి ప్రత్యేకమైన అండర్ వేర్‌ను అందిస్తోంది. అందుకు సంబంధించిన నియమ నిబంధనల లిస్టును స్టేట్స్ రెస్టారెంట్స్ వెబ్ సైట్లో పోస్ట్ చేసింది. నగ్న రెస్టారెంట్ ను సందర్శించి అక్కడి భోజనాన్ని ఆస్వాదించాలనుకునేవారు వెబ్ సైట్ లోని నియమాల జాబితాను ఫాలో అవ్వక తప్పదని నిర్వాహకులు చెప్తున్నారు. భోజనానికి వచ్చిన వారిని అక్కడికక్కడే బరువును చూసి మరీ లోపలకు అనుమతిస్తారు. ఒకవేళ నిబంధనకు మించి బరువు ఎక్కువగా ఉంటే బయటకు పంపించేందుకు ఏమాత్రం వెనుకాడే పనిలేదని నిర్వాహకులు కచ్చితంగా చెబుతున్నారు. జూలై 29న ప్రారంభం కానున్న నేకెడ్ రెస్టారెంట్ కు సంబంధించిన ఆన్ లైన్ బుకింగ్ పేజిలోనే ముందుగా అన్ని రకాల చెల్లింపులు చేసి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని, మొత్తం డబ్బును అడ్వాన్స్ గా చెల్లించిన తర్వాత రెస్టారెంటుకు వచ్చిన తర్వాత బరువు ఎక్కువగా ఉన్నవారిని బయటకు పంపడమే కాక, డబ్బును తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండదని నిర్వాహకులు చెబుతున్నారు. అప్పటికే ఉన్న అతిథులను నియమాల జాబితా గురించి అడగటం, వారిని విసిగించడం, సందర్శకులను ముట్టుకునేందుకు ప్రయత్నించడం చేస్తే... అలాంటివారి ప్రవేశాన్ని నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. అలాగే వచ్చిన అతిథుల మొబైల్ ఫోన్లు, కెమెరాలను వారికి దూరంగా టేబుల్ టాప్ బాక్స్ లో భద్రపరుస్తారు. త్వరలో ప్రారంభానికి సిద్ధమౌతున్న నేకెడ్ రెస్టారెంటులో ప్రవేశ టికెట్ ఖరీదు దాదాపు రూ. 50 వేలు. దీన్ని ముందుగా వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాలి. ఇలా రెస్టారెంట్ కు వచ్చిన అతిథులకు... జీ స్ట్రింగ్స్ ధరించిన కండల వీరులు భోజనాన్ని వడ్డిస్తారు. కావలసిన రుచులను ఆస్వాదిస్తూ... మేల్ మోడల్స్ చేసే కనువిందైన డ్యాన్స్ షోను తిలకించే అవకాశాన్ని నిర్వాహకులు కల్పిస్తారు. అయితే నృత్య ప్రదర్శన చూడాలనుకున్నవారు భోజనం టికెట్ కాక, డ్యాన్స్ షో టికెట్ ను వారి వారి ఇష్టాన్ని బట్టి మెనూలో ఎంపిక చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. -
మారుతి కార్యాలయంపై దాడులు
టోక్యో: మైలేజ్ పరీక్ష కుంభకోణంలో మారుతి సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జపాన్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంధన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డామంటూ మారుతి తప్పు ఒప్పుకున్న నేపథ్యంలో అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. వ్యక్తిగత భాగాల్లో అంతర్గతంగా నిర్వహించిన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డామన్న సుజుకి వాదనల నిర్ధారణ కోసం ఈ దాడులు నిర్వహించినట్టు రవాణా మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అక్రమ ఇంధన మైలేజీ ఆరోపణలపై విచారణలో భాగంగా మినీ కార్ మేకర్ సుజుకి ఆఫీసుపై దాడి చేసినట్టు చెప్పారు. కాగా మైలేజీ గణంకాలు తప్పుగా పేర్కొన్నామని, తాము కూడా తప్పు చేశామంటూ బహిరంగంగా సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్ పై రవాణా మంత్రిత్వశాఖ దాడి తర్వాత ఇది రెండవది. అక్రమ మైలేజీ గణంకాలతో 4 బ్రాండెడ్ మోడల్స్, 12 ఇతర బ్రాండ్లను సుజుకి విక్రయాలు జరిపింది -
ఉద్యోగాల్లో భారతీయులు హ్యాపీ...
జపనీయులు అన్‌హ్యాపీ! రోటీ కప్డా ఔర్ మకాన్... ఇవి మూడు ఉంటే భారతీయులు సంతోషంగా ఉంటారని నిన్న మొన్నటి వరకూ అనుకున్నాం. కాని భారతీయులు ఉద్యోగాన్ని కోరుకుంటారని, తమ ఉద్యోగాలను బాగా ప్రేమిస్తారని తాజా సర్వేలో వెల్లడయ్యింది. ఫ్రాన్స్‌కు చెందిన ‘ఇడెన్రెడ్’ అనే కార్పొరెట్ సర్వీసుల సంస్థ 2016 సంవత్సరానికిగాను 15 దేశాలలో ఉద్యోగుల మానసిక సంతృప్తి గురించి 14,000 మందితో ఒక సర్వే నిర్వహించింది. ‘మీరు మీ ఉద్యోగంతో సంతోషంగా ఉన్నారా’ అనే ప్రశ్నకు జవాబు ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇచ్చింది. అన్ని దేశాల కంటే భారతీయులే నూటికి 88 శాతం మంది సంతోషంగా ఉన్నట్టు జవాబు ఇచ్చారు. ఒత్తిడి కలిగించే సోమవారాలు, పీడించే బాస్‌లు, ఇబ్బంది పెట్టే పని వాతావరణం ఇవన్నీ ఎలా ఉన్నా చేస్తున్న ఉద్యోగంలో సంతోషం వెతుక్కోవడం ముఖ్యంగా చేస్తున్న ఉద్యోగంతో భావోద్వేగపరమైన సంతృప్తి వెతుక్కోవడం చేస్తున్నారని ఈ ఫలితాలు చెబుతున్నాయి. పనితో సంతోషంగా ఉన్న ఆ తర్వాతి దేశాలలో మెక్సికో, అమెరికా, చిలీ దేశాలు ఉన్నాయి. అయితే శ్రమకు విలువిచ్చే దేశంగా భావించే జపాన్‌లోని ఉద్యోగులు మాత్రం చాలా నిస్పృహగా ఉన్నారు. నూటికి 44 శాతం మంది మాత్రమే తాము తమ ఉద్యోగాలతో సంతోషంగా ఉన్నామని చెప్పారు. అయితే తాము సంతృప్తిగా పని చేయాలంటే ‘మంచి పని వాతారణం’ ఉండాలని కోరుకుంటున్న దేశాలలో జపాన్, టర్కీ, చైనా, ఇటలీలు ఉన్నాయి. తాము చేస్తున్న పనికి ‘మంచి గుర్తింపు ప్రోత్సాహం’ ఉండటం ప్రధానమని జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం అన్నాయి. సర్వేలో పాల్గొన్న చాలామంది ఉద్యోగ విరమణ తర్వాత దొరికే లబ్ధి గురించి శ్రద్ధ పెట్టాలని కోరారు. అలాగే ఎక్కువ మంది ఎప్పటికప్పుడు పనిలో నైపుణ్యాలు పెంచుకునే ట్రైనింగ్ ఇస్తూ పురోభివృద్ధి సాధించే వీలును సంస్థలు కల్పించాలని కోరారు. రిపోర్ట్ -
బర్గర్ బకాసుర
తిక్క లెక్క ఈ ఫొటోలోని జపానీస్ కుర్రాడు బక్కపల్చగా కనిపిస్తున్నాడు కదా అని తక్కువగా అంచనా వేయకండి. ఇతడి పేరు తకరు కొబాయాషి. టాలెంట్‌లో ఈ కుర్రాడు బకాసురుడికి బ్రదర్‌లాంటోడు. ఇటలీలోని ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో భోజన ప్రతాపాన్ని ప్రదర్శించాడు. మూడు నిమిషాల్లోనే ఏకంగా పన్నెండు బర్గర్లను శుభ్రంగా స్వాహా చేసేసి ప్రేక్షకులను నోళ్లెళ్లబెట్టేలా చేశాడు. ఈ ఘనకార్యంతో ఇతగాడు తంతే గిన్నెస్‌బుక్‌లో పడ్డాడు. -
ఐదువేల సంవత్సరాలు కలిసి బతికారు
టోక్యో: గత చరిత్ర మొత్తం కూడా సంఘర్షణలతో నిండుకొని రక్తపు సిరాతో రాయబడిందని చెప్తుంటారు. బలంకలవాడు బలహీనుడిని చిత్రహింసలు పెట్టి పెత్తనం చెలాయిస్తూ తన కుటుంబాన్ని సమాజాన్ని ప్రభావితం చేసే వ్యవస్థగా తయారుచేసుకున్నాడని కూడా చెప్తారు. ఈ క్రమంలోనే సమాజ నిర్మాణంలో, సంస్కృతి, సంప్రదాయాల్లో విభిన్న మార్పులు రావడం జరిగిందని, సమాజాల విచ్ఛిన్నతకు ప్రధాన కారణం యుద్ధాలవంటి ఘర్షణలే అని చెప్తారు. కానీ, ఒక్కసారి జపాన్‌లో క్రీస్తు పూర్వం కిందటి చరిత్ర చూస్తే మాత్రం పై విషయాలకు పూర్తి భిన్నం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేటగాళ్లంతా కూడా ఒకే సమాజంగా రూపొంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదువేల సంవత్సరాలపాటు కలిసి కట్టుగా జీవించారని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. జపాన్‌కు చెందిన పురాతత్వ శాస్త్రవేత్తలు క్రీస్తు పూర్వం 14,500 నుంచి క్రీస్తు పూర్వం 300 వరకు ఉన్న చరిత్రను పరిశీలించారు. అందులో భాగంగా ఆ మధ్య కాలంలో జీవించి చనిపోయినవారి అవశేషాలను పరిశీలించారు. ఇందులో ముఖ్యంగా వారి ఎముకలపై ప్రశ్నలు జరపగా ఏ ఒక్కరికీ కూడా గాయాలు అయినట్లు బయటపడలేదు. ఇలా దాదాపు ఐదు వేల సంవత్సరాల కాలంలో లభించిన ఎముకలను పరిశీలించగా ఇలాంటి ఆధారాలే కనిపించాయి. ఆటవిక జీవితాన్ని అనుభవిస్తూ వేటపై ఆధారపడి జీవించే అప్పటి వారే ఎలాంటి ఘర్షణలకు దిగకుండా హాయిగా బతికేశారని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతోపాటు అప్పట్లోనే సమాజ సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా వారు జీవించారని కూడా చెప్తున్నారు. -
వంటకాలతో వందకోట్ల టర్నోవర్..
భోజన ప్రియులను విభిన్న రకాల వంటకాలతో ఆకట్టుకున్న ఓ వ్యాపారి ఏకంగా కోట్లకు పడగలెత్తాడు. చవులూరించే రుచులతో ఆన్ లైన్ లో అందరినీ ఆకట్టుకునేందుకు కుక్ ప్యాడ్ వెబ్సైట్ ను స్థాపించి.. ఇప్పుడు ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో చేరిపోయాడు. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా చెప్పే జపాన్ లో జపనీస్ పారిశ్రామికవేత్త అకిమిస్తు సానో.. ఆన్లైన్లో నిర్వహిస్తున్న సంప్రదాయ ప్రాంతీయ జపనీస్ ప్రత్యేక వంటకాలలు భోజన ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. గ్రిల్డ్ స్క్విడ్, పాన్ కేక్స్ తో పాటు... చీజ్ కేక్, పాస్తా, బోలోగ్ నీస్ వంటి 2.1 మిలియన్ల అన్యదేశ వంటకాలతో 58.8 మిలియన్ల వినియోగదారులతో 'కుక్ ప్యాడ్' కొనసాగుతోంది. జపనీయులు ఇంటి భోజనాన్ని ఆస్వాదించేందుకు రకరకాల రుచులను అందిస్తున్న కుక్ ప్యాడ్.. జపాన్ లో అత్యంత ఎక్కువమంది వీక్షించే వెబ్‌పైట్లలో 55వ స్థానంలో ఉంది. గత ఏడు సంవత్సరాల్లో ఈ సంస్థ పన్నెండు రెట్లు విస్తరించింది. ఇంచుమించుగా జపాన్ మహిళల్లో సుమారు ఇరవైనుంచి ముఫ్ఫై సంవత్సరాల మధ్య వయసుగల మహిళల్లో సగంకంటే ఎక్కువ మంది కుక్ ప్యాడ్ ను సందర్శిస్తుంటారు. 1997 లో సానో స్థాపించిన ఈ కుక్ ప్యాడ్..ఎంతో ప్రజాదరణ పొంది 2009 నాటికి 80శాతం రెవెన్యూ పెంచుకుంది. గతేడాది 65 మిలియన్ డాలర్ల కు చేరిన రెవెన్యూ సుమారు 19 మిలియన్ డాలర్ల లాభాలను మిగుల్చుకుంది. గత నెల దీని షేర్లు కూడ 20 శాతం పెరిగి, కంపెనీలో సానో వాటాను 44శాతానికి పెంచడంతోపాటు... కంపెనీ మొత్తం విలువ వంద కోట్లకు చేరింది. అత్యంత అరుదుగా మీడియా ముందుకు వచ్చే 42ఏళ్ళ సానో... జపాన్ కీయో విశ్వవిద్యాలయంలో పట్టభద్రత పొంది కుక్ ప్యాడ్ లో పని ప్రారంభించాడు. 2012 లో అక్కడ సీఈవో పాత్రను వదిలిన సానో... ఆ తర్వాత ఆదాయ సముపార్జనపై దృష్టి సారించాడు. మనానో వెడ్డింగ్ పేరిట ఉన్న జపనీస్ వివాహ వేదిక రివ్యూ సైట్ ను, కుకుంబర్ టౌన్ అనే ఆమెరికాకు చెందిన ఓ ఆహార బ్లాగింగ్ వేదికను కొనుగోలు చేసి, ఈ సంవత్సరంలో లెక్కలేనంత ఆదాయాన్ని చేజిక్కించుకున్నాడు. పూర్వం చదువు లేకుండానే వంట జ్ఞానాన్ని ఎలా పొందారో తెలియదుకానీ, ఇప్పటి వారు వంటలు చేసేందుకు ఏమాత్రం ఇష్టం చూపించడం లేదని, అయితే రుచికరమైన వంటకాలు కుటుంబాలను సమష్టిగా ఉంచేందుకు ఎంతో సహకరిస్తాయని సానో గతంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సానో..అతని భార్య వారి కెంపెనీ హెడ్ క్వార్టర్స్ లో ఉండే ఓ చిన్నపాటి పరిశ్రమలా కనిపించే సంప్రదాయ పాకశాలలో(వంటిల్లు) ప్రతిరోజూ విధిగా ఉద్యోగులకు స్వయంగా వండి పెడుతుంటారట. అంతేకాక సానో తనకు కావలసిన, సమీప బంధువులు వండిన వంటకాలనే భుజిస్తాడని కూడా అతని గురించి బాగా తెలిసినవారు చెప్తుంటారు. -
వడ్డించిన చేపకు ప్రాణమొచ్చింది..
బిర్యానీలో కోడి.. కూతపెడితే.. అలాగే ప్లేట్లో ఉన్న చేప ఎగిరిపడితే.. వినడానికే షాకింగ్‌గా ఉంది కదూ.. జపాన్‌లో ఓ జంటకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జపాన్‌లో సషిమి చేపలు బాగా పాపులర్. వీటిని పచ్చిగానే తింటారు. అయితే తమ కస్టమర్స్‌కి ఫ్రెష్ చేపలు పెడుతున్నామనే విషయాన్ని లైవ్‌లో ప్రూవ్ చేయాలనుకున్నారో ఏమో. ఓ రెస్టారెంట్లో ఫిష్ ఆర్డర్ చేసిన ఆ జంటకు బతికి ఉన్న చేపనే వడ్డించారు. నోరూరించే.. సషిమిని ఓముక్క కొరికి ప్లేట్లో పెట్టి మాట్లలో పడిపోయిన కస్టమర్స్... తాము తిన్న చేప బతికే ఉందని తెలుసుకుని షాకయారు.. ప్లేట్లో ఉన్న చేప.. ఉన్నట్టుండి కదలటం మొదలుపెట్టి కాసేపయ్యాక.. ఏకంగా ప్లేట్లోంచి జంప్ చేసింది. దీంతో ఆర్డర్ ఇచ్చిన ఆసామితో పాటు... చుట్టుపక్కల వాళ్లు భయంతో కేకలు పెట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను ఓ వ్యక్తి తన సెల్ఫోన్లో బంధించి ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అప్లోడ్ చేసిన 24 గంటల్లోనే రెండు వేల మందికి పైగా ఈ వీడియోపై కామెంట్స్ చేశారు. 20 సెకండ్ల ఈ వీడియోని ప్రపంచవ్యాప్తంగా.. 20లక్షల మంది వీక్షించారు. -
హ్యూమన్ పిరమిడ్ కుప్ప కూలింది..!
పది అంతస్తుల హ్యూమన్ పిరమిడ్ కుప్ప కూలిపోయింది. జపాన్ ఒకసా లోని ఓ పాఠశాలలో విద్యార్థుల పిరమిడ్ ప్రదర్శన అర్థంతరంగా నేల ఒరిగింది. 150 మంది విద్యార్థులతో నిర్మించిన పిరమిడ్ ఒక్కసారిగా నేల కూలిపోవడంతో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. జెండా ఎగుర వేసేందుకు అందరికంటే పైకి ఎక్కిన విద్యార్థి తన పని పూర్తి కూడా చేశాడు. ఇంతలో ఏమైందో ఏమో.. ఉన్నట్లుండి అతడు జారిపోవడంతో మొత్తం ప్రదర్శన కకావికలమైపోయింది. జపాన్ లోని ఒసాకా.. యో సిటీ లోని జూనియర్ హైస్కూలు విద్యార్థులు ప్రదర్శనలో భాగంగా ఒకరిపై ఒకరు ఎక్కుతూ పది అంతస్తులుగా.. ఓ పిరమిడ్ రూపాన్నినిర్మించారు. ఇటువంటి గ్రూప్ ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు ఒకరి మధ్య ఒకరికి ఎంతో గట్టి నమ్మకం ఉండాలి. అప్పటికీ పైన ఎక్కిన విద్యార్థి తాను జెండా ఎగురవేసేందుకు నిలబడుతున్నానని ఒకటికి రెండుసార్లు అందర్నీ హెచ్చరిస్తూనే ఉన్నాడు. అంతా కలిపి చేయాల్సిన పనిలో ఏ ఒక్కరు పరధ్యాన్నంగా ఉన్నా మొత్తం కొలాప్స్ అవ్వడం ఖాయం. అక్కడ అదే జరిగింది. పైకెక్కిన విద్యార్థి చివరి అడుగును పైకి వేసేలోపు కింది వరుసలో నిలబడ్డ వారిలో కదలికలు రావడంతో అంతా ఒక్కసారి కుప్ప కూలిపోయారు. ఆ హఠాత్ పరిణామం అక్కడ ప్రదర్శనను చూస్తూ ఉన్న మిగిలిన విద్యార్థులను షాక్ కు గురి చేసింది. మొత్తం ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వారిలో ఒక విద్యార్థికి మాత్రం చెయ్యి కూడ విరిగిపోయింది. హ్యూమన్ పిరమిడ్స్ తో గాయాలవ్వడం జపాన్ లో కొత్తేమీ కాదు. 2012 లో 6,500 మందికి గాయాలవ్వడం ఓ రికార్డుగా మారింది. అప్పట్లో ఒక విద్యార్థికి పెర్మనెంట్ స్పైనల్ డ్యామేజ్ కూడ అయ్యింది. ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా జపాన్ ప్రజలు ఆ ప్రదర్శనను ఎంతో గర్వంగా ఫీలౌతారు. ప్రతి స్కూల్లోనూ విద్యార్థుల ప్రదర్శనల్లో మానవ పిరమిడ్ నిర్మించడం అక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. -
దేవుడా..! అమ్మాయి ఇలా కూడా ఉంటుందా..?
-
జపనీస్‌కు హిందీ, యోగాపై మక్కువ
టోక్యో: హిందీ, యోగా అంటే జపనీయులకు మక్కువ పెరుగుతోందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీ మంగళవారం జపాన్-ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేసిన వ్యాపారవేత్తల సమావేశంలో ప్రసంగించారు. భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, విశ్వ భాగస్వాములుగా పనిచేస్తున్నాయని మోడీ చెప్పారు. ఇరు దేశాల మధ్య మాటలకందని ఆధ్యాత్మిక సంబంధముందని పేర్కొన్నారు. హిందీ, యోగాలపై జపాన్ వాసులకు రోజురోజుకు ఆసక్తి పెరుగుతోందని మోడీ అన్నారు. -
జపనీస్‌లో మోడీ ట్వీట్స్
* 30 నుంచి జపాన్ పర్యటన నేపథ్యంలో ప్రధాని ఉత్సాహం * జపనీయుల మనసు దోచుకునే యత్నం న్యూఢిల్లీ: నాలుగు రోజుల జపాన్ పర్యటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా ఆ దేశ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఈ పర్యటనపై అమితాసక్తిని ప్రదర్శిస్తూ.. గురువారం జపనీస్ భాషలో పలు ట్వీట్లు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో తన గత పర్యటనను గుర్తు చేసుకుంటూ మలి పర్యటన కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోడీ శనివారం(30న) నాడు జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన ప్రధాని అయిన తర్వాత భారత ఉపఖండం దాటి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా జపాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన ట్వీట్లు చేశారు. ‘జపాన్ ప్రజలతో నేరుగా జపనీస్‌లో మాట్లాడాలని అక్కడి నా మిత్రులు కోరారు.అనువాదం చేయడానికి సహకరించినందుకు వారికి నా కృతజ్ఞతలు. జపాన్ ప్రజల సృజనాత్మకత, కచ్చితత్వం అద్భుతం. ప్రధాని షింజో అబేని కలిసేందుకు ఉద్వేగంగా ఉన్నాను’ అని ‘పీఎంవో ఇండియా’ఖాతా ద్వారా మోడీ జపనీస్‌లో ట్వీట్ చేశారు. కీలక ఒప్పందాలకు రంగం సిద్ధం: ఈ పర్యటనలో భాగంగా రక్షణ, అణు ఇంధనం, మౌలిక వసతుల కల్పన, ఖనిజ వనరులతో పాటు వాణిజ్యంపై ఇరు దేశాల ప్రధానులు చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా ఏటా రెండు వేల టన్నులకుపైగా అరుదైన ఖనిజాలను భారత్ నుంచి దిగుమతి చేసుకునేందుకు జపాన్ సిద్ధంగా ఉంది. ఇది ఆ దేశం వినియోగించే ఖనిజ సంపదలో 15 శాతం కావడం గమనార్హం. స్మార్ట్ఫోన్లు, కారు బ్యాటరీలు, టర్బైన్లు తదితరాల తయారీలో 18 రకాల అరుదైన ఖనిజాలు కీలకం. ఈ ఒప్పందం దాదాపు ఖరారైందని, మోడీ పర్యటనతో జపాన్‌తో సంబంధాలు సరికొత్త స్థాయికి చేరుతాయని విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నెల 30న మోడీ నేరుగా జపాన్‌లోని స్మార్ట్ సిటీ క్యోటోకు వెళ్లనున్నారు. ఆయన్ను స్వాగతించేందుకు ఆ దేశ ప్రధాని షింజో అబే కూడా క్యోటోకి రానున్నారు. భారత్‌లో వంద స్మార్ట్ సిటీల అభివృద్ధికి ప్రభుత్వం పూనుకున్న నేపథ్యంలో క్యోటో నగర ప్రణాళిక, నిర్మాణాన్ని మోడీ అధ్యయనం చేయనున్నారు. అందుకే మొదట రాజధాని టోక్యోకు కాకుండా స్మార్ట్ సిటీకే వెళ్లాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. -
జపాన్ భాష ట్వీట్స్ తో ఆకట్టుకున్న ప్రధాని!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఆసరాతో ప్రజలందరికి ప్రధాని నరేంద్రమోడీ అందరికి అందుబాటులోకి ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే. సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ ను ఆసరాగా చేసుకుని జపాన్ ప్రజలతో చేరువయ్యారు. గురువారం ట్విటర్ లో మోడీ జపాన్ భాషలో ట్వీట్స్ చేశారు. జపాన్ లోని తన మిత్రుల కోరిక మేరకు.. ఆదేశ ప్రజలకు చేరువయ్యేందుకే ట్విటర్ లో జపాన్ భాషలో ట్వీట్ చేశానని ప్రధాని మోడీ తెలిపారు. ఆగస్టు 30 తేది నుంచి సెప్టెంబర్ 3 తేది వరకు మోడీ జపాన్ లో పర్యటించనున్న నేపథ్యంలో తాజా ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమయ్యేందుకు తన పర్యటన దోహద పడుతుందనే విషయాన్ని తెలుపడానికి తనకు సంతోషంగా ఉంది. షింజో అబే నాయకత్వం పట్ట ఎంతో గౌరవం ఉంది. ముఖ్యంగా అబేను కలువడానికి ఉత్సాహంగా ఉన్నాను అని మోడీ ట్వీట్ చేశారు. తన మిత్రులు జపాన్ భాషలో ట్వీట్ చేయాలని కోరారు. ట్రాన్స్ లేషన్ కు సహకరించిన నా మిత్రులకు ధన్యవాదాలు అంటూ మరో ట్విట్ చేశారు. Konnichiwa ! Prime Minister @narendramodi reaches out to Japan directly. pic.twitter.com/XpeaxV2zUP — Syed Akbaruddin (@MEAIndia) August 28, 2014 Japanese-English quick translation & ready reckoner of PM @narendramodi tweets on forthcoming visit to Japan. pic.twitter.com/N4bfguvYAW — Syed Akbaruddin (@MEAIndia) August 28, 2014 -
జపాన్‌లో మర్యాదరామన్న
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మర్యాదరామన్న చిత్రం త్వరలో జపాన్ దేశవ్యాప్తంగా విడుదల కానుందా అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఇప్పటికే హిందీ, తమిళ్, బెంగాలీ భాషల్లోకి అనువాదమైన ఆ చిత్రం అక్కడి బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో మర్యాద రామన్న చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేయాలని ఆ చిత్ర హక్కుదారుడు సంకల్పించినట్లు సమాచారం. కాగా అందుకు సంబంధించిన వర్క్ దాదాపుగా పూరైనట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో మర్యాద రామన్న చిత్రం జపాల్ దేశవ్యాప్తంగా హల్చల్ చేయనుంది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సునీల్, సలోనీ హీరోహీరోయిన్లుగా నటించిన మర్యాదరామన్న చిత్రం తెలుగులో బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వరుసగా వచ్చిన మగధీర, మర్యాదరామన్న, ఈగ చిత్రాలు విజయఢంకా మోగించిన విషయం విదితమే. జపాన్‌లో రజనీకాంత్‌కు మంచి పాలోయింగ్ వుంది. ఆయన నటించిన ముత్తు, బాషా తదితర చిత్రాలలోపాటు ఇటీవలే విడుదలైన కొచ్చాడియాన్ వరకు అన్ని జపాన్ భాషలోకి అనువాదమై విడుదలైయ్యాయి. ఆ చిత్రాలకు జపనీయులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సునీల్ చిత్రం మర్యాదరామన్న కూడా జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతున్నాడు. సునీల్ జపనీయులను ఎంత వరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాలి. -
జపాన్‌లో సుదీప్ ‘చ్యూయింగ్ గమ్’
మన భారతీయ నటుల్లో జపనీయుల అభిమానం సంపాదించుకున్న తొలి నటుడు రజనీకాంత్. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా జపాన్‌లో ఫాలోయింగ్ ఏర్పడింది. టీవీ చానల్స్‌లో ఎన్టీఆర్ డాన్సులు చూసి, ఆయనకు అక్కడ అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడీ జాబితాలో కన్నడ నటుడు సుదీప్ చేరారు. ఆయన జపనీయుల అభిమానం సంపాదించుకోవడానికి కారణం తెలుగు చిత్రం ‘ఈగ’. ఈ బహు భాషా చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. జపాన్‌లో కూడా ఈ చిత్రం విడుదలైంది. ఇందులో సుదీప్ నటనకు జపాన్‌లో అభిమానులు ఏర్పడ్డారు. ఓ చ్యూయింగ్ గమ్ ఉత్పత్తిదారుడైతే, సుదీప్ ఫోటోని ఉపయోగించుకున్నాడు. చ్యూయింగ్ గమ్‌కి సంబంధించిన కవర్‌పై సుదీప్ ఫొటోని ముద్రించాడు. మామూలుగా అయితే ఈ విషయం సుదీప్‌కి తెలిసి ఉండేది కాదు. కానీ, ఒక్క జపాన్‌లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఇవి దొరుకుతున్నాయి. ఇటీవల సుదీప్ బ్యాంకాక్‌లో షూటింగ్ చేస్తుండగా, ఈ చ్యూయింగ్ గమ్స్ ఆయన కంటపడ్డాయి. ‘స్వీట్ షాక్ తగిలినట్లుగా అనిపించింది’ అని అంటున్నారు సుదీప్. దేశం కాని దేశంలో ఇలాంటి అభిమానం దక్కినందుకు ఆనందంగా ఉందని, జపాన్ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. -
చంద్రుడిపై నుంచి విద్యుత్
టోక్యో: భూమ్మీద పెట్రోలు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలన్నీ తరిగిపోతున్నాయి.. వాతావరణం, మేఘాలు అడ్డురావడం, స్థల లేమి వంటి కారణాల వల్ల సౌర విద్యుదుత్పత్తీ కష్టసాధ్యం.. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా చంద్రుడిపై సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, భూమిపైకి ప్రసారం చేసేందుకు ఒక సరికొత్త ప్రతిపాదనను జపాన్‌కు చెందిన షిమిజు కార్పొరేషన్ నిపుణులు తెరపైకి తెచ్చారు. దాని ప్రకారం.. చంద్రుడి భూమధ్యరేఖపై 11,000 కిలోమీటర్ల పొడవునా, దాదాపు 400 కిలోమీటర్ల వెడల్పుతో సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. వాటిని అక్కడక్కడా ఏర్పాటు చేసిన ప్రసార కేంద్రాలకు అనుసంధానించి.. అతి శక్తివంతమైన, సాంద్రత గల లేజర్లుగా మార్చి భూమిపైకి పంపుతారు. భూమిపై సుమారు 20 కిలోమీటర్ల వ్యాసంతో ఏర్పాటు చేసిన గ్రహణ కేంద్రాలు.. ఆ శక్తిని గ్రహించి విద్యుత్‌గా మార్చి ప్రసారం చేస్తాయి. ఏకంగా 13,000 టెరావాట్ల (సుమారు 1300 కోట్ల మెగావాట్లు) విద్యుదుత్పత్తి చేయగల ఈ ప్రాజెక్టును.. 2035 సంవత్సరానికల్లా చేపట్టవచ్చని షిమిజు సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. -
రాషోమోన్ చలనచిత్రం
సృజనం (1950లో జపనీస్ దర్శకుడు అకిరా కురసోవా తీసిన ‘రాషోమోన్’ చలనచిత్ర చరిత్రలో ఒక అద్భుతం. ఒకే సంఘటనను వివిధ పాత్రల దృష్టి కోణాల నుండి చిత్రించటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ర్యూనోసుకె అకుటగవ రాసిన కథ ‘ఇన్ ఎ గ్రోవ్ (1922)’ రాషోమోన్కు ఆధారం. నేపథ్యం కోసం మరోకథ - రాషోమోన్ - కలిపాడు దర్శకుడు. రాషోమోన్: జపాన్ ప్రాచీన రాజధాని క్యోటో నగర సింగహద్వారం.) ‘ఇన్ ఎ గ్రోవ్’ కథ కట్టెలు కొట్టడానికి అడవిలోకి వెళ్లినవాడు పోలీస్ కమిషనర్ ముందు ఇచ్చిన వాంగ్మూలం: అవును మహాప్రభూ, శవం కనిపించింది. రోజూ వెళ్లినట్టే ఈ రోజూ కట్టెల కోసం వెళ్లాను. దట్టమైన అడవిలో కనిపించింది శవం. ఎక్కడో కచ్చితంగా చెప్పమంటారా? యమామిషా దగ్గిర. రహదారి నుండి 150 మీటర్ల లోపలికి. నీలిసిల్కు కిమోనోలో వెల్లకిలా పడుంది. క్యోటో స్టైల్లో తలకు కట్టుకున్న గుడ్డ నలిగిపోయింది. ఒకే ఒక్క దెబ్బతో ఖడ్గం గుండెలోకి దిగింది. పువ్వులు, వెదురు ఆకులు నెత్తుటితో తడిసి ఉన్నాయి. ఖడ్గం గాని మరేదైనా ఆయుధం గాని కనిపించలేదు. సీడర్ చెట్ల మొదట్లో, ఒక తాడు మాత్రం కనిపించింది. ఆ, జ్ఞాపకమొచ్చింది. ఒక దువ్వెన కూడా చూశాను. అంతే! హత్యకు ముందు అతడు చాలా ప్రతిఘటించి ఉంటాడు. అక్కడి ఆకులన్నీ నలిగిపోయి ఉన్నాయి. గుర్రమా? ఆ తోపులోకి మనిషి ప్రవేశించటమే కష్టం. గుర్రం కూడానా! సంచార బౌద్ధ భిక్షువు వాంగ్మూలం: నిన్న మధ్యాహ్నం ఆ దురదృష్టవంతుణ్ని చూశాను - సెకియామా నుండి యమాశినాకు వెళ్లే దారిలో. అతడు సెకియామా దిశగా నడుస్తున్నాడు. అతడి వెంట గుర్రం మీద ఒక మహిళ ప్రయాణిస్తున్నది. ఆమె అతడి భార్య అని తరువాత తెలిసింది. ఆమె తలమీది స్కార్ఫుతో ముఖం కనిపించలేదు. లిలాక్ రంగు దుస్తులు ధరించింది. గుర్రం ఠీవిగా ఉంది. ఆమె ఎంత ఎత్తు అంటారా! సుమారు నాలుగడుగుల అయిదంగుళాలు. నేను బౌద్ధ భిక్షువును గనక, ఆమెను అంతకన్నా ఎక్కువ పరిశీలించి చూడలేదు. ఆ వ్యక్తి దగ్గిర ఖడ్గమూ, విల్లంబులూ ఉన్నాయి. ఆ అమ్ములపొదిలో సుమారు ఇరవై బాణాలుండొచ్చు. అతడి జీవితం అలా ముగుస్తుందని ఊహించలేదు. మానవ జీవితం నశ్వరము కదా! ఉదయం పరచుకున్న మంచులాగా, ఆకాశంలో మెరిసిన మెరుపులాగా క్షణకాలం కనిపించి మాయమైపోతుంది. పోలీస్ బంట్రోతు ఇచ్చిన వాంగ్మూలం: నేను ఒక వ్యక్తిని అరెస్టు చేశాను. అతడు పేరుమోసిన దోపిడీదొంగ. తాజోమారు. అప్పటికి గుర్రం పైనుండి జారి కిందపడ్డాడు. ‘అవటగుచి’ వంతెన మీద బాధతో మూలుగుతున్నాడు. గతరాత్రి, తెల్లవారుజామున అతడు నాకంటపడ్డాడు. అంతకు ముందురోజు రాత్రి కూడా అతణ్ని అరెస్టు చేయటానికి ప్రయత్నించాను గాని నా కళ్లుగప్పి పారిపోయాడు. ఆ సమయంలో అతని ఒంటిమీద నీలి సిల్కు కిమోనో, ఖడ్గం ఉన్నాయి. ఈ విల్లంబులు మృతుడివే అనుకుంటే, తాజోమారే హంతకుడై ఉండాలి. తోలుపట్టాతో కట్టిన అల్లెతాడు, లక్కతో చేసిన అమ్ములపొది, డేగ రెక్కల బాణాలు పదిహేడు - ఇవీ మృతుడి వద్ద లభించినవి. అతడెక్కినది మంచి, మేలుజాతి గుర్రమే. అతడు ప్రమాదవశాత్తూ గుర్రం పైనుండి జారిపడ్డాడంటే - విధి వక్రించిందన్నమాటే మరి. క్యోటో నగరంలో సంచరిస్తున్న దోపిడీ దొంగలందరిలోకీ, మహిళల్ని ఎక్కువగా ఇబ్బందులకు గురిచేసినవాడు తాజోమారు. గత సంవత్సరం, శిశిరంలో, పర్వతం వెనక భాగాన ఉన్న టోరిబె దేవాలయానికి వచ్చిన ఓ మహిళను ఎవరో హత్య చేశారు. ఇది తాజోమారు పనేనని అనుమానం. ఇతణ్ని హత్య చేసింది ఈ దుర్మార్గుడే అయితే, ఆయన భార్యను ఏం చేసి ఉంటాడో ఊహించవచ్చు. ఈ కేసును మీరు ఈ కోణం నుండి కూడా పరిశోధించాలని మనవి చేసుకుంటున్నాను. కమిషనర్ ముందు ఒక వృద్ధురాలి వాంగ్మూలం: మృతుడు నా అల్లుడు. అతడు క్యోటో నివాసి కాదు. వకాసా ప్రాంతంలోని కొకుప్ఫు గ్రామ సమురాయ్ (యోధ) అతడు. పేరు ‘కనజవ నో తకెహికొ’. వయస్సు ఇరవై ఆరు. సౌమ్యుడు. ఎవరితోనూ కలహించడు. నిన్న కూడా తనకై తాను పోట్లాటకు దిగి ఉండడు. నా కూతురి పేరు మసాగో. వయసు పంతొమ్మిది. వుషారైన పిల్ల. కాని దానికి తకెహికొ తప్ప మరొక పురుషుడితో సంబంధముందనుకోను. నిన్న తకెహికొ నా కూతుర్ని తీసుకుని బయల్దేరాడు. దురదృష్టం కాకపోతే, వాళ్లకే ఇలా జరగాలా? ఇంతకూ నా కూతురేమైంది? దానికోసం వెతకమని మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. ఆ దుర్మార్గుడు తాజోమారు నా బతుకులో నిప్పులు పోశాడు. అల్లుడు, కూతురు నాకు కాకుండా పోయారు.... (కన్నీరు మున్నీరుగా విలపించింది). తాజోమారు నేరాంగీకారం (కన్ఫెషన్): అతణ్ని చంపాను. ఆమెకేమైంది మరి? ఒక్క నిమిషమాగండి. మీరెన్ని చిత్రహింసలు పెట్టినా తెలియంది చెప్పలేను. ఇంత జరిగింతర్వాత, ఇంక మీనుంచి ఏమీ దాచదలచలేదు. నిన్న మధ్యాహ్నం దంపతులు నాకంట పడ్డారు. అప్పుడే చిరుగాలి వీచింది. స్కార్ఫు తొలగింది. ఆమె మొహం తళుక్కున మెరిసింది. ఆమె బోధిసత్వునిలా కనిపించింది. అప్పుడే నిర్ణయించుకున్నాను. అవసరమైతే, ఆమె కోసం, అతణ్ని చంపటానికైనా సందేహించకూడదని! మీరనుకుంటున్నట్టుగా, చంపటం నాకో విషయం కాదు. స్త్రీని బంధించినప్పుడు, ఆమె పురుషుణ్ని ఎట్లాగూ చంపక తప్పదు. ఈ పనికి, నా ఖడ్గాన్ని ఉపయోగిస్తాను. అయినా, ఈ లోకంలో హత్యలు చేసేవాణ్ని నేనొక్కణ్నేనా ఏమిటి? మనుషుల్ని చంపటానికి మీకు ఖడ్గాలు అవసరం లేదు. అధికారంతో, ధన బలంతో చంపుతారు మీరు. కొన్నిసార్లు వాళ్లకోసమే అనే సాకుతో కూడా చంపుతారు. మీరు హత్యలు చేసిన ప్రతిసారీ రక్తం ప్రవహించదు. మనిద్దరిలో ఎవరెక్కువ పాపం చేస్తున్నారు? మీరా, నేనా? (వ్యంగ్యంగా నవ్వుతాడు). అతణ్ని చంపకుండా ఆమెను బంధించగలిగితే, బాగానే ఉండేది. అతడికి అపకారం తలపెట్టకుండా ఆమెను స్వాధీనం చేసుకోవటానికి చాలా ప్రయత్నించాను. కాని, జన సంచారం ఉన్న ఈ రహదారి మీద నా ప్రయత్నం సఫలం కాదు. అందుకోసం, వాళ్లను చెట్ల మాటుకు రమ్మన్నాను. చెట్ల వెనకాల ఒక గోతిలో కొన్ని అద్దాలూ, ఖడ్గాలూ దాచిపెట్టాననీ, వాళ్లకు చవకగా అమ్ముతాననీ ఆశపెట్టాను. దురాశ మంచిది కాదని మీరూ అంగీకరిస్తారు గదా. మొదట సందేహించినా, అరగంటలో అతడు నన్ననుసరించాడు. దురాశ అతడి విజ్ఞతను కబళించింది. ఆమె మాత్రం గుర్రం దిగకుండా అక్కడే నిరీక్షిస్తానన్నది. అది స్త్రీ సహజమైన బెరుకు. దట్టమైన చెట్లను చూసి ఆమెకు సందేహం కలిగి ఉంటుంది. మొత్తం మీద నా పాచిక పారింది. అతడిని తీసుకుని తోపులోకి వెళ్లాను - ఆమెను ఒంటరిగా వదిలి. అవన్నీ వెదురుచెట్లు. ఓ యాభై గజాల దూరంలో సీడర్ చెట్లున్నాయి. నా పనికి అది అనువైన చోటు. అతడు ఆశగా ముందుకు నడిచాడు. అదను చూసి, వెనక నుండి బంధించటానికి యత్నించాను. అతడు ఖడ్గ విద్య నేర్చిన యోధ. బలిష్ఠుడు. కాని, ఆ క్షణాన నాదే పైచేయి. అతడెంత ప్రయత్నించినా, విడిపించుకోలేకపోయాడు. ఒడుపుగా పట్టుకుని, సీడర్ చెట్టుకు కట్టేశాను. తాడెక్కడ దొరికిందంటారా? దొంగలు ఎప్పుడూ తాడు వెంట తీసికెడతారు. ఏ క్షణానైనా గోడలెక్కవలసి రావచ్చు. అరవటానికి ప్రయత్నించాడు. వెదురు ఆకులు నోట్లో కుక్కి శబ్దంరాకుండా జాగ్రత్తపడ్డాను. అలా, అతణ్ని కదలకుండా చేసి, ఆమె వద్దకెళ్లి, అతడికి ఉన్నట్టుండి ఆరోగ్యం పాడైంది, వచ్చి చూడమన్నాను. ఆతృతగా గుర్రం దిగి నా వెంట నడిచిందామె - (చేతులో చేయి వేసి ఆమెను తోపుదాకా తీసుకెళ్లాను). భర్తను చూడగానే, దాచుకున్న చురకత్తి తీసింది. స్త్రీలకంత కోపం రాగలదని నాకప్పటిదాకా తెలియదు. నేను ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, ఆ చురకత్తి నాలో దిగేదే. ఆమె సాధారణ అబల. నేను తాజోమారు! నా ఖడ్గానికి పనిచెప్పకుండానే ఆమెను నిరాయుధురాలిని చెయ్యగలిగాను. చేతిలో చురకత్తి కూడా లేని మహిళ నా పట్ల ఎంత ద్వేషమున్నా ఏం చెయ్యగలదు? కనీసం ఆమె భర్తను చంపకుండా నా కోరిక తీర్చుకోగలిగాను. అవును. అతడి ప్రాణం తీసుకోలేదు నేను. ఆమె రోదిస్తూ కుప్పకూలింది. ఇక నేను వెళ్లిపోదామనుకుని ముందుకు కదిలినప్పుడు, ఆమె నా చేయి పట్టుకుని, ఆ భర్తో, నేనో - ఇద్దర్లో ఎవరో ఒకరం హతులం కాక తప్పదంది. తనకు జరిగిన అవమానం ఇద్దరు పురుషులు తెలియటం తను భరించలేనంది. మా ఇద్దరిలో ఎవరు బతికితే వాళ్లకు భార్యగా ఉండటం తనకు సమ్మతమేనంది. అలా, ఆ క్షణాన, అతణ్ని చంపాలనే కోరిక నాలో పెరిగింది. (ఉద్రేకంతో మొహం ఎరుపెక్కింది). ఇలా మాట్లాడుతున్నందుకు నేను మీకు చాలా క్రూరుడిగా కనిపిస్తున్నాననుకుంటాను. కాని, అప్పుడు ఆమె నావైపు ఎలా చూసిందో మీకు తెలియదు. నిప్పుల్లా మెరిసిన ఆమె చూపులు నన్ను దహించివేశాయి. తరువాత ఏమైనా సరే, మరొక్కరోజు బతకలేకపోయినా సరే, ఆమెను నా భార్యగా చేసుకోవటం తప్ప మరో కోరిక కలగలేదు నాలో. అది తప్ప నా జీవితానికి మరే లక్ష్యమూ లేదు. నేను బతికున్నదే ఆమెను నా దాన్ని చేసుకోవటానికనిపించింది. అది కేవలం కామం కాదు. అదే నిజమైతే, ‘అనుకున్నది చేశాను’ గనక, తనమానాన తనను వదిలి వెళ్లిపోవచ్చు. నా ఖడ్గం రక్తస్నానం చెయ్యనవసరం లేదు. ఆమె కళ్లు నన్ను దీనంగా అర్ధించినప్పుడు అతణ్ని చంపకుండా అక్కడ నుండి కదలకూడదనుకున్నాను. చంపటంలో కూడా ధర్మముండాలి. కట్లు విప్పి, కత్తి యుద్ధం చేద్దామన్నాను. కోపంతో ఊగిపోతూ అతడు ఖడ్గం ఝుళిపించాడు. మా యుద్ధం ఎలా జరిగిందో ఇప్పుడు వివరించవలసిన అవసరం లేదు. ఇరవై మూడవ ప్రహారంలో... అతడు మంచి యోధ. అతని సామర్థ్యానికి నా జోహారు. అతడు నేల కూలగానే, ఆమె వైపు చూశాను! కాని ఆమె ఎక్కడికో వెళ్లిపోయింది. ఎక్కడికి పోయి ఉంటుంది! సీడర్ చెట్లలో గాలించాను. అంతిమశ్వాస పీలుస్తున్న నా ప్రత్యర్థి మరణ వేదన తప్ప మరేమీ వినిపించలేదు. మేం యుద్ధానికి సిద్ధపడగానే, ఆమె సహాయం కోసం రహదారి వైపు వెళ్లి ఉంటుంది. అంటే, నాకు జీవన్మరణ సమస్య సృష్టించబోతున్నది. వెంటనే అతడి ఖడ్గం, విల్లంబులు తీసుకుని పర్వతమార్గం వైపు పరిగెత్తాను. అక్కడ, పచ్చగడ్డి మేస్తున్న ఆమె గుర్రం కనిపించింది. గ్రామంలోకి ప్రవేశించేముందు నా ఆయుధాలను వదిలించుకున్నాను. ఇదీ నా నేరాంగీకారం. నన్నెట్లాగూ ఉరి తీస్తారని తెలుసు. అంతకన్నా పెద్ద శిక్ష ఉండదు గద. (ధిక్కారంగా నవ్వుతాడు) మహిళ నేరాంగీకారం: ఆ వ్యక్తి, నన్ను లోబరుచుకుని కట్లలో ఉన్న నా భర్తవైపు అవమానకరంగా చూశాడు. నా భర్త ఎంత గాయపడి ఉంటాడు! నేను నిస్సహాయను. ఆ క్షణాన నాకు, నా భర్త కళ్లలో కొత్త వెలుగు కనిపించింది. దాని అర్థమేమిటో చెప్పలేను. మాట్లాడలేని నా భర్త మనసులోని మాట నాకు తెలిసింది. నా భర్త కళ్లలో కనిపించింది కోపమూ కాదు. విచారమూ కాదు. ఒక అసహ్యం, జుగుప్స. ఇతడు నా మీద చెయ్యి చేసుకున్నాడు. కాని ఈ దెబ్బ కన్నా నా భర్త చూపు నన్ను ఎక్కువగా అవమానపరిచింది. ఎంతసేపలా పడున్నానో తెలియదు గాని, కళ్లుతెరిచి చూసేసరికి నీలిసిల్కు గుడ్డలేసుకున్న వ్యక్తి కనిపించలేదు. బందీగా ఉన్న నా భర్త అచేతనంగా నావైపు దీనంగా చూశాడు. చూపులను తట్టుకోవటం నా వల్ల కాలేదు. నన్ను నిలువునా దహించివేశాయవి. దగ్గరగా వెళ్లి, ‘‘తకెహికో, ఇంత జరిగింతర్వాత ఇక నేను నీతో కాపురం చెయ్యలేను. మరణమే నాకు శరణ్యం. నాకు జరిగిన అవమానాన్ని నువ్వు కళ్లారా చూశావు. అందువల్ల నువ్వు కూడా ఇక బతికుండకూడదు. నిన్ను నేను బతకనివ్వను’’ అని చెప్పాను. అదృష్టవశాత్తూ చురకత్తి ఇంకా నా దగ్గరే ఉంది. మాటలు విని పెదవులు కదిపాడు నా భర్త. నోటి నిండా ఆకులున్నాయి గనక మాట్లాడలేకపోతున్నాడు. కాని, ఆ చూపులు చాలవా, మాటలెందుకు. ‘‘చంపు. త్వరగా చంపు’’ అంటున్నాయి కళ్లు. లిలాక్ రంగు కిమోనోలోనికి దిగింది నా బాకు. మళ్లీ మూర్ఛపోయి ఉంటాను. స్పృహ వచ్చేసరికే, నా భర్త మరణించాడు. కట్లు అలాగే ఉన్నాయి. ఏడుస్తూ మృతదేహానికున్న కట్లు విప్పాను. శరీరంలో సత్తువ లేదు. ఆత్మహత్య చేసుకోవటానికి కూడా శక్తి లేదు. బాకుతో గొంతు మీద పొడుచుకుని పర్వత పాదాల చెంత ఉన్న తటాకంలోకి దూకాను. కాని బాకుకు కూడా నా మీద కరుణ లేదు. ఇదిగో, ఇంకా బతికే ఉన్నాను. శీల భంగానికి గురైన అభాగ్యురాలిని. భర్తను హత్యచేశాను. దుర్మార్గుడి చేతిలో పరువుపోయింది. ఏం చెయ్యను? ఏం చెయ్యను?... (రోదిస్తోంది). మృతుడు, మరో బతికున్న వ్యక్తి (మీడియం) ద్వారా తన కథ వినిపిస్తాడు: నా భార్యను లోబర్చుకుని, ఆమెను సముదాయించటం ప్రారంభించాడు దోపిడీ దొంగ. నోట్లో ఆకులు కుక్కాడు గనక, మాట్లాడలేను. అయినా, నేనామెకు అనేకసార్లు కళ్లతో సైగలు చేశాను. ఆమె, వాడు చెబుతున్న కబుర్లు వింటోంది. అసూయతో రగిలిపోయాను. చివరికి, ధైర్యం చేసి, ‘‘నేను నీ శీలాన్ని దోచుకున్నాను గనక, నువ్వు నీ భర్తతో కలిసి బతకలేవు. ఇక, నన్నే నీ భర్తగా ఎందుకు అంగీకరించకూడదు’’ అన్నాడు వాడామెతో. వాడి మాయలో పడిపోయినట్టుగా ఆమె ఆ మాటల్ని ఆసక్తిగా వింది. ఆ క్షణాన, ఆమె ఎంత అందంగా కనిపించిందో! ఆమె వాడికేం బదులిచ్చిందనుకుంటున్నారా? నేను కదలలేను. మెదలలేను. కాని ఆ మాటలు విని కాలిపోయాను. ‘‘నీ వెంటే తీసికెళ్లు ఇక’’ అవీ ఆమె మాటలు. ఆమె చేసిన పాపం ఇది మాత్రమే అయితే, నేనంతగా బాధపడేవాణ్ని కాదేమో. మంత్రముగ్ధురాలైనట్టుగా, వాడి చేతిలో చేయి వేసి తోపులోనుండి వెళ్లిపోతూ, నావైపు తిరిగి చూసి, ‘‘అతణ్ని చంపెయ్. అతడు బతికున్నంతవరకూ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను’’ అంది వాడితో. ఆ మాటలు విని పాతాళంలోకి కుంగిపోయాను. మానవ చరిత్రలో, ఏ భార్య అయినా భర్త పట్ల అంత అసహ్యత పెంచుకుందా ఇదివరలో! ఆమె మాటలు విని, దోపిడీ దొంగ కూడా నిర్విణ్ణుడయ్యాడు. ఇలా చెయ్యవలసి వస్తుందని ఊహించి ఉండడు. నా దగ్గిరకు వచ్చి, ‘‘ఇలాంటిదాన్ని నువ్వేం చేస్తావు? చంపుతావా? వదిలేస్తావా? తలాడించు చాలు. చంపమంటావా?’’ అని అడిగాడు. ఈ మాటలన్నందుకైనా, అతడి నేరాన్ని క్షమించవచ్చు. నేను సందేహించాను. ఆమె అరుస్తూ పరిగెత్తింది. ఆమెను పట్టుకోవటానికి ప్రయత్నించాడతడు. కాని అతడి చేతుల్లోంచి జారింది ఆమె. ఆమె పారిపోయిన తర్వాత, నా ఖడ్గం, విల్లంబులు తీసుకున్నాడు. నా కట్లు తెంచేశాడు. లోపల ఏదో గొణుక్కుంటున్నాడతడు. ‘‘ఇక నా వంతు’’ అనుకుంటున్నాడు కాబోలు. అతడూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అంతటా నిశ్శబ్దం! సమీపంలో ఏడుపు వినిపించింది. జాగ్రత్తగా విన్నాను. అది నా ఏడుపే. పాదాల చెంత నా భార్య వదిలివెళ్లిన బాకు కనిపించింది. బలంగా గుండెలో పొడుచుకున్నాను. గొంతుకేదో అడ్డం పడింది. కాని బాధ తెలియలేదు. శరీరం క్రమంగా చల్లబడింది. మృత్యు నిశ్శబ్దం ఆవరించింది. సూర్యుడు కుంగిపోయాడు. చీకటి ఆవరించింది. నలువైపుల నుండీ నిశ్శబ్దం నన్ను కప్పేసింది. ఎవరో నావైపు కదిలి వచ్చారు. అంధకారంలో ఏమీ కనిపించలేదు. నా గుండెల్లో నుండి బాకును నెమ్మదిగా లాగింది అదృశ్య హస్తం. అంతే ఆ తర్వాత అగమ్య లోకాలకు నా ప్రయాణం ప్రారంభమైంది. (కథ సంక్షిప్త రూపం) అప్పుడే నిర్ణయించుకున్నాను. అవసరమైతే, ఆమె కోసం, అతణ్ని చంపటానికైనా సందేహించకూడదని! ఆ క్షణాన నాకు, నా భర్త కళ్లలో కొత్త వెలుగు కనిపించింది. దాని అర్థమేమిటో చెప్పలేను. మాట్లాడలేని నా భర్త మనసులోని మాట నాకు తెలిసింది. నా భర్త కళ్లలో కనిపించింది కోపమూ కాదు. విచారమూ కాదు. ఒక అసహ్యం, జుగుప్స. జపనీస్ మూలం: ర్యూనోసుకె అకుటగవ తెలుగు: ముక్తవరం పార్థసారథి -
కరౌకేయుడు ఏ పాటైనా.. ఎవరితోనైనా..
వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన డాక్టర్ కె.ఎ.గౌస్ హైదర్ వృత్తిరీత్యా వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు. ప్రవృత్తి రీత్యా కరౌకే కళాకారులు. గత పద్దెనిమిది ఏళ్లుగా కరౌకే సంగీతంలో ప్రయోగాలు చేస్తూ వస్తున్న హైదర్ సొంత ఇంటిని కరౌకే అకాడమీగా మార్చేసి ఆ కళకు ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నారు. ఆయనతో ఇంటర్వ్యూ... కరౌకే మీకు ఎలా పరిచయమైంది? 1992లో కాకినాడ ఫెర్టిలైజర్స్‌లో పనిచేసేటప్పుడు నా సహాధ్యాయి కరౌకేట్రాక్లతో ఎంజాయ్ చేసేవాడు. నాకు ఒక కరౌకే డెక్‌ను బహుమతిగా ఇచ్చాడు. అలా మొదలైన పరిచయం కరౌకేతో విడదీయలేని బంధంగా మారింది కరౌకే మ్యూజిక్ అంటే..? కరౌకే అంటే అన్ని రకాల సంగీత వాయిద్యాలతో పూర్తిస్థాయిలో ఒక పాట ట్యూన్ ఉంటుంది. సింగర్ చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడ పాట పాడాలో గ్రహిస్తూ మ్యూజిక్కు అనుగుణంగా గాత్రం ఇవ్వడం. నేపథ్య సంగీతంతో పాటు వచ్చే పాట చరణాలు పక్కాగా ఆర్కెస్ట్రాలో పాడినట్టుగా ఉండడమే కరౌకే ప్రత్యేకత. జపాన్‌లో ఆదరణ పొందిన సంగీత కళ ఇది. కరౌకే ప్రాచుర్యానికి మీరేం చేస్తున్నారు? ‘అన్మోల్ కరౌకే మ్యూజికల్ అకాడమీ’ నెలకొల్పి కరౌకేను వ్యాప్తి చేసే పనిలో ఉన్నాను. వరంగల్, హైదరాబాద్‌లల్లో ఇప్పటి వరకు దాదాపు 400 షోలు ఇచ్చాను. ఎన్నో ఆల్బమ్‌లు తెచ్చాను. దుబాయ్‌లో సైతం కరౌకే మ్యూజిక్ ఇష్టపడే అభిమానులు పెరిగారు. అక్కడి నుంచి సీడీలు కావాలని మా అకాడమీకి ఫోన్లు వస్తుంటాయి. కరౌకేలో మీ ప్రత్యేకత ఏమిటి? ప్రతి ప్రోగ్రాంలో ఏదో ఒక ప్రయోగం చేస్తుంటాను. అంధబాలలు, మానసిక వికలాంగులతో సైతం కరౌకే ట్రాక్‌లతో పాటలు పాడిస్తున్నాను. హన్మకొండలోని ‘అతిథి’, ‘మల్లికాంబ’ మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులతో ఎక్కువగా పాడిస్తుంటాను. సాధారణంగా పిల్లలతో స్టేజి మీద పాటలు పాడించటమే కష్టం. అలాంటిది కరౌకే ట్రాక్‌లో పాడించాలంటే చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. రెండురోజుల్లో ఎవరికైనా సులభంగా పాడడం నేర్పిస్తాను. సామాజిక సేవలో మీ పాత్ర ? నా తల్లిదండ్రుల పేరిట ఏటా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. ‘వలీహైదర్ మెమోరియల్’ పేరిట పేద కళాకారులకు ఆర్థిక సాయం అందిస్తున్నాను. ఇప్పటివరకు రాష్టంలో వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది అంధులకు కరౌకేలో శిక్షణ ఇచ్చాను. హిందీ, తెలుగు భాషలలోని మంచి పాటలను నేను పాడి కరౌకే ట్రాక్‌లో సీడీలు చేశాను. వీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నా. ఇప్పటికీ 20 వేలకు పైబడి పంపిణీ చేశాను. హైదర్ సాధించిన అవార్డులు 2002లో మిలీనియం అవార్డు. 2003లో లతామంగేష్కర్ అవార్డు. 2004 జూన్‌లో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మిలీనియం అవార్డు. 2005లో హైదరాబాద్ సమాజ సేవ సొసైటీ అవార్డు. 2013లో మంత్రి పొన్నాల లక్ష్మయ్య చేతుల మీదుగా ఉత్తమ సమాజ సేవ అవార్డుతో పాటు మరెన్నో పురస్కారాలు. - కోన సుధాకర్ రెడ్డి