
బర్గర్ బకాసుర
తిక్క లెక్క
ఈ ఫొటోలోని జపానీస్ కుర్రాడు బక్కపల్చగా కనిపిస్తున్నాడు కదా అని తక్కువగా అంచనా వేయకండి. ఇతడి పేరు తకరు కొబాయాషి. టాలెంట్‌లో ఈ కుర్రాడు బకాసురుడికి బ్రదర్లాంటోడు. ఇటలీలోని ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో భోజన ప్రతాపాన్ని ప్రదర్శించాడు.
మూడు నిమిషాల్లోనే ఏకంగా పన్నెండు బర్గర్లను శుభ్రంగా స్వాహా చేసేసి ప్రేక్షకులను నోళ్లెళ్లబెట్టేలా చేశాడు. ఈ ఘనకార్యంతో ఇతగాడు తంతే గిన్నెస్‌బుక్‌లో పడ్డాడు.