సాలీడు ఆకారంలో రాకాసిపీత
సముద్రంలో కనిపించే ఎండ్రపీతల్లో ఇది చాలా అరుదైన పీత. సాలీడు ఆకారంలో ఉండే ఈ రాకాసిపీత పూర్తిగా ఎదిగాక మనిషికి రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. దీని కాళ్లు చాలా పొడవుగా ఉంటాయి. దీని శరీరం అడుగున్నర ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాళ్ల పంజా నుంచి పంజా వరకు పొడవు చూస్తే ఏకంగా పన్నెండు అడుగుల వరకు ఉంటుంది. దీని బరువు గరిష్ఠంగా ఇరవై కిలోల వరకు ఉంటుంది. అతిపెద్ద పీత జాతుల్లో ‘అమెరికన్ లోబ్‌స్టర్’ తర్వాతి స్థానంలో ఈ రాకాసిపీత ఉంటుంది.
ఇది ఎక్కువగా జపాన్ తీర పరిసరాల్లోని సముద్రంలో చాలా లోతు ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటుంది. అందుకే దీనికి ‘జపానీస్ స్పైడర్ క్రాబ్’ అనే పేరు వచ్చింది. సముద్రంలో ఈరకం పీతలు దాదాపు రెండువందల అడుగుల నుంచి రెండువేల అడుగుల లోతులో తిరుగుతుంటాయి. ఇవి వేటగాళ్ల వలలకు చిక్కడం చాలా అరుదు.
ఇవీ చదవండి: బ్యాక్ ప్యాక్ కూలర్ బ్యాగు
అరుదైన జబ్బుతో అర్జున్ కపూర్ : ఎమోషనల్ కామెంట్స్,అంత ప్రమాదకరమా?
Comments
Please login to add a commentAdd a comment