crab
-
20 కిలోల బరువు: దీని దుంపతెగ! మూములు పీత కాదిది, రాకాసి పీత!
సముద్రంలో కనిపించే ఎండ్రపీతల్లో ఇది చాలా అరుదైన పీత. సాలీడు ఆకారంలో ఉండే ఈ రాకాసిపీత పూర్తిగా ఎదిగాక మనిషికి రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. దీని కాళ్లు చాలా పొడవుగా ఉంటాయి. దీని శరీరం అడుగున్నర ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాళ్ల పంజా నుంచి పంజా వరకు పొడవు చూస్తే ఏకంగా పన్నెండు అడుగుల వరకు ఉంటుంది. దీని బరువు గరిష్ఠంగా ఇరవై కిలోల వరకు ఉంటుంది. అతిపెద్ద పీత జాతుల్లో ‘అమెరికన్ లోబ్స్టర్’ తర్వాతి స్థానంలో ఈ రాకాసిపీత ఉంటుంది. ఇది ఎక్కువగా జపాన్ తీర పరిసరాల్లోని సముద్రంలో చాలా లోతు ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటుంది. అందుకే దీనికి ‘జపానీస్ స్పైడర్ క్రాబ్’ అనే పేరు వచ్చింది. సముద్రంలో ఈరకం పీతలు దాదాపు రెండువందల అడుగుల నుంచి రెండువేల అడుగుల లోతులో తిరుగుతుంటాయి. ఇవి వేటగాళ్ల వలలకు చిక్కడం చాలా అరుదు. ఇవీ చదవండి: బ్యాక్ ప్యాక్ కూలర్ బ్యాగుఅరుదైన జబ్బుతో అర్జున్ కపూర్ : ఎమోషనల్ కామెంట్స్,అంత ప్రమాదకరమా? -
ఈ పీతను కొనాలంటే ఆస్తులుకు ఆస్తులే అమ్ముకోవాలి..!
పులస చేపకే పుస్తెలమ్ముకోవాలనుకునే మన జనాలు ఈ పీత ధర వింటే ఏకంగా ఆస్తులకు ఆస్తులే అమ్మేసుకోవాలనుకుంటారు. జపాన్‌లో దొరికే ఈ అరుదైన పీత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పీత. సముద్రంలో మూడువందల మీటర్లకు పైగా లోతులో మాత్రమే ఇది దొరుకుతుంది. అంత లోతున వేటాడినా, అదృష్టం బాగున్న వేటగాళ్ల వలలకే ఇది చిక్కుతుంది. అందుకే దీనికి అంత ధర. దీనిని ‘మాత్సుబా క్రాబ్’ అని, ‘స్నో క్రాబ్’ అని అంటారు.ఈ పీత మాంసం చాలా రుచిగా ఉంటుందట! సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు ఈ పీతలు వలలో చిక్కినప్పుడు వాటిని వేలంలో అమ్ముతారు. గత ఏడాది నవంబర్‌లో ఒక మత్స్యకారుడి వలలో ఈ రకం పీత చిక్కింది. వేలంలో అమ్మితే, 1.2 కిలోల బరువు ఉన్న ఈ పీతకు ఏకంగా 10 మిలియన్ యెన్లు (రూ.58 లక్షలు) ధర పలికింది. జపాన్‌లోని రెస్టారెంట్లలో ఈ పీతలను సన్నగా తరిగి వేయించి ‘కనిసుకియాకి’, గంజిలో ఉడికించి ‘జోసుయి’, గ్రిల్డ్ క్రాబ్ వంటి వంటకాలను తయారు చేస్తారు. వీటిని ఆరగించేందుకు డబ్బున్న బడాబాబులు ఎగబడుతుంటారు. -
పీతను హింసించారు.. ఎమ్మెల్యేపై ‘పెటా’ ఫిర్యాదు
ముంబై, సాక్షి: ఇటీవల విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ పవార్ పీతను వేలాడదీయడంపై జంతు హక్కుల సంస్థ పెటా (PETA) ఎన్నికల అధికారులకు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరత్ పవార్) చీఫ్ శరద్ పవార్‌కు లేఖ రాసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, మహారాష్ట్ర మోడల్ ప్రవర్తనా నియమావళి, ఎన్నికల ప్రచారానికి, ఎన్నికలకు జంతువులను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ 2014 మార్చి 24న జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించారని పెటా పేర్కొంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఎమ్మెల్యే రోహిత్ పవార్ పీతను హింసించారని వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోందని, మీడియా స్టంట్ కోసం మూగ ప్రాణులకు నొప్పి, బాధ కలిగించారని శరత్ పవార్‌తోపాటు జిల్లా ఎన్నికల అధికారి మినల్ కలస్కర్‌కు రాసిన లేఖలో పెటా ఇండియా అడ్వకేసీ అసోసియేట్ శౌర్య అగర్వాల్ పేర్కొన్నారు. అలాగే వెటర్నరీ కేర్, పునరావాసం కోసం పీతను తిరిగి ప్రకృతిలోకి వదిలిపెట్టాలని కోరుతూ ఎమ్మెల్యే రోహిత్ పవార్‌కు కూడా పెటా ఇండియా లేఖ రాసింది. -
మండ పీతకు మంచి డిమాండ్.. 4 లక్షల ఆదాయం!
సాక్షి, అమలాపురం: ఆక్వాలో కీలకమైన చేపలు, వనామీ రొయ్యల పెంపకం సంక్షోభంలో కూరుకుపోతోంది. మరీ ముఖ్యంగా వనామీ సాగు రైతులకు నష్టదాయకంగా మారింది. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నా ఎగుమతిదారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులకు నష్టాలు తెచ్చిపెడుతోంది. దీంతో పలువురు ఆక్వా రైతులు ప్రత్యామ్నాయ సాగు వైపు దృష్టిసారించారు. ప్రస్తుతం వారు పీతల సాగుపై ఆసక్తి చూపుతుండగా.. అందుకు ప్రభుత్వం దన్నుగా నిలిచేందుకు సిద్ధమైంది. పీతల సాగుకు మద్దతుగా పలు చర్యలు తీసుకుంటోంది. కోనసీమలో ఒకటిన్నర దశాబ్దాలుగా తీర ప్రాంత మండలాల్లో పీతల సాగు చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా సాగు విస్తీర్ణం మాత్రం పెద్దగా పెరగలేదు. జిల్లాలో ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో కేవలం 200 ఎకరాల్లో సాగు జరుగుతోంది. దీనిని మరింత పెంచేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో మన దేశం నుంచి పీతల ఎగుమతి పెరుగుతోంది. సెల్లా సెరటా, స్కెల్లా ట్రాంక్బారికా (మండ పీత) రకాలకు మంచి డిమాండ్ ఉంది. ఇవి కిలో రూ.600 నుంచి రూ.వెయ్యి వరకూ ధర పలుకుతున్నాయి. ఈ రకం పీతల పెంపకం లాభదాయకంగా ఉంటుందని మత్స్యశాఖాధికారులు చెబుతున్నారు. ఎకరా సాగుకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ ఖర్చు కాగా, దిగుబడిని బట్టి ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఆదాయం వచ్చే అవకాశముంది. చిర్రయానాంలో హేచరీ పీతల సాగు ప్రోత్సాహంలో భాగంగా కాట్రేనికోన మండలం చిర్రయానాం వద్ద ప్రైవేట్ హేచరీ నిర్మాణానికి మత్స్యశాఖ ప్రోత్సాహం అందిస్తోంది. స్థానికంగా హేచరీ వస్తే పీతల సీడ్ తక్కువ ధరకు రావడంతో పాటు సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఆర్జీసీ విజయవాడ నుంచి, చెన్నై నుంచి తీసుకువస్తున్నారు. ఇది రైతులకు భారంగా మారింది. ఇదే సమయంలో సాగు ప్రోత్సాహంలో భాగంగా పెట్టుబడికి అవసరమైన రుణ పరిమితిని ఇటీవల డిస్ట్రిక్ట్ లెవిల్ టెక్నికల్ కమిటీ (డీఎల్టీసీ) పెంచిన విషయం తెలిసిందే. కమిటీ ఎకరాకు రూ.78 వేలుగా పేర్కొనగా, జిల్లా కలెక్టర్ శుక్లా దీనిని రూ.లక్షకు పెంచాలని సూచించారు. వనామీకి ప్రత్యామ్నాయంగా పీతల సాగు పెంచితే అటు వనామీకి కూడా మంచి డిమాండ్ వస్తోందని అంచనా. మూడు రకాలుగా.. పీతల సాగు మూడు రకాలుగా చేయవచ్చు. కానీ జిల్లా రైతులు కేవలం సంప్రదాయ పద్ధతిలో చెరువుల చుట్టూ వలలు వేసి పెంపకం చేపడుతున్నారు. సాధారణ ఆక్వా చెరువుల మాదిరిగానే ఇక్కడా చేస్తున్నారు. దీంతో పాటు బాక్సులలో పీతలను పెంచే అవకాశముంది. అభివృద్ధి చెందిన దేశాల్లో బాక్సులలో పీతలను పెంచుతున్నారు. మూడో రకం సాఫ్ట్ సెల్స్ ఎప్పటికప్పుడు సేకరించడం ద్వారా సాగు చేస్తారు. మన తీరం అనుకూలం జిల్లాలో ఇప్పుడు మూడు మండలాల్లో మాత్రమే చాలా తక్కువ మొత్తంలో పీతల సాగు జరుగుతోంది. పీతల సాగుకు తీర ప్రాంత మండలాలు అనుకూలం. ఇటు వరికి, అటు రొయ్యల సాగుకు పనికిరాని చౌడు నేలల్లో సైతం పండించవచ్చు. ఆక్వా రైతులు ముందుకు వస్తే ప్రభుత్వం సాగుకు సాంకేతిక సహకారం, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తుంది. –షేక్ లాల్ మహ్మద్, జిల్లా మత్స్యశాఖాధికారి -
భయానక వీడియో.. మహిళ చెవిలోకి దూరిన పీత.. ఎలా బయటకు తీశారంటే..
సాధారణంగా చెవిలో అప్పుడు చీమలు, చిన్న చిన్న పురుగులు వెళ్లడం గురించి వింటుంటాం.. చెవిలో నీళ్లు పోసి లేదా ఏదైనా వస్తువుతో వాటిని బయటకు తీస్తాం. కానీ తాజాగా ఓ మహిళ చెవిలో ఏకంగా పీత ఇరుక్కుపోయింది. అంతేగాక దాన్ని తీసేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. మహిళ చెవిలో పీత ఇరుక్కుపోయిన వీడియోను ఓ టిక్‌టాక్ యూజర్ షేర్ చేశారు. దీనిని బట్టి అట్లాంటిక్ తీరంలోని ప్యూయెర్టో రికోలో జరిగినట్టు తెలుస్తుంది. ఈ వీడియోలో మహిళ బీచ్‌లో ఉండగా ఆమె చెవిలోకి పీత వెళ్లిన్నట్లు గుర్తిస్తుంది. ఈ విషయాన్ని వెంటనే ఆమె పక్కన ఉన్న వ్యక్తి తెలియజేయగా.. అతను దానిని బయటకు తీయడానికి వ్యక్తి ఓ పరికరంతో ప్రయత్నిస్తుంటాడు. ఎంత ప్రయత్నించినా పీత బయటకు రాకపోగా మరింత లోపలికి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. చివరికి అలాగే ప్రయత్నించగా చాలాసేపటకి పీత బయటకు వస్తుంది. అయితే మహిళ చెవిలోకి పీత ఎలా వెళ్లిందో తెలియదు గానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. మహిళ పరిస్థితిని చూసి కాస్త భయందోళనకు గురయ్యారు. తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. Huh??? pic.twitter.com/YeiMgYe4Q4 — Lady Sesshōmaru (@JasmineSW3) March 28, 2022 https://t.co/33N24UTpfp pic.twitter.com/X4btHoqlrG — Name can't be blank (@brattypanda) March 28, 2022 -
ఏ వ్యాక్సిన్‌కైనా పీత రక్తమే దిక్కు.. లీటర్ రక్తం ధరెంతో తెలుసా?
Horseshoe Crab Blood: కరోనాకు వ్యాక్సిన్ వేసుకుంటున్నాం. రెండు డోసులు అయింది. బూస్టర్ డోసు వచ్చింది. తర్వాతా అవసరం పడొచ్చని అంటున్నారు. ఇంత అత్యవసరమైన వ్యాక్సిన్లు ఎంత భద్రమో తేల్చేది ఎవరో తెలుసా? ఎక్కడో సముద్రాల్లో బతికే ఓ చిన్నపాటి పీత. మనకు దాని రక్తం ధారపోసి బతుకునిస్తున్న ఈ పీతల వల్లే.. భారీస్థాయిలో కరోనా వ్యాక్సిన్లు త్వరగా అందుబాటులోకి వచ్చాయి. ఇదే కాదు.. ఏ వ్యాక్సిన్, ఔషధమైనా ప్రమాదకర బ్యాక్టీరియా లేదని తేల్చేందుకు వాటి రక్తమే దిక్కు. మరి ఆ పీతలేమిటి, మనకు జరుగుతున్న ప్రయోజనమేమిటో తెలుసుకుందామా.. తాబేలుకు ఉన్నట్టుగా డొప్పలాంటి తల భాగం.. దానిపై పది కళ్లు.. డొప్ప మధ్యలో వేలాడుతున్నట్టుగా శరీరం.. పదునుగా ఉండే ముళ్లు.. మధ్య నుంచి పొడవాటి తోక.. చిత్రమైన శరీరమున్న జీవి ‘హార్స్‌షూ క్రాబ్’. కోట్ల ఏళ్లుగా పరిణామం చెందకుండా ఉండిపోయిన ‘హార్స్‌షూ’ పీతలు.. ఒక్క విషయం మాత్రం అత్యంత అద్భుతమైన సామర్థ్యాన్ని సంతరించుకున్నాయి. అదే వాటి రోగ నిరోధక శక్తి. అత్యంత సూక్ష్మస్థాయిలో (వెయ్యి కోట్లలో ఒక వంతు) కూడా బ్యాక్టీరియా వంటి ప్రమాదకర సూక్ష్మజీవులు ఉన్నా గుర్తించగల సామర్థ్యం వాటి సొంతం. 1960వ దశకంలో శాస్త్రవేత్తలు దీని ప్రత్యేకతను గుర్తించారు. అప్పటి నుంచీ వ్యాక్సిన్లు, ఇతర ఇంజెక్షన్లు, సర్జికల్ ఇంప్లాంట్లు వంటివి ప్రమాదకర సూక్ష్మజీవులతో కలుషితం కాలేదని తేల్చుకునేందుకు ఈ పీతల రక్తాన్ని వినియోగించడం మొదలుపెట్టారు. చదవండి: బుసలు కొడుతూ పైకి లేచిన 14 అడుగుల కింగ్ కోబ్రా.. ►ఈ పీత రక్తకణాలను వేరుచేసి ‘ఎల్ఏఎల్ (లిమ్యులస్ అమిబోసైట్ లైసేట్)’ను ఉత్పత్తి చేస్తారు. వ్యాక్సిన్లు, యాంటీ బయాటిక్స్, ఇతర ఇంజెక్షన్లు, ఔషధాలలో ప్రతి బ్యాచ్‌ను ఈ ఎల్ఏఎల్తో పరీక్షిస్తారు. సదరు వ్యాక్సిన్/ఇంజెక్షన్/ఔషధంలో ప్రమాదకర బ్యాక్టీరియా ఏమాత్రం ఉన్నా.. ఎల్ఏఎల్ గుర్తిస్తుంది. ► బ్యాక్టీరియా ఉన్నట్టు సదరు వ్యాక్సిన్/ఔషధాన్ని పడేస్తారు లేదా శుద్ధిచేసి మళ్లీ పరీక్షిస్తారు. ప్రమాదమేమీ లేదని తేలితే.. ప్యాకేజింగ్ చేసి, విక్రయానికి పంపుతారు. ►శరీరం లోపల అమర్చే స్టెంట్లు, పేస్మేకర్లు, ఇతర ఇంప్లాంట్లు, సర్జికల్ పరికరాలను కూడా ఎల్ఏఎల్తో పరీక్షిస్తారు. ► కోవిడ్ మహమ్మారి మొదలైన తర్వాత వందల కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నారు. వాటన్నింటినీ హార్స్‌షూ రక్తంతో పరీక్షించి, భద్రమని తేల్చాకే మార్కెట్లోకి వస్తున్నాయి. లీటర్ రక్తం రూ.12 లక్షలు! ‘హార్స్‌షూ’ పీతల రక్తానికి ప్రపంచవ్యాప్తంగా ఔషధ, వైద్యారోగ్య సంస్థల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేగాకుండా పీతల సేకరణ, రక్తం తీయడం వంటివన్నీ క్లిష్టమైన పనులే. దీనితో ఈ రక్తం ధర ఒక్క లీటర్‌కు రూ.12 లక్షలు (16 వేల డాలర్లు) పైనే ఉంటుంది. అందుకే నీలి బంగారం (బ్లూగోల్డ్) అని పిలుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలు ఏటా వందల కోట్ల రూపాయలను ఈ పీతల రక్తం (ఎల్ఏఎల్) కోసం వెచ్చిస్తుంటాయి. చదవండి: జస్ట్ మిస్.. లేదంటే తలకాయ్ నిమ్మకాయలా నలిగేది.. వీడియో వైరల్! గుండె నాళానికి సూది గుచ్చి.. సముద్రం, తీర ప్రాంతాల నుంచి హార్స్‌షూ పీతలను సేకరించి, ల్యాబ్‌కు తీసుకొస్తారు. అక్కడ వాటి బరువును తూచి, రక్తం సరిపడా ఉన్నవాటిని వేరుచేస్తారు. అనంతరం ఆ పీతలను శుభ్రం చేసి.. వాటి గుండెకు సమీపంలోని రక్తనాళానికి సూదులుగుచ్చి రక్తం సేకరిస్తారు. వాటి శరీరంలో ఉండే మొత్తం రక్తంలో నుంచి సగానికిపైగా లాగేశాక.. తీసుకెళ్లి తిరిగి సముద్రంలో వదిలేస్తారు. ఈ సేకరణ, తరలింపు, రక్తం తగ్గిపోవడం క్రమంలో దాదాపు మూడో వంతు పీతలు చనిపోతుంటాయి. సెప్సిస్‌ను గుర్తించేందుకు.. సాధారణంగా ఏదైనా దెబ్బతగలడం, వ్యాధి వల్ల, శస్త్రచికిత్స ద్వారా అయిన గాయాలు మానకుండా.. పుండ్లుగా మారి, చీముపట్టడాన్ని సెప్టిక్ అంటాం. సదరు గాయంలోని ఇన్ఫెక్షన్ రక్తంలోకి వ్యాపించి.. శరీర అవయవాలను దెబ్బతీసే స్థితిని ‘సెప్సిస్’గా చెప్తారు. మొదట్లోనే దీన్ని గుర్తించలేక.. ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోటి మంది చనిపోతున్నట్టు అంచనా. హార్స్‌షూ పీతల రక్తం నుంచి తీసే ‘ఎల్ఏఎల్’ ద్వారా ‘సెప్సిస్’ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ రకంగానూ హార్స్‌షూ పీతలు మానవాళికి మేలు చేస్తున్నాయి. లేత నీలి రంగులో.. మనుషుల రక్తంలోని హిమోగ్లోబిన్లో ఇనుము (ఐరన్) ఉండటం వల్ల ఎరుపు రంగులో ఉంటుంది. అదే ‘హార్స్‌షూ’ పీతల రక్తం లేత నీలి రంగులో ఉంటుంది. వాటి రక్త కణాల్లో ఉండే రాగి (కాపర్) అణువులే దీనికి కారణం. ఇది ఈ పీతల మరో ప్రత్యేకత. ప్రమాదం అంచుకు చేరడంతో.. గత 40 ఏళ్లలో ఈ పీతల సంతతి 80 శాతం మేర అంతరించి పోయిందని అంచనా. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్లతో వాటికి మరింత కష్టమొచ్చి పడింది. ప్రపంచ వ్యాప్తంగా భారీగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తుండటంతో.. వాటి టెస్టింగ్ కోసం భారీగా పీతలను పడుతూ, రక్తాన్ని సేకరిస్తున్నారు. సాధారణంగా ఏటా ఒక్క అమెరికా తూర్పు తీరప్రాంతంలోనే 5 లక్షలకుపైగా ‘హార్స్‌షూ’ పీతలను సేకరిస్తారని అంచనా. అంతేకాదు మెక్సికో, చైనా, మరికొన్ని దేశాల్లోనూ భారీ ఎత్తున హార్స్‌షూ పీతలను సేకరిస్తుంటారు. మనుషులు రక్త పిశాచాల్లా ఏటా లక్షలాది ‘హార్స్‌షూ’ పీతల నుంచి రక్తాన్ని పిండేస్తున్నారని.. ఇది జీవహింస అని కారుణ్యవాదులు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. కోట్ల ఏళ్లుగా మారకుండా.. ఒకప్పటి గొరిల్లా/చింపాంజీల నుంచి మనుషులు అభివృద్ధి చెందినట్టుగా.. కాలం గడిచినకొద్దీ ప్రతి జీవి పరిణామం చెందుతుంది. కానీ ‘హార్స్‌షూ’ పీతలు పెద్దగా పరిణామం చెందకుండా.. సుమారు 45 కోట్ల ఏళ్ల కిందట (డైనోసార్ల కంటే ముందటి కాలం నుంచి) ఎలా ఉన్నాయో, ఇప్పటికీ అలాగే ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే వీటిని బతికున్న శిలాజాలుగా పిలుస్తున్నారు. -
ఒక ఎండ్రికాయ.. ఐదు సింహాలు రౌండప్.. ఆ తర్వాత
ఒక్క సింహం ఎదురుపడితేనే మనం గజగజ వణికిపోతుంటాం. అలాంటిది ఐదు సింహాలు ఒకేసారి దాడిచేస్తే.. అది ఊహించుకోవడానికి కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఎండ్రికాయ మాత్రం తనను ఐదు సింహాలు చుట్టుముట్టినా అది ఇంచు కూడా భయపడలేదు. అసలు ఆ సింహాలు దానిని ఏం చేద్దామనుకున్నాయో అర్థం చేసుకునేలోపే వీడియో పూర్తవుతుంది. ఈ అద్బుత దృశ్యాన్ని మాలా ప్రైవేట్గేమ్ రిజర్వ్‌కు చెందిన రేంజర్స్ రగ్గిరో బారెటో, రాబిన్ సెవెల్ తమ కెమెరాలో బంధించారు. 2.36 నిమిషాల నడివి గల వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. వీడియో ప్రారంభంలో ఒక ఎండ్రికాయ ఇసుకలో నుంచి పైకి లేవగానే అక్కడే ఉన్న సింహం దానిని పరిశీలిస్తూ ఫాలో అవుతుంది. కొద్దిసేపటికి మరో నాలుగు సింహాలు వచ్చి దానిని వెంబడిస్తుంటాయి. కానీ ఆ ఎండ్రికాయ మాత్రం తనకేం పట్టనట్టుగా వ్యవహరిస్తూ తన దారిన తాను పోతునే ఉంది. చివరగా ఐదు సింహాలు దానిని చుట్టుముట్టడంతో వీడియో ముగుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటివరకు 84, 136 మంది ఈ వీడియోను వీక్షించారు. వీలైతే మీరు ఒక లుక్కేయండి. చదవండి: వధువును భుజాలపై ఎత్తుకొని నదిని దాటిన వరుడు; వీడియో -
వీరింతే.... మారని అధికారులు
సాక్షి, తుని: ప్రభుత్వం మారినా అధికారుల్లో ఉదాసీనత కొనసాగుతోంది. ప్రజలకు మంచి పాలన అందించాలని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలను పరిగెత్తుస్తున్నారు. ఇందులో భాగంగానే 10 రోజల క్రితం తుని శాసనసభ్యుడు, విప్ దాడిశెట్టి రాజా మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో పారిశుద్ధ్యం బాగుండాలని, పందులు కనిపించకూడదని అధికారులకు సూచనలు చేశారు. రెండు రోజల పాటు అధికారులు హడావుడి చేశారు. పందులను పట్టి తరలించారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు షరా మామూలే. పట్టణంలో ఎక్కడ చూసినా పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో వ్యర్థాలు గుట్టలుగా ఉన్నాయి. మార్కండ్రాజుపేటలో ఇళ్ల మధ్యలో చెత్త పేరుకుపోయి దుర్వాసన రావడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వ్యర్థాలు ఉండడంతో పందులు వాటిలో సంచరిస్తున్నాయి. సొంత ఇల్లు ఉన్నా వాసన భరించలేక పోతున్నామని పలువురు ‘సాక్షి’ దృష్టికి తీసుకు వచ్చారు. అధికారుల దృష్టికి తీసుకు వెళ్లగా పారిశుద్ధ్యం నిర్వహణ బాగానే ఉందని, పరిశీలించి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ప్రజలకు పరిశుభ్రమైన పాలన అందించాలన్న లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం వలన నెరవేరడం లేదు. -
పీతల సాగుతో అధిక లాభాలు
నరసాపురం రూరల్: పీతలు, పండుగప్ప సాగులో ఆధునిక పద్ధతులు అవలబించడం ద్వారా అధిగ దిగుబడి సాధించి లాభాలు పొందవచ్చని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ అంజలి అన్నారు. మండలంలోని తూర్పుతాళ్లు చామకూరిపాలెం ప్రాథమిక పాఠశాల వద్ద సోమవారం జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ సహకారంతో ఏర్పాటుచేసిన మూడు రోజుల సదస్సును ఆమె ప్రారంభించారు. తీరప్రాంత గ్రామాల్లో వా తావరణం పీతలు, పండుగప్పల సాగుకు అనుకూలమన్నారు. ఇప్పటి వరకూ రైతులు చేప, వనామీ, టైగర్, రొయ్యల సాగుపైనే ఎక్కువగా దృష్టి సారించారని, పీతలను బాక్సుల్లో ఉంచి సాగుచేయడం ద్వారా తక్కువ ఖర్చుతో పాటు అధిక లాభాలను ఆర్జించవచ్చని వివరించారు. మూస పద్ధతిలో కాకుండా మత్స్యశాఖ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు సాగు చేయాలన్నారు. నరసాపురం మండలంలో ఇప్పటికే చంద్రన్న రైతు క్షేత్రంలో భాగంగా పండుగొప్ప, పీతల రైతు ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సర్పంచ్ చామకూరి సుబ్బలక్ష్మీరామ్మొహనరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీటీసీ పుచ్చకాయల తిరుపతమ్మ, మత్సశాఖ ఉపసంచాలకులు డాక్టర్ ఫణి ప్రకాష్, మత్సశాఖ సహాయ సంచాలకులు ఎ.అప్పలరాజు, రమణకుమార్, అభివృద్ధి అధికారులు ఎల్ఎన్ఎన్ రాజు, వి.సత్యనారాయణ, ఏడీ ఏడుకొండలు, ప్రతిభ, ఎంపీఈఏలు, రైతులు పాల్గొన్నారు. -
దీని రుచి చూడాల్సిందే..
శివాజీనగర: మీకు పీతల వంటకాలు అంటే మహా ఇష్టమా. అయితే మూడురోజులు ఆగండి. క్షత్రియ ఆహార మేళాను నిర్వహించటం ద్వారా రాష్ట్రంలో పీతల సరఫరా, విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు విశ్వ క్షత్రియ మహా సంస్థాన అధ్యక్షుడు ఎం.డీ.ప్రకాశ్ తెలిపారు. ఈ నెల 16న నగరంలోని తుమకూరు రోడ్డు, మాదావర నీలకంఠ కన్వెన్షన్ సెంటర్లో తిగళ క్షత్రియుల ఆహార మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ప్రెస్‌క్లబ్ వద్ద భారీ పీతలతో మీడియా ముందుకొచ్చారు. తిగళ క్షత్రియులు రాజ్యపాలన, సంరక్షణలో ఉండేవారని ఎం.డీ.ప్రకాశ్ తెలిపారు. కాలక్రమేణా వ్యవసాయంలోకి వచ్చారన్నారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో పీతల పెంపకం అధికమైందని, దానిని రాష్ట్రంలోనూ పరిచయం చేయాలనేది తమ సంస్థ లక్ష్యమన్నారు. స్టార్ హోటల్లో మాత్రమే లభించే పోషకాహార, రుచికరమైన పీత తిగళ క్షత్రియ సామాజిక వర్గపు సంప్రదాయ ఆహారమని ఆయన తెలిపారు. అందుకే ప్రీతికరమైన పీతల వంటకాలతో మేళా జరుపుతామన్నారు. ఈ సందర్భంగా వారు పీతల వేపుడు, కూర, పచ్చడి తదితరాలను ప్రదర్శించారు. మహా సంస్థాన నాయకులు ఎం.బీ.కృష్ణయ్య, ఎల్.సురేశ్, ఆర్.వాసు తదితరులు పాల్గొన్నారు. -
‘పీతా’మహ..
బ్రిటన్: పీత మహా అయితే ఎంతుంటుంది? ఇంతైతే ఉండదు కదా.. అందుకే ఇది పీతలకే పితామహుడి టైపన్నమాట. బ్రిటన్‌లోని పోర్ట్స్మౌత్ తీరంలో దొరికిన ఈ భారీ పీత బరువు 4 కిలోలకుపైనే. దీనికెంత బలముందుంటే.. మన చేతిని అలవోకగా పచ్చడిపచ్చడి చేయగలదట. బ్రిటన్ సముద్ర జలాల్లో కనిపించే పీతలు మహా అయితే 3 కిలోల బరువుంటాయట. ఇది వాటన్నిటినీ మించి ఉండటంతో దీన్ని స్థానిక అక్వేరియంలో ప్రదర్శనకు పెట్టారు.