దీని రుచి చూడాల్సిందే.. | Crab curry to must taste | Sakshi
Sakshi News home page

దీని రుచి చూడాల్సిందే..

Published Thu, Jul 13 2017 9:24 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

దీని రుచి చూడాల్సిందే..

దీని రుచి చూడాల్సిందే..

శివాజీనగర: మీకు పీతల వంటకాలు అంటే మహా ఇష్టమా. అయితే మూడురోజులు ఆగండి. క్షత్రియ ఆహార మేళాను నిర్వహించటం ద్వారా రాష్ట్రంలో పీతల సరఫరా, విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు విశ్వ క్షత్రియ మహా సంస్థాన అధ్యక్షుడు ఎం.డీ.ప్రకాశ్‌ తెలిపారు. ఈ నెల 16న నగరంలోని తుమకూరు రోడ్డు, మాదావర నీలకంఠ కన్వెన్షన్‌ సెంటర్‌లో తిగళ క్షత్రియుల ఆహార మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బుధవారం ప్రెస్‌క్లబ్‌ వద్ద భారీ పీతలతో మీడియా ముందుకొచ్చారు. తిగళ క్షత్రియులు రాజ్యపాలన, సంరక్షణలో ఉండేవారని ఎం.డీ.ప్రకాశ్‌ తెలిపారు. కాలక్రమేణా వ్యవసాయంలోకి వచ్చారన్నారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో పీతల పెంపకం అధికమైందని, దానిని రాష్ట్రంలోనూ పరిచయం చేయాలనేది తమ సంస్థ లక్ష్యమన్నారు.

స్టార్‌ హోటల్‌లో మాత్రమే లభించే పోషకాహార, రుచికరమైన పీత తిగళ క్షత్రియ సామాజిక వర్గపు సంప్రదాయ ఆహారమని ఆయన తెలిపారు. అందుకే ప్రీతికరమైన పీతల వంటకాలతో మేళా జరుపుతామన్నారు. ఈ సందర్భంగా వారు పీతల వేపుడు, కూర,  పచ్చడి తదితరాలను ప్రదర్శించారు. మహా సంస్థాన నాయకులు ఎం.బీ.కృష్ణయ్య, ఎల్‌.సురేశ్, ఆర్‌.వాసు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement