ముంబై, సాక్షి: ఇటీవల విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ పవార్ పీతను వేలాడదీయడంపై జంతు హక్కుల సంస్థ పెటా (PETA) ఎన్నికల అధికారులకు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరత్ పవార్) చీఫ్ శరద్ పవార్‌కు లేఖ రాసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది.
జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, మహారాష్ట్ర మోడల్ ప్రవర్తనా నియమావళి, ఎన్నికల ప్రచారానికి, ఎన్నికలకు జంతువులను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ 2014 మార్చి 24న జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించారని పెటా పేర్కొంది.
ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఎమ్మెల్యే రోహిత్ పవార్ పీతను హింసించారని వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోందని, మీడియా స్టంట్ కోసం మూగ ప్రాణులకు నొప్పి, బాధ కలిగించారని శరత్ పవార్‌తోపాటు జిల్లా ఎన్నికల అధికారి మినల్ కలస్కర్‌కు రాసిన లేఖలో పెటా ఇండియా అడ్వకేసీ అసోసియేట్ శౌర్య అగర్వాల్ పేర్కొన్నారు. అలాగే వెటర్నరీ కేర్, పునరావాసం కోసం పీతను తిరిగి ప్రకృతిలోకి వదిలిపెట్టాలని కోరుతూ ఎమ్మెల్యే రోహిత్ పవార్‌కు కూడా పెటా ఇండియా లేఖ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment