
ఒక్క సింహం ఎదురుపడితేనే మనం గజగజ వణికిపోతుంటాం. అలాంటిది ఐదు సింహాలు ఒకేసారి దాడిచేస్తే.. అది ఊహించుకోవడానికి కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఎండ్రికాయ మాత్రం తనను ఐదు సింహాలు చుట్టుముట్టినా అది ఇంచు కూడా భయపడలేదు. అసలు ఆ సింహాలు దానిని ఏం చేద్దామనుకున్నాయో అర్థం చేసుకునేలోపే వీడియో పూర్తవుతుంది. ఈ అద్బుత దృశ్యాన్ని మాలా ప్రైవేట్‌గేమ్ రిజర్వ్‌కు చెందిన రేంజర్స్ రగ్గిరో బారెటో, రాబిన్ సెవెల్ తమ కెమెరాలో బంధించారు. 2.36 నిమిషాల నడివి గల వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది.
వీడియో ప్రారంభంలో ఒక ఎండ్రికాయ ఇసుకలో నుంచి పైకి లేవగానే అక్కడే ఉన్న సింహం దానిని పరిశీలిస్తూ ఫాలో అవుతుంది. కొద్దిసేపటికి మరో నాలుగు సింహాలు వచ్చి దానిని వెంబడిస్తుంటాయి. కానీ ఆ ఎండ్రికాయ మాత్రం తనకేం పట్టనట్టుగా వ్యవహరిస్తూ తన దారిన తాను పోతునే ఉంది. చివరగా ఐదు సింహాలు దానిని చుట్టుముట్టడంతో వీడియో ముగుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటివరకు 84, 136 మంది ఈ వీడియోను వీక్షించారు. వీలైతే మీరు ఒక లుక్కేయండి.
Comments
Please login to add a commentAdd a comment