సాధారణంగా సింహం అడవికి రాజు. దాన్ని చూసిన ఏ జంతువైనా సరే భయంతో వణికి పోవాల్సిందే. దాని కంట్లో పడితే ఎక్కడ బలైపోతామోనని జంతువులు దాని దరిదాపుల్లోకి వెళ్లటానికి కూడా సాహసించవు. అయితే.. ఇక్కడ ఆపదలో ఉన్న దున్నపోతుని కాపాడటానికి, మరో దున్నపోతు సింహంపైనే దాడికి తెగపడింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ సింహనికి చాలా ఆకలివేసినట్టుంది. దాని ఒక దున్నపోతు కనిపించటంతో వేటాడి కిందపడేసింది. దాన్ని ఎటు కదలకుండా పదునైన దాని పళ్లతో గట్టిగా అదిమి పట్టుకుంది. దీంతో పాపం.. ఆ దున్నపోతు ఎటు కదల్లేక దీనంగా అరుస్తొంది.
అయితే.. ఈ అరుపులు దూరంగా ఉన్న వేరే దున్నపోతుల చెవినపడ్డాయి. తన మిత్రుడు ఆపదలో ఉన్నాయనుకున్నాయో ఏమో గానీ.. వెంటనే అక్కడికి చేరుకున్నాయి. అవి రెండు కూడా కోపంతో ఆ సింహం పైకి ఒక్కసారిగా దాడిచేశాయి. అందులో ఒక దున్నపోతు తన పదునైన కొమ్ములతో సింహన్ని పొడిచి గాల్లో బంతిలాగా ఎగిరేసింది. అంతటితో దాని కోపం తీరలేదేమో మరోసారి దాన్ని పొడిచి గాల్లో ఇలా ఎగిరేసి.. అలాపడేసింది. ఈ అనుకోని దాడితో సింహనికి పాపం ఏం జరుగుతోందో అర్థంకానట్టుంది. వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. అయితే, సింహం బారినపడి నాపని ఇక అయిపోయిందనుకున్న దున్నపోతు ప్రాణాలతో బయటపడింది... ఈరోజు కడుపునిండా మాంసం తిందామనుకున్న ఆ సింహం బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి జారుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు వీటి ఐక్యమత్యానికి తెగ సంబర పడిపోతున్నారు. మనుషుల కన్నా నోరులేని జీవాలే నయం అని కామెంట్‌లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment