unity
-
గిరిజనుల ఐక్యతకు భారతీయ హార్న్‌బిల్
భారతదేశంలోని ఈశాన్యప్రాంతంలో ప్రతి డిసెంబర్లో నాగాలాండ్‌లోని రోలింగ్ కొండల మధ్య సుందరమైన కోహిమా ప్రాంతం నాగా తెగల సాంస్కృతిక వేడుకలకు కేంద్ర బిందువు అవుతుంది. అక్కడి గిరిజనులు తమ అరుదైన సంస్కృతిని ప్రదర్శించడానికి హార్న్‌బిల్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వివిధ తెగల మధ్య ఐక్యతకు, శాంతికి, సంస్కృతికి ప్రతీకగా పాతికేళ్లుగా ప్రతియేటా జరిగే ఈ వేడుకలో లక్షన్నరకు పైగా సందర్శకులు పాల్గొన్నారు. దీంతో ఈ వేడుక ప్రపంచమంతటినీ ఆకర్షించింది. పర్యాటకాన్ని ప్రోత్సహించడం, నాగా తెగల శక్తివంతమైన గుర్తింపును వెలుగులోకి తీసుకురావం ఈ వేడుక ముఖ్య ఉద్దేశ్యం. పండుగ సందర్భంగా ఇక్కడ ప్రతి తెగ దాని స్వంత సజీవ నృత్యాలు, పాటలు, ఆచారాలను ప్రదర్శించడమే కాదు నాగా వంటకాలు విభిన్న రుచులను అందిస్తాయి. స్థానిక కళాకారులు, హస్తకళాకారులు ప్రదర్శనలో భాగం అవుతారు. తద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తుంది. చేతితో నేసిన వస్త్రాలు, సాంప్రదాయ ఆభరణాలు, వివిధ హస్తకళలతో నిండిన స్టాల్స్ పండుగకు వెళ్లేవారికి సాంస్కృతిక ్ర΄ాముఖ్యతతో కూడిన సావనీర్లను ఇంటికి తీసుకెళ్లడానికి సరైన అవకాశాన్ని అందిస్తాయి. నిర్దిష్ట తెగలు, వారి విలక్షణమైన సంప్రదాయాలకు నివాళులు అర్పిస్తూ ప్రత్యేక నేపథ్య సాయంత్రాలను ప్లాన్ చేయవచ్చు. ఉదాహరణకు కొన్యాక్ తెగ వారు వారి సంప్రదాయ పచ్చబొట్లు, పాటలు, కథలు వారి జీవన విధానంపై అవగాహన కలిగిస్తాయి. మరొక తెగ వారి ప్రాచీన నృత్యాల ద్వారా చారిత్రక కథలను వివరిస్తాయి.ఇదీ చదవండి: టీ లవర్స్ : టీ మంచిదా? కాదా? ఈ వార్త మీకోసమే!వివిధ తెగల మధ్య శాంతిఈ ఫెస్టివల్ తెగల మధ్య ఐక్యతను పెం΄÷ందిస్తుంది. గిరిజన సంఘర్షణల చుట్టూ తరచుగా గందరగోళ చరిత్ర ఉన్నందున, ఈ పండుగ వివిధ వర్గాల మధ్య అంతరాలను తగ్గిస్తుంది. భవిష్యత్ తరాలకు దేశీయ సంస్కృతుల పరిరక్షణకు భరోసానిస్తూ, నాగా యువకులు తమ మూలాలతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక వేదికగా మారుతుంది. వివిధ ΄ోటీలను నిర్వహించి గిరిజన యువతలో గర్వం, ప్రేరణను సృష్టిస్తుంది. రాత్రి సమయాల్లో జరిగే కచేరీలకు వివిధ ప్రాంతాల నుండి బ్యాండ్ లను ప్రదర్శిస్తారు. ప్రతి రోజు ఉత్సాహభరితమైన శ్రావ్యమైన పాటలతో ముగుస్తుంది. స్థానికులు, పర్యాటకులు, ప్రదర్శకులు కలిసి ఆనందాన్ని పొందడానికి వీలు కల్పిస్తుంది. పాతికేళ్లుగా హార్న్‌బిల్ ఫెస్టివల్ నాగా సంస్కృతిని పరిరక్షించడమే కాకుండా దాని అభివృద్ధిని కూడా వాగ్దానం చేస్తుంది. భవిష్యత్ తరాలకు ఈ విలువైన సంప్రదాయాలను వారసత్వంగా, భాగస్వామ్యం చేయడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇలాంటి సంప్రదాయ వేడుకలు మన భారతీయ సంస్కృతిని ఇంకా సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి అనడానికి హార్నబిల్ ఓ ఉదాహరణగా నిలుస్తుంది. View this post on Instagram A post shared by Hornbill Festival Nagaland (@hornbillfestivalofficial) -
కలసి ఉంటేనే కలదు విజయం
ఈ భూమి మీద విజయం సాధించిన వారంతా కేవలం తామొక్కరుగానే ఆ విజయాన్ని సాధించలేదు. వారందరికీ ఏదో సమయంలో అనేక మంది సహకరించడం వల్లనే ఆ విజయం సం్రపాప్తించిందన్నది జగమెరిగిన సత్యం. ఏ మనిషైనా ఎన్ని ప్రతిభా సామర్ధ్యాలున్నప్పటికీ, ఎంతటి పండితులైనప్పటికీ, అపారమైన మేధో సంపత్తి ఉన్నప్పటికీ, ఆయా సామర్థ్యాలను సాధించడానికి వారు చేసిన కృషి ఒక ఎత్తయితే, ఆ కృషి చేయడానికి సహకరించిన చేతులు అనేకం అని చెప్పక తప్పదు.ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి గురించి మాట్లాడినపుడు వారు పడిన శ్రమను, కష్టం గురించి మాట్లాడడం జరుగుతుంది తప్ప, వారికి అంతర్లీనంగా సహకరించిన పెద్దలను, మహనీయులను, గురువులను, స్నేహితులను, మిత్రులను గాలికి వదిలేస్తాం. నిజానికి వారందరి సహకారం లేనిదే ఆ వ్యక్తి అంతటి ఉన్నత శిఖరాలకు చేరుకుని ఉండేవారు కాదన్నది వాస్తవం. ఒకవేళ ఆ వ్యక్తి తనకు తానుగా గొప్పవాడిగా భావించుకుని అందరినీ దూరంగా జరిపితే ఆయా విజయాల దరిదాపుల్లోకి వెళ్ళేవాడు కాదన్నది అక్షరాల నిజం. అందుకే కలిసుంటే కలదు సుఖమే కాదు... అది జీవిత సత్యంగా కూడా ఆకళింపు చేసుకోవాలి. మన పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ ఏ ఒక్క యుగ పురుషుడు కూడా ఐకమత్యం సాధించకుండా విజయ బావుటా ఎగురవేయలేదన్న విషయంలో ఎంత వాస్తవం ఉందో, ఐకమత్యం లేకపోతే ఆ విజయాలు సాధ్యం కావన్న విషయంలోనూ అంతే నిజం ఉంది.అందువల్ల ఏదైనా ముఖ్యమైన విజయాన్ని సాధించడానికి, అత్యంత అవసరమైన అంశం ఐకమత్యం. మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఐకమత్యం అండగా నిలుస్తుంది. కనుక మన భవిష్యత్ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి అన్ని శక్తులు, సామర్థ్యాలు, వనరులు వాడుకోవాలి. ఇవన్నీ ఏ ఒక్కరిలోనో ఉండవు. సహాయం, సహకారం అవసరమున్నప్పుడు అర్ధించడం బలహీనతకు సూచన కాదు. అది వివేకవంతుల లక్షణం కూడా.దుష్టశిక్షణ శిష్ట రక్షణ చేయడానికి సాక్షాత్తు ఆ జగన్మాతే ఐకమత్యంతో అసురులపై విజయం సాధించింది. చండ, ముండాసురులను, మహిషాసురుని సంహరించి జగజ్జేతగా నిలిచింది. ఆ జగన్మాతకు విజయం దక్కడానికి ముక్కోటి దేవతలు ఒక్కటయ్యారు. తమకు కంటకంగా మారిన అసురులను సంహరించడానికి ఆ తల్లికి సహకరించారు. సృష్టి స్థితి, లయాలకు కారకులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులతో పాటు, ముక్కోటి దేవతలు ఆ తల్లికి తమకున్న శక్తులన్నింటినీ ధారపోశారు. తమకున్న అపార యంత్ర, తంత్ర, అద్వితీయ శక్తులను జగన్మాతకు ఇచ్చి, ఆ తల్లిని శక్తి స్వరూపిణిగా నిలబెట్టారు. చివరకు అసుర సంహారం చేశారు. అందువల్ల మన నిజమైన సామర్థ్యాలు మన ఒక్కరిలో ఉన్నవే కాదు. మన తోటి వాళ్ళందరితో కలిసి ఉంటేనే అవి సర్వశక్తిమంతులుగా మార్చుతాయి. ఇది ఐకమత్యంతోనే సాధ్యమవుతుందన్న వాస్తవాన్ని గుర్తెరిగి మసలుకుని విజయులమవుదాం.ఐకమత్యమే మహాబలం, మహాభాగ్యం అన్నారు పెద్దలు. అవును నిజమే.. మన పెద్దలు చెప్పినట్టు ఐకమత్యంగా ఉంటే ఎన్నో పనులు చెయ్యచ్చు.. శత్రువులను సైతం తరిమి తరిమి కొట్టచ్చు. ఎలాంటి దుస్సాధ్యమైన పనైనా సునాయాసంగా చేయచ్చు. ఐకమత్యం బలాన్ని, ప్రేమను, అనురాగాలను పెంచుతుంది. ఇది నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. ఏకత్వాన్ని సూచిస్తుంది, ఆనందాన్నిస్తుంది. కష్టాలలో పాలు పంచుకునే అవకాశాన్నిస్తుంది. శక్తిని, విశ్వాసాన్ని పెంచుతుంది. ఏకత్వాన్ని కలిగిస్తుంది. వ్యక్తుల మధ్య అంతరాలను తగ్గిస్తుంది. జీవితంలోని సంతోషకరమైన క్షణాలను ఆస్వాదించడానికి ఇది మనకు ఎంతగానో దోహదం చేస్తుంది. – దాసరి దుర్గా ప్రసాద్ -
దేశ సమైక్యతకు చిహ్నం ఆ భాష! జాతీయ భాషగా నీరాజనాలు అందుకుంటోంది
భాషతో బంధంజాతి నిర్మాణంలో భాష పాత్ర చాలా గొప్పది. అనేక విషయాలను అధ్యయనం చేయడం, విజ్ఞాన సాంకేతిక తదితర ఉన్నత రంగాల్లో ప్రావీణ్యత పొందడం ఒక భాష ద్వారానే సాధ్యపడుతుంది. ఒక వ్యక్తి సమగ్ర వికాసానికి భాష ఆయువుపట్టు. అదే భాష దేశాన్ని ఒకే తాటిపై నిలబడేలా, జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించినప్పుడు ఆ భాష ‘జాతీయ భాష’గా నీరాజనాలు అందుకుంటుంది. ఆ పాత్రను అక్షరాలా ‘హిందీ’ భాష నిర్వర్తించింది, నిర్వర్తిస్తోంది కూడా. భారత స్వాతంత్య్ర సమరంలో ప్రజలను జాగృత పరచడంలో క్రియాశీల పాత్ర పోషించి, ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడే రెండవ భాషగా వికసించిన భాష హిందీని కొందరు ఇంకా పరాయి భాషగా భావించడం దురదృష్టకరం. హిందీ ఒక భాష మాత్రమే కాదు, మన దేశ సమైక్యతా చిహ్నం కూడా! దేశంలో హిందీ మాట్లాడేవారు, అర్థం చేసుకునే వారు అధికంగా ఉండడం చేత కేంద్ర ప్రభుత్వము హిందీని అధికార భాషగా ప్రకటించింది. ప్రస్తుతం పదికి పైగా రాష్ట్రాలలో ప్రథమ భాషగా, మిగతా రాష్ట్రాల్లో ద్వితీయ భాషగా హిందీ ప్రచలనములో ఉన్నప్పటికీ, ఆంగ్ల భాషపై మోజుతో హిందీని నిర్లక్ష్యం చేస్తున్నారు. గాంధీజీ స్వయంగా దక్షిణ భారతదేశంలో ఈ భాష ప్రచార కార్యక్రమా నికి ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ స్థాపనతో శ్రీకారం చుట్టారు. ఆ మహాత్ముని ఆశయాలను అనుసరిస్తున్న మనం ఆయన విస్తరింపచేసిన భాషను తగిన విధంగా ఆదరించలేక పోవడం విచారకరం. వివిధ దేశాల్లో ఎన్నో విశ్వవిద్యాలయాల్లో హిందీని పాఠ్యాంశంగా బోధించడం గమనార్హం. కానీ, మన దేశంలో మాత్రం అంతగా హిందీకి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. ‘త్రిభాషా సూత్రా’న్ని అనుసరించి మాతృ భాష ప్రథమ భాషగా ద్వితీయ భాషగా హిందీని, తృతీయ భాషగా ఆంగ్లం. పాఠశాల విద్యార్థులకు బోధించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు లాంటి దక్షిణాది రాష్ట్రాలు ఈ సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పరాయి భాషలు అవసరానికి ఎన్ని నేర్చుకున్నా, మన మాతృ భాష, అధికార భాషలను నిర్లక్ష్యం చేయరాదు. – భైతి దుర్గయ్య, హిందీ ఉపాధ్యాయుడు (చదవండి: మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..) -
'అక్కడ చూస్తే నవ్వొచ్చింది..' ప్రతిపక్ష కూటమిపై ప్రపుల్ పటేల్ సెటైర్..
ముంబయి: అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీలో చీలిక వచ్చిన తర్వాత శరద్ పవార్ ముఖ్య అనుచరుడు ప్రపుల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో జరిగిన ప్రతిపక్ష కూటమి అనే అంశం నవ్వు తెప్పించే విషయమని అన్నారు. శరద్ పవార్‌తో కలిసి తాను కూడా ఆ మీటింగ్‌కు హాజరయ్యానని చెప్పిన ప్రపుల్ పటేల్.. అక్కడి దృశ్యాలు గుర్తొస్తే నవ్వొస్తుందని చెప్పారు. 'అక్కడ 17 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. అందులో 7 పార్టీలకు ఒక్క ఎంపీ మాత్రమే ఉన్నారు. ఓ పార్టీకైతే ఒక్కరు కూడా లేరు. అలాంటివారందరూ కలిసి దేశంలో మార్పులు తెస్తామని అంటున్నారు' అని ప్రపుల్ పటేల్ ఎద్దేవా చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలో ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంతో చేతులు కలిపినట్లు ప్రపుల్ పటేల్ తెలిపారు. శివ సేన భావాజాలాన్ని అంగీకరించినప్పుడు బీజేపీతో కలిస్తే తప్పేంటి?. జమ్మూ కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లాలు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. అలాంటి వారందరూ ప్రతిపక్ష కూటమి అంటూ ఒకచోటుకు వస్తున్నారని ప్రపుల్ పటేల్ చెప్పారు. నేడు ఎన్సీపీలో ఇరువర్గాల మధ్య బల ప్రదర్శన జరిగింది. ఇందులో అజిత్ పవార్ 30 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకోగా.. శరద్ పవార్ వెనుక కేవలం 17 మంది మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి మొత్తం 53 ఎమ్మెల్యేల బలం ఉండగా.. తనకు 43 మంది శాసన సభ్యుల మద్దతు ఉందని అజిత్ పవార్ చెబుతున్నారు. ఇదీ చదవండి: ‘బీజేపీతో పొత్తు కోసం ఆయనే యత్నించారు.. రాజీనామా డ్రామాలు ఆడారు! -
బీజేపీ శవపేటికకు చివరి మేకు అదే..కేంద్రానికి స్టాలిన్ హెచ్చరికలు..
తమిళనాడు:ప్రతిపక్షాలతో బీజేపీ ఎన్నికల్లో పోరాడటంలేదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఎన్నికల్లో పోరాడి బీజేపీని ఓడిస్తామని హెచ్చరించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రం ప్రభుత్వంపై డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ నిరసన సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అసత్య ప్రచారాలతో బీజేపీ సృష్టించుకున్న ఇమేజ్ను దెబ్బతీస్తామని అన్నారు. 'బీజేపీకి ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలపై దురహంకార చర్యలకు పాల్పడుతోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వడమే బీజేపీ శవపేటికకు చివరి మేకు అవుతుంది' అని స్టాలిన్ అన్నారు. మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనలు తెలుపుతూ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ సమావేశం నిర్వహించింది. ఇదీ చదవండి:ముందస్తును కొట్టిపారేయలేం: నితీశ్ -
బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే.. శరద్ పవార్
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు సీనియర్ నేత శరద్ పవార్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఎదుర్కోవడానికి విపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. జూన్ 23న బీహార్‌లో జరగనున్న విపక్షాల సమావేశంలో కూడా తాను ఇదే విషయాన్ని ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవంలో ఆ పార్టీ అధ్యక్షులు శరద్ పవర్ మాట్లాడుతూ పార్టీ వర్గాలకు తమ భవిష్యత్తు కార్యాచరణ గురించి వివరించారు. కేంద్రంలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఐక్యతతో పోరాడాలని ఆకాంక్షించారు. బీజేపీ పార్టీని ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో బీజేపీని వద్దనుకుంటున్నారంటే రేపు కేంద్రంలో కూడా ఆ పార్టీని వద్దనుకునే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సమయంలోనే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి. కలిసికట్టుగా బీజేపీని సాగనంపే ప్రయత్నం చేయాలని అన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం కోసం కష్టసాధ్యమైన హామీలిచ్చి ప్రజలను మభ్య పెట్టింది. ప్రజలకు ఆ విషయం తేటతెల్లమైంది. ఇప్పుడు వారు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని బీజేపీయేతర పార్టీలు సమిష్టిగా పోరాడితే ఆ పార్టీని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన తీసుకుని రాగా ఆయన స్పందిస్తూ అన్ని పార్టీలకూ తమ విస్తృతిని ఏ రాష్ట్రంలోనైనా పెంచుకునే అవకాశముంది. కానీ నాకెందుకో అది బీజేపీకి చెందిన తోక పార్టీగా అనిపిస్తోందన్నారు. ఇది కూడా చదవండి: వారితో చేతులు కలపడం దండగ.. -
ఆ చట్టాన్ని కొనసాగించాల్సిందే..అదే ఐక్యతను కాపాడుతోంది!
రాజద్రోహం చట్టం గురించి లాకమిషన్ ఒక ఆసక్తికరమైన నివేదిక ఇచ్చింది. ఆ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని, దాన్ని మరింత కఠినతరం చేసేలా కొన్ని గైడ్‌లైన్స్ ఇస్తే సరిపోతుందని లా కమిషన్ నివేదికలో పేర్కొంది. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదికలో సూచనలిచ్చింది. ఆ చట్టమే భారతదేశాన్ని ఐక్యతగా ఉంచడంలో ఉపకరిస్తోంది, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి, తీవ్రవాదాన్ని ఎదుర్కొనడంలో సహాయపడుతుందని వెల్లడించింది. అంతేగాదు రాజద్రోహం కేసులో విధించే జైలు శిక్షను మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలని కమిషన్ నివేదికలో ప్రభుత్వాన్ని సూచించింది కూడా. రాజద్రోహం చట్టాన్ని సవాల్ చేస్తూ గతంలో దాఖలైన పిటిషన్లపై అభిప్రాయన్ని చెప్పాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు నేపథ్యంలో ఈ నివేదికి రావడం గమనార్హం. వలసవాద వారసత్వంగా ఉన్న రాజద్రోహం రద్దుకు సరైన కారణం లేదని జస్టిస్ రీతు రాజ్ అవస్తీ(రిటైర్డ్) నేతృత్వంలోని లా కమిషన్ పేర్కొంది. ఈ చట్టాన్ని తరుచు వలసవాద వారసత్వంగా చెబుతుంటారు. ప్రత్యేకించి భారతదేశ స్వాతంత్య్ర సమరయోధులకు వ్యతిరేకంగా ఉపయోగించిన నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుంటారు. వాస్తవానికి న్యాయవ్యవస్థ మొత్తం వలసవాద వారసత్వమే అని నివేదిక తేల్చి చెప్పింది. అలాగే సెక్షన్ 124ఏ దుర్వినియోగంపై అభిప్రాయాలను స్వీకరించామని, వాటిని అరికట్టేలా మోడల్ మార్గదర్శకాలను కేంద్రం జారీ చేయాలని సిఫార్సు చేస్తున్నామని నివేదికలో తెలిపింది. ఈ సందర్భంగా ఐపీసీ సెక్షన్ 124ఏకి కింద నేరానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు.. క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ 1973 సీర్పీసీ సెక్షన్ 196(3)కి సమానమైన సీర్పీసీ 154 సెక్షన్‌ని ఒక నిబంధనగా ప్రత్యామ్నాయంగా చేర్చవచ్చని సూచించింది. ఇది అవసరమైన విధానపరమైన భద్రతను అందిస్తుంది అని లా కమిషన్ చైర్మన్ అవస్తీ.. న్యాయమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్కు తన నివేదికలో తెలిపారు. చట్ట విరుద్ధ కార్యకలాపా చట్టం, జాతీయ భద్రతా చట్టం వంటి చట్టాలు ఐపీసీ సెక్షన్ 124ఏ కింద సూచించబడిన నేరాలకు సంబంధించిన అన్ని అంశాలను కవర్ చేయదని అందువల్ల రాజద్రోహం చట్టాన్ని కొనసాగించాలని లా కమిషన్ నొక్కి చెప్పింది. ఇదిలా ఉండగా దేశద్రోహ చట్టం హేతుబద్ధతను పునఃపరిశీలిస్తామని చెబుతూ కేంద్రం అఫడవిట్ దాఖలు చేయమడే గాక రాజ్యంగ చెల్లుబాటును నిర్ధారించే కసరత్తును వాయిదావేయాలని అభ్యర్థించింది. సుప్రీం కోర్టు వలస రాజ్యాల కాలం నాటి నిబంధననను గట్టిగా సమర్థించడం తోపాటు దానిని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఈ చట్టాన్ని పునఃపరిశీలించేందుకు అంగీకరించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక తాజా పిటిషన్ దాఖలు చేసింది. కాగా, గతేడాది దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అజాది కా అమృతోత్సవాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వలసరాజ్యల యుగం నాటి చట్టం గురించి ప్రస్తావించారు. ఆ చట్ట ప్రయోజనాన్ని మించి పోయి ఉందని వెంటనే దాన్ని రద్దు చేయాలనే అభిప్రాయన్ని వెలిబుచ్చారు. కాగా, బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ చట్టం చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ సహా మొత్తం 16 పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపాలని గతేడాది మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. (చదవండి: ఐక్య ప్రతిపక్షం ఒంటరిగా బీజేపీని మట్టికరిపిస్తుంది: రాహుల్ గాంధీ) -
వైవిధ్యమే భారత్ బలం: మోదీ
న్యూఢిల్లీ: భారతీయులను వైవిధ్యం పట్ల సహజంగా ఉండే ప్రేమే శతాబ్దాలుగా ఐకమత్యంగా ఉంచుతోందని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌కున్న ఈ విశిష్టతే ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షించిందని చెప్పారు. ‘భారతదేశం వివిధ వర్గాలు, మతాలు, భాషలు, సంప్రదాయాలకు నెలవు. ఎన్నో సంస్కృతులు, ఆచారాలు, జీవన విధానాలను ఆచరిస్తూనే ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఒకరి పండుగలను మరొకరు జరుపుకుంటూ సహజీవనం సాగిస్తున్నారు’అంటూ ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌కు చెందిన నజాకత్ చౌధరికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా చౌధరి ఇటీవల అస్సాంలో పర్యటించారు. ఈ పర్యటన తనలో స్ఫూర్తి నింపిందనీ, మరిచిపోని అనుభూతులను మిగిల్చిందంటూ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖకు ప్రధాని పైవిధంగా బదులిచ్చారు. నేడు 71 వేల మందికి నియామక పత్రాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన 71 వేల మందికి మోదీ మంగళవారం వర్చువల్ విధానంలో నియామక పత్రాలివ్వనున్నారు. రోజ్‌గార్ మేళాలో భాగంగా ఆయన ఇప్పటిదాకా 2.9 లక్షల మందికి నియామక పత్రాలిచ్చారని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళాలను ఏర్పాటు చేయనున్నారు. 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా గత ఏడాది అక్టోబర్‌లో రోజ్‌గార్ మేళాను ప్రధాని ప్రారంభించారు. -
ఉమ్మడి గళం వినిపిద్దాం
చెన్నై/న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు ఉమ్మడిగా పోరాడాల్సిందేనని డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుండబద్దలు కొట్టారు. విపక్ష పార్టీలు కూటమి కట్టకుండా విడిగా పోటీ చేస్తే ఎలాంటి లాభం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో మళ్లీ సామాజిక న్యాయం, సమైక్యత, సోదరభావం, సమానత్వం సాధించాలంటే విపక్ష పార్టీలన్నీ ఉమ్మడిగా పోరాడాలని పిలుపునిచ్చారు. డీఎంకే ఆధ్వర్యంలో ఆన్లైన్ వేదికగా హైబ్రిడ్మోడ్లో సోమవారం తొలి ‘సామాజిక న్యాయ సదస్సు’ జరిగింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ నేత డిరెక్ ఒబ్రియన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్, ఎన్సీపీ, ఐయూఎంఎల్, బీఆర్ఎస్, ఎండీఎంకే, ఆర్ఎస్పీ, ఎల్ఎస్పీ, వీసీకే తదితర పార్టీల నేతలు పాల్గొని ప్రసంగించారు. అన్ని పార్టీలను ఏకతాటి మీదకు తేవడం అత్యంత ప్రధానమైన విషయమని స్టాలిన్ అన్నారు. ‘‘ఇది కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాకూడదు. దేశవ్యాప్తంగా సాకారం కావాలి. అందరం కలసి పోరాడదాం’’ అని పిలుపునిచ్చారు. ‘‘కేంద్రం ఏ హేతుబద్ద ప్రమాణాల ఆధారంగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలుచేస్తోంది? ఇది సామాజిక న్యాయం అనిపించుకోదు’’ అన్నారు. దేశవ్యాప్త కులగణన: తేజస్వి వెనకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిందేనని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. ‘‘బిహార్‌లో మహాఘట్బంధన్ సర్కార్ ఈ దిశగా ఇప్పటికే అడుగేసింది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఓబీసీలకు అదనపు రిజర్వేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ గవర్నర్లు మోకాలడ్డుతున్నారు’ అని ఆరోపించారు. సామాజిక న్యాయ రాజకీయాలతో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొందామని అన్నారు. దేశవ్యాప్త కులగణన డిమాండ్‌కు విపక్ష నేతలంతా మద్దతు పలికారు. విడివిడిగా ఎలాంటి లాభం ఉండదు: డీఎంకే చీఫ్ స్టాలిన్ ‘సామాజిక న్యాయ’ తొలి సదస్సులో పాల్గొన్న విపక్ష నేతలు -
విపక్షాల భేటీలో ఊహించని పరిణామం
ఢిల్లీ: కేంద్రాన్ని తీరును ఎండగట్టేందుకు ఇవాళ విపక్షాలు ఏకమయ్యాయి. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని ఇవాళ జరిగిన భేటీకి హాజరై.. ఆపై నిరసనల్లో సంఘటితంగా మోదీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాయి. రాహుల్ గాంధీ అనర్హత వేటును వ్యతిరేకిస్తూ సాగిన నల్ల దుస్తుల నిరసనలో విపక్షాలు ఒక్కటిగా ముందుకు సాగడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఖర్గే నేతృత్వంలో విపక్షాల వ్యూహత్మాక సమావేశం జరిగింది. ఆయన కార్యాలయంలో జరిగిన భేటీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌యేతర ఫ్రంట్ కావాలని బలంగా కోరుకుంటున్న టీఎంసీ సైతం ఈ భేటీకి హాజరైంది. తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రసూన్ బెనర్జీ, జవహార్ సిర్కార్‌లు విపక్షాల వ్యూహత్మాక సమావేశానికి హాజరయ్యారు. రాహుల్ గాంధీ విషయంలో విపక్షాలన్నీ ఏకతాటిపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టమవుతున్నా.. టీఎంసీ తన మద్దతును ఈ అంశానికే పరిమితం చేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక.. కాంగ్రెస్ ఈ పరిణామాన్ని స్వాగతించింది. మొత్తం పదిహేడు పార్టీలు హాజరయ్యాయి ఈ భేటీకి. నల్ల దుస్తుల నిరసనలు కేసీఆర్ బీఆర్ఎస్ సైతం పాల్గొంది. దీనికి మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకే, నిన్న అందరికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను, ఈరోజు కూడా కృతజ్ఞతలు చెప్పాను. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు, ప్రజలను కాపాడేందుకు ఎవరైనా ముందుకు వచ్చినా స్వాగతిస్తున్నాం. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని ఖర్గే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఐక్యత పవర్ అంటే ఇది!..హర్ష గోయెంకా ట్వీట్
ఐక్యమత్యమే మహాబలం అని చిన్నప్పుడు కథలు కథలుగా చదువుకున్నాం. కానీ దానికి ఉన్న పవర్ ఏంటో ఈ ప్రకృతిలోని కొన్ని జీవాలు మనుషులకు చెప్పకనే చెబుతున్నాయి. అందుకు సంబంధించి ఒక వీడియోను పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా నెట్టింట పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో..గొంగళి పురుగులు గుంపులు గుంపులుగా స్పీడ్‌గా వెళ్లిపోతున్నట్లు కనిపిస్తుంది. సాధారణంగా గొంగళిపురుగులు చాలా నిదానంగా వెళ్తాయి. అవి విడిగా..ఒక్కొక్కటి అంత తొందరగా భూమ్మీద పాకవు. అలాంటిది అవి ఒక దానిపై ఒకటి గుంపుగా స్పీడ్‌గా పాకుతూ వెళ్తున్నాయి. ఐక్యతగా ఉంటే ఏ పనైనా సులభంగా చేయోచ్చు అని చెబుతుంది. ఐక్యతకు ఉన్న శక్తిని కూడా తెలియజేసింది. "ఆ గొంగళి పురుగులు విడిగా కంటే సముహంగా ఉంటే వేగంగ వెళ్లగలవు, ఇదే ఐక్యత బలం అంటూ ట్వీట్ చేశారు హర్ష గోయెంకా. దీనికి నెటిజన్లు ఎంతో మంచి విషయాన్ని గుర్తు \ చేశారంటూ ధన్యవాదాలు చెప్పారు. అంతేగాదు కలిసి ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలమని, టీమ్‌గా ఉంటే ఎన్నో అద్భుతాలు చేయగలం అంటూ మరికొందరూ నెటిజన్లు ట్వీట్ చేశారు. It’s a group of caterpillars, moving in a formation known as a rolling swarm. This rolling swarm of caterpillars moves faster than any single caterpillar. Power of unity…pic.twitter.com/TibW70GP9n — Harsh Goenka (@hvgoenka) February 24, 2023 (చదవండి: వెరైటీ వంట: ప్లాస్టిక్ కవర్లో చేపల పులుసు, ఈ బామ్మ ఎలా చేసిందో చూడండి!) -
ఫంక్షన్ హాల్లో రౌడీషీటర్ల విందు భోజనం.. ఎందుకంటే?
ఖలీల్‌వాడి(నిజామాబాద్ జిల్లా): రౌడీషీటర్లు ఐక్యమత్యంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నగరంలో గత ఆదివారం పుట్టిన రోజు వేడుకల్లో రౌడీషీటర్ ఇబ్రహీం చావూస్ (29)ను రౌడీషీటర్లు హతమార్చిన విషయం విధితమే. ఈ హత్యకు ప్రధానకారణం పీడీఎస్ బియ్యం, భూ తగాదాల్లో వచ్చిన పంపకాలతోనే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఇల్లీగల్ దందాపై పోలీసు కమిషనర్ నాగరాజు సీరియస్‌గా దృష్టి సారించారు. అంతేకాకుండా ఇబ్రహీం హత్య కేసు లో 12 మంది నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు పరారీలో ఉన్నారు. పోలీసుల రియాక్షన్‌తో రౌడీషీటర్లు తమకు ఇబ్బందులు తప్పవని భావించారు. తమ దందా దెబ్బతింటుందని.. విభేదాలు తొలగించుకుని ముందుకుసాగేందుకు రెండు పార్టీలకు చెందిన నేతలను ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో రౌడీషీటర్ల మధ్య విభేదాలు రాకుండా ఉండేందుకు సదరు నేతలు రంగంలోకి దిగారు. రౌడీషీటర్ల మధ్య సఖ్యత కోసం వారితో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల క్రితం నగరంలోని ఒకటో టౌన్ పోలీస్‌స్టేష న్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో ముగ్గురు రౌడీషీటర్ల అనుచరుల సమావేశం జరిగింది. దీని వెనుక రెండు పార్టీలకు చెందిన నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశంలో భూ వివాదాలు, పీడీఎస్ బియ్యం, గంజాయివంటి వాటిలో వచ్చిన లాభాలు, మా మూళ్లను అందరూ సమానంగా పంచుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవద్దని, ఒకరు వెళ్లిన పనులకు మరోవర్గం వెళ్లకుండా ఉండాలని చెప్పుకున్నట్లు తెలిసింది. ఎక్కడ ఏ పనులు చేస్తున్నామో సమాచారం ఒకరికొకరు ఇచ్చుకొని ముందుకు వెళ్లాలని, వచ్చిన ఆదాయాన్ని ముగ్గురు సమానంగా పంచుకోవాలని ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. దీంతో వివాదాలు రాకుండా ఉంటాయని, పోలీసుల దృష్టి ఉండకుండా ఉంటుందని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్.. డైరీలో షాకింగ్ విషయాలు సమావేశంలో చర్చించిన నిర్ణయాలపై అందరూ సమ్మతించడంతో అందరూ కలిసి విందు భోజనం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. ఇబ్రహీం హత్య తర్వాత పోలీసులు ఇల్లీగల్ దందాలు, రౌడీషీటర్లపై దృష్టి సారించడంతో ఎలాంటి గొడవలు లేక పోవడంతో అక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉన్నా రు. రౌడీషీటర్ల సమావేశం అనంతరం వారి కదలిక లు మళ్లీ ప్రారంభం కావడంతో ఇబ్బందులు తప్ప డం లేవని, దీనిపై పోలీసులు దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు. -
ప్రపంచ దేశాల ఐక్యతతోనే అది సాధ్యం: ప్రియాంక
ఐక్యరాజ్యసమితి: ‘‘న్యాయమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన సమాజం ప్రతి వ్యక్తి హక్కు. ప్రపంచ దేశాల ఐకమత్యంతోనే ఇది సాకారమవుతుంది’’ అని నటి, దర్శకురాలు ప్రియాంకా చోప్రా జోనాస్ అన్నారు. ప్రపంచదేశాలు సంఘీభావంతో వ్యవహరించాల్సిన అవసరం మునుపటి కంటే ఇప్పుడే ఎక్కువగా ఉందని ఆమె చెప్పారు. ఇందుకు నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యా(ఎస్డీజీ)ల సాధనకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ అయిన చోప్రా ఎస్‌డీజీపై మంగళవారం జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. ప్రమాదం ముంగిట ప్రపంచం ప్రపంచ దేశాల మధ్య విభేదాలు భద్రతా మండలి వంటి కీలక అంతర్జాతీయ వ్యవస్థలను బలహీనపరుస్తున్నాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వెలిబుచ్చారు. ప్రపంచం ప్రమాదం అంచున ఉందన్నారు. అంతర్జాతీయ సహకారం లేకుండా మనుగడ సాగించలేమని గుర్తు చేశారు. ప్రపంచం ముంగిట ఉన్న సవాళ్లను సహకారం, చర్చల ద్వారా మాత్రమే ఎదుర్కోగలమని తెలిపారు. -
స్వేచ్ఛ.. ఆనంద హేతువు
స్వేచ్ఛ ఒక పోరాటం, ఆనంద స్థితి. సత్యావగాహన, ఆస్వాదనీయం. ఒక అభిలషణీయమైన, హర్షదాయకమైన మార్పు. మనిషి మనీషిగా రూపొందగల మార్గం. స్వేచ్ఛ ఒక బాధ్యత, ఐక్యత, గౌరవభావన. ఒక వృద్ధుడు రోడ్డు మీద నడుస్తూ తన చేతిలోని వాకింగ్ స్టిక్‌ని గిరగిరా తిప్పుతూ నడవసాగాడు. ఏదో కూనిరాగం తీస్తూ చాలా సంతోషంగా ముందుకు సాగుతున్నాడు. తనొక్కడే రోడ్డుమీద ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఆలా తిరిగే కర్ర దెబ్బ నుండి చాలా మంది తప్పించుకుంటూ, పెద్దవాడు కనుక ఏమనలేక తిట్టుకుంటూ వెళ్లిపోతున్నారు. చివరకు ఒక విద్యార్థి ధైర్యంగా ఆ తిరుగుతున్న కర్రను చేత్తో పట్టుకుని ఆపి ఆయన తన స్వేచ్ఛనుకుంటూ చేస్తున్న ఆ పని వల్ల మిగిలినవారు ఎలా ఇబ్బంది పడుతున్నారో వివరించాడు. అంతేకాదు, ఆ స్వేచ్ఛ లోని విశృంఖలతను ఆయన దృష్టికి తెచ్చి, ఆలోచింప చేసాడు. అంతేకాదు మనకూ దాన్ని స్ఫురింపచేసాడు. నవ్వు తెచ్చే సంఘటనగా ఉన్నా దీని వెనక ఎంత గొప్ప భావన ఉందో చూడండి. స్వేచ్ఛను నిర్వచించి దానికున్న పరిధులు ఉంటాయన్న ప్రాథమికమైన ముఖ్య విషయాన్ని ఆ రచయిత చిన్న ఉదాహరణ ద్వారా ఎంత సులభంగా వివరించాడో చూడండి. మనం స్వేచ్ఛను అనుభవించే పద్ధతి ఇతరుల స్వేచ్ఛను హరించకూడదన్న విషయాన్ని ఎంత బాగా చెప్పాడో చూసారు కదా! మనకు నచ్చిన విధంగా మన జీవితాన్ని గడపటమే వ్యక్తిగత స్వేచ్ఛ. ఆహార, ఆహార్యాలలో, మనదైన భావనలో, సిద్ధాంతాలతో, విశ్వాసాలతో మన చిత్తానికి తోచినట్టు జీవితాన్ని సాగించటంలో పూర్తి స్వాతంత్య్రం, అలాగే, మన విశ్వాసానికి అనుగుణంగా ఒక దైవాన్ని లేదా అనేక దైవాలను ఆరాధించటంతో పాటు ఆ దైవప్రదేశాల సందర్శన మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మనకు నచ్చిన దైవాన్ని లేదా అందరి దైవాలను పూజించే హక్కు మన ప్రతి ఒక్కరికీ ఉంది. మన వ్యక్తిగతమైన ఈ స్వేచ్ఛకు అడ్డు చెప్పటం గాని అవరోధం కలిగించటం కాని, దీనిని తప్పు పట్టే అధికారం కాని ఇతరులకు లేదు. అలాగే మనకూ ఇతరుల స్వేచ్ఛలోకి చొరబడే హక్కు లేదని గ్రహించి అందుకు అనుగుణంగా వర్తించాలి. మన స్వేచ్ఛను పూర్తిగా అనుభవిస్తూ ఇతరులకు ఉన్న ఆ స్వతంత్రతను గౌరవించటం మన సంస్కారాన్ని, విజ్ఞతను చాటుతుంది. మన భావప్రకటనా శక్తి కూడ మన స్వేచ్ఛను తెలియచేప్పేదే. విద్య, ఆధ్యాత్మిక, రాజకీయ రంగాలలోనే కాక ఇతర రంగాలలోనూ వచ్చే మార్పులకు మనం స్పందించి, దాన్ని వ్యక్తపరచటమూ మన స్వేచ్ఛను తెలియపరుస్తుంది. మన అభిప్రాయాలను స్పష్టంగా, సూటిగా తెలియపరచటంతో పాటు ఉచితమైన, ఆమోదయోగ్యమైన, మర్యాదకరమైన భాషను వాడాలి. సిద్ధాంతాలమీద, భావనల మీద మన ఉద్దేశాన్ని ఎంత నిర్కర్షగా మనం చెప్పదలచుకుంటే అంతగా చెప్పచ్చు. ఇక్కడ సమతౌల్యం, సంయమనం అవసరం. ఈ భావప్రకటనా స్వేచ్ఛ చక్కని ఆలోచనల, భావనల మార్పిడికి / బదిలీకి సహాయపడి మనలను వ్యవస్థను మెరుగు పరచుకునేందుకు మార్గం సుగమం చేస్తుంది. విద్యలో స్వేచ్ఛ అత్యంతావశ్యకం. గురువులు చక్కని వాతావరణాన్ని సృష్టించాలి. ఆ ఉత్సాహభరితమైన, ఉల్లాసభరితమైన స్థితి విద్యార్థులను నిర్భయులను చేసి వారి సందేహాలను, అనుమానాలను వ్యక్తపరచి నివృత్తి చేసుకునేటట్టు చేస్తుంది. ఇరువురి మధ్య విద్యాసంబంధమైన చనువుతో పాటు ఒక ఆత్మీయతను ఏర్పరుస్తుంది. గురుశిష్యులను దగ్గరకు చేరుస్తుంది. వారి బంధాన్ని దృఢం చేస్తుంది. గురువులు చెప్పే విద్యను వెంటనే అంగీకరించక పరీక్షించే గుణాన్నిస్తుంది. శోధించే తత్వాన్ని పెంపొందిస్తుంది. ఈ రకమైన స్వేచ్ఛా వాతావరణం ఉభయులకూ ఎంతో మేలు చేస్తుంది. అంతే కాదు, ఇద్దరినీ అప్రమత్తులను చేస్తుంది. స్వేచ్ఛ ద్విముఖి. సక్రమంగా వినియోగించుకున్నప్పుడు అనంత ప్రయోజనకారి. ఇది మనకు నిర్భయాన్నిస్తుంది. ధైర్య, స్థైర్యాలనిస్తుంది. స్వతంత్రంగా ఆలోచించే శక్తిని ప్రసాదిస్తుంది. ఇది మన ఊహాప్రపంచపు పరిధులను విస్తరింప చేస్తుంది. మన మేధను పదను పరుస్తుంది. మన సృజనకు నిత్య నూతనత్వాన్ని ఇస్తూ వికసింప చేస్తుంది. నిజమైన స్వేచ్ఛ ఏ నిర్బంధానికి, సంకుచితత్వానికి, స్వార్థానికి లొంగక ప్రజలు నిర్భయంగా, ఆనందంగా సంచరించే స్వర్గధామమని అన్నారు విశ్వకవి రవీంద్రులు. స్వేచ్ఛ సహజంగా వీచే వాయువు లాంటిది. కాని అనేక కారణాలవల్ల ఆ స్వేచ్ఛావాయువును పీల్చు కోలేకపోతున్నాం. ముఖ్యంగా పిల్లలు. వీరి స్వేచ్ఛకు తల్లిదండ్రులు, గురువులు, సమాజం, దేశపరిపాలనా రీతి కారణం. కొన్ని యుద్ధ ఉన్మాద దేశాలలోని భయానక వాతావరణం కూడ పిల్లల స్వేచ్ఛను హరించి వేస్తుంది. ఆహారం కాదు ఆహ్లాదం, ఆనందం లేనిచోట స్వేచ్ఛ లేనట్టే. అందుకే ‘స్వేచ్ఛ కోరే మనసు ఉంటే పొందలేనిది ఏముంది’ ‘మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి. కాని ప్రతి చోట బందీనే’ అంటారు రూసో. ఎలా..? ఏమిటీ సంకెలలు? బంధాలు,అనుబంధాల పై మితిమీరిన మమేకత, ప్రేమ, మమకారం, ఆకర్షణ. నేను, నాది , ఆస్తి పాస్తులు , చరాచరాస్తులు, చావు పుట్టుకల సహజత్వాన్ని అంగీకరించని తత్వం అనే అనేకానేక శృంఖలాలు. వీటినుండి బయటపడే నిజమైన స్వేచ్ఛ అసలైన స్వేచ్ఛ. స్వాతంత్య్రం. అద్భుతమైన ఈ దశకు మనస్సు చేరుకునేందుకే ఆధ్యాత్మిక సాధన, ఆ సాధనాపరుల తపన, లక్ష్యం. మనస్సు ఈ అరిషడ్వార్గాలనుండి విముక్తి పొందటమే ఎంతో ఉన్నతమైన స్వేచ్ఛ. అపుడంతా, అన్నిటా ఆనందమే. స్వేచ్ఛ పరమావధి బహ్మానందమే. మనస్సు ఒక స్వేచ్ఛా విహంగం. ఈ మాయామోహిత జగత్ప్రవాహంలో దాని రెక్కలు తడిసి ముద్దవుతుంటాయి. పక్షి తన పదునైన ముక్కుతో చిక్కుతీసుకుంటూ రెక్కలార్చుకుంటుంది. అలాగే మనిషి తన మనోవిహంగపు రెక్కలను భవబంధాల సంకెళ్ల నుంచి విడుదల చేసే యత్నానికే స్వేచ్ఛ అనే మరో పేరు. అపుడు మనోవిహంగపు సంచరించగల ఆవరణం అనంతం. బలమైన దేశాలు బలహీనమైన దేశాలను తమ చెప్పుచేతల్లోకి తీసుకుని ప్రజలను బానిసత్వవు ఊబిలోకి తోసేసేసిన వైనాలెన్నెన్నో. స్వేచ్ఛ అనే ప్రాణవాయువు అందక వారు ఎలా జీవచ్ఛవాలుగా మారారో చరిత్ర చెపుతుంది. అందుకే శ్రీ శ్రీ.. ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం.. అన్నాడు. స్వేచ్ఛ ప్రాణుల ఊపిరి. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
పాపం సింహన్ని ఇలా ఎత్తేసి.. అలా పడేసింది!
సాధారణంగా సింహం అడవికి రాజు. దాన్ని చూసిన ఏ జంతువైనా సరే భయంతో వణికి పోవాల్సిందే. దాని కంట్లో పడితే ఎక్కడ బలైపోతామోనని జంతువులు దాని దరిదాపుల్లోకి వెళ్లటానికి కూడా సాహసించవు. అయితే.. ఇక్కడ ఆపదలో ఉన్న దున్నపోతుని కాపాడటానికి, మరో దున్నపోతు సింహంపైనే దాడికి తెగపడింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ సింహనికి చాలా ఆకలివేసినట్టుంది. దాని ఒక దున్నపోతు కనిపించటంతో వేటాడి కిందపడేసింది. దాన్ని ఎటు కదలకుండా పదునైన దాని పళ్లతో గట్టిగా అదిమి పట్టుకుంది. దీంతో పాపం.. ఆ దున్నపోతు ఎటు కదల్లేక దీనంగా అరుస్తొంది. అయితే.. ఈ అరుపులు దూరంగా ఉన్న వేరే దున్నపోతుల చెవినపడ్డాయి. తన మిత్రుడు ఆపదలో ఉన్నాయనుకున్నాయో ఏమో గానీ.. వెంటనే అక్కడికి చేరుకున్నాయి. అవి రెండు కూడా కోపంతో ఆ సింహం పైకి ఒక్కసారిగా దాడిచేశాయి. అందులో ఒక దున్నపోతు తన పదునైన కొమ్ములతో సింహన్ని పొడిచి గాల్లో బంతిలాగా ఎగిరేసింది. అంతటితో దాని కోపం తీరలేదేమో మరోసారి దాన్ని పొడిచి గాల్లో ఇలా ఎగిరేసి.. అలాపడేసింది. ఈ అనుకోని దాడితో సింహనికి పాపం ఏం జరుగుతోందో అర్థంకానట్టుంది. వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. అయితే, సింహం బారినపడి నాపని ఇక అయిపోయిందనుకున్న దున్నపోతు ప్రాణాలతో బయటపడింది... ఈరోజు కడుపునిండా మాంసం తిందామనుకున్న ఆ సింహం బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి జారుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు వీటి ఐక్యమత్యానికి తెగ సంబర పడిపోతున్నారు. మనుషుల కన్నా నోరులేని జీవాలే నయం అని కామెంట్లు పెడుతున్నారు. చదవండి: బాల్కనీలో బాలుడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా! -
‘మాకంటే మీరే నయం’: పొడిచి పొడిచి తరిమేశాయి
కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహాబలం అనే సామెతలు మన దగ్గర చాలా ప్రసిద్ధి. ఒంటరిగా సాధించలేని కార్యాన్ని, లక్ష్యాన్ని ఐకమత్యంతో సాధించవచ్చని చెప్పే కథలు కోకొల్లలు. చిన్నప్పుడు మనం చదవుకున్న ఎద్దు, సింహం కూడా ఈ కథ కూడా ఈ కోవలోకే వస్తుంది. తాజాగా ఐకమత్యం గొప్పతనాన్ని చాటే సంఘటన ఒకటి వాస్తవంగా చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తమ మిత్రుడిపై దాడి చేయడానికి వచ్చిన పిల్లిని కోడిపెట్టలు పొడిచి పొడిచి మరి తరిమాయి. వీటి ఐకమత్యాన్ని చూసిన నెటిజనలు తెగ సంబరపడుతున్నారు. మా కంటే మీరే నయం అంటూ ప్రశంసిస్తున్నారు. రెండు నెలల క్రితం నాటి ఈ వీడియో తాజాగా మరోసారి వైరలవుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు తెలియవు. ఇక వీడియోలో పొలంలో ఒంటరిగా తిరుగుతున్న ఓ కోడిపెట్టను పిల్లి గమనిస్తుంది. ఒంటరిగా బలే చిక్కింది.. ఈ రోజు నాకు పండగే అని సంబరపడుతూ కోడి మీద దాడి చేయడానికి వస్తుంది. అయితే మిత్రుడికి వచ్చిన ఆపద చూసి మిగతా కోడి పెట్టలు అలర్ట్ అవుతాయి. పోలోమంటూ వచ్చి.. పిల్లిపై దాడి చేస్తాయి. ఊహించని ఈ ఘటనకు బిత్తరపోయిన పిల్లి నెమ్మదిగా అ్కడ నుంచి జారుకుంటుంది. చదవండి: ఇలాంటి ఏప్రిల్ ఫూల్‌ని ఎక్కడా చూసుండరు -
ప్రతిపక్ష ఐక్యతలో ప్రశ్నలెన్నో!
మోదీ వ్యతిరేకత అనే నినాదంతో మిగిలిన అందరూ ఏకమైతే అంతిమంగా అది మోదీ పట్ల సానుభూతిగా మారుతుంది. మమతా బెనర్జీ, లాలూ యాదవ్ కుమారుడు, అఖి లేశ్, మాయావతి, శరద్‌పవార్, చంద్రబాబునాయుడు, దేవెగౌడ, చంద్రశేఖరరావు, కరుణానిధి, నవీన్ పట్నాయక్ రాహుల్‌గాంధీతో చేతులు కలపడం వాంఛించదగినది కాదు. దీనివల్ల సాధారణ ఓటరు కొత్త తరహా భారతదేశం గురించి ఆలోచించడానికి ప్రేరణ కలుగుతుంది. నిజానికి దేశంలో చాలామంది ఓటర్లు మోదీ వైపు మొగ్గడానికి కారణం ఈ నాయకులేనన్న వాస్తవాన్ని మనం మరచిపోరాదు. కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్డి కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన వేళ ప్రతిపక్షాలు చూపించిన ఐకమత్య సంరంభం నాకు నోట మాట రాకుండా చేసింది. గడచిన నాలుగేళ్ల నుంచి నేను ఒకే విషయం చెప్పాను. ప్రధాని నరేంద్ర మోదీ పాలన ఇప్పటిదాకా భారత గణతంత్ర మౌలిక విలువల మీద దొంగచాటు దాడికి పాల్పడుతూనే ఉంది. అయినప్పటికి మోదీ వ్యతిరేకులు ఒకే తాటి మీదకు వచ్చి ప్రతిఘటించే ముహూర్తం కానరాకపోవడమే నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే మోదీని అధికారం నుంచి దించడం అనే ఏకసూత్ర ప్రణాళిక మాత్రం న్యాయబద్ధమైనది కాలేదు. అంతేకాదు, అలాంటి ఆలోచన ప్రతికూల ఫలితాన్ని ఇచ్చే అవకాశం కూడా ఎక్కువే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, తదనంతర పరిణామాలు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కొన్ని దారులు చూపించాయి. ఆ ఎన్నికల ఫలితాలు ఒక వాస్తవాన్ని కూడా నిర్ధారించాయి. ఈ వాస్తవం గడిచిన ఏడాదిగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఏ రాజకీయ విశ్లేషకుడైనా ఊహించేదే కూడా. మోదీ, షా ద్వయం బలీయమైనది, అదే సమయంలో అని తర సాధ్యమైనది. కాంగ్రెస్ మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న అంచనాలను కూడా ఫలి తాలు తారుమారు చేశాయి. సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీ అప్రతిహత రాజకీయ విన్యాసాల ముందు సొంత శక్తి మీద నిలువలేదన్న వాస్తవాన్ని కూడా ఆ ఫలితాలు వెల్లడించాయి. అలాగే ఆ ఫలితాలు ప్రతిపక్షాల ఐక్యత అవసరాన్ని కూడా సూచిస్తున్నట్టయితే, ఎన్నికల అనంతరం జరిగిన మాయోపాయాలు, యడ్యూరప్పను పదవీచ్యుతుడిని చేయడానికి జేడీ(ఎస్), కాంగ్రెస్ పోషించిన చురుకైన పాత్ర వంటివి చూస్తే అందుకు, అంటే ఐక్యతకు అవకాశం, ఆచరణ మెండుగానే ఉన్నట్టు నిర్ధారణయింది కూడా. ఆ విధంగా చూస్తే 2019 లోక్‌సభ ఎన్నికలు 1971,1977, 1989 నాటి ఎన్నికల నమూనాలో జరిగే అవకాశం ఉంది. అప్పుడు అన్ని ప్రతిపక్షాలు కలసి బలీయమైన అధికార పక్షాన్ని ఓడించడానికి ఏకమైనట్టు కనిపిస్తుంది. తేడా ఒక్కటే. పూర్వం అవన్నీ కాంగ్రెస్ వ్యతిరేక కూటములు. ఇప్పుడు మాత్రం బీజేపీ వ్యతిరేక కూటమి. ఈ పరిణామం ఆశ్చర్యపడవలసినదేమీ కాదు. మోదీ బుడగ తనకు తాను ఎప్పుడు బద్దలవుతుందా అని గడచిన నాలుగు సంవత్సరాల నుంచి ప్రతిపక్షం ఎదురుచూస్తూనే ఉంది. కానీ ఆ క్షణం రాలేదు. మోడీత్వకు వ్యతిరేకంగా విపక్షం చేయవలసినవన్నీ చేసింది. అవి కూడా ఫలితాలను ఇవ్వలేదు సరికదా, వికటిం చాయి. క్షేత్రస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా నిలబడగలిగే ఒక ప్రతిపక్ష కూటమిని అందించడంలో మోదీ వ్యతిరేకులు విఫలమయ్యారు. ఇక చేసేదిలేక విపక్షాలు విస్తృత మోదీ వ్యతిరేక కూటమి నిర్మాణమే తుది లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా ఆఖరిపోరాటం ఆరంభించారు. కానీ కర్ణాటకలో సంభవించిన పరి ణామాలు ఈ కూటమి ఏర్పాటుకు కొత్త షరతులను ముందుకు తెచ్చాయి. చిత్రం ఏమిటంటే ఆ షరతులను నిర్దేశించేది కాంగ్రెస్ కాదు, ప్రాంతీయ పార్టీలు. బీజేపీయేతర పార్టీల ఓట్లలో చీలిక రాకుండా జాగ్రత్త పడడం వల్ల ఆ లబ్ధి చేకూరుతున్నది. ఇది గోరఖ్‌పూర్, ఫూల్పూరు ఎన్నికలలో రుజువైంది. బీజేపీయేతర పార్టీలు ఎక్కడ బలం కలిగి ఉన్నాయో అక్కడ ఇది వర్తిస్తుంది. ఓట్లు చీలకపోవడం వల్ల మంచి ఫలితాలతో పాటు, విపక్షాలు జాతీయ స్థాయిలో హవాను కూడా సృష్టించే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్షాలకు ఉన్న ఈ సానుకూలతలను చాలా సందర్భాలలో అతిశయోక్తిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. చాలా రాష్ట్రాలలో ప్రతిపక్షాల ఐక్యత అనే ఆలోచన అవసరం రాదు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లలో ఇది నిజం. అక్కడ కాంగ్రెస్–బీజేపీల మధ్య ద్విముఖ పోటీయే ఉంటుంది. అలాగే ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్‌తో కలసే మరో ప్రతి పక్షం ఏదీ లేదు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరొక రకమైన పరిస్థితి. ఆ రాష్ట్రాలలో ఎక్కడా కూడా తొలి రెండు స్థానాలలో ఉన్న అగ్రగామి పక్షంగా బీజేపీ లేదు. కాబట్టి ఇక్కడ బీజేపీని ఓడించడానికి అన్ని పార్టీలు ఒకే తాటిపైకి రావాలన్న నినాదానికి అర్థమే లేదు. బెంగాల్లో బీజేపీని నిలువరించడానికి మమతా బెనర్జీకి మరొక రాజకీయ పార్టీ సాయమేదీ అవసరం ఉండదు. ప్రతిపక్షాల ఓట్లు చీలకపోవడం గురించి కూడా అతిశయోక్తులు వినిపిస్తూ ఉంటాయి. మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల మాదిరిగానే బీజేపీయేతర పార్టీల ఓట్లన్నీ కాంగ్రెస్‌కు అనుకూలం కాదు. మొన్నటి కర్ణాటక ఎన్నికలలో కొన్ని ప్రాంతాలలో జేడీ(ఎస్), కాంగ్రెస్‌ల మధ్య ప్రధాన పోటీ జరిగింది. ఇలాంటి పరిస్థితి ఉన్నచోట ప్రతిపక్షానికి కొత్తగా లభించే లబ్ధి ఏదీ ఉండదు. కొన్ని చోట్ల బీజేపీయేతర పార్టీల ఓట్లే అయినప్పటికీ అవి బదలాయించడానికి అవకాశం ఉన్నవి కావు. ఉత్తరప్రదేశ్, బెంగాల్లో కాంగ్రెస్ పరి స్థితి ఇదే. కాబట్టి కాగితాల మీద కనిపిస్తున్న బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం వాస్తవికంగా ఆకృతి దాల్చడం లేదు. ఇంకొక అంశం– ప్రతిపక్షాల ఐక్యత వల్ల వచ్చే ప్రయోజనాలు అన్ని సందర్భాలలోను నిలకడగా ఉండవు. టీఆర్ఎస్, టీడీపీ, డీఎంకే, జేకేఎన్సీ, బీజేడీ, ఐఎన్‌ఎల్‌డీల విషయంలోను, ఇంకా చెప్పాలంటే బీఎస్పీ విషయంలో కూడా ఇదే వాస్తవం. ఈ పార్టీలు మొదట బీజేపీ వ్యతిరేక కూట మిలో భాగస్వాములు కావచ్చు. కానీ వాటి గత చరి త్రను చూస్తే ఎన్నికల అనంతర అవగాహనలలో భాగంగా వారు బీజేపీవైపు మొగ్గు చూపబోరని ఎవరూ చెప్పలేరు. బీజేపీ వ్యతిరేక విస్తృత కూటమి గురించి మాట్లాడుతున్న సందర్భంలో రెండు వాస్తవాలను గుర్తించడంలో వైఫల్యం కనిపిస్తుంది. అవి– దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రయోజనాలకు సంబంధించినవి. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యమవుతున్నవారు నిజానికి భవిష్యత్తులో బీజేపీ పునాది విస్తరించడానికి ఉపయోగపడేవారే అవుతారు. ప్రధాన ప్రతిపక్షాల ఐక్యత (బిహార్‌లో ఆర్జేడీ, జేడీయూ; ఒడిశాలో ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్, తెలంగాణ, ఆంధ్రా) ఒక శూన్యాన్ని ఏర్పరిచే అవకాశం కూడా ఉంది. ఈ పార్టీలలో ఏదైనా తమను అనాథగా వదిలేసిందని ఓటర్లు భావించినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఇలా విపక్షాలు వదిలిన శూన్యాన్ని భవిష్యత్తులో బీజేపీయే సొంతం చేసుకుంటుంది. అలాగే మోదీ వ్యతిరేకత అనే నినాదంతో మిగిలిన అందరూ ఏకమైతే అంతి మంగా అది మోదీ పట్ల సానుభూతిగా మారుతుంది. మమతా బెనర్జీ, లాలూ యాదవ్ కుమారుడు, అఖి లేశ్, మాయావతి, శరద్‌పవార్, చంద్రబాబునాయుడు, దేవెగౌడ, చంద్రశేఖరరావు, కరుణానిధి, నవీన్ పట్నాయక్ రాహుల్‌గాంధీతో చేతులు కలపడం వాంఛించదగినది కాదు. దీనివల్ల సాధారణ ఓటరు కొత్త తరహా భారతదేశం గురించి ఆలోచించడానికి ప్రేరణ కలుగుతుంది. నిజానికి దేశంలో చాలామంది ఓటర్లు మోదీ వైపు మొగ్గడానికి కారణం ఈ నాయకులేనన్న వాస్తవాన్ని మనం మరచిపోరాదు. ప్రస్తుతం ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాల పట్ల నేను అసంతృప్తిగా ఉండడానికి వెనుక కారణం కొన్ని లాభనష్టాలు మాత్రమే కాదు. నాకున్న సమస్య ఏమిటంటే– నేడు ఉన్న ఈ పాలనను ఎందుకు తిరస్కరించాలి అన్న విషయాన్ని వారు మరచిపోయారు. అంతేకాదు, జనం కూడా మరచిపోయేటట్టు చేస్తున్నారు. కూటమిగా ఏర్పడుతున్న ఈ బీజేపీయేతర పార్టీలలో ఏ ఒక్కటీ కూడా గణతంత్ర భారత పునాదులకు ఎదురవుతున్న సవాళ్లను ప్రతిఘటించడానికి సంసిద్ధంగా లేదు. మోదీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడే కూటమికి ఈ నాలుగు లక్షణాలు ఉండాలి. ఒకటి– సానుకూల జాతీయవాద సంప్రదాయాన్ని పునరుద్ధరించే దృష్టి ఉండాలి. దేశంలో ఉన్న భిన్న సంస్కృతులూ సంప్రదాయాల మధ్య అంతస్సూత్రంగా వ్యవహరించాలి. ఈ తరం యువతకూ భవిష్యత్తుకూ మధ్య వారధిలా పనిచేయాలి. రెండు– స్వతంత్ర భారతంలో ఎన్నికల యంత్రాంగాన్ని భ్రష్టు పట్టించిన వ్యవస్థతో పోరాడే జాతీయ స్థాయి రాజకీయ సంస్థ అవసరం. మూడు– కొత్త రాజకీయాలను దర్శించే వ్యూహాత్మక ప్రణాళిక ఉండాలి. నాలుగు–దేశంలో కొత్త ఆశలు నింపగలరని నమ్మకం కలిగించే వ్యక్తులు అందులో ఉండాలి. దురదృష్టం ఏమిటంటే మోదీకి వ్యతిరేకమంటూ ఇప్పుడు ఏర్పడుతున్న కూటమిలో ఏ ఒక్క పార్టీకి ఇలాంటి లక్షణాలు లేవు. కానీ ప్రతిపక్ష కూటమి ఐక్యత వల్ల కొంత లబ్ధి జరగవచ్చు. అంతేకాని అవి మోదీ పాలనకు ప్రత్యామ్నాయం మాత్రం కాలేవు. ఇంకా చెప్పాలంటే మోదీ పాలనకు స్వస్తి పలికినప్పటికీ ఈ కూటమి స్వల్పకాలిక ప్రయోజనం కూడా సాధించలేకపోవచ్చునేమో కూడా. పోనీ స్వల్ప కాలిక ప్రయోజనమే సాధించినప్పటికీ అది మన గణతంత్ర రాజ్య ప్రయోజనాలను ఫణంగా పెట్టి సాధించినదే. యోగేంద్ర యాదవ్ , వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు, మొబైల్ : 98688 88986 -
‘నాయకులు కలిశారు..మనుసులు కలువలేదు’
లక్నో: వచ్చేఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు అన్నిజట్టు కట్టే ప్రయత్నం చేస్తుండంపై బీజేపీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తీవ్ర విమర్శలు చేశారు. కేవలం ప్రతిపక్ష పార్టీలు మాత్రమే ఒకే వేదికపైకి వచ్చాయి, కానీ వారి మనుసులు కలువలేదని ఆరోపించారు. గురువారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..బీజేపీని ఓడించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు కలిశాయి. కానీ వారి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఇలాంటి సమైఖ్యత ఎక్కువ రోజులు ఉండదని, దాని వల్ల ఫలితాలు రావన్నారు. ప్రస్తుతం బీజేపీ వెంటా రైతులు, జాట్లు, శాంతిని కోరుకునే వారంతా ఉన్నారన్నారు. దేశంలోని చిన్నపిల్లల్ని అడిగినా సరే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతల పరిస్థితులు సమూలంగా మారినట్లు చెబుతారన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు బీజేపీ వెంటా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. మే 28న ఖైరానా లోక్‌సభకు జరిగే ఉప ఎన్నికల ఫలితం 2019 లోక్‌సభ ఎన్నికలపై ఉంటుందా అని ఓ విలేకరు అడిగిన ప్రశ్నకు యోగీ సమాధానవిస్తూ..‘ నాకు తెలియదు. ఖైరానాలో దివంగత నాయకులు హుకుమ్ సింగ్ వారసులు ఎంపీగా గెలుస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. -
ఐక్యతా రాగం!
సాక్షి,ఆదిలాబాద్ : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుండి ఐక్యత రాగం అందుకుంది. ఈ కొత్త పల్లవిపై పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతున్నా ఇది ఎన్నికల వరకు కొనసాగుతుందా..లేనిపక్షంలో మూణ్నాళ్ల ముచ్చటేనా అనే అనుమానాలు లేకపోలేదు. గ్రూపు రాజకీయాలపై అధిష్టానం హెచ్చరికల నేపథ్యంలోనే తాజాగా పార్టీలో ఈ మార్పు కనిపిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్ర ఈనెల 26 నుంచి చేవెళ్ల నుంచి ప్రారంభం కానుండడం, రాష్ట్ర నేతల్లోనే ఎన్ని గ్రూపు రాజకీయాలున్నా ఈ యాత్రను ఐక్యంగా చేపడుతుండగా, జిల్లాల్లోనూ ఐక్యత కనబడాల ని అధిష్టానం ఆదేశించడంతోనే నేతలు కలిసి నడుస్తున్నారన్న ఊహగానాలు వినిపిస్తున్నాయి. ముందు, తర్వాత అదే పరిస్థితి.. జిల్లాల పునర్విభజనకు ముందు,ఆతర్వాత ఆదిలాబాద్ జిల్లాలో గ్రూపు తగాదాలది అదే పరిస్థితి. పునర్విభజన అనంతరం పార్టీలో ప్రధానం గా ఆదిలాబాద్ నియోజకవర్గం చుట్టే జిల్లా రాజకీయాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఉమ్మడి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్య వహరిస్తున్నారు. అయితే జిల్లాల విభజన తర్వాత ఆయన ఎక్కువగా తన నియోజకవర్గం నిర్మల్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో జిల్లా కాం గ్రెస్‌కు దిక్కులేని నావ లాగా తయారై ఎవరికివారే అన్న చందంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. గతంలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గా ల్లో మహేశ్వర్‌రెడ్డి తన వర్గంగా ఉన్నవారితో సఖ్యంగా ఉంటూ పరోక్షం గా పార్టీలో గ్రూపు తగాదాలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన కూడా ఈ జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగానే ఉంటూ వస్తున్నారు. గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్ రైతుబాట కార్యక్రమంలో భాగంగా ఉట్నూర్‌లో నిర్వహించిన సభలో నూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా సమక్షంలోనే జిల్లాలోని గ్రూపు తగాదాలు బహిర్గతం అయ్యాయి. దీంతో కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలను ఒకగాటి కి తేవడం కష్టమేనని పార్టీ శ్రేణుల్లోనే అభిప్రాయం వ్యక్తమైంది. గత ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి భార్గవ్‌దేశ్‌పాండేకు టికెట్ దక్కింది. అప్పుడు సి.రాంచంద్రారెడ్డితో పాటు గండ్ర త్ సుజాత టికెట్‌ను ఆశించినా చివరిక్షణంలో భంగపడ్డారు. అయితే పార్టీ అధిష్టానం ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంట నడిచారు. ఆ ఎన్నికల్లో భార్గవ్‌దేశ్‌పాండే మూడో స్థానంలో నిలిచారు. మూడు ముక్కలు అతికాయి.. 2014 ఎన్నికల తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొంత స్తబ్ధత ఏర్పడింది. ఆ తర్వాత రాష్ట్ర పార్టీ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమాల ద్వారా జిల్లా రాజకీయాల్లోనూ కాంగ్రెస్ వేడి పుట్టించేలా ప్రయత్నాలు చేసింది. ఎన్నికలు సమీపిస్తుండగా ఏడాది కాలంగా మా త్రం మళ్లీ గ్రూపు తగాదాలు మొదలయ్యాయి. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి భార్గవ్‌దేశ్‌పాండేలు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఎవరికి వారే అన్న చందంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కొద్ది నెలలుగా మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి ఆదిలాబాద్ పట్టణంలో వార్డు వార్డు తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నా రు. సుజాత ఇటీవల కాలంలో గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలను కలుస్తూ వచ్చారు. తాజాగా భార్గవ్‌దేశ్‌పాండే పల్లెపల్లెకు కాంగ్రెస్ కార్య క్రమాన్ని ప్రారంభించారు. మొదటిరోజు జైనథ్ మండలంలో కార్యక్ర మం చేపట్టి డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి పాల్గొననున్నట్లు ప్రచారం చేశారు. అయితే మహేశ్వర్‌రెడ్డి రాకపోవడంతో నియోజకవర్గంలో కాం గ్రెస్ గ్రూపు తగాదాలే కారణమన్న అభిప్రాయం శ్రేణుల్లో వ్యక్తమైంది. ఇదిలా ఉంటే పల్లె పల్లెకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా బుధవారం భార్గవ్‌దేశ్‌పాండే ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అనుకుంట గ్రా మంలో చేపట్టారు. కార్యక్రమానికి రాంచంద్రారెడ్డి, సుజాతను కూడా ఆహ్వానించారు. అయితే వారు పాల్గొంటారో లేదోనన్న మీమాంసలో ఉండగా, నేతలు కలిసి రావడంతో శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది. అదే సం దర్భంగా నేతల ప్రసంగంలోనూ మార్పు కనిపించింది. 2019 ఎన్నికల్లో టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పనిచేస్తామంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల వరకు ఈ రాగం కొనసాగుతుందా.. లేనిపక్షంలో మళ్లీ పరిస్థితు లు మారుతాయా అనేది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే పల్లె పల్లెకు కాం గ్రెస్ కార్యక్రమాన్ని భార్గవ్‌దేశ్‌పాండే అధిష్టానం అనుమతి తీసుకొ ని ప్రారంభించినట్లు చెబుతున్నారు. మిగతా నేతలు కలిసిరావడం లేద ని ఆయన పార్టీ అధిష్టానం వద్ద వాపోవడంతో అధినాయకత్వం మిగ తా నాయకులతో మాట్లాడినట్లు పార్టీ కేడర్ చెప్పుకుంటుంది. దీంతోనే తాజాగా ఈమార్పు కనిపిస్తుందని పార్టీశ్రేణులు చర్చించుకుంటున్నారు. -
విశాల ఐక్యత నేటి అవసరం
కమ్యూనిస్టు పార్టీల ప్రస్తుత క్షీణ స్థితిని గుర్తుచేసి జాగ్రత్తపడాలని హెచ్చరిస్తే అలాంటి వారిని బీజేపీ అనుకూల మేధావుల సరసన చేర్చి వ్యవహరించే వారిపట్ల కమ్యూనిస్టులు సైతం అప్రమత్తతతో ఉండాలి. కొన్ని పొరపాట్లు జరగకుండా ఉండి ఉంటే కమ్యూనిస్టుల స్థితి మరింత ఆశాజనకంగా ఉండేదన్న సదుద్దేశంతో విమర్శించినంత మాత్రాన వారందరినీ శత్రు శిబిరంలో కలుపడమే కాకుండా ‘కమ్యూనిస్టులదే అంతిమ విజయం’ అనే భావనను సమర్థించకపోవడమే తీవ్ర తప్పిదం అంటే ఎలా? ఇటీవల రాజస్థాన్‌లో 2 లోక్‌సభా స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ మూడు స్థానాల్లో బీజేపీ పరాజయాన్ని చవిచూసింది. ఇంతకు ముందు ప్రధాని మోదీ స్వరాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో గుజరాత్లో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆ విజయం బీజేపీకి గానీ, మోదీకి గానీ ప్రత్యేకించి పేర్కొనదగినది కాకపోగా, గతంలో కంటే తక్కువగా పోలైన ఓట్ల శాతంతో భారీగా నష్టపోయింది. ఆమేరకు కాంగ్రెస్ పార్టీ లాభపడింది. అదే విధంగా బెంగాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ ఘన విజయమే సాధించింది. ఉపఎన్నికలను కొట్టి పారేయడం కుదరదు. బహుశా గతంలో రెండు సార్లు.. అధికారంలో ఉన్న పార్టీ ఉపఎన్నికలలో ఇలా ఓడిపోవడం జరగలేదు. అది రాజస్థాన్‌లో బీజేపీ మాత్రమే సాధించిన రికార్డు. అలాగే తమిళనాడులో జరిగిన ఇటీవలి ఉపఎన్నికలలో బీజేపీకి నోటాకు వచ్చిన ఓట్లకంటే కూడా తక్కువ వచ్చి, 1300 ఓట్లతో సరిపెట్టుకోవలసివచ్చింది. ఈ 67 ఏళ్ల రిపబ్లిక్ చరిత్రలో ఒక శాసనసభ ఉప ఎన్నికలో ఇంత తక్కువ ఓట్లు సాధించిన ప్రధాన జాతీయ పార్టీ ఏదీ లేదు. భారతదేశం వివిధ జాతుల సముదాయం అన్న వాస్తవాన్ని గుర్తించకుండా మొత్తం దేశాన్ని ఏకశిలా సదృశమైన అఖండ హిందూరాజ్యంగా మార్చాలన్న ఆర్ఎస్ఎస్ మతతత్వ ఎజెండాను శాయశక్తులా అమలు జరిపేందుకు తీవ్రకృషి చేస్తోందని ఈ నాలుగేళ్ల బీజేపీ, మోదీజీల వ్యవహార శైలి వలన తేటతెల్లమవుతున్నది. దేశానికి ఈ పరిస్థితి దాపురించడానికి, బీజేపీ ఇంతటి స్థాయికి ఎదగడానికి, కాంగ్రెస్ పార్టీ అవినీతిమయమైన అధ్వాన పాలన కారణమని ఇతర ప్రతిపక్షాలు సహజంగా కాంగ్రెస్‌ను విమర్శిస్తాయి. ఆ విమర్శ వాస్తవమే. కానీ బీజేపీకి లేని బలాన్ని సంతరింపచేయడంలో మిగిలిన బీజేపీయేతర పార్టీల, వ్యక్తుల పాపం కూడా లేకపోలేదు. ఉదా.కు బిహార్‌లో నితీశ్ కుమార్ నిర్వాకం ఏమిటి? లాలూప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీతో కలిసి బిహార్‌లో గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీని మట్టిగరిపించి గద్దెనెక్కిన నితీశ్ కుమార్ ఈ మధ్యనే తనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన ఆర్జేడీకి, లాలూకు వెన్నుపోటు పొడిచి పచ్చి అవకాశవాదంతో బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రిగా నిస్సిగ్గుగా అందలం మీద కులుకుతున్న విషయం మనకు తెలిసిందే కదా. అవకాశవాదానికి మారుపేరు బాబు ఇక మన రాష్ట్రంలో చంద్రబాబు తెలుగుదేశం వ్యవహారం తెలిసిందే కదా. వెన్నుపోటు అనే పేరుతో ఎవరైనా సినిమా తీయదల్చుకుంటే అది చంద్రబాబును ఉద్దేశించేనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపార్థం చేసుకునే అవకాశమూ ఉంది. మోదీ అధికారంలో ఉండగా గుజరాత్లో మతకల్లోలాల సందర్భంగా 3 వేలమంది (అత్యధికంగా ముస్లింలు) మారణ హోమానికి గురైనప్పుడు మోదీ మన రాష్ట్రానికి వస్తే కారాగారంలో వేసి శిక్షిస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలికిన విషయం తెలుగు ప్రజలు మర్చిపోలేదు. 2004 ఎన్నికలనాటికి వాజ్‌పేయితో, బీజేపీతో కలిసి ఎన్నికలలో జతకట్టి ఓటమి పాలైన సందర్భంగా ఇక బీజేపీతో ఎన్నికలపొత్తు పెట్టుకోనని రాజకీయ ప్రతిజ్ఞ చేసిన పెద్దమనిషి చంద్రబాబు. కానీ 2014 ఎన్నికల్లో ఆ ఒట్టు తీసి గట్టున పెట్టి మోదీతో, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇక వామపక్షాల పాత్ర కూడా బీజేపీ నేడు ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడింది. నిజానికి బీజేపీకి, ఆ పార్టీ సైద్ధాంతిక స్ఫూర్తి ఆర్ఎస్ఎస్కు భావజాలపరంగా మార్క్సిస్టు దృక్పథంతోనే ప్రధమ శత్రుత్వం ఉంటోంది. ఈ నేపధ్యంలో మార్క్సిస్టులు పరస్పరం ఆ ఊరికీవూరు ఎంత దూరమో ఈ ఊరుకు ఆ ఊరూ అంతే దూరం అన్నట్లుగా ఉండటం సరైంది కాదు. ఏ కమ్యూనిస్టు పార్టీలోనూ సభ్యత్వం లేనంత మాత్రాన తమకు తెలిసినంతలో మార్క్సిజం పట్ల నిబద్ధత కలిగి ఉంటున్నవారు–కమ్యూనిస్టు పార్టీల ఆచరణ, వాటి ఎత్తుగడల లోపాలపై విమర్శిస్తూ ఉండవచ్చు. అది మన పిల్ల వాడు తప్పు చేస్తుంటే హెచ్చరించడం, సరిదిద్దుకోమని చెప్పడం వంటిది. అలా విమర్శించినంత మాత్రాన ఆ వ్యక్తిని కమ్యూనిస్టు పార్టీకి శత్రువుగా పరి గణించడం సబబు కాదు. పొత్తు విషయంలోనే విభేదాలు! ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలి, ఎవరిని దూరం పెట్టాలి, విభేదించాలి అనే సూత్రబద్ధతకు సంబంధించి కమ్యూనిస్టు పార్టీల్లోనే అంతర్గతంగా చర్చలు, వాదాలు జరిగి ఓటింగ్ వరకు వెళుతున్న ఘటనలు గతంలోనూ జరిగాయి, ఇప్పుడూ జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలనే విషయమై పుచ్చలపల్లి సుందరయ్య సీపీఎంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో తీవ్ర చర్చ జరిగింది. 42 ఏళ్ల తర్వాత సీపీఎం పార్టీ అఖిల భారత మహాసభ జరగనున్న సందర్భంగా అలాంటి పరిస్థితే మళ్లీ ఏర్పడింది. మోదీ, షాల బీజేపీ పార్టీ మతతత్వ ధోరణులకు వ్యతిరేకంగా రాజ్యాంగ ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి అన్న విషయంలో సీపీఎంలో విభేదాలున్నాయనే వార్త వచ్చింది. కాంగ్రెస్ పార్టీతో సహా బీజేపీ వ్యతిరేక, బీజేపీయేతర పార్టీలన్నింటినీ కలుపుకుని కూటమి ద్వారా పోరాడాలనీ, ఆ పార్టీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం ప్రతిపాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అలాంటి పోరాటంలో పాల్గొనే అర్హత కోల్పోయిందని అలాగే ఇతర పెట్టుబడిదారీ పార్టీలు కూడా కాంగ్రెస్ లాగే ఉదార ఆర్థిక విధానాలనే అనుసరిస్తున్నాయని, కనీస వామపక్షాలతో తప్ప ఇలాంటి వాటితో కలిసి వేదిక పంచుకునే ప్రశ్న రాదని, గతంలో విశాఖపట్నంలో చేసుకున్న తీర్మానానికే కట్టుబడి ఉండాలని, మునుపటి పార్టీ ప్రధాన కార్యదర్శి, నేటి పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ ప్రతిపాదించారని వార్త. ఈ ఇరువురి వాదనల మధ్య ఓటింగులు జరిగి, ఒక దశలో ప్రకాశ్ వాదన నెగ్గిందని, తర్వాత కేంద్రకమిటీలో ఏచూరి వాదన నెగ్గిందని అయితే మహాసభ చివర జరిగిన కేంద్రకమిటీ భేటీలో తిరిగి ప్రకాష్ వాదనే 8 ఓట్ల తేడాతో నెగ్గిందని హిందూ పత్రికలో వార్త చూశాము. ప్రకాష్ కరత్ వాదన ప్రకారం, కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ కాదు. కాంగ్రెస్ కూడా బీజేపీ అంత మొరటు మతతత్వ పార్టీ కాకపోయినా, కొంత సున్నితమైన మతతత్వ పార్టీయే అని కరత్ వాదన. ఇదే సమయంలో విజయవాడలో జరిగిన సీపీఐ జాతీయ కౌన్సిల్లో, మోదీ మతతత్వ, దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడిన పార్టీలన్నింటితోపాటు కాంగ్రెస్‌ను కూడా కలుపుకుని పోరాడాలి అని తీర్మానం చేశారు. దానిపై సీపీఎం నుంచి సానుకూల స్పందన లేదు. కమ్యూనిస్టు పార్టీల సానుభూతి పరులు, సాధారణ కష్ట జీవులు, వర్ణ (కుల) వ్యవస్థ పద ఘట్టన కింద నలిగిపోతున్నవారు, మతోన్మాదంతో పాటు ఉదారవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల ఫలితంగా దైనందిన జీవనంలో అష్టకష్టాలు పడుతున్నవారు.. వీరందరూ కూడా రెండు కమ్యూనిస్టు పార్టీల మధ్య కానరాని ఐక్యత విషయంలో నిస్పృహకు గురవుతున్నారు. వామపక్షాల ఐక్యత గురించి సీపీఐ, సీపీఎం తరచుగా ప్రబోధిస్తుంటాయి. కానీ ప్రస్తుత కీలక సమయంలో అయినా ఐక్యతకు భిన్నంగా ఉండే ప్రకటనల పట్ల కాస్త సమతుల్యతతో ఉండటం అవశ్యం. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండూ ఆర్థిక విధానాల్లో కోటీశ్వరుల కొమ్ము కాస్తూ, నిరుపేదల పట్ల, దిగువ మధ్య తరగతి పట్ల నిర్లక్ష్యం వహించి సాధారణ ప్రజల జీవితం దుర్భరం చేయడం వాస్తవమే. దానికి తోడు బీజేపీ కరడుగట్టిన మతతత్వంతో హిందూ, హిందూయేతర ప్రజల మధ్య వైరుధ్యాన్ని పెంచి హిందూ మత ఓటు బ్యాంకు కోసం పరమత ద్వేషాన్ని రెచ్చగొడుతూ, ప్రజానీకాన్ని మధ్యయుగాల అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నాలుగేళ్ల పాలనలో అది ఎన్ని దుశ్చర్యలకు పాల్పడిందో తెలిసిందే. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ కాదని చెబుతూ దాన్ని బీజేపీతో కలిపి ఒకే గాటన కట్టడం వాస్తవం కాదు. ఆ మాటకొస్తే మైనారిటీల తరఫున నిలబడినందువలన హిందూమతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న అపప్రథకు సీపీఎం కూడా గురైంది. అంత మాత్రాన అది నిజమేనా? మతతత్వ పాలనే ప్రథమ శత్రువు ఏది ఏమైనా మోదీ, షాల అప్రకటిత నియంతృత్వ పాలనను, దాని ఉన్మత్త ఏకశిలా సదృశ జాతీయతను, దాని శ్రామిక వ్యతిరేక సిద్ధాంతాన్ని, ప్రజల జీవనాన్ని అధోగతిలోకి నెడుతున్న మతతత్వ దుర్మార్గాన్ని వ్యతిరేకించడం ప్రస్తుతం అవసరం. నాడు అత్యవసర పరిస్థితిలో సుందరయ్య కూడా కాంగ్రెస్ నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా జనతాపార్టీతో కలిసి వ్యవహరించడం తప్పు అనలేదు. అలా సాగిస్తూనే, ఉమ్మడి ఎన్నికల కార్యక్రమాలు, ఉపన్యాస వేదికలు పనికిరావని ఆయన హెచ్చరించారు. నేటి పరిస్థితిలో అదే వైఖరి సరైనదవుతుంది. వామపక్ష నాయకత్వాన ఇలాంటి ప్రయత్నం సాగాలి. ఈ సందర్భంలో ఎన్నో రాజకీయ పార్టీలను, ఉద్యమ సంస్థలను, నేతలను కలుపుకురావాలి. అందుకు ఎంతో సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. తొలి పార్లమెంటులో నెహ్రూ ప్రధాని కాగా, సుందరయ్య ప్రధాన ప్రతిపక్ష నేత. నేడు పార్లమెంటులో పార్టీ స్థాయి ఎలా ఉంది? నేడు ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ కానీ, సీపీఎం కానీ ఒక్క స్థానాన్ని అయినా పొందగల స్థితి ఉన్నవా? అని కొందరు కమ్యూనిస్టులకు, సానుకూల తటస్థులైన మేధావులకూ సందేహాలుండే అవకాశం ఉంది. ఇలా పార్టీల క్షీణ స్థితిని గుర్తుచేసి జాగ్రత్తపడాలని హెచ్చరిస్తే అలాంటి వారిని బీజేపీ మేధావుల సరసన చేర్చి వ్యవహరించే వారిపట్ల కమ్యూనిస్టులు సైతం అప్రమత్తతతో ఉండాలి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వంటి విప్లవాత్మకత కూడా ఈ పార్టీల నుంచి ఆశించే భౌతిక, స్వీయాత్మక స్థితీ నేడు లేదు. కొన్ని పొరపాట్లు జరగకుండా ఉండి ఉంటే కమ్యూనిస్టుల స్థితి మరింత ఆశాజనకంగా ఉండేదన్న సదుద్దేశంతో విమర్శించినంత మాత్రాన వారందరినీ శత్రుశిబిరంలో కలపటం భావ్యం కాదు. పైగా కమ్యూనిస్టులదే అంతిమ విజయం అనే భావనను సమర్థించకపోవడమే అలాంటి మేధావులు, ప్రజాస్వామ్యవాదుల తీవ్ర తప్పిదమన్నట్లుగా హద్దులు దాటిన విమర్శనాస్త్రాలతో వ్యంగ్యంగా అపహాస్యం చేయబూనడం కమ్యూనిస్టు పార్టీల లక్ష్యాలను, వారి ఓర్పు నేర్పులను బూడిదలో పోసిన పన్నీరు చేస్తాయి. కమ్యూనిస్టులు తమను తాము ఒంటరి చేసుకునే అలాంటి తుంటరి పనులకు, రచనలకు, దూరంగా ఉండి ఆ మహత్తర కర్తవ్యంలో వీలైనంత మంది ప్రజానీకాన్ని రాసిరీత్యా, వాసి రీత్యా కూడా తమ మిత్రులుగా నిలబెట్టుకునే కృషి చేయడం చాలా అవసరం! - డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 98480 69720 -
బహుజనులంతా ఐక్యం కావాలి
హైదరాబాద్: బుద్ధుడు, జ్యోతిరావుçఫూలే, డా.బీఆర్.అంబేడ్కర్, సావిత్రిబాయిఫూలే స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య పిలుపునిచ్చారు. బహుజన ప్రతిఘటన వేదిక(బీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం ఎల్బీనగర్లో హలో బహుజన ఛలో హైదరాబాద్ సదస్సును డా.సూరేపల్లి సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంచ ఐలయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద బహుజన మహిళలపై మతోన్మాద దాడులను తిప్పి కొట్టేందుకు బహుజనులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను పట్టించుకోవడం లేదని, బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా ఒక్క తాటిపై ఉండి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు ఎఫ్.గోపీనా«థ్, డా.జయధీర్ తిరుమలరావు, లక్ష్మీనారాయణ, వై.రత్నం, జిలుకర శ్రీనివాస్, బండారు లక్ష్మయ్య, ఎంఎం.రెహమన్, శంకర్, బత్తుల వెంకన్న, బైరి నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కసి ఉంటేనే రాణించగలం
సాక్షి, నిజామాబాద్: కసి, పట్టుదల, శ్రమ ఉంటేనే క్రీడల్లో రాణించగలరని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ జి.వివేక్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో వారం రోజులుగా జరుగుతున్న వెంకటస్వామి స్మారక క్రికెట్ టోర్నీ గురువారం ముగిసింది. టోర్నీ విజేతగా మేడ్చల్ జట్టు నిలవగా, నిజామాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం వివేక్ మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తితో ఆడితేనే విజయాలు సొంతమవుతాయన్నారు. ప్రస్తుతం క్రికెట్‌కు ఉన్న ఆదరణ మరే క్రీడకు లేదని, క్రికెట్లో రాణించాలంటే కసి, పట్టుదల, శ్రమ అవసరమని చెప్పారు. పోటీ ఎంత ఎక్కువగా ఉన్నా క్రీడాకారుల క్రమశిక్షణే వారిని ఉన్నత శి«ఖారాల్లో నిలబెడుతుందన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా మాట్లాడుతూ.. ఇష్టంతో ఆడితే ఏదైనా సాధించవచ్చన్నారు. నిజామాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రసేన్‌రెడ్డి, కార్యదర్శి వెంకట్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, జాయింట్ కార్యదర్శి సురేష్‌బాబు, ఫయ్యుమ్, రఫీ, తదితరులు పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్ గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇరుజట్లు హోరాహోరీగా తలపడడంతో చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. మొదట బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. సత్యయాకీ 30 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మేడ్చల్ జట్టు 19.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. -
అభినవ ఆధ్యాత్మిక తపశ్చక్రవర్తి
పతనావస్థలో ఉన్న భారతీయ సనాతన ధర్మాన్ని పరిరక్షించి ప్రజలందరినీ ఒక్క తాటిమీద నడిపించగల శక్తి ఒక్క అద్వైత మతానికే ఉందనీ, దాంతోనూ ఐక్యతను సాధించవచ్చనీ, అందుకు తన శిష్యులను కూడా సమాయత్తం చేయాలనీ సంకల్పించారు శంకర భగవత్పాదులు. అందులో భాగంగా భారతదేశం నలుమూలలా నాలుగు పరమ పీఠాలను స్థాపించారు. వాటిలో ఒకటి కర్ణాటక రాష్ట్రం చిక్మగళూర్ జిల్లాలోని శ్రీశృంగేరీ శారదాపీఠం. ఈ పీఠానికి మొట్టమొదటి అధిపతి శ్రీశ్రీశ్రీ సురేశ్వరాచార్య. కాగా శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి 36వ (పస్తుత) అధిపతి. ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామివారు. భారతీతీర్థులకు ముందు శ్రీమదభినవ విద్యాతీర్థుల వారు అధిపతిగా ఉన్నారు. నేడు వారి జయంతి. ఈ సందర్భంగా వారి గురించి స్మరించుకుందాం... శ్రీ శృంగేరి జగద్గురు పీఠాన్ని అలంకరించిన శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామివారు పూర్వపీఠాధిపతుల తేజశ్శక్తులను సంగ్రహించి, సంప్రదాయ సిద్ధంగా మత వ్యాఖ్యానం చేస్తూ, అన్ని తరగతుల వారితోనూ, అన్ని రకాలైన శిష్యులతోనూ, సత్యసాధకులతోనూ, సత్యశోధకులతోనూ సన్నిహితంగా మెలిగారు. ఆదిశంకరుల తర్వాత కాలినడకన మూడుమార్లు భారతదేశమంతటా పర్యటించారు. తమ అనుగ్రహ భాషణంతో, ఆశీర్వచన బలంతో ఛిన్నాభిన్నమైన అనేక జాతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక శక్తులను పోగు చేసి, దేశాన్ని ఏకం చేశారు. బెంగళూరుకు చెందిన కైపు రామశాస్త్రి, వెంకటలక్ష్మి పుణ్యదంపతులకు పింగళ నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు అనగా 1917 సంవత్సరంలో జన్మించిన శ్రీనివాస శాస్త్రి, అసాధారణ ధారణ శక్తితో, అనన్య సామాన్యమైన శాస్త్రజ్ఞానంతో గురువనుగ్రహంతో ప్రతిష్ఠాత్మకమైన శృంగేరీ పీఠానికి 35వ జగద్గురువు స్థానాన్ని అలంకరించి, ఆ స్థానానికే వన్నె తెచ్చిన మహనీయులు. దక్షిణ భారతదేశమంతటా అనేకమార్లు సంచరించి, అనేక స్థలాలలో పలు ధర్మకార్యాలను జరిపించారు. విద్వత్సభలను ఏర్పాటు చేశారు. శ్రీ శంకర భగవత్పాదులపై భక్తిని కలిగించేందుకు ‘అఖిల భారత శంకర సేవాసమితి’ అనే సంస్థను స్థాపించారు. శ్రీ శృంగేరీ శంకర మఠ శాఖలను నెలకొల్పారు. హైదరాబాద్‌లోని నల్లకుంటలోగల శ్రీ శృంగేరి శారదాపీఠం నిత్యనామార్చనలతో, సుప్రభాత సేవలతో, కుంకుమపూజలతో భక్తుల నీరాజనాలందుకుంటూ కొంగుబంగారంగా విలసిల్లుతున్న ఆ చల్లని తల్లి శ్రీశారదాంబ విగ్రహ ప్రతిష్ఠాపన 1960లో శృంగేరీ పీఠాధిపతి పరమగురు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థమహాస్వామి దివ్యహస్తాల మీదుగా జరగడం భాగ్యనగర వాసుల భాగ్యంగా చెప్పుకోవచ్చు. -
అభివృద్ధికి ఐక్య మంత్రం
మేమంతా ఒకే టీం – అధికారులు, ఉద్యోగులతో కలిసి జిల్లా ప్రగతికి కృషి – నా వద్దకు వస్తే సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకాన్ని కలిగిస్తా – తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి – దీర్ఘకాలంలో విద్య, వైద్యం, పారిశ్రామికీకరణపై దృష్టి – క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యం – ప్రాథమికరంగ మిషన్‌పై మంగళవారం సమావేశం – ‘సాక్షి’తో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘ నేను, జిల్లా అధికారులు, ఉద్యోగులు వేరు వేరు కాదు. మేమంతా ఒక టీం. మేమందరం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం. నేను అనే భావన నా వద్ద ఉండదు. మనం అనే భావనతోనే పనిచేస్తాం. టీం స్పిరిట్‌తో పనిచేసి జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకెళ్లాం’’ అని జిల్లా నూతన కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఆయన సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యత ఇస్తానని, దగ్గరకు వెళ్లి వాస్తవ పరిస్థితిని గమనించకుండా సమస్యలను పరిష్కరించడం కూడా సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ వద్దకు వెళ్లి సమస్య చెప్పుకుంటే పరిష్కారమవుతుందనే నమ్మకాన్ని కలిగించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తక్షణం తాగునీటి సమస్యను పరిష్కరించాల్సి ఉందని గుర్తించానని, దీర్ఘకాలంలో విద్య, వైద్యం, పారిశ్రామికీకరణపై దృష్టి సారిస్తానని వివరించారు. ప్రాథమికరంగ మిషన్‌పై వ్యవసాయ, అనుబంధరంగాల అధికారులతో మంగళవారం సమావేశం కావాలని నిర్ణయించినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న 24 గంటల తర్వాత సాక్షి ప్రతినిధితో సత్యనారాయణ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.... నేను కిందిస్థాయి వర్కర్‌ను..! మొదట్లో నాకు కేంద్ర సర్వీసు...ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు (ఐఐఎస్)లో ఉద్యోగం వచ్చింది. అయితే, నాకు మన రాష్ట్రంతో ఉన్న అనుబంధంతో ఆ సర్వీసులో ఎక్కువకాలం పనిచేయలేదు. గ్రూప్స్ రాసి ఇక్కడ ఆర్డీవోగా 1996లో ఉద్యోగం ప్రారంభించాను. నేను ఇప్పటివరకు కిందిస్థాయిలోనే అంటే క్షేత్రస్థాయిలోనే ఎక్కువ పనిచేశాను. జెడ్పీ సీఈవోగా, ఐటీడీవో పీవోగా, ఆర్డీవోగా, డ్వామా పీడీగా.... ఇలా కిందిస్థాయి సమస్యలను నేరుగా తెలుసుకునే వీలు ఉండే పోస్టుల్లోనే పనిచేశాను. దీంతో వాస్తవ పరిస్థితులపై అవగాహన వచ్చేందుకు ఎక్కువ దోహదపడింది. హెడ్ ఆఫీసు పోస్టింగుల్లో నేను ఇప్పటివరకు పనిచేయలేదు. ప్రజల మధ్యనే ఇప్పటివరకు పనిచేశాను. ఫలితంగా నాకు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఎక్కువ అవకాశం దొరికింది. దీనిని ఇప్పుడు అవకాశంగా మలుచుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. ఇవీ నా ప్రాధాన్యతలు..! తక్షణ ప్రాధాన్యత అంశంగా తాగునీటి సమస్యను గుర్తించాను. ఇందుకోసం అవసరమైన చర్యలను ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తాను. వీటితో పాటు పంట కుంటలు, నీరు–చెట్టు, మొక్కల పంపిణీ తదితరాలను తక్షణం చేపట్టాల్సిన ప్రాధాన్యతలుగా గుర్తించాను. దీర్ఘకాలంలో విద్య, వైద్యం, పారిశ్రామికీకరణతో పాటు ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగామ్స్‌ను ముందుకు తీసుకెళతాను. ప్రధానంగా విమానాశ్రయం ఏర్పాటు, సోలార్ పార్కు, ఐఐఐటీ, ఉర్దూ యూనివర్సిటీ తదితర అంశాల్లో ఇంకా ఉన్న సమస్యలను పరిష్కరించి వాటిని ప్రారంభించేదుకు ప్రయత్నిస్తాను. భూమి రికార్డుల విషయంలో అటు అనంతపురం, ఇటు తూర్పుగోదావరి జిల్లాలో నా హాయంలోనే కొత్త పథకాలు ముందుకు తీసుకొచ్చాం. ఆ తర్వాత మిగతా జిల్లాలో వీటిని అమలు చేశారు. జిల్లాలో పర్స్పెక్టివ్ అవసరం. ఇక్కడే చదివిన విద్యార్థిగా నాకు జిల్లాపై ఒక అవగాహన ఉంది. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తాను. కొత్త పంథా...! జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే తన మార్క్ పరిపాలనను సత్యనారాయణ మొదలుపెట్టారు. కలెక్టర్ కుర్చీలో ఎక్కువ సమయం కూర్చోకుండా వెంటనే సమావేశ మందిరంలో జిల్లా అధికారులను పేరు పేరునా పరిచయం చేసుకున్నారు. కేవలం పరిచయాలతో సరిపెట్టకుండా ఆయా రంగాల్లో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించేందుకు ఆయా అధికారులతోనే బ్రీఫింగ్ ఇప్పించుకున్నారు. అక్కడికక్కడే ఆయా శాఖలల్లో ఉన్న సమస్యలను నోట్ చేసుకున్నారు. గడిచిన 24 గంటల్లోనే జిల్లా మీద ఒక అవగాహనకు వచ్చేందుకు కేవలం జిల్లా అధికారులతోనే కాకుండా నేరుగా మండలస్థాయి అధికారులైన ఎంపీడీవోలతోనే ఆయన ఫోన్లోనే మాట్లాడారు. అంతేకాకుండా పరిపాలనలో మూడు కోణాలు ఉంటాయని.... కిందిస్థాయి వారు చేసేవి అన్నీ తప్పు అనే ధోరణి, నాకు చేతకాదు అనే ధోరణి, నేను చేయగలను...మీరు చేయగలరనే మూడో రకం ధోరణి. నా పరిపాలన ధోరణి మూడోరకమని గడిచిన 24 గంటల్లోనే ఆయన స్పష్టంగా తేల్చిచెప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఐక్యతతో
► ఒకే వేదిక మీద ప్రత్యక్షం ► కాంగ్రెస్‌లో ఆనందం ► కుష్భు, నగ్మాల ప్రత్యేక ఆకర్షణ ► రాహుల్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన ► ఇక, రాష్ట్ర పర్యటనలో తిరునావుక్కరసర్ రాష్ట్ర కాంగ్రెస్‌లో ఐక్యత రాగాలు వెల్లి విరిశాయి. ఒకే వేదిక మీద గ్రూపు నేతలందరూ ప్రత్యక్షం కావడం కాంగ్రెస్ వర్గాలకు ఆనందమే. ఇక, నగ్మా, కుష్భు ప్రత్యేక ఆకర్షణగా వేదిక మీద కన్పించడంతో ఉత్సాహం పెరిగింది. రాహుల్ అరెస్టును వ్యతిరేకిస్తూ శుక్రవారం చెన్నైలో సాగిన నిరసనలో ఐక్యత అంటే తమదే.. అనుమానాలు ఉంటే, నివృతి చేసుకోండంటూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించడం కేడర్‌లో జోష్‌ను నింపింది. సాక్షి, చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్‌లోని గ్రూపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధ్యక్ష పగ్గాలు ఎవరు చేపట్టినా, ఈ గ్రూపులతో సతమతం కావాల్సిందే. ఇటీవల తిరునావుక్కరసర్ అధ్యక్ష పగ్గాలు చేపట్టినానంతరం అందర్నీ ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. తిరుచ్చి వేదికగా గత నెల జరిగిన కావేరి దీక్షలో కొంత మేరకు నేతల్ని ఏకం చేయడంలో సఫలీకృతులయ్యారు. మరి కొందరు దూరంగా ఉండడంతో, వారిని కూడా తాజాగా, ఏకం చేసి ఐక్యత అంటే, తమదే అన్న ధీమాను తిరునావుక్కరసర్ వ్యక్తం చేయడం విశేషం. కావేరి దీక్షకు దూరంగా ఉన్న నేతలు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ విషయానికి వచ్చే కొద్ది ఏకం కావడం ఆలోచించాల్సిందే. కాగా, మహిళా నేతలు కుష్భు, నగ్మా సైతం ఇన్నాళ్లు అంటి ముట్టనట్టుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దర్నీ కూడా ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో తిరునావుక్కరసర్ సఫలీకృతులయ్యారు. ఐక్యత రాగం : రాహుల్‌గాంధీని అరెస్టు చేసి, ఢిల్లీ పోలీసులు ముప్పుతిప్పలు పెట్టడాన్ని ఖండిస్తూ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం వళ్లువర్‌కోట్టం వేదికగా నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, మాజీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్, తంగబాలు, కృష్ణస్వామి, కుమరి ఆనందన్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంలతో పాటు పార్టీఅధికార ప్రతినిధి కుష్భు, మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా ప్రత్యక్షం అయ్యారు. నగ్మా, కుష్భు పక్క పక్కనే కూర్చుని ముచ్చటించుకోవడం కన్పించడం ఆ నిరసనలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. మోదీపై సెటైర్లు : తిరునావుక్కరసర్ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీని గురి పెట్టి తీవ్రంగా విరుచుకు పడ్డారు. రాహుల్‌ను అడ్డుకునేందుకు తీవ్ర కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, కాంగ్రెస్‌లో ఐక్యత అంటే ఇదే...అనుమానాలు ఉంటే, నివృతి చేసుకోండంటూ వ్యాఖ్యానించారు. ఈవీకేఎస్ ఇళంగోవన్ ప్రసంగిస్తూ, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన మోదీకి అక్కడి బుద్దులు వంట బట్టినట్టుందని మండిపడ్డారు. సర్వాధికారిగా పెత్తనం చెలారుుంచేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌తో చెలాగాటాలు ఆడిన వాళ్ల పరిస్థితి ఏమిటో ఓ మారు గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలికారు. దేశాన్ని ఏలేందుకు అన్ని అర్హతలు రాహుల్‌కు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కుష్భు, నగ్మా ప్రసంగిస్తూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా స్పందించారు. ప్రజల మీద చిత్తశుద్ధిలేదని, విదేశాలను చుట్టి రావడం మీదే ప్రధాని దృష్టి అంతా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర పర్యటన : ఈ నిరసనానంతరం తిరునావుక్కరసర్, నగ్మా సత్యమూర్తి భవన్లో మీడియాతో మాట్లాడారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా తనతో పాటు అందరూ నాయకులు రాష్ట్రంలో పర్యటించనున్నట్టు ప్రకటించారు. ఉప ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ స్థానిక నేతలు ప్రచారంలో దూసుకెళుతున్నట్టు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ముందుగానే, అందరు నేతల సమన్వయంతో రాష్ట్ర పర్యటన సాగుతుందని వివరించారు. కోయంబత్తూరు, తిరునల్వేలి, తంజావూరు, తిరువణ్ణామలై, చెన్నై, మదురై డివిజన్లలో ఆయా ప్రాంతాల్ని కలుపుతూ పార్టీ వర్గాలతో సమీక్షలు, సమావేశాలు, సంప్రదింపులు సాగుతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సివిల్ చట్టానికి మద్దతుగా కుష్బు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్ని ఇరకాటంలో పడేస్తుండడం గమనార్హం. నేతల మధ్య ఐక్యత కుదిరినా, ఈ మద్దతు వ్యవహారం చర్చకు వచ్చినట్టు సంకేతాలు ఉన్నారుు. అదే సమయంలో కుష్భుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాల్లో స్పందించే వాళ్లూ పెరిగారు. -
అదంతా పటేల్ కృషి వల్లే: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు కేంద్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 114వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలోని ధ్యాన్‌చంద్ స్టేడియంలో జెండా ఊపి ‘రన్ ఫర్ యూనిటీ’ మారదాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... ఏక్ భారత్ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే సాధ్యమైందని, దేశ ప్రజలందరినీ ఒకే తిరంగా జెండా కింద ఉంచడానికి పటేల్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. దేశం బలోపేతం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, అయితే అది సాధ్యం కావాలంటే అందరూ ఐక్యమత్యంగా ఉండాలని మోదీ అన్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి పటేల్ చేసిన కృషి శ్లాఘనీయమని, దానిని ఎప్పటికీ మరచిపోరాదని మోదీ అన్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం ప్రతిజ్ఞ చేయించిన ప్రధాని, దేశ సమగ్రత, ఐక్యతను కాపాడటానికి మరింత శ్రమించాలని పిలుపునిచ్చారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ డిజిటల్ మ్యూజియమును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. కాగా అంతకు ముందు ప్రధాని మోదీ... మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. -
సమష్టి కృషితోనే గెలుపు సాధ్యం
పట్నంబజారు: సమష్టి కృషితోనే కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు సాధ్యమని తూర్పు నియోజవకర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. టీడీపీ దుర్మార్గాలకు ఎదురొడ్డి వైఎస్సార్ సీపీ జెండాను భుజాన వేసుకున్న వారికే ప్రాధాన్యముంటుందని స్పష్టం చేశారు. అరండల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాయలంలో సోమవారం నగర ముఖ్య నేతలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధికార పార్టీ నేతల ఎత్తులను చిత్తు చిత్తు చేయాలన్నారు. బూత్ కమిటీ నుంచి డివిజన్ వరకు అన్ని విభాగాలు పూర్తి చేయాలని సూచించారు. కార్పొరేషన్‌పై వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడేందుకు కృషిచేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము), లక్కాకుల థామస్‌నాయుడు, ఎండీ నసీర్‌అహ్మద్, ఈచంపాటి వెంకటMýృష్ణ (ఆచారి), పార్టీ నేత కిలారి రోశయ్య మాట్లాడుతూ ఎన్నికలంటే భయంపుట్టే ఓట్లు తొలగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు పోలూరి వెంకటరెడ్డి, అత్తోట జోసఫ్, అంగడి శ్రీనివాసరావు, మామిడి రాము, శిఖా బెనర్జీ, మాలె దేవరాజు, దేవానంద్, మండేపూడి పురుషోత్తం, మేడా సాంబశివరావు, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, గనిక ఝాన్సీరాణి, నిమ్మరాజు శారదాలక్ష్మి, ఆరుబండ్ల కొండారెడ్డి, జగన్‌కోటి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేరువ నర్సిరెడ్డి, దాసరి కిరణ్, పల్లపు శివ, షేక్ జానీ, సుంకర రామాంజనేయులు, సోమికమల్, తోట మణికంఠ, దుగ్గెంపూడి యోగేశ్వరరెడ్డి, నరాలశెట్టి అర్జున్, అన్ని డివిజన్ల అధ్యక్షులు, పార్టీ ముఖ్యనేతలు పాల్గోన్నారు. -
సమష్టిగా ఆడి విజేతగా నిలవాలి
– వాలీబాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్ మహబూబ్‌నగర్ క్రీడలు : రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీలో సమష్టిగా ఆడి విజేతగా నిలవాలని వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అ««దl్యక్షుడు శాంతికుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలుర కళాశాలలో స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 వాలీబాల్ జిల్లా బాల, బాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను శాంతికుమార్ ప్రారంభించి మాట్లాడారు. ఓడిపోతే నిరాశ చెందకుండా మళ్లీ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. జిల్లాలో ప్రతిభ కనబరుస్తున్న వాలీబాల్ క్రీడాకారులకు అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అండర్–19 ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రాంచందర్, పీడీ పాపిరెడ్డి, రిటైర్డ్ పీడీ చెన్నవీరయ్య తదితరులు పాల్గొన్నారు. అండర్–19 బాలుర జట్టు : వెంకటేశ్, రాజేశ్, రమేశ్, ఆకాశ్ (మహబూబ్‌నగర్), రాజేందర్, గులాంమహ్మద్ (నారాయణపేట), రియాజ్ (మద్దూర్), శ్రీకాంత్, శ్రీశైలం (కడ్తాల్), కృష్ణయ్య (కోస్గి), రఘు (ఆత్మకూర్), పవన్‌కుమార్ (ఖిల్లాఘనపురం). బాలికలు : నీలమ్మ, దీప, రజిత (కల్వకుర్తి), అమృత, అనిత (కోయిలకొండ), మహేశ్వరి, నందిని, పద్మ, శాంతి (మహబూబ్‌నగర్). -
ఊరంతా.. ఒకే గణపతి
కన్నారం (భీమదేవరపల్లి, కరీంనగర్) : గణపతి నవరాత్రోత్సవాలు వచ్చాయంటే చాలు.. గ్రామాల్లో ప్రతి కాలనీలో.. వీధిలో గణపతివిగ్రహాలను పోటీపడిమరీ నెలకొల్పుతుంటారు. ఇది ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తున్న ఆచారం. కానీ.. భీమదేవరపల్లి మండలంలోని కన్నారంలో మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. ఆ ఊరంతా కలిసి ఒకే విగ్రహాన్ని నెలకొల్పి ఐకమత్యాన్ని చాటుతున్నారు. గతేడాది 10 వినాయక విగ్రహాలను నెలకొల్పిన ప్రజలు.. ఈసారి మాత్రం సర్పంచ్ కటుకం సదానందం, ఎంపీటీసీ మల్లం నర్సింహులు నవరాత్రికి ముందే.. (15 రోజుల క్రితం) సమావేశమై గ్రామంలో ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. తద్వారా ప్రతిష్ఠాపన, నిమజ్జన ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవచ్చని, గ్రామంలో ఐక్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీనికి గ్రామస్తులంతా అంగీకరించారు. అదే గ్రామానికి చెందిన సురేందర్‌రెడ్డి విగ్రహాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. పొన్నాల సమ్మయ్య అధ్యక్షతన 25మందితో ఉత్సవ కమిటీని నియమించి వినాయకుడిని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ప్రతిష్ఠించారు. ఇప్పుడా వినాయకుడి వద్ద ప్రతిరోజూ పండుగ వాతావరణమే కనిపిస్తోంది. ప్రతిరోజు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అన్నదానాలు చేస్తున్నారు. ఇందులో ఊరుఊరంతా భాగస్వామ్యం అవుతోంది. ఈనెల 14న వినాయకుడిని నిమజ్జనం చేస్తామని ఉత్సవ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. కలిసికట్టుగా నిర్ణయం గ్రామంలో ఏటా పదికిపైనే వినాయక విగ్రహాలను ప్రతిష్టించేవారు. ఈ ఏడాది అందరం కలిసికట్టుగా ఒకే విగ్రహా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. గ్రామస్తులందరూ సహకరించారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే ఒరవడిని కొనసాగిస్తాం. – కటుకం సదానందం సర్పంచ్ -
సమష్టి కృషితోనే విజయం
కలెక్టర్ కాంతిలాల్ దండే గుంటూరు వెస్ట్ : సమష్టి కృషితోనే విజయాలు సాధ్యమని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడం అభినందనీయమని ఆయన చెప్పారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి మరిన్ని లక్ష్యాలు సాధించాలని కోరారు. జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించిన సిబ్బందికి విజయోత్సవ అభినందన సభ స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం నిర్వహించారు. కలెక్టర్ కాంతిలాల్ మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసి యాత్రికులకు అవసరమైన అన్ని సౌకర్యాలూ కల్పించినట్లు చెప్పారు. పారిశుధ్య నిర్వహణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసిన పంచాయతీశాఖ పనితీరును కొనియాడారు. మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాలను సాధించాలి.. అక్టోబర్ 2వ తేదీ నాటికి జిల్లాలోని 462 గ్రామాల్లో 25 వేల మరుగుదొడ్లు నిర్మించాలని కలెక్టర్ కోరారు. ఆయా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం పుష్కర విధులు నిర్వహించిన ఈఓపీఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. తొలుత ఇటీవల మృతిచెందిన కొల్లూరు ఈవోపీఆర్డీ మల్లీశ్వరి మృతికి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీపీఓ కె.శ్రీదేవి, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్లు్యఎస్ ఎస్ఈ పి.భానువీరప్రసాద్, డీఆర్డీఏ పీడీ షేక్ హబీబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
దళితులు సంఘటితం కావాలి
ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫెడరేషన్ ర్యాలీలో నాయకుల పిలుపు విజయవాడ(గాంధీనగర్): బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని పలు దళిత సంఘాల నేతలు ధ్వజమెత్తారు. బీజేపీ అనుబంధ సంఘాలు ప్రభుత్వ అండతో పేట్రేగిపోతున్నాయన్నారు. శనివారం ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో మహా ర్యాలీ, ధర్నా నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ పాత గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఏలూరు లాకులు, న్యూఇండియా హోటల్æసెంటర్, లెనిన్ సెంటర్ మీదుగా ధర్నా చౌక్ వరకు కొనసాగింది. అనంతరం బహిరంగ సభలో ఫెడరేషన్ జాతీయ కన్వీనర్ కందుల ఆనందరావు మాట్లాడుతూ రోహిత్ కేసులో నిందితుల్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదన్నారు. గోవుల చర్మం వలిస్తే నేరంగా పరిగణించడం తగదన్నారు.. దళితులంతా ఒక్క రోజు పనిమానేస్తే మోడీ స్వచ్ఛభారత్ అడ్రస్ ఉండదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి విల్సన్ మాట్లాడుతూ దళితుల్లో ఇంకా చైతన్యం రావాలన్నారు. సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు దోనేపూడి శంకర్, కాశీనాథ్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక రచయితలు, సాహితీవేత్తలు, మేధావులు సైతం హత్యలకు గురవుతున్నారన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మణిసింగ్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సువర్ణలత, డీబీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని రమేష్, మట్టా ఝాన్సీ, బుట్టి రాయప్ప, కేవీపీఎస్ నాయకులు నటరాజ్, పీ రాజేష్, కొండలరావు, కే సంజీవరావు, దిలీప్‌కుమార్ పాల్గొన్నారు. -
దేశ సమగ్రతకు ఉపాధ్యాయులు నడుం బిగించాలి
ఖమ్మం: దేశ సమగ్రతకు ఉపాధ్యాయులు నడుం బిగించాలని ఇంటర్‌బోర్డు మాజీ కన్వీనర్ కర్నాటి రాంమోహన్‌రావు అన్నారు. టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం విజయ్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలితరం నాయకత్వం వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తే.. ఈ తరం యువత వ్యక్తి శ్రేయోవాదం వైపు పయనిస్తోందన్నారు. దేశానికి కొత్త నాయకత్వం కావాలని, నేడు దేశంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. విద్య మనచేతిలో లేకపోవడం వల్లనే విలువలు పడిపోతున్నాయన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.మనోహర్‌రాజు మాట్లాడుతూ నేడు విద్యారంగంలో అనేక అసమానతలు ఉన్నాయన్నారు. కొఠారి కమిషన్ నివేదికను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ నాగిరెడ్డి, రవికుమార్, రామారావు, సంగమేశ్వరరావు, నర్సింహారావు, లక్ష్మీనారాయణ, ఎ.వి.నాగేశ్వరరావు, కె.వెంకటేశ్వర్లు, మహేష్, వీరబాబు, యోగానందం తదితరులు పాల్గొన్నారు. -
సమగ్రతతో చెలగాటమా?
సీమాంతర ఉగ్రవాదం ద్వారా జమ్మూ కశ్మీర్లో కల్లోల పరిస్థితిని శత్రు దేశం రెచ్చగొడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి బాసటగా నిలిచే బదులు.. దేశ భద్రత, సమగ్రతకు భంగం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించటం మన దేశ ప్రజలపట్ల అన్యాయానికి పాల్పడటం తప్ప మరేమీ కాదు. మావోయిస్టులు, మతోన్మాదులు, మతతత్వవాదులు వంటి విచ్ఛిన్నకర శక్తులతో చేతులు కలుపుతూనే దేశ సమైక్యత గురించి ప్రవచనాలు వల్లించడం, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేయడం కాంగ్రెస్ లాంటి కుత్సిత రాజకీయ శక్తులకే చెల్లుతుంది. కశ్మీర్ మంటల్లో చలి కాచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించడం దురదృష్టకరం. ఈ దేశంలో ఏమి జరుగుతున్నది? కశ్మీర్ సమస్య పరిష్కారం, ఉగ్రవాద నిర్మూలనపై సంఘటితంగా దేశం యావత్తూ కృషి చేయాల్సిన తరుణంలో మన ప్రతిపక్షాలలో కొన్ని పార్టీలకు మాత్రం కేవలం రాజకీయాలే పరమావ ధిగా కనిపిస్తున్నాయి. దేశ సమగ్రత, సమైక్యత, అంతర్గత భద్రతలపై, విదే శాల్లో మన పరువు ప్రతిష్టలపై ఈ పార్టీ లకు ఏ మాత్రం పట్టింపులేనట్లు కనిపి స్తోంది. కశ్మీర్‌పై అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి, రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కబడడానికి ప్రధాని సహకారం కోరితే కొందరు వీధికెక్కి దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నారు. కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితికి కేంద్రంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలా లేక 50 ఏళ్లకుపైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలా? కశ్మీర్లో ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హన్ ముజఫర్ వాని ఎన్కౌంటర్లో మరణిస్తే, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించి లోయలో అల్లకల్లోలాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తే ఎవర్ని తప్పుపట్టాలి? ఈ దేశంలో ఐదు దశాబ్దాలుగా విచ్ఛిన్నకర రాజకీయాల్ని అవలంబిస్తూ ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ లోయలో చిచ్చు రేపింది ఎవరు? దేశంలో మతతత్వం, కులం, ప్రాంతం ఆధారంగా అనేక వర్గాలను చీలుస్తూ తమ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇంకెంత కాలం అవే నికృష్ట కార్యాలకు పాల్పడుతుంది? దేశ విభజనకు కార ణమైన ముస్లింలీగ్‌ను కేంద్ర కేబినెట్లో చేర్చుకున్న ఘనత కాంగ్రెస్‌దే. ఎంఐఎం వంటి మతోన్మాద శక్తులతో పొత్తు కుదుర్చుకుని, హైదరాబాద్ మేయర్ స్థానాన్ని కట్టబెట్టి ఆ పార్టీకి విశ్వసనీయత కల్పించిన పాపం కాంగ్రెస్‌దే. జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, సిమి, అల్ ఉమ్మా వంటి సంస్థ లతో ఒకప్పుడు చేతులు కలిపి వారిపట్ల సానుభూతితో వ్యవహరించిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. ఎవరు కాదనగలరు? వేర్పాటువాదానికి స్నేహ హస్తం ఈ దేశంలో తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వేర్పాటువాదాన్ని, విచ్ఛిన్నకరతత్వాన్ని కాంగ్రెస్ ప్రోత్సహించింది. భింద్రన్‌వాలేను ఒక గొప్ప సాధువుగా అభివర్ణించి, చివరకు అతడిని వధించేందుకు స్వర్ణ దేవాలయానికి సైన్యాన్ని పంపింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ తర్వాత 1984లో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 3,400 మంది సిక్కుల ఊచకోతకు కారణమైంది కూడా కాంగ్రెస్ సర్కారే. ‘ఒక మహావృక్షం కూలితే భూమి కంపిస్తుంది’.. అని ఈ ఊచకోత అనంతరం వ్యాఖ్యానించింది దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ కాదా? చరిత్ర అబద్ధాలు చెప్పదు. శ్రీలంకలో ఎల్టీటీఈని ఎవరు ప్రోత్సహించారు? వారికి ఆయుధాలు, శిక్షణను అందించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. శ్రీలంకలో వేయిమంది మన సైనికులు తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించడానికి కారణం కాంగ్రెస్ సర్కార్ అవలంబించిన తప్పుడు విధానాల వల్లే కదా? ఒకరికి శిక్షణ, ఆయుధాలనిచ్చి, వారిపై మన సైనికులను ఉసిగొల్పి మరణిం చేందుకు కారణమైన కాంగ్రెస్ సర్కార్ చేతులకు అంటిన నెత్తురు ఎంత కడు క్కున్నా పోతుందా? కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, వర్గాన్ని, ఆఖరుకు దేశ విద్రోహులను కూడా తమ కుత్సిత రాజకీయాలకు ఉపయోగించుకుని జాతి ప్రయోజనా లను దెబ్బతీస్తున్న కాంగ్రెస్ పార్టీకి జాతీయవాద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీని విమర్శించే హక్కు ఉందా? సుదీర్ఘకాలం దేశాన్ని పాలించి సర్వనాశనం చేసిన కాంగ్రెస్‌కు బీజేపీ సిద్ధాంతాలను విమర్శించే నైతిక అర్హత ఏ మాత్రం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఆడిన దుర్మార్గ రాజకీయాలే దేశాన్ని ఈ పరిస్థితికి దిగజార్చినట్లు చరిత్రను అధ్యయనం చేసిన వారెవరికైనా అర్థం అవుతుంది. సుదీర్ఘ కాలంగా పరిపాలన చేసిన పార్టీల బుజ్జగింపు రాజకీయాలు మెజారిటీ, మైనారిటీ ప్రజలపట్ల అగాథాన్ని పెంచాయి. కాంగ్రెస్ ఎన్నో ఏళ్లుగా చేసిన తప్పుడు రాజకీయాలే నేడు కశ్మీర్ సమస్యను సంక్లిష్టంగా మార్చాయి. ఆద్యంతం అవకాశవాదం దేశ సమైక్యత, సమగ్రతపట్ల కాంగ్రెస్ అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పార్టీ మరొకటి లేదు. కేంద్రంలో కీలకమైన పదవులు అనుభవించిన ఆ పార్టీ నేతలు చేస్తున్న పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. బెలూచిస్తాన్, ఆక్రమిత కశ్మీర్‌పై అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి చేసిన ప్రకటనలను ఒక కాంగ్రెస్ అధికార ప్రతినిధి సమర్థిస్తే మరో కాంగ్రెస్ నేత దాన్ని వ్యతిరేకిస్తారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలతో కూడా తమకు సంబంధం లేదని పార్టీ ప్రకటిస్తుంది. తమ మాజీ హోంమంత్రి చేసిన ప్రకటన, రాసిన వ్యాసాలతో కూడా తమకు సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటిస్తుంది. ఒక నేత చేసిన వ్యాఖ్యలు పార్టీ లైన్‌కు అను కూలంగా లేవని, అవి వ్యక్తిగత వ్యాఖ్యలేనని మరో నేత వివరణ ఇస్తారు. కేంద్ర మంత్రులు, ఒకప్పుడు ప్రభుత్వంలో థింక్ టాంక్లుగా ఉన్న చిదం బరం, సల్మాన్ ఖుర్షీద్, కపిల్ సిబల్, దిగ్విజయ్ సింగ్‌లు చేసిన పనులు, వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమైనవా? ఇంతకాలం తమ రెండు నాల్కల ధోరణితో కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు రకరకాల నాలుకలతో మాట్లాడుతూ, ఒకర్నొకరు ఖండించుకుంటూ ఏది పార్టీ లైనో తేల్చుకోలేని దుస్థితిలో ఉన్నారు. కేవలం రాజకీయ అవకాశవాదం తప్ప కాంగ్రెస్‌కు ఒక పంథా కానీ సిద్ధాంతం కానీ ఉన్నట్లు కనబడటం లేదు. గత తప్పిదాల నుంచి ఆ పార్టీ ఏమీ నేర్చుకోలేదని దీన్నిబట్టి అర్థమవుతున్నది. సీమాంతర ఉగ్రవాదం ద్వారా జమ్మూ కశ్మీర్లో కల్లోల పరిస్థితిని శత్రు దేశం రెచ్చగొడుతున్న సమయంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి బాసటగా నిలిచే బదులు దేశ భద్రత, సమగ్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ మన దేశ ప్రజలపట్ల అన్యాయానికి పాల్పడుతోంది. లేకపోతే విచ్ఛిన్నకర శక్తుల నినాదాలకు, భారత వ్యతిరేక నినాదాలకు వేదిక కల్పించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థపట్ల కాంగ్రెస్ ఎందుకు సానుభూతి ప్రకటిస్తున్నది? దేశ ద్రోహానికి పాల్పడ్డ యాకూబ్ మెమన్, మఖ్బుల్ భట్, అఫ్జల్ గురు వంటి వారికి అనుకూలంగా కార్యక్రమాలు నిర్వహించిన మావోయిస్టులు, మతోన్మాదులు, మతతత్వవాదులతో సమావే శాల్లో పాల్గొని కాంగ్రెస్ సంఘీభావం ఎందుకు ప్రదర్శించింది? ఒకవైపు ఇలాంటి శక్తులతో చేతులు కలుపుతూనే దేశ సమైక్యత గురించి ప్రవచనాలు వల్లించడం, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేయడం కాంగ్రెస్ లాంటి కుత్సిత రాజకీయ శక్తులకే చెల్లుతుంది. జేఎన్‌యూ, హైదరాబాద్ యూనివర్సిటీ, కేరళ ఉదంతాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనాలు. ఈ దేశంలో అన్ని అధికారాలు అనుభవించింది కాంగ్రెస్. పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు, ముఖ్యమంత్రి నుంచి మునిసిపాలిటీ వరకు కాంగ్రెస్ అధికారం అనుభవించని పదవి అంటూ లేదు. కాంగ్రెస్ వైఫల్యాల వల్లే ఈ దేశంలో 69 సంవత్సరాల తర్వాత కూడా 35 నుంచి 40 శాతం వరకు నిరక్షరాస్యత తాండవిస్తోంది. 25 శాతం మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ఈ దేశంలో ప్రజల మధ్య సామాజిక అనైక్యత పెచ్చరి ల్లుతోంది. అస్పృశ్యత ఇంకా అనేకచోట్ల కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ వైఫ ల్యాలవల్లే, విచ్ఛిన్నకర ఎజెండావల్లే ఈ దేశం ఇంకా ఇలా కునారిల్లుతోంది. మా ప్రభుత్వం కేవలం రెండేళ్ల క్రితమే అధికారంలోకి వచ్చింది. ఈ దేశంలో సామాజిక భద్రత సాధించేందుకు ప్రధానమంత్రి అహోరాత్రాలు కష్టపడి కృషి చేస్తున్నారు. సామాజిక సామరస్యత సాధించేందుకు తీవ్ర యత్నాలు సాగుతున్నాయి. దేశమంతా ఏకత్రాటిపై నిలిచి సామాజిక సమ స్యలపై పోరాడేందుకు తగిన వాతావరణం కల్పించేందుకు మేము కృషి చేస్తున్నాము. అభివృద్ధి సుపరిపాలనపై ఒకవైపు, పేదల్లో నిరుపేదలను చేరు కునేందుకు అంత్యోదయపై మరోవైపు మేము దృష్టి కేంద్రీకరించాము. సామాజిక భద్రత సాధించేందుకు అనేక పథకాలను మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరోవైపు పెట్టుబడులు పెట్టేవారిని ఆకర్షిస్తోంది. ఐఎస్ఐపై మౌనం.. ఆరెస్సెస్‌పై క్రోథం ఈ సమయంలో దేశానికి అండగా నిలబడటం అన్ని పార్టీల బాధ్యత. ముఖ్యంగా కాంగ్రెస్ వంటి కొన్ని పార్టీలు కశ్మీర్ మంటల్లో చలి కాచుకునేం దుకు ప్రయత్నించడం దురదృష్టకరం. గతంలో విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్స హించి, ప్రజల్లో వేర్పాటు ఆలోచనా ధోరణికి కారణమయింది చాలక ఇప్పుడు మా ప్రభుత్వాన్ని తప్పుపట్టడం దారుణం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఉగ్రవాద, వేర్పాటువాద శక్తులను దునుమాడుతున్న మన సైనిక బలగాలను అవమానిస్తున్న వారిపై కూడా కొన్ని పార్టీలు సానుభూతి కురిపిస్తున్నాయి. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ కార్యకలాపాలపై మౌనంగా ఉన్న కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్పై మాత్రం విరుచుకుపడుతోంది. జాతీయ వాదు లపై విమర్శలు చేసే కాంగ్రెస్ ఉగ్రవాదుల పట్ల మెతకవైఖరి అవలంబిస్తోంది. మన విదేశీ వ్యవహారాలకు సంబంధించి సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలు అత్యంత జాగ్రత్తగా ఉంటాయి. ఆచితూచి వ్యాఖ్యానిస్తాయి. ఈ వ్యవ హారంపై అంతా కలిసికట్టుగా, ఒకే స్వరం పలకడం అవసరం. కానీ కాంగ్రెస్ మాత్రం పలు స్వరాలతో మాట్లాడుతోంది. ఒక పరిపక్వ ధోరణిని ప్రదర్శిం చకుండా మానసిక ప్రకోప వైఖరిని ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ నేతల కొన్ని వ్యాఖ్యలు పాకిస్తాన్‌కు వీనుల విందుగా వినిపిస్తున్నాయి. కానీ భారతదేశ ప్రజలు మాత్రం దీన్ని సహించబోరు. ఇప్పటికే దేశంలో పలుచోట్ల కాంగ్రెస్ బలహీనపడిపోయింది. కాంగ్రెస్‌తో సహా దేశంలోని కొన్ని పార్టీలు ఆత్మపరిశీ లన చేసుకోవలసిన, తమ విధానాలను సమీక్షించుకోవలసిన సమయం ఆసన్నమైంది. మరింత ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది. వ్యాసకర్త కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు -
వైవీయూలో సామూహిక జాతీయ గీతాలాపన
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలోని అబ్దుల్ కలాం కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలో సామూహిక జాతీయ గీతాలాపన చేసి దేశభక్తిని ఎలుగెత్తి చాటారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యావత్ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని జాతీయ గీతాన్ని రాగయుక్తంగా ఆలపించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కుల, మత, లింగ బేధాలకు అతీతంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య జి. గులాం తారీఖ్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో ఐకమత్యానికి, త్యాగ పురుషులను గుర్తుంచుకోవడానికి దేశం పట్ల విద్యార్థులకు గౌరవ భావం కలిగించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య వై. నజీర్అహ్మద్ మాట్లాడుతూ డెబ్బై ఏళ్ల స్వాతంత్య్రభావన, త్యాగమూర్తుల గొప్పతనం, దేశప్రతిష్టలను భావితరాల వారికి అందించడానికి జాతీయ గీతాలాపన తప్పనిసరి అని వివరించారు. ఈ కార్యక్రమాన్ని వ్యాయామ విభాగం అధ్యాపకులు డా. రామసుబ్బారెడ్డి, చాంద్‌బాషాలు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
దేశ సమగ్రతను దెబ్బతీసే కుట్ర
–అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ పిలుపు –పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబైన పరేడ్ మైదానం – డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మార్చ్ఫాస్ట్ – నగరమంతా విస్తతంగా బాంబ్‌స్వా్కడ్ తనిఖీలు కర్నూలు: దేశ సమగ్రతను దెబ్బతీయడానికి అసాంఘిక శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వారిని కట్టడి చేసేందుకు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆకె రవికృష్ణ పోలీస్ సిబ్బందికి పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర వేడుకల పరేడ్ రిహార్షల్స్‌ను ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ రిహార్షల్స్‌ను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నేరాలు నివారణకు సీసీ టీవీల వినియోగాన్ని పెంచేందుకు ప్రతి పోలీసు అధికారి కషి చేయాలన్నారు. అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించి, పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కష్ణా పుష్కరాలతో పాటు స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న దష్ట్యా శాంతి భద్రతలపై పోలీసు నిఘాను పటిష్టం చేశామన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కష్ణమంత్రి పంద్రాగస్టు వేడుకల్లో ముఖ్యఅతిధిగా పాల్గొంటారని తెలిపారు. సివిల్, ఏఆర్ హోంగార్డు సిబ్బందితో పాటు ఎన్సీసీ విద్యార్థులు చక్కటి టర్నవుట్‌తో పరేడ్ రిహార్షల్స్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఆర్ఐ రంగముని, ఆర్ఎస్ఐలు మోహన్‌రెడ్డి, రంగనాథ్‌బాబు, నారాయణ, నరేష్, రఘురాముడు, శివయ్యశెట్టితో పాటు హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు. నగరంలో రూట్ మార్చ్: పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకొని కర్నూలు డీఎస్పీ రమణమూర్తి నేతత్వంలో ఆదివారం సాయంత్రం భారీ ఎత్తున రూట్‌మార్చ్ నిర్వహించారు. సాయుధ బలగాలతో పాటు సివిల్ పోలీసులు మార్చ్ ఫాస్ట్‌లో పాల్గొన్నారు. నగరంలోని అన్ని స్టేషన్ల సీఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత కంట్రోల్ రూమ్ (కోట్ల విగ్రహం) దగ్గర నుంచి కిడ్స్ వరల్స్, రాజ్‌విహార్ సెంటర్, మౌర్యా ఇన్, ఐదు రోడ్ల కూడలి, ఎస్బీఐ సర్కిల్, ఎకై ్సజ్ కార్యాలయం మీదుగా కొండారెడ్డి బురుజు వరకు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. పరేడ్ మైదానం ముస్తాబు: స్వాతంత్య్ర వేడుకలకు పోలీసు పరేడ్ మైదానం ముస్తాబైంది. ఆదివారం నిర్వహించిన మాక్ వేడుకలతో ç(రిహార్షల్స్) పంద్రాగస్టు కల కొట్టొచ్చినట్లు కనిపించింది. కొండారెడ్డి బురుజుతో పాటు సమీపంలో ఉన్న తెలుగుతల్లి విగ్రహాన్ని అలంకరించారు. డీఎస్పీ రమణమూర్తి ఆదేశాల మేరకు నగరమంతా బాంబ్‌స్క్వాడ్ బందం విస్తతంగా తనిఖీలు నిర్వహించారు. హెడ్ కానిస్టేబుల్ నబీరసూల్‌తో పాటు సిబ్బంది కష్ణంరాజు, నరసింహా, శేఖర్, మద్దిలేటి తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు. -
బీసీల్లో వర్గీకరణ ఐక్యతను పెంచింది
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ సాక్షి, న్యూఢిల్లీ: గత 30 ఏళ్లుగా వెనకబడిన తరగతుల్లో వర్గీకరణ అమలవుతున్నా బీసీల్లో ఎక్కడా ఐక్యత లోపించలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ బీసీల మధ్య ఐక్యతకు దారి తీసింది తప్ప ఘర్షణకు కారణం కాలేదన్నారు. అలాంటప్పుడు ఎస్సీల్లో వర్గీకరణకు కొంతమంది స్వార్థపరులు ఎందుకు అడ్డుపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. వర్గీకరణ కోసం ఢిల్లీలో చేపట్టిన ఎమ్మార్పీఎస్ ఆందోళన ఆదివారం 20వ రోజుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న వర్గీకరణ వాదులు కలసి ఉద్యమించాలని ఆందోళనకు మద్దతు పలికిన హరియాణా వర్గీకరణ ఉద్యమ సారథి సోదేష్ కబీర్ పిలుపునిచ్చారు. వర్గీకరణ ఉద్యమానికి బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్‌గౌడ్ చెప్పారు. ఎస్సీల వర్గీకరణ కోరుతూ మాలల సంఘీభావ కమిటీ జంతర్‌మంతర్ వద్ద ఆదివారం దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా కమిటీ జాతీయ అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు మాల మాట్లాడుతూ.. వర్గీకరణకు అందరూ కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు 12% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎమ్మార్పీఎస్, తెలంగాణ మాదిగ జేఏసీ, మాదిగ దండోరా ఆధ్యర్యంలో జంతర్‌మంతర్‌వద్ద సోమవారం నుంచి 3 రోజులు ఆందోళనలు చేపట్టనున్నారు. -
పాడి రైతులు సంఘటితం కావాలి
పాడి రైతులు సంఘటితం కావాలి అనంతపురం అగ్రికల్చర్ : పాడి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలంటే రైతులు ఏకతాటిపైకి రావాల్సి ఉందని బొవైన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ (బీఎంసీ) చైర్మన్ నరసింహారావు పిలుపునిచ్చారు. స్థానిక ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో బీఎంసీ ఆధ్వర్యంలో శనివారం పాల రైతులతో సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో నరసింహారావుతో పాటు డైరెక్టర్లు నరేంద్రబాబు, డాక్టర్ దేశాయ్ గోపాలరెడ్డి, మోహన్‌రావు తదితరులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పశుసంవర్ధకశాఖ అమలు చేస్తున్న రాయితీ పథకాలు, కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవడంతో అవసరమైన మరికొన్ని వెసులుబాట్లు పొందాలంటే పాడి రైతులు ఒక్కటి కావాలన్నారు. సమైక్యంగా ఉన్నపుడే లబ్ధిపొందడానికి అవకాశం ఉంటుందన్నారు. అందుకోసం రైతులంతా ఒక సంఘంగా ఏర్పడితే పాడిపరిశ్రమ ద్వారా రైతు కుటుంబాలు బాగుపడతాయన్నారు. ఇప్పటికే నాలుగు జిల్లాలలో సంఘాలు ఏర్పాౖటెనట్లు తెలిపారు. -
ఐక్య పోరాటంతోనే బలోపేతం
పెద్దాపురం : ఐక్య పోరాటంతోనే సంఘ బలోపేతం సాధ్యపడుతుందని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు కుండల సాయి అన్నారు. పెద్దాపురం యాదవ కమ్యూనిటీ హాలులో సోమవారం అఖిల భారత యాదవ మహాసభ అధికార ప్రతిని«ధి చావల రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ యాదవులంతా ఐక్యంగా పోరాడి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వం ఈ ఏడాది యాదవ సంక్షేమ నిధి వెయ్యికోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గొర్రెలు, మేకల పెంపకం దారులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన కోరారు. యాదవ సంఘం నాయకులు పైల చిన్నబ్బాయి, సందక రాంబాబులు మాట్లాడుతూ యాదవ సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని పిలుపునిచ్చారు. అనంతరం సంఘం పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో కన్నారావు, సందక సత్తిబాబు, మామిడి శివ, విడదాసరి రాజా, బొమ్మాడ సూరి, రెల్లబోయిన శ్రీనివాస్, గణేష్, లోవరాజు, మడక సుబ్బారావు, బొట్టా రామకృష్ణ, నీలపాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఇదొక అందమైన ప్రపంచం
‘ఒక జాతి సంస్కృతి ఆ దేశప్రజల హృదయంలో కొలువై ఉంటుంది’ అన్నారు మహాత్మాగాంధీ. చిన్న దేశమైనా, పెద్ద దేశమైనా...ప్రతి సంస్కృతిలో తనదైన గొప్ప విలువ ఉంటుంది. సౌందర్యం ఉంటుంది. ఆ విలువ, సౌందర్యం ఆ దేశ సరిహద్దులకే పరిమితం కాకూడదు. విశ్వవ్యాప్తం కావాలి. భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచ సంస్కృతిని బలోపేతం చేయాలి. సంస్కృతుల పునాదుల మీద ‘ఐక్యత’ వెల్లివిరియాలి. ఈ ఆశయంతో వెలిసిందే ‘వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్’. అమెరికా నుంచి జాంబియా వరకు ప్రతిదేశ సాంస్కృతిక వైవిధ్యం వందపూలై వికసించాలి. వెయ్యి నక్షత్రాలై వెలిగిపోవాలి. -
అంబేడ్కరిస్టులు-మార్క్సిస్టుల ఐక్యత కొనసాగేనా..!
‘‘మీరు షెడ్యూల్డ్ కులాల వారికే కాకుండా మొత్తం భారతదేశానికి నాయకులవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు డాక్టర్ అంబేడ్కర్నుద్దేశించి సోషలిస్టు నాయకుడు డాక్టర్ రామమనోహర్ లోహియా. 1955 డిసెం బరులో ఈ మేరకు అంబేడ్కర్‌కు లేఖ రాశారు. బాబాసాహెబ్‌తో చర్చించి ఆయన నాయకత్వంలో నూతన పార్టీ ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. ఉత్తర ప్రత్యుత్తరాలూ కొనసాగించారు. అంబేడ్కర్ కూడా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ సమావేశాల్లోనూ, సన్నిహి తుల సంభాషణల్లోనూ ఇదే అలోచన చేశారు. లోహియా, ఎం.ఎన్. రాయ్ భారతదేశం గర్వించదగ్గ గొప్ప మేధావులనీ, వారితో కలసి పని చేయాలనీ ఆయన అనేవారు. 1956 సెప్టెంబరులో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ అఖిల భారత కార్యవర్గ సమావేశం జరిగింది. కొత్త పార్టీ ఏర్పాటు చేయబోయే ముందు (రిపబ్లికన్ పార్టీ) లోహియాతో తప్పని సరిగా చర్చించాలని ఈ సందర్భంగా బాబాసాహెబ్ తన సహచరు లతో అన్నారు. అయన హఠాన్మరణంతో ఈ మహత్తర ప్రయోగానికి గండిపడింది. సోషలిస్టులు, కమ్యూనిస్టులు, అంబేడ్కరిస్టులను ఒక వేదిక మీదికి తీసుకురావాలనేది లోహియా చిరకాల ఆకాంక్ష. ఆరు దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ అటువంటి ఆశలు చిగురి స్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. జనవరి 17న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ‘హత్య’, తదనంతర పరిణామాలూ దేశంలోని వివిధ యూనివర్సిటీల్లో కమ్యూనిస్టు, అంబే డ్కర్ విద్యార్థి సంఘాల్ని దగ్గర చేశాయి. కొన్నేళ్లుగా ఏబీవీపీ ఉన్నత విద్యాలయాల్లో పట్టుకోసం విద్వేష రాజకీయాల్ని మొదలెట్టింది. అంబేడ్కర్, కమ్యూనిస్టు సంఘాల కార్యకర్తలపై జాతిద్రోహులు, కులతత్వవాదులనే ముద్ర వేసింది. పర్యవసానాల్ని మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిగా ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు అంబేడ్కర్ - కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయి. జేఎన్‌యూ విద్యార్థి సంఘ నాయకుడు కన్హయ్యకుమార్ ఉపన్యాసంలో జైభీం, లాల్ సలామ్ నినాదాలు అంతర్భాగాలయ్యాయి. ‘‘నేను జై భీం అంటాను. లాల్ సలామ్ అంటాను. అన్ని నినా దాలు భగత్‌సింగ్ ఇచ్చిన ఇంక్విలాబ్ జిందాబాద్‌తో మమేకమవు తాయి. దేశంలో ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు అంబేడ్కరిస్టులు -కమ్యూనిస్టుల కలయిక తక్షణ అవసరం. నూతన భారత ఆవిష్కా రానికి ఇది మనందరి కర్తవ్యం’’ అన్నారు చెన్నైలో జరిగిన అంబేడ్కర్ సంస్మరణ సభలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. 1980-90లలో శరద్‌పాటిల్ అంబేడ్కర్-కమ్యూనిస్టు సిద్ధాంతాల సమ్మేళనంగా సత్యశోధక్ కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేశారు. ఇది చిన్న ప్రయోగం. ఇప్పుడు యూనివర్సిటీల్లో ప్రారంభమైన ఐక్య ఉద్య మాన్ని రాజకీయ పోరాటంగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు విజయవంతం కావడానికి కొన్ని సవాళ్లున్నాయి. ఇప్పటికీ అంబేడ్కర్ వాదులు కమ్యూనిస్టుల నిబద్ధతను పూర్తిగా నమ్మడం లేదు. డాక్టర్ అంబేడ్కర్ కాలం నాటి నుంచీ ఆ దూరం, అనుమానం కొనసాగుతూనే ఉంది. భారతదేశ సమస్యల పరిష్కారానికి వర్గ దృక్పథమే ముఖ్యమనీ, కులం ఉపరితలాంశమనీ కమ్యూనిస్టులు ఇప్పటికీ భావిస్తున్నారు. ఇందుకు భిన్నంగా కులం ఒక ఘనీభవించిన వర్గమని లోహియా చెప్పారు. మన సమాజానికి అవసరమైన విధంగా కమ్యూనిజాన్ని అన్వ యించి నూతన ఆలోచనను తెరపైకి తెచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీలు మార్క్సిజాన్ని మన సమాజానికి అన్వయిస్తూ సరైన విశ్లేషణలు చేయడంలో వెనకబడ్డాయి. ఈ ధోరణి మారాలి. అంబేడ్కర్‌వాద ఉద్య మాల్ని కేవలం అస్తిత్వ రాజకీయాలుగా చూడడం సరికాదు. ఇదొక సరి కొత్త న్యాయబద్ధమైన ప్రజాతంత్ర ఆకాంక్ష. కమ్యూనిస్టు పార్టీల్లో దళి తులు ఉన్నత నాయకత్వ స్థానాల్లో లేకపోవడాన్ని గుర్తించినట్లు, దీన్ని సరిచేయనున్నట్లు సీపీఎం కోల్‌కతా ప్లీనం ప్రకటించింది. అంబేడ్కర్ వాదులు మొదటి నుంచీ చేస్తున్న విమర్శల్లో నాయకత్వ అంశం ప్రధాన మైంది. సైద్ధాంతిక-ఆచరణపరమైన ఇలాంటి సమస్యల్ని కమ్యూని స్టులు, అంబేడ్కరిస్టులు పరిష్కరించుకోవాలి. సానుకూల గత తప్పి దాల్ని అంగీకరించగలగాలి. రోహిత్ వేముల ‘ఆత్మ త్యాగం’ భారతదేశ రాజకీయాలపై సరికొత్త వెలుగులు ప్రసరింపచేయాలి. అప్పుడే అంబే డ్కర్ ఆకాంక్షించిన ప్రజాస్వామ్య భారతదేశం రూపుదిద్దుకుంటుంది. వ్యాసకర్త: బి. భాస్కర్ సీనియర్ జర్నలిస్టు, మొబైల్: 9989692001 -
పరస్పరం గౌరవించుకోవాలి
సంప్రదాయాలు, అభిప్రాయాలపై ప్రధాని రాయ్‌పూర్: ‘అసహనం’పై విస్తృత చర్చ నేపథ్యంలో శాంతి, ఐకమత్యం, సామరస్యాలకు పిలుపునిస్తూ.. పరస్పర సంప్రదాయాలు, అభిప్రాయాలను గౌరవించుకోవాలని ప్రజలను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. వివేకానంద జయంతిని సందర్భంగా రాయ్‌పూర్ జరుగుతున్న జాతీయ యువజనోత్సాన్ని ఉద్దేశించి మంగళవారం ప్రధాని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ‘మనది భిన్నత్వం గల దేశం. సామరస్యం మన బలం. మా ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం పని చేస్తోంది. సామరస్యంగా ఉండకపోతే ప్రగతి సాధించలేం. ఐకమత్యం, సామరస్యం లేకపోతే.. ఒకరి సంప్రదాయాలు, అభిప్రాయాలను మరొకరు గౌరవించకపోతే.. అభివృద్ధి మార్గంలో ఆటంకాలు కలగవచ్చు. శాంతి, ఐకమత్యం, సామరస్యం లేకపోతే సౌభాగ్యం, సంపద, ఉపాధి కల్పనలకు అర్థం ఉండదు. మనం శాంతియుతంగా, ఐకమత్యంగా, సామరస్యంగా ఉండాల్సిన సమయమిది. దేశ ప్రగతికి ఇవి హామీనిస్తాయి. వందలాది భాషలు, విభిన్న మతాలతో కూడిన భిన్నత్వ దేశం శాంతియుతంగా జీవించగలదని భారత్ ప్రపంచానికి చాటింది. ఈ సంస్కృతిని మనం దీనిని పరిరక్షించాల్సి ఉంటుంది’ అని మోదీ ఉద్ఘాటించారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజాన్ని ప్రస్తావిస్తూ మనిషి చేతులు ఏదో ఒకరంగంలో నైపుణ్యంతో బలోపేతం కావాలి కానీ, ఒకరిని చంపటానికి ఉపయోగపడవద్దని అన్నారు. -
కాంగ్రెస్‌లో ఐక్యతారాగం
-
కాంగ్రెస్‌లో ఐక్యతారాగం
- విభేదాలు పక్కకు పెట్టి ఒక్కటవుతున్న గ్రూపులు - బరిలో నిలిచిన స్థానాల్లో పట్టుసాధించాలని టీపీసీసీ నాయకుల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరుగుతున్న ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో క్రమంగా వేడిని పెంచుతున్నాయి. పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో గెలుపుకోసం టీపీసీసీ వ్యూహరచన చేస్తోంది. నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో గెలుపుపై ధీమాతో ఉంది. ముందుగా వ్యక్తిగత విభేదాలు, గ్రూపు తగాదాలను పరిష్కరించి ఆయా జిల్లాల్లో ఉన్న గ్రూపులను ఏకం చేయడంపై దష్టి సారించిన టీపీసీసీ అందులో సఫలమైనట్టు కన్పిస్తోంది. ముందుగా అగ్రనేతలు ఉన్న నల్లగొండ జిల్లా నుంచి దీనిని ప్రారంభించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఈ ఎన్నికల్లో గెలుపుకోసం వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. నల్లగొండలో ఏకాభిప్రాయం..? టీపీసీసీలో అగ్రనేతలు ఎక్కువగా నల్లగొండ జిల్లాకే చెందిన వారు ఉండడంతో ముందుగా గ్రూపు తగాదాలను అక్కడే పరిష్కరించడం ప్రారంభించింది. జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి, మాజీమంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తదితరులు ఎవరికివారే ఒక సొంత అనుచరవర్గానికి నేతత్వం వహిస్తున్నారు. వీరిలో ఏ ఒక్క నాయకునికి రెండో నాయకునితో సఖ్యతలేదు. అయితే, సాధారణ ఎన్నికల తర్వాత వచ్చిన శాసనమండలి ఎన్నికల్లో ఒక్కటయ్యారు. కోమటిరెడ్డి సోదరులతో తీవ్ర విభేదాలు ఉన్నా టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీమంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి... రాజగోపాల్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరై, ఐక్యతను ప్రదర్శించారు. ఇదే సందర్భంలో కె. అనిల్‌కుమార్‌రెడ్డికి భువనగిరి అసెంబ్లీ టికెట్ ఖరారు చేసుకోగా, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కుమార్తె స్రవంతికి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలను అధికారికంగా అప్పగించారు. టీపీసీసీ, సీఎల్పీలకు నాయకత్వం వహిస్తున్న ముఖ్యనేతలు నల్లగొండకే చెందినవారు కావడంతో ఈ జిల్లా ఎన్నిక కాంగ్రెస్‌పార్టీకే కాకుండా ముఖ్యనేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. మహబూబ్‌నగర్‌లోనూ కాంగ్రెస్ నేతలు ఐక్యతారాగాన్ని ఆలపిస్తున్నారు. కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, మాజీమంత్రులు డి.కె.అరుణ, జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, రామ్మోహన్‌రెడ్డి తదితరులంతా కాంగ్రెస్ గెలుపును భుజస్కందాలపై వేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్ గెలుపును ఆ జిల్లాకు చెందిన మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సవాల్‌గా తీసుకున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్‌పార్టీలో గ్రూపులుగా విడిపోయిన నేతలంతా ఐక్యతారాగాన్ని ఆలపిస్తుండడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
మన సంస్కృతికి ఇవే మచ్చు తునకలు
న్యూఢిల్లీ: భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతిని, భిన్నమతాల వారు ఐకమత్యంతో కలసి ఉండడం భారత్‌లాంటి దేశానికే సాధ్యమైందని లండన్ పర్యటనకు వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్కడ గొప్పగా చాటి చెప్పారు. దేశంలో *అసహనం* పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన అక్కడ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు రాజకీయమే కావచ్చుగాక... నిజంగా మనది భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతని చాటి చెప్పేందుకు కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు.... ముస్లిం దంపతుల కొడుకుకు గణేశ్ పేరు 27 ఏళ్ల ఇలాయజ్ షేక్ ఒకరోజు నిండు చాలాలు అయిన తన భార్య నూర్ జహాన్‌ను డెలివరి కోసం ముంబైలోని ఓ ఆస్పత్రికి కారులో తీసుకెళుతున్నాడు. మార్గమధ్యంలోనే నూర్ జహాన్‌కు నొప్పులు పెరిగాయి. తన కారులో ప్రసవం ఒప్పుకోనంటూ ఆ కారు డ్రైవర్ వారిని బలవంతంగా అక్కడే దించేశారు. ఏం చేయాలో తోచని షేక్ సమీపంలోవున్న గణపతి గుడికి తన భార్యను తీసుకొని వెళ్లాడు. అక్కడున్న హిందూ మహిళలు కొందరు ఆమె పరిస్థితిని గమనించి గుడి స్తంభాలకు అడ్డుగా చీరలు కట్టి నూర్ జహాన్‌కు ప్రసవం చేశారు. అలా పుట్టిన కొడుకును షేక్ దంపతులు గణేశ్ అని నామకరణం చేశారు. హిందూ స్నేహితుడికి అంత్యక్రియలు చేసిన ముస్లిం ప్రాణాంతక జబ్బుతో అర్ధాంతరంగా కన్నుమూసిన సంతోష్ సింగ్ అనే మిత్రుడికి రజాక్ ఖాన్ తికారి హిందూ మత సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం, ఇది సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రాచుర్యం పొందిన విషయం తెల్సిందే. ఈ సంఘటన చత్తీస్‌గఢ్‌లో ఇటీవల చోటుచేసుకొంది. పేదవారైన సంతోష్ సింగ్ కుటుంబాన్ని రజాక్ ఆర్థికంగా కూడా ఆదుకున్నారు. ఉమ్మడిగా అంత్యక్రియలు మధ్యప్రదేశ్‌లోని బార్వాని జిల్లా సెంద్వా పట్టణంలో సీతారాం అనే 75 ఏళ్ల వృద్ధుడు ఇటీవల మరణించాడు. ఆయనకు కుటుంబ సభ్యులు ఎవరూలేక పోవడంతో స్థానిక హిందువులు, ముస్లింలు కలసి హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. అనుమాన్ ఛాలీసా ఉర్దూలోకి అనువాదం హిందూ, ముస్లింల ఐక్యతను కోరుకుంటా అబీద్ అల్వీ అనే ముస్లిం యువకుడు హనుమాన్ ఛాలీసాను ఉర్దూలోకి అనవదించారు. ముస్లింల విశ్వాసానికి చెందిన ఉర్దూ పుస్తకాలను హిందీలోకి, హిందువుల గ్రంధాలను ఉర్దూలోకి మార్చాల్సిన అవసరం ఉందని ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌కు చెందిన అబీద్ అల్వీ అభిప్రాయపడ్డారు. గణపతి పందిరిలో ముస్లిం ప్రార్థనలు ముంబైలోని ఓ మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు చాలినంత చోటు లేకపోవడంతో మసీదు పక్కన వేసిన గణపతి పందిరిలోకి ముస్లింలను హిందూ భక్తులు ఆహ్వానించారు. పక్కన వినాయకుడి విగ్రహం ప్రతిష్టించి ఉన్నప్పటికీ ముస్లింలు అదే పందిరిలో ప్రార్థనలు జరిపారు. లూథియానా జైల్లో ఉమ్మడి పండుగలు లూథియానా జైల్లో ముస్లింలు, హిందువులు, సిక్కులు రంజాన్, దీపావళి, గురుపూరబ్ పండగలు కలసే జరుపుకుంటారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు సంఘీభావంగా హిందువులు, సిక్కులు 40 రోజుల పాటు ఉపవాసం చేయగా, ముస్లింలు, సిక్కులు దసరా, దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. హిందూ కీర్తనలు ఆలపించే బాబా.... మహారాష్ర్టలోని బీడ్ నగరానికి చెందిన 73 ఏళ్ల సాయిక్ రియాజొద్దీన్ అబ్దుల్ గనీ హిందూ దేవాలయాల్లో మీరా భక్తి గీతాలు, హిందూ కీర్తనలు ఆలాపిస్తూ హిందువులను ఎంతోగానో ఆకర్షిస్తున్నారు. రాజుబాబా కీర్తనకారుడు అని ఆయన్ని హిందువులు పిలుస్తారు. మతసామరస్యమనేది భారతీయ సంస్కృతిలో ఆనాదిగా ఉన్నదే. సూఫీ మతాధికారుల సమాధుల వద్దకెళ్లి ఉర్సు కార్యక్రమాల్లో హిందువులు పాల్గొనడం తెల్సిందే. హిందువులు, సిక్కులు కలసి దేశంలో మసీదులు నిర్మించడం, ముస్లింలు, హిందువులు కలసి దేవాలయాలు, గురుద్వారాలు నిర్మించడం లాంటి సంఘటనలు మన చరిత్రలో ఎన్నో ఉన్నాయి. -
ఐక్యంగా ఏపీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు
-
ఐక్యంగా ఏపీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు
హైదరాబాద్: టీడీపీ, బీజేపీలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేసేందుకు ఏపీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ కసరత్తు ప్రారంభించాయి. సీపీఎం, సీపీఐ కార్యదర్శులు మధు, రామకృష్ణతో కాంగ్రెస్ నేత సీ రామచంద్రయ్య మంతనాలు జరిపారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ అంశంతోపాటు రాజధాని, ప్రత్యేక హోదా అంశంపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయాలని ఆలోచనలో ఈ రెండు పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. -
రష్యాను భయపెట్టలేరు: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్‌తో వివాదం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించడంతో ఆ దేశాధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఏ దేశమూ రష్యాను భయపెట్టలేదని, ఏకాకిని చేయలేదని వ్యాఖ్యానించారు. అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. కష్టాలను అధిగమించేందుకు సన్నద్ధం కావాలని... దేశ సార్వభౌమత్వం, సుస్థిరత, ఐక్యతకు ఎదురయ్యే ఎలాంటి ముప్పునకైనా రష్యా తగిన సమాధానం ఇస్తుందన్నారు. -
సంకల్పబలుడు
భారతదేశంలో ఐక్యత గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు దేశ జాతీయోద్యమంలోను, ఆ తర్వాత కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం మాత్రమే మొదటి నిలువెత్తు ప్రతిమలా దర్శనమిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాకుండా... స్వాతంత్య్రానంతరం, మొరాయించిన సంస్థానాలకు ముకుతాడు వేసి మరీ భారతదేశంలో విలీనం చేయడంలోని దృఢ సంకల్పం ఆయనలోని ఉక్కు మనిషిని ప్రపంచానికి చూపింది. మనుషుల్ని, ప్రాంతాలను కలిపి ఉంచడానికి పటేల్ ఈ దేశపు తొలి హోమ్ మంత్రిగా కఠినమైన నిర్ణయాలే తీసుకున్నారు. దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాలలో చెలరేగిన అల్లర్లను కూడా తొలి ఉప ప్రధానిగా ఆయన ఎంతో సమర్థంగా అణచివేయగలిగారు. మరణించిన నాలుగు దశాబ్దాల తర్వాత పటేల్‌కు భారతరత్న లభించి ఉండవచ్చు కానీ, అందుకు సమానమైన గౌరవం ఈ ఏడాది నుంచి ఆయనను చిరస్మరణీయం చేయబోతోంది. పటేల్ జన్మించిన అక్టోబర్ 31 వ తేదీని ఏటా రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతాదినం)గా జరుపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోపక్క మధ్య గుజరాత్‌లోని నర్మదా నది ఆనకట్టకు మూడు కి.మీ. సమీపంలో ఉన్న సాధు ద్వీపంలో 2,989 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 182 మీటర్ల (597 అడుగులు) ఎత్తున ఏర్పాటు చేయ తలపెట్టిన పటేల్ ఐక్యతా ప్రతిమ నిర్మాణ పనులను గత సోమవారమే గుజరాత్ ప్రభుత్వం ఎల్ అండ్ టి సంస్థకు అప్పగించింది. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’కి రెండింతల ఎత్తు ఉండే ఈ విగ్రహం 2018లో పూర్తయ్యాక, ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా ఎత్తై స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ రికార్డును మించిపోతుంది. పటేల్‌లోని శిఖర సమాన దృఢచిత్తానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ఛాయామాత్రమైన ప్రతిరూపంగా నిలవగలుగుతుంది. 1875లో గుజరాత్‌లోని నడియాడ్‌లో జన్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంగ్లండ్‌లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించి, తిరిగి ఇండియాకు వచ్చాక క్రియాశీలక ఉద్యమ రాజకీయాల్లో పాల్గొన్నారు. రాజనీతిజ్ఞుడిగా ఎదిగారు. దేశ పౌరుల ప్రథమ విధి తమ దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడమేనని పటేల్ అంటారు. -
మన దేశం పేరును రాజ్యాంగంలో ఎలా చేర్చారు?
రాజ్యాంగ ప్రవేశిక - ఉన్నత ఆదర్శాలు స్వేచ్ఛ (Liberty): నిజమైన ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు, ఉదాత్త నాగరిక సామాజిక జీవనానికి స్వేచ్ఛాయుత వాతావరణం అనివార్యం. స్వేచ్ఛ అంటే నిర్హేతుకమైన పరిమితులు, నిర్బంధాలు లేకుండా పరిపూర్ణ వ్యక్తి వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం. ప్రతి పౌరునికి ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛ ఉండాలి. ఉదా: మత స్వేచ్ఛ లౌకిక రాజ్య స్థాపనకు పునాది. సమానత్వం (Liberty): ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఆదర్శం. సమానత్వం అంటే అన్ని రకాల అసమానత్వాలను, వివక్షతలను రద్దు చేసి, ప్రతి వ్యక్తి తనకు తాను పూర్తిగా వికాస పర్చుకోవడానికి అవసరమైన అవకాశాలను కల్పించడం. సౌభ్రాతృత్వం (Fraternity): సౌభ్రాతృత్వం అంటే సోదరభావం అని అర్థం. పౌరుల మధ్య సంఘీభావం, పరస్పర గౌరవం ఉండాలి. అసమానతలు, వివక్షత లేనప్పుడు పౌరుల మధ్య సోదరభావం వర్ధిల్లుతుంది. ఐక్యత, సమగ్రత (Unity & Integrity): దేశ ప్రజలందరూ కలిసి ఉండటానికి ఐక్యతాభావం దోహదపడుతుంది. ఇది ఒక మానసిక ఉద్వేగం (Psychological Emotion). మత, కుల, ప్రాంత అనే సంకుచిత ఆలోచనకు అతీతమైన ఆదర్శం. ‘సమగ్రత’ అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు. సమగ్రత ప్రజల మధ్య జాతీయ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. 1970 తర్వాత దేశంలో అనేక ప్రాంతాల్లో, ప్రాంతీయవాదం, వేర్పాటు వాదం, దేశ సమగ్రతను దెబ్బతీసేలా తీవ్ర పోరాటాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ‘సమగ్రత’ అనే పదాన్ని చేర్చాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ప్రవేశిక సవరణకు అతీతం కాదు ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు ప్రకరణ 368 ప్రకారం ఉంటుందని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పు చెప్పింది. అయితే ప్రవేశిక రాజ్యాంగ మౌలిక నిర్మాణం అనే నిర్వచనంలోకి వస్తుంది కాబట్టి, దాని సారాంశం (ఞజీటజ్టీ) మార్చకుండా ప్రాముఖ్యతను ద్విగుణీకృతం చేసేలా నిర్మాణాత్మకంగా సవరణలను చేయవచ్చని స్పష్టం చేసింది. అందువల్ల స్వరణ్‌సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సామ్యవాదం, లౌకికవాదం, సమగ్రత’ అనే పదాలను చేర్చారు. ఇదే మొదటి, చివరి సవరణ కూడా. ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమా? రాజ్యాంగ సారాంశమంతా ప్రవేశికలో నిక్షిప్తమై ఉంటుంది. అయితే ఇది రాజ్యాంగ అంతర్భాగమా? కాదా? అనే అంశంపై సుప్రీంకోర్టు భిన్న తీర్పులను వెలువరించింది. 1960లో బెరుబారి యూనియన్ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రకరణ 143 ప్రకారం సలహా పూర్వకమైన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే 1973లో కేశవానంద భారతి వివాదంలో పూర్తి భిన్నమైన తీర్పు చెబుతూ ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమేనని వ్యాఖ్యానించింది. 1995లో ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కేసులోనూ ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది.రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశికను ఓటింగ్‌కు పెట్టినప్పుడు కూడా డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమేనని పేర్కొన్నారు. ఈ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు స్థిరీకరించింది. ప్రవేశిక ప్రయోజనం - ప్రాముఖ్యత ప్రవేశిక రాజ్యాంగ ఆధారాన్ని పేర్కొంటుంది. ఇది రాజ్యాంగ ఆమోద తేదీని తెలియజేస్తుంది. రాజ్యాంగాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలకు చట్టపరమైన సహాయకారిగా ఉపయోగపడుతుంది. విమర్శలు: ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు. అంటే ఇందులో పేర్కొన్న ఆశయాలను అమలు చేయకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. ఇందులో పేర్కొన్న భావజాలానికి నిర్దిష్ట నిర్వచనాలు లేవు. హక్కుల ప్రస్థావన లేదు. శాసనాధికారాలకు ఇది ఆధారం కాదు. అదేవిధంగా పరిమితికాదు. ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ, హృదయం లాంటిది. ఇది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను తెలుసుకోవడానికి ఆధారం. రాజ్యాంగానికి సూక్ష్మరూపం (Constitution in Miniature). ప్రవేశికలో రాజ్యాంగ తాత్విక పునాదులు ఉన్నాయి. మాదిరి ప్రశ్నలు 1. భారత రాజ్యాంగ ప్రవేశిక సాధించాల్సిన లక్ష్యం? 1) సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. సమానహోదా, అవకాశం 2) ఆలోచన, భావప్రకటన, నమ్మకం, ఆరాధన విషయాల్లో స్వేచ్ఛ 3) వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను పెంపొందించే సౌభ్రాతృత్వాన్ని సాధించాలి 4) పైవన్నీ 2. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్ర స్వభావాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? 1) ఫ్రెంచి 2) బ్రిటిష్ 3) ఐర్లాండ్ 4) రష్యా 3. కిందివాటిలో సరికాని జత ఏది? 1) ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదు - గోలక్‌నాథ్ కేసు 2) ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమే - కేశవానంద భారతీ కేసు 3) లౌకికతత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపమే - ఎన్.ఆర్. బొమ్మయ్ కేసు 4) పైవన్నీ సరైనవే 4. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికలో చేర్చిన పదం? ఎ) సామ్యవాదం బి) లౌకిక సి) సమగ్రత డి) సార్వభౌమ 1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి 5. మనదేశం పేరును రాజ్యాంగంలో ఎలా పొందుపర్చారు? 1) ఇండియా - భారత్ 2) హిందూస్థాన్ 3) అఖండ్ భారత్ 4) సింధూస్థాన్ 6. భారతదేశం ఏ రాజకీయ తరహా వ్యవస్థను ఆచరిస్తుంది? 1) ప్రజాస్వామిక వ్యవస్థ 2) పార్లమెంటరీ ప్రజాస్వామ్య తరహా వ్యవస్థ 3) అధ్యక్ష తరహా వ్యవస్థ 4) సమాఖ్య తరహా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ 7. భారత రిపబ్లిక్ రాజ్యాంగం అనేది? 1) రాజ్యాంగ సభ ద్వారా నిర్మితమై, గవర్నర్ జనరల్ ద్వారా ఆమోదం పొందింది. 2) బ్రిటిష్ పార్లమెంట్ ప్రతిపాదించగా, రాజ్యాంగసభ ఆమోదించింది. 3) భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్తావించగా, రాజ్యాంగ సభ ఆమో దించింది. 4) రాజ్యాంగ పరిషత్తు రచించి, స్వీకరించింది. 8. ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం, ఒక ఆభరణంగా వర్ణించింది ఎవరు? 1) మహాత్మాగాంధీ 2) అంబేద్కర్ 3) వల్లభాయ్ పటేల్ 4) ఠాకూర్‌దాస్ భార్గవ 9. రాజ్యాంగ ప్రవేశిక? 1) సూచనాత్మకమైంది. 2) విషయ సూచిక లాంటిది 3) 1, 2 4) ఏదీకాదు 10. ప్రవేశిక నుంచి దేన్ని తెలుసుకోవచ్చు? 1) రాజ్యాంగ ఆమోద తేది 2) రాజ్యాంగ ఆధారాలు 3) రాజ్యాంగ ఆశయాలు 4) పైవన్నీ 11. ప్రవేశికకు సంబంధించి సరైంది? 1) రాజ్యాంగంలోని ప్రకరణలతో సంబంధం ఉంటుంది 2) ప్రత్యేకంగా ప్రవేశికకు ఉనికి ఉండదు 3) సవరణకు అతీతం కాదు 4) పైవన్నీ సరైనవే సమాధానాలు 1) 4; 2) 1; 3) 4; 4) 3; 5) 1; 6) 4; 7) 4; 8) 4; 9) 1; 10) 4; 11) 4. -
మానవతా విలువలను మేలుకొలిపే రమజాన్
దైవ ప్రసాదితమైన దివ్య ఖుర్ఆన్ గ్రంథం అవతరించిన పవిత్ర మాసం రమజాన్. మానవుడు పరిపూర్ణ ప్రేమమూర్తిగా మారేందుకు అవకాశం కల్పించే రమజాన్ ఎంతో శుభప్రదమైనది. మనిషిలో క్రమశిక్షణ, ఐక్యత, సర్వమానవ సౌభ్రాతృత్వం, సహనశీలం, భక్తిపరాయణత్వం, కోర్కెలను అదుపులో పెట్టుకునే మనోనిశ్చలతను, దానగుణాన్ని పెంపొందించే మహత్తరమైన నెల రమజాన్. ‘‘నీ సంపాదన నీ సుఖసంతోషాలకే, నీ భోగలాలసతకే వినియోగించడం మానవత్వం కాదు. కష్టాల్లో ఉన్నవారి కన్నీటిని తుడవాలి. నీ సంపాదనలో కొంత భాగం వారికిచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపాలి. అపుడే నీ జీవితానికి అర్థం, పరమార్థం’’ అని ప్రబోధించారు ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ రసూలుల్లాహ్(స.అ.స). మనిషి మానవతామూర్తిగా మారడానికి రమజాన్ అవకాశం కల్పిస్తుంది. ఇస్లాం మతానికి మూలం... ఇస్లాం ధర్మం ఐదు పునాదులపై ఉందని ప్రవక్త ముహమ్మద్ ప్రవచించారు. అవి 1. కలిమా(అల్లాహ్ ఒక్కడే. ఆయన సర్వశక్తిమంతుడు. ఆరాధనలకు ఆయనే అర్హుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ముహమ్మద్ ఆయన ప్రవక్త అని విశ్వసించాలి). 2. నమాజ్ (ప్రతి రోజూ ఐదు పూటలా దైవధ్యానం చేయాలి). 3. రోజా (రమజాన్ మాసంలో విధిగా ఉపవాసం ఉండాలి). 4. జకాత్ (తన సంపాదనలో కొంత బాగాన్ని సంవత్సరానికి ఒకసారి పేదలకు దానం చేయాలి). 5. హజ్ (స్తోమతగలవారు జీవితంలో ఒకసారైనా మక్కా, మదీనా యాత్ర చేయాలి) ప్రతి ముస్లిం ఈ ఐదు సూత్రాలను కచ్చితంగా పాటించాలని ప్రవక్త నిర్దేశించారు. ఉపవాసంతో పరివర్తన రమజాన్ నెలలో చంద్రుడు కనిపించిన రోజు నుంచి 30 రోజులపాటు ఉపవాసం (రోజా) ఉంటారు. రమజాన్ శబ్దవ్యూత్పత్తిలోనే ఉపవాసం సూచన ఉంది. ‘రమ్జ్’ అంటే కాలుట. దహించుట అని అర్థం. ఉపవాసం వల్ల ఆకలి బాధ తెలుస్తుంది. ఆకలిగొన్నవారి పట్ల సానుభూతి పెరుగుతుంది. ప్రాతఃకాలం నుంచి సూర్యాస్తమయం వరకూ ఉపవాస దీక్షను నియమ నిష్టలతో పాటించాలి. ఐదు పూటలా ప్రార్థనతో పాటు పవిత్ర ఖుర్ఆన్ పారాయణం చేయాలి. ఓరిమితో, సహనంతో ప్రేమమూర్తిగా, మానవతావాదిగా మెలగాలి. ప్రాతఃకాలంలో భోజనంచేయడాన్ని ‘సహరి’ అంటారు. సాయంత్రం ఉపవాసదీక్ష విరమించడాన్ని ‘ఇఫ్తార్’ అంటారు. ఇఫ్తార్ సమయంలో ముస్లింలందరూ మస్జీద్‌లో చేరి దీక్ష విరమిస్తారు. గోధుమ గంజితో పాటు ఖర్జూరం, వివిధ రకాల పండ్లు తీసుకోవచ్చు. హైదరాబాద్‌లాంటి నగరాల్లో హలీమ్, హరీస్ అనే పేరుతో మాంసాహార వంటకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఆహార అలవాట్లకు అనుగుణంగా తమకు అందుబాటులో ఉన్న ఏ ఆహారపదార్థాలైనా భుజించవచ్చు. ఉపవాసం ఉండలేకపోతే... రమజాన్ నెలలో ఏ కారణం చేతనైనా ఉపవాసానికి భంగం కలిగి పూర్తిచేయలేకపోతే ‘కఫ్పారా’(మూల్యం) చెల్లించాలి. పరిహారంగా రమజాన్ తర్వాత అరవై రోజులు ఉపవాసముండాలి. అదీ వీలుకాకపోతే ఒక పేదవ్యక్తికి 60 రోజులకు సరిపడా ఆహారం ఇవ్వాలి. ప్రతి ముస్లిం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. అయితే అందులో కొన్ని సడలింపులు ఉన్నాయి. దూరప్రయాణాలు చేసేవారు, దీర్ఘ రోగాలతో బాధపడేవారు, వయసుమీరిన వారు, గర్భవతులు, పిల్లలకు పాలిచ్చే స్త్రీలు, ఋతుస్రావం అవుతున్న మహిళలు ఉపవాసం ఉండకపోవచ్చు. అయితే, వారు రమజాన్ మాసంలో ఎన్నిరోజులు ఉపవాసదీక్ష పాటించలేకపోయారో అనంతరం అన్ని రోజులు ఉపవాసం ఉండాలి. కడుపులోని బిడ్డ భయంతో ఉపవాసం ఉండకపోతే ‘ఫిదియా’ చెల్లించాలి. అంటే రెండు పూటలా ఒక పేదవానికి కడుపునిండా అన్నం పెట్టాలి. సామూహిక ప్రార్థనామహిమ ఉపవాసం వల్ల కర్తవ్యపరాయణత్వం, కష్టాలను సహనంతో ఎదుర్కొనే శక్తి కలుగుతాయి.. కామక్రోధ మద మాత్సర్యాది అరిషడ్వర్గాలకు కళ్లెం వేయడంవల్ల మనో నిశ్చలత ఏర్పడుతుంది. దైవం పట్ల విశ్వాసం, పాపభీతి పెరిగి దుష్కృత్యాలు తగ్గుతాయి. రోజూ ఐదుసార్లు దైవప్రార్థన(నమాజ్)తో పాటు రమజాన్ మాసంలో ప్రతిరాత్రి ‘తరావీహ్’ నమాజ్ ప్రత్యేకంగా చేస్తారు. రోజుకు 20 రకాతుల చొప్పున నమాజ్ చేస్తూ 30 రోజులలో ఖుర్ఆన్లోని 30 భాగాలను పఠించడం పూర్తిచేస్తారు. మహిళలు ఇళ్లలోనే ప్రార్థన చేసుకోవచ్చు. అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్న వారు రమజాన్ మాసంలో ఉపవాసదీక్షతో పాటు ఎతెకాఫ్(ప్రాథమిక అవసరాల కోసం తప్ప మిగిలిన సమయమంతా దైవధ్యానంలోనే గడపడం) పాటించాలి. సాధారణంగా మగవాళ్లు మస్జీద్‌లో, ఆడవాళ్లు ఇంటిలోని ఒక గదిలో ఉండి నిరంతరం దైవధ్యానంలో, ప్రార్థనలో నిమగ్నమవుతారు. వీటితో పాటు తహజ్జూద్ నమాజ్ (అర్థరాత్రి తర్వాత తొలివేకువలో చేసే ప్రార్థన) చేయాలి. దైవాదేశం వెలువడిన రాత్రి రమజాన్ నెలలో 27వ దినంనాటి రాత్రిని ‘మహిమగల రాత్రి’ (లైలతుల్ ఖద్)్రగా భావిస్తారు. దీనినే ‘షబే ఖద్’్ర అని కూడా అంటారు. ఆ రాత్రి జాగరణ చేసి అత్యంత విశ్వాసంతో, నిష్ఠతో, పుణ్యఫలాపేక్షతో ప్రార్థన చేస్తే కృతాపరాధాలను అల్లాహ్ క్షమిస్తాడని, ఇహపరసుఖాలు ప్రసాదిస్తాడని ముస్లింల విశ్వాసం. మనిషికి మార్గదర్శనం చేయడంకోసం, మానవతా విలువలు పాటించి సన్మార్గంలో నిడిచేవిధంగా, ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దేందుకు విశ్వప్రభువు ఖుర్ఆన్ పవిత్ర గ్రంథ సూక్తులను ప్రవక్త ద్వారా షబేఖద్ ్రరాత్రి నుంచే మానవాళికి అందించడం ప్రారంభించారు. ఈ రాత్రి మహత్మ్యం గురించి అల్ ఖద్ ్రసూరాలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు...‘‘మేము ఖుర్ఆన్ను ఈ షబేఖదర్లోనే అవతరింపజేశాము. షబేఖదర్ అంటే మీకు ఏమి తెలుసు. షబేఖదర్ వేయి మాసాల కంటే ఉత్తమమైనది. ఈ రాత్రి దూతలు, హజ్రత్ జిబ్రయీల్ విశ్వప్రభువు ఆజ్ఞ మేరకు ప్రతి పనినీ నిర్వహించేందుకు భువికి దిగివస్తారు. ఉదయం అయ్యేవరకూ శుభాశీస్సులు ప్రాప్తిస్తాయి.’’ మక్కాలో నివసించే ముహమ్మద్ రసూలువారికి చిన్నప్పటి నుంచి దైవచింతన ఎక్కువ. వీలు చిక్కినప్పుడల్లా సమీపంలోని హిరా అనే పేరుగల కొండ గుహకు వెళ్లి ధ్యానం(తపస్సు) చేసేవారు. క్రీ.శ.610 సంవత్సరం రమజాన్ నెలలో మూడు రోజులపాటు హిరా గుహలోనే దైవ ధ్యానంలో గడిపారు. అప్పుడు ఒక రోజు రాత్రి జిబ్రయీల్ ప్రత్యక్షమై దైవవాణి (ఖుర్ఆన్) వినిపించారు. అప్పటి నుంచి 22 సంవత్సరాలపాటు ఇహపరలోకాల్లో సాఫల్యం కోసం మానవునికి మార్గనిర్దేశనం చేయడానికి ముహమ్మద్ ప్రవక్తకు దైవాదేశం వెలువడింది. సర్వేశ్వరుని సూక్తుల సమాహారమే ఖుర్ఆన్ పవిత్ర గ్రంథం. వెల్లివిరిసే ఐక్యత ముస్లింలందరూ ఒకే నెలలో ఒకే కాలంలో ఉపవాసవ్రతాన్ని పాటిస్తారు కాబట్టి పరస్పర సహకారం, సోదరభావం కలిగి ఐక్యత పరిఢవిల్లుతుంది. ఎవరైతే పరిపూర్ణ విశ్వాసంతో, ఆత్మవిమర్శతో ఉపవాసాలు పాటిస్తారో పూర్వం వారు చేసిన పాపాలను దేవుడు క్షమిస్తాడని ముహమ్మద్ ప్రవక్త సెలవిచ్చారు. రమజాన్ విశిష్టమైనది కాబట్టి ఈ నెలలోనే జకాత్ ఇస్తారు. తమ వార్షిక ఆదాయంలో కొంత భాగాన్ని పేదలకు ఇవ్వడమే జకాత్. 7.5 తులాల బంగారం, లేక 52.5 తులాల వెండి, లేదా దాని విలువ గల డబ్బు ఏడాదిపాటు మన వద్ద ఉంటే వాటి విలువలో నూటికి 2.50 రూపాయల ప్రకారం జకాత్‌గా తీసి ఆ మొత్తాన్ని పేదలకు దానధర్మాలు చేయాలి. ముప్పై రోజుల కఠిన ఉపవాసదీక్షానంతరం రమజాన్ ‘ఖుద్బా’ (పండుగ) చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ కొత్త దుస్తులు ధరించి ‘ఈద్గాహ్’లో సామూహికంగా ప్రార్థన చేస్తారు. ఆరోజు సేమ్యా పాయసం తింటారు. ప్రార్థనకు వెళ్లేముందే ‘ఫిత్రా’ (దానం) ఇస్తారు. డబ్బు రూపంలో కానీ, ధాన్యం రూపంలో గానీ పేదలకు ఫిత్రా ఇస్తారు. ఇంట్లో ఎంతమంది సభ్యులుంటే అంతమంది పేర ఫిత్రా ఇవ్వాలి. 1.75 కిలోల గోధుమలు లేదా దాని విలువ గల డబ్బు ఈద్ నమాజ్‌కు ముందే పేదలకు ఇవ్వాలి. ముస్లింలందరూ కొత్తదుస్తులు ధరించి ఆనందోత్సాహాలతో, భక్తిప్రపత్తులతో పండుగ చేసుకుంటారు. ఖుద్బా అనంతరం పరస్పరం ఈద్ ముబారక్(పండుగ శుభాకాంక్షలు) చెప్పుకుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు. - సద్దపల్లి ఖుదాబక్ష్ ‘ఇస్లాం’ అనే అరబ్బీ పదానికిస్వయంసమర్పణ, విధేయత, ఆజ్ఞాపాలన, శాంతి అనే అర్థాలు ఉన్నాయి. సర్వాంతర్యామికి, విశ్వప్రభువుకు,జీవనదాతకు మానవుడు స్వయంసమర్పణ చేసుకోవడమే ఇస్లాం. ఇస్లాం క్యాలెండర్ (హిజ్రీ శకం) ప్రకారం ఈనెల 29వతేదీ నుంచి రమజాన్ నెల ప్రారంభం అవుతుంది. జూలై 29వ తేదీ (నెలవంక కనిపిస్తే...) ఈదుల్ ఫితర్ జరుపుకుంటారు. రమజాన్ నెలలో నిష్కల్మష హృదయంతో, చిత్తశుద్ధితో, సంపూర్ణ విశ్వాసంతో, భక్తిప్రపత్తులతో ప్రార్థిస్తే సర్వేశ్వరుని కృపకు పాత్రులవుతారని, ఇహపర సుఖాలు లభిస్తాయని ముస్లింల విశ్వాసం. ఉపవాస దీక్ష ప్రారంభించే ముందు చేసే నియ్యత్... ‘అల్లాహుమ్మ అసూము గదల్ల్లక ఫగ్ఫిర్లి మా ఖద్దమ్తు వమా అఖ్ఖర్తు’ (అర్థంః దేవా... నా ఉపవాసాన్ని స్వీకరించు. నీవు ఏ పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తానని సెలవిచ్చావో దాన్ని నాకు ప్రసాదించు.) ‘ఇఫ్తార్’ (ఉపవాస దీక్ష విరమణ) సమయంలో చేసే ప్రార్థన (దువా)... ‘అల్లాహుమ్మ లకాసుమ్తు వ బికా ఆమంతు వ అలైక తవక్కల్తు వ అలా రిజ్జఖ అఫ్తర్ తు వతఖబ్బల్ మిన్ని’(అర్థంః దేవా. నేను నీ కోసమే ఉపవాసం పాటించాను. నీవు ప్రసాదించిన దానిద్వారానే ఉపవాస దీక్ష విరమిస్తున్నాను). ‘అల్లాహ్’ అనే పదానికి ముహజ్జబుల్ లుగాత్ గ్రంథంలో అర్థం ఇలా ఉంది. 1. ఖాలిఖ్ (సృష్టికర్త). 2. పర్వర్దిగార్ (సృష్టిస్థితిలయకారుడు, పోషించువాడు). ఈ పదం ఇలాహ్ అనే అరబ్బీ పదం నుంచి రూపొందింది. అల్లా- దేవుడు, ప్రభువు, సర్వశక్తిమంతుడు (ఎన్సైక్లోపిడియా ఏషియాటికా). లాహ్- అరబ్బీ క్రియ నుంచి రూపొందింది. కంపించుట, ప్రకాశించుట అని అర్థం. ఇలాహ్- దేవత...దానికి అల్ ప్రత్యయం చేర్చి దేవుడు అనే అర్థంలో అల్లాహ్ అని వాడుకలోకి వచ్చింది. -
ప్రగతికి పెద్దపీట
సాక్షి ప్రతినిది, ఆదిలాబాద్ : ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి జిల్లా ప్రగతికి పెద్దపీట వేస్తోందని, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. అమరులను స్మరించుకుంటూ దేశ సమగ్రత, సమైక్యత, జాతి, కుల, మత, వర్గరహితంగాప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, జిల్లా సర్వతోముఖాభివృద్ధి కలిసి సాగాలని ఆయన కోరారు. ఆదిలాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం జరిగిన 67 స్వాతంత్య్ర వేడుకలకు మంత్రి సారయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన ఆదిలాబాద్ డీఎస్పీ, పరేడ్ కమాండర్ లతామాధురి ఆధ్వర్యంలో కలెక్టర్ అహ్మద్ బాబు, ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠిలతో కలిసి ప్రత్యేక వాహనంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సభావేదిక నుంచి మంత్రి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విత్తనోత్పత్తికి ప్రోత్సాహం జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, విద్య, వైద్యం, వ్యవసాయం, గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సార య్య స్పష్టం చేశారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతుందన్నారు. ఈ ఖరీఫ్‌లో రూ.1,255 కోట్ల పంట రుణాలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.515 కోట్లు పంపిణీ చేశామన్నారు. గ్రామీణ స్థాయిలోనే విత్తనోత్పత్తిని ప్రోత్సహించడానికి రూ.91.90 లక్షల విలువైన 3,531 క్వింటాళ్ల సోయా, మొక్కజొన్న, పెసర, మినుము విత్తనాలు 50 శాతం సబ్సిడీతో అందించడం జరుగుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో నాబార్డు గ్రాంట్ ద్వారా రూ.48.40 లక్షలతో 4 డీఆర్ డిపోలు, రూ.51 లక్షలతో 12 అంగన్వాడీ భవనాలు నిర్మించామన్నారు. రూ.4.78 కోట్ల ఎన్ఆర్హెచ్ఎం గ్రాంట్ ద్వారా 49, రూ.4.33 కోట్ల సీఎస్ఎస్ గ్రాంట్‌తో నాలుగు అభివృద్ధి పనులు గిరిజన ప్రాంతాల్లో చేపట్టామన్నారు. 16, 254 సదస్సుల ద్వారా 16,91,893 మంది అవుట్ పేషెంట్లను పరీక్షించి, ఇందులో 55,674 గర్భిణులను పరీక్షించడం జరిగిందన్నారు. పచ్చతోరణం కింద ఉపాధి ఉపాధి హామీ ద్వారా నిరుపేద గ్రామీణులకు పని కల్పించడానికి ఇప్పటివరకు 5,23,824 జాబ్‌కార్డులు జారీ చేశామని మంత్రి సారయ్య పేర్కొన్నారు. రూ.202.24 కోట్లు ఖర్చు చేసి 2,58,295 కుటుంబాలకు ఉపాధి కల్పించాము. ఇందిరమ్మ పచ్చతోరణం ద్వారా జిల్లాలో 2,733 కిలో మీటర్ల పొడవున 3,288 ఎకరాల అసైన్డ్ భూములను గుర్తించి 3,067 మంది ద్వారా చెట్లను పెంచి తద్వారా శాశ్వత ఉపాధి కల్పించే చర్యలు తీసుకున్నామన్నారు. మహా త్మాగాంధీ వన నర్సరీ కార్యక్రమం కింద గతేడాది రూ.5.59 కోట్లు వెచ్చించి 25.58 లక్షల మొక్కలు 16,750 మంది రైతుల పొలాల్లో నాటించామన్నారు. గృహనిర్మాణం పథకం కింద జీవో 171 ప్రకారం రూ.74 కోట్ల తో 16,407 గృహాలు మంజూరు కాగా, వాటిలో రూ.60.67 కోట్ల వ్యయంతో 8,453 గృహాలు పూర్తి చేసినట్లు చెప్పారు. రచ్చబండ-1 కింద రూ.105.29 కోట్లతో 19,153 గృహాలు మంజూరు కాగా, వాటిలో రూ.30.36 కోట్లు ఖర్చు చేసి 3,261 గృహాలు పూర్తి చేశామన్నారు. ఎనిమిదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న 126 మంది రైతుల కుటుంబాలకు ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద పూర్తి సబ్సిడీతో ఇళ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. జూలై 15వ తేదీ నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో రూ.2.58 కోట్లతో వరద సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సంరక్షణ అభివృద్ధికి గాను ఈ ఆర్థిక సంవత్సరం రూ.12.56 కోట్లు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అహ్మద్ బాబు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ సుజాత శర్మ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపాలకృష్ణమూర్తి, ఐటీడీఏ పీవో జె.నివాస్, ఏజేసీ బి.వెంకటయ్య, డీఆర్వో ఎస్ఎస్ రాజు, డ్వామా, డీఆర్డీఏ పీడీలు వినయ్‌కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డీపీవో పోచయ్య, సీపీవో షేక్ మీరా, డీఈవో అక్రముల్లా ఖాన్, ఏపీ ట్రాన్స్‌కో, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అశోక్, ఇంద్రసేన్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రవీణ్‌రావు, డీఎఫ్‌వో శేఖర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ స్వామి, రిమ్స్ డైరక్టర్ శశిధర్, డీఎస్డీవో ఎన్.సుధాకర్‌రావు, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ విజయ్‌కుమార్, మెప్మా పీడీ రాథోడ్ రాజేశ్వర్లతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.