సెమినార్‌లో మాట్లాడుతున్న ఇంటర్‌బోర్డు మాజీ కన్వీనర్ కర్నాటి రాంమోహన్‌రావు
ఖమ్మం: దేశ సమగ్రతకు ఉపాధ్యాయులు నడుం బిగించాలని ఇంటర్‌బోర్డు మాజీ కన్వీనర్ కర్నాటి రాంమోహన్‌రావు అన్నారు. టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం విజయ్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలితరం నాయకత్వం వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తే.. ఈ తరం యువత వ్యక్తి శ్రేయోవాదం వైపు పయనిస్తోందన్నారు. దేశానికి కొత్త నాయకత్వం కావాలని, నేడు దేశంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. విద్య మనచేతిలో లేకపోవడం వల్లనే విలువలు పడిపోతున్నాయన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.మనోహర్‌రాజు మాట్లాడుతూ నేడు విద్యారంగంలో అనేక అసమానతలు ఉన్నాయన్నారు. కొఠారి కమిషన్ నివేదికను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ నాగిరెడ్డి, రవికుమార్, రామారావు, సంగమేశ్వరరావు, నర్సింహారావు, లక్ష్మీనారాయణ, ఎ.వి.నాగేశ్వరరావు, కె.వెంకటేశ్వర్లు, మహేష్, వీరబాబు, యోగానందం తదితరులు పాల్గొన్నారు.