తమిళనాడు:ప్రతిపక్షాలతో బీజేపీ ఎన్నికల్లో పోరాడటంలేదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఎన్నికల్లో పోరాడి బీజేపీని ఓడిస్తామని హెచ్చరించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రం ప్రభుత్వంపై డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ నిరసన సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అసత్య ప్రచారాలతో బీజేపీ సృష్టించుకున్న ఇమేజ్‌ను దెబ్బతీస్తామని అన్నారు.
'బీజేపీకి ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలపై దురహంకార చర్యలకు పాల్పడుతోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వడమే బీజేపీ శవపేటికకు చివరి మేకు అవుతుంది' అని స్టాలిన్ అన్నారు.
మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనలు తెలుపుతూ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ సమావేశం నిర్వహించింది.
ఇదీ చదవండి:ముందస్తును కొట్టిపారేయలేం: నితీశ్
Comments
Please login to add a commentAdd a comment