oppositio parties
-
ఫ్రాన్స్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం !?
పారిస్: ఫ్రాన్స్‌లో మైనారిటీ ప్రభుత్వాన్ని నడపలేక తిప్పలు పడుతున్న ప్రధాని మైఖేల్ బార్నర్ను మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దిగువసభలో ఓటింగ్ చేపట్టకుండానే బడ్జెట్‌ను ఆమోదింపజేసుకున్నారన్న ఆగ్రహంతో ఈ చర్యకు దిగుతున్నాయి. తీర్మానానికి అతివాద న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి, వామపక్ష నేషనల్ ర్యాలీ (ఎన్ఆర్) తదితరాలు మద్దతివ్వనున్నాయి. ఈ ప్రయత్నాలను బార్నర్ తీవ్రంగా ఖండించారు. ‘‘ దేశ భవిష్యత్తును పణంగా పెట్టి స్వప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటున్న ఇలాంటి పార్టీలను ప్రజలు క్షమిస్తారనుకోను. మా ప్రభుత్వం కూలితే దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారుతుంది’’ అని హెచ్చరించారు. అవిశ్వాస తీర్మానం నెగ్గితే గత 60 ఏళ్లలో ఫ్రాన్స్‌లో ఒక ప్రభుత్వం కూలడం తొలిసారి అవుతుంది. తాను మాత్రం 2027లో పదవీకాలం పూర్తయ్యేదాకా అధ్యక్షునిగా కొనసాగుతానని ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం కూలితే ఫ్రాన్స్‌లో మళ్లీ రాజకీయ ముఖచిత్రం మారనుంది. ప్రస్తుత పార్లమెంట్ దిగువసభ అయిన నేషనల్ అసెంబ్లీలో మేక్రాన్‌కు చెందిన మధ్యేవాద కూటమి, అతివాద న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి, మరీన్ లీ పెన్ సారథ్యంలోని నేషనల్ ర్యాలీ పార్టీలు ఉన్నప్పటికీ ఏ పార్టీకి మెజారిటీ లేదు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే మొత్తం 574 మంది సభ్యులకుగాను 288 మందికిపైగా సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలి. అయితే విపక్షాలు రెండూ కలిస్తే వాటి బలం 330కిపైగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో తీర్మానం నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు విద్యుత్‌పై కొత్త పన్నులను తొలగించాలని మరీన్ లీ పెన్ డిమాండ్‌చేశారు. -
విపక్షాల కూటమికి షాక్.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు..
న్యూఢిల్లీ: అధికార ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల కూటమికి 'ఇండియా' అని పేరు పెట్టడంపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన నేపధ్యంలో హైకోర్టు విపక్షాల కూటమికి నోటీసులు జారీ చేసింది. అధికార బీజేపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా 26 ప్రతిపక్షాలు ఏకమై ఆ కూటమికి 'ఇండియా'(ఇండియాన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్) అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ కూటమికి ఇండియా అని నామకరణం చేయడంపై మొదట్లోనే వ్యతిరేకత వచ్చింది. దీనిపై ఎలెక్షన్ కమిషన్ కు నివేదించినా కూడా వారు స్పందించకపోవడంతోనే పిటిషనర్ రిట్ పిటిషన్ దాఖలు చేశాడని హైకోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ న్యాయమూర్తి అమిత్ మహాజన్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ వెంటనే కేంద్ర హోంశాఖ, ఎలక్షన్ కమిషన్, 26 పార్టీలు దీనిపై వివరణ ఇవ్వాల్సిందింగా కోరింది. విపక్షాల కూటమికి 'ఇండియా' అని నామకరణం చేయడంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని, ఎలక్షన్ కమిషన్‌ను ఆదేశించమని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇండియా అనే పేరుని వాడుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అమాయక ప్రజలను సెంటిమెంటుతో మోసం చేసి అధికారాన్ని చేజిక్కించుకుని మొదట వారిలో రాజకీయ ద్వేషాన్ని రగిలించి రాజకీయ విధ్వంసానికి పాల్పడనున్నారని పిల్ ద్వారా గిరీష్ భరద్వాజ్ పిల్లో పేర్కొన్నారు. ఇండియా అనేది జాతీయ చిహ్నంలో భాగమని.. విపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టడం 1950 యాక్ట్ నిబంధనల ప్రకారం వృత్తి, వాణిజ్య, రాజకీయ ప్రయోజనాలకు జాతీయ చిహ్నాన్ని వినియోగించడం చట్ట విరుద్ధం కాబట్టి ఒకరకంగా ఇది జాతిని అవమానించడమేనని అందులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Viral Video : ఎన్సీసీ జూనియర్లపై సీనియర్ దురాగతం.. -
మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ స్పందించాలని పార్లమెంట్లో విపక్షాల డిమాండ్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Parliament Monsoon Session 2023: అవిశ్వాసానికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు దాదాపు ఏడాది ఉండగానే అధికార బీజేపీ, కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమి తదితర విపక్ష పార్టీల బాహాబాహీకి అనూహ్యంగా రంగం సిద్ధమైంది. అనూహ్యంగా లోక్‌సభే ఇందుకు వేదికగా మారనుంది! మణిపూర్ హింసాకాండ తదితరాలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టే వ్యూహంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైన నాటినుంచీ విపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తుండటం తెలిసిందే. అందులో భాగంగా మరో అడుగు ముందుకేసి మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని అవి తాజాగా నిర్ణయించాయి. ఆ సవాలు స్వీకరించి విపక్షాల ఎత్తును చిత్తు చేసేలా మోదీ సర్కారు పై ఎత్తు వేయడం, అందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పరిగణనలోకి తీసుకోవడం... ఇలా బుధవారం హస్తినలో అనూహ్య రాజకీయ పరిణామాలు ఒకదాని వెంట ఒకటి చకచకా చోటుచేసుకున్నాయి...! అన్ని పార్టీలతో సంప్రదించాక అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీ, సమయం తదితరాలు వెల్లడిస్తానని స్పీకర్ ప్రకటించారు. అదే రగడ...: మణిపూర్ హింసాకాండ తదితరాలపై లోక్‌సభలో బుధవారం కూడా రగడ జరిగింది. దాంతో సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభం కాగానే, కేంద్ర మంత్రివర్గంపై విశ్వాసం లేదని పేర్కొంటూ గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్) ఇచి్చన నోటీసును స్పీకర్ అనుమతించారు. దానికి ఎందరు మద్దతిస్తున్నారని ప్రశ్నించగా కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ, ఫరూక్ అబ్దుల్లా (ఎన్సీ), టీఆర్ బాలు (డీఎంకే), సుప్రియా సులే (ఎన్సీపీ) తదితర విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులతో పాటు ప్రతిపక్ష సభ్యులంతా లేచి నిలబడ్డారు. దాంతో తీర్మానాన్ని అనుమతిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎంపీలు శ్రీనివాసరెడ్డి, రాములు, దయాకర్ లోక్ సభ సెక్రటరీ జనరల్‌కు అవిశ్వాస నోటీసులిచ్చారు. బీఆర్ఎస్ ఎంపీలు బీబీ పాటిల్, రంజిత్‌రెడ్డితో పాటు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా దానిపై సంతకాలు చేశారు. ‘ఇండియా’ కూటమిలో బీఆర్ఎస్ భాగస్వామి కాని విషయం తెలిసిందే. ఇప్పడేమవుతుంది? అవిశ్వాస తీర్మానంపై ఏ రోజు, ఎప్పుడు చర్చ మొదలు పెట్టాలో స్పీకర్ సారథ్యంలో జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయమవుతుంది. ► చర్చలో పాల్గొనేందుకు ఏయే పార్టీకి ఎంత సమయం ఇవ్వాలో స్పీకర్ నిర్ణయిస్తారు. ► చర్చ తర్వాత తీర్మానంపై ప్రధాని సమాధానమిస్తారు. తర్వాత ఓటింగ్ జరుగుతుంది. లోక్‌సభలో బలాబలాలివీ... లోక్‌సభ మొత్తం బలం 543. ప్రస్తుతం 5 ఖాళీలున్నాయి. బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ పక్షానికి 330 మందికి పైగా, విపక్ష ‘ఇండియా’ కూటమికి 140కి పైగా ఎంపీల బలముంది. ఈ రెండు కూటముల్లోనూ లేని ఎంపీలు 60 మందికి పైగా ఉన్నారు. మోదీ జోస్యమే నిజమైంది! విపక్షాలు అవిశ్వాస తీర్మానం ఇవ్వడంతో ప్రధాని మోదీ నాడు చెప్పిన జోస్యమే నిజమైందంటూ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019 జూలై 20న మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తొలిసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తెలిసిందే. దానికి అనుకూలంగా 126 మంది ఓటేయగా 325 మంది ఎన్డీఏ సభ్యులు వ్యతిరేకించారు. దాంతో భారీ మెజార్టీతో మోదీ సర్కారు గట్టెక్కింది. ఆ సందర్భంగా అవిశ్వాస తీర్మానంపై చర్చకు మోదీ బదులిస్తూ విపక్షాలను ఎద్దేవా చేశారు. ‘2023లోనూ నా ప్రభుత్వంపై అవిశ్వాస పరీక్ష పెట్టేంతగా వాళ్లు సన్నద్ధం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ చెణుకులు విసిరారు. అచ్చం ఆయన అన్నట్టుగానే ఇప్పుడు జరుగుతోందంటూ బుధవారం రోజంతా సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొట్టాయి. -
పార్లమెంట్లో మణిపూర్ మంటలు.. లోక్‌సభ రేపటికి వాయిదా
Updates.. ► మణిపూర్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్ సభ మరోసారి దద్దరిల్లింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. ► మణిపూర్ అంశంపై తప్పుకుండా చర్చిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. లోక్‌సభలో మణిపూర్ అంశంపై చర్చను జరగనీయాలని ప్రతిపక్షాలను కోరారు. ఈ సున్నితమైన అంశానికి సంబంధించిన వివరాలను దేశ ప్రజలు తెలుసుకోవాలని అమిత్ షా చెప్పారు. ► మణిపూర్ అంశంపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ వెల్‌లోకి దూసి ఆయనపైకి ఫ్లకార్డ్లతో నిరసనలు తెలిపారు. విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. #WATCH | Rajya Sabha Chairman suspends AAP MP Sanjay Singh for the remaining duration of the Monsoon session during the Opposition's protest in the House over the Manipur issue pic.twitter.com/YpNYIhhMck — ANI (@ANI) July 24, 2023 ► ఈ క్రమంలో ధన్కర్.. సంజయ్ సింగ్‌ను సభ నుంచి సస్పెండ్ చేశారు. వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ధన్కర్ స్పష్టం చేశారు. ► మళ్లీ ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో రెండు సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ► లోక్‌సభ సైతం మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది. ► మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ వాయిదా. #MonsoonSessionofParliament | Rajya Sabha adjourned till 12 noon. — ANI (@ANI) July 24, 2023 ► లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీల ఎంపీల నిరసనలు.. Opposition MPs with placards 'INDIA for Manipur' and 'INDIA demand PM statement on Manipur' in Lok Sabha as the session gets underway pic.twitter.com/uHcmyheJDI — ANI (@ANI) July 24, 2023 ► లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. మణిపూర్‌కు చర్చకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. "We are ready for discussion in Parliament," says Defence Minister Rajnath Singh in Lok Sabha as opposition MPs demand PM Modi's statement on Manipur#MonsoonSession pic.twitter.com/36t74wKlBL — ANI (@ANI) July 24, 2023 ► కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. మణిపూర్ అంశంపై చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. 140 కోట్ల మంది ప్రజల నాయకుడు(ప్రధాని మోదీ) పార్లమెంటు వెలుపల ప్రకటన చేశారు. అలాగే, ప్రజాప్రతినిధులు కూర్చునే పార్లమెంటులో కూడా ప్రకటన చేయాలి అని డిమాండ్ చేశారు. #WATCH | "We are ready...If the leader of 140 crore people makes a statement outside the Parliament, then he should make a statement in the Parliament where people's representatives sit," says LoP Rajya Sabha & Congress President Malliakarjun Kharge. pic.twitter.com/QtT5JiNYAO — ANI (@ANI) July 24, 2023 ► టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. మణిపూర్ దారుణ ఘటనలో సోషల్ మీడియాలో మేము చూసిన విజువల్స్ చాలా కలవరపెడుతున్నాయి. మణిపూర్‌పై సభలో చర్చను ప్రధాని మోదీ కోరుకోవడం లేదు. ప్రభుత్వం దృష్టిని మళ్లిస్తోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అసమర్థమైనది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ► ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్ ఘటన మహిళలకు సంబంధించిన విషయం. ఇదేమీ రాష్ట్రాల మధ్య పోటీ కాదు. ఇలాంటి ఘటనలు ఏ రాష్ట్రంలో జరిగినా అది తప్పే అవుతుందన్నారు. #WATCH | NCP MP (Sharad Pawar faction) Supriya Sule on Manipur viral video, says, "This is about women, not a competition between States. Such a thing happening in any state is wrong." pic.twitter.com/YCdnaF40VR — ANI (@ANI) July 24, 2023 ► పార్లమెంట్ సమావేశాలకు హాజరైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. #WATCH | Congress Parliamentary Party Chairperson and Lok Sabha MP Sonia Gandhi arrives at the Parliament. #MonsoonSession pic.twitter.com/PPzBrtXlA9 — ANI (@ANI) July 24, 2023 ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మరోసారి మణిపూర్ ఘటనపై నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నేతలు మణిపూర్‌పై ప్రధాని మోదీ ఉభయ సభల్లో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. ► ఇటు, అధికార బీజేపీ పార్లమెంట్ సభ్యులు.. పలు రాష్ట్రాలకు మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. #WATCH | Opposition parties (I.N.D.I.A) protest in Parliament demanding PM Modi's statement on Manipur in both houses. pic.twitter.com/b8kjFA7UUB — ANI (@ANI) July 24, 2023 ► రాజస్థాన్‌కు చెందిన ఎంపీలు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. వీరంతా రాజస్థాన్‌లో జరుగుతున్న క్రైమ్స్, మహిళలపై దాడులను ఖండిస్తూ నిరసనలు తెలిపారు. సీఎం అశోక్ గెహ్లాట్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. #WATCH | Delhi: BJP Rajasthan MPs along with senior leaders hold a protest in front of the Gandhi statue. The protest is against issues of rising atrocities and crime against women in the state. pic.twitter.com/ruyKBbsZEM — ANI (@ANI) July 24, 2023 ► ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభల్లో మాట్లాడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. మణిపూర్ శాంతి నెలకోల్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. మణిపూర్ విషయంలో కేంద్రం తీరుకు మేము ఈరోజు నిరసనలు తెలుపుతాము. రాజ్యసభ ఛైర్మన్ చర్చకు అనుమతించాలని కోరారు. #WATCH | AAP MP Raghav Chada says "The country demands that the Govt and PM Modi should speak on the issue of Manipur. It is the responsibility of the Central govt to restore peace in the country. Today we are going to protest against this issue in the Parliament. Rajya Sabha… pic.twitter.com/bHGAVZMqOF — ANI (@ANI) July 24, 2023 ► ‘ఇండియా’.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసనకు దిగారు. మణిపూర్ అంశంపై ఉభయ సభల్లో ప్రధాని చర్చకు రావాలని డిమాండ్ చేశారు. #WATCH | Opposition parties (I.N.D.I.A) protest in Parliament demanding PM Modi's statement on Manipur in both houses. pic.twitter.com/zhX9ZKMtal — ANI (@ANI) July 24, 2023 ► కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాలని ప్రతిపక్షాలను అభ్యర్థిస్తున్నాం. చర్చల నుంచి ఎందుకు పారిపోతున్నారు? వారి వ్యూహాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు అని అన్నారు. #WATCH | We request the Opposition to take part in structured and constructive discussions in the Parliament. Why are they running away from discussions? Nobody is able to understand their strategy: Union minister Pralhad Joshi on Manipur issue pic.twitter.com/CQrNoMZP3W — ANI (@ANI) July 24, 2023 #WATCH | Delhi: On BJP's protest against rising atrocities & crime against women in Rajasthan, BJP MP Ravi Kishan says, "We demand the resignation of Rajasthan CM Ashok Gehlot. The atrocities on Dalits (women) need to be stopped. The atrocities have tremendously increased and so… pic.twitter.com/bLrZPf6ADf — ANI (@ANI) July 24, 2023 -
బీజేపీ శవపేటికకు చివరి మేకు అదే..కేంద్రానికి స్టాలిన్ హెచ్చరికలు..
తమిళనాడు:ప్రతిపక్షాలతో బీజేపీ ఎన్నికల్లో పోరాడటంలేదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఎన్నికల్లో పోరాడి బీజేపీని ఓడిస్తామని హెచ్చరించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రం ప్రభుత్వంపై డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ నిరసన సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అసత్య ప్రచారాలతో బీజేపీ సృష్టించుకున్న ఇమేజ్ను దెబ్బతీస్తామని అన్నారు. 'బీజేపీకి ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలపై దురహంకార చర్యలకు పాల్పడుతోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వడమే బీజేపీ శవపేటికకు చివరి మేకు అవుతుంది' అని స్టాలిన్ అన్నారు. మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనలు తెలుపుతూ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ సమావేశం నిర్వహించింది. ఇదీ చదవండి:ముందస్తును కొట్టిపారేయలేం: నితీశ్ -
ఏకమైన ప్రతిపక్షాలు... బీజేపీని ఓడించడమే లక్ష్యం
పాట్నా: జూన్ 23న పాట్నా వేదికగా సమావేశం కానున్న అఖిలపక్ష నేతలు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, ఎంకె స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, హేమంత్ సొరేన్ తదితర ముఖ్యనేతలు హాజరు కానున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పిన ఈ నేతలంతా ఒక్కచోట కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2024 ఎన్నికలే లక్ష్యం... వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీని మట్టి కరిపించడమే లక్ష్యంగా అఖిలపక్షాలు పావులు కదుపుతున్నాయి. వన్ ఆన్ వన్ సిద్దాంతానుసారంగా ఒక పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్ధికి వ్యతిరేకంగా తమ పార్టీలకు చెందిన ఒకే ఒక బలమైన ప్రత్యర్థిని నిలబెట్టి బీజేపీ వ్యతిరేక ఓటును చీలకుండా ఉంచేందుకు చేతులు కలపనున్నాయి అఖిలపక్ష పార్టీలు. బద్దశత్రువులంతా ఒకే చోట..? ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే ఎజెండాగా జూన్ 23న పాట్నాలో ఈ అఖిలపక్ష సమావేశం జరగనున్నట్లు జనతాదళ్ యునైటెడ్ జాతీయాధ్యక్షుడు రాజీవ్ రంజన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుండి రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, ఇతర రాష్ట్రాల నుండి తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్, బెంగాల్ సీఎం మమతా ఎనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లు హాజరు కానున్నట్లు ఆయన చెప్పారు. ఒక్క పార్టీ కోసం ఒక్కటయ్యారు.. ఈ సమావేశానికి ముందే అఖిలపక్ష నేతలంతా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి వేడుకలకు హాజరు కానున్నట్లు సమాచారం. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించిన తర్వాత సిద్ధరామయ్య ప్రమాణస్వీకారానికి హాజరై పక్క రాష్ట్రాల నేతలంతా తమ బలప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి కూడా వీరంతా ఏకతాటిపై నిలిచి కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఇలా అవకాశమున్నప్పుడల్లా ఐక్యత చాటుకుంటూ వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: మరో విమానాన్ని సిద్ధం చేసిన ఎయిర్ ఇండియా.. -
విపక్షాల భేటీలో ఊహించని పరిణామం
ఢిల్లీ: కేంద్రాన్ని తీరును ఎండగట్టేందుకు ఇవాళ విపక్షాలు ఏకమయ్యాయి. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని ఇవాళ జరిగిన భేటీకి హాజరై.. ఆపై నిరసనల్లో సంఘటితంగా మోదీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాయి. రాహుల్ గాంధీ అనర్హత వేటును వ్యతిరేకిస్తూ సాగిన నల్ల దుస్తుల నిరసనలో విపక్షాలు ఒక్కటిగా ముందుకు సాగడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఖర్గే నేతృత్వంలో విపక్షాల వ్యూహత్మాక సమావేశం జరిగింది. ఆయన కార్యాలయంలో జరిగిన భేటీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌యేతర ఫ్రంట్ కావాలని బలంగా కోరుకుంటున్న టీఎంసీ సైతం ఈ భేటీకి హాజరైంది. తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రసూన్ బెనర్జీ, జవహార్ సిర్కార్‌లు విపక్షాల వ్యూహత్మాక సమావేశానికి హాజరయ్యారు. రాహుల్ గాంధీ విషయంలో విపక్షాలన్నీ ఏకతాటిపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టమవుతున్నా.. టీఎంసీ తన మద్దతును ఈ అంశానికే పరిమితం చేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక.. కాంగ్రెస్ ఈ పరిణామాన్ని స్వాగతించింది. మొత్తం పదిహేడు పార్టీలు హాజరయ్యాయి ఈ భేటీకి. నల్ల దుస్తుల నిరసనలు కేసీఆర్ బీఆర్ఎస్ సైతం పాల్గొంది. దీనికి మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకే, నిన్న అందరికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను, ఈరోజు కూడా కృతజ్ఞతలు చెప్పాను. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు, ప్రజలను కాపాడేందుకు ఎవరైనా ముందుకు వచ్చినా స్వాగతిస్తున్నాం. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని ఖర్గే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పొలిటికల్ కామెంట్: తమ పిల్లలు మాత్రమే ఇంగ్లీషు మీడియంలో చదవాలా..?
-
‘సొంత ఖర్చులతో అమెరికా వెళ్తున్నా’
బెంగళూరు : నా సొంత ఖర్చులతో త్వరలోనే అమెరికా వెళ్తున్నా అంటున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. ఇంత సడెన్‌గా కుమారస్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఓ కారణం ఉంది. ప్రస్తుతం కుమారస్వామి పల్లె నిద్ర పేరిట గ్రామాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం నేటితో ముగింపుకు చేరుకుంది. అయితే సీఎం పల్లె నిద్ర కార్యక్రమం కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారని.. పల్లెల్లో కూడా ఫైవ్‌స్టార్ హోటల్ అరెంజ్మెంట్స్ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి త్వరలోనే తాను అమెరికా వెళ్తున్నాని.. అందుకు అయ్యే ఖర్చును పూర్తిగా తానే భరిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. ‘ఆదిచుంచునగరి మఠం శంకుస్థాపన నిమిత్తం త్వరలోనే న్యూ జెర్సీ వెళ్తున్నాను. ఇది అధికారిక పర్యటన కాదు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అమెరికా వెళ్తున్నాన’ని తెలిపారు. ఇక తన పల్లె నిద్ర కార్యక్రమం గురించి విపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై కుమారస్వామి స్పందిస్తూ.. ‘ఈ మధ్యే ఒక పాఠశాలలో బస చేసినప్పుడు అక్కడ ఓ మంచి వాక్యం నా కంట పడింది. అర్థంలేని ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం అని పాఠశాల గోడల మీద రాసి ఉంది. అదే ఇక్కడ నేను పాటిస్తున్నాను’ అన్నారు. -
కనుమరుగవుతున్న విపక్షాల కూటమి!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిపక్ష పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికలకు ముందున్న ఆ కాస్త ఐక్యత ఫలితాల అనంతరం క్రమంగా కనుమరుగవుతోంది. ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీలు రానున్న 11 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో విడి విడిగా పోటీ చేస్తుండడం, ఈ విషయాన్ని బీఎస్పీ నాయకురాలు మాయావతి పత్రికా ముఖ్యంగా మరీ ప్రకటించడం తెల్సిందే. కలిసికట్టుగా పోటీ చేసినా అత్యధిక సీట్లను బీజేపీ తన్నుకుపోవడం నుంచి వచ్చిన నైరాశ్యంతో మాయావతి ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. తెలంగాణాలో మళ్లీ బలపడే అవకాశం ఉందన్న కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుండడం, 18 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలకుగాను 12 మంది తమ పక్షాన్ని టీఆర్ఎస్లో చేర్చుకోవాల్సిందిగా కోరడం ప్రతిపక్షాలకు బాధాకరమైన పరిణామమే. బీజేపీ అధికారంకి రాకుండా ఉంచేందుకు కర్ణాటకలో ఏకమై సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలకు ఇప్పటికీ కంటి మీద కునుకు లేకుండా పోయింది. తమ పక్షం నుంచి ఎప్పుడు ఎవరు జారుకుంటారో, ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో అన్న ఆందోళన ఆ పార్టీల నాయకులను పట్టి పీడిస్తోంది. సాధారణ కేబినెట్ విస్తరణ చేయడానికే వారు భయపడి పోవడం, అప్పుడే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాల్సిందిగా పార్టీ కార్యకర్తలను స్వయాన ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పిలుపునివ్వడం పరిస్థితిని తెలియజేస్తోంది. ప్రతిపక్షానికి సుదీర్ఘకాల వ్యూహం లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయని అర్థం అవుతోంది. ఎన్నికల ముందు తాత్కాలికంగా ఒక్కటై పోటీ చేయడం వల్ల తాత్కాలిక ఫలితాలు ఉండొచ్చేమోగానీ ఆశించిన ఫలితాలు మాత్రం ఎప్పటికీ రావు. అవి రావాలంటే ముందు, ఆ తర్వాత బలమైన ఐక్యతనే ప్రదర్శించాలి. అందుకు బలమైన సాక్ష్యం కూడా మొన్నటి తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే అత్యధిక సీట్లను గెలుచుకోవడం. ఎన్నికల అనంతం కూడా డీఎంకే మిత్రపక్షాలు గట్టి ఐక్యతను చాటాయి. హిందీయేతర రాష్ట్రాలపై హిందీని రుద్దవద్దని గట్టిగా నినదించడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ‘నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్’ వల్ల తమ రాష్ట్రం విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న విషయంలో కూడా వారు ఐక్యతా బలాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్షాల ఐక్యతకు మొదట్లో కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అప్పుడే కాడి పడేయకుండా బీజేపీకి ఎప్పటికప్పుడు చెక్ పెట్టడానికి ప్రతిపక్షాలను ఎల్లప్పుడు ఏకతాటిపైకి తీసుకురావాలి, అందుకు ఎప్పుడూ కృషి చేయాల్సిందే. లేకపోతే ఆ పార్టీకి మనుగడే ఉండదు. -
టీడీపీ, బీజేపీ పాపపరిహారం చేసుకోవాలి
సాక్షి, కడప : కడప ఉక్కు - రాయలసీమ హక్కు అంటూ వైఎస్సార్ జిల్లా నినదించింది. కరువు సీమ అభివృద్ధి చెందాలంటే ఉక్కు పరిశ్రమ ఒక్కటే దారని జిల్లా ప్రజానీకం ఆకాంక్షింది. నాయకుల కుట్రలకు బలైన రాయలసీమకు న్యాయం చేయాలంటూ యువత ఉద్యమ బాట పట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన ఉక్కు పరిశ్రమను స్థాపించాల్సిందేనని జిల్లా ప్రజానీకం ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. తమ హక్కులను సాధించుకోవడానికి అఖిల పక్షం పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే జిల్లా వ్యాప్తంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు బంద్‌లో పాల్గొన్నారు. కడప ఉక్కు పరిశ్రమ విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి నిరసనగా శుక్రవారం వైఎస్ఆర్సీపీ, వామపక్షాలు సంయుక్తంగా జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పూటకో మాట మాట్లాడుతున్న టీడీపీ.. : బంద్ సందర్బంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీలకు గుణపాఠం చెప్పేందుకు బంద్ చేపట్టామని అన్నారు. విభజన హామీలను బీజేపీ విస్మరించిందని ఆయన ధ్వజమెత్తారు. ఇరుపార్టీలకు సెగ తగిలేలా ఉక్కు ఉద్యమం చేపట్టామని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకొని కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలకు ఉక్కు పరిశ్రమపై చిత్తశుద్ధి లేదని, అందుకే పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజల్లో పరిశ్రమపై బలమైన ఆకాంక్ష ఉందని, అందుకే బంద్‌కు అందరూ సహకరిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా పాపపరిహారం చేసుకోవాలి : జిల్లాకు ఉక్కు పరిశ్రమ ప్రకటించకపోవడంపై వామపక్ష నేతలు మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసి పాపాలను మూటగట్టుకున్నాయని, ఉక్కు పరిశ్రమ స్థాపించి చేసిన పాపాలకు పరిహారం చేసుకోవాలని హితవు పలికారు. ప్రజాఉద్యమంలో టీడీపీ, బీజేపీలు కొట్టుకు పోతాయిని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశత్వం విడిచి ప్రజల ఆకాంక్షల మేరకు నడుచు కోవాలంటూ సూచించారు. హామీలు అమలయ్యే వరకూ పోరాటం : విభజన చట్టంలోని హామీలు అమలయ్యే వరకూ వైఎస్సార్సీపీ అవిశ్రాంతంగా పోరాటం చేస్తుందని మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని జిల్లాలో ఉక్కు పరిశ్రమ పెట్టాలనే ఆకాంక్షను బలంగా తెలియచేశారని అన్నారు. గత నాలుగేళ్లుగా విభజన చట్టం హమీల కోసం నాలుగేళ్లుగా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంటే.. టీడీపీ నేతలు మాత్రం చిత్తశుద్ధి లేని దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. -
భూ బిల్లుపై నిరసనలు
న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా మంగళవారం ఢిల్లీలో వామపక్షాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి రైతులు భారీగా తరలివచ్చిన ఈ కార్యక్రమంలో టీఎంసీ, జేడీయూ పార్టీల నేతలు, సామాజిక కార్యకర్త మేథా పాట్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ బిల్లు రైతు వ్యతిరేకమని, దీనివల్ల ఆహార సంక్షోభం ఏర్పడుతుందని పలువరు నేతలు హెచ్చరించారు. పార్లమెంటు వెలుపల రైతుల ఐక్యతే పార్లమెంటులో ఈ బిల్లుకు వ్యతిరేకంగా తమకు పోరాడే శక్తినిస్తుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి పేర్కొన్నారు.