న్యూఢిల్లీ: అధికార ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల కూటమికి 'ఇండియా' అని పేరు పెట్టడంపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన నేపధ్యంలో హైకోర్టు విపక్షాల కూటమికి నోటీసులు జారీ చేసింది.
అధికార బీజేపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా 26 ప్రతిపక్షాలు ఏకమై ఆ కూటమికి 'ఇండియా'(ఇండియాన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్) అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ కూటమికి ఇండియా అని నామకరణం చేయడంపై మొదట్లోనే వ్యతిరేకత వచ్చింది. దీనిపై ఎలెక్షన్ కమిషన్ కు నివేదించినా కూడా వారు స్పందించకపోవడంతోనే పిటిషనర్ రిట్ పిటిషన్ దాఖలు చేశాడని హైకోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ న్యాయమూర్తి అమిత్ మహాజన్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ వెంటనే కేంద్ర హోంశాఖ, ఎలక్షన్ కమిషన్, 26 పార్టీలు దీనిపై వివరణ ఇవ్వాల్సిందింగా కోరింది.
విపక్షాల కూటమికి 'ఇండియా' అని నామకరణం చేయడంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని, ఎలక్షన్ కమిషన్‌ను ఆదేశించమని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇండియా అనే పేరుని వాడుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అమాయక ప్రజలను సెంటిమెంటుతో మోసం చేసి అధికారాన్ని చేజిక్కించుకుని మొదట వారిలో రాజకీయ ద్వేషాన్ని రగిలించి రాజకీయ విధ్వంసానికి పాల్పడనున్నారని పిల్ ద్వారా గిరీష్ భరద్వాజ్ పిల్‌లో పేర్కొన్నారు.
ఇండియా అనేది జాతీయ చిహ్నంలో భాగమని.. విపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టడం 1950 యాక్ట్ నిబంధనల ప్రకారం వృత్తి, వాణిజ్య, రాజకీయ ప్రయోజనాలకు జాతీయ చిహ్నాన్ని వినియోగించడం చట్ట విరుద్ధం కాబట్టి ఒకరకంగా ఇది జాతిని అవమానించడమేనని అందులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Viral Video : ఎన్‌సీసీ జూనియర్లపై సీనియర్ దురాగతం..
Comments
Please login to add a commentAdd a comment