notice issue
-
అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి నోటీసులు
-
15 రోజుల్లో రూ.24.57 కోట్లు చెల్లించాలి: సెబీ
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, కంపెనీ సీఎండీ సి.పార్థసారథికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నోటీసు జారీ చేసింది. పవర్ ఆఫ్ అటార్నీను దుర్వినియోగం చేయడం ద్వారా ఖాతాదారుల నిధులను పక్కదారి పట్టించిన కేసులో రూ.24.57 కోట్లను చెల్లించాలని ఆదేశించింది.గతంలో సెబీ విధించిన జరిమానాను చెల్లించడంలో కార్వీ సంస్థ విఫలమైంది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి ఈ నోటీసు వచ్చింది. 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించని పక్షంలో బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసి, కంపెనీల స్థిర, చర ఆస్తులను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని రికవరీ చేస్తామని సెబీ హెచ్చరించింది. అంతేకాకుండా మార్కెట్ రెగ్యులేటర్ నిబంధనల ప్రకారం పార్థసారథిని అరెస్ట్ చేసి జైలులో నిర్బంధిస్తామని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ప్రముఖ సంస్థపై సీబీఐ కేసు నమోదుబ్రోకింగ్ సంస్థకు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీను దుర్వినియోగం చేసినట్లు సెబీ గతంలోనే తెలిపింది. క్లయింట్ల నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారని పేర్కొంది. దాంతో ఏప్రిల్ 2023లో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, సీఎండీ పార్థసారథిలను సెక్యూరిటీ మార్కెట్ నుంచి ఏడేళ్లపాటు సెబీ నిషేధించింది. అలాగే రూ.21 కోట్ల పెనాల్టీని కూడా విధించింది. అయితే ఈ పెనాల్టీను చెల్లించడంలో కార్వీ జాప్యం చేస్తోంది. దాంతో జరిమానాతో కలిపి మొత్తం రూ.24.57 కోట్లు చెల్లించాలని సెబీ ఆదేశించింది. -
కర్ణాటకలో కొత్త ట్విస్ట్.. ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణకు సిట్ నోటీసులు
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులు, దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లికి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణను విచారించేందుకు శుక్రవారం ఐపీసీ సెక్షన్లు 64(A), 365, 109, 120(B) కింద సిట్ నోటీసులు ఇచ్చింది. తమ విచారణ కోసం భావానీ రేవణ్ణ హోలెనర్సీపూర్‌లోని వారి నివాసంలోనే జూన్ 1న సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది. #BreakingS.I.T issues another notice to #PrajwalRevanna's mother #BhavaniRevanna in the kidnapping case.Prajwal Revanna will shortly be taken for a medical examination, and after that, he will be brought to the City Civil Court Complex for further questioning...: @dpkBopanna… pic.twitter.com/G9croxFBP6— TIMES NOW (@TimesNow) May 31, 2024 ఇక.. శుక్రవారం తెల్లవారుజామున జర్మనీ నుంచి భారత్‌కు వచ్చిన ప్రజ్వల్ రేవణ్ణను సిట్ పోలీసులు బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. ఇక.. అక్కడి నుంచి ఆయన్ను విచారణ కోసం సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. విచారణలో భాగంగా ప్రజ్వల్‌కు పొటెన్సీ పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
Lok sabha elections 2024: ఫేక్ రాజకీయం!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏప్రిల్ 23న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను వారికి తిరిగిస్తామని ప్రకటించారు. అయితే మొత్తంగా రిజర్వేషన్లనే రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్టుగా మారి్ఫంగ్ చేసిన వీడియో తాజాగా దేశవ్యాప్తంగా వైరలవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర నష్టం చేయగల ఈ పరిణామాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర హోం శాఖ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. దీంతో సంబంధముందంటూ అసోంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక ఈ నకిలీ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ విస్తృతంగా షేర్ చేసిందంటూ పీసీసీ చీఫ్ అయిన సీఎం రేవంత్‌రెడ్డికి ఏకంగా సమన్లు జారీ చేశారు! సోమవారం హైదరాబాద్ వచ్చి మరీ రేవంత్, పీసీసీ సోషల్ మీడియా ఇన్చార్జి, మరికొందరు కాంగ్రెస్ నేతలకు నోటీసులిచ్చారు! అమిత్ షా మార్ఫింగ్ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారన్నది రేవంత్‌పై ఆరోపణ. రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్న ఈ పరిణామంతో డీప్ ఫేక్ ముప్పు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది...దేశం ఇప్పుడు సమాచార యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. సాంకేతికత సమాచారాన్ని ఎంత వేగంగా ప్రచారం చేస్తోందో అంతే వేగంగా దేశాన్ని ప్రమాదంలోనూ పడేస్తోంది. ముఖ్యంగా కృత్రిమ మేధతో పుట్టుకొచి్చన వికృత శిశువు ‘డీప్ ఫేక్’ ఎన్నికల్లో పెద్ద అస్త్రంగా మారిపోయింది. పారీ్టలు ఫేక్ వీడియోలతో తమ ప్రత్యర్థులపై దు్రష్పచారం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫేక్ వీడియోలు విపరీతంగా కలకలం రేపడమే గాక ఓటర్లపైనా బాగా ప్రభావం చూపాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఫేక్ వీడియోల జోరు మామూలుగా లేదు! పలు పార్టీలు తమ చేతికి మట్టి అంటకుండా డీప్ ఫేక్‌లను వీలైనంతగా వాడుకుంటున్నాయి. చౌక బేరండీప్ ఫేక్‌లను రూపొందించడానికి అవసరమైన కృత్రిమ మేధ సాధనాలు కారుచౌకగా అందుబాటులో ఉన్నాయి. కొన్నయితే ఉచితం కూడా! దాంతో పారీ్టలన్నీ ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎడాపెడా డీప్ ఫేక్‌లను తయారు చేసి వదులుతున్నట్టు వాటి నిర్వాహకులే చెబుతున్నారు. టీవీ వార్తలు మొదలుకుని ఫేస్బుక్, వాట్సాప్ వంటి గ్లోబల్ ప్లాట్‌ఫాంల దాకా నకిలీ వార్తల రూపకల్పన, ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ఇవి ఒకసారి జనంలోకి వెళ్లాక ఏం చేసినా నష్ట నివారణ కష్టమే.ఏఐ వాడకం..బీజేపీతోనే మొదలు... » ప్రచారంలో సాంకేతికతను వాడకంలో అధికార బీజేపీ ఎంతో ముందంజలో ఉంది. » ఆ పార్టీ 2012లోనే మోదీ త్రీడీ హాలోగ్రామ్‌ను వాడింది! దీని ద్వారా ఒకేసారి అనేక ప్రదేశాల్లో ప్రచారంలో పాల్గొనవచ్చు. » ఈ వ్యూహాన్ని 2014 లోక్‌సభ ఎన్నికల్లో విస్తృతంగా అమలు చేశారు. » ప్రచారం కోసం డీప్‌ఫేక్‌లను వాడిన తొలి నేతగా ఢిల్లీ బీజేపీ ఎంపీ, సినీ నటుడు మనోజ్ తివారీ నిలిచారు. 2020లో ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ హిందీ, హర్యాణ్వీ, ఇంగ్లిష్ భాషల్లో ఓటర్లనుద్దేశించి మూడు వీడియోల్లో ప్రసంగించారు. వీటిలో హిందీ వీడియో మాత్రమే అసలుది. మిగతా రెండూ డీప్ ఫేక్‌లు. కానీ ఏ మాత్రమూ గుర్తించలేనంత పకడ్బందీగా తివారీ గొంతు, పెదవుల కదలిక తదితరాలను మార్చారు! గతి తప్పుతున్న వ్యూహం అధికారికంగా, బహిరంగంగా జరిగే డీప్ ఫేక్ వ్యవహారాన్ని మించి ప్రత్యర్థులపై బురదజల్లేలా ‘అనైతిక ప్రచారం’ జోరుగా సాగుతోంది. వాట్సాప్‌లో అంతర్జాతీయ నంబర్లు, ఇన్స్టా్రగాంలో బర్నర్ హ్యాండిల్స్ తదితరాల ద్వారా ఇలాంటి కంటెంట్ ప్రజలను చేరుతోంది. రాజకీయ ప్రత్యర్థుల వీడియోలు, ఆడియోలకు అభ్యంతరకర, అశ్లీల కంటెంట్‌ను జోడిస్తూ డీప్ ఫేక్‌లు హోరెత్తిస్తున్నాయి. పలు సంస్థలు ఇలాంటి కంటెంట్ తయారీతో పాటు దాన్ని వైరల్ చేసే బాధ్యతనూ తీసుకుంటున్నాయి. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా నిర్మాణ కారి్మకుల ఫోన్ నంబర్ల సాయంతో డీప్ ఫేక్‌లను విచ్చలవిడిగా వైరల్ చేశారు. అభ్యర్థులు అవినీతిపరులని చూపేందుకు డబ్బులు తీసుకుని ఓటేయాలని ఓటర్లను బెదిరిస్తున్నట్టు, డబ్బు పంచుతున్నట్టు వీడియోలు, ఆడియోలు రూపొందించి ప్రచారం చేశారు. ప్రత్యర్థులపైనే గాక సొంత పారీ్టలోనూ శత్రువులపైనా కొందరు ఇలాంటి ప్రచారాలకు దిగుతున్నారు!చట్టాలకావల మన దేశంలో డీప్ ఫేక్ ఎన్నికల సమగ్రతకే ముప్పుగా మారుతోంది. ప్రస్తుత చట్టాలేవీ డీప్ ఫేక్ను స్పష్టంగా నిర్వచించడం లేదు. వ్యక్తిగత కేసుల్లో ఐటీ చట్టంతో కలిపి, పరువు నష్టం, నకిలీ వార్తలు, వ్యక్తి ప్రతిష్టకు భంగం, ప్రైవసీ ఉల్లంఘన వంటి చట్టాలను వాడుతూ పోలీసులు నెట్టుకొస్తున్నారు. నిరాశపరిచిన మ్యూనిచ్ ఒప్పందం డీప్ ఫేక్‌లను నియంత్రించాలంటూ గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు కృత్రిమ మేధ సాధనాలను వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ ప్రముఖ టెక్ కంపెనీలు మ్యూనిచ్ సదస్సులో ఒప్పందానికి వచి్చనా ఆచరణలో పెద్దగా జరిగిందేమీ లేదు. గతేడాది తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాంటిదే జరిగింది. కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ ప్రజలకు పిలుపునిస్తున్న వీడియో క్లిప్ పోలింగ్‌కు ముందు రోజు తెగ వైరలైంది. దాన్ని లక్షలాది మంది చూశారు. ఇదీ కృత్రిమ మేధ సాయంతో రూపొందిన డీప్ ఫేక్ వీడియోనే.నోట్ దీజ్ పాయింట్స్» భారత్‌లో జనాభాలో సగానికి పైగా, అంటే ఏకంగా 76 కోట్ల పై చిలుకు ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. » కనుక ఆన్లైన్ ప్రచారం శరవేగంగా ప్రజలను చేరుతోంది. » రీల్స్, షార్ట్స్ ప్రపంచాన్ని ఏలుతున్న ఈ రోజుల్లో ఒక్క క్లిక్, ఒక్క స్వైప్‌తో ఓటరు అభిప్రాయాన్ని మార్చొచ్చు. కనీసం ప్రభావితం చేయొచ్చు. » పార్టీ అభిమానులు పెద్దగా పట్టించుకోకున్నా తటస్థ ఓటర్లను ఇలాంటి ప్రచారం ప్రభావితం చేయగలదు. » ఈ అంశాన్ని తమ అభిమాన పార్టీలకు సానుకూలంగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. » అందుకే కృత్రిమ మేధతో పుట్టుకొచ్చే ‘మానిప్యులేటెడ్ కంటెంట్’ ఈ లోక్‌సభ ఎన్నికల్లో అనేక రెట్లు పెరగనుందని అంచనా. తప్పుడు ప్రచారంతో ఒక్క ఓటర్ మనసు మార్చినా అది స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు గొడ్డలిపెట్టే. ఈ తప్పుడు ప్రచార సరళి మీద ఈసీ దృష్టి పెట్టి ప్రజాస్వామ్యానికి చేటుగా మారుతున్న డీప్‌ఫేక్‌లను నియంత్రించాల్సిన అవసరముంది. నష్టం జరగకముందే చర్యలు తీసుకోవాలి– కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్ ఎస్‌వై ఖురేషీ–సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ.46 కోట్లు కట్టు! పీజీ విద్యార్థికి ఐటీ నోటీసు
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రమోద్ దండోతియా(25) అనే పీజీ విద్యార్థి ఏకంగా రూ.46 కోట్ల ఆదాయ పన్ను నోటీసు అందుకున్నాడు! దాంతో షాకై పోలీసులను ఆశ్రయించాడు. తన పాన్ కార్డు వివరాల ద్వారా ఎవరో ఢిల్లీ, ఫుణేల్లో తన పేరిట ఓ కంపెనీని సృష్టించి ఈ లావాదేవీలు జరిపినట్లు ఐటీ, జీఎస్టీ అధికారుల ద్వారా తెలిసిందని బాధితుడు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారతనికి సూచించారు. ఐటీ నోటీసులు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రమోద్‌కు చెప్పినట్టు ఏఎస్పీ షియాజ్ తెలిపారు. దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
కేజ్రీవాల్‌కు మళ్లీ సమన్లు
న్యూఢిల్లీ: మద్యం విధానం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణకు రావాలంటూ ఈడీ పంపిన నోటీసులను పట్టించుకోని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. విచారణకు రావాలంటూ జనవరి 12, 31వ తేదీలతోపాటు ఫిబ్రవరి 14వ తేదీన పంపిన 4 నుంచి 8 వరకు సమన్లపై కేజ్రీవాల్ స్పందించలేదంటూ బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన జడ్జి దివ్యా మల్హోత్రా ఈ నెల 16వ తేదీన తమ ఎదుట హాజరు కావాలంటూ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేశారు. -
కేజ్రీవాల్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు
ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ చేసిన ఆరోపణలకు గాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు శనివారం పోలీసులు నోటీసులిచ్చారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను మూడు రోజుల్లో అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఐదు గంటలు హైడ్రామా జరిగింది. కేజ్రీవాల్ నివాసంలో అధికారులు తాము నోటీసులు తీసుకుంటామని చెప్పగా పోలీసులు నిరాకరించారు. సీఎంకే ఇస్తామన్నారు. చివరికి కేజ్రీవాల్ బయటకు రాగా నోటీసులిచ్చారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తామిచ్చిన ఐదు నోటీసులకు కేజ్రీవాల్ స్పందించలేదంటూ ఈడీ అధికారులు శనివారం అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 7వ తేదీన విచారణ చేపడతామని మేజిస్ట్రేట్ చెప్పారు. -
జీ–సోనీ విలీన డీల్ రద్దు!!
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న జీ ఎంటర్టైన్మెంట్, సోనీ గ్రూప్ భారత విభాగ విలీన డీల్ ఊహాగానాలకు అనుగుణంగానే రద్దయింది. సోనీ గ్రూప్ కార్పొరేషన్ సోమవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్)కు నోటీసు పంపింది. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినందుకు, ఆర్బిట్రేషన్‌కు తెర తీసినందుకు గాను 90 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.750 కోట్లు) బ్రేకప్ ఫీజు చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. ‘సోనీ గ్రూప్ కార్పొరేషన్లో భాగమైన సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ప్రస్తుతం కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్) సంస్థ .. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) విలీనానికి సంబంధించి 2021 డిసెంబర్ 22న ప్రకటించిన ఒప్పందాలను రద్దు చేస్తూ, నోటీసులు ఇచ్చింది’ అని సోనీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. విలీన సంస్థకు ఎవరు సారథ్యం వహించాలనే విషయంపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఈ విషయమై సోనీ నుంచి నోటీసులు వచి్చనట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు జీల్ తెలిపింది. ‘విలీన ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు నిబద్ధతతో అన్ని ప్రయత్నాలు చేశాం. మాకు వన్‌టైమ్ ప్రాతిపదికన, మళ్లీ మళ్లీ ఖర్చులకు దారి తీసే చర్యలు కూడా తీసుకున్నాం’ అని తెలిపింది. డీల్ రద్దు వ్యవహారంపై చట్టపరంగా తీసుకోదగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నిబంధనల పాటింపునకు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తెచ్చుకునేందుకు జీల్ 2023 సెపె్టంబర్ వరకు దాదాపు రూ. 367 కోట్లు వెచి్చంచింది. ఇదీ జరిగింది.. ఎస్‌పీఎన్‌ఐలో జీల్‌ను విలీనం చేసేందుకు సంబంధించి 2021 డిసెంబర్లో ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం 24 నెలల్లోగా విలీనం జరగాలి. అలా జరగకపోవడంతో నెల రోజుల పాటు జనవరి 21 గడువు పొడిగించారు. డీల్ సాకారమై ఉంటే దేశీయంగా 10 బిలియన్ డాలర్ల మీడియా దిగ్గజం ఆవిర్భవించేది. విలీన సంస్థలో సోనీకి 50.86 శాతం, జీల్ ప్రమోటర్లయిన గోయెంకా కుటుంబానికి 3.99 శాతం వాటాలు ఉండేవి. 70 పైగా టీవీ చానల్స్, రెండు వీడియో స్ట్రీమి ంగ్ సరీ్వసులు, రెండు ఫిలిమ్ స్టూడియోలతో భార త్లో అతి పెద్ద ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్‌గా ఉండేది. ఈ ఒప్పందానికి నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులు లభించాయి. అయితే, ఈలో గా జీ ప్రమోటర్లయిన సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు .. సీఈవో పునీత్ గోయెంకాలపై నిధుల మళ్లింపు ఆరోపణలు రావడంతో వారిని లిస్టెడ్ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉండకూడదంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. దీనిపై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో గోయెంకాకు స్టే లభించింది. కానీ, ప్రాథమికంగా డీల్ కింద విలీన సంస్థ సారథ్య బాధ్యతలను గోయెంకాకు అప్పగించాలని భావించినప్పటికీ ఈ పరిణామాలతో ఆ అంశంపై సందిగ్ధత నెలకొంది. గోయెంకాను సీఈవోగా కొనసాగించడాన్ని సోనీ ఇష్టపడటం లేదని, ఆయన వెనక్కి తగ్గటం లేదని వార్తలు వచ్చాయి. దీనిపై నిర్దిష్ట డెడ్‌లైన్‌లోగా ఇరుపక్షాలూ అంగీకారానికి రాకపోవడంతో డీల్ రద్దు కానుందంటూ ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడేంటి.. ఆదాయాలు, లాభాల క్షీణతతో కొన్నాళ్లుగా జీ ఆర్థిక పనితీరు తగ్గుతూ వస్తోంది. సోనీతో డీల్ రద్దు అయిన నేపథ్యంలో జీల్‌కి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ భారత మీడియా వ్యాపార విలీనమైతే ఏర్పడే భారీ సంస్థతో పోటీపడేందుకు మళ్లీ వ్యూహాలు రచించుకోవాలి. కొన్ని క్రికెట్ ఈవెంట్ల ప్రసారం కోసం డిస్నీలో భాగమైన స్టార్‌తో జీల్‌కి ఒప్పందం ఉంది. దీని కోసం నాలుగేళ్ల వ్యవధిలో 1.32–1.44 బిలియన్ డాలర్ల వరకు చెల్లించాలి. సోనీతో డీల్ రద్దు అయినందున ఈ ఒప్పందంపైనా ప్రభావం పడొచ్చు. మరోవైపు, ప్రాంతీయ భాషల్లో జీల్‌కి ఉన్న కంటెంట్, టీవీ చానల్స్ అందుబాటులో ఉండవు కాబట్టి సోనీ కూడా భారత్‌లో తన కార్యకలాపాల వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సి రావచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
మహారాష్ట్ర స్పీకర్‌కు బాంబే హైకోర్టు నోటీసులు
ముంబై: ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాను పెట్టుకున్న పిటిషన్లను మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ కొట్టేయడాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం నేత, చీఫ్ విప్ భరత్ గోగావాలే బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఈ విషయంలో మీ స్పందన తెలపాలంటూ స్పీకర్, 14 మంది ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు పంపింది. అసెంబ్లీ సచివాలయానికీ కోర్టు నోటీసులిచి్చంది. నోటీసులు అందుకున్న వారు తమ స్పందనను అఫిడవిట్ల రూపంలో సమరి్పంచాలని కోర్టు సూచించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదో 8కి వాయిదావేసింది. -
మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. రాహుల్‌కు ఈసీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై ఈసీ వివరణ కోరింది. రాహుల్ వ్యాఖ్యలపై ఈనెల 25లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. వివరాల ప్రకారం.. రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు ఇచ్చింది. క్రికెట్ వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ ఓటమి నేపథ్యంలో మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఫైనల్ సందర్బంగా మోదీ స్టేడియంకు వెళ్లడం వల్లే టీమిండియా ఓడిపోయిందని రాహుల్ అన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీని అపశకునంగా రాహుల్ పోల్చారు. ఈ క్రమంలో మోదీని పనౌతీ, పిక్ పాకెటర్ అంటూ రాహుల్ వ్యాఖ్యలు చేశారు. దీంతో, రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం, ఈసీ.. రాహుల్‌కు నోటీసులు పంపింది. రాహుల్ వ్యాఖ్యలపై ఈనెల 25లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. Election Commission of India issues notice to Congress MP Rahul Gandhi on his 'panauti' and 'pickpocket' jibes at PM Modi, asks him to respond by 25th November pic.twitter.com/CcrIlU6I9o — ANI (@ANI) November 23, 2023 -
తమిళనాడు పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్
న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ తాత్సారం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు స్పందన కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జే/బీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ మేరకు నోటీసు జారీ చేసింది. రాజ్యాంగ బద్ధమైన ఒక అధికారం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ విధులను అడ్డుకుంటోందని తమిళనాడు ప్రభుత్వం పిటిషన్లో ఆరోపించింది. జోక్యం చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 12 బిల్లులు గవర్నర్ ఆర్ఎన్ రవి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని విచారణ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 20న చేపడతామని తెలిపింది. -
విపక్షాల కూటమికి షాక్.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు..
న్యూఢిల్లీ: అధికార ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల కూటమికి 'ఇండియా' అని పేరు పెట్టడంపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన నేపధ్యంలో హైకోర్టు విపక్షాల కూటమికి నోటీసులు జారీ చేసింది. అధికార బీజేపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా 26 ప్రతిపక్షాలు ఏకమై ఆ కూటమికి 'ఇండియా'(ఇండియాన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్) అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ కూటమికి ఇండియా అని నామకరణం చేయడంపై మొదట్లోనే వ్యతిరేకత వచ్చింది. దీనిపై ఎలెక్షన్ కమిషన్ కు నివేదించినా కూడా వారు స్పందించకపోవడంతోనే పిటిషనర్ రిట్ పిటిషన్ దాఖలు చేశాడని హైకోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ న్యాయమూర్తి అమిత్ మహాజన్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ వెంటనే కేంద్ర హోంశాఖ, ఎలక్షన్ కమిషన్, 26 పార్టీలు దీనిపై వివరణ ఇవ్వాల్సిందింగా కోరింది. విపక్షాల కూటమికి 'ఇండియా' అని నామకరణం చేయడంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని, ఎలక్షన్ కమిషన్‌ను ఆదేశించమని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇండియా అనే పేరుని వాడుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అమాయక ప్రజలను సెంటిమెంటుతో మోసం చేసి అధికారాన్ని చేజిక్కించుకుని మొదట వారిలో రాజకీయ ద్వేషాన్ని రగిలించి రాజకీయ విధ్వంసానికి పాల్పడనున్నారని పిల్ ద్వారా గిరీష్ భరద్వాజ్ పిల్లో పేర్కొన్నారు. ఇండియా అనేది జాతీయ చిహ్నంలో భాగమని.. విపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టడం 1950 యాక్ట్ నిబంధనల ప్రకారం వృత్తి, వాణిజ్య, రాజకీయ ప్రయోజనాలకు జాతీయ చిహ్నాన్ని వినియోగించడం చట్ట విరుద్ధం కాబట్టి ఒకరకంగా ఇది జాతిని అవమానించడమేనని అందులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Viral Video : ఎన్సీసీ జూనియర్లపై సీనియర్ దురాగతం.. -
స్పైస్‌జెట్‌కు ఎన్సీఎల్టీ నోటీసులు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ కంపెనీకి ఎయిర్‌క్రాఫ్టులను లీజుకి ఇచ్చిన ఎయిర్‌క్యాజిల్ (ఐర్లాండ్) పిటీషన్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) విచారణ జరిపింది. స్పైస్‌జెట్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 17కు వాయిదా వేసింది. నోటీసుల జారీ ప్రక్రియ సాధారణమేనని, ఎన్సీఎల్టీ తమకు ప్రతికూలంగా ఉత్తర్వులేమీ ఇవ్వలేదని స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి తెలిపారు. సెటిల్మెంట్ కోసం ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్న విషయాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుందని పేర్కొన్నారు. ఇకపైనా చర్చలను కొనసాగించవచ్చని వివరించారు. స్పైస్‌జెట్‌పై ఎయిర్‌క్యాజిల్ ఏప్రిల్ 28న పిటిషన్ దాఖలు చేసింది. అయితే, తమ దగ్గర ఎయిర్‌క్యాజిల్ విమానాలేమీ లేవని, ఈ పిటిషన్‌తో తమ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని స్పైస్‌జెట్ గత వారం తెలిపింది. ఎన్సీఎల్టీ వెబ్సైట్ ప్రకారం స్పైస్‌జెట్‌పై ఇప్పటికే రెండు దివాలా పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. -
పేపర్ లీక్ కేసు: ‘కేటీఆర్ చెప్పింది నిజమే.. వారిద్దరూ ఎవరంటే?’
సాక్షి, కామారెడ్డి: టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ స్పీడ్ పెంచింది. ఈ కేసులో ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై సిట్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌కు ఆయన దగ్గరున్న వివరాలు ఇవ్వాలని సిట్.. సీఆర్పీసీ 91 కింద నోటీసులు పంపించింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఇంటికి సిట్ అధికారులు, జూబ్లీహిల్స్ పోలీసులు చేరుకున్నారు. రేవంత్ ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. నోటీసుల్లో భాగంగా ఈనెల 23వ తేదీన సిట్ ఆఫీసు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరారు. అయితే, కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేపట్టిన హాత్ సే హాత్ యాత్రలో ఉన్నారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. టీఎస్టీఎస్ ఛైర్మన్ కేటీఆర్‌కు దగ్గరి బంధువు. అన్ని ప్రభుత్వ శాఖల్లో కంప్యూటర్లను టీఎస్టీఎస్ మాత్రమే నిర్వహిస్తోంది. పేపర్ లీకేజీ కేసులో ఐటీ శాఖకు ఏం సంబంధమని కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలోనే టీఎస్పీఎస్సీ రికార్డుల కంప్యూటరీకరణ జరిగింది. కంప్యూటర్ల భద్రతపై ఐటీ శాఖ సెక్యూరిటీ ఆడిట్ చేయాలి. పేపర్ లీకేజీ స్కాంను తామే బయటపెట్టామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఒక విషయంలో కేటీఆర్ నిజం మాట్లాడారు. ఈ స్కాంలో ఇద్దరికే సంబంధం ఉందని కేటీఆర్ చెప్పారు. ఆ ఇద్దరు కేసీఆర్, కేటీఆరేనని నేను అంటున్నాను అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక సిట్ నోటీసులపై స్పందిస్తూ.. సిట్ నోటీసులు ఊహించిందే. నన్ను వేధించాలనే నోటీసులు ఇస్తోంది. సిట్ నోటీసులను స్వాగతిస్తున్నాను. కేటీఆర్‌కు కూడా నోటీసులు ఇవ్వాలి. కేటీఆర్‌తో పాటు సబిత, శ్రీనివాస్ గౌడ్, సిట్ అధికారి శ్రీనివాస్‌కు కూడా నోటీసులు ఇవ్వాలి. నా దగ్గర ఉన్న ఆధారాలు సిట్‌ను ఇస్తాను. కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వకపోతే కోర్టులో తేల్చుకుంటాను అని అన్నారు. ఇక, పేవర్ లీక్ వ్యవహారంపై అంతకుముందు రేవంత్ మాట్లాడుతూ గ్రూప్-1 పరీక్ష పత్రం లీకేజీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రూప్-1 పరీక్షల్లో కరీంనగర్‌లోని మల్యాల మండలంలో వంద మందికి పైగా అభ్యర్థులు ప్రిలిమ్స్ క్లియర్ చేశారని ఆరోపించారు. ప్రిలిమ్స్‌లో వీరికి 100కుపైగా మార్కులు వచ్చాయన్నారు. ఇందులో కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపైనే సిట్ తమకు ఆధారాలు ఇవ్వాలని నోటీసులు పంపించింది. ఇది కూడా చదవండి: కేటీఆర్ పీఏపై రేవంత్ షాకింగ్ కామెంట్స్.. -
పేపర్ లీక్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు.. ట్విస్ట్ ఇచ్చిన సిట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్‌పై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, ఈ కేసులో విచారణ చేపట్టిన సిట్.. దూకుడు పెంచింది. ఆరోపణలు చేసిన పొలిటికల్ లీడర్లకు నోటీసులు అందజేస్తోంది. తమ వద్ద ఉన్న ఆధారాలను అందించాలంటూ సిట్ వారిని కోరింది. దీంతో, పేపర్ లీక్ అంశం ఆసక్తికరంగా మారింది. పేపర్ లీక్ విషయంలో ఆరోపణలు చేస్తున్న పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇచ్చి.. వారి వద్ద ఆధారాలని పేర్కొంది. ఇక, పేపర్ లీక్ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే మండలంలో వంద మందికి ర్యాంకులు వచ్చాయని తెలిపారు. అయితే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సిట్ సీరియస్‌గా తీసుకుంది. దీంతో, రేవంత్ వద్ద ఉన్న ఆధారాలను తమకు అందించాలని సిట్ ఏసీపీ కోరారు. ఇక, రేవంత్ ఇటీవలే పేపర్ లీక్ అంశంలో కేటీఆర్ పీఏ తిరుపతి పాత్ర కూడా ఉందన్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు, వివరాలు కూడా ఇవ్వాలని సిట్ పేర్కొంది. ఇది కూడా చదవండి: మంత్రి పీఏనే లీకేజీ సూత్రధారి.. జైలులో ప్రవీణ్, రాజశేఖర్‌కు బెదిరింపులు: రేవంత్ రెడ్డి -
ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇంటి పేరును ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు ఉపయోగించుకోలేదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కేపీ వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై సమాధానం ఇస్తూ ఫిబ్రవరి 9న రాజ్యసభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీపై రాజ్యసభ కార్యకలాపాల నిర్వహణ నిబంధనల్లోని రూల్ 188 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ తన నోటీసులో పేర్కొన్నారు. నెహ్రూ కుటుంబాన్ని ప్రధాని అవమానించారని ఆక్షేపించారు. నెహ్రూ కుటుంబ సభ్యులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యులేనని గుర్తుచేశారు. నెహ్రూ ఇంటి పేరును ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు వాడుకోలేదని ప్రశ్నించడం అసంబద్ధం, అర్థరహితమని వేణుగోపాల్ తేల్చిచెప్పారు. -
రాజాసింగ్‌కు మళ్లీ నోటీసులు.. భయపడేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి షోకాజ్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. తాజాగా మంగళ్‌హాట్ పోలీసులు.. రాజాసింగ్‌కు నోటీసులు అందజేశారు. కాగా, నోటీసుల్లో కోర్టు పేర్కొన్న బెయిల్ షరతులను ఉల్లంఘించారని తెలిపారు. అంతకుముందు, పీడీ యాక్ట్ కేసులో రాజాసింగ్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇక, పోలీసుల నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. రాజాసింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా, జైలుకు పంపినా భయపడేది లేదు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను.. గో హత్య, మతమార్పిడులు, లవ్ జిహాద్‌పై చట్టం చేయాలని కోరాను.. ఇందులో మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం ఉన్నాయి. ముంబైలో పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడితే.. నాకు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది. హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం అదనపు డైరెక్టర్ దేవేందర్ కుమార్ సింగ్ పేరుతో, 15వ తేదీతో (గురువారం) ఈ సమన్లు ఉన్నాయి. 2015 నుంచి రోహిత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులకు సంబంధించిన ఆర్థిక, వ్యాపార లావాదేవీలు, ఐటీ, జీఎస్టీ రిటర్న్స్, బ్యాంకు స్టేట్మెంట్స్, స్థిరచరాస్తులతోపాటు రుణాల వివరాలు తీసుకురావాలంటూ ఈడీ స్పష్టం చేసింది. ఆధార్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు కాపీలు తీసుకురావాలని పేర్కొంది. అతడి కుటుంబీకులకు సంబంధించిన పూర్తి బయోడేటాను అందించాలని కోరిన ఈడీ దాని నమూనాను నోటీసులతో జత చేసింది. రోహిత్‌రెడ్డిపై తొమ్మిది కేసులు రోహిత్ రెడ్డి 2018లో నామినేషన్‌తోపాటు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయనపై మొత్తం 9 కేసులు ఉన్నాయి. ఇవన్నీ 2017–18 మధ్య తాండూరుతోపాటు బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో నమోదయ్యాయి. వీటిలో అత్యధికం ఎన్నికల సంబంధిత నేరాలే. ఒక్క కేసులో మాత్రమే మోసం తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ ఏడాది మార్చిలో బెంగళూరులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులోనూ రోహిత్‌రెడ్డి పేరు వినిపించింది. నిర్మాత శంకరగౌడ్ బెంగళూరులో గతేడాది ఇచ్చిన పార్టీకి రోహిత్‌రెడ్డి హాజరైనట్లు ఆరోపణలు ఉన్నాయి. నైజీరియన్ అరెస్టుతో గుట్టురట్టయిన ఈ వ్యవహారంలో రూ.కోట్ల విలువైన డ్రగ్స్ విదేశాల నుంచి వచ్చినట్లు అక్కడి నార్కోటిక్ అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబం«ధించి ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చిన బెంగళూరు పోలీసులు విచారించారు. వీరిలో కొందరు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులను ఆ పార్టీకి తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమేయంపై వార్తలు వెలువడ్డాయి. ఆ డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని రోహిత్‌రెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏ కేసులో ఈడీ సమన్లు జారీ చేసిందో తెలియాల్సి ఉంది. ఏ కేసు ప్రస్తావన లేకుండా ఈడీ ఇచ్చిన నోటీసులపై రోహిత్‌రెడ్డి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఈడీ ఎలాంటి కేసులను దర్యాప్తు చేస్తుంది? ఈడీ అధికారులు రెండు చట్టాలకు సంబంధించిన కేసులను మాత్రమే దర్యాప్తు చేస్తుంటారు. పీఎంఎల్ఏతో పాటు విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద మాత్రమే కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటుంది. ఫెమా చట్టాన్ని ఈడీ అధికారులే నేరుగా వినియోగించవచ్చు. విదేశీ మారకద్రవ్యాలకు సంబంధించిన లావాదేవీలున్న అంశాలనే ఈ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు చేస్తుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, విచారణకు నోటీసులు అందుకున్న వారు ఏదో ఒక కోణంలో విదేశీ కరెన్సీ లావాదేవీలు చేసి ఉండాలి. అయితే పీఎంఎల్ఏ కింద ఈడీ అధికారులు ఓ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలంటే మాత్రం నేరుగా కుదరదు. అప్పటికే ఏదో ఒక పోలీసుస్టేషన్ లేదా సీబీఐ వంటి ప్రత్యేక విభాగంలో కేసు నమోదై ఉండాలి. ఆ ఎఫ్ఐఆర్ ఆ«ధారంగానే ఈడీ పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేస్తుంది. ఏదైనా కేసులో ఓ వ్యక్తి నిందితుడు కాకపోయినప్పటికీ... నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విచారణలో పేరు వెలుగులోకి రావడమో, వారి వాంగ్మూలాల్లో ప్రస్తావన ఉండటమో జరిగినా ఈడీ నోటీసులు ఇచ్చి విచారించే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఏదో ఒకచోట నమోదైన కేసు ఆధారంగానే రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసి ఉండొచ్చని చెప్తున్నారు. మరోసారి రకుల్‌కు నోటీసులు టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ అధికారులు శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈమెను సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. టాలీవుడ్ ప్రముఖులతో ముడిపడి ఉన్న డ్రగ్స్ కేసుకు సంబం«ధించి ఇప్పటికే ఈడీ రకుల్‌ను ఓసారి విచారించింది. ఎక్సైజ్ అధికారులు 2017లో నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. అయితే అప్పట్లో ఎక్కడా రకుల్ పేరు బయటకు రాలేదు. తర్వాత ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన ఓ డ్రగ్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్ విచారణలో బయటపడిన అంశాల ఆధారంగానే రకుల్‌ను గత సెప్టెంబర్ 3న ప్రశ్నించింది. తాజాగా రకుల్‌ను ఏ అంశాలపై, ఎవరితో సంబంధాలపై, ప్రశ్నిస్తారనే ఉత్కంఠ నెలకొంది ఇదీ చదవండి: హైదరాబాద్ నుంచి విదేశాలకు డ్రగ్స్ -
చిక్కుల్లో క్రికెటర్ యువరాజ్ సింగ్..
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. గోవా ప్రభుత్వం యువరాజ్‌కు నోటీసులు జారీ చేసింది. విషయంలోకి వెళితే.. గోవాలోని మోర్జిమ్ ప్రాంతంలో యువీకి 'కాసా సింగ్' పేరిట ఒక విల్లా ఉంది. గత సెప్టెంబర్‌లో ఈ విల్లాను అద్దెకు ఇస్తానంటూ యువీ తన ట్విటర్ వేదికగా ప్రకటన చేశాడు. గోవా రూల్స ప్రకారం ఇది ఒక విధంగా పేయింగ్ గెస్ట్ విధానం కిందకు వస్తుంది. దీనికి గోవా రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. పేయింగ్ గెస్ట్ విధానం కింద విల్లాను అద్దెకు ఇవ్వాలంటే గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్ 1982 ప్రకారం గోవా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ యూవీ ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే అద్దె ఇవ్వడం అతనికి చిక్కులు తెచ్చిపెట్టింది. దీనిని గోవా అధికారులు తప్పుబడుతూ రూ.లక్ష జరిమానా విధించారు. అంతేకాదు డిసెంబర్ 8న తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేశారు. పర్యాటక శాఖ చట్టాన్ని ఉల్లంఘించిన క్రమంలో ఎందుకు రూ. లక్ష జరిమానా విధించకూడదో చెప్పాలని నోటీసుల్లో ప్రశ్నించారు. ఎవరైనా సరే గోవాలో హోటల్/గెస్ట్ హౌస్ కార్యకలాపాలు నిర్వహించాలంటే కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర టూరిజం శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. I’ll be hosting an exclusive stay at my Goa home for a group of 6, only on @Airbnb. This is where I spend time with my loved ones & the home is filled with memories from my years on the pitch. Bookings open Sep 28, 1pm IST at https://t.co/5Zqi9eoMhc 🏖️#AirbnbPartner @Airbnb_in pic.twitter.com/C7Qo32ifuE — Yuvraj Singh (@YUVSTRONG12) September 21, 2022 చదవండి: 'నెంబర్ వన్ స్థానం నావల్లే.. వాడుకొని వదిలేశారు' బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు -
పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసుల నోటీసులు
సాక్షి, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు అందజేశారు. 41A కింద పవన్‌కు ఏసీపీ హర్షిత నోటీసులు ఇచ్చారు. కాగా, నోటీసుల్లో.. ఈనెలఖారు వరకు పోలీసు యాక్ట్ 30 అమలులో ఉంది. విశాఖలో సభలు, ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదు. నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీ చేసినందుకు పవన్ కల్యాణ్‌కు నోటీసులు ఇచ్చినట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: మంత్రుల కార్లపై జనసేన దాడి -
తలాక్‌లపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: ఇస్లాంలో తలాక్–ఎ–కినయా, తలాక్–ఎ–బెయిన్తో పాటు అన్నిరకాల విడాకులనూ రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై స్పందన తెలపాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖలకు నోటీసులు జారీ చేసింది. కర్నాటకకు చెందిన సయేదా అంబ్రీన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎ.నజీర్, జస్టిస్ జె.బి.పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఇదీ చదవండి: కొలీజియంలో విభేదాలు! -
ఇక తప్పదు రావాల్సిందే.. సోనియాకు ఈడీ నోటీసులు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఊహించని షాక్ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోనియాకు మరోసారి సమన్లు పంపించింది. ఈ సందర్భంగా జూలై 21న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియాను ఈడీ గత నెలలోనే విచారించాల్సి ఉండగా.. సోనియా కరోనా వైరస్ బారినపడటంతో విచారణ వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా ఆమె విచారణకు హాజరుకాలేదు. విచారణకు హాజరుకాలేనని, మరెప్పుడైనా వస్తానంటూ ఈడీని సోనియా గాంధీ కోరారు. ఆ అభ్యర్థనకు స్పందించిన ఈడీ.. విచారణను వాయిదా వేసింది. ఈ క్రమంలో సోమవారం మళ్లీ సమన్లు పంపింది. జూలై 21న విచారణకు హాజరు కావాలని అధికారులు తెలిపారు. ఇక, ఈ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సైతం ఈడీ పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. ED summons Congress interim President Sonia Gandhi to join investigation in the National Herald Case on July 21: Official sources (File pic) pic.twitter.com/MlUWVdzLbO — ANI (@ANI) July 11, 2022 ఇది కూడా చదవండి: ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్.. కాషాయ తీర్థం పుచ్చుకుంటే రూ. 50 కోట్లు! -
ట్విటర్‌కు షాక్: జూలై 4 వరకే డెడ్‌లైన్
సాక్షి, న్యూఢిల్లీ: మైక్రో బ్లాకింగ్ సైట్ ట్విటర్‌కు కేంద్రం మరో అల్టిమేటం జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలన్నింటినీ అమలు చేసేందుకు జూలై 4 చివరి గడువు ఇచ్చింది. ఈ మేరకు తుది నోటీసులు జారీ అయ్యాయి. జులై 4 లోగా గత ఆదేశాలన్నింటినీ పాటించాలని ప్రభుత్వం ట్విట్టర్‌కు నోటీసు జారీ చేసినట్లు బుధవారం అధికారిక వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ జూన్ 27 న నోటీసు జారీ చేసింది. దీన్ని ట్విటర్ బేఖాతరు చేయడంతో తుది నోటీసులిచ్చిన మంత్రిత్వ శాఖ ఇదే చివరి నోటీసని తేల్చి చెప్పింది. గడువులోగా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే ట్విటర్ మధ్యవర్తి స్థితిని కోల్పోతుందని హెచ్చరించింది. ఆ తరువాత ట్విటర్ పోస్ట్‌లకు బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. కాగా అంతర్జాతీయ న్యాయవాద గ్రూప్ ఫ్రీడమ్ హౌస్, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, రైతు ఉద్యమానికి మద్దతు పలికిన ట్విటర్ ఖాతాలను, కొన్ని ట్వీట్లను బ్లాక్ చేయాలని 2021లో ప్రభుత్వం ట్విటర్‌ను కోరింది. ఈ నేపథ్యంలో 80కి పైగా ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేశామంటూ దీనికి సంబంధించిన జాబితాను జూన్ 26న కేంద్రానికి సమర్పించింది. అయితే, ట్విటర్ పాటించాల్సిన ఆర్డర్లు ఇంకా ఉన్నాయని, ఇందుకు జూలై 4 మాత్రమే చివరి గడువిచ్చామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు తాజా పరిణామంపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. -
ఎంపీ నవనీత్ రాణా దంపతులకు మరో షాక్.. నోటీసులు జారీ
మహారాష్ట్రలో శివసేన, మాజీ నటి, ఎంపీ నవనీత్ రాణా దంపతుల మధ్య పొలిటికల్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) శనివారం ఎంపీ నవనీత్ రాణా, మహారాష్ట్రలో ఎమ్మెల్యే అయిన ఆమె భర్త రవి రాణాకు నోటీసులు జారీ చేసింది. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఖార్ ప్రాంతంలో నవనీత్ రాణా దంపతులు తమ ఇంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు బీఎంసీ గుర్తించారు. ఈ క్రమంలో వారి ఫ్లాట్ వద్ద అక్రమ నిర్మాణాన్ని ఏడు రోజుల్లో తొలగించాలని బీఎంసీలు అధికారులు నోటీసులు పంపించారు. లేనిపక్షంలో బీఎంసీ చర్యలు తీసుకొని కూల్చివేస్తుందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే MMC చట్టంలోని సెక్షన్ 475-A ప్రకారం ఫ్లాట్ యజమానికి జరిమానాతో పాటుగా జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, మాజీ నటి, ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలు హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. వీళ్లకు కౌంటర్‌గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ముంబైలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన శ్రేణులు యత్నించగా.. ఏం జరుగుతుందో అనే ఆందోళన ఏర్పడింది. ఈ తరుణంలో ఐపీసీ సెక్షన్ 153-ఏ ప్రకారం.. నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరుచగా.. ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు షరతులతో కూడిన బెయిల్‌ను ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసింది. ఇది కూడా చదవండి: ఒమిక్రాన్ కలవరం.. తమిళనాడులో సబ్‌వేరియంట్ బీఏ.4 రెండో కేసు -
చిక్కుల్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ
న్యూఢిల్లీ: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చిక్కుల్లో పడ్డారు. మూడు దశాబ్దాల క్రితం ఒక వ్యక్తి మరణానికి కారకుడైన కేసులో దోషి అయిన సిద్ధూ స్వల్ప జరిమానాతో బయటపడ్డారు. సిద్ధూ చేసిన నేరానికి తగిన శిక్ష పడలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ మళ్లీ కోర్టుకెక్కడంతో తీర్పుని పునఃసమీక్షించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. 1998లో పంజాబ్‌లోని పాటియాలాలో వాహనం పార్కింగ్‌పై వివాదం నెలకొని 65 ఏళ్ల వయసున్న గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ చితకబాదారు. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో కుటుంబ సభ్యులు సిద్ధూపై కేసు పెట్టారు. ఈ కేసు నుంచి బయట పడడానికి సిద్ధూ దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశారు. పంజాబ్ హరియాణా హైకోర్టు సిద్ధూ ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2018 మేలో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని పక్కన పెట్టేసింది. సీనియర్ సిటిజన్‌ను గాయపరిచినందుకు కేవలం వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సిద్ధూని కేసు నుంచి విముక్తుడిని చేసింది. ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బాధిత కుటుంబం మళ్లీ కోర్టుకెక్కింది. సిద్ధూకి కఠిన శిక్ష విధించాలని బాధిత కుటుంబం సుప్రీంలో శుక్రవారం వాదనలు వినిపించింది. సిద్ధూ తరపున కాంగ్రెస్ నేత, లాయర్ పి. చిదంబరం వాదనలు వినిపించారు. ఇన్నేళ్ల తర్వాత తీర్పుని సమీక్షించడం అర్థరహితమని పేర్కొన్నారు.