ముంబై: ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాను పెట్టుకున్న పిటిషన్లను మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ కొట్టేయడాన్ని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం నేత, చీఫ్ విప్ భరత్ గోగావాలే బాంబే హైకోర్టులో సవాల్ చేశారు.
దీంతో ఈ విషయంలో మీ స్పందన తెలపాలంటూ స్పీకర్, 14 మంది ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు పంపింది. అసెంబ్లీ సచివాలయానికీ కోర్టు నోటీసులిచి్చంది. నోటీసులు అందుకున్న వారు తమ స్పందనను అఫిడవిట్ల రూపంలో సమరి్పంచాలని కోర్టు సూచించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదో 8కి వాయిదావేసింది.
Comments
Please login to add a commentAdd a comment