mlas jumping
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు
సాక్షి,హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పును తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం(నవంబర్ 12) రిజర్వు చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. ఈ పిటిషన్‌పై వాద, ప్రతివాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు బెంచ్ వెల్లడించింది. కాగా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులోపిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ అనర్హతపై నెల రోజుల్లో చర్యలు తీసుకోవాలని, ఏం చర్యలు తీసుకున్నారో తమకు తెలపాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలపై అసెంబ్లీ సెక్రటరీ డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు.ఇదీ చదవండి: మరో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు -
అసెంబ్లీ సెక్రటరీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సాక్షి,హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై బీఆర్ఎస్ యాక్షన్ మొదలుపెట్టింది. కోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం(సెప్టెంబర్11) అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కె.పి. వివేకానంద అసెంబ్లీ సెక్రటరీకి వినతి పత్రాన్ని అందజేశారు.బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలపై నెలరోజుల్లో చర్య తీసుకోవాలని, లేదంటే తామే సుమోటోగా కేసు మళ్లీ విచారిస్తామని హైకోర్టు ఇటీవల స్పీకర్‌కు సూచించిన విషయం తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ షెడ్యూల్‌ను తేదీలవారిగా ప్రొసీడింగ్స్ విడుదల చేయాలని హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. ఇదీ చదవండి.. వాల్మీకి స్కామ్‌లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్ -
TG: ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం(సెప్టెంబర్9) కీలక ఆదేశాలు వెల్లడించింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని, నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని స్టేటస్ రిపోర్టు తమకు దాఖలు చేయాలని కోర్టు తీర్పు ద్వారా చేసింది. ‘‘పిటిషన్లపై ఎప్పటిలోగా వాదనలు వింటాం. ఎన్నిరోజుల్లో విచారిస్తాం. తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాం అనే అంశాలపై షెడ్యూల్ ప్రొసీడింగ్స్ విడుదల చేయాలి. లేదంటే మేమే ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారిస్తాం’’ అని కోర్టు అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. కాగా, తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌లను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లో కోరారు. ఇటు బీఆర్ఎస్, అటు ముగ్గురు ఎమ్మెల్యేల తరపున లాయర్లు వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హతపై ఫిర్యాదు చేసినప్పటికీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. ఇదీ చదవండి.. స్పీకర్ వేటు వేయకుంటే.. సుప్రీంకు: కేటీఆర్ -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక అందుకే: మంత్రి పొన్నం
సాక్షి,కరీంనగర్ జిల్లా: ప్రభుత్వ సుస్థిరత కోసమే కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం(జులై 15) కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో జరిగిన వన మహోత్సవంలో మొక్కలు పొన్నం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో బీజేపీ ఎన్ని ప్రభుత్వాలు కూల్చింది..? బండి సంజయ్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. బీజేపీ కూల్చిన ప్రభుత్వాల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు..? ప్రభుత్వాన్ని కూల్చుతామంటే.. చూస్తూ ఊరుకోవాలా..? మేం ధర్మం తప్పలేదు. కులగణనపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. డిసెంబర్ 3 వరకు మాకు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆలోచనే లేదు. తర్వాత పరిస్థితుల్లోనే చేర్చుకుంటున్నాం’అని పొన్నం తెలిపారు. -
‘అష్ట’కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. గులాబీ ఎమ్మెల్యేలు వరుసగా అధికార కాంగ్రెస్‌లో చేరుతున్నారు. రాబోయే రోజుల్లో తమ పారీ్టలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు మరింత వేగవంతం అవుతాయని కాంగ్రెస్ శిబిరం ప్రచారం చేస్తోంది. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినా వలసలకు అడ్డుకట్ట పడటం లేదని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.గతంలో చేసిన పనుల బిల్లుల కోసం, వ్యాపారాలపై దాడులు, కేసుల బెదిరింపులతోనే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ఆరోపిస్తున్నాయి. దీనికితోడు ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్‌లో విలీనం అవుతుందంటూ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతున్నాయి. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వలసల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరుసగా వలసల బాట! గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓటమితో ఈ సంఖ్య 38కి చేరింది. ఇక గత ఆరు నెలల్లో బీఆర్ఎస్ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీ, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు చేరిక ఖరారు కాగా... హైదరాబాద్ నగరానికి చెందిన మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. శాసనసభాపక్షం విలీనంపై చర్చ నిబంధనల ప్రకారం.. బీఆర్ఎస్ సంఖ్యాబలంలో మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే బీఆర్ఎస్ శాసనసభాపక్షం అందులో విలీనమైనట్టు పరిగణిస్తారు. 2014–18 మధ్యలో టీడీపీ శాసనసభాపక్షం, 2018–23 మధ్యలో కాంగ్రెస్ శాసనసభాపక్షం ఇదే తరహాలో బీఆర్ఎస్లో విలీనమయ్యాయి. ఈ నిబంధన ప్రకారం బీఆర్ఎస్ నుంచి కనీసం 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే.. శాసనసభాపక్షం విలీనమైనట్టుగా పరిగణిస్తారు.ఇప్పటికే 9 మంది కాంగ్రెస్‌లో చేరడం, మరొకరు చేరికకు సిద్ధమైన నేపథ్యంలో.. ఇంకో 16 మంది బీఆర్ఎస్ నుంచి ఫిరాయించాల్సి ఉంటుంది. అయితే బీఆర్ఎస్కు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఈ ఉమ్మడి జిల్లాల నుంచే ఫిరాయింపులు ఎక్కువగా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. కట్టడి కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో.. మిగతా వారిని కట్టడి చేసేందుకు గులాబీ పారీ్టలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ సర్కారులో అధికారం అనుభవించిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలతోపాటు కేసీఆర్‌కు సన్నిహితుడైన ఎం.సంజయ్ వంటి నేతలు కూడా వీడటంపై చర్చ జరుగుతోంది. దీంతో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి.. పక్షం రోజుల క్రితం ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.వారికి విందు ఇచ్చి.. పారీ్టలో కొనసాగితే కలిగే ప్రయోజనాలు, భవిష్యత్తుపై భరోసా కలి్పంచే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరగా.. కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఓ ఎమ్మెల్యే తన కారు మరమ్మతుకు అయ్యే ఖర్చులను తీసుకుని కూడా పార్టీ మారారని ప్రచారం జరుగుతోంది. మరింత మంది బీఆర్ఎస్ను వీడనున్నారన్న ప్రచారం నేపథ్యంలో.. పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మరోమారు వ్యక్తిగతంగా భేటీకానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రలోభాలు, బెదిరింపులను ప్రస్తావిస్తూ..!! పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు తమకు అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్లు, బెదిరింపులను కేసీఆర్‌కు ఏకరువు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడం, కుటుంబ సభ్యుల వ్యాపారాలపై దాడులు, కేసులు పెడతామనే బెదిరింపులు వంటి కారణాలతో పార్టీ మారక తప్పడం లేదని అంటున్నారని పేర్కొంటున్నాయి. నగర శివార్లలోని ఓ ఎమ్మెల్యే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను వారు గుర్తు చేస్తున్నారని వివరిస్తున్నాయి. న్యాయ పోరాటం.. ప్రజల మధ్యకు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్.. అసెంబ్లీ వేదికగా కొట్లాడాలని నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రపతి, గవర్నర్లను కలసి అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ వైఖరిని వివరించాలని.. అనర్హత వేటుపై స్పందించాల్సిందిగా కోరాలని భావిస్తోంది. రాష్ట్రపతి ఎదుట పార్టీ ఎమ్మెల్యేలతో పరేడ్ చేయించేందుకూ సన్నద్ధమవుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కేసీఆర్ స్వయంగా పర్యటించి.. ఆ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ తీరును ఎండగట్టాలనే వ్యూహాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్టు బీఆర్ఎస్ కీలక నేత ఒకరు వెల్లడించారు. -
కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్: మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ‘కారు’ దిగడానికి రెడీ!
సాక్షి, హైదరాబాద్: ‘గ్రేటర్’ పాలిటిక్స్ రసవత్తరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. కారు దిగడానికి ఆరుగురు ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. శుక్రవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యేతో చేరికలు షూరూ అయ్యింది. గ్రేటర్లో రోజుకో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జంపింగ్‌కు స్కెచ్ సిద్ధమయ్యింది. ఇప్పటికే కార్యకర్తలతో పలువురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.హైదరాబాద్ శివారులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ చర్చలు పూర్తయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రోజుకో ఎమ్మెల్యే, 20 మంది ముఖ్యనేతలు చేరికకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నారు. -
weekly roundup: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్.. బీఆర్ఎస్లో గుబులు!
బీఆర్ఎస్ పార్టీకి గ్రహణం పట్టుకున్నట్లైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారాన్ని చేజార్చుకుంటే.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సింగిల్ సీటు గెలవకుండా పట్టుకోల్పోయింది. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కారు దిగుతూ హస్తం పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. పార్టీ నేతలు అధికార పార్టీలోకి జంప్ చేయడం తలనొప్పిగా మారింది. మరోవైపు పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఫిరయింపులను ముమ్మరం చేసుకుంటూ వెళ్తోంది. ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీనే.. ప్రోత్సహించడంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత కే. కేశవరావు కాంగ్రెస్ గూటికి చేరారు. బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ప్రజాప్రతినిధుల వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెసులో చేరగా, రాజ్య సభ సభ్యుడు కేకే పార్టీలో చేరిన మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరబాద్ చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్ లోని తన క్యాంపు కార్యాలయంలో వారిని కాంగ్రస్ లోకి చేర్చుకున్నారు.కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో బస్వరాజు సారయ్య, భాను ప్రసాద్ రావు, ప్రభాకర్ రావు, దండే విఠల్ , బొగ్గారపు దయానంద్, యెగ్గె మల్లేశం ఉన్నారు.తెలంగాణ శాసన మండలిలో సంఖ్యాపరంగా మైనార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వలసలను ప్రోత్సహించడం ద్వారా పట్టుబింగించేదుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మండలిలో సుమారు నాలుగింట మూడొంతుల ఎమ్మెల్సీల బలం ఉన్న బీఆర్ఎస్ పై కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించింది.ఈ క్రమంలో గురువారం ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మండలిలో ఆ పార్టీ బలం 12 స్థానాలకు చేరింది. అయినా కీలకమైన బిల్లులు , తీర్మానాలను అవసరమైన సంఖ్యా బలం కాంగ్రెస్ కు లేదు.కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందితే తప్ప నిధులు వ్యయం చేయడానికి వీలులేదు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే బీ ఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్సీలను చేర్చుకునే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేస్తోంది. రానున్న కాలంలో మరికొంత మంది ఎమ్మెల్సీలను చేర్చుకునే కార్యక్రమాన్ని ప్రయత్నాలు కొనసాగిస్తోందని తెలుస్తోంది. మరోవైపు మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్థానాల బలం 29 నుంచి 21 కి పడిపోయింది.దీనికంటే ముందు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి(రంగారెడ్డి), కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెల్సిందే. దీంతో మొత్తం 40 స్థానాలు ఉన్న మండలిలో బీఆర్ఎస్ కు 21, కాంగ్రెస్ కు చేరినవారితో కలుపుకొని 12 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు.మరోవైపు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి గతంలో బీఆర్ఎస్ సన్నిహితంగా కొనసాగినా.. ప్రస్తుతం ఆయన కూడా దూరం పాటిస్తున్నారు.కాగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించినప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసినా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించటంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.ఇక తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ నగర కార్పొరేటర్లు, ఎమ్మెల్యే సమావేశానికి కార్పొరేటర్లు మినహా ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాధవరం కృష్ణా రావు, అరికేపూడి గాంధీ. కాలేరు వెంకటేష్,కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ లక్ష్మా రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి హాజరుకాలేదు. దీంతో వీరు పార్టీ మరుతున్నారా? అనే చర్చ కూడా మొదలైంది.మరోవైపు కొన్ని రోజులుగా పార్టీ మారనున్నారని ప్రచారం జరిగిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మరో 19 మంది కాంగ్రెస్ లో చేరితే.. బీఆర్ఎస్ఎల్పీని హస్తం పార్టీలో విలీనం చేయడానికి అర్హత సాధించినట్టు అవుతుంది.తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయంతంగా కొనసాగుతోంది. మొత్తం బీఆర్ఎస్ గెలిచిన 38 సీట్లలో బండ్ల కృష్ణ మోహన్‌తో సహా ఏడుగురు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం 31కి పడిపోయింది. పార్టీ మారటం లేదు..తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కార్యకర్తలు అయోమయానికి గురి కావొద్దని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు.మరోవైపు గతంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆమె కుమారుడు, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తాను, తన తల్లి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగుతామని కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే కాంగ్రెసులో చేర్చుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మళ్లీ గెలించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సవాల్ విసిరారు.బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ల ఆత్మీయ సమావేశంలో ఫిరాయింపుదారులపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. '' పార్టీ నాయకులను సృష్టిస్తుంది.. నాయకులు పార్టీని సృష్టించరు. భవిష్యత్తులో సమర్థవంతమైన యువ నాయకత్వాన్ని తయారు చేస్తాం. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీ మారాతున్నవారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు'' అని కేసీర్ అన్నారు. -
TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిని అనర్హులుగా ప్రకటించాలంటూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణ కోసం సోమవారానికి వాయిదా వేసింది. -
బీఆర్ఎస్ను వీడుతున్నవారిపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,గజ్వేల్: పార్టీ పవర్లో ఉన్నపుడు అత్యున్నత పదవులు అనుభవించి ప్రస్తుతం పార్టీని వీడుతున్న నాయకులపై బీఆర్ఎస్ అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడుతున్న వారు నాలుగు రోజులు పదవులు లేకపోతే ఉండలేరా? వారిని చూసి ప్రజలు అసహించుకుంటున్నారన్నారు.ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో మంగళవారం(జులై2) జరిగిన పార్టీ జెడ్పీచైర్మన్ల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారన్నారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వంలో జెడ్పీచైర్మన్లందరూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు. భవిష్యత్తులో మీరంతా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.ప్రజా జీవితంలోకి ఒకసారి వచ్చిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పని చేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నీ సవ్యంగా నడిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు , తాగు నీటి ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి. మతకల్లోలాలు కూడా చెలరేగడం బాధ కలిగిస్తోంది. అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నారు. అయినా శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తున్నదో ఆలోచించాలి. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించింది. పార్టీ నాయకులను సృష్టిస్తుంది కానీ నాయకులు పార్టీని సృష్టించరు. మంచి యువనాయకత్వాన్ని తయారు చేస్తున్నాం’అని కేసీఆర్ చెప్పారు. -
‘తొందర పడకండి’..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్
సాక్షి,హైదరాబాద్ : ‘తొందరపడకండి.. పార్టీ మారుతున్న నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు హితబోధ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు.ఈ తరుణంలో కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో వరసు భేటీ అవుతున్నారు. నిన్న పలువురు ఎమ్మెల్యలతో కేసీఆర్ మంతనాలు జరపగా.. ఇవాళ హరీశ్ రావు, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, సుధీర్ రెడ్డి,బండారి లక్ష్మారెడ్డిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారుతున్న నేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తొందరపడొద్దని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.కాగా మంగళవారం ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్ రెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేశ్, రావుల శ్రీధర్ రెడ్డిలు హాజరైన విషయం తెలిసిందే. -
నేతల జంప్ జిలానీ.. బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. మొన్నటికి మొన్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్.. మంగళవారం భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్ రెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేశ్, రావుల శ్రీధర్ రెడ్డిలు ఉన్నారు.ఫాంహౌజ్‌కు వచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ లంచ్ చేశారు. అనంతరం ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీ నేతలెవరూ తొందరపడవద్దని తెలిపారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టి మారటం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాలు గతంలనూ జరిగాయని, అయినా మనం భయపడలేదని చెప్పారు.ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని అన్నారు కేసీఆర్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు. భవిష్యత్తులో బీఅర్ఎస్ మంచి రోజులు వస్తాయని, కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఅర్ఎస్కు వచ్చే నష్టం లేదని తెలిపారు. రేపటి నుంచి(బుధవారం) వరుసగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయని స్పష్టం చేశారు.కాగా ఈ చేరికతో మొత్తం ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్టయింది. ఇటీవలే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. అంతకంటే ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయానికి వస్తే 2018లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలిచారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌లో చేరినట్టుగా ప్రచారం జరుగుతోంది.మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం, సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి వారిని పార్టీలోకి ఆహ్వానించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రచారంలో నీతులు చెప్పి, ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులు చేస్తున్నారంటూ రేవంత్‌పై మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.‘ముఖ్యమంత్రి గారు.. ప్రచారంలో నీతులు..? ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులా..?నాడు..ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమన్నారు.ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమన్నారు. భుజాలపై మోసిన కార్యకర్తల పాలిట తీరని ద్రోహమన్నారు.చివరికి...ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టిచంపమన్నారు.రాజీనామా చేయకుండా చేరితో ఊళ్లనుంచే తరిమికొట్టమన్నారుమరి ఇవాళ మీరే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ.. కాంగ్రెస్ కండువాలు కప్పి కప్పదాట్లను ప్రోత్సహిస్తారా ?జంప్ జిలానీల భరతం పడతా అని భారీ డైలాగులు కొట్టి..ఏ ప్రలోభాలను ఎర వేస్తున్నారు ! ఏ ప్రయోజనాలను ఆశిస్తున్నారు !!ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని ?రాజకీయంగా గోరి కట్టాల్సింది ఎవరికి ??ఏ ఎమ్మెల్యేనైనా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే.. రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటా అన్నది మీరేఅందుకే జవాబు చెప్పాల్సింది కూడా మీరే..!!!జై తెలంగాణ’ -
అనర్హత విచారణ.. ఎమ్మెల్సీ రఘురాజు గైర్హాజరు
గుంటూరు, సాక్షి: అనర్హత వేటు పిటిషన్ విచారణకు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు గైర్హాజరు అయ్యారు. దీంతో ఈ నెల 31వ తేదీకి విచారణ వాయిదా వేశారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి రఘురాజు పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే.ఈ ఫిరాయింపుపై వైఎస్సార్సీపీ, మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో వ్యక్తిగతంగా ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ప్రస్తావించారు. దీంతో.. రఘురాజు, చైర్మన్ ఎదుట వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే రఘురాజు హాజరు కాకపోవడంతో విచారణ వాయిదా పడింది.శృంగవరపుకోట జెడ్పీటీసీ సభ్యుడిగా 2001–06 కాలంలో ఇందుకూరి రఘురాజు రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఏ పార్టీలో ఉన్నా.. ఆధిపత్య ధోరణి ప్రదర్శించేవారనే విమర్శ ఆయనపై బలంగా ఉంది. బొత్స కుటుంబానికి దగ్గరగా ఉంటూ వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు రఘురాజు. అయితే అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి ఫిరాయించారు. ఉపేక్షించేది లేదు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్లు నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తున్నారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై, అంతకు ముందు ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేశారు. ఈ ఇద్దరు వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికై.. వంశీకృష్ణ జనసేనలోకి, సి.రామచంద్రయ్య టీడీపీలోకి వెళ్లారు. దీనకంటే ముందు.. ఎనిమిదిమంది రెబల్ ఎమ్మెల్యేలపైనా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేశారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలపై వేటు పడింది. వైఎస్సార్సీపీలో గెలిచి టీడీపీకి మద్దతు ప్రకటించిన ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై చర్యలు తీసుకున్నారు. అలాగే టీడీపీలో గెలిచి వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాళి గిరిలపైనా వేటు పడింది. -
కాంగ్రెస్‌కు షాక్!.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగటానికి ముందే పార్టీలు మారుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. అటు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి.. ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి అభ్యర్థులు చేరుతున్నారు. ఈ తరుణంలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఒకేసారి ఆరుమంది రెబల్ ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలోకి చేరారు. ''సుధీర్ శర్మ, రవి ఠాకూర్, ఇందర్ దత్ లఖన్‌పాల్, దేవేంద్ర భుట్టో, రాజేంద్ర రాణా, చైతన్య శర్మ''లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, రాష్ట్ర బీజేపీ చీఫ్ రాజీవ్ బిందాల్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేర్చలేకపోయామని, అందుకే పార్టీ మారి ప్రజలకు మేలు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సీఎం నియంతలా మారి ప్రజలను అవమానిస్తున్నారని, ఎమ్మెల్యేల మాట వినడం లేదని బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. హిమాచల్ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సీఎం, ఆయన అనుచరుల పాలన సాగుతోందని వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ తమదైన రీతిలో ప్రచారాలు మొదలుపెట్టేశాయి. నిజానికి బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు ఓటు వేసిన ఈ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో వీరు బీజేపీ పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. #WATCH | Six rebel MLAs of Himachal Pradesh- Sudhir Sharma, Ravi Thakur, Inder Dutt Lakhanpal, Devendra Bhutto, Rajendra Rana, and Chaitanya Sharma, join BJP in the presence of Himachal Pradesh BJP President Rajiv Bindal and Union Minister Anurag Thakur. pic.twitter.com/IftAl6U1T5 — ANI (@ANI) March 23, 2024 -
Yellow Babu : ప్రకృతి కూడా పసుపు పార్టీ సరుకేనా?
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు రాజకీయ పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు. కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి బి.ఆర్.ఎస్., బిజెపి ల నుండి పలువురు నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుని పార్టీ కండువాలు కప్పుతున్నారు. ఇలా చేస్తే ప్రకృతి ఊరుకోదని.. తీవ్ర పరిణామాలు తప్పవని గతంలో రేవంత్ రెడ్డి ఓ ఎల్లో మీడియా అధినేతతో కలిసి స్టూడియోలో కూర్చుని సిద్ధాంతీకరించారు. మరి ఇపుడు రేవంత్ రెడ్డి ఇలా BRS పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? ప్రమాదం ఏమీ ఉండదా? అని పొలిటికల్ ఎన్విరాన్ మెంటలిస్టులు ప్రశ్నిస్తున్నారు. పొరుగు పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకోదట. టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని అనుకోవడం వల్లనే దివంగత వై.ఎస్.ఆర్. పై ప్రకృతి ప్రకోపించిందట. దాని కారణంగానే ఆయన మరణించారని ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లో మీడియా లో ఇంటర్వ్యూలో అభిప్రాయ పడ్డారు. ఇలా అభిప్రాయ పడ్డ రేవంత్ రెడ్డి.. ఏబీఎన్ రాధాకృష్ణ ఇద్దరూ కూడా చాలా చాలా మేధవులు. కాకపోతే ఇద్దరికీ కొద్ది పాటి సంస్కారం కూడా లేకుండా పోయిందంటున్నారు రాజకీయ పండితులు. దివంగత వై.ఎస్.ఆర్. హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. చనిపోయిన వారి గురించి ఎవ్వరూ కూడా హేళనగా మాట్లాడరు. కానీ ఈ ఇద్దరూ కూడా వై.ఎస్.ఆర్. మరణానికి ఆయన టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలనుకోవడమే కారణమన్నట్లు.. అందుకే ప్రకృతి ఆయన్ను శిక్షించింది అన్నట్లు తీర్మానించారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి అత్యంత ఇష్టమైన గురువు చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? 23 మంది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కేసులు పెడతామని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి టిడిపిలో చేర్చుకున్నారు. మరి ఈ ఘటనపై ప్రకృతికి కోపం ఎందుకు రాలేదట? వై.ఎస్.ఆర్. టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను చేర్చుకుందామా వద్దా అని ఆలోచన చేస్తేనే పగ బట్టేసిన ప్రకృతి చంద్రబాబు నిస్సిగ్గుగా 23 మందిని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవడమే కాకుండా అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినా ప్రకృతి ఎందుకు ఊరుకున్నట్లు? కొంపదీసి ప్రకృతి కూడా ఎల్లో బ్యాచ్ లో చేరిపోయిందా? ఎల్లో మీడియా తరహాలో టిడిపి అధినేత ఏం చేసినా ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? చంద్రబాబుకి రాజకీయ ప్రత్యర్ధి అయిన వై.ఎస్. ఆర్. తనను ఆశ్రయించిన వారిని తన పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటేనే ప్రకృతికి కోపం వస్తుందా? అన్నది రేవంత్ రెడ్డితో పాటు..రాధాకృష్ణకూడా సమాధానం చెప్పాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదే చంద్రబాబు పురమాయిస్తే ఇదే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంటికి కరెన్సీ కట్టలతో వెళ్లి బేరసారాలాడారు. మరి ఆ ఘటన పట్ల ప్రకృతికి అభ్యంతరాలేవీ ఉండవా? చంద్రబాబు వారి అనుచరులు ఎలా వ్యవహరించినా ప్రకృతి చూసి పరవశించిపోతుందా? అన్నది కూడా రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు వివరించాలి. ఈ ఒక్క విషయమే కాదు..చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు పీకలదాకా అప్పులు చేసి రాష్ట్ర ఖజానా దివాళా తీయించి గద్దె దిగేటపుడు 100కోట్లు మాత్రమే మిగిల్చి పోయారు. అపుడు ఏపీ అద్బుతంగా ఉందని భజన చేసింది ఎల్లో మీడియా. బాబుతో పోలిస్తే చాలా తక్కువగా అప్పులు చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం రాష్ట్రాన్ని దివాళా తీయించేస్తున్నారంటూ గగ్గోలు పెట్టే రాతలు రాసింది. మనోడు చేస్తే సంసారం..ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఎల్లో మీడియా పైత్యపు రాతలు.. ఆ భావజాలంతో ఉండే వారి పైత్యపు కూతలు కొత్త కాదు. సరే చంద్రబాబు నాయుడి ప్రకృతికి చుట్టం కాబట్టి ఆయన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా రాజ్యాంగ విరుద్ధంగా టిడిపిలో చేర్చుకున్నా ప్రకృతి ఏమీ అనలేదు. కానీ ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం ప్రకృతి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆయన్ని అభిమానించే వారు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే బి.ఆర్.ఎస్. నుంచి ఇద్దరు ఎంపీలను ఒక ఎమ్మెల్యేనీ రేవంత్ రెడ్డి పార్టీ చేర్చుకుని కండువాలు కప్పింది. మరో మాజీ మంత్రి మల్లారెడ్డిని డి.కె.శివకుమార్ దగ్గరకు పంపి బేరాలాడించింది. ప్రకృతి ఏపీలోనే కాదు కర్నాటకపైనా నిఘా పెడుతుంది మరి. అందుకే అందరూ జాగ్రత్తగా ఉంటే మంచిదంటున్నారు విజ్ఞులు. - సి.ఎన్.ఎస్.యాజులు, సీనియర్ జర్నలిస్ట్ -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురు
సాక్షి, అమరావతి : అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలతో పాటు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు జరుపుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే.. స్పీకర్, చైర్మన్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువునిచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న వారు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్, అసెంబ్లీ స్పీకర్లతో పాటు ఫిర్యాదుదారు అయిన మదునూరి ప్రసాదరాజును ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇదీ నేపథ్యం.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి గెలుపొందిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో వైఎస్సార్సీపీ వారిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తరువాత వారు టీడీపీలోకి ఫిరాయించారు. ఈ నేపథ్యంలో.. వీరిపై ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలంటూ చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే రీతిలో ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యపై కూడా శాసన మండలిలో చీఫ్‌విప్ అయిన మేరిగ మురళీధర్ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. వీటిపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ విచారణ చేపట్టారు. అనర్హత వేటు ఎందుకు వేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఫిరాయింపుదారులకు ఇటీవల నోటీసులిచ్చారు. ఈనెల 29న విచారణ జరుపుతానని అందులో పేర్కొన్నారు. కానీ, ఈ నోటీసులను రద్దుచేయాలని కోరుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు నలుగురు, ఎమ్మెల్సీ సోమవారం అత్యవసరంగా హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు వేర్వేరుగా దాఖలు చేశారు. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు మరింత గడువునిచ్చేలా స్పీకర్, చైర్మన్లను ఆదేశించాలని, అలాగే విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని వారు తమ పిటిషన్లలో కోర్టును కోరారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం.. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ప్రసాదరావు ఫిర్యాదుపై స్పీకర్ తమకు నోటీసులిచ్చి, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఈ నెల 8న ఆదేశించారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నందున ఆ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు మరింత గడువు కావాలని ఆ నలుగురు కోరడంతో ఈ నెల 26 వరకు స్పీకర్ గడువునిచ్చారన్నారు. తిరిగి ఈనెల 24న స్పీకర్‌కు లేఖ రాసి, వివరణకు నాలుగు వారాల గుడువునివ్వాలని కోరామన్నారు. అయితే, స్పీకర్ తమ అభ్యర్థనను తిరస్కరించి, ఈ నెల 29న విచారణ జరుపుతామని చెప్పారన్నారు. స్పీకర్ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఏ నిమిషంలోనైనా ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉందని, అందువల్ల అనర్హత పిటిషన్లలో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేయాలని ఆయనతో పాటు ఎమ్మెల్సీ న్యాయవాది కోర్టును కోరారు. ఫిరాయింపుదారులను విచారించిన స్పీకర్ మరోవైపు.. వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభలోని తన కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నలుగురిని స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం విచారించారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని స్పీకర్ వారిని కోరారు. వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని వారు చేసిన విజ్ఞప్తిని స్పీకర్ సున్నితంగా తోసిపుచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే మూడుసార్లు సమయం ఇచ్చామని గుర్తుచేస్తూ వారిని విచారించారు. అలాగే, స్పీకర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్ కూడా విచారణకు హాజరయ్యారు. వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం హాజరుకాలేదు. నోటీసులివ్వడం సహజ న్యాయ సూత్రాలకు ఎలా విరుద్ధం? అనంతరం.. అసెంబ్లీ తరఫున న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు వాదనలు వినిపిస్తూ.. అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ గానీ, మండలి చైర్మన్‌గానీ ఓ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. అందువల్ల వారి నిర్ణయాలను అధికరణ 226 కింద కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదన్నారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపే పరిధి హైకోర్టుకు లేదన్నారు. కాలయాపన చేయాలన్న ఉద్దేశంతోనే వివరణ ఇచ్చేందుకు పిటిషనర్లు గడువు కోరుతున్నారని తెలిపారు. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలకు వారి వారి విధులు, బాధ్యతలున్నాయని, ఒక వ్యవస్థలోకి మరొకరు చొరబడటానికి వీల్లేదన్నారు. చట్టం నిర్ధేశించిన మేరకే స్పీకర్, చైర్మన్ నోటీసులిచ్చి వివరణ కోరారన్నారు. వివరణ కోరకుండా ఉత్తర్వులిస్తే అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమవుతుందే తప్ప, నోటీసులు ఇచ్చి వివరణ కోరడం ఎలా విరుద్ధమవుతుందని ప్రశ్నించారు. స్పీకర్, మండలిౖ చైర్మన్ తుది ఉత్తర్వులు జారీచేయడానికి ముందే దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలు అపరిపమైనవని మెట్టా చంద్రశేఖర్‌రావు వివరించారు. ఇలా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్.. పిటిషనర్లు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమని తేల్చిచెప్పారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేశారు. -
మహారాష్ట్ర స్పీకర్‌కు బాంబే హైకోర్టు నోటీసులు
ముంబై: ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాను పెట్టుకున్న పిటిషన్లను మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ కొట్టేయడాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం నేత, చీఫ్ విప్ భరత్ గోగావాలే బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఈ విషయంలో మీ స్పందన తెలపాలంటూ స్పీకర్, 14 మంది ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు పంపింది. అసెంబ్లీ సచివాలయానికీ కోర్టు నోటీసులిచి్చంది. నోటీసులు అందుకున్న వారు తమ స్పందనను అఫిడవిట్ల రూపంలో సమరి్పంచాలని కోర్టు సూచించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదో 8కి వాయిదావేసింది. -
TS: బండి సంజయ్‌కి మంత్రి పొన్నం కౌంటర్
సాక్షి,కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు అమ్ముడుపోతారన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనని మరోసారి బయటపడిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ రెండుగా చీలి పోతుందని చెప్పారు. మంగళ సూత్రాలు అమ్మిన సంజయ్‌కి ఇప్పుడు లక్షల రూపాయలతో కటౌట్స్ పెట్టుకునే డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు. కరీంనగర్లో ఆదివారం పొన్నం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంటుకు బండిసంజయ్ తెచ్చిన నిధులు శూన్యమని పొన్నం విమర్శించారు. ‘శాస్త్రం ప్రకారం ప్రాణప్రతిష్ఠ పండితులు చేస్తారు. అయోధ్య దేవాలయం నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే అశాస్త్రీయంగా మందిర ప్రారంభం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామమందిర ప్రారంభానికి పోవద్దని ఎక్కడా చెప్పలేదు. రాముడి పేరుతో బీజేపీ మార్కెటింగ్ చేస్తోంది. రేషన్ బియ్యం తెచ్చి రాములోరి అక్షింతలంటున్నారు. ఎంపీగా బండిసంజయ్ కొండగట్టు, వేములవాడ కోసం నిధులు ఏమైనా తీసుకువచ్చాడా..? చెప్పాలి. బండిసంజయ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు, పోనీ, జ్యోతిష్య శాస్త్రమూ చదువలేదు. బండిసంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కరెప్షన్ ఆరోపణలు రావడం వల్లే తొలగించారు. కరీంనగర్ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. మాతో పోటి పడేది ఎవరో మిగిలిన పార్టీలే తేల్చుకోవాలి. బండిసంజయ్, వినోద్ కుమార్ ఇద్దరికీ కరీంనగర్లో ఓట్లు అడిగే హక్కు లేదు. కరీంనగర్ స్మార్ట్ సిటిలో అవినీతి జరిగితే మాజీ మంత్రి గంగుల కమలాకర్, బండిసంజయ్ ప్రేక్షక పాత్ర వహించారు. అవినీతి, అక్రమాలపై ఎంక్వైరీ నడుస్తోంది. త్వరలో అన్నీ బయటికి వస్తాయి’ అని పొన్నం అన్నారు. ఇదీచదవండి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతారు -
జనవరి 10 కల్లా తేల్చండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: శివసేన పార్టీలోని రెండు వర్గాలు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ పెట్టుకున్న పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు సుప్రీంకోర్టు గడువు పెంచింది. గతంలో డిసెంబర్ 31వ తేదీలోగా ఏదో ఒకటి తేల్చాలంటూ ఇచ్చిన గడువును తాజాగా మరో 10 రోజులు పొడిగించింది. ‘డిసెంబర్ 20వ తేదీతో అసెంబ్లీ కార్యకలాపాలు ముగుస్తున్నందున, ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు గడువు పొడిగించాలంటూ స్పీకర్ పెట్టుకున్న వినతిని సహేతుకమైందిగా భావిస్తున్నాం. అందుకే, గడువును మరో 10 రోజులపాటు, వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు పొడిగిస్తున్నాం’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. -
డీకే శివకుమార్ బిగ్ స్కెచ్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షిఫ్ట్..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎగ్జిట్‌పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడంతో ఆ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. తమ పార్టీ తరపున గెలిచే ఎమ్మెల్యేలు చేయి జారిపోకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఫలితాల్లో పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటితే ఎలాంటి సమస్యలు ఉండవు కానీ అలాకాని పక్షంలో ఎమ్మెల్యేల హార్స్ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పెద్ద స్కెచ్‌నే వేసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొందరు సీఎం కేసీఆర్‌కు టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎగరేసుకుపోకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలు నడపడంలో దిట్ట అయిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను రంగంలోకి దిగారు. కౌంటింగ్‌కు ఒక రోజు ముందే శనివారం సాయంత్రమే డీకే సహా ఆరుగురు కర్ణాటక మంత్రులు హైదరాబాద్ రానున్నట్లు సమాచారం. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణాకు రావాలని డీకే అండ్ కో ఇప్పటికే అభ్యర్థులను కోరినట్లు తెలిసింది. అభ్యర్థులతో డీకే ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచాం. ఫలితాల వెల్లడి తర్వాత గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానాల్లో డీకే బ్యాచ్ బెంగళూరు షిఫ్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా,శనివారం ఉదయం తెలంగాణఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను కలిసిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు కూడా గెలవబోయే కాంగ్రెస్ అభ్యర్థుల విషయమై ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. తమ పార్టీ చీఫ్ పోలింగ్ ఏజెంట్‌కే ఎమ్మెల్యేల గెలుపు ధృవీకరణ పత్రాలు అందజేయాలని కోరారు. దీనినిబట్టి పోటీచేసిన అభ్యర్థులు లోకల్‌గా అందుబాటులో ఉండరని తేలిపోయింది. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత ఓ జాతీయ టీవీ ఛానల్‌తో మాట్లాడిన డీకే శివకుమార్ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఇప్పటికే మా అభ్యర్థుల్లో కొంత మందికి టచ్‌లోకి వచ్చారని చెప్పారు. అయితే ఈసారి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోవడం అంత ఈజీ కాదని డీకే స్పష్టం చేశారు.2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకంగా లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ఇదీచదవండి..తెలంగాణ ఎన్నికలు 2023.. నేటి సమగ్ర సమాచారం -
మా ఆదేశాలే అపహాస్యమా?
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, వారి వర్గం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు మండిపడింది. దీనిపై నిర్ణయాన్ని ఆయన నిరవధికంగా వాయిదా వేస్తూ పోజాలరని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ‘‘స్పీకర్ కాస్త విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మేం భావించాం. నిర్దిష్ట కాలావధిలోగా ఈ అంశాన్ని పరిష్కరించాల్సిందిగా గత విచారణ సమయంలోనే ఆయనకు మేం స్పష్టంగా నిర్దేశించాం. ఇందుకు కాలావధి కూడా పెట్టుకోవాల్సిందిగా సూచించాం. ఆయన దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కని్పంచాలి. కానీ ఈ అంశంపై అసలు విచారణే జరపడం లేదు’’ అంటూ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు తలంటిపోశారు. ‘‘గత జూన్ నుంచీ ఈ విషయం అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. మేమంతా గమనిస్తూనే ఉన్నాం. అసలు స్పీకర్ ఏమనుకుంటున్నారు? మా ఆదేశాలనే అపహాస్యం చేస్తారా? ఇదేమైనా ఆషామాషీ విషయమని అనుకుంటున్నారా?’’ అంటూ ఆగ్రహించారు. ‘‘ఈ విషయంలో స్పీకర్‌కు కచి్చతంగా ‘సలహా’ అవసరం. వెంటనే ఎవరైనా ఆ పని చేయడం మేలు‘‘ అని స్పీకర్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సీజేఐ సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకపోతే ఈ మొత్తం ప్రక్రియకు అర్థమే లేకుండా పోతుందన్నారు. ఈ అంశాన్ని ఎప్పట్లోగా తేలుస్తారో స్పష్టంగా పేర్కొంటూ మంగళవారం నాటికి తమకు టైమ్‌లైన్‌ను సమరి్పంచాలని ఆదేశించారు. లేదంటే ఈ విషయమై తామే నేరుగా ఆదేశాలిస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. స్పీకర్‌ను బాధ్యున్ని చేయాల్సి వస్తుంది! మహారాష్ట్రలో పలువురు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలు రద్దు చేయాలంటూ శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత ఉద్ధవ్‌ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం ముందు శుక్రవారం విచారణ కొనసాగింది. ఠాక్రే వర్గం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు కొనసాగించారు. దీనిపై జూలై 14న స్పీకర్‌కు ధర్మాసనం నోటీసులు జారీ చేసినా ఇప్పటికీ ఏమీ జరగలేదని సీజేఐ దృష్టికి తెచ్చారు. దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదుటి పక్షం వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవడం, ఇందులో పలు అంశాలను స్పీకర్ ముందుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్న సొలిసిటర్ జనరల్ మెహతా వివరణతో సంతృప్తి చెందలేదు. ‘‘ఈ విషయమై మేం జూలై 14న స్పష్టమైన సూచనలు జారీ చేశాం. సెప్టెంబర్ 18న ఆదేశాలు కూడా వెలువరించాం. అయినా స్పీకర్ చేసిందేమీ లేదు. కనుక రెండు నెలల్లోగా దీనిపై ఆయన నిర్ణయం తీసుకోవాలని మేం ఆదేశించక తప్పడం లేదు’’ అన్నారు. ‘‘స్పీకర్ పదవికున్న హుందాతనం దృష్ట్యా తొలుత మేం టైంలైన్ విధించలేదు. కానీ ఆయన తన బాధ్యతలను నెరవేర్చకపోతే అందుకు బాధ్యున్ని చేయక తప్పదు’’ అని అన్నారు. -
హిమాచల్ కాంగ్రెస్‌లో ‘ఆపరేషన్ లోటస్’ గుబులు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. శాసనసభ ఫలితాల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరోహోరీ పోటీ నెలకొంది. స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్న హస్తం పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలు పెట్టింది. బీజేపీ ఆపరేషన్ కమలం ప్రయత్నాలను అడ్డుకుని, విజయం సాధించే తమ అభ్యర్థులను చేజారి పోకుండా కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలను రాజస్థాన్‌కు తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని పరిస్థితులపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రానికి ఆమె సిమ్లా చేరుకోనున్నారని సమాచారం. మరోవైపు.. కొత్త ఎమ్మెల్యేల తరలింపు బాధ్యతను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్, పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాకు అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గురువారం సాయంత్రం ఎమ్మెల్యేలను బస్సుల ద్వారా రాజస్థాన్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. ఇదీ చదవండి: మోదీ అడ్డాగా గుజరాత్.. రికార్డులు బద్దలుకొట్టిన బీజేపీ! -
షిండేకు పదవీ గండం.. ఏ క్షణమైనా మహారాష్ట్రకు కొత్త సీఎం?
ముంబై: ఎంతో నమ్మకంగా సుదీర్ఘకాలం కొనసాగిన పార్టీలోనే తిరుగుబాటు చేసి మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి తెరతీశారు ఏక్నాథ్ షిండే. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇప్పటికీ రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. అయితే.. తాజాగా ఏక్నాథ్ షిండే వర్గంలోనే చీలకలు వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి పదవికి ఎసరు వచ్చేలా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు ఆయనపై అసంతృప్తితో ఉన్నట్లు ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన.. తన అధికారిక పత్రిక సామ్నాలో ఈ మేరకు వెల్లడించింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలోని 40 మందిలో 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు పేర్కొంది సామ్నా. ఏక్నాథ్ షిండేను బీజేపీ తాత్కాలికంగా ఆ పదవిలో కూర్చోబెట్టిందని పేర్కొనటం గమనార్హం. ‘ఆయన ముఖ్యమంత్రి పదవి ఏ క్షణమైనా కోల్పోతారని ప్రతిఒక్కరికి అర్థమైంది. అంధేరీ ఈస్ట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో షిండే వర్గం పోటీ చేయాలని భావించింది. కానీ, అందుకు బీజేపీ నిరాకరించింది. గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించామని షిండే వర్గం చెప్పటం పూర్తిగా తప్పు. 22 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. వారిలోని చాలా మంది బీజేపీతో కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ’అని ఉద్ధవ్ థాక్రే వర్గం పేర్కొంది. ఏక్నాథ్ షిండే తనకు తాను, మహారాష్ట్రకు చాలా నష్టం చేశారని, రాష్ట్ర ప్రజలు వదిలిపెట్టరని పేర్కొంది శివసేన. షిండేను తమ స్వప్రయోజనాల కోసం బీజేపీ వినియోగించుకోవటం కొనసాగిస్తుందని తెలిపింది. బీజేపీ నాయకుడి వ్యాఖ్యలను ఉద్ఘాటించింది. ప్రభుత్వం 40 మంది ఎమ్మెల్యేలతో నడుస్తోందని, వారంతా సీఎంఓ నియంత్రణలో ఉన్నారని పేర్కొంది. నిర్ణయాలన్నింటిని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకుంటున్నారని, ఆ నిర్ణయాలను షిండే ప్రకటిస్తున్నారని ఆరోపించింది. ఇదీ చదవండి: పెళ్లైన మరుసటి రోజే డబ్బు, నగలతో వధువు పరార్.. వరుడికి ఫోన్ చేసి..! -
‘బీజేపీలో చేరితే రూ.20కోట్లు.. ఎమ్మెల్యేలను తీసుకెళ్తే రూ.25 కోట్లు’
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంపై మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించిన క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు నేతలు. ఈ క్రమంలోనే ఐదుగురు ఆప్ సీనియర్ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డబ్బులు, బెదిరింపులతో తమ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్ర ఏజెన్సీలను ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏవిధంగా ఉపయోగిస్తుందో ప్రస్తుత పరిస్థితులు అద్దపడుతున్నాయని పేర్కొన్నారు ఆప్ జాతీయ ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్. ‘ఢిల్లీ ఎమ్మెల్యేలను విడగొట్టే ప్రయత్నం మొదలైంది. మనీష్ సిసోడియాపై బీజేపీ చేసిన ‘షిండే’ ప్రయత్నం విఫలమైంది. పార్టీ మారి రూ.20 కోట్లు తీసుకోండి.. లేదా సిసోడియా మాదిరిగా సీబీఐ కేసులు ఎదుర్కోండి అని ఆప్ ఎమ్మెల్యేలను బెదిరించారు. ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమ్‌నాథ్ భారతి, కుల్దీప్లకు బీజేపీ నేతలు ఈ ఆఫర్ ఇచ్చారు. పార్టీ మారితే ప్రతిఒక్కరికి రూ.20 కోట్లు ఇస్తామన్నారు. ఇతర ఎమ్మెల్యేలను తనతో తీసుకొస్తే రూ.25 కోట్లు ఆఫర్ చేశారు.’ అని పేర్కొన్నారు ఎంపీ సంజయ్ సింగ్. తమకు బీజేపీ నేతలు ఏవిధంగా ఆఫర్ ఇచ్చారనే అంశాన్ని విలేకరులతో చెప్పారు మిగిలిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలు. ‘సిసోడియాపై పెట్టిన కేసులు ఫేక్ అని తమకు తెలుసునని, కానీ, ఆప్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సీనియర్ నేతలు నిర్ణయించారని బీజేపీ నేతలు మాతో చెప్పారు. ఆప్ నాయకులను తీసుకువచ్చే పనిని వారికి అప్పగించినట్లు తెలిపారు. ఎంత దూరమైనా వెళ్లి ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొడతామని వెల్లడించారు.’ అని ఎమ్మెల్యే సోమ్‌నాథ్ పేర్కొన్నారు. మరోవైపు.. ఆప్ ఎమ్మెల్యేలు, సిసోడియా.. ఆపరేషన్ లోటస్‌ను ఆపరేషన్ బోగస్‌గా మార్చారని ఎద్దేవా చేశారు సంజయ్ సింగ్. ఇదీ చదవండి: బీజేపీ మాకు భయపడుతోంది :కేజ్రీవాల్ -
ఆపరేషన్ వికర్ష్.. బీజేపీకి భారీ షాక్?
వరుసగా ఒక్కో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాలతో అనిశ్చితి, ప్రభుత్వాలు కుప్పకూలే పరిస్థితి నెలకొనడం.. వాటిని తమకు అనుకూలంగా బీజేపీ మార్చుకుంటూ పోవడం చూస్తున్నాం. కానీ, ఆ రాష్ట్రంలో మాత్రం బీజేపీకే భారీ షాక్ తప్పేలా కనిపించడం లేదు. రాంచీ: జార్ఖండ్‌లో అధికార పార్టీ తాజా ప్రకటన బీజేపీలో గుబులు పుట్టిస్తోంది. బీజేపీ నుంచి పదహారు మంది ఎమ్మెల్యేలు తమతో ‘టచ్’లో ఉన్నారంటూ జార్ఖండ్ ముక్తి మోర్చా అనూహ్య ప్రకటన చేసింది. యూపీఏ మిత్రపక్షం అయినప్పటికీ.. జేఎంఎం మొన్న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకే మద్ధతు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అలాంటిది.. సుమారు పదహారు మంది బీజేపీ ఎమ్మెల్యేలు జేఎంఎంలో చేరేందుకు రెడీగా ఉన్నారంటూ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ‘బీజేపీ ఆకర్ష్.. ఇక్కడ వర్కవుట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్లు(16 మంది బీజేపీ ఎమ్మెల్యేలు) తమ పార్టీలో ఇబ్బందికర పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. వాళ్లంతా హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు’ అని జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారిక ప్రతినిధి సుప్రియో భట్టాచార్య ప్రకటించారు. అవసరం అయితే బీజేపీ నుంచి చీలిపోయి.. ఒక గ్రూపుగా ఏర్పడి జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు వాళ్లంతా సిద్ధంగా ఉన్నారని సుప్రియో పేర్కొన్నారు. ప్రస్తుతం జేఎంఎం ప్రభుత్వ పాలన స్థిరంగానే కొనసాగిస్తోంది. 2019 ఎన్నికల్లో మొత్తం 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 స్థానం గెల్చుకుంది. అలాగే బీజేపీ 25 స్థానాలు దక్కించుకుంది. యూపీఏ కూటమితోనే జేఎంఎం ప్రభుత్వం నడుస్తోంది అక్కడ. అయితే.. ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్‌పై అక్రమ మైనింగ్ ఆరోపణలపై దర్యాప్తు సంస్థల దృష్టి పడింది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సైతం బీజేపీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో జేఎంఎం.. బీజేపీ నుంచే తమవైపు ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రకటించడం కొసమెరుపు. ఇదిలా ఉంటే జేఎంఎం ప్రకటనపై బీజేపీ వెటకారంగా స్పందించింది. అవినీతిలో కూరుకుపోయిన జేఎంఎం.. ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని పేర్కొంది. రాష్ట్రపతి ఎన్నికల్లో జేఎంఎం ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఇచ్చారో అందరికీ తెలుసని, ప్రజావ్యతిరేకత నేపథ్యంలో త్వరలో జేఎంఎంతో పాటు కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలసలు తప్పవని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ సహదేవ్ ప్రకటించారు. -
కాంగ్రెస్‌లో ఫిరాయింపుల కలవరం.. చెన్నైకి ఆ ఎమ్మెల్యేలు!
పనాజీ: దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీని వీడారు. ఈ క్రమంలో గోవా కాంగ్రెస్‌లో ఫిరాయింపు వార్తలు కలకలం సృష్టించాయి. పలువురు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైంది కాంగ్రెస్ అధిష్ఠానం. గోవాకు చెందిన ఐదుగురు తమ పార్టీ ఎమ్మెల్యేలను శనివారం చెన్నైకి తరలించింది. చెన్నైకి తరలించిన గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో.. సంకల్ప్ అమోంకర్, ఆల్టోన్ డికోస్టా, కార్లోస్ ఆల్వారెస్, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్, యూరి అలెమోలు ఉన్నారు. సంకల్ప్ అమోంకర్ ప్రస్తుతం కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నేతగా కొనసాగుతున్నారు. గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మైకెల్ లోబోలు పార్టీలోని మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పుకుని పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను తరలించటం ప్రాధాన్యం సంతరించుకుంది. గోవా కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ దినేశ్ గుండూరావు తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.25 కోట్లు ఇచ్చిందని ఇటీవలే ఆరోపణలు చేశారు. మరోవైపు.. బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను మైకెల్ లోబో ఖండించారు. అలాంటి ఆలోచనే తనకు లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మైకెల్ లోబోను గోవా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా నుంచి తొలగించింది కాంగ్రెస్. లోబో, కామత్‌లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఇదీ చదవండి: PM Narendra Modi: ఎన్నికల్లో ‘ఉచిత హామీలు’ దేశాభివృద్ధికి ప్రమాదకరం