
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.
కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిని అనర్హులుగా ప్రకటించాలంటూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణ కోసం సోమవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment