సాక్షి, హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం(సెప్టెంబర్9) కీలక ఆదేశాలు వెల్లడించింది. అనర్హత పిటిషన్‌లు స్పీకర్ ముందు ఉంచాలని, నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని స్టేటస్ రిపోర్టు తమకు దాఖలు చేయాలని కోర్టు తీర్పు ద్వారా చేసింది.
‘‘పిటిషన్‌లపై ఎప్పటిలోగా వాదనలు వింటాం. ఎన్నిరోజుల్లో విచారిస్తాం. తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాం అనే అంశాలపై షెడ్యూల్ ప్రొసీడింగ్స్ విడుదల చేయాలి. లేదంటే మేమే ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారిస్తాం’’ అని కోర్టు అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది.
కాగా, తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ పిటిషన్ వేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌లను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్‌లో కోరారు. ఇటు బీఆర్‌ఎస్, అటు ముగ్గురు ఎమ్మెల్యేల తరపున లాయర్లు వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హతపై ఫిర్యాదు చేసినప్పటికీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్‌ఎస్ హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.
ఇదీ చదవండి.. స్పీకర్ వేటు వేయకుంటే.. సుప్రీంకు: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment