Disqualifications
-
నేడు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల కేసుపై మంగళవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి విచారించనుంది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ జనవరి 15న బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్‌లు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీలపై బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ రెండు పిటిషన్లపై ఈనెల 10న సుప్రీం కోర్టు విచారించింది. విచారణ సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. రాజకీయ పారీ్టల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే చూస్తూ ఊరుకోం’అంటూ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం పేర్కొంది. అనంతరం ఈనెల 18కి విచారణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
ఫిరాయింపు MLAలపై సుప్రీంకోర్టు విచారణ
-
నేడు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టులో విచారణ
-
పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ ముగిసేంత సమయం కావాలా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు? అసలు మీకెంత సమయం కావాలి? అసెంబ్లీ కాలపరిమితి ముగిసేంత సమయం కావాలా?’అంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మీకెంత సమయం కావాలో చెప్పండంటూ ఆదేశించింది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా శాసనసభ స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఈనెల 15న సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ పేర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పి)ను దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాం«దీలపై బీఆర్ఎస్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరుల పేర్లతో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్ఎల్పిపై శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసిహ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. పది నెలలుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై పది నెలలుగా స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు దామ శేషాద్రి నాయుడు, పొనుగోటి మోహిత్‌రావు సుప్రీంకోర్టుకు తెలిపారు. తమ పిటిషన్లపై హైకోర్టు ఉత్తర్వులు వచ్చి ఏడు నెలలైనా స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని నివేదించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని స్పీకర్ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ చెప్పగా.. ఫిర్యాదులపై నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ కార్యాలయానికి పది నెలల సమయం పట్టిందా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. రీజనబుల్ టైం అంటే ఎంత? పార్టీ ఫిరాయింపులపై స్పందించేందుకు స్పీకర్ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఎంత అని న్యాయవాది రోహత్గీని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. ఇందుకు రోహత్గీ బదులిస్తూ.. స్పీకర్ నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో ఇచి్చన తీర్పును చదివి వినిపించారు. నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ ఎమ్మెల్యేలకు తగిన సమయం ఇవ్వాలని ఆ తీర్పులో ఆదేశాలు ఇచ్చిందన్నారు.జస్టిస్ గవాయి జోక్యం చేసుకుని ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ కాలపరిమితి ముగింపు దశలో నిర్ణయం తీసుకుంటారా? అనర్హత విషయంలో మహారాష్ట్ర స్పీకర్ మాదిరిగా వ్యవహరిస్తారా?’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులపై స్పందించేందుకు ఎంత సమయం కావాలో అసెంబ్లీ సెక్రటరీ కనుక్కుని చెప్పాలని ధర్మాసనం సూచించింది. ఇందుకు మీకెంత సమయం కావాలో చెప్పాలని ధర్మాసనం రోహత్గీని అడగ్గా.. రెండు వారాలు కావాలని బదులిచ్చారు. రోహత్గీ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ.. ‘ఈ అంశం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరమైతే లేదు. ఫోన్ కాల్ సరిపోతుంది’అంటూ జస్టిస్ గవాయి చమత్కరించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి ధర్మాసనం వాయిదా వేసింది. -
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు తీర్పు
-
3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపుల అంశంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీళ్లకు విచారణార్హత లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు వాదించారు. ‘పదవ షెడ్యూల్‌ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్ ముందు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా లోక్‌సభ, శాసనసభల జీవితకాలం ఐదేళ్లు మాత్రమే. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత సమయంలో తీర్పు వెలువరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.ఇక్కడ 8 నెలలైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..’అని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్), తెల్లం వెంకట్రావు (కొత్తగూడెం) దానం నాగేందర్ (ఖైరతాబాద్)లను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్లు దాఖలు వేశారు. అలాగే దానంను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యా దు చేసేందుకు ప్రయత్నించినా స్పీకర్ సమ యం ఇవ్వడం లేదంటూ బీజేపీ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై విచారణ షెడ్యూల్‌ను నాలుగు వారాల్లోగా ఖరారు చేయాలని సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి గత నెల హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్ రావు ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు విన్పించారు. గడువులోగా నిర్ణయం తీసుకోవాలి.. ‘ఎమ్మెల్యేగా గెలిచిన ఓ నేత పార్టీ మారడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆయనను ప్రజలు ఓడించారు. మహారాష్ట్ర, మణిపూర్ కేసులలో సుప్రీంకోర్టు వెలువరించిన రెండు తీర్పులను పరిశీలిస్తే.. తమ ముందు పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై నిరీ్ణత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రూల్ 6, 7 ప్రకారం స్పీకర్ నడుచుకోవడం లేదు. వెంటనే నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలి..’అని మోహన్‌రావు కోర్టును కోరారు. కాగా ఏలేటి తరఫున న్యాయవాది జె.ప్రభాకర్ వాదనల కోసం తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. -
ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ వాయిదా
హైదరాబాద్, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. గురువారం మరోసారి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టింది. తొలుత కడియం శ్రీహరి తరఫున న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు.అసలు ఈ అప్పీల్లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని సీజే ధర్మాసనం తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. ఆ తర్వాత స్పీకర్ సూచన మేరకు షెడ్యూల్‌ను రిజిస్ట్రీ ముందు ఉంచాలని అన్నారు. స్పీకర్ ముందు ఉంచనని చెప్పే అధికారం కార్యదర్శికి లేదని కోర్టు తెలిపింది. అసెంబ్లీ కార్యదర్శి ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నారు. ఆయన కోర్టు ఉత్తర్వులు పాటించాల్సిందే. అధికారాలను ఎంజాయ్ చేస్తా.. విధులను మాత్రం నిర్వహించనని అంటే సరికాదని పేర్కొంది.అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ మెయింటనబుల్ కాదని అందుకే కొట్టివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు కోర్టుకు తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా ఎంపీగా పోటీ చేశారని చెప్పారు. వాదనల అనంతరం.. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. అంతకుముందు సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనంలో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. స్పీకర్ నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి తీర్పు వెలువరించారు.చదవండి: ‘ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు'.. 4 వారాలు గడువు -
వారిక ‘నో ఫ్లై లిస్టు’లో
న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులతో హడలెత్తిస్తున్న ఆకతాయిలు, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి ఉత్తుత్తి బాంబు బెదిరింపులతో ప్రమాణికులకు తీవ్ర అసౌకర్యం కల్పిస్తున్న వారిని, భయాందోళనలకు గురిచేస్తున్న వారిని ఇకమీదట విమాన ప్రయాణానికి అనర్హుల జాబితా (నో ఫ్లై లిస్టు)లో చేర్చనున్నారు. మూడు రోజుల్లో మొత్తం 19 జాతీయ, అంతర్జాతీయ విమానా లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కొన్ని విమానాలను దారిమళ్లించి దగ్గర్లోని విమానాశ్రయాల్లో దింపి తనఖీలు పూర్తి చేశారు. ఇవన్నీ ఉత్తుత్తి బాంబు బెదిరింపులేనని తేలింది. సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు బుధవారం సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, కేంద్ర హోంశాఖ అధికారులతో సమావేశమై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. నిఘా సంస్థలు, పోలీసుల సహకారంతో బాంబు బెదిరింపులకు దిగుతున్న వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని, చట్టసంస్థలు ప్రతికేసులోనూ లోతుగా దర్యాప్తు జరుపుతున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు బుధవారం తెలిపారు. మరో ఏడు విమానాలకు బెదిరింపులుబుధవారం మరో ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ ఉత్తవేనని తేలింది. నాలుగు ఇండిగో విమానాలు, రెండు స్పైస్‌జెట్ విమానాలు, ఒక ఆకాశ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. రియాద్–ముంబై ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని దారి మళ్లించి మస్కట్ (ఒమన్)లో దింపారు. చెన్నై– లక్నో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో లక్నోలో దిగగానే ప్రయాణికులను సురక్షితంగా దింపి.. విమానాన్ని నిర్జన ప్రదేశానికి తీసు కెళ్లారు. అలాగే ఢిల్లీ– బెంగళూరు ఆకాశ ఎయిర్ విమానానికి బెదిరింపు రావడంతో దాన్ని తిరిగి దేశ రాజధానికి మళ్లించి.. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఇలాగే ముంబై– ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అహ్మదాబాద్‌కు మళ్లించారు. మైనర్ అరెస్టు: ముంబై: మూడు విమానాలను లక్ష్యంగా చేసుకొని సోషల్‌మీడియాలో బాంబు బెదిరింపులు పంపిన చత్తీస్‌గఢ్‌లోని ఒక 17 ఏళ్ల మైనర్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేశారు. -
మహిళా ప్రజాప్రతినిధులంటే అలుసా?
న్యూఢిల్లీ: ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధిని పదవి నుంచి తొలగించడాన్ని సాధారణ విషయంగా తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధిగా గెలిచిన మహిళలను ఇష్టారాజ్యంగా పదవుల నుంచి తొలగించడం సరైంది కాదని పేర్కొంది. మహారాష్ట్రలో ఓ గ్రామ మహిళా సర్పంచిని పదవి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును న్యాయస్థానం కొట్టివేసింది. మహిళలు గ్రామ సర్పంచి కావడాన్ని చాలామంది తట్టుకోలేకపోతున్నారని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. దేశమంతటా ఇలాంటి పరిస్థితి ఉందని పేర్కొంది. నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం మహిళల్లో ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని వెల్లడించింది. నిజానికి మహిళల్లో చక్కటి పరిపాలనా సామర్థ్యాలు ఉంటాయని, వారిని తక్కువ అంచనా వేయొద్దని సూచించింది. మనీశ్ రవీంద్రపన్ పాటిల్ అనే మహిళ మహారాష్ట్రలో జలగావ్ జిల్లా విచ్ఖేడ్ గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనంలో ఆమె తన అత్తతో కలిసి నివసిస్తున్నారని గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఒక ప్రజాప్రతినిధి కబ్జా చేసిన స్థలంలో కట్టిన ఇంట్లో నివసించడం చట్టవిరుద్ధమని ఆమెపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ ఆరోపణలను మనీశ్ రవీంద్రపన్ పాటిల్ ఖండించారు. తాను భర్త, పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నానని స్పష్టంచేశారు. కలెక్టర్ సరైన విచారణ చేయకుండా తెలుసుకోకుండా పాటిల్‌ను సర్పంచి పదవి నుంచి తొలగించారు. దీన్ని ఆమె బాంబే హైకోర్టులో సవాలు చేశారు. హైకోర్టు కూడా కలెక్టర్ నిర్ణయాన్ని సమర్థించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బాంబే హైకోర్టు ఉత్తర్వును తోసిపుచ్చింది. పాటిల్ సర్పంచిగా విధులు నిర్వర్తించవచ్చంటూ తీర్పు వెలువరించింది. దేశంలో లింగ సమానత్వం కోసం, మహిళా సాధికారత కోసం ఒకవైపు కృషి కొనసాగుతుండగా, మరోవైపు వారిని నిరుత్సాహపర్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఆవేదన వెలిబుచ్చింది. ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని, మహిళలను ప్రోత్సహించాలని స్పష్టం చేసింది. వారిని కింపచర్చడం, అలుసుగా తీసుకోవడం తగదని హితవు పలికింది. పేర్కొంది. -
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. స్టేకు నిరాకరించిన హైకోర్టు
-
ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ నెల 24న వాదనలు వింటామని తెలిపింది.సెప్టెంబర్ 9న ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ మూడు అంశాలపై ప్రధానంగా చర్చించింది. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్లు అసెంబ్లీ కార్యదర్శి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పెండింగ్ పిటిషన్లకు సంబంధించిన అంశాన్ని స్పీకర్ దగ్గరకు తీసుకెళ్లాలి. అనర్హత వేటుకు సంబంధించిన అంశాల్లో వాదనలు వినాలి. అలాగే షెడ్యూల్ ఖరారు చేయాలి. వీటన్నింటికి సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను హైకోర్టుకు సమర్పించాలన్నదే ఆ తీర్పులోని సారాంశం. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని, స్టేటస్ రిపోర్ట్‌ను తమకు అందజేయాలని తీర్పిచ్చింది. అయితే కోర్టు ఇచ్చిన నాలుగు వారాల గడువు ముగియనుంది. ఈ తరుణంలో రెండ్రోజుల క్రితం అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపైన స్టే విధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో అడ్వకేట్ జనరల్ ఈ అంశంపై స్టే విధించి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.అయితే దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ మాత్రం అందుకు అంగీకరించలేదు. అసెంబ్లీ కార్యదర్శి తరుఫున కోర్టులో వాదించిన అడ్వకేట్ జనరల్ చెప్పే విషయాలన్నింటిని తాము వినేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ నెల 24న వాదనలు వింటామని సూచించింది. -
‘స్టేషన్‌ఘన్‌పూర్’కు ఉప ఎన్నిక అనివార్యమేనా..?
సాక్షిప్రతినిధి, వరంగల్ : స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పదవికి అనర్హత ముప్పు పొంచి ఉందా..? ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పదా.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పుతో ఉమ్మడి జిల్లాలో ఇదే చర్చ నడుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని తీర్పులో హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచరవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. అంతటా ‘అనర్హత’పైనే చర్చ..గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్లో గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా మరో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాల తీర్పులను, ఫిరాయింపు చట్టం నిబంధనలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని సోమవారం హైకోర్టు ఆదేశించించడం కలకలం రేపింది. దీంతో స్టేషన్ ఘన్పూర్ టికెట్ పొందడం మొదలు గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం... తాజాగా హైకోర్టు తీర్పు వెలువడే వరకు పలుమార్లు కడియం శ్రీహరి పతాక శీరి్షకలకెక్కారు. హైకోర్టు తీర్పు మేరకు కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడే అవకాశమే ఎక్కువుందన్న చర్చ ఒక పక్కన.. స్పీకర్ కార్యాలయం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ మరో పక్కన జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ నియోకవర్గానికి ఉప ఎన్నిక తప్పదా? అన్న ఉత్కంఠ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. విమర్శలు, ప్రతి విమర్శలు.. ఎవరి ధీమా వారిదే... బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటుకు సంబంధించిన అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు స్పందించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, డా.టి.రాజయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు ఎవరికీ వారుగా తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. వెంటనే చర్య తీసుకోవాలి..బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్న. నాలుగు వారాల్లో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్పీకర్ అనర్హత వేటు వేయాలి.– ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రిడివిజన్ బెంచ్‌కు అప్పీలుకు వెళ్తాంనాకు కోర్టుపైన నమ్మకం వుంది.. డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్తాం. పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సంబరాలు జరుపుకుంటున్న బీఆర్ఎస్ నేతలే పార్టీ ఫిరాయింపులకు మూల కారకులు. 2014 నుంచి 2023 మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఫిరాయింపులకు పాల్పడిన చరిత్ర బీఆర్ఎస్ది. – కడియం శ్రీహరి, ఎమ్మెల్యేనిబద్ధత ఉంటే శ్రీహరి రాజీనామా చేసి గెలవాలి..బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి నిబద్ధత ఉంటే రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై గెలవాలి. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజ్యాంగబద్ధంగా స్పీకర్ వ్యవహరించాలి. కడియం శ్రీహరి, కావ్యలు నియోజకవర్గానికి ఎంత చేసిన తక్కువే. నియోజకవర్గ ప్రజలకు వారు రుణపడి ఉండాలి. – డా.టి.రాజయ్య, మాజీ మంత్రి -
స్పీకర్ స్పందించకుంటే మళ్లీ కోర్టుకే!
సాక్షి, హైదరాబాద్: పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో అసెంబ్లీ స్పీకర్ నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో మరోమారు కోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఫిరాయింపులపై పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద వేసిన రిట్ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు సోమవారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. స్పీకర్ నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.ఈ నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్ అనుసరించే వైఖరిని బట్టి తమ భవిష్యత్తు న్యాయ పోరాటం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్)పై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఈ ఏడాది మార్చిలో స్పీకర్‌కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. స్పీకర్ స్పందించకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో.. ఇటీవలి కాలంలో ఇదే తరహాలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఆయా రాష్ట్రాల స్పీకర్లు అనుసరించిన వైఖరిని బీఆర్ఎస్ పరిశీలిస్తోంది. మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఫిరాయింపులు, ఆయా సందర్భాల్లో స్పీకర్, కోర్టులు స్పందించిన తీరును అధ్యయనం చేస్తోంది. మహారాష్ట్ర, హిమాచల్‌లో ఏం జరిగింది? మహారాష్ట్రలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం సుమారు రెండేళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. 2022 జూన్ 21న ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కొందరు శివసేన ఎమ్మెల్యేలతో సొంత గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు కూడా షిండే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో చేరారు. షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ అప్పట్లో సీఎంగా ఉన్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే డిప్యూటీ స్పీకర్ (స్పీకర్ పదవి ఖాళీగా ఉండటంతో)కు పిటిషన్లు సమరి్పంచారు.మరోవైపు తమదే అసలైన శివసేన అంటూ షిండే వర్గం అనర్హత పిటిషన్లు ఇచి్చంది. అయితే కొత్త స్పీకర్ ఈ అనర్హత పిటిషన్లపై స్పందించకపోవడంతో విషయం సుప్రీంకోర్టుకు చేరింది. తొలుత 2023 డిసెంబర్ 31లోగా అనర్హత పిటిషన్ల అంశాన్ని తేల్చాలని స్పీకర్‌కు గడువు విధించిన సుప్రీంకోర్టు.. ఆ తర్వాత మరో పది రోజులు పొడిగిస్తూ ఈ ఏడాది జనవరి 10వరకు గడువు విధించింది. అయితే స్పీకర్.. షిండే, ఉద్ధవ్ వర్గాలు ఇచ్చిన అనర్హత పిటిషన్లను తిరస్కరించారు.దీంతో అనర్హత వేటు అంశం మరోమారు సుప్రీంకోర్టుకు చేరింది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర స్పీకర్ ఈ ఏ డాది ఫిబ్రవరి 29న అనర్హత వేటు వేశారు. అయితే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉపఎన్నిక నిర్వహించవద్దని అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఈ అంశంలో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఉప ఎన్నికలు జరిగాయి. మరో ఏడుగురు ఎమ్మెల్యేలపైనా వేటు వేయాలి హిమాచల్ తరహాలో ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరితో పాటు మరో ఏడుగురు ఎమ్మెల్యేలపై ఇచ్చిన అనర్హత పిటిషన్లపైనా స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతోంది. కాంగ్రెస్‌లో చేరిన అరికెపూడి గాం«దీ, ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, గూడెం మహిపాల్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కూడా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్లు సమరి్పంచింది. కోర్టు తీర్పులో పేర్కొన్న ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఈ ఏడుగురు ఎమ్మెల్యేలను కూడా అనర్హులుగా ప్రకటించని పక్షంలో కోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. -
TG: ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం(సెప్టెంబర్9) కీలక ఆదేశాలు వెల్లడించింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని, నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని స్టేటస్ రిపోర్టు తమకు దాఖలు చేయాలని కోర్టు తీర్పు ద్వారా చేసింది. ‘‘పిటిషన్లపై ఎప్పటిలోగా వాదనలు వింటాం. ఎన్నిరోజుల్లో విచారిస్తాం. తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాం అనే అంశాలపై షెడ్యూల్ ప్రొసీడింగ్స్ విడుదల చేయాలి. లేదంటే మేమే ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారిస్తాం’’ అని కోర్టు అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. కాగా, తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌లను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లో కోరారు. ఇటు బీఆర్ఎస్, అటు ముగ్గురు ఎమ్మెల్యేల తరపున లాయర్లు వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హతపై ఫిర్యాదు చేసినప్పటికీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. ఇదీ చదవండి.. స్పీకర్ వేటు వేయకుంటే.. సుప్రీంకు: కేటీఆర్ -
Court of Arbitration for Sport: ఒక్క గ్రాము ఎక్కువున్నా అనర్హతే
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) సూచించింది. పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంగా భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయగా... కేవలం వంద గ్రాములే కదా దీన్ని మినహాయించండి అని భారత అథ్లెట్ సీఏఎస్‌ను ఆశ్రయించింది. వాదనలు విన్న అనంతరం తీర్పును పలుమార్లు వాయిదా వేసిన సీఏఎస్ ఈనెల 14న వినేశ్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు ఏకవాక్యంలో తీర్పు ఇచి్చంది. ఇప్పుడు తాజాగా దీనిపై వివరణ ఇచి్చంది. ‘క్రీడాకారులకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి. బరిలోకి దిగే బరువు కేటగిరీ కంటే ఎక్కువ ఉంటే అనుమతించరు. అది అందరికీ వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. నిరీ్ణత బరువు కంటే ఒక్క గ్రాము ఎక్కువ ఉన్న అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందే. అందుకే పోటీపడే కేటగిరీ కంటే కాస్త తక్కువే ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు. దరఖాస్తు చేసుకున్న అథ్లెట్ (వినేశ్ ఫొగాట్‌ను ఉద్దేశించి) తాను అధిక బరువు ఉన్నానని స్పష్టంగా పేర్కొంది. ఇందులో ఎలాంటి వివాదం లేదు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా పొందుపరిచింది. దరఖాస్తుదారు అనుభవమున్న రెజ్లర్. గతంలో ఇలాంటి నిబంధనల నడుమ పోటీపడింది. రూల్స్ అర్థం చేసుకోలేకపోయిందనే సమస్యే తలెత్తదు. అయితే ఆమె అభ్యర్థన ఏంటంటే.. 100 గ్రాములు బరువు ఎక్కువ కాదని.. రుతుస్రావానికి ముందు దశలో అధికంగా నీరు తాగడం వల్లే ఇలా జరిగిందని.. తగిన సమయం లేనందు వల్లే బరువు తగ్గించలేకపోయానని.. మినహాయింపు ఇవ్వాలని కోరింది’ అని సీఏఎస్ సోమవారం వివరణ ఇచి్చంది. కాగా మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో వరుస విజయాలతో ఫైనల్ చేరిన వినేశ్.. తుది పోరుకు ముందు 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురై ఒలింపిక్ పతకానికి దూరమైంది. తొలి రోజు పోటీల్లో నిరీ్ణత బరువుతోనే పోటీపడి విజయాలు సాధించినందుకుగానూ... క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపెజ్‌తో కలిపి తనకూ రజతం ఇవ్వాలని వినేశ్ న్యాయపోరాటం చేసింది. పలు అంతర్జాతీయ టోర్నీల్లో రెండు కేజీల అధిక బరువు ఉన్నా యూడబ్ల్యూడబ్ల్యూ వారిని అనుమతిస్తోందని.. దీంతో వంద గ్రాములే కాబట్టి మినహాయించాలని సీఏఎస్‌లో అప్పీలు చేసింది. దీనికి భారత ఒలింపిక్ కమిటీ మద్దతిచ్చి నిష్ణాతులైన న్యాయ నిపుణులను నియమించింది. అయినా నిబంధనలు అందరికీ ఒక్కటే అని స్పష్టం చేసిన సీఏఎస్.. వినేశ్ అప్పీల్‌ను కొట్టేసింది. దీంతో దిగ్గజ రెజ్లర్ యూ సుసూకీపై విజయంతో సంచలనం సృష్టించడంతో పాటు.. ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా రికార్డుల్లోకెక్కిన వినేశ్‌కు నిరాశే ఎదురైంది. -
రాజ్యసభలో తీవ్ర రగడ
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు అంశం పట్ల రాజ్యసభలో అలజడి రేగింది. ప్రతిపక్ష సభ్యులు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. వినేశ్ ఫోగాట్ అంశంపై సభలో చర్చించేందుకు చైర్మన్ అనుమతి ఇవ్వకపోవడంపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ జగదీప్ ధన్‌ఖడ్ సభ నుంచి వెళ్లిపోయారు. ఎగువ సభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. వినేశ్ ఫోగాట్‌పై అనర్హత అంశంపై తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. అందుకు ధన్‌ఖడ్ అంగీకరించకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. డెరెక్ ఓబ్రెయిన్‌తోపాటు విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండడంతో సభలో గందరగోళం నెలకొంది. ఫోగాట్‌పై చర్చించేందుకు ధన్‌ఖడ్ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. విపక్ష ఎంపీల తీరు పట్ల ధన్‌ఖడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఉండలేనని చెప్పారు. భారమైన హృదయంతో సభ నుంచి నిష్కృమిస్తున్నానని తెలిపారు. -
వినేష్ ఫోగట్ అనర్హత.. అసలు కారణం ఇదేనా?
-
మనసు గెలిచింది- ఆ వంద గ్రాములు లెక్కే అంటారా?
నవ్వుతూ మాట్లాడకూడదు. నచ్చిన డ్రెస్ అసలే వేసుకోకూడదు. హవ్వ.. అబ్బాయిల్లా ఆ ఆటలు ఏంటి? ఏమ్మా నువ్వైనా నీ బిడ్డకు చెప్పవచ్చు కదా! అసలే తండ్రి లేని పిల్ల... ఇలాంటివి మీకు అవసరమా? సూదుల్లా గుచ్చే ఇరుగు పొరుగు మాటలు లెక్కచేయలేదు– ఆ తల్లీ.. కూతురు తల్లి ఎంతటి ధైర్యశాలో కూతురికి తెలుసు. 32వ ఏటనే భర్తను కోల్పోయినా ఇద్దరు కూతుళ్లను గొప్పగా పెంచింది. ఆడపిల్లలు బలహీనులని భావించక మగాళ్ల గోదాలో రెజ్లర్లుగా దించింది. క్యాన్సర్ బారిన పడ్డా కూతుళ్ల కోసం యముడితో పోరాడి బయటపడింది. అవును... ఆ తల్లిని చూసి పోరాడటం నేర్చుకుంది ఆ కూతురు... వినేశ్ ఫొగట్ డాటరాఫ్ సరళాదేవి.‘పట్టు’ పడితే పతకం మెడలో వాలాల్సిందే. అన్యాయం చేసిన వాళ్ల తాట తీయాల్సిందే. న్యాయపోరాటంలో మొండిగా ముందుకు దూకాల్సిందే. నాన్న లేడని అమ్మను వంకర చూపులు చూసే వాళ్ల తోడేలుతనం ఆమె దృష్టిని దాటి పోలేదు. ఆడవాళ్లకు అదెంత వేదనో స్వయంగా చూసింది. అందుకే తోటి మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురయ్యామని చెబితే వారికి మద్దతుగా నిలిచింది. కెరీర్‌ను పణంగా పెట్టి రాజధానిలో ఉద్యమానికి ఊపిరిగా మారింది.పాలకుల ఒంటెత్తు పోకడలను నిరసిస్తూ జీవితకాల శ్రమతో సంపాదించుకున్న ఖేల్ రత్న అవార్డును కూడా తృణ్రపాయంగా విడిచిపెట్టింది. ఇంత బరితెగింపా అంటూ అజ్ఞానంతో అనరాని మాటలు అనే వాళ్లను చిరునవ్వుతో మరింత చికాకు పెట్టింది. మద్దతుగా నిలిచిన వారికి కన్నీళ్లతోనే కృతజ్ఞతలు చెప్పింది. ఖేల్ ఖతమే అన్న వాళ్ల చెంప చెళ్లుమనిపించేలా అన్ని సవాళ్లను దాటుకుని మూడోసారి ఒలింపిక్స్ బరిలో నిలిచింది. అంతేనా.. ఇప్పటి వరకు భారత మహిళా రెజ్లర్లు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించింది. స్వర్ణ పతకపోరుకు అర్హత సాధించింది. ఊహించని విధంగా వందగ్రాములు.. కేవలం వందగ్రాముల అదనపు బరువు కారణంగా పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పతకం సాధించకపోతేనేమి.. అందరి హృదయాలలో అభిమానాన్ని సంపాదించింది. వీటన్నిటి ముందు ‘ఆ వంద గ్రాములు‘ లెక్కే అంటారా? (ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ ఫొగట్.. 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది)-సుష్మారెడ్డి యాళ్లచదవండి: వినేశ్ ఊహించలేదా!.. జుట్టు కత్తిరించి, రక్తం తీసినా.. తప్పెవరిది? -
‘ఆ వంద గ్రాములే’ అసలు ఒలింపిక్ మెడల్ బరువెంతో తెలుసా?
ఒలింపిక్స్‌లో చారిత్రాత్మక స్వర్ణాన్ని సాధించి రికార్డ్ విజయంతో చరిత్ర సృష్టింస్తుందనుకున్న మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై అనూహ్యంగా అనర్హత వేటు పడటం యావద్దేశాన్ని దిగ్భ్రమకు గురి చేసింది. ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్స్ కి ప్రవేశించిన తొలి భారతీయ మహిళగా, స్వర్ణం సాధించాలన్న ఆమె కల కలగానే మిగిలి పోయింది. ఒలింపిక్ పతకంలో ఐదో వంతు బరువు వినేశ్ ఫోగట్ ఆశల్నేకాదు, యావద్దేశ ఆకాంక్షల్ని కుప్పకూల్చింది.Gold medal awarded at the Paris Olympics.pic.twitter.com/dbqgXwPWCY— Figen (@TheFigen_) August 7, 2024 ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో వినేశ్ ఫోగట్ తొలి మహిళా ఒలింపిక్ ఛాంపియన్‌గా అవతరించే అవకాశాన్ని కోల్పోవడం క్రీడాభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా అనర్హత వేటు పడింది. అయితే ఒలింపిక్ ఏయే పతకాలు ఎంతెంత బరువుంటాయి అనేది నెట్టింట చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో 100-150 గ్రాముల బరువుండే లగ్జరీ వస్తువులు ఏంటో కూడా ఒకసారి చూద్దామా? ఐఫోన్ 15- 171 గ్రాములు కాగా ఒక కాటన్ టీ-షర్టు 100-150 గ్రాములు ఉంటుంది. ఒలింపిక్ పతకాలు, బరువుఒలింపిక్ గోల్డ్ మెడల్ బరువు - 556 గ్రాములుఒలింపిక్ సిల్వర్ మెడల్ బరువు- 550 గ్రాములుఒలింపిక్ కాంస్య మెడల్ బరువు - 450 గ్రాములువినేశ్ ఫోగట్ అనర్హతకు దారితీసిన కారణాలుమంగళవారం రాత్రి ఆమె రెండు కిలోల బరువు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తొలి మూడు రౌండ్లలో ఆమె 2 కిలోల బరువు పెరిగింది.ఆమె రెండు కిలోలు అధిక బరువుతో ఉందని తెలిసినప్పుడు, ఆమె రాత్రంతా నిద్రపోలేదు , సైక్లింగ్ స్కిప్పింగ్ చేయడానికి జాగింగ్‌తో సహా ఆ రెండు కిలోగ్రాముల బరువును తగ్గించుకోవడానికి ఆమె సాధ్యమైనదంతా చేసింది. నీళ్లు కూడా తాగకపోవడంతో డీ హైడ్రేషన్‌కు కూడా గురైంది.బుధవారం ఉదయం తూకం వేయగా 100 గ్రాములు అధిక బరువుతో ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో భారత ప్రతినిధి బృందం 100-150 గ్రాముల బరువు తగ్గించుకోవడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరింది, కానీ ఫలితం లేకుండా పోయింది.Close up of an object that Neeraj Chopra will gift the country…. pic.twitter.com/0DBIK9frR5— Harsh Goenka (@hvgoenka) August 7, 2024 -
#Vinesh Phogat కుట్ర? కఠిన వాస్తవమా? గుండె పగిలిందంటున్న నెటిజన్లు
ప్యారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆశలు అడియాసలయ్యాయి. భారత్‌కు మరో పతకం ఖాయమని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న వేళ భారతీయ క్రీడాభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేసుకున్న ఆనంద క్షణాలో ఆమెపై అనర్హత వేటు పడటం సంచలనంగా మారింది. 50 కేజీల విభాగంలో 100 గ్రాములు ఎక్కువ బరువున్నకారణంగా ఆమెను అనర్హురాలిగా ఒలింపిక్ సంఘం ప్రకటించింది.This is Conspiracy against Vinesh Phogat.This is a SCAM 💔 pic.twitter.com/nN6mgmVa5Y— Harsh Tiwari (@harsht2024) August 7, 2024HEART-BREAKING TURN AROUND OF INDIAN OLYMPIC HISTORY - VINESH PHOGAT 💔 - This pain will stay forever. pic.twitter.com/x4geviOJHD— Johns. (@CricCrazyJohns) August 7, 2024బరువు నియంత్రణకోసం 14 గంటలు నీరు కూడా తాగలేదు వినేశ్. బరువు తగ్గడానికి నిద్ర పోలేదు అయినా 100 గ్రాములు ఎక్కువ కావడం ఆమెతోపాటు, కోట్లాదిమంది భారతీయులను గుండెల్ని బద్దలు చేసింది. కానీ నీళ్లు తాగని కారణంగా డీహైడ్రేషన్‌కు గురికావడంతో వినేశ్ ఆస్పత్రి పాలైంది. దీంతో సోషల్‌మీడియాలో నెటిజన్లు బావురుమన్నారు. కుట్ర జరిగిందా, కఠిన వాస్తవమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 100 గ్రా. కోసమా అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు. నమ్మశక్యంగా లేదు.. గుండె కొట్టించుకున్నాసరిపోయేదిగా!ఇది అసలు నమ్మశక్యంగా లేదు. 100 గ్రాముల కోసం అనర్హత వేటా? ఈ మాత్రం బరువు తగ్గేందుకు నెత్తి మీద వెంట్రుకలు తీయించుకున్నా సరిపోతుంది అంటూ ప్రముఖ యూ ట్యూబర్ ధృవ్ రాఠీ ట్వీట్ చేశారు. పలువురు నెటిజన్లు గుండె పగిలిన ఎమోజీలను పోస్ట్ చేశారు. మరోవైపు ‘నువ్వు విజేతవే.. వినేశ్... అధైర్యపడవద్దు’ అంటూ మరికొంతమంది వ్యాఖ్యానించారు. ఈ బాధ తీరనిది అంటూ మరికొందరు ట్వీట్ చేశారు.ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనడాని కంటే ముందు మహిళా రెజర్లపై లైంగిక ఆరోపణల పోరాటంలో వినేశ్ ఫోగట్ ముందు వరుసలో నిలిచారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై ఆ రోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిని అనర్హులుగా ప్రకటించాలంటూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణ కోసం సోమవారానికి వాయిదా వేసింది. -
ఆప్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆనంద్‌పై అనర్హత వేటు
సాక్షి, ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆనంద్‌పై అనర్హత వేటు పడింది. బీఎస్పీ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన రాజ్‌కుమార్.. విచారణకు హాజరుకావాలని స్పీకర్ ఆదేశించారు. విచారణకు హాజరుకాకపోవడంతో రాజ్‌కుమార్ అసెంబ్లీ సభ్యత్వంపై అనర్హత వేటు వేసినట్టు స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ శుక్రవారం తెలిపారు. జూన్ 11న విచారణకు హాజరుకావాలని నోటీస్ ఇచ్చినా కానీ ఆయన హాజరుకాలేదని గోయెల్ పేర్కొన్నారు. మరోసారి జూన్ 14న హాజరుకావాలని ఆదేశించినా స్పందించలేదన్నారు. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు స్పీకర్ తెలిపారు.'ఆప్' సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలను రాజ్‌కుమార్ ఆనంద్ నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దళితులకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. గత ఏప్రిల్‌లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీని కూడా వీడారు. ఆప్‌లోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, కౌన్సిలర్లకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. గత మేలో బీఎస్పీలో చేరారు. బీఎస్పీ తరఫున ఎంపీ ఎన్నికల్లో రాజ్‌కుమార్ పోటీ చేశారు. -
హిమాచల్‌లో సుఖు సర్కార్ సేఫ్!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ అస్థిరతకు తాత్కాలికంగా తెరపడింది. ముఖ్యమంత్రి సుఖి్వందర్ సింగ్ సుఖు ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కే.ఎల్.ఠాకూర్, హోషియార్ సింగ్, ఆశిష్ శర్మలు మార్చి 22న రాజీనామా చేయగా, స్పీకర్ కుల్దీప్సింగ్ పథానియా సోమవారం వాటిని ఆమోదించారు. తొలుత కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన ఈ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు.. ఫిబ్రవరిలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు. బీజేపీ అభ్యర్థి హర్‡్ష మహజన్ గెలుపునకు దోహదపడ్డారు. మెజారిటీ ఉండి కూడా కాంగ్రెస్ తమ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్విని గెలిపించుకోలేకపోయింది. అప్పటి నుంచి బీజేపీ హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పావులు కదుపుతోంది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడగా.. వారు బీజేపీలో చేరి ఆ పార్టీ గుర్తుపై ఉప ఎన్నికల్లో పోటీచేశారు. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. హిమాచల్ అసెంబ్లీ బలం 68 కాగా... తొమ్మిది మంది పోను ప్రస్తుతం 59గా ఉంది. కాంగ్రెస్‌కు 34 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 25 మంది సభ్యులున్నారు. మంగళవారం వెలువడే ఉప ఎన్నికల ఫలితాల్లో ఆరింటికి ఆరు స్థానాలు బీజేపీ నెగ్గినా వారి బలం 31 మాత్రమే అవుతుంది. ఈ పరిస్థితుల్లో గనక ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల బలం కూడా తోడైతే బీజేపి 34కు చేరుకునే అవకాశాలుండేవి. అలా కాకుండా సరిగ్గా ఫలితాలకు ముందు రోజు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో మళ్లీ ఉప ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేదాకా సుఖు ప్రభుత్వం కొంతకాలం ఊపిరిపీల్చుకున్నట్లే. అదీ మళ్లీ తాజాగా ఫిరాయింపులేవీ జరగకుండా ఉంటే! -
AP: ఫిరాయింపు ఎమ్మెల్సీ కొత్త డ్రామా?
విజయనగరం, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు కొత్త డ్రామాకు తెర లేపారా?. సరిగ్గా శాసన మండలిలో అనర్హత పిటిషన్‌పై విచారణ నాడే ఆయన ఆస్పత్రిలో చేరడం ఆ అనుమానాలను బలపరుస్తోంది. ఎమ్మెల్సీ రఘురాజు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి పార్టీ ఫిరాయించారు. దీంతో వైఎస్సార్సీపీ శాసనమండలిలో ఫిర్యాదు చేసింది. మే 27వ తేదీన విచారణకు హాజరు కావాలని మండలి చైర్మన్ మోషేన్ రాజు నోటీసులు పంపారు. అయితే ఆరోజు కారణం ఏంటో చెప్పకుండానే రఘురాజు విచారణకు గైర్హాజరు అయ్యారు. దీంతో విచారణను మే 31(ఇవాళ్టికి) వాయిదా వేశారు చైర్మన్. అయితే విచారణకు రాకుండా విశాఖ నారాయణ ఆస్పత్రిలో చేరారు రఘురాజు. కిడ్నీ సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరారని ఆయన అనుచరులు అంటున్నారు. మరోవైపు ఆయన ఇవాళ కూడా విచారణకు గైర్హాజరు కావడంతో చైర్మన్ మోషేన్ రాజు విచారణ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. తదుపరి విచారణ ఎప్పుడుంటుదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఇటు శాసనమండలిలో.. అటు శాసనసభలోనూ చైర్మన్, స్పీకర్లు ఫిరాయింపులను తీవ్రంగా పరిగణిస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. ఇక మండలిలోనూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపైనా అనర్హత వేటు పడింది. -
రఘురాజుపై అనర్హత వేటుకు రంగం సిద్ధం
ఈ చిత్రం చూశారా? టికెట్ పంచాయితీ ముగిసిన తర్వాత లోకేశ్‌తో గొంప కృష్ణ సహా ఎస్.కోట టీడీపీ నాయకులంతా ఫోజు ఇచ్చిన ఫొటో ఇది. అప్పటివరకూ అంతా తానై నడిపించిన రఘురాజు మాత్రం ఆ ఫొటోలో కనిపించకుండా దాగుండిపోయారు. ధైర్యం ఉంటే వారితో ఫొటో దిగవచ్చు కదా? అలా చేస్తే ఆయన రఘురాజు ఎందుకవుతారని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాజకీయ ద్రోహానికి పాల్పడిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే టీడీపీలోకి ఫిరాయించిన జంగా కృష్ణమూర్తి, సి.రామచంద్రయ్య, జనసేన పార్టీలోకి జంప్ చేసిన వంశీకృష్ణ యాదవ్‌పై శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు వేటు వేశారు. వాళ్లంతా బాహాటంగానే ఫిరాయించారు. వారికి భిన్నంగా తెరచాటు, వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్న రఘురాజు గుట్టు ఆలస్యంగానైనా వెలుగులోకి వచ్చింది. లోకేశ్ సహా టీడీపీ నాయకులతో అంటకాగుతున్న వ్యవహారం, వారితో కుమ్మకై ఎస్.కోటలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును, విశాఖ లోక్‌సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఓడించేందుకు పన్నిన కుతంత్రాలు తేటతెల్లమయ్యాయి. ఈ నేపథ్యంలో రఘురాజుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో వైఎస్సార్సీపీ విప్ పాలవలస విక్రాంత్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 27న రావాలని మండలి చైర్మన్ మోషేన్ రాజు తాఖీదులు పంపినా రఘురాజు డుమ్మా కొట్టేశారు. ఈనెల 31న ఆఖరిసారిగా మరో అవకాశం ఇస్తున్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్నవారంతా శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన మండల స్థాయి నాయకులు. వారి మధ్యలో కూర్చున్న వ్యక్తి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు. వారు వెళ్లింది ఏదో ప్రజాప్రయోజన కార్యక్రమం కోసం కాదు సుమీ... టీడీపీ టికెట్ కోసం పోటీపడిన కోళ్ల లలితకుమారి, గొంప కృష్ణ మధ్య సంధి కోసం! గత మార్చి నెలలో లోకేశ్‌ను కలిసేందుకు ఆయన ఇంట్లో వేచివున్న సదరు నాయకుల చిత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదవులిచ్చిన పారీ్టకే ద్రోహం... శృంగవరపుకోట నియోజకవర్గంలో టీడీపీ టికెట్ దక్కించుకున్న కోళ్ల లలితకుమారికి వ్యతిరేకంగా గళమెత్తిన గొంప కృష్ణ నోరుమూయించిన వ్యవహారం వెనుక పెద్ద తతంగమే నడిచింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... గత మార్చి నెలాఖరులో గొంప కృష్ణను, ఆయన అనుచరులను నారా లోకేశ్ హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిపించుకున్నారు. అక్కడ జరిగిన టికెట్ పంచాయితీకి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వెళ్లడం అప్పట్లో సంచలనమైంది. కాకపోతే ఆ భేటీ ఫొటోలేవీ అప్పట్లో బయటకు రాకపోవడంతో తాను ఇంకా వైఎస్సార్సీపీలోనే ఉన్నానంటూ రఘురాజు నటించారు. తెరవెనుక మాత్రం టీడీపీ మేలు కోసం విశ్వప్రయత్నాలు చేశారు. అప్పటికే ఎస్.కోట మండల వైస్ ఎంపీపీ పదవికి రాజీనామా చేయకుండానే తన భార్య ఇందుకూరి సుబ్బలక్ష్మి అలియాస్ సుధారాజును టీడీపీలోకి పంపించారు. లోకేశ్‌తో పచ్చ కండువా వేయించారు. బడ్డువరలోని స్వగృహంలో టీడీపీ సమావేశాలన్నీ పెడుతూనే అవేవీ తనకు సంబంధం లేదని బుకాయిస్తూ వచ్చారు. భార్య, భర్త వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పేమిటని, మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉండవచ్చా? అంటూ సుధారాజు ఘాటు వ్యాఖ్యలు చేసినా ఆయన ఖండించలేదు. రాజకీయంగా అండదండలు అందించిన బొత్సపైనే విమర్శలు చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అంత స్థాయి లేకపోయినా ఇచ్చిన మాట కోసం సామాజిక సమీకరణలనూ పక్కనబెట్టి ఎమ్మెల్సీని చేసిన వైఎస్సార్సీపీకే ద్రోహం చేసిన వ్యక్తి నుంచి అంతకన్నా ఏమీ ఆశించలేమని పార్టీ శ్రేణులు నివ్వెరపోయారు. ఎంత వారించినా తెగింపే... వాస్తవానికి పార్టీకి నష్టం చేసే పనులు చేయొద్దని, వారి రాజకీయాలకు ఇబ్బందేమీ ఉండదని రఘురాజు దంపతులకు వైఎస్సార్సీపీ అధిష్టానం నచ్చజెప్పి చేసింది. ఎంత వారించినా ‘స్థానికత’ ముసుగులో పార్టీకి ద్రోహం చేయడానికి తెగించారు. ఈ కుతంత్రంలోకి ఎస్ కోట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు కొందరినీ లాగేందుకు విఫలయత్నం చేశారు. ఎమ్మెల్సీ మూణ్నాళ్ల ముచ్చటే... ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం ఒక పార్టీ తరఫున చట్టసభల్లో అడుగుపెట్టిన వ్యక్తి తర్వాత సదరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం–1985 ప్రకారం అనర్హత వేటు పడుతుంది. ఈ ప్రకారం వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టిన రఘురాజు ఇప్పుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, అతనిపై చర్యలు తీసుకోవాలని అతనిపై ఫిర్యాదు దాఖలైంది. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు నోటీసులు పంపించారు. ఈ నెల 31న రఘురాజు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది. పారీ్టకి ద్రోహం చేసినట్లు వచ్చిన ఆరోపణలు రుజువైతే ఎన్నికల కమిషన్ అనుమతితో రఘురాజు సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. ∙ కోళ్ల’కు కాటు తప్పదా? వైఎస్సార్సీపీకి ద్రోహం చేసి టీడీపీ కోసం పనిచేస్తున్న రఘురాజు దంపతులతో తనకు మేలు జరుగుతుందని టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి భావిస్తున్నారు. కానీ లోకేశ్ సమక్షంలో జరిగిన పంచాయితీ గురించి తెలిస్తే ఆమె గుండె పగిలిపోవడం ఖాయమని టీడీపీ నాయకులే గుసగుసలాడుతున్నారు. తన భార్యను ఏదిఏమైనా సరే ఎమ్మెల్యే చేయాలన్నదే రఘురాజు జీవిత ఆశయమట! కడుబండి శ్రీనివాసరావును తప్పిస్తే ఆమెకే వైఎస్సార్సీపీ టికెట్ ఇప్పించాలని చేసిన ప్రయత్నాలే ఫలించలేదు. దీంతో టీడీపీని ఆశ్రయించారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్సీ చొరవతో లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన దామచర్ల సత్యకు చేరువయ్యారు. గత ఎన్నికల్లో రఘురాజు పోటీచేసి 30 వేల పైచిలుకు ఓట్లు సాధించారని, ఆయనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని దామచర్ల సత్యనారా లోకేశ్‌కు చెప్పారట! దీంతో రఘురాజుతో కలిసి వైఎస్సార్సీపీపై కుట్రకు టీడీపీ నాయకులు సిద్ధమైపోయారు. ఇందుకోసం కోళ్ల లలితకుమారికి తెలియకుండానే వారిమధ్య చీకటి ఒప్పందం కుదిరింది. 2029 నాటికి నియోజకవర్గ పునరి్వభజన ద్వారా ఎస్.కోట రెండు నియోజకవర్గాలు అవుతుందని, వాటిలో ఒక టికెట్ గొంప కృష్ణకు, రెండో నియోజకవర్గంలో టికెట్ రఘురాజు భార్య సుబ్బలక్ష్మికి ఇస్తామని లోకేశ్ గట్టి హామీ ఇచ్చారట! ఇద్దరికీ రెండూ ఇచ్చేస్తే మరి కోళ్ల లలితకుమారి పరిస్థితి ఏమిటనేదీ ఆగమ్యగోచరమే. చేరదీసిన గురువుకే పంగనామాలు పెట్టడంలో సిద్ధహస్తులైనవారి వెన్నుపోటు ఆమెకు కూడా తప్పేలా లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
అనర్హత విచారణ.. ఎమ్మెల్సీ రఘురాజు గైర్హాజరు
గుంటూరు, సాక్షి: అనర్హత వేటు పిటిషన్ విచారణకు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు గైర్హాజరు అయ్యారు. దీంతో ఈ నెల 31వ తేదీకి విచారణ వాయిదా వేశారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి రఘురాజు పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే.ఈ ఫిరాయింపుపై వైఎస్సార్సీపీ, మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో వ్యక్తిగతంగా ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ప్రస్తావించారు. దీంతో.. రఘురాజు, చైర్మన్ ఎదుట వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే రఘురాజు హాజరు కాకపోవడంతో విచారణ వాయిదా పడింది.శృంగవరపుకోట జెడ్పీటీసీ సభ్యుడిగా 2001–06 కాలంలో ఇందుకూరి రఘురాజు రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఏ పార్టీలో ఉన్నా.. ఆధిపత్య ధోరణి ప్రదర్శించేవారనే విమర్శ ఆయనపై బలంగా ఉంది. బొత్స కుటుంబానికి దగ్గరగా ఉంటూ వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు రఘురాజు. అయితే అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి ఫిరాయించారు. ఉపేక్షించేది లేదు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్లు నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తున్నారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై, అంతకు ముందు ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేశారు. ఈ ఇద్దరు వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికై.. వంశీకృష్ణ జనసేనలోకి, సి.రామచంద్రయ్య టీడీపీలోకి వెళ్లారు. దీనకంటే ముందు.. ఎనిమిదిమంది రెబల్ ఎమ్మెల్యేలపైనా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేశారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలపై వేటు పడింది. వైఎస్సార్సీపీలో గెలిచి టీడీపీకి మద్దతు ప్రకటించిన ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై చర్యలు తీసుకున్నారు. అలాగే టీడీపీలో గెలిచి వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాళి గిరిలపైనా వేటు పడింది. -
జంగా కృష్ణ మూర్తిపై అనర్హత వేటు
-
జంగా ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ సీనియర్ పొలిటీషియన్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్ తగిలింది. పార్టీ ఫిరాయింపు కారణంగా ఆయనపై అనర్హత వేటు వేశారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. దీంతో.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ కోరింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు విచారణ నిర్వహించారు. ఆయన నుంచి వివరణ తీసుకున్నారు. చివరకు.. ఎమ్మెల్సీగా కృష్ణమూర్తి అనర్హుడని పేర్కొంటూ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ బుధవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జంగా కృష్ణమూర్తి.. 2009 నుంచి 2019 మధ్య పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది. వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు మండలిలో విప్‌గా కూడా పని చేశారు. -
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిని చేయాలని వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకుగాను మోదీని ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడిని చేయాలని వేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టు ముందు సోమవారం(ఏప్రిల్29) విచారణకు వచ్చింది.ఇటీవల ఉత్తరప్రదేశ్ ఫిలిబిత్‌లో నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని మోదీ దేవుని పేరు చెప్పి ఓట్లు అడిగారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పిటిషనర్ కోరారు. అయితే పిటిషన్లో విచారించదగ్గ మెరిట్స్ ఏవీ లేవని కోర్టు అభిప్రాయపడింది. -
కడియంకు బీఆర్ఎస్ చెక్?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న సీనియర్ నేత కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియంపై అనర్హతవేటు వేసేందుకు సిద్ధమైన్లు సమాచారం. కేసీఆర్ సూచన మేరకు శనివారం మధ్యాహ్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఒకటి అసెంబ్లీకి చేరుకుంది. అయితే.. కడియంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ అందుబాటులో లేరని సమాచారం. దీంతో అసెంబ్లీ కార్యదర్శిని కలిసే యత్నం చేయగా.. ఆయన కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది. దీంతో డిప్యూటీ సెక్రటరీకి ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన స్వీకరించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు కడియంపైన కాకుండా.. దానం నాగేందర్‌పై అనర్హత వేటు ఫిర్యాదు చేసేందుకు ఈ బృందం వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. దీంతో ఇద్దరిపైన లేకుంటే ఇద్దరిలో ఒకరిపైనే బీఆర్ఎస్ ఫిర్యాదుకు సిద్ధమైందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఎవరి మీద అయినా.. ఆలస్యం చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను బీఆర్ఎస్ కోరనుందని సమాచారం. ఒకవేళ అనర్హత పిటిషన్‌ను స్పీకర్ స్వీకరిస్తే గనుక.. తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయా? అనే ఆసక్తి నెలకొంది. మరోపక్క శనివారం ఉదయం అనుచర గణంతో సమావేశమైన కడియం, ఆయన కూతురు కావ్యలు పార్టీ మారబోతున్నట్లు నిర్ణయం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, పార్టీకి ప్రజలు దూరమవుతున్నారని, కారణాలు ఏవైనా బీఆర్ఎస్ ను ఇంకా ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు. అందుకే తాము తప్పనిసరి స్థితిలో ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అన్నారు. కావ్య తాను వరంగల్ ఎంపీగా పోటీ చేయబోతున్నానని.. తనను గెలిపించాలంటూ వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ రెబల్స్‌కు సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లోని అధికార కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించడంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ఆరుగురు శాసనసభ్యులు ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. అనర్హత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీరు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం విచారణ జరిపింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా కార్యాలయానికి నోటీసు పంపింది. పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున అసెంబ్లీ కార్యకలాపాలతోపాటు ఓటింగ్‌లోనూ పాల్గొనరాదని ఆరుగురికి ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది. ఖాళీ అయిన ఆరు స్థానాల్లో నామినేషన్ల దాఖలుకు మే 7 ఆఖరు తేదీ. -
‘సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడితోనే స్పీకర్ కలవలేదు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తమకు అపాయింట్మెంట్ ఇచ్చిమరీ కలవకపోవడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు అపాయిట్మెంట్ ఇవ్వడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ వెళ్లారు. ఇంట్లో స్పీకర్ లేకపోవడంతో ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో రెండున్నర గంటల పాటు స్పీకర్ నివాసం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరీక్షించి అయినప్పటికీ ఆయన రాకపోవటంతో వెనుదిరిగారు. తమను స్పీకర్ కలవకపోవటంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. స్పీకర్ గడ్డం ప్రసాద్.. అపాయింట్మెంట్ ఇచ్చి తమను కలవకపోవడం బాధాకరమని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడితోనే అసెంబ్లీ స్పీకర్ తమను కలవలేదని మండిపడ్డారు. రేపు మరోసారి స్పీకర్‌కు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారాయన. -
ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు పడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఈ ఇద్దరు వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే వంశీకృష్ణ జనసేనలోకి, సి.రామచంద్రయ్య టీడీపీలోకి పార్టీ మారారు. దీంతో పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైఎస్సార్సీపీ నేత, మండలిలో చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆ ఇద్దరికి నోటీసులు పంపించారు. నోటీసుల ఆధారంగా వాళ్లిద్దరి నుంచి వివరణ సైతం తీసుకున్నారు మండలి చైర్మన్. ఈ క్రమంలో.. ఇప్పుడు సమగ్ర విచారణ అనంతరమే ఈ ఇద్దరిపై వేటు వేసినట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. -
నేడు ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై మండలి చైర్మన్ విచారణ
సాక్షి, గుంటూరు: ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై నేడు(మంగళవారం) శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు విచారణ జరపనున్నారు. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలను విచారణకు రావాలని ఇప్పటికే మండలి చైర్మన్ నోటీసులు ఇచ్చారు. ఇవాళే తుది విచారణ అని మండలి చైర్మన్ పేర్కొన్నారు. తుది విచారణ కావడంతో ఎమ్మెల్సీలు ఏం చెబుతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఫిరాయించిన వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ.. మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
అందుకే క్రాస్ ఓటేశాం.. హిమాచల్ రెబల్స్
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి క్రాస్ ఓటు వేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ఓట్లు టై కావటంతో టాస్ వేసి ఫలితాలు ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామాల నడుమ బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ గెలుపొందారు. అయితే సర్కార్ కూలిపోయే అవకాశాలు కనిపించడంతో.. ఆ వెంటనే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర స్పీకర్ అనర్హత వేటు వేశారు. తాజాగా ఈ మొత్తం పరిణామాలపై రెబల్ ఎమ్మెల్యేలు స్పందించారు. ఎమ్మెల్యే రాజేంద్ర రానా క్రాస్ ఓటింగ్ విషయంపై మాట్లాడుతూ.. ‘హిమాచల్ ప్రదేశ్ ప్రజలపై ఉన్న గౌరవం, మర్యాద ప్రకారం మేం క్రాస్ ఓటు నిర్ణయం తీసుకున్నాం. హిమాచల్ ప్రదేశ్‌కు దేవభూమిగా పేరుంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నిలపడానికి ఇంకా ఎవరూ లేరా?. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు కాంగ్రెస్‌కి కనిపించలేదా?. అసలు హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎవరూ ప్రాతినిధ్యం వహించాలి?’ అని రాజేంద్ర రానా ప్రశ్నించారు. ‘మేము కోర్టుకు వెళ్తాం. తీవ్రమైన ఒత్తిడి కారణంగా స్పీకర్ మాపై అనర్హత వేటు వేశారు. పోలీసు మా అనుచరులకు చలాన్లు జారీ చేయటం మొదలుపెట్టారు. మేము రాష్ట్రం ఆత్మాభిమానాన్ని రక్షిస్తాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. కేవలం సుఖ్విందర్ సింగ్ సుఖు స్నేహితుల ప్రభుత్వం. ప్రతిఒక్కరికి రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలుసు. యువత ఉద్యోగ పరీక్షలు రాసి రోడ్లమీద ఉన్నారు. వారు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదు. కొంత మంది ఎమ్మెల్యేలను అవమాన పరుస్తున్నారు. మరో తొమ్మిది మంది మా వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని రాజేంద్ర రానా అన్నారు. -
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సిమ్లా: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీ అభ్యర్థి గెలుపునకు కారకులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురిపై హిమాచల్ ప్రదేశ్ శాసనసభ స్పీకర్ కుల్దీప్ సింగ్ పథాలియా అనర్హత వేటు వేశారు. వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించారు. ఈ వివరాలను స్పీకర్ గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. ‘‘బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు తప్పకుండా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ విప్ జారీచేసింది. అయినా సరే ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ రోజు అసెంబ్లీకి రాలేదు. బడ్జెట్‌పై ఓటింగ్‌లో పాల్గొనలేదు. పార్టీ విప్‌ను ఉల్లంఘించారు. అందుకే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీరిని అనర్హులుగా ప్రకటించాలని పార్లమెంటరీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి హర్షవర్ధన్ ఇచి్చన ఫిర్యాదు మేరకు వీరిని అనర్హులుగా ప్రకటిస్తున్నా. రాజ్యసభలో క్రాస్ ఓటింగ్ ఘటనతో ఈ అనర్హతకు ఎలాంటి సంబంధం లేదు’ అని స్పీకర్ పథాలియా చెప్పారు. అనర్హులైన వారిలో రాజీందర్ రాణా, సు«దీర్శర్మ, ఇందర్ దత్ లఖాన్‌పూర్, దేవీందర్ కుమార్ భుట్టో, రవి ఠాకూర్, చేతన్య శర్మ ఉన్నారు. ఇరువైపుల వాదనలు విన్న స్పీకర్ బుధవారం తన తీర్పును రిజర్వ్‌చేసి గురువారం వెల్లడించారు. కాగా, స్పీకర్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని అనర్హతకు గురైన ఒక ఎమ్మెల్యే రాజీందర్ రాణా చెప్పారు. రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాక అసెంబ్లీలో ప్రస్తుత సభ్యుల మొత్తం సంఖ్య 68 నుంచి 62కు తగ్గింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 40 నుంచి 34కు దిగి వచ్చింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా హిమాచల్‌లో ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారమే చర్యలు: స్పీకర్ తమ్మినేని
గుంటూరు, సాక్షి: ఎన్నికల ముందర అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పార్టీ ఫిరాయించిన ఎనిమిది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై స్పీకర్ తమ్మినేని సీతారాం సాక్షితో స్పందించారు. నిష్పక్షపాతంగా తాను వ్యవహరించానని.. చట్ట ప్రకారమే నడుచుకున్నానని అన్నారాయన. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ ముగించాం. విచారణ అంతా నిబంధనల ప్రకారమే జరిగింది. వాదనలు వినిపించేందుకు వాళ్లకు తగిన సమయం ఇచ్చాం. కానీ, వాళ్లు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. కాబట్టే విచారణ ముగించి అనర్హత వేటు వేశాం. ఈ విషయంలో నేను నిష్ఫక్షపాతంగా వ్యవహరించా. చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నా అని తెలిపారాయన. అలాగే.. వైఎస్సార్సీపీలో చేరినవాళ్లపైనా చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘అనర్హత వేటు పడ్డవాళ్లు కావాలనుకుంటే కోర్టుకు వెళ్లొచ్చు. మాదీ(అసెంబ్లీని ఉద్దేశించి..) కోర్టు లాంటిదే. ఇక వారిష్టం’’ అని స్పీకర్ తమ్మినేని అన్నారు. -
సీపీఐ (ఎంఎల్)ఎమ్మెల్యేపై అనర్హత వేటు
పట్నా: సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ పారీ్టకి చెందిన ఎమ్మెల్యే మనోజ్ మంజిల్‌ను బిహార్ అసెంబ్లీ అనర్హుడిగా ప్రకటించింది. ఓ హత్య కేసులో న్యాయస్థానం ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించినందున, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విధాన సభ సెక్రటేరియట్ తెలిపింది. కోర్టు శిక్ష ప్రకటించిన ఫిబ్రవరి 13వ తేదీ నుంచి అనర్హత అమల్లోకి వస్తుందని శుక్రవారం జారీ చేసిన నోటిఫికేషన్లో తెలిపింది. భోజ్‌పూర్ జిల్లా తరారీ స్థానం నుంచి మంజిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం నాటి హత్య కేసు విచారించిన ఎంపీ/ఎమ్మెల్యే కేసుల ప్రత్యేక కోర్టు మంజిల్‌ను దోషిగా నిర్థారించిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో బిహార్ అసెంబ్లీలో వామపక్షాల బలం 11కు తగ్గినట్లయింది. -
నలుగురికీ చివరి అవకాశం ఈసారి విచారణకు రాకపోతే
-
నేడు విచారణకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్
-
AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు
అమరావతి: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో.. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12 న విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈసారి వాళ్ల నుంచి పూర్తిస్థాయి వివరణ తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలు ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీరికి తాజాగా నోటీసులు జారీ చేసిన స్పీకర్.. ఈనెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. -
Toshakhana corruption case: తోషఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు కష్టాల మీద కష్టాలు వచ్చిపడుతున్నాయి. తోషఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీకి ఇస్లామాబాద్ కోర్టు 14 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. విదేశీ నాయకులు ఇచ్చిన ఖరీదైన బహుమతులను విక్రయించి, సొమ్ము చేసుకున్నట్లు ఇమ్రాన్ దంపతులపై అభియోగాలు నమోదయ్యాయి. దర్యాప్తులో అదంతా నిజమేనని తేలడంతో న్యాయస్థానం బుధవారం శిక్ష ఖరారు చేసింది. దోషులకు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనరాదంటూ కోర్టు ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు కూడా వేసింది. 1.5 బిలియన్ల జరిమానా చెల్లించాలని ఇమ్రాన్ దంపతులను ఆదేశించింది. ఫిబ్రవరి 8న పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. విదేశాలకు అధికారిక పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి దేశాధినేతలు బహుమతులు ఇస్తుంటారు. అవన్నీ ప్రభుత్వానికే చెందుతాయి. తోషఖానాలో భద్రపర్చాల్సి ఉంటుంది. ఇమ్రాన్ మాత్రం సొంత ఆస్తిలాగా అమ్మేసుకున్నారు. అధికార రహస్యాల వెల్లడి కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు మూడు రోజుల క్రితం 10 సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. -
AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు
గుంటూరు, సాక్షి: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో.. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 8వ తేదీన స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారాయన. ఈసారి వాళ్ల నుంచి పూర్తిస్థాయి వివరణ తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏపీ స్పీకర్ కార్యాలయం నుంచి ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి. ఫిబ్రవరి 5వ తేదీలోగా ఈ నోటీసులకు స్పందించాలని స్పీకర్ కార్యాలయం కోరింది. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు పిటిషనర్ అయిన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజులకు నోటీసులు పంపించారు. ఈ ఐదుగురిని ఒకేసారి కలిపి విచారణ చేయనున్నారు స్పీకర్ తమ్మినేని. మరోసారి ఎమ్మెల్యేల వివరణ తీసుకోనున్న తర్వాతే ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్ ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ వారిని కోరిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ, టీడీపీ నుంచి పార్టీ ఫిరాయించిన మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్‌పై సోమవారం స్పీకర్ తమ్మినేని విచారణ జరిపారు. అయితే ఇందులో స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ క్రమంలో వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మూడుసార్లు టైం ఇచ్చిన సంగతి గుర్తు చేశారు కూడా. మరోవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలతో పాటు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు హైకోర్టులో చుక్కెదురైంది. విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువునిచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న వారు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. -
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నేడే తీర్పు.?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ నెలకొంది. నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్‌పై నిన్న స్పీకర్ విచారణ జరిపారు. నిన్న స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని స్పీకర్ వారిని కోరారు. వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని వారు చేసిన విజ్ఞప్తిని స్పీకర్ సున్నితంగా తోసిపుచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే మూడుసార్లు సమయం ఇచ్చామని గుర్తుచేస్తూ వారిని విచారించారు. అలాగే, స్పీకర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్ కూడా విచారణకు హాజరయ్యారు. వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం హాజరుకాలేదు. కాగా, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలతో పాటు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు జరుపుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే.. స్పీకర్, చైర్మన్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువునిచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న వారు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్, అసెంబ్లీ స్పీకర్లతో పాటు ఫిర్యాదుదారు అయిన మదునూరి ప్రసాదరాజును ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇదీ చదవండి: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురు -
రేపు ఏపీ స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ముందు సోమవారం హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది. రేపు(సోమవారం) ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకానున్నారు. అయితే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ ముందుకు వైస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరై, వివరణ ఇవ్వనున్నారు. ఇక.. వైఎస్సార్సీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు విచారణకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు చేసిన విషయం తెలిసిందే. అనర్హత పిటిషన్లపై విచారణకు 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించింది. వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. చదవండి: గంటా రాజీనామా ఆమోదం.. టీడీపీలో కొత్త టెన్షన్! -
Maharashtra: ఉద్దవ్ ఠాక్రేకు షాక్.. షిండేదే అసలైన శివసేన!
ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శివసేన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై స్పీకర్ రాహుల్ నార్వేకర్ కీలక నిర్ణయం వెల్లడించారు. సీఎం ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి భారీ ఊరట లభించింది. 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏక్నాథ్ షిండే వర్గానికే ఉందని తెలిపారు. 2013 తర్వాత పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగలేదని అన్నారు. శివసేన నుంచి సీఎం ఏక్నాథ్ షిండేను తొలగించే అధికారం శివసేన (యూబీటీ) వర్గం నేత అయిన ఉద్ధవ్ ఠాక్రేకు లేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఏ వర్గం నిజమైన పార్టీ అని తెలపడానికి నిర్ణయించే జాతీయ కార్యవర్గ సమావేశం జరిగినట్లు శివసేన(యూబీటీ) వర్గం ఎటువంటి ఆధారం సమర్పించలేదని తెలిపారు. శివసేన పార్టీ చీఫ్‌గా ఉద్దవ్ ఠాక్రే కొనసాగాలని ఆ వర్గం నేతల ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్ రాహుల్ నార్వేకర్ తిరస్కరించి.. శివసేన పార్టీకి చీఫ్‌గా సీఎం ఏక్నాథ్ షిండేను అడ్డుకోలేమని తెలిపారు. మహారాష్ట్రలో 16 మంది శివసేన ఎమ్మెల్యేల అనర్హతపై ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సుప్రీకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నానని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ అన్నారు. పార్టీ నాయకత్వంపై శవసేనలోని ఇరు వర్గాలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ మేజార్టీ ఒక్కటే ప్రధామైన అంశమని అన్నారు. నాయకత్వ నిర్మాణాన్ని పరిగణలోకి తీసుకోని సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఎన్నికల సంఘానికి షిండే, ఉద్దవ్ వర్గాలు సమర్పించిన ఫిర్యాదుల్లో ఏకాభిప్రాయం లేదని తెలిపారు. మహారాష్ట్రలోని శివసేనకు చెందిన 34 ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు గడువు బుధవారం ముగిసింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ప్రస్తుత సీఎం ఎక్నాథ్ షిండే వర్గాల ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఈ వ్యవహారంలో స్పీకర్ రాహుల్ నార్వేకర్ నిర్ణయంపై ఇరు వర్గాల్లో ఆసక్తి నెలకొనగా.. స్పీకర్ నిర్ణయంతో ఏక్నాథ్ షిండే వర్గానికి భారీ ఊరట లభించింది. 2022 జూన్‌లో ఏక్నాథ్ షిండే, పలువురు ఎమ్మెల్యేలు శివసేన పార్టీ చీల్చి బయటకు వచ్చారు. దీంతో మహా వికాస్ అఘడి ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఇక.. ఏక్నాథ్ షిండే, పలువురి రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ చేరాడు. బీజేపీ మద్దతు ఆయన మహారాష్ట్ర సీఎంగా అధికారం చేపట్టారు. అయితపాటు శివసేన నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే మంత్రుల పదవలు దక్కటం గమనార్హం. చదవండి: భారీ స్థాయిలో కమలం ఆపరేషన్.. 1984 తర్వాత సాధించని ఫీట్ కోసం..! -
ఏపీ: ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైఎస్సార్సీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలను అనర్హులుగా చేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు, మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సీ రామచంద్రయ్యపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది. పార్టీ తరపున మండలి కార్యదర్శికి ఎమ్మెల్సీలు మేరుగు మురళి, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. -
డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్
పోర్ట్‌ల్యాండ్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్ తగిలింది. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న ఆయనకు దారులు క్రమంగా మూసుకుపోతున్నాయి. కొలరాడో రాష్ట్రంలో అధ్యక్ష అభ్యరి్థత్వానికి(ప్రైమరీ ఎన్నికలో) పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడని 2021 జనవరి 6న జరిగిన క్యాపిటల్ హిల్‌పై దాడి కేసులో కొలరాడో సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కొలరాడో రాష్ట్ర ప్రైమరీ ఎన్నికలో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. తాజాగా మెనె రాష్ట్రంలోనూ ట్రంప్‌నకు పరాభవం ఎదురైంది. రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికలో పోటీ చేయకుండా బ్యాలెట్ నుంచి ట్రంప్ పేరును తొలగిస్తున్నట్లు మెనె రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి షెన్నా బెల్లోస్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఉత్తర్వుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాన్ని ట్రంప్‌నకు కలి్పంచారు. కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మెనె రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికలో ట్రంప్ అభ్యరి్థత్వాన్ని వ్యతిరేకిస్తూ కొందరు అప్పీళ్లు దాఖలు చేశారు. ఆయనకు ఇక్కడి నుంచి ప్రైమరీలో పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని కోరారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న షెన్నా బెల్లోస్ ప్రైమరీ బ్యాలెట్ నుంచి ట్రంప్ పేరును తొలగించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థి పేరును ఒక రాష్ట్రంలో ఇలా బ్యాలెట్ నుంచి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
USA presidential election 2024: ట్రంప్‌కు షాక్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాక్ తగిలింది. 2024 నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో రాష్ట్ర సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2021లో కాపిటల్ హిల్‌పై జరిగిన దాడి ఉదంతంలో ఆయన పాత్ర ఉందని తేలి్చంది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ (సెక్షన్ 3) ప్రకారం ట్రంప్‌ను దోషిగా నిర్ధారించింది. దీని ప్రకారం ప్రభుత్వంపై, ప్రభుత్వ సంస్థలు, భవనాలపై దాడిలో పాల్గొనే అధికారులు భవిష్యత్తులో ప్రభుత్వ పదవులు చేపట్టడానికి అనర్హులు. కాకపోతే అధ్యక్ష అభ్యరి్థని ఈ సెక్షన్ కింద పోటీకి అనర్హుడిగా ప్రకటించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి! ఈ తీర్పు కొలరాడో రాష్ట్రం వరకే వర్తిస్తుంది. తీర్పు నేపథ్యంలో కొలరాడోలో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎన్నిక (ప్రైమరీ)లో ట్రంప్ పోటీ చేయకుండా కోర్టు అనర్హత వేటు వేసింది. ప్రైమరీ బ్యాలెట్ పేపర్ల నుంచి ఆయన పేరును తొలగించాలని ఆదేశించింది. ‘‘కాపిటల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ స్వయంగా పురిగొల్పారు. అక్రమ పద్ధతుల్లో, హింసాత్మకంగా అధికార మారి్పడిని అడ్డుకోజూశారు. తద్వారా దేశ ప్రజల తీర్పునే అపహ్యాసం చేశారు. కనుక సెక్షన్ 3 ప్రకారం దేశాధ్యక్ష పదవి చేపట్టేందుకు ఆయన అనర్హుడు’’ అంటూ ఏడుగురు జడ్జిల ధర్మాసనం 4–3 మెజారిటీతో తీర్పు చెప్పింది. ఆశలపై నీళ్లు!: మరోసారి అధ్యక్షుడు కావాలన్న 77 ఏళ్ల ట్రంప్ కలలకు కొలరాడో కోర్టు తీర్పు గట్టి ఎదురు దెబ్బేనని భావిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వ రేసులో ఇప్పటికే ఆయన అందరి కంటే ముందున్నారు. కొలరాడో కోర్టుది తప్పుడు తీర్పంటూ ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తనను ఏదోలా అడ్డుకునేందుకు న్యాయవ్యవస్థను కూడా అడ్డగోలుగా వాడుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్ ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు ట్రంప్ లాయర్లు ప్రకటించారు. కొలరాడో కోర్టు కూడా తన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు జనవరి 4 దాకా గడువిచి్చంది. అప్పటిదాకా తీర్పు అమలుపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ రాజకీయ భవితవ్యాన్ని సుప్రీంకోర్టులోనే తేలనుంది. అయితే, ఒకట్రెండు నెలల్లో రాష్ట్రాలవారీగా ప్రైమరీలు మొదలవుతున్న నేపథ్యంలో ఆలోగా సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించకపోతే ట్రంప్ పరిస్థితి ఏమిటన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కొలరాడోలో మార్చి 5న జరగనున్న ప్రైమరీకి అధ్యక్ష అభ్యర్థుల బ్యాలెట్ పత్రాల ఖరారుకు జనవరి ఐదో తేదే తుది గడువు! అంతేగాక కాపిటల్ భవనంపై దాడి ఉదంతానికి సంబంధించి ఇంకా పలు రాష్ట్రాల్లో ట్రంప్ కేసులు ఎదుర్కొంటున్నారు. అక్కడా ఇలాంటి తీర్పే వస్తే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ మరింతగా చిక్కుల్లో పడనుంది. ఈ పరిణామాలపై స్పందించేందుకు డెమొక్రటిక్ పార్టీ నిరాకరించింది. వివేక్ రామస్వామి అండ రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వానికి ట్రంప్‌తో పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి కూడా కొలరాడో సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుబట్టడం విశేషం. ఈ విషయంలో ట్రంప్‌కు అండగా నిలవాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఈ తీర్పు కారణంగా కొలరాడో రిపబ్లికన్ ప్రైమరీలో ట్రంప్ పోటీ పడలేకపోతే తాను కూడా అక్కడ పోటీ చేయబోనని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులెవరూ కూడా కొలరాడో ప్రైమరీలో బరిలో దిగొద్దని 38 ఏళ్ల వివేక్ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. -
జనవరి 10 కల్లా తేల్చండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: శివసేన పార్టీలోని రెండు వర్గాలు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ పెట్టుకున్న పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు సుప్రీంకోర్టు గడువు పెంచింది. గతంలో డిసెంబర్ 31వ తేదీలోగా ఏదో ఒకటి తేల్చాలంటూ ఇచ్చిన గడువును తాజాగా మరో 10 రోజులు పొడిగించింది. ‘డిసెంబర్ 20వ తేదీతో అసెంబ్లీ కార్యకలాపాలు ముగుస్తున్నందున, ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు గడువు పొడిగించాలంటూ స్పీకర్ పెట్టుకున్న వినతిని సహేతుకమైందిగా భావిస్తున్నాం. అందుకే, గడువును మరో 10 రోజులపాటు, వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు పొడిగిస్తున్నాం’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. -
ఎంపీ మహువా లోక్‌సభ సభ్యత్వం రద్దుకు కేంద్రం చర్యలు!
డబ్బులు తీసుకొని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకొని పార్లమెంట్లో ప్రధాని మోదీ, అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగారంటూ నమోదైన కేసులో ఎథిక్స్ ప్యానెల్ తన నివేదికను లోక్‌సభలో సమర్పించనున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్య చేపట్టనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఎథిక్స్ ప్యానెల్ తన రిపోర్టును డిసెంబర్ 4న లోక్‌సభ ముందు ప్రవేశపెట్టనుంది. ఎథిక్స్ కమిటీ చైర్పర్సన్ వినోద్ కుమార్ సోంకర్ వచ్చే సోమవారం ప్యానెల్ నివేదికను కేంద్రానికి సమర్పించే అవకాశం ఉంది. గత నెల నవంబర్ 9న ఎథిక్స్ ప్యానల్సమావేశమై కమిటీ.. మహువాను లోక్‌సభ సభ్యత్వం నుంచి బహిష్కరించాలంటూ చేసిన సిఫార్సును ప్యానెల్ ఆమెదించింది. లోక్‌సభ స్పీకర్‌కు ఈ నివేదికను సమర్పించింది. పార్లమెంట్ మెంబర్‌గా మొయిత్రా చర్యలు అత్యంత అభ్యంతరకరమైనవి, అనైతికమైనవి, హేయమైనవి, నేరపూరితమైనవని ఎథిక్స్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. కాగా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి మేలు చేసేలా అదానీ గ్రూప్‌పై లోక్‌సభలో మొయిత్రా పలుమార్లు ప్రశ్నలు అడిగారంటూ గత నెలలో దుబే ఆరోపించడం తెలిసిందే. వ్యాపారవేత్త హీరానందానీ కూడా పార్లమెంట్‌కు సమర్పించిన అఫిడవిట్లో తన నుంచి మోయిత్రా గిఫ్టులు తీసుకున్నట్లు పేర్కొన్నాడు. హీరానందనీ నుంచి డబ్బులు తీసుకొని మోదీ, అదానీ టార్గెట్‌గా లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని విమర్శిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు దూబే ఫిర్యాదు చేశారు. దాంతో 15 మంది ఎంపీలతో కూడిన లోక్‌సభ నైతిక విలువల కమిటీ ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహాద్రాయ్‌లు ఇప్పటికే కమిటీ ముందు హాజరై.. తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. నవంబర్ రెండున లోక్‌సభ ఎథిక్స్ ముందు విచారణకు హాజరైన మహువా.. ప్యానెల్ సభ్యులు అసభ్యకరమైన, చెత్త ప్రశ్నలు అడిగుతున్నారంటూ ఆగ్రహించి విచారణ మధ్యలోనే బయటకు వచ్చేశారు. అనంతరం మహువా కేసులో ఎథిక్స్ కమిటీ 500 పేజీలతో కూడిన నివేదికను రూపొందించింది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్ నేతృత్వంలోని లోక్‌సభ నైతిక విలువల కమిటీ సమావేశమై ఈ నివేదికను పరిశీలించింది. అనంతరం 6:4తో ఈ నివేదికను కమిటీ ఆమోదించింది. పదిమందిలో ఆరుగురు సభ్యులు సిఫార్సుకు అనుకూలంగా, నలుగురు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు కమిటీ తెలిపింది. మొయిత్రా అనధికారిక వ్యక్తులతో పార్లమెంట్ లాగిన్ ఐడిని షేర్ చేసుకున్నారని, దర్శన్ హీరానందానీ నుంచి నగదు, గిఫ్ట్‌లు తీసుకున్నారని కమిటీ నిర్ధారించిందని సోన్కర్ పేర్కొన్నారు. ఆమె చర్య తీవ్రమైన శిక్షకు కారణమని తెలిపారు. మహువా అనైతిక వ్యవహారంపై చట్టపరమైన, సంస్థాగత, కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేపట్టాలని సిఫార్సు చేసినట్లు చెప్పారు. -
ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరించాలి
న్యూఢిల్లీ: టీఎంపీ ఎంపీ మహువా మొయిత్రాపై అనర్హత వేటువేయాలని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రశ్నలడిగేందుకు వ్యాపార వేత్త హీరా నందానీ నుంచి డబ్బులు తీసుకు న్నారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చిన విష యం తెలిసిందే. ఈ అంశాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎథిక్స్ కమిటీకి పంపారు. బీజేపీ ఎంపీ వినోద్‌కుమార్ సోంకార్ సారథ్యంలో గురువారం సమావేశమైన 10 మంది సభ్యుల ఎథిక్స్ కమిటీ 479 పేజీల నివేదిను ఆమోదించింది. పదిహేను రోజుల వ్యవధిలో ముగ్గురిని ప్రశ్నించి దీనిని తయారు చేశామని సోంకార్ చెప్పారు. ఎంపీ మొయిత్రాను సస్పెండ్ చేయా లన్న సిఫారసును కమిటీలోని నలుగురు వ్యతిరేకించగా ఆరుగురు బలపరిచారని తెలిపా రు. కాగా, ఒక ఎంపీపై అనర్హత వేటు వేయాలంటూ ఎథిక్స్ కమిటీ సిఫారసు చేయడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. దీనిపై ఎంపీ మొయిత్రా స్పందిస్తూ.. ఇదంతా ముందుగానే ఖరారు చేసిన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికి తనను బహిష్కరించినా, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో మళ్లీ సభలోకి అడుగుపెడతానన్నారు. ఈ నివేదికను ఎథిక్స్ కమిటీ పార్లమెంట్ ముందుంచుతుంది. అనంతరం చర్చ, ఆపైన చర్యలపై ఓటింగ్‌కు పెడతారు. ఎంపీ మహువా మొయిత్రా లంచం తీసుకున్నారంటూ అక్టోబర్ 14న బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే, లాయర్ జై అనంత్ దేహద్‌రా య్‌తో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. ఇలా ఉండగా, తమ ఎంపీ మొయిత్రాను టీఎంసీ గట్టి గా సమర్థించింది. బీజేపీ సారథ్యంలోని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రశ్నించిన వారిని వేధిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ విమర్శించారు. ఆరోపణలు రుజువు కాకు ండానే పార్లమెంటరీ కమిటీ ఆమెపై చర్యలకు ఎలా సిఫారసు చేస్తుందని ప్రశ్నించారు. -
మా ఆదేశాలే అపహాస్యమా?
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, వారి వర్గం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు మండిపడింది. దీనిపై నిర్ణయాన్ని ఆయన నిరవధికంగా వాయిదా వేస్తూ పోజాలరని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ‘‘స్పీకర్ కాస్త విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మేం భావించాం. నిర్దిష్ట కాలావధిలోగా ఈ అంశాన్ని పరిష్కరించాల్సిందిగా గత విచారణ సమయంలోనే ఆయనకు మేం స్పష్టంగా నిర్దేశించాం. ఇందుకు కాలావధి కూడా పెట్టుకోవాల్సిందిగా సూచించాం. ఆయన దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కని్పంచాలి. కానీ ఈ అంశంపై అసలు విచారణే జరపడం లేదు’’ అంటూ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు తలంటిపోశారు. ‘‘గత జూన్ నుంచీ ఈ విషయం అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. మేమంతా గమనిస్తూనే ఉన్నాం. అసలు స్పీకర్ ఏమనుకుంటున్నారు? మా ఆదేశాలనే అపహాస్యం చేస్తారా? ఇదేమైనా ఆషామాషీ విషయమని అనుకుంటున్నారా?’’ అంటూ ఆగ్రహించారు. ‘‘ఈ విషయంలో స్పీకర్‌కు కచి్చతంగా ‘సలహా’ అవసరం. వెంటనే ఎవరైనా ఆ పని చేయడం మేలు‘‘ అని స్పీకర్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సీజేఐ సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకపోతే ఈ మొత్తం ప్రక్రియకు అర్థమే లేకుండా పోతుందన్నారు. ఈ అంశాన్ని ఎప్పట్లోగా తేలుస్తారో స్పష్టంగా పేర్కొంటూ మంగళవారం నాటికి తమకు టైమ్‌లైన్‌ను సమరి్పంచాలని ఆదేశించారు. లేదంటే ఈ విషయమై తామే నేరుగా ఆదేశాలిస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. స్పీకర్‌ను బాధ్యున్ని చేయాల్సి వస్తుంది! మహారాష్ట్రలో పలువురు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలు రద్దు చేయాలంటూ శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత ఉద్ధవ్‌ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం ముందు శుక్రవారం విచారణ కొనసాగింది. ఠాక్రే వర్గం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు కొనసాగించారు. దీనిపై జూలై 14న స్పీకర్‌కు ధర్మాసనం నోటీసులు జారీ చేసినా ఇప్పటికీ ఏమీ జరగలేదని సీజేఐ దృష్టికి తెచ్చారు. దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదుటి పక్షం వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవడం, ఇందులో పలు అంశాలను స్పీకర్ ముందుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్న సొలిసిటర్ జనరల్ మెహతా వివరణతో సంతృప్తి చెందలేదు. ‘‘ఈ విషయమై మేం జూలై 14న స్పష్టమైన సూచనలు జారీ చేశాం. సెప్టెంబర్ 18న ఆదేశాలు కూడా వెలువరించాం. అయినా స్పీకర్ చేసిందేమీ లేదు. కనుక రెండు నెలల్లోగా దీనిపై ఆయన నిర్ణయం తీసుకోవాలని మేం ఆదేశించక తప్పడం లేదు’’ అన్నారు. ‘‘స్పీకర్ పదవికున్న హుందాతనం దృష్ట్యా తొలుత మేం టైంలైన్ విధించలేదు. కానీ ఆయన తన బాధ్యతలను నెరవేర్చకపోతే అందుకు బాధ్యున్ని చేయక తప్పదు’’ అని అన్నారు. -
ఎన్సీపీ ఎంపీ ఫైజల్‌పై అనర్హత వేటు
తిరువనంతపురం: లక్షద్వీప్ ఎంపీ ముహమ్మద్ ఫైజల్‌పై మరోసారి అనర్హత వేటు వేస్తూ కింద కోర్టు విధించిన తీర్పు ప్రకారం శిక్షను ఖరారు చేసింది కేరళ హైకోర్టు. కేంద్ర మాజీ మంత్రి సయ్యద్ అల్లుడు మహ్మద్ సలేహ్ హత్యాయత్నం కేసులో దోషిగా తేలడంతో ఈ ఉత్తర్వులపై స్టే విధించాలని మహ్మద్ ఫైజల్ హైకోర్టును కోరగా హైకోర్టు ఆయన అభ్యర్ధనను తిరస్కరించింది. జనవరి 11న ఎంపీ ఫైజల్ ఈ కేసులో దోషిగా తేలిన నాటి నుంచి ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది. హత్యాయత్నం కేసులో మహ్మద్ ఫైజల్‌పై ప్రాథమిక సాక్ష్యాధారాలున్న నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. శిక్ష అమలుపై స్టే విధించాలన్నది ఫైజల్ డిమాండ్. ఇప్పటికే ఈ కేసులో కవరతి సెషన్స్ కోర్టు పదేళ్ల శిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, ప్రజాప్రతినిధికి ఏదైనా నేరంలో రెండేళ్లకు మించి జైలుశిక్ష విధిస్తే ఆయన చట్టసభల సభ్యత్వానికి అనర్హుడవుతాడు. ఇది కూడా చదవండి: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌లో ట్రబుల్ షురూ: సుప్రియా సూలే -
శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు?
ముంబయి: ఎన్సీపీలో ఇరు వర్గాల మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. పార్టీలో ఎలాంటి చీలిక రాలేదని సీనియర్ నాయకులు అజిత్ పవార్, శరద్ పవార్లు ప్రకటించినప్పటికీ ఇరుపక్షాల నుంచి ఇంకా విభజనకు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయి. శరద్ పవార్ గ్రూప్ ఎమ్మెల్యేలపై అజిత్ పవార్ వర్గం అనర్హత వేటుకు సిద్ధమైంది. ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యేల పేర్లు పేర్కొంటూ స్పీకర్‌కు అజిత్ వర్గం ఫిర్యాదు చేసింది. మొదట అజిత్ పవార్ వర్గానికి చెందిన 41 మంది ఎమ్మెల్యేలపై శరద్ పవార్ వర్గం అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసింది. దీని తర్వాత అజిత్ పవార్ వర్గం కూడా ఈ చర్యలకు పూనుకుంది. అనర్హత వేటు పిటిషన్లో శరద్ పవార్ వర్గానికి చెందిన జయంత్ పాటిల్, జితేంద్ర అవద్, రోహిత్ పవార్, రాజేష్ తోపే, అనిల్ దేశ్‌ముఖ్, సందీప్ క్షీరసాగర్, మాన్సింగ్ నాయక్, ప్రజక్తా తాన్పురే, రవీంద్ర భూసార, బాలాసాహెబ్ పాటిల్ ఉన్నారు. అనర్హత పిటిషన్ జాబితా నుంచి నవాబ్ మాలిక్, సుమన్ పాటిల్, అశోక్ పవార్, చేతన్ తుపేలను మినహాయించారు. ఎన్సీపీ జాతీయాధ్యక్ష పదవిపై ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ సమక్షంలో ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. అజిత్ వర్గం పిటిషన్‌పై అక్టోబర్ 6న ఇరువర్గాలను ఈసీ విచారణకు పిలిచింది. పార్టీ జాతీయాధ్యక్షున్ని తాము ఎన్నుకున్నామని అజిత్ వర్గం ఈసీకి పిటిషన్ దాఖలు చేసింది. అజిత్ పవార్ తిరుగుబాటుతో జులైలో ఎన్సీపీలో చీలిక వచ్చింది. తన వర్గం ఎమ్మెల్యేలతో అజిత్ పవార్.. శివ సేన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చారు. అనంతరం తన వర్గమే నిజమైన ఎన్సీపీ అని ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్సీపీలో ఎలాంటి చీలిక రాలేదని ఇటీవల ఇరుపక్షాల నాయకులు చెప్పారు. అయినప్పటికీ తాజాగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదీ చదవండి: చంద్రయాన్ 3: విక్రమ్ ల్యాండర్, రోవర్ మేల్కొలుపు! -
దేవెగౌడ మనవడు ఎంపీ రేవణ్ణకు ఉపశమనం
న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో హాసన్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎన్నికైన జెడి-ఎస్ ఏకైక ఎంపి ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీం కోర్టు ఉపశమనం కలిగించింది. రేవణ్ణపై ఎన్నికల అనర్హత వేటు వేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ముగ్గురు జడ్జిలతో కూడిన ధర్మాసనం రేవణ్ణ ఎన్నిక చెల్లదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారన్న ఆరోపణలపై జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎంపిక చెల్లదంటూ ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. తాజాగా సుప్రీం కోర్టు హైకోర్టు నిర్ణయంపై స్టే విధించడంతో ప్రజ్వల రేవణ్ణకు కొంత ఉపశమనం లభించినట్టైంది. వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రేవణ్ణను అనుమతించాలని ఆయన తరపు న్యాయవాది కెకె వేణుగోపాల్ కోర్టును అభ్యర్థించగా, సుప్రీం కోర్టు అందుకు కూడా అనుమతించింది. ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మనవడు మాజీ మంత్రి రేవణ్ణ కుమారుడు. ఇది కూడా చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం -
దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు షాక్..
సాక్షి, బెంగళూరు: జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు పొందుపరిచినందుకు ఎంపీగా రేవణ్ణ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. అతడి ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు తీర్పులో పేర్కొంది. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ తరఫున హసన్ లోక్‌సభ స్థానానికి ఎంపీగా గెలిచారు. ఆ ఎన్నికల్లో జేడీఎస్ తరపున లోక్‌సభకు ఎన్నికైన ఒకే ఒక్క నేత ప్రజ్వల్. అయితే రేవణ్ణ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని, ఎన్నికల కమిషన్‌కు తన ఆస్తులను ప్రకటించలేదని ఆరోపిస్తూ ఆయనపై కర్ణాటక హైకోర్టు రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. నియోజకవర్గానికి చెందిన ఓటరు జీ దేవరాజేగౌడతోపాటు రేవర్ణ చేతిలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఏ మంజు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం జస్టిస్ కె నటరాజన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చింది నిజమేనని తేల్చింది. ఎంపీగా అతడి ఎన్నిక చెల్లదని చెప్పింది. చదవండి: ఆదిత్య ఎల్1: సూర్యుడిపై సరికొత్త ప్రయోగం.. US, చైనాకు ధీటుగా.. అంతేగాక వచ్చే 6 సంవత్సరాల పాటు రేవణ్ణ ఏ విధమైన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. అలాగే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకు ప్రజ్వల్ రేవణ్ణపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉండగానే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై హైకోర్టు అనర్హత వేటు వేయడం గమనార్హం. అయితే, రేవణ్ణ అనర్హతతో తనను ఎంపీగా ప్రకటించాలని బీజేపీ అభ్యర్థి మంజు కోరగా... ఆమె అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మంజు పైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. ఇక లోక్‌భ ఎన్నికల్లో రేవణ్ణపై బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మంజు ఆ తరువాత జీడీఎస్‌లో చేరారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
ఆలస్యమైనా న్యాయం జరిగింది: డీకే అరుణ
సాక్షి, మహబూబ్ నగర్: గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈ తీర్పుపై డీకే అరుణ స్పందించారు. తీర్పు ఆలస్యమైనా న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉందని అన్నారామె. ‘‘తీర్పు ఆలస్యమైన న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు ఈ తీర్పును స్వాగతిస్తారు.. గౌరవిస్తారు. ప్రభుత్వం కూడా బేషజాలకి పోకుండా కోర్టు తీర్పును గౌరవించాలి. కోర్టు ఆర్జర్ కాపీ రాగానే ఎలక్షన్ కమీషనర్, అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ ను కలుస్తాను’’ అని తెలిపారామె. ఇక.. అనర్హత వేటుపడిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సాక్షి టీవీతో మాట్లాడుతూ.. ‘‘ఈవీఎం వివిపాట్లను మానిప్లేట్ చేయటం, స్థిర చరస్తుల వివరాలు సరిగా ప్రకటించకపోవడం, వాహనంపై ఉన్న చలాన్ ను కట్టకపోవడం పై కోర్టు నాపై అనార్హత వేటు వేసింది. ఈ వ్యవహారంలో నాకు ఎలాంటి నోటీసులు ముందుగా అందలేదు. కోర్టు తీర్పు కూడా ఏకపక్షంగా వచ్చింది. ఈ అనర్హత వేటుపై పైకోర్టుకు వెళ్తాను’’ అని తెలిపారాయన. గద్వాలకు పొలిటికల్ టూరిస్టులు ఎక్కువని.. గద్వాల కచ్చితంగా తన అడ్డేనన్న కృష్ణమోహన్‌రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. సంబంధిత వార్త: గద్వాల ఎమ్మెల్యేపై అనర్హత.. తీర్పు కాపీలో ఏముందంటే.. -
మణిపూర్ సమస్యను కామెడీగా మార్చేస్తారా?
వయనాడ్: మణిపూర్ హింసాకాండ వంటి అతి తీవ్రమైన సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ నవ్వులాటగా మార్చేశారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. వయనాడ్ ఎంపీ అయిన ఆయన అనర్హత వేటు తొలగాక శనివారం తొలిసారి కేరళలో పర్యటించారు. కాల్పెట్టలో యూడీఎఫ్ బహిరంగ సభలో మాట్లాడారు. మణిపూర్ సమస్యను విపక్షాలు పార్లమెంటు దాకా తీసుకెళ్లి చర్చకు పెట్టినా దానిపై మాట్లాడటానికి కూడా మోదీ ఇష్టపడలేదని ఆరోపించారు. ‘అవిశ్వాస తీర్మానంపై చర్చకు బదులిస్తూ మోదీ 2 గంటల 13 నిమిషాల సేపు ప్రసంగించారు. అందులో ఏకంగా 2 గంటల పాటు కాంగ్రెస్ గురించి, నా గురించి, విపక్ష ఇండియా కూటమి గురించి... ఇలా అన్నింటి గురించీ మాట్లాడారు. అంతసేపూ మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు అన్నింటి మీదా జోకులు వేశారు. నవ్వుకున్నారు. కానీ అసలు సమస్య మణిపూర్ హింసాకాండ గురించి మాట్లాడేందుకు మాత్రం మోదీ కేటాయించింది కేవలం రెండంటే రెండే నిమిషాలు! భారత్ అనే భావనకే మణిపూర్‌లో తూట్లు పొడిచారు‘ అని మండిపడ్డారు. భారత్ అనే భావనకే తూట్లు పొడిచే వాళ్లు జాతీయవాదులు ఎలా అవుతారని రాహుల్ ప్రశ్నించారు. మణిపురీల దుస్థితి చూసి.. చలించిపోయా మణిపూర్ పర్యటన సందర్భంగా అక్కడి బాధితుల దుస్థితి చూసి ఆపాదమస్తకం చలించిపోయానని రాహుల్ గుర్తు చేసుకున్నారు. తన 19 ఏళ్ల రాజకీయ జీవితంలో అంతటి దారుణ పరిస్థితులను ఎన్నడూ చూడలేదని ఆవేదన వెలిబుచ్చారు. బీజేపీయే తన స్వార్థ ప్రయోజనాల కోసం మణిపూర్ ప్రజల మధ్య నిలువునా చీలిక తెచి్చందని ఆరోపించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే కనీసం ఐదేళ్లయినా పడుతుందని అభిప్రాయపడ్డారు. ‘ పునరావాస కేంద్రాల్లో ఒక మహిళ చెప్పింది విని కన్నీరు పెట్టా. కొడుకును ఆమె కళ్ల ముందే చంపారు. మిగతా అందరూ కుటుంబాలతో ఉంటే ఆమె మాత్రం ఒంటరిగా పడుకుని కనిపించింది. మీ వాళ్లెక్కడ అని అడిగితే ఎవరూ మిగల్లేదంటూ ఏడ్చేసింది. తన పక్కన పడుకున్న కొడుకును కళ్ల ముందే కాల్చేస్తే రాత్రంతా శవం పక్కనే గడిపానని గుర్తు చేసుకుంది. తనెలాగూ తిరిగి రాడని గుండె రాయి చేసుకుని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నానని చెప్పింది. ఆ ఘోర కలి గురించి చెప్తూ కూడా వణికిపోయింది. ఇంకో బాధిత మహిళ తనకు జరిగిన దారుణాలను తలచుకున్నంత మాత్రాన్నే స్పృహ తప్పి పడిపోయింది. మణిపూర్‌లో ఇలాంటి దారుణ గాథలు వేలాదిగా ఉన్నాయి. నా తల్లికి, చెల్లికి ఇలా జరిగితే ఎలా ఉంటుందని ఊహించుకున్నా‘ అన్నారు. -
కొన్ని కానుకలు.. ఒక మాజీ ప్రధాని.. ఏమిటీ తోషఖానా కేసు?
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ జైలుపాలయ్యే పరిస్థితి వస్తుందని ముందే ఊహించినట్టున్నారు. గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో ఆఖరి బంతి వరకు పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు. తనని జైలు పాలు చేసినా, అనర్హత వేటు వేసినా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీయే విజయం సాధిస్తుందని పలు సందర్భాల్లో ధీమాగా చెప్పారు. మరి ఆయన విశ్వాసానికి తగ్గట్టుగా భవిష్యత్ ఉండబోతోందా ? ఇమ్రాన్‌కు జైలు శిక్ష పడిన కేసు ఏమిటి ? ముందుండి నడిపించాల్సిన నాయకుడు కటకటాల పాలైతే పార్టీ పరిస్థితి ఏంటి? ఏమిటీ తోషఖానా కేసు..? ► తోషఖానా.. అంటే ప్రభుత్వానికి దేశ విదేశీ ప్రతినిధుల నుంచి వచ్చే కానుకల ఖజానా. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోషఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న మూడేళ్లలో 58 కానుకలు వచ్చాయి. అలా వచ్చిన కానుకల్ని ప్రధాని తీసుకోవాలంటే దాని ధరలో సగం చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఇమ్రాన్ ప్రభుత్వం నిబంధనల్ని సవరించి అసలు ధరలో 20 శాతం మాత్రమే చెల్లించి కానుకలు తన సొంతం చేసుకున్నారు. 2018, సెప్టెబర్ 24 నాటికి అలా వచ్చిన కానుకల్లో 15.4 కోట్ల విలువైన కానుకల్ని కేవలం 3 కోట్లకే ఆయన సొంతం చేసుకున్నట్టుగా ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత 2022 ఆగస్టులో తోషఖానా వివాదంపై కేసు నమోదైంది. పీటీఐపై నీలినీడలు? ► పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ (పీటీఐ)ఇమ్రాన్‌ఖాన్ ప్రజలపై వేసిన ప్రభావం గత అయిదు దశాబ్దాల్లో మరే నాయకుడు వెయ్యలేకపోయాడు. ప్రజల్లో ఆయనకున్న ఫాలోయింగ్ తిరుగులేనిది. గత మేలో అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసినప్పుడు పీటీఐ కార్యకర్తలు దేశంలో ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. వారిని నియంత్రించడం ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్‌గా మారింది. గతంలో పాకిస్తాన్ మాజీ ప్రధా నులు బెనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్, షాహిద్‌ఖాన్ అబ్బాసి వంటి వారు అవినీతి కేసుల్లో అరెస్ట్ అయినప్పటికీ పట్టించుకోని ప్రజలు ఇమ్రాన్ ఖాన్ విషయంలో మిలటరీకే ఎదురు తిరిగారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఇమ్రాన్‌ఖాన్ అభిమానుల్లో అప్పట్లో కనిపించిన ఆగ్రహావేశాలు చూస్తే పార్టీ పునాదులు ఎవరూ కదపలేరన్న భావన కలుగుతుంది. ఇమ్రాన్‌ఖాన్ ఒక్కడే నిజాయితీపరుడని, ఆర్థికంగా కుదేలైన దేశాన్ని ఆయన మాత్రమే గాడిలో పెట్టగలరన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. కానీ పవర్ పాలిటిక్స్ వేరుగా ఉంటాయి. చదవండి: ఇమ్రాన్ ఖాన్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఐదేళ్ల అనర్హత వేటు.. ఆ వెంటనే అరెస్ట్ ఇమ్రాన్‌ఖాన్‌కు బాగా మొండివాడన్న పేరుంది. రాజకీయాల్లో ఆయనకి స్నేహితుల కంటే శత్రువులే ఎక్కువ మంది ఉన్నారు. ఇమ్రాన్ ప్రధాని కావడానికి కారకుడైన అప్పటి ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వాతో ఆయ న ఎక్కువ కాలం సత్సంబంధాలు నడపలేకపోవడమే దీనికి నిలువెత్తు నిదర్శనం. ఇమ్రాన్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్, పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ సంకీర్ణ సర్కార్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇమ్రాన్‌ను కేసుల ఉచ్చులో బిగించాయి. గత రెండు నెలల్లో పారీ్టకి చెందిన సీనియర్ నాయకులు 80 మందికి పైగా పార్టీని వీడారు. వారిని బెదిరించి పార్టీని వీడేలా చేశా రని ఇమ్రాన్ ఆరోపించినప్పటికీ వరసపెట్టి కీలకమైన నాయకులు వెళ్లిపోవడం పార్టీ భవిష్యత్ పై ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు. ఇమ్రాన్ గతంలో అరెస్ట్ అయినప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసిన వేలాది మంది పార్టీ కార్యకర్తలు మిలటరీ జైళ్లలో ఉన్నారు. పాకిస్తాన్లో ఈ నెల 9న జాతీయ అసెంబ్లీని రద్దు చేయనున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ జైలు పాలవడం ఆయన పారీ్టకి శరాఘాతంలా తగిలింది. పార్లమెంటు రద్దయిన 3 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇమ్రాన్‌పై ఐదేళ్లు అనర్హత వేటు పడడంతో ఆయన ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా అయింది. పార్టీని ముందుండి నడిపించాల్సిన నాయకుడు కటకటాల మధ్య ఉంటే పార్టీ ఎంతవరకు మనుగడ సాగించగలదన్న ప్రశ్నలైతే వినిపిస్తున్నాయి. అయితే ఇమ్రాన్ ఆశలన్నీ ఇప్పుడు పై కోర్టులోనే ఉన్నాయి. కోర్టు ఇచ్చిన తీర్పుని పీటీఐ లాహోర్ హైకోర్టులో సవాల్ చేసింది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయలేదని, ఆయ నపై తుపాకీ గురిపెట్టి అపహరించుకొని వెళ్లిపోయారని పీటీఐ తన పిటిషన్లో విమర్శించింది. వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ఇమ్రాన్ కూడా శాంతి మార్గాన్నే అనుసరిస్తున్నారు. అరెస్ట్‌కు ముందే చేసి ఉంచిన రికార్డు మెసేజ్‌లో ఆయన కార్యకర్తలకి శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే తోషఖానాతో సహా 150 కేసుల్ని ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఆ ఉచ్చులోంచి ఎలా బయటకి రాగలరన్న సందేహాలైతే ఉన్నాయి. -
Rahul Gandhi: ఇలా జరిగితేనే లోక్‌సభలో అడుగుపెట్టేది
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు నిజంగానే ఇవాళ ఊరట ఇచ్చింది. పరువు నష్టం దావా కేసులో రెండేళ్ల శిక్షపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా.. ఆయన తన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లోనూ ఆయన మళ్లీ పోటీ చేసేందుకు వీలు కల్పిచింది. అయితే.. రాహుల్ గాంధీ ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే సభలో అడుగుపెడతారా? కేంద్రంపై అవిశ్వాస చర్చలో పాల్గొంటారా?.. లోక్‌సభ సెక్రటేరియెట్ ఏం చేయబోతుంది.. అనే ఉత్కంఠ నెలకొంది ఇప్పుడు. లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరగాలంటే.. సుప్రీం కోర్టు తన శిక్షను నిలుపుదల చేసిందని, కాబట్టి తన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోరుతూ లోక్‌సభ కార్యదర్శికి రాహుల్ గాంధీ ఒక విజ్ఞప్తిని సమర్పించాలి. పనిలో పనిగా సుప్రీం కోర్టు ఉత్తర్వుల కాపీని సైతం జత చేయాల్సి ఉంటుంది. ఆ కాపీల ఆధారంగానే రాహుల్‌గాంధీ అనర్హత వేటును లోక్‌సభ ఎత్తేస్తుంది. ఆపై అధికారిక ప్రకటనచేస్తుంది. అయితే ఇది జరిగినా.. రాహుల్ గాంధీ సభ్యత్వం పునరుద్ధరణ కావడానికి కాస్త సమయం పట్టే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.. గతంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మొహమ్మద్ ఫైజల్(లక్షద్వీప్) విషయంలోనూ ఇలాగే జరిగింది. హత్యాయత్నం కేసులో శిక్ష పడిన ఆయన సభ్యత్వం కోల్పోగా.. కేరళ హైకోర్టు ఆయన శిక్షపై స్టే విధించింది. అయితే రెండున్నర నెలల తర్వాతే లోక్‌సభ సెక్రటేరియెట్ ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాహుల్ విషయంలోనూ అదే జరగొచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు. అయితే ఫైజల్ కేసులో మరో ఆసక్తికరమైన పరిణామం ఉంది. ఆయన తన సభ్యత్వాన్ని పునరుద్ధరించడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ మరికొద్ది గంటల్లో విచారణ జరగాల్సి ఉండగా.. లోక్‌సభ సెక్రటేరియెట్ హడావిడిగా ఆయన సభ్యత్వ పునరుద్ధరణ ప్రకటన చేసింది. ఇక రాహుల్ విషయంలో మాత్రం ఎలాంటి జాప్యం జరగొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఇవాళ సుప్రీం కోర్టు స్టే ఆదేశాలు ఇచ్చిన వెంటనే.. సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీతో లోక్‌సభ స్పీకర్‌ను కలిశారు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి. వీలైనంత త్వరగా రాహుల్‌పై అనర్హత వేటు ఎత్తేసేలా లోక్‌సభ కార్యదర్శిపై ఒత్తిడి చేయాలని కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మోదీ ఇంటి పేరు కేసు.. రాహుల్‌కు శిక్ష.. టైం లైన్.. ఏప్రిల్ 13, 2019.. కోలార్(కర్ణాటక) ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ.. ఇలా దొంగలందరికీ ఒకే ఇంటిపేరు (మోదీ) ఎందుకు ఉంటుంది..?’ అని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 15, 2019: రాహుల్ వ్యాఖ్యలపై గుజరాత్‌లోని సూరత్ ఎమ్మెల్యే, భాజపా నేత పూర్ణేశ్ మోదీ క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. జులై 7, 2019: ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా సూరత్ మెట్రోపాలిటన్ కోర్టుకు రాహుల్ గాంధీ తొలిసారి హాజరయ్యారు. మార్చి 23, 2023: మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం.. రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మార్చి 24, 2023: రెండేళ్ల శిక్ష పడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఏప్రిల్ 2, 2023: మెట్రోపాలిటన్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సూరత్ సెషన్స్ కోర్టును రాహుల్ ఆశ్రయించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. ఏప్రిల్ 20, 2023: రాహుల్ అభ్యర్థనను పరిశీలించిన సూరత్ సెషన్స్ కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కానీ, తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఏప్రిల్ 25, 2023: సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. జులై 7, 2023: రాహుల్‌కు అక్కడ కూడా చుక్కెదురైంది. తీర్పుపై స్టే విధించాలన్న ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. జులై 15, 2023: గుజరాత్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒకవేళ స్టే విధించకుంటే భావప్రకటన స్వేచ్ఛకు ఆటంకం కలిగించడమే అవుతుందని అందులో పేర్కొన్నారు. జులై 21, 2023: హైకోర్టు ఆదేశాలను సవాలు చేసిన కేసులో గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీతోపాటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 4, 2023: రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సూరత్ కోర్టు కచ్చితంగా రెండేళ్లపాటు శిక్ష విధించడానికి కారణాలేంటో తెలియదని, దాని మూలంగానే రాహుల్‌పై అనర్హత వేటు పడిందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఒక్క రోజు తక్కువ శిక్ష వేసినా.. లోక్‌సభలో అనర్హత వేటు నుంచి ఆయన బయటపడేవారని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. -
TS: ఎన్నిక చెల్లవంటూ పిటిషన్లు.. కీలక ఆదేశాలు జారీ
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లందంటూ తెలంగాణాలో హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కాగా, ఇవాళ(జులై 31 సోమవారం)దానిపై విచారణ జరిగింది. ఎన్నికల అఫిడవిట్ లో గంగుల కమలాకర్ తప్పుడు వివరాలు ఇచ్చారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2018 ఎన్నికల సమయంలో బండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గంగుల చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే.. గంగుల తప్పుడు వివరాలతో అఫిడవిట్ సమర్పించారంటూ బండి సంజయ్ పిటిషన్ వేశారు. ఈ తరుణంలో ఇవాళ విచారణ జరగ్గా.. పిటిషనర్‌ను క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి శైలజతో కమిషన్ ఏర్పాటు చేసిన హైకోర్టు.. ఆగస్టు 12 నుండి 17 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అగస్ట్ 21కి వాయిదా వేసింది. ఇక మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనర్హత పిటిషన్‌పైనా హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల అఫిడవిట్లో శ్రీనివాస్‌గౌడ్ తప్పుడు ధ్రుృవపత్రాలు సమర్పించారని, శ్రీనివాసగౌడ్ ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే దీనిని కొట్టేయాలంటూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా చుక్కెదురైంది. ఈ క్రమంలో.. సోమవారమూ ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగింది. 19-11-2018వ తేదీన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగానే విచారణ జరుపుతోంది ధర్మాసనం. ఈ క్రమంలో.. అఫిడవిట్, ఆధారాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. కోర్టు విచారణ పై మీడియాకు ఎలాంటి సమాచారం షేర్ చేసుకోవద్దు వాది, ప్రతివాది ఇద్దరిని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. క్రిమినల్ కేసుకు నాంపల్లి కోర్టు ఆదేశం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో పిటిషనర్ రాఘవేంద్ర రాజు సాక్షితో మాట్లాడారు. ‘‘2022, ఆగస్టు 4వ తేదీన నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసు పిటిషన్ వేశాను. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఎన్నికల అధికారుల మీద క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని కోర్టు ఆదేశించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు చీఫ్ ఎలక్షన్ అధికారి రాజీవ్ కుమార్, రోనాల్డ్ రోస్ ప్రస్తుత ghmc కమిషనర్, సంజయ్ కుమార్ కేంద్ర ఎన్నికల అధికారి, మహబూబ్ నగర్ కలెక్టర్ ఎస్ వెంకట్ రావు, ఆర్థివో శ్రీనివాస్, పద్మ శ్రీ డిప్యుటీ కలెక్టర్, కే వెంకటేష్ గౌడ్, నోటరీఅడ్వకేట్ రాజేంద్ర ప్రసాద్, దానం సుధాకర్ ప్రపోజర్ లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ ఆదేశించింది అని తెలిపారు రాఘవేంద్ర రాజు. ‘‘ఎన్నికల కమిషన్ కు తప్పుడు నివేదిక ఇచ్చాడని పిటిషన్ లో తెలిపాను. ఎన్నికల కమీషన్ వెబ్సైట్ టాంపరింగ్ కు పాల్పడ్డారని ఆధారాలు ఇచ్చాను. 11 సెప్టెంబర్ పూర్తి నివేదిక ఇవ్వాలని మహబూబ్ నగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది’’ అని తెలిపారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ తోక పార్టీలా బీఆర్ఎస్ -
అలా అయితే ‘ట్రిపుల్ ఇంజన్’లో మొత్తం వాళ్లే ఉన్నారుగా సార్! ఎలా?
అలా అయితే ‘ట్రిపుల్ ఇంజన్’లో మొత్తం వాళ్లే ఉన్నారుగా సార్! ఎలా? -
రసకందాయంలో ఎన్సీపీ రగడ.. ఎత్తులు, పై ఎత్తులు
ముంబై/సతారా: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పారీ్ట (ఎన్సీపీ)పై ఆధిపత్యం కోసం అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అజిత్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శరద్ పవార్ వర్గం, శరద్ వర్గం ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని అజిత్ వర్గం పట్టుబడుతున్నాయి. శరద్ వర్గం నాయకులను పార్టీ పదవుల నుంచి అజిత్ వర్గం తొలగించింది. అసెంబ్లీలో ఎన్సీపీ పక్షనేతగా అజిత్ పవార్ నియమితులైనట్లు ఆయన వర్గం చెబుతోంది. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్ పవార్‌తోపాటు మంత్రులుగా ప్రమాణం చేసిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఎన్సీపీ అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు ఫిర్యాదు చేసింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం 9 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా తేల్చడానికి తగిన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. శరద్ పవార్ వర్గం నేత జితేంత్ర అవద్ ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ మేరకు స్పీకర్‌కు విజ్ఞాపన అందించారు. ఇదిలా ఉండగా, అజిత్ పవార్‌తో సహా 9 మంది ఎమ్మెల్యేలకు శరద్ పవార్ వర్గం సోమవారం నోటీసులు జారీ చేసింది. ఎన్సీపీతో వారికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఇక ఏ వేదికపైనా ఎన్సీపీ ప్రతినిధులుగా చెప్పుకోవద్దని వారికి తేల్చిచెప్పింది. పార్టీని ధిక్కరించి బయటకు వెళ్లిపోయిన వారు పార్టీ నేతలమని చెప్పుకోవడం చట్టవ్యతిరేకం అవుతుందని ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ స్పష్టం చేశారు. 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయడానికి వీలుగా ఎన్సీపీ క్రమశిక్షణా కమిటీ ఇప్పటికే ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్సీపీ ఫిర్యాదు తగిన నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ చెప్పారు. పవార్‌కు ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నదీ తనకు తెలియదన్నారు. పటేల్, తత్కారే బహిష్కరణ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, లోక్‌సభ సభ్యుడు సునీల్ తత్కారేను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోమవారం తమ పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వారిపై ఈ మేరకు చర్య తీసుకున్నట్లు ట్విట్టర్లో వెల్లడించారు. ఇక మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడిగా లోక్‌సభ సభ్యుడు సునీల్ తత్కారేను నియమించినట్లు ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. అసెంబ్లీలో ఎన్సీపీ పక్ష నేతగా అజిత్ వ్యవహరిస్తారని అన్నారు. గరిష్ట సంఖ్యలో ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్ అన్నారు. అజిత్ కు బీజేపీ సీఎం పదవి ఎర: కాంగ్రెస్ అజిత్‌కు సీఎం పదవి కట్టబెడతామని బీజేపీ హామీ ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ‘‘బీజేపీ–శివసేన ప్రభుత్వంలో అజిత్ చేరుతారని ఎప్పుడో తెలుసు. 16 మంది సేన(షిండే) ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించి షిండేను సీఎం పదవి నుంచి దింపేస్తారు. అజిత్‌ను కూచోబెడతారు’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. శివసేన (ఉద్ధవ్) పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలోనూ ఇదే విషయం రాసింది. అజిత్ తిరుగుబాటు వెనుక నా ప్రమేయం లేదు: పవార్ తన ఆశీస్సులతోనే అజిత్ పవార్ తిరుగుబాటు చేశారంటూ వినిపిస్తున్న వాదనలను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఖండించారు. బీజేపీ–శివసేన ప్రభుత్వంలో అజిత్ చేరడం వెనుక తన ప్రమేయం ఎంతమాత్రం లేదన్నారు. ఆయన సోమవారం సతారా జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీ బలోపేతం కోసం ప్రజల్లోకి వెళ్తానని, రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని తెలిపారు. -
రాహుల్ పాస్‌పోర్టుకు కోర్టు ఓకే
న్యూఢిల్లీ: కొత్త పాస్‌పోర్టు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఢిల్లీ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. మూడేళ్ల పాటు సాధారణ పాస్‌పోర్టు పొందడానికి అనుమతి మంజూరు చేసింది. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాతరాహుల్ గాంధీ తన డిప్లొమాటిక్ పాస్‌పోర్టును, ఇతర ప్రయాణ అనుమతి పత్రాలను అధికారులకు అందజేశారు. విదేశాల్లో ప్రయాణించడానికి వీలుగా సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితుడిగా ఉండడంతో పాస్‌పోర్టు కోసం నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంది. ఎన్ఓసీ ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. మూడేళ్లపాటు సాధారణ పాస్‌పోర్టు కోసం ఎన్ఓసీ ఇస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. -
మహారాష్ట్ర సర్కార్‌కు ముప్పు లేదు.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై ఎన్సీపీ నేత అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సంక్షోభ సమయంలో తిరుగుబాటు చేసిన షిండేకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా అధికార ప్రభుతానికి ఎలాంటి ముప్పు లేదని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరనున్నారంటూ గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా అప్పటి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబాటు ఎగరవేసిన ఏక్నాథ్ షిండే వర్గం 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో సత్వర చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్ధవ్ వర్గం శివసేన మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌కు 79 పేజీల లేఖను అందజేసింది. స్పీకర్ విదేశీ పర్యటనలో ఉండటం వల్ల డిప్యూటీ స్పీకర్‌కు లేఖ అందించినట్లు శివసేన నేత ప్రభు తెలిపారు. చదవండి: కర్ణాటక ఫలితాలు: కరెంటు బిల్లులు కాంగ్రెస్ నుంచి వసూలు చేసుకోండి! దీనిపై అజిత్ పవార్ మాట్లాడుతూ..ఒకవేళ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా.. షిండే, ఫడ్నవీస్‌ల ప్రభుత్వం పడిపోదని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని సోమవారం ముంబైలో విలేకరు సమావేశంలో పేర్కొన్నారు. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినా ప్రభుత్వం తన మెజారిటినీ కోల్పోదని తెలిపారు. కాగా ఏక్నాథ్ షిండే శివసేన, బీజేపీకి ప్రస్తుతం అసెంబ్లీలో 145 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇతరులతో కలిపి మొత్తం అధికార కూటమికి 162 మంది శాసన సభ్యుల బలం ఉంది. అంతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్య కంటే 17 మంది ఎక్కువే ఉన్నారు. ఇదిలా ఉండగా శివసేన పార్టీలో ఏర్పడిన సంక్షోభంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. సభలో ఉద్ధవ్ ఠాక్రే మెజార్టీ కోల్పోయినట్లు నిర్ధారణకు రావడానికి తగిన సమాచారం లేకపోయినా మెజార్టీ నిరూపించుకోవాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించడం సరైంది కాదని తెలిపింది. గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ తన విచక్షాణాధికారాలను ఉపయోగించిన తీరు చట్టబద్దంగా లేదని తెలిపింది. అయితే ఉద్ధవ్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని తేల్చిచెప్పింది. శాసనసభలో బల పరీక్షలను ఎదుర్కోకుండా ఆయన స్వచ్చందంగా రాజీనామా చేశారని తెలపింది. చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమర్ కీలక వ్యాఖ్యలు.. -
ఎమ్మెల్యే హత్య కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష.. బీఎస్పీ ఎంపీపై అనర్హత వేటు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హతవేటు పడింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్‌ను కిడ్నాప్ చేసి హత్యచేసిన కేసులో అఫ్జల్‌ను దోషిగా తేల్చిన ఘాజిపూర్ ప్రజా ప్రతినిధుల కోర్టు.. ఎంపీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం సోమవారం వెల్లడించింది. కాగా అఫ్జల్ అన్సారీ గత లోక్‌సభ ఎన్నికల్లో ఘాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాది పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. అయితే 2005 నవంబర్ 29న అప్పటి ఘాజీపూర్ ఎమ్మెల్యే కృష్ణనాద్ రాయ్ హత్యకు సంబంధించి అఫ్జల్ అన్సారీతోపాటు అతని సోదరుడిపై యూపీ గ్యాంగ్స్టర్స్ చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా వీరిద్దరు దోషులుగా తేలారు. ఎంపీకి నాలుగేళ్ల జైలు శిక్ష, అతని సోదరుడు, గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీకి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. చదవండి: ఢిల్లీ మెట్రోలో మరో యువతి డ్యాన్స్.. వీడియో వైరల్ -
సూరత్ కోర్టులో వాదనలు.. ‘మరీ ఇంత పెద్ద శిక్షా ?’
సూరత్: మోదీ ఇంటి పేరును అనుచితంగా వాడారనే పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష, ఎంపీగా అనర్హత వేటును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తరఫున ఆయన న్యాయవాదులు గురువారం సూరత్ కోర్టులో వాదనలు వినిపించారు. ‘ నేర నిరూపణ విధానం సవ్యంగా లేదు. ఈ కేసులో ట్రయల్ కోర్టు జడ్జి అసమతుల్య సాక్ష్యాధారాలను ఆధారం చేసుకుని తీర్పు చెప్పారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాలతో మొత్తం కేసు ఆధారపడింది. రాఫెల్ కేసులో రాహుల్ చెప్పిన బేషరతు క్షమాపణ అంశాన్ని ఈ కేసుకు సంబంధంలేకున్నా ఇందులో జతచేశారు. మరీ ఇంత పెద్ద శిక్షా ?. ఈ కేసులో గరిష్ట శిక్షను అమలుచేయాల్సిన అవసరం లేదు’ అని అదనపు సెషన్స్ జడ్జి ఆర్పీ మొగెరా ముందు రాహుల్ లాయర్ ఆర్ఎస్ ఛీమా వాదించారు. శిక్షను నిలుపుదల చేయాలని కోరారు. ‘ దొంగలందరి ఇంటి పేరు మోదీ అనే ఎందుకుంది? అనే ప్రసంగం చేసే నాటికి రాహుల్ దేశంలోనే రెండో అతిపెద్ద పార్టీకి అధ్యక్షునిగా ఉన్నారు. దేశ ప్రజలపై ఆయన ప్రసంగ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రసంగాన్ని సంచలనం చేయాలనేది ఆయన ఉద్దేశ్యం. ఇలాంటి పరువునష్టం కేసులు ఆయన వేర్వేరు చోట్ల చాలా ఎదుర్కొంటున్నారు. రాఫెల్ కేసులో అనుచిత వ్యాఖ్యలు, ఆనక క్షమాపణల తర్వాతా ఆయన ఇలాంటి ప్రసంగాలు చేశారు’ అని పరువునష్టం కేసు వేసిన పూర్ణేశ్ మోదీ తరఫు లాయర్ హర్షిత్ తోలియా వాదించారు. తర్వాత జడ్జి తీర్పును 20వ తేదీకి వాయిదావేశారు. -
రేపు మంచిర్యాలలో భారీ బహిరంగ సభకు సన్నాహకాలు
-
‘రాహుల్’ పరిణామాలను గమనిస్తున్నాం
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య కొనసాగుతున్న రగడ ముదిరింది. ‘ రాహుల్‌కి వ్యతిరేకంగా కోర్టు తీర్పు, అనర్హత వేటు తదనంతర పరిణామాలను గమనిస్తున్నాం. లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయడం సమంజసమేనా? అనేది పై కోర్టులో తేలుతుంది’ అని జర్మనీ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు మీడియాతో అన్నారు. దీనికి కాంగ్రెస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశ అంతర్గత వ్యవహారాల్లోకి విదేశీ శక్తులను కాంగ్రెస్ ఆహ్వానిస్తోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్‌చేశారు. ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందించారు. ‘ అసలైన వ్యవహారాన్ని ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు? అదానీపై రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఇవ్వడంలేదు. ప్రజల దృష్టిని మళ్లించడం కాదు, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి’’ అని డిమాండ్ చేశారు. -
ఖర్గే ఇంట గెలిచేనా?: అగ్నిపరీక్షగా అసెంబ్లీ ఎన్నికలు!
ఎస్.రాజమహేంద్రారెడ్డి : మల్లికార్జున ఖర్గే.. ది గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కొత్త బాస్. గాంధీల ఇంటి పార్టీలాంటి కాంగ్రెస్‌కు గాంధీయేతరులు అధ్యక్షుడు కావడం విశేషం. ఆ పదవికి ఎంపిక కావడమే ఆయన సమర్థతకు నిదర్శనం. అంతగా పట్టులేని ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్గే తన ప్రభావాన్ని అంతగా చూపెట్టలేకపోయినప్పటికీ పార్టీని ఏకతాటిపై నడపడంలో తన సమర్థతను చాటాడనే చెప్పుకోవాలి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ముక్తకంఠంతో నిరసన గళాన్ని వినిపించడంలోనూ ఖర్గే తన నాయకత్వ గరిమను రుజువు చేసుకున్నారు. అనర్హత వేటుకు నిరసనగా విపక్షాలన్నింటినీ ఒకే వేదికపై మోహరించడంలోనూ విజయం సాధించారు. పార్లమెంట్లో అదానీ వ్యవహారంపైనా, పార్లమెంట్ బయట అనర్హత వేటు పైనా సామూహిక నిరసనలకు కాంగ్రెస్ పార్టీ ఖర్గే సారథ్యంలోనే నాయకత్వ బాధ్యతను భుజానికెత్తుకుంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక అసెంబ్లీ పోరుకు నగారా మోగింది. వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఖర్గేకు ఇది అసలు సిసలైన పరీక్ష. ఒకరకంగా అగ్నిపరీక్ష. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తన సొంత రాష్ట్రమైన కర్ణాటకలో పార్టీని మళ్లీ గద్దెనెక్కించడం ఇప్పుడు ఆయన ముందున్న ప్రధాన, ఏకైక లక్ష్యం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఇంటి పోరులో గెలుస్తారో లేదో మే 13న(కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే రోజు) తేలనుంది. ఖర్గే హీరోనో లేక జీరోనో అదే రోజు కర్ణాటకతోపాటు దేశానికీ తెలుస్తుంది. ఇప్పటికే తొలి విజయం నిజానికి చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పోరుకు పూర్తి సన్నద్ధతతో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ఓ వారం రోజుల ముందే కాంగ్రెస్ 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. నిత్యం అంతర్గత పోరుతో తలమునకలై ఉండే కాంగ్రెస్ పార్టీకి ఇది శుభ పరిణామం. తొలి జాబితాను ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సామరస్యపూర్వక వాతావరణంలో ప్రకటించడం కచ్చితంగా ఖర్గే వ్యవహార శైలికి అద్దం పడుతుంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య ఉన్న చిరకాల భేదాభిప్రాయాలు ఈ ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారడం ఖాయమనుకున్నారు. ఎన్నికల వేళ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన ఖర్గే, ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచే వీరిద్దరి సంఘర్షణపై ఓ కన్నేసి ఉంచారు. సరిగ్గా షెడ్యూల్ ప్రకటించే సమయానికి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. మే 10న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగిస్తే ఆ క్రెడిట్ అంతా ఆయనదే అవుతుంది. జేడీ(ఎస్)తో పొత్తుకు విముఖత ఒకే గొడుగు కింద వైరి వర్గాల ఘర్షణ ఏ స్థాయిలో ఉంటుందో ఖర్గేకు అనుభవపూర్వకంగా తెలుసు. తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఖర్గే ఒక్కసారి కూడా కర్ణాటక ముఖ్యమంత్రి కాలేకపోయారు. అవకాశాలు రాక కాదు, అవకాశాలు తలుపుతట్టినా అంతర్గత పోరును తట్టుకొని నిలబడలేకపోయారు. ఒక్కసారి కాదు, ఏకంగా మూడుసార్లు ఆయన నుంచి ముఖ్యమంత్రి పదవి తృటిలో చేజారిపోయింది. 1999లో ఎస్.ఎం.కృష్ణ, 2004లో ఎన్.ధరమ్ సింగ్, 2013లో సిద్ధరామయ్య నుంచి ఎదురైన గట్టి పోటీని ఎదుర్కోలేకపోయారు. 2004లో మిశ్రమ ఫలితం వచ్చినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించే అవకాశం వచ్చింది. దాదాపు ఖాయమైపోయిందనుకున్న తరుణంలో జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ అభ్యంతరం చెప్పడంతో తన సహచరుడైన మరో సీనియర్ నాయకుడు ధరమ్‌సింగ్ ముఖ్యమంత్రి కావడానికి సహకరించారు. ఈ అనుభవం వల్లే జేడీ(ఎస్)తో ఎన్నికల పొత్తుకు ఖర్గే విముఖంగా ఉన్నారు. ఎన్నికల తర్వాత సంకీర్ణం తప్పని పరిస్థితి ఎదురైనా జేడీ(ఎస్)తో దోస్తీ కలలోని మాట అని ఖర్గే ఈపాటికే సుస్పష్టంగా చెప్పేశారు. ఈ మేరకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని సైతం ఒప్పించినట్లు వినికిడి. మది దోచిన సర్వేలు కింగ్ అయ్యే అవకాశం మూడుసార్లు చేజారిన ఖర్గే ఈసారి కింగ్‌మేకర్ కావాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ఇంటి గెలిచి చూపించి, రచ్చ గెలుపు మీద ఇనుమడించిన ఉత్సాహంతో దృష్టి సారించాలని ఆశిస్తున్నారు. ఇటీవలి కొన్ని సర్వేల ఫలితాలు ఖర్గే మనసు దోచాయి. ఇండియాటుడే నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో కర్ణాటకలో జనవరిలో లోక్‌సభ ఎన్నికలు జరిగి ఉంటే 28 సీట్లకు కాంగ్రెస్ 17 సీట్లను దక్కించుకొనేది అని ఆ సర్వే సారాంశం. కర్ణాటక ఎన్నికల నగారా మోగిన రోజే∙ఏబీపీ–సీ ఓటర్ సర్వే కాంగ్రెస్‌కే విజయాన్ని కట్టబెట్టింది. ఆ పార్టీకి 115–127 సీట్లు వస్తాయంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో 117 స్థానాలంటే సంకీర్ణం జోలికెళ్లకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఈ సర్వే ఖర్గే మనసు దోచి ఉంటుంది. ఇక కర్ణాటక ప్రజల మనసులు దోచడానికి ఖర్గే వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి. -
లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం!
న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీపై అనర్హత వేటు పై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ అంశంపై బహుముఖ దాడితో అధికార బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ముందుగా ‘ఏకపక్షంగా వ్యవహరించి రాహుల్‌పై వేటు వేశా’రంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తోంది. కాంగ్రెస్ ఎంపీలంతా మంగళవారం ఉదయమే సమావేశమై దీనిపై మల్లగుల్లాలు పడ్డారు. కోర్టు శిక్ష విధించిన గంటల వ్యవధిలోనే ఆగమేఘాలపై రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన వైనాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా హైలైట్ చేయొచ్చన్న భావన వ్యక్తమైంది. అనంతరం దీనిపై విపక్షాలతో కూడా విస్తృతంగా చర్చోపచర్చలు జరిపినట్టు సమాచారం. అన్నీ కుదిరితే వచ్చే సోమవారం అవిశ్వాసం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే కొన్ని విపక్షాలు ఇందుకు అభ్యంతరం చెబుతున్నట్టు సమాచారం. ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్న విపక్షాల ఐక్యత యత్నాలకు ఇది గండి కొట్టే ప్రమాదముందన్నది వాటి వాదనగా తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు సంతకాలు అవసరం. పైగా పార్లమెంటు ఉభయ సభలూ రెండు వారాలుగా ఒక్క రోజు కూడా సజావుగా నడవని నేపథ్యంలో తీర్మానం సాధ్యాసాధ్యాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పెట్టినా వీగిపోయే అవకాశాలే ఉన్నప్పటికీ ముందుకెళ్లాలనే యోచనలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. త్యాగాలకు సిద్ధమవ్వాలి విపక్షాలకు రాహుల్ పిలుపు రాహుల్‌పై వేటును నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్‌తో సహా 17 ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌కు తాజాగా సంఘీభావం ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంటులో కన్పించిన విపక్షాల ఈ ఐక్యతను మరింత ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా ఏప్రిల్ తొలి వారంలో విపక్ష అగ్రనేతలతో కీలక సమావేశం జరపాలని నిర్ణయించింది. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన విపక్షాల భేటీలోనే ఈ మేరకు ప్రతిపాదన వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘విపక్షాల అగ్ర నేతలు, అధ్యక్షులంతా భేటీ అయ్యేలా కాంగ్రెస్ చొరవ తీసుకోవాలని ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్‌తో పాటు డీఎంకే, జేడీ(యూ), సీపీఎం నేతలు ప్రతిపాదించారు. 2024 సాధారణ ఎన్నికలకు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని నిర్ణయించుకోవాల్సిన అవసరం చాలా ఉందని వారు పదేపదే చెప్పారు’’ అని కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు వివరించారు. విపక్షాలన్నీ త్యాగాలకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. ‘‘విపక్షాల ఐక్యత కోసం ఎంతటి త్యాగాలకైనా కాంగ్రెస్ సిద్ధం. నేనూ సిద్ధం’’ అని ఆయన కుండబద్దలు కొట్టారని సమాచారం. ఆ భేటీకి దూరంగా ఉన్న శివసేన (ఉద్ధవ్ వర్గం) కూడా తమతో కలిసి నడుస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వివరించారు అదానీ ఉదంతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తృణమూల్ సహా విపక్షాలను కాంగ్రెస్‌కు దగ్గర చేయడం తెలిసిందే. ‘అదానీ’పై మోదీకి లేఖలు! రాహుల్‌పై వేటును నిరసిస్తూ, అదానీ అంశంపై జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ నెల రోజుల పాటు బ్లాక్ స్థాయి నుంచి హస్తిన దాకా దేశవ్యాప్త ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మార్చి 24న పార్టీ స్టీరింగ్ కమిటీ, పీసీసీ చీఫ్‌లు, అనుబంధ విభాగాల చీఫ్‌లతో జరిగిన భేటీలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. వివరాలు... ► ఢిల్లీలోని ఎర్రకోట నుంచి మొదలు పెట్టి దేశంలోని 35 ప్రధాన నగరాల్లో మంగళ, బుధవారాల్లో ‘లోక్తంత్ర్ బచావో శాంతి మార్చ్’ ► ఏప్రిల్ రెండో వారంలో ‘జై భారత్ మహా సత్యాగ్రహం’. ఇందులో భాగంగా బ్లాక్/మండల కాంగ్రెస్ విభాగాలు సభలు, సమావేశాలు నిర్వహించి రాహుల్‌పై వేటు, అదానీతో ప్రధాని మోదీ బంధంపై ప్రజలకు వివరిస్తాయి. రాహుల్ సందేశాన్ని పార్టీ సోషల్ మీడియా విభాగాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాయి. ► ఏప్రిల్ 15 నుంచి 20 దాకా జై భారత్ మహా సత్యాగ్రహంలో భాగంగా విపక్షాలతో కలిసి జిల్లాల్లో కలెక్టరేట్ల ఘెరావ్. రాష్ట్ర స్థాయిలోనూ భారీ కార్యక్రమం. ఒక్క రోజు ఉపవాస దీక్షలు. అనంతరం ఢిల్లీలో జాతీయ స్థాయిలో భారీ సత్యాగ్రహం. ► మార్చి 31న జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నేతల మీడియా సమావేశాలు. ► యూత్ కాంగ్రెస్, ఎన్ఎన్యూఐ తదితరాల ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమం. అదానీ అవినీతి, రాహుల్‌పై వేటు తదితరాలపై ప్రశ్నిస్తూ ప్రధాని మోదీకి లేఖలు. ► మహిళా కాంగ్రెస్ నిరసన ర్యాలీ. -
ఆ బంగ్లాతో ఎన్నో జ్ఞాపకాలు
న్యూఢిల్లీ: ఎంపీగా అనర్హత వేటు పడ్డ నేపథ్యంలో అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తానని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. నెల రోజుల్లోపు దాన్ని ఖాళీ చేయాలన్న లోక్‌సభ సచివాలయం నోటీసుపై ఆయన మంగళవారం స్పందించారు. ‘‘12, తుగ్లక్ లేన్‌లో నాకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలంటూ మీరు పంపిన లేఖకు ధన్యవాదాలు. నాలుగుసార్లు ఎంపీగా ఆ బంగ్లాలో చాలా ఏళ్లు గడిపాను. నాకక్కడ ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. నా హక్కులకు భంగం కలగని రీతిలో వ్యవహరిస్తా’’ అంటూ నోటీసుకు బదులిచ్చారు. సదరు బంగ్లాలో రాహుల్ 2005 నుంచీ ఉంటున్నారు. దాన్ని ఖాళీ చేయాలన్న తాఖీదులపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మోదీ సర్కారు తాలూకు ‘బెదిరించి, భయపెట్టి, అవమానించే’ వైఖరికి ఇది పరాకాష్ట అంటూ దుయ్యబట్టారు. రాహుల్‌ను బలహీనపరిచేందుకు మున్ముందు కూడా ఎంత చేయాలో అంతా చేస్తారని అభిప్రాయపడ్డారు. ‘‘రాహుల్కంటూ సొంతిల్లు లేదు. అధికారిక బంగ్లా వీడాక తన తల్లి సోనియాతో 10, జన్‌పథ్ నివాసంలో ఉంటారు. లేదంటే నా ఇంటిని ఖాళీ చేసి ఆయనకిస్తా’’ అని ఖర్గే చెప్పుకొచ్చారు. ‘‘ఎన్నికల ఫలితాలు వచ్చిన ఆర్నెల్ల తర్వాత గానీ నాకు అధికారిక బంగ్లా కేటాయించలేదు. ఇలాంటివి బీజేపీకి అలవాటే’’ అని విమర్శించారు. -
అట్టుడికిన పార్లమెంటు
న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీపై అనర్హత వేటు మొదలుకుని పలు అంశాలపై పార్లమెంటు సోమవారం అట్టుడికిపోయింది. విపక్ష సభ్యుల ఆందోళనలు, డిమాండ్లు, నినాదాలతో ఉభయ సభలూ దద్దరిల్లాయి. పెద్దగా ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టకుండానే మరోసారి వాయిదాపడ్డాయి. ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభ ఉదయం సమావేశమవుతూనే కాంగ్రెస్, విపక్ష సభ్యులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేబూని నినాదాలతో హోరెత్తించారు. అదానీ అవకతవకలపై జేపీసీ దర్యాప్తు కోరుతూ వెల్‌లోకి దూసుకెళ్లారు. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ కుర్చీపైకి కాగితాలు విసిరారు! సభాధ్యక్షులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దాంతో ఉభయ సభలూ మధ్యాహ్నం రెండింటి దాకా వాయిదా పడ్డాయి. తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడ్డాయి. రాహుల్‌పై వేటును నిరసిస్తూ కాంగ్రెస్‌తో పాటు విపక్ష సభ్యులంతా నల్ల దుస్తులు ధరించి సభలకు హాజరయ్యారు. అంతకుముందు ఈ అంశంపై వ్యూహరచనకు కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాలన్నీ సమావేశమై చర్చించాయి. ఆర్థిక బిల్లుకు రాజ్యసభ ఆమోదం ఎలాంటి చర్చలూ చేపట్టకుండానే ఆర్థిక బిల్లు–2023ను, జమ్మూ కశ్మీర్ బడ్జెట్, పలు ఇతర బిల్లులను రాజ్యసభ సోమవారం మూజువాణి ఓటుతో ఆమోదించి లోక్‌సభకు తిప్పి పంపింది. సభలో విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వీటిపై చర్చకు 10 గంటల సమయాన్ని సభ్యులు వినియోగించుకోలేదంటూ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ఆవేదన వెలిబుచ్చారు. గత వారం లోక్‌సభ కూడా ఈ బిల్లులను చర్చ లేకుండానే ఆమోదించడం తెలిసిందే. మోదీకి ఎందుకంత భయం? ‘‘ప్రధాని మోదీ జీ! ప్రజల రిటైర్మెంట్ నిధులను అదానీ గ్రూప్‌లో ఎందుకు పెట్టుబడులుగా పెట్టాల్సి వచ్చిందన్న విపక్షాల ప్రశ్నలకు మీ నుంచి సమాధానం లేదు. అదానీ గ్రూప్ అవకతవకలపై విచారణ లేదు. మీకెందుకంత భయం?’’ అని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ‘‘మోదీ–అదానీ బంధం బయటపడ్డాక కూడా ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, ఎస్బీఐ, ఈపీఎఫ్ఓ పెట్టుబడులన్నింటినీ అదానీ సంస్థల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది?’’ అంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌కు తృణమూల్ బాసట కొన్నాళ్లుగా కాంగ్రెస్‌తో ఉప్పూనిప్పుగా ఉంటున్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆ పార్టీకి సంఘీభావం ప్రకటించింది. లోక్‌సభ నుంచి రాహుల్‌ను అనర్హునిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన వ్యూహరచన భేటీలోనూ, అదానీ ఉదంతంపై జరిగిన నిరసనల్లోనూ పాల్గొంది. తృణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్, శివసేన (యూబీటీ)తో సహా మొత్తం 16 విపక్షాలు వీటిలో పాల్గొన్నాయి. తమ మద్దతు కేవలం రాహుల్ అంశానికే పరిమితమని అనంతరం తృణమూల్ స్పష్టత ఇచ్చింది. ‘‘పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు జరిపే ఆందోళనల్లో కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీలతోనూ మేం కలిసి సాగుతాం. అదే సమయంలో పలు అంశాలపై కాంగ్రెస్‌తో తమ అభిప్రాయ భేదాల్లో ఏ మార్పూ లేదు’’ అని పేర్కొంది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమికి తృణమూల్ కొంతకాలంగా దూరంగా ఉంటుండటం తెలిసిందే. బంగ్లా ఖాళీ చేయండి లోక్‌సభ సభ్యత్వం రద్దయిన నేపథ్యంలో అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలంటూ రాహుల్‌గాంధీకి తాఖీదులందాయి. ఎంపీ హోదాలో 12, తుగ్లక్ లేన్‌లో ఆయనకు కేటాయించిన బంగ్లాను ఏప్రిల్ 22కల్లా ఖాళీ చేయాలని లోక్‌సభ హౌజింగ్ కమిటీ పేర్కొంది. అనర్హత వేటు పడ్డ ఎంపీలు నెలలోపు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు గుర్తు చేశారు. బంగ్లాలో మరింతకాలం ఉండాలనుకుంటే కమిటీకి రాహుల్ లేఖ రాయవచ్చన్నారు. -
Sankalp Satyagraha: మోదీ పిరికిపంద
న్యూఢిల్లీ: ‘‘దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రధాని రాజీవ్‌గాంధీ కుమారుడు రాహుల్. దేశ ఐక్యత కోసం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అలాంటి వ్యక్తి దేశాన్ని ఎందుకు అవమానిస్తారు?’’ అని ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. ‘‘బీజేపీ నేతలు రాహుల్‌ను మీరు జాఫర్ అంటూ ఎగతాళి చేశారు. జాతి వ్యతిరేక శక్తి అని నిందించారు. మా తల్లిని అవమానించారు. నెహ్రూ ఇంటిపేరు ఎందుకు పెట్టుకోలేదంటూ మమ్మల్ని ఎద్దేవా చేశారు. మా కుటుంబాన్ని, కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని ఆక్షేపించారు. అయినా వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? జైలు శిక్షలు విధించలేదు?’’ అని ప్రశ్నించారు. తమ కుటుంబాన్ని ఇప్పటికీ అవమానిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘హార్వర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదివిన రాహుల్‌ను ‘పప్పు’ అని ఎగతాళి చేస్తున్నారు. కానీ ఆయన పప్పు కాదని బీజేపీ నాయకులకు తెలిసిపోయింది. అందుకే పార్లమెంటు నుంచి బయటికి పంపించారు’’ అంటూ దుయ్యబట్టారు. రాహుల్‌పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ ఆదివారం దేశవ్యాప్తంగా ‘సంకల్ప్ సత్యాగ్రహ’ దీక్షలు చేపట్టింది. ఢిల్లీలో రాజ్‌ఘాట్ వద్ద దీక్షలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితర అగ్ర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రియాంక నిప్పులు చెరిగారు. ‘‘మోదీ ఉత్త పిరికిపంద. అధికారం వెనుక దాక్కుంటున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. అహంకారపూరిత మోదీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం నేర్పించడం తథ్యమన్నారు. అరాచక బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘‘మా కుటుంబం ధారపోసిన రక్తం దేశ ప్రజాస్వామ్యానికి ఊతమిచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాం’’ అని చెప్పారు. ఇకపై తాము మౌనంగా ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘మోదీ’లను విమర్శిస్తే నొప్పెందుకు: ఖర్గే ‘‘ఒక వ్యక్తిని కాపాడడానికి మొత్తం ప్రభుత్వం, కేబినెట్ మంత్రులు, ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. అసలు అదానీ ఎవరు? ప్రభుత్వం ఆయనకు ఎందుకు అండగా ఉంటోందో చెప్పాలి’’ అని ప్రియాంక నిలదీశారు. ‘‘ప్రజల హక్కుల కోసం రాహుల్ పోరాడుతున్నారు. జోడో యాత్రలో ఆయన వెంట లక్షల మంది నడిచారు’’ అన్నారు. అక్రమాలకు పాల్పడి విదేశాలకు పరారైన నీరవ్ మోదీ, లలిత్ మోదీలను విమర్శిస్తే బీజేపీ ప్రభుత్వానికి నొప్పి ఎందుకని ఖర్గే ప్రశ్నించారు. సత్యాగ్రహం పేరిట కాంగ్రెస్ దీక్ష చేయడం సిగ్గుచేటని బీజేపీ దుయ్యబట్టింది. దానికి ఆ అధికారమే లేదని బీజేపీ నేత సుధాంశు త్రివేది అన్నారు. ‘అనర్హత వేటు పడిన ఎంపీ’ ట్విట్టర్ ఖాతాను అప్డేట్ చేసిన రాహుల్ లోక్‌సభ సభ్యుడిగా తనపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో రాహుల్ ఆదివారం తన ట్విట్టర్ ఖాతాను అప్డేట్ చేశారు. బయోడేటాను ‘అనర్హత వేటుపడిన ఎంపీ’గా మార్చారు. తన అధికారిక వయనాడ్ ట్విట్టర్ ఖాతాలోనూ ‘డిస్‌క్వాలిఫైడ్ ఎంపీ’ అని రాశారు. -
అపూర్వమైన ప్రతిపక్ష ఐక్యతకు నాంది పలికింది: శశి థరూర్
సాక్షి, న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్షపడి, అనర్హత వేటు పడగానే ప్రతిపక్షాలన్ని ఏకతాటిపైకి వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ అన్నారు. ఈ మేరకు శశి థరూర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఒకరంగా ఇది అపూర్వమైన ప్రతిపక్ష ఐక్యతకు నాంది పలికింది. వాస్తవానికి ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థిగా భావించే ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉండటమే చూశాం మనం. కానీ నేడు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డాయి ఆయా పార్టీలు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్‌లోని మమతా బెనర్జీ, హైదరాబాద్‌లో చంద్రశేఖర్ తోసహా అందరూ రాహుల్‌కి మద్దతుగా నిలిచారు. గతంలో కాంగ్రెస్‌తో ఈ పార్టీలన్నీ ఏవిధంగానూ సంబంధం కలిగి లేవు. బీజేపీ చర్య అనాలోచిత పరిణామాల చట్టల పరిధిలో తొలిస్థానంలో ఉంది. ఆయా పార్టీ ముఖ్యమంత్రులందరూ రాహుల్ పేరు ప్రస్తావించకుండానే ఈ చర్యను ఖండించారు. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ముక్త కంఠంతో వ్యాఖ్యానించారు. అంతేగాదు కాంగ్రెస్‌తో మాకు విభేదాలు ఉన్నాయి. కానీ రాహుల్ గాంధీని పరువు నష్టం కేసులో ఇరికించడం అనేది సరి కాదని అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అదీగాక పారపోయిన వ్యాపారవేత్తలు లలిత్ మోదీ, నీరవ్ మోదీ, ఇద్దరూ వెనకబడినవారు కానందున రాహుల్‌పై వచ్చిన అభియోగాలు అర్థరహితమైనవి. వారంతా తమ అక్రమ సంపాదనను విదేశాలకు తరలించి విలాసవంతంగా జీవిస్తున్నారు. వారిని వెనుకబడిన తరగతుల వారుగా చెబుతూ..ఓబీసీలపై దాడి అని వ్యాఖ్యనించి చెబుతున్న వారి ఇంగితజ్ఞానం విస్మయానికి గురి చేస్తోంది. అని ఘాటుగా విమర్శించారు. ఈ మేరకు థరూర్ కూడా రాహుల్‌పై కోర్టు విధించిన శిక్ష పట్ల అభ్యంతరం చెబుతూ..ఈ కేసు బలహీనంగా ఉంది. మాకు మంచి న్యాయవాదులు ఉన్నారు. ఫిర్యాదుదారుడికి బలహీనమైన కేసు ఇది అని అన్నారు. అలాగే కేసు పెట్టిన నాల్గవ మోదీ..పూర్ణేశ్ మోదీ తనను ఏ రకంగా టార్గెట్ చేశారని నిరూపించగలడు అని శశి థరూర్ అన్నారు. కాగా రాహుల్ గాంధీ తరుఫు న్యాయవాది కోర్టు కార్యకలాపాలు ఆది నుంచి లోపభూయిష్టంగా ఉన్నాయని అన్నారు. రాహుల్ తన ప్రసంగంలో మోదీని లక్ష్యంగా చేసుకున్నందున ఫిర్యాదుదారునిగా ప్రధాని మోదీ ఉండాలి కానీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ కాదని ఆయన వాదించారు. (చదవండి: ట్వీట్ దుమారంపై స్పందించిన ఖుష్బు! మరిన్ని తీయండి అంటూ కౌంటర్) -
ట్వీట్ దుమారంపై స్పందించిన ఖుష్బు! మరిన్ని తీయండి అంటూ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహల్‌పై పడిన లోక్‌సభ అనర్హత వేటు విషయమై బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బు సుందర్ పాత ట్వీట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఖుష్బు.. తన పాత ట్వీట్‌ని తొలగించేదే లేదని కరాఖండీగా చెప్పారు. అంతేగాదు ఇలాంటి ట్వీట్లు చాలా ఉన్నాయి. వాటిని కూడా బయటకు తీయండి. ఏ పని లేని కాంగ్రెస్‌కి కనీసం ఇలాగైనా తన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని గట్టి కౌంటర్ ఇచ్చారు. అయినా మీరు గాంధీతో సమానంగా నిలబెట్టినందుకు కాంగ్రెస్‌కి కృతజ్ఞతలు. జాతీయ నాయకుడిగా చెప్పుకునే ఆయనతో సమానంగా ఉండేందుకు తగిన పేరు, గౌరవం సంపాదించడం నాకు చాలా ఇష్టం. అలాగే అవినీతి, దొంగలు అనే పదానికి చాలా తేడా ఉంది. అది కేవలం పార్టీ నాయకత్వాన్ని అనుసరించిన చేసిన ట్వీట్ అని సమర్థించుకున్నారు. ఇదిలా ఉండగా, ఖుష్బు కాంగ్రెస్ పార్టీలో ఉండగా చేసిన ట్వీట్లో..మోదీ అంటే అవినీతి అని మారుద్ధాం, ఇదే సరైన పోలీక అంటూ ట్వీట్ చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు కారణాంగా జైలు శిక్ష పడి, అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఖుష్బు చేసిన పాత ట్వీట్‌ని షేర్ చేసింది. నాడు ఆమె కూడా మోదీని అవినీతి అంటూ రాసుకొచ్చారు కాబట్టి ఆమెపై కూడా కేసు వేస్తారా అని పూర్ణేశ్ మోదీని ప్రశ్నిస్తూ బీజేపీకి కౌంటరిచ్చింది కాంగ్రెస్. I will not delete my tweet. It’s out there. There are many more. Pls use your time, as CONgress is absolutely jobless, to dig out a few more. BTW I like to see how the CONgress is putting me and @RahulGandhi on the same platform. I like the fact that I have earned enough name n… — KhushbuSundar (@khushsundar) March 25, 2023 (చదవండి: రాహుల్ గాంధీ అనర్హత వేటుకి నిరసనగా..సత్యాగ్రహ దీక్ష చేపట్టిన కాంగ్రెస్!) -
నా లోక్‌సభ సభ్యత్వాన్ని... వెంటనే పునరుద్ధరించండి
న్యూఢిల్లీ: తనపై అనర్హత వేటు ఎత్తేసి లోక్‌సభ సభ్యత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలంటూ లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హత్య కేసులో ఫైజల్‌ను దోషిగా నిర్థారించి కవరత్తీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ జనవరి 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. తీర్పుపై కేరళ హైకోర్టు స్టే విధించింది. అయినా అనర్హతను లోక్‌సభ సెక్రటేరియట్ ఎత్తేయలేదని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఎంపీ పేర్కొన్నారు. -
Defamation case: పోరాడుతూనే ఉంటా..నా పేరు సావర్కర్ కాదు...!
న్యూఢిల్లీ: అధికార బీజేపీ ఆగడాల మీద మరింత దూకుడుగా పోరాడతానని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తేల్చి చెప్పారు. ‘‘కావాలంటే నాపై జీవిత కాలం పాటు వేటు వేయండి. జైల్లో పెట్టుకోండి. మీరేం చేసినా నన్నాపలేరు. సత్యం కోసం, దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా. అందుకోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడను’’ అని ప్రకటించారు. ‘‘దేశ పౌరుల ప్రజాస్వామిక గళాన్ని పరిరక్షించేందుకే నేనున్నా. ఇలాంటి హెచ్చరికలు, అనర్హతలు, ఆరోపణలు, జైలు శిక్షలతో నన్నెప్పటికీ బెదిరించలేరు. వాటికి ఎంతమాత్రం వెరవబోను. వీళ్లకు నేనింకా అర్థం కాలేదు. అదానీ అవినీతిపై ఎక్కడ నిజాలు బయటికొస్తాయోనని బీజేపీ సర్కారు నిలువెల్లా భయంతో కంపించిపోతోంది. నా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం ద్వారా విపక్షాలకు చేజేతులారా అతి పెద్ద అస్త్రాన్ని అందించింది’’ అన్నారు. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన 24 గంటల్లోపే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ శుక్రవారం స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఆ తర్వాత తొలిసారి రాహుల్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనపై వేటును కేవలం అదానీ ఉదంతం నుంచి దృష్టి మళ్లించేందుకు ఆడిన గేమ్‌గా అభివర్ణించారు. ‘‘అదానీ గ్రూప్ అవకతవకలపై పార్లమెంటులో నా తర్వాతి ప్రసంగంలో ఏం మాట్లాడతానోనని ప్రధాని నరేంద్ర మోదీ వణికిపోయారు. అదానీతో ఆయన బంధం పూర్తిగా బయట పడిపోతుందని కలవరపాటుకు లోనయ్యారు. ఆ భయాన్ని మోదీ కళ్లలో నేను స్పష్టంగా చూశా’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘అందుకే నా ప్రసంగాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనుకున్నారు. నాపై ఆరోపణలు, అనర్హత వేటు తదితరాలతో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారు’’ అని ఆరోపించారు. ‘‘కానీ అదానీతో మోదీ బంధం బయట పడితీరుతుంది. దాన్నెవరూ ఆపలేరు. అప్పటిదాకా అదానీ అవినీతిపై ప్రశ్నలు సంధిస్తూనే ఉంటా. అదానీ షెల్ సంస్థల్లో రూ.20 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టిందెవరు? అదానీతో మోదీ సంబంధమేమిటి? సమాధానాలు దొరికేదాకా వీటిని లేవనెత్తుతూనే ఉంటా’’ అన్నారు. అదానీ వంటి అవినీతిపరున్ని ప్రధాని ఎందుకు కాపాడుతున్నారన్న ప్రశ్నే ఇప్పుడు ప్రజలందరి మనసుల్లోనూ మెదులుతోందన్నారు. ప్రజాస్వామ్యానికి పాతర బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిపోయిందని రాహుల్ అభిప్రాయపడ్డారు. బీజేపీ సర్కారు దృష్టిలో అదానీ అంటే దేశం, దేశమంటే అదానీ అంటూ ఎద్దేవా చేశారు. తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్నారా అని ప్రశ్నించగా, తానలా కనిపిస్తున్నానా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ‘‘నిజానికి నాకెంతో ఉత్సాహంగా, సంతోషంగా ఉంది. అనర్హత వేటు బహుశా వాళ్లు నాకివ్వగలిగిన అత్యుత్తమ కానుక!’’ అన్నారు. ‘‘బ్రిటన్‌లో నేను ఎక్కడా భారత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని కోరలేదు. కానీ కేంద్ర మంత్రులు దీనిపై పార్లమెంటులో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వాటిపై స్పందించాలనుకుంటే అవకాశమివ్వలేదు. పైగా ఓబీసీలను అవమానించానంటూ నాపై తప్పుడు ఆరోపణలతో అదానీ అవినీతి నుంచి అందరి దృష్టీ మళ్లించజూస్తోంది. తప్పు చేసిన వాళ్లు ఇలాగే వ్యవహరిస్తారు. దొంగ అడ్డంగా దొరికినా తానేమీ తప్పు చేయలేదనే అంటాడు. ‘అదుగో, అటు చూడండి’ అంటూ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తాడు. కానీ బీజేపీని వదిలిపెట్టబోను. విపక్షాలన్నీ కలసికట్టుగా మోదీ–అదానీ బంధాన్ని బయట పెట్టి తీరతాయి’’ అన్నారు. ..సభ్యత్వం ముఖ్యం కాదు తన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఆశ పడటం లేదని ఒక ప్రశ్నకు బదులుగా రాహుల్ చెప్పారు. ‘‘దానితో నిమిత్తం లేకుండా నా విధి నేను నిర్వర్తిస్తూనే ఉంటా. శాశ్వతంగా వేటు వేసినా, నా సభ్యత్వాన్ని పునరుద్ధరించినా ఈ విషయంలో తేడా ఉండదు. పార్లమెంటులో ఉన్నా, బయట ఉన్నా నా తపస్సు కొనసాగుతుంది’’ అన్నారు. ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజల గొంతుకను కాపాడటం. ప్రధానితో సాన్నిహిత్యాన్ని దుర్వినియోగం చేస్తున్న అదానీ వంటివారి గురించి ప్రజలకు నిజాలు చెప్పడం. ఆ పని చేసి తీరతాం’’ అని స్పష్టం చేశారు. నా పేరు సావర్కర్ కాదు...! ‘బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలపై మీ క్షమాపణకు బీజేపీ డిమాండ్ చేస్తోంది. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలపై కోర్టులో విచారం వ్యక్తం చేసుండాల్సిందని భావిస్తున్నారా?’ అని విలేకరులు ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని రాహుల్బదులిచ్చారు. ‘‘నా పేరు సావర్కర్ కాదు, గాంధీ. గాంధీ ఎవరికీ ఎప్పుడూ క్షమాపణలు చెప్పడు’’ అన్నారు. ‘‘వీటిపై లోక్‌సభలో మాట్లాడతానని స్పీకర్‌కు రెండుసార్లు లేఖ రాసినా అవకాశమివ్వలేదు. తానలా చేయలేనంటూ నవ్వి చాయ్ ఆఫర్ చేశారు. ఆయన మరింకేం చేయగలరు? ఇక బహుశా మోదీనే అడగాలేమో. కానీ ఆయనా నాకు మాట్లాడే అవకాశమివ్వరు’’ అన్నారు. విపక్షాలన్నీ ఏకమవ్వాలి వేటును నిరసిస్తూ తనకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించిన విపక్షాలకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. భయాందోళనలతో మోదీ తీసుకున్న ఈ వేటు నిర్ణయం విపక్షాలకు చెప్పలేనంత మేలు చేస్తుందని జోస్యం చెప్పారు. ‘‘దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుందాం. విపక్షాలు ఒక్కతాటిపైకి రావడం తక్షణావసరం. అందరమూ కలసికట్టుగా పని చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆందోళనలు మోదీ దిష్టి బొమ్మ దగ్ధం రాహుల్‌పై వేటును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శనివారం ఆందోళనలకు దిగింది. ఆయన ప్రాతినిధ్యం వహించిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంతో సహా పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనంచేశారు. మరోవైపు బీజేపీ కూడా సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలను నిరసిస్తూ ముంబైలో ఆందోళనకు దిగింది. ఓబీసీలను అవమానించే ప్రయత్నాలను సహించబోమని పార్టీ నేతలు హెచ్చరించారు. వేటును సొమ్ముచేసుకునే యత్నం: బీజేపీ పరువు నష్టం కేసు, అనర్హత వేటు తదితరాలు అదానీ ఉదంతం నుంచి జనం దృష్టి మళ్లించేందుకేనన్న రాహుల్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. జైలు శిక్ష నేపథ్యంలో రాహుల్‌పై వేటును కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో సొమ్ము చేసుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోందని పార్టీ నేత రవిశంకర్ ప్రసాద్ ఎద్దేవా చేశారు. అందుకే వేటు పడకుండా ముందస్తు చర్యలేవీ చేపట్టలేదని ఆరోపించారు. ఓబీసీలను రాహుల్ అవమానించిన తీరును దేశమంతటా ప్రచారం చేస్తామన్నారు. -
రాహుల్ ముందు 2 మార్గాలు.. నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లకపోవచ్చు!
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్ష, పార్లమెంట్ సెక్రటేరియట్ వేసిన అనర్హత వేటుపై న్యాయ పోరాటానికి ప్రతిపక్ష కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. అనర్హత వేటు నుంచి బయట పడి, ఎంపీగా కొనసాగడంతో పాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే రాహుల్ ముందు రెండు మార్గాలున్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. తీర్పును పై కోర్టు కొట్టివేస్తే అనర్హత వేటూ రద్దవుతుంది. కనీసం జైలు శిక్షను రెండేళ్ల కంటే తగ్గించినా ఊరటే. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు, అంతకు మించి జైలుశిక్ష పడితేనే అనర్హత వేటు వర్తిస్తుంది. కనుక సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేసేలా, రెండేళ్ల కంటే తగ్గించేలా పై కోర్టులో వాదించి నెగ్గాల్సి ఉంటుంది. లేదంటే కనీసం శిక్ష అమలుపై స్టే తెచ్చుకున్నా ఎంపీ పదవిని కాపాడుకోవచ్చు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. రాహుల్ అప్పీల్‌ను పై కోర్టు తిరస్కరిస్తే మాత్రం మరో ఎనిమిదేళ్ల దాకా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఇది క్రిమినల్ కేసు కావడంతో నేరుగా గుజరాత్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించకపోవచ్చని తెలుస్తోంది. చదవండి: రాహుల్‌పై అనర్హత వేటు.. సెప్టెంబర్‌లో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక? తొలుత సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేస్తారని, అక్కడ ఊరట దక్కకపోతే హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 11న లక్షద్వీప్ కరవట్టిలోని సెషన్స్ కోర్టు ఒక హత్యాయత్నం కేసులో ఫైజల్‌ను దోషిగా నిర్ధారించి, 10 సంవత్సరాల శిక్ష విధించింది. జైలుశిక్ష పడిన రెండు రోజులకే లక్షదీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్‌పై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. దీంతో లక్షద్వీప్ లోక్‌సభ స్థానం ఖాళీ అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉప ఎన్నిక కోసం జనవరి 18న నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. ఇంతలో మొహమ్మద్ ఫైజల్‌కు విధించిన జైలు శిక్షపై కేరళ హైకోర్టు జనవరి 25న స్టే విధించింది. దీంతో ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం రద్దు చేసింది. మరోవైపు హైకోర్టు నిర్ణయంపై లక్షద్వీప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై ప్రస్తుతం సుప్రీంలో విచారణ నడుస్తోంది. చదవండి: ప్రధాని కళ్లలో భయం చూశా: రాహుల్ గాంధీ