
లక్నో: యూపీలోని కతౌలీ శాసనసభ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించింది. ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీకి న్యాయస్థానం రెండేళ్లు శిక్ష విధించడంతో ఆయన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఫలితంగా ఆ సీటు ఖాళీ అయినట్లు సోమవారం విడుదల చేసిన నోటిఫికేషనలో ధ్రువీకరించింది.
2013 ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో సైనీతో పాటు మరో 11 మందికి ప్రత్యేక ప్రజాప్రతినిధుల న్యాయస్థానం అక్టోబర్ 11న రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఇది రెండవ అనర్హత వేటు. ఎస్పీ నాయకుడు మరియు రాంపూర్ ఎమ్మెల్యే ఆజం ఖాన్‌పై కూడా అక్టోబర్ 28 న ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడింది.
ఇదీ చదవండి: బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై అంతా షాక్