లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ ఎమ్మెల్యేపై జరిగిన దాడి సర్వత్రా చర్చనీయాంశమైంది. లఖింపూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ చెంప చెళ్లుమనించాడు ఓ న్యాయవాది చెంపపై న్యాయవాది కొట్టాడు. పోలీసుల సమక్షంలోనే ఈ సంఘటన జరగ్గా. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 14న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఓటర్ల జాబితాను తారుమారు చేశారని, కొంత మంది సభ్యులను జాబితా నుంచి తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సునీల్‌సింగ్, ఎమ్మెల్యే యోగేష్ వర్మ డిమాండ్ చేశారు. బుధవారం అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం)కు వినతి పత్రం సమర్పించారు. కానీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) సంజయ్ సింగ్ ధృవీకరించారు.
అయితే, కలెక్టర్ కార్యాలయం నుంచి తిరిగి వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మపై స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయవాది అవధేష్ సింగ్ దాడికి ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఎమ్మెల్యే చెంపపై ఆయన కొట్టాడు. అంతేగాక సింగ్ మద్దతుదారులు, మరికొంతమంది న్యాయవాదులు కూడా ఎమ్మెల్యేపై చేయిచేసుకున్నారు. ఎమ్మెల్యే తిరిగి ప్రతి దాడికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Uttar Pradesh: In Lakhimpur, tensions flared during the Urban Cooperative Bank election as Sadar MLA Yogesh Verma and Bar Association President Avadhesh Singh clashed pic.twitter.com/qF9mFi5Mps
— IANS (@ians_india) October 9, 2024
Comments
Please login to add a commentAdd a comment